జ్యోతిష్య శాస్త్రము/రాశి - గ్రహము

43. రాశి - గ్రహము

మార్చు

ఇంతకుముందే కర్మచక్రములోని భాగములను రాశులంటామని చెప్పుకొన్నాము. అలాగే కాలచక్రములోని భాగములను లగ్నములంటాము. కాలచక్రములోని లగ్నములలో, గ్రహములు తిరుగుచుండునని చెప్పాము. ఇంతకుముందు ఒక వ్యక్తి ఏమి వ్యాపారము చేయునని ప్రశ్నవచ్చినప్పుడు, జ్యోతిష్యము ప్రకారము అతని భవిష్యత్తులోని జీవన విధానమును గురించి చెప్పుచూ అతడు వ్యాపారము చేయడు, ఉద్యోగమును చేస్తాడని చెప్పాము. అంతేకాక కోర్టులో జడ్జిగాగానీ, జస్టీస్‌గాగానీ ఉద్యోగము చేయవచ్చునని చెప్పడము జరిగినది. అలా చెప్పుటకు కారణము ఏమైనది అను విషయమును వివరముగా చెప్పాము. అంతేగాక ఏ జాతకుని ప్రశ్నకైనా జవాబు చెప్పుటకు ఏ జ్యోతిష్యుడైనా ముఖ్యముగా ప్రశ్నకు సంబంధించిన స్థానమునూ, అలాగే ప్రశ్నకు సంబంధించిన గ్రహమునూ చూడవలెనని చెప్పాము. లగ్న గ్రహమునుబట్టియు, కర్మస్థానమునుబట్టియు జ్యోతిష్యము ప్రకారము భవిష్యత్తును చెప్పవచ్చును. వృత్తి లేక ఉద్యోగము, వ్యాపారమును గురించి చూచుటకు ముందు అడిగిన ప్రశ్నలో ఏ గ్రహమును చూచామో, ఏ స్థానమును చూచామో వ్రాశాము. అందువలన జ్యోతిష్యమునకు ప్రశ్నకు సంబంధించిన స్థానము, గ్రహము ముఖ్యమన్నాము.

ఇంతకుముందు ఏ గ్రహము ఆధీనములో ఏ వస్తువులు, ఏ విషయములు ఉన్నాయో వ్రాసుకొన్నాము. పన్నెండు గ్రహముల ఆధీనము లోని అన్ని విషయములను తెలుసుకొన్నాము. అయితే ఏ రాశిలో ఏ కర్మ ఉన్నదని గతములో చెప్పుచూ పన్నెండు రాశులను గుర్తించి, వాటిలో అంగీ అర్ధాంగి అని రెండు భాగములను చూపి, అందులో కొన్ని విషయములను మాత్రము పొందుపరచి చూపాము. అయితే ఎన్నో విషయములను అక్కడ చూపలేదు. అందువలన పై ప్రశ్నకు జవాబును చెప్పుచూ పదవ స్థానమును చూడవలెనని చెప్పాము. పదవ స్థానములో జీవన విధానము ఉన్నదని మొదట చెప్పలేదు. అప్పుడు చెప్పని విషయములను పూర్తిగా ఇప్పుడు చెప్పుచున్నాము జాగ్రత్తగా చూడండి.

ప్రథమ స్థానము (తనువు)

మార్చు

శరీరము, ఆత్మ, రూపము, స్వభావము, అంగ సౌష్టవమును గురించిన మొదలగు విషయములు ప్రథమ రాశిలో ఉండును. కర్మచక్రము లోని మొదటి స్థానములో శరీరమునకు సంబంధించిన పుణ్యము ఉండును. ఇది పుణ్య స్థానమే అయినా శత్రు గ్రహము (పాపమును పాలించు గ్రహము) ఆ స్థానములోనికి తన కిరణములను ప్రసరింపజేసితే అక్కడున్న పుణ్యమును ఆ కిరణములు గ్రహించక తమకు పట్టనట్లుండుట వలన ఆ జాతకుడు పుణ్యము ప్రకారము మంచి శరీరము పొందలేక పోవును. అక్కడకు కిరణముల ద్వారా చూచునది పాపగ్రహమైనప్పుడు తన ప్రభావము చేత బలహీనమైన దేహమూ, అంగలోపమున్న దేహమునూ, అనారోగ్యములకు అనువుగాయున్న దేహమునూ, అంగసౌష్టవము లేని దేహమునూ లభించు నట్లు చేయును. శుభగ్రహముండిన మంచి బలమైన శరీరము, మంచి అందమైన శరీరము, మంచి కొలతలుగల్గిన అంగసౌష్టవమున్న శరీరమును ఆ జాతకుడు కల్గియుండును. మొదటి స్థానమైన శరీర స్థానమున ఏ గ్రహమూ లేకున్నా, ఏ గ్రహమూ తన హస్తములతో తాకకున్నా అటువంటి వానికి మధ్యతరగతి ఆరోగ్యము, అందము, అంగసౌష్టవముగల శరీరముండును. ఈ విధముగా ఒక వ్యక్తికి (జాతకునికి) శరీరము ఎట్లుండునని జ్యోతిష్యము ద్వారా అతని కర్మచక్రములోని ప్రథమ స్థానమును చూచి చెప్పవచ్చును.

ద్వితీయ స్థానము (ధనము)

మార్చు

రెండవ స్థానము ధనస్థానమని పేరుగాంచియున్నా ఆ స్థానములో ఒక ధన విషయమే కాకుండా, మిగతా విషయముల కర్మలు కూడా ఉండును. మిగత ఉన్నవాటిలో వాక్కు ముఖ్యమైనది. అంతేకాక కుటుంబము, నేత్రము, కర్ణము (చెవి) ముఖ వర్చస్సు, మరణము మొదలగునవి ఉండును. అవియేకాక వాక్‌చతురత, సత్యవచనములు పలుకుట, మాటకు అందరు సమ్మతించుట, మాట్లాడబడిన మాటలు అందరినీ ఆకర్షించునట్లు ఉండును. రెండవ స్థానమున శుభగ్రహమున్నా (మిత్ర గ్రహమున్నా) లేక వేరే స్థానములోవుండి తన హస్తము చేత అక్కడినుండి తాకినా, ముఖవర్చస్సులో ప్రత్యేకత కల్గియుండును. కన్నులు సోయగముగా సొంపుగా ఆకర్షణగా ఉండును. ఆయుర్‌ బలముండును. మంచి కుటుంబముతో ఉండడమేకాక ఆ కుటుంబము దైవభక్తికలదై ఉండును. ఒకవేళ రెండవ స్థానములో శత్రు గ్రహము (పాప గ్రహము) ఉండినా లేక తాకినా అక్కడున్న పుణ్యమును అందివ్వక పాపమును అందించును. ద్వితీయ స్థానమున పాపపుణ్యములు రెండూ ఉండును. కావున పాపగ్రహము ముఖములో అందము లేకుండా, మాటలో ఆకర్షణ లేకుండా చేయును. కుటుంబములో అన్యోన్యత లేకుండా చేయును. ధనమును లేకుండా చేసి ఇబ్బంది పెట్టును. ఈ విధముగా మంచి, చెడు గ్రహములు రెండవ స్థానములో ఉన్నప్పుడు చేయును. ఒకవేళ ఏ గ్రహమూ లేని పక్షములో అతని రెండవ స్థానములోని విషయములు అతనికి మధ్యరకముగా అందుచుండును. మంచి చెడు కాకుండా తటస్థముగా ఉండును. కాలక్రమములో అక్కడికి వచ్చిపోవు గ్రహములు తమ ఇష్టమును బట్టి అక్కడి ఫలితములను ఇచ్చుచుండును.

