తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస
తెలుఁగునాడు
అను ఆంధ్రవీధి లో
బ్రాహ్మణ ప్రశంస
మొదటి భాగము
________________________
ఇయ్యది
ఏలూరులో ఫష్టు గ్రేడు ప్లీడరుగా నుండిన
దాసు శ్రీరామమంత్రి చే
రచియింపఁబడియె.
__________________________________
Reprints
బెజవాడ వాణీ ముద్రాక్షరశాల యందు ముద్రింపఁబడియె
1929
PREFACE
Though written somewhat after the fashion of Srinatha's Veethi, this book has deviated from it in many points as the reader will see. My book, unlike Srinatha's, is not confined to a description of the peculiarities of Telugu Women and it is more over free from the morbid taste which is met with in the pages of Srinatha's book. This pamphlet termed the "Brahmana Prasamsa" treats of the Brahmins and forms the opening chapter to my intended work viz. a description of all the principal castes of the Telugu people. It might be said by some that I am not altogether impartial and that the remarks applied to one sect may, with equal truth and force, be applied to another. To this I can only say that I am as impartial as I can be, and that poetic fancy can not be althogether judged by any hard and fast rule. I may also say that among others it is my object in writing this to smooth down the many and unpleasant differences between sect and sect and in fact in this, as well as in some of my previous books, I have ventured to preach my pet exhortation Inter-marriages among sub-sects of Brahmins and their advantages.
In the latter portion of the book which has been printed during my absence in a distant place, one may find wrong punctuation here and there and I beg to say that such will be carefully corrected in the second edition. In conclusion, I beg to point out that there is a great need in Vernacular Literature of books containing witty and painless observations on social matters; it is such literature that has done so much in moulding the present polished manners of European countries. I therefore beseech my readers, to take the remarks contained herein in the spirit in which they are offered and to encourage me to bring out the other parts of the work.
DASU SRIRAMULU
పీఠిక
శ్రీనాథుని 'వీధినాటకము' ననుసరించి కొంతవరకు వ్రాయబడినప్పటికి వానికిని నా పుస్తకమునకును అనేక విషయములలో భేదమున్నటులఁ జదువరుల కందరకు విశదము కాఁగలదు. శ్రీనాథుని వీధిలో నాంధ్రస్త్రీ వర్ణనము మాత్ర మతి శృంగారముగా వర్ణింపబడియె. ఈ నా పుస్తకములో శ్రీనాథుని లోనున్న యా యతి శృంగారము గానరానీక తెనుఁగు దేశపువారల ప్రకారములు మాత్రము కొంచెము చమత్కృతితో స్వాభావికముగా వర్ణించితి. ఈయది తెనుగు దేశములలోఁ గల ముఖ్యవర్ణముల వారిని వర్ణింప నుద్యమించిన నా 'తెలుఁగునాడ'ను మహావీధిలో 'బ్రాహ్మణ ప్రశంస' యను ప్రథమభాగము. ఇందు ఆంధ్ర బ్రాహ్మణులలోని పలు తెఱఁగులవారి కులవర్తనములు, ఆచార వ్యవహారములు, వేష భాషలు మున్నగునవి వ్రాయుఁబడియుండె. ఇందొక తెగను గుఱించి వ్రాసిన వర్ణనలు మఱొక తెగవారికి సంబంధించుననియు నియ్యది నిష్పక్షపాత బుద్ధితో వ్రాయబడియుండలేదనియుఁ గొందఱందురేమో. కవిత్వపు పస చెడకుండ సాధ్యమైనంత నిష్పక్షపాత బుద్ధితో నాశక్తి కొలఁది వర్ణించియుంటినే గాని వేరొండు గాదని చెప్పగలను. ఇదియునుంగాక మనదేశములో బ్రాహ్మణ జాతిలోఁగల వివిధ శాఖలవారు అనవసరముగాఁ గల్పించుకొను వివాదలు తగ్గింపవలెనని నా యుద్దేశము. బ్రాహ్మణ శాఖలలో వివాహ సంబంధము లుం డుట శ్రేయోదాయకమని నాయభిప్రాయము. ఈ యభిప్రాయమును ఈ పుస్తకమందేగాక యింతకు ముందు నాచే రచింపఁబడిన యితర గ్రంథములలోఁ గూడ వెల్లడిచేసితిని.
ఈ పుస్తకపు తుదిభాగము నే గ్రామాంతరమున నుండు నవసరమున ముద్రింపఁబడిన దగుటచే నచ్చటచ్చట గొన్ని ముద్రాస్ఖాలిత్యములు దోపవచ్చును. అట్టి వానిని రెండవ కూర్పున సరిచేసికొందును.
సంఘ విషయములఁ గూర్చి అబాధకములగు చమత్కార కావ్యములు మనదేశభాషలలో లేవు. ఐరోపాఖండమువారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణభూతములైనవి యిట్టి కావ్యములేయని నేను జెప్పనవసరములేదు. కనుక చదువరులారా! యీపుస్తకమున నుండు విశేషములను, వర్ణనలను గురించి మనసున వేరుగాఁ దలంపక నాయుద్దేశము నాలోచించి మన్నించి చదివి తక్కిన భాగములు కూడా త్వరలో వెలువడునటుల నన్ను ప్రోత్సాహపఱచెదరని నమ్ముచున్నాను.
దాసు శ్రీరాములు
శ్రీరస్తు.
తెలుఁగునాడు
(స్తుత్యాదికము.)
ఉ. శ్రీపరమున్ మహేశుని భ
జించి రసంబు ఘటింప గాళహ
స్తీపురమున్ బురాణపురి
శ్రీగిరి యెల్లలుగాఁ దలిర్చు నా
నాపుర మానితం బయిన
నాఁటఁ జెలంగు దెలుంగుఁబల్లెలన్
గాపుర ముండువారల ప్ర
కారము వీథి యొనర్తుఁ గ్రొత్తగన్.
ఉ. లోకవితాన మేలు పరలోకవిభు డఖిలంబు గూర్చెనౌ
నా కవితాకునన్ ధనమునం బరితృప్తులు గాక నిక్కువా
రా కవితారసంబు కెనయంగల రిద్దమరేయి దొంగకున్
రా కవితంబ యయ్యవి నిరాకుల చిత్తులపాలి భాగ్యముల్.
చ. తెలుఁగునఁ దేటతెల్లముగఁ దెల్పినమాట వరాలమూటగాఁ
దెలుఁగున మాటలాడు మనదేశపువారు గణింతు రందుకై
తెలుఁగనునాఁటివారల నుతింప నతిశ్రమ మంచు నెంచకే
తెలుఁగున వీథి సేయఁదగదే ధని మెచ్చిన మెచ్చుగల్గునే.
కం.కులవర్తనముల నానా
కలనము లాచారముల ప్రకారము లందం
బులఁ జందంబుల నుడుఁగుల
పలుతెఱఁగులు నిందుఁ జెప్పఁబడుఁ గడువేడ్కన్.
చ. ఇది నవవీథి దీనికి ననేకరసంబు లనేకనాయకుల్
పదపడి మంచిచెడ్డలును బాగులునోగులు మేళ్ళుఁగీళ్ళునుం
గొదవలుగొప్ప లాంధ్రజనకోటికి నెట్లగు నట్లు సెప్పెదన్
మదిఁబరికించి కోపమును మానుఁడు నానుడుఁ గానుఁడూరకన్.
ఉ.ఉన్నది యున్నయట్లు మధురోక్తులఁ జెప్పిన కబ్బ మెప్పుడున్
బన్నమునొంద దందఱును బాగని మెత్తురు, లేనిపోని దం
ధన్నలు కొన్ని పన్నుక కతల్ వెదఁబెట్టిన నేమి, యన్నెమా?
పున్నెమ? పూరుషార్థమ? బుభుక్షువు సేసిన బ్రాహ్మణార్థమా?
సీ.భాషీయపద్ధతి పట్టుదప్పఁగనీక
దీర్ఘ సమాసంబు తెరువుపోక
గూఢార్థసమితి దిక్కున దేఱిచూడక
స్పష్టార్థములజాడ జాఱనీక
మఱుఁగు పదంబుల మార్గంబు ద్రొక్కక
తేటమాటల రాచబాట విడక
దూరాన్వయంబుల దారి మూచూడక
సంకరాలంకార సరణి గనక
గీ. ఉన్నయది ఉన్నయట్టులు గన్నయదియు
గన్నయట్టులు విన్నది విన్నయటులు
నన్నయది యన్నయట్టులు వన్నె వెట్టి
కవితఁ జెప్పిన సంతోష మవు జగాన.
సీ. ఉచ్చరించినమాట యూఁకొన్న మాత్రనే
యెట్టిదో తాత్పర్య మెఱుఁగవలయు
నెఱిఁగి డెందానఁ జింతించిన మాత్రనే
దృష్టాంత మొకటి స్ఫురించ వలయు
స్ఫురియించి సరిఁజూచి పరికించు మాత్రనే
దొసఁ గిందు లేదని తోఁచవలయు
తోఁచి యొక్కింత యాలోచించు మాత్రనె
"యౌరా! యథార్థమే" యనఁగవలయు
గీ. స్వస్తుతియుఁ బక్షపాతము సంప్రదాయ
భంగమును, మత్సరము, శాస్త్రబాధ, నీతి
లోపమును, నింద, కఠినోక్తి దోఁపరాదు
కవి జగచ్ఛ్లాఘనీయమౌ కవిత గూర్ప.
ఉ. ఓరుపులేని వాఁడను మహోద్యమ మిచ్చి సుధీముఖంబునం
దీరుపులేనివాఁడను, విధిచ్యుతి లేని కృతిన్ రచింపఁగా
నేరుపులేనివాఁడను, గుణిప్రకరం బెపుడైన నిందు నా
కూరుపుఁ జూచి చీ! యనునొకో? తలపెట్టితి నేమి సేయుదున్.
ఉ. లోకములోని యెల్లనరలోకముల న్నిఖిలప్రవృత్తులం
దేకముగా సృజించెను మహేశుఁ డటంచుఁ తలంచి యెవ్వఁడా
లోకము సేయు, వాఁడె యతిలోక మతిక్రముఁ డంచు గీతలం
దా కమలాతరంగవిభుఁ డర్జునుతోడ వచించె వింటిరే?
ఉ. నందునినందనుండు విడనాడె భువి, న్గలి వచ్చె నాఁడె య
న్నందున నాఁటనుండియును నాలుగుదొమ్మిది తొమ్మిదీరువో
నందననామవత్సరమునన్ శుభపౌష సితాష్టమిన్ ధరా
నందననామవాసరమునన్ దొరకొంటిని దీనిఁ జేయఁగన్.
కం. పదునెనిమిదివందల తొం
బది రెండగు నాంగిలేయ వత్సరమున ని
ర్వదియెన్మిదవ డిశంబరు
మొదలుగ నివ్వీథిఁ జెప్ప మొదలిడితి వెసన్.
వైదికులు
చ. వచనములందు మార్దవము, వస్త్రముల న్మడి, వంటకంబులన్
బచనము సేయు చేతిపరిపాటి, శ్రుతిస్మృతిచోదితక్రియా
నిచయమునందు భక్తి, గృహిణిన్ సుఖపెట్టుట, వాసవాటికా
శుచితయు వైదికోత్తముల సొమ్మనవచ్చు నసంశయంబుగన్.
