శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః
గోపీనాథ రామాయణము
అయోధ్యాకాండము
|
రాధాకుచకుంకుమ
సారాంకితతారహారసంకలితవిశా
లోరస్థలయాశ్రితమం
దారా నవనీతచోర నందకుమారా.
| 1
|
వ. |
దేవా అవధరింపుము కుశీలవు లగుకుశలవు లవ్వలికథ యిట్లని చదువం
దొడంగి రిట్లు పితృభ్రాత్రనుజ్ఞానంతరంబునఁ గామాదివికారరహితుం డగు
శత్రుఘ్నుండు తనయన్న యగులక్ష్మణుండు బలవంతుం డగురామున కాశ్రితుం
డయ్యె నాచేతను మహదాశ్రయంబు కర్తవ్యం బని తలంచి కలుషబుద్ధి
రహితుం డై మాతులగృహంబునకుం జను భరతునిచేత మాతులగృహవాస
జనితసౌఖ్యం బే నొక్కరుండ ననుభవించుట సముచితంబు గాదనుబుద్ధిచేత
నీతుం డై భరతవిషయస్నేహపురస్కృతుండై యతనివెంటం జనియె.
| 2
|
భరతుండు శత్రుఘ్నసమేతుఁ డై తనమాతులగృహంబునకుం జనుట
ఉ. |
ఆతతతేజుఁ డాభరతుఁ డచ్చట భ్రాతృసమన్వితంబుగాఁ
జాతురి మీఱ నిత్యమును సత్కృతి సత్కృతుఁ డై కృపాలుఁ డా
మాతులుఁ డద్భుతక్రియఁ గుమారకవత్సలతం గడంగి వి
ఖ్యాతిగ గారవింపఁ జెలువాడుచు నుండె ముదం బెలర్పఁగన్.
| 3
|
తే. |
అభిమతపదార్థములచేత నచటఁ దర్ప్య
మాణు లయుఁ నయ్యిరువురు మానసమున
వృద్ధనృపుఁ డైనతండ్రిని వీరుఁ డైన
రామునిఁ దలంచుచుండిరి రమణతోడ.
| 4
|
క. |
జననాథుండును జిత్తం, బున నిత్యముఁ దలఁచుచుండెఁ బ్రోషితసుతులన్
ఘనుల భరతశత్రుఘ్నుల, ననిమిషపతి వరుణనిభుల నర్కప్రభులన్.
| 5
|
ఉ. |
ఆనరనాథమౌళికి నిజాంగజబాహుచతుష్టయంబుచం
దానఁ జెలంగు నిష్టగుణధన్యకుమారచతుష్టయంబులోఁ
జానుగ వేల్పులం దజుఁడు చక్రికిఁ బోలె ఘనుండు జానకీ
జాని యహర్నిశంబుఁ బటుసమ్మదదాయకుఁ డయ్యె నెంతయున్.
| 6
|
తే. |
ఆరఘూత్తముఁ డతిదుస్సహప్రతాప, కలితుఁ డగు రావణుని చేటుఁ దలఁచు దివిజ
వరులచేఁ బ్రార్థితుం డయి వసుధ నవత, రించిన మాధవుఁడు గాఁడె యెంచి చూడ.
| 7
|
ఆ. |
అమితతేజుఁ డైన యక్కుమారునిచేత, జనని ముదముఁ గాంచె సంతతంబు
దేవవిభునిచేత దివిజలోకమున స, మ్మదముఁ గన్న దేవమాతకరణి.
| 8
|
ఆ. |
అతఁడు వీర్యవంతుఁ డనసూయకుండు రూ, పోపపన్నుఁ డెన్న నుర్వి ననుప
మానసూనుఁ డతులమానధనుఁడు దశ, రథసముండు సుగుణరాజికలన.
| 9
|
క. |
ఒరులు పరుసంబు లాడిన, నురుమతిఁ బేశలసుధామయోక్తులఁ దగ ను
త్తర మిచ్చు గాని కినుక, న్బరుషోత్తర మీఁడు శాంతభావుం డగుటన్.
| 10
|
క. |
అపకృతులు నూ ఱొనర్చియు, నుపకృతి యొక టాచరింప నుత్తమమతి న
య్యుపకృతియె తలఁచుఁ గాక, య్యపకృతులఁ దలంపఁ డంచితాత్ముం డగుటన్.
| 11
|
తే. |
ఆమహీశ కుమారపుష్పాస్త్రుఁ డనిశ, మస్త్రయోగాంతరములయందైన ప్రమద
మెసఁగ శీలవయోజ్ఞానవృద్ధు లైన, సజ్జనులతోడ సద్గోష్ఠి సలుపుచుండు.
| 12
|
ఆ. |
బుద్ధిమత్తరుండు పూర్వభాషియుఁ బ్రియ, భాషి మధురమంజుభాషి యైన
జానకీప్రియుఁడు చటులపరాక్రమ, క్రమణశీలుఁ డయ్యు గర్వి గాఁడు.
| 13
|
మత్తకోకిల. |
వృద్ధసేవియు సత్యవాదియు విప్రపూజనతత్పరుం
డిద్ధతేజుఁడు వీర్యశాలి దినేంద్రవంశలలాముఁ డా
పద్ధరుండు ప్రశాంతచిత్తుఁడు పండితుండును దుష్టసం
పద్ధరుండు మహానుభావుఁడు భద్రమూర్తి దలంపఁగాన్.
| 14
|
క. |
నానావిధసద్గుణములు, జానుగ రంజిల్లఁ జేయు సతతముఁ బ్రజలన్
నానావిధసంస్తవముల, మానుగ ననురక్తుఁ డగును మఱి ప్రజచేతన్.
| 15
|
క. |
సదయుఁడు జితకోపుఁడు భూ, త్రిదశప్రతిపూజకుఁడును దీనావనుఁడు
న్విదితాఖలధర్ముం డతి, వదాన్యుఁడును శుచియు నియమవంతుఁడు ధాత్రిన్.
| 16
|
వ. |
మఱియు నిక్ష్వాకుకులోచితదయాదాక్షిణ్యశరణాగతరక్షణాది ధర్మైకప్రవణ
బుద్ధి యై దుష్టనిగ్రహపూర్వకశిష్టప్రతిపాలనరూపం బగుస్వకీయక్షత్ర
ధర్మంబు బహుమానించుచు క్షత్రధర్మసంజాతకీర్తిచేత నతిశయితం బగుస్వర్గ
|
|
|
ఫలంబు సాధ్యం బని యెఱింగి నిషిద్ధకర్మంబునందును విరుద్ధకథలయందును
సంసక్తుఁడు గాక బృహస్పతియుం బోలె నుత్తరోత్తరప్రమాణోపన్యాసచతు
రుండై యుండు మఱియును.
| 17
|
మ. |
రవితేజుండును వాగ్మియుం బురుషసారజ్ఞుండు లోకైకనా
థువరేణ్యుండు నరోగుఁడుం వరుణుఁ డెందున్ దేశకాలజ్ఞుఁ డి
ద్ధనపుష్మంతుఁడు నైనరాముఁ డలరెన్ ధాత్రీప్రజాశ్రేణి కా
ర్యవితానస్తుతసద్గుణంబుల బహిఃప్రాణంబుచందంబునన్.
| 18
|
శా. |
వేదజ్ఞుండు తడంగపారగుఁడు సద్విద్యావ్రతస్నాతుఁడున్
సాధుగ్రామణి సత్యవాది ఋజుఁడు న్శాంతుండు దాంతుండు ని
త్యాదీనుండును మంగళాభిజనుఁ డిష్వస్త్రంబులందుం గృతా
మోదుం డాతఁడు తండ్రికంటె ఘనుఁ డై భూమండలిన్ భాసిలెన్.
| 19
|
తే. |
వెలయ ధర్మార్థవిదు లగువృద్ధభూసు, రాగ్రణులచేత సంతత మభివినీతుఁ
డమితగుణధాముఁ డినధాముఁ డరివిరాముఁ, డవనిజాకాముఁ డంబుదశ్యాముఁ డతఁడు.
| 20
|
క. |
ప్రతిభానస్మృతిమంతుం, డతులగుణుఁడు లౌకికసమయాచారమునం
గృతకల్పుఁడు గోవిదుఁ డు, న్నతుఁడును ధర్మార్థకామతత్త్వజ్ఞుండున్.
| 21
|
తే. |
గుప్తమంత్రుండు మంత్రాంగకోవిదుండు, ఘనుఁడు నిభృతుఁడు సంభృతాకారుఁ డమిత
సత్త్వవంతుఁ డమోఘరోషప్రసాధుఁ, డసదృశుఁడు త్యాగసంయమావసరవిదుఁడు.
| 22
|
మ. |
పరమోదారుఁ డదుర్వచస్కుఁడు స్థిరప్రజ్ఞుండు సద్గ్రాహియున్
సరనుండుం బురుషాంతరజ్ఞుఁడు కృతజ్ఞశ్రేష్ఠుఁడున్ నారశా
స్త్రరతుం డుజ్జ్వలుఁ డాత్మదోషపరదోషజ్ఞుండు నిస్తంద్రుఁడున్
గరుణాసింధుఁడు నప్రమత్తుఁడు త్రిలోకఖ్యాతచారిత్రుఁడున్.
| 23
|
తే. |
అరయ సత్సంగ్రహప్రగ్రహణములందు, బ్రగ్రహానుగ్రహములందు రాజనీతు
లందు న్యాయవిచక్షణుం డనఁగ మఱియు, నిగ్రహస్థానవిదుఁ డన నెగడు నతఁడు.
| 24
|
వ. |
మఱియు బుష్పంబువలన మధుకరంబునుంబోలెఁ బ్రజలవలనఁ బీడనంబు
లేకుండ నుపాయంబున ధనం బార్జించి శాస్త్రదృష్టవ్యయకర్మజ్ఞుండై యొప్పు
మఱియు న్యాయవైశేషికవేదాంతాదిశాస్త్రసమూహంబులందును సంస్కృత
ప్రాకృతాదిభాషాత్మకకావ్యనాటకాలంకారాదులయందును నిపుణత్వంబు
|
|
|
నొంది యుండుధర్మార్థంబులు సంగ్రహించి సుఖతంత్రుం డై కర్తవ్యకార్యం
బులయం దుత్సాహంబు గలిగి యలరు నదియునుంగాక.
| 25
|
క. |
వారణతురంగచయవిస, యారోహములందుఁ జతురుఁ డార్యనుతుఁడు వై
హారికశిల్పజ్ఞాతయు, వీరోత్తముఁ డర్థభాగవిదుఁడు దలంపన్.
| 26
|
చ. |
అతిరథసమ్మతుండు నిఖలారిహరుండు చమూనయజ్ఞుఁడున్
వితతధనుష్కళావిదుఁడు వీరుల కెల్లను మేలుబంతి యా
తతసమరంబులందు సురదైత్యుల కెల్ల నసాధ్యవిక్రముం
డతని కతండె నాటి సుజనాభినుతాతతసద్గుణంబులన్.
| 27
|
క. |
జితకోపుం డనసూయుఁడు, మతిమంతుఁ డదృప్తకుం డమత్సరుఁడు జగ
ద్ధితుఁడు నయకోవిదుఁడు సు, వ్రతుఁడు బలాఢ్యుం డకాలవశగతుఁ డుర్విన్.
| 28
|
క. |
అతులితమతిచే వాచ, స్పతికిన్ సాటి యగువాఁడు శౌర్యమున దివ
స్పతికిం బ్రతివాది సము, న్నతసత్త్వమునం బ్రభంజనప్రతిముఁ డిలన్.
| 29
|
క. |
ధారుణికిం గలక్షమయును, సారసబాణునకుఁ గలుగుచక్కఁదనంబు
న్మేరువునకుఁ గలధైర్యం, బారఘుపతియందుఁ బొల్చు నద్భుతలీలన్.
| 30
|
వ. |
ఇట్లు సర్వప్రజాకాంతంబులును జనకునకుఁ బ్రీతిసంజననంబులు నైన ప్రసిద్ధగు
ణంబులచేత నారాముండు కిరణంబులచేతఁ బ్రదీప్తుం డగుసహస్రాంశునిచం
దంబున నభిరాముం డయ్యె మఱియును.
| 31
|
క. |
ఏవంవిధ గుణగణసం, భావితునిఁ బ్రచండవిక్రమక్రము నఖిలా
శావరసము రామునిఁ బృ, థ్వీవనజాతాక్షి దనకు విభుఁ డని తలఁచెన్.
| 32
|
తే. |
ఇట్టు లసమానబహుగుణహితుఁడు నైన, సుతునిఁ గనుఁగొని దశరథక్షితిబలారి
శేఖరుఁడు దనమదిలోనఁ జింతఁ జేసె, సకలజనహితహేతువిచారుఁ డగుచు.
| 33
|
క. |
ఘనవృద్ధుఁడు చిరజీవియు, ననయుం డగునృపతి కేను సప్రాణుఁడ నై
మనియుండ సుతుఁడు స్వామిత, మను టెవ్విధిఁ గలుగు ననుచు మదిఁ బ్రియ మొదవెన్.
| 34
|
ఉ. |
పొందుగ సర్వభూరమణపూజితుఁ డై సకలావని న్మహా
నందముతోడ నేలుప్రియనందనుఁ గాంచి మనంబులో ముదం
బొందుట నాకు నెన్నఁ డగునో యనునీయధికప్రియంబు లో
సందడి పెట్ట సాగె గుణశాలికి ఱేని కహర్నిశంబునున్.
| 35
|
తే. |
వృద్ధికాముండు జనుల కెవ్వేళలందు, వివిధభూతహితుండును వృష్టిమంతుఁ
డైనవర్జన్యుచందాన నధికమోద, కరుఁడు గద లోకమునకు నాకంటె నితఁడు.
| 36
|
క. |
ఈసర్వమహీభారం, బీసరణిం దాల్చుతనయు నీవయసున నే
నాసక్తితోడఁ గనుఁగొని, భాసురసురలోక మెట్లు పడయం గలనో.
| 37
|
క. |
యమశక్రతుల్యవిక్రముఁ, డమరగురుసమానబుద్ధి యవనీతులిత
క్షముఁడు నగోపమధైర్యుఁడు, కమనీయగుణోత్తరుండుగద నాకంటెన్.
| 38
|
దశరథుండు శ్రీరాముని యువరాజుగాఁ జేయం దలంపుఁ గొనుట
క. |
సతతము సముదితగుణుఁ డగు, సుతునిం గని రాజమౌళి సువిహితమతి యై
హితకార్యవిశారదబుధ, యుతుఁ డై మదిఁ దలఁచె నతని యువరాజుగఁ గాన్.
| 40
|
వ. |
మఱియు మేధావి యగుదశరథుండు దివియందుఁ బొడమినగ్రహనక్షత్రాది
వైకృతంబును నంతరిక్షంబునం బొడమినమహావాతపరివేషసంధ్యాదిగ్దాహా
దికంబును బుడమియందుం బొడమినభూకంపశిలాపాతవృక్షరక్తస్రవణాది
కంబును మనుష్యాదిజాతివలన విజాతీయపశుపక్షిమృగాది సముత్పత్తియు
నేతాదృశత్రివిధోత్పాతసంభూతదారుణభయంబును నిజశరీరంబునందు నూఁ
దినముదిమియును బరామర్శించి సచివులకుం జెప్పి సంపూర్ణచంద్రవదనుండును
సకలసద్గుణసదనుండును సౌందర్యవిత్రాసితమదనుండును నిజకరోల్లసితచండ
కోదండవిముక్తకాండఖండితపరమహీపాలశిరోలంకృతకదనుండు నగుకుమార
మదనునకుం గలప్రియత్వంబును దనకు శోకాపనోదకారణం బైనదాని
నిరూపించి.
| 41
|
క. |
తనకును ధాత్రీప్రజలకు, ఘనభద్రముకొఱకుఁ బ్రాప్తికాలప్రియభ
క్తినయంబులచే నృపకుల, వనజవనార్కుండు త్వరితవంతుం డగుచున్.
| 42
|
వ. |
ఒక్కనాఁడు సభామందిరంబునకుం జనుదెంచి.
| 43
|
క. |
నానాపురవాస్తవ్యులు, నానాజానపదపరుల నానానృపులన్
నానాప్రధానులను మఱి, నానాహితమతులఁ దత్క్షణమె రావించెన్.
| 44
|
క. |
జనకమహీశునిఁ గేకయ, జనవల్లభు నీప్రియంబుఁ జతురత నవల
న్వినియెదరుగాక యని య, య్యనఘులఁ బిలిపింపఁ డయ్యె నతిశయయుక్తిన్.
| 45
|
క. |
తక్కిన సకలమహీశుల, నక్కజముగ సభకుఁ బిలువ నంపించి ముదం
బెక్కుడు గాఁగ మహీపతి, గ్రక్కున సామంతమంత్రిగణయుతుఁ డగుచున్.
| 46
|
క. |
నానాభరణాలంకృతుఁ, డై నీరజభవుఁడు ప్రజల నట్టులు దనచే
మానితు లైననృపాలుర, మానుగఁ గని సంతసిల్లి మహిమ దలిర్సన్.
| 47
|
క. |
ఘనరత్నఖచితసింహా, సనమునఁ గూర్చుండె రాజసము మెఱయఁగఁ ద
క్కిననృపు లుచితాసనముల, ననువుగఁ గూర్చుండి రతని కభిముఖు లగుచున్.
| 48
|
వ. |
ఇవ్విధంబున వినయవిధేయులును లబ్ధమానులును సుఖోపవిష్టులు నగుసమస్త
సభాసదులచేత నావృతుం డై యద్దశరథుండు బృందారకపరివృతుం డయిన
సహస్రాక్షునిచందంబునం దనరి కొంతవడికి సభ్యుల నందఱిఁ గలయ విలో
కించి మనోహరంబును మధురంబును దుందుభిస్వనకల్పంబును రాజలక్షణ
|
|
|
యుక్తంబును సరసంబును నిరుపమానంబును గంభీరంబును శ్రేయస్కరంబును
నానందజననంబును నర్థగరిష్ఠత్వంబుచేతఁ బ్రసిద్ధంబు నగు వచనంబు ప్రావృ
ట్కాలవారివాహగర్జాసముజ్జృంభణగంభీరస్వనంబునఁ దత్సభాంతరకుడ్యం
బులం బ్రతిధ్వనులు సెలంగ నిట్లనియె.
| 49
|
దశరథుండు సుమంత్రాదులతో శ్రీరామునకుఁ బట్టాభిషేకంబుఁ జేయ నాలోచించుట
క. |
మును మాపెద్దలు నునుముఖు లినకులదీపకులు దొల్లి యీరాజ్యంబున్
దనయునివలెఁ బాలించిన, యనువెల్లను మీకుఁ దెల్ల మైనదియె కదా.
| 50
|
తే. |
అట్టియిక్ష్వాకుకులమునఁ బుట్టినట్టి, యేనును జగంబు నోపిన ట్లింతదనుక
జాగరూకత నిత్యంబు సత్యధర్మ, హితుఁడ నై పూర్వికులభంగి నేలితిఁ గద.
| 51
|
తే. |
అట్టియేను మనుస్రముఖాఖిలాచ, లాధిపులచేత రక్షితం బగుసుఖార్హ
లోకమును రామచంద్రాభిషేకరూప, లాభయుతముగఁ జేయఁ దలంచినాఁడ.
| 52
|
తే. |
అఖలలోకహితార్ధినై యవని నేలు, నట్టినాచేత నీగాత్ర మనవరతము
నాయతసితాతపత్రసచ్ఛాయయందు, సకలజనములు చూడంగ జరిత మయ్యె.
| 53
|
శా. |
అశ్రాంతం బజితారిదుర్వహము రాజౌజస్సదాజుష్టమున్
సుశ్రేయం బగుధర్మభారము నతిస్థూలంబుగా మోచి శౌ
ర్యశ్రీసంపద దీర్ఘకాలమున జీర్ణం బైనయిమ్మేనికిన్
విశ్రాంతి న్మదిఁ గోరినాఁడ సుతు నుర్వీవల్లభుం జేసెదన్.
| 54
|
క. |
సురపతిసమవీర్యుఁడు పర, పురమర్దనుఁ డస్మదీయపుత్రాగ్రణి సుం
దరుఁ డగురాముఁడు నాతో, సరివచ్చుం గాదె సకలసద్గుణములచేన్.
| 55
|
క. |
కావున నే నిఁక బుధసం, భావిత మగుభూసురానుమతమున సుతునిన్
భూవిభునిఁ జేసి పిమ్మట, వావిరిసుఖగోష్ఠి నుండువాఁడం జుండీ.
| 56
|
ఆ. |
పుష్యయుక్తుఁ డైనపూర్ణచంద్రునిమాడ్కి, వఱలువాని ధర్మపరులలోన
నధికుఁ డైనరాము నభినవయౌవరా, జ్యాభిషిక్తుఁ జేసి యలరువాఁడ.
| 57
|
తే. |
రమణ నెవ్వనిచే జగత్త్రయము నాథ, వత్తరం బయి యొప్పు నవ్వసుమతీసు
తాపతిఁ దలంప మీ కనురూపుఁ డైన, విభుఁడు గాదె తదాజ్ఞచే వెలయరాదె.
| 58
|
క. |
ఈసర్వమహీభారం, బాసుతుపై నునిచి ధాత్రి నతులశ్రేయ
శ్రీసంయుతఁ జేసి గత, క్లేశుఁడ నై సుఖముఁ గాంతుఁ బ్రియ మలరారన్.
| 59
|
వ. |
మఱియు నీకార్యంబు మీ కనుకూలార్థం బయ్యె నేనియు నాచేత మిక్కిలి సు
మంత్రితం బయ్యె నేనియు మీ రందఱు నా కనుజ్ఞ నొసంగుండు భవదనుమ
|
|
|
తంబు వడయక కార్యంబు నడపుట కేను సమర్థుండఁ గాను హితాహితవిచార
సామర్థ్యంబునందు నీకంటె నధికుం డెవ్వం డనవలదు యీరామాభిషేక
విషయాలోచనంబు నాకు మిక్కిలిఁ బ్రియం బై యున్న దైన నంతకంటె వేఱొ
క్కటి హితంబు గలిగెనేని యోచింపుండు విచారంబుచేత నధికఫలం బైన
మధ్యస్థాలోచనంబు స్వజనచింతావిలక్షణంబై యుండు నని పలికిన నతని విలో
కించి సభామండపాగతజను లందఱు వృష్టిమేఘంబు నవలోకించి కేకారావం
బులు సేయుశుక్లాపాంగంబులకరణి పరమానందరసపూరితహృదయులై దశర
థుని బ్రశంసించి రప్పుడు హర్షసమీరితం బైనజనోద్ఘృష్టసుస్నిగ్ధసన్నాదంబు
రాజమండపాభ్యంతరంబు నిండి చెలంగె నంత ధర్తార్థవిదుం డగుదశరథుని
యభిప్రాయం బెఱింగి బ్రాహ్మణులును రాజులును బౌరజానపదులతో నాలో
చించి నిశ్చయించి యైకమత్యంబు నొంది యమ్మహీపతి కి ట్లనిరి.
| 60
|
జనం బంతయు దశరథునితోఁ దమయభిమతంబుఁ దెల్పుట
తే. |
అనఘ బహుకాల ముర్విపై మనుటకతనఁ, గరము వృద్ధుండ వైతివి కాన నీవు
ధార్మికుం డైనరాముని ధర్మయుక్తి, కడఁగి జగతికిఁ బట్టంబు గట్టుమయ్య.
| 61
|
తే. |
విపులకాంతి శత్రుంజయద్విపము నెక్కి, యాతపత్రావృతాస్యుఁ డై యరుగుదెంచు
నట్టి రాము మహాబాహు నమితసత్వు, నెలమి వీక్షింపఁ గోరెద మలఘుచరిత.
| 62
|
జనులందఱు శ్రీరామునిగుణంబులఁ బ్రశంసించుట
వ. |
అని పలికిన విని దశరథుండు రామునిసర్వాతిశాయిత్వంబును దదభిషేకంబు
సర్వజననమ్మతం బగుటయు నెఱింగియు నెఱుంగనివాఁడపోలె స్వాభిప్రాయంబు
మాటుపఱచి ప్రజాముఖంబువలన నెఱుంగువాఁడై వారల నవలోకించి మీరు
మద్వచనశ్రవణానంతరంబున నించుక యైన విచారింపక రామునకుఁ బట్టాభి
షేకంబుఁ గావింపు మని పలికితిరి దీన నాకు సంశయంబు వొడముచున్నది
యేను ధర్మంబునఁ బృథివీచక్రంబు బాలించుచుండ యౌవరాజ్యపట్టభద్రుం
డైనమత్పుత్రు నీక్షింప నపేక్ష యేల పొడమె నెఱింగింపుం డనిన వారమ్మహీ
పతిం జూచి దేవా యేమందఱము నీచేత మిక్కిలి పరిపాలితులమైతిమి నీయందు
దోషగంధం బించుక యైన లేదు సత్యం బైనను రామునికళ్యాణగుణ
బాహుళ్యంబువలన వశీకృతచిత్తుల మైనమాచేత నిట్లు పలుకంబడియె నమ్మహా
త్ముండు దేవకల్పుండును గుణవంతుండును ధీమంతుండు నన విశ్రుతిం గన్న
వాఁ డతనియందు మంగళస్వభావంబులును నితరపురుషదుర్లభంబులు నగు
సద్గుణంబు లనేకంబులు సన్నివిష్టంబులై యుండు శత్రువులకైనఁ బ్రీతిజనకం
|
|
|
బులును ననిష్టనివారణపూర్వకేష్టప్రాపకత్వంబునఁ బరమానందజనకంబులు
నగుశౌర్యాదిగుణంబుల నెల్ల నెఱింగించెద మారాముం డిక్ష్వాకువంశజులలో
నుత్తముండు నమానుషగుణంబులచేతఁ బ్రశస్తుండును సత్యపరాక్రముండును
సత్పురుషుండును లోకసమ్మతుండును సత్యధర్మపరాయణుండును ధర్మజ్ఞుండును
సత్యప్రతిజ్ఞుండును శీలవంతుండును ననసూయకుండును క్షాంతుండును సాంత్వ
వాదియుఁ బ్రియవచనశీలుండును గృతజ్ఞుండును విజితేంద్రియుండును మృదు
స్వభావుండును నతిసంకటంబులయం దైన నంగీకృతపరిత్యాగరహితుండును
భవ్యుండును దివ్యమంగళవిగ్రహుండును భూతంబులకుఁ బ్రియరూపసత్యవాది
యు బహుశ్రుతవృద్ధబ్రాహ్మణోపాసకుండును దేవాసురమనుష్యులలోన సర్వా
స్త్రంబులయందు విశారదుండును సమ్యగ్విద్యావ్రతస్నాతుండును సాంగవేద
విదుండును గాంధర్వశాస్త్రంబునందుఁ గృతపరిశ్రముండును గల్యాణాభిజనుం
డును సాధుసమ్మతుండును క్షోభహేతుసహస్రంబులయం దైన నక్షుభితాంతః
కరణుండును మహామతియు ధర్మార్థనిపుణు లగుద్విజశ్రేష్ఠులచేత సుశిక్షితుండును
మహేష్వాసుండును వృద్ధసేవియు స్మితపూర్వాభిభాషియు నై యొప్పు నదియు
నుం గాక.
| 63
|
క. |
విలసితనృపధర్మము రా, జ్యలక్ష్మితోఁ గూడ రామచంద్రునివలనం
గలిగె నతనిచే యశ ము, జ్జ్వలతేజము కీర్తి చాల వర్ధిల్లె రహిన్.
| 64
|
చ. |
అతులమనీషచే నలబృహస్పతితో సరి సేయఁగాఁ దగున్
హితఘనవిక్రమంబున నరేంద్రునకుం బ్రతివాది యోర్పుచే
క్షితికి సముండు ధైర్యమున శీతగిరిప్రతిముండు సాధుస
మృతుఁడు ప్రజాసుఖత్వమునఁ బంకజవైరికి సాటి రాఁ దగున్.
| 65
|
తే. |
కరుణ గలవాఁడు గావునఁ గడఁగి పరుల, దుఃఖమునకును దానును దుఃఖితుఁ డగు
నొరులయుత్సవమునకు మే లోర్చువాఁడు, గానఁ దానును పరితుష్టిఁ గాంచు నధిప.
| 66
|
వ. |
మఱియు నెప్పుడేనియు సుమిత్రాపుత్రసేవితుం డై పరులతోడ రణంబునకుం
జని యందు వైరివధం బాపాదింపక మరలి పురప్రవేశంబుఁ జేయమి యెల్ల
వారికిఁ దెల్లంబు గదా యిట్లు పగతులం బరిమార్చి విజయలక్ష్మీవిరాజమానుం
డై మహోత్సవంబునం బొదలుచు రథవారణంబులలోన నిష్టం బైనదాని
నారోహించి మరలి పురప్రవేశంబుఁ గావించి పౌరుల నందఱ రావించి జన
కుండుఁ గుమారులం బోలెఁ బ్రసన్నుండై నిత్యంబును గుశలం బరయు
నింతియ కాక పుత్రమిత్రకళత్రాగ్నిహోత్రప్రేష్యశిష్యగణంబును యథో
|
|
|
చితవ్యాపారంబులం బ్రవర్తింతురు గదా యనియును గర్మసుదంశితు లై
శిష్యులు నిత్యంబును శుశ్రూషఁ గావింతురు గదా యనియు నీదృశంబు
లగుకుశలప్రశ్నంబుల విప్రోత్తములు విచారించు నదియునుం గాక.
| 67
|
మత్తకోకిల. |
ఆర్యసమ్మతుఁ డుత్తమోత్తముఁ డంబుజారుణనేత్రుఁడున్
శౌర్యవీర్యపరాక్రమంబుల శార్జ్గికిం బ్రతివాది స
త్కార్యశీలి ధనుర్ధరుం డుపకారచిత్తుఁడు సంతతౌ
దార్యశాలి మహానుభావుఁ డతండు సుమ్మి మహీపతీ.
| 68
|
క. |
సరసుఁడు శ్రేయోవంతుం, డురువిక్రమశాలి యుత్తరోత్తరయుక్తిన్
గురునంతవక్త సతతము, విరుద్ధకథలందు నతఁడు విరతుఁడు ధాత్రిన్.
| 69
|
క. |
భూపాలశేఖరుఁ డరా, గోపహతేంద్రియుఁడు నరసురోరగలోక
వ్యాపారక్షముఁ డతనికి, భూపాలన మనఁగ నెంత పో చింతింపన్.
| 70
|
తే. |
పార్థివేశ్వర యతనికోషప్రసాద, ములు నిరర్థకములు గావు తలంచి చూడఁ
గోప మెత్తిన గడెలోనఁ గూల్చు రిపునిఁ, గరుణ తొడమిన నంతలో ఘనునిఁ జేయు.
| 71
|
తే. |
దాంతములు సర్వభూప్రజాకాంతములు జ, నంబులకుఁ బ్రీతిసంజననంబు లైన
ఘనగుణంబుల నతఁడు ప్రకాశ మొందె, నంశువుల దీప్తుఁ డగుసహస్రాంశుభంగి.
| 72
|
క. |
ఏవంవిధగుణనిధి సు, శ్రీవారాన్నిధిని ధర్మ శేవధి నఖిలా
వావరసమానునిం బృ, థ్వీవనజాతాక్షి దనకు విభుఁ డని తలఁచెన్.
| 73
|
క. |
జనవర నీభాగ్యంబున, వినుతగుణుం డైనరామవిభుఁడు సుతుండై
జనియించెఁ బుత్రగుణములు, గనియె న్మారీచుఁ డైన కాశ్యపునిక్రియన్.
| 74
|
వ. |
మఱియు దేవాసురగంధర్వోరగమహర్షులును నానానగరరాష్ట్రవాస్తవ్యజనంబు
లును బాహ్యాభ్యంతరజనంబులును బౌరజానపదజనంబులును విదితాత్ముం
డగురామునకు బలాయురారోగ్యంబు నాశంసించుచున్నవారలు మఱియు
వృద్ధులును దరుణులు నగుస్త్రీలు సమాహిత లయి యశస్వి యగు
రామునియభ్యుదయవిషయంబునందు సర్వదేవతల నుద్దేశించి కాలత్రయం
బున నమస్కరించుచున్నవారు గావునఁ దదీయాయాచితంబు భవత్ప్రసా
దంబువలన సఫలం బగుం గాక యని పలికి వెండియు.
| 75
|
తే. |
రాము నిందీవరశ్యాము రాజకులల, లాము నఖిలారివంశవిరాము సుగుణ
ధాము నిఖిలావనీధురంధరునిఁ గాఁగఁ, గాంతుము కదయ్య కన్నుల కఱవు దీఱ.
| 76
|
చ. |
అనఘు నుదారజుష్టు సుజనార్తిహరున్ మధువైరితుల్యుఁ గాం
చనగిరిధైర్యు శూరు రఘుచంద్రుని మాకు హితంబు గాఁగ లో
|
|
|
కనివహ ముత్సహింపఁగ జగద్భరణాభినివిష్టుఁ గాఁగ నా
తని నభిషిక్తుఁ జేయుము ముదంబు హితంబు యశంబుఁ గల్గెడిన్.
| 77
|
క. |
అని యీగతి నుత్కంఠను, ననువారల ఫాలకీలితాంజలులం గై
కొని నరపతి గ్రమ్మఱ ని, ట్లనియెఁ బ్రియము హితముఁ దోఁప నతులమృదూక్తిన్.
| 78
|
క. |
జనహితముకొఱకు మత్ప్రియ, తనయునిఁ బతి గాఁగ మీరు దలఁచినకతనన్
మనమునకు ముదము చేకురె, ననవరితము మత్ప్రభావ మతులం బయ్యెన్.
| 79
|
దశరథుండు వసిష్ఠాదులతో రామాభిషేకోచితసంభారంబు లొనఁగూర్పుఁ డనుట
వ. |
అని పలికి యద్ధరారమణుండు వారి నందఱ నయ్యైతెఱంగుల సంభావించి
వా రందఱు వినుచుండ వసిష్ఠవామదేవులను దక్కినబ్రాహ్మణశ్రేష్ఠులను విలో
కించి యీచైత్రమాసంబు పుణ్యం బై శ్రీమంతం బై పుష్పితకాననం బై
యొప్పుచున్నది గావున మత్కుమారశేఖరుం డగు రాముని యౌవరాజ్యం
బునం దభిషిక్తునిం జేయవలయు సర్వసంభారంబు లొనగూర్చుం డని పలి
కినఁ గర్ణరసాయనంబు లగుదశరథునిపలుకుల కలరి సభాసదులు సాధువాక్యం
బుల నభినందించిన సజ్జనఘోషంబు తుములం బై చెలంగెఁ బదంపడి యమ్మహా
నాదంబు శాంతిఁ బొందినయనంతరంబ నరేశ్వరుండు మునిలోకగ్రాహణు లైన
వసిష్ఠవామదేవుల నవలోకించి యి ట్లనియె.
| 80
|
క. |
తనయునియభిషేకార్ధం, బనుపమగతి నెద్ది కర్మ మర్హము దానిం
బనివడి సపరిచ్ఛదముగ, ననుజ్ఞ యీ నర్హులరు మహామునులారా.
| 81
|
క. |
అని విన్నవింప విని యమ్మునివర్యులు రాజవరునిముంగల ఘనఫా
లనిబద్ధాంజలిపుటు అయి, వినయముతో నున్న వారి వీక్షించి తగన్.
| 82
|
సీ. |
సర్వౌషధులును బూజాద్రవ్యములును గార్తస్వరముఖదివ్యరత్నములును
మధువును ఘృతమును బృథుకంబులును లాజలును శ్వేతమాల్యంబులును ఖండి
తాంబరంబులు వేగయాయితం బొనరింపుఁ డదిగాక యరదంబు నాయుధములు
జతగూర్పుఁ డెలమితోఁ జతురంగ మగు మనబలమును గూర్పుఁడు భద్రకరణిఁ
|
|
తే. |
జామరంబులు పాండురఛ్ఛత్రమును స, మగ్రశార్దూలచర్మంబు నగ్నివర్ణ
హేమకుంభశతంబును నెల్లి యుదయ, వేళ కొనగూర్పుఁ డధిపాగ్నివేశ్మమందు.
| 83
|
వ. |
మఱియు మణిదండమండితమహోన్నతకాంచనధ్వజంబును హిరణ్యశృంగాలం
కృతశృంగం బగుమహోక్షంబును శీఘ్రంబున నాయితంబు సేయింపుఁ డని
పలికి వెండియు నిట్లనిరి.
| 84
|
క. |
అరసి సమస్తపురాంతః, పురవరణద్వారములను భూరిసుగంధో
త్కరచందనసుమమాలా, గరుధూపంబులును వేగ గైసేయుఁ డొగిన్.
| 85
|
వ. |
మఱియు దధిక్షీరసంస్కారవంతంబును గుణవంతంబును వ్యంజనోపేతంబును
సరసపదార్థసంపన్నంబు నైనమృష్టాన్నంబు గావించి యెల్లి ప్రభాతకాలం
|
|
|
బున నపరిమితబ్రాహ్మణవరుల రావించి సత్కరించి యథేష్టంబుగా భోజనంబు
సేయించి పుష్కలంబుగా దక్షిణ లొసంగుఁడు సూర్యోదయకాలంబున
వేదపారగు లగువిప్రుల స్వస్తివాచనంబునకు నియమింపవలయు నానావిధ
పరమాసనంబులు గల్పింపుఁడు పురంబునం దెల్లెడలఁ దోరణధ్వజంబు లెత్తుట
కును రాజమార్గంబు గైసేయుటకును దగినవారి నియోగింపుఁ డదియునుం
గాక తాళావచరు లగునర్తకాదు లందఱును గణికలును జతుర్విధాలంకారం
బులం గైసేసి ద్వితీయద్వారంబున నుండువారుగా సంఘటింపుఁడు మఱియు
దేవాయతనచైత్యంబులందు దక్షిణాన్నమోదకహస్తు లై మాల్య ప్రదాన
యోగ్యులు వేర్వేఱ నుండునట్లు సంస్థాపింపుఁడు నిబద్ధదీర్ఘాసు లగుయోధులు
సన్నద్ధు లై ధౌతాంబరంబులు ధరించి మహోదయం బగు మహారాజాంగణం
బున నిండియుండువారుగా నియమించవలయు నని యధికారులకు రామాభి
షేకోపయోగికార్యంబు లన్నియు నాజ్ఞాపించి రాజశాననంబున సర్వంబునుం
గావించి హర్షప్రీతియుక్తు లై దశరథునకు సర్వంబు నుపకల్పితం బయ్యె నని
యెఱింగించి రంత నమ్మహీపతి సుమం త్రు నవలోకించి యి ట్లనియె.
| 86
|
సుమంత్రుఁడు దశరథునికడకు శ్రీరామునిఁ దోడి తెచ్చుట
క. |
నయ మార నీవు చని సా, రయశోనయధర్మబుద్ధిరమ్యుం డగుమ
త్ప్రియపుత్రుఁ డైనరాముని, రయమునఁ దోడుకొని వేడ్క ర మ్మిచ్చటికిన్.
| 87
|
చ. |
అనిన మహాప్రసాద మని యాతఁడు నేలినవానియానతి
న్జని రథివర్యుఁ డైనరఘునాథుని హేమరథస్థుఁ జేసి నె
మ్మనమున సమ్మదం బలరఁ బౌరులు వేడుకతోడఁ జూడఁ దో
డ్కొని చనుదెంచె భూవిభుని గొప్పహజారముఁ జేరి యచ్చటన్.
| 88
|
సీ. |
ఒకవంకఁ బ్రాచ్యు లత్యకలంకచిత్తు లై జయచిహ్నములు పెక్కు సన్నుతింప
నొకయోర దాక్షిణాత్యులు తటిఁగని తమదేశప్రవృత్తులఁ దెలియఁ జేయ
నొకదెసఁ బాశ్చాత్యు లొగిఁ దమమనవుల కిదియె కాలం బని యెచ్చరింప
నొకక్రేవఁ దగ నుదీచ్యులు గరములు మోడ్చి కరములు గొనుమని కరము వేఁడ
|
|
తే. |
నన్యు లగుకాననమహీధరాంతవాసు, లైనమ్లేచ్ఛులు గొలువఁ దదంతరమున
దివిజపరివృతుఁ డైనవాసవునిభంగి, నిండుకొల్వుండి దశరథనృపవరుండు.
| 89
|
సీ. |
ఇనకులాంబుధిసోము నిందీవరశ్యాముఁ గననీయగుణశీలు ఘనకపోలు
సురుచిరకీర్తిని సుకుమారమూర్తిని సద్గుణగేహు నాజానుబాహు
రమణీయవదనుని లావణ్యసదనుని నేత్రోత్సవప్రదు నిత్యవరదు
నధికతేజోలాభు నాదిత్యరాజాభు సౌవర్ణమణిభూషు సత్యభాషు
|
|
తే. |
విమతవిధ్వంసనోచితవీర్యయుతుని, భవ్యచారిత్రు నూతనదివ్యహేమ
రథగతుని నతజనమనోరథఫలదుని, రామచంద్రునిఁ గాంచె నారాజవరుఁడు.
| 90
|
క. |
కని తృప్తి నొందఁ డయ్యెను, మనమున ఘర్మాభితప్తమనుజులను ముదం
బునఁ బొదలఁ జేయు పర్జ, న్యునిక్రియ నలరారు నందనుని సుందరునిన్.
| 91
|
వ. |
మఱియు గంధర్వరాజప్రతిముఁ డగువాని విఖ్యాతపౌరుషుం డగువానిఁ బౌరు
పోషయుక్తసమానసత్త్వమహాదీర్ఘబాహుం డగువాని మహాసత్త్వుం డగు
వానిఁ దదనుగుణవిశేషమత్తమాతంగగమనుం డగువానిఁ జంద్రకాంతాననుం
డగువాని నత్యంతప్రియదర్శనుం డగువాని రూపౌదార్యగుణంబులచేతఁ
బురుషులదృష్టిచిత్తాపహారకుం డగువాని తనసమీపంబునకు వచ్చుచున్న
వానిఁ బ్రతిక్షణదర్శనంబున నవనవప్రేమాస్పదుం డగువాని రామభద్రుని
నిర్నిమేషదృష్టి నవలోకించి పరమానందభరితాంతఃకరణుం డై యుండె
నప్పుడు.
| 92
|
క. |
అంత సుమంత్రుఁడు సీతా, కాంతుని యరదంబు దిగిచి కడువేడుక గు
ర్వంతికమున కరుగునతని, చెంతం బనె నొసలఁ గేలు సేర్చి ముదమునన్.
| 93
|
చ. |
జనకసుతావిభుండు నృపసత్తముఁ గన్గొనువేడ్కతో గిరీ
శనగసమాననవ్యఘనసౌధముమీఁదికి నెక్కి భక్తిచే
జనకుపదాంబుజంబులకు జాఁగిలి మ్రొక్కి తదంతికంబునం
దనుపమలీల నుండె ఘటితాంజలి యై వినయంబు దోఁపఁగన్.
| 94
|
వ. |
ఇవ్విధంబునం దనకు నమస్కరించి పార్శ్వభాగంబునం గొలిచి యున్నకు
మారశేఖరు నవలోకించి బాహువుల నాకర్షించి కొండొకసేపు గాఢాలింగ
నంబుఁ గావించి పదంపడి దివ్యకాంచనమణిభూషితరుచిరపీఠంబునం గూర్చుండ
నియోగించిన నాసీనుం డై విమలుం డగుసూర్యుం డుదయంబునందు సుమేరు
శైలంబునుంబోలె స్వశరీరకాంతిచేత నయ్యాసనంబును భాసమానంబుఁ
గావించె మఱియుఁ దత్సభామండపంబు వసిష్ఠదశరథాదిబ్రహ్మర్షిరాజర్షులచేత
భ్రాజమానం బయ్యును విశేషించి రామునిచేత విమలగ్రహనక్షత్రశోభిత
శారదాకాశంబు సంపూర్ణచంద్రునిచేతంబోలె నుద్దీపితం బై యుండె నిట్లు
సుఖోపవిష్టుం డైనప్రియకుమారు నవలోకించి యాదర్శతలసంస్థితుఁ డైన
తన్ను విలోకించి యలరుమనుజునిమాడ్కి దశరథుండు సంతోషించి
మందహాససుందరవదనారవిందుం డై కాశ్యపుండు పురందరునకుంబోలె గౌస
ల్యానందనున కి ట్లనియె.
| 95
|
దశరథుఁడు శ్రీరాముని ధరణీభారంబు వహింప నియోగించుట
ఆ. |
రామభద్ర నీవు రమణతో ననురూప, పత్ని యగుమదగ్రపత్నియందు
సదృశసుతుఁడ వగుచు జనియించితివి నాకు, సకలసద్గుణముల సత్ప్రియుఁడుగ.
| 96
|
తే. |
ధారుణీప్రజ లెల్ల నీచే రమింపఁ, బడిరి కావున నింక వైభవము మెఱయ
పుష్యయోగంబునం దెల్లి పుడమికెల్ల, నాథుఁడవు గమ్ము జానకీనాథ నీవు.
| 97
|
తే. |
ప్రకృతిచేతనె మిక్కిలి రామ నీవు, విమలగుణరాశి వైతివి వేఱె చెప్ప
నేటి కైనను గృప నొక్కహితము నీకుఁ, దెలియఁ జెప్పెద వినుము సందేహ ముడిగి.
| 98
|
తే. |
వినయ మూఁది జితేంద్రియవృత్తి గలిగి, యంగనాదికకామజవ్యసనములను
వాక్పరుషతాదికోపజవ్యసనములను, విడువు మిది నీతివిదుఁ డైనవిభునిగుణము.
| 99
|
తే. |
మఱియుఁ బ్రత్యక్షవృత్తిచే మంత్రివరుల, నింపు సొంపార నెపుడు రంజింపు మీవు
తక్షముఖసర్వజనులఁ బ్రత్యక్షపదముఁ, జేర్పక పరోక్షవృత్తి రంజింపు వత్స.
| 100
|
వ. |
మఱియుఁ గోష్ఠాగారాయుధాగారంబులతోఁ గూడఁ బ్రశస్తవస్తునిచయంబులు
సంపాదించి.
| 101
|
క. |
కర మనురక్తప్రకృతిత, ధరణిం బాలించు నెవఁ డతనిమిత్త్రు లొగిన్
బరమానందము నొందుదు, రరమర లే కధిగతామృతామరులక్రియన్.
| 102
|
క. |
కావునఁ గుమారవర యీ, భావము భావంబునందు భద్రంబుగ సం
భావించి ప్రజల నందఱఁ, బ్రోవుము జగదేకరాజపూజ్యుఁడ వగుచున్.
| 103
|
క. |
అని పలుక నతనిపలుకులు, విని యచ్చట నున్నరామవిభునాప్తులు వే
చని కౌసల్యకుఁ జెప్పిరి, ఘనమతి రామాభిషేకకథ ముద మలరన్.
| 104
|
క. |
ప్రమదారత్నం బగున, య్యమ నానారత్నకాంచనాంబరధేనూ
త్తమమాల్యహారములు నె, య్య మెలర్పఁగఁ బ్రీతిఁ దత్ప్రయాఖ్యుల కొసఁగెన్.
| 105
|
క. |
అంత ధరిత్రీతనయా, కాంతుఁడు జనకునకు మ్రొక్కి కాంచనరథ మ
త్యంతముదంబున నెక్కి ని, జాంతఃపురమునకుఁ జనియె ననుచరయుతుఁ డై.
| 106
|
ఉ. |
పౌరులు మేదినీవిభుఁడు పల్కినవాక్యము లాలకించి యా
ధారుణినాథు వీడ్కొని ముదంబున నిండ్లకుఁ బోయి యందు సీ
తారమణీవిభుండు వసుధాధిపుఁ డయ్యెడు నంచు నెంచుచున్
సారమతి న్సురార్చనలు సల్పిరి భక్తినిబద్ధచిత్తు లై.
| 107
|
క. |
అట దశరథనృపరజనీ, విటుఁడు ప్రధానయుతుఁ డగుచు వెండియు హర్షో
త్కటమున మంత్రం బొనరిచి, పటుమతి నిశ్చయముఁ జేసి పదపడి పలికెన్.
| 108
|
క. |
ఎల్లి తగఁ బుష్య యోగం, బల్లన జలజారుణాక్షుఁ డగుజనకసుతా
వల్లభుని నిఖిలజగతీ, వల్లభునిం జేయువాఁడ వరమతులారా.
| 109
|
చ. |
అని యిటు లానతిచ్చి విభుఁ డాత్మగృహంబున కేగి సూతునిన్
|
|
|
వినమితగాత్రు రాఁ బనిచి వెండియు రామునిఁ దోడి తెమ్ము నీ
వనిన మహాప్రసాద మని యాతఁడు రామునిదివ్యమందిరం
బునకు రయంబునం జనియె మోమున సంతస మంకురింపఁగన్.
| 110
|
సుమంత్రుఁడు వెండియు దశరథునికడకు రాముని దోడితెచ్చుట
వ. |
ఇవ్విధంబునం జని దౌవారికులచేతఁ దనరాక నెఱింగించిపుచ్చిన నారాముండు
శంకాసమన్వితుం డగుచు నతని రయంబున రావించి యి ట్లనియె.
| 111
|
క. |
అనఘాత్మ నీదురాకకుఁ, బని యెయ్యది యనిన రాజు పదపడి మిముఁ గ
న్గొనఁ దో డ్తెమ్మన వచ్చితిఁ, బని గలిగిన వినఁ దగు న్నృపాలునివలనన్.
| 112
|
క. |
అన విని రాముఁడు గ్రమ్మఱ, జనకునిఁ గనువేడ్క మదిని సందడి పెట్ట
న్ఘనరాజభవనమునకుం, జనియె నతఁడు వెంట నడువ సత్వరుఁ డగుచున్.
| 113
|
క. |
వచ్చినతనయునిఁ గనుఁగొని, ముచ్చట పడి దశరథుండు మోమున మోదం
బచ్చుపడఁగ రుచిరాసన, మిచ్చి హితము దోఁపఁబలికె మృదుమధురోక్తిన్.
| 114
|
ఉ. |
మించినవేడ్కతో జనులు మెచ్చఁగఁ బెక్కుదినంబు లుర్వి జీ
వించినకారణంబునఁ బ్రవృద్ధుఁడ నైతి ననారతంబు న
భ్యంచితభూరిదక్షిణల నన్నవదిష్టిశతంబు లుర్విఁ గా
వించితి సంతతం బనుభవించితి నీప్సితభోగభాగ్యముల్.
| 115
|
తే. |
అట్టి సకలార్థసిద్ధుండ నైననాకు, నిరుపమేష్టుసుతుండ వై నీవు ప్రీతిఁ
బుట్టితివి గాన నాచేతఁ బుత్రవర్య, దత్త మగురాజ్యము భరింపఁదగుదు వీవు.
| 116
|
వ. |
మఱియు నభీష్టంబు లగువీరసుఖంబులు నాచేత ననుభూతంబు లయ్యె యాగా
ధీతపుత్రదత్తసుఖోపభోగంబుల చేత దేవర్షిపితృవిప్రాత్మఋణంబులవలన విము
క్తుండ నైతి నింక భవదభిషేకంబుకంటె నొండుకార్యం బెద్దియుఁ గొఱంత
లేదు కావున నే నెద్ది గఱపిన దానిం గా దనక చేయవలయు నని పల్కి వెండి
యు ని ట్లనియె.
| 117
|
తే. |
అనఘ యిప్పుడు ధారుణీజనము లెల్ల, నిన్నుఁ బతిఁగా దలంచుచు నున్నవారు
గాన యువరాజపట్టంబు గట్టెదను భ, రింపుమా సర్వభూభార మింపు మెఱయ.
| 118
|
సీ. |
అనఘాత్మ ఘనతారుణాశుభంబులు పెక్కు కలలోన నిప్పుడు కానఁబడియెఁ
జటులనిర్ఘాతనిస్వనమహోల్కాతతు ల్పడసాగె మత్తారభౌమరాహు
రవిముఖదారుణగ్రహములచే నవష్టబ్ధ యయ్యె నటంచు సకలదైవ
చింతకు లిప్పుడు చెప్పిరి గావున నిట్టియుత్పాతము ల్పుట్టు టెల్ల
|
|
ఆ. |
నవనిపతికిఁ జేటు నగుఁ గానిచో మితి, పెట్టరానివగవు పుట్టు నింక
నిట్టిదశలలోన నెద్ది బొందక మున్నె, ధారుణీభరంబుఁ దాల్పు పుత్ర.
| 119
|
క. |
అనఘాత్మ శరీరుల నె, మ్మనములు దలపోయ నిమిషభంగురములు గా
వునఁ దలఁచిన పని యప్పుడె, యనుకూలము చేయవలె నమంచితబుద్ధిన్.
| 121
|
వ. |
అట్లు గావున నాలస్యంబుఁ జేయుట కర్జంబు గాదు నేఁడు చంద్రుండు పునర్వసు
నక్షత్రసహితుఁ డై యున్నవాఁ డెల్లి పుష్యయోగంబు నియతం బని దైవజ్ఞు
లాదేశించిరి కావున నమ్మహనీయశుభలగ్నంబునందు సకలమహీరాజ్యంబున
కభిషిక్తునిం జేసెద నేఁటిరాత్రి సీతాసమేతంబుగా దర్భప్రస్తరశాయి వగుచు
నుపవసింపు మేతాదృశశుభకార్యంబుల కనేకవిఘ్నంబులు సంభవించు నట్లు
గాకుండ నప్రమాదు లగుసుహృజ్జను లెల్లెడలం గాచికొని యుండువారు గా
నియోగింపు మని పలికి యద్దశరథుండు దొల్లి కేకయరాజునకు రాజ్యం
బుంకువఁ జేసి కైకేయిని బెండ్లి యైనవాఁడు గావునఁ దద్వృత్తాంతంబు మనం
బున నిడికొని వెండియు.
| 122
|
క. |
భరతుఁడు గ్రమ్మఱఁ బురమున, కరుదేరక మున్నె రఘువరా నీవు మహీ
వరుఁడ నగు టొప్పు నని యే, నరయుదుఁ జిత్తంబునందు ననవరతంబున్.
| 123
|
దశరథుఁడు భరతునిగుఱించి శంకించుట
వ. |
అని యిట్లు భరతునిసాధువృత్తంబు నెఱింగియు రామస్నేహంబువలన రాజ్యం
బుకొఱకు నెట్లు తనచిత్తంబును శంకించె నట్లు భరతచిత్తంబును శంకించి పలికి
సద్గుణయుక్తుం డైనభరతునం దిట్టిశంక యుక్తంబు గా దని పలుకునో యని
యాలోచించి తత్పరిహారంబుకొఱకు మరల ని ట్లనియె.
| 124
|
చ. |
అనఘుఁడు ధర్మశీలుఁడు దయాహృదయుండు జితేంద్రియుండు నై
తనరు నతండు సాధులపథంబు మనంబునఁ బట్టి నీయెడ
న్ఘనతరభక్తిగౌరవముఁ గల్గినవాఁ డగు నైన నేమి యీ
మనుజులచిత్త మస్థిరము మాటికి నమ్మఁగరాదు తద్గతిన్.
| 125
|
తే. |
కుజనులమనంబె కాక యక్రూరజనుల, మనము చపలత్వ మొందునే యనఁగ వలదు
సత్యధర్మాభిరతు లైనజనులచిత్త, మైనఁ గృతశోభి యగు నిక్క మనఘచరిత.
| 126
|
వ. |
అని పలికి వీడుకొల్చినఁ దండ్రిచేత ననుజ్ఞాతుం డై రాముండు దచ్చరణంబు
లకుం బ్రణమిల్లి నిజనివాసంబునకుం జని యమ్మహోత్సవంబు నిజజనని కెఱిం
గించుతలంపునఁ బదంపడి తదీయమందిరంబునకుం జని యందు.
| 127
|
శ్రీరాముఁడు దశరథాభిప్రాయంబుఁ గౌసల్యకుఁ దెల్పుట
క. |
రాముండు గనియెఁ బూజా, ధామంబున క్షౌమపటముఁ దాలిచి నియతిం
దామోదరుఁ దలఁపుచు ను, ద్దామశ్రీఁ గోరుచున్న తల్లిని బ్రీతిన్.
| 128
|
వ. |
మఱియు నంతకుమున్న చనుదెంచి యున్నసుమిత్రాసౌమిత్రి ధరిత్రీపుత్రికలం
గూడి లక్ష్మణునివలన రామాభిషేకవృత్తాంతంబు విన్న దగుట హర్షపుల
కితసర్వాంగి యై కనుంగవ మూసి ప్రాణాయామంబునఁ బరమపురుషుండైన
జనార్దనుని ధ్యానంబు సేయుచున్నతల్లి నవలోకించి తచ్చరణంబులకు నియ
మంబున నభివందనంబుఁ గావించి యనిందిత యగునద్దేవికిఁ బ్రియంబుగా
మధురవాక్యంబున నిట్లనియె.
| 129
|
తే. |
అంబ రాజ్యపాలనకర్మమందుఁ దండ్రి, చేత నేఁడు నియుక్తుఁడ నైతి నేను
నెల్లి పుష్యయోగమున నహీనరాజ్య, పట్టబద్ధుఁ జేసెద నని పలికె విభుఁడు.
| 130
|
వ. |
మఱియు నీరాత్రి సీతాసమేతంబుగా నుపవాసం బుండు మని ఋత్విగుపా
ధ్యాయసహితుం డై రాజేంద్రుండు నన్ను నియోగించెం గావున నెల్లి మత్ప
ట్టాభిషేకంబునందు నాకును సీతకు నేయేమంగళకర్మంబు లాచరింపం దగు
నవి యెల్లఁ జేయింపుం డని పలికినఁ జిరకాలాభికాంక్షితం బైనతత్క్రియ
వృత్తాంతంబు విని యానందబాష్పధారాపూరితలోచన యై యిట్లనియె.
| 131
|
తే. |
అనఘ రామ చిరంజీవి వగుము నీదు, రిపులు హతు లైరి నీవు సుశ్రీయుతుండ
వగుచు నాబంధుజనముల నలసుమిత్ర, బంధువులఁ బ్రోవు మానందపరులఁ జేసి.
| 132
|
తే. |
వత్స నీచేత మీతండ్రి వరగుణముల, చేత నారాధితుం డయి చెలఁగెఁ గాన
భవ్యనక్షత్రదినమందు భద్రమూర్తి, వై జనించితివి గద నాయందు నీవు.
| 133
|
తే. |
రామ యిబ్భంగి నిక్ష్వాకురాజ్యలక్ష్మి, యింపు సొం పార ని న్నాశ్రయించెఁ గాన
నచ్యుతునియందు నేఁ జేయునట్టిసువ్ర, తంబు నేఁటి కమోఘ మై తనరెఁ గాదె.
| 134
|
క. |
అని యిట్లు జనని పలికిన, విని రాముఁడు సంతసిల్లి వినమితతనుఁ డై
తనమ్రోల నున్నలక్ష్మణుఁ, గనుఁగొని యిట్లనియె హాసకలితాననుఁ డై.
| 135
|
తే. |
అనఘ నాయంతరాత్మ వైనట్టి నిన్ను, రమణతోఁ బొందె నిక్ష్వాకురాజ్యలక్ష్మి
సంతతంబును ననుఁ గూడి సంతసమున, నింపు సొంపార ధాత్రిఁ బాలింపు మింక.
| 136
|
తే. |
అభిమతాఖలభోగ్యపదార్థరాజ్య, ఫలములను బ్రీతి భుజియింపు మలఘుచరిత
రాజ్యమును జీవితంబును రమణ నెపుడు, మించి భవదర్థ మాత్మఁ గామించుచుందు.
| 137
|
వ. |
అని పలికి లక్ష్మణుమనంబుఁ గలపికొని తల్లికి నమస్కరించి సీత కనుజ్ఞ
యొసంగి నిజనివాసంబునకుం జనియె నట్లు దశరథుండు వ్రతోపవాసాదికంబుఁ
గావింపు మని రాముని నియోగించి పదంపడి వసిష్ఠు రావించి యి ట్లనియె.
| 138
|
దశరథుఁడు రామునిచే నుపవాసంబుఁ జేయింప వసిష్ఠుని నియోగించుట
సీ. |
అనఘాత్మ నీవు రయంబునఁ జని రమాబలయశోరాజ్యలాభంబుకొఱకు
రాముని నేఁడు భార్యాయుతంబుగ నుపవాసంబుఁ జేయింపవలయు ననిన
నమ్మౌని యట్ల కా కని బ్రాహ్మణోచితం బైనరథం బెక్కి మానితముగ
రామునిమణిమందిరమునకుఁ జని మూఁడువాకిళ్లు దాఁటి పోవంగ నతని
|
|
తే. |
రాక ఫణిహారు లెఱిఁగింప రామవిభుఁడు, సత్వరంబున నమ్మునిసత్తమునకు
నెదురుగా వచ్చి సంతోష మెసఁగ రథము, డించి పూజించి నుతులు గావించె నపుడు.
| 139
|
వ. |
ఇట్లు భగవంతుఁడును మంత్రకోవిదుండు నగువసిష్ఠుండు రామునిచేత నవతా
రితుండును సత్కారసత్కృతుండు నై ప్రియార్హుం డగురామభద్రు నవలో
కించి ప్రసాదసుందరవదనారవిందుం డగుచు నమందానందంబున ని ట్లనియె.
| 140
|
చ. |
నెనరున నీగురుండు గరుణించె రహి న్నహుషుండు వంశవ
ర్ధనుని యయాతినట్ల తగ రాజ్యపదస్థునిఁ జేయుఁ గాక నె
ల్లి నిఖిలరాజ్యభారమును బ్రీతి వహించెద వీవు నేఁడు పా
వనగుణపత్నితోడ నుపవాస మొనర్పుము మంగళార్థ మై.
| 141
|
క. |
అని పలికి మునిప్రవరుఁడు, జనకజతోఁ గూడ రామచంద్రుని వేగం
బున నుపవాసముఁ జేయిం, చెను విధిపూర్వకము గాఁగ సిరి యుల్లసిలన్.
| 142
|
వ. |
ఇట్లు ధృతవ్రతుం గావించి రామునిచేత నర్చితుండై యామంత్రణంబు వడసి
తదీయదివ్యసదనంబు వెలువడి మరల రథారూఢుం డై రాజమార్గంబుఁ బట్టి
చనియెఁ దదనంతరంబ.
| 143
|
తే. |
అవనిజాపతి ప్రియవాదు లగుసుహృజ్జ, నములతోఁ గూడ నంతఃపురమున కరిగె
నచట వారల కందఱ కాత్మనిలయ, ములకు విచ్చేయుఁ డిఁక నని సెల వొసంగె.
| 144
|
క. |
తగ హృష్టయువతిజనయుత, మగురామాలయము వికసితాంభోజము మ
త్తగరుత్మత్ప్రకరయుతం, బగు కాసారంబుభంగి నలరారె రహిన్.
| 146
|
వ. |
ఇత్తెఱంగున నవ్వసిష్ఠుండు రాజభవనప్రఖ్యం బగురామనివేశనంబువలన నిర్గ
మించి రాజమార్గంబు విలోకించె నది మఱియు రామాభిషేకదర్శనకుతూ
హలజనసమూహంబులచేత నభిసంవృతంబై తొలంగం ద్రోయరాక యుండె
జనబృందోర్మిసంఘర్షహర్షసంజనితం బైనతదీయనిస్వనంబు సాగరస్వనంబు
భంగిఁ జెలంగుచుండె నయోధ్యాపట్టణంబు సిక్తసంమృష్టరథంబును వనమా
లియును సముచితగృహధ్వజంబునై చూడ్కికి వేడ్కఁ జేయుచుండె నప్పట్ట
ణంబునం గలస్త్రీబాలవృద్ధజనంబు లెల్ల రామాభిషేకం బనుశుభవార్త విని
|
|
|
ప్రజాలంకారభూతంబును సకలజనానందవర్ధనంబు నగుతన్మహోత్సవంబుఁ గనుం
గొనుతలంపున సూర్యోదయంబుఁ గోరుచుండిరి యిట్టిజనసంబాధం బగురా
జమార్గంబు నవలోకించుచు నజ్జనౌఘంబును విభజించుచున్నవాఁడు పోలె
మందగమనంబునం జని చని సితాభ్రశిఖరప్రఖ్యం బగురాజప్రాసాదం బారో
హించి శకునిచేత బృహస్పతియునుంబోలె నద్దశరథునిచేతఁ బ్రత్యుద్ధతుం
డును సమర్చితుండును గల్పితాసనుండు నై యతనిచేత నామంత్రణంబు
వడసి సభాసదులకుం జెప్పి నిజనివాసంబునకుం జనియె దశరథుండు నచ్చటి
వారల నెల్ల విడుదులకుం బోవం బనిచి దృప్తకంఠీరవంబు గిరికందరంబునుం
బోలె నగ్ర్యవేషప్రమదాజనాకులంబును మహేంద్రవేశ్మప్రతిమంబు నగు
నిజాంతఃపురంబుఁ బ్రవేశించి చంద్రుండు తారాగణసంకులం బగునభంబునుం
బోలె నద్దివ్యభవనంబు వెలుంగం జేయుచుండె నంత నిక్కడ.
| 147
|
క. |
మునివరుఁడు సనినపిమ్మట, జనకసుతావల్లభుండు స్నాతుం డై నె
మ్మనమున నియతిన్ మధుసూ, దనుని నుపాసించె నాత్మదయితాయుతుఁ డై.
| 148
|
తే. |
శిరమునందు హవిష్పాత్ర నిరవుకొల్పి, మాధవునకుఁ బ్రియంబుగ మంత్రపూత
మగుఘృతంబును బ్రజ్వలితాగ్నియందు, హోమ మొనరించె నతులకల్పోక్తసరణి.
| 149
|
మ. |
చెలు వొప్పన్ రఘునాయకుం డలహవిశ్శేషంబుఁ బ్రాశించి కే
వలభక్న్తి గృహదేవసద్మమున భాస్వన్నూత్నదర్భాసన
స్థలిపై జానకిఁ గూడి శాశ్వతశుభౌదార్యంబు వర్ధిల్ల దో
హలనిష్ఠన్ శయనించె మాధవగుణధ్యానంబు గావించుచున్.
| 150
|
వ. |
ఇట్లు సుఖనిద్రఁ జేసి ప్రభాతకాలంబున మేల్కని.
| 151
|
క. |
వందిజనంబులు మాగధు, లందంద యొనర్చు శ్రుతిసుఖావహ మగువా
గ్బృందము విని రఘునాథుఁ డ, మందానందరసభరితమానసుఁ డగుచున్.
| 152
|
మ. |
విమలక్షౌమపటంబుఁ దాల్చి నియతిన్ వేగంబె సాధ్యాదికృ
త్యములం దీర్చి నితాంతభక్తియుతుఁ డై యంభోధిరాట్కన్యకా
రమణుం జిత్తములోఁ దలంచుచు నతు ల్గావించి భూదేవతో
త్తములన్ మన్నన సేసె భావిశుభసంధానక్రియాపేక్షతన్.
| 153
|
క. |
ధరణీసురకృతపుణ్యా, హరవంబును భూరికాహళార్భటి మధురో
త్కరతూర్యధ్వానముఁ ద, త్పురము ప్రతిధ్వను లెసంగఁ బూర్ణం బయ్యెన్.
| 155
|
క. |
పురజనులు రామవిభుఁ డ, త్తఱి సీతాయుక్తుఁ డగుచుఁ దడయక వ్రతమున్
గురుభక్తి సల్పుటయు విని, కర మామోదించి రధికకౌతూహలు లై.
| 156
|
రామునిపట్టాభిషేకంబునకుఁ బురజనులు పట్టణ మలంకరించుట
క. |
అంతటఁ బురమునఁ గలవా, రెంతయు రామాభిషేక మేర్పడ విని త
మ్యంతంబునఁ బట్టణ మా, ద్యంతము గయిసేయఁ దొడఁగి రామోదమునన్.
| 157
|
సీ. |
శీతాద్రిశిఖరోపమాతతదేవతాయతనంబులందు నంచితనగంబు
లందుఁ జైత్యములందు నట్టాలకములందు లలి శృంగాటకరథ్యలందు
శ్రీమత్కుటుంబసమృద్ధగేహములందు సౌవర్ణమయసర్వసభలయందు
వివిధపణ్యసమృద్ధవిడ్జనాపణములం దతులితధ్వజము లాతతపతాక
|
|
తే. |
లలరె గాయకులును గణికలును నటులు, నర్తకులుఁ బురి నందంద నయనహృదయ
కర్ణశర్మావహంబులు గాఁగఁ బాడి, రాడిరి తదుత్సవజనితహర్షు లగుచు.
| 158
|
వ. |
మఱియు రామాభిషేకార్థంబు సనుదెంచి యున్నజనంబులు రమ్యచత్వర
మందిరంబులం గూడికొని యన్యోన్యంబు రామాభిషేకకథాప్రసంగంబులు
సేయుచుండిరి ప్రతిగృహద్వారంబునందు గుమిగూడి క్రీడావినోదార్థంబు విహ
రించుచున్న పృథుకజనంబులును రామాభిషేకసంయుక్తంబు లగుశుభకథా
సల్లాపంబులు సేయుచుండిరి యుత్సవలక్ష్మీనృత్యరంగం బగురాజమార్గంబు
గృతపుప్పోపహారంబును ధూపగంధాదివాసితంబునుం గా నాగరులచేత
రచింపంబడియె రామాభిషేకమహోత్సవంబు పరిసమాప్తి నొందక మున్నె
రాత్రికాలంబు వచ్చు ననుశంకచేతఁ బ్రకాశకరణార్థంబు పురవీధులందు వృక్షా
కారదీపస్తంభంబులు నిల్పి రిట్లు పురంబు సర్వంబు నలంకరించి పురవాసులు
రామునియౌవరాజ్యాభిషేకంబుఁ గోరుచుండి రప్పుడు.
| 159
|
రాముఁడు రాజ్యాధిపతి యగుటకు జనులు సంతసిల్లుట
ఉ. |
ప్రాకటభూరిచత్వరసభాభవనంబులయందు భూజనుల్
మూఁకలు గట్టి భూవరుఁడు బుద్ధిని వృద్ధు నెఱింగి తన్ను న
స్తోకమనీష రాముని వసుంధరకుం బతిఁ జేయఁ బూనె నా
హా కడు సమ్మదం బని జనాధిపునిం గొనియాడి రెంతయున్.
| 160
|
తే. |
నేఁడు మనభాగ్యములు పండె నృపునికరుణ, మనకు రక్షకుఁడును జగన్మాన్యుఁడుఁ గుల
దీపకుఁడు దృష్టలోకపరాపరుండు, నగు రఘూత్తముఁ డుర్వీంద్రుఁ డగుటఁ జేసి.
| 161
|
తే. |
పండితుఁడు ధర్మవంతుండు భ్రాతృవత్స, లుండు సుస్నిగ్ధుఁ డగురాఘవుండు మిగులఁ
|
|
|
దనదుతమ్ములయెడఁ జేర్పఁ దగినకరుణ, మనయెడలఁ జేర్చు నినుమడి ననుదినంబు.
| 162
|
తే. |
ఎవ్వనిప్రసాదమున ధాత్రి కిపుడు సమభి, షిక్తుఁ డగురామవిభుని వీక్షింపఁ గలిగె
నట్టిపుణ్యుండు ధర్మాతుఁ డైనదశర, థాధిపుఁడు చిరజీవి యై యలరుఁగాక.
| 163
|
వ. |
అని యిట్లు వొగడుపౌరులప్రశంసావచనంబులును రామాభిషేకమహోత్సవ
విలోకనకౌతుకాతిరేకంబున దిక్కులనుండి చనుదెంచి యున్నజానపదజనం
బులు సేయుహర్షనాదంబులు పరస్పరవచనాకర్ణనంబు గాకుండ నప్పురంబు
నిండి చెలంగె మఱియును.
| 164
|
తే. |
ఆమహాధ్వని పర్వములందు దీర్ణ, రంహుఁ డగుకంధివిభునివిరావమట్ల
యావిసర్పత్ప్రజాసమూహంబుచేత, బంధురంబుగ నాలింపఁబడియె నపుడు.
| 165
|
చ. |
సనినద మై త్రివిష్టపముచాడ్పున భాసిలునప్పురంబు త
ర్ఘనతరదివ్యవైభవముఁ గాంచుటకై చనుదెంచి యున్నభూ
జననికరంబుచేతఁ గడుసంకుల మయ్యెఁ దిమింగిలాదిజం
తునివహసంకులం బయిన తోయధిరాడుదకంబుచాడ్పునన్.