తృతీయము - సోదర స్థానము

మార్చు

మూడవ స్థానము పాపస్థానము. ఇది పాపకోణములో మూడవది గా ఉండుట వలన ఈ స్థానములో పాపము మాత్రముండును. తృతీయ స్థానములో పుణ్యముండక పోయినా అక్కడున్న గ్రహములను బట్టిగానీ, అక్కడ తాకుచున్న గ్రహమునుబట్టిగానీ ఫలితముండును. పాప గ్రహము మూడవ స్థానమును తాకుట వలన లేక ఉండుట వలన ఆ స్థానమునకు సంబంధించిన విషయములలో పూర్తి వ్యతిరేకతయుండును. తనకంటే చిన్నవారైన చెల్లెండ్రుకల్గియుండి వారివలన అనేక బాధలు వచ్చునట్లు చేయును. వారి పెళ్ళిళ్ళు అయ్యేవరకు తనకు పెళ్ళి కాకుండా పోవుట వలన పెళ్ళి పూర్తి ఆలస్యమగును. దాయాదులతో ఇబ్బందులు ఉండును. స్వంత అన్నదమ్ములు కూడా వ్యతిరేఖముగా మాట్లాడుచుందురు. మరియు పోట్లాడుచుందురు. శాంతి లేకుండపోయి కోపము వచ్చుచుండును. ఒకవేళ శుభ గ్రహమున్నట్లయితే అన్నదమ్ముల వలన సుఖము లేకున్నా వ్యతిరేఖము లేకుండా సాధారణముగా ఉందురు. మంచి గ్రహమున్న ఆ స్థానములో పుణ్యము ఏమాత్రము లేనందున పైన చెప్పిన విషయములలో సుఖము ఉండదు. అట్లని కష్టముండదు. ఈ స్థానములో పాపము మాత్రముండుట వలన ధనము లేకుండా చేయును. జీవన విధానమును చెరచి నీచ జీవనము చేయునట్లు చేయును. తండ్రి ఆస్తి తనకు దక్కకుండా పోవును. ఉత్సాహము లేకుండ పోయి అశాంతితో జీవించునట్లు, సేవకా వృత్తిలో కాలము గడుపునట్లు చేయును.

చతుర్థము - మాతృస్థానము

మార్చు

నాల్గవ స్థానము అంగీ భాగములో కేంద్రముగాయున్నా ఇది పాప పుణ్యముల రెండిటికీ నిలయము. ఈ స్థానము తల్లికి, వాహనమునకు, భూమికి, గృహమునకు, కోనేరు, బావి, చెరువులకు, వ్యయసాయమునకు, పశువృద్ధికి, పంటలకు, బంధువులకు నిలయముగా ఉన్నది. సకల వస్తువులు ఉన్నచోటు, సమస్త పంటలు పండుచోటు ఈ స్థానములోనే కలదు. ఈ స్థానమున ఒక శుభగ్రహముండినా లేక ఈ స్థానమును తాకినా వస్తు బలముండును. ఈ స్థానములోని పుణ్యమును శుభగ్రహము (పుణ్యగ్రహము) స్వీకరించి జాతకునికి ఇచ్చుట చేత గృహములు, గృహము లోని వస్తువులు, ధన, కనక, వస్తు వాహనములు, భూములు, జలాశయము లు, బావులు, వనములు కల్గును. అంతేకాక బంధు మిత్రుల పరివారము, దాస జనములు, పశువృద్ధి, పాలవృద్ధి, ధాన్యవృద్ధి చాలాకలుగును. నమ్మకస్తులైన బంధువుల బలము కల్గును. మాతృప్రీతి ఎక్కువ ఉండును. శుభకార్యములకు ప్రయాణము చేయించును. సౌఖ్యములను కలుగజేసి కీర్తి గౌరవములను ఎక్కువజేయును. ప్రతి కార్యము జయముగా సాగును. తల్లివైపు వారిని పెంచును. క్రిమికీటకాది బాధలను లేకుండ చేయును. నిక్షేపములు దొరకవచ్చును. గృహప్రవేశములు జరుగును. వసతి గృహములు కట్టించును. ప్రవాహ సమీప భూములు, సారవంతమైన భూములు కల్గునట్లు చేయును. విద్యావంతుల, గాయకుల, గౌరవనీయుల, ఉద్యోగుల మిత్రత్వమును కల్గించును. గుర్రములు, ఏనుగులు, కుక్కలు మొదలగునవి వృద్ధి చేయును. శుభకార్యములను, దైవకార్యములనూ, ఇంటిలోనే చేయించును. శయన గృహమూ, శయన వస్తువులూ ఎక్కువగా యుండును. వైభవ గృహములనూ, దేవతా మందిరముల నిర్మాణములనూ చేయించును. ధర్మసత్ర నిర్మాణము చేయించును. ధర్మసత్రములను, ధర్మ బావులను కట్టించి కీర్తిని సంపాదించడమేకాక వైభవోపేతముగా జీవింప జేయును. అయితే ఇక్కడ చతుర్థమున ఒక పాపగ్రహముండినగానీ, తాకినా గానీ, పైన చెప్పిన ఫలితములకన్నిటికీ వ్యతిరేఖమున ఫలితములుండును.

పంచమము - విద్యాస్థానము

మార్చు

ఈ స్థానములో కేవలము పుణ్యము మాత్రముండును. కోణములలో పుణ్యమునకు సంబంధించిన కోణము. ఈ స్థానము విద్యాస్థానమే అయినప్పటికీ ముఖ్యముగా జ్ఞానమునకు నిలయమైన స్థానము. జ్ఞానమనగా ప్రపంచ జ్ఞానమని తెలియవలెను. అందువలన ఈ స్థానము యుక్తాయుక్త వివేకమునకు, సమయస్ఫూర్తికి, గ్రాహితాశక్తికి, జ్ఞాపకశక్తికి నిలయమని చెప్పవచ్చును. విద్యాస్థానమగుట వలన జాతకుడు ఎంతవరకు చదువ గలడు అనియూ, మొదటికే చదువు అబ్బునా అబ్బదా అనియూ, చదువులో మొద్దుగా ఉండునా, చురుకుగా ఉండునా అనియు ఈ స్థానమునుబట్టియే తెలియవచ్చును. ఐదవ స్థానము పూర్తి పుణ్య స్థానమగుట వలన ఇక్కడ మిత్రవర్గములోని ఏ గ్రహము చూచినా లేక తన హస్తములతో తాకినా అన్నీ మంచి ఫలితములే జాతకునికి లభించును. ఐదవ స్థానమున సంతానమునకు సంబంధించిన కర్మయుండుట వలన పుణ్య గ్రహము వలన మంచి సంతానము కలుగును. ప్రపంచ జ్ఞానమునకు నిలయమైన స్థానమగుట చేత అనుకూలమైన గ్రహము బలము చేత మంత్రి పదవి లభించును. అంతేకాక మంచి నడవడిక కల్గినవారై నిశ్చయ బుద్ధి కలవాడై బంధు, మిత్రులకు సలహాదారుడుగా ఉండును. పుణ్యగ్రహము వలన విద్యా, వినయము, విధేయత, వివేకము కల్గును. ముఖ్యమైన విషయములను తెలుసుకొనుట, మంచి విషయములను మాట్లాడుట దూరము ఆలోచనలు చేయుట ఉండును. ఇంకా ఘనత, గాంభీర్యము, గ్రామాధికారము కల్గును. గ్రంథ రచనలో ప్రావీణ్యత, మంత్రోపాసనలో ప్రసన్నత కల్గును. దానము చేయుట, న్యాయముగా నడుచుట కల్గి యుండును. పాపపుణ్యములలో విమర్శించుట, పాండిత్యములో ప్రతిభ, జ్ఞానశక్తి, జ్ఞాపకశక్తి, గ్రాహిత శక్తి, చేతిపని నైపుణ్యము, యంత్రములను సరిచేయు యుక్తియుండును. మంత్ర, తంత్ర, యంత్ర బలము కలుగును. గురుత్వము, గురు హోదా కల్గి యుండును. కార్యజయము, నిదానము, అధికారము, అన్నదానము, వంశాభివృద్ధి, నీతి, నియమము, శాంతిని కల్గించును. కీర్తి గౌరవములు వ్యాపింపజేయును. ఎవరూ చూడని వాటిని, ఎవరూ వినని వాటిని కనుగొను శక్తినిచ్చును. అధర్మములను ఖండిరచుట, ప్రజలకు హితునిగా, గురువుగా చూపించును. ఇతరులు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబునిచ్చు స్థోమతను కలుగజేయును. ఒకవేళ ఐదవ స్థానమున పాపగ్రహమున్నా పుణ్యమును అందించదు, పాపము లేదు కనుక చెడునూ చేయలేదు. పుణ్య గ్రహము లేనిదానివలన గ్రహముల సంచారములో ఏ గ్రహము ఆ స్థానములోని వస్తే దానికి అనుకూలమైన వాటిని కలుగ జేయును.