సీ. చదివిరా! ఋగ్యజుస్సామముల్ భూర్భువ
స్సువరాది లోకముల్ స్తుతులు ముట్టు
మెదపిరా! పెదవి గుంఫిత మృదుస్తుతిపాఠ
సల్లాపముల నల్లరాళ్ళు గఱఁగు
తలఁచిరా! క్షేత్రయాత్రలు సేతు కాశికా
గంగోత్తరలకు మూఁ డంగలీడు
నిలిచిరా! సత్కర్మనియతి న్మహాధ్వర
కాండంబు పౌండరీకంబు దట్టు
గీ. పఱచిరా! పంచపాళి దర్భాసనములు
ముక్కుమూఁతల సరిపుత్తు రొక్కజాము
బళిర! యీపాటి పరిపాటి దెలుఁగునాఁటి
వైదికునితోటి యేమేటి వచ్చుసాటి.
చ. శమముదమంబు శౌచము:ను సత్యము శ్రోతముస్మార్తము౾
మృదు
త్వము సరసత్వ మార్యజన వందనతృ ప్తివిగర్హిత క్రియా
విముఖత యప్రమాదము వివేకము నీశ్వరభక్తి నిశ్చల
త్వము నిరపాయజీవనము వైదికవృత్తిని మించనున్న దే.
ఉ. నీళ్ళకు నిజ్ఞితోళ్ళకును నేతికరుళ్ళకు దొడ్డయుత్తరేణ్
వేళ్ళకు దర్భముళ్ళకును వేదపునోళ్ళకు సన్నకుట్టు వి
స్తళ్ళకు రావి పేళ్ళ కనిశంబును మళ్ళకు పప్పుగూర ప
చ్చళ్ళకు రాగిబిళ్ళకును సంతసమందుదు రాంధ్రవైదికుల్.
ఉ. తాతలనాటి శాలువులు దాపటివంక బుజాలపైఁ గడుం
బ్రాతదనాన జిన్గులగు బాటగునం చొకయింత వింతగా
మూతమడంచివైబి మొగములై గఁబూసిన బూదిజారగా
జేతుల ఝారు లొప్ప ధని జేరగవత్తురు వైదికోత్తముల్.
చ. తెల తెలవారఁ గాల్యములు దీరిచి స్నానము జేసి బూదిమై
నలది కుశాసనంబుల నొయారముమీరఁగగూరుచుండిని
శ్చలమతిసంధ్య వార్చి విలసజ్జపమాలిక (వేళ్ళద్రిప్పుచు౯
మిలమిలఁగన్నుదోయినిని మీలన వైతురు వైదికోత్తముల్
చ. విడువకురా ఉతోతఇషవేనమరా అదిదుడ్డు రాముడా:
కొడుకయటన్న మాటవిని కొరికి ఉతోత ఇనేనమంచు శి
ష్యుడు దనవెంటరావడకుచుంగుడిచే నొక యక్షమాలచో
ప్పడ నొకచేత దండమిడి బాటను వైదికవృద్ధు డేగెడి౯.
ఉ. త్రుళ్ళక నీరు కాని మడిదోవతికమ్ములు వేళ్ళబిళ్ళకు
చ్చెళ్ళిడికట్టి నీళ్ళబుడి చెంబొక చేతనుఁ బట్టి దారిలో
జిళ్ళలకొత్తుకొంచు నొక చేఁ దడికొళ్ళయిబెట్టి పెళ్ళిపం
దిళ్ళకు భోజనానకరు దెంచును వైదిక శేఖరుం డిల౯
సీ.మ్రోకాళ్లుదాటని' మొరటుగావంచాల
నందియందనిగోచి • యంటదోపి
పిల్ల గాలికి దూగి యల్లాడు చిన్న నే
రెడుగాయవలే జుట్టు ముడియవైచి
నడునెత్తి పెడ చెంప లెడనెడగాన్పింపఁ
దల నొక్కయంగవస్త్రంబుజుట్టి
గీరు గంధపురేఖదీరైన నొసటిపై
పసపక్షతల చుక్క యెసగనునిచి
గీ. బెదరిచూచుచు బెరవారికొదిగికొనుచు
జందెపోగులు చిక్కువోఁజమిరికొనుచు
నోటనొకఋక్కు ముమ్మాఱు నొక్కియనుచు
శ్రోత్రియక్షితిదేవతా సుతడు వెడలు.
ఉ. లేవరు లెండులెండనిన, లేచినవారయినం దటాలునం
బోవరు, పోవుచు౯నిలిచి పోదుముపోదుము త్రోయకుండటం
చీవరు నందు గేస్తునలాయింతురు బెండిలిలో సదస్య సం
భావననాడు జూడవలెం బాపన సాముల సాములన్నియు౯.
చ. అనుదిన మంగపంచకము • నందరికి విరుపించు బాపడా
దినమునువారఋక్షములు దెల్పుమరింగరణంబు యోగము౯
వినబడఁ జెప్పి త్యాజ్య మొక వింతగ నీడిచి చెప్పి పై పయి౯
బనిగొని రావె కేవె యని పాఱున దేమిటి చెప్పుమన్న దా
విన డవి రాహు కేతువుల వేధలటంచు నెఱుంగ కజ్ఞుడై.
ఉ. సత్తుగ దేవతార్చనవు సంచుల నున్నని వేల్పు రాళ్ళకు౯
వత్తులుగాల్చి పూవులిడి వాసన దూపిడి గంటగొట్టిమా
కత్తెసరంచులౌక్యులగృహంబులఁ జొచ్చిన వైదికోత్తముల్
కుత్తుకనిండ బచ్చడియుగోరసమన్నము దిండ్రు నిచ్చలు౯
శా. గంగాజోస్యుల వారుమీకునునమస్కారంబటంచున్వెస౯
వేంగప్పంతులుగారుపల్క వినుచు౯. వేదో క్తమాయుష్యమ
స్తుం గేల్దోయినిసాచి పల్కినగుచుం దోడ్తోమహారాజ! యే
భంగి౯ మాబ్రతుకెల్లమీదనిస్తుతిం పంజొత్తు రాశ్రోత్రియుల్
మ. నినునే మెచ్చిన మెచ్చులా యనృతమా నీకల్పవృక్షంబునీ
డనునీజందెపు చాటునంబ్రతుకువాడ౯ గొప్పసంస్థాన మెం
దునబోసేసినమివెమాయమృతమస్తుల్ మాప్రభో! పేదవా
డనుగాపాడుమటండ్రు పై దికులబిడ్డల్ లౌక్యులంగాంచిన౯.
సీ ఉదయించుచున్న సూర్యునివంటి గుండ్రని
ముతకకుంకుమబొట్టు మొగమునిండ
కొయ్యకరాటానం గొని వేలమెదిపి రా
చిన నూనె కాటుక కనులనిండ
అట్టిట్టుగదులాడునట్టి మేల్ముత్యా
మక్కుపోగొక ప్రక్కమూతినిండ
గోటంచుతో బొద్దుకుట్టుగుట్టినగట్టి
పై రిణీమోచేతి పట్లనిఁడ
గీ మాలనూలును చీరేల సాలికిత
మూరగలిగిన దళముఁ బుంజమిడిన
మేలికమ్మె సొగసుచీరె మేనునిండ
బ్రియుఁ గదియుఁ దెల్లునాటిశ్రోత్రియవధూటి.
శా. ఆస్సే చూస్సివషేవొషే చెవుడుషేఅష్లాగషే యేమిషే
విస్సావర్హులవారిబుర్రినష యావిస్సాయకిస్సారుషే
విస్సండెంతడివాడె యేళ్ళుపదిషే వెయ్యేళ్ళ కీడేషుమా
ఓస్సేబుర్రికి యీడషే వొయిషు కే ముంచుందిలే మంచివో
ర్పెస్సేయందురుశ్రోత్రియో త్తమపద స్త్రీలాంధ్ర దేశంబున౯.
సీ, కోడికూయగమేలు కొనితలవాకిలి
పైసాళిజిమ్మి కలాపిజల్లి
దడదడగా దంత ధావనం బొనరించి
యిల్లల్కి మ్రుగ్గిడి యెనుము బ్రిదికి
పొరుగింటి కేగి నిప్పునుదెచ్చి రాజేసి
మణివలువల నుత్కి పిడిచిమడిచి
బుజము పైనిడి దండెములనారవైచి కూ
రలుదర్గికొనియు దండులములోడ్చి
పసపు రాచుక నీళ్ళు పై బోసికొని బట్ట
తడిదిగట్టుకొనితీరంబు దెచ్చి
నాలుగుసేర్ల తప్పేల దబ్రాగిన్ని
రాచిప్పయొకటి పొయ్ రాళ్ళ బెట్టి
గీ. కళపిళ వెసళ్లు గ్రాగించి, కమ్మనైన
పంటకాల్జేసి విస్తళ్ళ, వడ్డనములు
పొసగగావించి భయభ క్తి పూర్వకముగ
నుపచరించును వైదిక యువతి పతిని.
చ. వసుధ నియోగి బాలికనూ వైదిక బాలున కిచ్చి చేయగా
బస నది యిట్టునట్టనిన బాగషునిష్షను మంచు నత్తయ
బ్బెన మొనరింపఁనొక్కతరి పీషష పెష్షష మామగారికి౯
మసలక పెష్షుపెష్షుమనుః మాషలె పల్కేనషం(డు గష్షిగ౯
ఉ. పావనమైన వైదికుల భాష గొరంతలు పట్టితెల్పుట
బ్బా వినరాదుగా జెఱకు వంకరజోయిన యంతమాత్రనే
పోవునెతీపి? కొందరిదిపోల్పరు వైదికుపిల్లి ప్రత్తి మేవ్
మ్రేవనునండ్రు రేఫమది శ్రీకరమున్ శిఖబీజముం గదా.
నియోగులు
చ. బడిబడి బాంధబాడబులు*బ్రాహ్మాణగేహము గోరుచున్ననీ
నడువడి యెల్లజూడు కరణాలను బ్రాహ్మణులందువా సరే
వడి నడు వీధిలోనిలకు వచ్చినదారిన పొమ్ముపొమ్మటం
చడుగునబుట్టునుంట తల+కంట నదల్తురు లౌక్య భూసురుల్.
సీ. మెలిబెట్టివిడిచినమిాసాలపై గొప్ప .
నిమ్మకాయలురెండుఃనిలుపవచ్చు
తేటగా తెల్లగాతెగగాలు లంకాకు
పొాగచుట్ట జుంజురు బోల్పవచ్చు
నడువీధి రెడ్డిగాలిడి రచ్చదీర్చుచో
సివిలుజడ్జీలని జెప్పవచ్చు .
అసదుగాబొసగించి నొసట బెట్టినబొట్టు
లొక్కమా రుప్ఫనియూదవచ్చు
గీ.వడివడిగ చిన్ననాడైన వడుగునాడు
తడబడుచుఁ జెప్పుకొన్నట్టి తప్పుసంధ్య
ముక్క నాలుగునిముపాలముగియవచ్చు
భళిరయనవచ్చు లౌకిక బ్రాహ్మాణులను.