| 166
|
పురాలంకారంబుఁ జూచి మంధర యాశ్చర్యపడుట
వ. |
ఇప్పగిది నప్పురవరంబు సకలమహోత్సవంబుల కెల్ల నాటపట్టైలై యొప్పుచుండె
నప్పూర్వదివసంబున దశరథుండు గొలువుకూటంబున నెల్లవారలు విన నెల్లి
రామాభిషేకం బని ప్రకటంబుగాఁ బలికి యంతఃపురంబునకుం జనినయనం
తరంబ కైకేయీజ్ఞాతిదాసియు నవిజ్ఞాతదేశమాతాపితృకయు నైనమంథర
యనునొక్కకుబ్జ స్వోదరపూరణార్థంబు కైకేయియొద్ద దాసకృత్యంబులు
సేయుచుండి యాసమయంబున నది యదృచ్ఛచేతఁ జంద్రసంకాశం బైన
ప్రాసాదం బారోహించి ప్రకీర్ణకుసుమోత్కరంబును వరార్హధ్వజపతాకాభి
శోభితంబును బూరితనిమ్నోన్నతప్రదేశమార్గాలంకృతంబును గృతమంగళ
ద్రవ్యకలితహస్తప్రశస్తధరణీదేవతాభినాదితంబును సుధాధవళితదేవగృహ
ద్వారబంధురంబును వేదఘోషాభినాదితంబును సర్వవాదిత్రనిర్ఘోషసన్నా
దితంబును సంప్రహృష్టజనాకీర్ణంబును సంతుష్టువరకరితురంగంబును సంప్రణర్దిత
గోవృషంబును బ్రహృష్టముదితపౌరజనసముచితధ్వజవిరాజితంబు నై యొప్పు
నప్పురంబు నవలోకించి పరమవిస్మయావిష్టచిత్తయై తత్తఱంబునఁ దన్మహోత్స
వశ్రవణజనితపరమానందరోమాంచకంచుకితశరీర యగుదానిఁ బాండురక్షౌమ
పటశోభితకటి యగుదాని సభ్యాశప్రదేశసంచారిణి యగుదాని నొక్క
|
|
|
ధాత్రి నవలోకించి ధనపర యయ్యు రామమాత యుత్తమహర్షకలిత యై యర్థు
లకు ధనం బొసంగుచున్నది జనం బంతయు నతిమాత్రప్రహర్షం బై కానం
బడుచున్నది మహీపతి సంప్రహృష్టుండై యేమి సేయందలంచి యున్నవాఁ
డెఱింగింపు మని యడిగిన నది హర్షోపచిత్తగాత్రి యై ముదంబున నిట్లనియె.
| 167
|
క. |
జనవిభుఁడు పుష్యయోగం, బున నెల్లి ప్రశాంతచిత్తుఁ బుణ్యచరితు న
త్యనఘుఁ జితేంద్రియు రాముని, మునుకొని యువరాజుఁ జేయఁ బూనె ముదమునన్.
| 168
|
మంధర కైకకు దుర్బోధన సేయుట
శా. |
ఆపాపాత్మకురాలు మంథర ప్రశోకాపీడితస్వాంత యై
కోపోద్రేకమునన్ దహింపఁ బడి సంక్షోభంబునన్ దుస్సహ
వ్యాపారప్రతిబద్ధబుద్ధి యగుచున్ హర్మ్యంబు వే డిగ్గి శో
ణాపాంగంబులు దీటుచుం బలికె వజ్రాభోక్తి నక్కైకకున్.
| 170
|
సీ. |
వనజాక్షి కడుమౌఢ్యమున సమాగత మైనభయము నెఱుంగక పవ్వళించి
నిదురవోయెద విట్లు నిరుపమఘోరదుఃఖౌఘనిపీడిత నైతి నింక
నెయ్యది తెఱఁగు నా కేమి సేయుదు నంచుఁ బరితపింప వదేల భావమందు
సౌభాగ్య మది నాకుఁ జాల గల్దని వృథాయోగంబుచే విఱ్ఱవీఁగె దీవు
|
|
తే. |
నీదుసౌభాగ్య మంతయు నేఁటితోడ, నిండు వేసవినాటిధునీప్రవాహ
మట్ల శోషించి చనె నిఁక నైన లెమ్ము, విభున కప్రియ వైతివి వేయు నేల.
| 171
|
వ. |
అని యిట్లు పాపదర్శినియును దుష్టస్వభావయు నగు కుబ్జ తన్నుం బదరి పలికిన
నప్పలుకుల కులికిపడి విషణ్ణవదనయై కైకేయి దనపురోభాగంబువ దీనముఖి
యై దుఃఖించుచున్నమంథరం జూచి ప్రియసఖి యెవ్వనిచేతఁ బరాభవింపఁ
బడితి వెఱిఁగింపు మనవుడు మధురాయమానం బగుకైకేయీవాక్యంబు
విని క్రోధసంరక్తలోచన యై మనోవ్యథాకరంబును రామునియందు విరోధ
జనకంబు నగుపరుషవాక్యంబున ని ట్లనియె.
| 172
|
క. |
పతి కౌసల్యకు వశుఁ డై, యతివా త్వన్నాశహేతు వగువైదేహీ
పతిని యువరాజ్యమునకుం, బతిఁ జేయఁ దలంచె నీదు బ్రతు కేటి కిఁకన్.
| 173
|
క. |
ఈవృత్తాంతము విని మది, తా వహ్నిం గాల్పఁ బడినదానిక్రియన్ దుః
ఖావిలమానస యై యిట, కే వచ్చితి వేగ నీకు హితి మొనరింపన్.
| 174
|
తే. |
దేవి నీదుఃఖమున నాకుఁ దీర్పరాని, దుఃఖ మొదవును నీవు సంతోష మంద
నాకు మితి పెట్టరానియానంద మొదవు, నిందులకు మది సందియ మొందవలదు.
| 175
|
క. |
ధారుణి రాజకులంబున, నారయ జన్మించి దశరథావనిపతికిన్
|
|
|
దార వయి రాజధర్మ, క్రూరత్వం బెఱుఁగ వేల కువలయనేత్రా.
| 176
|
క. |
పలుకులఁ దీపును ధర్మముఁ, గలిగి హృదయమందుఁ జాలఁ గలుషముఁ గ్రౌర్యం
బలవడఁగ నాఁటినుండియు, మెలఁగున్ నీమగఁడు దెలియమిన్ వంచించెన్.
| 177
|
చ. |
జనపతి నిష్ఫలం బయిన సాంత్వము నీపయిఁ జేర్చి యిప్పు డ
త్యనుపమరాజ్యరూపకమహార్థముచేఁ బ్రథమద్వితీయనె
మ్మన మలరించెఁ గానియెడ మామను జూచుటకై భవత్సుతుం
బనిచి ధరాసుతాపతికిఁ బట్టముఁ గట్ట నుపక్రమించునే.
| 178
|
చ. |
అతివ వృథాప్రసాంత్వుఁ డగునానరనాథకులోత్తముం డనా
రతము సుఖోచితం బయినరాజ్యమునందు వసుంధరాత్మజా
పతి నభిషిక్తుఁ జేయు నిఁక బాంధవసంఘసమన్వితంబుగా
క్షితిని సజీవ వయ్యు గతజీవిత వైతివి మాట లేటికిన్.
| 179
|
క. |
సుతునకు హితంబు నా కు, న్నతహర్షము నీకు మే లొనర్చుతలఁపు నీ
మతిఁ గలిగిన నభిషేకముఁ, జతురత విఘ్నితముఁ జేయఁ జను నీ కబలా.
| 180
|
రామునికిఁ బట్టాభిషేకంబు జరుగుట మంథరవలన విని కైకేయి సంతసిల్లుట
వ. |
బాలా దశరథుండు నీకుఁ బతివ్యపదేశంబుచేత శత్రుం డగు ఛన్నహృదయుం
డగునతండు ఋజుస్వభావ వైననీచేత సర్పశిశుపోషయిత్రిచేతంబోలె హితా
చరణేచ్ఛచేతఁ బ్రతిచ్ఛన్నాంతర్విషం బైనసర్పంబువోలె నుత్సంగంబునందు
బరిధృతుం డయ్యె నుపేక్షితంబు లైనశత్రుసర్పంబులచేతం బోలె బాపస్వభా
వుండును వృథానాంత్వుండు నగునద్దశరథునిచేత నిత్యసుఖోచిత వైన నీవు
సపత్నీపుత్రాభిషేకరూపాపకారంబునఁ బుత్రమిత్రబంధుసహితముగా హత
వైతి వింకనైన వివేకంబు గలిగి తత్కాలోచితోపాయవిచారకుశలవు గావున
శీఘ్రంబున రామాభిషేకంబునకు విఘ్నంబుఁ గావించి భరతుని నిన్నును నన్ను
నుం బ్రోవు మని పలికిన విని యక్కేకయరాజపుత్రి రామాభిషేకకథాశ్రవణ
సంజాతపరమానందరసపూరితహృదయ యై చంద్రరేఖాలంకృత యైనశరద్ర
జనియునుం బోలె నభిరామదర్శన యై యొప్పుచు రయంబున లేచి పర్యంకమ
ధ్యంబునం గూర్చుండి వికసితమనోహరముఖారవింద యై కన్నుల నానంద
బాష్పధారలు గ్రమ్ము దేర సరసమణిప్రభాపటలశోభితం బై యొక్కదివ్యాభర
ణం బొసంగి యి ట్లనియె.
| 181
|
క. |
చెలియా పరమప్రియ మగు, నల జనకసుతాధినాథునభిషేకము సొం
పలరం జెప్పితి దీనికిఁ, గల ప్రత్యుపకార మేమి గావింతు నిఁకన్.
| 182
|
మంథర దుర్బోధనల విని సరిగా దనుచుఁ గైకేయి దానిని సమ్మతిపఱచుట
వ. |
అని యుత్సాహంబు దీపింపఁ బలికి వెండియు.
| 183
|
క. |
ఆరాముఁడు భరతుఁడు నా, కారయఁగా నొక్కరూప యటు గావున నా
భూరమణుఁ డతని రాజ్య, శ్రీరమణునిఁ జేయు టరయఁ బ్రియ మగుఁగాదే.
| 184
|
వ. |
ప్రియార్హా నా కీరామాభిషేకకథనంబుకంటె నన్యం బొక్కటి యొక్కింతైన
నభిమతం బగుశ్రేష్ఠవాక్యంబు నీచేతఁ గ్రమ్మఱం జెప్పుట కశక్యంబై యుండు
నట్లు సర్వప్రియంబులకంటె నుత్తమం బైన వేఱొక్కవస్తువు గల దేని యా
రసి చెప్పుము దాని నొసంగెద ననిన నమ్మంథర యమ్మాట గీటునం బుచ్చి
యద్దేవి యొసంగినయాభరణంబుఁ బాఱవైచి దండతాడితభుజంగంబు
చందంబున సక్రోధ యై దుఃఖశోకంబులు పెనంగొన ని ట్లనియె.
| 185
|
మంథర యతికఠినముగాఁ గైకేయికి దుర్బోధనలఁ జేయుట
తే. |
దారుణాపత్సముద్రమధ్యస్థ వైతి, ననుచు నిను నీ వెఱుంగక యప్రమోద
విషయమం దిట్లు ముదముఁ గావించె దీవు, వనిత నీ బాలిశత్వ మేమనఁగవచ్చు.
| 186
|
తే. |
రామభద్రసామ్రాజ్యసంప్రాప్తిరూప, మగుమహావ్యసనము నొంది వగవ కిట్లు
హర్ష మొందితి కాన దుఃఖార్త నగుచు, నిన్ను దూడెద మది నవినీత వనుచు.
| 187
|
మ. |
మగువా నీకు సపత్నిపుత్రుఁ డగురామస్వామి మృత్యూపముం
డగుశత్రుండు దలంప వాని దగు రాజ్యప్రాప్తికి న్నీ వయో
పగ సాధింపక మోద మంది తిది యే ప్రజ్ఞావిశేషంబు మె
చ్చగునే తావకదుర్మతిత్వమున కే నాత్మన్ విషాదించెదన్.
| 188
|
తే. |
అకట రాజ్యసాధారణుం డైనభరతు, వలన రాముని కయ్యెడుభయముఁ దలఁచి
మిక్కిలి విషణ్ణ నైతి నిమ్మైయి ధరిత్రి, భీతి భీతున కొదవించు భీతుఁ డబల.
| 189
|
వ. |
మఱియు మహేష్వాసుం డగులక్ష్మణుండు మనోవాక్కాయకర్మంబులచేత
రామునిం బొందియుండునట్ల శత్రుమ్నుండును భరతునిం బొంది యుండు సన్ని
కృష్ణం బైనపునర్వసుపుష్యనక్షత్రజననక్రమంబుచే నైనను భరతునికె రాజ్య
ప్రాప్తి యగుఁ గనిష్ఠు లైనలక్ష్మణశత్రుఘ్నులకు రాజ్యక్రమంబు వ్యవహితం బయ్యె
లక్ష్మణశత్రుఘ్నులు వ్యవహితు లైనను బరతంత్రు లైనను రాజ్యవిషయంబు
నం దభిలాషంబు రామభరతులకుంబోలె వారలకుం గలిగి యుండు నైనను మొ
దల రామునకుఁ బిదప భరతునకుఁ బదంపడి లక్ష్మణశత్రుఘ్నులకు రాజ్యక్ర
మంబు సన్నికృష్టంబై యుండు నట్లు గావునఁ బ్రథముం డగు రాముండు ద్వితీ
యుం డగుభరతుని హింసించు గావున రామునివలన భయంబు భరతునకేకాక
లక్ష్మణశత్రుఘ్నులకుం గలుగ నేర దిట్లు రాజ్యక్రమంబు సన్నిహితం బైనను రా
|
|
|
ముండు మొదట నేలుట కర్హుండై యుండ భరతున కెట్లు రాజ్యశంక గలుగున
ని యంటివేని వివేకశాలియు క్షత్రచారిత్రంబునందుఁ బ్రాజ్ఞుండును గాలోచిత
కర్తవ్యార్థకారియు నైన రామునివలన నయ్యెడు భావ్యనర్థకరణభయంబు
వలనఁ బూర్వోక్తవై శారద్యాదిరహితుం డైనభవత్పుత్రు నుద్దేశించి పరితపించు
చున్నదాన నని యిత్తెఱంగున భరతునకు రాజ్యనాధారణ్యం బుగ్గడించి
వెండియు గౌసల్యకుం గల సౌభాగ్యప్రసంగంబునఁ గైకకు నీర్ష్యోత్పాదనంబుఁ
జేయుతలంపున ని ట్లనియె.
| 190
|
ఉ. |
ఎల్లి సమస్తబంధుజను లెంతయు మెచ్చఁగఁ బుష్యయోగమం
దల్లన ధారుణీసురకులాఢ్యులచే నభిషిక్తుఁ డై మహీ
వల్లభు లెల్ల మ్రొక్కు లిడ వారక గద్దెయ నున్న జానకీ
వల్లభుఁ జూచి మోదమున వాలఁగ నీసవ తేమి నోఁచెనో.
| 191
|
తే. |
పగతు లెల్లను నిర్జింపఁ బడిరి కాన, నధిక విశ్రుతి సంప్రీతి నలరి యున్న
నీసపత్నికి దాసి వై నెనరు పుట్టఁ, బనులు సేయంగ వలసె నీ కనిశ మబల.
| 192
|
క. |
ఏ మెల్ల నిన్ను వీడ్కొని, రామజననిఁ గొలిచి యునికి ప్రాప్తించెఁ దగన్
రామునకు నీకుమారుం, డోమహిళా ప్రేష్యభావ మొందఁగ వలసెన్.
| 193
|
క. |
భరతునిగృహమున నీస్నుష, లరుదారఁగ నప్రహృష్ట లై వర్తింపం
బరికించి రామయువతులు, గర మానందంబు నొంది కన్గొనవలసెన్.
| 194
|
వ. |
అని యిట్లు పాపవ్యవసాయంబునందుఁ జిత్తంబు తగులువడునట్లు బోధించు
పరిచారిక నవలోకించి రామునియందు నన్నివిష్టంబు లగుసద్గుణంబు లభివ
ర్ణింప నుపక్రమించి కైక యి ట్లనియె.
| 195
|
కైక మంథరకు రామునిసద్గుణంబులఁ దెల్పుట
మ. |
గురుదాంతుండు కృతజ్ఞుఁ డార్తిహరుఁ డక్రూరుండు ధర్తజ్ఞుఁడుం
గరుణోదారుఁడు సత్యవాది శుచియుం గాకుత్స్థవంశేంద్రుఁ డా
ధరణీజాపతి యాజి కగ్రసుతుఁ డై తాఁ బుట్టెఁ గానన్ ధరం
బరిపాలింప నతండె యర్హుఁడు జగత్ప్రఖ్యాతనీతిం జెలీ.
| 196
|
క. |
అనుజుల భృత్యుల బంధుల, ననవరతముఁ దండ్రి వోలె నారసి ప్రోచున్
మనరాముఁ డతనియభిషే, చనమునకు న్వగవఁ దగునె సకియా నీకున్.
| 197
|
క. |
అవనిసుతావిభుఁ డేలీన, యవల మహీచక్ర మెల్ల నస్మత్తనయుం
డువిదా పాలింపఁ గలం, డు విచారము దక్కి యూఱడుము నీ వింకన్.
| 198
|
క. |
ఎడఁబడక విూఁద భరతుఁడు, పుడమికి ఱేఁ డగుచు నుంట బుద్ధిఁ దలఁప కి
ప్పుడు రామాభ్యుదయమునకుఁ, బడఁతీ యిప్పగిది నడలుపడ నేటి కిటన్.
| 199
|
క. |
జనకతనయాకళత్రుం, డనిశము నిజజననికంటె నతిశయభక్తిన్
ననుఁ జేరి కొలుచుఁ గావున, మనభరతునికంటె నతఁడు మాన్యుఁడు నాకున్.
| 200
|
చ. |
అనవరతం బతండు తన యట్టులె తమ్ములఁ జూచుఁ గాన న
య్యనఘునియందుఁ జెందిన మహాప్రియ మంతయు మత్కుమారునం
దును దగఁ జెందినట్ల తలఁతు న్మగువా మది కిప్డు దీనికై
మనమున నింతపట్టి పలుమాఱెదఁ గుందఁగ నేల దీనతన్.
| 201
|
వ. |
అని యివ్విధంబునం గైక దనమనంబున రామునియందుం గలవాత్సల్యంబు
తేటపడం బలికిన నక్కుబ్జ శోకశిఖిశిఖాదందహ్యమానస యై నిట్టూర్పువుచ్చి
యొక్కింతసే పూరకుండి వెండియుఁ గైక కి ట్లనియె.
| 202
|
ఆ. |
వినుము వ్యసనశోకవిస్తీర్ణ మగుదుఃఖ, వనధి మగ్న నైతి ననుచు నిన్ను
మది నెఱుంగ లేవు మౌర్ఖ్యంబువలన న, నర్థదర్శినివి గదా లతాంగి.
| 203
|
మంథర కైకకు నానాప్రకారంబుల బోధించుట
వ. |
అని యిట్లు కైకయభిప్రాయం బనాలోచితం బని నిందించి రామరాజ్యానంత
రంబుననైన భరతునకు రాజ్యంబు లేమి తెల్లంబుగా బోధించుతలంవున
ని ట్లనియె.
| 204
|
సీ. |
ధరణీశ్వరులు రాజతంత్రంబులను జ్యేష్ఠసుతునందె ఘటియింతు రతిగుణాఢ్యు
లై నతక్కినవారియందుఁ జేర్పరు రాజునకుఁ గలసుతు లెల్ల నరపతిత్వ
మొందలే రబ్భంగి నొందినచోఁ జాల ననయంబు వాటిల్లు నగ్రపుత్రుఁ
డగురాముఁ డేలిక యైనపిమ్మట వానితనయుండె భూపతిత్వము వహించు
|
|
తే. |
రాజవంశంబువలన వారక సుఖంబు, వలన నత్యంతనిర్భగ్నుఁ డగుచు నీదు
సుతుఁడు భరతుం డనాథుఁ డై సొంపు సెడి య, రణ్యమున కేగఁ గలఁ డిప్పురంబు విడిచి.
| 205
|
ఆ. |
కాంత నీదు మేలు ఘటియించుతలఁపున, హితముఁ గఱప నచ్చు టెఱుఁగ కిట్లు
సవతిభాగ్యమందు సంతసించెద వయో, యెంత చెనటి వైతి వే మొనర్తు.
| 206
|
తే. |
రాముఁ డధినాథుఁ డైన నీరాజ్యమునకు, హాని లేకుండ నీపుత్రు నన్యదేశ
మునకు నైన లోకాంతరమునకు నైనఁ, బనుచు నిక్కువ మీ చంద మనుపమాంగి.
| 207
|
వ. |
దేవీ బాలుం డగుభరతుని మాతులగృహంబునకుం బుచ్చితి విది యవివేకంబు
నేఁ డతండు సమీపంబున నుండె నేనియు మహీపతికి రామభరతాదుల
యందు సమానసౌహార్ధంబు సంఘటిల్లుఁ దృణగుల్మలతాదిస్థావరంబులయం
దైనను నత్యంతసన్నిధానంబువలన నన్యోన్యసంశ్లేషరూపసుహృద్భావంబు
|
|
|
జనించుఁ బ్రాజ్ఞు లైనరామభరతాదులయందు జనించుట కేమి యరిది యట్టి
సన్నికర్షంబు నీచేత విఘటితం బయ్యె లక్ష్మణుండు రామునకుం బోలె శత్రు
ఘ్నుండు భరతునకు వశుండై యుండు నతం డైన సమీపంబున నున్నఁ దనయ
స్నేహంబువలన భరతునియందు సౌహార్దంబు గలుగు నతండును బ్రస్థాపితుం
డయ్యె వనోద్భూతతృణకాష్ఠజీవు లగువ్యాధాదులచేత ఛేత్తవ్యం బగుకొం
డొకవృక్షంబు కంటకప్రచురవేత్రతృణలతాదులచేత సన్నికర్షంబువలన ఛేదన
రూపభయంబువలన సమోచితం బగునని వినఁబడుం గావున సన్నికర్షంబు రక్షణ
కారణం బై యుండునది నీచేతఁ బరిహృతం బయ్యెనని విందుముగాదె యని
పలికి వెండియుఁ గుబ్జ యి ట్లనియె.
| 208
|
తే. |
రాఘవుఁడు లక్ష్మణునిఁ బ్రోచు లక్ష్మణుండు, ప్రోచు రాముని నశ్వినీపుత్రులట్ల
వారిసౌభ్రాత్ర మఖిలభువనమునందు, నధికవిశ్రుత మై యుండు నట్టు లగుట.
| 209
|
క. |
సౌమిత్రిపై రఘూత్తముఁ, డేమియుఁ బాపంబు సేయఁ డించుక యైనన్
లేమా మనభరతునిఁ బెనుఁ, బాముపగిదిఁ గినుకఁ బూని బాములఁ బెట్టున్.
| 210
|
వ. |
కావున భవత్కుమారుండు మాతులగృహంబుననుండి వనంబునకుం జనుం
గాక భరతుండు ధర్మంబు దప్పక పిత్ర్యం బగురాజ్యంబుఁ బరిపాలించెనేని
నాకుఁ బరమహితంబును నీ కత్యంతహర్షంబును భవదీయజ్ఞాతుల కధికోదయం
బును సంభవించు నదియునుంగాక.
| 211
|
తే. |
అతిసుఖోచితుఁ డగుభవత్సుతుఁడు రామ, చంద్రునకుఁ జూడఁ గేవల సహజశత్రుఁ
డతఁడు సతతసమృద్ధార్థుఁ డగుచు నుండ, నితఁడు నష్టార్థుఁ డై యెట్లు బ్రతుకుఁ దన్వి.
| 212
|
క. |
వనితా బలుసింగముచే, వనమున వెస నాక్రమింపఁ బడినకరివిధం
బున రామునిచేఁ బొదువఁ బ, డిన భరతునిఁ బ్రోవు మతని డెందం బలరన్.
| 213
|
మ. |
రమణీ మున్ను విభుండు నీకు వశుఁ డై లాలించునాఁ డీవు గ
ర్వమునం జేసినయెగ్గు లన్నియును దాఁ బల్మాఱు చింతించి గి
న్క మదిన్ డాఁచిన నీసపత్ని యగునక్కౌసల్య రాముండు రా
జ్యము బాలించుచు నుండె నేనియు నినున్ సాధింపదే క్రమ్మఱన్.
| 214
|
తే. |
రామచంద్రుండు సకలసామ్రాజ్యమునకు, నాయకుం డయ్యె నేని నీనందనునకు
నీకు నీబంధుజనుల కస్తోకదైన్య, వృత్తి వాటిల్లు నిక్కువ మివ్విధంబు.
| 215
|
క. |
కావున భరతుని రాజ్య, శ్రీవిభునిఁ గఁ బగతుఁ డైన శ్రీరాము నర
ణ్యావాసునిఁ గాఁ దలఁవుము, భావంబున సుతుఁడు నీవు బ్రతుకఁ దలఁచినన్.
| 216
|
వ. |
అని బహుప్రకారంబుల నమ్మంథర తననేర్పుకొలంది వ్యాపాదంబునందుఁ
జిత్తంబు తగులువడునట్లు బోధించిన నక్కైకేయి యెట్టకేలకు నీయకొని
క్రోధానలజ్వలితవదన యై నిట్టూర్పు నిగిడించి క్రమ్మఱ నక్కుబ్జ కి ట్లనియె.
| 217
|
చ. |
అనుపమబుద్ధి నీకఱపినట్టులె రాము నరణ్యభూమికిం
బనిపెద మత్కుమారునకుఁ బట్టముఁ గట్టుతెఱం గొనర్చెదన్
మనమున దీనికిం దగినమంచియుపాయముఁ జూచి చెప్పు మీ
వనిన మదిన్ ముదం బలర నప్పరిచారిక పల్కెఁ గ్రమ్మఱన్.
| 218
|
ఉ. |
ఓయెలనాగ నీదుతల పొప్పిద మయ్యె వసుంధరాసుతా
నాయకుఁ డుగ్రసత్త్వభయదాటవియందుఁ జరింప నీసుతుం
డాయతరాజ్యవైభవసమంచితుఁ డై తనరారు నట్టినూ
పాయముఁ జెప్పెదన్ విను మపారసుధీరచనాధురీణ వై.
| 219
|
మంథర కైకకు రామవివాసన భరతాభిషేచనముల నుపాయం బెఱింగించుట
వ. |
దేవీ నీచేత బహుప్రకారంబుల నుచ్యమానం బైనయాత్మప్రయోజనంబు
నావలన వినం గోరితివి దీనికిం దగినయుపాయంబు నీ వెఱుంగక యడిగితివో
యెఱింగి ప్రకటంబు గానీక మనంబున నిడుకొని యడిగితివో యెఱుఁగరాదు
నాచేతఁ బలుకంబడినదాని విన నభిలాషం బగునేని యెఱింగించెద దాని
నాకర్ణించి యవ్వల విమర్శింపు మని పలికిన నమ్మంథరావాక్యంబు విని
యక్కైకేయి స్వాస్తీర్ణం బైనశయనంబుననుండి యొక్కింత లేచి మంథర
కి ట్లనియె.
| 220
|
ఆ. |
ముదిత యేయుపాయమున మత్కుమారుండు, రాజ్య మధిగమించు రామభద్రుఁ
డడవి కిప్పు డరుగు నట్టియుపాయంబు, జెప్పు మీవు తడవు సేయ నేల.
| 221
|
క. |
అని పలికిన నమ్మంథర, ఘనతరరామాభిషేకకార్యవిఘాతం
బొనరించుచుఁ గైకేయిం, గనుఁగొని యి ట్లనియె మరలఁ గడుహర్షమునన్.
| 222
|
వ. |
దేవీ తొల్లి దేవాసురసంగ్రామంబునఁ బురందరాదిబృందారకులు రాక్షసుల
కోడి పోడిమి సెడి నీమగనిం దమకుఁ దోడుపడుమని ప్రార్థించిన నతండు నిన్నుం
దనకు బాసటగాఁ గొని రాజర్షిసమేతుండై దక్షిణదిశకుం జని దండకార
ణ్యంబుఁ బ్రవేశించి యందు వైజయంతం బనుపురంబున కధివిభుం డైన
తిమిధ్వజుం డగుశంబరుం డనుమహారాక్షసుని మహామాయునిం దాఁకి వీఁక
శరాసారఘోరంబుగాఁ బోరి పోరి ప్రొద్దు గ్రుంకినఁ దదీయశూలాభిసంజాతక్ష
తవేదనాపనోదనార్థంబు నిదురించి యుండ నప్పు డప్పూర్వగీర్వాణులు నిశా
సమయంబున సుప్తులైనవారి నందఱ నానావిధప్రహరణంబులం బ్రహరించిన
|
|
|
నక్కైదువులతాఁకున కోర్వక దశరథుండు మేల్కని నిజస్యందనంబు గడప
నిన్ను సారథిఁగా నియోగించుకొని రాక్షసులతోడ దారుణప్రకారంబున
రణంబుఁ జేసి రాక్షసప్రయుక్తశూలపట్టిసప్రాసాదిసాధనంబుల నొచ్చి నష్టచే
తనుం డైన నీ వప్పు డద్దశరథుని రణంబునకుఁ దొలంగించి దానవకృత్యంబులం
బడి మడియకుండ రక్షించితి పదంపడి రాక్షనులు పై నెత్తివచ్చినఁ దత్తత్ప్ర
హరణంబులం బొలియకుండఁ గాచితి విట్లు ద్వివారంబులు నీచేత రక్షితుండై
యతండు మెచ్చి వరంబులు రెం డొసంగెద వేఁడు మనిన వలసినయపుడు గో
రెద నొసంగు మన నద్దశరథుం డట్లయ్యెడు నని నీయకొనియె నీవృత్తాంతంబు
తొల్లి యొక్కనాఁడు స్నేహబలంబున నాకుం జెప్పితి నేను నాఁటనుండి
మనంబున నిడుకొని తద్వినియోగసమయాన్వేషణంబు సేయుచుండఁ బెద్ద
కాలంబునకుఁ దగినసమయంబు దొరకొనియెఁ బదునాల్గువత్సరంబులు రా
మున కరణ్యవాసంబును భరతునకు రాజ్యాభిషేకంబునుంగా నివ్వరంబు లొ
సంగవలయునని మగని బలాత్కరించి యడిగి రామాభిషేకసంభారంబులు
నివర్తింపు మట్లైన భరతుండు ప్రజాభిప్రాయసంప్రాప్తస్నేహుం డై సుస్థిరుం
డగు దానం జేసి నీకు వశులై సపత్ను లెల్లఁ బనులు సేయుచుండ మాబోంట్ల
నెల్ల రక్షించుచు నీశ్వరివై యుండెద వని సౌభాగ్యంబునం దాశాకల్పనా
పూర్వకంబుగా రామవివాసంబునకుం దగినయుపాయం బెఱింగించి వెండియు
ని ట్లనియె.
| 223
|
క. |
చెలువంబు దక్కి బలువడి, మలినపటము గట్టి క్రోధమందిరమున సొ
మ్ములు డుల్చి నేలపైఁ గ, ట్టలుకం బడియుండు మిపుడె యధిపుఁడు వచ్చున్.
| 224
|
క. |
వచ్చిన మగనిం గన్నులు, విచ్చి గనుంగొనక పూర్వవిధమునఁ బ్రేమ
న్ముచ్చట లాడక తగ మన, సిచ్చి గలియ కేడ్చుచుండు మెంతయుఁ గినుకన్.
| 225
|
వ. |
అట్లైన భర్తృపరిత్యాగరూపానర్థంబు వాటిల్లు నని తలంచితేని వినుము.
| 226
|
క. |
మానిని మగనికిఁ గూర్చిన, దానవు గావున నతండు త్వత్కృతమం దెం
నెనరు గలిగి ప్రజ్వలి, తానలమం దైనఁ జొచ్చు నది నిక్క మగున్.
| 227
|
తే. |
నెనరు గలవాఁడు గావున నీమగండు, నెలఁత నినుఁ గడదానిఁగాఁ దలఁచి దారు
ణోక్తిఁ గోపింపఁజాలఁడు యుష్మదగ్ధ, మాన సేయుట నసువుల నైన విడుచు.
| 228
|
క. |
పాటలగంధిరొ విను నీ, మాటకు జవదాఁట లేఁడు మానవపతి యి
ప్పాట భవదీప్సితార్థము, వాటముగాఁ జేకురున్ ధ్రువం బది నీకున్.
| 229
|
వ. |
ఇ ట్లలుక వొడమినడెందంబుతో నీవు క్రోధాగారంబుఁ బ్రవేశించి శయ
|
|
|
నించి యున్నసమయంబున నీవిభుం డరుదెంచి నీచిత్తంబు వడయుటకు బహు
రత్నసువర్ణభూషణాంబరమాల్యాదు లొసంగం జూచు మనోవిభ్రమకారణంబు
లైన యప్పదార్థంబులం దాస సేయక తొల్లి దేవాసురసంగ్రామసమయం
బున సంప్రీతుండై యొసంగెద నన్నవరంబు లిచ్చునంతకుఁ గోపంబు డింపకుండు
మట్లైన నతండు మోహవిశేషంబున నవ్వరద్వయం బొసంగువాఁడై కోర్కికిం
దనినప్రయోజనంబు లెఱింగింపు మని యడుగు నప్పుడు నీవు భయంబు
విడిచి యమ్మహీవిభుని సత్యంబునందు సంస్థాపించి పదునాల్గువత్సరంబులు
రామునకు వనవాసంబును భరతునకు రాజ్యాభిషేకంబును గోరు మతం డివ్వ
రంబు లనుమానంబు దక్కి యొసంగు నంతట రాముండు వనంబునకుం జనిన
భరతుండు సామ్రాజ్యపదవిఁ గైకొని వశీకృతమూలబలుం డై పగతులం బరి
మార్చి సంగృహీతమనుష్యుం డగుచు నిష్టజనంబులఁ గూడి మహీభార
ధౌరేయుండై యొప్పు నవ్వల నారాముందు చతుర్దశవత్సరంబులు వనవా
సంబు సల్పి గ్రమ్మఱఁ బురంబునకుం జనుదెంచెనేని భరతుని జయింప సామ
ర్థ్యంబు లేమింజేసి యూరకుండు నంతట రాముండు రాముం డయ్యెడు భర
తుండు చతుర్దశవర్షవ్యతిరిక్తపురుషాయుఃకాలం బంతయు నేకచ్ఛత్రాధిపత్యం
బుగాఁ బుడమి నేలుం గావున నెల్లభంగుల సందియంబు దక్కి నిర్బంధంబున
దశరథుని స్వాధీనుం గావించుకొని రామాభిషేకంబునకు విఘ్నంబు సేయు
మిదియే భరతునకుఁ బ్రాప్తకాలం బని పలికిన నక్కుబ్జపలుకుల కలరి యక్కై
కేయి యనుకూలార్థరూపంబునం బ్రతిబోధితమైనయయ్యవస్థంబుం బరిగ్రహించి
సంతసించి యమార్గగత యైనకిశోరచందంబున నవశయై మిక్కిలివిస్మయంబు
నొంది మంథర కి ట్లనియె.
| 230
|
కైక మంథరను శ్లాఘించుట
తే. |
బుద్ధినిశ్చయమందు నీపుడమిలోనఁ, గలుగు కుబ్జలలో నగ్రగణ్య వైతి
వింతహితమతి వనుచు ని న్నెఱుఁగనైతి, నెంతశ్రేష్టాభిధాయినివే మృగాక్షి.
| 231
|
క. |
సతతము మదర్థములయం, దతులితముగఁ గూడి యుందు వటుగావున భూ
పతి పూనినకార్యం బెఱిఁ, గితి నే నెఱుఁగంగనైతిఁ గేవలజడతన్.
| 232
|
వ. |
ప్రియసఖి దారుణస్వభావలును వక్రరూపిణులును దుష్టావయవసంస్థానవిశేష
సంయుక్తలు నగుకుబ్జలు పెక్కండ్రు గలరు నీకు వారల సాటి సేయం దగదు
ప్రియదర్శన వగునీవు పద్మంబుకరణి వాతంబుచేత నమ్ర వైతి వైననేమి సహజ
సుందరం బయినపద్మంబు వాతంబుచేత నమ్రం బైన నె ట్లనింద్యం బై యుండు
నట్లు సహజసౌందర్యశాలిని వగునీవు వాతోద్రేకంబువలన వక్రత్వంబు నొం
దియు ననింద్య వైతి వని పలికి వెండియు ని ట్లనియె.
| 233
|
తే. |
స్కంధపర్యంతమును నొప్పు గలిగి యుభయ, పార్శ్వముల నొత్తికొని యున్న ప్రబలమయిన
యురముఁ గని సిగ్గువడి సునాభోదరంబు, శాతత వహించె ననఁ జాల సన్నమయ్యె.
| 234
|
క. |
పరిపూర్ణజఘనమును లన, దురుకుచములు విమలహిమకరోపమవక్త్రం
బరుదార నీకె కలిగెను, వరవర్ణిని యెంతరూపవతి వే తలఁపన్.
| 235
|
చ. |
ఘనరవకింకిణీతలితకాంచియుతం బగునీనితంబమున్
గనకనిషంగకాహళవికాసము లైనత్వదీయజంఘిక
ల్సునిచితభంగి దీర్ఘమయి శోభిలు నీదుపదద్వయంబు కాం
చనరుచిశోభితావయవసౌష్ఠవ మింత పొసంగునే చెలీ.
| 236
|
క. |
క్షౌమాంబరంబుఁ జాలిచి, కామిని నీవాయతోరుకాండంబులచే
నాముంగలఁ జను బిసభు, గ్భామపగిదిఁ జూడ్కి కింపు గావించె దిఁకన్.
| 237
|
క. |
ఘనమాయుఁ డైనశంబర, దనుజునియందుఁ గల బహువిధస్ఫుటమాయ
ల్వనజాతనేత్రి నీయం, దనవరతము నొప్పు శతగుణాధికములు నై.
| 238
|
తే. |
సకియ యే నీస్థగుప్రదేశంబు దీర్ఘ, మగుచు రథఘోణమువలె నాయతత గలిగి
యలరు నచ్చోట రాజనీతులు మతులు వి, చిత్రతరయుక్తి శక్తులు జేరి నిలిచె.
| 239
|
వ. |
అని యిట్లు బహుప్రకారంబులఁ గుబ్జారూపంబు కురూపంబైనను సురూపం
బుగాఁ గొనియాడి తదీయవాక్యంబులు లోకగర్హితంబులని యెఱుంగక కార్య
సాధకంబు లని తలంచి హర్షోత్కర్షంబునఁ గైకేయి వెండియు ని ట్లనియె.
| 240
|
చ. |
తలకొని మత్సుతుం డఖిలధారుణి నేలఁగఁ గల్గెనేని యో
నెలఁత మహోన్నతంబయిన నీస్ఠగువందు సుగంధిచందనం
బలఁది సువర్ణకంచుకము నర్మిలి నిచ్చెద నీమొగంబునం
దిలకము దిద్దెద న్విమలదివ్యవిభూషణపఙ్క్తి నిచ్చెదన్.
| 241
|
తే. |
పూర్ణచంద్రునిఁగేరు నీముఖము నాదు, లోచనేందీవరములకు రుచు లొసంగ
ధౌతకాంచనపరిధానధారుణిపయి, నచ్చర బలెం జరించెద వతివ నీవు.
| 242
|
తే. |
నీవు నా కెట్లు దాసివై నెనరు పుట్ట, సేవఁ జేసెద వారీతిఁ జెలియ నీకు
సకలకుబ్జలు విమలభూషణవిభూషి, తాంగు లై సేవఁ గావింతు రనుదినంబు.
| 243
|
క. |
అని యిటు తనుఁ గొనియాడుచుఁ దనబుద్ధికిఁ జిక్కి వేదితలగతశిఖిచా
డ్పునఁ దల్పముపై శయనిం, చినకైకం గాంచి కుబ్జ చెచ్చెరఁ బలికెన్.
| 244
|
మంథరోపదేశంబునఁ గైకేయి క్రోధంబుఁ బూనుట
చ. |
అతివ వృథాప్రసంగ మిపు డర్హమె శాత్రవుఁ డైనరాముఁ డా
తతసకలావనీభరముఁ దాల్చినపిమ్మట నీప్రయత్నముం
|
|
|
గతజలసేతుబంధనముకైవడి శూన్యనివాసదీపసం
గతి యగుఁ గాన నాపనుపుఁ గైకొని వేగమె జేయు మిత్తఱిన్.
| 245
|
ఆ. |
అనిన నట్ల కాక యని కైక రయమునఁ, గుబ్జతోడఁ గూడి క్రోధగృహము
సొచ్చి మైలఁ గట్టి సొమ్ము లుర్వర వైచి, ధర వసించి మరల దాని కనియె.
| 246
|
చ. |
క్షితితనయావిభుండు వనసీమకుఁ బోవుచునుండ మత్సుతుం
డతులితపూజ్యరాజ్యవిభుఁ డయ్యె నటం చల కేకయావనీ
పతి కెఱిఁగింపు కానియెడఁ బ్రాణసఖీ మది నుక్కు దక్కి నా
మృతి నెఱిఁగింపుమా దశరథేశున కాతనియుల్ల ముబ్బఁగన్.
| 247
|
వ. |
అని యి ట్లతిక్రూరంబుగాఁ బలికిన నక్కుబ్జ తనతలం పీడేఱె నని మనంబున
నుబ్బుచు రాముండు రాజ్యస్థుండైన నీకుఁ జేటు వాటిల్లుం గావున నెల్లభం
గుల నతండు వనంబునకుం జను నంతకు నిమ్మౌర్ఖ్యంబు విడువ కుండవలయు
నని యక్కైకకు నొత్తి చెప్పిన నద్దేవి మహాక్రూరంబు లగుతదీయవచశ్శిలీము
ఖంబుల ముహుర్ముహుర్లుఠితాంతరంగ యగుచు హస్తంబు లురంబున నిడి
కొని యమ్మంథరమతంబునకు బహువారంబులు కైవారంబులు సేయుచు
సీతావల్లభున కరణ్యవాసం బొండె నాకు జీవితాంతం బొండె నందాఁక నీయ
లుక డింపక యుండుదాన నదియునుంగాక నిక్కార్యం బొడఁబడు నందాఁక
భోజనమజ్జనపానశయనాదు లుడిగి స్రక్చందనాదిపదార్థంబులం దాస మాని
దివ్యాంబరాభరణాదులం గైసేయకుండెద నని నిష్ఠురంబుగాఁ బ్రతిజ్ఞ జేసి
సర్వాభరణంబులు పుడమిం బడవైచి పుణ్యాంతంబునందు దివంబున నుండి
నేలం బడిన కిన్నరాంగనతెఱంగున ననాప్తరణసంవృతమేదినిపయిం బడి
యుండె నప్పు డప్పడంతి యుదీర్ణసంరంభతమోవృతముఖయును విముక్తముక్తా
మాల్యవిభూషణయు నై యస్తమితతారకంబై తమశ్ఛన్నం బైననభంబు నను
కరించి నప్పు డక్కుబ్జ మణికాంచనవిచిత్రంబు లైనతదీయదివ్యాభరణం
బులు కీలుడిపి యెల్లకడలం జల్లె నవి నక్షత్రంబులు నభంబును బోలె నచ్చటి
వసుంధరను బ్రకాశింపంజేసె ని ట్లేకవేణియును విముక్తభూషణాంబరయు నై
కేకయరాజపుత్రి విపరీతార్ధబోధిత యై యొంటి నేలం బడి నాగాంగనభంగి
నూర్పులు వుచ్చుచు మంథరోపదిష్టకార్యంబు యుక్తం బని నిశ్చయించి మన
చేత నాలోచితం బైనసర్వంబు సమీచీనం బని మెల్లన మంథరకుం జెప్పుచు
నిజోద్యోగం బగునో కాదో యని నిశ్చయాభావంబువలన దీనయై సారెసా
రెకు నాత్మసుఖావహం బైన తన్నిశ్చయోపాయం బొక్కముహూర్తంబు
చింతించి నిశ్చితార్థయై భ్రుకుటిబంధోదీర్ణవదనయై యుండె నప్పు డక్కుబ్జ కైకే
యీకృతకార్యనిశ్చయం బెఱింగి రససాధనాదిసిద్ధి నొందినదానితెఱంగునఁ
బరమప్రీత యయ్యె నంత.
| 248
|
దశరథుఁడు కైకేయీగృహంబునకు వచ్చుట
చ. |
ఇనకులవార్ధిశీతకరుఁ డెల్లి జను ల్విన రాఘవాభిషే
చన మని తెల్పి యవ్వలను సభ్యుల వీడ్కొని తత్ప్రియప్రయో
జనముఁ బ్రియార్హ యైనగుణశాలికిఁ గైకకుఁ దెల్పువేడ్కఁ జ
య్యనఁ జనియెం దదీయవిపులాయతనంబున కాతఁ డున్నతిన్.
| 249
|
సీ. |
క్రౌంచమరాళసారసనాదయు క్తంబు శుకపికశారికాశోభితంబు
చంపకాశోకరసాలప్రసవగంధమిళితలతాగృహవిలసితంబు
తపనీయరౌప్యవితర్దికాలంకృతరమ్యనిశాంతవిరాజమాన
మమృతోపమానభక్ష్యాన్నపానాదికసరసపదార్థోపసంభృతంబు
|
|
తే. |
నిత్యపుష్పఫలోపేతనిఖిలతరువి, కాసితోద్యానసహితంబు కనకరత్న
భూషణవిభూషితంబు నై పొసఁగ నింద్ర, కాంతసదనంబుక్రియ మనఃకాంత మగుచు.
| 251
|
క. |
వాపీకూపంబులచే, నాపాండురదాంతరాజతాసనములచే
నేపారెడు కుబ్జలచే, దీపించెడుదాని రుచులఁ దేలెడుదానిన్.
| 252
|
క. |
కైకేయిగృహముఁ గనుఁగొని, ప్రాకటముగ రాహుయుక్తపాండుఘనచ్ఛ
న్నాకాశముఁ జేరెడు దో, షాకరుగతి నమ్మహార్హసదనముఁ జేరెన్.
| 253
|
ఆ. |
కామబలయుతుండు గావున సురతసు, ఖంబుఁ గోరి తృష్ణ గదుర శయ్య
కడకుఁ బోయి యందుఁ గైకేయిఁ గానక, మనుజవిభుఁడు తనదుమానసమున.
| 255
|
దశరథుఁడు కైకేయిఁ గానక పరితపించుట
సీ. |
రమణి నిత్యము మదాగమనవేళ యెఱింగి మాల్యచందనచేలమండనములఁ
గయిసేసి మోహనాకారమై నారాక కెదురు సూచుచునుండు నిప్పు డేల
తొల్లింటిచందానఁ దొయ్యలి చూపట్ట దని విషాదము నొంది యచట నున్న
ప్రతిహారిఁ గనుఁగొని భామిని యెక్కడఁ జెప్పు మీ వన నది చేతు లళిక
|
|
తే. |
భాగమునఁ జేర్చి దేవరవారిదేవి, యలుక తొడమినడెందాన నల్ల క్రోధ
సదనమున నొంటిఁ గఠినభూశయ్యమీఁద, దీనయయి పడియున్నది దేవ యనిన.
| 256
|
వ. |
విని యదర్శనమాత్రంబున మొదలు సంప్రాప్తవిషాదుం డై యున్న యన్నర
పతి క్రోధాగారప్రవేశశ్రవణంబువలన ద్విగుణీకృతవిషాదుం డై లుళితవ్యాకు
లేంద్రియుం డగుచు మెల్లనఁ గ్రోధాగారంబులోనికిం జని యందు వినిష్కృత్త
యై నలతికపగిదిఁ బుణ్యక్షయంబువలన స్వర్గంబున నుండి పుడమిం ద్రెళ్లిన
|
|
|
దేవతవిధంబున ధరణికిం జనుదెంచిన వేల్పువెలయాలిచందంబునఁ బరమోహ
నార్థంబు ప్రయోగింపంబడినమాయకరణిఁ బరిమ్లార యైనపుష్పమాలిక
కైవడి వాగురాదికంబులచేత నిబద్ధ యైనహరిణిపోలిక వేఁటకానిచేత వనాంత
రంబున విషదీర్ఘబాణంబున నభిహత యైనకరిణిభంగి నసంవృతమేదినిపయిం
బడియున్నదాని నతథోచిత యగుదానిఁ బ్రాణంబులకంటె గరీయసి యగు
దాని రామాభిషేకవిఘాతానుకూలసంకల్ప యగుదానిఁ దరుణి యగుదానిఁ
గైకేయి నవలోకించి యపాపుండును వృద్ధుండు నగుదశరథుండు పరమ
దుఃఖతుండై డాయం జని యరణ్యమధ్యంబున మహాగజంబు పూర్వోక్తవిశే
షణయుక్త యైనకరిణిం బోలె స్నేహంబున నద్దేవిం బరామర్శించి కరంబుల
చేతఁ బరిమార్జనంబుఁ గావించి మదనబాణబాధితుండు గావున మిక్కిలి
సంత్రస్తచేతనుం డై యి ట్లనియె.
| 257
|
దశరథుండు కైకేయిని నానాప్రకారంబుల ననునయించుట
ఉ. |
ఎవ్వనిచేత భంగపడితే మృదుకోకిలవాణి నీమనం
బెవ్వఁడు నొవ్వఁజేసె సొబ గేటికిఁ దప్పె మనోహరాంగి నీ
కివ్విధి నాపయిం గినుక యేల జనించినదో యెఱుంగ నా
కవ్విధ మంత వే దెలుపుమా కమలాయతచారులోచనా.
| 258
|
ఉ. |
ముద్దులగుమ్మ నాదుమునిముక్కున నూపిరి గల్గియుండ నీ
విద్దురవస్థ నొంది తపియించుచు ధాత్రి వసింప నేల నీ
ముద్దుమొగంబు పాంసుకణపూరిత మై యిటు లుండఁ గాంచి నా
కెద్దిసుఖిత్వ మేటి బ్రతు కేగతిఁ దాళుదు నింకఁ జెప్పుమా.
| 259
|
క. |
రాకేందువదన భూతము, సోఁకెనొ శారీరరుజలఁ జొక్కితొ దానిన్
వాకొని చెప్పుము వేగమె, చేకొని దివ్యౌషధంబు సేయింతు నొగిన్.
| 260
|
మ. |
వనజాక్షీ యటు గాకయున్నఁ బరుఁ డెవ్వఁడైన నీ కప్రియం
బొనరింపంగఁ దలంచెనే మఱియుఁ గోపోద్వృత్తి నెవ్వానికై
నను నీ పప్రియముం ఘటింప మదిలోనం బూనితే తెల్పు మె
వ్వని శాసింపుదు నెవ్వని సుఖినిగాఁ బాలింతు నే నియ్యెడన్.
| 261
|
ఉ. |
మానిని యిట్టులుండఁ జలమా భవదిష్టముఁ దెల్పు మెత్తెఱం
గేని యవధ్యు నైన వధియించెద వధ్యుని నైనఁ గాచెదం
బూని దరిద్రునైన ధనపూర్ణునిఁ జేసెద విత్తవత్తముం
డైన దరిద్రుఁ డై వగచున ట్లొనరించెద సిద్ధ మింతయున్.
| 262
|
క. |
జలరుహపత్రేక్షణ నా, బలమును నాధనము నాదుపత్నులు నామి
త్రులు నేను నాకుఁ గలబం, ధులు నీయాజ్ఞం జరింపుదుము గాదె రహిన్.
| 263
|
ఆ. |
బిసరుహాక్షి నీయభిప్రాయ మింతైనఁ, గాదనంగ రాదు గాన నాదు
|
|
|
జీవితానిలంబుచే నైన నొకటెద్దిఁ, గలిగె నేని దానిఁ దెలియఁ జెపుమ.
| 264
|
తే. |
రమణి నీమీఁదఁ గల యనురాగబలము, నెఱిఁగియును మది శంకించు టిది యుచితమె
జలజనేత్ర మత్సుకృతంబు సాక్షి గాఁగఁ, జెలఁగి నీకోర్కిఁ దీర్చెదఁ జెప్పు మిపుడు.
| 265
|
మ. |
జలజాక్షీ సకలాబ్ధిముద్రితధరాచక్రంబు నాయాజ్ఞచే
మెలఁగు న్వంగకళింగమత్స్యకురుకాశ్మీరాదిదేశాధినా
థులు నాకు న్వశు లై చరింతు రెద నెంతోభీతి నచ్చోటులం
గల వస్తుప్రకరంబు లెవ్వియయినం గామించినం దెల్పవే.
| 266
|
వ. |
దేవి నాయందుం గల సామర్థ్యంబును నీపయింగల ప్రేమాతిశయంబును విచా
రించిన భవన్మనోరథంబు సిద్ధించుటకు సందియంబు లేదు ప్రయాసంబు విడిచి
శయనస్థానంబునం గూర్చుండి స్వస్థచిత్తవై నీకు సంప్రాప్తం బైనభయంబుఁ
దెలుపుము సూర్యుండు నీహారంబునుం బోలె దాని నపనయించెద నని బహు
ప్రకారంబుల నమ్మహీవల్లభుం డద్దేవిచిత్తంబు వడయుటకుఁ దగినతెఱంగున
ననునయించిన నమ్మత్తకాశిని రామాభిషేకవిఘ్నరూపం బైనయప్రియం
బెఱింగింప నిశ్చయించి ప్రతిజ్ఞాకరణంబుచేతఁ గ్రమ్మఱ నిర్బంధింప నుపక్రమించి
మన్మథశరవిద్ధుండును గామవేగవశానుగుండు నగుదశరథు నవలోకించి దా
రుణవాక్యంబున ని ట్లనియె.
| 267
|
కైకేయి దశరథునిచే శపథంబుఁ జేయించుట
తే. |
మానవేశ్వర యేను నెవ్వానిచేతఁ, బరుషతఁ బరాభవింపంగఁ బడినదానఁ
గాను నా కొక్కకార్యంబు గలదు దానిఁ, గూర్మి పెంపునఁ దీర్ప దక్షుఁడవు నీవు.
| 268
|
క. |
మోసము సేయక యప్పనిఁ, జేసెద నని నీవు బాసఁ జేసితి వేని
న్భూసంక్రందన యవ్వలఁ, జేసెద వని నమ్మి తలఁపుఁ జెప్పెద నీకున్.
| 269
|
వ. |
అనిన విని యద్ధరారమణుండు భవదాజ్ఞాకారి నైన నాయందు శపథాకాంక్ష
పరిధృతం బయ్యె నని యుద్ధతస్మితుం డై యద్దేవిశిరంబు నిజాంకంబున నిడి
కొని స్వాభిముఖీకరణంబుకొఱకుఁ జికురబంధంబునం గరం బిడి యి ట్లనియె.
| 270
|
క. |
నాకుం గల స్త్రీపురుషుల, నోకాంతా జానకీప్రియునకంటెఁ దగన్
నీకంటెం బ్రియు లెవ్వరు, లేకునికి యెఱుంగ వొక్కొ లేమా యితరుల్.
| 271
|
సీ. |
కమలాక్షి యెవ్వానిఁగానక యొక్కముహూర్తమైనను మని యుండఁజాల
ఘనుఁ డెవ్వఁ డసువులకంటెఁ దక్కినపుత్రకులకంటె నిలఁ బ్రాణికోటికంటె
నట్టిముఖ్యుఁడు జీవనార్హుఁ డజయ్యుఁడు సదయుఁడు నగు రామచంద్రుతోడు
రమణిత్వద్వచనకరణము నుద్దేశించి శపథంబుఁ జేసితి శంక విడిచి
|
|
తే. |
నీకు హిత మాచరింపంగ నిశ్చయించి, యున్న నాబుద్ధిఁ దిలకించి యుష్మదిష్ట
|
|
|
కథనమున నన్నుఁ బ్రోవుము కల్ల గాదు, సత్యమాడితిఁ బుణ్యంబు సాక్షి గాఁగ.
| 272
|
వ. |
అని పలికిన నద్దేవి దశరథుండు తనవలని మోహంపుటురిం దగులుపడియె
నని యూహించి రామశపథపూర్వకస్వవచనక్రియావాక్యంబున సంహృష్ట
యగుచు నిజపుత్రపక్షపాతంబువలనను సర్వప్రకారంబుల విభుండు తనకా
ర్యంబు సఫలంబుఁ గావించు ననెడుహర్షంబువలనను శత్రువుల కైన వచించుట
కశక్యం బైనదాని నభ్యాగతాంతకునిచందంబున నతిఘోరం బగుదానిఁ
బుత్రాభిషేచన రామనివాసన రూపాభిప్రాయం బెఱింగించెదఁ గా కని నిశ్చ
యించి రాజప్రతిజ్ఞ దుష్కరదారుణప్రయోజనవిషయం బగుటవలన విఫల
త్వంబు నొందునో యని శంకించి దాని నశేషసాక్షికరణంబున సుస్థిరత్వంబు
నొందింపం దలంచి భర్త నుద్దేశించి దేవా యిప్పుడు సకలభూతంబులును జం
ద్రాదిత్యాదిగ్రహంబులును నగ్నిపురోగము లైనదేవతలును భూమ్యంతరిక్ష
దివంబులును దిక్కులును నహోరాత్రంబులును గంధర్వరాక్షరాదిదేవయోని
విశేషంబులును నిశాచరభూతంబులును గృహదేవతలును సాక్షిగాఁ బ్రియపుత్ర
సుకృతాదిపరిగ్రహక్రమంబున శపథంబుఁ జేసితివి తత్పూర్వకం బగువరంబు
నా కొసంగితివి నీవు సత్యసంధుండవు ధర్మజ్ఞులలో నుత్తముఁడవు మహాతేజుం
డవు సకలభూతసమక్షంబున నీపలికినపలుకు లర్థవంతంబులు సేయుటకు సంది
యంబు లేదు గదా యని యిట్లు దశరథుని స్వమతంబునందు సంస్థాపించి సత్య
సంధాదివిశేషణంబుల స్వవచనకృతిస్థైర్యంబుకొఱకుఁ బ్రశంసించి నిజాభిప్రా
యంబు దేటపడ ని ట్లనియె.
| 273
|
సీ. |
అవనీశ తొల్లి దేవాసురసంగ్రామమున శంబరుం డనుదనుజవరుని
చే నష్టసంజ్ఞుఁడ వైననీ వవుడు నాచే రక్షితుండ వై చిత్తమందు
మెచ్చి వరద్వయ మిచ్చెద నంటివి తఱి యగునంతకుఁ గరము నమ్మి
నీయొద్ద డాఁచితి నేఁ డవ్వరంబులు దయ సేయు మటు గాక తక్కెనేని
|
|
తే. |
నేఁడె మదుపేక్షకుఁడ వైననీవు చూడ, జీవితంబులు విడిచెద సిద్ధ మట్లు
గాన నను జక్కఁ గొనుకోర్కి గలిగెనేని, వరము లొసఁగి యభీష్టము ల్వడయు మిపుడు.
| 274
|
వ. |
అని పలికిన నద్ధశరథుండు విశేషంబుగాఁ బరస్వరూపం బుక్తంబు గా కున్నను
బూర్వదత్తవరస్మారకవచనమాత్రంబునఁ గైకేయీవశీకృతుండై మృగశబ్దాను
కరణలుబ్ధకవాక్యంబున వశీకృతం బైనమృగంబు వాగురాదిపాశంబునం దగులు
వడినచందంబున ననుకూలవరప్రదానాభ్యుపగమసంజ్ఞం బగుపాశంబునం దగులు
వడియె ని ట్లమ్మహీపతిని సత్యపాశబద్ధుం గావించి కైకేయి వెండియు ని ట్లనియె.
| 275
|
కైకేయి దశరథుని భరతాభిషేచనరామవివాసనరూపవరద్వయం బడుగుట
సీ. |
భూనాథ యొకవరంబునకు మత్సుతునకు ఘనరాజ్యపట్టంబుఁ గట్టవలయు
వినుము రెండవవరంబునకు రాముఁడు జటాజినచీరధారి యై సిరికిఁ బాసి
తాపసవేషంబుఁ దాల్చి చతుర్దశవర్షము ల్దండకావనమునందుఁ
జరియింపవలయు నిత్తెఱఁగున ఘటియింపు మిదియె నామనమున నిరువుకొనిన
|
|
ఆ. |
కార్య మట్లు గానఁ గడఁగి నీ విప్పుడు, రాఘవాభిషేకలగ్నమందె
పూజ్యయౌవరాజ్యమునకు నాతనయుని, విభునిఁ జేయు మవనివిభులు వొగడ.
| 276
|
చ. |
అఱమర దక్కి యివ్వరము లర్థి నొసంగుము సత్యసంగర
స్థిరుఁడవు గమ్ము జన్మకులశీలములం దగఁ గాచికొమ్ము భూ
వరులకు సత్యమే సిరియు వైభవముం బరలోకసాధనో
త్కరమని తాపసు ల్బహువిధంబులఁ బల్మఱు చాటి చెప్పరే.
| 277
|
వ. |
రాజేంద్రా యేను నీచేత దత్తం బైనవరంబునే యడిగితిం గాని నూతనవరం బడి
గినదానఁ గా నని యిట్లు కర్ణశూలాయమానం బగుదారుణవాక్యంబు పలి
కిన విని కొండొకసేపు నిశ్చేష్టితుం డై చిచ్చుతాఁకునం దపించుమహా
గజంబుపోలిక నేలం బడి పొరలుచు నిజాంతర్గతంబున.
| 278
|
దశరథుండు నానాప్రకారంబులఁ గైకెయిని దూఱుట
క. |
ఊహింప సూక్ష్మకారణ, దేహావస్థ లొకొ రుజయొ తీఱనిచేతో
మోహంబొ గాక తక్కిన, నాహా యే నింతవెఱ్ఱి నగుదునె యకటా.
| 279
|
మ. |
అని చింతించుచు గేహినీవచనవజ్రాభోగ్రనారాచదు
ర్దినసమ్మూర్ఛితమానసుం డగుచు ధాత్రీనాథుఁ డొక్కింతసే
పునకుం దేఱి యసంవృతావనిపయిం బొ ల్పేది కూర్చుండి మో
మున దీనత్వము గానుపింప విపదంభోరాశినిర్మగ్నుఁ డై.
| 280
|
మ. |
ఘనమంత్రౌషధరుద్ధవిక్రమమహాకాలాహిమాడ్కిం గడం
గిననిట్టూర్పు నిగిడ్చి యొంటిమెయి వ్యాఘ్రిం గన్న పెన్నిఱ్ఱిచా
డ్పున భార్యం గని భీతి నొంది మరల న్మూర్భాగతుం డై చిరం
బునఁ దె ల్వొంది సుదుఃఖితుం డగుచు నప్పూఁబోఁడితో ని ట్లనున్.
| 281
|
తే. |
పుత్రగర్ధిని దుష్టచారిత్రకులవి, నాశిని నృశంస జానకీనాథుచేతఁ
బరఁగ నాచేత నేమి పాపం బొనర్పఁ, బడియె నిట్టిదుర్వాక్యంబుఁ బలికె దేల.
| 282
|
చ. |
సతతముఁ దల్లినట్ల బలుచందముల న్నినుఁ గొల్చు జానకీ
పతి కహితంబు సేయ మదిఁ బట్టితి వేమినిమిత్త మేను దు
ర్మతి నగునిన్ను దీక్ష్ణగరలప్రథితోరగినట్ల యిల్లు సే
ర్చితి జడబుద్ధిచేఁ జనువుఁ జేసితి నాత్మవినాశనార్థ మై.
| 283
|
ఆ. |
సకలజనులు రాముఁ డకలంకగుణధాముఁ, డనుచు సన్నుతింతు రట్టిపుణ్యు
నందు నేమి నేర మొందించి ఘోరకా, ననమునం జరింపఁ బనుపువాఁడ.
| 284
|
ఆ. |
పుడమి నైన రాజ్యభోగసంపద నైన, బలము నైనఁ బ్రాణపవను నైన
నాసుమిత్ర నైనఁ గౌసల్య నైనను, విడుతుఁ గాని యతని విడువఁజాల.
| 285
|
ఆ. |
అగ్రపుత్రుఁ డైనయవనిసుతాపతిఁ, గనిన నాదుప్రీతి ఘనత కెక్కు
నతనిఁ గాన కున్న నబల మచ్చిత్త మా, నందరహిత మగుచుఁ గుందుచుండు.
| 286
|
తే. |
పన్నుగ సరోజసఖుఁడు లేకున్న జగము, నీరు లేకున్న సస్యంబు నిలుచుఁ గాని
రమణి రాముఁడు లేకున్న నిమిషమయిన, నాదుతనువునఁ బ్రాణంబు పాదుకొనదు.
| 287
|
క. |
అటుగావున నీపదములు, పటురయమున శిరము సోఁకఁ బ్రణమిల్లెద నీ
విటు క్రూరచింత సేయక, కుటిలాలక యొండుకోర్కి గోరు మొసఁగెదన్.
| 288
|
తే. |
పరమదారుణ మయిన యీపాప మెట్టు, లకట నీచేతఁ జింతితం బయ్యె నేఁడు
పుణ్యవర్ధనుఁ డైనరామునకు నెగ్గుఁ, దలఁచుదానికి నిహపరంబులును గలవె.
| 289
|
వ. |
దేవి నీ విప్పు డాడినవాక్యంబు భరతప్రియాప్రియవిషయంబునందు మచ్చి
త్తంబుఁ బరీక్షించుట కని తలంచెద నదియె భవదభిప్రాయం బేని భరతాభి
షేకంబే గోరవలయుం గాని రామునివివాసనంబుఁ గోర నేల తొల్లి నీవు
రాముండు నాకు జ్యేష్ఠపుత్రుండు ధర్మజ్యేష్ఠుం డని పలికితి వది ప్రియవాదిని
నగునీచేత రామకృతశుశ్రూషార్థం బొండె మదీయచిత్తంబు భవదాయత్తం
బై యుండుటకు నొండెఁ గథితం బయ్యె నని యిప్పు డూహించెద నట్లు గా
దేని రామాభిషేకంబునకు సంతసింపక శోకసంతస్తచిత్త వై యిత్తెఱంగున
న న్నేల పరితపింపం జేసెద వైనను శూన్యగ్రహంబు సోఁకి తత్పారవశ్యం
బున ని ట్లప్రియంబుఁ బలికితివి గావలయుఁ దొల్లి యొక్కింతైన భవదీయ
చిత్తం బధర్మాయత్తంబు గాకుండు నట్టి వినయసంపన్న వైవనీ విప్పు డీయధర్మ
కార్యం బవలంబించుటవలన ధర్మిష్ఠం బైనయిక్ష్వాకువంశంబునం దనివార్యం
బైనయనర్థంబు సంప్రాప్తం బయ్యెనని తోచుచున్నది ము న్నొక్కింతైన లోక
విరుద్ధం బగుప్రతికూలవాక్యంబు నీవలన విని యెఱుంగనికారణంబున నేఁ
డివ్వాక్యంబు నమ్ముట కనర్హంబై యున్నది నాకు రాముండు భరతసముండని
బహుప్రకారంబుల నాకుం జెప్పుచుందు వట్టిసమచిత్త వైననీకు రాముని
యందు విరోధభావం బెత్తెఱంగున నుత్పన్నం బయ్యె.
| 290
|
దశరథుఁడు కైకేయికి రామునిసద్గుణంబు లభివర్ణించి బోధించుట
చ. |
అనిశము ధర్మమార్గరతుఁ డై యశ మెల్లెడఁ గూడఁ బెట్టి వా
రనిసుకుమారత న్వఱలురాముఁడు నీపయిఁ జేయుభక్తి నై
నను దలపోయ కిట్లు పదునాలుగువర్షము లుగ్రకాననం
బునఁ జరియింపఁ బంపు మన మూఢమతీ మది నెట్లు సైఁచితే.
| 291
|
తే. |
కౌసలేయుండు భరతునకంటె నధిక, భక్తి శుశ్రూషఁ గావించుఁబరఁగ నీకు
నారఘూత్తముకంటె నీయందు భరతునకుఁ గలవిశేష మేమిఁ గానము లతాంగి.
| 292
|
తే. |
కమలలోచన నీకు రాఘవునకంటె, నన్యుఁ డెవ్వాఁడు వచనక్రియాప్రణామ
వినయగౌరవసేవాదివృత్తులందుఁ, జతురుఁ డెందైనఁ గలఁడె ముజ్జగములందు.
| 293
|
తే. |
తరుణి కాంతోపజీవిశతంబులోన, రమణి యొక్కరిచే నైన రామునందు
బలుకఁబడు పరివాదాపవాదములు ద, లంప లే నట్టిఘను వని కంప నేల.
| 294
|
తే. |
రాఘవుఁడు శుద్ధబుద్ధిచేఁ బ్రాణికోటి, నెపుడు రంజిల్లఁ జేయుచు నిష్టకామ
దానములచేత స్వవశీకృతస్వదేశ, వాసిజనుఁ డై ప్రకాశించు వనజనేత్ర.
| 295
|
తే. |
దానమున దీనజనుల సత్యమున లోక, ములను శుశ్రూషచే గురువులను వింటి
చే రణంబున దుస్సహవైరివరుల, ననిశము జయించి యున్నవాఁ డతఁడు తన్వి.
| 296
|
వ. |
మఱియు సత్యంబును దానంబును దపంబును ద్యాగంబును మిత్రత్వంబును
శుచిత్వంబును నార్జవంబును విద్యయు గురుశుశ్రూషయు నివి మొదలగు
సకలగుణంబు లక్కుమారునందు సన్నివిష్టంబు లై యుండు నట్టిశమాదిగుణ
సంపన్నుండును దేవతుల్యుండు నగురామునియం దెవ్విధంబునఁ బాపంబు
దలంచితివి లోకప్రియవాదియును మహాప్రియుండు నగురాముని వివాసము
గుఱించి వాక్యంబు స్మరించుటకు నైన శక్తుండఁ గా నట్టియేను బ్రియుం డగు
నారాముని భవదర్ధంబు వనంబునకుఁ బొమ్మని యెట్లు పలుకుదు నని పలికి
వెండియు శోకం బగ్గలం బైన దీనవదనుం డగుచు గద్గదకంఠుం డై యి
ట్లనియె.
| 297
|
తే. |
శమదమంబులు సత్యశౌచములు భూత, దయయు దాక్ష్యంబు ధర్మ మేధన్యునందు
నిలిచె నట్టిధరాసుతానేత వనికి, జనినపిమ్మట నేగతిఁ జనుదు నేను.
| 298
|
వ. |
అని పలికి దుఃఖాతురుం డగుచుఁ గ్రమ్మఱ నమ్మహీవల్లభుండు ఘూర్ణమాన
శరీరుం డై శోకార్ణవంబునకుఁ బారంబుఁ బ్రార్థించునయ్యంగనచరణంబులకుం
బడి లేచి యంజలి ఘటియించి యి ట్లనియె.
| 299
|
సీ. |
చతురబ్ధిముద్రితక్షితియందుఁ గలసర్వమును నీ కొసంగెదఁ గినుక విడిచి
తలకొని ధర్మంబు దప్పక యుండ రాఘవునకు శరణంబు గమ్ము పెక్కు
|
|
|
దినములు పుడమిపై మనినకతంబునఁ గడువార్థకంబున బడలి మిగుల
దైన్యము నొంది పుత్రవియోగజనితార్తి కోర్వఁజాలక చేతు లొగ్గి వేఁడు
|
|
తే. |
మామకాంజలిఁ గైకొని మంజువాణి, చాలఁ గారుణ్య మొనరింపఁ జాలుడనిన
వినుచు బడబాగ్నిగతి రౌద్రవేష యగుచు, నలుక రెట్టించి బలికె నవ్వెలఁది పతికి.
| 300
|
సీ. |
భూనాథ మును వరంబు లొసంగి క్రమ్మఱఁ బరితపించెదవు నీపాటినృపులు
విన్న మెత్తురె వారు విన నీదుధార్మికత్వం బెట్లు వాక్రుచ్చి పలుకఁగలవు
మఱియు నాభూపతు ల్మద్వరదానప్రసంగంబుఁ జేసినసమత వారి
కుత్తరం బెయ్యది యొనరఁ జెప్పుదు వీవు భయదదేవాసురభండనమున
|
|
తే. |
నన్నుఁ గాంచిన కేకయనాథపుత్ర, కే నొసంగినవరములు పూని మిథ్య
యనుచుఁ బల్కేదవో నృపజనుల కెల్ల, నపయశం బొనఁగూర్చితి వధిప నీవు.
| 301
|
వ. |
అని గర్హించి పలికి క్రమ్మఱ సత్యంబు ప్రకటంబుగా నిరూపించుతలంపున
ని ట్లనియె.
| 302
|
చ. |
విమలవిచారు లైననృపవీరుల మెచ్చఁ గపోతరక్షణా
ర్థము మును శైబ్యుఁ డన్ నృపుఁడు తత్పిశితార్థియు నైనయొక్కశ్యే
నమునకు నెంతపుణ్యకలనం దనకండలు గోసి యిచ్చి స
త్యముఁ బ్రకటంబుగా నిలిపె ధారుణి నత్తెఱఁ గీ వెఱుంగవే.
| 303
|
చ. |
అదియును గా కలర్కుఁ డనునాతఁడు నేత్రము లిచ్చి పుణ్యసం
పద నిరవందఁడే యది ధ్రువంబుగ నిల్చెనొ లేదొ వార్ధియుం
ద్రిదశగణార్థితుం డయి తుది న్పమయం బొనరించి వేలఁ దాఁ
బదపడి దాఁటెనే ధరణిపాలక సత్యము నూఁది నేఁటికిన్.
| 304
|
చ. |
జనవర పూర్వవృత్తముఁ బ్రసన్నమతిం గని మున్ను నీవు చే
సినసమయంబుఁ దప్పకుము శీలము సత్యముఁ బాయఁ బెట్టి రా
మునిఁ బృథివీశుఁ జేసి యిఁక ముప్పునఁ దప్పుక నగ్రపత్నితో
ననిశముఁ క్రీడ సల్స హృదయంబున జూచితి వేమొ దుర్మతీ.
| 305
|
తే. |
జనవరో త్తమ నాకోర్కి సత్యధర్మ, యుక్త మయినను దద్వ్యతిరిక్తమైన
నిపుడు నీమ్రోల నాచేత నెద్ది పలుకఁ, బడియె దానికి నవ్యధాత్వంబు లేదు.
| 306
|
తే. |
ఎంత లే దని త్రోచి నీ వెల్లి పుడమి, కన్నెమగనికిఁ బట్టంబు గట్టితేని
గరళ మైనను గ్రోలి నీకనులు చల్ల, గాఁగ మేనికిఁ బాసెదఁ గల్ల గాదు.
