జడకుచ్చులు/ఆచారక్షయము

ఆచారక్షయము

 
                            1
తీరు తీరుల నలం ♦ కారముల్‌ మృగ్గులఁ
                       జిత్రించు మవ్వంపు ♦ జేతిమేల్మి
పూసలతో బొమ్మ ♦ పోసిన యట్లు చ
                       క్కని కుట్టుపను లల్లు ♦ కాశలంబు
కైవారములు లేక ♦ యే వలయము లష్ట
                       దళరేఖల సమర్చు ♦ కలికితనము
పాడేటి రాటాల ♦ పాలు దీసినరీతి
                       సన్నదారముఁ దీయు ♦ జాణతనము
గీ.తెనుఁనాఁటి కులస్త్రీల ♦ దినదినంబు
   సన్నసన్నగ నణఁగారి ♦ చచ్చుచున్న
   వకట! ఈగృహజీవ దీ ♦ పికలు నిలువ
   స్నేహనిధికి భిక్షాటన ♦ సేయ రేమొ!
                           2
సీ.ఏడాది పొడుగున ♦ నింతతీరిక లేక
                    చేలలోఁ గష్టించు ♦ సేద్యకాండ్ర
   పెద్దపురాణాల ♦ విన నోచుకొనక యూ
                    రికి దూరులగు దుర ♦ దృష్టజనుల

40

జడకుచ్చులు

ఉప్పు కల్లుకుఁ గూడ ♦ నొడ లమ్మవలసిన
                    ఆధార శూన్యులౌ ♦ అనదవాండ్ర
ఇంటిబానినబాకి ♦ రే సర్వమని తూర్పు
                    పడమర లెఱుగని ♦ పల్లెసతుల

గీ.ఎవ్వడింక తాంబూర వా ♦ యించుకొనుచు
   దరిసి నడుపు పజాహ్లాద ♦ తంత్ర మెపుడు?
   అన్నకాటక మటులుండ ♦ నావహించె
   భూమి నానంద దుర్భిక్ష ♦ మును సఖుండ!
                          3

సీ.వినువారి కన్నీరు ♦ వినవాకగా బొంగ
                  సీతమ్మ కష్టాలు ♦ సెప్పిసెప్పి
   వెఱ్ఱిగొల్లడు గూడ ♦ నుఱ్ఱూతలూగంగ
                  వీధిభాగవతాలు ♦ వేసివేసి
   ముసలివాండ్రును మీస ♦ ములు త్రిప్పి కాకెక్క
                  వీరబొబ్చిలికథల్‌ ♦ వినిచి వినిచి
   ఆబాలగోపాల ♦ మావేశమున త్రుళ్ళ
                  పల్నాటియుద్ధాలు ♦ పాడిపాడి

గీ.పల్లెపల్లెల బ్రాణము ♦ పచ్చగిల్ల
   జూతిసుఖము పోషించితి ♦ సర్వకాల
   మెచ్చట సురింగిపోతివో ♦ బిచ్చకాఁడ
   కవివి పాటకుఁడవు నీవె ♦ గావె సఖుఁడ!

                             4
సీ. బువ్యమ్ముబంతులఁ ♦ గవ్వించి వయసుకా
                   వరముబ్బ పడుచులు ♦ పాడలేరు
గొబ్బితట్టెడు వేళఁ ♦ గూడ కన్నె నెలంత
                   లరమరలే కాడ ♦ మఱచినారు
తద్దెపండుగల సై ♦ తముయాల లూగుట
                   మోటుగా మగువలు ♦ మూసినారు
రుక్మిణిమొదలుగా ♦ రుచిగొన్న బొమ్మల
                   పెండ్లిండ్లు బాలలు ♦ విడచినారు

గీ.ఏనిరపరాధమగు క్రీడ ♦ లింతవఱకు
జూతిముఖకళలనదగు ♦ జానలందుఁ
బెంచె సౌందర్య సుఖరుచి ♦ సంచయమ్ము
నా శుభము లస్తమించెడు ♦ నరయరేమొ?