జడకుచ్చులు








రాయప్రోలు సుబ్బారావు










బెజవాడ, ఆంధ్రగ్రంథాలయ ముదాక్షరశాల (లిమిటెడ్ ) యందు

క. కోదండరామయ్య గారిచే ముద్రింపబడియె.

1925



సు వ ర్ణ వృ ష్టి

విజ్ఞప్తి

ఇందలి పద్యములు పలుపత్రికలనుండి యేరికొంటిని. ఆంధ్రభారతి, గ్రంథాలయసర్వస్వములు అందు ముఖ్యములు. ఏతత్పత్రికాధిపతుల ఇయ్యకోలున కెంతయుఁ గృతజ్ఞుఁడను. చేర్పఁదలచిన మఱికొన్నిపద్యములు విస్మృతి గహనముపాలై దొరికినవికావు. రసికులకిం దేవియేని రుచించినఁ గృతకృత్యుడను.

-గ్రంథకర్త.


కం. పాయలు పాయలుగా విడి
పోయిన నా తెనుఁగుకన్నెముంగురులకు వే
ణీ యోగ్యాభరణముగా
నీయెడ జడకుచ్చు లల్లి యిచ్చితిఁ బ్రీతిన్


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.