| 307
|
తే. |
వైభవంబునఁ బొదలు సవతిని గాంచి, యొకనిమిష మైన నోర్వలే నకట దాని
విభుత కంజలిఁ జేయుచు వినయవృత్తి, బ్రతుకుకంటెను జచ్చుట పాడి గాదె.
| 308
|
క. |
జనవర రామవివాసస, మునకంటెను వేఱుకార్యమున నాచిత్తం
బున కానందము కలుగదు, విను భరతునిమీఁదియాన వే యన నేలా.
| 309
|
వ. |
అని యిట్లు పరమదారుణం బైనవాక్యంబుఁ బలికి యూఱకుండిన నమ్మహీరమ
|
|
|
ణుండు మిక్కిలి యవాచ్యం బైనరామునివనవాసంబును భరతునిరాజ్యాభి
షేకంబును విని పరిమశోకాక్రాంతచిత్తుం డై కోపంబునఁ గొండొకసేపు ఱెప్ప
వ్రేయక యప్పడంతిమొగంబుఁ దప్పక చూచుచు నిశ్చేష్టితుం డై యూర
కుండి వెండియు నద్దేవివ్యవసాయంబును దాను జేసినశపథంబునుం దలంచి
యశక్యప్రతిక్రియం బగుటవలన నించుకసేపు ధ్యానంబుఁ జేసి రామా యని
నిట్టూర్పు పుచ్చి సన్నిపాతాదులచేత విపరీతప్రకృతి యైనవానిచందంబున
వ్యాధిగ్రస్తుం డైనవానిపోలిక నున్మత్తునికైవడి మంత్రాహృతవీర్యం బయిన
మహాసర్పంబుభంగి నష్టచిత్తుం డై పరశుచ్ఛిన్నం బైనతరువుమాడ్కి ధరణి
పయిం బడి కొండొకసేపునకు లబ్ధసంజ్ఞుం డై వెండియు దీనవాక్యంబున
ని ట్లనియె.
| 310
|
క. |
రమణి యనర్థం బర్థా, ర్హముగా నెవ్వాఁడు గఱపె నకట పిశాచా
క్రమగతమతివలె దుర్వా, క్యముఁ బల్కుట కోడ వెంత యవివేకినివో.
| 311
|
క. |
ఈసద్వృత్తభ్రంశము, నేసరణి న్ము న్నెఱుంగ మిప్పుడు చెనటీ
యీశీలము విపరీతం, బై సర్వముఁ గానఁబడియె నటు నీయందున్.
| 312
|
క. |
నీ కీభయంబు వొడముట, కేకారణ మాత్మసుతున కీశత్వము సీ
తాకాంతునకు వివాసన, మేకరణిం గోరితివి విహీనప్రజ్ఞా.
| 313
|
తే. |
మగఁడ నగునాదుసుతునకు జగమునకును, దప్పక ప్రియంబుఁ గావింపఁదలఁచితేని
రామవనవాసభరతసామ్రాజ్యరూప, మైన యీపాపభావంబు మాను మిపుడు.
| 314
|
క. |
రామునియం దపరాధం, బేమి విలోకించి పలికితే నీ కిపుడే
నేమి విరోధముఁ జేసితి, నీమాటలు నీతిశాస్త్రనిర్ణీతములే.
| 315
|
తే. |
అతివ నాచిత్త మెరియించు టంతెకాని, రాముఁడు భరింపఁదగినసామ్రాజ్యభార
మేల భరతుఁడు పూను సీతేశుకంటె, భరతుఁ డధికుఁడు నృపనీతిపరతఁ జేసి.
| 316
|
తే. |
అనఘ వనమున కీవు పొమ్మనిన యంత, రాహుసంగ్రస్తుఁ డగునుడురాజుపగిదిఁ
గడువివర్ణత నొందినకౌసలేయు, వదన మేరీతిఁ గనుఁగొనువాఁడఁ జెపుమ.
| 317
|
ఆ. |
మఱియు సకలరాజమధ్యంబునఁ బ్రధాన, హితులఁ గూడి నిశ్చయింపఁబడిన
దాని శత్రురాజదళితసైన్యమునట్ల, కలుషచిత్త యెట్లు గ్రమ్మఱింతు.
| 318
|
సీ. |
జడబుద్ధి యైనదశరథుండు చిరకాల మెత్తెఱంగున రాజ్య మేలె ననుచు
గుణవంతు లగురాజకుంజరు ల్నను వెలిఁ బెట్టరే జానకీప్రియుని యుత్స
వముఁ జూడ వచ్చిన వసుమతీధవులు రాఘవుఁ డాజిచే నేమి కారణమున
నిర్వాసితుం డయ్యె నేఁ డని రాము నుద్దేశించి పలికినఁ దిరిగి వారి
|
|
తే. |
కేమియుత్తర మొసఁగుదు నిపుడు మఱియుఁ, గైకచేఁ బీడితుండ నై కాననమున
కనిచితి నటంచుఁ జెప్పుదునా యటైన, సత్యవిచ్ఛిత్తి కేనోర్వఁజాలు టెట్లు.
| 320
|
సీ. |
అనిశముఁ బ్రియపుత్రయును బ్రియవాదిని ప్రియకామయును మహాప్రియయు వైన
కౌసల్య యయ్యయికాలంబులను దాసియనువున సఖియట్ల జననిపగిది
భగినిచందంబుని భార్యపోలిక నొప్పు నట్టికాంత గుమారుఁ డడవి కేగు
చుండ నన్నే మని యొప్పిదంబులు పల్కు నీదృశం బగుపాప మేను జేసి
|
|
తే. |
యే మని ప్రియంబుఁ జెప్పుదు నంతకాల, మేను నీయందుఁ జేసినహితము నన్నుఁ
బరితపింపఁగఁ జేసె నపథ్యభోజ, నంబు విషరోగినిం బలె నాతి నేఁడు.
| 321
|
వ. |
మఱియు సత్కారోచిత యైనయక్కౌసల్య భవద్విప్రియశంకచే నాచేత నొ
క్కనాఁ డైన సత్కరింపం బడినయది గా దయ్యె నదియునుం గాక.
| 322
|
క. |
వనసంప్రయాణరూపా, వనిజాప్రియవిప్రియంబు వదలక విని గ్ర
క్కున నలసుమిత్ర న న్నే, మని మనమున విశ్వసించు నక్కట చెపుమా.
| 323
|
వ. |
సకలలోకానందకరుం డైనరామభద్రునిఁ బరిత్యజింపం దలంచిన దశరథుం
డింక నేమి యకార్యంబుఁ గావించుటకు వెఱచు నని ధిక్కరింపదే యని వెండి
యు ని ట్లనియె.
| 324
|
ఆ. |
విపినవాసి యైనవిభుని లోకాంతర, వాసి యైననన్ను పరుసతోడ
జనకరాజపుత్రి వినుటకు నెట్లోర్చు, నకట రెండు నప్రియములు గావె.
| 325
|
తే. |
పతివిపినయాత్రయును నాదుపంచతయును, విని మహీసుత గృపణ యై వెండికొండ
క్రేవఁ గిన్నరుఁ బాసిన కిన్నరిక్రియ, వెతలఁ బొంది ప్రాణంబులు విడువ కున్నె.
| 326
|
క. |
వనమునకుఁ జనినరాముని, వనగతుఁ డగువిభునిఁ గూర్చి వగచుమహీజం
గనుఁగొని యేను ధరణిపై, వనితా చిరకాల మింక బ్రతుకఁగఁ జాలన్.
| 327
|
క. |
జననుతుఁ డగురాముని వన, మునకుఁ బనిచి నన్ను దుఃఖమునఁ జంపి రయం
బున భరతుఁ గూడి మోదం, బున విధవా రాజ్య మేలఁ బూనితొ బుద్ధిన్.
| 328
|
తే. |
అసతి వగు నిన్ను మది సతి వనుచు నమ్మి, విదప దుఃఖార్తి నిట్లు తపింపవలసె
|
|
|
నరుఁడు మోహవశంబున గరళయుక్త, మద్యమును గ్రోలి దుఃఖించుమాడ్కి నబల.
| 329
|
క. |
వనమున లబ్ధుఁడు గీతి, ధ్వనిచే మృగమును గడంగి వంచించినచా
డ్పున శతృసాంత్వమున నను, దినమును వంచించి తుది వధించితి వకటా.
| 330
|
తే. |
ఎంతపాపాత్ముఁ డీనృపుఁ డిపుడు గ్రామ్య, సుఖముకొఱకుఁ గుమారుని సూరిసుతుని
వనమునకుఁ బంచె ననుచు సజ్జనులు నన్ను, దూఱరే కల్లుఁ ద్రావిన పాఱునట్లు.
| 331
|
వ. |
దుష్టచారిణీ వరదానవిషయంబునందు రాముండు జటాజినచీరధారియై ముని
వేషంబున వనంబునకుం జనవలయు నని పలికితి విట్టిక్రూరవాక్యంబులు విని
క్షమింపవలసెం గావున మత్పురాకృతదుష్కృతం బివ్విధం బపరిహార్యత్వం
బున నవశ్యం బనుభావ్యం బయ్యె నక్కటా యిది యెంతకష్టం బెంతదుఃఖంబు
చిరకాలంబున నుండి సౌఖ్యంబుకొఱకు నాచేత ననుష్ఠితం బైనభవద్రక్ష
ణంబు గంఠలగ్నం బైనపాశంబుభంగి స్వనాశనంబుకొఱకుఁ బరిణతం
బయ్యె నని పలికి వెండియు ని ట్లనియె.
| 332
|
క. |
బాలుం డేకాంతంబునఁ, గాలాహిని ముట్టినట్లు గానక జడతన్
వాలాయము సతి వని దు, శ్శీలాపాణిగ్రహంబుఁ జేసితి నిన్నున్.
| 333
|
ఉ. |
కాంతకుఁ బ్రీతి సేయ ననుకంప దలంపక రాముని న్వనా
భ్యంతరసీమకుం బనిచె నక్కట యానృపుఁ డెంత చంచలుం
డెంతవివేకశూన్యుఁ డని యెన్నిక వెట్టదె సర్వలోక మా
వంతయు శంక లేక యది యంతయు నిక్కముగాదె దుర్మతీ.
| 334
|
తే. |
రమణి సువ్రతబ్రహ్మచర్యములచేత, గురులచేతను నృపధర్మపరులచేత
సతత ముపకర్షితుం డైనసుతుఁడు మరల, భోగవేళ దుఃఖంబులు వొందె నకట.
| 335
|
క. |
వనమునకుఁ బొమ్ము సుత నీ, వనినంతనె యట్లుగాక యని శీఘ్రమునం
జనుఁ గాని మరలఁ దా నొం, డనఁజాలం డట్టిసుమతి ననుచుట తగవే.
| 336
|
క. |
తనయా నీ విపుడు వనం, బునకుం బొ మ్మనుచుఁ బల్కఁ బో నని నాతో
మునుకొని ప్రతికూలముఁ బ, ల్కిన మేలగుఁ బల్కఁ డట్లు కేవలభక్తిన్.
| 337
|
తే. |
పాపచారిణి పరిశుద్ధభావుఁ డగుట, రామభద్రుండు నాయభిప్రాయ మించు
కైన నెఱుఁగక వనికిఁ బొమ్మనినఁ దడవు, సేయ కప్పుడె చను నేమి సేయఁగలను.
| 338
|
వ. |
మఱియు మహాత్ముం డగురాముండు వనంబునకుం జనిన సర్వలోకధిక్కా
రంబు సహింపంజాలక యేను యమక్షయంబునకుం జనియెద రామప్రవ్రా
జనమస్మరణానంతరంబు ననిష్టం బైన కౌసల్యాదిజనంబునం దేమి పాపం
బాచరించెదవో యని భయంబు వొడముచున్నయది యవ్వల మన్మతానుసారి
|
|
|
జనంబంతయు మనోవాగగోచరం బైనదుఃఖంబు నొందు నీవలన నిక్ష్వాకు
కులోచితం బైనయశం బంతయుఁ బరిక్షీణం బయ్యె రామునకు సహచరుం
డగుటం జేసి లక్ష్మణుం డతని విడువంజాలక వెనువెంట నరణ్యంబునకుం
జను నంతఁ గుమారవనవాసంబును భర్తృమరణంబునుం దలంచి శోకించి
కౌసల్య ప్రాణంబులు విడువం గల దంతట సుమిత్ర నన్నును గౌసల్యను రా
మలక్ష్మణశత్రుఘ్నులం గానక శోకంబున సహగమనంబుఁ జేసి పంచత్వంబు
నొందు నిట్లు కౌసల్యాసుమిత్రలను నన్నును రామలక్షణశత్రుఘ్నులను దుఃఖ
నిమగ్నులం జేసి నాచేతను రామునిచేతను విడువం బడిన శాశ్వతం బైన
యిక్ష్వాకుకులం బాకులంబుగాఁ బరిపాలించుచు సుఖం బుండుము భరతు
నకు రామవనవాసంబు ప్రియం బయ్యెనేని గతజీవితుండ నైననాకుఁ బ్రేత
కృత్యంబు సేయుటకు నతం డర్హుండు గాఁడు మే మందఱ మరిగిన పిదప నీవు
లబ్ధకామితవై పుత్రునిం గూడి విధవారాజ్యంబుగాఁ బరిపాలింపు మీవు రాజ
పుత్రీవ్యపదేశమాత్రంబున మద్గృహంబుఁ బ్రవేశించుటం జేసి నాకుఁ బాపాత్ము
నకుంబోలె నపయశంబును మహాజనసమక్షంబున ధిక్కారంబును సర్వభూతం
బులయం దవమానంబును సంప్రాప్తం బయ్యె నని పలికి వెండియు నమ్మహీ
రమణుండు శోకోద్రేకంబున ని ట్లనియె.
| 339
|
మ. |
అతివేగాన్వితఘోటకవ్రజముతో హస్తీంద్రసంఘంబుతోఁ
జతురస్యందనరాజితో నెపుడు సంచారంబుఁ గావించు నా
క్షితికన్యాధవుఁ డుగ్రకంటకశిలాశ్లిష్టాటవీభూమి నే
గతిఁ బాదంబులచేఁ జరింపఁగలఁ డింక న్భర్తృవిద్వేషిణీ.
| 340
|
చ. |
సరసపదార్థము ల్వలయుచందముల న్బసనొందఁజేయ నే
ర్పరు లగుపాచకుల్ తనకుఁ బక్వతరోదనభక్ష్యభోజ్యము
ల్వరుస నొసంగ నిత్యముఁ గరం బనురక్తి భుజించు జానకీ
వరుఁ డికఁ గందమూలముఖవన్యము లెట్లు భుజించు నక్కటా.
| 341
|
ఉ. |
ధౌతసువర్ణవర్ణపరిధానములన్ గయి సేసి పుష్పశ
య్యాతలమందు నుండెడు మహాసుకుమారుఁడు నాకుమారుఁ డే
రీతి నమంజులాజినపరిక్షతవల్కలముల్ ధరించి ఘో
రాతతకంటకాత్మకఠినావనియందు వసించుఁ జెప్పుమా.
| 342
|
చ. |
మదనవసంతవాసవకుమారమహాసుకుమారమూర్తి వా
రిదనిభగాత్రు నద్భుతచరిత్రునిఁ బుత్రునిఁ జూచి నప్పుడే
ముదుకఁడ నయ్యుఁ గ్రమ్మఱ సమున్నతయౌవన మొంది నిట్లు నె
మ్మది రహియింతు నట్టి జనమాన్యునిఁ బాసి మనంగ నేర్తునే.
| 343
|
వ. |
మఱియు రామారణ్యగమనపూర్వకం బైనభరతాభిషేకం బతిదారుణకృతం
|
|
|
బవ్వాక్యం బెట్టిదుష్కర్మున కైన వినఁదగియెడునది గాదు యువతులు నిం
దింపందగియెడువారని పలుకు లోకవాక్యంబు సర్వసాధారణంబైనను స్వార్థ
పర వగునీయందుం గాని పతివ్రతలయం దవ్వాక్యంబు సార్థకంబై యుండదు
నీవు స్వపరానర్థసాధనస్వభావసంయుక్తవు మత్పరితాపనివేశితాంతఃకరణవు
స్వార్థసాధనపరపు నీచందం బిట్టిదని ము న్నెఱుంగ నైతి సమస్తజగద్ధితాను
సారి యగురామునియందు నాయందు నేమియపరాధంబు విలోకించితివి రా
మప్రవాసనసాధకం బైనభవద్వ్యాపారంబును వ్యసననిమగ్నుం డైనరాముని
నిరీక్షించి జగంబంతయు నతికుపితం బగుఁ బితృపుత్రవధూవరు లన్యోన్యం
బు పరిత్యజించు సూర్యుండు తపింపకున్న నింద్రుండు వర్షింపకున్న లోకంబు
జీవించుంగాని వనంబునకుఁ జనురాముని విలోకించి యననుభూతరామస్వభా
వుం డైనను జీవింపంజాలఁ డే నెట్లు జీవింపంగలవాఁడ భార్యాకారాగతమృ
త్యు వని ని న్నెఱుంగక నజ్ఞానంబున నీతోడం గ్రీడించితిఁ గామభారావసన్నుం
డనైనయేను మహావిషం బైనసర్పంబునుంబోలెఁ జిరకాలంబున నుండి ని
న్నంకభాగంబున నిడికొని తుది నిట్లు నీచేత వధియింపంబడితి దురాత్ముండ
నగునాచేత మహాత్ముఁ డగురాముం డపితృకుం డయ్యె నపుత్రకుండనైన నాచే
తఁ బరిత్యక్తం బైనక్షోభరహితేక్ష్వాకురాజ్యంబును భరతుండు చేకొని సర్వ
జనంబుల విడిచి బంధువుల నెల్ల వధించి భవత్సహితంబుగాఁ బరిపాలింపం
గలఁడు నీవు మద్విమతులయందు స్నేహయుక్తవై యుండుము నేఁ డిట్లు పతి
పత్నీభావంబుఁ దిరస్కరించి యాపత్కాలమందు నుపద్రవకారిణివై క్రూర
వాక్యంబుఁ బలికితి విప్పాపంబున భవదీయదశనంబులు విశీర్యమాణంబు లై
పుడమిం బడ వేల భవదీయరసన సహస్రప్రకారంబుల వ్రయ్య వేల యెన్నఁ
డేనియు నప్రియంబు లగుపరుషవాక్యంబులు పలికి యెఱుంగం డట్టి యభి
రామవాదియు గుణనిత్యసమ్మతుండు నగురామునియం దెవ్విధంబున దోషం
బులు పలికితివి కైకేయీ గ్లాని నధిగమించిన నధిగమింపుము కోపించినఁ గోపిం
వుము నశించిన నశింపుము సహస్రప్రకారంబుల విస్ఫుటితవై మహీతలంబుఁ
బ్రవేశించినఁ బ్రవేశింపుము యప్రియం బైనభవద్వచనంబు సఫలంబు గావిం
పంజాల క్షురోపమానవు మిథ్యాప్రియవాదినివి దుష్టస్వభావవు స్వకులోపఘా
తినివి నమనోహారిణివి ప్రాణహారిణి వగునీవు జీవించియుండుటకు సహింపంజాల
నని పలికి వెండియు ని ట్లనియె.
| 344
|
తే. |
రామభద్రుండు లేనిచో రమణి నాకుఁ, బ్రాణము సుఖంబు యశమును రతియు లేదు
నీదుపదములు ముట్టెద నెలఁత సుప్ర, సన్నవై ప్రోవు రాముని నన్నుఁ బ్రీతి.
| 345
|
క. |
అని యీగతి విలపించుచు, మనుజేంద్రుఁడు దుఃఖశోకమయవీథిలో
మునుఁగుచుఁ దేలుచుఁ గ్రమ్మఱ, వనితపదంబులకు వ్రాలె వ్యాధితుమాడ్కిన్.
| 34
|
వ. |
ఇ ట్లనాథునిభంగి విలపించుచు నతిక్రాంతమర్యాన యై కైకేయిచేత నికృత్త
మర్ముండై చిత్తమూర్ఛయు జీవితవైమనస్యంబునుం బైకొనినఁ బ్రణామపరి
హారబుద్ధిచేత నొండు దిక్కులకుం బ్రవారితంబులైన యద్దేవిచరణంబులు
సంస్పృశింపక యాతురునిపగిది దారుణంబుగాఁ బుడమిం బడి పుణ్యాంతంబున
దేవలోకంబునుండి ధరణిపయిం బడిన యయాతిచందంబు దీనవదనుం డై
యసంవృతమేదినిపయిం బడి రోదనంబు సేయుచున్నమగనిం గని యువతు
లకుం బ్రణామంబు సేయుట కనర్హుం డనియు నంతకుమున్న ననుభూతతావృశ
వ్యసనుం డనియును బుడమిం బడియున్నవాఁ డనియుఁ దలంపక యనర్థరూపయు
ననిష్పన్నప్రయోజకయు నభీతయు భయదర్శినియు నై యక్కైక జనాప
వాదశంకారహితచిత్త యగుచు వెండియుఁ బూర్వదత్తదరంబుల నుద్దేశించి
దశరథుని సంబోధించుచు ని ట్లనియె.
| 347
|
క. |
జననాథ సత్యసంధుఁడ, నని నినుఁ గడు నాడుకొందు వధికరచన మై
మును వరము లిచ్చి లోభపుఁ, దనమున నేఁడేల యీక తప్పెద వకటా.
| 348
|
చ. |
మునుకొని నేఁడు తుచ్ఛజనముల్ వినఁ బల్కిన రాఘవాభిషే
చన మొనరింపకుండిన నసత్యజదోషము వచ్చునంచుఁ బే
ర్కొనియెద వీవు తొల్లి యమరు ల్విన నిచ్చెననన్న మద్వరం
బు నొసఁగకున్న సూనృతసముద్భవపుణ్యము నిన్నుఁ జెందునే.
| 349
|
చ. |
అన విని యమ్మహీరమణుఁ డద్భుతశోకపరీతచిత్తుఁ డై
పనివడి కొంతకాల మటు వల్కక యూరక యుండి వెండియు
న్వనిత మొగంబుఁ జూచి వదనంబునఁ గోపము చెంగలింపఁగాఁ
గనుఁగవ నశ్రువు ల్దొరుఁగ గద్గదికన్ దలయెత్తి యి ట్లనున్.
| 350
|
క. |
మానితగుణుఁ డగురాముఁడు, కాననమున కేగఁ బరమగతి కేఁ జనఁగా
మానిని యవ్వల రాజ్యముఁ బూనికఁ బాలింపు మొదవుఁ బుణ్యము సుఖమున్.
| 351
|
ఉ. |
ఏ నటు దేవలోకమున కేగ సురల్ ననుఁ జూచి జానకీ
జాని సుఖాత్ముఁడే యనినఁ జయ్యన నేమని చెప్పువాఁడ నా
ధీనిధిఁ గానకుం బనిచితిన్ సతికిం బ్రియమార నంటినా
దీనత నొంది కోపమున ధిక్కృతి సేయుదు రేమి సేయుదున్.
| 352
|
వ. |
మఱియుఁ గైకేయి కొసంగినవరంబునకుఁగా సత్యవశుండ నై రాముని వనంబు
నకుం బుచ్చితినని సత్యంబుగాఁ బలికితినేని సకలజనసమక్షంబున నెల్లి రా
ముని రాజ్యంబున కభిషిక్తునిఁ జేసెద నని పలికినవచనంబున కసత్యదోషంబు
కలుగునని పలికి యప్పుడమిఱేఁ డంతకంత కినుమడించిన శోకంబున ని ట్లనియె.
| 353
|
తే. |
తరుణి యనపత్యతాదురితమునఁ బెద్ద, కాల మత్యంతదుఃఖశోకముల బడలి
తుది నతని బుత్రుఁగాఁ గంటి దుష్కరముగ, నట్టిప్రియపుత్రు నెబ్భంగి ననుప నేర్తు.
| 354
|
క. |
శూరుండును గృతవిద్యుఁడు, వీరుండు క్షమాపరుండు విజితేంద్రియుఁడు
న్సారసనేత్రుఁడు రాముఁడు, వారక యేలాగు విడువఁబడు నాచేతన్.
| 355
|
క. |
రాముని నీలోత్పలసమ, ధాముని నాజానులంబితతబాహుని ను
ద్దామబలుని నభిరాముని, భామిని యేపగిది వనికిఁ బంపఁగ నేర్తున్.
| 356
|
ఆ. |
సుఖము లొసఁగ దుఃఖశోకంబులకుఁ బాప, నర్హుఁ డైనరాము నకట నేఁడు
వనికి నెట్లు వుత్తు పరమదుఃఖుని జేసి, దీన నేమి కోర్కె దీరు నీకు.
| 357
|
తే. |
కమలనేత్ర దుఃఖార్హుండు గానిరాఘ, వునికి దుఖంబు సేయక తనువు విడిచి
యనిమిషేంద్రులోకమునకుఁ జనితినేని, యొదవుసౌఖ్యమం దైనఁ గాకున్నఁ గలదె.
| 358
|
క. |
ఓకలుషచిత్త రాముని, నాకుం బ్రియుఁ డయినవాని నయధర్మవిదుం
జేకొని సుజనులు దూఱఁగ, నీకరణి న్వనికిఁ బనిచె దేటికిఁ జెపుమా.
| 359
|
క. |
వనితా రాముని వనికిం, బనిచిన సత్సభలయందుఁ బరిభవము జగం
బున ననుపమాపయశమును, మునుకొని నా కొదవు నిక్కముగఁ దోడ్తోడన్.
| 360
|
వ. |
అని యిట్లు బహుప్రకారంబులఁ బరిభ్రమితచేతస్కుండై యార్తుండై విలపించు
చుండ నమ్మహీపతికిఁ జంద్రమండలమండిత యైనయారాత్రి యతికష్టతరం
బునఁ గించిదవశేషంబుగా నతిక్రమించె నప్పు డద్దశరథుండు వేఁడినిట్టూర్పు
నిగిడించి గగనాసక్తలోచనుండై యంజలిఁ గీలించి పరమార్తుండై విలపిం
చుచు శర్వరి నుద్దేశించి యి ట్లనియె.
| 361
|
సీ. |
విమలనక్షత్రశోభిత యైనశర్వరి యంజలి ఘటియించి యధికభక్తిఁ
బ్రార్థింతు నినుఁ దెల్లవాఱిన రాముని కటవీప్రయాణ మ ట్లావహిల్లుఁ
గావున నామీఁదఁ గరుణించి వేగకు మటు గాక వేగుట యదియు నొక్క
హితమని గణుతింతు నెట్లన్న నెద్దానివలన నా కి ట్లనివార్యమైన
|
|
తే. |
యమితదుఃఖంబు ప్ర్రాప్తించె నట్టి క్షుద్ర, శీలయుఁ బతిఘ్నియును దుష్టచిత్తయుఁ గుల
ఘాతినియుఁ గ్రూరయైన యీకైకయాన, నంబుఁ జూడక తలఁగి చనంగ వచ్చు.
| 362
|
వ. |
అని పలికి వెండియు నతండు శోకరోషంబు లొక్కింత తనలోనఁ దాన యుప
శమించుకొని యప్పడంతిదిక్కు మొగంబై దేవీ సాధువృత్తుండును నల్పావశేషా
|
|
|
యువును సత్యవశగతత్వంబున భవదధీనుండును విశేషించి వల్లభుండ నైననాకుఁ
బ్రసాదం బొసంగుము నీచేత వరబలంబునఁ బ్రతిగ్రహింపఁబడిన రాజ్యంబును
మత్ప్రీత్యర్థంబుగా రామున కొసంగుము రామాభిషేకంబు నాచేత నిర్జనప్రదే
శంబునందు సముదాహృతం బైనది గాదు రాజసభామధ్యంబునం బలుకఁబడిన
యది గావున దాని కసత్యత్వంబు గలుగకుండ సార్థకత్వంబు నొందించి సత్యవశ
గతత్వంబువలన భవదధీనుండ నైననన్నుఁ బ్రోచి కీర్తిలాభంబు పడయు మిక్కా
ర్యంబు నాకును రామునకు లోకంబునకు గురువులకు భరతునకుఁ బ్రియంబై
యుండునని ధర్మబోధంబుగాఁ బలుకుచు శోకరోదనతామ్రాక్షుండై కన్నీరు
నించుచు నిలపించుచున్న యద్ధశరథుం గనుంగొని తదీయవిచిత్రకరుణవిలాపంబు
విని యద్దేవి కోపరసాధిదేవతయుం బోలె నేత్రకోణంబులఁ దామ్రదీధితులు
నిగుడ మొగంబెత్తి యతనిం దనచూపుచిచ్చునం గాల్చుచు నదత్తప్రతివచనయై
యూరకుండె నప్పు డమ్మహీనాథుండు నిత్యంబును మనోనుసారిణియై యుండి
తత్కాలంబున బుద్ధివైపరీత్యంబునఁ బ్రతికూలభాషణంబులు పలుకుచున్నకైకే
యిమొగం బట్టె చూచి రామవివాసనరూపం బగువరంబుఁ దలంచి చిరపరి
చితప్రేమంబున నద్దేవిని ధిక్కరించుటకుం జాలక ప్రియపుత్రుని వనంబునకుం
బనుచుట కోర్వక మూర్ఛాక్రాంతుండై ధరణిపయిం బడియె నిట్లు విసం
జ్ఞుండై పడియున్న యద్దశరథునకుఁ దెలివి దొరకొనుట కవ్విభావరి యనుగ్ర
హించె ననం దూ ర్పెఱ్ఱనగుచు వచ్చెఁ బదంపడి బోధనసాధనమంగళగీతాది
కంబు సెలంగె నప్పుడు దాని నివారించి పుత్రవియోగజనితశోకంబు సహింపం
దరంబుగామికి నేలంబడి వివేష్టమానుండై విలపించుచున్నరాజు నవలోకించి
మరల న త్తెఱవ యి ట్లనియె.
| 363
|
తే. |
జనవరోత్తమ మును నాకు సంశ్రవంబు, స్వీకరించియు దురితంబుఁ జేసినట్లు
ధరణిపయిఁ బడి మిక్కిలి పరితపించె, దేల స్థితియందు నిల్వ నీ కిది గుణంబె.
| 364
|
తే. |
ధర్మవిదు లగువారు సత్యంబు పరమ, ధర్మ మని పల్కి రేనును ధర్మయుక్తిఁ
దడయ కడిగితి నీవును ధర్మ మూఁది, వరము లొసఁగక యిబ్భంగి వగచె దేల.
| 365
|
చ. |
మును తనమేనుఁ గోసి నృపముఖ్యుఁడు శైబ్యుఁడు పక్షి కిచ్చుట
ల్ప్రణుతవదాన్యశేఖరుఁ డలర్కుఁడు పాఱున కక్షు లిచ్చుట
ల్వనినిధి వేల దాఁటి సుకరంబుగ మేదిని ముంప కుండుట
ల్దినకరుఁ డెండ గాయుటయు ధీవర సత్యము నూఁదియేకదా.
| 366
|
క. |
సత్యమునఁ గలుగుఁ బరమును, సత్యంబున నుండు ధర్మసంచయ మెల్లన్
సత్యంబె శ్రుతులు బ్రహ్మము, సత్యేతర మైనదొకటి జగతిం గలదే.
| 367
|
వ. |
రాజేంద్రా యేను ధర్మపరిపాలనార్థంబు నిన్నుం బ్రేరేపించితి నీకు ధర్మసం
రక్షణంబునందు నియతి గల దేని మత్ప్రేరణంబునఁ బుత్రుం డగురాముని వనం
|
|
|
బునకుం బంపు మిమ్మాట ముమ్మాటికిం బలికితి నట్లు సేయవేని నీయెదుట నిప్పు
డే జీవితంబు విడిచెద నని యిట్లు కైకేయిచేతఁ బ్రచోదితుండై యద్దశరథుం
డుపేంద్రకృతం బైనపదత్రయప్రతిశ్రవరూపం బగుపాశంబునం గట్టుపడిన బలి
చందంబున నార్మవినాశకరం బైనసత్యపాశంబునం గట్టువడి విడివడ సమ
ర్థుండు గాక యుగచక్రాంతరంబునం జిక్కిన ధురంబు పగిది నుద్భ్రాంతచిత్తుం
డును వివర్ణవదనుండు నై నేత్రంబుల నశ్రుకణంబులు దొరఁగఁ గొండొకసే
పూరకుండి వెండియు నొక్కింత ధైర్యం బవలంబించి యక్కైకయాననంబు
విలోకే౦ప రోసి యవాఙ్ముఖుం డై యి ట్లనియె.
| 368
|
తే. |
నిగమసంస్కృతమైన యే నీకరంబు, శిఖిసమక్షమునందు నాచే గ్రహింపఁ
బడియె నప్పాణి నిప్పుడు విడుతు నాకుఁ, బ్రియసుతుం డైనభరతుఁ బరిత్యజింతు.
| 369
|
వ. |
మఱియు సూర్యోదయసమయం బయ్యె నింక గురుజనంబు లభిషేకార్థంబు
కల్పితంబులైన సంభారంబులచేత రామాభిషేకంబు నుద్దేశించి నన్ను వేగిర
పడి పలుకుదురు గావున రాముండు కృతాభిషేకుం డై యుండఁగలం డట్లుగాక
నీచేత విఘ్నంబు సంభవించెనేని యతనియాననం బాలోకింప నోడి
యేను బరిత్యక్తకళేబరుండనై లోకాంతరంబునకుం జనియెద నప్పుడు మృతుండ
నైన నాకు సలిలక్రియ సల్పుటకు రామభద్రుండె యర్హుం డగుం గాని
సమాతృకుం డైనభరతుం దర్హుండు గాఁ డేను దొల్లి రామాభిషేకప్రారంభ
వేళయందుఁ దాదృశసుఖయుక్తం బైనజనంబు నవలోకించి యిప్పుడు హత
హర్షం బగుటవలన నిరానందం బైయున్నజనంబును గ్రమ్మఱ నవలోకింపం
జాల నని పలికినఁ బాపచారిణి యగుకైక క్రోధమూర్ఛిత యై వెండియు
ని ట్లనియె.
| 370
|
చ. |
జనవర క్రూరశస్త్రసదృశం బగువాక్యముఁ బల్కె దేల నీ
తనయుని రాము రాఁ బనిచి దారుణకాననసీమకు న్వెస
న్బనిచి మదీయపుత్రునకుఁ బట్టము గట్టి మహాత్మ నన్నుఁ జ
య్యన నసపత్నఁ జేసి చరితార్థుఁడవై సుకృతంబుఁ గాంచుమా.
| 371
|
వ. |
అని పలికిన నమ్మహీరమణుండు తీక్ష్ణంబైన ప్రతోదంబుచేతఁ దాడితంబైన
హయంబుభంగి సారెసారెకుఁ గైకేయీవాక్యచోదితుండై యద్దేవి నవలోకించి
యేను ధర్మపాశంబున బద్ధుండ నైతి మద్బుద్ధి ప్రణష్ట యయ్యె యశస్వియు
జ్యేష్ఠపుత్రుండును బ్రియుండును ధార్మికుండు నగురామునిం జూడఁ గోరెద
నతని రావింపుము.
| 372
|
క. |
అని యిట్లు పలుదెఱంగుల, జననాథుఁడు పరితపించుసమయంబునఁ బూ
ర్వనగశిఖరోపరిస్థిత, ఘనరత్నమువోలెఁ దీవ్రకరుఁ డుదయించెన్.
| 373
|
వసిష్ఠుఁడు దశరథునిమందిరంబునకు వచ్చుట
వ. |
తదనంతరంబ మహాత్ముం డగువశిష్ఠుండు సరయూనదియందు స్నానాద్యనుష్ఠా
నంబులు దీర్చి సునక్షత్రయోగం బైనసుముహూర్తం బరసి శిష్యగణంబు లభి
షేకసంభారంబులు సంగ్రహించుకొని తోడ నడువ సిక్తసమ్మార్జితపథంబును
బతాకాధ్వజభూషితంబు విచిత్రకుసుమాస్తీర్ణంబును సంహృష్టమనుజోపేతం
బును సమృద్ధవిపణాపణంబును మహోత్సవసమాకీర్ణంబును సర్వరాజాభి
నందితంబును సమంతతశ్చందనాగరుధూపపరిధూపితంబు నై పురందరపురం
బునుంబోలె సమస్తకల్యాణభాజకం బై యొప్పు నప్పురవరంబుఁ బ్రవేశించి రాజ
మార్గంబునం జని చని యందు నానాద్విజగణయుతంబును బౌరజానపదాకీర్ణం
బును బ్రాహ్మణోపశోభితంబును యజ్ఞకర్మవిశారదపరమర్త్విగ్జనసదస్యసంపూ
ర్ణంబు నైన యంతఃపురంబు డాయం జని యచ్చటివారి నందఱ నతిక్రమించి
రాజమందిరద్వారంబుఁ బ్రవేశించి యచ్చటికిం జనుదెంచి యున్నవానిఁ బ్రియ
దర్శనుం డగుసుమంత్రుం డనుసూతు నవలోకించి మహీపతికి మారాక యెఱిం
గింపు మని పలికి వెండియు నతని కి ట్లనియె.
| 374
|
వసిష్టుఁడు సుమంత్రునితో దశరథునికిఁ దనరాక యెఱింగింపు మనుట
సీ. |
నిర్మలమందాకినీకంధిజలపూర్ణకమనీయకాంచనఘటశతంబు
భర్మదామపినద్ధపాండరవృషభంబు భూరిచతుర్దంతవారణంబు
నభినవౌదుంబరం బగుభద్రపీఠంబు నసమానరుచిరకన్యాష్టకంబు
కాంచనాలంకృతఘనకేసరాన్వితరమణీయభవ్యతురంగమంబు
|
|
తే. |
చామరంబులు శశినిభచ్ఛత్రమును స, మగ్రశార్దూలచర్మసింహాసనంబు
ఖడ్గమును గార్ముకంబును గనకరథము, వర్ణితంబైన సంయుక్తవాహనంబు.
| 375
|
వ. |
మఱియు హిరణ్మయం బగుభృంగారువును సర్వబీజంబులును గంధంబులును
వివిధంబు లగురత్నంబులును క్షౌద్రంబును దధియును ఘృతంబును క్షీరం
బును లాజలును సమిత్కుశప్రముఖహోమద్రవ్యంబులును సర్వవాదిత్రసం
ఘంబులును బుణ్యంబు లగు మృగపక్షిగణంబులును స్వలంకృత లగు యువ
తులును బౌరజానపదశ్రేష్ఠులును నాచార్యులును బ్రాహ్మణులును శ్రేణిముఖ్యు
లును ధేనువులును బార్థివులును మఱియుం దక్కినమంగళద్రవ్యంబు లన్నియు
నొడఁగూడె మఱియు సమస్తజనంబులు గుతూహలపరులై యున్నవారు గావున
నీవు రయంబున రాజసన్నిధికిం జని నారాక యెఱింగించి రామాభిషేకముహూ
ర్తసమయం బాసన్నంబయ్యె నని చెప్పు మనిన నతం డట్ల కాక యని యవార్య
|
|
|
గమనంబున నంతఃపురంబుఁ బ్రవేశించి దశరథునకుం బాటిల్లిన దురవస్థ యె
ఱుంగనివాఁ డగుటంజేసి యెప్పటియట్ల మహీపాలునికడకుం జని సంప్రీతచే
తస్కుం డగుచు నిటలతటఘటితాంజలిపుటుండై ప్రాతఃకాలార్హంబులును
బరితోషకారణంబులు నైనవాక్యంబుల ని ట్లనియె.
| 376
|
సుమంతుఁడు దశరథుని మేలుకొలుపుట
తే. |
అధిప సంపూర్ణచంద్రోదయంబునందు, సంక్రమితతన్మనోజ్ఞతేజమున జలధి
చెలఁగి సుప్రీతుఁ డగుచు రంజిల్లఁ జేయు, కరణి రంజిల్లఁ జేయుము కరుణ మమ్ము.
| 377
|
ఉ. |
మాతలిజంభసూదనునిమాడ్కి శ్రుతు ల్పరమేష్ఠినట్ల య
బ్జాతసఖుండు చంద్రుఁడును బాయక నెప్పుడు మేదినింబలె
న్భూతలనాథ యే నినుఁ బ్రబోధితుఁ జేసెన మేలుకొమ్ము సం
జాతకుతూహలంబునఁ బ్రసన్నముఖుండవు గమ్ము నాయెడన్.
| 378
|
ఉ. |
రాజవరేణ్య మోద మలరం గృతకౌతుకమంగళుండవై
యోజ దలిర్ప రత్నరుచిరోత్తమభూషణభూషితుండవై
తేజ మెలర్ప భాస్కరుఁడు దేవనగంబున నుండి సర్వది
గ్రాజి వెలుంగ వెల్వడినకైవడి లెమ్ము ప్రసన్నమూర్తివై.
| 379
|
క. |
జననాథ పవనసోములు, దిననాథుఁ డుషర్బుధుండు దేవాధిపుఁడు
న్వననిధివిభుండు శంకరుఁ డనిశము జయ మిత్తు రతిదయామతి నీకున్.
| 380
|
సీ. |
మనుజనాయక రాత్రి చనియె సహస్రాంశుఁ డుదయించె మేల్కాంచి యుచితవిధులు
సలిపి రామాభిపేచనకార్య మొనరింప గడఁగు మరుంధతీకాంతుఁ డఖిల
సంభారములఁ గూర్చి సకలభూపురయుతుం డై నగరద్వారమందు నిలిచి
యున్న వాఁ డెల్లవా రుత్సవశ్రీదర్శనోత్సాహులై కూడి యున్నవారు
|
|
ఆ. |
చందురుండు లేని శర్వరికరణిఁ గా, పరియు లేని పసులపగిది గిబ్బ
లేని మొదవుభంగి నై నీవు లేని వీ, డొనర వేడ్క సేయకున్న దిపుడు.
| 381
|
వ. |
అని పలికిన నతనిస్తుతివచనంబు లాకర్ణించి క్రమ్మఱ నమ్మహీపతి శోకమూర్ఛా
పరవశుం డగుచు నెఱ్ఱనివిరితామరలం దెగడుకన్నులు విచ్చి సుమంత్రు నవలోకించి
నష్టహర్షుఁ డై కైకేయీక్రూరవచననికృత్తమర్ముండ నైననన్ను స్తుతివాక్యంబుల
|
|
|
చేతఁ గ్రమ్మఱ నేల పరితపింపఁ జేసెద వనిన నతం డమ్మహీవిభునిదీనస్వరంబును
వదనంబునందలి వైవర్ణ్యంబును బరికించి యిది యేమియొకో యని వెఱఁ గం
దుచు నేమియుం బలుకనేరక యూరకుండె నప్పుడు స్వనాథ్యోచితవిచారతజ్ఞ
యగుకైక సూతపుత్రు నవలోకించి యి ట్లనియె.
| 382
|
కైక రామునిఁ దోడితెమ్మని సుమంత్రు నియోగించుట
ఉ. |
ఓయి సుమంత్ర రామవిభవోత్సుకుఁ డై జననాథుఁ డీనిశ
న్బాయక నిండుజాగర మొనర్చుటచేఁ గడు డస్సి యిందు ని
ద్రాయుతుఁ డయ్యె నీ వరిగి రాజకుమారవరేణ్యు జానకీ
నాయకు రామభద్రుని జనప్రియుఁ దోడ్కొని రమ్ము చెచ్పెరన్.
| 383
|
వ. |
అని వేగిరపడి పలికిన నద్దేవిపలుకులం దోఁచువిశ్వాసంబువలన నిక్కంబుగా
మహీపతిశాసనంబున నద్దేవి యభిషేకార్థంబు రామునిం దోడ్కొని ర మ్మ
నియె నని తలంచుచుఁ బ్రీతచేతస్కుం డై నాగరహ్రదసంకాశం బయినయంతః
పురంబు నిర్గమించి జనసంబాధం బగుమొగసాలకడకుం జనుదెంచి యచ్చట
నున్న మహీపతులను బౌరుల నుపహారపాణుల నుపస్థితుల విలోకించుచుం
బోవుచుండె నప్పుడు సభాసదనంబునందు నిండి యున్న వేదపారగు లగువిప్రు
లును బలముఖ్యులును మంత్రులును మహీపతులును రాజపురోహితులును
దక్కినసమస్తజనంబు లొక్కట గుంపులు కట్టి తమలోన సూర్యుఁ డుదయించెఁ
గర్కాటకలగ్నంబు డగ్గఱియె సమగ్రవ్యాఘ్రచర్మసమాస్తీర్ణం బగురథంబును
గాంచనమయం బగుభద్రపీఠమును సాగరగంగాయమునాసరస్వతీప్రముఖ
ముఖ్యాపగాసరోవరప్రదకూపజలపూరితంబు లై క్షీరివృక్షపల్లవోపేతంబు లై
పద్మోత్పలకైరవశోభితంబు లైనసరస్సులచందంబునం దనరు ధౌతకలధౌత
ఘటంబులును దధిమధుఘృతలాజదర్భపుష్పక్షీరప్రముఖమంగళద్రవ్యంబులును
సర్వాభరణభూషిత లగువారకాంతలును జంద్రాంశువికచప్రఖ్యంబును రత్న
దండమండితంబును గంధపుష్పాలంకృతంబు నైనవాలవ్యజనంబును సుధాకర
మండలసంకాశపాండరచ్ఛత్రంబును బాండురవృషభంబును బాండురాశ్వం
బును స్రవన్మదద్విపంబును రాజవాహ్యంబులును స్వలంకృతం బగుకన్యాష్టకం
బును సర్వవాదిత్రంబులును సూతమాగధవందిగాయకులును దక్కినసమస్త
మంగళద్రవ్యంబులును సన్నిహితంబు లయ్యె నింకఁ దడ వేల యని వేగిరపడు
చుండిరి మఱియు యోగ్యానర్ఘరత్నవస్తుజాతం బుపాయనంబుగాఁ గొని
రాజశాసనంబున రామాభిషేకంబునకుం జనుదెంచిన మహీపతు లందఱుఁ
గూడుకొని మహీపతిం జూడ మైతిమి సూర్యుం డుదయించె రామాభిషేకసం
భారం బంతయు సజ్జం బయ్యె మనరాక మహీపతి కెఱిఁగించువాఁ డెవ్వండొకో
యని విచారించుచుండ సార్వభౌము లైనయమ్మహీపతుల నందఱ విలోకించి
|
|
|
రాజసత్కృతుం డగుచు సుమంత్రుఁ డేను రాజశాసనంబున రామునిం దోడి
తెచ్చుటకుం బోవుచున్నవాఁడ మీరు దశరథునకు రామునకు విశేషించి పూ
జ్యులు గావున దీర్ఘాయుష్మంతు లైనమీవచనంబువలన దశరథుని కుశలం
బడిగి దర్శనంబునకు రాకుండుటకు నైనకారణంబు నడిగెద నని చెప్పి సామంత
రాజానువర్తనరూపపురాణవృత్తాంతాభిజ్ఞుం డైనసుమంత్రుండు మరలి యంతః
పురద్వారంబు దాఁటి సదాసక్తం బైనయమ్మహనీయమందిరంబుఁ బ్రవేశించి
యమ్మహీపాలునివంశంబుఁ గొనియాడుచు శయనగృహంబులోనికిం జని యవ
నికమాటున నుండి గుణయుక్తంబు లైనయాశీర్వచనంబులచే స్తోత్రంబుఁ గావిం
చుతలంపున ని ట్లనియె.
| 384
|
సుమంత్రుఁడు మహీపతులనియోగంబున మరల దశరథునియొద్ది కరుగుట
క. |
రవిసోములు వాసవవై, శ్రవణులు వహ్నియును మఱియు జలధివిభుండున్
శివుఁడును గారుణ్యంబున, నవనీశ్వర విజయ మిత్తు రనిశము నీకున్.
| 385
|
ఆ. |
అధిప రాత్రి చనియె నర్యముఁ డుదయించె, సర్వకృత్యములును జతను పడియె
రాజవర్య యింక రమణతో మేల్కన, వలయుఁ గార్య మెల్ల సలుపవలయు.
| 386
|
క. |
బలముఖ్యులు భూసురులును, జెలువుగ నైగములు వచ్చి చిత్తంబున మి
మ్మలఘుమతిఁ జూచుకోరికఁ, దలవాకిట నున్నవారు ధరణీనాథా.
| 387
|
క. |
అని పలుకు నలసుమంత్రుని, ఘనబుద్ధిని మంత్రవిదునిఁ గని యతని సుమం
త్రునిఁగా నెఱింగి వెస న, య్యినకులహరిణాంకుఁ డతని కి ట్లని పలికెన్.
| 388
|
దశరథుఁడు రామునిఁ దోడి తెమ్మని సుమంత్రున కాజ్ఞాపించుట
సీ. |
సూతశేఖర నీవు సీతాధిపతిని శీఘ్రమునఁ దో డ్తెమ్మని కైకచేతఁ
బరఁగ నియోగింపఁబడితి వ ట్లనుమత మనిషిద్ధ మనెడున్యాయంబుచేత
మొనసి మచ్ఛాసనంబున వచించినకైకవచన మమోఘ మవ్వాక్య మేల
దీర్పక మరల నేతెంచితి వది నాదుమతమొ కాదో యని మానసమున
|
|
ఆ. |
సంశయించి యిట్లు చనుదెంచితివొ జాగు, సేయవలదు మరలఁ జెప్ప నేల
రయము మీఱ నేగి రాముని రవివంశ, తోయరాశిసోముఁ దోడి తెమ్ము.
| 389
|
చ. |
అనిన మహాప్రసాద మని యాతఁడు నేలినవానియాజ్ఞఁ జ
య్యనఁ దలఁ బూని భక్తివినయప్రమదంబులు మానసంబున
న్బెనఁగొన సంతతోత్సవనవీకృతరాజపథంబునం బురీ
జనములు దన్నుఁ జూచి కడుసంతస మందఁగ నేగె నున్నతిన్.
| 390
|
తే. |
రాజవీథుల నందంద రమణతోడఁ, జెలఁగి శ్రీరామచంద్రాభిషేకకథలఁ
జెప్పుకొనువారిమాటలు చిత్త మలర, నాలకించుచు రయమున నరిగె నతఁడు.
| 391
|
సుమంత్రుఁడు శ్రీరామమందిరముఁ జేర నరుగుట
సీ. |
సురుచిరోరుకవాటశోభితం బగుదాని వేదిశతంబుల వెలయుదానిఁ
గాంచనప్రతిమావికాసితం బగుదాని శరదంబుదములీల వఱలుదాని
రత్నప్రవాళతోరణయుక్తనుగుణాని యమరాచలగుహాభ మైనదానిఁ
జందనాగరుధూపసంయుతం బగుదాని మణిమౌక్తికంబుల మలయుదాని
|
|
తే. |
నమలకైలాసశిఖరాభ మైనదాని, బలరిపునిమందిరముభంగి నలరుదాని
రుచిరమగుదాని రామభద్రునిమనోజ్ఞ, దివ్యమణిమయహేమమందిరముఁ గనియె.
| 393
|
వ. |
మఱియు వరమాల్యాంతరాళవిలంబమాననూతనమణిగణాలంకృతంబును మనో
హరసుగంధబంధురదర్దురశైలశిఖరసంకాశంబును సారసమయూరనినదసంకు
లంబును సుకృతేహామృగాకీర్ణంబును సూక్ష్మచిత్రశిల్పాభిపూర్ణంబును సకల
జనదృష్టిచిత్తాపహారంబును జంద్రభాస్కరసంకాశంబును కుబేరభవనోపమం
బును నానాపతత్రిసమాకులంబును సుమేరుశృంగసన్నిభంబును మహామేఘ
ఘనప్రఖ్యంబును నానారత్నసమాకీర్ణంబును గుబ్జకైరాతకావృకంబును నుప
స్థితప్రాంజలిజనసమన్వితంబును నుపాయనపాణిజానపదజనోపేతంబు నగురామ
భద్రునిభద్రభవనంబు విలోకించి రథంబుతోఁ గూడఁ బ్రవేశించి పురస్థిత
జనంబులచిత్తంబు రంజిల్లం జేయుచు యమ్మందిరంబు మహాధనం బై మహోన్న
తం బై మృగమయూరసంకీర్ణం బై మహాజనాకులం బై మహేంద్రభవనంబుకరణి
నలరుచునికి నానందించుచుఁ గైలాససన్నిభంబు లై స్వలంకృతంబు లై త్రిదశా
లయోపమంబు లై యొప్పుద్వారంబు లవలోకించుచు నచ్చట నున్నరామమ
తానుసారు లగుప్రియజనంబుల నతిక్రమించి శుద్ధాంతంబు డాసి యచ్చట హర్ష
యుక్తంబులు రామాభిషేకార్థప్రయుక్తంబులును రామచంద్రమంగళప్రతిపా
దనప్రయోజనంబులు నగుజనవాక్యంబులు విని యలరుచు మహేంద్రసద్మప్రతి
మంబును రమ్యంబును మృగపక్షిజుష్టంబును సుమేరుశృంగోన్నతంబును మనో
హరప్రభావిరాజమానంబు నగునమ్మహనీయమణిసద్మంబు విలోకించి యందు
విముక్తయాను లై యుపాయనపాణు లై మ్రోల నిండియున్న జానపదుల నంజ
లికారులఁ గోటిపదార్థసంఖ్యాతుల విలోకించి వారలచేత నభిసంవృతం బైన
ద్వారపథంబుఁ జూచి యచ్చట మహామేఘమహీధరసంకాశం బై మదధారా
కలితగండభాగం బై యతిక్రాంతాంకుశం బై యప్రసహ్యం బై యుదగ్రకాయం
బై యొప్పుచున్నదాని రామోపవాహ్యం బైనశత్రుంజయాఖ్యమహాగజంబు
నీక్షించుచుం జని చని యుభయపార్శ్వంబుల స్వలంకృతు లై గజాశ్వరథారూ
ఢు లై యొప్పువారి రాజప్రియుల బహుశతనంఖ్యాకుల మహామాత్యుల
నందఱ నతిక్రమించి యమ్మహాద్వారంబు దాఁటి యచ్చటఁ దేరు డిగ్గి యవ్వల
నసంబాధం బై ప్రాసకార్ముకహస్తు లై మృష్టకుండలు లై యప్రమాదు లై
|
|
|
యేకాగ్రమనస్కు లై పరస్పరానురక్తు లై యొప్పుయువపురుషులచేత నభిర
క్షిత మయిన వేఱొక్కకక్ష్య డాయం జని యందుఁ గాషాయకంచుకధారు లై
స్వయంకృతు లై సుసమాహితు లై యలరునంతఃపురద్వారరక్షకులఁ బరమవృ
ద్ధుల రామప్రియచికీర్షుల విలోకించి వా రందఱుఁ దన్ను సందర్శించి రయం
బువ నాసనంబుల నుండి లేచి ససంభ్రము లై యెదుర్కొని వారి నభినందించి
వినీతాత్ముండును సేవానిపుణుండు నగుసుమంత్రుం డి ట్లనియె.
| 394
|
తే. |
చెలువు మీఱంగ మీరు లోపలికిఁ బోయి, రహి సుమంత్రుఁడు వచ్చి ద్వారమున నిలిచి
యున్నవాఁ డని నారాక యొప్పు మీఱ, మొనసి రామున కెఱిఁగింపుఁ డనిన వారు.
| 395
|
క. |
రయమున లోపలికిం జని, ప్రియాసహితుఁ డైనరామవిభు నుచితగతిన్
నయ మారఁ గాంచి దెల్పిరి, ప్రియ మలర సుమంత్రురాక వినయముతోడన్.
| 396
|
క. |
చెప్పిన నారఘుసత్తముఁ, డప్పుడు గుర్వంతరంగుఁ డయినసుమంత్రుం
దప్పక దోడ్తెమ్మని ముద, మొప్పఁగ సెల వొసఁగ వార లుత్సాహముతోన్.
| 397
|
వ. |
శీఘ్రంబున మరలం జనుదెంచి సుమంత్రునకు రామశాసనం బెఱింగించిన
నతండు ప్రభూతరత్నం బగుసముద్రంబుఁ బ్రవేశించు మహామకరంబుకైవడి
మహావిమానోత్తమవేశ్మసంఘవంతం బైనయంతఃపురంబుఁ బ్రవేశించి యం
దొక్కసుమపర్యంకమధ్యంబున.
| 398
|
సుమంత్రుఁడు రామునికి దశరథనియోగం బెఱింగించుట
సీ. |
కటితటి శోభిల్లు కౌశేయచేలంబు ఘనము చెంగటిమించుకరణిఁ దనర
హరిచందనార్ద్రకాయంబు సంధ్యారాగఘనయుక్తనీలాద్రిగతి వెలుంగ
ఘనహారకలితవక్షము లనన్నక్షత్రశోభితాభ్రముభంగి సొం పెలర్ప
నిరువంక సేవించుపరరాజకీర్తులకరణి ముత్యాలచౌకట్లు మెఱయ
|
|
తే. |
రత్నహారంబు లురమునఁ గ్రాల వామ, భాగమున నుండి జానకి భర్మదండ
చామరము వీవఁ దారకాజానిభంగి, వెలయు రాఘవుని సుఖోపవిష్టుఁ గనియె.
| 399
|
క. |
కని వినయజ్ఞుఁడు సూతుఁడు, మునుకొని తత్పాదమూలములు దల సోఁకం
బ్రణమిల్లి కృతాంజలి యై, వినయంబున నిట్టు లనియె విశ్రుతఫణితిన్.
| 400
|
క. |
అనఘాత్మ నృపతి కేకయ, మనుజేంద్రకుమారికాసమన్వితుఁ డగుచు
న్నినుఁ జూడఁ గోరి ననుఁ దో, డ్కొని రమ్మన వచ్చితి న్బటుత్వరితగతిన్.
| 401
|
క. |
నా విని రాముఁడు మోదం, బావిర్భవ మొంద సూతు నర్హవిధుల సం
భావించి వేగ సీతా, దేవికి ని ట్లనియె వదనదీధితు లడరన్.
| 402
|
క. |
వనితా నృపతియుఁ గైకయు, ఘనబుద్ధి మదర్థమందుఁ గడువడి నభిషే
చనసంయుతపర్యాలో, చనమును గావించుచున్నచందము దోఁచెన్.
| 403
|
వ. |
మఱియుఁ గేకయరాజనందని రాజసౌముఖ్యాదిప్రయోజనంబుకొఱకు సంత
తంబు మృదుమధురభాషణపరిచర్యాభక్తియోగంబుల నమ్మహీపతిచిత్తం
బెఱింగి వర్తించుచుండు నట్టిహితకామానువర్తినియు మదర్థవృద్ధ్యపేక్షిణి
యు నైనయద్దేవి వృద్ధుం డగుమహీపతియభిప్రాయం బెఱింగి సుదక్షిణ
గావున రాజునకుఁ బ్రియంబు పుట్టఁ బరమానందంబున మదభిషేకంబును
గూర్చి రంజిల్లుచున్నదని యూహించెద నట్లు గాదేనిఁ బ్రియాసహితుం డై
మహీరమణుండు మదర్థకామకరుం డైనసుమంత్రుని మత్సకాశంబునకుఁ
బుచ్చునే మదర్థైకప్రయోజనుం డగుసుమంత్రుండు చనుదెంచుటం జేసి
రాజాంతఃపురంబునందు మదర్థైకప్రయోజనం బైనపర్యాలోచనంబు ప్రవ
ర్తించుచున్నది సందియంబు లేదు మహీరమణుం డిప్పుడు నన్ను సామ్రాజ్య
పట్టభద్రునిం జేయు నమ్మహాత్మునిసదనంబునకుం బోయి వచ్చెద నిచ్చట సఖీజ
నంబులతోడం గ్రీడించుచు సుఖం బుండు మని పలికినఁ బతిసన్మానిత యగుసీత
సంతుష్టాంతరంగమృదుమధురభాషణంబుల ని ట్లనియె.
| 404
|
సీ. |
ప్రాణేశ సర్వశుభంబును నినుఁ బొందుఁ బరమేష్ఠి యలశచీపతికిఁ బోలె
నుర్వీశ్వరుఁడు నీకు యువరాజపట్టంబుఁ గట్టువాఁ డుత్తరకాలమందు
రాజసూయమహాధ్వరమున దీక్షితుఁడ వై యజినంబుఁ దాల్చి మహాభూతి
పటుకురంగవిషాణపాణి యై యలరారు నినుఁ గాంచి భజియింతు నెమ్మితోడఁ
|
|
ఆ. |
బోయి రమ్మ వజ్రి పూర్వాశ శమనుండు, పరఁగ దక్షిణాశఁ బాశపాణి
పశ్చిమాశ యక్షపాలుఁ డుత్తరదిశఁ, గాతు రెపుడు నిన్నుఁ గరుణతోడ.
| 405
|
రాముండు దశరథమందిరంబునకుఁ బోవుట
వ. |
అని యిట్లు మంగళం బొసంగి పతివెంట ద్వారపర్యంతం బరుగుదెంచి సముచి
తంబుగా వీడుకొల్పిన ననుష్ఠితార్థమంగళుం డగునారఘుపుంగవుండు సీత
చేత నామంత్రణంబు వడసి గిరిగుహాముఖంబువలకు నిర్గమించుదృప్తకంఠీ
రవంబు చాడ్పున నిజమందిరంబు వెలువడి యంతఃపురద్వారంబునందు బద్ధాం
జలి యై గాచికొని యున్నలక్ష్మణుం గలిసికొని మధ్యమకక్ష్యాంతరంబునందు
వ్యాఘ్రచర్మయుక్తంబును మణిహేమవిభూషితంబును మార్తాండమండలదు
ర్నిరీక్షంబును మేఘగంభీరనిర్హ్రాదంబును గరేణుశిశుకల్పజవతురంగసంగ
తంబును నసంబాధంబును నగుసుందరస్యందనం బారోహించి దివ్యరథాధి
రూఢుం డైనసహస్రాక్షునిచందంబున నందం బగుచు మహాభ్రంబువలన నిర్గ
మించుశశాంకునిభంగి వెలుంగుచు గగనంబునందు స్వనవంతుం డైనపర్జ
న్యునిసొబగున రథనేమిఘటనసంజాతనిస్వనంబున దిగంతంబులు పూరించుచు
నానావనీపకలోకంబుమీఁదఁ దనచల్లనిచూపులు వెదచల్లుచు ఛత్రచామర
|
|
|
హస్తుం డై లక్ష్మణుండు పిఱుందదెస రథంబుమీఁద నుండి బహుప్రకారం
బుల రక్షించుకొనుచుం జనుదేర వాయువేగంబు లగుహయంబులును గిరి
సన్నిభంబు లగుగజంబులును బహుసహస్రంబులు పశ్చాద్భాగంబునం జనుదేర
సన్నద్ధులై ఖడ్గచాపధరులై చందనాగరురూషితులై యోధు లనేకు లగ్రభా
గంబున నడువ సూతమాగధవందిగాయకపాఠకజనంబు లమందానందం
బున నభినందింప మురజమృదంగపణవశంఖకాహళనిస్సాణవేణువీణాప్రముఖ
నిఖిలమంగళవాద్యరవంబులు సెలంగ హయహేషితంబులును గజబృంహి
తంబులును రథనేమినిస్వనంబులును దూర్యఘోషంబులును మాగధాదులస్తుతి
నాదంబులును గాయకులగానస్వనంబులును భూసురులయాశీర్వాదనాదంబు
లును జనంబులహర్షశబ్దంబులును వారకాంతలచరణనూపురక్రేంకారనినదం
బులును వేత్రపాణులసాహోనాదంబులు శూరులసింహనాదంబులు నొక్కటి
యై మిన్ను ముట్టి మ్రోయ హర్మ్యాగ్రభాగంబులనుండి పుపాంగనలు పుష్పం
బులు సేసలుఁ జల్ల భూసురాంగనలు కర్పూరదీపకళికల నివాళింప ననంతవైభ
వాభిరంజితుం డై యారఘుకుంజరుండు శ్రీమంతుం డగువైశ్రవణునిభంగి వె
లుంగుచుఁ గరేణుమాతంగరథాశ్వసంకులం బగుదాని మహాజనౌఘప్రతి
పూర్ణచత్వరం బగుదానిఁ బ్రభూతయానం బగుదాని బహుపణ్యసంచయం
బగుదానిఁ బతాకాధ్వజసంపన్నం బగుదాని మహార్హచందనాగరుధూప
వాసితం బగుదాని నానాజనసమాకులం బగుదాని మహాభ్రసంకాశపాండుర
మందిరోపశోభితం బగుదాని ముఖ్యచందనాగరుసంచయంబులు మహార్హగం
ధంబుల క్షౌమకోశాంబరవితానంబుల నవర్షఘముక్తాజాలంబుల మహనీయస్ఫటి
కోపలంబుల నానాపణప్రసారితనానావిధభవ్యపదార్థంబుల దధ్యక్షతహవిర్లాజ
చందనాగరునానామాల్యోపగంధంబులచేత నిరంతరాభ్యర్చితంబు లైనశృం
గాటకంబుల నభిరంజితం బగుదానిఁ బాండురవిమానంబులచేత గగనంబునుం
బోలెఁ గైలాసశిఖరోపమపాండురమేఘసంకాశరమణీయప్రాసాదశృంగంబుల
చేత నభిరామం బగుదాని రాజమార్గంబుఁ బ్రవేశించి సుందరమందగమనం
బునం బోవుసమయంబున.
| 406
|
పౌరులు రాముని నానావిధంబుల నభినందించుట
చ. |
లలితవిచిత్రహర్మ్యపటలంబులపై నలరారుపౌరకాం
తలు దమలోన నీరఘువతంసుఁడు రాజ్యపదప్రవిష్టుఁ డై
యిల నతులప్రభావమున నేలఁగ నేఁటికిఁ గంటి మెంతయుం
దలఁపఁగ నస్మదీయసుకృతంబు గణింపఁ దరంబె ధాతకున్.
| 407
|
తే. |
చెలఁగి సామ్రాజ్యపట్టాభిషిక్తుఁ డైన, సుతవరుని సిద్ధయాత్రునిఁ జూచి నేఁడు
పుణ్యసాధ్వి గౌసల్య యభూతపూర్వ, ఘనతరానందకలిత యై తనరుఁ గాదె.
| 408
|
తే. |
సోముఁ గూడినరోహిణీభామపగిది, నీజగన్మోహనునిఁ గూడి యింపు మెఱయ
సర్వభోగంబులు భుజించు జనకతనయ, సకలసీమంతినీవతంసంబు గాదె.
| 409
|
క. |
ఈఘనునకుఁ బ్రియగేహిని, యై ఘనరాజ్యాభిషిక్త యగుటకు ము న్నా
మేఘలసత్కచ మహిజ య, మోఘతపం బేమి నిక్కముగ సల్పెనొకో.
| 410
|
క. |
అని యిట్లు రామభద్రుఁడు, వినుచుండఁగఁ జెప్పుకొనుచు వేడుకతోడం
గొనియాడుచు నప్పుణ్యునిఁ, గనుఁగొనుచుండి రటు కౌతుకం బలరారన్.
| 411
|
ఉ. |
ప్రాకటభూరిచత్వరసభాభవనంబులయందు భూజను
ల్మూకలు గట్టి యీపరమపుణ్యుఁడు దీనశరణ్యుఁ డిష్టరా
జ్యైకపదస్థుఁ డయ్యె నహహా మముఁ బోంట్లకు నెల్ల సంతతా
స్తోకతరేష్టసంపదలు సొప్పడుఁ గాదె దలంచి చూడఁగన్.
| 413
|
ఆ. |
ఈమహానుభావుఁ డేలురాష్ట్రంబునఁ గాఁపురములు సేయుఘనుల కమర
లోక మేల యన్యలోకంబు లేల య, భీప్సితార్థసిద్ధు లిందె గలుగు.
| 414
|
తే. |
అనఘుఁ డీరాముఁ డధినాథుఁ డగుచు నుండ, నప్రియము దుఃఖ మొక్కింత యైనఁ గలుగ
దింతకంటె మహీప్రజ కెద్ది లాభ, మితఁడు చిరజీవి యై ధాత్రి నేలుఁ గాక.
| 415
|
రాముఁడు దుఃఖితుం డగుదశరథుం జూచి విచారపడుట
వ. |
మఱియు రాముండు రాజ్యాభిషిక్తుం డగుచుండఁ బితృపితామహులచేత నుప
లాలితు లైనపుత్రపౌత్రకులభంగి మన మందఱము సర్వసుఖంబులు వడయం
గలవారము మన కిప్పుడు భోజనం బేల పరమపురుషార్థసాధనంబు లైనతపస్స్వా
ధ్యాయజపహోమధ్యానాదికంబు లేల యితండు రాజ్యంబునందు సుప్రతిష్ఠి
తుండై శత్రుంజయం బనుమహానాగంబు నారోహించి రాజమార్గంబునం జను
దెంచు నప్పు డిమ్మహనీయమూర్తి నవలోకించునదియె మనకు సుఖలాభం
బైహికవిషయంబుచేతను దజ్జన్యసుఖంబులచేతను శ్రేష్ఠార్థంబు లైనస్వర్గాదుల
చేతను దజ్జన్యసుఖంబులచేతను దృప్తి నొందినవార మగుటకు సందియంబు
లేదు మహాతేజుం డగురామునియభిషేకజన్యయభూమానందబ్రహ్మసాక్షాత్కా
రసుఖంబునకంటెఁ బ్రేమాతిశయాస్పదం బగునొండుకార్యం బొక్కింతయైనఁ
గలుగనేర దదియునుం గాక యీరాఘవుండు దృష్టిపథంబు నతిక్రమించిన
వాఁ డయ్యును సకలజనమనోనయనసమ్మోహనాకారానుభవజనితవాసనాబలం
బునఁ గట్టెదుటం గనుపట్టిన టొప్పుచున్నవాఁ డమ్మహాత్మునివలనం జిత్త
|
|
|
వీక్షణంబులు గ్రమ్మఱించుట కొక్కపురుషుఁడైన సమర్థుండు లేఁడు కాంతలం
జెప్పనేల నొక్కసారియైనఁ దత్సాన్నిధ్యాసాన్నిధ్యంబులయందుఁ జక్షుర్మానసం
లచేత నెవ్వండు రామునిం జూడకుండుఁ గరుణాంతరంగితాపాంగవీక్ష
ణంబుల రాముం డెవ్వని విలోకింపకుండు నట్టివాని లోకంబు గర్హించు
నంతియె కా దే నెంత దుర్భాగ్యుఁడ నని తన్నుఁ దాన గర్హించుకొను నీపర
మోదారుండు సకలవర్ణంబులకు సకలజనంబులకు వయోనురూపం బైనదయ
నొసంగుం గావున సర్వజనంబు లితని కనువ్రతు లై యుందు రని యిట్లు పెక్కు
తెఱంగుల వినుతించువారిభద్రవాక్యంబు లాకర్ణించుచు నెల్లవారిని యథా
ర్హంబుగా వీక్షణోక్తిభ్రూవిక్షేపణాంజలులచేతఁ బూజించుచుఁ బితృపితా
మహులచేత నధిష్ఠితం బైనధర్మమార్గంబు ననుసరించి యభిషిక్తుండ వై చిర
కాలంబు రాజ్యం బేలు మనిపలుకు పరమవృద్ధుల యాశీర్వాదంబులు
వీనులం బొలయ నుత్సుకుం డై మనోహర్షకరంబు లైన సుహృజ్జనులహిత
ప్రసంగంబులు వినుచుఁ జైత్యాయతనదేవాగారంబులకుఁ బ్రదక్షిణంబు
సేయుచుఁ గృతపుష్పోపహారం బై నక్షత్రశోభితం బైనయాకాశపథంబు
మాడ్కిఁ జూడికి వేడ్క సేయుచున్న రాజమార్గంబునం జని చని ముందఱ
రత్నజాలపరిష్కృతంబు లైనవర్ధమానగృహంబులచేత శారదాభ్రప్రతీ
కాశంబు లైనవిమానంబులచేతఁ గైలాసశిఖరాకారంబు లైనమహోన్న
తప్రాసాదశిఖరంబులచేత నభిరామదర్శనం బై యున్న రాజభవనంబుఁ గాంచి
హర్షపులకితగాత్రుం డై యమ్మణిమయమందిరంబుఁ బ్రవేశించి కక్ష్యాత్రయం
బతిక్రమించి యచ్చట రథంబు డిగ్గి తేవసంబున నవ్వలికక్ష్యాద్వయంబు
దాఁటి సహచరుల నందఱ నచ్చట నిలువ నియమించి క్రమంబునఁ గక్ష్యాం
తరంబు లన్నియు నతిక్రమించి శుద్ధాంతఃపురంబుఁ బ్రవేశించె జనం
బంతయుఁ జంద్రోదయంబు నాకాంక్షించుసరిత్పతిభంగి రాముని పునరాగమ
నంబుఁ గోరుచు మధ్యమద్వారంబున నుండె రామభద్రుం డట్లు సముచితం
బుగా నంతఃపురంబునకుం జని యందుఁ గైకేయీసహితుండై పర్యంక
మధ్యంబునం బవ్వళించి మొగంబున వైవర్ణ్యంబు దోఁపఁ గన్నుంగవ మోడ్చి
యున్నతండ్రి నవలోకించి తదీయచరణంబులకు నిజనామోచ్చారణపూర్వ
కంబుగా నభివందనంబుఁ గావించి పదంపడి కైకేయిపదంబులకు నమస్కరిం
చిన నద్దశరథుండు మెల్లనఁ గన్నులు విచ్చి కుమారువదనంబు విలోకించి
రామా యని పేర్కొని బాష్పపర్యాకులేక్షణుం డై యతని విలోకించుటకుం
జాలక గ్రమ్మఱ నేత్రంబులు ముకుళించి రామా యనెడు నక్షరద్వయోచ్చార
ణంబుకంటె నధికం బుచ్చరించుటకు భరం బై తోఁచిన నతనితోడ సంభా
షించుటకుం జాల కుండె నివ్విధంబున క్షుభితం బగుసముద్రంబుపగిది నుపప్లు
|
|
|
తుం డైనసూర్యునిభంగి ననృతం బాడినమహర్షిపోలిక వ్యధితాకులితచిత్తుం
డై తేజోహీనుం డై శోకసంతాపకర్శితుం డై యదృష్టపూర్వవిషాదుం డై
యప్రహృష్టేంద్రియుం డై యూర్పులు పుచ్చుచున్నదశరథుం జూచి పాదం
బుచేతఁ బన్నగంబును సంస్పృశించినవానిపగిది భయంబుఁ గొని యచింత్య
కల్పం బైనజనకునిశోకంబు విలోకించి పర్వకాలసముద్రునిభంగి సంరబ్ధతరుం
డై పితృహితతత్పరుం డగురాముండు తొల్లి పరోక్షంబునందు నాయందుఁ గుపి
తుం డయ్యును నన్నువిలోకించినప్పుడు ప్రసాదం బొసంగు నట్టిపరమదయాళుం
డైనయిమ్మహీరమణుం డిపు డేలకో నన్ను విలోకించి ప్రీతి సేయక దుఃఖంబు
నొందియున్నవాఁ డని విచారించి విషణ్ణవదనుం డై దీనుండునుంబోలె శోకా
ర్తుం డై కైకేయి కి ట్లనియె.
