తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/కవితాపారమ్యము

14

కవితాపారమ్యము


శ్రీవేంకటపార్వతీశ్వరకవుల 'యేకాంతసేవను, దాని యనుకార్యమగు 'గీతాంజలి' ని బురస్కరించుకొని 'కవితాపారమ్య' మనువిషయమును గూర్చి నేను తలపోయుచుండు విషయముల నిక్కడ నించుక ప్రస్తావింతును.


శ్రీ వేంకటపార్వతీశ్వరకవులు రచియించిన యేకాంత సేవాకావ్యము రవీంద్రనాథ టాగూరుగారి 'గీతాంజలీ' చ్ఛాయగలదిగా విఖ్యాతి గాంచినది, 'గీతాంజలి' యు, 'నేకాంతసేవ' యు వ్యంగప్రధానకావ్యము లనియు, అవాజ్మానసగోచరమైన యీశ్వరతత్వమునుగూర్చి యన్వేషము జరుపువారి నవి యొకానొక యవ్యక్తానుభూతికిఁ దారఁగలిగియున్న వనియు వాకొనుట సహృదయులకు ననుభవపునరుక్తి.

వ్యంగ్యప్రధాన మైనకావ్య ముత్తమకావ్య మని యాలంకారికుల నిశ్చితనిర్వచనము. విరిసినపూవు సువాసనను, పుప్పొడిని, మకరంద బిందువులను తననెలవునకుఁ బై పడి యివీ యింతవరకే యని గీటుగీయ నలవికానంత వింతగా చుట్టుపట్టుల కెంతదాఁకనో ప్రసరింపఁజేసి వేడుక గొల్పినట్లు, వ్యంగ్యవైభవముగూడ నిది యింతే యని గ్రుద్ధి హద్దుగీటు గీయరానంతవింతగా వాచ్య లక్ష్యములకంటె మించిన యుద్ధవిశేషముల నెన్నింటి నేని జలజల రాల్చుచు నానందము గొల్పును. వ్యంగ్య వైభవము వాచ్యాతిశాయి గనుక వాచ్యమున నిర్వహింపఁదగనివియుఁ, దరము గానివియు నగుసర్ధముల ననుమితపఱచు నది సామాజికులను విశాల యోచనమునకుఁ బాల్పబచి యనిర్వచనీయానందమునకుఁ దార్చును.


లోకానుభూయమానములగు సామాన్యవిషయములలోనే వ్యంగ్యవైభవ మింతచమత్కార జనక మగు సనఁగా, నిఁక నవాజ్మనస గోచరము, సర్వజగద్వ్యాపారమూలాధారము నగు నీశ్వరతత్త్వమును

నిర్వచించుటకో, నిరూపించుటకో పూనినపుడు దాని చిద్విలాస మిఁక నెంతేని వింత గొల్పునదై యుండి తీఱును గదా. క్రాంతదర్శియైన సుకవి తనలో దృశ్యాదృశ్యముగా వెలుంగులు గొలుపుచున్న తత్త్వమును వ్యక్తావ్యక్త వాక్కులతో వ్యంగ్యమర్యాదతోనే సామాజికులకు పరిస్ఫురింప జేయవలసినవాఁ డగును, ఉత్తమగాయకుఁడుగూడ నొక్కోకపు డంతరంగమున గానామృతము పొర్లు వాలుచుండఁగా నుచ్చస్థాయికి భోయిపోయి, కంఠశక్తి వెనుబడఁగా శిరః కంపహస్తవాలనభ్రూభంగా దులచే గేయావశేషము నవగతపబుచువాఁ డగును,


కవి తనలో నెక్కడో యనభివ్యక్తముగా నెప్పుడో గోచరించిన పరతత్త్వము నాలంబముగాఁగొని దాని యనుభూతివాసనచొప్పునఁ దన నేర్పుకోలఁదీ భాషతో నొకప్రతికృతిని గల్పించి, సామాజికులకు దానిని బ్రదర్శించి పరమార్థానందచ్ఛాయ ననుభవింపఁజేయును. కవీశ్వరునట్లు సామాన్యజనుఁ డట్లు దాని దర్శింపనేని, ప్రదర్శింపనే చాలఁడు. అట్లే చిత్రకారుఁడును తన కేక్కడో-లోపలనో వెలుపలనో గోచరించిన దృశ్యమును దేశకాలాంతరములందు తనభావవాసనాసంస్కారమువలనఁ గొనివచ్చి తననేర్పున కనుగుణముగా వన్నెచిన్నెలతో రూపు గల్పించి, చూపి సామాజికుల నానందపఱచును.