శా. జ్ఞానాధిక్టము, శాంతి, యర్థిజనరక్షా దీక్ష, భూపాలకా
స్థానప్రాపిత వైభవంబు, పటుమంత్రప్రజ్ఞయు౯, సంతతా
క్షీణం బుగ్గునబెట్టు తల్లియె నియోగి బ్రాహ్మణ(శేణికి౯
మానంబే నగ మాటలే కవచముల్ మర్యాదలే భాగ్యముల్
ఉ.ముచ్చిలిగుంటజుట్టుముడి, మోయగ నెత్తి గుళాయి యిస్తి
యిచ్చినకోటు మేనధరియించ బుజాన రుమూలువైచి లే
గచ్చను జీరుగోచియిడికట్టిన మల్మలు చెంగుజూరగా
నిచ్చిచెడావులందొడగియేగు నియోగిసుతుండు నిచ్చలు౯
ఉ.ద్వారము జేరగానె యవధానులుగా రదెవచ్చిరే నమ
స్కారములండి రండి పరిచండికుశాసన మూానుగాని గో
చార బలంబునాకిప్పుడుచాలునొ చాలదో చెప్పుడీ పరి
ష్కారముగానటుండ్రు సరసంబుగ వైదికుగాంచి లౌకికుల్
చ.కరణము మంత్రసాని; సరకారు (పసూతిక; రైతు బిడ్డని
బ్బరమగు[వాతకోతలు జవాబుసవాళ్ళును దంత్రయక్షి బం
ధురముగ నూరిమీద నొకనూరయినం బడుగాక యెన్నడుం
గరణముమీదనొక్క యరాకాసయినం బడదండ్రుమానవుల్.
చ. నిరుపమబుద్ధిశాలి కరిణీకము జేసిన యూరికాపులె
ల్లరుభువిఁ బాలుబొంగినటులన్మదిబొంగుచు "దొడ్డవోడుమా
కరణముబిడ్డయింట కలకాలము మేలగు" నంచు గంగగో
లుకు; సరికానివా రతనిదొడిన మేపుదు రాలమందల౯.
చ. నడవడిమంచివ్రాతకరణంబతడెప్పుడు వ్రాయుచుండగ౯
దడదడమోగు గూతకరణం బతడన్నిటసున్న యిందరి
దడబడజేసి మేతకరణంబు గుటుక్కున మ్రింగు నెల్లరా
బడులును బెళ్ళికట్టములు బందరుపజ్జన కొన్నియూళ్ళలో౯.
చ. కరణము సంజనేల దరఖాస్తులకాలమె పంటకళ్ళ మం
చెరబడి చేయిసాప రయితెట్లనో చౌలము పావుదెచ్చి య
క్కరగడతేర్చు మంచడుగ౦గా నెకరానికి మాడమేర కం
దరునొసగంగ నీనొసటనా యుదయించెను ప్రొద్దుపొమ్మను౯.
శా. ఓరీ చాకలి కాళ్ళుగ్రుద్దుమని యెన్నోసార్లు నేబిల్వ లే
దా రావేమిర తిమ్మిరెక్కినది లేదా బుద్ధి నీచాకిరం
బేరేవోయికఁజూడునీమదము నాకెవ్వారలడ్డంబురా
తేరాద స్త్రమటండ్రు గ్రామకరణా ల్తీవ్రప్రభావంతులై.
ఉ. నమ్మిన నమ్మకున్న నది నావశమ జనులాడుకొన్నవా
క్యమ్ములు నేను జెప్పెదభ యంపడియోపడకో నియోగిలో
క మ్మనివార్య కార్య ఘట కమ్మవుగాని పరోపకార శూ
న్యమ్మనుస్వప్రయోజన పరాయణము౯ దలపోయ దిద్దర౯.
చ. ముదికరణాలు రాముగుడి మోసలరచ్చలు దీర్చి భారతాల్
జదువుచులోకవార్తల బ్రసంశలనండ్రు తెలుంగుభాష మం
చిది మనపిల్లకాయలు వచించెడి యింగిలిపీసువుస్ పుస౯
బెదవులుదాటదెంతటియె ఫేయు బియే యెమియే వచించిన౯
ఉ. ఈతరి జాతి రాచరికమింతటి దుర్గతిదెచ్చెగాని మా
తాతహయాములో నుడుగు:దాటినవారలఁ బట్టి తెచ్చి చ
ట్రాతను గట్టికొట్టి పది రాత్రు లటుంచిన రాజుతోడ వి
జ్ఞాతము సేయు వాడొకడు గల్గెనెయందురు వృద్ధలౌకికల్.
ఉ.స్నానము జేసి సంధ్య నిముసాననె దీరిచి బొట్టుబెట్టి పీ
ఠాననుగూరుచుండి యెఱడాలరివాణము జోడు చెంబులుం
దా నమరించిమంచి యరటాకునవన్నముగూరగాయలు౯
దానుభుజించు సై సినపదార్థను గొంచునియోగినిచ్చలు౯.
గీ. అడిగినదియిచ్చు త్యాగి సత్యమున నేగి
అన్ని గల్గినభోగి భార్యగల యోగి
చిలుమిడని రాగి వండనేర్చిన నియోగి
కంచుదివిటీలతోన జగాన గాను
చ. గడబిడ జేసియైన తను గట్టిగ మంత్రము సెప్ప డెప్పు డా
గడమున గట్టుసేయవలె గ్రామపురోహితునంచు తప్పక౯
గడియలు లెక్కబెట్టి సరికానిది యైనది చూచుకొందు రే
బడబడ పాట బాడినను పట్టగలేరు తెలుంగులౌకికుల్.
ఉ. యజ్ఞము సేయగావలయునన్ని టిగూర్పుడు నాఁబురోహితుల్
ప్రజ్ఞలు గొట్టి యిచ్చినవరాలను గైకొని మీరు వేదసా
రజ్ఞులు, యాజమానములు రావలెనందు రనంగ లౌకికుం
డజ్ఞులరో కొనుండు మనకవ్వియు నాలుగు బండ్లనున్వెస౯
ఉ. కేలఁ గలంబుపట్టిన వకీలుతనంబొనరించుచున్న నే
కాలము దీర్పుఁ జెప్పు, నధికారముఁ జేసిన గాకితాలు ద
స్త్రాలగుఁగాళ్లు కాయలగుఁదప్పకొడల్ కనగాచుకొన్న చూ
లాలి నిబోలు క్షుత్తుజెడు లౌకిక విప్రులలోన నొక్కట౯.
చ. అనుపమమేరుమందరగుహావళిమూయఁగవచ్చుఁ గాని యీ
మనుజులనోరుమూయదరమాయనుకొండ్రది యంతపట్టు న
మ్మనలవికో నియోగి తనపచ్చయె కాని సహింప డన్యుప
చ్చననుచు దానికేమి విరజాజులు రాజులుసైత మట్లనే,
మ. కొమరుంబాపటకడ్డమై మొగలిరేకుం దమ్మలంపాకు నం
దముమీర౯ జడచుట్టపైనిడిన సాదాబిళ్ళపైఁ బచ్చఱా
లుమురాళింపగఁ గూబకుట్టులునుఁ దాలూకాలఁ జిల్లాలమ
చ్చెములం దుద్దుల బుష్యరాగములఁడాల్చీకట్లుబో మొ త్తనె
య్య మునన్భర్తలబ్రీతిగొల్పుదురులౌక్య బ్రాహ్మణప్రేయసుల్'.
సాధారణ విషయములు
ఉ. కమ్మనిమాట యొక్కటి సుఖమ్ముగఁ జెప్పెద నాలకింపుడీ
యెమ్మెను భోజనంబులకు నేదయిన౯ శుభకార్యవేళల౯
రమ్మని యెంతబిల్చినను రారొకపట్టున లౌక్యభూసురుల్
బొమ్మనియెంతగెంటినను పోరొకపట్టున వైదికోత్తముల్
చ. మసలుచుగర్మ కాండమును మాయము జేసినరీతిజూచియు౯
బస లలిత ప్రవర్తనము బావినిఁద్రోచినభాతి జూచియు౯
వసుధ నియోగిసంధ్యయును వైదికు చేతివిడెంబటంచును౯
హసనము జేతురెల్లపుడు హా పెరవారలు కోడిగాలకు౯.
చ. పొసగు సమస్తమున్గలము పోటునమేటినియోగి కెప్పుడు౯
గొస కఖిలంబు వైదికునకు౯ సమకూరునుదర్భపోటున౯
వసుమతినేలువారలకు వచ్చుసమస్తము నీటెపోటున౯
బస ననికొందడిట్లు తెలుపందొరకొందురు కోడిగాలకు౯.
ఉ. ఈయిసుకోలుబళ్ళకడ నింగిలివీనులు పీసపాసుగాఁ మొ
గూయగఁజొచ్చి యామయిల గుడ్డలు సంకెదగిల్చిరండు
ఱ్రోయన నాలకింప రిసీలో కలికాలముగాలె రామరా
మాయనువృద్ధురాలయిన స్మార్తవితంతువుమాటిమాటికి౯.
ఉ. కమ్మనికందిపప్పు నురుంగారఁగఁగాచిన నేతిబొట్టు దూ
రమ్మునదానిగ్రమ్ముకొని రాఁబొగుపెత్తిన యాకుగూరలుం
గుమ్మడిపొట్ల కాకరము నుంగయు వంగయుదొండ బెండజే
కమ్ములుదప్పళంబులను గల్పిభుజింతురు శాలితండులా
న్న మ్ములు భ్రేవుమంచనుది నంబరటాకులలోన బ్రాహ్మణుల్
శా. అచ్చమ్మాయిదియేమిటే; రెయిలటే; ఆసీయిదేనా; సరే
బుచ్చమ్మా వినలేదటే, గడియలో( బోవచ్చునే కాశికి౯;
అచ్చోదేహముగ్రుద్దుకోదటె ఆయో ఆసౌఖ్యమేమందునే
యిచ్ఛారాజ్యమటండ్రు ట్రైనుగనియెంతేవింతవిప్రాంగనల్
ఉ. అంతయునొక్క టే సకలమాత్మయె నీదిది నాదిదంచుకా
సంతయునెన్న రాదుతనయాలయ, దార, ధనాధులన్నీ యు౯
భ్రాంతులటంచుబ్రత్యహము పల్మరుఁదప్పక చెప్పి శుష్క వే
దాంతులుకొంపదోతురు కడాపటఁ జోగినిఁజేతు రజ్ఞుల౯.
చ. వలదనినేను చెప్పి గెలువంగలనా యికచాలుచాలు నే
తెలియకయొక్కటన్న నలుదిక్కుల న౯బడియండ్రుకాని లే
తెలిపెదఁదెంపునం దెలుఁగు దేశపుస్మార్తులవియ్యపొత్తుల౯
దలచిన ధర్మశాస్త్ర పరతంత్రులు గారనవచ్చువారల౯.
చ. చెలగినియోగిశాఖలను జేతురునియ్యము భేదమెంచ రు
జ్జ్వలమతులైన కొందరిక శాఖలు మూడును నాటినాటికి౯
గలయుచువచ్చుచున్నయవి గానియదేమొకొతక్కు భేదముల్
దళముగఁబట్టుకొన్న యవి దైవవశమ్ముననాంధ్రమండలి౯.
