చిత్రభారతము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
చిత్రభారతము
తృతీయాశ్వాసము
| 1 |
వ. | అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని | 2 |
సీ. | తనసొమ్ములైయున్న ఘనతరపద్మరా | |
తే. | దన్నుఁ బాయని సిరిఁ జూచి తలఁగ లేక | 3 |
చ. | సరసిజనేత్ర చూడు జలజాతదళంబులపై బయఃకణా | 4 |
చ. | అలశశి తన్మొఱింగి కమలాకృతి నీటఁ దపంబుఁ జేసి ని | 5 |
క. | తనపతి యగుద్విజరాజున | 6 |
మ. | మకరందంబున దానము ల్సలిపి, జిహ్మప్రక్రియ ల్మాని, కొం | 7 |
తే. | కందమూలంబులు భుజించి కమలవనము | |
| భువనసంచారమహిమచేఁ బొలిచి రాజ | 8 |
వ. | ఇట్లు తదీయవిశేషంబు లీక్షించి యిది యంభోనిధియుం | 9 |
చ. | [1]వలుద విభూషణంబులు జవంబున డుల్చి చెలంగి వస్త్రముల్ | 10 |
వ. | అయ్యవసరంబున. | 11 |
సీ. | అంగుష్ఠములు ముట్టి యంఘ్రితలంబులఁ | |
తే. | క్రమము మీఱఁగ నిరతాభిరతి దలిర్ప | |
| జాలి నీరేజపత్రలోచనల నెల్ల | 12 |
చ. | [2]జలములుచొచ్చి యీఁదునెడ సారసనేత్రల మోముఁదమ్ములుం | 13 |
ఉ. | పాటలగంధులెల్ల మురిపంబులఁ బంతము లెక్కఁ జల్లుఁ బో | 14 |
క. | కరకమలము లాననపం | 15 |
తే. | అధరరాగంబు గన్నులయందుఁ జేరె | 16 |
వ. | ఇవ్విధంబున జలక్రీడావినోదంబులు సలిపి యలసతం జెంది | 17 |
చ. | తడిసిన మేలివస్త్రములఁ దార్కొని మేనులసోయగంబు వె | 18 |
చ. | జలములు జాఱఁగాఁ జికురజాలము మించె సుధాంశు మ్రింగి త | 19 |
తే. | ఇట్టి చెలువంబు చూపఱ కింపొనర్ప | 20 |
ఉ. | బారుపటీరపంకమునఁ జాలఁగఁ బన్నిరు పోసి మంచిక | 21 |
తే. | ముత్తియంబుల కమ్మలు ముంగరలును | 22 |
క. | కురులు కొనగోళ్లచే దు | 23 |
వ. | ఇవ్విధంబున నవ్విలాసినులు చీనిచీనాంబరసుగంధానులేప | 24 |
సీ. | ముఖచంద్రరోచులు మోహరించినఁ జూచి | |
తే. | వఱలి మట్టియ లందియల్ సరవి మొరయఁ | 25 |
వ. | అయ్యవసరంబున. | 26 |
క. | ఒక్క కమలాక్షి యలసతఁ | 27 |
ఆ. | నెలఁత యొక్కతె పాపట నెరులు దిద్ద | 28 |
క. | ఒకకోమలి యమ్మునినా | 29 |
తే. | జపము సన్నంపుటెలుఁగున జరపు నతనిఁ | 30 |
ఉ. | వేఱొక కొందఱింతులు ప్రవీణతతో మునినాథుఁ డున్నయ | 31 |
వ. | అయ్యవసరంబున నమ్మునిచంద్రుండు తనమనఃకమలపీఠం | |
| డును బీతాంబరధరుండును శంఖచక్రగదాదిలాంఛనకలిత | 32 |
తే. | చెలియ తెచ్చిన వీణఁ గెంజేత నంది | 33 |
సీ. | తనభూషణంబులఁ దనరెడు మాణిక్య | |
తే. | నొళవు చెమరింప దివ్యపయోజనేత్ర | 34 |
వ. | అప్పుడు. | 35 |
క. | అనిమిషనాథునిబన్నము | 36 |
క. | కోయిల లదిఁ గనుఁగొని వెసఁ | 37 |
వ. | అంత. | 38 |