ప్రకృతిపుష్పము వెలార్చుసౌందర్యసౌరభ్యాదులు చిత్ర పుష్పమున లేవు. అయినను సామాన్యమానవులీ చిత్రకారుని పుష్పము నధికానందముతో నాలోకింతురు. ప్రతికృతికంటే సాక్షాత్సత్య వస్తు వధికహృద్యము వలయుట విస్పష్ట విషయమే కాన, చిత్రపుష్పముకంటె మూలపుష్ప మధిక హృద్యమే కావలెను గదా? అయినను మూలపుష్పమున నెప్పుడో యెక్కడో కొంతసేపే దృశ్య మగుట, దాని రచయితయు, రచనా ప్రణాళియు నదృశ్యములగుట యన్న కొలుత లుండుట వలనను, చిత్రపుష్పమున సదా సర్వత్ర దృశ్య

మగుట, చిత్రకారుఁడును దద్రచనాప్రణాళియు ప్రత్యక్ష మగుట యన్నగుణము లుండుటవలనను; అంతే కాక, మానవత ప్రాయికముగా మాయాజా సావృతమై సత్యానుభూతికి దూరమై తానే సత్య ప్రతిబింబభూతమై యుండుటవలనను, సులభమగు సత్యప్రతికృతికే మానవ ప్రకృతి ముచ్చటపడును.

సామాజికాభిరంజనమునకై కవియు తాను కల్పించిన సత్య ప్రకృతికి వస్వలంకారశిల్పము, భాషాపరివేషము శయ్యా వైయాత్యము ఛందస్సందర్భము పొసగించి స్వారస్యాతిశయము సంపాదింపఁ జూచును.

సృష్టివ్యాపార కార్యమును స్పష్టముగా, సర్వదృశ్యముగా సాగించుచుఁ గూడఁ దత్కర్త యీశ్వరుఁడు తన్ను దాచుకొని తన కార్యములచేతనే తన్ననుమానిపించు చున్నట్లు ఉత్తమకవియు సత్యప్రతికృతియగు తనకవితాకల్పనలోఁ దత్పరమార్థ మంతర్లీనమై వ్యక్తముగా ధ్వన్యర్థవేద్యము కాలేకపోయినచో నట్టికవి వట్టి యబద్ధాలకోరుగానే గర్షితుఁ డగును.

అనఁగా, కవిత యొకవిధముగా నసత్యకల్పనమే యైనను, కవితలో ననభివ్యక్తముగా సత్యానందము వ్యంజనావృత్తి గోచరమై సందర్భిత మయియుండఁబట్టియే యది హృద్య మగుచున్న దన్నమాట.

ఈశ్వరతత్త్వము అవాజ్మనసగోచర మగుట తథ్యము. అట్లయ్యు దాని నాకళించుటకై లోకమెల్ల నటతటపడుచుముందు కడుగువేయుచున్న దనుటయుఁ దథ్యము, అది యనివార్య మగుటయుఁ దథ్యము, మానవయత్నము లెల్ల సత్యార్థములు,జానార్థములు నానందార్థములు నగుటను బట్టియు, నీశ్వరుఁడు నిరతిశయసత్యజ్ఞానానందాత్మఁకుఁ డగుటను బట్టియు నిది యిట్లే యనవలెను. ఉపనిషత్తు “ అసతో మాస ర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో ర్మామృతం గమయ” అని భగవత్రాప్తిని ప్రతిపాదించుచున్నది. కాఁగా, ఎఱిఁగయో, యెఱుఁగకయో యెటుపోయినను ఘట్టకుటీ ప్రభాతన్యాయమున సర్వమానవగతియు, అంతే యేమి - సర్వప్రాణిగతియు నీశ్వరాభిముఖమే యగుచున్నది. కాస ఈశ్వరప్రాప్తి ప్రాణికోటి కెల్ల సనివార్యమేకదా !

సదసత్తులతో, జ్ఞానాజ్ఞానములతో, ఆనందదుఃఖములతో, అపాయ, తన్ని వృత్తులతో కలగలు పయి గజిబిజిగా నున్న ప్రపంచవృత్తిలో తా ముపద్రష్టలై లోకసామాన్యమున కీయీశ్వరప్రాప్తియత్నమున తాత్త్వికులు, శాస్త్రకారులు, చిత్రకారులు, కవులు పురోగాములై యుందురు.