మ. వెలినాడు౯ దెలగాణెము౯ మురికినాడ్విఖ్యాతమున్వేగినా
డు లలింగౌసలనాడు నానయిదునాడుల్ ఋగ్యజుస్సామవి
ఖ్యలశాఖాశ్రయివారుద్రావిడులుసత్యాపాడు లార్వేలవా
రలు బల్ నందవరీకులు౯ దమిళవారల్ పాకనాటీలు; స్మా
ర్తులలోని స్తరిపొ త్తె వియ్యములపొత్తుల్లేవు వింతయ్యెడి౯,
మాధ్వులు
సి. జావులావని తురుష్క వ్యాహృతులు సెప్ప
సౌకుభేశని స్వభాషలు వచింప
పంతులవారి ప్రభావంబు వెలయింప
నాచార్య భావంబు నధికరింప
ఓర్పుతో రాజకీయోద్యోగములు సేయ
ఘనభక్తి దేవతార్చనలు నెఱవ
భోగినీ యోగ సంభోగంబుచాటింప
దీవిరిసాలగ్రామతీర్ధమాడ
గీ. చాల మిగాళ్ళదూల నీమాలఁదొడగ
తప్పకను మేనఁ బంచముద్రలు వహింప
లౌక్య వైదికములు చెవుల్ బట్టిలాగ
మాధ్వులొప్పుడు రీయాంధ్ర మండలమున.
సి. గట్టిగా నొకపట్టుపట్టించె నేని ము
ప్పత్తుహోళిగతృణ ప్రాయమనును
స్వస్తుతిన్నమ్మదే వరదొడ్డ దేవర
తెలియ ముఖ్యప్రాణం దేవరయను
పరనింద నిమ్మ దేవర యేను దేవర
రుబ్బు గుండాకార రూఢిగనును
తత్వబోధలు సేయు తరినిజీవపదార్థ
బేరెయీశ్వరవస్తు భేదయనును
గీ. ఘనతరాంగారపుండ్ర శృం. గారకలిత
ముఖమెసుఖమను మైగంధ • లిఖతముద్ర
భద్రవితరణకరణనిర్ని ద్రయనును
మాధ్వు డనిశంబు నీయాంధ్ర మండలమున.
ఉ. బేరము లేని బేరి, శరవేగముబెట్టనినారి, దంధణల్
బారనిభేరి, ధర్మపరిపాలన లేని కచేరి, స్వచ్ఛమై
పొరనివారి వంటకము బాగుగసేయగ నేరనట్టే వ్యా
పారి, యవాహకంబగు స వారినపోలుదురాంధ్రభూస్థలి౯
ఉ, బాగుగనున్న వానికడ బంధువు లెల్లరు దారెచేరి యే
లాగుననేని వాని బదిలంబుగఁ దంటసపట్టివైతు రా ఫ్రే
త్యాగియునాయము౯ వ్రయము నారయకూరకనోడుతాను
ణాగళుపూరిగళ్ ప్రతిది నంబునుదప్పదుమాధ్వులోగిట౯
సీ; మాతంగళిల్లెనమ్మగురురాయరమహా
మధ్వరాయస్తోత్రమాడు బేకు
మంత్రగళ్ హేళినా మగళుస్మరిసి హను
మద్దేవరార్చన మాడు బేకు
మహిమ దత్రైలోక్య మాత శ్రీతులసిక
నోడిప్రదక్షిణ మాడు బేకు
అతిభక్తి శ్రీభాగవత కీళి నందకు
మారనమస్కారమాడు బ్రేకు
గీ. మహితపుణ్యనదీతీర్ణ మాడుభేకు
మానితాంగారపుండ్రగళ్ • మాడుబేకు
బేకు బేకు సదా బేకు బేకు బేకు
అనుచు మాధ్వులు భాషింతురనుదినంబు.
ఉ. కన్నడ బాసలోగిట, నికం దెలుగందరితోడ, బైటక
త్యున్నతమైన బెబ్బులి ప్రయోగము, లోపట మేకపోతు కో
ల్వున్న యెడన్నవాబు, పని యూడిననాడుపకీరు, భూస్థలి౯
గన్న సనత్కుమారుడుపగల్, నిశిగాముడు మాధ్వుడెన్నగ౯.
మ. విసరుంజేతిరుమాళ్ళతో నడుగుల౯ విప్పారు నీమాలతో
తను కాడుంబయిజార్లతోఁ దలలనూ దారంగు పాగాలతో
వెసఁబట్టంచులుజారు పై వలువతో బేషక్ కలందాన్లతోఁ
బస వార్థక్యములోన దాచగలరా పంతుళ్ళవా రిద్ధర౯.
శా. సారోదారులు సాహసోద్ధ తసమాచారుల్ వినోదార్థవి
స్తారుల్ ధీరు లటత్ప్రతాపశిఖసం తప్తారు లత్యంతగం
భీరుల్ ళూరులు దాన పౌరులు బదర్ ఫేణీమిఠాలడ్డుకా
హారుల్ పంతులువారుబొల్తురుధర౯ వ్యాపారులై సారు౯
.
సీ, కడుచెల్వమగు బెండ కాయబొట్టు మొగాన
తతగంధముద్రాంకితములు మేన
మడచితీర్చిన జరీమధిర యోణి బుజాన
వెలగల యుంగ రాల్వేళ్ళపైన
ఆవరంజివిడికడియము మణిబంధాన
పగడాలసరము చొప్పుడు గళాన
పట్టంచుదట్టంపు బలుఠీకు పుట్టాన
మేలుముత్యాలత, మ్మెట్లతోన
గీ. ద.స్త్రమపసవ్యమున గలందాను సవ్య
భాగముననుంచి కలముచేపట్టి గోవ
కాగితంబులపొతక మ్రోకాలనునిచి
ఫరుదు బరపరవ్రాయు వేసారిగంటె.
ఉ. సమ్మతి నమ్మకర్మ సహజంబగు కర్మయటండ్రు నిమ్మక
ర్మమ్మది దుష్టకర్మయని • బల్కు చునుందురు నోటికేదియ
డ్డమ్ము జగమ్మునం భళభళాభళ మాధ్వులవంటివారు ని
క్కమ్ముగ లేరు లేరని పుకారుపకారులు కారుకా రిల౯,
శా. ఔనోయీనరసింగరాయుడు హుకుం ఆంపించినా వామదార్
భాను౯ చిత్తమువానిఁబంపినపనుల్. కావచ్చు సందేహమా
సానాజోగముదా మహాప్రభుఖులా సాకేమి యేముండ యో
తానాగిన్నెఱసేయునున్న తపదోద్యన్మాధ్వుడత్యుగ్రుడై.
శా. వీటిమో దివిటీ నటీకుచతటీ విన్య స్తపాటీర యు
క్మాటీమోదికటీపిటీ పటువచో జ౦ఝూటధీరార్భటీ
ధాటీమోదిఘటీభటీకృతశఠాదత్తార్ధవిస్ఫార్యయః
పేటీమోదివినోదిమాధ్వధరణీ బృందారకుండిద్ధర౯.
ఉ. మాధ్వగురుండువచ్చునొకమారు పదేండ్లకు, వచ్చి వారిధ
ర్మాధ్వమడేయటంచున వరహా వరహా యొక యగ్నిముద్రకు౯
సాధ్వసలీల నిచ్చినను నాకన డింకను బేకు బేకు బే
కుధ్వనినేయు, మోక్షమునకుం గరణంబుహిరణ్య మేనుమీ.
చ. విరివిగ నేయినూనియల వేపుడు కూరలు మెండు మెంతి చ
ల్లొరుగులు నూరుబిండులును నూనములప్పడము ల్వడెంబులుం
బొరిపొరియెందునుందిరుగ బోతలనింగువలెస్స మంచిపాల్
పెరుగులు వెన్నమీగడలు పెంపుభళాభళి మాధ్వులోగిట౯
సీ. ఒఱుపై నవలి పెంపు చెఱఁగుగోచీకట్టు
తాటిముచ్చికవంటి తాలిబొట్టు
చేతులనపరంజి చిన్నారిపోచీలు
మేలైనమెడఁ బిరికీలసజ్జు
కడుఠీవినడుమున గంటల మొలనూలు
నెఱిగుల్కు దమ్మెలఁ గరణిపూలు
పదయుగంబున వెండి పాంజేబులందెలు
బటువు గుబ్బలబిగి . పైఠిణీయుఁ
గీ. గలిగి బంగారుకీల్బొమ్మ వలెనె హంస
గమనమున మెల్లగఁ బడక గదికిఁ జేరి
యలరి పతితోడఁ జెండ్లాట లాడి యిష్ట
భోగములఁ దేల్చు వ్యాపారి • పూవుబోడి.
మ. అనువారంబొకనోముస్నానములు మెన్దాచారముల్చెప్ప జా
లనువస్త్రంబులయందు దేహములజాలంబారిశుద్ధ్యంబు మా
టనుమాధుర్యము ధైర్యముం తెలివితేటల్ చాలునౌఁగానియే
పనియు౯ గట్టిగఁ జేయనోరువరు వ్యాపార్యంగనారత్నముల్.
సీ. బెళగావ్ తలేహేద్దు. బేగవుదంతధా
వనమాడి స్నానపు . మాడికొండు
మడిగట్టుకొండు నేమకకూడి దేవతా
ర్చనమాడికొండు బెచ్చ గెపదార్థ
ఈశగెభోజన . యిట్టికొండుందాను
మధురభోజనబేగ మాడికొండు
తేలెబాచియనొడివి . గుళుహాకికొండు ని
ష్ఠగెపురాణవు కేళి . సఖిగళువరు
గీ. కూడిహువ్వి వన కెహోగి, కోయ్దహువ్వి
గళుసరపుమాడియ౯ రాత్రి కాలపతిగె
భూరిసంతోషదిందతా౯భోగిసురుళు
కృతసుకృతపాణి వ్యాపారి • కీరవాణి
'
ఉ. కన్నులుద్రిప్పు సోలుగటం కాముఖహస్తముబట్టు జారుగా
వెన్నుననున్న పైట నొక వింతగనంతటసర్ది నిండుగాఁ
బన్నుక వెంకుబాయ్ తులసిబాయ్ మొదలైన సఖీజనంబుతో
గన్నడబాస మాధ్వసతి కందువలాడు విధంబు గంటిరే
మ. తెములు౯ బుణ్యవతీవిలాసము లధో దేహంబునం, దూర్థ్వదే
హమున౯ బోడితనంబు, నోటనుసృసింహస్తోత్రముల్, కన్నులం
బ్రమదావర్తనముల్, మెడందులసి కామాలల్, కయి౯ బుష్ప హా
రములు౯, మాధ్వవితంతుయౌగపదసా రాసారశోభల్తగు౯.
మ. నిజమోళల్లయెనేనెరుంగనునరుల్ నిందింత్రు నిచ్చల్ నియో
గిజన శ్రేణినిఁగుక్క గుంపనుచు, నగ్గింతెఫ్టు మాధ్వద్విజు
ప్రజలన్ గాకులటంచు, వైదికులరాబందుల్ గదాయంచు, బే
రజమాడందొరకొండ్రు దీనికొక మేరంగారణంబుండెడిన్.