శా. | నాదబ్రహ్మము లక్ష్యమై మునుపులోన న్మ్రోయుచుండంగ నా | 39 |
క. | తనమనమున మును నిలిపిన | 40 |
వ. | ఇవ్విధంబున నప్పూబోడిం దప్పక చూచి తనలో నిట్లనియె. | 41 |
ఉ. | కారుమెఱుంగులెల్ల నొగిఁ గాయముగా సవరించి మేలి బం | 42 |
తే. | పలుక విహరింప నేర్చిన పసిఁడిబొమ్మ | 43 |
తే. | చంద్రమండలిమీఁద నక్షత్రపంక్తి | 44 |
చ. | ఎలమిఁ గుశేశయప్రతతి నెల్లను గెంజిగురాకుగుంపుతో | 45 |
తే. | సోగవట్రువ బాగున సొబగులైన | 46 |
క. | మానినిజంఘాయుగ మిల | 47 |
ఉ. | నిండినవేడ్క మీఱ నిట నీరరుహాయతనేత్ర రత్నపుం | 48 |
తే. | కమలములమేలుఁ జెందొవగములచెలువు | 49 |
చ. | కరభము లీడు వచ్చుననఁగాఁ దగు నెప్పుడు చేతులం బహి | 50 |
తే. | అమృత మధరంబునన్ దేజ మాననమునఁ | 51 |
తే. | రత్నకీలితకాంచసరశనచేత | 52 |
క. | వనిత జఘనంబుమీఁదుగఁ | 53 |
ఉ. | కౌను నభంబు గాని హరికమ్రవలగ్నము గాదు చూడ న | 54 |
సీ. | కుటిలవర్తన మయ్యుఁ గుంతలదేశంబు | |
తే. | శంబరారాతి యనుమేటిసార్వభౌముఁఁ | 55 |
క. | చనుఁగవయును జఘనంబును | 56 |
తే. | తనరునూగారుతో వళిత్రయము మించె | 57 |
తే. | పసిఁడికుండల కుంభికుంభములఁ జక్ర | 58 |
క. | ఈలలన బాహుయుగ్మముఁ | 59 |
క. | గణుతింపఁగ మరుశంఖము | 60 |
క. | పగడంపుఁదియ్యమోవికిఁ | 61 |
క. | హల్లకగంధికి మదనుఁడు | 62 |
తే. | పండువెన్నెలఁ గాయు నీపడఁతిమోము | 63 |
క. | ఈపడఁతి మెఱుఁగుఁజెక్కులు | |
| నేపున నలరుచుఁ జిహ్నము | 64 |
క. | రమణికి నాసిక తనరెను | 65 |
తే. | మించు బవిరెలకెంపులు మేలువాలుఁ | 66 |
తే. | వెల్లదామరఱేకుల విరియఁదోలి | 67 |
ఉ. | వ మ్మొకయింత లేక నిడువాలిక బాగును సోగలాగునున్ | 68 |
చ. | కమలజుఁ డీవధూటియలికం బటు చూచి మునిద్రుమప్రసూ | 69 |
చ. | పొలఁతిముఖాబ్దసంపదలఁ బొందఁ దలంచియొ చంద్రుఁ డబ్జతన్ | 70 |
చ. | తరుణిముఖారవిందమునఁ దానకమై విలసిల్లు తుమ్మెద | 71 |
ఉ. | అన్న సరోజగర్భుఁ డనయంబుగ దర్శనిశన్ బ్రభాతమున్ | 72 |
వ. | అని యివ్విధంబున నమ్మునీంద్రుం డయ్యిందువదన సకలా | 73 |
సీ. | కిసలయంబులమేలు కెందామరలఁ గూర్చి | |
| గజకుంభముల బాగు కందుకంబులఁ గూర్చి | |
తే. | బర్హములమేలు షట్పదపంక్తిఁ గూర్చి | 74 |
క. | కనుఁగొనెడు యోగివల్లభు | 75 |
వ. | అయ్యవసరంబున నయ్యతివరుం డాత్మాధీనుం డయ్యెనని | 76 |
ఉ. | ఆరమణీశిరోమణి నయంబున నమ్మునినాథుఁ జేరి యొ | 77 |
సీ. | ప్రవహించు శృంగారరసవూర మమ్ముని | |
| [16]మవ్వంపుఁదేనియల్ చివ్వున నిడువాక్య | |
తే. | యమృతరసములు చిప్పిలు నధరబింబ | 78 |
తే. | స్వర్గసౌఖ్యంబులకు నెల్ల సంయమీంద్ర | 79 |