| 416
|
రాముఁడు దశరథదుఃఖకారణముఁ గైకేయి నడుగుట
చ. |
అతులకృపాసమృద్ధి నను నక్కునఁ జేర్చెడునట్టితండ్రి నేఁ
డతికుపితాత్ముఁ డై యునికి కైనవిధం బెఱిఁగింపు మేను దు
ర్మతి నొనరించినట్టియపరాధ మొకింతయు లేదు తల్లితో
హితమతితోడ నీ వయిన నివ్విభు వేఁడు మనుగ్రహార్థ మై.
| 417
|
చ. |
ఇలపయి దేహధారులకు నెప్పు డపాయము లేనిసౌఖ్యము
ల్గలుగుట చాల దుర్లభము గావున మానవభర్త కంగహృ
త్కలితరుజావిశేషములు గల్గెనొ లే కనృతంబు లాడెనో
కలతెఱఁ గంతయుం దెలుపఁ గాఁ దగు నీ కిటు దాఁచ నేటికిన్.
| 418
|
క. |
భరతునియందు సుమిత్రా, వరపుత్రునియందు మాతృవర్గమునందు
న్నరవరుఁ డశుభం బేమియుఁ, బరికించెనొ దానిఁ దెలియఁబలుకుము నాతోన్.
| 419
|
క. |
జనకునకుఁ బ్రీతి సేయక, జనకునివాక్యంబు భక్తి సలుపక ధరలో
జననీ యొకత్రుటి యైనను, మనఁ జాలను గుపితుఁ డైన మనుటకు వశమే.
| 420
|
క. |
తనపుట్టువునకు మూలం, బని యెఱుఁగువివేకశాలి యగునరుఁ డేలా
జనకుని యనువర్తింపఁడు, తన కిలఁ బ్రత్యక్షదైవతం బగుచుండన్.
| 421
|
ఆ. |
జనని నీవు గర్వమునఁ గోపచిత్త వై, పరుషభాషణములు పలికి తొక్కొ
తండ్రిచంద మెల్లఁ దగఁ జెప్ప కుండిన, నిమిష మైన నోర్వనేర నింక.
| 422
|
క. |
శ్రీమహితరూపుఁ డగునీ, భూమీశ్వరునం దభూతపూర్వవికారం
బేమికతంబునఁ బొడమె ద, యామతి నెఱిఁగింపు మమ్మ యనవద్యగుణా.
| 423
|
కైక రామునికి మున్ను తనకు దశరథుఁడు వరద్వయం బిచ్చిన తెఱం గెఱింగించుట
వ. |
అనిన విని యయ్యంగన శంకారహితాంతరంగ యై సిగ్గు విడిచి రఘుపుంగవు నవ
లోకించి వుత్రా భవజ్జనకుండు గుపితుండు గాఁ డతనికి వ్యసనంబు లే దొక్కింత
మనోగతం బైనకార్యంబు గలదు ప్రియార్హుండ వైన నీతోడ నప్రియంబుఁ
|
|
|
బలుకంజాలక భయంబుఁ గొని యున్నవాఁడు నేను జనకునియట్ల నీకు మన్నిం
చుటకుం దగినదాన నగుటం జేసి నాచేత నేది పలుకం బడు నక్కార్యంబు
నీ కవశ్యకర్తవ్యంబు గదా తొల్లి యీమహీరమణుండు దేవాసురసంగ్రామంబున
నన్ను మన్నించి వరద్వయం బిచ్చెద నని పలికి పదంపడి ప్రాకృతునియట్ల పరి
తపించుచు సకలధర్మమూలం బైనసత్యంబు విడిచి భవన్నిమిత్తంబున నాయం
దుఁ గుపితుం డై రోషదోషంబున నవ్వరంబులు వ్యర్థంబులు సేయం దలం
చియున్నవాఁడు తన్మనోగతం బైనకార్యంబు నీవు నిక్కంబుగా నెఱవేర్చెద
వంటి వేని యతండు చెప్ప కున్న రాజానుమతంబున నేను దెలియఁ జెప్పెద
నిమ్మహీపతి వరంబు లిచ్చెద నని పలికి క్రమ్మఱ లోభంబునఁ దప్పించుకొనఁ
దలంచు టెల్ల గతజలసేతుబంధనంబు గదా యని పలికిన రాముండు వ్యధితుండై
రాజసమక్షంబునఁ గైకేయి కి ట్లనియె.
| 424
|
రాముఁడు దశరథానుమతంబు నెఱవేర్చెద నని ప్రతిజ్ఞఁ జేయుట
ఉ. |
ఇచ్చట రాజు దా నొడువ నిచ్చఁ దలంచినమాటఁ జెప్పు మే
జెచ్చెరఁ జేయువాఁడ నృపశేఖరునాజ్ఞ విషంబు నైన నే
నొచ్చెము లేక గ్రోలెదఁ బయోధిహుతాశనులందు నైన నేఁ
జొచ్చెద రాఘవుం డరసి చూచిన నాడినమాట దప్పునే.
| 425
|
వ. |
దేవీ యిమ్మహాత్ముండు నాకు గురుండును దండ్రియు నృపుండును హితుండును
గావున నట్టివానివాక్యకరణంబునందు సందేహవిషయీభూతునిఁగా నన్నుఁ
దలంచుట నీకు యుక్తంబు గాదు.
| 426
|
చ. |
అన విని కైక యి ట్లనియె నాతనితో మును దేవదైత్యభం
డనమున భూవరుండు జగడం బొనరించి నిశాటబాణపా
తనమున మూర్ఛపోయినఁ బదంపడి యేను సజీవుఁ జేయ లో
ననుఁ గరుణించి సమ్మదమునన్ వరయుగ్మ మొసంగె మెచ్చుచున్.
| 427
|
కైక రామునికిఁ దాను వరద్వయంబునకుఁ గోరిన తెఱంగుఁ జెప్పుట
క. |
అనఘాత్మ యొకవరంబున, కనుపమగతి మత్తనయున కభిషేకముఁ ద
క్కిన రెండవవరమునకుం, గొనకొని నీ కడవి నునికిఁ గోరితి నిచటన్.
| 428
|
క. |
జనకుని సత్యవ్రతునిఁ గ, నొనరింపఁగఁ దలఁచి తేని యుత్తమగుణయు
క్తిని నా చెప్పెడువాక్యము, వినుము విచారంబుఁ దక్కి విమలవిచారా.
| 429
|
సీ. |
జనకునిశాసనంబున నీవు ఘనజటాజినచీరధారి వై సిరిని విడిచి
తాపసవేషంబుఁ దాల్చి చతుర్దశవర్షము ల్దండకావనమునందు
విహరింపవలయు నీవిభునిచే భవదర్ధమందె భరతుఁడు గృతాభిషేకుఁ
డై యయోధ్యాపురమందు రాజ్యం బేలు నిమ్మాటఁ జెప్పుట కీనృపుండు
|
|
తే. |
నేరక వివణ్ణవదనుఁ డై నిన్నుఁ జూడ, వెఱచి యున్నాఁడు గావున విభునిమాట
|
|
|
దప్ప కుండంగ వనమున కిప్పు డరిగి, నృపవరుని సత్యమున నుద్ధరింపు మనఘ.
| 430
|
వ. |
అని పలికిన మరణోపమం బైనయద్దేవిపరుషవాక్యం బాకర్ణించి యవ్వాక్యం
బప్రియం బైనను మహానుభావుడు గావున నొక్కింత యైన మనంబున శో
కంబు నొందక వదనంబున వైవర్ణ్యాదిబాహ్యవికారంబు నొందక వెండియుఁ
గైకేయి కి ట్లనియె.
| 431
|
రాముఁడు కైకేయి చెప్పినప్రకారము ఒప్పుకొనుట
చ. |
అనఘవిచారుఁ డైనపతియాజ్ఞ శిరంబునఁ బూని వేడ్కతో
ననుపమబుద్ధి నీకఱపినట్ల జటాజినముల్ ధరించి కా
ననమున కేగెద న్మనుజనాయకుఁ డేటికి నన్నుఁ జూచి నె
మ్మనమున విశ్వసింపక విపన్నత నొందె నెఱుంగఁ జెప్పుమా.
| 432
|
క. |
మనమున దైన్యము విడువుము, వని కరిగెద నిపుడు జడలు వల్కలములు గ్ర
క్కునఁ దాల్చి సంతసింపుము, పనివడి నీమ్రోల నిజముఁ బల్కితిఁ దల్లీ.
| 433
|
క. |
క్షితివిభుఁడు గురుఁడు దండ్రియు, హితుఁడు గృతజ్ఞుండు నమ్మహీశువచనము
న్హితమతి విస్రబ్ధుఁడ నై, చతురతఁ గావింతుఁ గాక జవదాఁటుదునే.
| 434
|
క. |
జననీ భరతునియభిషే, చన మీనరవిభుఁడు దానె సమ్మతితోఁ జె
ప్పనికారణమున నామన, మనలజ్వాలికల నేర్చిన ట్లయ్యె రహిన్.
| 435
|
ఆ. |
అప్రచోదితుండ నయ్యును భరతున, కఖిలరాజ్య మిచ్చునట్టివాఁడ
జనకుచేత నిట్లు సంప్రచోదితుఁడ నై, యిచ్చుటకు విచార మేల గలుగు.
| 436
|
సీ. |
కావున జననీ భూకాంతుఁ డాడినమాటఁ జెల్లించుటకుఁ బూని యెల్లసిరులు
భరతున కొసఁగి సంపద్భోగములు వీడి నయశాలినికి నీకుఁ బ్రియము గాఁగఁ
బదునాల్గువర్షము ల్వనమున నుండిన నిపుడు భూవిభుఁ డేల హితము విడిచి
యాస్యంబు వాంచి ధరాసక్తనయనుఁ డై కన్నీరు నించుచు నున్నవాఁడు
|
|
తే. |
మానవేంద్రుని వేగ ననూనయింపు, మిపుడె కేకయధరణీశు నింట నున్న
భరతు నిచటికిఁ దోడ్తేర బటురయమున, జారులను బుచ్చుము నృపాలుశాసనమున.
| 437
|
కైకేయి రామునితో భరతాగమనపర్యంతం బుండవలదని వేగిరపడి చెప్పుట
వ. |
అని పలికిన నారఘువుంగవుండు సమ్మతించుటకు సంతుష్టాంతరంగ యై యయ్యం
గన నీచెప్పినట్ల శీఘ్రగతు లగుదూతలం బంచి మాతులకులంబున నున్నభర
తుని రావించెద నతం డరుగుదెంచునందాఁక నీ విచ్చట నుండవలదు రయంబున
నిపుడె వనంబునకుం జను మిమ్మహీరమణుండు నిజసత్యపారప్రాప్త్యదర్శన
సంజాతవ్రీడాభరంబున మొగంబు వాంచి మూర్ఛాక్రాంతుం డై సంభాషిం
చుటకుం జాలక యున్నవాఁ డిట్టివానిసంభాషణంబునుం గూర్చి చింతించుటకు
కార్యంబు గాదు నీ వవిలంబగమనంబున నిద్ధరపతిదైన్యం బపనయింపవల
యు నదియునుం గాక నీ వరణ్యంబునకుం జనునందాఁక భవజ్జనకుండు మజ్జన
|
|
|
భోజనాదులు సలుపం డని వేగిరపడి పలికిన నక్కైకేయిదారుణవాక్యంబు
విని యక్కకుత్స్థకులతిలకుండు ధైర్యధుర్యుండు గావున నొక్కింత యైన మ
నంబున శోకింపక కైకేయివచనంబునకు రోయుచు శోకపరిప్లుతుం డై యూ
ర్పులు వుచ్చుచు హేమభూషితం బైనపర్యంకంబుమీఁదం బడి పొరలుచున్న
తండ్రిం గ్రుచ్చి యెత్తి సాంత్వవచనంబులం చేర్చుచుఁ గశచేతఁ దాడితం
బైనవాజిచందంబున వనగమనంబునందుఁ గృతత్వరుండై వెండియుఁ గైక కి
ట్లనియె.
| 438
|
సీ. |
జనని నే ధనపరుండను గాను లోకంబు నొగి సంగ్రహించుట కుత్సహింప
నను మునిసమునిఁ గా నయసత్యధర్మతత్పరునిఁ గా నెఱుఁగుము పరఁగ నెద్ది
నాచేతఁ బతికిఁ బ్రాణత్యాగమున నైన సత్త్రియం బొనరింప శక్య మదియుఁ
గృత మయ్యె నని నీవు మతి నెఱుంగుము జనవిభునకు హితముఁ గావించుకంటెఁ
|
|
తే. |
దలఁప నాకుర్వి వేఱొక్కధర్మ మెద్ది, లేదు గావున నృపుఁడు దా నూఁది చెప్ప
కున్న నీయాజ్ఞ శిరమున నునిచి గహన, వాటి నుండెదఁ బదునాల్గువత్సరములు.
| 439
|
వ. |
తల్లీ నీవు నా కత్యంతనియంత్రి వయ్యు భరతున కభిషేకంబుఁ గావించి నీవు
వనంబునకుం జను మని భవద్వచనకారి నైనసన్ను నియోగింపక మహావిభుని
నిర్బంధించితివి గావున నాయందు సన్నివిష్టం బైనయార్జవౌదార్యాదిగుణం
బించుకయైన నెఱుంగనిదాన వని యూహించెద.
| 440
|
రాముఁడు దశరథునకు నమస్కరించి బయలుదేరుట
ఆ. |
జననివగపుఁ దీర్చి జనకకుమారి న, నూనయించి పిదపఁ గాననమున
కిపుడె పోవువాఁడఁ గృపఁ జేసి యందాఁక, దడవొసంగ వలయు ధర్మయుక్తి.
| 441
|
క. |
భరతుఁడు రాజ్యం బేలుచు, గురునకు శుశ్రూష సేయుగుణ మగు టె ట్లా
తెఱఁగున నీచే సుగుణో, త్క రమునఁ గర్తవ్య మది ప్రథమధర్మ మగున్.
| 442
|
క. |
అని పలుకుసుతునిమాటలు, విని భూపతి భూరిశోకవివశాత్మకుఁ డై
కనుఁగొనల నశ్రు లొలుకఁగఁ, గనుఁగవ ముకుళించి ఘోరగతి దుఃఖించెన్.
| 443
|
ఉ. |
అంత మహీశుపాదముల కారఘునేత నమస్కరించి త
త్కాంతపదద్వయంబునకు దండముఁ బెట్టి తదీయమందిరా
భ్యంతరసీమఁ దా వెడలె నశ్రులు నించుచు లక్ష్మణుండు దా
నెంతయుఁ గ్రుద్ధుఁ డై వదన మెత్తక వెంబడి నేగుదేరఁగన్.
| 444
|
తే. |
జానకీజాని యాభిషేచనికభాండ, మపుడు వలగొని చనియెఁ దా నందు మిగుల
దృష్టి సొరనీక కరము సాపేక్షఁ డగుచు, మందగతి నిష్టజనములు సందడింప.
| 445
|
ఆ. |
రజనికాంత జగతి రాకాసుధాంశుని, కాంతి మాపలేనికరణి రాజ్య
నాశ మతనిమోమునం గలఘనకాంతి, నపహరింపఁ జాల దయ్యె నహహ.
| 446
|
తే. |
అవని దిగనాడి వనమున కరుగ నున్న, యతనిమానసవైక్లబ్య మచటివారి
కేమిఁ గనుపట్ట దయ్యె నదెంత చిత్ర, మఖిలలోకాతిగునిచిత్త మట్ల సనుము.
| 447
|
క. |
విగతాతపత్రచామరుఁ, డగుచు రథము డిగ్గి యనుచరాలి విడిచి యొ
ప్పుగ నింద్రియములు వెంటం, దగులక మది దుఃఖ మడఁచెఁ దద్దయుఁ దాల్మిన్.
| 448
|
క. |
అంతటఁ బురజనములు శ్రీ, మంతుం డగునతనివదనమండలమున నొ
క్కిం తైనవిషాదముఁ గన, రెంత మహాత్ముఁడు జనకజేశ్వరుఁ డహహా.
| 449
|
తే. |
శరదుదీర్ణాంశుఁ డగుపూర్ణచంద్రుఁ డాత్మ, తేజమును బోలె నమ్మహాధీరవరుఁడు
వితత మగునిజహర్షంబు విడువఁ డయ్యె, విమలవిజ్ఞానధైర్యవివేకయుక్తి.
| 450
|
వ. |
అప్పుడు విపులవిక్రముం డగులక్ష్మణుండు రామునియట్ల దుఖంబు మనంబున
నిడికొని యమ్మహాత్ముని వెంటం జనుచుండె నివ్విధంబున నారఘుపుంగవుండు
సమానశోకుం డగుసౌమిత్రితోడ నరుగుదేరఁ బ్రాణనాశశంకచేత సుహృజ్జనం
బుల కభిషేకవిఘాతకథావృత్తాంతంబుఁ జెప్పక యెప్పటియట్ల మధురవాక్యం
బున మన్నించుచు సాక్షాత్కృతనిత్యనిరతిశయానందాత్ముండై కౌసల్యానివాస
యోగ్యం బైనదివ్యమందిరంబునకుం జనియె నంత నిక్కడఁ బురుషశార్దూలుం
డగురాముఁడు మాతృగృహంబునకుం జనినపిమ్మట దురంతచింతాభరపరి
శ్రాంత లై యంతఃపురకాంత లెల్ల నొక్కట నార్తధ్వనులు సేయుచుఁ
దమలో నిట్లని విలపించిరి.
| 451
|
అంతఃపురస్త్రీలందఱు విలపించుట
ఉ. |
నెయ్య మెలర్ప నెవ్వఁ డిట నిత్యము భూపతిచే నచోదితుం
డయ్యును రాష్ట్రకృత్యములయందు జితశ్రముఁ డై చరించు సా
హాయ్యము సేసి యెవ్వఁడు జనాలికి సద్గతి యై చెలంగువాఁ
డయ్యవనీసుతాపతి మహాగహనంబున కేగు నక్కటా.
| 452
|
తే. |
దాశరథి జన్మ మాదిగఁ దల్లియందు, ననిశ మేరీతి వర్తించు మనలయందు
నత్తెఱంగున వర్తించు నమ్మహాత్ముఁ, డకట నేఁడు నిర్వాసితుం డయ్యె నేల.
| 453
|
వ. |
మఱియు నెవ్వాఁడు శ్రుతపారుష్యం డైనను గ్రోధింపక క్రోధహేతుకర్మం
బులు పరిత్యజించి కుపితు లగువారలఁ బ్రసాదంబు నొందించునట్టి పరమదయా
ళుం డగురాముని వనంబునకుం బుచ్చిన యచ్చపలాత్ముఁ డగుదశరథుండు
జీవలోకంబు నెల్ల హింసించుట కోర్చువాఁ డని దశరథుని నిందించుచు ననేకు
లనేకప్రకారంబుల లేఁగలఁ బాసిన మొదవులచందంబున విలపించుచున్న
వారల రోదనంబు విని పుత్రవియోగసంజాతశోకాభిసంతప్తుం డైన యద్దశర
థుండు పర్యంకంబుమీఁదం బడి లజ్జితుండై దుఃఖించుచుండె నంత నిక్కడ.
| 454
|
సీ. |
స్వజనదుఃఖప్రాప్తి సంజాతభేదుఁ డై రఘుపతి మత్తవారణముకరణి
నూర్పులు పుచ్చుచు నేర్పునఁ దద్దుఃఖ మవనయించుచు మాతృవిపులగృహము
|
|
|
సేరంగఁ బోయి హజారంబునం దున్నవారిఁ గన్గొనుచు నవ్వలిద్వితీయ
కక్ష్య డగ్గఱి యందుఁ గడువృద్ధు లగువిప్రవరులకు మ్రొక్కుచుఁ బరఁగ నవల
|
|
తే. |
నలరుమూఁడవకక్ష్య డాయంగఁ బోవ, నందుఁ గావలి యున్నస్త్రీబృంద మపుడు
త్వరితముగ లోపలికిఁ బోయి తత్ప్రియంబుఁ, బ్రీతి నెఱిఁగించె నారామమాతతోడ.
| 455
|
రాముఁడు కౌసల్యకడకుఁ బోవుట
వ. |
ఇట్లు రాముఁడు దనరాక యెఱింగించి పుచ్చి తోడన తానును నద్దేవి యున్న
కడకుం జని యందు దేవపూజార్థంబు సంగ్రహింపఁబడియున్నదధ్యక్షత
ఘృతహవిర్లాజంబులును మోదుకంబులును శుక్లమాల్యంబులును బాయసం
బును గృసరంబులును సమిత్తులును బూర్ణకలశంబులును గనుంగొనుచు సమా
హితచిత్త యైయారాత్రి యుపవాసంబు సలిపి సూర్యోదయసమయంబునం
గృతమంగళస్నాన యై శుక్లక్షౌమచేలంబుఁ దాల్చి తనయభ్యుదయంబుకొఱకు
విప్రులచేత మంత్రపవిత్రాగ్నిహోత్రంబునందు హోమంబు సేయించుచు దేవ
తాసంతర్పణంబుఁ గావించుచున్ననిజజననిం గాంచి బాలాశ్వంబు నెదుర్కొ
నినహయాంగనభంగి త న్నెదుర్కొనినయద్దేవిచరణంబుల కభివందనంబులు
గావించె నప్పు డద్దేవి సమాగతుం డైనకుమారు నవలోకించి కనుంగొనల
నానందబాష్పధారలు జడిగురియ హర్షోత్కర్షంబున నిజకరంబుల గ్రుచ్చి యెత్తి
చుబుకంబు పుణికి శిరంబు మూర్కొని వదనంబు ముద్దు గొని వాత్సల్యంబు
దీపింప మధురవాక్యంబున ని ట్లనియె.
| 456
|
తే. |
అనఘశీలురు ధర్మాత్ము లమితతేజు, లధికవిశ్రుతు లైనపూర్వాధిపతుల
యశము నాయువు ధర్మంబు నఖిలహితముఁ, బొందు నీ వింక సతతంబుఁ బుత్రవర్య.
| 457
|
ఆ. |
సత్యవాది యైనజనపతిఁ గనఁ జను, మమ్మహాత్ముఁ డిపుడె యఖిలధరణి
కధిపుఁ గాఁగ నీకు నభిషేక మొనరించు, నిఖలనృపులు మెచ్చ నేఁడు వత్స.
| 458
|
రాముఁడు తనకు సంభవించిన యరణ్యగమనంబుఁ గౌసల్య కెఱింగించుట
వ. |
అని పలికి యొక్కకనకాసనం బిచ్చిన నారాముండు భోజనార్థంబు తల్లిచేత
నిమంత్రితుం డగుచు నయ్యాసనంబు వ్రేల ముట్టి స్వభావవినీతుం డైనను
మాతృత్వప్రయుక్తగౌరవంబువలన మిక్కిలివినీతుం డై వ్రీడానమ్రవదనుఁ
డగుచు దండకారణ్యగమనంబున కనుజ్ఞాకాంక్షి యై కేలుదమ్మి ఫాలంబునం
గీలించి కౌసల్య కి ట్లనియె.
| 459
|
క. |
జననీ యేమని చెప్పుదు, ననివార్యం బైనయొకభయంబు గలిగె నీ
కును సీతకు సౌమిత్రికి, ఘనతరదుఃఖార్థిహేతుకం బది తలఁపన్.
| 460
|
తే. |
కొనలు గల పంచవింశతికుశలనిర్మి, తాసనవిశేషసముచితం బైనకాల
మిపుడు దొరకొనె దండకావిపినమునకు, నరుగుచున్నాఁడ నేల యీయాససంబు.
| 461
|
సీ. |
ధరణీవిభుఁడు నన్ను దండకాటవి కేగు మని పంచె నమ్మనుజాధినాథు
నానతి నమ్మహాకాననంబున కేను జని పదునాల్గువత్సరము లందుఁ
గందమూలముల నాఁకలిఁ దీర్చికొనుచుఁ దాపసవేషధరుఁడ నై పరమశాంతి
యుక్తి వానప్రస్థయోగ్యకర్మంబుల నాచరించుచు వల్కలాజినములు
|
|
తే. |
మునివలె ధరించి మాంసంబు దినక కాన, నునికిఁ జేసెద నిపుడు రాజోత్తముండు
భరతుని సమస్తసామ్రాజ్యపట్టభద్రుఁ, జేయువాఁ డద్భుతదయావిశేషమతిని.
| 462
|
కౌసల్య రామునిమాట విని మూర్ఛవోవుట
వ. |
అని వనప్రయాణం బెఱింగించిన నద్దేవి పుత్రవియోగసంజాతశోకంబు సహింపం
జాలక మూర్ఛాక్రాంత యై పరశునికృత్త యైనసాలయష్టిచందంబున స్వర్గపద
భ్రష్ట యైనదేవతాంగనకైవడి మహావాతపతితం బైనకదళీద్రుమంబుపోలిక
ధరణిపయిం బడియె ని ట్లవశ యై పడియున్నతల్లిం దనకరంబులం గ్రుచ్చియెత్తి
యొక్కకనకాసనంబునం గూర్చుండఁ బెట్టి భారవహనంబుఁ బ్రాపించి శ్రమ
నివృత్తికొఱకుఁ బుడమిం బడి పొరలి క్రమ్మఱ లేచిన బడబచందంబున బాంసు
కుంఠితసర్వాంగి యై యున్నయద్దేవిశరీరం బంతయుఁ గరంబులం బరిమార్జిం
చి వివిధవినయవాక్యంబులం బ్రబోధించినఁ గొండొకసేపునకు మూర్ఛ దేఱి
నిజకరంబున నక్కుమారశేఖరుని నెమ్మేను సంస్పృశించి కనుంగొనల నశ్రుకణం
బు లొలుక గద్గదస్వరంబుతో సుమిత్రాపుత్రుండు వినుచుండ రామున కి ట్లనియె.
| 463
|
కౌసల్య రామునితోఁ దనదుఃఖంబు లన్నియుఁ జెప్పికొనుట
సీ. |
అనఘాత్మ ధాత్రి వంధ్యకు నపుత్రక నైతి నని యొక్కటియె దుఃఖ మన్యదుఃఖ
మది యించుకయుఁ బుట్టద ట్లేను నినుఁ బ్రియపుత్రునిఁ బడయక పుట్టినట్ల
వంధ్య నై యున్న నివ్వడువున నభిమతపుత్రవిశ్లేషసంభూతదుఃఖ
మొంది కృశింపక యుందుఁ గదా నేఁడు కొమరులు లేనిదుఃఖమునకంటెఁ
|
|
తే. |
బుత్రవిశ్లేషసంజాతభూరిదుఃఖ, మెక్కు డై యుండు దాని సహింపఁ గూడ
దకట నినుఁ బాసి యేలాగు నసువు లొడల, నిలిపికొని యిచ్చట వసింప నేర్తుఁ జెపుము.
| 464
|
చ. |
ఆరయ మహీశుపౌరుషమునందు లభించుమనోజ్ఞభోగము
ల్సురుచిరసౌఖ్యము ల్మృదువచోగరిమంబు లొకప్పు డైన నే
నెఱిఁగినదానఁ గాను జగతీంద్రుఁ డిఁక న్నినుఁ జూచి యైన సు
స్థిరముగ నాపయిం గరుణఁ జేర్చు నఁటంచుఁ దలంతు నెమ్మదిన్.
| 465
|
క. |
జనవిభున కగ్రసతి నై, కనిష్ఠ లగుసవతు లెల్లఁ గడుగర్వమునన్
ననుఁ దూలనాడుచుండఁగ, విని యేగతిఁ దాళుదాన విమలవిచారా.
| 466
|
తే. |
జనవినుత పుత్రయుత లగుసవతు లాడు, వివిధపరిహాసవచనము ల్వినుటవలనఁ
బుట్టు నాదుఃఖశోకంబు లిట్టి వట్టి, వనఁగ వచ్చునే వానికి నవధి గలదె.
| 467
|
ఆ. |
పాయ కెపుడు నీవు నాయొద్ద నుండఁగ, నధికహీనవృత్తి నడలుచుందు
నీవు గహనమునకుఁ బోవుచుండఁగ నాకు, మరణమే నిజంబు వరగుణాఢ్య.
| 468
|
వ. |
మఱియు నమ్మహీపతికి నగ్రపురంధ్రి నై యుండియు నతండు న న్నవమాన
పురస్సరంబుగాఁ జూచుటవలన నప్రధానీకృత నై కైకేయిపరిచారికాజనం
బునకంటె నొక్కింత యవర నైతి నదియునుం గాక భరతుండు ప్రాప్త
రాజ్యుం డైన నతని విలోకించి నిత్యంబు నన్ను సేవించుజనంబును వాని
భయంబువలన నింక నన్ను సేవింపకుండు నని పలికి వెండియు ని ట్లనియె.
| 469
|
చ. |
అనిశము వైరిభావమున నద్భుతకోపరసంబు ముక్కునం
గనుపడ భాగ్యగర్వమునఁ గష్టదురుక్తులఁ బల్కు కైకయా
నన మెటు చూచి యోర్చెద ఘనంబుగ దుర్దశ నొంది యుండి నే
నినకులదీప మానవతు లీలఘుజీవన మోర్చి యుందురే.
| 470
|
సీ. |
మది సుక్కు దక్కి సప్తదశాబ్దములనుండి యేక్షోభమునకుఁ బరిక్షయంబు
సతతంబు నాచేత నతికాంక్షితం బయ్యె నాక్షోభ మక్షయం బయ్యె నిపుడు
భాగ్యగర్వమున సపత్నులు గావించు విప్రకారము మది వెగటు పఱప
హీనదశాప్రాప్తి కే నోర్చి ధర మని యుండ లే నదియు నట్లుండ నిమ్ము
|
|
తే. |
కమలపత్రంబులను బోలు కనులతోడఁ, బూర్ణశశిబింబసదృశ మై భూరికళల
నొప్పునీమోముఁ జూడక యొక్క నిమిష, మైన నేగతి జీవించుదానఁ దండ్రి.
| 471
|
వ. |
వత్సా నీవు భాగ్యరహిత నైననాచేత నుపవాసదేవతాధ్యానవ్రతంబులచేత
నిష్ఫలం బగునట్లు సంవర్ధితుండ వైతివి భవదీయపరివర్ధనం బిప్పుడు దుఃఖం
బుకొఱకుఁ బరిణతం బయ్యెఁ బ్రావృట్కాలంబునందు మహానదీప్రవాహసలి
లంబుచేతఁ దత్తీరంబు నశించినపగిది భవద్విప్రయోగశ్రవణంబున సహస్ర
కారంబుల వ్రయ్య లైపోకయుండుటవలన మదీయహృదయం బతికఠినం
బని తలంచెద.
| 472
|
సీ. |
వలనొప్ప కంఠీరవంబు బిట్టేడ్చెడు మృగిని గొంపోయినపగిది నన్నుఁ
గుద్దుఁ డై శమనుండు గొని పోనికతమున నల దండధరలోకమందు నాకు
స్థానంబు లే దని తలఁచెద నా కింక జగతి నెన్నటికిని జావు లేదు
కడువడి నిట్టిదుఃఖంబుచే నుపహతం బయ్యును నాహృదయంబు మేను
|
|
తే. |
మాన కిట వేయివ్రయ్యలై పోనికతన, నాయసాకృతి గాఁబోలు నని దలఁచెద
నందన యకాలమున నిధనంబు గలుగ, దేమి సేయుదు నింక నా కేది దిక్కు.
| 473
|
తే. |
నయవిశారద పిన్నటనాఁటనుండి, యేను గావించువ్రతములు దానములును
దపములు సపర్యలును నిరర్థకము లయ్యెఁ, జవుట విత్తిన విత్తులచందమునను.
| 474
|
తే. |
పృథివి దుఃఖకర్శితుఁ డెవ్వఁడేని దలఁచి, నపుడు శమనునివీటికి నడగునేని
యేనును భవద్విహీననై ధేను వట్ల, తనువు విడిచి యమక్షయంబునకుఁ బోనె.
| 475
|
ఉ. |
ధీవర నీవు న న్నిచట దించి వనంబున కేగితేని గ
ర్వావహచిత్తలై సవతు లాడుదు రుక్తులు విన్న మేనిలో
జీవము నిల్వ ద ట్లగుటఁ జేసి మదిం దనివారఁ జూచుచు
న్నీవెనువెంట వచ్చెద ననిందితశీల యరణ్యభూమికిన్.
| 476
|
లక్ష్మణుఁడు మన్మథవశుఁ డైనదశరథునిమాట వినుట యుక్తము గా దని చెప్పుట
వ. |
అని యిట్లు పెక్కుతెఱంగులఁ గుమారుండు సత్యపాశబద్ధుం డయ్యె నని
యెఱింగి యతనివనగమనంబు నివారించుటకు సామర్థ్యంబు లేమిం జేసి
భావిసంభావితవ్యసనంబు దలంచి కిన్నరియుం బోలె విలపించుచున్న కౌసల్య
నవలోకించి సుమిత్రానందనుండు మొగంబున దైన్యంబు దోఁపఁ దత్కాల
సదృశం బగువాక్యంబున ని ట్లనియె.
| 477
|
క. |
పడఁతుకమాటకు రాజ్యము, విడిచి రఘూత్తముఁడు ఘోరవిపినంబున కి
ప్పుడు పోవఁ దలఁచు టెంతయుఁ, దడవఁగ నామది కయుక్తతరమై తోఁచెన్.
| 478
|
క. |
జనపతి మదనవశుండై, యనిశము సతిమాటఁ బట్టి యనుచితముగఁ బ
ల్కినఁ బలుకఁగ నిమ్మది మన, మున గట్టిగఁ బట్టి సేయఁ బూనఁగ నేలా.
| 479
|
క. |
దీమసమున మనుజవిభుం, డేమి తగనిదోస మెంచి యిప్పుడు కినుకన్
రాముని సుగుణోద్దాముని, భూమి వెడలి ఘోరవనికిఁ బొ మ్మని పలికెన్.
| 480
|
క. |
ధర నెవ్వఁడు సరియైనను, నిరసక్తుండైన నీయనింద్యగుణునిపైఁ
గరమొకదోషం బెన్నఁడుఁ, బరోక్షమందైన నూఁదిపలుకు టెఱుంగన్.
| 481
|
తే. |
ఘనుని దాంతుని ధర్మవిగ్రహుని ఋజుని, సమరతుల్యుని రిపులయందైనఁ గరుణ
గలుగునట్టికుమారునిఁ గని యకార, ణమున నెవ్వాఁడు ఘోరవనమున కనుచు.
| 482
|
తే. |
అంగభవజాతపారవశ్యమున మేను, మఱచి నోటికి వచ్చిన ట్లఱచు నృపతి
యట్టిమాట మనంబునఁ బట్టి రాజ, ధర్మ మరియు నెవ్వాఁడు దవిలి సేయు.
| 483
|
వ. |
అని పలికి యన్నదిక్కు మొగంబై యి ట్లనియె.
| 484
|
తే. |
అనఘ యీయర్థ మొకనరుండై న నేమి, యెంతలో వినఁ జాలఁ డీ వంతలోన
మత్సహాయతవలన సామ్రాజ్యమెల్ల, నాత్మవశముగఁ జేసికొ మ్మది హితంబు.
| 485
|
వ. |
అత్తెఱం గెట్లు శక్యం బగు నంటి వేని.
| 486
|
సీ. |
ధనువుఁ గైకొని పార్శ్వమున నేను రక్షింప నల జముమాడ్కి నీ వలరుచుండ
నప్పు డెవ్వాఁడు నీయాజ్ఞ దాఁటి చరింప దక్షుఁ డవ్విధిగాక తక్కెనేని
కాలసర్పాభీలఘనబాణముల నయోధ్యాపురి నిర్మనుష్యఁగ నొనర్తు
|
|
|
భరతుఁ డీపూజ్యసామ్రాజ్యస్థుఁ డగుఁగాక యని కోరువారల యమునిపురికిఁ
|
|
తే. |
బనుతుఁ గామాంధుఁడై యాలిపలుకులు విని, బుద్ధి నరయక లోకవిరుద్ధవృత్త
మూఁది పరిపంథిభూతుఁడై యున్న నృపునిఁ, గడఁగి చంపెదఁ గానిచోఁ గట్టివైతు.
| 487
|
వ. |
తండ్రి కపరాధంబు సేయం దలంచుట ధర్మవిరుద్ధం బని తలంచి తేని వినుము.
| 488
|
తే. |
విషయతంత్రుఁడై ధర్మవిధికిఁ దప్పి, మది ననారత మిది కార్య మిది యకార్య
మని యెఱుంగక వర్తించునతఁడు తండ్రి, యైనఁ గడువధ్యుఁడని పల్కి రార్యు లధిప.
| 489
|
క. |
జనపతి నీ దగురాజ్యముఁ, గొనుటకు నేబలము గలఁడు గుణహీనతఁ దా
మునుకొని యేకారణమునః, దనమదిఁ గైకేయి కొసఁగఁ దలఁచె మహాత్మా.
| 490
|
తే. |
పరఁగ నీతోడ నాతోడ వైరముఁ గొని, యరినిషూదనకులయోగ్య మయినయట్టి
ధర్మనిధి నీవు దాల్పఁగఁ దగినసిరిని, భరతుని కొసంగఁ బతి కేటి బలము చెపుమ.
| 491
|
వ. |
అని పలికి క్రమ్మఱఁ గౌసల్య నవలోకించి తల్లీ యేను సర్వప్ర కారంబుల రా
మున కనురక్తుండ నిది యసత్యంబు గాదు సత్యచాపదానేష్టంబులచేత శప
థంబుఁ జేసి పలికెద రాముం డరణ్యంబునె కాదు దీప్తాగ్నిని బ్రవేశించిన నే నం
తకు మున్నె ప్రవేశింతు నట్టివానిఁగా న న్నెఱుంగుము.
| 492
|
చ. |
జననిరొ నాప్రతిజ్ఞ విను సత్యము నీవును రాఘవుండుఁ గ
న్గొని మది మెచ్చ దీప్తశరకోటి నరాతుల గీటడంచి మిం
చినయనురక్తిచే నినుఁడు చీఁకటినట్లు భవన్మనోవ్యధం
బనివడి తీర్చెదన్ ధరకుఁ బట్టముఁ గట్టెద రామభర్తకున్.
| 493
|
కౌసల్య రామునికి లక్ష్మణుఁడు చెప్పినట్ల చేయుమని బోధించుట
వ. |
అని యిట్లు వీరాలాపంబు లాడుచున్న సుమిత్రాపుత్రునివాక్యంబు లాలకించి
యద్దేవి రామునివదనం బులక్షించి దుఃఖించుచు ని ట్లనియె.
| 494
|
మ. |
అనఘా తమ్మునిమాట వింటె విహితం బై యున్న దారీతి
ననుమానింపక సేయు టొప్పు నృపవంశాచార మీచందమై
చనుఁ గా కీవు సపత్నిమాటకయ రాజద్రాజ్యభోగంబు మా
ని నను న్నెవ్వగ ముంచి పోవఁ దగ వౌనే కాననక్షోణికిన్.
| 495
|
వ. |
మఱియు నీవు పితృవాక్యకరణరూపం బగుధర్మం బనుష్ఠించుట సమస్తధర్మం
బులలో నుత్తమధర్మం బని దలంచితి వది నిక్కంబైనను నీలోకంబున మాతృ
శుశ్రూషాపరుం డై ప్రవర్తిల్లుమహాత్మున కెల్ల లోకసుఖంబులు కరతలా
మలకంబులై యుండుఁ దొల్లి గృహంబున నుండి మాతృశుశ్రూవఁ గావించి
తద్బలంబునఁ గాశ్యపుండు ప్రాజాపత్యపదంబుఁ బ్రాపించెఁ గావున నీవును నా
వచనంబుఁ బట్టి భక్తిపూర్వకంబుగా నాకు శుశ్రూషఁ గావించుచు గృహం
|
|
|
బున నుండు మేనును దండ్రియట్ల పూజించుటకుం దగినదాన నల్లగుటం జేసి
నాయనుమతి లేక నీవు వనంబునకుం బోవుట ధర్మంబు గా దదియునుంగాక శోక
లాలస నైన నన్ను విడిచి వనంబునకుం జనితేని భవద్వియోగదుఃఖంబునం బ్రా
యోపవేశంబుఁ జేసి ప్రాణంబులు విడిచెద దానం జేసి తొల్లి సముద్రుండు మాతృ
దుఃఖంబున నరూపాధర్మంబువలన బ్రహ్మహత్య నొందినవిధంబున నీవు
లోకవిశ్రుతం బైననిర్ణయంబు నొందఁగలవు నీవు వనంబునకుం జనినపిమ్మట
నాకు సుఖజీవితంబులచేత నయ్యెడుకార్యం బేమి భవత్సహిత్తనై యున్ననాకుఁ
దృణభక్షణంబైనను శ్రేయస్కరంబై యుండు నని పలికి దుఖభరంబున రోద
నంబు సేయుచున్నతల్లిం గాంచి మహానుభావుం డైనరాముండు ధర్మసహితం
బగువాక్యంబున ని ట్లనియె.
| 496
|
రాముఁడు కౌసల్యకు సయుక్తికంబుగా సమాధానంబుఁ జెప్పుట
క. |
జనకుని వాక్యము నది గా, దని మీఱఁగ నా కశక్య మటు గాన మహా
వినయమున మ్రొక్కి వేఁడెదఁ, బని విని వనమునకు నన్నుఁ బనుపుము తల్లీ.
| 497
|
ఆ. |
పరమపండితుండు వ్రతచారియును ధర్మ, కోవిదుఁడు మహానుభావుఁ డైన
కండు వనెడు మునిశిఖామణి జనకువ, చనముఁ బట్టి గవిని జంపలేదె.
| 498
|
తే. |
మును మదన్వయకర్తయై తనరు సగరుఁ, డనుమహాత్మునియానతి నతనిసుతులు
ఘనమఖాశ్వంబుకొఱకు నఖప్రహతుల, బుడమిఁ ద్రవ్వి పదంపడి మడియ లేదె.
| 499
|
తే. |
విను మదియుఁ గాక జమదగ్నితనయుఁ డైన, రాముఁ డతనియానతిని శిరంబునందు
దాల్చి దయమాలి మనమునఁ దల్లి యనక, పట్టి రేణుకఁ ద్రుంపఁడే పరశుహతిని.
| 500
|
వ. |
మఱియుఁ బ్రాణంబులనైనఁ బరిత్యజించి పితృవాక్యంబు పరిపాలనీయం బని
పండితులైన కండుముఖమహర్షులు పలికిరి పితృవాక్యగౌరవంబున గోవధ మాతృ
వధాదికంబు మహాత్మ లగుపూర్వులచేత నాచరితం బయ్యెం బితృవాక్యం
బె ట్లలంఘనీయం బట్లు మాతృవాక్యంబు నలంఘనీయంబై యుండు నైన
నేకకాలంబున నుభయవాక్యకరణంబునం బ్రవర్తిల్లుట దుర్లభం బట్లగుటం
జేసి పితృవాక్యంబు ప్రథమకర్తవ్యం బని పలికి రదియునుం గాక పితృవాక్యో
ల్లంఘనంబునఁ బితృవధపాతకంబు వాటిల్లు నే నొక్కరుండనేకాను నాచేతఁ
బరికీర్తితులైన వీ రందఱుఁ బితృశాసనంబుఁ గావించి కృతార్థులైరి గావున
నాకునుం బూర్వాచారవిరుద్ధం బైనధర్మంబునం బ్రవర్తిల్లుట పాడి గాదు తొల్లి
మహాత్ము లగువారిచేత నంగీకృతం బైనమార్గం బవలంబించి యెల్లభంగులఁ
|
|
|
బితృనిర్దేశంబున వనంబుకుం జనియెద నని పలికి లక్ష్మణు నవలోకించి
యి ట్లనియె.
| 501
|
రాముఁడు లక్ష్మణునకు సమాధానంబుఁ జెప్పుట
చ. |
అనఘవిచార నీదగుమహత్త్వము తావకతేజముం ద్వదీ
యనిబిడోద్బలంబు భవదద్భుతశౌర్యము నాపయిం జనిం
చిన ప్రియము సమస్తమును జిత్తమునందు నెఱుంగుదున్ యశో
ధనులకుఁ గల్గు టబ్బురమె తద్దయు లక్ష్మణుపాల వింతలే.
| 502
|
చ. |
పరమవివేక సత్యశమభావము భావమునం దెఱింగియుం
గర మనురక్తిఁ బ్రాకృతినికైవడి నీ వటు దుఃఖ మొంద దు
ర్భరతరశోకవేగమునఁ గ్రాఁగెడు నీయమ తాల్మి దక్కి తా
మఱిమఱి చొక్కుఁ గాన నిఁక మానుము తాదృశదీనవాక్యముల్.
| 503
|
తే. |
ధరణిఁ బురుషార్థములలోన ధర్మ మెక్కుఁ, డట్టిధర్మంబునందు సత్యంబు నిలిచి
యుండు నన్నిటికంటె నత్యుత్తమంబు, గుర్తునియానతి నడుచుట గురుగుణాఢ్య.
| 504
|
తే. |
జనకవాక్యంబు జననీవచనము బ్రాహ్మ, ణోత్తమునిమాట ధర్మసంయుక్త మగుట
నుచితగతిఁ జేయవలయు న ట్లోపఁడేని, యలఘుతరకల్మషాత్ముఁ డౌ ననిరి మునులు.
| 505
|
వ. |
కావున నేను బితృశాసనంబునఁ గైకేయిచేతఁ బ్రచోదితుండ నైతి నింక దానిఁ
గడువం జాల నీ వశుభం బైనక్షత్రధర్మంబునందు బుద్ధిఁ జొరనీక తీక్ష్ణభావంబు
విడిచి పరచుశ్రేయోనిష్ఠ యైన మద్బుద్ధి ననుసరింపు మని సౌహార్దవిశేషం
బునం బలికి వెండియు నక్కకుత్స్థకులదీపకుండు కౌసల్యదిక్కు మొగంబై
వినయవినమితోత్తమాంగుం డగుచుఁ గేలుదోయి ఫాలంబునం గీలించి
యి ట్లనియె.
| 506
|
క. |
వేవేగ విపినసీమకు, వావిరిఁ బోవంగవలయు వారింపకు మ
జ్జీవితము లాన గ్రక్కున, దీవన లిపు డొసఁగి పనుపు దేవీ నన్నున్.
| 507
|
తే. |
గురునివాక్యంబు నెఱవేర్చి మరల వేగ, మడవినుండి పురంబు కరుగుదెంతు
మును ధరకు వచ్చి మరల విబుధనిలయము, నొందిన యయాతిరాజర్షిచందమునను.
| 508
|
క. |
జననీ నీకును నాకును, జనకజకు సుమిత్ర కట్ల సౌమిత్రికి గ్ర
క్కునఁ బతియానతిఁ బోవఁగ, జను నిదియె సమస్తధర్మసమ్మతము సుమీ.
| 509
|
వ. |
తల్లీ యభిషేకసంభారంబులు విసర్జించి మనంబున దుఃఖంబు నిగ్రహించి
ధర్మంబు నవలంబించి వనవాసంబునకుం బోవ నిశ్చయించినవాఁడ నేను
వనంబునకుం బోయి వచ్చునందాఁన శోకంబు దక్కి ధైర్యం బవలంబించి యుండ
వలయు నని పలికిన నమ్మహాత్ముని ధైర్యస్థైర్యంబుల కచ్చెరువంది యక్కౌసల్య
వెండియు మనంబునఁ బుత్రవియోగంబుఁ దలంచుకొని మూర్ఛాక్రాంతయై
చచ్చినదానియట్ల నేలంబడి యుండి గ్రమ్మఱ నొక్కింతసేపునకు నానావి
ధోపచారంబులం దెలివొంది బాష్పధారాపూరితలోచనయై గద్గదస్వరంబున
ని ట్లనియె.
| 510
|
చ. |
అనఘవిచార యేను గురునట్లె స్వధర్మముచేత సౌహృదం
బునను సుపూజకుం దగుదుఁ బూనికి మద్వచనంబు నెమ్మనం
బున నిరసించి దుఃఖరసపూరితభూరిగభీరవార్ధిలో
ననుఁ బడఁద్రోచి నీకుఁ దగునా యిటు కాననసీమ కేగఁగన్.
| 511
|
సీ. |
విను మీవు కాననంబునకుఁ బోయిన నాకు నింక లోకం బేల యేల ప్రాణ
మేల సంపద్భోగ మేల పిత్రమరలోకంబులు నేమికార్యంబు సర్వ
లోకసంస్థితజీవలోకసాన్నిధ్యంబుకంటె నొక్కముహూర్తకాల మైన
సరసగుణాఢ్య నీసన్నిధానము నాకు ఘనతరశ్రేయ మై తనరుచుండు
|
|
తే. |
సిద్ధ మన నాతఁ డుల్కలచే నపోహ్య, మాన మైనమహేభంబుమార్గ మనుస
రించినట్లు తదుక్తు లాలించి దృఢత, రంబుగ స్వవంశధర్మమార్గస్థుఁ డగుచు.
| 512
|
వ. |
వెండియు నారఘుపుంగవుండు నిసంజ్ఞయై పడి యున్నతల్లిని దుఃఖపీడితుం డైన
తమ్మునిఁ జూచి యధర్మారంభంబునకు సుముఖుండు గాక ధర్మసహితం బగు
వాక్యంబున లక్ష్మణు నవలోకించి రఘువరా నీవు ధరైకనిష్ఠారూపం బైన
మదీయాభిప్రాయం బెఱుంగక పుత్రవాత్సల్యంబున వగచుతల్లిం గూడి దుఃఖిం
చెన వీ దుఃఖంబు నుచ్చిత్తంబు గలంచుచున్నయది పురాకృతపుణ్యవిశేషం
బునం గలిగిన భార్య యొక్కటి యయ్యును ననుకూల యై ధర్మంబును నభిమత
యై కామంబును సుపుత్ర యై యర్థంబును బతికిం జతగూర్చినతెఱంగున
సకలపురుషార్థమూలం బైన ధర్మం బొక్కటి యయ్యును స్వానుష్ఠానంబున
ధర్మార్థకామఫలంబులు సిద్ధింపం జేయు నిది మదీయచిత్తంబునం గల యర్థంబు
గావున నే కర్మంబునందు ధర్మార్థకామంబు లసన్నివిష్టంబు లగు నట్టికర్మం
బుపక్రమింప నర్హంబు గా దెల్లభంగుల నెద్దానివలన ధర్మంబు గలుగు
నట్టికర్మం బనుష్ఠింపవలయు లోకంబునం గేవలార్థపరుం డగువాఁడు ద్వే
ష్యుం డగుఁ గేవల కామపరత్వం బప్రశస్తం బగు గురుండును వృద్ధుండును
స్వామియును జనకుండు నగు మహీరమణుండు కోపంబునం గాని ప్రసాదం
|
|
|
బునం గాని కామంబునం గాని సత్యప్రతిజ్ఞత్వరూపధర్మం బవలంబించి తత్పరి
పాకంబుఱకు నేకార్యంబు సేయు మని నియోగించె నక్కార్యంబు
ననృశంసవృత్తి యగువాఁ డెవ్వఁ డాచరింపకుండు నట్టియపాపుండ నగు
నేను వరదానహేతుకభరతాభిషేకమద్వివాసనరూపం బైన పితృప్రతిజ్ఞను
యథోక్తక్రమంబున సర్వంబును గావించకుండుటకు సమర్థుండఁ గాను
నాకును భరతునకును మహీరమణుండు నియోగంబునందు సమర్థుం డగు
నంతియే కాదు మజ్జనని యగు కౌసల్యకును భర్తయుఁ బరమగతియుఁ
గావున నిద్దేవియును మనయట్ల పతియాజ్ఞ ననుసరించి వర్తించు టది
పరమధర్మం బైయుండు నాదేవి పుత్రవాత్సల్యంబున నన్ను విడువంజాలక నా
తోడ వనంబునకుం జనుదెంచెద నని తలంచి యున్నది ధర్మప్రవర్తకుండును
బూర్వరాజులకంటె నధికుండును స్వకులాచారధర్మసంస్థితుండు నగు మహీర
మణుండు జీవించి యుండ సహధర్మచారిణియైన యిమ్మహాదేవి పుత్రుండ నైస
నాతోడ నవ్యయువతిచందంబున వనంబున కెవ్విధంబునం జనుదెంచుఁ బతి
హీన యగువనిత పుత్రునితోఁ గూడిఁ జనుదెంచు టది యుచితం బగుం గాని
సభర్తృక యైనయువతి చనుదెంచుట యుచితంబు గా దదియునుం గాక.
| 513
|
చ. |
అతివల కిందు నం దభిమతార్థకరుండు విభుండు తన్మనో
గతి నతియుక్తిచేఁ గని యకల్మషభక్తి సదా మనంబులో
నతఁడె గురుండు దైవ మఖిలార్థదుఁ డంచుఁ దలంచుచు న్సము
న్నతమతిఁ గొల్చి యుండుట సనాతనధర్మము లాఁడువారికిన్.
| 514
|
క. |
కావున నీయమ మగనిం, దా విడిచి యధర్మముగ వనంబున కిమ్మై
నావెంట రాఁ బొసంగదు, ధీవిలసితధర్మసరణి తెలియదె నీకున్.
| 515
|
శ్రీరాముఁడు కౌసల్య ననూనయించుట
వ. |
అని పలికి గ్రమ్మఱ నమ్మహానుభావుం డమ్మ కి ట్లనియె.
| 516
|
క. |
జననీ పదునాల్గబ్దము, లనఁగాఁ బదునాల్గుదినము లట్ల గడపి చ
య్యన వత్తు మరల వీటికిఁ, బనివడి దీవించి నన్నుఁ బనుపు మడవికిన్.
| 517
|
వ. |
తల్లీ యేను ధర్మవిరహితరాజ్యకారణంబున మహోదయం బగుయశంబును
దిరస్కరించుటకుం జాల జీవితం బల్పకాలం బగుచుండ నధర్మంబునకుం దలం
కక తుచ్ఛరాజ్యంబుఁ గోరుట తగవు గా దని యిట్లు జనయిత్రి ననూనయించి
పలికి క్రోధశోకాకులుం డగుతమ్మునికి ధర్మరహస్యం బుపదేశించి పదంపడి
నిజజననికిం బ్రదక్షిణంబుఁ జేసి వనప్రయాణోన్ముఖుం డై వెండియు మహా
వ్యధం జెంది గుందుచు మహాసర్పంబుకరణి రోఁజుచు రోషవిష్ఫారితేక్షణుండై
|
|
|
యున్నసౌమిత్రిం జూచి సౌహార్దవిశేషంబున నభిముఖుం డై ధైర్యంబునఁ జం
తాదివికృతులు వదనంబునం దోఁపనీక మనంబున నడంచుచు ని ట్లనియె.
| 518
|
రాముఁడు లక్ష్మణుని ననూనయించుట
చ. |
అనుపమధైర్యముం గొని రయంబున శోకము దోషము న్మనం
బునఁ జొరనీక యెంతయుఁ బ్రమోదము నొంది మహీశుపై జనిం
చిన పెనుకిన్క మాని యభిషేకవిచారము దక్కి సత్వరం
బుగ వనవాసయుక్తము ప్రభూతవివేకతఁ జేయు కార్యమున్.
| 519
|
తే. |
అస్మదీయాభిషేకార్థమందు నీకు, సముదితం బైనసంభారసంభ్రమంబు
తవిలి యిప్పుడు తన్నివర్తనమునందుఁ, జెల్లుఁ గాక మనంబునఁ జింత యేల.
| 520
|
ఆ. |
అనఘ మదభిషేచనార్థమం దేదేవి, మానసంబు చాల మలఁగుచుండు
నట్టితల్లిహృదయమందుఁ బుట్టినశంక, వాయునట్లు గాఁగఁ జేయు మయ్య.
| 521
|
క. |
ఆమగువ మనోగతశం, కామయదుఃఖం బొకింతకాలం బైనన్
దీమసమునఁ గనుఁగొనుటకు, నామదికిం దాల్మి లేదు నయగుణశాలీ.
| 522
|
వ. |
వత్సా యేను జ్ఞానంబుచేతంగాని యజ్ఞానంబుచేతంగాని తల్లిదండ్రుల కించుక
యైన విప్రియం బొకానొకప్పు డైనఁ గావించుటకు నోడుదుఁ గావున.
| 523
|
తే. |
తల్లిదండ్రు లొకానొకతఱి నొనర్చు, నప్రియ మొకింతయైన నే నాడుకొనుట
యెన్నఁడేనియుఁ గలదె వేయేల వినుము, హృదయమున నైన నిలుపుట యెఱుఁగఁ జుమ్మి.
| 524
|
క. |
సత్యుండు సత్యసంధుఁడు, సత్యపరాక్రముఁడు నైన జనకుఁడు పరలో
కాత్యంతభయమువలనను, నిత్యము విలసిల్లుఁ గాక నిర్గతుఁ డగుచున్.
| 525
|
తే. |
అడవి కేఁ బోకయున్న నాయనకు సత్య, హాని యగు దాన నా కసత్యాగ మొదవు
నవలఁ బతికి మనస్తాప మతిశయిల్లుఁ, బిదప నది నన్నుఁ జాలఁ దపింపఁజేయు.
| 526
|
వ. |
కావున నేను సామ్రాజ్యంబునం దాస సేయక శీఘ్రంబున వనంబునకుం జని
యెద సపత్నీమాత యగుకైకేయి చీరాజినజటామండలధారినై వనంబునకుం
జనుచున్న న న్నవలోకించి పరమానందభరితాంతఃకరణ యగుచుఁ గుమా
రునిం బూజ్యరాజ్యంబున కభిషిక్తునిం జేసి కృతకృత్య యగు మఱియు నే
జనంబుచేత నీబుద్ధి ప్రణీత యయి దీనియందు మనంబు సమాహితం బయ్యె
నాజనంబునకును దుఃఖంబు సేయనొల్ల నేను వనంబునకుం బోవకుండిన మ
జ్జనకునకు మనఃఖేదంబు గలుగు నెవ్వని శిక్షోపదేశంబుల చేత మనంబునకు
|
|
|
సౌగుణ్యంబు జాతంబయ్యె నట్టిజనకుని సంక్లేశింపఁజేయుటకుం జాలశీఘ్రం
బున వనంబునకుం జనియెద నని ప్రవాసంబునందు మనంబు గట్టిపఱిచి కైకే
యీనిమిత్తశంకచేత నద్దేవియందు లక్ష్మణునకుఁ గ్రోధనివారణంబు సేయు
తలంపున ని ట్లనియె.
| 527
|
రాముఁడు లక్ష్మణునికిఁ గైకమీఁదం గలకోపమును బోఁగొట్టుట
క. |
చేవచ్చిన సిరి గ్రమ్మఱఁ, బోవుటయును ఘోరవిపినభూమినివాసం
బావహిలుటయును దలఁపఁగ, దైవకృతము గాక యొరులతరమె కుమారా.
| 528
|
తే. |
అనఘ కైకభావంబు కృతాంతవిహిత, మైనయది యట్లు గానిచో మాన కిట్లు
తివిరి యనివార్య మగుచు నద్దేవి బుద్ధి, పరఁగ మత్పీడయం దేల పరిణమించు.
| 529
|
వ. |
మఱియు నద్దేవి భావవైపరీత్యంబు దైవకారణం బని పలికి తదీయసహజభావం
బెఱింగించుతలంపున ని ట్లనియె.
| 530
|
తే. |
అమలగుణ నాకుఁ దల్లులయం దొకింత, యైన వైషమ్య మెట్లు లే దట్ల సంత
తంబు నాయందు సుతునందుఁ దారతమ్య, మేమియును గైకకును లేమి యెఱుఁగ వొక్కొ.
| 531
|
ఆ. |
అట్టి నేను గైక యభిషేచనము మాని, భూరిగహనమునకుఁ బొ మ్మటంచు
నశనిపాతకల్ప మైనమాటాడుట, దైవకృత మటంచుఁ దలఁతు జుమ్మి.
| 532
|
ఉ. |
ఆవిధి గానిచో నరవరాత్మజ యింతకుమున్ను భూరిహ
ర్షావహచిత్తయై ప్రియము లాడుచు నుండినయట్టితల్లి గో
త్రావరుమ్రోలఁ దా నిపుడు ప్రాకృతకాంతబలెన్ మదర్థమం
దీవిరసోక్తు లేల మది నించుక గొంకక పల్కుఁ జెప్పుమా.
| 533
|
వ. |
మఱియు నద్దైవంబు భూతంబుల కనివార్యంబై యచింత్యప్రభావం బై యుండు
పూర్వస్థితవాత్సల్యాపగమరూపంబునఁ గైకయందును స్వగతరాజ్యభ్రంశ
రూపంబున నాయందును విపర్యయంబు గలిగించెగాదె తత్స్వరూపంబు కార్య
భూతఫలంబులకంటె నొండువిధంబునఁ గానంబడ దట్టి దైవంబుతోడ నొ
డ్డారించుట కెవ్వండును సమర్థుండు గాఁడు లాభాలాభంబులును సుఖదుఃఖం
బులును భయక్రోధంబులును భవాభవంబులు నెయ్యది గలుగఁజేయు నదియె
దైవంబు విశ్వామిత్రాదితపోధనులును జితేంద్రియు లయ్యును దైవప్రపీడితు
లగుచు నియమంబు విడిచి కామక్రోధాసక్తు లగుట యెల్లవారికిఁ దెల్లంబు గదా
యీలోకంబునం దారబ్ధకార్యంబుఁ గ్రమ్మఱించి యసంకల్పితం బగుకార్యం బా
కస్మికంబుగాఁ బ్రవర్ధింపఁజేయు టదియె దైవకార్యం బని యెఱుంగవలయు
|
|
|
నిట్టి నిశ్చయబుద్ధిచేత నంతరింద్రియంబు నిరోధించి చూచిన వ్యాహతం బైన
మదీయాభిషేకంబునందు బరితాపంబు పుట్టదు గావున నీ వుపదిష్టబుద్ధి
యోగబలంబున సంతాపంబు దక్కి మద్బుద్ధి ననుసరించి మభిషేకాలంకా
రాదికర్మంబులం బరిహరింపు మని పలికి వెండియుఁ గౌసల్యానంననుండు
సుమిత్రానందనున కి ట్లనియె.
| 534
|
తే. |
వినుము పట్టాభిషేకసంభృతములైన, కాంచనమయాఖిలఘటోదకములచేత
మహితతాపసయోగ్యకర్మంబునందు, మిగుల నాకు వ్రతస్నాన మగు నిజంబు.
| 535
|
తే. |
అరయ రాజ్యార్థ మానీత మైనయట్టి, సలిల మేల మనచేత నింపు మీఱ
నుపహృతం బైనసలిలంబె యొనర నాకు, వెస వ్రతస్నాన మిపుడు గావించు ననఘ.
| 536
|
తే. |
నాకుఁ జూడఁ బ్రజాపాలనమునకంటె, నవ్విపినవాస మధికోదయంబు గాన
ననఘ లక్ష్మీవిపర్యయముందు నీవు, మది విషాదంబు విడువుము మమత దక్కి.
| 537
|
లక్ష్మణుఁడు రామునితో దైవంబు ప్రబలంబు గా దనుట
వ. |
అది యె ట్లనినఁ బ్రజాకృత్యాకృత్యవిచారక్లేశరాహిత్యంబునను సంతతంబుఁదప
ప్రవృత్తిసాధనత్వంబువలనను విశిష్టపితృవాక్యపరిపాలనవిశేషప్రయోజనత్వం
బువలనను రాజ్యపాలనంబుకంటె వనవాసంబు మహాభ్యుదయసాధనం బగు మఱి
యు మదభిషేచనవిఘ్నంబు కనిష్ఠమాతయైన కైకేయివలన నయ్యెనని శంకింప
వలన దద్దేవి దైవాభిపన్నయై యనిష్టంబులు పలికె దైవం బట్టిప్రభావంబు గలది
యని యెఱుంగుదువుగదా యని యిట్లు పెక్కుభంగులం బ్రబోధించిన రాముని
వచనంబులు విని సుమిత్రానందనుండు శిరంబు వాంచి దుఃఖహర్షంబులు మనం
బునం బెనంగొన నొక్కింతసే పూరకుండి పదంపడి రోషం బగ్గలంబైన
బొమలు ముడివడఁ బేటికాబిలస్థం బైన మహాసర్పంబుపడిది రోఁజుచు నిజ
వదనంబు కోపోద్దీపితం బైనసింహముఖంబుకరణిం జూపట్టఁ గన్నులం గెంజాయ
రంజిల్ల మదోద్దండవేదండశుండాదండంబునుం బోలె నిజభుజాదండంబు విదు
ర్చుచుఁ గ్రోధాతిశయంబున శిరోధూననంబు సేయుచుఁ దీక్ష్ణబాణంబులంబోని
కటాక్షవీక్షణంబుల నిరీక్షించి దేవా పితృవచనపరిపాలనాకరణరూపధర్మ
దోషప్రసంగంబుచేతను దండ్రివచనంబు గావింపని రాముండు మనల నెట్లు
రక్షించు నని జనంబునకుం బొడము శంక నపనయించు కోరికచేతను నీసం
భ్రమం బేది యుదయించె నది భ్రాంతిమూలం బంతియెగాక యుక్తం బైన
యది కాదు నినుబోఁటి యసంభ్రాంతచిత్తుండ ట్లనం దగదు తనంతం
దాను ముంగల నిలిచి యొక్కింతయైన నెద్దియుం జేయుటకు సామర్థ్యంబు
లేమింజేసి స్వాపేక్షితార్ధకరణంబునం బురుషాంతరంబు నపేక్షించుచుండునట్టి
యశక్తంబును కృపణంబు నగుదైవంబు ప్రబలం బని పలికెదవు. దైవంబు నిరా
|
|
|
కరించుటకు సమర్థుండు గానిప్రాకృతునకుం గాక శౌండీరుం డగు భవాదృశ
క్షత్త్రియశ్రేష్ఠులకుఁ గొనియాడం దగవు గాదని దైవాలంబనవాదంబు ప్రక్షే
పించి ధర్మదోషప్రసంగంబును బరిహరించుతలంపునఁ గ్రమ్మఱనమ్మహాను
|
|
లక్ష్మణుఁడు రామునికిఁ గైకేయి దుర్మంత్రం బెఱింగించుట
|
భావు నవలోకించి దేవా పాపాత్ము లగుకైకేయీదశరథుల విషయంబునందుఁ
బాపిత్వాశంక నీ కేల గలుగ దయ్యె వా రిరువురు నిక్కంబుగా నీకుఁ బాపం
బాచరింప సమకట్టి రట్టిపాపాత్ము లగుకైకేయీదశరథులు వాక్యాకరణంబు
నందు నీకు ధర్మహానిప్రసక్తి గలుగ నేరదు లోకంబునం గొండఱు
దోషమతు లయ్యును గపటధర్మాచరణకంచుకంబుచేత స్వదోషంబునుం గప్పి
కొని యుందురు నీవు ధర్మైకశ్రవణస్వభావశౌర్యంబుచే భవదభిషేకరూప
ప్రయోజనంబుఁ బరిహరింప నుపక్రమించి యక్కైకేయీదశరథులు గావిం
చిన దురాలోచనం బిది యని యేల యెఱుఁగ వైతి వది యె ట్లనిన భర
తున కవశ్యంబు రాజ్యం బొసంగం దగినయది రాముఁడు జ్యేష్ఠుం డగుటను
దద్విషయం బైనయభిషేకకార్యం భారంభించెద నప్పుడు నీవు వరద్వయం
బడుగుము తద్వ్యాజంబున రాముని వనంబునకుం బనిచి భరతున కభిషేకంబుఁ
గావించెద నని యిట్లు కైకేయీదశరథులచేత సంకేతితం బైనకార్యం
బిది యట్లు గా దేని యద్దేవియే తావత్పర్యంతంబు వరద్వయం బేల యాచింప
కున్నయది యవ్వరద్వయం బయాచితంబైనను నీతిజ్ఞుండగు దశరథుండైన
నింతకుమున్నె పరిహరింప కేల యుపేక్షించియున్నవాఁ డెల్లభంగుల నిది వర
వ్యాజంబున భవత్సంపద నసహరింపం గోరి చేసినదుర్మంత్రం బగుటకు సంది
యంబు లేదని పలికి వెండియు ని ట్లనియె.
| 538
|
శా. |
శిష్టాచారము మాని రాజు సుగుణున్ జ్యేష్ఠున్ విసర్జించి
గష్టుం డైనకనిష్ఠు నుర్వికి విభుంగాఁ జేయు టేధర్మని
ర్దిష్టం బైనవిధంబు దైవమని యే దీనుండనై లోకవి
ద్విష్టం బైనతెఱంగు సైతునె మహావీరోత్తముల్ మెత్తురే.
| 539
|
వ. |
మహాత్మా యేధర్మంబు చేత భవద్బుద్ధి రాజ్యపరిత్యాగవనగమనాంగీకారరూప
ద్వైధంబు నొందె నేధర్మంబువలనఁ బితృవాక్యాకరణంబునందుఁ బ్రత్యవాయం
బగు నని మోహంబు నొందితి వట్టి ధర్మంబు నాకు ద్వేష్యంబై యున్నది
నీవు ప్రతీకారకర్మంబునందు శక్తుండ వయ్యును గైకేయీవశవర్తియైన దశర
థునివాక్యం బధర్మిష్ఠం బతిలోకనిందితం బని ద్రోచిపుచ్చక యెత్తెఱంగున
నంగీకరించితి వభిషేకకార్యవిఘాతంబు వారలచేతఁ గిల్బిషంబువలనఁ గృతంబైన
దని యెఱింగి పరిహరింపనికారణంబున నాకు మిక్కిలి దుఃఖంబు వొడము
చున్నయది యిట్టి ధర్మాచరణంబు లోకవిరుద్ధంబు కామమన్యుపరీతచిత్తులును
|
|
|
బితృప్రవాదశత్రువులు నగు కైకేయీదశరథులశాసనంబు మనంబునందైన
సంస్మరింపందగినయదియె యని పలికి వెండియు ని ట్లనియె.
| 540
|
క. |
అనఘా వారలయభిషే, చనవిఘటటనబుద్ధి దైవసంకల్పమ యం
చని పలికెద వట్లైనను, ననవరత ముపేక్షణీయ మనుచుఁ దలఁచెదన్.
| 541
|
క. |
విను మసమర్థుఁడు దైవం, బనుకొను సంభావితాత్ము లగువీరులు ద్రో
చి నడుతురుగాక దైవం, బని దానిప్రశంస సేయ రతిధీయుక్తిన్.
| 542
|
క. |
ధర నెవ్వఁడు పౌరుషమునఁ, దఱిఁ గని దైవమును గడవ దక్షుం డగు న
ప్పురుషుం డాదైవముచేఁ, గరము నిరోధింపఁబడఁడు కాకుత్స్థవరా.
| 543
|
క. |
దైవబల మెక్కుడో నృప, భావితుఁ డగుశూరవరునిపౌరుషమె ఘనం
బో వీక్షింపుము ధీవర, దైవపురుషశక్తితారతమ్యము దెలియున్.
| 544
|
క. |
ఏదైవముచే నిప్పుడు, నీదగు సిరి పరులయందు నెఱపఁబడియె లే
డాదైవమును మదీయబ, లౌదార్యాభిహతమునుగ నరయుదు రార్యుల్.
| 545
|
వ. |
దేవా యే నతిక్రాంతాంకుశవ్యాపారంబై విశృంఖలవృత్తి నభిముఖంబుగాఁ
జనుదెంచు మదబలోత్కటవేదండంబునుం బోలే టైముబును బౌరుషంబునఁ
గ్రమ్మఱించెద నదియునుంగాక.
| 546
|
లక్ష్మణుఁడు తాను రాజ్యమును రామునికి లోఁబఱతు ననుట
మ. |
అనుమానం బొకయింత లేక రఘువర్యా నీదురాజ్యాభిషే
చనవిఘ్నం బొనరింపఁ బూని పటుదోస్సత్వంబుతో లోకపా
లనికాయం బరుదెంచెనేని పటుభల్లవ్రాతఘాతంబునన్
దునుమం జాలుదు నట్టినాకు నరనాథుం డెంత చింతింపఁగన్.
| 547
|
క. |
రవికులవర ని న్నిప్పుడు, వివాసితునిఁ జేసినట్టివిమతులు గరిమం
దవిలి పదునాలుగబ్దము, లవిరళగతి నడవి నుండున ట్లొనరింతున్.
