జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 13

అధ్యాయము 13.

జర్మని విద్యార్థుల సహకార సంమము.

చాలామంది జర్మను విద్యార్థులు యుద్ధసమయము- చనువుమాని యుద్ధములో సైనికు గా ప్రవేశించినారు. యుద్ధ మంతము కాగానే విద్యార్థులు తిరిగి చదువుకొనడానికి ధన సామర్థ్యము లేకపోయినది. ఇంగ్లాండులో,ఈ సమస్య వచ్చినది కాని, ప్రభుత్వము నా రున్న విశ్వవిద్యాలయాల వారున్ను విద్యార్థులకు యుద్ధమునుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఇంగ్లీషు ప్రభుతము వారు ప్రత్యేక విద్యార్థి వేతనము లిచ్చినారు; విశ్వవి ద్యాలయము వారు సంఖ్యతో నిమిత్తము లేకుండా వచ్చినవారి కందరికిన్ని ప్రవేశమిచ్చి, సాధ్యమయి మట్టుకు సహాయము చేసి, శీఘ్రకాలములో వారివారి పట్టములను సంపాదించు కొనగలిగినట్లు పాఠక్రమమును, పరీక్షలను మార్చినారు, జర్మను ప్రభుత్వము వారికి విద్యార్థులకు సహాయ ము చేయడానికి డబ్బు లేకపోయినది. విశ్వవిద్యా

120

లయాలకు మూలధనము లేక పోవడము చేతను

అవి కూడా ప్రభుత్వము మీదనే ఆధార పడి ఉం డడము చేతను, విద్యార్థుల కెట్టి సహాయమును చేయజాలక పోయినవి. అందుచేత విద్యార్థులు స్వయంసహాయము చేసుకోవలసి వచ్చినది. 1921 సం. రము ఫిబ్రవరి నెలలో పెద్ద సభ చేసి స్వయం-సహాయ సంఘము నొక దాని నేర్పాటుచేసుకొన్నారు. ఈ సుఘమునకు మూలస్థానము డ్రెన్-డ్రెన్ (Lort: 1en) పట్టణములోను, దానిశాఖలు ప్రతి విశ్వవిద్యాలయ స్థానములోను ఏర్పాటు చేసినారు. 1921 సం. రలో వారేర్పరుచుకొన్న చిన్న సంఘము, ఇప్పుడెంతో అభివృద్ధి అయి, జర్మనీ దేశము లోని ఉన్నత విశ్వవిద్యాలయ విద్యావ్యాపనము విషయమై ఎంతో పని చేస్తున్నది.

ఈ సంఘమువారు విశ్వవిద్యాలయ స్థలా లన్నిటిలో విద్యర్థిగృహములను కట్టడానికి ప్రయ త్నిస్తున్నారు. అప్పుడే ఇటువంటివి అయిదు కట్టి నారు. ఇతర స్థలాలలో అద్దెలకు ఇళ్ళు పుచ్చు

121


కొన్నారు. ఈ యిళ్ళు కట్టడానికి చందాలు లే వనెత్తినారు. చందాసొమ్ము కాక అసొమ్ములో నూటికి 70 వంతు ప్రభుత్వమువారు కూడా ఇచ్చినారు. ఈ ఇళ్ళు విశ్వవిద్యాలయసంఘముల వలే సంఘము ఉంటవిగాని, హాస్టలు లవలె ఉండవు. ఈ యిళ్ళకు అను బంధించి పెద్ద హొటేళ్ళుంటవి. వీటిలో చౌకగా అన్నము పెట్టుతారు. మరిఒక చోట కంటే ఈహొటేళ్ళలో నూటికి 60 వంతు మా త్రమిచ్చుకోవలసి ఉటుంది. మొత్తము వి ద్యార్థులలో మూడోవంతుమంది బసలు చేసుకొంటారు. ఈ ఇళ్ళలో ఉండడము వల్లను, వీటి కనుబంధించిన భోజనము చేయడము వల్లను, సంవత్సరానికి ఈ ధ్యార్థులందరూ కలిసి 88,000 పౌనులు మిగుల్చుకొంటారు. ఈ మిగిలిన సొమ్ము పేదవిద్యార్ధు లకు సహాయనిధిగా ఏర్పడుతుంది. చాలమంది బీద విద్యార్థుల నుంచి సగము సొమ్ము మాత్రమే తీసుకొంటారు. నూటికి 15 గురు పేద విద్యార్ధు లను ఉచితముగానే చేర్చుకొంటారు. ఉచిత భో

