జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 22
ఈబడులలో పరీక్షలు చేసి, కావలసినవారికి సర్టిఫి కేట్లు ఇస్తారు. ఉన్నత పాఠశాలాపరీక్షకు పోదలచిన వారికి ప్రయివేటు గా చదువు చెప్పుతారు. వీరికి ప్రత్యేకముగా " తెలివి తేటల పరీక్ష" అనే దానిని విద్యామంత్రి శాఖ వారేర్పాటు చేసినారు . ఈపరీక్ష ఆబిట్యూరియేటెన్ పరీక్షకు సమానము. ఈప్రయివేటు విద్యార్థులకు ప్రతిశనివారమున్ను పరీక్ష జరుగుతుంది.
అధ్యాయము 22
విద్యా పరిశోధనాలయములు,
విద్యా పద్ధతులలో ఏదో ఒకటే శ్రేష్ఠమైన దని చెప్పవీలు లేదు. ప్రభుత్వము వారు, విశ్వ విద్యాలయములవారు, ఇతర విద్యాలయముల వారు కూడా కొత్త విద్యా పద్ధతులను కొత్తరీతిగా బడులను నడిపించడము కనుగొనడానికి -ప్రతి దేశము లోను ప్రోత్సాహము కల్పిస్తారు. ఆమెరికాలో ఇట్టి విద్యా పరిశోధనాలయములు చాలా ఉన్నవి.
183
ఈ అమెరికనువిద్యా పద్ధతులలో డాల్టను పద్ధతి, గారీ పద్ధతి అనేవి ఈ పరిశోధనలకు కొన్ని ఫలితము లను కోవచ్చును. డాల్టనుషట్టణములో మిస్ ఎ వెలిన్" డ్యూయీ అనే ఆమె అవలంబించిన పద్ధతికి డాల్టను పద్ధతి అని పేరు. దీనిప్రకారము ఉపాధ్యాయులు పాఠము చెప్పరు. అంతా విద్యార్థులే నేర్చుకో వలేను. ఉపాధ్యాయులు సలహామాత్రమిస్తారు. ప్రతివిద్యార్థికి వేర్వేరుగా ఉపాధ్యాయుడు భోధి స్తాడు. తరగతి మొత్తముమీద చదువు చెప్పడముండదు. ఈ పద్ధతిని ఇండియాలో బాగుగా అవగాహన చేసుకొనలేక , దానిని పాడు చేస్తున్నారు. విలియమ్ ఏ. వర్టు అనేఆయన గారీ అనే పట్టణము లోని తనబడిలో అవలంబించిన పద్ధతికి గారీ పద్ధతి అని పేరు. “ప్రతివిద్యార్థికిన్ని ఒక స్థలముండవలెను. ఆవిద్యార్థి ఆస్థలమును విడిచి పెట్టకూడదు” అనే వాదమును వర్టుగారు నిరసిస్తారు. పార్కులలో ఒకొక్క మనిషికి ఒకొక్క స్థలమును నియమించడ మెట్లక్కర లేదో, బడిలోకూడా ఒకొక్క విద్యా రికి ఏదో ఒక స్థలము నియమించ నక్కర లేదని
184
ఈతనివాదము. తనబడి లోనికి వచ్చే పిల్ల లలో సగ ము మందికే అతడు స్థలముంచినాడు. తక్కివారు ఆటస్థలములో చదువు నేర్చుకొంటారు. ఇష్టము వచ్చినవారు గదులలో ఉండవచ్చును. తక్కిన వారు బయట ఆడుకోవచ్చును.ఈతడు సాయంకాలము పిల్లలతండ్రులను బడికి పిలిచి పిల్లలతో ఆడుకోనిస్తాడు. సంవత్సరమునకు 12 నెల లున్ను, వారమునకు 7 దినములున్ను బడి ఉంచుతాడు. బడే పిల్లలకు ఇల్లన్న మాట, పిల్లలు బడిలో ఉన్నంత కాలమున్న బడే ఇల్లను కొనేటట్లు చేస్తాడు.
జర్మనీలో కూడా విశ్వవిద్యాలయముల వారున్ను, ఇతరులున్న ఇటువంటి విద్యాపరి శోధనాలయాలను స్థాపించి, కొత్తివిధ్యా పద్ధతు లను కనుక్కొనడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటు వంటి బడులలో ఒకటి ఈ క్రింద వర్ణింపబడినది.
ఈబడికి ఇన్సెల్ షూలే (Inse Schule)అని పేరు. ఇది 'బెర్లిన్ పట్టణమునకు దగ్గరగా ఉన్న ఒక ద్వీపముమీద ఉన్న ది. బెర్లిను పురపాలక
185
సంఘమువా రీద్వీపమునంతటిని ఈబడికి ఇచ్చి వేసి నారు. ప్రభుత్వమువారే ఇందులోని ఉపాధ్యా యులకందరికిన్ని జీతములిస్తారు.ఇదివసతిబడి. ఇందులో 38 గురుపిల్ల లున్న 5గురు ఉపాధ్యాయు లున్ను ఉన్నారు. ఇందులోని పిల్లలందరున్ను తు దకు అబ్యిరియెంటెన్ పరీక్షకు పోతారు. ఈ పిల్లలలో కొందరు గొప్పఇంటివాండ్లు, బడికి వై ద్యుడు లేడు; ఆరేళ్ళలో ఒక్క సారిమాత్ర మే కావలసివచ్చినాడట; అప్పుడతనిని దగ్గర పల్లెనుంచిపిలి పించినారు. సాధారణ మైన తిండి మోతాదుగా తిన డమున్ను , కావలసినంత వ్యాయామము చేయడ మున్ను పిల్లల ఆరోగ్యమునకు మూల కారణము), పొద్దుటి భోజనమునకు పూర్వము ఏ విద్యార్థిన్ని ద్వీపము చుట్టు 1 1/4 మైళ్ళు పరుగెత్త వ లెను. ఈబడిలో ఇప్పుడు రెండు పరిశోధనలు జరుగు తున్నవి .
