తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)/ఎఱ్ఱాప్రెగడ రామాయణము

13

ఎఱ్ఱాప్రెగడ రామాయణము

చదలువాడ యెర్రా ప్రగడ భారతారణ్వపర్వ శేషమును, రామాయణమును, నృసింహపురాణమును, హరివంశమునురచియించెను. హరివంశమున నిట్లున్నది:


శా."నా తమ్ముండు ఘనుండు మల్లరధినీనాధుండు ని న్నాతత
శ్రీ తోడన్ సముపేతుజేసి యేలమీన్ జేపట్టి మా కిచ్చుటన్
జేతోమోద మెలర్ల రామకధ మున్ జెప్పించి యత్యుత్తమ
ఖ్యాతిం జెందితి నింకనుం దనియ నేర గా వ్యామ్మృతాస్వాదసన్, "


దీని బట్టి రామాయణము హరీవంశమునకుఁ బూర్వకృతి యనియు, నది ప్రోలయ వేమారెడ్డి గారి ప్రేరణమున రచితమయ్యే ననియుఁ దెలియనగును.

  • వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్రప్రబంధంబుఁజేసె"


నని యేర్రా ప్రెగ్గడవంశమువాఁ డీటీవలిపోఁడు చదలువాఁడ మల్లయకవి చెప్పినాఁడు. దీనినిఁబట్టి యా రామాయణము సంగ్రహరూప మయినదిగాక సకలవర్ణనాపూర్ణమయిన, సంస్కృతరామయణానుసారి యయిన ప్రశస్త ప్రబంధముగా దెలియనగును.

ఇట్టి యెర్రా పెగ్గడ రామాయణ మిప్పుడు గాన రాదు. లక్షణ గ్రంథములలో నెర్రాపెగ్గడరామాయణ పద్యములు పెక్కు లుదాహృతము లయియున్నవి. -2. కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసం గ్రహమున ఎర్రా ప్రెగ్గడ రామాయణములోని వని యీ క్రింది పద్యములు సుదాహరించినాఁడు: తెలుఁగుమింగులు 137 w ఇటీవల భాస్కరరామాయణమును పరిశీలించుచుండఁగా వావిళ్ల వారిముద్రణమున యుద్ధకాండములోని యీ క్రింది పద్యము 'ఎఱా ప్రెగ్గడవారి పద్య మని ప్రతీతి' అను అధోజాపికతో కానవచ్చెను.


"ఉ.త్రెవ్వెదు గంటులం గురువు దేఱైడు నెత్తురు రాకమున్న యే
నొవ్వియు నేవికారము మనోగతిఁ జెందకమున్న సాయకం
బవ్వలఁబోకమున్న మకుటాగ్ర విఘట్టనరావ మొప్పుంగా
నువ్వున నుప్పతిల్లె నసురోద్వహ మూర్ధచయంబు గ్రక్కునన్. "


అది చూచి వ్రాతప్రతులను పరిశీలింతును గదా ఉదాహృతమైన యీ పద్యము ఎట్రాప్రెగ్గడ వారి దని యుండుట మాత్రమే కాక దీనిపూర్వ పద్యము--


"ఉన్నవి యున్నయట్ల తల లుర్వికి డిగె శిరఃప్రవాహముల్
మొన్నొక సారె నిండు దెగ మోపిన సాయక మట్లే యుండఁజాం
గె న్నెఱిఁడూపు వెల్లియని ఖేచరకోటి నుతించె నంచితో
త్పన్నదశాస్యరాఘవతపః కరలాఘవచిత్రసంపదల్."


