చర్చ:పోతన తెలుగు భాగవతము

తాజా వ్యాఖ్య: దింపుకొనే పుస్తకంలోని లోపాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

నంబర్లు?

మార్చు

+Rajasekhar1961 గారు నమస్తే అష్టమ స్కంధలో నం ఉన్నాయి అని అడిగారు కదండి. చాలా ఉపయోగకరంగా అడిగారు. ఇలాంటి విషయాలు ఎత్తి చూపి సాయం చేసేవాళ్ళు కావాలని చాలా రోజులుగా పరితపించా. మీరు చూపుతున్న అభిమానానికి శ్రద్ధకి అనేక ధన్యవాదాలు. ఆ నంబర్లు 14గురు మునువుల వరుస నంబర్లు. నేను ఈ విషయసూచిక పేజీలో కొంత అర్థమయ్యేలా మార్చాను. గమనించగోర్తాను. - Telugubhagavatam (చర్చ) 09:01, 14 సెప్టెంబరు 2013

దింపుకొనే పుస్తకంలోని లోపాలు

మార్చు

అర్జున గారు, దీనిని దింపుకొనే పుస్తకంగా చేశాను. ఒకసారి చూసి ఇంకా చేయాల్సిన పనుల్ని సూచించండి.--Rajasekhar1961 (చర్చ) 05:18, 28 ఏప్రిల్ 2016 (UTC)Reply

Rajasekhar1961 గారికి, ఇది ముద్రింపబడని పుస్తకం. దింపుకొనేవి ముద్రించినవాటికే పరిమితంచేయటం మంచిది. --అర్జున (చర్చ) 03:50, 29 ఏప్రిల్ 2016 (UTC)Reply
Rajasekhar1961 గారికి, అర్జున గారికి నమస్కారములు. పోతన తెలుగు భాగవతాన్ని దిగుమతి పుస్తకంగా చేయటాన్ని నేను పూర్తిగా సమర్థిస్తాను. కాని ఈ విషయంలో ::కొన్ని సూచనలు:
పోతన రచన ఆరువందల క్రితంది కనుక ఇది పబ్లిక్ డొమైనులోకి వస్తుంది. అది ఉచితంగా అందించటం కనుక ఆహ్వానించదగినది. పోతన భాగవతం పద్యాల భాగం అనేక ప్రుచురణలు ముద్రింపబడ్డాయి కనుక దీనిని అందించటం సముచితమే. పైగా కాగితం పుస్తకాలు అందక ఎందరో బాధపడుతున్నారు. ఇది ఒక పుస్తకంగా కాకుండా కనీసం 15 పుస్తకాలుగా చేయవలెను, లేనిచో చదువరులకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఇప్పడు దిగుమతి అవుతున్నది ఆకారాది విషయసూచిక (సుమారు 1200 ప్లస్ పుటలు) (ఇది నా స్వీయ సంకలనం) మరియు స్కంధాలు, ఘట్టాలు జాబితాలు మాత్రమే 1247 పుటలు వస్తున్నాయి. అన్నిటికన్నా పెద్దదైన దశమ స్కంధం ఒక్కటి పుస్తకంగా చేస్తే సుమారు ఇన్ని పుటలు వస్తాయి (1800 పద్యాలు x 5 లేదా 6 పంక్తులు వేసుకుంటే 10000 పైగా పంక్తులు కావాలి). ఇదే సంకలనం మొత్తం తెలుగుభాగవతం.ఆర్గ్ లో XML DATA based గా ఉన్నది. ఆ జాలగూడులో అనేక ముద్రారాక్షసాలను సరిచేసాము. కాని అవన్నీ ఇక్కడ కూడా సమాంతరంగా చేయలేకపోయాను. విడిగా చేయాలన్నా వీలు కాదు. మనలో ఎవరైనా దయచేసి ఆ XML DATA నుంచి ఇక్కడకు లింకు చేయగలిగితే అక్షరదోషాలు లేని ప్రతి సిద్ధం (యతి, ప్రాసల గుర్తింపుతో సహా) అవుతుంది. ఒక్కొక్క స్కంధం ఒక్కొక్క పుస్తకంగా సిద్ధం చేయవచ్చు. ఇప్పుడు ఉన్న టేబుల్ ఫార్మెట్టు వలన కొంత సరిచేయటానికి కూడ ఇబ్బంది ఉన్నది. అందువలన కూడా ఈ ఫారమెట్టు కూడ పేరాలు ఫార్మెట్టుకి మార్చవలసి ఉన్నది. ఈ పాఠంమార్చటానికి TeXt నుంచి అంటే కనీసం ~ 640 ఘట్టాలకు 640 దస్త్రాలు తీసుకుని, దానికి వికీ కోడింగు జేర్చి, ఒక్కొక్కటి కాపీ పేస్టు చేయాలి. అందుకని ఎలాగా ఆన్ లైనులో ఉంది కనుక దానిని వాడుకుంటే బావుంటుంది అని నా విన్నపం. ఇది అవకాశం లేదు అంటే, ఏవరైనా సాయం చేస్తామంటే (సాంకేతికంగా కానీ మరోలా కాని కోడింగుకి / లోడింగుకి) నేను పాఠ్యదస్త్రాలను దిగుమతి చేసి ఇస్తాను. ప్రతి పుస్తకానికి హెడ్డరు, పుట్టరు, పుట సంఖ్య మున్నగునవి అవసరముంటుంది ఆ వివరాలు మరల చర్చించగలను. Telugubhagavatam (చర్చ)