(1) డాల్టను పద్ధతి:- తరగతిలోని పిల్లల కందరికీ ఒక్కసారి పాఠములు చెప్పరు. ఒకొక్కరికి ప్రత్యేకముగా చెప్పుతారు. ఈ పద్ధతి ఇండి
186
యా దేశములో అనాదిగా ఉన్న దే. బ్రిటిషువారు రాక పూర్వము బడులలో తరగతుల పద్ధతి లేదు. తరగతి మొత్తముమీద పాఠములు చెప్పుతే కాల ముతక్కువ అవుతుందని సాధాణముగా మనమను కొంటాముగాని, ఈ బడిలోని ఉసాధ్యాయుల అభి ప్రాయము వేరు. తరగతి మొత్తముమీద చె ప్పడమువల్ల కాలము కలిసిరాదనన్ని, ఉపాధ్యాయు లకు మాత్రము సులువనిన్ని వారిఊహ.తరగతి "మొత్తముమీద పాఠములు చెప్పడమువల్ల తెలివి గల పిల్లలకే లాభము గాని, మొద్దు పిల్లలు మరింత మొద్దులవు తారు. మధ్య రకము పిల్లలమీదనే ఉ పాధ్యాయుల దృష్టి ఉంటుంది; అందు చేత వారు మి క్కిలి తెలివై నపిల్లలను, మొద్దుపిల్లలను నిఘాలో ఉంచుకోరు.ఈ జర్మముబడిలో తరగతి అనే అభి ప్రాయమును తొలగించడానికి, పిల్లలను వర్గము లుగా ఉంచి, ఒకొక్క వర్గమువారికి ఒకొక్కరంగు గురుతుగా ఉంచుతారు. ఒకొక్కప్పుడు ఉపాధ్యా యులు ఒకొక్క విద్యాన్ని ప్రత్యేకముగా పా ఠము చెప్పుతారు. ఒకప్పుడొక టేపొఠముకోసము
187
ఇద్దరు ముగ్గురిని కలిపి చెప్పుతారు. పిల్లలు పాఠము కోసము ఉపాధ్యాయుల దగ్గరకు పోరు; ఉపాధ్యా యులే పిల్లలవద్దకుపో తారు. బడి పెద్దల( మోనిటర్ల) పద్ధతి ఈబడి వారి కిష్టము లేదు; అనగా • తెలివైన పిల్లలను మందమతులకు పాఠములు చెప్పడమునకు ఏర్పరచరు. దానికి బదుగా ఉపాధ్యాయుల సంఖ్యనే ఎక్కువ చేయడము లాభకరమని వారి అభిప్రాయము,
(2) సామాన్య జీవనమున కలవా టు చేయ డము:-ఇది పరిశోధనలో ఉన్న రెండో పద్ధతి. ద్వీప మంతటిలోను పిల్లలవంటకు ఇద్దరు ఆడవాళ్ళు తప్ప, మ రెట్టి కనౌకరులును లేరు. ద్వీపములో రోడ్లను,బడి గదులను, వసతి ఇండ్లను, పిల్లలేను తుడుచుకొంటారు. పక్కలను తామే పరుచుకొంటారు. భోజనచా వడిలో భోజనము చేసే 'టేబిలును తామేసర్దుకొం టారు. తిన్న కంచాలను తామే కడుగుకొంటారు. ద్వీపములోని కోళ్ళను, ఆవులను, వ్యవసాయ పొల మును తామే చూచుకొంటారు.ఈపనులు చేయ డానికి నౌకర్లను నియమించరు. యూరోపులో
188
లకు తిండి పెట్టడముకూడాను.
బసకు, తిండికి, ఆటలకు, రోజుకు విద్యార్థి ఒక్క-షిల్లింగు మాత్రము చెల్లించవలెను. యూ రోపులో ఇతర చోట్ల ఈపిల్లింగు ఏమూలకున్ను చాలదు. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి, భోం చేస్తారు. బడి ఖర్చుకోసము బడిపిల్ల శ్రమయే చా లును; ఒక వేళ చాలకపో తే తల్లిదండ్రుల నడుగు తే ఆలోటు పూర్తి చేస్తారు.
ఇటువంటి బడులు విద్యాపరిశోధనముకో సము ఇంకా అనేకరకములవి ఉన్న వి.
అధ్యాయము 23
బడులలోని వస్తు ప్రదర్శనశాల . ప్రతి దేశములోను విద్యకు సంబంధించిన వ స్తుప్రదర్శనశాల లుంటవి. ఇంగ్లాండులో ఇట్టి దర్శన శాల దక్షిణ కెన్సింగ్ టనులోని శాల కను బంధముగా ఉంటుంది. ఉపాధ్యాయులు పిల్లలను
189