ఆరవది - శత్రుస్థానము

మార్చు

ఆరవ స్థానము పాపపుణ్య మిశ్రమ స్థానము. ఇక్కడున్న మిత్ర గ్రహమును (పుణ్యగ్రహమును) బట్టి మంచియూ, శత్రు గ్రహమును (పాప గ్రహమును) బట్టి చెడుయూ జరుగుచుండును. ఇక్కడ శుభగ్రహమున్నా లేక తాకినా పుణ్యఫలము లభ్యమగుట వలన శత్రు, రుణ, రోగ, సమస్యలు ఉండవు. వడ్డీ వ్యాపారముతో, వైద్యవృత్తితో ధనార్జన కల్గించును. శత్రువులు ఉండరు, ఉన్నా వారే నశించిపోవుదురు, ఋణబాధలుండవు. ఋణము లున్నా సులభముగా తీరిపోవును. రోగములు రావు, ఒకవేళ వచ్చినా సులభముగా పోవును. కలహభయము, మనోచింత, ఇతరులు ద్వేషించడము, అపవాదులు, అపనిందలు, అనుమానములు, చెడు వ్యసనముల బాధలు ఉండవు. అంతేకాక డబ్బు వృథాగా ఖర్చుకాదు. అప్పులు ఇచ్చుటలోను, తెచ్చుటలోను, ఇప్పించుటలోను ఎటువంటి చిక్కులూ ఉండవు. ఆరవ స్థానమును చేరు పుణ్యగ్రహములనుబట్టి ఫలితములుండును. ఒకవేళ పాప గ్రహముండినా లేక అక్కడ తాకినా శత్రు, ఋణ, రోగ సమస్యలు జీవితమంతా ఉండును. ఏ గ్రహము లేకుండిన అటు ఇటుగాక మధ్య రకముగా జరుగుచుండును.

సప్తమము - కళత్రస్థానము

మార్చు

ఇది పూర్తి పాపస్థానము. ఇక్కడ పాపగ్రహముంటే అందులోని పాపమును అందించి మనిషిని చాలా ఇబ్బంది పెట్టును. జీవితములో భార్య సౌఖ్యము లేకుండ చేయును. యౌవ్వన కాలమంతా వ్యర్థమగును. వివాహము కావడమే కష్టమగును. ఒకవేళ వివాహమైనా అది కొంత కాలమునకే చెడిపోయి భార్య విడిపోవును. ఉన్నంత కాలము భార్య భర్తలకు ఏమాత్రము పొసగదు. జీవితములో ముఖ్యమైనది భార్య అయితే ఆ భార్య వలన సుఖము లేకుండ ఎప్పుడూ కష్టమే ఉండుట వలన, మరికొన్ని కారణముల వలన పూర్తి విసుగుచెంది మనోశాంతి లేకుండ పోవును. దానికి తోడు ఆ స్థానములో ఎనిమిదవ స్థానాదిపతియుండినా, ఎనిమిదవ స్థానములో పాపగ్రహముండినా అటువంటి వాడు భార్యవలన మనోకలత చెంది చివరకు ఆత్మహత్య చేసుకొనును.

కళత్రము అనగా పూర్తి భార్య సంబంధమైన దానివలన సప్తమ స్థానములో శుభగ్రహముండినా లేక శుభగ్రహము తన చేతులతో తాకినా కళత్రము నుండి లభించు అన్ని రకముల కష్టములు లేకుండ పోవును. ఆ స్థానములో పుణ్యము లేకున్నా శుభగ్రహము ఉండుట వలన శుభ గ్రహము ఎదురుగా ఒకటవ స్థానముననున్న పుణ్యములను గ్రహించి, ఆ పుణ్యము ద్వారా శరీర సుఖమును అందివ్వవలసిన కర్తవ్యము తనకున్నది. కావున భార్యనుండి శరీర సుఖము అందించును. అప్పుడు ఒకటవ స్థానములోని శరీర సౌష్టవము, శరీరము అందము ద్వారా భార్యను ఆకర్షితురాలిగా చేసి సుఖమునందించును. అట్లే మిగతా విషయములైన భార్య ద్వారా ధనము కలుగునట్లు చేయును. వివాహము ఉన్నట్లుండి జరుగునట్లు చేయును. స్త్రీసాంగత్యము, సుగంధములు, మధుర పానీ యములు, మధుర ఫలహారములు, పుష్పములు, తాంబూలము అనుకోకుండ లభ్యమగును. ఇతర స్త్రీలను ఆకర్షించుట వారివలన సుఖము పొందునది ఒక స్థానమున ఉండుట వలన అతనికి భార్యయే ఇతర స్త్రీ క్రింద జమకట్టి ఆమెవలన సుఖము స్నేహము లభ్యమగునట్లు శుభగ్రహము చేయును. సకాల నిద్ర సకాల మైధునము లభించును. పడకగది కూడా సుఖములకు అనుకూలముగా లభించును. ఇదంతయు శుభగ్రహము వలన ప్రథమ స్థానమునుబట్టి ఉండును. మొదటి స్థానములో మరియొక శుభగ్రహముండి అక్కడినుండి ఏడవ స్థానమును తాకుట వలన, ఏడవ స్థానములో మరియొక శుభగ్రహముండిన, అటువంటి జాతకునికి గ్రహముల మూలమున ఒకటవ స్థానము పుణ్యమును ఎదురుగాయున్న ఏడవ స్థానమున అమలు జరిగినట్లు భ్రమింపచేసి సుఖములనిత్తురని తెలియవలెను.

అష్టమము - ఆయుస్థానము

మార్చు

కర్మచక్రములోని ఎనిమిదవ స్థానములో పాపము, పుణ్యము రెండూ ఉన్నాయి. ఈ స్థానములో ఎన్నో విషయములున్నా, ఆయుష్షు విషయమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు. అందువలన ఈ స్థానమును ఆయుస్థానము అంటారు. ఈ స్థానములో ఆయుర్దాయమున్నప్పుడు మరణమును కూడా చెప్పవచ్చును. అంతేకాక జాతకుని జీవనము, దుఃఖము, నరకము, పాప కృత్యములు చేయుట మున్నగునవి కలవు. ఇవన్నియు పాప మరియు పుణ్యములబట్టియుండును. ఈ స్థానమున మంచి గ్రహము (శుభ గ్రహము) ఉన్నా లేక తాకినా జాతకుడు ఎక్కువ కాలము జీవించునని చెప్పవచ్చును. పుణ్యగ్రహముండుట వలన ఆ స్థానములోని పుణ్యమును మాత్రము స్వీకరించి మనిషికి అందించుట వలన జాతకుడు దేహపుష్ఠి, వీర్యపుష్ఠి కలిగి కామసౌఖ్యమును అనుభవించును. ఎక్కువ కన్యలతో సంబంధము కల్గునట్లు చేయును. దీర్ఘనాడికల్గియుండుట వలన రతికేళిలో ఎక్కువ కాలము గడుపును. అవమానములు, కలహములు లేకుండ చేయును. అంగలోపముండదు, స్త్రీల వలన దుఃఖముండదు. శత్రు భయము ఉండదు. కారాగార ప్రాప్తిగానీ, చట్టమును మీరి నడువడముగానీ కలుగదు. జంతు వధలు చేయడు, పాపభీతియుండును. అకాల మృత్యు భయముండదు. చేయు పనిలో ప్రతిభ కల్గియుండును. కళత్ర సుఖముండును, అన్యస్త్రీల సాంగత్యము కలుగును. ఒకవేళ జనన సమయములో ఈ స్థానమున పాపగ్రహముండినట్లయితే అది అక్కడున్న పాపమును స్వీకరించి జాతకునికి అందించును. పుణ్యమును తీసుకోదు. పాపగ్రహము వలన అతనికి పాపకర్మ అనుభవములే కల్గును. అకాల మృత్యువు ఏర్పడును. ఒకవేళ అకాల మృత్యువు లేకున్నా ఆయుష్షు తొందరగా అయిపోవును. అనగా అల్పాయుష్కుడగును. పరాభవములు కల్గును. కారాగార ప్రాప్తి కలుగును. ఇతరులచే ప్రాణహాని భయముండును. స్త్రీ సుఖముండదు. స్పర్శనాడి కలవాడై మగతనమున్నా నిమిషము లేక అరనిమిషములో కామవాంఛ తీరిపోవును. దానివలన నిరాశ ఏర్పడును. స్త్రీలతో అవమానము కల్గును. ఎనిమిదవ స్థానమున శత్రు గ్రహముగ రాహువున్న విషాహారము వలనగానీ, పాముకాటు వలనగానీ చనిపోవునని చెప్పవచ్చును. చంద్రుడు పాపియై అష్టమమున ఉన్న నీటిగండముతో చనిపోవునని చెప్పవచ్చును. అలాగే శుక్రుడు శత్రుగ్రహమై ఎనిమిదవ స్థానమున ఉండినట్లయితే జీవితములో సమయము చూచి అగ్ని వలన కాలి చనిపోవునని చెప్పవచ్చును. ఒకవేళ బుధగ్రహము ఎనిమిదవ స్థానమున ఉన్నట్లయితే జాతకుని శరీరములో దయ్యములు చేరి డాక్టర్లకు అంతుదొరకని రోగమును కల్పించి దయ్యములే చంపివేయును. ఎనిమిదవ స్థానమున కుజగ్రహము అశుభగ్రహముగా యుండినట్లయితే అట్టి జాతకుడు ఆయుధములచేత చంపబడునని చెప్పవచ్చును. కుజగ్రహమునకు భూగ్రహము తోడైయుంటే బాంబుల వలనగానీ, తుపాకుల వలనగానీ జాతకునికి మరణము సంభవించును. మిగత స్వపక్ష గ్రహము ఏది తోడైయున్నా రోడ్డు ప్రమాదములో రక్తసిక్తమై చనిపోవునట్లు చేయును. ఒకవేళ జనన కాలములో ఈ స్థానమున ఏ గ్రహము లేకున్నా, తాకకున్నా అతనికి (జాతకునికి) మంచి ఫలితములుగానీ లేక చెడు ఫలితములుగానీ కలుగక జీవితము సాధారణముగా జరిగిపోవును. అటువంటివాడు దీర్ఘ నాడి, స్పర్శనాడి లేకుండా మధ్యనాడి కల్గియుండునని కూడ చెప్పవచ్చును.