గణనాధ్యాయి 17:15, 14 మే 2016 (UTC)

Telugubhagavatam గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. దింపుకొదగిన ప్రతి విషయం ఎలావున్నా, ఇప్పటికే మూలంలో సరిచేసిన కూర్పుని వికీసోర్స్ లో సరిచేయటం ప్రధానం. తెలుగు వికీలలో సాంకేతిక సహాయం చేయగలవారు చాలా తక్కువ. సిఐఎస్ సంస్థాపరంగా ఏమైనా సహాయం అందగలదేమో వాడుకరి:Pavan_santhosh.s స్పందించమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 21:46, 16 మే 2016 (UTC)Reply
:::

అర్జున గారికి మీ ఆత్మీయస్పందనకు అనేక ధన్యవాదములు వాడుకరి:Pavan_santhosh.s గారూ దయచేసి సాయం చేసిపెట్టండి. XML తో వీలుకాదంటే నేను సరిదిద్దిన పద్యాలను ఎక్సెల్లు నందు వికి కోడింగుతో పంపమనిన పంపగలను, ఈ సరిదిద్దిన పద్యాలను అన్ని ఘట్టాలకి రీప్లేసింగు చేయించి పెట్టాలి. వారం పది రోజులలో పంపగలను. ఉదా- దయచేసి గమనించండి ఎడిట్ మోడ్ లో కనబడేలా అందించ గలను.