122

జన మునక య్యే ఖర్చులను సంఘమువారు హోటే ళ్ళకు ఇస్తారు. అందు చేత హోటేళ్ళమీద సాధారణముగా నష్టము రాదు. సంఘమువారు సహ కార విక్రయశాలలను ఏర్పాటు చేసి నారు. ఇందులో వస్తువులు కొనడము వల్ల , పైని కొను క్కొనడముకంటె నాలు గో వంతు మిగులుతుంది. బట్టలు, జోళ్ళు, మొదలయిస విలువగల వస్తువు లను కంపెనీలనుంచి అందరూ కలిసి తెప్పించు కొంటారు, కంపెనీల వారు మంచి డిస్కౌంటు ఇస్తారు. పాత విద్యార్థులు తమ పాఠపుస్తకా లను ఈ గృహములకు ఉచితముగా ఇస్తారు. వీటిని పేద విద్యార్థులు ఉపయోగించుకొంటారు, చాలామంది విద్యార్థులు ఉపన్యాస సారాంశములను టైపు చేసుకొంటారు. టైపు చేసుకొనడానికి సంసుమువారు టైపు మెషీనులను ఉచితముగా ఎరువిస్తారు. ఈ మెషీనులను విద్యార్థులు తమ గదులకు కూడా తీసుకొని పోవచ్చును. ఇదిగాక రోగముపడ్డ విద్యార్థులను జర్మనీలోను ఇతర దేశ ములలోను ఉన్న రోగులను పోషించే గృహముల

123

కు సంఘమువారే ఖర్చులను భరించిపంపు తారు.

సెలవులలో పేదవిద్యార్థులకు పనిని కల్పించి, వ చ్చే " టెర్ము” ఖర్చులకు సరిపోయేటట్లు సంపాదిం చుకొనడానికి సదుపాయాలు కూడా సంఘము వారు చేస్తారు.తమ దేశపు విద్యార్థులను ఇతర దేశాలలో పోషించే పద్ధతి మీద పరదేశీ విద్యార్థులను వీరు తమ గృహాలలో జేర్చుకొని పోషి స్తారు. తమ దేశ విద్యార్థులు పర దేశములలో చ దువు కొంటే కొంతమందికి సంఘమువారు విద్యా ర్థి వేతనములు కూడా ఇస్తారు. విద్యార్థులకు అప్పు లివ్వడమున్న, ఉచితముగా డబ్బు ఇవ్వడమున్ను, కాకుండా వారికి చేబదుళ్ళు కూడా ఇస్తూ ఉంటారు' ఈ చేబదుళ్ళలో నూటికి 40 వంతు తిరిగీ రాదట. ఈనష్టమును పూర్తిచేయడానికి విశ్వ విద్యాలయములోని ప్రతి విద్యార్థిన్ని 'టెర్ముకు 8 పెన్సులు చెల్లిస్తాడు. తమ గృహములోని వి ద్యార్థులకు ఉద్యోగాలను సంపాదించడానికి సంఘ ము వారొకశాఖను ఏర్పాటు చేసినారు. ఇది గాక ఇతర దేశ విశ్వవిద్యాలయముల భోగట్టాను

124

వీరు తెలుపుతూ ఉంటారు. సంఘమువారే కా కుండా గవర్నమెంటు వారున్ను విద్యార్థుల కోసము సహాయనిధి నొక దానిని ఏర్పాటు చేసి ఈ సంఘమువారి సలహాపై "కూరే టరు” సొమ్ము పంచి పెట్టు తాడు.