నవమ స్థానము - పితృ స్థానము

మార్చు

కర్మచక్రములో నాలుగు (4) ఐదు (5) స్థానములు ఎంతో ముఖ్యమైనవి. అలాగే తొమ్మిది (9) పది (10) స్థానములు కూడా ముఖ్యమైనవిగాయున్నవి. జాతకచక్రములో నాలుగు, ఐదు స్థానములు ఎంత ప్రశస్తత చెందియున్నాయో అంత ప్రాముఖ్యత కల్గియున్నవి తొమ్మిది (9) పది (10) స్థానములని అందరూ తెలియవలెను. మనిషి జీవితములో ఎంతో ముఖ్యమైన ఆస్తిబలము (సంపద బలము), బుద్ధిబలము ఎంతో ముఖ్యమైనవి. ఆస్తిబలము నాల్గవ స్థానములోనూ, బుద్ధిబలము ఐదవ స్థానములోను ఉన్నవి. అలాగే మనిషి జీవితములో ధనబలము, గౌరవము ఎంతో అవసరమైనవి. ధనబలము తొమ్మిదవ స్థానములోనూ, గౌరవము పదవ స్థానములోనూ ఉండుట వలన కర్మచక్రములో ఈ నాలుగు స్థానములు ముఖ్యమైనవేనని తెలియుచున్నది. నాలుగు, ఐదు స్థానములలో నాలుగవ స్థానములో పాపపుణ్యములు రెండూ ఉండగా అది అంగీ భాగమునకు కేంద్రముగాయున్నది. ఐదవ స్థానము పూర్తి పుణ్యస్థానమైయున్నదని ఈ గ్రంథము చదివిన వారిందరికీ తెలుసు. అలాగే తొమ్మిది పది స్థానములలో పదవ స్థానము అర్ధాంగి భాగమునకు కేంద్రముగాయుండి పాపపుణ్యములకు నిలయమైయుండగా, తొమ్మిదవ స్థానము మాత్రము పూర్తి పుణ్యస్థానమై యుండి పుణ్య స్థానములకు కోణముగాయున్నది. ఇప్పుడు 1,5,9 అను మూడు కోణములలో తొమ్మిదవ స్థానముగాయున్న దానిని గురించి తెలుసు కొందాము. ఇది పూర్తి పుణ్యస్థానమే అయినా ఈ స్థానములో జనన కాల సమయమున మిత్రవర్గమునకు చెంది పుణ్యమును పాలించు శుభగ్రహము ఉండవచ్చు లేక శత్రువర్గమునకు సంబంధించిన పాపమును పాలించు అశుభగ్రహము ఉండవచ్చును.

జనన సమయములో పుణ్యమును పాలించు శుభగ్రహము తొమ్మిదవ స్థానములో ఉన్నా లేక ఆ స్థానమును శుభగ్రహము యొక్క చేతులు తాకినా మంచి ఫలితము కల్గును. తండ్రి సంపాదించిన ఆస్తి జాతకునకు తృప్తిగా లభించును. భక్తి, దాన, తపస్సులను చిత్తశుద్ధితో చేయును. దైవభక్తి మరియు గురుభక్తి ఈ జాతకునికి ఉండును. తొమ్మిదవ స్థానమును భాగ్యస్థానమని కూడ చెప్పవచ్చును. ఎందుకనగా డబ్బు రూపముగానున్న ధనము ఈ స్థానములోనుండే లభించుచున్నది. ఇక్కడున్న శుభగ్రహము ఈ స్థానములోని పుణ్యమును స్వీకరించి డబ్బురూపముగా ఇచ్చును. డబ్బు చలామణి బాగా ఉండడమేకాక డబ్బు నిలువయుండును. డబ్బును ఈ జాతకుడు సులభముగా సంపాదించి నిలువ చేసుకొనును. ఈ స్థానములోనున్న పుణ్యమువలన శుభకార్యములు ఎక్కువ జరుగును. శుభకార్యములను చేయుట, పాల్గొనుట జరుగును. మంచివారి సహవాసము, భక్తుల, జ్ఞానుల స్నేహము కల్గును. సకల ఐశ్వర్యములు కలుగును. వివాహములు వైభవముగా జరిపించును. వివాహములలో పాల్గొని గౌరవమును పుణ్యమును సంపాదించుకొనును. న్యాయసమ్మతమైన ఆదాయము లభించును. జ్ఞానమార్గమున జీవితము గడుపవలెనను ఆలోచన వచ్చును. ఒకవేళ ఇక్కడొక పాపగ్రహముండిన పైన చెప్పిన విషయము లన్నిటికి వ్యతిరేఖముగా చేయుటకు ప్రయత్నించును. ఉదాహరణకు శుక్రుడు శుభగ్రహమై తొమ్మిదవ స్థానములోయుంటే, శుక్రుడు ఐశ్వర్యమునకు (డబ్బుకు) అధిపతియగుట వలన జాతకునకు డబ్బు సమృద్ధిగా ఉండును. ఒకవేళ శుక్రుడు అశుభగ్రహమై తొమ్మిదవ స్థానములో యుంటే నూరు రూపాయలు కూడా లేని స్థితి ఏర్పడును. బీదవానిగా బ్రతుక వలసివచ్చును. మూడవస్థానము ఎదురుగాయున్నందున అక్కడి పాపముతో ఇక్కడ నిర్భాగ్యుణ్ణి చేయును. అలాగే గురువు ఈ స్థానమునకు శుభుడైయున్న గురువు బంగారుకధిపతి అయినందున బంగారమును ఎక్కువ కలుగజేయును. అదే గురువు అశుభుడైయుంటే తన (గురువు) ఆధీనములో నున్న బంగారును ఏమాత్రము లేకుండ చేయును. ఈ విధముగా ఒక స్థానములోని శుభాశుభములను స్థానమునుబట్టియు, గ్రహమునుబట్టియు తెలియవచ్చును.