అనుపద్యము 'భాస్కరుని వారి' దనికూడఁ గలదు. ఈ పద్యములు పెక్కుప్రతులలోఁగానరావు. కొనిప్రతులలోనే కలవు. ఇవి రాముఁడు రావణునితలలు తెగఁ గొట్టు ప్రకరణమునందలివి. యుద్ధకాండములోని యీ భాగమున భాస్కరరచనము నేఁడు కానరాదు. భాస్కరుఁడు కడముట్ట యుద్ధకాండము రచించినట్టు ప్రతీతియు లేదు. ఇందు భాస్కరరచనముగ పద్య ముందుటనుబట్టి చూడఁగా భాస్కరుడు యుద్ధ కాండమును కడముట్ట రచించె నని యేర్పడుచున్నది. ఇవే కాక, యుద్ధకాండమున మఱికొన్ని పద్యములు కొన్ని ప్రతులలో మాత్రమే యధికముగాఁ గానవచ్చుచున్నవి. దొరకిన యుద్ధకాండప్రతులనెల్ల పరిశీలించిన యెడల నట్టివి మఱికొన్ని పద్యములుగూడ భాస్కరునివిగనో, ఎట్రాప్రెగ్గడవిగనో వేర్పడఁగల పనుకొందును. యుద్ధకాండ విషయ మిట్టుండె. అరణ్యకాండమున ముద్రణములంు ప్రధనపాఠముగ గ్రహింపఁ బడిన గ్రంథ భాగములు తాళపత్రప్రతులలో సాధారణముగా దొరకుచున్నవియు, పాఠాంతరముగా నధఃకరింపఁబడినవియు నగు గ్రంథభాగములకంటెఁ బ్రశస్తరచనము కలవి. ఒకవేళ నవియెల్ల ఎఱప్రెగ్గడ రచనమేమో యని యొక పెద్ద సందేహము నాకుఁ గలిగెను. ఆ గ్రంథభాగములలో వాల్మీకిరామాయణానుసారులు కానివి కొన్ని రచనములు కలవు.

చ.“తపనుఁడు వేఁపఁజొచ్చె ననుఁ దమ్ముఁడ! వృక్షముక్రిందఁ బెట్టు:నా
దపనుఁడు రేయి లేఁడు వసుధావర! చంద్రుఁడుగానిః చంద్రునిన్
నృపసుత! యె ట్లెఱింగితివి నీవు; మృగాంకము చూడనునీ హా
చపలమృగాక్షి! చంద్రముఖ ! జానకి! యెక్కడ నున్న దానవే"?

"సౌమిత్రే, నను సేవ్యతాం తరుతలం చండాంశు రుజ్జృంభతే
చండాంశో ర్నిశి కా కథా రఘుపతే, చంద్రోఽయ మున్మీలతీ.
వతైత ద్విదితం కథన్ను భవతా ధత్తే కురంగం యతః
క్వాసి ప్రేయసి, హా కురంగనయనే, చంద్రాననే, జానికి "

(ప్రసన్న రాఘవము)

ఇత్యాదులు.

ఇట్టి యీప్రధాన పాఠరచనముకూడ ప్రాచీనకవికృతమే కావలెను. కాని, యిది భాస్కరరామాయణ మను పేర లభ్యమగుచున్న గ్రంథములోనిది కాదు-- భాస్కరరామాయణతాళపత్రప్రతులలోఁ గానరాదు కాన. ఇట్టి సందేహములతో నేను చీకాకుపడుచుండఁగా డాక్టరు నేలటూరిగాకట రమణయ్య గారు తమ కానెగొందిలో నొక భాస్కరరామాయణపుఁ దాళపత్ర ప్రతి దొరకె ననియు, అం దారణ్యకాండమున ఎఱాప్రెగ్గడ కృతములుగా కొన్ని పద్యములు గానవచ్చె సనియు తెలిపి ఈ క్రిందిపద్యములను నాకుఁ జూపిరి:

ఆ నెఱజోదు కేలుచొనఁకై నిగుడించుట యమ్ము మౌర్వి సం
ధాసము సేత నిండఁదెగఁ దార్కోనీ లక్ష్యము సేయు డేయుడున్,
గాన సజస్రమండలితకార్ముక మొక్కటి గంటిఁ గంటి న
ద్దాసదీర్ఘ దేహసముదాయనిరంతర పాదవేగముల్.