క. | విను మట్టియేను నిన్నుం | 80 |
క. | తనువులు నొచ్చినపిదపం | 81 |
శా. | నీ వీమోక్షము గోరి యోగముల నెంతే డస్సి డెందంబులో | |
| వేవెంటన్ జనకుండఁ గల్గు నమృతం బిచ్చోట నామోవిపై. | 82 |
సీ. | నాగుబ్బచన్ను లున్నతహేమభూమీధ్ర | |
తే. | నాయధరరుచి దేవతానాథసతత | 83 |
వ. | అని యిచ్చ నచ్చలంబు హెచ్చంజేరి మీఁదఁ జలువలు | 84 |
ఉ. | అమ్మునినాథు నెమ్మొగమునందుఁ గటాక్షము నిల్పి రంభ లోఁ | 85 |
సీ. | పచ్చవిల్తునికాఁక నొచ్చినదేహంబు | |
తే. | నెవ్విధంబున నీవల పీఁదనేర్తు | 86 |
శా. | కంఠారావ మొనర్చె నత్తఱి మహోగ్రస్ఫూర్తి దిఙ్నాగముల్ | 87 |
క. | భూపాలక విను తుల్యుఁడు | 88 |
ఉ. | ఓసి దురాత్మురాల, వినయోక్తులచే నను వెఱ్ఱిఁ జేయు పే | 89 |
వ. | అని శపియించిన. | 90 |
సీ. | సైంహికేయచ్ఛన్నచంద్రబింబమురీతి | |
తే. | నొదవు చంపకవాసన కులికిపఱచు | 91 |
ఉ. | అత్తఱిఁ గొంతసేపునకు నయ్యెలనాఁగ మనంబు ధీరతా | 92 |
మ. | మునిచూడామణి నీమనంబు కినుకం బొందంగ లక్ష్యం బఱన్ | 93 |
మ. | అనఘా, పిచ్చుకమీఁద వేయుదురె బ్రహ్మాస్త్రంబు రౌద్రాకృతిన్ | 94 |
సీ. | విటుఁడు పల్లొత్తినఁ గటకటపడుమోవి | |
తే. | సంతతము మందగమనాలసంబులైన | 95 |
వ. | అని తనలోన. | 96 |
ఉ. | కూరిమితోడఁ జేరి నలకూబరు నంతటివాఁడు మత్పదాం | 97 |
వ. | అని యివ్విధంబునఁ జింతించుచుఁ దోడిచెలులచందంబులు | |
| మునీంద్రుపాదారవిందంబులకుఁ బునఃపునః ప్రణామంబు | 98 |
తే. | ఎంతకాలంబునకు నాకు నేనెపమున | 99 |
క. | అని కరుణపుట్టఁ బల్కెడు | 100 |
చ. | వినయవివేకశాలి పరవీరభయంకరదోర్బలుండు కుం | 101 |
ఉ. | ఆతనికిం బురాకృతమహాసుకృతంబున మేనితోడనే | 102 |
క. | ఆనృపతికి సంతోషం | |
| మేనిచెలువంబు తొల్లిటి | 103 |
వ. | ఇవ్విధంబున ననుప నంతకుమున్న యమ్మునీంద్రుకోపంబు | 104 |
సీ. | రతిరాజు బాణసంతతి మూలఁ బడవైచి | |
తే. | జిలుకగుంపులుఁ గండుగోయిలలగములు | 105 |
వ. | ఆరంభయుఁ దనగర్వసంరంభం బుడిగి కన్నీరు దొరుఁగ | 106 |
సీ. | వనిత యమ్మునిప్రోడ వద్దనె వద్దనె | |
తే. | వకట నీనేర [19]మని యెంత యనినఫలము | 107 |
క. | అని వగచుచు నాయంగన | 108 |
వ. | తదనంతరం బారంభ తచ్ఛాపదవానలజ్వాల సోఁకి వసి | 109 |
సీ. | నెరులసౌ రళులందు నెమ్మోముసిరి చంద్రు | |
| జనుదోయిగరిమంబు చక్రవాకములందుఁ | |
తే. | నడలమురిపంబు గజగమనములయందు | 110 |
సీ. | ప్రియునికెమ్మోవి చుంబింపనోపనిలేమ | |
తే. | మిగులు మెత్తని నడుపుల మెలఁగునింతి | 111 |
వ. | ఇట్లు రంభ తురంగంబై చరించుచుండె నంత. | 112 |