పైని వివరించిన సదుపాయములన్నీ విదేశీ విద్యార్థులకు కూడా చేస్తారు. ఈపనులను నిర్వహించడానికి సంఘములో ప్రత్యేక శాఖ ఉన్నది. 1928 సం|రములో చీనా విద్యార్థుల కోసము వారు విద్యార్థి వేతనములను ఆయా విశ్వ విద్యాలయాలకు పంచి పెట్టినారు. ఈసదుపా యాలతో విదేశీయ విద్యార్థి నెలకు 10 పౌనుల మోతాదు ఖర్చుతో కాలక్షేపము చేసుకో గలడు. ఈ సొమ్మయినా డ్రెస్డెను పట్టణములో మూల స్థానమునుండి అప్పు పుచ్చుకోవచ్చును. విద్యార్థులు రైలుబండ్లలో మూడో తరగతిలో సగము ఛార్జీల మీద ప్రయాణము చేస్తారు. విదేశీయ విద్యార్థులు మొదట నిండు ఛార్జీ చెల్లిం చినా, రైలు స్టేషనులో ఆవిషయమై ఒక కాగితము

125

పుచ్చుకొని ఉంటే, వారు చెల్లించిన దానిలో సగముసొమ్ము వాపసు ఇచ్చి వేస్తారు. విదేశీయ విద్యార్థులు ఫాక్ట రీలలో అను భవమును సంపాదిం కొనడమునకున్ను, మంచి జర్మను కుటుంబములలో చేరడమునకున్న, 'సెలవులలో తగిన సౌకర్యము - కలగడమునకున్ను సంఘమువారు ఏర్పాట్లు చేస్తారు.

మూల స్థానము

పైని విద్యార్థుల సహకార సంఘము పని సాధారణముగా చెప్పబడినది. ఇక మూలస్థాన మును గురించి తెలుసుకొందాము, సంఘము మూల స్థానము 'డె స్టెప్ పట్ట పట్టణములో ఉన్నది. ఈసంఘములో మూడుతరగతుల సభ్యులుంటారు. (1) జర్మను విశ్వవిద్యాలయ ములో మెట్రిక్యు లేషను పరీక్ష ప్యాసయిన విద్యార్థు లందరున్ను ఇందులో సభ్యులు కావచ్చును. (2) విద్యార్థులు కౌనివారు సంవత్సరమునకు 8 షిల్లింగులు చెల్లించి సభ్యులు కావచ్చును (3) వర్తక కంపెనీలవారు సంవత్సరమునకు 5 పౌనులు చెల్లించి సభ్యులుగా

126


వచ్చును. ఈ సంఘము కార్యనిర్వాహకవర్గ పండ్రెండుగురు సభ్యులుంటారు. వీరిని సాధారణ సభ్యులు ఎన్ను కొంటారు. వీరిలో నలుగురిని అధ్యాపకులు తమలో తాము ఎన్నుకొంటారు. నలుగురిని విద్యార్థులు తమ వారిని ఎన్ను కొంటారు. తక్కిన నలుగురిని విద్యార్థులు కాని ఇతర సభ్యులు తమలో వారిని ఎన్ను కొంటారు.

(1) అప్పులిచ్చే శాఖ. (9) విద్యార్థులకు ప్రత్యేక ప్రత్యేకముగా సహాయము చేసే శాఖ, (3) విద్యార్థి వేతనముల నిచ్చేశాఖ. (4) స్వదేశ విద్యార్థులను పర దేశ ములకు పంపించి, వారి స్థానే పర దేశవిద్యార్థులను రప్పించే శాఖ. (5) సంఘము పనిని మొత్తముమీద సాగించే శాఖ, (6) సంఘమును గురించి ప్రకటనలను చేసి దానిని అభివృద్ధి పొందిం చేశాఖ, అనే శాఖలతో సంఘము పనిచేస్తుంది. 127 దీనిలో మొదటి శాఖపని విద్యార్ధులకు అప్పులివ్వడము. దీని కోసము సంఘము వారికి ప్ర భుత్వమువారు సంవత్సరమునకు 800,000 పౌను లిస్తారు. దీనిలో రెండు వంతులు మూల ప్రభుత్వ ము. వారున్ను , ఒకవంతు రాష్ట్రీయ ప్రభుత్యము వారున్ను ఇస్తారు. ఈ గ్రాంటును పది సంవత్స గములవరకున్ను ఇవ్వడమునకున్ను, ఆతరువాతే ఆ 80 లక్షల పౌనులను మూలధనముగా చేసుకొని, సంఘము తనపనిని సాగించుకొనడమునకున్న ఏస్పాటు జరిగినది. విద్యార్థులు తీసుకొన్న సొమ్ము ఇచ్చి వేస్తే, దానిని తిరిగి అప్పులిస్తూ ఉంటారు. జర్మనీలో బ్యాంకు లో నూటికి 8 చొప్పున వడ్డీ ఉన్నా, సంఘమువారు 3 చొప్పున నే అప్పులిస్తారు. పద్ధతివల్ల నష్టము రాకుండా ఉండడమునకు, అప్పు కావలసిన విద్యార్థి చెల్లించక పోతే తనకు బదులుగా చెల్లించడానికి ఒక పెద్ద మనుష్యుని : జామీనుగా ఇవ్వవ లెను. విద్యార్థులు కొందరు మృతి నొందుట వల్లను చదువయిన తరువాత విద్యా రులకు పనిదొరకక పోవడమువల్లను, కొన్ని అప్పు