| 548
|
క. |
జనవిభునకుఁ గైకేయికి, ననయవిధి న్భరతరాజ్యమందు మదిం బు
ట్టినదుర్భరాశ నస్మ, ద్ఘనబాహుబలాసిచేత ఖండింతు నొగిన్.
| 549
|
వ. |
మహాత్మా మదీయం బైనమహోగ్రపౌరుషంబు విరుద్ధజనులకు దుఖంబుకొఱకు
నెట్లగు నట్లు దైవబలంబు సుఖంబుకొఱకుఁ గానేరదని యెఱుంగు మని పలికి
వెండియు లక్ష్మణుం డొకానొకప్పుడైన భరతునకు రాజ్యంబు లేమిఁ దెల్లం
బుగా బోధించుతలంపున ని ట్లనియె.
| 550
|
తే. |
అనఘ చిరకాల మీవు రాజ్యంబుఁ జేసి, వనమునకుఁ బోవుచుండ నవ్వల భవత్సు
తులె ప్రజాపాల్య మొనరింపఁగలరు గాని, భరతునకు లేదు స్వాతంత్ర్య మరసి చూడ.
| 551
|
వ. |
అని పలికి స్వోక్తవనవాసం బశేషజనసమ్మతం బని యి ట్లనియె.
| 552
|
తే. |
వినుము సుతవత్ప్రజానుపాలననిమిత్త, మవనిభారంబు సుతులయం దమరనునిచి
యన్నల నరణ్యమున కేగు టర్హ మనుచు, వేదవిదులు వచించిరి గాదె తొల్లి.
| 553
|
వ. |
మఱియు దశరథుం డిట్లు చలచిత్తుం డగుచుంటను రాజ్యవిభ్రమశంకచేత నీవు
రాజ్యం బంగీకరింపవేని భవదీయరాజ్యంబును నేను జెలియలికట్ట సాగరం
బునుం బోలె రక్షించెద నట్లు సేయనైతినేని వీరలోకసుఖంబు నాకుఁ గలుగ
కుండుం గాక యని నిక్కంబుగా నీతోడ శపథంబుఁ జేసెద మంగళద్రవ్యయు
క్తంబు లగు జలంబులచేత నభిపిక్తుండ వగు మయ్యభిషేకకర్మంబునందు
వ్యాసక్తచిత్తుండ వగు మే నొక్కరుండ సకలమహీపాలుర నివారించుటకుఁ
జాలుదు నని పలికి వెండియు ని ట్లనియె.
| 554
|
తే. |
అనఘ మద్బాహువులు చాప మసియు శరము, లరయ నివి యలంకారంబుకొఱకుఁ గావు
యతులపరిపంథిదురభిమానాపనోద, నార్థ మని చిత్తమునఁ జూడు మనుదినంబు.
| 555
|
వ. |
మఱియు నెవ్వండు నాకు మిక్కిలి శత్రుండని పక్షకులచేత సమ్మతుం డగు
నట్టివానియునికి సహింపంజాల.
| 556
|
తే. |
వాసవుం డల్కమెయి నెత్తి వచ్చెనేని, వాఁడి గలఖడ్గధారచేఁ బోడిమి సెడ
నిగ్రహించెద పట్టి నే నుగ్రభంగిఁ, దుచ్ఛు నన్యుని సరకుగొందునె మహాత్మ.
| 557
|
క. |
నిరుపమసుగుణాకర మ, త్కరోల్లసచ్చండఖడ్గఖండితకరిరా
ణ్ణరహరిశిరములచే ధర, కరము గహనమ ట్లగమ్యకరమై యుండున్.
| 558
|
వ. |
మఱియు మదీయఖడ్గధారావినిపాతితంబు లైనమత్తశుండాలంబులు తీవ్రవ్రణ
సంజాతరక్తధారాస్నపితంబు లై విద్యుత్సమన్వితంబు లగుమేఘంబులకరణి
గైరికాదిధాతుమండితంబు లైనపర్వతంబులపోలిక ధరణిపయిం బడియెడుఁగాక
బద్ధగోధాంగుళిత్రాణుండనై శరాసనంబు కేలందాల్చి పురుషమధ్యంబున
నిలిచియుండఁ బౌరుషంబు ప్రకటించి నన్నుఁ దేఱిచూడంజాలువాఁడు గలఁడె
యిట్లు సంరంభవిజృంభితుండ నై పెక్కండ్ర నొక్కబాణంబులను బెక్కుబా
ణంబుల నొక్కనింగాఁ గుదులు గ్రుచ్చినట్లు విచిత్రవిహారంబున రణక్రీడ సలువు
నప్పుడు మదీయదివ్యాస్త్రప్రధానంబు మీరె చిత్తగించెదరు మద్దివ్యాస్త్ర
ప్రభావంబు దశరథున కప్రభుత్వంబును నీకుఁ బ్రభుత్వంబును గావించుటకు
సమర్థం బైనదని యెఱుంగు మిప్పుడు మదీయబాహువులు చందనపంకంబున
కును గేయూరధారణంబునకును ధనత్యాగంబునకును సుహృత్పాలనంబున
కును యోగ్యంబులైన నవి యన్నియుఁ బరిత్యజించి భవదభిషేచనకర్మవిఘా
తంబుఁ గావించినట్టి దురాత్ముల వధంబునందుఁ బ్రవృత్తంబులు గాఁగలవు
|
|
|
తమ్ముండ నైననాకు నీకు హితంబు సేయుటకంటె నొండు కార్యంబు లేదు
గావున గింకరుండినైన నావచనం బంగీకరించి కార్యంబు నడపుతెఱం గానతి
మ్మని ప్రార్థించుచున్న లక్ష్మణుం జూచి తదీయనేత్రగళదశ్రుబిందుసందో
హంబు కొనగోట మీటుచుఁ బితృవచనవ్యవస్థితుండై యావజ్జీవపర్యంతం
బును వాక్యకరణంబును బ్రత్యబ్దంబు భూరిభోజనంబును గయయందుఁ బిండదా
నంబు నిమ్మూఁటిచేతఁ బుత్రత్వంబు ప్రాపించుఁ గావున నెల్లభంగుల వనంబునకుం
జనియెద నీ వంగీకరింపవలయునని ధర్మసంహితంబుగా బోధించుచున్నరామునిం
గని బాష్పధారాపూరితలోచనయై కౌసల్య యి ట్లనియె.
| 559
|
సీ. |
ఎవ్వఁడు ధర్మాత్ముఁ డెవ్వాఁ డదృష్టదుఃఖుఁడు సర్వభూతప్రియుఁడు మహాత్ముఁ
డెవ్వాఁడు దశరథోర్వీశునివలన నాయందు జన్మించె సమంచితముగ
నెవ్వానిదాసులు భృత్యులు మృష్టాన్న మారగింతురు నిత్య మట్టినీవు
భీకరవనములో నాకలంబులు దీని యేరీతి నుండెద విట్లు రాముఁ
|
|
ఆ. |
డడవి కేగె ననఁగ నాలించి విభుని నె, వ్వాఁడు విశ్వసించు వసుధ సుగుణ
వనధి వైననీవు వనమున కరుగ నే, మందు దైవ మింత యధిక మగునె.
| 560
|
సీ. |
అనఘాత్మ భవనదర్శనమారుతోత్థిత మై దేహజాతశోకానలంబు
గాఢవిలాపదుఃఖసమిత్సమన్విత మగుచు సమ్యగ్గళదశ్రుఘృతము
చే వేల్వఁబడి మహాచింతోష్ణధూమంబు వఱల నూర్పుల సమావర్తనమునఁ
గడువృద్ధిఁ బొంది మద్గాత్రంబు నేర్చుచు నతులదావాగ్ని హిమాత్యయమున
|
|
తే. |
నెండుపొదను దహించిన ట్లీవు నడవి, కరుగ నన్నుఁ దపింపఁజేయదె గడంగి
కుఱ్ఱ నెడఁబాయఁ జాలని గోవుపగిది, నేను నీవెంట వచ్చెద నిపుడు వనికి.
| 561
|
క. |
అని యీగతి విలపించుచు, మనమున సంతాపవహ్ని మల్లడిగొనఁగాఁ
దనతోడ మాటలాడెడు, జననికి ని ట్లనియె రామచంద్రుఁడు సూక్తిన్.
| 562
|
రాముఁడు కౌసల్యనుఁ దాను వనమునకుఁ బోవుటకు సమ్మతిపఱచుట
మ. |
జననీ యే నలదావసీమ కరుగన్ క్ష్మానేత కైకేయి చే
సినపాపంబునకుం గృశించు మఱి నీచే నిప్పు డీరీతిఁ జ
య్యనఁ దా వీడ్వడెనేని ఘోరతరదుఃఖార్తిన్ మదిం గుంది యా
యన జీవింపఁడు గాన నీ కతనిఁ బాయం బోల దీపట్టునన్.
| 563
|
క. |
రమణులకుఁ బతిపరిత్యా, గము కేవలఘోరపాపకారణ మగుటన్
సముదితగుణుఁ డగుపతి నో, రమణీయగుణాఢ్య విడువరా దిట నీకున్.
| 564
|
మ. |
జననాథోత్తముఁ డెంతకాల మిలపై సప్రాణుఁడై యుండు నీ
వనుమానింపక యంతకాలము సముద్యద్భక్తియోగంబుచే
|
|
|
తను శుశ్రూష యొనర్పఁ బోలు నిది యుక్తం బీవు నే నెప్పు డా
యనవాక్యం బొనరింపఁ బోలుఁ బతియున్ క్ష్మాధీశుఁడుం గావునన్.
| 565
|
వ. |
అని బహుప్రకారంబుల బోధించి యద్దేవి నెట్టకేలకు నొడంబఱిచి పితృవచన
ప్రకారంబునఁ బదునాల్గుసంవత్సరంబులు వనవాసంబుఁ గావించి వచ్చి భవ
దీయపాదారవిందంబులు గొలుచుచుండువాఁడ నని పలికిన నద్దేవి వెండియుఁ
గుమారుని వనవాసంబు దలంచి కనుంగొనల నశ్రుకణంబు లొలుక నక్కుమార
వరు నవలోకించి యి ట్లనియె.
| 566
|
చ. |
జనకునిమాటఁ గైకొని వెస న్విపినంబున కీవు పోయిన
న్వినుము సపత్నులం గనుచు నే సరిగా మనియుండఁ జాల జ
య్యన విపినంబునం బొడమినట్టి మృగిం బలె నన్ను వెంటఁ దో
డ్కొని చను మేగుదెంచెద నకుంఠితభంగి నరణ్యసీమకున్.
| 567
|
వ. |
అని పలికి రోదనంబుఁ జేసిన తల్లిం జూచి తానును దుఃఖాక్రాంతచిత్తుం
డగుచు ధైర్యధుర్యుండు గావున నొక్కింత యుపశమించుకొని గ్రమ్మఱ నయ్య
మ్మదిక్కు మొగంబై యి ట్లనియె.
| 568
|
చ. |
పతియె మృగాక్షికి న్విభుఁడు బంధుఁడు దైవత మట్లు గావునన్
క్షితిపతి నీకు నా కెపుడుఁ గేవలపూజ్యకుఁ డమ్మహాత్ముఁ డ
ద్భుతకరుణాకరుండు నినుఁ బ్రోవక నేటి కుపేక్ష సేయు స
మ్మతి నిటు చింత వీడి గుణమండనగేహమునందె యుండుమా.
| 569
|
క. |
ఏ నడవి కరుగ భూపతి, దా నంతయు దుఃఖశోకతాపముచేతన్
మ్రానుపడి యుండుఁ గావున, నీనేర్పున నమ్మహాత్ము నెగ లుడుపఁ దగున్.
| 570
|
క. |
పరమోత్తమయై యేసతి, నెఱిగల్గి వ్రతోపవాసనిరత యగుచుఁ దా
వచుని భజియింప దాసతి, నిరయపదంబునకుఁ బోవు నిక్కము జననీ.
| 572
|
క. |
ధాత్రీసురసురపూజలు, పాత్ర మెఱిఁగి సేయకున్న బతిశుశ్రూషా
మాత్రమున సాధ్వి కెంతయుఁ, జిత్రంబుగ స్వర్గపదవి చేకుఱుఁ దల్లీ.
| 573
|
క. |
జననీ యేయుత్తమసతి, తననాథుని ధర్మసరణిఁ దప్పక యెపుడున్
ఘనభక్తిఁ గొలుచు నాయమ, యనిమిషలోకైకసౌఖ్య మందుచుఁ జెలఁగున్.
| 574
|
క. |
వగ పెంత తనకుఁ గలిగిన, మగువకుఁ బతిసేవ శ్రుతిసమంచితధర్మం
బగుఁ గాన దీనిఁ గనుఁగోని, మగనిఁ గొలుచుచుండు మెపుడు మాన్యచరిత్రా.
| 575
|
వ. |
అని పలికి భర్తృశుశ్రూషయందు యద్దేవిచిత్తంబు గీలుకొల్పి వెండియు.
| 576
|
క. |
భరతుఁడు ధర్మరతుండును, గరుణ గలుగువాఁడు గానఁ గైకను నినుఁ దా
సరిగాఁగఁ జూచు నారఘు, వరు నన్నుంబోలెఁ జూడు వాత్సల్యమునన్.
| 577
|
చ. |
అనుపమశాంతిహోమములయందు ఘృతాహుతిచేత వేల్పులన్
వినుతధనంబులం బుడమివేల్పులఁ దృప్తులఁ గాఁగఁ జేయుచున్
జనప్రతిరక్షణంబునకుఁ జాలి మదాగమనంబుఁ గోరుచున్
మునుకొని కాల మొక్కగతిఁ బుచ్చుచు నుండుము పోయి వచ్చెదన్.
| 578
|
వ. |
ఏను గ్రమ్మఱఁ బురంబునకుం జనుదెంచునందాక మహీరమణుండు సప్రాణుండై
యుండెనేని సకలాభీష్టఫలంబులు వడయంగలదాన వని పలికిన నత్తలోదరి శోకాయ
త్తంబగుచిత్తంబున బాష్పపర్యాకులేక్షణయై వెండియు నక్కుమారున కి ట్లనియె.
| 579
|
తే. |
వినుతగుణశీల విను నీకు విపినగమన, మందుఁ బుట్టినబుద్ధి నావంతయైన
నిలువరింపంగ లేనైతి నేర్పు లేల, కాలము దురత్యయం బెంత ఘనున కైన.
| 580
|
వ. |
పుత్ర యేకాగ్రచిత్తుండవై నీవు చనుము నీ కెల్లప్పుడు భద్రంబు గలుగుం
గాక నీవు కృతార్థుండవై చరిత్రవ్రతుండవై పితౄణముక్తుండవై వనంబున నుండి
గ్రమ్మఱఁ జనుదెంచినప్పుడు నిన్ను విలోకించి యేను గతక్లేశనై సుఖంబుఁ
బ్రాపించెద నని పలికి వెండియు.
| 581
|
తే. |
దేనిప్రేరణచేతను బూని నాదు, వాక్యమును ద్రోసిపుచ్చి యిబ్భంగి నీవు
విపినమున కేగఁదలఁచె దవ్విధిమహిమము, దుర్విభావంబు నేరికి నుర్వియందు.
| 582
|
క. |
తనయా వనమున కిప్పుడు, చనుము కుశలి వగుచు మరలఁ జనుదెంచి ముదం
బునఁ జారుసామసూక్తుల, ఘనమతి నను హృష్టచిత్తఁ గాఁ జేయు మొగిన్.
| 583
|
కౌసల్య రామునికిఁ బ్రాస్థానికస్వస్త్యయనంబుఁ గావించుట
వ. |
వత్సా నీవు వనవాసవ్రతంబు పరిసమాప్తి నొందించి జటామండలధారిపై
చతుర్దశవర్షాంతరంబునమరలి మత్సమీపంబునకుం జనుదెంచి నన్నుం దేర్చునట్టి
కాలం బిదియ కారాదా యని తలంచెద నని పలికి దుఃఖం బడంచుకొని నిర్మల
జలంబు లుపస్పృశించి శుచియై ప్రాస్థానికంబగు స్వస్త్యయనం బొసంగ నుపక్ర
మించి శ్రీరాము నుద్దేశించి.
| 584
|
క. |
అతులితముగ నియమముచే, ధృతిచే నీచేత మిగుల నేధర్మము పా
లితమయెయే నట్టిధర్మము, సతతము నినుఁ బ్రోచు నడవి నిత్యవిచారా.
| 585
|
వ. |
అదియునుం గాక చైత్యాయతనంబులందు నిత్యంబు నీచేత నెవ్వారు వందితు
లగుదు రట్టిదేవతలు మహామునులం గూడి నిన్ను రక్షింతురుగాక మహాత్ముం
డగువిశ్వామిత్రుండు తొల్లి నీకొసంగిన దివ్యాస్త్రంబులు నీకు జయప్రదంబు
లగుం గాక పితృమాతృశుశ్రూషాసత్యంబులచేత రక్షితుండవై బలాయురారో
గ్యంబులు గలిగి వర్ధిల్లెదవు గాక మఱియు సమిత్కుశపవిత్రవేదికాయతనస్థం
డిలంబులును శైలవృక్షంబులును హ్రస్వశిఫంబు లగు శాఖావృక్షంబులును
హ్రదంబులును నిన్ను నిరంతరంబు రక్షించుం గాక పతంగపన్నగసింహం
బులు నీకు శుభంబు లొసంగుఁ గాక సాధ్యులును నాశ్వినేయులును వాయు
|
|
|
వులును ధాతయు విధాతయు సూర్యుండును లోకపాలకులును మహర్షిగణం
బులం గూడి సుఖప్రదులై రక్షింతురు గాక భగవంతుండగు స్కందుం
డును సోముండును బృహస్పతియు సప్తర్షులును నారదుండును సర్వకా
లంబు నీకు మంగళం బొసంగుచుండుదురు స్మృతియును ధృతియును ధర్మం
బును సముద్రంబులును నదులును భూమ్యంతరిక్షదివంబులును దిక్కు
లును ఋతుసంవత్సరమాసపక్షంబులును నహోరాత్రంబులును గ్రహ
నక్షత్రంబులును సంధ్యలును గళాకాష్ఠాముహూర్తాదికాలంబులును నిత్యం
బును మునివేషధరుండవై వనంబునం దిరుగు నీకు సకలమంగళప్రదము
లై వెలయుం గాక మఱియు భూతప్రేతపిశాచబ్రహ్మరాక్షసరక్షోయక్షప్ల
వంగవృశ్చికదంశమశకసరీసృపకీటసింహశరభశార్దూలగజగవయవరాహ
భల్లూకమహిషాదిక్రూరసత్వభయంబువలన సర్వదేవత లేమఱక నిన్ను రక్షిం
తురుగాక యింద్రాదిదిక్పాలురు దండకారణ్యనివాసి వైననీకు సర్వోపద్రవ
నివారణంబు సేయుచుండుదురుగాక మార్గంబులు కందమూలమధుసంపన్నంబు
లై యుండుఁ గాక మునిముఖచ్యుతంబు లగు మంత్రంబులును నగ్నియును
మారుతంబును హోమధూమంబులును నుపస్పర్శనకాలంబున నిన్ను రక్షిం
తురుగాక శిరంబు దివంబును శ్రోత్రంబులు దిక్కులును ముఖంబు నింద్రాగ్ను
లును నేత్రంబులు సూర్యుండును మనంబు చంద్రుండును బ్రాణంబులు వాయువు
నాభి నంతరిక్షంబును బాదంబులు భూమియు రక్షించుఁగాక యని యీదృ
శంబులగు మంగళవాక్యంబుల స్వస్తివచనపూర్వకంబుగా నంగరక్షుఁ గావించి
గంధపుష్పాక్షతంబులచేత దేవగణంబులం బూజించి రామునకు మంగళాభ్యు
దయపరంపరాభివృద్ధికొఱకు ఘృతంబును బుష్పంబులును శ్వేతసర్షపంబులు
సమిత్తులుఁ గల్పోక్తప్రకారంబున బ్రాహ్మణునిచేత నగ్నియందు హోమంబు
సేయించి మఱియు నారామునకు మంగళంబుకొఱకు స్వస్త్యయనక్రియ లాచ
రించి యవ్విప్రముఖ్యునకు గోభూహిరణ్యాదిదానంబు లొసంగి వెండియు సీతా
వల్లభు నుద్దేశించి యి ట్లనియె.
| 586
|
సీ. |
వృత్రనాశనమందు నింద్రున కమరసమాజ మిచ్చిన జయమంగళంబు
నమృతంబుఁ దేఁబోవునహికులారికి వినతాంగన యిచ్చిన మంగళంబు
నమృతంబు వడయునాఁ డదితి దైత్యుల గెల్వ మఘవున కిచ్చిన మంగళంబు
బలిఁ గట్ట నరుగునాఁ డలవామనున కింద్రమాత యిచ్చిన శుభమంగళంబు
|
|
తే. |
నీకె యగుఁ గాక యని రఘునేతశిరము, నందు మంత్రాక్షతలు నిడి చందనంబు
నలఁది సువిశల్యకరణి దివ్యౌషధియును, గుళికఁ గావించి ముంజేతఁ గూర్చి కట్టె.
| 587
|
వ. |
ఇట్లు రక్షాబంధనంబుఁ గావించి దాని వీర్యవంతంబు లగుమంత్రంబులచేత
నభిమంత్రించి చుబుకంబు పుణికి శిరంబు మూర్కొని చెక్కిలి ముద్దుగొని
గద్గదస్వరంబున ని ట్లనియె.
| 588
|
సీ. |
అనఘాత్మ పోయి ర మ్మడవికి సుఖివై యరోగుండవై యందు రూఢి మెఱయ
సమయంబుఁ దీర్చి ప్రసన్నాననుండ వై మరలఁ బురంబున కరుగుదెంచి
యవనిజఁ గూడి పట్టాభిషిక్తుండ వై యతులితవజ్రసింహాసనమునఁ
బూర్వాద్రిపైఁ బొల్చుపూర్ణచంద్రునిమాడ్కిఁ జెలఁగుచుఁ బ్రజల రక్షించు నిన్నుఁ
|
|
తే. |
గన్ను లారంగఁ జూచెదఁ గాక యనుచు, నడవి వర్తించునిన్ను శివాదిసురులు
నమరమునులును నీకు దీర్ఘాయు వొసఁగి, కాచి రక్షించుచుందురుగాక వత్స.
| 589
|
రాముఁడు స్వగృహంబున కరుగుట
వ. |
అని పలికి స్వస్త్యయనంబుఁ బ్రయోగించి రక్షార్థంబు ప్రదక్షిణంబు చేసి కొడు
కుం గౌఁగిలించుకొని పోయి రమ్మని పంచిన నారఘుపుంగవుండు తల్లిపాదంబు
లకుఁ బ్రదక్షిణపూర్వకంబుగా సారెసారెకు నమస్కారంబుఁ గావించి దీవెనలఁ
జెంది తదీయమందిరంబు వెలువడి నిజదేహప్రభాపటలసమలంకృతరాజ
మార్గుం డగుచుఁ బూర్వభాషిత్వప్రియవాదిత్వప్రభృత్యుక్తవిశిష్టగుణత్వం
బున జనంబులచిత్తంబుల నిర్మథించుచు సంహృతజనాకీర్ణంబును గార్తస్వర
విభూషితంబు నగుస్వగృహంబునకుం జని యందుఁ బట్టాభిషేకనిఘాతాదికం
బెఱుంగని దగుటవలన నాయౌవరాజ్యాభిషేచనంబు మనంబున నిడికొని దేవ
పూజాదికంబు నిర్వర్తించి యభిషిక్తభర్తృవిషయంబునందుఁ బట్టభార్యల
చేతఁ జేయం దగినపాదార్చనాదిసమాచారం బెఱింగిన దగుటం జేసి
సాక్షతగంధపుష్పపాత్రహస్త యై యభిషిక్తరాజసాధారణలక్షణపాండురచ్ఛత్ర
చామరపురస్కృతభద్రాననాదికంబు లెఱింగినది గావున నుక్తలక్షణవిశి
ష్ఠుం డై వల్లభుం డెప్పుడు వచ్చునో యని తథాగమనంబుఁ బ్రతీక్షించుచున్న
సీతకడకుం జని యద్దేవి కెవ్విధంబున నేతాదృశవిప్రియం బెఱింగింతు నని
వ్రీడానమ్రవదనుం డై యుండె నప్పుడు.
| 590
|
తే. |
విభునిముఖమునఁ గనుపట్టు విన్నఁదనము, జిత్తమునఁ గూరియుండినచింతఁ జూచి
యొకవిధంబునఁ జూపట్టుచున్నదనుచుఁ, గాంత చింతాకులితసర్వకరణ యయ్యె.
| 591
|
సీత రామునిముఖంబునం గల దుఃఖమునకుఁ గారణం బడుగుట
చ. |
అతివ తెఱంగుఁ జూచి హృదయంబునఁ దాలిమి నిల్పలేక దా
నతిశయదుఃఖవేగమున నశ్రులు రాల్పఁ దొడంగె నప్పు డా
పతికడఁ దోఁచులజ్జయు విపన్నతయుం బరికించి మేదినీ
|
|
|
సుత కడు నివ్వెఱ న్మునిఁగి శోకముతో నిజభర్త కి ట్లనున్.
| 592
|
తే. |
దేవ నేఁడు బృహస్పతిదేవతాక, మైనపుష్యమి నీదురాజ్యాభిషేక
మునకుఁ దఱి యని విప్రోత్తములు వచించి, రది నిరర్థక మేభంగి నయ్యెఁ జెపుము.
| 593
|
క. |
జలఫేనసన్నిభము శత, శలాకికాయుతము పూర్ణచంద్రసదృశ ము
జ్జ్వల మగుశ్వేతచ్ఛత్రము, సులలిత మగు శిరముమీఁద శోభిల దేలా.
| 594
|
తే. |
నవసరోరుహపత్రాభనయన మైన, నీదువదనంబు మణిదండనిర్మితాఛ్ఛ
చంద్రహంసప్రతీకాశచామరముల, చేత రంజింపఁబడ దేల చెపుము నాకు.
| 595
|
తే. |
నిఖిలమంగళతూర్యవినిస్వనములు, సూతమాగధపాఠకస్తుతిరవములు
సకలభూసురస్వస్తివాచననినాద, మిపుడు వినఁబడ వేల ప్రాణేశ చెవుమ.
| 596
|
తే. |
వేదవేదాంగవిదు లైనవిప్రవర్యు, లధిప మూర్ధాభిషిక్తుఁడ వైననీదు
శిరమునందుఁ దీర్థాంబుమి శ్రితమనోజ్ఞ, దధియుక్షౌద్రంబు నిడ రేల తపనతేజ.
| 597
|
క. |
పరిషన్ముఖ్యులు మంత్రులు, పరమర్షులు జానపదులు పౌరులు భృత్యుల్
పరమానందంబున నీ, పిఱుందదెస రా రదేల ప్రియ మలరారన్.
| 598
|
తే. |
ముఖ్యములు వేగసంపన్నములు మనోజ్ఞ, కాంచనవిచిత్రభాండయుక్తంబు లైన
భూరిహయములఁ బూన్చినపుష్యరథము, భానుతేజ నీమ్రోలఁ జూపట్ట దేల.
| 599
|
తే. |
నీలమేఘనిభప్రభానిరుపమాన, కుసుమపూజితసుందరకుంజరంబు
పృథుపరిష్కారరేఖాగభీర మగుచు, దేవ నీమ్రోల రా దేల తెలియఁ జెపుమ.
| 600
|
క. |
హరిహయసన్నిభవిక్రమ, సురుచిరమణివజ్రచిత్రసుందరచామీ
శరభద్రాసనముఁ బుర, స్కరించుకొని రా వదేల సముచితభంగిన్.
| 601
|
చ. |
సలలితచంద్రబింబసదృశం బగునీవదనం బదేలకో
చెలువము దక్కి నేఁడు పెనుచింత వివర్ణత నొంది యున్న దు
ల్లలదురురాజలక్షణవిలాసము లేమియుఁ గానరావు నా
కలవడఁ దెల్పు మింతయు మహాపురుషా యనుమాన మేటికిన్.
| 602
|
చ. |
అని విలపించుచున్న ప్రియురాలికి నాత్మవివాసనంబుఁ దా
మును వినిపించినం బిదప మోసము వచ్చు నటంచు బెద్దయు
న్ఘనగుణకీర్తనంబున మనంబు దిరంబుగఁ జేయ రాఘవుం
డనియె మహీజతోడ ముదితాత్ముఁడుపోలె నయంబుఁ దెల్పుచున్.
| 603
|
రాముఁడు సీతకు దశరథనిర్దేశంబుఁ దెల్పుట
చ. |
సరసిజనేత్ర తొల్లి నృపచంద్రుఁడు కైకకు మెచ్చి వేడ్కతో
వరములు రెం డొసంగె విభవంబున నాయమ నాఁటనుండి దా
మఱచియు నిఫ్డు తెల్వి గని మానవనాథునియొద్ద నెంతయు
|
|
|
న్భరతున కుర్వి రాజ్యమును నాకుఁ బ్రవాసముఁ గోరెఁ గోరినన్.
| 604
|
చ. |
జనపతి సత్యవాదియును సత్యవిచారుఁడు గాన మున్ను దా
ననుమతిఁ జేసి వేడ్క మెయి నాడినవాక్యముఁ దప్పలేక నె
మ్మనమునఁ గైకపుత్రునకు మానవరాజ్యము నీఁ దలంచి న
న్వనమున నుండు పొ మ్మనె నవారణలీలఁ జతుర్దశాబ్దముల్.
| 605
|
రాముఁడు సీతకు బుద్థులు కఱపుట
వ. |
నీచేత ననుజ్ఞాతుండ నై కాదె వనంబునకుం బోవువాఁడ నై నిన్నుఁ జూడ
వచ్చితి మఱియు భరతుని సమీపంబునం దేను నీచేత నొకానొకప్పు డైన
శ్లాఘనీయుండఁ గాను సమృద్ధియుక్తు లగుపురుషులు పరస్తవంబు సహింపం
జాలరు గావున మద్గుణంబులు భరతునిమ్రోలఁ గథ్యంబులు గావు సర్వ
ప్రకారంబుల నతనిసమీపంబున ననుకూలత్వంబున వర్తించు టిది యో
గ్యంబు నీవు బంధుసాధారణ్యంబున భరణీయవుగాని భర్తవ్యవు గావు సనాతనం
బగురాజ్యంబు తండ్రిచేత నతనికి దత్తం బయ్యెఁ గావున నతండు నరపతి
యగుటం జేసి నీచేత విశేషించి ప్రసాద్యుండై యుండుఁ బితృవచనప్రకారం
బున నేను వనంబునకుం జనియెద నావచ్చునందాఁక వ్రతోపవాసంబులు సలు
పుచుఁ గాలంబు దప్పకుండ దేవతాసపర్యలు గావించుచు నిత్యంబుఁ గౌస
ల్యాదశరథులకు నమస్కరించుచు విశేషించి మజ్జనని యగు కౌసల్య శోకసం
తాపకర్శిత గాకుండ సన్మానంబు సేయుచు స్నేహప్రణయపాలనంబుల నాకుఁ
దల్లు లందఱు నొక్కరూపు గావున నద్దేవుల కందఱకు వందనంబు లాచ
రించుచు మఱియు నాకుఁ బ్రాణతుల్యులును భ్రాతలును బుత్రసములు నగు
భరతశత్రుఘ్నులయెడ వాత్సల్యంబు నెఱపుచు విశేషించి భరతుండు
దేశకులంబులకు రాజు గావున నతనికి విప్రియంబుఁ గావింపక ప్రియవా
దిని వై యుండు మనుకూలవృత్తిచేత నాలస్యత్యాగాదులచేత నవనీపతు
లారాధితు లై ప్రనన్ను లగుదురు తద్విపర్యయంబునందుఁ గుపితు లగు
దురు గుణంబు లేనియెడఁ బుత్రుల నైనఁ బరిత్యజింతురు గుణంబు గలచోట
నన్యుల నైనం బరిగ్రహింతు రట్లు గావున నీ వీయర్థంబు మనంబున నిడికొని
ధర్మంబు దప్పకుండ భరతుని కనువర్తినిపై సత్యవ్రతపరాయణవై యొక్కని
కైన నప్రియం బొనరింపక ధర్మైకనిష్ఠవై కాలంబుఁ గడపుచు మదాగమ
నంబుఁ బ్రతీక్షించుచుఁ గౌసల్యయొద్ద నుండు మేను వనంబునకుం బోయి
వచ్చెద.
| 606
|
క. |
అని యీవిధమునఁ బతి ప,ల్కినఁ బ్రణయమువలనఁ గోపగించినయటు లా
వనజాతనేత్ర నిజనా, థునిఁ గనుఁగొని పలికె మరల దుఃఖము గదురన్.
| 607
|
సీత రామునితోఁ దానును వెంటనే వత్తు ననుట
తే. |
అనఘ యేమి వచించెద వలఁతిమాట, లఖిలధర్మపారంగతు లైనమీరె
తగవు విడనాడి పలుకు టెంతయును నాదు, మదికిఁ బరిహాసమై తోఁచె మానవేంద్ర.
| 608
|
చ. |
తనయుఁడు భ్రాతయున్ స్నుషయుఁ దల్లియుఁ దండ్రియు నాత్మకర్మసం
జనితఫలంబులం గుడువఁజాలి స్వభాగ్యనియుజ్యమాను లై
మనుదురు భర్తృభాగ్యమును మానిని యొక్కతె పొందుఁ గావున
న్మనుజవరేణ్య యేనును వనంబున నున్కి యొనర్పఁగాఁ దగున్.
| 610
|
వ. |
అదియునుంగాక 'అర్థోవా ఏష ఆత్మనో యత్పత్నీ”యను వేదవాక్యంబు గలదు
గావున భవదర్ధశరీరభూత నైనయేనును మహీపతిచేత వనవాసంబునందు నియో
గింపఁబడినదాన నైతిఁ గావున నేను నీతోడ వనంబునకుం జనుదెంచెద.
| 611
|
క. |
జనకుఁడు జననియు సజయును, దనయుండును దనకుఁ గారు తథ్యము ధరలో
వినుము సతి కిందు నందును, మనుఁ డగుపతి యొకఁడె పరమగతి తలపోయన్.
| 612
|
క. |
అనఘా నీ విపుడే వన, మునకుం జనితేని నీదుముంగలఁ గుతుకం
బునఁ గుశకంటకముల నొగి, పని మృదువుగఁ జేసికొనుచు వచ్చెదఁ బ్రీతిన్.
| 613
|
తే. |
రోషము నసూయయును మృషాభాషణంబు, భుక్తశేషోదకంబును బోలె విడిచి
కొని చనుము నన్ను నిర్విశంకుండ నగుచుఁ, బ్రాణనాథ నాయందుఁ బాపంబు లేదు.
| 614
|
వ. |
మఱియు వల్లభుండు ప్రాసాదాగ్రంబులకన్నను స్వర్లోకస్థితవిమానంబులకన్న
ను యోగబలంబువలనఁ గేవలవైహాయసగతంబులకన్నను సర్వావస్థలయందుఁ
బతిపాదచ్ఛాయయే యువతి కధికం బని విధింపఁబడియె నదియునుంగాక.
| 615
|
ఉ. |
తల్లియుఁ దండ్రియు న్బహువిధంబుల బుద్ధులఁ జెప్పుచోట నా
కెల్లెడ భర్తృసేవ మది నేమఱకుండు మటంచుఁ బ్రీతితోఁ
దెల్లము గాఁగ ధర్మవిధిఁ దెల్పిరి గావున నత్తెఱంగు నా
యుల్లమునందుఁ బాదుకొని యున్నది వెండియుఁ జెప్ప నేటికిన్.
| 616
|
ఆ. |
పురుషవర్జితంబు భూరిమృగాకీర్ణ, మైనవిపినమునకు నరుగుదెంచి
తండ్రిగృహమునందు దగ వసించినమాడ్కి, నిన్నుఁ గూడి యచట నిలుచుదాన.
| 617
|
క. |
అతులత్రిలోకసుఖసం, తతి యైన నదేల వినుము ధరణీశ పతి
వ్రత లగుసతులకు నిత్యముఁ, బతిసేవ చతుర్విధేష్టఫలదము గాదే.
| 618
|
ఉ. |
కావున జీవితేశ ఘనకాననసీమఫలంబుల న్ముదం
|
|
|
బావహిలన్ గ్రసించుచు సమాహికబుద్ధి భవత్పదాబ్జముల్
వావిరిఁ గొల్చుచు న్మధుసువాసితభూముల నిన్నుఁ గూడి యి
చ్ఛావిధిఁ గ్రీడ సల్పెదఁ బ్రసన్నతఁ దోడ్కొని పొమ్ము వచ్చెదన్.
| 619
|
క. |
దేవా యన్యుల నైనను, బ్రోవ సమర్థుఁడవు నీవు పొలుపుగ నన్నుం
బ్రోవఁగఁ జాలవె మునుకొని, నీవెంట నరణ్యమునకు నిజముగ వత్తున్.
| 620
|
వ. |
మహాత్మా న్యాయప్రాప్తానుగమనత్వంబువలన నన్నుఁ గ్రమ్మఱింప శక్యంబు గా
దన్నపానవిశేషసంపాదనంబుకొఱకు నీకు దుఃఖంబుఁ గావింపక ఫలమూలంబు
లాహరించి నిత్యంబు నిన్ను సేవించుచుఁ ద్రైలోక్యైశ్వర్యంబు నైన గణిం
పక పాతివ్రత్యంబుఁ జింతించుచుఁ దపశ్చరణశీల నై నియమయుక్త నై నిన్నుం
గూడి యుండెద నదియునుంగాక.
| 621
|
సీ. |
మనుజేంద్ర గుహలందు మధుగంధివనములయందుఁ బల్వలములయందు శైల
ములయందు శాడ్వలంబులయందు నామదేశములందు బకహంసచక్రవాక
కారండవాకీర్ణకాసారములయందు మించి నీతోడఁ గ్రీడించుకంటె
నాకలోకం బైన నామనంబున కెక్కు డగునె మహాత్మ యిప్పగిదిఁ బెక్కు
|
|
తే. |
వత్సరంబులు చరియింప వచ్చుఁ గాక, చిత్తమున కొక్కదురవస్థ చిక్కుపడునె
నిన్నుఁ బాసినయెడ నింట నున్న భోగ, మెంత గలిగిన సంతోష మింత లేదు.
| 622
|
ఉ. |
కావున నే నవశ్యమును గారుణికోత్తమ కాననోర్వికి
న్నీవెనువెంట వచ్చెదను నేర్పులు దెల్పుచుఁ గా దఁటన్నచో
వావిరి దుఃఖశోకమయవారిధిలోన మునింగి చెచ్చెరన్
జీవితముల్ ద్యజింతు నిది సిద్ధము పల్కులు వేయు నేటికిన్.
| 623
|
వ. |
దేవా మృగయుతంబును వానరవారణసమన్వితంబును సుదుర్గమంబు నగువనం
బునకుం జనుదెంచి యందు భవత్పాదారవిందంబులు సేవించుచుఁ బితృగృ
హంబునందుం బోలె సుఖంబుగా నుండెద నిరంతరానురక్తచిత్త నై యనన్య
భావ నై భవద్వియుక్త నగుదు నేని మరణంబునకు నిశ్చిత నై ప్రార్థించుచున్న
నన్ను శీఘ్రంబున వనంబునకుం దోడ్కొని చను మిది నీకు భారంబు గాదు.
| 624
|
చ. |
అని యిటు సర్వధర్మకలితాత్మక యైనమహీకుమారి ప
ల్కిన విని రాఘవుండు పలికెన్ మరలన్ నిజపత్నిఁ జూచి కా
ననమునఁ గల్గు బాములు మనంబున నెంచుచుఁ దద్విలోలలో
చనగళదశ్రువుల్ దుడిచి సాంత్వమృదూక్తి ననూనయించుచున్.
| 625
|
తే. |
అంబుజేక్షణ నీవు మహాకులీన, వగుట ధర్మవిశారద వైతి విచట
నిలిచి మనమున కింపుగా నిఖిలధర్మ, మాచరింపుము ననుఁ గూర్చి యనుదినంబు.
| 626
|
శ్రీరాముఁడు సీతను వనమునకు రావల దనుట
క. |
ఏ సిద్ధి బుద్ధిఁ గఱపిన, దాని నొనర్పంగ నీకుఁ దగుఁ గావునఁ బ
ద్మానన కాననసీమకు, మానుగ రావలదు నిలువుమా నిలయమునన్.
| 627
|
ఉ. |
కోమలి కాననంబు లతకూనలకుం జొర రాదు దుర్జన
స్తోమనివాసము న్బహుళదుఃఖతరంబు భయస్వరూప ము
ద్దామమృగప్రకాండ మతిదారుణ మచ్చట నెంతయు న్సుఖం
బేమియు లేదు నామతి గ్రహించి సుఖస్థితి నింట నుండుమా.
| 628
|
క. |
గిరినిర్ఝరజనితము లగు, పరుషనినాదములు భయనబంధురగిరికం
దరవాసిసింహనినదో, త్కరములు వీనులకు దుఃఖకరములు గావే.
| 629
|
క. |
జనశూన్యము లగుఘోరవి, పినదేశములందు భూరిభీషణఘోషం
బునఁ గ్రీడ సలుపుమృగములఁ, గనుఁగొన్నను భయము వొడముఁగాదె మృగాక్షీ.
| 630
|
క. |
దారుణనక్రవిహారో, దారము లై బురద గల్గి దంతికలితసం
చారంబు లై తనర్చెడు, భూరిమహానదులు దాఁటఁబోలునె చెపుమా.
| 631
|
క. |
హరిణాంకవదన భీషణ, తరకృకవాకూపనాదితములు లతాప్ర
స్తరకంటకయుతములు నగు, నరణ్యమార్గముల నడువ నలవియె నీకున్.
| 632
|
రాముఁడు సీతకు వనవాసంబునం గల యిడుములఁ దెల్పుట
క. |
వనజాతనేత్ర తమయం, తనె రాలినపర్ణతల్పతలములయందుం
బనిపడి నిద్రించుటయును, ఘనసుకునూరులకు మిగులఁ గష్టముగాదే.
| 633
|
క. |
కమలాక్షి తరువు వలనం, దమయంతనె పడినఫలవితానముఁ దిని కా
లము పుచ్చుచు నాఁకటి కో, ర్చి మనంగాఁ జెల్లు నొక్కొ మృగనేత్రలకున్.
| 634
|
మ. |
చలిగాలిం బడి నిత్యముం ద్రిషవణస్నానంబుఁ గావించుచున్
ఫలమూలంబుల దేవతాతిథిపితృవ్రాతంబుల న్భక్తి ని
చ్చలుఁ బూజించుచు సంతతవ్రతవిధుల్ సంధించుచున్ దీర్ఘవ
ల్కలముల్ దాల్చి వసింపవచ్చునె వనిం గార్శ్యోపవాసంబులన్.
| 635
|
క. |
వానప్రస్థోచితవిధి, చే నిత్యము వేదియందు క్షితిజాత గళ
త్సూనార్చలు సలుపఁగ వలెఁ, గాన నరణ్యంబు దుఃఖకరము లతాంగీ.
| 636
|
తే. |
మానినీమణి లబ్ధంబు లైనమూల, ఫలము లవి కొంచె మైనను బరఁగ వాని
చేతనై మనంబునకుఁ దృప్తి సేయవలయు, గహనవాసంబు కడుదుఃఖకరము సుమ్మి.
| 637
|
వ. |
మఱియు మహావాతంబులు రజోరూషితంబులై సుడియుచుండు రాత్రులయందు
గాఢతిమిరంబు వ్యాపించియుండు సర్వకాలంబు మిక్కిలి భోజనేచ్ఛ గలిగి
యుండు గిరిసర్పంబులు బహురూపంబులై యతికుటిలసంచారంబులై మార్గంబు
|
|
|
నావరించుకొనియుండుఁ బతంగవృశ్చికకీటదంశమశకంబులు నిత్యంబును బాధిం
చుచుండుఁ గంటకవంతంబు లైనద్రుమంబులును గుశకాశంబులును వ్యాకుల
శాఖాగ్రంబు లై యుండు నదియునుం గాక యరణ్యవాసంబునందుఁ గాయ
క్లేశకరంబు లైనవ్రతోపవాసాదికంబులు గావించవలయు నుక్తవిలక్షణంబు
లైనభయంబు లనేకంబులు గలిగియుండుఁ గ్రోధలోభంబులు వర్జించి నిత్యం
బును దపంబునందు బుద్ధి నిలుపవలయుఁ గావున వివిధదురవస్థాప్రాప్తిహేతు
వగు కాంతారవాసంబు నీ కశక్యం బై యుండు నెల్లభంగుల మదీయవాక్యం
బంగీకరించి వనప్రయాణం బుపసంహరింపు మని నానావిధానూనవాక్యంబుల
ననూనయించుచున్న ప్రాణవల్లభుం గనుంగొని కన్నీరు నించుచు గద్గదస్వరం
బున ని ట్లనియె.
| 638
|
తే. |
అనఘ మీ రాన తిచ్చినయటుల ఘోర, గహనమున దోషములు పెక్కు గలుగు టదియు
నిక్క మైనను నీదుసన్నిధివశంబు, వలన నవియు గుణంబు లై యలరుచుండు.
| 639
|
తే. |
దేవ సింహాదిమృగము లదృష్టపూర్వ, మైననీవిగ్రహముఁ జూచి యధికభీతిఁ
బఱచు నెవ్వారికైనను భయము పుట్టుఁ, దవిలి భయహేతువస్తుసందర్శనమున.
| 640
|
క. |
మానక మును గఱపినగురు, నానతి నీతోడ వనికి నరుగుట యెండెం
గానియెడ జీవితము లు, ర్వీనాయక విడుచు టొండె వేఱక టగునే.
| 641
|
ఉ. |
మానవనాథ యింత పలుమాఱు భయం బిటు పల్క నేల నీ
మానితబాహుదుర్గములమాటున నిల్చిననన్ను వాసవుం
డై నను దేఱి చూడఁగలఁడా భవదీయపరాక్రమక్రమం
బే నిపు డాత్మలోఁ దెలియ కిట్లు దలంతునె సాహసంబునన్.
| 642
|
ఆ. |
భానువంశవర్య పతిహీన యగుసాధ్వి, జగతిలోన బ్రతుకఁజాల దనుచుఁ
బెక్కుమార్లు మీరె ప్రీతితోఁ జెప్పితి, రిప్పు డన్యధర్మ మెట్లు గలిగె.
| 643
|
క. |
మును జనకునిగృహమున స, జ్జను లగుభూసురులు పరమసాధ్వీ పతితో
వనయాత్ర సలుపఁ గల వని; యనఘా వచియించి రదియు ననృతం బగునే.
| 645
|
ఆ. |
రాజవర్య సాముద్రికలక్షణజ్ఞు, లతివ పతితోడ వనమున కరుగఁగలవ
టంచు రేఖావిశేషంబు లరసి చెప్పి, రది నిరర్థక మగునె మహాత్మ యిపుడు.
| 647
|
ఆ. |
వాసవాభ విప్రవరులచే నుపదిష్ట, మైనవిపినవాస మనుభవింప
కేల తక్కు నాకు హితబుద్ధి నీవెంటఁ, బూని కాననమున కేను వత్తు.
| 648
|
క. |
వనవాసమందు దోసము, లసమాత్మక పెక్కు గలుగు టది నిక్కం బై
|
|
|
నను విషయలోలుపులఁ జ, య్యనఁ గలఁచుం గాక నియమితాత్ముల కగునే.
| 649
|
తే. |
పిన్ననాఁ డేను గురునింట నున్నవేళఁ, దల్లిమ్రోల నొకానొకతపసివలన
విపినవాసంబు గలగుట వింటి నాఁట, నుండి యదియె కాంక్షించుచునున్నదాన.
| 650
|
తే. |
అధిప మన మిద్దఱము విలాసార్థ మర్ధి, వేడ్క విహరించుటకు జాహ్నవీతటస్థ
విపినమున కేగుదమె యంచుఁ బెక్కుగతులఁ, బ్రీతితోడుత నిన్నుఁ బ్రార్థింపలేదె.
| 651
|
తే. |
కాంత నేఁటికి దైవయోగమున నదియు, దొరకొనియె మాట లిం కేల పరమభక్తి
కాననంబున నీపాదకమలసేవ, సేయుచుండెద సంతుష్టచిత్త నగుచు.
| 652
|
సీత తన్ను వనమునకుఁ దోడ్కొనిపోవలయు నని నిర్బంధించుట
వ. |
మఱియు నాకు భర్తకంటె నొండు దైవంబు లేదు గావున నట్టి దైవస్వరూ
పుండ వైననీచరణసేవావిశేషంబున విగతకల్మషనై యుభయలోకసుఖంబులం
బడిసెద నది యె ట్లనినఁ దండ్రిచేత సలిలధారాపూర్వకంబుగా దత్త యైన
యువతి యీలోకంబునఁ బతివ్రతాధర్మంబునం బ్రవర్తించె నేనియు నది పర
లోకంబునందును నతనికే దయిత యై యుండు నని బ్రాహ్మణముఖనిర్గతం బైన
వేదవాక్యంబువలన వినబడుచుండు శ్రుతిస్మృతిన్యాయంబులవలన మన కిరు
వురకు నిత్యసంబంధంబు సిద్ధం బగుచుం సదాచారసంపన్నను బతివ్రతను
స్వకీయ నైన నన్నుఁ బురంబుననుండి వనంబునకుం దోడ్కొని పోవుట కేల
యనుమతి సేయవు సమానసుఖదుఃఖ నగుచున్న నీతోడ వనంబునకుం
దోడ్కొని పొమ్ము దీని కొడంబడవేని విషాగ్నిజలంబులవలనం బ్రాణంబులు
విడిచెద నని నానావిధన్యాయానుసరణంబు లగువాక్యంబులం బ్రార్థించి
యతనిచిత్తంబు ప్రసాదాయత్తంబు గాకున్నం గనుంగొని యద్దేవి ప్రణ
యాభిమానంబుల నీషత్కోపదీఫ్తవదన యై వెండియు నిజవల్లభున కి ట్లనియె.
| 653
|
చ. |
విను మిథిలాధినాథుఁ డతివిశ్రుతకీర్తి విదేహుఁ డైనమ
జ్జనకుఁడు పత్ని నైననను సమ్మతిఁ బ్రోవఁగఁ జాల కొంటి మై
వనమున కేగునిన్ను వినివారక లోపల స్త్రీత్వమున్ వెలిన్
ఘనపురుషారరూపమును గల్గినయల్లునిఁగాఁ దలంపఁడే.
| 654
|
తే. |
రామ మాతండ్రి జనకుండు రమణతోడ, రూపమాత్రంబుచేతఁ బురుషుఁడ వైన
నిన్ను స్త్రీనిఁ గా నెఱుఁగక న న్నొసంగె, నెఱిఁగి యుండినఁ గని కని యేల యిచ్చు.
| 645
|
తే. |
అసమ మాయయ్య జనకుండు నిను మహాత్ము, నల్లునిఁగఁ గొని భువనత్రయంబునందుఁ
|
|
|
గలుగు భవదన్యపురుషవిగ్రహము సర్వ, మాత్మలో నెంచె స్త్రీ యని యనుదినంబు.
| 656
|
క. |
ఆతతబుద్ధి విదేహ, జ్యాతలనాథుండు మాత యగుకేకయభూ
నేతసుతవలనఁ గలహం, బీతఱిఁ బుట్టు నని యెఱుఁగ కిచ్చె న్నన్నున్.
| 657
|
తే. |
కాంత మాతండ్రి పురుషవిగ్రహుఁడ వనుచు, రామ జామాత వనుచుఁ గరంబు నిన్నుఁ
గాంచి యుభయలోకసుఖంబుఁ గరము తుచ్ఛ, ముగఁ దలంచుచు నానందపూర్ణుఁ డయ్యె.
| 659
|
వ. |
ఏతాదృశసర్వానందకరుండ వైననీవు న న్నేల పరితపింపంజేసెద వని పలికి
వెండియు ని ట్లనియె.
| 660
|
శా. |
అస్తీనేతపతీవరామనృపతావత్యంతతేజఃపరం
చాస్తోక మ్మనుమాట న న్నిచటఁ బాయం బెట్టి నీ వేగిన
న్నాస్తీనేతపతీవరామనృపతావత్యంతతేజఃపరం
చాస్తోక మ్మని మ్రోయు నింక భువిలో నార్యాస్యసందీప్త మై.
| 661
|
తే. |
అనఘ యేల విషణ్ణుఁడ వైతి నీవు, నీకు భయ మెట్లు గలిగె ననింద్యశీల
యోగ్య నై నీవె గతి యని యున్ననన్ను, రమణ విడుచుట కేమి కారణము చెవుమ.
| 662
|
క. |
అనఘ ద్యుమత్సేనజుఁడును, జననుతుఁ డగుసత్యవంతుసతి యగుసావి
త్రినిఁ బోలె భవద్వశవ, ర్తిని నగుననుఁ జిత్తమందుఁ దెలియు మధీశా.
| 663
|
చ. |
అనఘవిచార యేను బరు నాత్మఁ దలంచి యెఱుంగ నక్కటా
పనివడి యిట్లు నన్నుఁ గులపాంసనినట్ల త్యజింప నేల చ
య్యనఁ గొని పొమ్ము ఘోరవిపినావలికి న్నను నట్ల సేయఁ బా
వనతను యోప వేని ఘనపాతకి వయ్యెద వింత యేటికిన్.
| 664
|
క. |
దేవ యనపాయఁ గౌమా, రావస్థాపరిణతను మహాసతి ననఘన్
దేవి నగునన్ను జాయా, జీవునికరణి నొసఁగఁ దలఁచితివి పరులకున్.
| 665
|
తే. |
అధిప వంశపరంపరాభ్యాగతయును, భర్తృయోగ్యయు సతియును భద్రదయును
లలితకౌమారయును నగు రాజ్యలక్ష్మి, నకట భరతాదుల కొసంగు టర్హ మగునె.
| 666
|
ఉ. |
ఎవ్వరిపథ్యముం బలికె దెవ్వరియర్థముపొంటె వేఁగె దీ
వెవ్వరికిన్ హితంబు హృదయేశ యొనర్చెద వట్టివారికిన్
నవ్వులు గాక యెంతయు వినమ్రుఁడ విష్టకరుండ వై మదిన్
నెవ్వగ మాని యుండు మిట నిన్ను జనంబులు మెత్తు రెంతయున్.
| 667
|
వ. |
అని కోపంబు పెంపున నాక్షేపించి వెండియు ని ట్లనియె.
| 668
|
క. |
తప మైన నాక మైనను, విపిన మయిన నిరువురకును వెస నొక్కటి యా
విపరీత మేల పల్కెదు, చపలత లేకుండ వనికిఁ జనుదెంతు రహిన్.
| 669
|
తే. |
నిన్నుఁ గూడి వనంబున నున్నవేళ, నిడుమ లెన్నియుఁ గలిగిన హృదయమునకు
స్వర్గభోగసమాన మై వఱలు నాకు, దేవ తోడ్కొని పొమ్ము సందియము దక్కి.
| 670
|
ఆ. |
అధిప నీపిఱుంద నరుదెంచునాకు ను, ద్యానవనవిహారమందుఁబోలె
నధ్వమం దొకింతయైన నాయాసంబు, గలుగ దిడుమ లనుచుఁ దలఁప వలదు.
| 671
|
మ. |
మనుజేంద్రోత్తమ నిన్నుఁ గూడి యటవీమార్గంబునం బోవునా
కనిశంబుం గుశకాశముఖ్యకఠినజ్యాజాతముల్ భూరిశో
భససంధాయకతూలతల్పకసమస్పర్శంబు లై యుండు న
న్ననుమానింపక నీదువెంటఁ గొని పొమ్మా కాననక్షోణికిన్.
| 672
|
తే. |
అధిప ఝంఝానిలోద్ధూత మైన యేర, జంబుచే నస్మదీయగాత్రంబు చాల
ధూసరిత మగు నమ్మహీధూళి నతుల, చందనముగాఁ దలంపుదు డెందమందు.
| 673
|
తే. |
చెలఁగి నీతోడ వనమధ్యసీమయందు, రమణ శయనించుతఱి శాడ్వలములకంటె
సదనమునఁ గల్గుఘనచిత్రమృదులతరకు, థాస్తరణతల్పకము లంత యధిక మగునె.
| 674
|
తే. |
అధిప నీవు కాంతారమధ్యంబునందుఁ, గరుణఁ జేసి యొసంగిన కందమూల
ఫలపలాశాదికములు స్వల్పంబు లైన, నవియె నాకు సుధాభంబులని తలంతు.
| 675
|
క. |
జనకుని తల్లిని గృహమును, మనమునఁ దలపోయ నెపుడు మత్కృతమున నీ
కనిశము శోకము గలుగదు, ననుఁ దోడ్కొని పొమ్ము కాననంబున కధిపా.
| 676
|
క. |
నినుఁ గూడి యున్నచో టది, వన మైనను స్వర్గసన్నిభం బగు మఱియు
న్నినుఁ బాసి యున్నచో టది, ఘనపట్టణ మైన నారకసమం బధిపా.
| 677
|
క. |
కావున ననుఁ దోడ్కొని విపి, నావలికిం బొమ్ము దేవ యటు గానియెడ
న్నీ వవలోకింప విషముఁ, ద్రావి యయిన నిపుడె జీవితంబులు విడుతున్.
| 678
|
ఉ. |
అక్కటికంబుఁ బూని హృదయాధిప న న్విడనాడి కానకున్
గ్రక్కున నీవు పోవ నసుఖస్థితి నవ్వల నైన మేనిలో
నిక్కడఁ బ్రాణము ల్నిలువ వింతయు నిక్కము గాన నవ్వలన్
దిక్కఱి చచ్చుకంటె దగ నీయెదుర న్మఱి చచ్చు టొప్పదే.
| 679
|
చ. |
అనఘ భవద్వియోగజనితార్తిని నొక్కముహూర్తకాల మై
నను భరియింపఁజాలఁ బదునాలుగువర్షము లెత్తెఱంగునన్
మనమున నోర్చి యుందు నని మానిని దుఃఖవిధూయమాన యై
తనపతిఁ గౌఁగిలించుకొని తద్దయు నేడ్చెఁ గలస్వనంబునన్.
| 680
|
తే. |
మఱియు నద్దేవి విషదిగ్ధశరనివిద్ధ, యైనకరిణిచందంబున నధిపవాక్య
విద్ధయై ఘనచిరసన్నిరుద్ధలోచ, నాశ్రువులు నించె నరణి ఘోరాగ్ని నట్ల.
| 681
|
తే. |
స్ఫటికసమములు సంతాపసంభవములు, నగులసద్బాష్పబిందువు లపుడు చాల
జలజలోచనకన్నులవలనఁ దొరఁగెఁ, గమలదళములవలన నీరములుఁ బోలె.
| 682
|
రాముఁడు సీతను వనమునకుఁ దోడుకొని పోవుటకు సమ్మతించుట
తే. |
లలితకైరవమిత్రమండలసమంబు, దీర్ఘదృశ్వ్యాప్త మైనతదీయవచన
మపుడు బాష్పముచే శుష్క మగుచు నొప్పె, జలసముద్ధృతనవపంకజంబుకరణి.
| 683
|
క. |
అప్పుడు రఘునాథుఁడు దయ, ముప్పిరి గొన దుఃఖవేగమునఁ గ్రాఁగెడు నా
కప్పురగంధినిఁ గుతుకము, కుప్పలు గొనఁ గౌఁగిలించుకొని యి ట్లనియెన్.
| 684
|
చ. |
అమలశశాంకబింబవదనా విను మెంతయు నీవియోగదుః
ఖమున లభించునట్టిబలఘస్మరుసంపద యైన నాదుచి
త్తమునకు నించుకైనఁ బ్రమదం బొనగూర్ప ద దెల్లచోటులం
గమలజసూతికిం బలెను గల్గదు నాకు భయం బొకింతయున్.
| 685
|
ఉ. |
ఆయతశక్తిరక్షణమునందు సమర్థుఁడ నయ్యు నీయభి
ప్రాయ మెఱుంగఁ గోరి వనవాసము వద్దని యంటిఁ గాక వి
చ్చేయుము నాదువెంట వనసీమకు ని న్నెడఁబాయఁజాల నీ
తోయము ద్రిప్ప నాతరమె తోయరుహాయతచారులోచనా.
| 686
|
వ. |
దేవి నీవు నాతోఁగూడ వనవాసంబుకొఱకు నిప్పుడు నిశ్చయించితివి గావున
శీలవంతునిచేతఁ గీర్తియుంబోలె నాచేత విడువ నశక్య వైతివి ధర్మాత్ము లగు
పూర్వరాజులచేతఁ బత్నీసమేతంబుగా వానప్రస్థధర్మం బాచరింపబడియెఁ
గావున నేనును సువర్చల సూర్యుని ననువర్తించినకైవడిఁ బూర్వరాజాచరి
తధర్మంబు ననుసరించెద సత్యోపబృంహితం బైనతండ్రివచనంబు నన్ను వన
వాసంబుకొఱకుఁ దొరసేయుచున్నది. శీఘ్రంబున వనంబునకుం బోవవలయుఁ
దల్లితండ్రులకు విధేయుండై యుండు టదియె పుత్రునకుఁ బరమధర్మంబు గా
వున నమ్మాతాపితృవిధేయత్వరూపధర్మంబు నతిక్రమించి యేను జీవింపఁజాల.
| 687
|
రాముఁడు సీతకు గుర్వాజ్ఞానువర్తనధర్మమును బ్రశంసించి చెప్పుట
తే. |
వినుము స్వాధీన మగుమాతృపితృగురుస్వ, రూపదైవంబు నవలఁ బోఁ ద్రోచి తనకు
వశముగానట్టి యన్యదైవంబు నెట్లు, మచ్చకంటి యారాధింపవచ్చుఁ జెపుమ.
| 688
|
తే. |
ఎచటఁ బితృమాతృగురురూప మెసఁగుచుండు, నచట లోకత్రయం బుండు నట్లు గాన
దేవి తత్సేవచే జగత్త్రితయవర్త్య, శేషదేవపూజనఫలసిద్ధి గలుగు.
| 689
|
రాముఁడు సీతతో బ్రాహ్మణులకు దానములు సేయు మనుట
వ. |
కావునఁ దత్సమం బైనపవిత్రం బన్యంబు లే దక్కారణంబున మాతృపితృగురు
రూపత్రయంబు నవశ్యం బారాధింపవలయు మఱియుఁ బరలోకసాధనోత్త
మంబు లైనపితృసేవాదులచేతం బడయంబడులోకంబులు సత్యదానమానజప
తపస్స్వాధ్యాయవ్రతక్రతువులం బడయ రా వదియునుం గాక గురుచిత్తప్ర
వృత్త్యనువర్తనంబున స్వర్గధనధాన్యవిద్యాపుత్రప్రముఖనిఖిలసంపద్విశేషం
బులు సిద్ధించు మాతాపితృపరాయణు లగుమహాత్ములు దేవగంధర్వగోలోక
బ్రహ్మలోకంబులు పడయుదురు గావున సత్యధర్మమార్గస్థితుం డై దశరథుండు
గఱపినమార్గంబున నవశ్యంబు వనంబునకుం జనియెద భవదీయభావాపరిజ్ఞా
నంబువలన నిన్ను వనంబునకుం దోడ్కొనిపోవుటకు మొదలు మదీయచిత్తంబు
ధైర్యహీనం బయ్యె నీవు న న్ననుసరించి వనంబునకుం జనుదెంచెద నని పలు
కుటవలన నిప్పుడు నిన్నుం దోడ్కొనిపోవుటకుఁ గ్రమ్మఱ నుద్యుక్తం
బయ్యెఁ గావున నీవును గురుపదిష్టధర్మప్రవర్తకుండ నైన న న్ననుసరించి
సహధర్మచారిణి వై వనంబునకుం జనుదెమ్ము పత్యనుసరణాధ్యవసాయంబు
నధిగమించుటవలన నీవు సర్వప్రకారంబుల నాకును గులంబునకును సమ్మత
వైతి విది నీకు సదృశంబును బరమశోభనం బై యుండు నింక విశేషించి వన
వాసక్షమంబు లగుదానంబులం గావింపుము శీఘ్రంబున భిక్షుకులకు భోజనం
బును విప్రులకు సువర్ణరత్నాదికంబు లిచ్చి పదంపడి మన కిరువురకుం గల
వస్త్రమాల్యాభరణశయనాసనంబులును గ్రీడార్థంబు సంగ్రహించిన జాత
రూపమయకృత్రిమపుత్రికాచయంబులును భృత్యుల కొసంగు మని పలికిన
నద్దేవి పరమానందభరితాంతఃకరణ యై పతివచనప్రకారంబున బ్రాహ్మణులకు
భృత్యవర్గంబులకు ధనధాన్యరత్నాదికంబు లొసంగుచుండె నాసమయంబున
సుమిత్రానందనుం డచ్చోట నున్నవాఁ డగుటం జేసి తదీయసంవాదంబు విని
యర్ధశరీరభూత యైనజానకివనానుగమనంబే బహుప్రయత్నంబున నంగీకృతం
బయ్యె నా కెవ్విధంబున సంభవించు నని విరహసంజాతశోకంబు సహింపం
జాలక యన్నచరణంబులకుం బ్రణమిల్లి నిజాభిమతసంసిద్ధికి సీతాశరణాగతి
యమోఘం బైనయుపాయం బని యాలోచించి మదీయప్రార్థనఁ బురుషకా
రత్వంబున నంగీకరింపు మని సీతం బ్రార్థించుచు రామున కి ట్లనియె.
| 690
|
లక్ష్మణుఁడు నేనును వనమునకు వచ్చెదనని రామునిఁ ప్రార్థించుట
సీ. |
అనఘాత్మ నన్నొక్కరుని లాఁతివానిఁగాఁ బోఁ ద్రోచి యడవికిఁ బోవ నీకు
న్యాయంబె నినుఁ బాసి నాకలోకాధిపత్యం బైన నమరత్వ మైన ఘనవి
భూతి యైనను గోర భూరిచాపముఁ దాల్చి కడఁగి మీయగ్రభాగమునఁ గాన
నావని కరుదెంతు దచట మదీయదోర్బలఘనప్రాకారరక్షితుండ
|
|
తే. |
వగుచు నీదేవిఁ గూడి నానాటవులను, సంచరించెదు గా కని సవినయోక్తిఁ
జేసి ప్రార్థించి రామునిచే నిషిద్ధుఁ, డగుచుఁ గ్రమ్మఱ నతని కి ట్లనియె నతఁడు.
| 691
|
చ. |
ఘనకరుణావిశేషమునఁ గాననమేదిని నున్కి నాకు ము
న్ననుమతిఁ జెసి యిప్పు డదయామతిఁ గా దని పల్కె దేలకో
పనివడి బాల్య మాదిగ భవత్సరతంత్రుఁడ నైననన్ను వ
ల్దనుటకుఁ జోద్య మయ్యెడి మహాపురుషా యిది యేమి చెప్పవే.
| 692
|
క. |
అని యిట్లు సుమిత్రానం, దనుఁడు నిటలఘటితహస్తనలినుం డై ప
ల్కిన విని క్రమ్మఱ రఘునం, దనుఁ డిట్లనె ధర్మసంహితం బగుసూక్తిన్.
| 693
|
రాముఁడు లక్ష్మణుని వనమునకు రావల దనుట
తే. |
స్నిగ్ధుఁడవు వరుఁడవు ధర్మశీలుఁడవు ప్రియార్హుఁడవు నీతిపరుఁడవు ప్రాణసముఁడ
వార్యనుతుఁడవు సఖుఁడవు శౌర్యనిధిని, యనుజుఁడవు గావె నాకు గుణాఢ్య నీవు.
| 694
|
తే. |
అనఘ నీవు నాతోడఁ గాననధరిత్రి, కరుగుదెంచిన ఘోరదుఃఖార్తిఁ గ్రాగి
బడలు కౌసల్య నిడుమలఁ బడు సుమిత్ర, నింక భరియించువా రెవ్వ రిచటఁ జెపుమ.
| 695
|
క. |
అనఘా పర్జన్యునిక్రియ, ననవరతముఁ గామవృష్టి నర్థులమీఁదం
దనివారఁగఁ గురియించెడు, జననాథుఁడు గామపాశసంయుతుఁ డయ్యెన్.
| 696
|
తే. |
అనఘచరిత మహీనాథుఁడై భరతుఁడు, కైకపనుపున మాతృత్వగౌరవంబు
విడిచి మజ్జనయిత్రుల వెతలఁ బెట్టు, మదిఁ దలంపఁడు వారిసేమంబు నెపుడు.
| 697
|
చ. |
తనయునియాధిపత్యమును ధారుణినాథువశస్థితత్వముం
గనుఁగొని కైక భాగ్యభవగర్వమునన్ మనయమ్మల న్శుభా
ననల ననారతంబును గ నారిలఁ జేయుచు నుండుఁ గావున
న్బనివడి వత్స నీ వయిన వారిమనోవ్యధ దీర్పవల్వదే.
| 698
|
తే. |
అనఘచరిత రాజానుగ్రహమున నైన, నిత్య మతిభక్తి నీయంత నీవ యైన
నరసి రక్షింపు మిచట మాయమ్మ నెపుడు, ధరణి గురుపూజనముచేత ధర్మ మొదవు.
| 699
|
తే. |
అనఘ యిట్లు మదాజ్ఞచే నతులభక్తి, నిచట మన్మాతృపూజన ముచితకరణిఁ
జేయుచుండుము నాయందుఁ జేయుభక్తి, కిదియె సార్థక్య మనుచు నే మదిఁ దలంతు.
| 700
|
లక్ష్మణుండు సయుక్తికంబుగా రాముని వేఁడుట
మ. |
అని యి ట్లారఘునేత పల్క విని నెయ్యం బొప్పఁగా లక్ష్మణుం
|
|
|
డనియెం గ్రమ్మఱ నోదినేశకులవర్యా మీయనుజ్ఞ న్భవ
జ్జననిన్ మజ్జనని న్నితాంతసముదంచద్భక్తిచే సంతతం
బును శుశ్రూష యొనర్చుచు న్భరతుఁడే పోషించు జాగ్రత్తతోన్.
| 701
|
తే. |
దేవ యేదేవికృప నుపజీవిశతము, లగ్రహారశతంబుల నధిగమించె
నట్టికౌసల్య మాదృక్సహస్రములను, సంతతముఁ బ్రోచు స్వభరణ మెంత చెపుఁడి.
| 702
|
క. |
ఆయమ్మఁ గూడి నిత్యము, మాయమ్మయు నెగులు దక్కి మహితసుఖాప్తిం
బాయక సేవించును దే, వా యీయెడ సందియంబు వలవదు బుద్ధిన్.
| 703
|
వ. |
దేవా న న్ననుచరునిఁగాఁ బరిగ్రహింపు మీయనుచరత్వకరణంబునందు సేవ్య
సేవకధర్మరాహిత్యంబును వైపరీత్యసాధనంబును లేదు నారాకవలన నీకు
ఫలమూలాద్యాహరణం బనాయాసంబుగాఁ గల్పింపంబడు నేనును భవత్సేవ
వలనఁ గృతార్థుండ నగుదు నట్లు గావున.
| 704
|
క. |
నిరుపమఖనిత్రపిటకా, ధరుండ నై సగుణ మైన ధనువుఁ గొని వెసం
దెరు వెఱిఁగించుచు ముంగల, నరుదెంచెద న ట్లొనర్పుమయ్య మహాత్మా.
| 705
|
చ. |
పవలు సమస్తవన్యఫలపంక్తులఁ దెచ్చి యొసంగుచు న్నిశ
ల్సవినయబుద్ధి బద్ధగుణచాపముఁ దాల్చి సుషుప్తిఁ దక్కి క
న్గవ కటు ఱెప్ప వ్రేయక సుఖస్థితి నెప్పుడుఁ గాచుచుండఁగా
నవనిజఁ గూడి నీవు గిరులందు విహార మొనర్చు టొప్పదే.
| 706
|
క. |
అని యిట్లు సుమిత్రానం, దనుఁడు వివిధవినయవాక్యనైపుణ మలరం
దను వేఁడినఁ గౌసల్యా, తనయుఁడు హర్షించి మరలఁ దమ్మున కనియెన్.
| 707
|
రాముఁడు లక్ష్మణవనాగమనంబున కొడంబడుట
వ. |
వత్సా యేను నీవనప్రయాణంబున కొడంబడితి నాతోడం జనుదెమ్ము జనకయ
జ్ఞంబునందు మహాత్ముం డగువరుణుం డొసంగిన మహాకార్ముకంబులును నభేద్య
కవచంబులును నక్షయబాణతూణీరంబులును హేమపరిష్కృతం బగుఖడ్గద్వ
యంబునుఁ బూజార్థం బాచార్యుమందిరంబున నిక్షేపించి యున్నయవి వానిఁ
గైకొని యిష్టులకుం జెప్పి ర మ్మనవుడు నతండు వనవాసనిశ్చితుం డగుచు సుహృ
జ్జనంబుల నందఱివలన నామంత్రణంబు వడసి సంభ్రమంబున వసిష్ఠగృహంబు
నకుం జని ధనురాదిసాధనంబులఁ గొని రయంబునఁ బఱతెంచినం జూచి కాల
విడంబనంబు సేయక చనుదెంచితి వని బహూకరించి వెండియు రఘువల్లభుం
డి ట్లనియె.
| 708
|
క. |
అనఘాత్మ మామకం బగు, ధనమును విప్రోత్తములకు దానము సేయం
జనుఁ గాన నిపుడె సని దో, డ్కొని రమ్ము సుయజ్ఞునిం బటుత్వరితగతిన్.