దశమ స్థానము - జీవన స్థానము

మార్చు
అర్ధాంగి భాగములో కేంద్రమైన దశమ స్థానమున పాపపుణ్యములు రెండూ గలవు. ఈ స్థానమున పుణ్యమును అందించు శుభగ్రహము ఉన్నట్లయితే, జీవనోపాదులైన ఉన్నత వృత్తిగానీ, పెద్ద ఉదోగ్యముగానీ, మంచి వ్యాపారము గానీ కల్గునట్లు శుభగ్రహము చేయును. రాజకీయమే వృత్తిగాయున్న వానికి పాలనాశక్తినీ, దానికి కావలసిన యుక్తినీ జాతకునకు శుభగ్రహము ఇచ్చును. యుక్తితో పనిగానీ, వ్యాపారముగానీ, రాజకీయము గానీ చేయువానికి కీర్తి గౌరవప్రతిష్ఠలు కల్గునట్లు చేయును. చేయు వృత్తిలో గౌరవము లభించుట వలన ప్రజలు సన్మానింతురు. అలాగే ప్రభుత్వము వారు కూడా సన్మానింతురు. ఓర్పు, నిగ్రహశక్తి కల్గియుండును. సకల సంపదలు దిన దినాభివృద్ధి చెందును. మంచి భవనములు నిర్మించుకొనును. దేవతా మందిరములు, మండపములు కట్టించును. దైవకార్యములను చేయించుట, పాల్గొనుట జరుగును. స్వంత సంపాదన పెరిగి జీవనమునకు ఆటంకము లేకుండ జరుగును. ముద్రణావిషయములో చొరవకల్గి గృహములను నిర్మించినట్లు గ్రంథములను తయారు చేయగలడు, వ్రాయ గలడు. దీనితో ప్రజాధరణ పెరుగును. అష్టభోగములను అనుభవించుచూ, ఎదురులేని జీవితము గడుపును. ఈ స్థానములో సూర్యుడుగానీ, చంద్రుడు గానీ శుభులైయుండిన ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగియై (కలెక్టరై) ప్రజాపాలన చేయును. ఉద్యోగి కాకుండ, ఉద్యోగమును వదలి రాజకీయములో ఉండి నట్లయితే మంత్రిపదవి కల్గి ప్రజలను పాలన చేయును. దశమ స్థానములో కుజగ్రహము శుభగ్రహమైయుంటే అతడు ప్రభుత్వ డాక్టరుగా మంచి ఆపరేషన్లు చేయు డాక్టరుగా ప్రజలలో మంచి పేరు తెచ్చును. కుజ గ్రహముతో పాటు సూర్యుడో, చంద్రుడో పదవ స్థానమున ఉండుట వలన జాతకుడు మిలిటరీలో పెద్ద డాక్టరుగా ఉండును. ఇదే స్థానములో శుక్ర గ్రహముంటే జీవితము మొత్తము సుఖమయమైపోవును. అన్ని సుఖములతో అష్టఐశ్వర్యములతో జీవితము గడచిపోవును. ఈ విధముగా గ్రహమునుబట్టి జరుగుచుండును. ఒకవేళ దశమస్థానములో పాప గ్రహముండిన పైన చెప్పిన వాటికి భిన్నముగా, వ్యతిరేఖముగా జరుగును. కర్మచక్రములోని పదవ స్థానములోని పాపమునుబట్టి పాపగ్రహములు అక్కడ చేరునట్లు ప్రకృతిద్వారా దేవుడు చేయించాడు. పాపగ్రహములుండుట వలన జీవితమే వృథా అనిపించినట్లుండును. జీవనమునకై నిరంతరము బాధపడుచూ బ్రతుకవలసివచ్చును.

ఏకాదశ స్థానము - లాభ స్థానము

మార్చు

కర్మచక్రములో పదకొండవ స్థానము పాపకోణములో చివరిదగును. ఈ స్థానములో కేవలము పాపము మాత్రముండును. అక్కడ చేరిన శుభ గ్రహముల వలన ఎదురు స్థానములోని పుణ్యము ఉపయోగపడుట వలన కొంతవరకు మంచి జరుగును. పాపగ్రహముండిన ధనార్జనలో కష్టము, లాభములో నష్టము, జయములో అపజయము కల్గును. విద్య లేకుండ పోవును. తండ్రి ఆస్తిని పోగొట్టుకోవలసి వచ్చును. జీవితము దుఃఖమయ మగును. సప్త వ్యసనములలో కొన్నిటికి అలవాటుపడిపోవును. ఈ విధముగా అక్కడ చేరు పాపగ్రహములనుబట్టి దుష్ఫలితములుండును. ఒకవేళ పదకొండవ స్థానములో ఒక శుభగ్రహముండినా లేక తాకినా జాతకునికి గ్రహమునుబట్టి మంచి జరుగును. ఈ స్థానమును లాభస్థానమని పెద్దలు చెప్పారు కనుక ఇక్కడున్న గ్రహమునుబట్టి కట్నరూపములో ఒక్కమారు డబ్బువచ్చునట్లు ఆ గ్రహము చేయును. బుధగ్రహముంటే కట్నకానుకల రూపములో మంచి లాభమును చేకూర్చును. తొమ్మిదవ స్థానాధిపతియుండిన, వానికి లాటరీవలన లాభము వచ్చును. లగ్నాధిపతి యుండిన ఎల్లప్పుడు లంచము రూపములోనో లేక కమీషన్‌ రూపములోనో డబ్బు వచ్చునట్లు చేయును. పంచమాధిపతియుండిన మెడికల్‌ కాలేజ్‌ లాంటిది కల్గించి దానిద్వారా డొనేషన్లరూపములో డబ్బు విపరీతముగా వచ్చునట్లు చేయును. ఈ స్థానములో ఇద్దరు లేక ముగ్గురు శుభ గ్రహములు ఉండిన ఉన్నట్లుండి కోట్లలో డబ్బు వచ్చు లాటరీలు తగులును. వ్యాపారములో విపరీతముగా లాభములు వచ్చును. అన్న, అక్కగారి ఆస్తులు లభించును. ఒక రూపముగా కాకుండా అనేక రూపములలో అనేక లాభములు వచ్చునట్లు అమరిపోవును. ఇది పదకొండవ స్థానమగుట వలన పాపకార్యములు చేయుట చేత జాతకుడు ధనమార్జించును. లేఖన వృత్తి అయిన విలేఖరిగాయుంటూ ధనమును బాగా సంపాదించగలుగును. ఐదవ స్థానమునకు ఎదురుగా ఉన్నందున అందులోని విద్యనూ, ప్రతిభనూ, గ్రాహితశక్తిని, శిల్పకళ విద్యను నేర్వగలుగును. ఎన్నో ఆదాయములు గల స్థానము కావున దీనిని లాభస్థానమని అన్నారు. అంతేకాక వృత్తిలోకంటే ఎక్కువ లాభము వచ్చుట వలన ప్రవృత్తి స్థానమన్నారు. పైకి కనిపించుటకు ఇది ప్రవృత్తి స్థానముగాయున్నా ముందే ఇది పాపస్థానమైయుండి, దీనిలో చేయునదంతా ఇతరులది లాగుకొని లాభము పొందడము తప్ప ఏమీలేదు. దానివలన పాపము రావడము తప్ప పుణ్యమొచ్చు అవకాశము లేదు. అందువలన కొందరు ఇది ప్రవృత్తి స్థానమనినా మేము మాత్రము దీనిని నీచ వృత్తి స్థానమేగానీ ఇందులో ప్రవృత్తి లేదని చెప్పుచున్నాము.