128

లు వసూలు కావు. అట్టి నష్టమును పూర్తి చే

యడానికి జర్మనీ లోని 40 విశ్వవిద్యాలయముల లోను చదువుకొంటు ఉన్న ప్రతివిద్యార్థిన్ని టెర్మకు 15 పెన్సులు చెల్లించవలెను. విదేశీయ విద్యార్ధులకిచ్చే అప్పులు వాపసు కావడము ఎ క్కువ గనుక విదేశీయ విద్యార్థులు ఒటెర్మకు 4 షిల్లింగుల 6 పెన్సులు నములు చేయడానికి ఆలోచిస్తున్నారు.

విద్యార్థులకు ప్రత్యేక త్యేకముగా స హాయము చేసే రెండో శాఖలో అనేక భాగము లున్నవి. వాటిలో ముఖ్యమైనది. రోగిష్ట విద్యా ర్థులను ఆరోగ్యస్థలము కు పంపించేది.జర్మినీ లోను, ఇతర దేశములలోను ఉన్న ఆరోగ్యస్థలాలకు సంవత్సరమునకు 200 మంది విద్యార్ధులను సంఘ మువారు పంపించి, వారికయ్యే ఖర్చంతా తామే భరిస్తారు. ఈశాఖలోని విదేశీయభాగము చా లా మంచిపని చేస్తున్నది. అంతర్వీశ్వవిద్యాలయ సభలకు ఈశాఖవారు సభ్యులను పంపుతారు. ఇతర దేశాల అధ్యాపకులను ఆహ్వానము చేసి,

129

జర్మసు విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసా లిప్పి

స్తారు. ఈ ఆధ్యాపకుల ప్రయాణఖర్చులను సంఘమువారు భరించి, వారిని బాగుగ సత్కరించి, ఉపన్యాసాలకు ఏర్పాటు చేసిన టిక్కట్ల సొమ్ము లో కొంతభాగ మిచ్చి వేస్తారు. జర్మను విద్యా ర్డులకు అమెరికాలోని ఫాక్టోరీలలోను అమెరికా విద్యార్థులకు జర్శన ఫాక్టరీలలోను అనుభవము కోసము ఏర్పాటు చేస్తారు. జర్మను విశ్వవిద్యా లయాలలో చదువదలచే విద్యార్థులకు విద్యార్థి వేతనము లిస్తారు. విదేశీయ విద్యార్థులకు జర్మను విశ్వవిద్యాలయాల భోగట్టా తెలుపుతూ ప్రతి సంవత్సరమున్ను ఒక పుస్తకము ప్రకటిస్తారు. ఇండియా విద్యార్థులకు ఈ శాఖవారే విద్యార్థి వేత నము లిస్తారు.

విశ్వవిద్యాలయ స్థలము లలోని సహ కారశాఖలు.