స్రగ్దర.
కరిణీయానంబు నవ్వున్ గతి నవలతికాకార మంగంబు చంద్రున్
బురుణించున్ ముద్దుమో మంబురుహదళములంబోలుఁ గన్ను ల్విపంచీ
స్వరసంకాశంబు పల్కున్ జలదళినిచయస్పర్థియైయుందు వేణీ
భర మాతన్వంగి కింద్రప్రముఖ నిఖిల దిక్పాల కాథీలశౌర్యా,

చ.అలినిభవేణి చంద్రసద్మశాసన యుత్పలపత్రనేత్ర కో
మలలతికాభిరామభుజ మంజులవృత్తలసత్కుచడ్పడూ
కలితసుమధ్య హృద్యకటి కామ్యతరోరువు రమ్యజంఘ యు
జ్వలచరణాబ్జ తద్వనిత జానకినా, విలసిల్లు రావణా. "

వా రిందుకై మదరాసులోని యితర తాళపత్రప్రతుల నెల్లం బరిశీలించిరట! ఆ విషయము నిట్లు చీటిలో వ్రాసి పంపిరి : "ఈ పద్యాలు నేను అనెగొందినుంచి తెచ్చిన ప్రతిలోనివి. అందు 'ఎర్రాప్రగడ పద్యాలు' అను శీర్షికతో గూడియున్నది. ఇది గాక అడయారు లైబ్రరి G.NO. XXXII T. 13 G. 'యెర్రప్రగడ వారి పద్యం (తాళ, ప. 86, పం.1) అనుమాటకు తరువాత పై మూడు పద్యాలు కలవు. ఇంకను మద్రాసు యూనివర్సిటీ కలెక్షన్ (ఎర్రాప్రెగ్గడ పేరులేకున్నను) 1/150 నంబరు ప్రతియందు మూడుపద్యములును గానవచ్చుచున్నవి. అట్లే 1/426 లో కూడా పద్యాలు పేరులేకుండా కొన్పించుచున్నవి. G.Or. Mss. Madras. 14-10-7 దీనిలో ఎర్రాప్రెగ్గడ పద్యాలు' అన్న మాటలేదు. కానీ ఆ పద్యాలలో "కరిణీయానంబు", "అలినిభ వేణి" అన్న పద్యాలు కాన్పించుచున్నవి."

ఈ మూఁడుపద్యములతో పాటు తక్కిన అరణ్యకాండరచనాభేదము లెల్లఁగూడ ఎర్రాప్రెగ్గడ రచనములు కావచ్చునేమో యనికూడ నే ననుమానించు చున్నాను. అయోధ్యాకాండమునఁగూడ రచనాభేదములు చాలఁగాఁ గలవు. అందుఁగూడఁగొన్ని యెర్రాప్రెగ్గడపద్యము లుండునేమో! ఇట్లు భాస్కరరామాయణగ్రంథభాగము లెన్నోచిక్కులతో నున్నవి. అవియెల్ల జాగ్రత్తగాఁ బరిశీలించి యిదమిత్థమని నిర్ణయింపవలసియున్నది. భాస్కర రామాయణమున ఎర్రాప్రెగ్గడ రచనములు కొన్ని చేరియుండుట తథ్యము.

4 ఆ నడుము నేను ప్రాచ్య లిఖిత పుస్తకశాలలోని యొక సంకీర్ణ పద్యముల తాళపత్రసంపుటమును పరిశీలించుచుండఁగా అందు రామాయణ యుద్ధకాండమున పద్యములు ముప్పది కానవచ్చినవి. చదువఁగా నవి ప్రసిద్ధములైన భాస్కరరామాణణాది గ్రంథములలోనివిగా తోఁచలేదు. భాస్కరరామాయణమును, భారతారణ్యపర్వాంతర్గత రామాయణమును, భాగవతాంతర్గత రామాయణమను, మొల్లరామాయణమును, రామాభ్యదయ మును ఘనగిరి రామకవి సకలవర్ణనాపూర్ణరామాయణమును పరిశీలించి చూచితిని. ఆ కానవచ్చిన ముప్పది పద్యములు నందెందును గానరాలేదు. ఆ పద్యములుగూడ ఎర్రాప్రెగ్గేడ రామాయణములోనివి కావచ్చునను కొనుచున్నాను. వానిలో-


"నిను సేవించినఁగల్లు మానవులకున్ వీటీవధూటీఘటీ
ఘనకోటీ శకటీకటీతటి పటీగంధీభవాటిపటీ
రసటీహారిపటీ సువర్ణమకుటీ ప్రచ్చోటికాపేటికల్
కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠేశ్వరా!"!


