జ్యోతిష్య శాస్త్రము/కర్కాటకము
16. కర్కాటకము
ఇపుడు కర్కాటక, సింహలగ్నములకు మిత్ర, శత్రు గ్రహములను క్రిందగల 18వ పటములో చూచెదము.
కర్కాటకలగ్నమునకు, అదే స్థానాధిపతిపైన చంద్రుడూ, సింహ లగ్నాధిపతియైన రవి(సూర్యుడు) మరియు వృశ్ఛిక లగ్నాధిపతియైన భూమి, ప్రక్కనేయున్న ధనస్సు లగ్నాధిపతియైన కేతువూ, మీనలగ్నాధిపతియైన గురువూ, మేషలగ్నాధిపతియైన కుజ గ్రహములు మొత్తము ఆరు మిత్రు గ్రహములుకాగా, మిగత మిత్ర, చిత్ర, బుధ, శుక్ర, రాహు, శని గ్రహములు ఆరు శత్రుగ్రహములగుచున్నవి. కర్కాటకలగ్నమునకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులగుచున్నారో వారే ప్రక్కనున్న సింహలగ్నమునకు కూడా శాశ్వితముగా మిత్రు, శత్రువులుగా ఉన్నారు.
కర్కాటక, సింహలగ్నములకు శాశ్వితముగా శత్రు మిత్రులుగానున్న గ్రహములు క్రింది విధముగాగలవు.