ఉ. | కుండినవల్లభుండు రిపుకుంజరసింహపరాక్రముండు దో | |
| ర్తాండతనూభవుండు వనితామదనుం డొకనాఁడు వేడ్కతో | 113 |
తే. | భానుఁ డుదయాద్రిపై నున్నపగిది రత్న | 114 |
వ. | అప్పుడు. | 115 |
క. | కరికుంభజాతమౌక్తిక | 116 |
తే. | వచ్చి కడుసంభ్రమంబున వసుమతీంద్రు | 117 |
శా. | సామీ! గూడెములోని మాప్రజలు నిచ్చల్ పండుగల్ సేయుచుం | 118 |
వ. | అని విన్నవించిన నాచతుర్ధనుండు సంతసిల్లి యాచెంచు | 119 |
చ. | కలుగునె చేరువన్ బొలము కందువలన్ మృగకోటిపక్షులున్ | |
| నిలిచి ముదంబు మీఱఁగ వనేచరముఖ్యుఁడు హస్తనీరజం | 120 |
ఆ. | మెకములేమి [21]బ్రాఁతి మేదినీవల్లభ | 121 |
తే. | కారుఁగోళ్లును గౌఁజులుఁ గక్కెరలు [22]సు | 122 |
వ. | మఱియును. | 123 |
క. | కూరిమితోఁ దిరుగుచుఁ గ | 124 |
వ. | అని విన్నవించిన సంతసంబునం బొదలి వేత్రహస్తులం | 125 |
సీ. | పసిఁడివ్రాఁతల పచ్చపట్టు దట్టిగఁ గట్టి | |
| గరుడపచ్చలమించు కడియాలు ధరియించి | |
తే. | జమునినాలుకఁ బురణింపఁ జాలునట్టి | 126 |
వ. | ఇవ్విధంబున మృగయోచితశృంగారంబు నంగీకరించి నిజ | |
| కత్తెరల నెత్తుడుతెరలను బూని తమమేనిపొంకంబులును | 127 |
సీ. | నీలికాసెలమీఁదఁ గీలుకొల్పినయట్టి | |
తే. | జెలఁగి తలముళ్లు వాకట్టు తిలకములును | 128 |
వ. | అందు. | 129 |
సీ. | ఎరమీఁదీపులినైన గొఱియచందంబునఁ | |
| జాలఁ గోపించిన శరభాధిపంబునై | |
తే. | ఘోరమృగముల గమియించుకొని ప్రతాప | 130 |
వ. | ఇవ్విధంబునఁ బ్రబలంబు లగుశబరబలంబులు గొలువ నాత్మ | 131 |
క. | ముందటఁ గనియెన్ నరపతి | 132 |
వ. | ఇట్లు గనుంగొని చొత్తెంచి యందు. | 133 |
క. | తగువారలుఁ దానును నా | 134 |
క. | కీలెఱిఁగి వలలు పన్నుఁడు | 135 |
వ. | అని యాన తిచ్చుటయుఁ జెంచు లుచ్చులుపెట్టిన నెలవుల | |
| తోరణంబుల గతిం గట్టియు, బోనులు మాఁటియు, మెకం | 136 |
ఉ. | ఆతమగంబుపై నరవరాగ్రణి సమ్ముఖవర్తిమానవ | 137 |
వ. | అయ్యవసరంబున మేఁతలవెంబడి మూతులు సాఁచి తల | |
| తిరుగు భల్లూకంబులను, నిచ్చకువచ్చు మృగము నలిమి | 138 |
సీ. | విపులధ్వనికి నుల్కి విపినాంతరము నెల్లఁ | |
| తెరలచందము గని వెఱచి తీవ్రంబుగా | |
తే. | వెనుకవారలు తఱుమంగ వేగిరమునఁ | 139 |
క. | అప్పుడు ధరణీకాంతుఁడు | 140 |
క. | ఎందును బథికులు పొడఁగని | 141 |
క. | కలకలము సేయు మనుజుల | 142 |
క. | ఏరీతి నోర్తు నే భూ | |
| దారత్వముఁ గైకొనెనని | 143 |
తే. | ఖడ్గినై యుండు టెఱిఁగియు గణన సేయ | 144 |
చ. | తరగనియట్టి దానజలధారలచేఁ గనుపట్టు కుంభినీ | 145 |
ఆ. | సకలమహిషసమూహంబు సంహరించి | 146 |