వైష్ణవులు
సీ. గండభేరుండంచుగల ధోవతీకట్టు
కొమరైనవట్టె నామముల బొట్టు
కడుపెద్దముడికిఁ జొప్పడెడి సందెడు జుట్టు
నితరుల కెరుకగా నీనిగుట్టు
సామాన్యులకును దు.స్పాథ్యంబయిన బెట్టు
ద్రవిడభాషాప్రబంధములరట్టు
కఱ్ఱతోదోలినఁ గాని పారనితట్టు
తిట్టంపు తెఱచాటు తళియపట్టు
గీ. ఆట్టులిట్టుల ననరాని * యట్టియట్టు
లెట్టులే దమ్మి పేశిలో నెట్టునెట్టు
గట్టిగాఁ దెల్గు దేశంబు • బట్టినట్టి
వీరవైష్ణువు లను దొట్టు : నారుమట్టు,
ఉ. ఆసరసోక్తి, యామృదుత, యాగురు భావము, నాప్రసన్న తా
భ్యాసము, నామ భోద్యత వి భాసము, నచ్యుతదాసదాసప
ద్దాసవరేణ్య దాసభట . దాస తదీయక థాసదాసవి
న్యాసని తాంత నై వ్యనటనాభినయంబును, వైష్ణవార్ధముల్.
చ. తళతళ నెఱ్ఱఁ బార నిరతంబున దోమిన తామ్రపాత్రముల్
'మిలమిల నున్నగా నలికి మెత్తిన య త్తిరుమాళిగల్, కడు౯
బెళ పెళనారఁ దండెముల వేలఁగవైచిన ధౌతవస్త్రముల్
భళిభళిపైష్ణవో త్తముల పాలిటి భాగ్యము లేమి చెప్పుదు౯
సీ. చీటికిమాటికి శ్రీమతే రామాను
జాయనమోయంచుఁ జదువుసొగసు
నిరుపమభక్తిచేఁ బెరుమాళ్ల సుఫిరాట్టు
దిరువడిఘళ్ గొల్చి యెఱఁగుసొగసు
సారెసారెకుఁ దిరువారాధనంబులఁ
దిగవాయి మొడినోటఁ దెలుపు సొగసు
జ్ఞానులఁగని యడియే నడియేను దా
సోహమ్మనుచుఁ బల్కు నట్టిసొగసు
గీ. పరగఁ బన్నిద్దరాళ్వార్లఁ బరమభ క్తి
మించి తిరుమంత్ర మొనర సా యించుసొగసు
పొగడుచో వేయినోళ్ళకు మిగులుగొంత
వైష్ణవ బ్రాహ్మణులదె దైవప్రపత్తి.
సీ. తిరుమణి తిరుచూర్ణ తిరుణాళ్ళు తిరుమంత్ర
తిరుమాళిగయు తిరుక్కరియమధులు
తిరువీధి తిరుగలు తిరునామములు తిరు
వారాధనము తిరు వాయి మొడియు
తిరువధ్యయనమును తిరుమంగయాళ్వారు
తిరువేళికయు మఱి తిరువడిఘళ్లు
తిరుపతి తిరుమల తిరువీసములు తిరు
ప్పణ్నేరములు తిరు ప్పావుమఱియం
గీ. తిరువలి క్కేణి తిరువటూర్తురువంద
పురమును తిరువళ్ళూరును తిరుతుళసియు
తిరుతిరు తిరుత్తిరు త్తిరు తిరుతిరుతిరు
దిరుగువైష్ణవ పరిభాష తెఱవు మఱుగు.
ఉ.ధారుణిమీద గాళ్ళోరయ దట్టుపయి౯దగఁగూరుచుండి వి
స్తారపుమోపుగట్టి మడిసంచులుముందిడి, వెన్క దిండిసం
బారపుమూటపెట్టి యెడ బాయనిదాసుడుదోల శిష్యసం
చారముకై ప్రయాణమగు స్వామినిత్రోవనెచూడగావలె౯.
సీ.భుంభుంభురూంభుంభు౦మ్మటంచును
భూరగొమ్ములవారు ముందునడువ
ఢండండడండడం ఢంఢమ్మటంచును
ఢంకాలవారొక వంకనడువ
ఖణ్నీల్ఖిణీల్భిణీల్ ఖిణ్నీలటంచును
గిలకకఱ్ఱలవారు కెలననడువ
గుళుగుళుగ్గుళుగు గ్గుళుగుళ్ళటంచును
గురుసంస్తుతులవార లొరసినడువ
గీ. రంజితములైన ముత్యాల పిఁజరీల
పైడియడ్డల బంగారు పల్లకీల
చెలగి తిరువీధివేంచేపు జేసికొనుచు
వచ్చు జియ్యలవారు శ్రీ వైష్ణవులను.
సీ. వల్లకీపై నొక్కి బహుజనంబులు గొల్వ
బూరలూదుచువచ్చు వారలొకరు
బడుగుగుఱ్ఱ౦బుల పైనెక్కి కావటీ
వాని బెట్టకవచ్చు వారలొకరు
ఱ్రాలుజుట్టుక కుండలాలువ్రేలగఁ బాద
చారులై చనుదెంచు వారలొకరు
తలలుమావుక ఛత్ర ధారులై యక్షయ
పాత్రబుచ్చుకవచ్చు వారలొకరు
గీ. అవని శ్రీరంగమున వేంకటాచలమున
యాత్రలొనరించువారల నాశ్రయించి
తీరికూర్చుండిగడియించు వారలొకరు
బహువిధంబులు వైష్ణవ వర్తనములు.
ఉ.దోసమువచ్చునంచు మదిఁదోచెడినందున కేమిసేయుదు౯
జేసినపాపమెప్పుడునుఁ జెప్పినఁబోవును వైష్ణవుం డుప
న్యాసముజేసెనా విడువ కారునెలల్ వినువారిమంగళా
శాసనశక్తియెట్టిదొకొ చప్పునఁదీరును లౌకికార్థముల్.
చ. వినుమని చెప్పబూనితిని వింతకు, నన్నెవరైనఁజెప్పవో
యనివలికించిరా యనృతమాడగఁగారణమేమి మాటదా
చను చలికోతమందుసుమీ సంసరణ వ్రణపూర్ణశాంతికి౯
ఘనుడగువైష్ణవోత్తముముఖమ్మునఁబొందుమహోపదేశముల్.
చ. చెవిఁబడరాదు సాంబ శశిశేఖరస్ శూలధరాదినామముల్
సవనము లెందుఁగానమికస్నానములాగళముల్ ప్రచారమా
వివిధము సంధ్యసంగ్రహము వెల్లువ లద్భుతకైతవాత్మసం
స్తవములు వైష్ణవోత్తముల తత్వములంగొనియాడశక్యమే.
ఉ. కోపమువచ్చునేమొమరి గొంచెము నాకంభయంబుదో చెడి
న్తాపము లెల్లఁదీర్చుటకుఁ దాపమె హేతువటండ్రు మంచిదే
పాపము వైష్ణనో త్తములు పల్కినదే నిజ మెట్టులంటిరా
వ్యాపకమైన వజ్రమును వజ్రమె ప్రయ్యలు సేయజాలెడి౯
శా. ప్రీతికా శిష్యు న కుళ సమాశ్రయణమ రి చేయుచోఁ బాహు
భీతిఁ గంపిలఁ జేసినథ్
విడువరుర్విన్నై ప్లైవుల్ నిర్దయుల్ [వుల్
“తాతాచార్యుల వారిముద్రబుజముల్ తప్పించుకోగోరి కా
లూతం బారిసవీపుదప్ప దనుఁబూర్వోక్తిప్రకారంబున.
ఉ. రచ్చలలోన నన్నుఁ బలు రవ్వలఁ బెట్టిన నేమి, వారికి౯
నచ్చిన నేమి, కాక మఱి నచ్చకయుండిన నేమి చెప్పెద౯
పిచ్చియొ వెఱ్రియో నిజము, బేర్మిని వైష్ణవుడెంత కాంచనం
బిచ్చిననంతమోక్షమను నీయకయుండినముక్తి లేదను౯.
చ. తిరుమణి విష్ణుడుండు సిరిదేటపడ౯ దిరుచూర్ణ మందు సు
స్థిరముగనుండు వైష్ణవుని దివ్యముఖంబుననిద్దరు౯ సదా
దరలక యుండ్రిక౯ దులసిఁ దామరనట్లనెయుండ్రటంచుఁబ
ల్కిరి హరులెందరో సిరులికెందరో తద్దరు లెందఱోధర౯.
ఉ. గౌరవమొప్పశిష్యులకుఁ గమ్మనితియ్యనిమంచిమంచి ప
ణ్ణేరములారగింపుడని నెయ్యమునందయచేసికొంచుసాల్
వారిబదేంటీదీకొరత లాగరు, లాగుటజెప్పునప్పుడా
చారులవారిజెప్పవలె స్మార్తులఁగీర్తుల నట్టుఁ బెట్టుఁడీ.
సీ. చల్డినై వేద్యముల్ చాటుననేగాని
గ్రామదేవతఁ గొల్వ రాదటండ్రు
వఱుగు పచ్చడిదింట మఱుఁ గుమాటేకాని
గోంగూర దఱికిరాఁ గూడదండ్రు
పుళిహోరసాద మాకలిదీఱుటకెగాని
యేకాదశినిఁ దిండి హేయమండ్రు
ఆత్మసంస్తుతు లవి యాచారమేకాని
దురభిమానము చాల దూష్యమండ్రు
గి. ఘనపటాటోపమెల్ల లౌక్యంబెగాని
దంభసంరంభములు సేయఁ దగదటండ్రు
చెట్టలకుఁ గొంతయుపపత్తి జెప్పుచుండ్రు
వైష్ణవాచార్యస్వామ్యయ్యవార్లుగారు.
ఉ. చుంగులు వారధోవతులు సొంపుగఁగట్టిన యుత్తరీయముల్
కంగులుదీర న౦సములు గ్రమ్ముకవేలఁగఁ జల్ది సాదముల్
ఠంగునఁగొట్టి కోవెలకొ ఠాయులఁ గొందఱుమంది వైష్ణవుల్
పొంగళిబుట్ట లెత్తికొని పోవుదు రిండ్లకు వీధివింబడి౯.
చ. తెలియదునాకుఁ బూర్ణ ముగధీరులు వైష్ణవు లేమి సేతురో,
చలనముగాన రాదు, తెఱచాటునఁ జేతు; రదేమిటంటిమా
తళియయటండ్రు; కొంచెను నిదానముగానొకయింతవింటిమా
గళుకుగళుక్కు మన్గటుకు గట్కు గుటుక్కు గుటుక్కు గుట్కమన్
శా. బారుంబూరుగనారగింతురువడప్పణ్నేరముల్ పూర్ణప
ణ్నీరంబుల్పుళిహోర తైరువడపన్నేరంబు దధ్యోదనం
బారంగర్యమధుల్కొళంబువురితో హ్యాతై రుమోరున్మహో
దార స్వైరవిహార వైభవులుదాత్త ప్రాభవుల్ వైష్ణవుల్.
ఉ. కాకరకాయ కట్టొకటి • కైనిడిపోయెడికాపు జూచి “చీ
యేకడఁగజ్జికాయ లివియేల” నన౯ విని “మంచికూరఁయోఁ
గాకర కాయలం" డనుచుగాపువచింపఁగ"నట్లనా, యువుం
గాకిటుజూపు"మన్న విని కావుసమర్పణ సేయఁగా దిరు
ప్పాకముజేసి సాపడెను వైష్ణవులొక్కరు తొల్లి మెల్లన౯,
ఉ. వైష్ణవునామముల్ గనిన బాబొకడోర్వకనాక వానిక్రో
ధోష్ణమునార్పనాతడొకయు క్తినిఁబన్నె తురుష్క భూమిరా
డ్జిష్ణుతకంచు నాభిపరి షిక్తము దిద్దుట గాన కాతఁడా
యుష్ణక రాత్మజాలయము నొయ్యనబోయెనటండ్రు గ్రక్కున౯.