| 709
|
రాముఁడు వసిష్ఠపుత్రుం డగుసుయజ్ఞు రావించుట
వ. |
మఱియు మననగరంబున గురుశుశ్రూషాపరాయణు లగువా రెవ్వరు గల రట్టి
వారికి నుపజీవులకు నధికంబుగా ధనం బొసంగ నిశ్చయించితి వారి నందఱఁ
దోడ్కొని రమ్ము శిష్టు లైనబ్రాహ్మణోత్తముల నందఱం బూజించి వారిచేత
ననుజ్ఞ వడసి వనంబునకుం జనువాఁడ నని యాన తెచ్చిన నతం డట్లగాక యని
వసిష్ఠపుత్రుం డగుసుయజ్ఞునినివేశనంబునకుం జని యందు.
| 710
|
తే. |
అగ్నిశాలాగతుం డైనయతనిభక్తిఁ, గాంచి మ్రొక్కి దుష్కరకర్మకారి యైన
రామభద్రు వేశ్మమునకు రమ్ము కృత్య, మంతయును దగ వీక్షింపు మనిన నతఁడు.
| 711
|
తే. |
సంభ్రమంబున నప్పుడే సంధ్య వార్చి, లక్ష్మణోపేతుఁ డై శుభలక్షణాభి
రంజితం బైనరాముని రమ్యసదన, రాజమున కేగె రయమునఁ దేజ మలర.
| 712
|
క. |
వచ్చినమునిసుతుఁ గనుఁగొని, యిచ్చ నలరి రాఘవుఁడు మహీజాన్వితుఁ డై
చెచ్చెర నెదురుగఁ జని కొని, దెచ్చి సుఖాసీనుఁ జేసి దృఢతరభక్తిన్.
| 713
|
రాముఁడు సుయజ్ఞాదులకు ధనధాన్యమణిగోభూషణాదుల నొసంగుట
వ. |
జాతరూపమయకటకకుండలసువర్ణసూత్రగ్రథితవైదూర్యపద్మరాగమణిభూషిత
కేయూరాంగదప్రముఖనిఖలశ్రేష్ఠభూషణంబులచేతం బూజించి పదంపడి
సీతాప్రచోదితుం డై ముక్తాహారహేమసూత్రరశనావిచిత్రకేయూరాంగద
వరాస్తరణనానారత్నవిభూషితహేమపర్యంకంబు లొసంగి యివి యన్నియు
జానకి భవత్పత్ని కొసంగు మని పంచెఁ గావున నమ్మహాసాధ్వి కిమ్ము మాతు
లదత్తం బైనశత్రుంజయాఖ్యమహానాగంబు గజసహస్రంబుతోఁ గూడ నీ
కొసంగెదఁ బరిగ్రహింపు మని పలికిన నాసుయజ్ఞుండు రామదత్తం బైన
తత్సర్వంబునుం బ్రతిగ్రహించి సీతారామలక్ష్మణుల నాశీర్వదించె నంతఁ
బ్రియంవదుండును బరమేష్ఠిసముండు నగురాముండు ప్రియుండును వాసవ
సంకాశుండు నగులక్ష్మణుం జూచి నీవు శీఘ్రంబున నగస్త్యవిశ్వామిత్ర
పుత్రుల రావించి వర్షోదకంబులచేత సస్యంబునుం బోలె నానావిధచిత్ర
దివ్యాంబరగోసహస్రసువర్ణరజతమహాధనంబులచేతఁ బూజించి సంతుష్టులం
గావింపుము నిత్యంబును గౌసల్యాదేవి నాశీర్వదించుచు భక్తుండై యాశ్ర
యించి యున్న తిత్తిరీయశాఖాధ్యేత్రాచార్యుం డైనవిప్రోత్తమునకుఁ బుష్క
లంబుగాఁ గౌశేయచేలంబులును మహార్హయానంబులును దాసీజనంబుల నొ
సంగుము చిరకాలంబున నుండి మనగృహంబున నివసించి యున్నవాని రాజసచి
వుం డగువాని చిత్రరథుం డనుసూతుని రావించి వేయిగోవుల నజాదికంబు
నిచ్చి మహార్హరత్నవస్త్రధనంబు లొసంగి ప్రీతచేతస్కునిం జేయుము కఠక
లాపిప్రోక్తశాఖాధ్యాయులును బలాశదండయుక్తులును మృద్వన్నకాములును
సజ్జనసమ్మతులును నిరంతరస్వాధ్యాయశీలత్వంబువలన నన్యం బేమియు నెఱుం
|
|
|
గనివారు నగు బ్రహ్మచారులకు రత్నపూర్ణంబు లగునశీతియానంబులును బలీ
వర్ధసహస్రంబును గర్షణప్రవీణమహావృషభంబుల నిన్నూటిని దధిఘృతాది
వ్యంజనార్థంబు గోసహస్రంబు నొసంగుము మఱియు వివాహార్థంబు కౌసల్య
నాశ్రయించి యున్నమేఖలిసంఘంబునకుఁ బ్రత్యేకంబుగా గోసహస్రంబు
లొసంగి మఱియు నయ్యంబకు మనోమోదంబు గలుగునట్లు యథేష్టంబుగా
ధనం బొసంగు మని పంచిన నతండు యథోక్తప్రకారంబున బ్రాహ్మణోత్తము
లకు ధనదునిపగిది ధనమణివస్త్రాదు లొసంగె నంత నారఘుపుంగవుండు
బాష్పగద్గదకంఠులై తనమ్రోల నిలువం బడి యున్ననిజభృత్యులకుఁ బ్రత్యే
కంబుగా ననంతద్రవ్యం బొసంగి నా వచ్చునంచాఁక నామందిరంబును లక్ష్మ
ణునిగృహంబునుం గాచికొని యిచ్చటనే యుండుం డని పలికి వెండియుఁ
బరమదుఃఖితు లై యున్న వారి నవలోకించి ధనాధ్యక్షు రావించి ధనంబుఁ దె
మ్మనవుడు నతం డట్ల కావింప రాశీభూతం బైనయమ్మహాధనం బంతయు బ్రాహ్మ
ణులకు భృత్యులకుఁ గృపణులకు బాలవృద్ధుల కొసంగుచుండె నాసమయంబున.
| 714
|
త్రిజటుఁ డనుబ్రాహ్మణోత్తముఁడు రామునికడ కేతెంచుట
సీ. |
చతురుఁడు గర్గవంశజుఁడు పింగళవర్ణుఁ డనఘుఁడు త్రిజటాఖ్యుఁ డగుద్విజాన్వ
యాగ్రణి గలఁ డొక్కఁ డాతఁడు ఫాలకుద్దాలలాంగలములఁ దాల్చి నిత్య
మడవిలో క్షతవృత్తి నాఁకలి దీర్చుచు నుండ నాతనిభార్య యొనర నపుడు
దారకులను జూచి దారిద్ర్యమునఁ బొక్కి తనపతితోడ ని ట్లనియె దేవ
|
|
తే. |
ఫాలకుద్దాలకము లటు పాఱవైచి, తగ వదాన్యశేఖరు రాముఁ దడయ కిపుడు
గొనఁ జనుము దారిద్ర్యంబు గడవ నగు మ, హాత్మ నావచనంబు సత్యంబు జువ్వె.
| 715
|
చ. |
అన విని భూసురేంద్రుఁడు రయంబున దుశ్ఛదశాటి మేనిపైఁ
దనరఁ బ్రదీప్తపావకువిధంబున హేళిక్రియ న్వెలుంగుచున్
వనమున నుండి తద్దయు నవార్యగతిం జనుదెంచి సజ్జన
ప్రణుతగుణాతిరేకుఁ డగు రామునిముంగల నిల్చి యి ట్లనున్.
| 716
|
రాముఁడు త్రిజటునికి బహుసహస్రంబులు గోవు లొసంగుట
వ. |
రాజనందనా యేను బహుపుత్రకుండ ధనంబు లేమిం చేసి బాలకు లశనాచ్ఛా
దనంబులకు దుఃఖింప వారి నూరార్చుట కుపాయంబు లేక దారిద్ర్యంబున
కంటె నొండు కష్టం బెద్దియు లే దని తలంచుచు దానిం బాపికొన వదాన్య
శేఖరుండ వైననీకడకుం జనుదెంచితి ననిన నారాముం డవ్విప్రునిం జూఛి చిఱు
నగవు నగుచు నామందలోఁ గలగోసహగ్రంబులలోన నొక్కసహస్రంబు
|
|
|
ప్రత్యేకంబుగా నే నొసంగలే దీదండం బెంత దవ్వు వీచి వైచిననంతదవ్వు నిండి
యున్నగోజాతంబు నీ కొసంగెద నని పలికిన నవ్విప్రుండు సంతుష్టం డగుచు శీఘ్రం
బునఁ గటితటంబున శాటి బిగియించి భుజాబలంబుకొలంది దండంబు విసరివై
చిన నది సరయూతటంబు నతిక్రమించి బహుసహస్రసంఖ్యాకం బగు గోవ్రజం
బున వృషభసన్నిధిం బడిన నారఘూత్తముండు సంతసిల్లి యమ్మహీసురుఁ గౌఁగి
లించికొని సరయూతటపర్యంతంబు నిండి యున్నగోవుల నన్నింటి గోపాలకుల
చేత శీఘ్రంబున నతనియాశ్రమంబునకుఁ దోలించి బహూకరించుచు ని ట్లనియె.
| 717
|
తే. |
దివ్య మగునీప్రభావంబు దెలియఁ గోరి, యనఘచరిత్ర వినోదార్థం బంటిఁ గాక
నదటుపడి లోభబుద్ధిచే నన్నవాఁడఁ, గాను దయ సేసి నామీఁద గనలవలదు.
| 718
|
క. |
ధనధాన్యకోశసంపద, లనవరతము బ్రాహ్మణార్థ మగుఁ గాదొకొ నా
మన మెప్పుడు గోబ్రాహ్మణ, జనరక్షణ మందుఁ జిక్కి చతురత నొప్పున్.
| 719
|
రాముఁడు దశరథదర్శనంబున కేగుట
వ. |
మహాత్మా యతివృద్ధుండ వైనభవదీయదురత్యయశక్తి నెఱుంగం గోరి నాచేత
నీదండప్రక్షేపణరూపార్థంబు నుద్దేశించి ప్రచోదితుండ వైతివి గోవులకంటె
నన్యం బైనదాని నెద్ది యేని వరింపం దలంచితి వేని నిర్విశంకుండ వై వరింపు
మొసంగెద నివ్వాక్యం బుపచారమాత్రంబు గాదు సత్యంబుగాఁ బలికితి సం
కోచంబు వలవదు నాచేత నుపార్జితం బైనధనం బంతయు విప్రప్రయోజనసం
పాదనార్థం బని యెఱుంగుము భవాదృశులయందు సమ్యత్ప్రతిపాదనంబుచేత
నాకు నితాంతప్రీతియశంబులు గలుగు నని పలికిన నారఘుపతివచనంబుల
కలరి యవ్విప్రోత్తముండు గోసమూహంబునుం బ్రతిగ్రహించి యశోబలప్రీతి
సుఖంబులు గలుగుఁగాక యని యారఘుపుంగవు నాశీర్వదించి భార్యాసహి
తుం డై నిజాశ్రమంబునకుం జనియె నంత నారాముండు ప్రతిపూర్ణమాన
సుం డై ధర్మయుక్తపరాక్రమార్జితం బైననిజధనం బంతయు యథార్హసమ్మా
నవచనంబుల నుపలాలించుచు ద్విజసుహృద్భృత్యజనదరిద్రభిక్షాచరణులకు
నందఱకు యథేష్టంబుగా నొసంగి సీతాలక్ష్మణసహితుం డై మాలానిచయ
సమాబద్ధంబులును గంధపుష్పాద్యలంకృతంబు లగుఖడ్గాదిసాధనంబుల ధరించి
పితృసందర్శనోత్సుకుం డై రాజమార్గంబుఁ బట్టి తదీయమందిరంబునకుం బోవు
చుండె నప్పుడు పౌరజనంబులు బహుజనాకులంబు లైనరాజమార్గంబులం
జన నేరక ప్రాసాదహర్మ్యవిమానాగ్రంబు లెక్కి వర్జితాతపత్రుం డై పాదసం
చారంబునం జను రామభద్రు నవలోకించి శోకవ్యాకులితచిత్తు లగుచు మొగం
బున దైన్యంబు దోఁపఁ దమలో ని ట్లనిరి.
| 720
|
చ. |
అనుపమలీలఁ బెక్కుచతురంగబలావలు లేమహాత్ముని
న్వెనుకొని వోవు నట్టిరఘువీరుపిఱుంద సుమిత్రపట్టి దా
|
|
|
జనకజ తోడ రా నొకఁడె సంభ్రమి యై చనుచున్నవాఁడు గ
న్గొనుఁ డకటా విరించి కఠినుండు గదా తలపోసి చూడఁగన్.
| 721
|
తే. |
అతులితైశ్వర్యసారజ్ఞుఁ డగుచు యాచ, కులకు సకలేష్టఫలదాయకుండు నయ్యు
ధర్మగౌరవమునఁ జాల దండ్రివాక్య, మనృతముగ జేయఁ దలపోయఁడయ్యె నేఁడు.
| 722
|
తే. |
కాంక్షతోడ నేసాధ్విని గనుఁగొనంగ, నభ్రచరభూతముల కైన నలవి గాక
యుండు నాసీత నీక్షించుచున్నవారు, పురములోఁ గలపురుషు లందఱును నేఁడు.
| 723
|
తే. |
సురుచిరాంగరాగార్హయు శోణగంధ, సేవినియు నైనసీతను దాప మందు
మొనసి శీతోష్ణములు వర్ష మనవరతము, దీనతయును వైవర్ణ్య మొందింపకున్నె.
| 724
|
జను లందఱు రామునిఁ జూచి పలుతెఱంగుల విలపించుట
ఉ. |
ఇన్నితలంపు లేల మనుజేశ్వరుఁ డిప్పుడు సత్య మూఁది యా
పన్నశరణ్యు నీసుజనపాలునిఁ బల్కెడుఁ గాక యట్లు కా
దన్నను ధాత్రి నెంత కఠినాత్మకుఁ డైన సుతున్ సునీతిసం
పన్నునిఁ బాసి నిందలకుఁ బాల్పడి యొంటి మనం దలంచునే.
| 725
|
తే. |
పుడమి గుణహీనుఁ డైనను బుత్రు విడువఁ, డెందు జనకుఁ డేఘనుని యహీనవృత్తి
చేత సతతంబు జనము రంజింపఁబడియె, నట్టిరాముని విడుచునె యవనివిభుఁడు.
| 726
|
తే. |
దమము శీలంబు శ్రుతమును శమము దయయు, నానృశంస్యంబు ననెడు నీయాఱుగుణము
లననరత మీరఘుస్వామి ననఘచరితు,నింపు సొంపారఁగ నలంకరింపఁజేయు.
| 727
|
ఆ. |
అట్టి పుణ్యపురుషుఁ డడవికిఁ బోయిన, ఘర్మకాలశుష్కఘనజలాశ
యమున నున్నమీల యట్ల లోకము దుఃఖ, తప్త మగుచు భీతిఁ దల్లడిల్లు.
| 728
|
చ. |
ఇతఁడు జగత్కు జంబునకు నెంతయు మూలము సర్వభూతముల్
సతతము పుష్పపల్లవఫలంబులు గావున నీత్రిలోకస
మ్మతుపరిపీడనంబున సమస్తజగంబు విపన్నతం బరి
ప్లుత మగు మూలఘాతమునఁ బుష్పఫలోపగశాఖకైవడిన్.
| 729
|
మ. |
అతులోద్యానములన్ గృహంబులను మాన్యక్షేత్రవిత్తాదులం
జతురత్వంబునఁ ద్రోచి పుచ్చి మన మీసౌమిత్రిమాడ్కి న్సము
న్నతసౌహార్దము దోఁప నీరఘుకులోత్తంసంబువెంట న్సతీ
సుతవర్గంబులఁ గూడి పోద మిచటన్ శోకింపఁగా నేటికిన్.
| 730
|
మ. |
లలితైణాంకసమానవక్త్రుఁ డగునీరాముం డరణ్యావనీ
స్థలికిం బోయిన వెన్కఁ బాడఱినపద్మం బట్ల నిస్తేజ మై
ఖలచిత్తాకృతి నొప్పు నీపురములోఁ గైకేయి దా నొంటి వ
ర్తిలుఁ గా కేటికి నిచ్చట మన కసద్వృత్తిన్ బ్రవర్తింపఁగన్.
| 731
|
ఆ. |
రాఘవుండు లేనిరాజ్యంబు కాంతార, మమ్మహాత్ముఁ డున్న నదియె పురము
మనము రాముఁ గూడి మను టొప్పుఁ గైక పా, డఱినవీటనుండి వఱలుఁ గాక.
| 732
|
రాముఁడు దశరథునకుఁ దనరాకఁ దెల్పుమని సుమంత్రు నియోగించుట
వ. |
మఱియు సముద్ధృతనిక్షేపంబులును బ్రభగ్నాంగణంబులురు నవనీతధనభూ
షణపశుధాన్యంబులును నపహృతశయ్యాసనాదికంబులును రజోవకీర్ణంబులును
గృహదేవతాపరిత్యక్తంబులును సముద్భిన్నబిలపరిధావన్మూషకావృతంబులును
నపేతోదకసేచనధూమంబులును హీనసమ్మార్జనంబులును సంప్రణష్టపూజా
కర్మయాగమంత్రహోమజపంబులును క్షామరాజక్షోభయుక్తకాలంబుచేతం
బోలెఁ బ్రభగ్నంబులును భిన్నభోజనంబులు నగుచు శూన్యంబులై మనచేత
విడువం బడినసదనంబులం గైకొని కైకేయి శూన్యకుడ్యంబుల కాధిపత్యంబు
సేయం గలయది మన మందఱము వనంబునకుం జనిన నస్మద్భయభీతంబు లై
గజసింహాదిమృగంబులును విహంగమంబులును సర్పంబులును వనాంతరపర్వత
ప్రస్థబిలంబులఁ బరిత్యజించి మనచేత నంత్యక్తం బైనయీపురంబుఁ బ్రవేశిం
పం గలయవి మన మాయరణ్యమధ్యంబున రామునిం గూడి సమానసుఖదుః
ఖుల మై పురంబునందుం బోలె సుఖాత్ముల మై యుండుద మాకైకేయి సపుత్ర
బాంధవ యై తృణమాంసఫలాదమబు లైనపశువ్యాఘ్రమృగద్విజంబుల కాట
పట్టయిన యీనగరంబు పాలించుచుండుం గాక యని యిట్లు పురజనులు పెక్కు
విధంబుల విలపించుచుండ వారిదీనాలాపంబులు వినుచు మనోవికారంబు
నొందక నిశ్చలుం డై మత్తమాతంగగమనంబునం జని యన్నరశార్దూలుండు
కైలాసశిఖరాకారం బైనపితృమందిరంబు డాయం బోయి వినీతవీరపురుషం బైన
రాజాలయంబుఁ బ్రవేశించి యచ్చట దుఃఖపరిపీడితం బై కూడి యున్నజనం
బును వీక్షించి తా నార్తస్వరూపుండు గాక చిఱునగవు నగుచు మెల్లనం జని
ధర్మవత్సలుండు గావునఁ దండ్రిచేత ననుజ్ఞఁ గొని వనంబునకుం బోవుట యుచి
తం బని తలంచి ద్వారమధ్యగతుం డైనసుమంత్రు నాలోకించి నారాక మహీ
నాథుని కెఱింగింపు మనవుడు నతండు సంతాపకలుషేంద్రియుం డగుచు
రయంబునం జని యభ్యంతరమందిరంబున రాహుగ్రస్తుం డైనసూర్యునిపోలిక
భస్మచ్ఛన్నం డగువైశ్వానరుచందంబున నిస్తోయం బగుతటాకంబుపగిది
దుఃఖపరిత్రస్తుం డై యున్నవానిఁ బరమాకులచేతస్కుం డగువాని రామునిం
బేర్కొని విలపించువాని దశరథుం గాంచి వివిధవాక్యంబులం బ్రస్తుతించి నిటల
ఘటితాంజలిపుటుం డై యిట్లనియె.
| 733
|
చ. |
అనఘ భవత్కుమారుఁడు వనావనికిం జనఁ బూని రత్నముల్
ధనమును విప్రసంతతికి దత్తముఁ జేసి కృతాభ్యనుజ్ఞుఁ డై
జననికిఁ జెప్పి మీవలన సమ్మతిఁ గైకొని పోఁ దలంపున
|
|
|
న్బనివడి వచ్చి భానుకులనాయక వాకిట నున్నవాఁ డొగిన్.
| 734
|
తే. |
అధిప రశ్మిసహస్రసమావృతుఁ డగు, భాస్కరునిచందమున సర్వపార్థివగుణ
పరివృతుం డయి యున్న నీవరకుమారు, శిష్టసమ్మతుఁ గరుణ నీక్షింపు మిపుడు.
| 735
|
తే. |
రాజశేఖర నీ వంబరంబు కరణిఁ, గరము నిష్పంకుఁడవు మహాఘనుఁడ వబ్ధి
సదృశగాంభీర్యుఁడవు మఱి సత్యవాది, వఖిలధర్మజ్ఞుఁడవు పుత్రు నరయు మనిన.
| 736
|
మ. |
అతఁ డాసూతకుమారుఁ గన్గొని సుమంత్రా నీవు శీఘ్రంబె మ
త్సుతులం దోడ్కొని రమ్ము పొ మ్మనిన నాతం డట్ల కావింప న
ప్రతిమార్తిక్షుభితార్ధసప్తశతభార్యావేష్టితుం డై వెసం
బతి దాఁ గ్రమ్మఱ రాముఁ దోడుకొని రమ్మా సూత పొమ్మా యనన్.
| 737
|
రాముఁడు సుమంతుఁడు వెంట రాఁగ దశరథునికడ కేగుట
క. |
పతిపనుపున నతఁ డారఘు, పతిని సుమిత్రాతనూజ వసుధాతనయా
యుతముగ నెంతయు సత్వర, గతిఁ దోడ్కొనివచ్చెఁ దత్సకాశంబునకున్.
| 738
|
ఉ. |
అంత మహీవరుండు ఘటితాంజలి యై చనుదెంచురాము న
ల్లంతనె చూచి కన్నుఁగవ నశ్రులు గ్రమ్మఁగ దుఃఖశోకవి
క్రాంతమనస్కుఁ డై ధృతి దొలంగి కడంగినమూర్ఛతోడ న
త్యంతరయంబునం బడియె నప్పు డిలం బెనుమ్రానుకైవడిన్.
| 739
|
చ. |
పతి తెఱఁ గెల్లఁ జూచి బహుభంగుల శోకముఁ బట్ట లేక త
త్సతు లతిదుఃఖవేగమునఁ దత్సదనాంతరకుడ్యభాగముల్
ప్రతినినదంబు లీన వికలంబుగ నేడ్చుచు గాఢమూర్ఛచే
క్షితిపయి వ్రాలి తల్లడముఁ జెందిరి వాడినతీఁగెలో యనన్.
| 740
|
ఉ. |
అప్పుడు రామలక్ష్మణులు నారఘువీరునిఁ గాంచి యాత్మలో
ముప్పిరి గొన్నశోకమునఁ బొక్కుచు డగ్గఱి గ్రుచ్చి యెత్తి నే
ర్పొప్పఁగ మంజుశయ్యపయి నుంచి వచోమృతసేవనంబునన్
దెప్పర మైనతాపమును దేర్చిరి తల్లులు వెంటఁ దేరఁగన్.
| 741
|
రాముడు వనమునకుఁ బోవ ననుజ్ఞ యిమ్మని దశరథుని వేఁడుట
వ. |
ఇట్లు దశరథుండు లబ్ధసంజ్ఞుం డై వేఁడినిట్టూర్పులం గందినముఖారవిందంబుతోఁ
జెలువఱియున్నఁ దండ్రిం గని సీతావల్లభుండు కృతాంజలిపుటుం డై యి ట్లనియె.
| 742
|
క. |
దేవా మాకందఱకును, దేవర వటు గాన మీరు ధృతిఁ బూని యర
ణ్యావనికిం జనఁ బూనిన, నావంకఁ గృపావిలోకనంబునఁ గనుఁడీ.
| 743
|
క. |
జానకియు లక్ష్మణుండును, బూనిక నాతోడ విపినభూమి నునికి డెం
దానం గోరిరి గానన్, నాథ యనుజ్ఞ యిమ్ము మామువ్వురకున్.
| 744
|
చ. |
అనవుడు భూమిభర్త హృదయంబున నెవ్వగ నివ్వటిల్ల రా
మునిఁ బరికించి యోపురుషభూషణ కైకవరప్రదానరూ
|
|
|
పనిబిడదీర్ఘపాశమున బద్ధుఁడ నైతి ననున్ సునీతిదూ
రుని వడి నిగ్రహించి యవిరోధముగా మహి నేలు మిత్తఱిన్.
| 745
|
ఉ. |
నా విని రాఘవుఁడు రఘునాథుని కి ట్లనుఁ గేలు మోడ్చి గో
త్రావర నీయనుజ్ఞను శిరంబునఁ బూని చతుర్దశాబ్దము
ల్వావిరి దండకాటవి నివాస మొనర్చి కృతవ్రతుండ నై
తావకపాదపద్మములు దప్పక గొల్వఁగ వత్తుఁ గ్రమ్మఱన్.
| 746
|
తే. |
రాజశేఖర పెక్కువర్షములు నీవు, పుడమి యేలితి వత్యంతపుణ్యమూర్తి
వైననిన్ను మృషావాదిఁగా నొనర్పఁ, జాల నిప్పుడే నడవికిఁ జనెదఁ దండ్రి.
| 747
|
దశరథుఁడు రామునికి వనమునకుఁ బోవ ననుజ్ఞ యొసంగుట
క. |
ఒండు దలంపక నను వన, మండలికిం బంపు మో క్షమావర యన నా
ర్తుం డయి సీతాపతి కా, తం డిట్లనుఁ గైకక్రూరతను బ్రేరింపన్.
| 748
|
తే. |
వివిధభంగుల నిహలోకవృద్ధికొఱకు, వితతముగఁ బారలౌకికహితముకొఱకు
మనుకులోత్తమ పునరాగమనముకొఱకు, స్వస్తి యగు మంచితెరువున వనికిఁ జనుమ.
| 749
|
చ. |
అతులితసత్యధర్మవినయాన్వితచిత్తుఁడ వైననీదుస
మ్మతి నిఁకఁ గ్రమ్మఱించుటకు మాకు నశక్యము గానఁ గాన కు
న్నతగతి నేగు మచ్చట వ్రతం బొకవైఖరి సల్పి వేగ స
మ్మతిఁ జనుదెమ్ము సంతతశుభస్ఫురితుండవు గమ్ము పుత్రకా.
| 750
|
ఉ. |
తల్లియు నేను జాలఁ బ్రమదంబునఁ గామితముల్ ఘటింపఁగా
నుల్లము చల్ల నై సిరుల నొందుచు భృత్యుల కెల్లఁ బ్రీతి సం
ధిల్లఁగ నీవిభావరి సుధీవర నాకడఁ బుచ్చి సాధ్వసం
బల్లన దేర్చి రేపకడ నంపక మై చనుమా వనోర్వికిన్.
| 751
|
వ. |
పుత్రా నాకు బ్రియంబు సేయుటకు సర్వైశ్వర్యంబు విడిచి హితజనంబులఁ
బరిత్యజించి వనంబునకుం బోవ నుపక్రమించితి విక్కార్యం బతిదుష్కరం బైన
యది గదా యని పలికి వెండియు ని ట్లనియె.
| 752
|
మ. |
కలితచ్ఛన్నకృశానుకల్ప యగునీకైకేయిచే నెంతయుం
జలితప్రజ్ఞుఁడ నైతి నీదువనవాసం బించు కైన న్గుణో
జ్జ్వల నా కర్థిఁ బ్రియంబు గాదు విను మే సత్యంబుగాఁ బల్కితిం
గలకాలంబును నీ వెఱుంగవె జగత్కల్యాణ మద్భావమున్.
| 753
|
తే. |
అనఘ కులవృత్తసాదిని యైనకైక, చేత సంప్రచోదితుఁడ వై చెలఁగి యిపుడు
పరఁగ వంచించి యడిగినవరము నర్థ, వంతముగఁ జేయఁ బూనితి వెంత యరిది.
| 754
|
తే. |
ఘనత నన్ను వీతానృతకథునిఁ గాఁగ, జేయు టది ధర్మరతుఁడవు జ్యేష్ఠసుతుఁడ
|
|
|
వర్కవంశప్రదీపుఁడ వలఘుమతిని, ధార్మికుఁడ వైననీకుఁ జిత్రంబు గాదు.
| 754
|
క. |
అని యీగతి విలపించుచు, మనుజవరేణ్యుండు పలుకుమాటకు దీనా
ననుఁడై యతఁడు సుమిత్రా, తనయుఁడు వినుచుండ మఱియుఁ దండ్రికి ననియెన్.
| 756
|
తే. |
ఇపుడు పొందెడిగుణములు నెల్లి యెవ్వ, రిత్తు రటు కాన భానుకులేశ యిచటఁ
దడయఁగా నేల యిప్పుడే వెడలి యడవి, కరుగుటయె నాకు నెంతయు నర్హ మగును.
| 757
|
క. |
తరణికులోత్తమ నాచే, నిర వందఁగ విడువఁబడిన యీసర్వమహిన్
వరము సఫల మగునట్లుగ, భరతునకు నొసంగుఁ డిపుడు ప్రాభవ మలరన్.
| 758
|
సీ. |
అవనీశ వనవాసమందు నిశ్చిత యయ్యె పరఁగ నామతి యది దిరుగు దింకఁ
గరము సంప్రీతితోఁ గైకకు మీచేత దత్త మైనవరంబు దప్పకుండ
భరతుని సామ్రాజ్యపట్టభద్రునిఁ జేసి జగతి సత్యప్రతిశ్రవుఁడ వగుము
నీనియోగంబున నెఱిఁ బదునాల్గేండ్లు వనచరయుతుఁడ నై వని వసింతుఁ
|
|
ఆ. |
గౌతుకమునఁ బ్రియసుఖంబుల కొఱకురా, జ్యంబు నిచ్చగింప నధిప యేను
మీరు చెప్పినంత మెయికొని గావించు, టదియె కోరువాఁడ ననుదినంబు.
| 759
|
రాముఁడు దశరథు నూరార్చుట
క. |
మనమున శోకము విడువుము, కనులన్ బాష్పములు నింపఁగా వలవదు మే
దినిలోఁ దటినీవల్లభుఁ, డినకులవర యెన్నఁ డైన నింకునె చెపుమా.
| 760
|
వ. |
దేవా యేను రాజ్యసుఖంబులును జీవితంబును సీతను సర్వకామంబులును స్వర్గం
బు నైన మనంబున నిచ్ఛింప మహానుభావుండ వైననిన్ను సత్యయుక్తునిఁ గాఁ
జేయుట యొక్కటియే యిచ్ఛించెదఁ బ్రత్యక్షదైవభూతుండ వైననీసన్నిధి
యందు సత్యసుకృతంబులు సాక్షిగా శపథంబుఁ జేసితి నే నొక్కక్షణం బైన నిప్పు
రంబున నుండ నోప సంకల్పితవరగమనోద్యోగనివృత్తి నాకుం గలుగనేరదు
నీవు శోకంబు విడువుము వనంబునకుం జనుమని యేను గైకేయిచేతఁ బ్రార్థితుం
డ నై యట్ల సేయంగలవాఁడ నని నీయకొంటి దాని సత్యంబుగాఁ బరిపా
లించువాఁడ నీ వీమనోవ్యధ విడిచి యెప్పటియట్ల స్వస్థచిత్తుండవు గమ్ము
ప్రశాంతహరిణాకీర్ణంబును నానాపక్షిగణయుతంబు నగువనంబున సీతాల
క్ష్మణసహితుండనై యథాసుఖంబుగా విహరించెద లోకంబున దేవతలకైనఁ
దండ్రికంటె నొండు దైవంబు లేదని యార్యులు నొడువుదురు గావునఁ బ్రత్యక్ష
దైవస్వరూపుం డైనతండ్రివచనంబు యథోక్తప్రకారంబున నిర్వర్తించెద.
| 761
|
క. |
నరనాథ చతుర్దశవ, త్సరము లరణ్యమున నుండి తడయక మరలం
బురికిం జనుదెంచిన ననుఁఁ, బరికించెదు నీమనమున వగవకు మింకన్.
| 762
|
తే. |
అనఘ యీబాష్పగళ మైనజనములెల్లఁ,
దగువిధంబునఁ దేర్పంగఁదగినమీరె
తాల్మి విడిచి యిబ్భంగి సంతాపమొంద, నింక నినుఁ దేర్చువా రెవ్వ రిచటఁ జెపుమ.
| 763
|
తే. |
క్షితివరోత్తమ నాచే వినృష్ట మైన, సాగరపురాద్రికాననసంయుత మగు
|
|
|
ధరణి యంతయుఁ జేకొని భరతుఁ డేలుఁ, గాక నీమాట కనృతంబు గలదె యధిప.
| 764
|
క. |
ఫలమూలంబులు మెసవుచు, సొలయక గిరినదులు వేడ్కఁ జూచుచు సౌఖ్యం
బలరారఁ గాననంబునఁ, గలయఁగఁ జరియింతు సుఖివి గ మ్మిట నీవున్.
| 765
|
సుమంత్రుఁడు కైకేయి నధిక్షేపించి దూఱుట
వ. |
అని పలికిన నద్ధరారమణుండు శోకసంతప్తచిత్తుండై కొడుకుం గౌఁగిలించుకొని
మోహవిశేషంబున రోదనంబు సేయుచు నొక్కింతసేపు నష్టచేష్టితుం డై
యుండెఁ గైకేయిదక్కఁ దక్కినరాజపత్ను లందఱు హాహాకారంబులు సేయు
చు మూర్ఛాక్రాంత లైరి సుమంత్రుండును దుఃఖాతిశయంబున వినష్టచేత
నుం డై ధరణిపయిం బడియె ని ట్లందఱుఁ కొండొకసేపు వివశు లై హాహాకా
రంబులు సేయుచుండి వెండియుం దేఱినయనంతరంబ సుమంత్రుండు కటకటం
బడి క్రోధాతిశయంబున శిరఃకంపంబు సేయుచు నిట్టూర్పులు పుచ్చుచు
బొమలు ముడివడఁ గన్నులం గెంజాయ రంజిల్లఁ గైకేయిదిక్కు మొగం బై
మహీపతిమనోవిధం బంతయు నెఱింగి నిశితంబు లగువాక్శరంబులచేత నద్దేవి
హృదయంబుఁ గంపింపంజేయుచు వజ్రోపమానంబు లగువాక్యంబులఁ దదీయ
మర్మంబులం గలంచుచు దేవి యెద్దానిచేత భర్తయు స్థావరజంగమాత్మకం
బైనసర్వజగంబునకు నాథుండు నగుదశరథుండు విడువంబడియె నట్టినీకు
నింకఁ జేయరానికార్యం బొక్కింత యైనఁ గలుగదు మహేంద్రుండునుఁబోలె
నజయ్యుండును మహాశైలంబునుం బోలె నప్రకంప్యుండును మహార్ణవంబునుం
బోలె నక్షోభ్యుండు నగుమహీపతి నీక్రూరవ్యాపారంబులఁ బరితపింపంజేయుట
వలన నిన్నుఁ బతిఘ్ని వనియుఁ గ్రమంబునఁ గులఘ్ని వనియుఁ దలంచెద నని
పలికి వెండియు ని ట్లనియె.
| 766
|
తే. |
తనయు లొకకోటి గల్గిన ధరణిలోన, నంబుజాక్షికి భర్తృమనోనుసరణ
మరయ నిఖిలార్థసాధన మై చెలంగుఁ, గానఁ బతినింక నేఁచక గావు మబల.
| 767
|
తే. |
అతివ యిక్ష్వాకుకులవిభుం డితఁడు సుగతి, కరిగినయనంతరంబ జ్యేష్ఠానుపూర్వ
కముగ రాజ్యభారముఁ దాల్సఁగలరు పుత్రు లిపుడు తద్ధర్మ మేల లోపించె దకట.
| 768
|
మ. |
అమలుం డీనృపుఁ డట్టివానిపయిఁ బూర్వాచారధర్మంబు హై
న్యము నొందింపఁ దలంచి తీవు జననింద న్నీసుతుం డాధిప
త్యముఁ గావించుచు నుండనిమ్ము చెలువొంద న్మేము నిత్యంబు దా
వమున న్రామునిఁ గూడి నిశ్చయమతిన్ వర్తింతు మిచ్ఛారతిన్.
| 769
|
ఆ. |
యోగ్యుఁ డైనవిప్రుఁ డొక్కరుండైన నీ, విషయమందు నిలిచి వెలయఁజాలఁ
డట్టిపాపకర్మ మాచరించితి వేనిఁ, జెట్టఁదన మిఁ కేమి చెప్పవచ్చు.
| 770
|
తే. |
రామునకు నెగ్గు సేయఁ దలంచియున్న, నీకు బ్రహ్మర్షి వాగ్దండనికర మేల
హింస సేయదు నీవు కాలిడిన పుడమి, వ్రయ్యలై పోవ దేల చిత్రంబు గాదె.
| 771
|
తే. |
భర్త కెప్పుడు భవదనువర్తనంబు, కోమలి వృధాప్రయాసంబుకొఱకు నయ్యె
రమణి చూతంబుఁ ద్రుంచి నింబమును బాలుఁ, బోసి పెంచిన మధురిమ పుట్టఁగలదె.
| 772
|
వ. |
అని కోపంబు పెంపునం బలికి వెండియు మర్మవచనంబుల ని ట్లనియె.
| 773
|
క. |
తల్లికిని బోలె నీకును, నుల్లంబునఁ గ్రూరచింత యొప్పుచు నుండుం
గ ల్లనఁగ వలదు వేఁపకుఁ, దెల్లంబుగ విసమె కాక తీపు గలుగునే.
| 774
|
సుమంత్రుఁడు కైకేయితల్లి దురాచారంబు లుగ్గడించుట
వ. |
అది యెట్లనినఁ దొల్లి భవజ్జనకుం డగుకేకయమహీనాథుం డొక్కయోగివలన
సకలభూతరుతార్థజ్ఞానవిషయకం బైనయొక్కవరంబు వడసి తత్ప్రభావంబున
సర్వభూతరుతంబును దదభిప్రాయంబు నెఱింగి దానం జేసి పశుపక్షిమృగాదుల
వచనం బతనికి విదితం బై యుండు నంత నొక్కనాఁ డద్ధరారమణుండు శయన
కాలంబునందు నొక్కజృంభనామకం బైనపక్షిరుతంబు విని దానియభి
ప్రాయం బెఱింగి నవ్విన నది విని మృత్యుపాశంబు నభిలషించుచు మీతల్లి
కోపించి హాసకారణం బెఱింగింపు మనిన నతండు తత్ప్రకారం బెఱింగించిన
నిప్పుడు నాకు మరణంబు సంభవించు ననిన నది వినక నీ వెట్లైన లెస్స నాకు న
వ్వుటకుం గలిగిననిమిత్తం బెఱింగింపు మని నిర్బంధించిన నన్నరవరుం డవ్వి
ధం బంతయు వరదాయకుం డగుయోగి కెఱింగించిన నతండు మోహవశం
బున నాలికిఁ జెప్పి మరణంబు నొందక దాని నిరసింపు మనిన నక్కేకయుండు
గురువచనప్రకారంబున భార్యను నిరసించి మృత్యువుం దిరస్కరించి సుఖి యై
కుబేరుండునుం బోలె యథాసుఖంబుగా విహరించె నిది మీతల్లివృత్తాంతం
బెల్లవారికిఁ దెల్లం బై యున్నయది యట్టిక్రూరచిత్తకుం బుట్టిననీకు మంచి
గుణం బేల దొరకొనుఁ దల్లియట్ల నీవును దుర్జనాచరితమార్గస్థితవై మోహంబున
మహీపతిం జంపం జూచితివి పుత్రులకుఁ దండ్రిగుణంబును బుత్రికలకుఁ దల్లి
గుణంబును నిక్కంబుగా సన్నిహితం బై యుండు నీవును దల్లిగుణం బంగీ
కరించి జనాపవాదంబున కోర్చి మహీపతిచిత్తంబుఁ గలంచెద విమ్మహీపతి సభా
మధ్యంబునం బలికినరామాభిషేకంబునకు విఘ్నంబుఁ జేసితి వేని నితని కసత్య
దోషంబు వచ్చు జ్యేష్ఠునిం బరిహరించి కనిష్ఠు నభిషిక్తునిం జేసిన రాజధర్మం
బుసకు హాని వాటిల్లు నిమ్మనుజపుంగవుండు దేవరాజసమప్రభుండును కీర్తి
రథుండును సత్యవాదియుఁ గావున నమ్మహాత్మున కపయశంబు గలుగకుండ
సత్యంబున నుద్ధరింపు మని పలికి వెండియు ని ట్లనియె.
| 775
|
సుమంత్రుఁడు కైకేయికి నీతులు దెల్పుట
చ. |
అనఘచరిత్రుఁ డీరఘుకులాంబుధిచంద్రుఁడు రాఘవుండు కా
ననమున కేగుచుండ నుడునాథుఁడు లేనితమిస్రభంగి శో
భనరుచి దక్కి చిక్కు సెడి పాడఱి యున్నపురంబులోపల
|
|
|
న్మనుజుఁ డొకండు నిల్చునె వనంబున కేగక దుష్టచారిణీ.
| 776
|
తే. |
రామభద్రుండు దండకారణ్యమునకుఁ, జనిన నీ కపవాదంబు సంభవించు
వంశధర్మమునకు హానివచ్చు మనుజ, పతికిఁ దీర్పంగరానియాపద ఘటిల్లు.
| 777
|
క. |
కావున ననేకఘనదో, షావహ మగునీవిచార మటు వో నిడి సీ
తావిభుని సకలరాజ్య, శ్రీవిభునిఁగఁ జేయు మిపుడు చిత్తము లలరన్.
| 778
|
శా. |
సీతానాథుఁ డశేషరాజ్యపదవీసింహాసనాధ్యక్షుఁ డై
చేతోజాతసమానమూర్తులు నృపశ్రేష్ట ల్సుమిత్రాతనూ
జాతు ల్నీతనయుండుఁ గొల్వఁ బ్రజలన్ సంప్రీతితో నేలఁగాఁ
బూతాత్ముం డగురాజు కాన కరుగుం బూర్వాధిపప్రక్రియన్.
| 779
|
క. |
అని యిట్లు పెక్కుభంగులఁ, బనివడి సూతజుఁడు దీక్ష్ణభాషితముల మె
త్తనిమాటల న్యాయప్రవ, చనములఁ గొంతవడి ధర్మసరణిఁ బలికినన్.
| 780
|
క. |
పడఁతుక దుర్మత మది తా, విడువక జనులాడుసడికి వెఱవక మదిలోఁ
బొడమినకోపము మత్సర, ముడుగక మఱుమాట పలుక కూరకయుండెన్.
| 781
|
వ. |
అంత నమ్మహీనాథుండు ప్రతిజ్ఞాపీడితుం డై నిట్టూర్పు నిగిడించి కన్నుల బాష్ప
కణంబు లొలుక సుమంత్రుదిక్కు మొగంబై రత్నసంపూర్ణంబు లగుచతుర్విధ
సైన్యంబులును బరచిత్తాపకర్ష ణచతురవచన లగువారకాంతలును సుప్రసారితు
లగువణిగ్జనంబులును ముఖ్యంబు లగువరాయుధంబులును నాగరులును శకటంబు
లును గాంతారగోచరు లగువ్యాధులును ధనధాన్యకోశంబులును రాముని
పిఱుంద వనంబునకుం జనునట్లు సేయుము సేనాయుతుండై కుంజరాదిమృగం
బులం జంపుచు సహాయసంపన్నుం డై యారణ్యకం బగుమధువుఁ గ్రోలుచు
ధనవంతుం డై పుణ్యప్రదేశంబులందు యాగంబులఁ జేసి బ్రాహ్మణులకుఁ బుష్క
లంబుగా దక్షిణ లొసంగుచు మునులతోడఁ బుణ్యకథావినోదంబులం బ్రొద్దు
పుచ్చుచుఁ బురంబునందుంబోలె రాముండు సుఖగోష్ఠి వనంబునందు విహరించు
చుండు నిచ్చట భరతుం డయోధ్యఁ బాలించుచుండుఁ బదంపడి రాముండు
వనవాసానంతరంబున సకలమహీరాజ్యభారధౌరేయుం డై ప్రజలఁ బాలింపఁ
గలం డని పలికినఁ గైకేయి భయభ్రాంత యై మొగంబున వెల్లఁదనంబు గదుర
నద్దశరథున కభిముఖి యై యి ట్లనియె.
| 782
|
క. |
రమణా గతజన మగురా,జ్యము నకటా పీతమండ మగుమద్యమున
ట్ల మలినమతిచేఁ గడుఁ గృ, త్రిమయుక్తి నొసంగఁ దలఁచితే భరతునకున్.
| 783
|
క. |
దాని నతఁ డేల చేకొను, నీ నేర్పులు దెలిసె నింక నిలువు మనిన న
మ్మానవపతి లజ్జాభయ, హీన యగువెలంది కనియె నెంతయుఁ గినుకన్.
| 784
|
క. |
విను వారి కయుక్తం బగు, పని యైనను సత్యపాశబద్ధుఁడ నై గై
కొని సేయఁ గడంగిన న, న్ననుమానము దక్కి యేమి యలఁచెద వింకన్.
| 785
|
తే. |
పాపమతి రాము నడవికిఁ బంపు మనుచుఁ, బలికితివి గాని నామ్రోల బలయుతముగ
ననుప వల దని యంటివే యపుడు నాకుఁ, దోఁచిన ట్లిప్పు డొనరింతు దోస మేమి.
| 786
|
కైకేయి దశరథునితో సగరుఁ డసమంజునట్ల రాముని వనమునకుఁ బంపు మనుట
క. |
అని పలికిన విని యమ్మానిని తనపతికంటె మిగుల నెఱి గల్గిన బల్
కినుక హృదయమునఁ గదురఁగ, ననుమానము విడిచి మరల నాతని కనియెన్.
| 787
|
ఉ. |
ఇంత విచార మేల పృథివీశ్వర మీకులమందుఁ దొల్లి వి
క్రాంతదురంధరుండు సగరక్షితినాథుఁడు జ్యేష్టపుత్రు న
త్యంతగుణప్రవీణుని మహాత్ముని నయ్యసమంజుని న్సుధీ
మంతునిఁ ద్రోచి పుచ్చఁడె క్షమావర యాతని కెగ్గు కల్గెనే.
| 788
|
వ. |
మహేంద్రా యసమంజునిచందంబున నీరాముండు నిర్వాసితుఁ డగుఁ గాక
యనిస నప్పడంతివాక్యంబులు విన రోసి మహీనాథుం డూరకుండె జనం
బంతయు వ్రీడితం బయ్యె నప్పుడు మహావృద్ధుం డగుసిద్ధార్థుం డనుమంత్రి
పుంగవుండు కైకేయి కి ట్లనియె.
| 789
|
క. |
ఆయసమంజుఁడు క్రీడా, వ్యాయామమువలనఁ దెరువులందు శిశువులం
బాయక కొని చని సరయూ, తోయంబుల వైచు భూరిదుర్మదలీలన్.
| 790
|
సిద్ధార్థుం డనువృద్ధమంత్రి కైకేయికి నయంబుఁ దెల్పుట
వ. |
దానిం జూచి సహింపక పౌరు లమ్మహీపతిపాలికిం జని భవన్నందనుండు దుర్మదం
బున నస్మత్పుత్రులం గొని చని మౌర్ఖ్యంబున సరయూనదీజలంబులం
బడవైచు నిట్టిదుష్టు నొక్కనిం జేకొని మమ్ము నందఱ నుపేక్షించుట
ధర్మంబు గాదని యాక్రోశించిన వారికిఁ బ్రియంబుగా సభార్యుం డైనయసమంజు
ని యావజ్జీవపర్యంతంబు వనంబున నుండు మని రాష్ట్రంబు వెడల ననిచిన
నయ్యసమంజుండు ఫాలపిటకధరుం డై గిరిదుర్గంబుల నాశ్రయించి కందమూల
ఫలాశనుండై పాపకర్మంబునంబోలె సంచరించుచుండె నక్కుమారుండు జన
కంటకుం డగుటం జేసి పరిత్యజించుటకుం దగియెడువాఁ డయ్యె నక్కుమారుని
యందుం బోలె రామునియం దేమి పాపంబు గంటిమి శశాంకునియందు
మాలిన్యం బెట్లు లే దట్లు రామునియందు నిరయహేతుభూతం బైనదోషం
బించుకయైన లే దిమ్మహాత్ముండు విడుచుటకుం దగియెడువాఁడే యని పలికి
వెండియు ని ట్లనియె.
| 791
|
క. |
మానిని సీతాపతిపైఁ, బూనిక నిం తైన దోషముం గల దేనిన్
దానిం బేర్కొను మిప్పుడె, కానకుఁ దగఁ బుత్తు మి ట్లకారణ మేలా.
| 792
|
క. |
ముదితా సత్పథనిరతుం, డదుష్టుఁ డగువాని త్యాగమందుఁ దలంపం
|
|
|
ద్రిదశాధీశుని పటుసం, పద నైన దహించు ధర్మపథరోధమునన్.
| 793
|
క. |
మునుకొని రాముని వనికిం, బనిచిన నీ కేమి ఫలము వచ్చు మృగాక్షీ
విను మీదుర్మత ముడుగుము, గొనకొని జననిందఁ బాపికొనుము సుమతి వై.
| 794
|
దశరథుఁడు కైకేయికి నయంబుఁ జెప్పుట
మ. |
అని యి ట్లాడు ప్రధానశేఖరునిమా టాలించి భూభర్త దా
ఘనశోకోపహతేంద్రియుం డగుచు నక్కైకేయి నెమ్మోముఁ గ
న్గొని మందధ్వని నిట్లనె జను లుపక్రోశింప కుండన్ మహ
ఘనుఁ డీమంత్రివరుండు పల్కునయవాక్యం బర్థి నాలింపుమా.
| 795
|
తే. |
లేమ యీమంత్రివాక్య మాలింప వేని, సొరిది నీకును నాకును సుఖము లేదు
వృజినపథ మొంది నీవు గావించునట్టి, కర్మ మది నాధులోకవిగర్హితంబు.
| 796
|
చ. |
పలుకులు వేయు నేల కులపాంసిని నీవును నీకుమారుఁ డీ
యిల నవిరోధతం గుజను లెల్ల నుతింపఁగ నేలుచుండుఁ డే
లలితగుణాభిరాముఁ డగురామునిఁ గూడి వనోర్వి కేగెద
న్దులువలపొత్తుఁ బోదురె ఘనుం డెడఁ బాసినచో యశోధనుల్.
| 797
|
రాముఁడు దశరథుని వల్కలము లడుగుట
చ. |
అని జనభర్త పల్కునపు డారఘురాముఁడు మంత్రివాక్యము
ల్విని వినయంబు దోఁపఁ బృథివీపతి కి ట్లను నోమహాత్మ శో
భనకరరాజ్యసంపదలఁ బాసి వనంబున నుండువాఁడ నై
చనియెడునాకు నీసకలసైన్యసమాగమ మేల చెప్పుమా.
| 798
|
మ. |
నరనాథోత్తమ యెవ్వఁ డర్థి గజముం దా నిచ్చి తత్కక్ష్యయం
దురుమోహంబునఁ గామకారి యగు నోహో రజ్జుసంస్నేహత
త్పరత న్వానికిఁ గార్య మేమి గల దీదాక్షిణ్యము న్మాని చె
చ్చెరఁ దెప్పింపుము నారచీర లవియే శ్రీ లంచు నూహించెదన్.
| 799
|
మ. |
అని సీతావిభుఁ డాడువాక్యములకు న్హర్షించి కైకేయి చ
య్యన వల్కంబులఁ దెచ్చి రామ గయికొమ్మా యంచు నందీయఁ జే
కొని రాముం డటు సూక్ష్మవస్త్రము జను ల్క్షోభింపఁగాఁ బుచ్చి తా
ముని వస్త్రంబులు గట్టె నాయమకు సంమోదంబు సంధిల్లఁగన్.
| 800
|
ఉ. |
ఆదట లక్ష్మణుండును శుభాంబర మల్లనఁ బుచ్చి తాపసా
చ్ఛాదనము ల్ధరించెఁ దమయయ్య గనుంగొనుచుండ నంత రా
కాధవళాంశువక్త్రయు జగ్గన్నుతశీలయు భర్తృదుఃఖవి
చ్ఛేదిని జాతరూపమయచేలయు నైనధరాకుమారియున్.
| 801
|
రాముఁడు సీతకు వల్కలములఁ గట్టుట
తే. |
కైక కఠినాత్మ యై కృప లేక తన కొ, సంగిన యమంజుతాపసాచ్ఛాదనంబు
|
|
|
హరిణి వాగుర నట్ల తా నందికొని సు, బాష్పపూర్ణాక్షి యై నిజభర్తఁ జూచి.
| 802
|
తే. |
పురుషవర యిట్టికఠినంపుఁబుట్ట మెట్లు, మునులు దాల్పంగ నోపుదు రనుచుఁ గనుల
నశ్రువులు గ్రమ్మ వ్రీడిత యగుచు దానిఁ, గట్ట నేరక శోకంబు గడలుకొనఁగ.
| 803
|
తే. |
అంసమున నొక్కపరిధాన మలవరించి, పాణిచే నొక్కవసనంబుఁ బట్టి విభుని
మోముఁ జూచుచు మనమున నేమి దోఁప, కూర కున్నమహీపుత్రి నూఱడించి.
| 804
|
క. |
రాముఁడు రయమున సీతా, భామిని కనకాంబరంబుపై వల్కల ము
ద్దామగతిఁ గట్టఁ గనుఁగొని, భూమీశ్వరుసతులు చాలఁ బొక్కుచు నంతన్.
| 805
|
ఉ. |
రామునిఁ జూచి యి ట్లనిరి రాజకులోత్తమ యీధరిత్రిక
న్యామణి బాల గోలయు మహాసుకుమారియుఁ బుట్టి యెన్నఁడు
న్బాము లెఱుంగనట్టిఘనభాగ్యయుఁ గావున నీసతి న్వనీ
భూమికి నేఁడు దోడుకొని పోవఁగ యుక్తము గాదు చూడఁగన్.
| 806
|
తే. |
ధన్యచరిత నీ వచ్చునందాఁక నిన్నుఁ, గాంచి యానందమునఁ బొంగుకరణి జనక
సుతను గనుఁగొని సంతోషయుతుల మగుచు, నసువులు ధరించి యుండెద మంచితముగ.
| 807
|
క. |
జనపతి ని న్నొంటిగఁ గా, ననమున కరుగు మని పంచె నరవర యటు గా
వున జనకసుతను దోడ్కొని, చను టొప్పదు తండ్రిమాట సత్యమ కాదే.
| 808
|
క. |
మామాటఁ బట్టి సీతా, భామిని నిచ్చోట నునిచి భద్రయశుం డీ
సౌమిత్రి వెంట రా వన, భూమికిఁ జను మిదియ నీకుఁ బోలుఁ గుమారా.
| 809
|
క. |
అని యిట్లు తల్లు లందఱుఁ, దనకు హితముఁ బల్క వినుచుఁ దడయక రాముం
డనుమానింపక ధాత్రీ, తనయకు వల్కలముఁ గట్టె తత్పరమతి యై.
| 810
|
వ. |
ఆసమయంబున నృపపురోహితుం డగువసిష్ఠుండు సీతాదేవిని నివారించి కై
కేయి నవలోకించి యిట్లనియె.
| 811
|
వసిష్ఠుఁడు కైకేయిని దూఱుట
తే. |
శీల మెన్నక మగని వంచించి రామ, భద్రు నడవికిఁ బొమ్మని పలికి తాఁ బ్ర
మాణ మందున నిలువ కీమానవతికి, సీత కిచ్చితి వేటికిఁ జీర లిపుడు.
| 812
|
ఉ. |
ఆ తేఱఁ గెట్లు చొప్పడు మహాసుకుమారి పవిత్రశీల యీ
సీత నిజాధినాథుఁ డెడ సేయక క్రమ్మఱ వచ్చునంత కి
ట్లాతనిశాసనంబున ధరాధిపతిత్వము నొంది యుండుఁ గా
కాతతకంటకాశ్మకఠినావని కేటికిఁ బోవు నిత్తఱిన్.
| 813
|
తే. |
ఇంతి వినుము గృహస్థుల కెల్లఁ బత్ని, యాత్మ యై యుండు రామున కాత్మయైన
ధాత్రికన్య తత్ప్రతినిధిత్వమున నిఖిల, వసుధఁ బాలించుఁ దనపతి వచ్చుఁదాక.
| 814
|
ఆ. |
అట్లు గాక యామహాసాధ్వి పతిఁ గూడి, యడవి కరిగె నేని యతులసుఖము
|
|
|
లిచట విడిచి పిదప నే మందఱము చను, వార మతఁడు వోవు ఘోరవనికి.
| 815
|
తే. |
తండ్రిచే ధర్మయుక్తి దత్తంబు గాని, యుర్విఁ బాలింప భరతుఁ డర్హుండు గాఁడు
నృపతికి జనించు టది నిక్క మేని యింకఁ, దల్లివలె నిన్నుఁ జూడఁడు తథ్య మపుడు.
| 816
|
ఆ. |
మఱియు విషయజనులు పురజనంబులు దండ, నాయకులు సతీసహాయు లగుచు
నెచట రామభద్రుఁ డింపార వసియించు, నచటి కిపుడె వోదు రనృతశీల.
| 817
|
దశరథుఁడు కైకేయి యన్యాయంబు నుగ్గడించుట
వ. |
దుష్టచారిణీ నీవు భూతలంబున నుండి గగనంబున కెగసినఁ బితృవంశచరిత్ర
విశారదుం డగుభరతుండు భవన్మతం బంగీకరింపఁడు పుత్రవినాశిని వగునీచేత
భరతున కప్రియంబు గావింపంబడియె మఱియు లోకంబున నెవ్వాఁడు రాముని
ననుసరింపకుండు నతని లేనివానిఁగా నెఱుంగుము పశువ్యాళమృగద్విజంబులు
ను బాదపంబులును దదున్ముఖంబు లై రామునితోఁగూడ వనంబున కిపుడె పోవఁ
గలయవి తత్ప్ర కారంబు విలోకింపం గలవు భరతుండును శత్రుఘ్నుండును రా
మునియట్ల తాపసవేషంబులు దాల్చి దండకారణ్యంబున వసియింతు రంతట గత
జనం బై శూన్యాకృతినున్నయిప్పురంబు చేకొని విగతఫలంబు లైనవృక్షంబుల
కాధిపత్యంబు సేయుచుండుము మఱియు రాముండు లేనిపురం బరణ్యసమా
నం బగు నమ్మహాత్ముండు వసియించియున్ననెలవు విపినం బైనను నానాజనశోభితం
బైనపురం బై యుండు నుఱియు నొక్కరామునివనవాసంబే నీచేతఁ బ్రార్థితం
బైనయది గాని వరప్రదానంబునందు సీతావనవాసంబు ప్రార్థితం బైనయది
గాదు కావున నలంకారనియత యైనయీసీత సర్వాలంకారభూషితయై మహా
ర్హయానపరిచారకవస్త్రభూషణోపకరణసహితంబుగా వనంబునకుం జని యందు
రామునితోఁ గూడ నివసించి యుండం గలయది నీ వీవైదేహికి దివ్యాంబరా
భరణమాల్యాదు లొసంగి వల్కలంబులు గ్రమ్మఱిఁ బ్రతిగ్రహింపు మని
యిట్లు కైకేయిం బదరి పలికి జానకిని నివారించిన నద్దేవి యమ్మహాత్ముఁ డెంత
జెప్పిన నుడుగక పత్యనుకారకామ గావున నిజవల్లభునిరూపంబున కనురూపం
బుగా వల్కలంబు ధరించె నప్పు డచ్చటిజనంబు లందఱు దుఃఖించిన నమ్మహా
ధ్వని విని దశరథుండు శోకవ్యాకులితచిత్తుం డగుచు యశోధర్మజీవితంబు
లయందుఁ బ్రియత్వంబు విడిచి నిట్టూర్పు నిగిడించి కైకేయి నవలోకించి
యి ట్లనియె.
| 818
|
సీ. |
పుట్టి యెన్నఁడు దుఃఖముల నెఱుంగక సరసాన్నంబుఁ గుడిచి చీనాంబరములఁ
దాల్చి మహోన్నతిఁ బొల్చి యుండెడునట్టియీబాల యీగోల యీసుఖార్హ
యీమహాసుకుమారి యీధరిత్రికుమారి కుశచీరఁ దాల్చి యాకులత కోర్చి
ఘోరవనావని కేరీతిఁ బో నేర్చు గురునివాక్యంబు నిక్కువము సువ్వె
|
|
తే. |
ఘనసుఖోచిత యైనయీ జనకకన్య, తనయలంకారరూప మంతయును విడిచి
|
|
|
తాపసులు గట్టుపుట్టంబుఁ దాల్పఁ జూచి, కన్నవారలమనములు గంద కున్నె.
| 819
|
తే. |
చీరలు పరిత్యజించి యీక్షితికుమారి, కనకభూషణభూషితాకార యగుచుఁ
గడుసుఖంబుగ వని కేగఁగలదు శ్రమణి, యగుట కే నీయకొంటినే మగువ యిపుడు.
| 820
|
తే. |
అకట వల్కముఁ దాల్చి సభాంతరమున, శ్రమణిచందాన నొప్పెడుజనకపుత్రి
నెవ్విధంబున వీక్షింతు నెట్లు సైఁతు, నీవెలంది యెవ్వని కేమి యెగ్గుఁ జేసె.
| 821
|
తే. |
రమణి జానకి నారచీరలు ధరించి, వనికిఁ బోవుట కే నీయకొనుట లేదు
గావున సమస్తభూషణకలిత యగుచు, భూరిసుఖలీల నడవికిఁ బోవఁగలదు.
| 822
|
వ. |
దేవి ముమూర్షుండ నైననాచేత భవత్ప్రార్థనంబుఁ గావించెద నని శపథపూ
ర్వకంబుగా సతిక్రూరం బైనప్రతిజ్ఞ మొదలఁ గావింపంబడియెఁ బదంపడి నీచే
త నజ్ఞానంబున రామప్రవ్రాజనభరతాభిషేకరూపప్రయోజనంబు ప్రతిపన్నం
బయ్యెఁ గాని సీతాప్రవ్రాజనరూపప్రయోజనంబు ప్రతిపన్నం బైనయది గా
దే నందు కీయ కొనిన యది లే దిప్పుడు ముఖ్యంబుగా సీతాప్రవ్రాజనంబె యా
రంభింపఁబడియెఁ గావున నిక్కార్యం బాత్మపుష్పంబు వేణువుం బోలె నన్ను
దహింపం గలయది యని పలికి వెండియు ని ట్లనియె.
| 823
|
తే. |
ఈమహీజాత నీ కేమి యె గ్గొనర్చె, రాముఁ డే మింత నీకుఁ గారామిఁ జేసె
నీదురత్యయబుద్ధి నీ కేల గలిగె, మంచికుల మేల నీఱు గావించె దకట.
| 824
|
తే. |
పరమసాధ్వి మృదుస్వభావయును గోల, మంజుభాషిణి హరిణీసమాననయన
బాల సుకుమారి ధర్మైకపరయు నైన, సీత యేమి విరోధంబు సేయు నీకు.
| 825
|
వ. |
దుష్టచారిణీ నీకు నరకానుభవంబుకొఱకు నీరామవివాసనంబె చాలు వెండియు
నింతకంటె నధికంబుగా నీచేత ననుష్ఠీయమానం బైనయీయవాచ్యదుఃఖ
ప్రదసీతాప్రవ్రాజనరూపపాతకంబుచేత నేమి యనుభవించెద వభిషేకార్థం
బిచటికి సమాగతుం డైనరాము నుద్దేశించి నీచేతఁ బలుకంబడిన రామవివా
సనవిషయకం బైనవాక్యం బాకర్ణించి నాచేత రామవివాసనమాత్రంబె ప్ర
తిజ్ఞాతం బయ్యెఁ గాని సీతావివాసనంబు ప్రతిజ్ఞాతం బైనయది గా దిప్పుడు మ
త్ప్రతిజ్ఞాతం బైనరామవివాసనం బతిక్రమించి యప్రతిజ్ఞాతం బైనసీతావివా
సనంబునుం గోరితి విది ధర్మవిరోధంబు చీరవల్కలవాసిని యైన వైదేహి
నీక్షింప నిశ్చయించితిని గావున నీవు నిక్కంబుగా నిరయగతి నొందఁగలవు.
| 826
|
ఉ. |
లోకముతోడిదాన వని రూఢిగ నెమ్మది నమ్మి యంత క
స్తోకముదంబునం బ్రియము దోఁపఁ గుమారుని మేలుకార్యము
న్వాకొని చెప్ప వచ్చి తుది వారనిదుఃఖము నొందితిం గటా
నీకడ కేగుదెంచు టది నేరము వచ్చెఁ దలంపు లేటికిన్.
| 827
|
మ. |
అని యి ట్లాజనభర్త శోకమున భార్య న్దూఱుచుం గోడలం
గని శోకించుచు బాష్పతోయణముల్ గన్గోనలం దాల్చుచు
న్దనయు న్బాయుట కోర్వఁజాలక మనస్తాపంబు వాటిల్లఁ గ్ర
న్నన దుఃఖంబు సహింప లేక సొరిగెం దల్పప్రఘాణంబునన్.
| 828
|
వ. |
ఇట్లు మూర్ఛితుం డై పడి యున్నతండ్రిం దేర్చి సీతావల్లభుండు గహనోన్ముఖుం
డై వెండియు ని ట్లనియె.
| 829
|
రాముఁడు కౌసల్యను సన్మానించుచుండు మని దశరథుఁ బ్రార్థించుట
సీ. |
అనఘాత్మ మాతల్లి యైనయీకౌసల్య కడువృద్ధ కీర్తిసంకలిత పుట్టి
యెన్నఁడు దుఃఖంబు లెఱుఁగని దక్షుద్రశీల మహాధర్మచిత్త నన్ను
నిమిష మైనను బాసి నిలువ నేరని దట్లు గావునఁ బుత్రశోకమునఁ గుంక
కుండ సన్మానింపు మురుసమాదరమున నట్లు గావింపక నలఁతి గాఁగఁ
|
|
తే. |
జూచితేనియు దారుణశోకవహ్నిఁ, గ్రాఁగి యసువులు విడిచి నిక్కముగ యమపు
రంబునకుఁ బోవు ననిన నారాజవరుఁడు, మహితశోకాబ్ధిదోధూయమానుఁ డగుచు.
| 890
|
వ. |
మునివేషధరుం డైనకుమారు నవలోకించి వదనం బెత్తి యతనిం జూచుటకు
నతనితోడ సంభాషించుటకుం జాలక పత్నీసహితంబుగా మూర్ఛితుం డై
వెండియు నొక్కింతసేపునకుం దేఱి.
| 891
|
క. |
ముదమున ము న్నేమొదవుల, వదలక కుఱ్ఱలకుఁ బాపి భంజించితినో
పదుగుర హింసించితినో, యది యెంతయుఁ గట్టి కుడువ నయ్యె న్నాకున్.
| 892
|
ఉ. |
అక్కట కైకమాటలకు నంగము లెల్ల మహోగ్రవేదన
న్స్రుక్కియు మౌనివేష మది సొప్పడఁ గైకొని యగ్రభాగమం
దుక్కఱి యున్నపుత్రుఁ గనియు న్మనియుండుటఁ జేసి ధాత్రిలో
గ్రక్కునఁ జే టకాలమునఁ గల్గమి నిక్కము ప్రాణికోటికిన్.
| 893
|
తే. |
నను విరోధించి స్వప్రయోజనమునందుఁ, బ్రియము గలిగిన కైకేయి కృతమునందు
జనము కటకటఁ బడుచున్న దనుచుఁ బలికి, యశ్రువులు గాఱ నంతలో నవశుఁ డయ్యె.
| 894
|
దశరథుఁడు సీతకు దివ్యవస్త్రాభరణాదుల నొసఁగుట
వ. |
ఇట్లు మూర్ఛాక్రాంతుం డై ముహూర్తమాత్రంబునకుఁ గ్రమ్మఱ లబ్ధసంజ్ఞుం
డై రామా యని పేర్కొని క్రమ్మఱ నుచ్చరింపంజాలక కొంతసే పూరకుండి
వెండియు బాష్పకణంబులు కొనగోట మీటుచు సుమంత్రుం జూచి నీవు రయం
బునం జని యువవాహసమాత్రోపయుక్తం బైనరథంబు నుత్తమాశ్వంబులం
|
|
|
బూన్చి తెమ్ము నాథుండును వీరోత్తముండు నగురాముండు తల్లిదండ్రులచేత
వనంబున కనుపంబడియె నిదియె గుణవంతు లగువారిగుణంబులకు ఫలం బని
యెంచెద నని దుఃఖాతిశయంబునం బలికిన విని యతండు రాజానుమతంబున
సువర్ణరత్నభూషితం బైనరథం బాయితంబుఁ జేసి తెచ్చి ముందటం బెట్టి కృ
తాంజలిపుటుం డై కొలిచి యుండె నప్పు డద్దశరథుండు దేశకాలజ్ఞుండును
బాహ్యాభ్యంతరబుద్ధియుక్తుండును దత్తత్కాలోచితవస్తువిషయనిశ్చితజ్ఞానవం
తుండు నగుధనాధ్యక్షుని రావించి మంజువస్త్రంబులును మణిభూషణంబులును
బదునాల్గువర్షంబులకుం జాలునట్లుగా వేర్వేఱ వైదేహి కొసంగు మని పంచిన
నతండు కోశగృహంబునకుం జని వస్త్రాభరణంబులు దెచ్చి యద్దేవి కొసంగిన
నయోనిజయు సాముద్రికోక్తసర్వలక్షణసంపన్నయు నగు నమ్మహీపుత్రి
వివిధవిచిత్రప్రభాపటలజటిలంబు లగుమణిభూషణంబులు దాల్చి ప్రాతః
కాలంబున నంతరిక్షంబు నలంకరించు భానుప్రభయునుం బోలె నమ్మహామంది
రంబు వెలుంగం జేయుచుండె నప్పు డప్పుడమికన్నె నవలోకించి భుజంబులం
బరిష్వజించి శిరంబు మూర్కొని బాష్పధారాపూరితముఖ యై కౌసల్య యి
ట్లనియె.
| 835
|
కౌసల్య సీతకు హితోపదేశముఁ జేయుట
క. |
క్షితిలోన నసతు లెంతయు, సతతము నిజవిభులచేత సత్కృత లయ్యుం
బతి కృఛ్రగతుం డగుచో, క్షితితనయా నిగ్రహంబు సేయుదు రంతన్.
| 836
|
తే. |
పార్థివాత్మజ మున్నలభర్తవలనఁ, బెక్కుసుఖములు వడసియుఁ బృథివిలోన
వరున కొక్కింతయాపద వచ్చినప్పు, డతని విడుచుట యసతుల కాత్మగుణము.
| 837
|
తే. |
కల్ల నిజముగఁ బల్కుట కలుషవృత్తి, కఠినచిత్తంబుఁ దాల్చుట కపటబుద్ధి
తవిలి పురుషుని వంచించి తనకుఁ దలఁకు, వానిఁ జేయుట యసతులవర్తనములు.
| 838
|
క. |
విపరీతకర్మయుక్తలు, కపటవచోరతలు కృతము గాననికుమతు
ల్చపలాత్మలు వారి మనః, కపటత్వము దెలియరాదు గా పురుషులకున్.
| 839
|
తే. |
ధర నవిశ్వసనీయలు దురితచిత్త, లగుటఁ గులకృతదానవిద్యాదికములు
సంగ్రహంబును నసతుల స్వాంతవృత్తిఁ, గ్రమ్మఱింపంగఁ జాలవు రాజతనయ.
| 840
|
క. |
సతులకుఁ గాంతామణి సు, శ్రుతశమదమసత్యశీలసుగుణములందు
న్మతి సేయునట్టివారికిఁ, బతి యొక్కఁడె గతియు నతఁడె పరమార్థ మిలన్.
| 841
|
వ. |
కావున మత్తనయుండు ధనవంతుం డైనను నిర్ధనుం డైనను నీకు దైవం బ
ట్లగుటం జేసి యమ్మహాపురుషునిఁ బరిచర్యాభక్తియోగంబులు నిత్యంబును
సేవించుచుండు మని పలికిన ధర్మార్థసహితం బైనయక్కౌసల్యవాక్యం బెఱింగి
కృతాంజలి యై యద్దేవి కి ట్లనియె.
| 842
|
మ. |
క్షితిలో మెచ్చుగ నాకుఁ దొల్లి పతిసంసేవావిధం బంతయుం
|
|
|
జతురత్వంబునఁ దల్లిదండ్రులు మహాసంప్రీతితోఁ జెప్పి రా
గతి మీ రిప్పుడు క్రొత్తఁ జేసితిరి వేడ్క న్భక్తియోగంబుచేఁ
బతిశుశ్రూష యొనర్చుచుండెద జగత్ప్రఖ్యాతచారిత్ర నై.
| 843
|
క. |
ధరణి నతిదుర్జనులతో, సరిగా ననుఁ దలఁచి తొక్కొ శశిఁ బాయనిత
త్పరమద్యుతిగతి నేనును, దరలక వర్తింతు నిత్యధర్మమువలనన్.