ప్రథమ స్కంధము

====(భా-1-1-శా.)====

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

====(భా-1-2-ఉ.)====

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా


Telugubhagavatam (చర్చ) గణనాధ్యాయి 06:09, 19 మే 2016 (UTC)Reply

Telugubhagavatam, అర్జున రావు గార్లకు ఈ అంశంలో బహుశా వికీ మార్కప్ కోడ్ లోని పాఠ్యాన్ని తెవికీసోర్సు పేజీల్లోకి చేర్చడంలో సహకారం కోరుతున్నారని భావిస్తున్నాను. ఐనా ఈ విషయాన్ని సుస్పష్టంగా అవగాహన చేసుకుందుకు, సాంకేతిక సాధ్యతను అనుసరించి కార్యాచరణ ఎలా ఉండవచ్చన్న దానిపైన చర్చించేందుకు సాంబశివరావు గారికి మెయిల్ పంపాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:57, 13 ఆగష్టు 2016 (UTC)
Rajasekhar1961, అర్జున రావు, పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గార్లకు మీరు చూపుతున్న ఆదరాభిమానాలకు అనేక ధన్యవాదములు. మన్నించాలి నాకు మీరు పంపిన వికీ వేగరి (మైలు) చూడడం రాలేదు.పంపడం రాదు. . అందుచేత మిత్రులు Rajasekhar1961 గారకి వ్యక్తిగత వేగరి పంపాను. మన్నింపదగినవాడను. సరిదిద్దిన తెలుగు భాగవతం ప్రతి వికీ కోడింగు జత చేసిన దస్త్రములు (640+) ఘట్టాలకు తయారు చేశాను. కాని ఎక్కించడానికి నాకు సమయాభావం వలన ఇబ్బంది పడుతున్నాను. . గణనాధ్యాయి 06:49, 13 ఆగష్టు 2016 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) ఈ పుస్తకం 201803 లో 10 అత్యధిక వీక్షణలు కలవాటిలో వున్నది కావున, ఈ చర్చకు అర్ధవంతమైన ముగింపు చేస్తే మంచిది.--అర్జున (చర్చ) 01:03, 5 ఏప్రిల్ 2018 (UTC)Reply
Telugubhagavatam గారికి,ఈ పుస్తకం మెరుగు చేయటం ఎంతవరకు వచ్చిందో తెలపగలరు. పిడిఎఫ్ మూలం లేకుండా ఈ పుస్తకము నాణ్యతను పరిరక్షించడం కష్టం. పిడిఎఫ్ పుస్తకం కూడా చేరిస్తే మంచిది.--అర్జున (చర్చ) 06:03, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply
అర్జున , Rajasekhar1961 మాన్యులకు నమస్కారములు.. అనేక దోషాలు పరిష్కరించి మెరుగు పరచడం చేసానండి. పిడిఎప్ చేర్చుట ఎలాగో నాకు తెలియుటలేదండి. దయచేసి ఎవరైనా సాయం చేయమనవి. స్కంధానికి ఒక పుస్తకము, అకారాది ఒక పుస్తకము గా మొత్తం 15 పుస్తకములు చేయవలెనండి. దశమ స్కంధం పూర్వ, ఉత్తర భాగాలు రెండూ కొద్దిగా పెద్ద పుస్తకాలు అవుతాయండి. వీలయితే 11, 12 స్కంధాలు కలిపి ఒక పుస్తకం చేయవచ్చండి. అలా అయితే 14 పుస్తకాలు తయారవుతాయండి.. పుస్తకాలు మాత్రం ఉచితంగానే అందించాలన్నది నా అభిమతం..Lalitha53 (చర్చ) 08:03, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply
:::::

Telugubhagavatam,Lalitha53 గార్లకు, మీరు ఒక్కో స్కంధాన్ని మీరు వాడే పాఠ్య ఉపకరణం (Microsoft Word/Libreoffice Writer) లో రూపు దిద్దండి. దానిలో pdf భద్రపరచే ఆదేశం వాడి లేక pdf కు ముద్రించు ఆదేశం వాడి pdf తయారుచేయవచ్చు. --అర్జున (చర్చ) 04:01, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply

అర్జున , Rajasekhar1961 గార్లకు నమస్కారములు.. తెవికే పుస్తకములు అని నా ఉద్దేశము. నాకు పిడిఫ్ చేయటంలో ఇబ్బందేమీ లేదండి.. ఎవరైనా అడిగితే ఇస్తుంటాను. పుస్తకాలువికేలో ఎక్కించవచ్చంటే. ప్రయత్నిస్తా నండి. Lalitha53 (చర్చ) 11:52, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply
Lalitha53 గారికి, మంచిది. నేను మీకు ఈమెయిల్ చిరునామా SMS లో పంపాను. తొలి పుస్తకం ఈమెయిల్ లో పంపండి. నేను చూసి స్పందిస్తాను. --అర్జున (చర్చ) 11:57, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply
Return to "పోతన తెలుగు భాగవతము" page.