చ. చెఱువున కేగెడు౯ జలము చెంబును బూనడు, లేశమాత్రము
న్మఱుఁగుజరూరు లేదు, తను మానవులెవ్వరు జూచిన౯ సరే
వెఱువడు, బాహ్యగామియగు వేళను; సాపడునప్పుడొప్పుగ
న్దెఱమఱుఁగడ్డముండకను తీరదు వైష్ణవభూసురాళికి౯.
చ. దిటముగలోనగోచియిడి తెల్లనిధోవతీ గూడుకట్టుగాఁ
బటుగతిఁగట్టి జుట్టుముడి బల్హోయలై వెనుపట్టెమూయఁగా
స్ఫుటమ: గనూర్థ్వపుండ్రముల శోభిలదవ్వుల నవ్వుకొంచుని
వ్వటముగఁగన్ను లార్చుచును వైష్ణవమాణవకుండువచ్చెడి౯.
ఉ. పూచినతంగెడుల్ కఱిఁగిపోసిన బొమ్మలు నిల్చిధాత్రి పైఁ
దోచిన క్రొమ్మెఱుంగులమితో జ్జ్వల రాజకిరీటకోటిపై
దాచినపద్మరాగములు దర్ప కుదార లసత్పటంబుపై
వై చినచిత్రరేఖ లలవైష్ణవవసుందరు లేమిచెప్పుదున్.
తరువోజ, తిన్నని సన్ననితిరుచూర్ణ రేఖ
తీరుగా సౌరుగా దిద్దిన మోము
మిన్నఁగా నున్నగా మెఱుఁగారదువ్వి
మేలుగా వీలుగా మెలచినకొప్పు
చిన్నారి పొన్నారి, చెమరెత్తుచున్న
సిరిగుల్కు నెఱిఁదళ్కు, చెక్కుటద్దములు
వన్నెతో చిన్నెతో వరుని మెప్పించు
వాసిగా దాసిగా వైష్ణవయువతి.
ఉ సారణిమిటుఁ గిన్నెరలసాటిగ సన్ననిగొంతులెత్తి శృం
గారముమీర రాగములు గాసరిగాఁ బెరుమాళ్ళసన్నిధి౯
హారతులిచ్చువేళల యొయారము వైష్ణవపమ్మ నారలం
గారల దేసుమీ మధురగానము తమ్మిళిపేశి దోడ్పడ౯.
చ. కలదుసుమీ యొకింతయుపకార మనాథలపట్ల మేటితెం
గళికుడివడ్హ లం దదియుఁ గానముస్మార్తులతోటిపాటెయెం
దులకిటులంటిరంచు మదిఁదోచెడి మీకును శంకదీర్చెద౯
నెలనెలకు౯ వితంతువుల నెత్తులు మంగలిముట్టకుండుట౯,
చ.“ఎడపక సానియిల్మఱిగి యిల్లఁనడద్దిర" యంచుఁ దండ్రియ
ప్పడతుక యింటఁగన్మోరగి బాలకుఁజూడఁ బిపాస దానిపా
నడబయికెత్తి లోనిమిడి పాలునుగూడును సాపడంగ "నా
బుడుతఁడు పైప్లవంబునిలు వున్సరిగా" ననిమెచ్చి వానికై
పడుల గణింపకేగెనట వైష్ణవుడొక్కఁడు తొల్లివింటిరే.
శైవులు
సీ. భస్మత్రిపుండ్రముల్ ఫౌలదేశంబున
నడినెత్తిమెడమీఁద గడతలందు
కనుఁగ్రేవలను వీపు ననుబుజంబులయందు
మ్రోచేతులందు రొమ్మునను బొజ్జ
మణిబంధములఁ గటిమండలంబున వ్రేళ్లఁ
(బ్రక్కలమోకాళ్ళఁబిక్కలందు
సీలమండలనుఁ బాదాలపై యడుగుల
వ్రేళ్ల మొదళ్ళను గోళ్ళయందు
గీ. నిచ్చటచ్చటనన రాక నెల్ల యెడల
తనువు నిండగఁ దెగఁబూసి తమ్ముఁజూచి
యదరిపడి బ్రహ్మరాక్షసుల్ బెదరిపోర
శైవభూసురు లాంధ్రదేశమునఁగలరు.
సీ. తలయు గడ్డము మీస ములు గోళ్లుఁ జింకలు
దండిగాఁ బెంచిగొం దరుజరింత్రు
మణిగెడురుద్రాక్షమాలికల్ మెడయందుఁ
దలయందుఁదాల్చి కొందరుజరింత్రు
పులివెంబడించినప్పుడు గూడ భువినీడ
దరియరాదనుచు గొందరుజరింత్రు.
ఎట్టియాపదనైనఁ బట్టినట్టి వ్రతంబు
దప్పరాదనుచుఁ గొందరుజరింత్రు
గీ. బ్రాహ్మణులతోడిపొత్తును భక్తిమీది
వలపు నీరెండునెన్నఁడు . దలవునందు
మఱువగారాదటంచుఁ గొందరుజరింత్రు
శైవభూసురులాంధ్ర దేశంబునఁదు.
సీ.పంచాక్షరీమంత్ర పఠనగోప్య మెకాని
యధ్యయనంబు లంతంతమాత్ర
మాగమోక్తంబుల నాచరించుటెకాని
వేదోక్త మదియొక్క వీసముండు
నట్టిల్లునిండగాఁ బట్టుపెట్టుటెకాని
కర్మధర్మములెవ్వి కానరావు
తుదకు నూరైన వత్తులు గాల్చుటేకానీ
యౌపాసనములు మాటాడరాదు.
గీ. ధనము వెచ్చించి రాత్రిభోజనములిడుచు
జనులు గొనియాడగా గణార్చనలెకాని
యజ్ఞయాగాదికముల పేరైన వినరు
శైవు లేమందు నాంధ్రదేశంబునందు.
చ. పరశివునం దమందదృఢభక్తి, యవారతనిందిత క్రియా తా
చరణమున న్విరక్తి, మధు సారములొల్కుమృదూక్తిదేవ
ధ్వరకరణాగమప్రచుర తంత్రవిశంకటశక్తి, తుందగ
స్వార పరిపూర్ణభుక్తి, యహహా యివి శైవులనై జసంపదల్.
చ. మనుదివముల్ ప్రసాదనియ మంబునునిత్యమహేశ్వరార్చనం
బును నిరతంబు బిల్వదళ పూజసదాధృత భవ్యలింగలాం
ఛనమును సర్వదా పటుపిశాచవితాన విపాటనక్రియా
చణమగుభూతిధారణను శైవులుమాన్యులుగారె ధారుణి౯
ఉ. కట్టలుకట్టలే కరుచుగావలెఁ బత్తిరి, మ్రుగ్గుపిండులా
బుట్టలుబుట్ట లేతరిగి పోవలె, మెత్తనిదూదివత్తులా
తుట్టెలుతుట్టెలే చమురుతో వెలుగన్వలె, నౌప్రసాదమా
తట్టలుతట్ట లే కొసలు దట్టగ, విస్తరినిండ గావలె౯
పట్టులు పట్టులౌర యయవారులకు న్శివపూజువేళల౯.
సీ. నూరువత్తులవారు పేరుజెందనివారు
వేయివత్తులవారు విడియుచోట
వేయివత్తులవారు వెనుకఁబట్టిన వారు
లక్ష వత్తుల వారు డాయుచోట
లక్షవత్తులవారు లావుదూలినవారు
కోటివత్తులవారు గూడుచోట
కోటివత్తులవారుకొరకుమాలిన వారు
భూరివత్తులవారు జేరుచోట
గీ. విత్తమున కే ముదాత్తవి ద్వత్త కేమి
చిత్తసత్తలకేమి ధీమత్త కేమి
వత్తులే బత్తులకును మహత్తులెన్న
దేవసములైన శైవభూదేవులందు.
ఉ. కాయము భూతిభూషితము కర్మము తీక్ష్ణముదుర్గమంబు న
త్యాయతినంతరంగ గుణమద్భుతమైనశీల గరుంగగాఁ
జేయుజగత్తమంబు పసజించు మహామహిమంబు భానులె
క్కాయను గంటిరే నివురు గప్పిననిప్పులు శైవభూసురుల్
మ. తమకు౯ వృద్ధవితంతుమండలము వేదాంతార్థసారోపదే
శముల శిష్యగణంబులై కొలువగా, సత్తంచుజిత్తంచుభూ
తములంచున్మరియింద్రియమ్ములను చు౯ దత్తంచుత్వమ్మంచసి
క్రమమంచుంబరమాత్మయంచుగురురాట్కారుణ్యమంచుందవై
వమమంచుం బహుధావచింతురువహవ్వావృద్ధ శైవాగ్రణుల్.
ఉ. తత్వవిదుల్ శివద్విజులు దారువచింతురు వారి కెప్డుప్రే
తత్వము లేదుగాని తను దాహము గూడదటంచు; బాగుదే
వత్వమునందు వారలకు వచ్చునధోగతం లాసమాధివా
సత్వమున౯ గతంబెరుగఁ జాలవిరుద్ధముగాఁగనంబడు౯.
ఉ. తల్లికిభారమాశిశువు, తామరతూటికి పువ్వుభారమా,
విల్లోక భారమా కడిఁది వీరున, కొంటెకుగూనుభారనూ,
వల్లికిభారమాఫలము, బఱ్ఱెకుఁ గొమ్ములు భారమా, నుతుల్
చెలును లింగధారులకు లింగపుఁగాయలు భారమామహీ౯.
శా. భూత ప్రేతపిశాచరాక్ష సగణంబుల్ శాకినీడాకినీ హ్రయం
వాతంబుల్భయక౦వమందితో లగ౯ హాంహ్రీం ఫటోస్వా
చాతంశంబులుమాని మంత్రమహిమా వ్యాప్తి౯ గ్రహగ్ర స్తలం
బ్రీతి దందనలాడఁ జేతురు గ్రహావేశంబుల౯ శాంకరుల్
ఉ. లింగమ బోయినం బ్రతుకు లేదని శైవులు లింగరక్షణ౯
భఁగము లేక సేయుదురు; ప్రాగ్భవసంచితపాపశక్తి మై
లింగము బోయినం దెలియ లేరది మానవులంచుఁ గొందఱా
లింగముబోయినంబదులు లింగముదాల్తురుభక్తి మీరగ౯.
ఉ. మర్త్యత లింగథారణము మాత్రనబోవు నమర్త్యభావమే
కీర్త్యము శైవవిప్రతతికి౯, బ్రతుకందరితోఁటిపాటె, యా
మర్త్యత కేమియర్ధమొయ మర్త్యతకేమొయెఱుంగమాదట౯
మర్త్యతమంటపాలగు సమర్త్యతగంటి రెమంటిపొలగు౯.
చ. వడివడిగా హరీయనినవారక మూతురుగర్ణరంధ్రముల్
తొడరిహరాయటన్నఁదమితోఁ దమమేనులుదామెఱుంగ రా
గుడితలకట్టు భేదమునకు౯ రసభేదమునొందునట్టి దె
క్కడిపని శైవభూసురళి భామణులందునఁదక్కలాతుల౯.