వ. | వెండియు. | 147 |
సీ. | కొలఁది మీఱినయట్టి కొమ్ములు నెమ్ములుఁ | |
తే. | నెఱుఁగరాకుండఁ జక్కుగాఁ దఱిగినట్లు | 148 |
వ. | ఇవ్విధంబున నమ్మహీవరుండు మృగంబులం జంపి యంత | 149 |
చ. | బలమునఁ దీవ్రతన్ హరులపాటివి యంచు నుతించి కుక్కలం | |
| బులుల నెలుంగులం బ్రిదిలిపోవఁగనీయక యొక్కటొక్కటే | 150 |
చ. | కనుఁగవఁ గట్టినట్టి కుడుకల్ దలఁగించి మృగాలినెల్లఁ గ్ర | 151 |
తే. | ఉరులఁ గొమ్ములను ధరించు హరిణతతుల | 152 |
తే. | ఇవ్విధంబునఁ దమనేర్పు లెల్లఁ జూపు | 153 |
క. | బలుసాళువముల నోరణ | 154 |
వ. | ఇట్లు వేఁటలాడి చాలించి ప్రాణంబులతోడఁ గస్తూరిమృగం | |
| మాంసంబులు దోరహత్తుగా నిచ్చి యొక్కరమ్యప్రదేశం | 155 |
ఉ. | నేతులు గారు మాంసముల నిగ్గులు గ్రమ్మెడు నీరు ద్రెళ్లఁగాఁ | 156 |
క. | మనమున మృగయాక్రీడలు | 157 |
క. | పరుషఖలీనముతో భా | 158 |
తే. | కని తదంతికమునకు నజ్జనవరేణ్యుఁ | 159 |
క. | పదములచొప్పును వడియొ | 160 |
సీ. | సురలోకముననుండి ధరణీతలంబున | |
తే. | కాకయుండిన నీశుభ్రకాంతిమహిమ | 161 |
క. | అని బహువిధములఁ బలుకుచు | 162 |
తే. | అరిగి నిజమందిరముఁ జొచ్చి యత్తురంగ | 163 |
వ. | వెండియు హృద్యఖాద్యవిశేషంబులం బోషించుచు నొక్క | 164 |
క. | ఏవనమున వేఁటాడం | |
| బేవిధమున మెలఁగెడినో | 165 |
క. | కావున విూ రీక్షణమున | 166 |
తే. | అనుడు మంత్రులు సర్వసిద్ధాంతవిదుల | 167 |
వ. | అని శుకయోగీంద్రుం డిలావంతునకు నెఱింగించిన | 168 |
శా. | అంభోజాతభవాన్వయాంబునిధితారాధీశ భోగింద్రది | 169 |
క. | బాహసితీక్ష్ణధారా | 170 |
సుగంధి. | తారకాశశాంకకుంద తారకాశమల్లికా | |
| హారనాగ పుండరీక హారనాగ రాజ నీ | 171 |
గద్యము. | ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ | |
- ↑ వలదురుభూషణంబులు
- ↑ చలమునఁ జొచ్చి
- ↑ దేలఁగన్
- ↑ జల్లిబొట్టలు
- ↑ గ్రమ్మఁ జెమటల
- ↑ జార్చిన
- ↑ స్వాదోత్కర్షము
- ↑ నివాసకవాటబద్ధతోరణ
- ↑ భాసుర
- ↑ మణిదీప్తికినై
- ↑ నోపమినో
- ↑ రాగదము గాఁగఁ
- ↑ తదిందురేఖనున్
- ↑ ఛాయలు
- ↑ మందహాసవికాసమహిమంబు చందనపంకంబుగా సమర్పణ మొనర్చి
- ↑ అచ్చపుఁదేనియల్ విచ్చిలు మృదువాక్య
- ↑ సంభ్రమారంభ
- ↑ యొదిగె జిక్క, వలుసు రాయంచ
- ↑ మే మని యెంతు నబల, ముట్టినను గందు
- ↑ నుడికార
- ↑ భాతి; భ్యాతి
- ↑ మ, యూరములును
- ↑ గోడలజాడలం బొదలి... నొత్తుకత్తెర లన లొప్పుతెరలనుం
- ↑ గుడి
- ↑ బొల్పుగన్
- ↑ వగలం దగిలి
- ↑ తెందేఁపలు గాఁగ నిన్నుఁ దిట్టుదురను నీ
- ↑ గలదె
- ↑ దూలి జాలి