ఈ 28 వ పద్యము నీలకంఠేశ్వరస్తుతిరూప మయినది. ఇది వేఱొక గ్రంథములోనిది యయినను గానవచ్చును. కానీ, యీ సంకీర్ణపద్య సంపుటమున సుదాహృతరామాయణపద్యములతో నున్నది. కాన రామాయణములోనిదియే కావచ్చు నసుట సంగత మగును. ఎర్రాప్రెగ్గడ నెల్లూరి మండలమందలి గుడ్లూరి నీలకంఠేశ్వరస్వామిభక్తుఁడు. ప్రోలయ

వేమారెడ్డిగారి ప్రేరణమున నాతఁడు రామాయణము నా నీలకంఠేశ్వరస్వామి కంకితముగా రచించెనేమో! ఈ పద్యము గుడ్లూరి నీలకంఠస్వామి స్తుతి సందర్భములోనిది గోవచ్చును.!

ఆ పద్యములలో ఎర్రాప్రెగ్గడ రచనాగౌరవము కానవచ్చుచున్నదా యని సందేహము తోచును. పద్యము లన్నియు సలక్షణములై యున్నవి. గొప్ప రచనా ప్రౌఢిమ కానరాకున్న దనవచ్చును కాని యర్రా ప్రెగ్గడ తొలుతటి కూర్పుకాన యిందు రచనమునఁ గొంత వెన్పాటు గల దేమో!

5.

శ్రీనాథుఁడు 'పరిఢవింతుఁ బ్రబంధపరమేశ్వరునిదేవ సూక్తి వైచిత్రి నొక్కాక్కమాటు' అని తనయెర్రా ప్రెగ్గడరచనానుకరణాభిమాసముసు వెల్లడించుకొన్నాఁడు. ఈ క్రింది పద్యద్వయమున ఎర్రా ప్రెగ్గడ సూక్తి వైచిత్రియు, శ్రీనాథుని తదనుకరణమును గాననగును;


"ఉ.కందక గాజువాలక మొగంబు వికాసమునొందెఁ జేతు లీ
యందములైన కాళ్ళు నరుణాంబురుహంబులలీలఁ గాంతఁ జె
 న్నాందెడు, జీవహీను లీటు లుండరు ప్రాణముతోడనున్న వా
డిందుసహోదరుఁడు ధరణీశ్వర నీకు విషాద మేటికిన్?"

ఉ."కందక గాజువాఱుక వికాసము ఉందక మందహాసని
ష్యందము చెక్కుటద్దముల నాటక నెమ్మది నిద్ర వోవున
బందమునొందె ధాత్రి సిరియాలకుమారకువ్య చంద్రుఁ దా
నందము నొందె నప్పు డెలనాఁగమనంబును భర్తచిత్తమున్. "

(శ్రీనాథుని హరవిలాసము)

ఎర్రాప్రగడ 'సూక్తివైచిత్రి' శ్రీనాథుని సమకాలపుఁ బ్రసిద్ధకవీ జక్కనకూడ

“ఈత్రయిఁ దాఁ బ్రబంధపరమేశ్వరుఁడై విరచించె శబ్దవైచిత్రి
నరణ్యపర్వమున శేషము......... "

అని ప్రశంసించెను.

సంస్కృత వాల్మీకి రామాయణమునకును, ప్రాచీనాంధ్రరచనములగు రంగనాథభాస్కరరామాయణములకును జాల భేదములు గలవు. రంగనాథభాస్కరరామాయణలుగూడఁ గొన్ని కాండములందుఁ బోలికలు గలిగి, కొన్ని కాండములందు లేక యున్నవి. రంగనాథ రామాయణమున విశిష్టాద్వైత విషయములు గొన్ని యధికముగాఁ జేరినవి.కొన్నికథాభేదము లున్నవి; అధికకథ లున్నవి. అందుఁ గొన్నిటికి సంస్కృతమూలము గానరాదు. దేశికథా సంప్రదాయముల ననుసరించి వానిని కవిచేర్చియుండ వచ్చును. ఎర్రాపెగ్గడ రామాయణాంద్రీకరణము హరివంశాంద్రీ కరణమును బోలియుండు ననఁదగును. ఇప్పు డుపలబ్ధము లయిన పద్యములు సంస్కృతాను సారులుగా నున్నవి. ఆయా పర్యముల పట్టులను సంస్కృత వాల్మీకి రచనలతోసు, తెలుఁగు రంగనాథ రచనాభాగములతోసు బోల్చి చూచిన నీయెర్రా ప్రెగ్గడ పద్యములు సరిగా సంస్కృతానుసారులుగా నుండుట వ్యక్త మగును.