ఉ. కొందఱిభూతకోటిబురికొల్పుదునం చదలించి లోగొనుం
గొందరియింటనౌకరయి కొల్చిమతుల్కరగించియిష్టుడౌ
నందిన జుట్టుబట్టుకొను నందకయుండినఁ గాళ్ళుబట్టు న
స్పందవిచారశీలుఁడగు శైవమహీసురశేఖరుం డిల౯.
చ. ఆడవి నెడారిదారిఁజను నప్పుడు శైవమహానుభావుఁజో [యీ
రుఁడొకఁడు వెంబడించినఁబరుంగిడఁగాలికొలందిఁ జొచ్చి
మిడిమిడిదొంగపోటులకు మిక్కిలి యయ్యెనులింగపోటటం-
చడుగిడనేఱ కీశ్వరహ:రాశివశంకరయంచుఁగూయిడె౯
శా. అయ్యాశైవులఁ బిల్చు చోజనులు పేరయ్యయ్య వారండ్రుపే
రయ్యం డ్రొక్కరుపేరయండ్రొరులు పేరారాధ్యుడండ్రొక్కరా
యయ్యన్ బేరయలింగమండ్రొకళులొయ్యంబేర లింగంబటం
డ్రయ్యై వేళల వారువారు సమయోక్తానేక నామంబుల౯.
ఉ. చర్యలునామముద్దెలుపు, శైవులు వైష్ణవులంచు నెప్పుడు౯
ధార్యములింగ మొక్కరికిఁ • దప్తములన్యుల కెన్నలింగయా
చార్యుడురంగలింగమును శైవులవైష్ణవులందునామసాం
కర్యమునొందుఁబూరుషులు గానఁగ రారుమతంబుకట్టడిన్.
చ. మొగమునభూతి రేఖలని మూడుఁగణంతలరెండు దీర్చివా
సిగఁబలుజందెపోగులనుఁ జేర్చిననున్న నిలక్కలింగకా
యగనఁబడుంగనంబడ దొయూరముగం జరలింగమందు రీ
జగమునలింగధారిమత శాబకుడాడు నియోగిబాలుతోన్.
సీ. నూత్రంబునకు లింగసూత్రంబుసహకారి
పొసగుఁ గుంకుమకు విభూతితోఁడు
కరకంకణములసంగాతము దోరముల్
ధూపగంథము గంధలేపసఖము
అవతంసభూషాస హాయంబు తొగఱేకు
రహిఁబదంబులకుఁ బారాణి నేస్తి
కొనచెవిబొగడల కనుఁగు మారెడుపత్రి
గోళ్ళకుఁ గాదిలి గోరిఁటాకు
గీ. భక్తి మహినుకు నరచూపు బ్రాపునుమ్ము
శాంతభావంబు మందహాసంబు ప్రియము
ఉక్తిమృదుతకు శివనామ ముపవదంబు
వాసిగను లింగథారమ్మ వారలకును.
సీ. వేఁగుజామునలేచి వీధిగుమ్మము జిమ్మి
యిల్లూడ్బి యావెన్కఁబళ్లుదోమి
గోమయంబునుఁ దెచ్చి గీమునున్నఁగనల్కి
కలయంపి వాకిళఁ గలయఁజల్లి
చిన్ని వన్నెల మ్రుగ్గు చిగురు బారలఁదీర్చి
మడిబట్ట లుతికి ప్రొయ్ బిడకలనిడి
రాఁజేసి మడిగట్టి రాజాన్నములు వండి
భక్తిమిరఁగఁ బిండి పట్టుబెట్టి
గీ. వత్తి జోతులు మారేడు పత్తిరియును
తుమ్మిపూవులు చమురుకుందులు విభూతి
పండ్లు పతిశివపూజ కేర్పాటుజేసి
వాసిగను లింగధారయ్య, వారి నారి.
సీ.తుట్టెగట్టినపిండి తట్టలోదొక యింత
మ్రుగ్గుపట్టులఁబెట్టు ముగుదయోర్తు
బూజుబట్టిన ప్రాతబూదిగడ్డలుకొన్ని
లింగ లేపమునేయు లేమయోర్తు
వఱుగుగానెండి ప్రాబడిన మారెడుపత్రి
శివపూజకొనఁగూర్చు చెడెయోర్తు
ఏడోది కొక్కతూ రే చేసిడాచిన
వత్తులు వెలిగించు వనితయోర్తు
గీ. ఉడికియుడకనిమెదుకు నీళ్లోడుపప్పు
కాగికాఁగనిచారును గరిటెనంటి
తొలఁగిజారని కట్టాలి. పులుసుఁ గూర
పతికివడ్డించు శైవరూ సవతియోర్తు.
చ. వలపులులెస్స, కూడని వివాదలు లేశముగాన రావు, కా
వలసినయంత భక్తి గలవారయినం భయమే కొఱంత భ
ర్తలయెడ లింగ ధారినని తాతకి, కయ్యదివారివుణ్యమో,
చెలువలదోషమో, తలవ స్వీకృతలింగశిలామహత్వమో.
శా. చారుంగూరలు పప్పులుంబులును పచ్చళ్లప్పడాల్ దప్పళా
లూరుంగాయలు మెంతిమజ్జిగలుపాలుంబాయసాన్నంబులుం
గారెల్ బూరెలు బొబ్బటుల్దినగ వ క్కా బంట్లు శైవుల స్వచే
స్టారూఢంబగు కాకకుం బసవగడ్డల్ దొడ్డమందుండగ౯.
చ. కుడువఁడు భక్ష్యభోజ్యములు గోరసనీరముఖద్రవంబు లా
నడు మెడబంగరుంగొలుసునం దగిలించినలింగకాయలో
విడిసినలింగమూర్తికిని వేదన సేయక శైవభూసురం
డడవినొకండు నెండనుఁ బ్రయాణమునే సెడివేళ నేనియున్.
చ. పశువుమతంబు శైవమది, పాముమతంబది వైష్ణవంబు, క
ర్కశములు గావుమాద్ధ్యమది గట్టిగఁ గోతిమతం; బదెట్లునా౯
బసవడు, భాష్య కారులును, మధ్వుఁడు; నందియు, శేషుఁ,డంజనీ
శిశువును మానవత్వమును జెంది జనించినవారు కావున౯.
కరణకమ్మలు
మ.మతమేదో తెలియంగ రాదుకలదా మాధ్వాళితో బొత్తు, సం
తతము౯ లౌకికవృత్తి జీవనము, పెద్దల్ వామనాచార్యునం
చితసిద్ధాంతము వారిదందురు;మఱా సిద్ధాంత మేచందమో
మతినూహింపఁగ లేరుపోగరణకమ్మల్ తెల్గుదేశంబున౯.
సీ.నూఱూళ్ళ కొకయింటి వారైనఁ గనరారు
దొఱికిరా' యరుదుగాఁ బురములందు
అమరదు పడుచు బెండ్లాడదలంచిన
దొరికెనా యొక సంచి దులపవలయు
వెతకియెను వారి మతముఁ జెప్పఁగలేము
దొరికెనా సిద్ధాంత మెరుకపడదు
పరమవైదికమును పట్టిచూచిన లేదు
దొరికెనా ముదుసలి'త్రొక్కులందు
గీ. అన్నదమ్ములవారలు గన్న వారి
నడుమవచ్చిన వెనుక నొక్కింటనుఁట
దొఱికెనా యొక్కరిద్దరుందురు జగాన
విలువగలవారు కరణకమ్మలనువారు.
చ. నడవడులన్ని యోగిసరి, నామమునందునులౌక్యమధ్వుకై
వడి, మడిమంట్రలందుఁదుల వైదికుతో, నికవైష్ణవంబు జొ
ప్పడుసముదాత్తభాగవతభక్తిని, యుక్తిగోరంతలేదు నల్
గడలఁబొసంగెడి౯గరణ గమ్మకుఁ గుమ్మకులిమ్మతమ్ముల౯
సీ గుణముమంచిదికాని గుట్టుకొంచెంబైన
కరణకమ్మలకు జుగానఁగాన
త్యాగభోగమెకాని ధనసంగ్రహముచాల
కరణకమ్మలకు జగాన గాన
మాటబింకమెకాని మనసునొప్పించుట
కరణకమ్మలకు జగానఁ గాస
పేరుదొడ్డదిగాని బెట్టువిస్తారంబు
కరణకమ్మలకు జగానఁ గాన
గీ. లౌకికములై నవ్యవహార లాంఛనముల
వేషభాషల క్షాత్రంబు • వెలయుఁగాని
బ్రాహ్మణాచారహాని యేపట్టులందుఁ
గరణకమ్మలలోన జగానఁ గానఁ గాన
సీ.కొమరైన జలతారు కోకగట్టునుగాని
గోచిగొప్పది పైటకొంగుకురుచ
రాణించు మేల్పట్టురవిక దొడగునుగాని
జేబుపెద్దది దండచేయిపొట్టి
ముంజేతికంకణంబులు పసందేకాని
కడ్డీలులావులో దొడ్డిబిగువు
నాణెంపుబంగారు నత్తుబెట్టును గాని
గాటుపల్లము రాతి కట్టుమెఱక
గీ.స్మార్తులందు నియోగులు మాధ్వులందు
యాజ్ఞవల్క్యులయందు లౌక్య ప్రవరులఁ
గరణకమ్మల నీనాటి కాలమందు
వరలు వగలాడిపడుచు పువ్వారుకోడి.
యాజ్ఞవల్క్యులు
మ. కుడువంజొచ్చును బ్రాహ్మణార్థముల బెక్కు ల్రాుజకీయార్థముల్
నడువంజూచును యాజ్ఞవల్క్యుఁడు ధర౯మ నానోచ్చనీ చంబులం
దెడలేక న్నటియించుఁ గాలముకొలందింజోవు, నేయెండకా
గొడుగుం బట్టుధనార్జనంబునకు నెగ్గుం మ్రోగ్గుతగ్గేమను౯
గోలకొండ వ్యాపారులు
ఉ. పేరున రావుపంతులని పెట్టకమానరు, వైష్ణవంబు వి
స్తారము, వైదికంబుగల దాయని రోసినఁ, గొంతజిక్కు నం
ఆసారముగుట్టువారలదె, సాధువు లెందును గోలకొండ వ్యా
పొరులులౌక్య వృత్తులన పౌరులు, కారులు బల్కరెప్పుడు౯.
సీ. శుచిదేరినయెడళ్లు సొగసైన కుచ్చెళ్లు
చిట్టాడుమిగాళ్ళు జుట్టుముళ్లు
తమ్మెట్లరవణాళ్లు తమలంపుఁ బసనోళ్లు
రంగురుమాళ్లుంగరాల వ్రేళ్ళు
రావుపంతులుపేళ్లు రవరవచప్పుళ్లు
రాతిరియుఁ బగళ్లు వ్రాయుగీళ్లు
బంగారు మొలత్రాళ్లు పై జారుజోళ్లు వై
ష్ణవుచేతినీ ళ్లరచాటుమళ్లు
గీ. శక్రపొంగళ్ళు సాపాట్లు సగముపాళ్ళు
పెళ్ళినడవళ్ళు వేయారు పెట్టుబళ్లు
నిత్యమును గామ్యములు సొమ్ము నిజము గోల
కొండవ్యాపారులం దాంధ్ర మండలమున.