ద్వాదశ స్థానము - వ్యయ స్థానము

మార్చు

మొదటి స్థానము జనన స్థానమగుట వలన, జననములో శరీరము లభించుట వలన దానిని తను (శరీర) స్థానమన్నారు. చివరిదైన పన్నెండవ స్థానము వచ్చిన శరీరము నాశనమైపోవునది కావున దానిని వ్యయ (నాశన) స్థానమన్నారు. జీవిత చివరి భాగము ఈ స్థానములోనే ఉండును. ఇది జీవితమునకు చివరి కాలము యొక్క విధి విధానమును తెల్పునది. కావున వయస్సు ముదిరిన తర్వాత వృద్ధాప్యములో జరుగు విషయములు ఇక్కడ తెలియును. ప్రారబ్ధకర్మ ప్రారంభమగునది మొదటి స్థానములోకాగా ప్రారబ్ధ కర్మ అయిపోవునది పన్నెండవ స్థానములో, కనుక ప్రారంభమగు ప్రథమ స్థానమును జనన స్థానమని అన్నారు. అయిపోవు స్థానమును మరణ స్థానము అన్నారు. పన్నెండవ స్థానములో కర్మ అయిపోవుచున్నది. కావున అతని (జాతకుని) ఆయుష్షు ఇంతయని చెప్పవచ్చును. అయితే ఇక్కడ ఒక చిక్కు సమస్య ఉండడము వలన ఈ విషయములో సత్యము చెప్పుటకు వీలు పడడములేదు. ఆ చిక్కు సమస్యను తర్వాత చెప్పగలను. ఇప్పుడు ద్వాదశ స్థానమును గురించి చెప్పుకొంటే ఇది పాపపుణ్యముల మిశ్రమ స్థానము. మిశ్రమము అంటే కలిసిపోయాయని కాదు, రెండూ ఒకే స్థానములో ఉన్నాయని అర్థము. అందువలన ఇక్కడ ఒక పుణ్య గ్రహమైన శుభగ్రహముంటే ఇక్కడ ఏదైనా దుర్వినియోగముకాదు. డబ్బుగానీ, ధాన్యము గానీ, నీరుగానీ ఖర్చు చేయు ఏదైనా దుర్వినియోగముకాదు. చెడు ఉపయోగములకు కాకుండా మంచిగా ఉపయోగపడును. కేతుగ్రహముంటే (శుభగ్రహముగా) ఆధ్యాత్మిక చింతనకలుగజేసి హిందువును భగవద్గీతను, ముస్లీమ్‌ను ఖుర్‌ఆన్‌ను, క్రైస్తవుడైతే బైబిల్‌ను చదువునట్లు చేయును. గురువు గ్రహమున్న జ్ఞాన విషయములని పేరుపెట్టిన దానిని చదువును. మిగతా నాలుగు గ్రహములలో ఏదొక్కటియున్నా సద్గ్రంథములను చదువునట్లు చేయును. సద్గ్రంథ పఠనముచే దైవభక్తి చేకూరి ముక్తికొరకు ప్రయత్నించును. ప్రయత్నించకపోయినా ముక్తి ఒకటున్నదని తెలిసిపోవును. తర్వాత శుభ గ్రహము ఏదున్నా పాపభీతిని కల్గించి, నరకలోకమును తప్పించి స్వర్గ లోక ప్రాప్తి కల్గించునని తెలియుచున్నది. అంతేకాక అంతవరకున్న మనిషిలోని పశుత్వమును మాన్పించి మానవత్వమును గల్పించును. అంత వరకు చేయుచున్న జంతువధను మాన్పించి అక్కడ ఖర్చయ్యే డబ్బును ఇతరులకు ఉపయోగపెట్టి, దానిద్వారా తర్వాత మంచి జన్మ పొందుటకు అవకాశము కల్గించును. మరణ సమయములో ఎక్కువ కష్టములు లేకుండా నిశ్చింతగా ఉండునట్లు చేయును. జాతకుడు మరణించినప్పుడు ప్రజలు ఎక్కువ మంది వచ్చి అతనిని గురించి చెప్పుకొనునట్లు చేయును. అతడు చనిపోయిన చోట అన్ని అనుకూలతలు ఉండి శవయాత్ర బాగా జరుగు నట్లు చేయును. ఒకవేళ ద్వాదశ స్థానమున జనన సమయములో పాప గ్రహమున్న (శత్రువర్గములోని గ్రహమున్న) జాతకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా చనిపోవు సమయమునకు బంధుమిత్రులు, భార్యా పిల్లలు లేనిచోట చావు లభించును. అతను ఫలానా వ్యక్తి అని కూడా బయటికి తెలియకపోవడము వలన అనాధశవము క్రింద జమకట్టి ఏ సంబంధమూ లేనివారు ఏమీ బాధపడకుండ అంతిమ సంస్కారములు చేయుదురు. అటువంటి చావులు ఎంతోమందికి కల్గినవి. అప్పుడు వారికి వారి జాతకము లోనే పన్నెండవ స్థానమున పాపగ్రహమున్నదని తెలియవచ్చును. ఎప్పుడో ఎనభై సంవత్సరములప్పుడు పుట్టిన సమయములో ఉన్న గ్రహములను బట్టి ఎనభై సంవత్సరముల వరకు జీవితము సాగడమేకాక మరణ సమయములో కూడా జాతకములోని (జనన సమయములోని) గ్రహముల ప్రాబల్యమునుబట్టియే జరుగును. కావున జీవితమును శాసించి నడుపునది జాఫతకము (జాతకము). జాఫతకము లేని జీవితమును గురించి అంచనా వేయుటకు సాధ్యపడదు. అందువలన జన్మనుండి చావువరకు దిక్సూచిలాగ యున్న జాతకమును అందరూ వ్రాసుకొనియుండడము మంచిది.

మరణ విషయములో చిక్కు సమస్య

మార్చు

ఇంతకుముందు ద్వాదశ స్థానమును గురించి తెలుసుకొన్నాము. ప్రథమస్థానములో కర్మ ప్రారంభమై ద్వాదశ స్థానములో కర్మ అయిపోవు చున్నది. కావున పన్నెండవ స్థానమును ఆధారము చేసుకొని ఆయుష్షును నిర్ణయించి చెప్పవచ్చుననీ, ఆయుష్షు అయిపోవడము మరణమగుట వలన, ఈ జాతకుడు ఫలాన సంవత్సరము చనిపోవుననీ చెప్పవచ్చును. అయితే జ్యోతిష్యశాస్త్రము ప్రకారము చెప్పినది సత్యమే అయినా మరణము ఏదైనదీ ప్రజలకు తెలియకున్న దానివలన మనిషి అకాల మరణమును పొందినా, తాత్కాలిక మరణమును పొందినా దానినే మనిషి మరణము అనుకోవడము వలన పెద్ద చిక్కు ఏర్పడుచున్నది. జ్యోతిష్యము ప్రకారము ఒక సంవత్సరము ముందు వెనుకగా చావు సమాచారమును చెప్పవచ్చును. అయితే మనిషికి మూడు రకముల మరణములుండుట వలన, వాటిలో చెప్పబడినది గుర్తింప బడకపోవడము వలన, చెప్పిన కాలముకంటే ముందు వచ్చు అకాల, తాత్కాలిక మరణములను కాలమరణముగా పోల్చుకోవడముతో, చెప్పిన సత్యము అసత్యముగా కనపడుచున్నది. ‘‘చెప్పిన కాలముకంటే ముందే అకాల మరణము వలనగానీ, తాత్కాలిక మరణము వలనగానీ చనిపోయినా చెప్పిన సత్యము అసత్యముగా కనిపించవచ్చునుగానీ, చెప్పిన సమయము కంటే ఐదు లేక ఆరు సంవత్సరములు ఆలస్యముగా చనిపోతే అప్పుడు చెప్పిన మాటా అసత్యమే అగును కదా!’’యని ఎవరైనా అడుగవచ్చును. ఇది హేతుబద్ధమైన ప్రశ్నయే అయినందున దీనికి జవాబు ఏమనగా!

ప్రారబ్ధకర్మ పుట్టిన సమయములో నిర్ణయింపబడినది. అదియూ సంచితకర్మనుండి తీసి ఇచ్చినదానిని ప్రారబ్ధకర్మ అంటున్నాము. ప్రారబ్ధ కర్మప్రకారము 70 సంవత్సరములకు మరణము నిర్ణయించబడినట్లు తెలిసి ఇతని ఆయుష్షు 70 సంవత్సరములని చెప్పామనుకోండి. జ్యోతిష్యము ప్రకారము ఆ మాట సత్యమే అయినా ఆ జాతకుడు 80 సంవత్సరముల వరకు బ్రతికి చనిపోయాడనుకొనుము. అప్పుడు జ్యోతిష్యుడు చెప్పినది పూర్తిగా అసత్యమగును. ఒకవేళ 70 సంవత్సరములు ఆయుష్షు నిర్ణయించ బడిన వ్యక్తి 50 సంవత్సరములకే చనిపోయాడనుకొనుము అప్పుడు కూడా జ్యోతిష్యము వలన చెప్పినమాట అసత్యముగా కనిపించును. ఈ రెండిటికీ సమాధానము చెప్పవలసిన బాధ్యత మాకు కలదు. ఈ ప్రశ్నలకు జ్యోతిష్యులు జవాబు చెప్పాలి, అయితే వారు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కారణము ఏమనగా! జ్యోతిష్యమును జ్యోతితో (జ్ఞానముతో) చెప్పడము లేదు. జ్ఞానము లేనప్పుడు జ్యోతిష్యములో జ్యోతి లేకుండ పోవుచున్నది. అందువలన పూర్తి కర్మ విధానము తెలియకుండా పోయి దానికి సరిjైున సమాధానము లేకుండా పోయినది. అయితే మేము చెప్పు జవాబు ఏమనగా!

మనిషికి జీవితమున్నట్లే అకాల మరణము, తాత్కాలిక మరణములు కర్మనుబట్టి కొందరికి వస్తున్నవి. కొందరికి రావడములేదు. ఈ రెండు మరణములున్నట్లు కూడా చాలామందికి తెలియదు. జ్ఞానులైన వారికి కూడా తాత్కాలిక మరణమున్నట్లు తెలియదు. ఈ రెండు మరణములు పూర్తి మరణము కాదు. ఈ రెండు మరణములు పొందినవారు జీవితమును సాగించుచునే ఉన్నారు. ఈ రెండు మరణములతో వారి జీవితము ముగిసి పోలేదు. అందువలన వారు బ్రతికేయున్నారు అని చెప్పవచ్చును. ఈ విషయము మీకు క్రొత్తగాయుంటే, మా రచనలలోని ‘‘మరణ రహస్యము’’ చదివితే పూర్తి సమాచారము తెలియగలదు. మనిషి ఈ రెండు మరణముల ద్వారా చనిపోయినట్లు కనిపించినా మనకు తెలియకుండా జీవించియుండి తర్వాత జ్యోతిష్యములో నిర్ణయించినట్లే 70 సంవత్సరముల ఆయుష్షులో చనిపోయినా, ఆ విషయము ఇటు జ్యోతిష్యునికిగానీ, ప్రజలకుగానీ తెలియ కుండా పోవుచున్నది. మరణము ఎప్పుడు జరిగినదీ తెలియనివారు, జ్యోతిష్యములో జాతకము ప్రకారము 70 సంవత్సరములు ఆయుష్షు అని చెప్పడము పూర్తి తప్పుగా లెక్కించుకొనుచున్నారు. ఇక్కడ ఎవరైనా పొరబడుటకు అవకాశమున్నది. కావున వారి పొరపాటేగానీ, జ్యోతిష్యము తప్పుగాదని చెప్పవచ్చును. అకాలమరణము పొందినవాడు తిరిగి కాల మరణము పూర్తి కర్మ అయిపోయినప్పుడు పొందును. దానిప్రకారము 50 సంవత్సరముల వయస్సులో చనిపోయినవాడు (అకాల మరణము పొందినవాడు) మిగతా 20 సంవత్సరములు సూక్ష్మముగా కనిపించక జీవించుచుండును. తర్వాత వాడు 20 సంవత్సరములు జీవితమును గడిపి చనిపోవును. ఈ విధానములో మనుషులు పొరపాటుపడడము తప్ప జ్యోతిష్యము తప్పుకాదని తెలియుచున్నది.

