17. కన్య

ఇపుడు కన్యాలగ్నమునకు ఎవరు మిత్రుగ్రహములో, ఎవరు శత్రు గ్రహములో తర్వాత పేజీలోనున్న 19వ పటములో చిత్రీకరించుకొన్నాము.

కన్యాలగ్నమునకు అదే లగ్నాధిపతిమైన బుధుడు, ప్రక్కనున్న తులా లగ్నాధిపతియైన శుక్రుడు మరియు మకర లగ్నాధిపతియైన రాహువు, కుంభ లగ్నాధిపతియైన శని, వృషభ లగ్నాధిపతియైన మిత్ర, మిథున లగ్నాధిపతియైన చిత్ర గ్రహములు ఆరు, శాశ్వితముగా మిత్రులుకాగ మిగత చంద్ర, సూర్య, భూమి, కేతువు, గురు, కుజ గ్రహములు ఆరు శాశ్వితముగ

కాలచక్రము - 19వ పటము

శత్రువులైనారు. అదే విధముగ కన్యా లగ్నమునకు ఎవరైతే శత్రు, మిత్రులుగా ఉన్నారో వారే శాశ్విత శత్రు మిత్రులుగా ఉందురు.

కన్య, తులా లగ్నములకు శాశ్విత శత్రు, మిత్రు గ్రహములు క్రింద వరుసగా వ్రాయబడినవి.

రెండు వర్గములుగా విభజించబడిన గ్రహములు, ఒక వర్గమునకు మరొక వర్గము శత్రువులుగా ఉన్నవని చెప్పుకొన్నాము. మిత్రులుగానున్న గ్రహములను శుభులని అంటున్నాము. అంతేకాక మిత్రగ్రహములు పుణ్యమును పాలించునవి కావున, వాటిని పుణ్యులు అని అంటున్నాము. వారు పుణ్యులు కావున శుభులని చెప్పడము జరిగినది. అదే విధముగా శత్రు గ్రహములు మానవుని పాపమును పాలించునవి కావున, ఆ జీవునికి అవి పాపులనీ మరియు అశుభులనీ అనడము జరుగుచున్నది. రెండు వర్గములకు గురువర్గము, శనివర్గము అని నామకరణము చేయడము జరిగినది. రెండు వర్గములవారు ఒకరికొకరు శత్రువులైనా, పుట్టిన జీవునికి ఒక వర్గము మిత్రులు, ఒక వర్గము శత్రువులుగా వ్యవహరించుచున్నవి.