సీ.ఎలమిఁ జీపురుబట్టి యిల్లూడ్చునపుడైన
పోనీరు తలజుట్టు పూల మెరగు
అసదుగా జలకంబులాడు వేళలనైన
పోనీరు నునుగొప్పునూనె మెఱుగు
మడిగట్టి వంటకాల్కడ తేర్చునపుడైన
పోనీరు తోడగు కడానిమెఱగు
నాయకాలింగనోన్న తసౌఖ్యమందైన
పోనీరు కొంతైన మేని మెఱుగు
గీ. తనులతా చారు తాశుచింతా విభూష
ణాంబితాంగ విలాసతా వాత్తినతుల
మతుల సుకృతులఁ గృతచమత్కృతులఁ గోల
కొండవ్యాపారసతులఁ బేర్కొనఁగఁ జనదె.
ద్రావిడులు
ఉ. ద్రావిడవైదికో త్తములధర్మములన్నియు దేశ్యతుల్యముల్
గా వొకకొన్ని భేదములు గానగవచ్చు శివాక్షమాలికల్
లావు, సదావహీంత్రునవలాల్ కుడి పైటలు, కచ్చకట్టులా
లేవు, వివాహశుల్కములు లెస్సలు, సాములు దేశయాత్రలం
బ్రోవిడుసొమ్ము లంగనల పూర్వభవార్జిత పుణ్యలబ్ధముల్.
వివాహములు
ఉ. చెప్పకయున్న దోషముగుఁ జెప్పినగోపము లేమిసేయుదున్
జెప్పకతప్పదీవయిపు సీమల బ్రాహ్మణకోటి గన్యకల్
గొప్పగిరాకి పెద్దపడి గుండున నల్బది సేర్ల వెండికి౯
జప్పుడు లేకఁ దూగు నదిచాలక యున్న మఱొక్క సేరగు౯.
ఉ.చెప్పిన కార్యమే మెవరు జేతురు నాపలు కాలకించి, వెం
కప్పకుడెబ్బ దేఁడ్లు నరసమ్మకు నెన్మిదియేడు లీదుగాఁ
జొప్పడేనంచు నాంధ్రపద సూరులు తప్పక పొంతనంబుల
జెప్పుడు రెంతతప్పుపనిచీ! ముసలింబసి కాయమెచ్చునే
ఉ. అప్పుడెపెండ్లివచ్చె మన యమ్మికినంచును తల్లిదండ్రియ
న్నప్పలు జెప్పగా వినుచు నాయిఁక్రదోయిలమబ్బెఁ జిక్కిలాల్
పప్పులుపాయసాలరిసె పప్పులుకుప్పలు తెప్ప లప్పరో
యెప్పుడే చెప్పు చెప్పుమని యీడ్తురు పయ్యెద కొంగుఁబట్టికీల్
గొప్పున కొప్పులై కురులు గూడని యీడుననాంధ్ర బాలికల్.
ఉ. చేతురుకయ్య ముల్గడుసు చెయ్వుల వియ్యపురాండ్రు; చాలునీ
కూతురిసారెలోనిడిన కోక యిదోవది రెండుమూళ్ళు; నీ
కూతురిసారె నేను గనుఁగొంటినిగా పదిమూళ్లె లేదుగా
నీతులులాతికిందెలుప నేర్తువటంచును మూతిద్రిప్పుచు౯.
అత్తకోడండ్రు
చ.తెలిపెడి నత్త,కోడలికిదివ్వెలదివ్వెలదివ్వెలంటుదు౯
దల;శనివారమాపయిని దాబుధవారమునాఁడునంటుదు౯
దల వినుడమ్మకూతులకు; తథ్యము చెప్పుడు తల్లులార! యం
చలవడెనీళ్ల రేవుకడ నమ్మలునక్కలు గూడియుండగ౯.
చ.అడిగినఁబొట్టనిండునటు లన్నము వెట్టనియ త్తతోఁడఁ దా
వడివడి నంబటేరదుగొ వచ్చెడి!న త్త, యనంగ గోడలా!
బుడబుడ లేలబొమ్ముకొలఁబుర్రను జూడుమునాదు చేతిలోఁ
దడఁబడదెప్పుడంచు నుడిదప్పకకోడలి కత్తసెప్పెడి౯.
చ.అలుకున బిచ్చగాని గనియందదుపొమ్మనికోడలన్న, వాఁ
డలుఁగుచుఁబోవఁ దోవఁగని యత్తిటురమ్మనిపిల్వ, వాఁడురా,
నిలువకపొమ్ములేదనిన నీకిదియేమనివాఁడన౯; సరే
కలదన లేదన౯ దనది. కావలెఁ గోడలిప్రేష్యమేమను౯,
ఉ. "కోడల!వీపుదోము” మని కోరినయత్త నుజూచి“య త్తచే
యాడదు, కాలుపై కెగయు” నన్న “నయో,మును నేనుమీది
తోలూడఁగఁగాళ్లతోనదిమి హుమ్మనితోమితి న త్తవీపు, నే
డీడకువచ్చెదానిఫలమే కుడువుం గద కోడలాయను౯.
చ. చనువునఁ గోతినెత్తినొక చక్కనిఱాయిడి యత్తవారికుం
డన వినిప్రక్కలై ధరఁబడ౯ విడు; బుట్టిన యింటి వారికుం
డన విని మెల్ల మెల్లన న పాయము సేయకడించు నట్లుగా
గొనకొను నత్తగారికీని గోడలికింగల యానుకూల్యమల్•
పండుగలు
సంక్రాంతి
చ. నిరుపమలీల బాలికలు నిశ్చలభక్తిని యుక్తిసంకురా
తిరినెలఁ బేడగొబ్బిలులు దీర్తురు వాకిళులందు మ్రుగ్గుల౯
బొరిపొరీబొమ్మలన్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలో
బరువడినారఁగించెదరు పచ్చడిబెల్లమువుల్గమిచ్చల౯
అట్లతద్దె
చ. బడిబడినట్లతద్దెయను పండుగవచ్చిన సంతసిల్లుచు౯
వడిఁ దెలవాఱుచుక్క బొడువం గని లేచి సమస్తబాలికల్
మడినిడి పొట్లకాయపరమాన్నము నన్నము మెక్కి యాటలన్
బడిమఱునాఁటనుయ్యెలల పైఁదగనూగుటజూడనొప్పదే.
దీపావళి
చ. చిటపట టుప్పుటప్పనెడి సీమ టపాకులపెట్టె లెన్ని, యు
ద్భటముగ ఢమ్మడుమ్మను టాపాకులవెన్ని, మతాబులెన్ని, పి
క్కటిలెడి ఝిల్లు లెన్ని, మఱి కాకరపూవతులెన్ని, గాల్తురో
దిటముగఁ దెల్పనాతరమెదివ్వెల పండుగ రేయినర్భకుల్.
వినాయక చవితి
చ. తొలుదినమే వినాయక చతుర్ధికిముందర రాల్ పలేరుగా
యలుగడియించి పండుగ మహాగణనాధుని మంచిమంచి పూ
వులఁబలుపత్రులంగఱికిఁ బూజలు జేనుక ప్రొద్దుగ్రు౦కంగా
నలపొరుగిండ్లఁజల్లుకొను చాడిక జెందు దుర్భ కావళుల్.
సంవత్సరాది
సీ. అలవణ నింబవు ష్పామ్లరసాలశ
లాటుఖండములుతొల్త గబళించి
ఇష్టమృష్టాన్నముల్ తుష్టిగాభుజియించి
విప్రోత్త ముఁడుగ్రామ వీధిజేరి
పదిమందిరయితుల గుది గూర్చి కూర్చుండి
క్రొత్త పంచాంగంబు నెత్తిచదివి
ఆదాయములును వ్య యంబులు సెప్సి కం
దాయంబులకు వేళ యాయెననిన
గీ. దుడ్డునిండుగనిచ్చిన దొడ్డవారి
కన్నికందాయములు పూర్ణమనుచు జెప్పు
దుడ్డుదుగ్గాని లేదన్న గొడ్డుబోతు
కన్నికందాయముల శూన్య మనుచు జెప్పు
నౌర బాపన సంవత్సరాదినాడు.
నానావిధేతర విషయములు
పొడుము
సీ. పాటిపొగాకు బైపయి మడ్డిగల బారు
దళసరికొమ్మముక్కలు గ్రహించి
నడిమీ నెదివివి చొప్పడ గణకణలాడు
మేలై ననిప్పుల మీదగాని
మంటికోసను నల్పి మంచికఱ్ఱను నూరి
తడియోతి నున్న మింత తగవైచి
నేర్పుతోఁ గమ్మని నేయి కొంచెను బోసి
పొలుపై నవన్నె రాఁ బొడుముఁజేసి
గీ. వెండిపొన్మూతగొలుసుబొబ్బిలి పనందు
పోగమారెడుబుర్రఁ బోసుకొని రొండి
నిడి దలచినప్డు కించిత్తు పొడిగ్రహించి
బుర్రుమనఁ బీల్చుబాపని ముక్కెముక్కు.
ఇతరవిషయములు
చ. నలుగురుపట్టుపట్టుమన నాపలుకెవ్వరుబిండ్రు, గట్టిగాఁ
దెలిపినఁ గోపగింతురు సుధీతిలశంబులు, దాని కేమిలే
యళుకనువిప్రజీవనము యాచ్న యటండ్రుగృషింద్యజింతురిం
తెలుగలవాయటంచుసరి నాడుల వారలునవ్వు నట్లుగ౯
శా. స్మార్తుల్ దూరిరిమాధ్వ భూసురునిగర్మభ్రష్టుఁ డంచు న్వెస౯
స్మార్తు౯ మాధ్వులుదూరిరోడకనుముమ్మారు వ్రతభ్రష్టుగా
భర్తీ వైష్ణవవిపృనందు నుభయ భ్రష్టత్వమం డ్రిద్దరు౯
ధూర్తత్వంబున విష్ణు వాసరమునందుం దద్దినం బబ్బిన౯.
ఉ. తిండికి బత్తెమిండు నెలదీరిన దింకొక యిద్దు మప్పుగా
పిండదితీరులోన జమయిత్తునటంచును గంపదుల్పఁగాఁ
బండినపంటలోన సగంబాలు హరించును పాలివాడు బా
పండొనరించు సేద్యమున బాగొకజుట్టు నతండు నిల్చుటే.
చ. మలుమలులంచువచ్చినవి మంచివిగావవి, యేమొకానియా
ర్నెలలకుఁజిన్గు చీయెడలు నిండిన దట్టపు తాటిపాకచా
వులు మనువాకపుష్కరము పూచిమడంతను గట్టి చాకికిఁ
నెలకొకసారిగా నుదుక నిండని యందురువృద్ధభూసురుల్.
ఉ. తిండ్లర బాలు మజ్జిగలు తేటతుషారపునీళ్ళు, పప్పులే
దిండ్లక చెంపఁగప్పెగసి ఎండయువానయుదూలిపోదు
డేండ్లకు నైదుసారు లుతికించిన బట్టలు, నేమి జెప్పుదు౯
బెండ్లముమీదనింటిపయిఁ బెత్త నముంచిన వాని సౌఖ్యముఁ
తెలుగునాడు
బ్రాహ్మణప్రశంస సంపూర్ణము
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.