తాత్త్వికులు, శాస్త్రకారులు ఘోరదీక్షతో నంతరంగసముద్రమును మథించియు, బాహ్యమాయావరణారణ్యమును జీల్చికొని బాటలు తొక్కియు గుర్తించి, తెచ్చిన దివ్యవిజ్ఞానపదార్ధములను పరికరములుగా ల గొనియే వారివెనుక నడచువాఁ డగుకవీశ్వరుఁడు వానిలో మే లేర్చి వారు గుర్తించిన మార్గములలోనే చలువ పందిళులను, రసామృతప్రపలను గల్పించుచు, నింకను వెనుక నడచు మానవ సామాన్యమునకు వేడుగొల్పుచు వారీపయనము సుఖమయము గావించును,

తాత్త్వికునిలోఁ బరమార్థసాక్షాత్కార ముండును. కవిలోఁ దదనుసారిగా ప్రసన్నమధురాంశచ్ఛాయాకల్పనము లుండును.

తాత్త్వికునిలో కవితాంశములుసు, కవిలో తాత్త్విక తాంశములును గూడ ననుగతములై యుండువచ్చును.

తాత్త్వికుల తత్త్వజ్ఞానము పెరుగఁగా పెరుగఁగా తన్మూలమున కవితలో తాత్త్వికతాంశములు పెరుగఁగా పెరుగఁగా సంఘమున తాత్త్విక తాశ్రద్ధ పెచ్చుపెరుగును. అప్పుడు కవిత తేటదేరి క్రమపరిణామముతోఁ బరమార్థపరాయణ మగును. కృత్రిమకవితావిడంబనముల కపుడు తావుండదు. కవి కపుడు సత్యప్రతికృతికల్పన మనావశ్యక మగును. సౌందర్యసముచిత మయిన ఆ పరమార్థమే, అనఁగా సత్యమే యప్పుడు 150 పోజ్మయాకృతిఁ దాల్చును. పదనాఱువన్న బంగారమును మించినమేనిసారు గల శుద్ధ సాత్త్వికతేజోవిరాజితునకు బంగారపుటలంకారములతో బనియేమి?

శాస్త్రకారుల శారీరకపదార్థ విజ్ఞానరసాయనాది శాస్త్ర ప్రజా తిశయమున గులాబీ పువ్వును సువాసనతో, సౌకుమార్యముతో, పూవు తేనెలో, పుప్పొడితో సర్వసులభముగా శాస్త్ర ప్రక్రియ చొప్పునఁ గల్పింపం గల్గినపుడు గులాబిచిత్రకల్పన ప్రయోజనము సమసిపోవును. శాస్త్రజ్ఞులు శబ్దస్పర్శరూపరసగంధములను జ్ఞానేంద్రియ వ్యాపారములతో నిప్పటికి శబ్దరూపములను సర్వత్ర సర్వదా సులభములు చేయఁగల్గినట్లు తక్కిన మూడింటినిగూడ చేయఁగల్గ వచ్చును. అనఁగా మదరాసురేడియోలో పాడఁగా నపుడే గ్రామఫోనులో నెక్కించిన పాట, యెక్కడఁబట్టిన సక్కడ, ఎప్పుడు పట్టిన సప్పుడు వినఁదగినట్లు, చెన్నపురిలోనే రేడియోస్థానమునఁ బెట్టిన భక్ష్యభోజ్యముల చవియు, పూల వాసనయు, వస్తువుల స్పర్శయు సదా సర్వత్ర యాస్వాదింపఁ దగినది, యాఘ్రాణింపఁ దగినది, స్పృశింపఁ దగినది కావచ్చును గదా!

ఇట్టివి జరిగినచో ఇంక ననుకరణములయు. ప్రతికృతి కల్పనములయు. కవితాకల్పనములయు ప్రయోజన మేముండును? సత్యజగదానందమే కాని కవికల్పిత జగదానంద మప్పు డక్కలు లేక పోవును, కవి యపుడు దన కనుకార్యుఁడగు నీశ్వరునికిఁ దాను బ్రతిబింబతను గాక తాదాత్మ్యమునే పొందును. ఇట్లు మానవతలో నీశ్వరతాదాత్మ్యము గోచరింపను గోచరింపను వాజ్మయముకూడ నకృత్రిమ మయి తాత్త్విక మగును. ఆత్వీకులయు, సాత్త్వికులయు దివ్యవిజ్ఞానము లిందుకు తార్కాణము. “తత్త్వమసి" యిందుకు ప్రమాణము.