| 844
|
ఆ. |
వినుఁడు తంత్రి లేనివీణ మ్రోయదు రథాం, గములు లేనిరథము గదల లేదు
సుతులు నూర్వు రున్నఁ బతిభక్తి లేనితొ,య్యలి సుఖింపఁజాల దవనియందు.
| 845
|
క. |
జననీజనకులు దనయులు, ననుజులు మితసుఖము నిత్తు రంతియె విభుఁ డిం
దును నం దమితసుఖదుఁ డగు, ననిశంబే సాధ్వి గొల్వ దాతని భక్తిన్.
| 846
|
క. |
శ్రుతధర్మపరావరసం, చితపాతివ్రత్యధర్మశీల నయిననే
మతి నొండుతెఱఁగుఁ దలఁతునె, పతియె సతుల కేడుగడయు బాలింపంగన్.
| 847
|
రాముఁడు కౌసల్య నూరార్చుట
వ. |
అని పలికిన హృదయంగమంబు లగుకోడలిపలుకులు విని శుద్ధగుణాఢ్య యగు
కౌసల్య గనుంగొనల దుఃఖహర్షసంభూతంబు లగుబాష్పకణంబులు నించుచు
సపత్నీమధ్యంబున నుండె నప్పుడు కల్యాణగుణాభిరాముం డగురాముండు
నిజజననికిం బ్రదక్షిణంబుఁ జేసి కృతాంజలిపుటుండై యి ట్లనియె.
| 848
|
క. |
జననీ శోకింపకు మా, జనకునిఁ గనుఁగొనుము సత్యసంధుఁడు కరుణా
వనధి సుగుణుఁ డీ మహనీ, యుని నఱమఱ లేక ప్రోచుచుండుము భక్తిన్.
| 849
|
క. |
వినుము చతుర్దశవర్షము, లనఁగఁ జతుర్ధశదినంబులట్ల గడపి చ
య్యన వత్తు నంత దడ వీ, వనుమానము దక్కి యుండు మధికప్రీతిన్.
| 850
|
వ. |
మఱియు నేకరాత్రంబునందు నిద్రవోయెడు నీకుఁ జతుర్దశఘటిక లెట్లు చను
నట్లు చతుర్దశవత్సరంబులు తృటిమాత్రంబుగాఁ జను నందాఁకఁ గనుంగవ
మూసికొని దుఃఖంబు గణింప కుండు మని సవినయంబుగాఁ బలికి క్రమ్మఱఁ
బ్రదక్షిణంబు చేసి పరమదుఃఖాక్రాంతలై తన్ను విలోకించుచున్నతక్కినతల్లు
ల నందఱ నిరీక్షించి యేను సంవాసంబువలన నొక్కింతపరుషం బాడినను
నజ్ఞానంబువలన నొక్కింతయపరాధంబుఁ గావించిన నది యంతయు సంస్మ
రింపక కృపఁ జేసి యనుజ్ఞ యొసంగుదురు గాక యని పలికిన ధర్మయుక్తం
బును సమీచీనార్థసమన్వితంబు నైనరామునివచనంబు విని శోకోపహత
చిత్త లగుచు నక్కుమారుని బహుప్రకారంబులం బ్రస్తుతించుచుఁ గైకేయి
నిందించుచు బహువిధాలాపంబుల విలపించుచుండి రప్పుడు తదీయాక్రందిత
నినాదంబు క్రౌంచీనిస్వనంబుభంగిఁ జెలంగె మున్ను మురజపణవమేఘ
ఘోషసహితం బై విలసిల్లు నమ్మందిరం బప్పుడు పరిదేవనాకులం బై
వ్యసనగతం బై సుదుఃఖితం బై యుండె నంత రాముండును లక్ష్మణుం
|
|
|
డును సీతయును బాదగ్రహణపూర్వకంబుగా దశరథునకుం బ్రణామంబుఁ
జేసి కృతాంజలిపుటు లై తల్లిదండ్రులకు శుశ్రూష యొనర్పక వనంబునకుం
జనవలసెఁ గదా యనువిచారంబున దీనవదను లై ప్రదక్షిణంబుఁ జేసి
యనుజ్ఞఁ గొని పదంపడి మాతృదుఃఖసందర్శనంబువలన శోకసమ్మూఢుం డై
రాముండు సీతాసహితంబుగాఁ గౌసల్యకుం బ్రదక్షిణంబును బ్రణామంబునుం
గావించి తోడనె సుమిత్రచరణంబులకుం బ్రణమిల్లె లక్ష్మణుండును రాము
నియట్ల కౌసల్యకుం బ్రణామంబు లాచరించి నిజజనని యగుసుమిత్రచర
ణంబులు శిరంబు సోఁకఁ బ్రణమిల్లె నప్పు డద్దేవి దుఃఖించుచు నిజనందనుం
డగులక్ష్మణునిశిరంబు మూర్కొని ప్రేమాతిశయంబున ని ట్లనియె.
| 851
|
మ. |
క్షితి నెవ్వాఁ డెడఁబాయ కెప్పుడును రక్తిన్ జ్యేష్ఠు సేవించువాఁ
డతులశ్రేయము నొందుఁ గావున సముద్యత్ప్రీతితో నీవు న
ద్భుతచారిత్రకుఁడైన రామునిఁ బదాంభోజాతసంసేవనా
రతిచే నెప్పుడుఁ గాచుచుండుము మహారణ్యంబునం బుత్రకా.
| 852
|
వ. |
పుత్రా నీవు సుహృజ్జనంబునందుఁ బరమానురక్తుండ వైనను వనవాసంబు
కొఱకు నాచేత విసృష్టుండ వైతివి రామసేవయం దనవధానంబు గావింపకు
మతండు రాజ్యాభావంబున వ్యసని యైనను రాజ్యప్రాప్తిచేత సమృద్ధుం
డైనను నీకుఁ బరమగతి యై యుండు నెవ్వండు జ్యేష్ఠవశగతుం డై వర్తించు
నతనికిఁ బరమశ్రేయంబు ప్రాప్తం బగు నిక్ష్వాకుకులంబునం బుట్టినవారికి
దానంబును యజ్ఞంబులయందు దీక్షయు జ్యేష్టానువర్తనంబును రణంబుల
యందుఁ దనుత్యాగంబును బితృవాక్యకరణంబును సనాతనధర్మంబు గావున
రాముని సేవించుచు వనంబునకుం జను మని పలికి వనవాసంబునందుఁ బితృ
మాతృనగరస్మరణంబున మనశ్చాంచల్యంబు గలుగునో యని శంకించి తత్ప
రిహారంబుకొఱకు వెండియు ని ట్లనియె.
| 853
|
తే. |
తనయశేఖర రాముని దశరథునిఁగ, గహ్వరీపుత్రికను నన్నుఁ గాఁగ దండ
కాటవి నయోధ్యఁగా హృదయమున నెఱిఁగి, భూరిసుఖలీల నడివికిఁ బోయి రమ్ము.
| 854
|
తే. |
రాజనందన దశరథు రామునిఁగను, నన్ను జనకాత్మజను గాఁగ నయముతో న
యోధ్య నటవిఁగాఁ దలఁచుచు యుక్తభంగిఁ, నన్నతోఁ గూడి చనుము ఘోరాటవులకు.
| 856
|
తే. |
దశరథకుమార రాము మాధవునిఁ గాఁగ, జనకపుత్రిని క్షీరాబ్ధితనయఁ గాఁగ
భూరిగహనంబు వైకుంఠపురము గాఁగ, నెఱిఁగి సుఖలీల వనమున కరుగు మీవు.
| 857
|
వ. |
మఱియు సపరిచారకాపరిచారకు లగుగురువులయం దెవ్వం డనువర్తించు
టకుం దగియెడువాఁ డనియు నైహికసుఖరాజ్యభోగపారలౌకికజ్యేష్ఠాను
వర్తనధర్మములయం దెయ్యది గరీయంబనియు విచారించుచు నరణ్యంబునకుం
బోయి రమ్మని పలికి దీవించి సముచితప్రకారంబున వీడుకొల్పె నప్పుడు
సుమంత్రుండు వినీతుండును వినయజ్ఞుండును బ్రాంజలియునై మాతలి యింద్రు
నిం బోలె రామభద్రు నవలోకించి మహాత్మా నీ కిష్టం బైనచోటికి కొని
పోయెద నీరథం బారోహింపుము కైకేయి వనంబున కిప్పుడే చను మని పలికెఁ
గావున నద్దేవిచేత నియోగింపఁబడిన చతుర్దశవర్షపరిమితవనవాసవ్రతంబు
నారంభించుట కిదియె మొద లని పలికె నప్పుడు రామునిచేత ననుఙ్ఞ గొని
సీతాదేవి సూర్యసంకాశం బైనకాంచనరథం బెక్కె నాసమయంబున.
| 858
|
సీతారామలక్ష్మణులు రథారూఢులై తరలుట
క. |
వనవాసమునకు వేడుకఁ, దనవిభునిం గూడి యరుగఁ దలఁచిన ధాత్రీ
తనయకుఁ గృపచే దశరథ, మనుజపతి యొసంగె వస్త్రమణిభూషణముల్.
| 859
|
వ. |
అంత రామలక్ష్మణులు దివ్యాయుధపరిష్కృతంబులును దివ్యఖడ్గకవచసమన్వి
తంబును జామీకరవిభూషితంబు నగునమ్మహారథం బారోహించి రిట్లు
మువ్వురు సముచితప్రకారంబున రథారోహణంబుఁ జేసినం జూచి సుమం
త్రుండు యుగ్యంబులపగ్గంబులు వదలి యతిత్వరితగమనంబునం దోలిన నది
మిన్నునం జనుభానునిరథంబుతెఱంగున దుర్నిరీక్షం బై పోవుచుండె నప్పుడు
రామునివనప్రయాణంబుఁ జూచి పురంబునం గలబాలవృద్ధజనంబులును
గజాశ్వాదికంబులును నుత్సవార్థం బరుగుదెంచిన జానపదులును మూర్ఛా
క్రాంతు లై హాహాకారంబుల విలపించిన నయ్యాక్రందనస్వనంబును హయ
శింజితనిర్ఘోషంబును గుపితమత్తద్విపబృంహితంబులును బురంబు నిండి చెలంగె
నప్పుడు పౌరులు బాలవృద్ధసహితంబుగా దుఃఖపీడితు లగుచు రథంబు వెను
కొని బాష్పపూర్ణవదను లై యఱ్ఱు లెత్తి సుమంత్రు నుద్దేశించి యి ట్లనిరి.
| 860
|
తే. |
విమలచారిత్ర హరులపగ్గములు పట్టి, మందగతిఁ దోలు మయ్య యీస్యందనమ్ము
రామచంద్రుని మోము నేత్రములకఱవు, దీఱఁ గని సంతసంబు నొందెదము గాని.
| 861
|
తే. |
దేవగర్భసమానుఁడు ధీరవరుఁడు, రాజసమ్మతుఁ డైనయీరాముఁ డడవి
కేగఁ గనుఁగొని కౌసల్యహృదయ మగల, దాయసాకృతి గాఁబోలు నకట తలఁప.
| 863
|
క. |
ఈయవనికన్య రాముని, ఛాయపగిది ననుసరించి సమరసబుద్ధిం
బాయక కొల్చుచు వనవా, సాయాసము నోర్చి ధన్య యయ్యెడుఁ జుమ్మీ.
| 864
|
క. |
ప్రియవాది యైనరాముని, నయ మొప్పఁగఁ గొల్చి లక్ష్మణకుమారుఁడు దా
భయదాటవికిం బోవ హృ, దయమునఁ దలపోయుకతన ధన్యుం డయ్యెన్.
| 865
|
ఆ. |
రాజపూజ్యుఁ డైనరామభద్రుని భక్తి, ననుసరించి ఘోరవనికిఁ బోవు
టదియ పరమసిద్ధి యదియ మహోదయం, బదియ స్వర్గమార్గ మదియ హితము.
| 866
|
వ. |
అని పెక్కుచందంబుల దీనస్వరంబున విలపించుచుఁ గన్నీరు నించుచు రాముని
రథంబు వెనుకొని చనుచుండి రిట దశరథుండు భార్యాసహితుం డై శోకావే
శంబున రామునిం జూడఁ జనియెద నని మందిరంబు వెడల గమకించి యగ్ర
భాగంబునఁ బురుషకుంజరంబు నిరుద్ధం బగుచుండఁ గరేణువులు దుఃఖించిన
తెఱంగున రోదనంబు సేయునంతఃపురస్త్రీలమహాధ్వని విని ఖన్నుండై రాహు
గ్రస్తుం డైనచంద్రునిచందంబున నొప్పి యుండె నంత రఘుపుంగవుండు
రథంబు రయంబునం దోలుమని యాజ్ఞాపించిన సుమంత్రుం డట్ల కావింప రథ
చక్రక్షుణ్ణసముద్భూతమహీపరాగపటలంబు నీరంధ్రంబుగఁ గప్పినఁ బౌరజన
లోచనగళద్బాష్పధారాసారంబున నది యడంగినఁ బదంపడి సకలజనంబులు
దుఃఖపీడితు లై హాహాకారంబులతోడ విలపించి రప్పుడు మీనసంక్షోభ
చలితంబు లగుపంకజంబులవలనం దొరఁగుసలిలంబునుం బోలెఁ గామినీ
నయనంబులవలన నాయాససంభవం బగుబాష్పజలంబు సాంద్రంబుగాఁ గురిసె
నంత మహీనాథుం డేకచిత్తగతం బైనపురంబు నాలోకించి దుఃఖాతిశయం
బున ఛిన్నమూలం బైనపాదపంబుమాడ్కి ధరణిపయిం బడియె నప్పుడు పౌర
జనంబులు భృశదుఃఖితుం డైనదశరథు నవలోకించి రామునిరథంబు వెనుకొని
యుచ్ఛైర్నాదంబున హాహాకారంబులు సేయుచుం జనుచుండిరి యంతఃపుర
కాంతలు రామలక్ష్మణజానకీకౌసల్యలం బేర్కొని యొక్కపెట్ట నార్తనాదంబున
రోదనంబుఁ గావించి రమ్మహాధ్వని విని రాముండు మరలి చూచి విషణ్ణుం డైన
జనకుని భ్రాంతచిత్త యైనజనయిత్రి నవలోకించి తదీయదుఃఖాతిశయంబు
సహించంజాలక తోత్రార్దితం బైనమహాద్వీపంబుచందంబున సంతప్తచిత్తుం
డై పాశబద్ధం బైనబాలాశ్వంబుపోలికఁ దల్లి నుద్దేశించి ధర్మపాశబద్ధుం డై
సంకుచితదర్శనవ్యాపారుం డయ్యె నప్పుడు సుమంత్రుండు రామప్రచోదితుం డై
రథంబు రయంబునం దోలిన నవ్వేగిరపాటునకుఁ దలంకుచు సీతారామలక్ష్మ
ణులం బేర్కొని దుఃఖించుచుఁ గన్నీరు నించుచుఁ గౌసల్య పుత్రవత్సల యగుటం
జేసి రామవియోగంబు సహింపంజాలక గృహబద్ధవత్స యైనగోవు గృహంబు
|
|
|
నకుం బోవుపగిది దుఃఖపరిత్రస్త యై రామునిరథంబు దెసకుం బాఱె నట్లు గృ
హంబు నిర్గమించి రోదనంబు సేయుచు వాతాందోళితవనలతభంగి నడలుచు
వచ్చుచున్ననమ్మహాదేవి నచ్చటివా రడ్డంబు వచ్చి మరల్చిన మరలం జాలక విల
పించుచుండె నయ్యవస్థ విలోకించి రాముండు పరమదుఃఖితుండై మరలి మరలి
చూచుచుం బోవుచుండె నప్పుడు నిలు నిలు మని పలుకు దశరథునివాక్యంబును
రథంబు రయంబునం దోలు మనియెడురామువాక్యంబును విని సుమంత్రుండు
యెద్దియుం జేయనేరక చక్రమధ్యంబునం జిక్కినపురుషునిచందంబున దశ
రథరామవచనమధ్యంబునం జిక్కి యాందోళించుచున్నం జూచి రాముండు.
| 867
|
రాముండు సుమంత్రుని రథమును వేగముగఁ దోలు మనుట
క. |
బరువడిఁ దనమదిలో నిష్ఠురగతి ననుభూయమానశోకంబునకుం
జిరకాలావస్థానము, కర మిది దుస్సహ మటంచు గణుతించి తగన్.
| 868
|
ఆ. |
ఏను మాటి మాటి కిటు నిల్వు మనఁగ నామాట వినక వోప మంచిదగునె
యనుచు రాజు నిన్ను నాడిన రాముండు, వినఁగ నొల్లఁ డయ్యె నని వచింపు.
| 870
|
మ. |
ధరణీశుం డెడఁబాయలేక మనలన్ దాక్షిణ్యవిస్ఫూర్తిచే
మరలం జీరుచు నున్నవాఁడు మనకు న్మర్యాద గా దట్టిసేఁ
త రథంబు న్వెసఁ బోవ ని మ్మనిన నాతం డట్ల కావింపఁ ద
త్తురగవ్రాతము వాయులీలఁ జనియెన్ ధూళిప్రతిచ్ఛన్న మై.
| 871
|
వ. |
ఇ ట్లతిత్వరితగమనంబునం బోవుచుఁ దన్నుం గూడి వనంబునకుం బఱతెంచెద
మని ప్రార్థించుచు వచ్చువారి సామంతబాంధవమంత్రిసంఘంబుల నంతః
పురజనంబుల నుపజీవిసహస్రంబుల భృత్యులఁ బౌరజానపదజనంబుల నిలువ
నియమించిన వారందఱు బాష్పధారాపూరితముఖు లై యతనిశాసనంబు
నుల్లంఘింపం జాలక నంత నంత నిలువంబడియుఁ జిత్తవృత్తులం గ్రమ్మఱింపం
జాలక రథమార్గసక్తవీక్షణు లై యుండిరి పౌరజనంబు మరలక వెంటం బోవు
చుండె నప్పుడు పుత్రవియోగసంజాతశోకంబునం బెటలిపడుచున్నదశరథు
నవలోకించి శాస్త్రార్థకథనంబున ననూనయించుచు మంత్రిపుంగవు లి ట్లనిరి.
| 872
|
క. |
జననాథ యేమి వగచెదు, తనయుఁడు దూరంబు చనియెఁ దడయక మరల
న్జనుదెంచినపుత్త్రునిఁ గని, మనమున నలరుదువు గాక మననం బేలా.
| 873
|
వ. |
మఱియు నెవ్వనిపునరాగమనం బిచ్ఛయింపంబడు నతని దూరం బను
గమింపఁ జన దని యాశ్వాసించిన విని యప్పుడమిఱేఁడు ప్రస్విన్నగాత్రుం డై
విషణ్ణముఖుం డై చేయునది లేక కన్నీరు నించుచు రామరథమార్గగత
వీక్షణుం డై యుండె నంత నంతఃపురకాంతలు పరమచింతాక్రాంతస్వాంతలై
యార్తనాదంబులు సెలంగఁ దమలో ని ట్లనిరి.
| 874
|
అంతఃపురస్త్రీలు రామవివాసనంబునుం గూర్చి విలపించుట
క. |
ది క్కెవ్వఁడు దుర్బలులకు, ది క్కెవ్వఁ డనాథులకు నధీరజనులకుం
ది క్కెవ్వఁ డట్టినాథుం, డొక్కట నేఁ డెందుఁ బోవుచున్నాఁ డకటా.
| 875
|
క. |
ఎంత యభిశప్తుఁ డైనను, బంతంబునఁ గ్రోధకరణపరివర్జితుఁ డై
సంతత మనుగ్రహమె మది, నెంతయుఁ జింతించు నాథుఁ డెం దరిగెడినో.
| 876
|
తే. |
ఏమహాత్ముఁడు తనతల్లి నెట్లు కొలుచు, న ట్లనారత మధికభక్త్యాదరముల
మనల సేవించు నట్టిక్షమాసుతాధి,వల్లభుం డెందుఁ జనుచున్నవాఁడు నేఁడు.
| 877
|
తే. |
మఱియుఁ గైకేయిచేఁ గ్లిశ్యమానుఁ డైన, యవనిపతిచేఁ బ్రచోదితుం డగుచు నెవ్వఁ
డఖలజనులకు రక్షకుం డట్టిరాముఁ, డుగ్రకాననమున కేగుచున్నవాఁడు.
| 878
|
తే. |
అకట దుఃఖాభిసంతప్తుఁ డయ్యు రాజు, సత్యధర్మవిచారుండు సర్వసముఁడు
సూరినుతుఁ డైనరాముఁడు ఘోరవనికి, నొంటిఁ బోవఁ గనుంగొనుచున్నవాఁడు.
| 879
|
వ. |
అని బహుప్రకారంబుల వివత్స లగుధేనువులచందంబున విలపించుచు రోదనం
బుఁ జేసిన ఘోరం బైననయ్యారధ్వని విని పుత్రశోకాభిసంతప్తుం డైన
మహీవరుం డినుమడిగా దుఃఖించుచుండె నప్పుడు పట్టణంబునం గలగృహమే
ధు లగువిప్రు లగ్నిహోత్రకృత్యంబులు నన్నపానాదికృత్యంబులు మఱచి ఱిచ్చ
వడి యుండిరి రామశోకకర్శితుం డైనవాఁడుపోలె సూర్యుం డస్తమించినట్లుండె
మృగాశ్వకుంజరధేనుకదంబంబులు కబళంబులకుం బాసి కన్నీరు నించుచు
వత్సంబులం గైకొనకుండె నంగారకుండును ద్రిశంకుండును బుధబృహస్పతు
లును దక్కినగ్రహంబు లన్నియు వక్రగతిచేత సోము నాక్రమించి దారుణంబు
లయి యుండె విశాఖాప్రభృతినక్షత్రంబులు దారుణగ్రహపీడితము లై పొగ
లుమియుచు మార్గంబునకుం దప్పి యుండె మేఘంబులు వాయుహతంబు లై
సముద్రంబునం బడుచుండె మఱియు సకలజంతుస్వాంతసంచారచతురుం డైన
రాముండు వనంబునకుం జనుచుండ నగరంబు బాలికానిలవేగంబున నుత్థితం
బైనసముద్రంబుభంగిఁ జలించిన ట్లయ్యె హరిదంతంబులు తిమిరసంవృతంబు
లై పర్యాకులంబు లయ్యెఁ బట్టణంబునంగల సర్వజనంబులు గుంపులు కట్టి కటకటా
యనువారును నింత పుట్టునె యనువారును నింక నేమి గల దనువారును దశ
రథుం డెంత కఠినాత్ముం డయ్యె ననువారును నింతకుం గారణంబు పాపాత్మ
యైనకైకేయి గదా యనువారును దైవంబునుం దిట్టువారును సతీసుతబంధు
మిత్రులయందు మమత్వంబు విడిచి గృహకృత్యంబులు దలంపక రాముని
మంగళగుణకీర్తనంబు సేయుచు నిరానందు లై కన్నీరు నించుచు బహుప్ర
కారంబుల విలపించువారు నై యుండిరి పవనుండు శీతలుం డై వీవకుండె
|
|
|
జంద్రుండు సౌమ్యదర్శనుండు గాకుండె సూర్యుండు తపింపకుండె మఱియుఁ
బౌరులు పుత్రమాతృభార్యాభర్తృభ్రాతలయొకఁ బరస్పరస్నేహంబు విడిచి
రామునే చింతించుచుండిరి రాముని సుహృదు లందఱు శోకభారాక్రాంతు
లై మూఢచేతస్కులై మూర్ఛిల్లి పుడమిపయిం బడి యుండికి నాగరసరిద్ద్విప
వనశైలసహితంబుగా మహి యెల్ల సంచలించె నప్పుడు.
| 880
|
క. |
అనఘాత్ముఁ డైనరాముఁడు, జనకజతోఁ గూడి వనికిఁ జనియెడుతఱిఁ జే
తనములు దుఃఖంచె ననం, బని లేదు జనంబు లెల్ల మ్రాన్పడి యుండెన్.
| 881
|
క. |
పొందుగ నరిగెడురాముని, స్యందనగతచక్రయుగసంజాతరజం
బెందాఁకఁ దోఁచె నురువడి, నందాక మరల్పఁ డయ్యె నధిపుఁడు చూడ్కిన్.
| 882
|
చ. |
అనఘుఁడు పుత్రదర్శనమునందు మహాప్రమదంబు గల్గు నీ
మనుకులనేత కంచు గరిమం దలపోసి మహీపరాగ మా
మనుజవరేణ్యుఁ డెం దనుక మక్కువతోడ సుతు న్గుణాకరుం
గనుఁగొనుచుండె నం దనుక గాఢతరంబుగఁ బర్వె నత్తఱిన్.
| 883
|
తే. |
రజము గనుపట్టునందాఁక రాజవర్యుఁ, డనఘునిఁ గుమారుఁ గనుఁగొని యంతకంత
కది యడంగిన భూరిశోకార్తుఁ డగుచు, మూర్ఛ పైకొన నంతలోఁ బుడమిఁ బడియె.
| 884
|
వ. |
ఇట్లు మూర్ఛాపరవశుం డై నేలం బడి యున్ననిజవల్లభునిం జూచి కౌసల్య
దాపటను గైక వలపటం గ్రుచ్చి యెత్తి యాసీనుం గావించినం గూర్చుండి
యమ్మహీపతి శోకంబు పెంపున వ్యధితేంద్రియుం డగుచుఁ గైకేయి నవలో
కించి యి ట్లనియె.
| 885
|
దశరథుఁడు కైకేయిని దూఱుట
క. |
ఓకలుషచిత్త నన్నుం, దాఁకకు నీకరము సోఁకఁ దను వంతయు న
స్తోకగతి వాఁడినూదులు, సోఁకినయ ట్లార్తి నొంది స్రుక్కెం గడిమిన్.
| 886
|
వ. |
నీవదనంబుఁ జూడ నొల్ల నాకుఁ బత్నివి గావు బాంధవివి గా వని పలికి కోపం
బగ్గలం బగుటయు నంత నిలువక.
| 887
|
క. |
సువిచారుఁ డైనరాముని, నవిచారత నడవి కనిపినందున వంశ
ఘ్నివి బంధుఘ్నివి భర్త, ఘ్నివి యైతివి నిన్నుఁ జూడ నేర్తునె యింకన్.
| 888
|
తే. |
జగ దుపక్రోశితాచారసరణి నొంది, త్యక్తకులధర్మ వైతివి దానఁ జేసి
యాలి వని నమ్మఁజనునె నీయాననంబుఁ, గన్న ద్విజుఁ జంపినంతయఘంబు రాదె.
| 889
|
చ. |
పురుషులచే ధరిత్రిపయిఁ బొల్పుగ నగ్నిసమక్షమందునం
గరము గ్రహింపఁగాఁ బడినకాంతలలోఁ బతికి న్నిరంతరం
బఱమఱు లేక ధర్మమును నర్థము కామముఁ గూడఁ బెట్టునే
ర్పరి వొక నీవె కాక కులపాంసిని వేఱొక తెందుఁ గల్గునే.
| 890
|
వ. |
తొల్లి వహ్నిసమక్షంబున ధర్మార్థకామంబులయందు నీతోడఁ జరించెద నని
|
|
|
పలికి భవత్పాణిగ్రహంబుఁ జేసితి నింక మీఁద నిహసౌఖ్యకరంబు లైన
నీతోడిక్రీడాదివ్యవహారంబులును బరలోకసాధనంబు లైన నీతోడియగ్నిహో
త్రాదికర్మంబులును బరిత్యజింపం గలవాఁడ నని పలికి వెండియు ని ట్లనియె.
| 891
|
క. |
భరతుఁడు రాజ్యస్థుం డై, చిరభక్తిని నాకుఁ బూజసేయుట కొఱకై
కర మెద్ది నొసఁగు నది నే, నరయుచు జన్మాంతరమున కయ్యెడు ననుచున్.
| 892
|
దశరథుఁడు రాముని బేర్కొని విలపించుట
వ. |
మఱియు భరతుండు సామ్రాజ్యంబుఁ జేకొని సంతుష్టుం డయ్యె నేని మన్మరణా
నంతరంబున నతండు పితృప్రీత్యర్థం బెయ్యది యొసంగు నది మత్ప్రీతికొఱకుఁ
గాకుండుం గాక యని యిట్లు కైకేయి నిందించుచు రాముని పిఱుందం
బోవ నుద్యోగించిన నప్పుడు కొనల్య పతి కడ్డంబు వచ్చి మరల్చినం బ్రతిహత
గనునుం డై కామాతిశయంబున బ్రాహ్మణుం జంపినవానియట్ల కరంబునఁ
జిచ్చు నంటినవానిక్రియఁ గుమారునిం దలంచి సంతపించుచు రాహుగ్రస్తుం
డైనభానునిచందంబున దీనవదనుం డై రథమార్గంబుఁ జూచి యెలుం గెత్తి
రామునిం జేర్కొనుచు నక్కుమారుండు పురం బతిక్రమించినం జూచి శోక
వేగంబున ని ట్లని విలపించె.
| 893
|
చ. |
అరదము దూర మయ్యె జవనాశ్వము లద్భుతవేగలీల బం
ధురగతిఁ బోవుచున్నయవి ధూళికతంబున నాకుమారకుం
డరసినఁ గాన రాఁడు తను వంతయు నేర్వఁ దొడంగె నింక నే
తెరువునఁ బోదు నెవ్వ రిఁక ది క్కకటా విధి నేమి సేయుదున్.
| 894
|
చ. |
సరసపదార్థము ల్గుడిచి సన్నపుటొల్లియఁ గట్టి దీప్తహే
మరచితసౌధభాగముల మంజులశయ్యను బవ్వళించునా
వరసుతుఁ డాకలంబుఁ దిని వల్కముఁ దాల్చి మహీజమూలమం
దురుకఠినాశ్మతల్పమున నొ ప్పఱి యెట్లు వసించు నక్కటా.
| 895
|
తే. |
ధూళివృతదేహుఁడై యొప్పు డొఱఁగి పుడమి,నుండి ప్రస్రవణంబునందుండి మదగ
జంబునట్టు లుత్థితుఁ డయి చనెడుదీర్ఘ, బాహుఁ గాంత్రు రాముని వనవాసు లెల్ల.
| 896
|
చ. |
అడవిఁ జరించునప్పుడు మృగారవము ల్వినువేళ నాఁకటన్
దడఁబడువేళఁ గంటకపథంబున నేగెడువేళ నెండచే
బడలినవేళ నాకొడుకు భావమునందు ననుం దలంచి హా
యిడుమలఁ బెట్టెఁ దండ్రి యని యించుక యైనఁ దలంప కుండునే.
| 897
|
క. |
జనకసుత యెంతఁ జెప్పిన, వినక మగనిఁ గూడి ఘోరవిపినంబునకుం
జనుచున్న దతిసుఖోచిత, మనమున దుఃఖించి యెంత మలఁగునొ యచటన్.
| 898
|
వ. |
గంభీరంబులును రోమహర్షణంబులు నగు శ్వాపదారవంబులు విని యెంత
భయ౦పడునో యని విలపించి కైకేయిదిక్కు మొగం బై యిట్లనియె.
| 899
|
చ. |
ఆకలుషచిత్తుఁ డంచితగుణాస్పదుఁ డైనసుతుండు కాననో
ర్వికిఁ జనియె న్మనంబు చెయిఁ బెట్టి గలంచినరీతిఁ జాలఁ ద్రి
ప్పుకొనఁ దొడంగెఁ బై పయిని మూర్ఛ ముసుం గిడుచున్న దిప్పు డం
బకములు గాన రావు ప్రసభంబున సంగము లార్తి నొందెడిన్.
| 900
|
దశరథుఁడు కౌసల్యాసదనమున కరుగుట
వ. |
నీవు విధవవై పతిపుత్రపరిత్యక్తం బైనరాజ్యంబు పాలింపు మని బహుప్రకా
రంబులు విలపించుచు నచ్చోట నిలువక యపన్నాతునియట్లు నగరంబుఁ బ్రవే
శించి శూన్యచత్వరవేశ్మాంతంబును సంవృతాపణదేవతాగృహంబును గ్లాంత
దుర్భలదుఃఖార్తంబును వాత్యాకీర్ణమహాపథంబు నగుపురంబుఁ గనుంగొని
దుఃఖించుచు సూతికాగృహంబునుంబోలెఁ గశ్మలంబై యున్నయంతఃపురంబు
న కరిగి క్షోభించినమహాప్రవాహంబుచందంబున సుపర్ణహృతం బైనపన్నగంబుకై
వడి రామలక్ష్మణవైదేహీరహితం బై దిక్కఱి యున్నదాని నవలోకింపనొల్లక
దౌవారికులం జూచి కౌసల్యాసదనంబునకు నన్నుం దోడ్కొని పొం డొండు
చోట నీమనఃపరితాపంబు దీఱ దనిన వారు రయంబుగ వామదక్షిణ
పార్శ్వంబుల గ్రుచ్చి పట్టి దోడ్కొని చనిన నద్దేవిమందిరంబుఁ బ్రవేశించి
తల్పంబునం దనువు వైచి యసంవృతమేదినిం బడి పొరలుచు వడ లూనిన
చిత్తంబున భుజం బెత్తి దీర్ఘస్వరంబున రోదనంబు సేయుచుఁ బెక్కువిధం
బులఁ గుమారునిగుణంబు లగ్గించుచుఁ బుత్రవియోగసంజాతశోకానలంబునం
గాఱియపడుచుండ రాత్రిసమయం బయ్యె నారాత్రి దశరథునిపాలికిఁ గాళ
రాత్రి యై తోఁచె నప్పు డన్నరపతి కౌసల్య కి ట్లనియె.
| 901
|
మ. |
అతివా రామునివెంట నంటిన మదీయాలోక మాశానుష
క్తి తదీయాకృతిపై రమించుచును దృప్తిం జెంద కీవేళకున్
ధృతిచేఁ గ్రమ్మఱ దట్లు గావున నిను న్వీక్షింపఁగాఁ జాల స
మ్మతిచే నీదుకరంబునం దనువు సంభావింపుమా యిత్తఱిన్.
| 902
|
వ. |
అని నియోగించిన నద్దేవి రామగుణకథనపరవశుం డై తన్నామంబునె
పేర్కొనుచున్నదశరథుని దురవస్థఁ జూచి బహుప్రకారంబుల నాక్రందనంబు
సేయుచుఁ గన్నీరు నించుచు వేఁడి నిట్టూర్పులు పుచ్చుచు శోకభారావసన్నుం
డైనయమ్మహీపతిశరీరంబు పాణితలంబునఁ బరిమార్జించుచు ని ట్లనియె.
| 903
|
క. |
వీరోత్తమ రామునిపైఁ, గూరిమి యించుకయు లేక గుబుసము వీడన్
ఘోరవిషము గ్రక్కెడు క్రూ, రోరగగతిఁ గైక గనలుచుండుం గాదే.
| 904
|
కౌసల్య పుత్రునిఁ బేర్కొని విలపించుట
ఆ. |
అట్టిదానిఁ గూడి యధిప నా కేగతిఁ, బూని పొత్తు మనఁగఁ బోలు నకట
క్రూరపన్నగంబు సేరిన యింటిలో, నూహఁ జేసి మనుజు లుండ వశమె.
| 905
|
తే. |
తవిలి రామునిఁ గైకకు దాసునిఁగ నొ, నర్పవైతివి యటు లైన నగరమందు
బైక్షవృత్తిఁ జరించుచు భవనమందె, యునికిఁ జేసిన వీక్షించుచుండుదుఁ గద.
| 906
|
వ. |
మఱియు నాహితాగ్ని యగువానిచేత దర్శపూర్ణమాసరూపపర్వంబునందు
వ్రీహిగతతుషజాలం బెట్లు రక్షోభాగత్వంబుచేత నిర్దిష్టం బగు నట్లు కైకచేత
రాముండు స్వరాజ్యావస్థానంబువలనను స్వగృహావస్థానంబువలనను వినిపా
తితుం డై యథేష్టంబుగా రాక్షసభాగత్వంబున వినియుక్తుం డయ్యె నని పలికి
వెండియు ని ట్లనియె.
| 907
|
క. |
గజరాజగమనుఁ డమల, ద్విజరాజముఖుండు వినుతవీర్యుండు భృత
ద్విజుఁ డగునాతనయుఁడు జన, కజతోఁ గూడి యెటు నిల్వఁగా నేర్చు వనిన్.
| 908
|
క. |
కట్టా కైకేయికిఁ గాఁ, బుట్టి యెపుడు దుఃఖములను బొందనివారిం
గట్టిఁడితనమున నిప్పుడు, నట్టడవికిఁ బంప నీకు న్యాయమె యధిపా.
| 909
|
చ. |
తరుణులు రూపవంతులు నుదంచితమూర్తులు రామలక్ష్మణు
ల్వరఫలకాలమం దిటు వివాసితు లై రటు రత్నహీను లై
బరువడిఁ గందమూలఫలభక్షకు లై యలకాననంబులోఁ
గర మతిదీనవృత్తి నిలుఁ గానక నెట్లు వసింతు రక్కటా.
| 911
|
ఉ. |
తమ్ముఁడు ప్రీతితో బహువిధంబుల సేవ యొనర్చుచుండ నం
దమ్ముగ సీతఁ గూడి ప్రమదంబున నిష్టసుఖైకశీలుఁ డై
సమ్మతితో నయోధ్యఁ గల సర్వజనంబు నుతింప నాధిప
త్య మ్మొనరించుకాలము జనాధిప యెప్పుడు చూడఁ గల్గెడిన్.
| 912
|
వ. |
అని యాసపెంపునం బలికి వెండియు.
| 913
|
ఉ. |
క్రన్నన రామలక్ష్మణు లరణ్యము వెల్వడి వీటి కింకఁ దా
రెన్నఁడు వత్తు రిష్టసుఖ మెన్నఁడు గాంతురు భానుమత్కులం
బెన్నఁడు తేజ మొందు మనుజేశ్వర మత్పృథుదుఃఖశోక మిం
కెన్నఁడు దీఱు బంధుజను లెన్నఁడు గాంతు రనంతమోదమున్.
| 914
|
క. |
పంకజదళనయనుని నక, లంకేందుసమానముఖుని రమణీయగుణా
లంకృతుని నాకుమారుని, నింక విలోకింపఁ గలదె యీజన్మమునన్.
| 915
|
క. |
వనవాసము సల్పి రయం, బునఁ దమ్ముఁడు గొల్వ సతిని ము న్నిడికొని చ
య్యన మరల వచ్చురామునిఁ, గనుఁగొను భాగ్యంబు నాకుఁ గలదో లేదో.
| 916
|
ఉ. |
పొందుగ రామలక్ష్మణులు భూమికుమారియు రాజవీథి నా
నందముతోడ రాఁ గని మనంబునఁ గోర్కులు పల్లవింపఁగాఁ
జందురుఁ గన్నయోషధులచందము నొంది పురీకులాంగన
ల్బృందముఁ గట్టి ప్రీతిమెయి నెన్నఁడు గాంతు రభీప్సితార్థముల్.
| 917
|
ఉ. |
పన్నుగ రాఘవుం డడవిఁ బాసి పురంబున కేగుదెంచి య
భ్యున్నతవైభవస్ఫురణ నుర్వికుమారికతోడ సౌఖ్యవా
కాన్నిధి నోలలాడుచుఁ దిరంబుగ రాజ్యము సేయుచుండ నా
కన్నులు చల్లగాఁ గని సుఖస్థితిఁ బ్రీతిఁ దనర్చు టెన్నడో.
| 918
|
మ. |
రమణీయోజ్జ్వలకుండలంబు లలర న్రాముండు సౌమిత్రి ఖ
డ్గము చాపంబును దాల్చి శృంగవదగాకారంబులం బొల్చుచుం
బ్రమదం బొప్పఁగ విప్రకన్యకలపుష్పంబు ల్పలంబుల్ గ్రహిం
చి మహార్థంబు ప్రదక్షిణంబుగఁ బురి న్సేవించు టిం కెన్నఁడో.
| 919
|
తే. |
ప్రాయమున శక్రతుల్యుండు ప్రజ్ఞచేతఁ, బరిణతుండు ధర్మజ్ఞుండు నిరుపమాన
తేజుఁ డగురాముఁ డెపు డరుదెంచి నాదు, మ్రోల మూఁడేండ్లబాలునిలీల నాడు.
| 920
|
సీ. |
నరనాథ తొల్లి నందనులు తల్లులపాలుఁ గ్రోలునప్పుడు తదురోజములను
గప్పితిఁ గాఁబోలుఁ గాకున్నచో లేఁతదూడ గల్గినమంచిపాఁడిమొదవు
చందాన నధికవత్సలతో నొప్పెడునేను మృగరాజుచే గోవుపగిది భూరి
కల్మషమతి యైన కైకేయిచే ముద్దుగుమరునిఁ బాసి శోకమునఁ గుందఁ
|
|
తే. |
గావలసెఁ బుత్రుఁ డొక్కఁడె కాని వేఱె, యొకఁడు లేఁ డట్టిసుగుణాభియుక్తుఁ బాసి
యెట్లు బ్రతుకుదు శోకాగ్ని యేర్చఁదొడఁగె, నేమి సేయుదు నెద్ది ది క్కెందుఁ జొత్తు.
| 921
|
తే. |
రాజవర్య నిదాఘకాలంబునందు, నుత్తమప్రభుఁడైన సూర్యుండు తిగ్మ
కరముల ధరిత్రినిం బోలె గాఢశోక, మేర్చుచున్నది యధిప న న్నెట్లు సైఁతు.
| 922
|
సుమిత్ర కౌసల్య నూఱడించుట
వ. |
అని బహుప్రకారంబుల విలపించుచున్న కౌసల్య నవలోకించి యుపశమన
వాక్యంబుల ననూనయించుచు సుమిత్ర యి ట్లనియె.
| 923
|
ఉ. |
మంచివివేకి వైతి విటు మానిని ప్రాకృతకాంతయట్ల దుః
భించెద వేల నీసుతునిఁ గేవలమర్త్యునిఁగాఁ దలంచితో
కాంచనశైలధీరుఁడు నకల్మషబుద్ధి మహానుభావుఁ డ
భ్యంచితసద్గుణాభిరతుఁ డాతని కెందును గీడు గల్గునే.
| 924
|
మ. |
అతులాముష్మికసౌఖ్య మెంచి మహాశిష్టాచారధర్మాధ్వసం
స్థితుఁ డై తుచ్ఛసుఖంబుఁ గోరక పితృస్నేహంబున న్మేదినీ
పతివాక్యం బొనరింపఁ బూని నయ మొప్పం గాన కేగె న్భవ
త్సుతుఁ డానీతివిచారుఁ బాయుటకు నై శోకింపఁగా నేటికిన్.
| 925
|
మ. |
ముదితా లక్ష్మణుఁ డన్నకుం బ్రియుఁడు నాప్తుం డై తగన్ భక్తిఁ ద
త్పదపద్మంబులు గొల్చుచున్ ఫలము లుద్యత్ప్రీతి నర్పించుచున్
ముద మేపార నహర్నిశంబు శరియై మున్నాడి రక్షించుచుం
డ దవక్షోణి నివాస మాతనికి సంతాపంబుఁ గావించునే.
| 926
|
క. |
పతిసేవ సేయుతలఁపున, క్షితిసుత ధర్మాత్ముఁ డైనశ్రీరామునిస
మ్మతితో వెనుకొని విపిన, క్షితికిం జనుచున్న దేల చింతింపంగన్.
| 927
|
తే. |
తామరసనేత్ర సత్యంబు దమము శమము, నార్జనము శీలశౌచంబు లతనియందె
సన్నివిష్టంబు లై యుండుజగములందుఁ, బరగఁ గీర్తిధ్వజంబును బాదుకొలిపె.
| 928
|
చ. |
అతని ప్రతాప మున్నతమహత్త్వము శౌచ మెఱింగి కానన
క్షితి నహిమాంశుఁ డంశువులచేతఁ దపింపఁగఁజేయఁజాలఁ డం
చితగతి గాడ్పు రేఁబవలు చిత్తహరంబుగ వీచుచుండు స
మ్మతి జలజారి రాత్రుల సమద్యుతి వెన్నెల గాయు నిత్యమున్.
| 929
|
మ. |
అనిలోఁ గూలిన శంబరాత్మజుని దైత్యశ్రేష్ఠు నీక్షించి చ
య్యన నెవ్వానికి భారతీప్రియుఁడు దివ్యాస్త్రంబు లర్పించె న
య్యనఘుం డాఢ్యుఁడు రాఘవుండు నిజబాహాశౌర్యమే తోడుగా
వనదేశంబున నింటనున్నపగిదిన్ వర్తించు నిర్భీకుఁ డై.
| 930
|
క. |
భువి నెవ్వని శరపథముం, గవిసి పగతు లంతకాంతికస్థు లగుదు రా
రవికులపతిశాసనమం, దవని యెటులు నిల్వఁ బోల దంభోజాక్షీ.
| 931
|
తే. |
వనిత యెవ్వానిశౌర్య మవార్య మేవి, ధూతకల్మషుతేజంబు దుర్నిరీక్ష
మారఘుస్వామి వనవాస మర్థి సలిపి, యవలఁ గైకొను సామ్రాజ్య మది నిజంబు.
| 932
|
చ. |
ఇనున కినుండు నీశ్వరున కీశ్వరుఁ డగ్నికి నగ్ని కీర్తికి
న్ఘన మగుకీర్తి గహ్వరికి గహ్వరి లక్ష్మికి లక్ష్మి పెద్దవే
ల్పున కిలువేల్పు భూతములలో ఘనభూతము నీకుమారుఁ డ
య్యినకులనేతకున్ విముతు లెవ్వరు రాష్ట్రమునం బురంబునన్.
| 933
|
చ. |
వెలుపుగ లక్ష్మి త న్నధిగమింప మహీసుతఁ గూడి రాఘవుం
డిల కభిషిక్తుఁడై జనుల కేలిక గాఁ గలఁ డేల సందియం
బలికచ పౌరజానపదు లాతని కభ్యుదయంబుఁ గోరి ని
శ్చలమతి సర్వదేవతల సన్నుతి సేయుచు నున్నవా రొగిన్.
| 934
|
చ. |
అనుపమశోకవేగహతులై పురిలోఁ గలవార లెవ్వనిం
గనుఁగొని యశ్రుబిందువులు గాఱఁగ నేడ్చుచు నున్నవార లా
యనఘుఁడు లక్ష్మితోడ జనకాత్మజతోడ ధరిత్రితోడ సొం
పెనయఁగఁ గూడి రాజ్యమున కేలిక గాఁగలఁ డెన్ని చూడఁగన్.
| 935
|
తే. |
అంబురుహనేత్ర వల్కల మద్ది దాల్చి, వనమునకుఁ బోవు రామభద్రునిపిఱుంద
జనకసుతిమాడ్కి, విడువక చనియె రాజ్య, లక్ష్మి యాతని కెద్ది దుర్లభము చెపుమ.
| 936
|
తే. |
చాపశరఖడ్గములఁ బూని శస్త్రభృద్వ, రుండు లక్ష్మణుఁ డుగ్రవీర్యుండు మ్రోల
|
|
|
నప్రమాదుఁ డై ప్రోచుచు నరుగుచుండ, రామభద్రుని కెద్ది దుర్లభము చెపుమ.
| 937
|
క. |
వనవాసము సల్పి రయం, బునఁ గ్రమ్మఱ నరుగుదెంచి పొలుపుగఁ జరణం
బునకుఁ బ్రణమిల్లురామునిఁ గనుఁగొని మది సంతసించుకాలము వచ్చున్.
| 938
|
క. |
రమణీ మాదృశలను శో, కమున బడలకుండఁ దేర్పఁ గాఁ దగు నీ వీ
క్రమమున శోకింపఁగ నిను, హిమకరముఖ దేర్చువార లెవ్వా రిచటన్.
| 939
|
క. |
తరుణీ రామునికంటెను, బరుఁ డొక్కఁడు లేఁడు ధర్మపరుఁడు జగతిలో
నరుదార రాఘవునియం, దరసిన లే దించు కైన నశుభం బబలా.
| 940
|
వ. |
మహానుభావుం డగురాముండు లక్ష్మణసహితుం డై యరణ్యంబున నుండి
గ్రమ్మఱఁ బురంబునకుం జనుదెంచి సామ్రాజ్యపట్టాభిషిక్తుం డై జానకిం
గూడి రోహిణీయుక్తుం డైనచంద్రునిభంగి వెలుంగుచు మృదుపీనంబు లగు
కరంబులచేత భవచ్చరణంబులు సంస్పృశింపం జనుదెంచు నప్పు డీవు మేఘ
రాజి శిలోచ్ఛయంబునుం బోలెఁ బరమానందసంభూతబాష్పజలంబులచేత
నక్కుమారశేఖరునిం బ్రోక్షించెదవు సత్యంబుగాఁ బలికితి శోకమో
హంబులు విడిచి యూఱడిల్లు మని యిట్లు సుమిత్రాదేవి పూర్వజన్మకృతభగవ
దారాధనజనితసుకృతపరిపాకంబున శ్రీరామునిం బరమాత్మఁగా నెఱింగి
వివిధవినయసాంత్వవాక్యోపచారంబుల ననేకప్రకారంబుల నాశ్వాసించిన
నాసుమిత్రాదేవివాక్యం బాలకించి శరద్గతం బగునల్పతోయమేఘంబుభంగి
నరదేవపత్ని యగునక్కౌసల్యాదేవిశరీరంబునందలి శోకంబు వినాశంబు
నొందె నంత నిక్కడ.
| 941
|
చ. |
జనకుని మిత్రవర్గమును సర్వవిధంబుల వీడు కొల్పి కా
ననమున కేగురాముని జనప్రియుఁ బాయఁగ లేక రక్తు లై
పనివడి పౌరజానపదవర్గము బల్విడి నమ్మహాత్ముని
న్వెనుకొని యెంతఁ జెప్పినను వీడక వోవుచు నుండి రత్తఱిన్.
| 942
|
తే. |
సముదితుం డైనపూర్ణిమాచంద్రుమాడ్కి, రామభద్రుండు సాకేతరాజధాని
పౌరు లగువారి కెల్ల నుదారసద్గు, ణాబ్ధి గావున సత్ప్రియుండై తనర్చె.
| 943
|
రాముఁడు పౌరుల నూఱడించుట
క. |
వనికిం జనవల దని చ, య్యన రాముఁడు వారిచేత యాచితుఁ డయ్యున్
జనకుని సత్యాత్మునిఁ గా, నొనరింపఁగఁ బూని నిలువ కొయ్యనఁ జనియెన్.
| 944
|
వ. |
ఇవ్విధంబునం బోవుచు నారఘువంశశేఖరుండు వారి నందఱఁ గరుణాతరం
గితాపాంగవీక్షణంబుల నిరీక్షించి స్నేహయుక్తంబు లగుమంజులవాక్యం
బుల నిజపుత్రులం బోలె ననునయించుచు ని ట్లనియె.
| 945
|
తే. |
చెలఁగి మీరలు నాయందు సలుపునట్టి, భక్తిబహుమానగౌరవరక్తులను వి
శేషముగ భరతునిమీఁదఁ జేర్పుఁ డింక, మామనంబున కదియె సమ్మద మొసంగు.
| 946
|
చ. |
అతఁ డపరాజితుండును మహాత్ముఁడు గీర్తిరథుం డమర్షి ప్రా
జ్ఞతముఁడు పిన్నవాఁ డయిన జ్ఞానముచేఁ గడుఁబెద్ద సాధుస
మ్మితుఁ డగుఁ గాన నింకఁ దగ మీ కనురూపకుఁ డైననాథుఁ డై
తతమతిచేఁ బ్రియంబును హితంబును జేయుచు నుండు నిచ్చటన్.
| 947
|
క. |
జనకునిపనుపున భరతుఁడు, ఘనరాజ్యపదస్థుఁ డయ్యెఁ గావున మన మ
య్యనఘునియానతిఁ గైకొని, యనిశము వర్తింపవలయు నతిశయబుద్ధిన్.
| 948
|
వ. |
కావున మీకు మత్ప్రీతికొఱకు నతం డెట్లు పరితపింపకుండు న ట్లనూనయిం
చుచు నతనియాజ్ఞ నుల్లంఘింపక మదాగమనంబుఁ గోరుచుఁ దద్వశవర్తు లై
యుండుం డని పలికిన నప్పు డప్పురజనంబులు రామభద్రుం డెట్లు పితృవచన
పరిపాలనరూపధర్మంబునందు సంస్థితుఁ డయ్యె నట్లు తదాధిపత్యంబుఁ గోరు
చు నమ్మహాత్ము నుద్దేశించి విలపించుచుఁ గన్నీరు నించుచుండి రప్పు డారా
ముందు సౌమిత్రిసహితుం డై బాష్పవిహితలోచను లైనపురజనంబుల రజ్జు
వులచేతం బోలె స్వగుణంబులచేత నాకర్షించుచు నతిత్వరితగమనంబునం బో
వుచుండ నప్పుడు వయోజ్ఞానతపోవృద్ధు లైనవిప్రులు వయఃప్రకంపితమస్తకు
లై మిక్కిలి వృద్ధు లగుటవలన సమీపధావనాశక్తిచేత దవ్వులం జూచి రాము
నికృపావిశేషం బుగ్గడించుటకుఁ దదీయరథకీలితహయంబుల నుద్దేశించి యి
ట్లనిరి.
| 949
|
ఉ. |
రామరథప్రకీర్ణహయరాజములార సమీరసన్నిభో
ద్దామరయంబునం జనక దాశరథి న్వెసఁ గ్రమ్మఱింపుఁ డ
ట్లేమని బ్రాహ్మణోత్తమముఖేరితసూక్తిఁ దిరస్కరించినం
దా మదిలో సహింపఁ డతిధార్మికుఁ డౌట రఘూద్వహుం డొగిన్.
| 950
|
తే. |
అవనిలోఁ గర్ణవంతంబు లైనభూత, సంఘములయందు మిక్కిలిశ్లాఘనీయు
లట్లు గావున మీరు దయాసమృద్ధి, మా మనవి బుద్ధిఁ గైకొని మరలుఁ డిపుడు.
| 951
|
చ. |
రవికులసార్వభౌమునిఁ బరాక్రమశీలుని రామునిం బురో
పవనవిహార మర్థి సలుపం గొనిపోవుట మాని మీరు భై
రవతరసింహముఖ్యమృగరాజివిరాజత మైనదండకా
టవి కిటు సాహసంబునఁ గడంగి వెసం గొనిపోవఁ జెల్లునే.
| 952
|
విప్రులందఱు రాముని వనమునకుఁ బోవలదని ప్రార్థించుట
వ. |
అని యిట్లు విలపించుచున్నయావిప్రవరులదీనాలాపంబు లాలకించి రాముండు
బ్రాహ్మణవాక్యశ్రవణానంతరంబున రథగమనంబునందు దోషం బగు నని
యును బ్రాహ్మణాశ్వాసనంబున వ్రతభంగం బగుననియును దలంచి రథంబు
డిగ్గి తదాగమనపర్యంతంబు సన్నికృష్టపదన్యాసుం డై చారిత్రవత్సలుండు
గావున బ్రాహ్మణులయం దతివిశ్వాసంబువలనఁ దాను రథారూఢుండై యుండి
|
|
|
పదాతు లయినవారలఁ గ్రమ్మఱింప నుచితంబు గా దని నిశ్చయించి పాద
సంచారంబున వనపరాయణుం డై మెల్లనం బోవుచుండె నప్పు డారఘుపుంగ
వుని డాయం జని యావృద్ధవిప్రులు సంతప్తాంతఃకరణు లై యి ట్లనిరి.
| 953
|
సీ. |
అనఘాత్మ నీమంగళాకృతిఁ జూడక యొకనిమిషం బైన నోర్వలేమిఁ
జేసి నీమృదువాగ్విశేషంబుచే బహూకృతుల మై వనభూమి నతిసుఖాబ్ధి
నలరుచు నుండెద మనునాసపెంపున వచ్చుమ మ్మిటఁ ద్రోచి పుచ్చి నీకుఁ
బోవంగఁ జెల్లునె భూతదయాళుండ వైననీవె దయాహీనబుద్ధి
|
|
తే. |
ద్విజవరోపేక్షఁ జేసిన వేఱె యొకఁడు, కడఁగి రక్షింపఁగలవాఁడు గలఁడె జగతి
నకట యీచంద మైన ని న్నధికధర్మ, నిష్ఠుఁ డని సూరిజను లాడనేర్తు రెట్లు.
| 954
|
వ. |
మఱియు బ్రహ్మసంబంధిసకలమంత్రతంత్రజ్ఞానోపయోగానుస్థానరూపంబు లైన
యస్మదీయకర్మంబులును బాత్రారణిద్వారంబున ద్విజస్కంధాధిరూఢంబు
లైనగార్హపత్యాహవనీయదాక్షిణాగ్నులును గౌతుకాతిరేకంబున ననుసరించి
వచ్చుచున్నయవి వాజపేయసముస్థితంబు లైనయస్మదీయపాండురచ్ఛత్రంబులు
శరన్మేఘంబులభంగి వెలుంగుచు నివియే వెనుకొని యరుగుదెంచుచున్న
వీయాతపత్రంబులచేత ననవాప్తచ్ఛత్రుండ వైన నీకు రవికిరణంబుల వేఁడిమి
సోఁకకుండ నీడఁ గావించెదము వేదమంత్రానుసారిణి యగు నస్మత్పరమథన
భూతంబు లైననస్మద్బుద్ధి భవన్నిమిత్తంబు వనవాసానుసారిణిగా నొనర్పంబడి
యె వేదంబులు మాహృదయంబులయంద యున్నవి పాతివ్రత్యరక్షిత లగు
నస్మత్పత్నులు గృహంబులయంద నిలువంగలరు భవన్నివర్తనంబునం దస్మద్భు
ద్ధి సునిశ్చిత యయ్యె నింక నీవు వనగమననిశ్చయంబు సేయం జనదు ధర్మపరా
యణుండ వైననీవ బ్రాహ్మణప్రార్థనాచరణరూపధర్మనిరపేక్షకుండ వగుచుండ
నింక ధర్మం బెత్తెఱంగునం బ్రవర్తిల్లు నిభృతాచారుండ వైననీవు హంస
శుక్లశిరోరుహంబులును మహీపతనరజోవ్యాప్తంబులు నగుమాశిరంబులచే
యాచితుండ వై మరలు మని పలికి వెండియు ని ట్లనిరి.
| 955
|
చ. |
రవికులవర్య రమ్ము నగరంబునకుం జనుదేరవేని భూ
దివిజులు త్వద్వియోగజవితీర్ణమహావ్యసనాభిపన్ను లై
తవిలి ద్విజార్హయాగము లుదంచితభక్తి నొనర్ప రందున
న్సవనవిఘాతదోష మది సంగత మయ్యెడు నీకుఁ జూడఁగన్.
| 956
|
క. |
వినుము చరాచరభూతము, లనఘాత్మక భక్తియుతము లై దైన్యమున
న్నినుఁ బ్రార్థించుచు నున్నవి, సునిశితముగ భక్తులందుఁ జూపుము కరుణన్.
| 957
|
రాముండు తమసాతీరంబుఁ జేరుట
వ. |
మఱియు నఖిలజనహృదయనయనానందకరుండ వైననిన్ను విడువం జాలక
నీవెంటం జనుదెంచుచున్నయస్మదాదిపురజనుల భాగ్యంబు నాలోకించి తాము
|
|
|
ను వెనువెంటం బోవ గమకించి మూలంబులచేత హతగమనవేగంబులై పురజను
లకుంబోలెఁ దమకు రామానుయానభాగ్యంబు లేదయ్యె నని చింతించి వాయు
వేగంబుచేత నాక్రోశించుచున్నవానియట్ల చూపట్టుచున్న మహోన్నతంబు లైన
పాదపంబులను నాహారసంచారంబులు మాని చేష్టలు దక్కి వృక్షైకస్థాననిష్ఠి
తంబులై సర్వభూతానుకంపి వైననిన్నుఁ బ్రార్థించుచున్నఖగంబులను విలోకిం
పుమని యిట్లు బహుప్రకారంబుల దుఃఖించుచున్న యావిప్రోత్తములదీనాలాపం
బు లాలించి కల్యాణగుణాభిరాముం డైనరాముని నివారించుట కడ్డంబు
వచ్చెనో యనం దమసానది యాసన్నం బయ్యె నప్పుడు సుమంత్రుండు మార్గ
పరిశ్రాంతంబు లైనహయంబులఁ దెచ్చి యమ్మహానదీజలంబులఁ గడిగి మృదుమ
ధురఘాసంబు మేపి తద్రక్షణంబునకుం జాలియుండె నిట్లు రమ్యం బగుతమసా
తీరంబు నాశ్రయించి రాముండు సీత నవలోకించి లక్ష్మణున కి ట్లనియె.
| 958
|
క. |
అనఘ రవి యస్తమించెను, వనవాసంబునకు నొక్కవాసర మయ్యెన్
మునుపటివలె నీవు మనం, బున గృహసౌఖ్యాదివాంఛఁ బొందకు మింకన్.
| 959
|
క. |
పగ లెల్ల నడవిఁ గ్రుమ్మరి, ఖగమృగములు తమకు వలయు కందువలందుం
దగురీతిఁ జేరినందున, సుగుణాఢ్య వనములు గంటె శూన్యము లయ్యెన్.
| 960
|
క. |
విను మిప్పు డయోధ్యాపుర, జను లందఱు బాలవృద్ధసహితంబుగ నె
మ్మనమున నడలుచు నుండుదు, రనఘా మనరాకఁ దలఁచి యంధులభంగిన్.
| 961
|
క. |
అనుపమసద్గుణములచే, ననవరతము విషయవాసు లవనీపతికిన్
మనకు భరతశత్రుఘ్నుల, కనురక్తులు గారె వారి కడలు జనించెన్.
| 962
|
క. |
జననీజనకులు సారెకు, వనగమనముఁ దలఁచి తలఁచి వారక మదిలో
ఘనశోకంబునఁ గుందుదు, రనఘాత్మ తదార్తి కాత్మ నడలెదఁ జుమ్మీ.
| 963
|
ఆ. |
అయిన నేమి భరతుఁ డఖలధర్మవిదుండు, కరుణ జేసి యేల గావ కుండు
నతనిభక్తిభావ మరసి డెందంబునఁ, గుందకున్నవాఁడఁ గొంతధృతిని.
| 964
|
వ. |
మఱియు న న్ననుసరించి వనంబునకుం జనుదెంచుటం జేసి నీ వుచితం బాచరించి
తివి వైదేహీరక్షణార్థంబునందు సహాయత సంపాదనీయంబు గదా నేఁడు
వనవాసోపక్రమదివసం బీతమసాతీరంబు మహాక్షేత్రంబు గావున నీరాత్రి
జలపానంబుఁ జేసి యిచ్చట నుపవాసంబు సేయుద మని పలికి సుమంత్రుం
జూచి నీ వశ్వరక్షణంబునం దప్రమత్తుండ వై యుండు మని నియమించిన
నతం డయ్యశ్వంబుల బంధించి సమృద్ధఘాసవంతంబులఁ గావించి ప్రత్యాస
న్నుండై సంధ్య నుపాసించి మంజుపల్లవంబులఁ దల్పంబుఁ గావించిన నారఘు
వరుండు కృతానుష్ఠానుం డై సీతాసహితంబుగా సుమంత్రవిరచితపల్లవ
తల్పంబు నధివసించెఁ బురజనంబులు మార్గాయాసఖేదంబున మై మఱచి
నిద్రించుచుండి రంత లక్ష్మణుం డన్నదిక్కుఁ గనుంగొని సూతునితో ననేక
|
|
|
ప్రకారంబులఁ దదీయకల్యాణగుణవిశేషంబులు వక్కాణించుచు నిద్రాసుఖం
బులు విడిచి జాగరూకత్వంబున నప్రమత్తుం డై రక్షించుచుండె నిట్లు గోకులా
కులతీరయైనతమసానదితీరంబున నారాత్రి వసియించి యరుణోదయకాలంబున
రాముండు మేల్కని నిద్రించుచున్న ప్రకృతిజనంబుల నవలోకించి పుణ్యలక్ష
ణుం డైనలక్ష్మణున కి ట్లనియె.
| 965
|
క. |
అనఘా చూచితే యీపుర, జను లెంతయు మనల విడువఁజాలక వనికిం
జనుదెంచెద మని కుతుకం, బునఁ బడి యున్నారు వృక్షమూలములందున్.
| 966
|
క. |
ఉడుగుఁ డని యెంతఁ జెప్పిన, నుడుగరు వల దనుచు నింక నొత్తి పలికినం
గడువడిఁ దమప్రాణంబులు, విడిచెద మని యున్నవారు వెఱ్ఱితనమునన్.
| 967
|
ఆ. |
వీ రెఱింగి రేని విడువక మనవెంట, నరుగుదెంతు రదియు భరము గానం
గడఁగి నిద్ర లేచుకంటె ముంగల మన, మరద మెక్కి పోద మతిరయమున.
| 968
|
రాముఁడు నిద్రితు లగుపౌరుల వంచించి వనమున కరుగుట
వ. |
మఱియు నీ యిక్ష్వాకుపురవాసులు నాయం దనురక్తు లై నన్ను విడువంజాలక
వృక్షమూలంబుల నాశ్రయించి నిద్రించుచున్నవారు గావున వీరల వంచించి
చను టొప్పు వీ రరణ్యంబునందు సంచరించుచు నిడుమలఁ గుడువం జాల రని
పలికిన సాక్షాద్ధర్మస్వరూపం డైనరామునిం జూచి లక్ష్మణుండు దేవా యిదియే
నాకుం జూడ యుక్తం బై తోఁచుచున్న దట్లు గావింపు మనిన నారాముండు
సుమంత్రుం జూచి రథంబు రయంబున నాయితంబు గావింపు మనవుడు నతండు
జవసత్వసంపన్నంబు లైనహయంబులం బూన్చి సజ్జంబుఁ జేసి తెచ్చిన నారఘు
పుంగవుండు సీతాలక్ష్మణసహితంబుగా రథారోహణంబుఁ జేసి యమ్మహానది
నుత్తరించి మహామార్గంబు నాశ్రయించి శీఘ్రంబునం బోవుచుఁ బురజనమో
హనార్థంబు సుమంత్రు నవలోకించి మనపోయినతెఱంగు పౌరు లెఱుంగకుండు
విధంబున నీవు కొంతదూరంబు రథం బయోధ్యాపురంబున కభిముఖంబుగాఁ
దోలి గ్రమ్మఱ వనమార్గంబునకు మరల్పు మనిన నతం డట్ల కావించి క్రమ్మఱ
రథంబుఁ దోలుకొని రామునికడకుం జనుదెంచిన నమ్మహాత్ముండు సీతాలక్ష్మణ
సహితంబుగా సపరిచ్ఛదం బైనరథం బెక్కిన నాసుమంత్రుండు తపోవనమా
ర్గంబుఁ బట్టి హయంబుల రయంబునం దోలిన నవి వాయుజవంబునం బోవు
చుండె నిట్లు రాముండు జానకీలక్ష్మణసహితంబుగా రథారోహణంబుఁ జేసి
ప్రయాణానుకూలమంగళసూచకనిమిత్తదర్శనార్థం బొక్కింత రథం బుదఙ్ము
ఖంబు గావించి నిమిత్తస్వీకారానంతరంబున దక్షిణాభిముఖంబుగా వనమా
ర్గంబుఁ బట్టి చనియె నంతఁ దమసాతీరంబున నిద్రించి యున్న పౌరజనంబులు
ప్రభాతకాలంబున మేల్కాంచి రామునిం గానక దిక్కులు గలయం దిలకిం
చుచు శోకోపహతచిత్తు లై కొండొకసేపు చేష్టలు దక్కి యుండి వెండియు
|
|
|
నొక్కింత తెలివిఁ దాల్చి కన్నీరు నించుచు విషాదవేదనావిశేషంబునఁ దమలో
నిట్లని విలపించిరి.
| 969
|
పౌరులు నిద్ర లేచి రామునిం గానక విలపించుట
ఉ. |
అక్కట రాముఁడు న్మనల నారట పెట్టి దయావిహీనుఁడై
చిక్కక త్రోచి పోయె దరి చేరఁగ రానివిపత్పయోధి నిం
కెక్కడ నీఁదువార మిఁక నెవ్వఁడు రక్షకుఁ డేది దిక్కు నేఁ
డెక్కడ వచ్చె నీనిదుర యెంతటి మోసము వచ్చె నిత్తఱిన్.
| 970
|
ఉ. |
నిర్మలచిత్తుఁ డంచితసునీతివిదుండు దయాపయోధి స
ద్ధర్మవిశారదుం డభయదాయకుఁ డీశ్వరుఁ డంచుఁ జిత్తమం
దర్మిలి నమ్మి యున్నమము నక్కట యిక్కడ నొంటి డించి యే
ధర్మ మటంచుఁ బోయె నిల ధార్మికు లీగతి విన్న మెత్తురే.
| 971
|
ఉ. |
రాముని భానుమత్కులలలాముని గోమలనీలనీరద
శ్యామునిఁ బాసి మేన నికఁ బ్రాణము నిల్పఁగ నేల చిచ్చులో
వేమఱుఁ జొచ్చి యైన నడవి న్విషపాన మొనర్చి యైన నిం
కేమి యొనర్చి యైన మన మిచ్చటఁ జత్తము నిక్కువంబుగన్.
| 972
|
క. |
జాలిం బడి తనసుతులం, బోలె మనల నేఘనుండు భూరికరుణచేఁ
బాలించు నట్టిరాముఁడు, వాలాయము మనల విడిచి వనమున కరిగెన్.
| 973
|
క. |
ఏలాగు బ్రతుకుదము మన, మేలీలఁ జరింత మెచటి కేగుద మకటా
బాళిం దల్లులఁ బాసిన, బాలులగతి నయ్యె నేఁడు పరికింపంగన్.
| 974
|
తే. |
రామభద్రుండు లేనిపురంబు శూన్య, గృహముగతి నుండు దాని నేరీతిఁ జూత
మచటివారలు రాముఁ డెం దరిగె ననిన, నేమి చెప్పుద మిఁకఁ దెఱఁ గెద్ది మనకు.
| 975
|
వ. |
అని బహుప్రకారంబుల భుజం బెత్తి రోదనంబు సేయుచు రామరహితం బైన
పురంబు సౌర నొల్లక రథం బరిగినచొప్పునఁ గొంతద వ్వరిగి మార్గనాశం
బగుట విషాదంబు నొందుచుఁ జేయునది లేక మరలి పురమార్గంబుఁ బట్టి
వివత్స లయినమొదవులచందంబున విలపించుచు దైవోపహతుల మైతి మింక
నేమి సేయువార మని చింతించుచు నరిగి చంద్రహీనం బైనగగనంబుపోలికఁ
దోయహీనం బైనసముద్రంబుభంగి గరుడునిచేత నుద్ధృతపన్నగం బైన
హ్రదంబుపోలిక నిరానందం బైనయయోధ్యాపురంబు సొచ్చి దాని శోభా
హైన్యంబునకు శోకించుచుఁ గన్నీరు నించుచు విప్రణష్టప్రమోదు లై పుత్ర
దారగృహక్షేత్రాదులయందు మమత్వంబు మాని యమూల్యంబు లైనస్వగృ
హంబులు ప్రవేశించియు దుఃఖసహితం బైనస్వజనంబు నిరీక్షించి దుఃఖోప
హతు లై స్వపరవేశ్మస్వజనాన్యజనవివేకంబు లేక కొండొకసేపున కతిప్రయ
త్నంబునం దమవారి నెఱింగి వారలం గూర్చికొని వారికి రాముండు వంచించి
|
|
|
యరిగిన చందం బంతయు వినిపించి బాష్పపిహితముఖు లై కన్నీరు మున్నీరు
గా రోదనంబు సేయుచుండి రప్పుడు విషణ్ణరూపులును శోకపీడితులును
బాష్పవిప్లుతలోచనులును దుఃఖోపహతచిత్తులును రామపరిత్యక్తులు నగునప్పుర
వాసులప్రాణంబు లుద్గతంబు లయిన ట్లుండె వణిజు లంతర్బాహ్యసంతోషంబు
లు విడిచి బేహారంబులు సేయు టుడిగి ఱిచ్చవడి యుండిరి గృహస్థులు మజ్జన
పానభోజనశయనాగ్నిహోత్రాదికంబు విడిచి ధనలాభవ్యయంబు లెఱుంగక
యేమియుం దోఁచకుండిరి చాతుర్వర్ణ్యంబులవారును దమకు నియతంబు
లైనధర్మంబులకుం దప్పి చరించుచుండిరి ప్రథమజు లగుపుత్రులం బొంది తల్లులు
హర్షింపక పరమదుఃఖాక్రాంత లై యుండిరి యిట్లు గృహంబులకుం జను
దెంచినభర్తలం గూడి పౌరకాంతలు దుఃఖార్త లై తోత్రంబులచేత ద్విపంబు
లంబోలెఁ దీక్ష్ణవాక్యంబులచేత గృహపతుల గర్హించుచు ని ట్లనిరి.
| 976
|
పౌరకాంతలు భర్తలతోడ నానాప్రకారంబుల విలపించుట
చ. |
కరుణ దలిర్ప లోకములఁ గావ నరాకృతిఁ బుట్టినట్టియా
హరి యగురామభద్రుని మహామహు నెచ్చట నున్న సంభృతా
దరమునఁ జూడ కింట సుతదారలపై రమియించుచుండు న
ప్పురుషులు కల్మషాత్ము లయి పోదురు దుర్గతికి న్నిజంబుగన్.
| 977
|
క. |
పరమాత్ముఁ డైనరామునిఁ, బరికింపఁగ లేని నీతిబాహ్యుల కిల మం
దిరసుతభార్యాభోగో, త్కరసుఖములచేత నేమి కార్యము దలఁపన్.