రంగనాథ భాస్కరరామాయణములు ఎర్రాప్రెగ్గడ రచనమున కంటెఁ బూర్వము వెలసిన వనందగినవి. ఎర్రాపెగ్గడ కించుక తర్వాతికాలమువాఁ డగును - భాస్కరరామాయణ యుద్ధ కాండశేషమును పూర్తిచేసిన అయ్యలార్యుఁడు. ఇంచుమించుగ నాతని కాలముననే తెలుఁ గున మఱొక రామాయణాంద్రీరణము వెలసినది.

రామాయణకృతి కృతియై. ఆ మెఱయుచు నాంధ్రకవిపితామహుఁడనఁగా
భూమిం చినభీమన యను-నామంబున వెలసె సత్యనారనఘనుఁడై,

(సింహాసనద్వాత్రింశిక,)

'పిన భీమన', యని 'ఆంధ్రకవిపితామహుఁ' డని పేరందిన. రామాయణకృతికర్తయైన యీ సత్యనారస అనపోతకుమారసింగభూపతి (వెలుగోటి వెలమరాజు) సమకాలమువాఁ డగును. ఈ రామాయణము

గూడ నిపుడు గానరాదు. ప్రాచీన లక్షణ గ్రంథకారులుగాని, యితర ప్రాచీనకవులు గాని యీ సత్యనారనను స్మరించినట్లు గానరాదు. ఎట్రాప్రెగ్గడ రామాయణము ఎర్రాప్రెగ్గడనాఁటనుండి కూచిమంచి తిమ్మకవినాఁటి దాఁక సుప్రచారము గలదిగాఁ దెలియవచ్చు చున్నది. నూటయెనుబది యేండ్ల క్రిందటిదాఁక సురక్షితమై యున్న యీ గ్రంథ మీనాఁడు గూడ నెక్కడనేని అపరిజ్ఞాతముగా నుండవచ్చును. గోదావరీమండలమున కందరాడ, చంద్రమపాలెముల (కూచిమంచి తిమ్మకవియూళ్లు) చుట్టుపట్టులఁ గాని , కృష్ణా గుంటూరు నెల్లూరు కడప కర్నూలు మండలములలోఁ గాని అది దొరకఁదగు ననుకొందును. నెల్లూరు కర్నూలు కడప మండలములలో ప్రాచీన గ్రంథపరిశీలన మింకను సరిగా జరుగవలసియున్నది. ఆయా చోట్ల నపరిచితముగా నున్న తాటియాకు కట్టలను పరిశీలించి ఎఱ్ఱ పెగ్గడరామాయణము నేపుణ్యాత్ముఁడేని యుద్ధరింపఁగల్గు నని విశ్వసించుచున్నాను. ఎట్రాప్రెగ్గడ నృసింహపురాణము తప్పులతో నొక్క ప్రతిమాత్రమే ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోఁ గలదు. దానికిని మంచి ప్రత్యంతరము కావలెను. ఆంధ్రవిశ్వవిద్యాలయోపాధ్యక్షు లగు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఎర్రాప్రెగ్గడ రామాయణమును సంపాదింపఁ గల్గితిమేని యది మన కొక భాగ్యవిశేష మనియు, దాని నార్జింపఁగలవారి కెంత సాహాయ్యమేనీ చేయ నుత్సహింతు మనియు ఆనడుమ రాజమహేంద్రవరమున జరిగిన రెడ్డి సామ్రాజ్యవర్ధంత్యుత్సవమునం జెప్పిరి. శ్రీరామలింగారెడ్డిగారి పవిత్రాశయము సఫలమగుట కపేక్షించుచున్నాను.