తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస/Preface
PREFACE
Though written somewhat after the fashion of Srinatha's Veethi, this book has deviated from it in many points as the reader will see. My book, unlike Srinatha's, is not confined to a description of the peculiarities of Telugu Women and it is more over free from the morbid taste which is met with in the pages of Srinatha's book. This pamphlet termed the "Brahmana Prasamsa" treats of the Brahmins and forms the opening chapter to my intended work viz. a description of all the principal castes of the Telugu people. It might be said by some that I am not altogether impartial and that the remarks applied to one sect may, with equal truth and force, be applied to another. To this I can only say that I am as impartial as I can be, and that poetic fancy can not be althogether judged by any hard and fast rule. I may also say that among others it is my object in writing this to smooth down the many and unpleasant differences between sect and sect and in fact in this, as well as in some of my previous books, I have ventured to preach my pet exhortation Inter-marriages among sub-sects of Brahmins and their advantages.
In the latter portion of the book which has been printed during my absence in a distant place, one may find wrong punctuation here and there and I beg to say that such will be carefully corrected in the second edition. In conclusion, I beg to point out that there is a great need in Vernacular Literature of books containing witty and painless observations on social matters; it is such literature that has done so much in moulding the present polished manners of European countries. I therefore beseech my readers, to take the remarks contained herein in the spirit in which they are offered and to encourage me to bring out the other parts of the work.
DASU SRIRAMULU
పీఠిక
శ్రీనాథుని 'వీధినాటకము' ననుసరించి కొంతవరకు వ్రాయబడినప్పటికి వానికిని నా పుస్తకమునకును అనేక విషయములలో భేదమున్నటులఁ జదువరుల కందరకు విశదము కాఁగలదు. శ్రీనాథుని వీధిలో నాంధ్రస్త్రీ వర్ణనము మాత్ర మతి శృంగారముగా వర్ణింపబడియె. ఈ నా పుస్తకములో శ్రీనాథుని లోనున్న యా యతి శృంగారము గానరానీక తెనుఁగు దేశపువారల ప్రకారములు మాత్రము కొంచెము చమత్కృతితో స్వాభావికముగా వర్ణించితి. ఈయది తెనుగు దేశములలోఁ గల ముఖ్యవర్ణముల వారిని వర్ణింప నుద్యమించిన నా 'తెలుఁగునాడ'ను మహావీధిలో 'బ్రాహ్మణ ప్రశంస' యను ప్రథమభాగము. ఇందు ఆంధ్ర బ్రాహ్మణులలోని పలు తెఱఁగులవారి కులవర్తనములు, ఆచార వ్యవహారములు, వేష భాషలు మున్నగునవి వ్రాయుఁబడియుండె. ఇందొక తెగను గుఱించి వ్రాసిన వర్ణనలు మఱొక తెగవారికి సంబంధించుననియు నియ్యది నిష్పక్షపాత బుద్ధితో వ్రాయబడియుండలేదనియుఁ గొందఱందురేమో. కవిత్వపు పస చెడకుండ సాధ్యమైనంత నిష్పక్షపాత బుద్ధితో నాశక్తి కొలఁది వర్ణించియుంటినే గాని వేరొండు గాదని చెప్పగలను. ఇదియునుంగాక మనదేశములో బ్రాహ్మణ జాతిలోఁగల వివిధ శాఖలవారు అనవసరముగాఁ గల్పించుకొను వివాదలు తగ్గింపవలెనని నా యుద్దేశము. బ్రాహ్మణ శాఖలలో వివాహ సంబంధము లుం డుట శ్రేయోదాయకమని నాయభిప్రాయము. ఈ యభిప్రాయమును ఈ పుస్తకమందేగాక యింతకు ముందు నాచే రచింపఁబడిన యితర గ్రంథములలోఁ గూడ వెల్లడిచేసితిని.
ఈ పుస్తకపు తుదిభాగము నే గ్రామాంతరమున నుండు నవసరమున ముద్రింపఁబడిన దగుటచే నచ్చటచ్చట గొన్ని ముద్రాస్ఖాలిత్యములు దోపవచ్చును. అట్టి వానిని రెండవ కూర్పున సరిచేసికొందును.
సంఘ విషయములఁ గూర్చి అబాధకములగు చమత్కార కావ్యములు మనదేశభాషలలో లేవు. ఐరోపాఖండమువారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణభూతములైనవి యిట్టి కావ్యములేయని నేను జెప్పనవసరములేదు. కనుక చదువరులారా! యీపుస్తకమున నుండు విశేషములను, వర్ణనలను గురించి మనసున వేరుగాఁ దలంపక నాయుద్దేశము నాలోచించి మన్నించి చదివి తక్కిన భాగములు కూడా త్వరలో వెలువడునటుల నన్ను ప్రోత్సాహపఱచెదరని నమ్ముచున్నాను.
దాసు శ్రీరాములు
శ్రీరస్తు.
తెలుఁగునాడు
(స్తుత్యాదికము.)
ఉ. శ్రీపరమున్ మహేశుని భ
జించి రసంబు ఘటింప గాళహ
స్తీపురమున్ బురాణపురి
శ్రీగిరి యెల్లలుగాఁ దలిర్చు నా
నాపుర మానితం బయిన
నాఁటఁ జెలంగు దెలుంగుఁబల్లెలన్
గాపుర ముండువారల ప్ర
కారము వీథి యొనర్తుఁ గ్రొత్తగన్.
ఉ. లోకవితాన మేలు పరలోకవిభు డఖిలంబు గూర్చెనౌ
నా కవితాకునన్ ధనమునం బరితృప్తులు గాక నిక్కువా
రా కవితారసంబు కెనయంగల రిద్దమరేయి దొంగకున్
రా కవితంబ యయ్యవి నిరాకుల చిత్తులపాలి భాగ్యముల్.
చ. తెలుఁగునఁ దేటతెల్లముగఁ దెల్పినమాట వరాలమూటగాఁ
దెలుఁగున మాటలాడు మనదేశపువారు గణింతు రందుకై