| 978
|
చ. |
రయమునఁ గాననంబునకు రాముని వెన్కొని పోయినట్టిదు
ర్ణయయుతుఁడుం బవిత్రుఁ డయి నవ్యశుభం బడి గాంచు నన్నచోఁ
బ్రియుఁ డగురామునిం బరిచరించుచుఁ గానకు నేగినట్టిసీ
తయు నలలక్ష్మణుండు సుకృతం బది గాంతు రనంగఁ జిత్రమే.
| 979
|
క. |
రామునివెంట వనంబున, కామెయిఁ జనినట్టితమ్ముఁ డతఁ డొక్కఁడె పో
ధీమంతుఁడు సత్పురుషుఁడు, శ్రీమంతుం డన్యజనులఁ జెప్పఁగ నేలా.
| 980
|
క. |
సదమలచరితుఁడు రాముఁడు, పదపడి మజ్జన మొనర్చి పానము సేయ
న్మదిఁ దలఁచునట్టికొలఁకులు, నదులు తటాకములు గడుఘనంబులు గావే.
| 981
|
క. |
కడురమ్యకాననము లగు, నడవు లనూపములు సరసు లద్రులు నదము
ల్బడబడ రఘుకులశేఖరు, నుడుగక శోభింపఁజేయుచుండుం బ్రీతిన్.
| 982
|
వ. |
మఱియు వనంబులం గలవిచిత్రకుసుమాపీడంబు లగునగంబులు రామునిం
బరమాత్మగా నెఱింగి స్వనిష్ఠభ్రమరఝంకారమంత్రోచ్చారణపూర్వకంబుగా
స్వశాఖాకరధృతమంజరీరూపపుష్పాంజలులచేత నమ్మహాత్ము ననుదినంబును
బూజించుచుండుఁ బర్వతంబులు సమాగతుం డైనరాముని జూచి యను
క్రోశంబువలన నకాలంబునందును స్వనిష్ఠవృక్షద్వారంబున ముఖ్యంబులయిన
|
|
|
ఫలపుష్పంబు లొసంగుచు బహుధాతుమండితంబు లైననిర్ఝరంబులవలన
విమలతోయంబుల నొసంగుచు నిత్యంబును సేవించుచుండుఁ బాదపంబులు
స్వమూలావకీర్యమాణకుసుమపల్లవవిరచితశయ్యాతలంబులం దధివసించిన
రాముని రమింపఁజేయుచుండు మఱియు నెందెందు వసియించు నవి యెల్లఁ
బ్రియాతిథిం బోలె రామభద్రుని సత్కరించుచు నుండు నమ్మహాత్ముం డెచ్చట
వసియించు నచ్చట నించుక యైన భయంబును బరాభవంబును లేకుండు
మహాశూరుండు మహాబాహుండు మహాతేజుం డాపుణ్యాత్ముండు సర్వభూతం
బులకు బరమగతియుఁ బరమపరాయణుండును గావున నమ్మహానుభావుని
పాదసేవ మాకుఁ బరమసుఖసాధనభూత యై యుండు మన మిప్పుడు వనం
బునకుం జని మీరు రాముని సేవించుచుండుఁ డేము సీతను సేవించు
చుండెద మరణ్యంబునందు మీకు రాముండును మాకు సీతయు నిత్యంబును
యోగక్షేమంబు సేయు చుండుదు రట్టిపరమస్థానంబున నుండక దుఃఖశోకం
బుల బడలుచు నిరానందుల మై యమనోజ్ఞంబును నప్రశస్తంబును సోత్కం
ఠితజనంబును జిత్తనాశకంబు నైనపురంబున నెట్లుండుద మదియునుం గాక.
| 984
|
తే. |
అకట కైకేయి దయ్యె రాజ్యం బధర్మ, కలితమై నాథవంతంబు గాక యుండు
నిచట మనకు వసింపంగ నెట్లు వచ్చు, ధనము జీవిత మది యేల తనయు లేల.
| 985
|
ఆ. |
రాజ్యకారణమున రమణునిఁ దనయుని, విడిచె నట్టిదుర్వివేక యైన
కైక యింక నూరఁ గలవారి నెవ్వారి, విడువకుండు దాని విడువవలదె.
| 986
|
క. |
జీవించి యున్న కేకయ, భూవరసుతమ్రోల భృత్యభూతల మగుచున్
జీవించి యుండఁజాలము, జీవితములు సాక్షి గాఁగఁ జెప్పెద మింకన్.
| 987
|
తే. |
పరఁగ నెవ్వతె కృప మాలి పార్థివేంద్ర, తనయు రామునిఁ గానకుఁ బనిచె నట్టి
లోకవిద్విష్టమతి యైనకైకమ్రోల, నెగులు దక్కి యెవ్వా రెట్లు నిలువఁగలరు.
| 988
|
ఉ. |
రాముఁడు కానకుం జనియె రాజవరేణ్యుఁడు శోకకర్శితుం
డై మని యుండఁజాలఁ డతఁ డంతము నొందినవెన్క నీపురం
బీమహి యీసమస్తజనబృంద మనాయక మై యుపద్రుతం
బై మితి లేనిదుఃఖమున నట్టె వినాశము నొందు నెంతయున్.
| 989
|
తే. |
మీరు పత్నియుతంబుగ ఘోరవిషము, నర్థిఁ గ్రోలియు మృతి నైన నధిగమింపుఁ
డట్లు గా దేని సుగుణాఢ్యుఁ డైనరాముఁ, డర్థి వసియించువనమున కైనఁ బొండు.
| 990
|
తే. |
అకట మిథ్యావివాసితుం డయ్యె రాముఁ, దూర భరతునిముంగల యుంటఁ జేసి
యుర్విఁ బశుమారకునిమ్రోల నున్నపశువు, లట్ల నిశ్చితమరణుల మైతిమి గద.
| 991
|
శా. |
రాజీవాక్షుఁడు గూఢజత్రుఁడు మహోరస్కుండు లోకప్రియుం
|
|
|
డాజానుస్థిరబాహుఁ డంచితఘనశ్యాముండునుం బూర్ణిమా
రాజాస్యుండు ముహారథుండు ఘనుఁ డారాముండు నానావనీ
రాజి న్శోభిలఁ జేయుచుండు నెపుడు న్రంగత్తనూరోచులన్.
| 991
|
తే. |
మఱియుఁ బూర్వాభిభాషియు మధురభాషి, యైనరాముండు శశిభంగి నడవియందు
సమదదంతియానంబున సంచరింపఁ, గని విపినవాసులు ముదంబుఁ గాంతురు కద.
| 992
|
వ. |
అని యిట్లు నాగరస్త్రీలు బహుప్ర కారంబులు భోజనమజ్జనశయనాదు లుడిగి
నానావిధదీనాలాపంబుల విలపించుచు మృత్యుభయాగమంబునందుం బోలె
నాక్రందనంబు సేయుచుండఁ దదీయదుఃఖంబు సహింపలేనివాఁడు పోలె
సూర్యుం డస్తమించెఁ బదంపడి రాత్రి ప్రవర్తించె నప్పుడు సాకేతనగరంబు
గాఢసంతమసపరిపూర్ణం బై నష్టజ్వలనసంపాతం బై ప్రశాంతాధ్యయనపుణ్య
కథేతిహాసం బై శూన్యవిపణిమార్గం బై ప్రణష్టహర్షం బై నిరాశ్రయం బై నష్ట
నక్షత్రగ్రహం బైనయంతరిక్షంబు ననుకరించె మఱియు సప్పురస్త్రీలు వినయ
వివేకప్రియంబులచేతఁ దమసుతులకంటె నధికుం డైనరామునిం దలంచి భ్రాతృ
పుత్రసహితంబుగా రోదనంబు సేయుచుండిరి ప్రశాంతనృత్యోత్సవగీతవాద్యం
బై నిరానందం బై యపగతపణ్యవస్తుప్రసారణం బై యయోధ్యానగరంబు
సంక్షుభితోదకం బైనమహార్ణవంబుభంగి నయ్యె నిట రాముండు తమసాతీరం
బునఁ బురజనుల విడిచి నాఁటిరాత్రి వేఁగునంతకుం జని సూర్యోదయసమ
యంబున నాహ్నికకృత్యంబులు దీర్చి పితృవాక్యపరిపాలనక్షముం డై దూ
రంబు చనిచని కోసలదేశాంతంబు డాసి వికృష్టసీమాంతంబు లగుగ్రామం
బులును బుష్పితకాననంబులును విలోకించుచు సీతాలక్ష్మణసహితుం డై పోవు
చుండ నప్పు డచ్చటి గ్రామోపగ్రామనివాసు లగుజనంబులు రామునివన
ప్రయాణంబుఁ జూచి తమలో ని ట్లనిరి.
| 993
|
వనంబునకుఁ బోవురామునిఁ జూచి గ్రామనివాసులు దుఃఖించుట
సీ. |
అక్కట దశరథుఁ డాలిమాటకుఁ బ్రియపుత్రు నేగతి వనంబునకుఁ బనిచెఁ
దనవంశధర్మంబు దప్పి కైకేయి మగనికి దుర్నయ మెట్లు గఱపె నీతఁ
డసమానబాహుబలాఢ్యుఁ డయ్యును దాని హితమతిఁ దా నెట్లు నీయకొనియె
సతిసుఖోచితముగ్ధ యబల మహాసుకుమారి యీధరణీకుమారి యెట్లు
|
|
తే. |
భయదవనమున నిడుములు వడఁ దలంచె, నెంతయాపద వాటిల్లె నిపుడు వీరి
కేమి సేయంగఁ గలవార మీశ్వరాజ్ఞ, మీఱి నడువంగఁ దరమె యెవ్వారికైన.
| 994
|
క. |
అని యీగతిఁ గోసలవిష, యనివాసులు దుఃఖతప్తులై విలపింప
న్ఘనుఁ డారఘుపతి వారల, యనూనదీనోక్తి వినుచు నటు చని మ్రోలన్.
| 995
|
క. |
సాదరమునఁ బరిమళశీ, తోదకపరిపూర్ణ మగుచు నొప్పెడిదాని
న్వేదశ్రుతి యనువరనది, నాదశరథసుతుఁడు దాఁటి యవ్వలఁ జనుచున్.
| 996
|
క. |
విమలోదక యై కమనీ, యమరాళరుతాభియుక్త యై గోకులయు
క్తమనోజ్ఞానూపక యై, యమరెడుగోమతిని దాఁటి యరుగుచు నవలన్.
| 997
|
క. |
నవరాజీవోత్పలకై, రవగతమకరందలుబ్ధరమ్యభ్రమరీ
రవనాదిత యై యొప్పెడు, నవజల యగుస్యందికాఖ్యనదిని దరించెన్.
| 998
|
వ. |
ఇ ట్లమ్మహానది నుత్తరించి తొల్లి యిక్ష్వాకునకు మను వొసంగినట్టి స్యందికాఖ్య
నదీమర్యాదం బైనదాని నవాంతరజనపదావృత మగుదానిఁ గోసలదేశవిశేషం
బు వైదేహికిం జూపుచు నతిత్వరితగమనంబునం బోవుచు సుమంత్రు నవలోకిం
చి మత్తహంసస్వరంబున ని ట్లనియె.
| 999
|
చ. |
కడఁగి చతుర్దశాబ్దములు కాననవాస మొనర్చి క్రమ్మఱం
దడయక నేగుదెంచి తలిదండ్రులు కామితము ల్ఘటింపఁగా
నుడుగక రేపుమాపు సరయూతటపుష్పితకాననంబునం
దడరినకౌతుకంబు చెలువారఁగ నెన్నఁడు వేఁట సల్ఫెదన్.
| 1000
|
రాముఁడు జనపదనివాసు లగుజనుల నూఱడించుట
వ. |
వేఁట శిష్టాచారం బగునే యని యంటి వేని.
| 1001
|
సీ. |
అనఘాత్మ యీలోకమందు రాజర్షుల కడవిలో వేఁట క్రీడార్థ మగుట
నవసరం బెఱిఁగి సదాచారపరులచే మానక స్వీకృతం బైనదానిఁ
జలవేధనార్థంబు శరచాపధరులచే ననిశ మాకాంక్షితం బైనదాని
సరయూనదీతీరసంజాతవనములో నించుక వేఁటఁ గావించువాఁడ
|
|
తే. |
నరయ రాజుల కీరీతి యవనిలోన, నతుల మై సమ్మతం బయి యలరుచుండు
ననుచు నీభంగి రాఘవుఁ డమృతమధుర, భాషణంబులఁ బలుకుచుఁ బ్రాభవమున.
| 1002
|
వ. |
శీఘ్రంబున నగస్త్యదిశాభిముఖుం డై పోవుచు విశాలంబు లగుపురంబు లర
ణ్యంబులు గ్రామంబులు విలోకించుచుఁ గోసలదేశాంతంబుఁ జేరి యయోధ్యా
భిముఖుం డై యారబ్ధవ్రతనిర్విఘ్నపరిసమాప్త్యర్థంబు నిర్గమనసమయంబున
శిష్టాచారప్రాప్తపురదేవతానమస్కారంబునకు సంకటంబుచేత నవకాశంబు
లేమిం జేసి యమ్మహాపురివలన ననుజ్ఞఁ గొనువాఁడై కేలుదోయి ఫాలంబునం
జేర్చి యి ట్లనియె.
| 1003
|
ఉ. |
ఓపురరాజమా సురపురోపమధామమ నీకు నిత్యముం
గాపుగ నున్నదైవతనికాయముతోఁ దగ నాన తిమ్ము మా
కీవనిఁ దీర్చి క్రమ్మఱ నహీనగతిం జనుదెంచి యవ్వలం
జూపులవిందు గాఁగ నినుఁ జూచెద మింత యనుగ్రహింపవే.
| 1004
|
వ. |
అని పలికి భక్తిపూర్వకంబుగా నమస్కరించి పదంపడి దర్శనార్థం బరుగు
|
|
|
దెంచి దుఃఖించుచున్నజానపదుల నవలోకించి వారల దుఃఖనివారణంబు
కొఱకుఁ దానును బాష్పపూర్ణముఖుండై దక్షిణభుజం బెత్తి యి ట్లనియె.
| 1005
|
సీ. |
అనఘాత్ములార యథార్హంబుగాఁ దొల్లి నాయందు మీచే నొనర్పఁబడిన
యట్టియనుక్రోశ మనుకంపయును గడుఁ బాపీయ మై దోఁచెఁ బరఁగ మీకు
బహుకాలదుఃఖానుభవముకొఱకు నిది చేకూడె నే నేమి సేయువాడ
నిపుడు మీపదముల కేగుఁ డే మర్థసంసిద్ధికై కాననసీమ కర్థిఁ
|
|
తే. |
బోయివచ్చెద మని యిట్లు పొసఁగ రామ, చంద్రుఁ డవతరణప్రయోజనము రావ
ణాసురవధార్థ మని యక్షరార్థ మెఱుక, పడ వచించినవారు సంభ్రాంతు లగుచు.
| 10066
|
ఆ. |
రమ్యమూర్తి యైన రామున కభివాద, నము ప్రదక్షిణం బొనర్చి బాష్ప
పూర్ణవదను లగుచుఁ బోవ లే కందంద, నిలిచి చూచుచుండి రలఘుమతులు.
| 1007
|
వ. |
ఇట్లు రామచంద్రముఖచంద్రామృతంబు నేత్రచకోరంబులం గ్రోలుచుఁ దనివి
నొందక తదీయగుణంబులచేత నాకర్షింపఁబడినమనంబును గ్రమ్మఱింపంజాల
క విలపించుచున్నవారల కారఘువల్లభుండు సాయంకాలంబునందు సూర్యుం
డునుం బోలె నగోచరుం డై చతుర్విషయం బతిక్రమించి నిజదేహప్రభాపట
లంబుల నద్దేశంబు వెలింగించుచుం జని ధనధాన్యోపేతంబులును దానశీలజనా
కీర్ణంబులును శుభకరంబులును భయరహితంబులును రమ్యంబులును దేవతా
యతనయాగీయపశుబంధనస్తంభసంకులంబులును నుద్యానామ్రవణోపేతంబు
లును సంపన్నసలిలాశయంబులును హృష్టపుష్టజనాకీర్ణంబులును గోపగోకు
లసేవితంబులును నరేంద్రులకు రక్షణీయంబులును వేదఘోషాభినాదితంబులు
ను నగుకోసలదేశస్థగ్రామంబు లన్నియు నతిక్రమించి ముందట.
| 1008
|
రాముఁడు గంగానదిఁ జేర నరుగుట
మ. |
కనియె న్రాఘవుఁ డభ్రమార్గవిలసత్కల్లోలమాలామిళ
ద్ఘనహంసచ్ఛదజాతవాతనిపతత్స్వర్వృక్షసూనాళిచే
ననిమేషుల్ త్రిజగత్పవిత్రమహిమవ్యాప్తి న్వితర్కించి గొ
బ్బునఁ బుష్పంబులఁ బూజఁ జేసి రనఁగాఁ బొల్పొందుగంగానదిన్.
| 1009
|
వ. |
మఱియు దేవదానవగంధర్వకిన్నరోరగసేవిత యగుదాని విమలపుళినవిహర
మాణవిద్యాధరసుందరీసుందరకబరీసమర్పితనూతనపారిజాతకుసుమ
స్వాదనమత్తమధుకరఝంకారసంకుల యగుదాని నిరంతరహోమధూమ
పటలఘనీభూతపుణ్యాశ్రమాభిరామరమణీయతీర యగుదాని జలక్రీడాకుతూ
హలసమాగతవిహరమాణదివ్యాప్సరోగణజలాశయ యగుదాని నంత
ర్లీనదేవోద్యానదేవక్రీడాపర్వతశతాకీర్ణ యగుదాని దేవభోగ్యపద్మిని యగు
దాని దేవప్రయోజనార్థం బాకాశంబున కుద్గమించినదాని దేవసంఘాప్లుత
సలిల యగుదాని సముల్లసితపద్మోత్పలకైరవషండమండలాంతర్గత
|
|
|
మాణమత్తమరాళచక్రవాకసారసక్రౌంచరుతాభియుత యగుదాని స్మరణ
మాత్రంబున సకలకల్మషహరణస్వభావ యగుదాని దర్శనమాత్రంబున
సమస్తమంగళప్రదశీల యగుదానిఁ ద్రిలోకవిఖ్యాత యగుదాని సకలలోక
పావని యగుదాని జలఘాతాట్టహాసోగ్ర యై మణినిర్మలదర్శన యై యాభోగ
పులిననితంబ యై డిండీరఖండనిర్మలహాస యై శైవాలకేశ యై నానాపుష్ప
పరాగపటలపటావృత యై వివిధకుసుమాలంకృత యై భూషణోత్తమభూషిత యై
నయువతిభంగి నలరుదాని దిశాగజవనగజదేవోపవాహ్యగజముహుర్ముహు
స్సన్నాదితాంతర యగుదాని శింశుమారచక్రభుజంగనిషేవిత యగుదాని
ఫలపుష్పకిసలయద్విజగుల్మలతాశతపరివృత యగుదాని నిష్పాప యగుదాని
విష్ణుపాదాంగుష్ఠనఖనిష్ఠ్యూత యగుదాని శంకరజటాభ్రష్ట యగుదాని సము
ద్రమహిషి యగుదాని మఱియును.
| 1010
|
సీ. |
తిలకింప నొకచోట స్తిమితగంభీరత్వ మొకచోట వేగజలోత్కరంబు
నొకచోట వేణీకృతోదకం బొకచోట రమణీయపులినాభిరంజితంబు
భీషణగంభీరభూషణం బొకచోట నూర్మికాసందోహ మొక్కచోట
సముదంచితావర్తసముదయం బొకచోట నొకచోట ఘనవాలుకోత్కరంబు
|
|
తే. |
నొక్కచోటఁ గౌరవపంకజోత్పలంబు, లుభయతీరజతరుజాల మొక్కచోటఁ
గలిగి యద్భుతవైఖరిఁ గ్రాలుదానిఁ, గలితరంగత్తరంగను గంగఁ గనియె.
| 1011
|
వ. |
ఇట్లు జాహ్నవి నవలోకించి రాముండు దనచరణంబుపగిదిఁ బద్మరేఖాలంకృత
యై తనహృదయంబుకరణి నిష్పంక యై తనదానగుణంబుకైవడి బహుజీవన
యై తనవనప్రయాణంబుభంగి వసుమతీజాతాభిరామ యై యలరుట కానందిం
చుచుఁ దత్తీరంబున శృంగిబేరపురం బనునిషాదపట్టణంబుఁ గని తత్సమీపం
బునకుం జని సుమంత్రు నవలోకించి యి ట్లనియె.
| 1012
|
ఉ. |
నూతనపుష్పపల్లవమనోహర మై మన కాశ్రయార్హ మై
యీతటినీతటంబుపయి నెంతయు నొప్పెడి నింగుదీమహీ
జూతము చూచితే యిచట సమ్మతి నేఁడు వసించి యాపగా
జాతకళావిశేషములు సర్వముఁ జూతము గాక సారథీ.
| 1013
|
మ. |
అనిన న్సూతుఁడు లక్ష్మణానుమతి నచ్చోటికిం దేరుఁ దో
లిన రాముండు రథంబు డిగ్గి యట నోలిన్ సీతయుం దమ్ముఁ డొ
య్యన సేవింపఁగ వృక్షమూలమున నధ్యాసీనుఁ డై యుండె భ
క్తినిబద్ధాంజలి యై సుమంత్రుఁ డనురక్తి న్ముందటం గొల్వఁగన్.
| 1014
|
శృంగిబేరపురాధీశుం డగుగుహుండు రామునిం జూడవచ్చుట
ఉ. |
ఆపుర మేలువాఁడు సుగుణాభిరతుండు నిషాదలోకర
|
|
|
క్షాపరతంత్రుఁ డుగ్రబలశాలి గుహుం డనుపేరివాఁడు ప్రా
ణోపమమిత్రుఁ డై తగురఘూత్తమురాక యెఱింగి సన్ముతో
ద్దీపితుఁ డై హితాళి చనుదేర భజింపఁగ వచ్చె రామునిన్.
| 1016
|
ఉ. |
ఈగతి నేగుదెంచుగుహు నెంతయు నంతనె చూచి చాప
దీక్షాగురుఁ డైనరాముఁడు ప్రసన్నముఖుం డయి రమ్ము రమ్మన
న్వేగమె డాయ వచ్చి కడువిశ్రుతకీర్తిని రామమూర్తినిం
గౌఁగిటఁ జేర్చి మేనఁ బులక ల్సెలఁగ న్వినయోక్తి ని ట్లనున్.
| 1017
|
ఆ. |
ఓ మహానుభావ యేమి కారణమున, నీతపస్విరూప మిపుడు గలిగె
సఖుఁడ నైననాకు సర్వంబు దయతోడఁ, జెప్పు మధిప వేఱు సేయనేల.
| 1018
|
క. |
పాయక మద్భాగ్యంబున, నీయట్టిప్రియాతిథి న్వినిర్మలచరితున్
న్శ్రీయుతునిఁ జూడఁగలిగెను, నాయట్టికృతార్థుఁడు భువనంబులఁ గలఁడే.
| 1019
|
వ. |
అని స్వాగతం బడిగి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి వెండియు ని ట్లనియె.
| 1020
|
మ. |
ఇనవంశోత్తమ యీధరిత్రికిఁ గరం బీశుండ వీ వేము నీ
కనిశంబుం బని సేయువారము మదీయం బైనరాజ్యంబు గ్ర
ద్దనఁ జేపూని ధరింపు మీపుర మయోధ్యాపట్టణంబట్ల వే
డ్క నిరీక్షింపుము భక్ష్యభోజ్యములు వే గైకొమ్ము నాపై కృపన్.
| 1021
|
మ. |
అని ప్రార్థించుచు నున్నయాగుహుని రాజాగ్రేసరుం డైనరా
మనరేంద్రుండు దయార్ద్రదృష్టిఁ గని సమ్మానంబుఁ గావించి యి
ట్లనుఁ బుణ్యాత్మక యేము సంతతము నుద్యత్ప్రీతి నీచేత న
ర్హణముం బొందినవార మింత యిపు డేలా నూత్నసంబంధముల్.
| 1022
|
వ. |
అని మైత్రిం బ్రకటించి మృదుపీనంబు లైనబాహువులం బరిష్వజించి వెండియు
ని ట్లనియె.
| 1023
|
చ. |
అనుపమపూర్వజన్మసుకృతాతిశయంబున నిన్ను నేఁడు లో
చనములు చల్ల గాఁగఁ గని చాలఁ గృతార్థుఁడ నైతి నీసుతుల్
తనయలు చుట్టము ల్సఖులు దాయలు సైన్యపతు ల్కరు ల్హరుల్
ఘనముగ సంతతంబును సుఖస్థితి నొప్పుదురే సుహృద్వరా.
| 1024
|
చ. |
అనఘవిచార నీ కొసఁగు నట్టిసపర్యలు మాకు నచ్చె మ
జ్జనకునియాజ్ఞచే నియతి సంధిలఁ దాపసవృత్తిఁ గానలోఁ
బనివడి సత్వ్రతంబు సలుపం జను నే నిట భక్ష్యభోజ్యము
ల్గొనుట యసంగతంబు నయకోవిద యీవినయంబు చాలదే.
| 1025
|
వ. |
ఈతురంగమంబులు మార్గాయాసంబున డస్సి యున్నయవి ఘాసపానీయం
బులచేత వీనికిం దృప్తిఁ గావింపుము నన్నుం బూజించినట్ల కా సంతసించెద
ననిన నట్ల యని తగువారల నశ్వరక్షణంబునకు నియోగించి నంత నారఘు
|
|
|
పుంగవుండు కాలోచితకృత్యంబులు దీర్చి లక్ష్మణదత్తం బైనగంగానదీజలంబుఁ
గ్రోలి సుమంత్రవిరచితం బైనపర్ణతల్పంబుఁ బత్నీసమేతంబుగా నధివసించె
నప్పుడు లక్ష్మణుం డన్నచరణంబుల గంగోదకంబులం గడిగి తడి యొత్తి కొంత
దడవు శుశ్రూషఁ గావించి పదంపడి ధనుర్ధరుం డై కొలిచి యుండె గుహుండు
ను సూతసహితంబుగా సౌమిత్రితోడ సంభాషించుచు ధనుర్ధరుం డై
యుండె నంతఁ గొంతరాత్రి చనిన యనంతరంబ భ్రాతృరక్షణాయత్తచిత్తుం
డై యదంభంబున నిద్ర వేఁగించు చున్నలక్ష్మణుం జూచి సంతాపసంతప్తుం డై
గుహుం డి ట్లనియె.
| 1026
|
గుహుఁడు లక్ష్మణుఁడు నిద్రపోకయుండుటను జూచి పరితపించుట
చ. |
అతులితవైభవోన్నతి మహాసుకుమారుఁడ వయ్యు నీవు నీ
గతి నడురేయిఁ గా ల్నిలిపి కంటికి నిద్దురఁ గాచి యున్కి నా
మతికి విషాద మయ్యెడి క్షమావరపుత్ర త్వదర్థ మిందుఁ గ
ల్పిత మగుపర్ణతల్పమునఁ బ్రీతి సుఖస్థితిఁ బవ్వళింపవే.
| 1027
|
ఆ. |
అనఘచరిత కష్ట మనుభవింపఁగ నాకుఁ, జెల్లుఁ గాక నీకుఁ జెల్లు నయ్య
ఘనసుఖోచితుఁడవు కడుసుకుమారుఁడ, వతిమృదుండ వవనిపాత్మజుఁడవు.
| 1028
|
చ. |
అనవరతంబు నీదుకృప నందినవారము గాని సజ్జనా
వనగుణధుర్య మేము కడవారము గాము సు మయ్య యీనిశం
బనివడి బంధువు ల్సఖులు భ్రాతలు జ్ఞాతులు గొల్వ నిద్ర మే
ల్కనియెడునంతదాఁక మిముఁ గాచెదఁ గంటికి ఱెప్ప కైవడిన్.
| 1029
|
మ. |
ధర నెవ్వానికృప న్నితాంతయశము న్దర్మార్థకామంబులుం
బరమైశ్వర్యము నాకుఁ గల్గె సుఖసంపల్లాభముం గంటి నా
నరవర్యుం డగుజానకీప్రియునకన్న న్సత్ప్రియుం డెవ్వఁ డు
ర్వరలో లేమి యథార్థ మింతయు సుమిత్రాపుత్ర చర్చింపఁగన్.
| 1030
|
తే. |
నరవరాత్మజ గహనగోచరుఁడు నైన, నాకుఁ దెలియని దీవిపినంబునం దొ
కింతయును లేదు బల మోపినంత గలదు, శంక విడిచి నిద్రింపుము శయ్యయందు.
| 1031
|
ఉ. |
నా విని లక్ష్మణుండు కరుణంబుగ నాగుహుఁ జూచి పల్కు నో
భూవినుతప్రతాప విను ముజ్జగ మేలుట కర్హుఁ డైనయీ
భావజసన్నిభుం డిటులు పర్ణతలంబునఁ బవ్వళింప నా
కేవిధి నిద్ర వచ్చు సుఖ మేటికి జీవిత మేల చెప్పుమా.
| 1032
|
లక్ష్మణుఁడు రామునివనవాసమును గుహునితోఁ జెప్పి దుఃఖించుట
ఆ. |
అనఘ ధర్మవిదుఁడ వైననీచేత రక్షితుల మైనమాకు మది నొకింత
యైన భీతి పుట్ట దన్యుఁడ వీవు గా, వాదరింపఁబడితి నదియె చాలు.
| 1033
|
క. |
రణమున నేవీరుఁడు సుర, గణమున కైన నెదిరింపఁగా రాక బలో
ల్బణవృత్తి నలరునాయన, తృణములపై బవ్వళించె నిప్పుడు గంటే.
| 1034
|
తే. |
ఘనతపముచేత వివిధయాగములచేత, దానములచేత సకలమంత్రములచేతఁ
బ్రాప్తుఁ డై తుల్యగుణుఁ డయి పరఁగెఁ గాన, జనకున కతిప్రియాత్మజుం డనఘ యితఁడు.
| 1035
|
ఆ. |
అట్టి రాఘవాన్వయప్రదీపకుఁ డైన, యితఁడు ఘోరవనికి నేగుచుండఁ
జూచి తండ్రి యైనక్షోణీశ్వరుఁడు మను, ననెడుమాట సందియంబు గాదె.
| 1036
|
వ. |
పితృమరణానంతరంబున మేదిని యనాథ యై యుండఁగలదు యువతులందఱు
నాక్రందనంబుఁ గావించి యలసి నిరానంద లై యుందు రని పలికి వెండియు
ని ట్లనియె.
| 1037
|
చ. |
నిరుపమవాద్యఘోషముల నృత్యరసంబుల గీతనిస్వనో
త్కరముల భూషణద్యుతులఁ దద్దయు సొంపు వహించురాజమం
దిర మది నేఁడు సంక్షుభితనీరధిమాడ్కి వినష్టతారకాం
బరమువిధంబున న్మిగులఁ బాడఱినట్లుగ నుండునేకదా.
| 1038
|
క. |
మాయయ్యయుఁ గౌసల్యయు, మాయమ్మయు నేఁటిరాత్రి మహనీయగుణ
శ్రీయుతుల మమ్ముఁ గానక, పాయక నేపగిది వీట బ్రతుకుదు రకటా.
| 1039
|
తే. |
అనఘ మాతల్లి శత్రుఘ్ను నాశ్రయించి, యొకవిధంబున ధర మనియుండుఁ గాని
యేకసుత యైనకౌసల్య యెట్లు బ్రతుకఁ, గలదు తీర్పంగరానిదుఃఖము వహించి.
| 1040
|
క. |
అనురక్తజనాకీర్ణం,బును లోకసుఖావహంబు భూరిద్యుతి యౌ
ఘనసాకేతము వ్యసనం, బునఁ గ్రాఁగి నశించు నింకఁ బుణ్యచరిత్రా.
| 1041
|
తే. |
అగ్రతనయుండు ప్రియుఁడు మహాత్ముఁ డైన, రామభద్రుని విడిచిన రాజవరుని
యొడలఁ బ్రాణంబు లెబ్భంగి నుండు నతఁడు, ప్రియకుమారుఁడు వృద్ధుఁడు నయవిదుండు.
| 1042
|
తే. |
విపులయశుఁ డైనరామునివిపిన యాత్ర, దలఁచి శోకాగ్నిచేఁ గ్రాఁగి తనువు విడుచుఁ
గాక కౌసల్య మని యుండఁగలదె యింక, నాయమవితాన మాయమ్మ యడలుఁ గాదె.
| 1043
|
క. |
గ్రద్దన భూమీశ్వరుఁ డా, యిద్దఱముద్దియలపాటు హృదయంబునఁ దాఁ
దద్దయుఁ జింతించి ఘనవి, పద్దశచే డస్సి మేనుఁ బాసెడు సుమ్మీ.
| 1044
|
ఆ. |
ఇట్టిమాటఁ దలఁప నెంతయు నాగుండె, యవియుచున్న దట్టియడలు మాని
సమ్మదమున నేఁడు ఱొమ్మునఁ జేయిడి, నిద్ర వోవ నెట్లు నేర్తు నయ్య.
| 1045
|
ఆ. |
తనయువిపినయాత్రఁ దలపోసి మృతుఁ డైన,తండ్రి సంస్కరించి ధన్యు లగుచు
వఱలుచుందు రట్టిభరతాదులకుఁ బోలెఁ, గలుగదయ్యె భాగ్యగరిమ మాకు.
| 1046
|
ఆ. |
తపముపేర్మి మమ్ము నపురూపముగఁ గాంచి, పెంచినట్టిజనకుఁ డంచితముగ
బ్రతికియుండెనేని గ్రమ్మఱఁ జనుదెంచి, నపుడు గాదె చూచి యలరుటెల్ల.
| 1047
|
వ. |
మఱియు మృతుం డైనదశరథుని సత్కరించి ధన్యులై భరతాదికుమారులు
రమ్యచత్వరసంస్థానంబును సువిభక్తమహాపథంబును హర్మ్యప్రాసాదసంప
న్నంబును గణికావరశోభితంబును గజాశ్వరథసంబాధంబును దూర్యనాదవినా
దితంబును సర్వకల్యాణసంపూర్ణంబును హృష్టపుష్టజనాకులంబును నారామో
ద్యానసంపన్నంబును సమాజోత్సవశాలియు నగుసాకేతనగరంబున యథా
సుఖంబుగా విహరించెద రేము వనవాసంబు నిర్వర్తించి సత్యప్రతిజ్ఞుల మై
సేమంబుతో నయోధ్యాపురంబుఁ బ్రవేశించి దశరథుండు జీవించి యుండె నే
నియు నమ్మహాత్మునిపాదంబుల కభివందనంబుఁ గావించి సేవించెద మని
సత్యంబుగాఁ బలికిన నానుమిత్రాపుత్రునివాక్యంబు విని గుహుండు రాముని
యందు గురుసౌహృదంబువలన జ్వరాతురుం డై వ్యధాతురం బగుగజంబు
పోలిక సంతాపసంతప్తుం డై కన్నీరు నించుచుండె నంతఁ బ్రభాతకాలం
బగుటయు రాముండు మేల్కాంచి సౌమిత్రి నాలోకించి యి ట్లనియె.
| 1048
|
లక్ష్మణునాజ్ఞ గుహుఁడు గంగ దాఁటుట కోడఁ దెప్పించుట
మ. |
కృకవాకుల్ మొఱయం దొడంగె శిఖు లుద్గ్రీవంబు లై మ్రోసె విం
టె కపు ల్గూయఁ దొడంగె నల్లదిగొ ప్రాగ్దేశం బినచ్ఛాయచే
నకలంకస్థితి నొప్పె భానుఁ డుదితుం డై రాఁ గలం డింకఁ ద
క్కక నీయాపగ దాఁటి పోద మన నౌఁగా కంచు నాతం డొగిన్.
| 1049
|
ఆ. |
గుహునిఁ జూచి పల్కె గొబ్బున నీవు సు, మంత్రుఁ గూడి నీదుమంత్రివరులఁ
బనిచి గంగ దాఁటి చనుటకు నోడ దె, ప్పింపు మనిన నతఁడు పెంపుతోడ.
| 1050
|
వ. |
తనమంత్రులం జూచి మీరు రయంబునం జని సువాహనసంయుక్త యగుదానిఁ
గ్రాహవతి యగుదాని సుప్రతార యగుదాని దృణసంధిబంధ యగుదాని
శోభనస్వరూప యగుదాని నొక్కనావ నవతరణమార్గంబునం దెం డనిన విని
యాగుహామాత్యు లట్టినావ దెచ్చి గుహునకు సమర్పించిన నతండు దాని
రామునకుం జూపి ప్రాంజలియై దేవా యిమ్మహానది నుత్తరించుటకు యోగ్యం
బైన సాధనం బుపస్థితం బయ్యె దీని నారోహింపుఁ డనిన నారాముండు గుహు
నిం జూచి నీచేతఁ గృతకాముఁడ నైతి నట్లు సేయం గలవాఁడ ఖనిత్రపిటకా
దిసాధనంబులును వైదేహివస్త్రాభరణాదికంబును నోడమీఁదం బెట్టింపు మని
పలికి సౌమిత్రిసహితంబుగాఁ దనుత్రాణంబులు దొడిగి తూణీరంబులు బిగించి
కృపాణంబులు ధరించి కోదండపాణియై రథారోహణంబు సేయక వైదేహిం
దోడ్కొని పాదసంచారంబున నోడసమీపంబునకుం జనుసమయంబున
సుమంత్రుండు నిటలఘటితాంజలిపుటుం డై దేవా యేమి సేయం గలవాఁడ
|
|
|
నానతిం డని వినయంబునం బల్కిన నారఘువల్లభుండు గజేంద్రహస్తప్రతిమం
బైనదక్షిణకరంబున నతని సంస్పృశించి మందమధురవాక్యంబుల ని ట్లనియె.
| 1051
|
రాముఁడు సుమంత్రు నయోధ్యకుఁ బొమ్మని చెప్పుట
చ. |
భరతుఁడు వీట లేఁడు నరపాలుఁడు మద్వనయాత్ర కాత్మలోఁ
బరమవిషాద మొందుచు విపద్దశచే నడ లూనుఁ గాన స
త్వరగతి నేగి నీ వొకవిధంబున నాయనఁ దేర్చుచుండు మో
పరమసఖా వనంబునకుఁ బాదగతిం జనువార మెంతయున్.
| 1052
|
చ. |
అనిన నతండు దీనుఁ డయి యాయన కి ట్లను దేవ యే మనం
జను వనితాయుతంబుగ నిజంబుగఁ గాఱడవిం జరింపు మం
చనయము నీకుఁ బ్రాకృతున కట్ల కృతాంతుఁడు సేయుచుండ న
న్యునకు మనుష్యమాత్రునకు నొక్కనికి న్వశమే మరల్పఁగన్.
| 1053
|
తే. |
అనఘచరిత నీయట్టిమహాత్ముఁ డిట్టి, కష్టదశ నొందుచుండఁగఁ గాంచి మార్ధ
వార్జవబ్రహ్మచర్యంబులం దధీత, మందును ఫలోదయంబు లేదని తలంతు.
| 1054
|
వ. |
దేవా నీవు పితృవియోగంబున వైదేహీలక్ష్మణసహితంబుగా వనవాసంబు
సలుపుటం జేసి ముల్లోకంబుల నతిక్రమించి నిక్కువంబుగాఁ బరమసిద్ధి వడ
సెదవు తమసాతీరంబున నిద్రాసమయంబునం దవిదితగమనంబునఁ బౌరులును
బలాత్కరించి క్రమ్మఱించుటం జేసి యేనును నీచేత వంచితుల మైతి మింకఁ
బాపభాగిని యగుకైకేయికడ నెత్తెఱంగున జీవించెద మని దుఃఖార్తుం డై
రోదనంబు సేయుచుఁ బ్రాణసముం డైనయమ్మహానుభావుని విడువంజాలక పరి
భ్రమించుచున్నసుమంత్రుం జూచి రోదనజనితాశుచిత్వనివారణార్థంబు జల
స్పర్శంబు సేయించి పరిశుధ్ధుం గావించి మధురవాక్యంబుల ననూనయించుచు
ని ట్లనియె.
| 1055
|
క. |
మనువంశజులకు నీతో, నెన యగుసన్మిత్రుఁ డన్యుఁ డిఁక లేఁ డటుగా
వున దశరథజనపతి వగ, పునకుం జొరకుండునట్లు బోధింపు మటన్.
| 1056
|
తే. |
అనఘ మాయయ్య ననుఁ బాసి యడలుచుండు, నమ్మహాత్మునిశోకంబుఁ గ్రమ్మఱింపు
మధికవృద్ధుండు కామభారావసన్నుఁ, డగుట ని ట్లొత్తి చెప్పంగఁ దగియె నేఁడు.
| 1057
|
రాముఁడు సుమంత్రునితో దశరథాదులకుఁ దననమస్కారములఁ దెల్పు మనుట
వ. |
మఱియు మహీపతులు స్వతంత్రులు గావున వలయునెడల నిందాస్తుతివిచా
రంబు దక్కి నిగ్రహానుగ్రహంబులు సలుపుచుండుదు రట్టివారిసేఁతకుం దెగ
డుట బుద్ధిమంతుల కుచితంబు గాదు దశరథుండు కైకేయిచిత్తంబు వడయు
|
|
|
టకు నెద్ది పంచిన దానం గా దనక సేయుచుండుము మఱియు మహీరమణుం
డేకార్యంబు నుద్దేశించి యప్రియంబును దుఃఖంబును సంతాపంబును బొంద
కుండు నట్టికార్యం బట్లు గావింపుము నీ విప్పుడు రయంబునఁ బురంబునకుం
జని వృద్ధుండును జితేంద్రియుండును నదృష్టదుఃఖుండును నగుమహీపతిని
సముచితంబుగా సందర్శించి యభివాదనంబుఁ గావించి నావచనంబులుగా ని
ట్లనుము.
| 1058
|
చ. |
మిహిరకులేశ నీకుఁ బ్రణమిల్లెద నేనును లక్ష్మణుండు భూ
దుహితయు నీయనుగ్రహము తోడుగ శోకము దక్కి దండకా
గహనసదంబున న్సమయకాలముదాఁక వసించి క్రమ్మఱ
న్రహిఁ జనుదెంచి యవ్వలఁ దిరంబుగ నీపద మాశ్రయించెదన్.
| 1059
|
తే. |
రాజ్యహీనుల మైతి మరణ్యవాస, మావహిలె నంచు మది నించుకైన వగవ
కధిప యేనును లక్ష్మణుఁ డవనిపుత్రి, సుఖుల మై యున్నవార మిచ్చోట నిపుడు.
| 1060
|
వ. |
అనివిన్నవించి పదంపడి మజ్జనని యగుకౌసల్యాదేవి కభయంబుఁ దెలిపి సుమిత్ర
ననూనయించి కైకేయిసంతాపంబు మాన్చి తక్కినతల్లుల కారోగ్యంబు
దెలిపి విశేషించి మామువ్వురవచనంబులుగా మజ్జననికి మత్కుశలంబుఁ దె
లిపి యభివాదనంబుఁ జేసి వెండియు జగతీపతితోఁ గార్యంబుతెఱం గి ట్లని
చెప్పుము.
| 1061
|
చ. |
భరతుని వేగ రాఁ బనిచి బంధువు లెల్లను సమ్మతింపఁగా
నిరుపమరాజ్యపీఠమున నిల్పు మతండు భవన్మనోవ్యథ
న్బరునడిఁ దీర్చు నంచు నరపాలునితో వివరింపు మమ్మలం
దఱ సమదృష్టిఁ జూడు మని నాయనుజన్మునితోడ నాడుమీ.
| 1062
|
తే. |
తండ్రిపనుపున రాజ్యంబు తవిలి యేలు, నతఁ డుభయలోకసుఖతంత్రుఁ డగుచు నలరుఁ
గాన దశరథునానతిఁ బూని రాజ్య, మేలు మని కైకకొడుకుతోఁ జాల జెపుమ.
| 1063
|
తే. |
మఱియుఁ దలిదండ్రులందు సమానభక్తి, గలిగి వర్తింపు మనిశంబు కైకయందు
బోలె నిశ్చలభక్తి సల్పుము సుమిత్ర, యందు మజ్జనయిత్రియం దనుచుఁ జెపుమ.
| 1064
|
వ. |
విశేషించి దూరం బరుగుదెంచితి నింక రథంబుఁ గొని యరుగు మనిన నతండు
సంతాపసంతప్తుం డై వెండియు స్నేహంబున రాముని విలోకించి యి ట్లనియె.
| 10665
|
సుమంత్రుఁడు రామవియోగమును దలంచి దుఃఖించుట
క. |
మునుకొని భక్తి స్నేహం, బున సౌహృదమున నవిక్లబుఁడ నై యే నా
డినమాట తప్పుగాఁ గొన, కినవంశశ్రేష్ఠ యేలు హృదయమునందున్.
| 1066
|
తే. |
అనఘ తనయునిఁ బాసినజననిమాడ్కిఁ, ద్వద్వియోగసంభూతదుర్వారదుఃఖ
|
|
|
మున నిరానంద మై యున్నపురవరమున, కెట్లు చనువాఁడ నానతి యిమ్మధీశ.
| 1067
|
తే. |
మిహిరకులవర్య మును భవత్సహిత మైన, రధము గ్రమ్మఱ నిటు భవద్రహిత మగుచు
నుండ వీక్షించి వీటిలో నున్నవారు, పద్మదళలగ్నజలములభంగిఁ గారె.
| 1068
|
తే. |
సూతపరిశేష మైన యీశూన్యరథము, నాజి హతవీర మైనసైన్యమును బోలెఁ
జూచి సాకేతనగరంబు శోకతాప, యుక్త మై కడుదైన్యంబు నొందుఁ గాదె.
| 1069
|
తే. |
జనవరాత్మజ దూరదేశమున నున్న, వాఁడ వైనను నిను వీటివారు మ్రోల
నున్నవానిఁగ మది నెంచి యోగిరంబు, గుడువ నొల్లక యుందురు జడత నొంది.
| 1070
|
చ. |
కడువడి నీవు ప్రో ల్వెడలి కాననసీమకు నేగుదెంచున
ప్పుడు నినుఁ బాయ లేక బలముఖ్యులు పౌరు లమాత్యకు ల్సఖు
ల్దడయక దుఃఖశోకమునఁ దద్దయు నాకులపాటు నొందుచు
న్జడత వహించి యుండుటయు సర్వము నీ కది దృష్టమే కదా.
| 1071
|
తే. |
సాధునుతశీల నీప్రవాసనమునందు, నగరజనముచే నెద్ది యొనర్పఁబడియె
నట్టిరోదనశబ్ద మీవట్టితేరుఁ, దేఱి చూచిన శతగుణాధికము గాదె.
| 1072
|
తే. |
ఇనకులోత్తమ యీదుఃఖ మెల్లవారి, కోడ కేనె యొనర్చినవాఁడ నగుదు
నన్నియు న టుండ నిమ్ము ధరాధినాథు, శోకతాపంబు నా కటు చూడ వశమె.
| 1073
|
తే. |
దోష మని యెన్న కిటు నన్ను దుఃఖవార్ధి, లోనఁ బడఁద్రోచి పోవంగఁ బూనితే మ
హాత్మ దయ మాలి యట్లైన నసువు లిపుడె, విడుతుఁ గా కేల పోదు నవ్వీటి కధిప.
| 1074
|
సీ. |
రాజవంశాంభోధిరాజ ని న్నిటఁ బాసి యే నొంటిఁ బురమున కేగ నచట
మీతల్లి కౌసల్య నాతనూభవు నెందు విడిచి వచ్చితి వని యడుగు నామె
కేమని చెప్పుదు నోమహాదేవి నీకొడుకును మాతులకులమునందు
డించి వచ్చితి నూఱడిల్లుము నీ వని చెప్పుదునే దానఁ దప్పు గలుగు
|
|
తే. |
మానితాచారు నీపుత్రుఁ డైనరాము, నడవిలో డించి వచ్చితి నంటి నేని
పిడుగువంటియీవాక్యంబు నొడివినంతఁ, దడయ కప్పుడె యసువులు విడువకున్నె.
| 1075
|
క. |
జననుత యీహయరాజము, లనఘుని నినుఁ బాసి శూన్య మైనరథంబుం
గొని నేఁడు మరలఁ బట్టణ, మున కేగతిఁ బోవ నేర్చుఁ బురుషశ్రేష్ఠా.
| 1076
|
సుమంత్రుఁడు తానును రామునితోడ వనమునకు వచ్చెద ననుట
వ. |
దేవా ప్రియదర్శనుండ వైననిన్నుం బాసి నిమిషం బైన జీవింపంజాల నీతోడ
వనంబునకుం జనుదెంచెద ననుగ్రహింపు మ ట్లీయకొనవేని రథంబుతోఁ గూడ
నగ్నిప్రవేశంబుఁ జేసెద నని పలికి వెండియు ని ట్లనియె.
| 1077
|
మ. |
అనఘా దారుణకంటకద్రుమశిలావ్యాప్తంబు లై నట్టియా
|
|
|
వనమార్గంబులయందుఁ బాదగతిఁ బోవం జాల వీస్యందనం
బనుమానింపక యెక్కుఁ డేను సుఖ మింపారంగ నెచ్చోటికిం
జన నిష్టం బగునట్టిదేశమున కిచ్ఛాభంగిఁ గొంపోయెదన్.
| 1078
|
వ. |
మహాత్మా కాంతారంబున మీకు నెయ్యది తపోవిఘ్నంబుఁ గావించుచుఁ
జరించు నట్టిసత్వంబుల నెల్ల నేను రథస్థుండనై బాధించుచుండెద రాజ్యాభి
షిక్తభవద్రథచర్యాకృతం బైనసుఖంబు భాగ్యహీనుండ నైననాచేత నలబ్ధం
బయ్యె నైనను భవత్సాహాయ్యకరణంబుచేత వనవాసకృతసుఖం బైన ననుభ
వింప నిశ్చయించితి నరణ్యంబునందు నీ కనుకూలుండ నయ్యెద నీవు నాకుఁ
బ్రత్యాసన్నుఁడ వగు మని ప్రీతిపూర్వకంబుగా నీచేతఁ బలుకంబడు వాక్యం
బేను వినం గోరెద హయంబులు వనవాసి వైననీకుఁ బరిచర్య సేయుచుఁ బర
మగతిం బ్రాపింపఁ గలయవి యేను నిన్నుం బాసి అయోధ్యాపురంబునకుం
గాదు దేవలోకంబున కైనం బోవ నొల్ల వనంబున నీకు శుశ్రూషఁ గావిం
చుచు సుఖినై యుండెద నని పలికి వెండియు ని ట్లనియె.
| 1079
|
క. |
విను మఘచిత్తుఁడు బలశా, సనునగరంబునకుఁ బోవఁజాలనిమాడ్కి
న్జనవర నినుఁ బాసి పురం, బున కరుగంజాల నన్నుఁ బుచ్చకు మింకన్.
| 1080
|
క. |
వనవాసవత్సరంబులు, చనినవెనుక మిమ్ము నర్థిఁ జారుశతాంగం
బున నిడుకొని క్రమ్మఱఁ బుర, మునకుం గొనిపోవువాంఛ పొడమె నధీశా.
| 1081
|
తే. |
ఘోరవనిలోన నీతోడఁ గూడి యున్న, నాకుఁ బదునాలుగబ్దము ల్నయచరిత్ర
నిమిషకాలంబు లై తోఁచు నిన్ను విడిచి, యున్న నవియె నూఱేడు లై యుండు నధిప.
| 1082
|
వ. |
దేవా నీవు పరమదయాళుండవు విశేషించి భృత్యవత్సలుండవు ధర్మాత్ముండ
వేను భృత్యుండ నపరాధరహితుండ రాజపుత్రాశ్రితమార్గస్థితుండ నన్ను విడ
నాడి పోవుట ధర్మంబు గా దని యిట్లు దీనుం డై బహుప్రకారంబుల సారె
సారెకుఁ బ్రార్థించుచున్నసుమంత్రు నవలోకించి భృత్యానుకంపి యగురాముండు
మధురవాక్యంబుల నాశ్వాసించి సుమంత్రా నిన్ను భర్తృవాత్సల్యంబు గల
వానిఁ గా నెఱుంగుదుఁ బురంబునకుం జను మనుటకుఁ గారణం బెఱింగించెద
విను మని యి ట్లనియె.
| 1083
|
రాముఁడు సుమంత్రు నయోధ్యకుఁ బొ మ్మనుటకుఁ గారణముఁ జెప్పుట
క. |
చెచ్చెఱ నగరికిఁ గ్రమ్మఱ, వచ్చిన నినుఁ జూచి కైక వదలక రాముం
డచ్చుపడ వనికిఁ జనె నని, యిచ్చ నలరుఁ బ్రత్యయార్థ మేగఁగ వలయున్.
| 1084
|
క. |
అనఘాత్మ యేను గానన, మున కరిగినవార్త విని ప్రమోదాన్విత యై
జనపతి మిథ్యావచనుం, డనియెడిశంక వెస విడుచు నక్కైక మదిన్.
| 1085
|
క. |
గురుతరభరతారక్షిత, సురుచిరసుతరాజ్యజన్యసుఖ మయ్యమకుం
దిరముగ దొరకొను టదియే, పరమసఖా నాకు మిగులఁ బ్రథమార్థ మిలన్.
| 1086
|
క. |
నాకును విభునకుఁ బ్రియముగఁ, జేకొని యరదంబు గొనుచు శీఘ్రంబున న
వ్యాకులమతి వై పురి క, స్తోకగతిం బొమ్ము సూత సుగుణవ్రాతా.
| 1087
|
రామలక్ష్మణులు జడలఁ దాల్చుట
వ. |
నాచేతఁ జెప్పంబడినయీవాక్యంబు లన్నియు వారివారికి వేర్వేఱ నెఱిం
గింపు మని యిట్లు పెక్కువిధంబుల సారెసారెకు ననునయించుచు సుమం
త్రుని నిలువం బనిచి గుహునిం జూచి నాకు సజనం బగువనంబునందు నివా
సం బయోగ్యంబు జనపదరహితం బైనవనంబునందు వాసంబును వన్యాహారా
ధశ్శయ్యాదికంబును గర్తవ్యంబు గావున నియమంబు పరిగ్రహించి సీతా
లక్ష్మణదశరథులకు హితకాముఁడనై వనంబునకుం జనియెద నిప్పుడు జటాధార
ణార్థంబు న్యగ్రోధక్షీరంబుఁ దెమ్మని పలికిన నతం డట్ల కావింప రాముండు
లక్ష్మణసహితంబుగా సముచితప్రకారంబున జడలఁ దాల్చె దీర్ఘబాహు లగు
నమ్మహానుభావులు చీరసంపన్నులును జటామండలమండితులునై తపోనిష్ఠాగరి
ష్ఠు లైనమునులచందంబున నొప్పిరి యిత్తెఱంగున రాముండు సౌమిత్రిసహితం
బుగా వానప్రస్థమార్గానుసారి యగువ్రతం బంగీకరించి వెండియు గుహు
నవలోకించి.
| 1088
|
క. |
బలకోశదుర్గజనపద, ములయందుఁ బ్రమాద ముడిగి పుణ్యోచిత మ
త్యలఘుతరం బగురాజ్యము, నలయక పాలించుచుండు మయ్య మహాత్మా.
| 1089
|
క. |
అని యిటు నిషాదనాథున, కనుజ్ఞ యిడి రాముఁ డవనిజానుజయుతుఁ డై
పెనుపొంద నోడకడకుం, జని లక్ష్మణుఁ జూచి పలికె సంతరణేచ్ఛన్.
| 1090
|
క. |
జనకసుత యబల గావున, నినకుల తా నెక్కఁజాల దీయోడపయిం
బనివడి మెల్లన నీసతి, ననఘా యెక్కింపు మనిన నాతఁడు ప్రీతిన్.
| 1091
|
క. |
మానుగ రామునిపనుపున, జానకి నెక్కించి పిదపఁ జక్కఁగ నోడం
దా నెక్కెఁ బీదప వీరుఁ డ, హీనపరాక్రముఁడు రాముఁ డెక్కెం గడిమిన్.
| 1092
|
సీతారామలక్ష్మణులు నౌకారోహణముఁ జేయుట
వ. |
ఇట్లు నావ నెక్కి యాత్మహితంబుకొఱకు బ్రాహ్మణక్షత్రియార్హం బైన
నావారోహణమంత్రంబు జపియించి యథాశాస్త్రంబుగా నాచమనంబుఁ జేసి
సీతాలక్ష్మణసహితంబుగా నమ్మహానదికి నమస్కారంబుఁ గావించి ప్రీతిసంహృ
ష్టసర్వాంగుం డై సుమంత్రుని బలసహితంబుగా గుహుని నిలువ నియమించి
నావికులం జూచి రయంబున నోడ గడపుం డనిన వా రట్లు గావింప నయ్యో
డ కర్ణధారసమాహిత యై మహార్ణవంబునం జనుమందరాచలంబుచందంబునం
|
|
|
బోవుచుండె నప్పుడు సీతాదేవి యంజలిఁ గీలించి యమ్మహానది నుద్దేశించి
యి ట్లనియె.
| 1093
|
సీతాదేవి గంగానదినిం బ్రార్థించుట
క. |
దేవీ యీయన దశరథ, భూవల్లభసుతుఁడు విపినభూమి కరిగెడి
న్నీ వచ్చటఁ గృప మెఱయఁగ, వావిరి రక్షించుచుండవలయుం జుమ్మా.
| 1094
|
క. |
ఈరే డబ్దంబులు వన, ధారుణి వసియించి యవలఁ దమ్ముఁడు నేనుం
గోరిక సేవింపఁగఁ జను, దేరఁగలఁడు నిన్నుఁ జూడ దేవీ మరలన్.
| 1095
|
తే. |
త్రిపథగ యనంగ సాగరదేవి యనఁగ, నఖిలవిష్టపపావని యనఁగ బ్రహ్మ
లోకగామిని యనఁగ నస్తోకమహిమ, ధాత్రి విఖ్యాతిఁ గైకొన్నదాన వీవు.
| 1096
|
తే. |
అట్టి నీకు నమస్కార మాచరింతు, సర్వకామప్రసాదిని సపతి నగుచు
మరల వచ్చితి నేని సమ్మద మెలర్ప, వివిధభంగులఁ దృప్తిఁ గావించుదాన.
| 1097
|
క. |
పాయక మద్వల్లభుఁ డగు, నీయనఘుఁడు మరల భూమి కేలిక యైన
న్నీయాన నీకుఁ బ్రియముగ, వేయిమొదవు లిత్తు వేదవిప్రుల కెలమిన్.
| 1098
|
వ. |
మఱియు నరణ్యవాసంబు పరిసమాప్తి నొందించి క్రమ్మఱ నయోధ్యకుం జను
దెంచునప్పుడు సురాఘటసహస్రంబుల మాంసభూతోదనంబున నీకుఁ దృప్తి
నొందించెద మఱియు ననేకసువర్ణవస్త్రాభరణాదులు బ్రాహ్మణుల కొసంగెద
భవదీయతీరనివాసు లై భవదంతర్లీనంబు లైనప్రయాగాదిపుణ్యతీర్థంబులను
గాశ్యాద్యాయతనంబులను సంతుష్టంబులం జేసెద నని యివ్విధంబున
నపాంసులాశిరోమణి యగువైదేహి భాగీరథిం బ్రార్థించుచుండ నయ్యోడ త
ద్దక్షిణతీరంబు సేరంజనియె నప్పుడు రాముండు సీతాలక్ష్మణసహితంబుగా నావ
డిగ్గి తటం బెక్కి తమ్మునిం జూచి యి ట్లనియె.
| 1099
|
క. |
సజనస్థలమున నైనను, విజనం బగుచోట నైన వేయిగతుల భూ
మిజ నధికయుక్తిఁ గాచుట, గజవిక్రమ మనకు వలయుకార్యము సుమ్మీ.
| 1100
|
క. |
కావున ముంగలి యై చను, మీవు నడుమ జనకపుత్రి యేతెంచెడి నే
వావిరి మీయిద్దఱకుం, గావలి యై వెనుక ప్రాపుగాఁ జనుదెంతున్.
| 1101
|
తే. |
పురుషశార్దూల యీగోల పుట్టి యెన్నఁ, డిట్టికష్టంబు లెఱుఁగని దిపుడు దారు
ణాటవీవాససంభవాయాస మొంది, యాత్మ శోకింపఁ గల దింక నకట కంటె.
| 1102
|
క. |
జనరహితము విషమము భయ, జనకం బగుగహనమందుఁ జనుచున్నది గా
వున నేమఱ కిప్పుడు మన, మనఘా రక్షింపవలయు నంగన యగుటన్.
| 1103
|
వ. |
అని యాజ్ఞాపించిన నట్ల కాక యని లక్ష్మణుండు మహాధనుర్ధరుం డై యగ్ర
భాగంబునం జనియె వైదేహి ము న్నిడుకొని రాముండు పిఱుందదెసం
బోవుచుండె నంత సుమంత్రుండు భాగీరథిదక్షిణతీరంబునం బోవుచున్న
రాముని దవ్వులం జూఛి కూడ ముట్టుటకు సామర్థ్యంబు లేమిం జేసి కన్నీరు
|
|
|
నించుచుండె నిట్లు రాముండు గంగానది నుత్తరించి శుభసస్యసమృద్ధంబు
లగువత్సదేశంబులు విలోకింపుచు వ్యాఘ్రాదిక్రూరమృగంబులం దోలుచు
నాహారయోగ్యంబు లగువరాహఋశ్యరురుపృషతసంజ్ఞమృగంబుల వధించి
వానిం గొని బుభుక్షితులై ప్రొద్దు గ్రుంకునంతకు నొక్కవనస్పతి డాయం జని
వరుణప్రియ యగుసంధ్య నుపాసించి జానకీవల్లభుండు సౌమిత్రి నవలోకించి
యి ట్లనియె.
| 1104
|
క. |
ఏనిశ సుమంత్రవిరహిత, మై నేఁ డిట మనకుఁ దోఁచె నారాత్రి బహి
స్స్థాననివాసంబున కిది, మానుగ మొదలిటిది గాదె మనుజశరణ్యా.
| 1105
|
తే. |
అనఘ నేఁ డాది గాఁగ నిత్యంబు రాత్రు, లందు సమధిజ్యధన్వుల మై సహస్ర
గతుల నరయుచు నిద్దురఁ గాచి యుండ, వలయు సీతకు భయ మింత గలుగకుండ.
| 1106
|
ఆ. |
మఱియు నేఁడు మొదలు మనుకులవర్య ని, త్యంబు రాత్రులందు స్వార్జితంబు
లైనపర్ణతృణము లవనిపైఁ బఱిచి వ,సింత మొక్కచోటఁ జేరుదనుక.
| 1107
|
వ. |
అని పలికి మహార్హశయనోచితుం డైనకౌసల్యానందనుండు సీతాలక్ష్మణసహి
తంబుగా నవ్వనస్పతిమూలంబున నధ్యాసీనుండై సౌమిత్రితోఁ బుణ్యకథాప్ర
సంగంబులు సేయుచు నంతకంతకుఁ బ్రసంగవశంబునం బెక్కుతలంపు లూర
వెండియు లక్ష్మణున కి ట్లనియె.
| 1108
|
రాముఁడు దశరథాదులఁ దలంచుకొని దుఃఖించుట
మ. |
అనఘా యీనిశ మేదినీవిభుఁడు శోకాకల్పితస్వాంతుఁ డై
ననుఁ జింతించుచు నేమి దోఁపక నిరానందంబుగా నుండున
ట్లనె కైకేయి సపత్నిపుత్రుఁడు మహారణ్యోర్వికిం బోయె నే
ననిశం బింకఁ గృతార్థ నైతి నని యాహ్లాదించుచుండుం గదా.
| 1109
|
తే. |
మఱియు నద్దేవి మాతులమందిరమున, నుండి వచ్చినతనపుత్రు నొప్పఁ జూచి
రాజ్యకారణమున మహీరమణుప్రాణ, ములను నిఁకమీఁద హరియింవఁ బూనదు గద.
| 1110
|
తే. |
అకట వృద్ధుఁ డనాథుఁడు నగునృపుండు, కామభారావసన్నుఁడు గాన నేను
లేనిచోఁ దాను గైక కధీనుఁ డగుచు, నేమి సేయంగఁ గలఁ డిప్పు డింకఁ జెపుమ.
| 1111
|
తే. |
కైక యీవాక్యరశ్మిచేఁ గట్టువడిన, మనుజనాథునిమతివిభ్రమంబుఁ జూచి
రాజకులవర్య యర్థధర్మముల కంటెఁ, గామము గరీయ మని తోఁచెఁ గాదె నాకు.
| 1112
|
తే. |
కానిచో నుర్వి నెంతదుష్కర్ముఁడైన, సుతుని సుగుణాభిరతుని సువ్రతుని నృపుని
కరణి నెవ్వాఁడు విడుచు నకారణముగ, లక్ష్మణా యది కామధర్మంబు గాదె.
| 1113
|
మ. |
అనఘాత్మా భరతుం డొకండె పితృదత్తైశ్వర్యము సంతతం
బును బాలించుచుఁ బత్నిఁ గూడి సుఖసమ్మోదాత్ముఁ డై యుండున
య్యనఘుం డేను బ్రవాసి నై దశరథుం డంతంబు నొందంగఁ దా
ననిశం బేకముఖంబుగా నఖిలరాజ్యశ్రీలఁ బాలింపఁడే.
| 1114
|
క. |
ధర నెవ్వఁ డర్థధర్మ, స్ఫురణ ముడిగి ముఖ్యకామమున వర్తిలు న
ప్పురుషుండు దశరథునిక్రియ, భరతానుజ తుదిని గడువిపన్నతఁ బొందున్.
| 1115
|
క. |
అనఘా కేకయపతినం, దని మనయిలు సొచ్చు టెల్ల నావనవాసం
బునకు విభునిమరణమునకుఁ, దనయునిరాజ్యమున కనుచుఁ దలఁచెద బుధ్ధిన్.
| 1116
|
క. |
కైకేయి తనసుతుండు ర, సాకాంతుం డగుచు నుండ సౌభాగ్యమద
వ్యాకులత న్మనయమ్మలఁ, జీకాకుం జేయుచుండు సిద్ధము వత్సా.
| 1117
|
రాముఁడు లక్ష్మణు నయోధ్యకుఁ బొమ్మని చెప్పుట
క. |
నాకతమున మీయమ్మకు, నీకష్టపుఁబాటు గలిగె నిఁక నాపనువుం
గైకొని క్రమ్మఱఁ బురి క, వ్యాకులమతి నగుచు నరుగు మమ్మలకడకున్.
| 1118
|
తే. |
ఏను వైదేహితోఁ గూడఁ గాననమున, కెల్లి నొక్కడ నరిగెద హీనవృత్తి
బడలి ది క్కెవ్వరును లేక నడలుచున్న, మాయమను నీవు ది క్కయి మనుపు మచట.
| 1119
|
వ. |
మఱియు క్షుద్రకర్మ యగుకైకేయి ద్వేషోచితం బైనయన్యాయ్యం బాచ
రించుం గావున నీవు మజ్జననీరక్షణం బేమఱకుండు మని ధర్మజ్ఞుం డగుభర
తునకుం జెప్పుము.
| 1120
|
తే. |
సాధునుతశీల తొల్లి మజ్జననిచేత, రాజముఖులు పెక్కండ్రు పుత్రకులచేత
నిల వియోజిత లైరి గావలయు నట్టి, పాప మిప్పు డయ్యమకు సంప్రాప్త మయ్యె.
| 1121
|
తే. |
రాజనందన పెద్దకాలముననుండి, ప్రీతితో బహువిధములఁ బెంచినట్టి
యంబ నాచేత ఫలకాలమందు విడువఁ, బడియెఁ దల్లికి నాయట్టికొడుకు లేల.
| 1122
|
తే. |
మిగులసమ్మోదము నొసంగఁ దగినయేను, గాఢసంతాన మొసఁగిన కారణమునఁ
బరఁగ నాయట్టితనయుఁడు ధరణి నెంత, కలుషచారిణికైనను గలుగవలదు.
| 1123
|
తే. |
శత్రుపాదదంశము నేయు సరగ శుకమ, యనెడు నెద్ధానిపల్కు మదంబచేత
వినఁబడియె నట్టిశారిక వీరజనవ, రిష్ఠ నాకంటెఁ బ్రీత్యతిరిక్త మయ్యె.
| 1124
|
వ. |
వత్సామాతృసంవర్ధితతిర్యగ్జాతిసంభూతశారికాకృతప్రియదానమాత్రం బైనను
నాచే సకృతం బయ్యెఁ బుత్రకృతప్రయోజనరహితయై శోకించుచున్నయల్ప
భాగ్య యగుకౌసల్య కేను బుత్రుండనై జన్మించు టంతయు నిరర్థకంబు గదా
యని మిక్కిలి వగచి వెండియు ని ట్లనియె.
| 1125
|
తే. |
అనఘ ననుఁ బాసి ఘోరశోకాభిమగ్న, యై పరమదుఃఖసంతాప మనుభవించె
నకట కౌసల్య దా నెంత యల్పభాగ్య, యయ్యె నయ్యమ కెద్ది ది క్కరయ నింక.
| 1126
|
చ. |
అనఘచరిత్ర యే నొకఁడ నల్క వహించి యయోధ్య నుర్వర
|
|
|
న్సునిశితబాణజాలములఁ జూర్ణముఁ జేసి విభుత్వ మర్థిఁ గై
కొనుటకు మేటి నయ్యు నయకోవిదవర్య యధర్మసాధ్వసం
బునఁ బరలోకభీతి నది పోవుట కెంతయు సమ్మతించితిన్.
| 1127
|
క. |
అని యీగతి విలపించుచు, జనకసుతావిభుఁడు శోకసంతాపముచేఁ
గనుఁగొనల నశ్రుకణములు, చనుదేరఁగ నూరకుండె జాలి జనింపన్.
| 1128
|
తే. |
అంత సౌమిత్రి విగతార్చి యైనవహ్ని, కరణి నిర్వేగ మైనసాగరముపగిది
భూరిదుఃఖార్తి విలపించి యూరకున్న, యగ్రజు ననునయించుచు నపుడు పలికె.
| 1129
|
తే. |
దేవ మీచెప్పినట్టుల నీవు వెడలి, రాఁగ గతపూర్ణశశి యైనరాత్రిభంగి
నిష్ప్రభత్వంబు నొందుట నిజ మయోధ్య, తండ్రి పరితాప మిం తని తలఁపరాదు.
| 1130
|
తే. |
నరవరోత్తమ సీతను నన్నుఁ గూర్చి, డెందమునఁ బరితాపంబు నొంద వలవ
దీవిచారంబు నినుఁ దపియింపఁజేయు, ధైర్యవంతున కిది యుచితంబు గాదు.
| 1131
|
రాముఁడు లక్ష్మణుఁడు వనమునకు వచ్చుటకు సమ్మతించుట
క. |
మనుకులశేఖర యేనును, జనకజయు జలోద్ధృతాంబుచరములభంగి
న్ఘనుని జగదేకపూజ్యుని, నినుఁ బాసి మనంగ లేము నిమిషం బైనన్.
| 1132
|
ఆ. |
అధిప నీవు లేనియలస్వర్గపద మైన, మదికిఁ దోఁచుఁ దృణసమాన మగుచుఁ
దల్లి యనఁగ నెంత దశరథుఁ డన నెంత, తమ్ముఁ డనఁగ నెంత దలఁప నాకు.
| 1133
|
వ. |
అని లక్ష్మణుండు పలికిన నత్యంతశ్రేష్ఠం బైనయతనివచనంబు విని రాముండు కొం
డొకసేపు విచారించి ధర్మం బంగీకరించి తమ్మునిరాక కొడంబడి యవ్వనస్పతి
మూలంబున లక్ష్మణవిరచితం బైనపర్ణతల్పంబునందు సీతాసమేతంబుగాఁ బవ్వ
ళించె ని ట్లంధకారబంధురం బైనరాత్రియందు జనసంచారశూన్యం బైనవనంబున
మహాసత్వనంపన్ను లగురామలక్ష్మణులు భయసంభ్రమంబులం జెందక గిరిసాను
గోచరంబు లగుకంఠీరవంబులచందంబున నొప్పి రంతఁ బ్రభాతకాలం బగుటయు
సాంధ్యాదికంబులు దీర్చి యచ్చోటు వాసి గంగాయమునాసంగమప్రదేశంబు
నకుం బోవ సమకట్టి మహారణ్యంబుఁ బ్రవేశించి వివిధంబు లగుభూభాగంబు
లును మనోరమంబు లగువత్సదేశావాంతరదేశంబులును నదృష్టపూర్వంబు
లగువృక్షంబులును నంత నంత విలోకించుచుం జని చని దివసంబు నివృత్త
మాత్రం బగుచుండ రాముండు సౌమిత్రి కి ట్లనియె.
| 1134
|
చ. |
అనుపమలీలఁ గ్రాలెడు ప్రయాగమునంతట నిండి మ్రోల న
య్యనలునికేతు వై యలరు నధ్వరధూమము మింటఁ బర్వి నూ
తనఘనత న్వహింప శిఖితాండవనాదము లొప్పెనో యన
న్మునికృతవేదమంత్రరవము ల్విన నయ్యెడు వింటె లక్ష్మణా.
| 1135
|
క. |
ఇం దొకమునిపతి మన కా, నందంబుగ నేఁడు దర్శనం బొసఁగఁ గలం
డిందులకు నీమనంబున, సందియ మందంగ వలదు జననుతశీలా.
| 1136
|