ఇకపోతే జ్యోతిష్యము ప్రకారము 70 సంవత్సరముల ఆయుష్షు కలదని చెప్పబడినవాడు 80 సంవత్సరములకు చనిపోతే, అప్పుడు ఆయుష్షున్నది 70 సంవత్సరములే కదా! అలాంటప్పుడు పది సంవత్సరములు ఎక్కువ ఎలా బ్రతుకగలిగాడని అడుగవచ్చును. ఎలా బ్రతికినా జ్యోతిష్యము ప్రకారము 70 సంవత్సరములు ఆయుష్షు అనుమాట అసత్యమైనది కదాయనీ అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! విషయమును వివరించుకొని చూడగల్గితే ఇక్కడ కూడా 70 సం॥ముల ఆయుష్షు తప్పుకాదని తెలియుచున్నది. తప్పని ఎదురుగా కనిపిస్తుంటే తప్పుకాదనడమేమిటని కొందరనుకోవచ్చును. అలా ప్రశ్నరాగలదనే వివరించుకొని చూడాలని ముందే చెప్పాము. అందువలన ఇప్పుడు మనము ఈ విషయమును గురించి వివరించుకొని చూద్దాము. ఎప్పుడో 70 సంవత్సరముల క్రిందట జాతకుని ఆయుష్షును గురించి చెప్పియుండగా, 70 గడచిన తర్వాత, 80 సంవత్సరములు బ్రతికిన తర్వాత ఆయుష్షును గురించి చెప్పినమాట తప్పని తెలియుచున్నది. ఇప్పుడు ఇన్ని సంవత్సరము లకు తప్పని తెలిసినా, తప్పుగా చెప్పబడినది ఎప్పుడు అని చూస్తే ఆ మనిషి పుట్టినప్పుడు కదా! అప్పుడు సత్యమైనది, ఆ రోజు శాస్త్రబద్ధముగా చెప్పబడినది, ఇప్పుడు అసత్యమెలా అయినదని చూస్తే, అప్పుడు చెప్పినది అప్పటికి సత్యమే, ఇప్పుడు జరిగినది ఇప్పటికి సత్యమేనని చెప్పవచ్చును. మా మాట విన్న కొందరికి మా మాటలోని సత్యము అర్థముకాక మమ్ములను అసత్యవాదులుగా వర్ణించవచ్చును. అయితే అందరికీ తెలియని సత్యమొకటి కలదు. జాతకుడు పుట్టినరోజు జాతకమునుబట్టి అతను 70 సంవత్సరములు బ్రతుకవలెనని ఉండుట సత్యమే. అయితే 70 సంవత్సరముల జీవితములో అతడు కొంతవరకు దైవజ్ఞానము ప్రకారము నడుచుకోవడము వలన కర్మమారుటకు అవకాశముగల దశా సంవత్సరములో తేడావచ్చి అతని ఆయుష్షు పది సంవత్సరములు పెరిగినది. మొదట శాస్త్రబద్ధముగాయున్నది 70 సంవత్సరముల ఆయుష్షూ సత్యమే, జ్ఞానమువలన కర్మమారి పది సంవత్సరములు పెరిగినదీ సత్యమే. అందువలన జనన లగ్నములో ఉన్నట్లు 70 సం॥ ఆయువు సత్యము. తర్వాత 80 సంవత్సరములు బ్రతుకు కూడా సత్యమే. దశాసంవత్సరములు జీవిత మధ్యకాలములో ఉన్నవి. మనిషి దైవజ్ఞానమును అనుసరించితే, ఆయా గ్రహములు పాలించవలసిన కర్మలు, ఆయా గ్రహముల యొక్క దశలలో నశించి పోగలవు. అందువలన మొదట పుట్టినప్పుడు నిర్ణయించబడిన కర్మకూ తర్వాత మధ్యకాలములో మార్పుచెందిన కర్మకూ తేడాయున్నది. జ్ఞానము ప్రకారము కర్మ తగ్గిపోయినదని అర్థము చేసుకోవచ్చును కదా! యని మేము చెప్పుచున్నాము. అయితే మా మాట విన్న తర్వాత కొందరు ఇలా ప్రశ్నించవచ్చును. ‘‘జ్ఞానము తెలియగల్గి దాని ప్రకారము ఆచరించితే గీతలో చెప్పినట్లు కర్మతగ్గిపోవు మాట వాస్తవమే అయితే దానిని మేము ఒప్పుకుంటున్నాము. ఆ లెక్క ప్రకారము 70 సంవత్సరములు బ్రతుకవలసిన వాడు 65 సంవత్సరములకో లేక 60 సంవత్సరములకో చనిపోయాడంటే, కర్మ తగ్గిపోయినందుకు అలా ఆయుష్షు కూడా తగ్గిపోయి ముందే చనిపోయాడని అనుకొందుము. కానీ ఇక్కడ పది సంవత్సరములు ఎక్కువ బ్రతికాడు కదా! దానికి మీరేమంటారు.’’ అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇలా గలదు.

ఏ మనిషికైనా ప్రపంచ విషయములలో ప్రవర్తించు ప్రవర్తనను గురించి ప్రారబ్ధకర్మ ఏర్పరచబడియుండును. గ్రహచారము ప్రకారము ఒక్క క్షణము కూడా కర్మ వదలక మనిషిని నడుపుచుండును. కర్మప్రకారము దేవున్ని తెలియుటకుగానీ, దేవుని జ్ఞానము తెలియుటకుగానీ, దేవుని జ్ఞానము మీద శ్రద్ధకల్గుటకుగానీ కర్మ కారణము కాదు. అటువంటపుడు కర్మకు అతీతముగా దేవునివైపు మనిషి పోవుటకు తగినట్లు గ్రహముల దశలను దేవుడు ఏర్పరచాడు. గ్రహముల దశాకాలములో మిత్ర శత్రుగ్రహములు మనిషి దేవునిమీద శ్రద్ధకల్గి దైవమార్గములో ప్రయాణించుటకు ఆయా గ్రహములు తమ తమ కర్మలను లేకుండ చేయవచ్చును. కర్మను పాలించు నవి గ్రహములే కావున జ్ఞానమునుబట్టి, జ్ఞానశక్తిని (జ్ఞానాగ్నిని) బట్టి కర్మలను నిర్మూలించవలసిన కార్యమును చేయవలసిన బాధ్యత గ్రహముల మీదనే ఉన్నది. అందువలన అటువంటి కార్యమును ఆచరించుటకు గ్రహముల దశలు ఏర్పరచబడినవి. గ్రహచారములో రవ్వంత కర్మను కూడా వదలక అనుభవింపజేయు గ్రహములు, తమ దశలలో మాత్రము దేవుని శాసనమును అనుసరించి కర్మను దహించు కార్యము కూడా చేయును. ఇంతకుముందు ఇదే గ్రంథములో ‘‘దశలు అంటే ఏమిటి’’ అను విభాగములో దేవుని విషయములో మనిషి ప్రవర్తననుబట్టి గ్రహములు తమ దశలలో కర్మను తీసివేయవచ్చును లేక తగిలించవచ్చును అని చెప్పియున్నాము. అక్కడ కర్మను తీసివేయు విధానమును గ్రహములే చేయుచున్నవని చెప్పుచూ అక్కడ కర్మలేకుండ పోవుటకు భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున చెప్పిన 37వ శ్లోకమును కూడా చెప్పాము. ఆ శ్లోకమునుబట్టి జ్ఞానమను అగ్నిచేత కర్మలను దహించు కార్యమును గ్రహములే చేయుచున్నవి. అంతేకాక దేవుని విషయములో భక్తి శ్రద్ధలకు బదులు దేవున్ని ద్వేషించుట, దూషించుట చేసినవారికి లేని కర్మలను అనుభవించునట్లు చేతునని భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగయోగమున 18,19 శ్లోకములను చూస్తే తెలియుచున్నది. ప్రపంచ విధానములో కాకుండ దేవుని మార్గములో లేని కర్మలను గ్రహములే తగిలించవలసియున్నది. అందువలన గ్రహచారములో మనిషి దేవునిపట్ల ప్రవర్తించు దానినిబట్టి కర్మను తీసి వేయుటకుగానీ, కర్మను తగిలించుటకుగానీ గ్రహములే కర్తలు. అటువంటి దైవ కార్యములను గ్రహములే తమ దశలయందు చేయుచున్నవి.

