జ్యోతిష్య శాస్త్రము/వృశ్చికము

18. వృశ్చికము

ఇపుడు వృశ్ఛికలగ్నమునకు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తర్వాత పేజీలోనున్న 20వ పటములో చూచెదము.

వృశ్ఛికలగ్నమునకు అదే లగ్నాధిపతియైన భూమి, ప్రక్కనేయున్న ధనుర్ లగ్నాధిపతియైన కేతువు మరియు మీన లగ్నాధిపతియైన గురువు, మేష లగ్నాధిపతియైన కుజుడు, కర్కాటక లగ్నాధిపతియైన చంద్రుడు, సింహ లగ్నాధిపతియైన సూర్యుడు మొత్తము ఆరు గ్రహములు మిత్ర

కాలచక్రము - 20వ పటము


గ్రహములగుచున్నవి. సూత్రము ప్రకారము మిగిలిన మకర లగ్నాధిపతియైన రాహువు, కుంభ లగ్నాధిపతియైన శని, వృషభ లగ్నాధిపతియైన మిత్ర, మిథున లగ్నాధిపతియైన చిత్ర మొత్తము ఆరు గ్రహములు శత్రుపక్షమున చేరిపోయినవి. వృశ్ఛిక లగ్నమునకు శాశ్వితముగా మిత్ర గ్రహములు ఆరు, శత్రు గ్రహములు ఆరు, పాపపుణ్యములను పరిపాలించుచుందురు. వీరు, సూత్రము ప్రకారము పుణ్య పాపములను పరిపాలించుచు శుభులు, అశుభులని పేరుగాంచియున్నారు. వీరు తమ కర్తవ్యములను వదలి శత్రువులు మిత్రులుగా మారిపోవడముగానీ, మిత్రులు శత్రువులుగా మారడముగానీ జరుగదు. వృశ్చిక లగ్నమునకు ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో వారే ధనుర్ లగ్నమునకు కూడా శత్రు మిత్రులుగా ఉన్నారని తెలియవలెను. వృశ్చిక, ధనుస్సు లగ్నములకు శాశ్వితముగా మిత్రు శత్రు వర్గములుగానున్న గ్రహములను వరుసగా క్రింద చూడవచ్చును.

పండ్రెండు గ్రహములు ఆరుకు ఆరు మిత్రు, శత్రువులుగా ఉండడమే కాక వీరిలో ప్రత్యేకముగా ఒక గ్రహమునకు ఒక గ్రహము బద్దశత్రుత్వము కల్గియున్నది. ఆ విషయమును తర్వాత తెలిపెదము.