మూల స్థానమునకు ప్రతి విశ్వవిద్యాలయ స్థానములలోను ఒక శాఖ ఉంటుంది. ఈ శాఖకు కూడా ఒక కార్యనిర్వాహక వర్గ ముంటుంది. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థులు


130


కాని ఇతరులు, సమాన సంఖ్యగా ఉంటారు. విద్యార్థులు కానివారిని వారికి విద్యార్థుల మీద ఉండే ఆభిమానమును బట్టిగాని, వారు చెల్లించే చందాను బట్టి గాని సభ్యులుగా ఎన్ను కొంటారు. సంమము యొక్క, విశ్వవిద్యాలయ శాఖ వారు హో టేళ్ళను ఏర్పాటు చేసి, విదారులకు భోజన టిక్కట్లను అమ్మడము, పొఠపుస్తకాలను ఎరువి వ్వడము, టైపు రైటర్లను ఎరువివ్వడము, సెలవు లలో విద్యార్థులకు పనికల్పించడము, రోగిష్టి విద్యా నలను జర్మనీలోని ఆరోగ్య స్థలాలకు పంపడము, చేబదుళ్ళివ్వడము, సహకార విక్రయశాలలను ఏర్పాటు చేయడము మొదలయిన పనులను చేస్తారు. ఒకొక్క శాఖ ఉచితముగా పనిచేసే విద్యార్థివశమందుంటుంది. ఆయా శాఖలను చూచే విద్యార్థులకు సహాయపడి, ఆఫీసుపని చూడడానికి జీతముమీద ఒక ఉద్యోగికూడా ఉంటాడు. ఈ ఉద్యోగికి సంవత్సరమునకు 120 పౌనులనుంచి 400 పౌనులవరకు జీతమిస్తారు. ఉపసంఘములుగా పనిచేయడములో జర్మ


131

నులకు నమ్మకము లేదు. ఉపసంఘమువారు

మొత్తముమీద చూచుకొంటారు. ప్రత్యేక విషయాలను ప్రత్యేక వ్యక్తులే చూస్తారు. స్థానిక శాఖల వారిచ్చే విద్యార్థి వేతనములు మూ ల సంఘమువారి చ్చేవాటికంటె వేరు గా కూడా ఉంటవి. వీరుకూడా విద్యార్థులకు చేబదుళ్ళిస్తారు. విద్యార్థికి వేతనములు కావలసినవా డొక ఫారమును నింపవలెను, దీనిలోని విషయములు సరిగా ఉన్నవో లేవో పోలీసు వారు సరిచూస్తారు. ఈ విద్యార్థి వేతనములను, ప్రభుత్వమువారును, సం ఘమువారును ఇచ్చే అప్పులను, ఏ దేశీయ విద్యార్థులు కూడా పుచ్చుకోనచ్చును.

ఈశాఖలకు (1) టెర్ముకు ప్రతివిద్యార్థి 1 1/2 పిల్లింగుల చొప్పున చెల్లం చేసొమ్ము (2) డ్రెస్టెను లోని మూల స్థానము వారిచ్చే సొమ్ము (2) పయి పటు చందాల సొమ్ము (4) విశ్వవిద్యాలయము లోని విద్యార్థికి 2 1/2 పెన్సుల చొప్పున ప్రభుత్వ మువారిచ్చే సొమ్ము-ఇ దేరాబడి.

ఈ సంఘము ఉద్దేశములు, దాని రాబడి,

132

ఖర్చు, మొదలయిన వాటిని గురించి డ్రైస్డెనులోని

మూలస్థానమునకుగాని, దాని శాఖలకుగాని వ్రా సీ తెలుసుకో వచ్చును.

ఆధ్యాయము 14

జ్మునీలో యువజన సంరంభము.

దక్షిణ ఆఫ్రికాలో జరిగిన బోయరు యుధ్ధములో పండ్రెండు, పదమూడేండ్ల బోయరు పిల్ల లు యుద్ధము చేయడముచూచి, బేడెను పవెలు (General Baden Powell) అనే ఆయన ఇంగ్లాం డులో బాలభటోద్యమమును లేవదీసెను. ఆ ఉద్యమము చల్ల చల్లగా బ్రిటిషు సామ్రాజ్యమంతటా ప్రాకిపోయినది. జర్మసులుకూడా, బోయరుల పద్ధతిమీద “ప్ ఫాడ్ ఫింటర్ " అనే ఒక ఉద్యమ మును ఆరంభించినారు (Piad Finder). ఇప్పు డాఉద్యమము పేరు “వం టర్న ఫో గెల్” (Wandern Vogel). బే డెన్-ప వెల్ ఉద్యమము నకు సంఘసేవ, సైనిక శిక్షణము అనునవి మూ

133