ఒక మనిషి కర్మ ప్రకారము ప్రపంచ విషయములలో అస్వతంత్రుడై ప్రవర్తించవలసియుండును. అదే దైవము యొక్క విషయములో స్వతంత్రముగా ప్రవర్తించగలడు. దేవుని విషయములు కర్మ ఆధీనములో ఉండవు. అందువలన జీవుడు దేవునికి స్వయముగా దగ్గరగా పోవచ్చును. లేక దూరముగా కూడ పోవచ్చును. దేవునికి దగ్గరగా పోయినవానికి ఉన్న కర్మలు లేకుండ గ్రహముల చేతనే తీసివేయబడును. అలాగే దేవునికి దూరముగా పోయినవానికి లేని కర్మలను గ్రహముల చేతనే తగిలించ బడును. ఆ రెండు పనులను గ్రహములు తమ దశలలో చేయుటకు అవకాశము కలదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. పుట్టిన కాలములో (జాతకములో) ఒక వ్యక్తికి 70 సంవత్సరముల ఆయుష్షున్నదని చెప్పబడినప్పుడు ఆ మాట జ్యోతిష్యశాస్త్రమునుబట్టి సత్యమేనని చెప్పవచ్చును. అయితే ఆ వ్యక్తి తన ఇచ్చతో దేవుని జ్ఞానమును తెలిసి యోగియై జ్ఞానశక్తిని సంపాదించుకొన్నట్లయితే, ఆ మనిషి దేవునికి దగ్గర వాడగును. అప్పుడు అతని 70 సంవత్సరముల కర్మలో 20 సంవత్సరముల కర్మ కాలిపోయినది. అప్పుడు అతడు ఉన్న కర్మనుబట్టి 50 సంవత్సరములే జీవించును. ఇది జ్యోతిష్యమునకు సంబంధములేదు. జ్యోతిష్యము కర్మను బట్టియుండునని జ్ఞప్తికుంచుకోవలెను. 70 సంవత్సరములు ఆయుష్షున్న వ్యక్తి తన ఇష్టానుసారము అజ్ఞానముచేత దేవున్ని దూషించి దేవునికి దూరమైనప్పుడు లేని కర్మను గ్రహములే తమ దశలలో తగిలించుచున్నవి. అప్పుడు వానికి ఆ జన్మలో కర్మ ఎక్కువైపోయి 70 సంవత్సరములు మాత్రము బ్రతుకవలసినవాడు 80 సంవత్సరములు బ్రతుకవలసి వచ్చు చున్నది. జనన కాలములోని కర్మ ప్రకారము మనిషి ఆయుష్షు 70 సం॥ అని చెప్పడము శాస్త్రబద్ధమే అగుట చేత అది శాస్త్రము ప్రకారము సత్యము. అయితే జీవిత మధ్యకాలములో కర్మకు సంబంధములేని దైవ విషయములో కర్మ తీసివేయబడడముగానీ, కలుపబడినప్పుడుగానీ, జరిగిన మార్పుకు జ్యోతిష్యమునకు సంబంధములేదు. జ్యోతిష్యము ప్రపంచ సంబంధమైనది. బ్రహ్మవిద్య దైవసంబంధమైనది. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము ఆయుష్షు చెప్పబడినది. బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము ఆయుష్షులో హెచ్చుతగ్గులు జరిగినది. అందువలన ఆయుష్షుకు సంబంధము లేకుండ జ్ఞానులైన వారు (జ్ఞానశక్తిగలవారు) తమ ఆయుష్షుకు ముందు చనిపోవుచున్నారు. అజ్ఞానులైనవారు కర్మను పెంచుకొని ఆయుష్షు కంటే ఎక్కువకాలమునకు చనిపోవుచున్నారు. అందువలన అటువంటి జ్ఞానుల విషయములోనూ అజ్ఞానుల విషయములోనూ ఇంతే ఆయుష్షు అని ఖచ్ఛితముగా చెప్పలేము. ఉదాహరణకు ఒక అనుభవ విషయమును క్రింద వివరిస్తాము చూడండి.

2011 A.D సంవత్సరము మార్చినెల మొదటిలో సత్యసాయిబాబా గారు అనారోగ్యముగా ఉన్నప్పుడు ఆయన ఆయుష్షు విషయమును గురించి మా భక్తులు కొందరు అడిగారు. సత్యసాయిబాబాగారి విషయము చాలా సంవత్సరముల పూర్వము ఒక సందర్భములో ఆయన దీర్ఘాయుస్సు కలవాడనీ ఆయన ఆయుష్షు 96 సంవత్సరములున్నా, బహుశా 92వ సంవత్సరము చనిపోవచ్చుననీ చెప్పినట్లు జ్ఞాపకమున్నదని చెప్పాము. అప్పటికి బాబాగారి వయస్సు 86వ సంవత్సరము జరుగుచున్నట్లు వినికిడి. దానినిబట్టి ఆయన ఇప్పుడే చనిపోడు ఇంకా ఐదు సంవత్సరములు బ్రతుకు తాడని చెప్పాము. అయితే బాబాగారు ఏప్రిల్‌ 24వ తేదీ చనిపోయినట్లు తెలిసినది. ఆయన ఆయుష్షు 96 అయితే మేము చెప్పినది 92 సం॥ములు. ఆయన చనిపోయినది 86 సంవత్సరములలో. దీనినిబట్టి మేము చెప్పిన ఆయుష్షుకంటే ఆరు సంవత్సరములు ముందే చనిపోయాడు. చెప్పిన జ్యోతిష్యము తప్పా అని ఆలోచిస్తే, జ్యోతిష్యములో తప్పులేదని తెలియు చున్నది. ఈ విషయములో ఎందుకలా జరిగినదని చూస్తే రెండు రకముల కారణాలు తెలియుచున్నవి. (ఒకటి) బాబాగారు అకాలమృత్యువు చేతనైనా చనిపోయివుండాలి లేక (రెండు) ఆరు సంవత్సరముల జీవిత కర్మ జ్ఞానముచే కాలిపోయి ఉండాలి. బాబాగారు సాధారణ వ్యక్తికాదు, కాబట్టి ఆయన ఆయుష్షులో ఆరు సంవత్సరముల కర్మ కాలిపోయి ఉండవచ్చును. అనుభవించుటకు కర్మలేని దానివలన బాబాగారు ఆరు సంవత్సరములు ముందే చనిపోయాడని చెప్పవచ్చును. అయితే ఈ విషయము పూర్తిగా తెలియనందువలన జ్యోతిష్యమునే తప్పుగా అనుకోవచ్చును. వాస్తవమునకు జ్యోతిష్యములో శాస్త్రబద్దముగా ఆయన చనిపోవలసినది 92 సంవత్సరము లకు. జ్యోతిష్యమునకు కర్మలు తప్ప జ్ఞానము వలన జరుగు పనులు తెలియబడవు. కావున ఆయన ఆరు సంవత్సరములు ముందే చనిపోవు విషయము జ్యోతిష్యమునకు తెలియదు. జాతకము బాబాగారు పుట్టినప్పుడు వ్రాసినది. అప్పుడు కర్మప్రకారము జరుగు విషయములే వ్రాయవచ్చును. జ్ఞానము వలన మధ్యలో మారిపోవు విషయములను ముందే వ్రాయుటకు వీలుపడదు. ఈ విధముగా చాలామంది ఆయుష్షు ముందుకు వెనక్కు పోయిన సందర్భములు కలవు. అందువలన ఆయుష్షు విషయమును చెప్పుటకు ఇటువంటి చిక్కు సమస్యలున్నాయని ముందే చెప్పాము.