గణపతి
గణపతి
1, 2 భాగములు
కళాప్రపూర్ణ
చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిచే
రచింపఁబడినది.
పబ్లిషర్సు :
వెలగల వీరెడ్డి,
కాలచక్రం ప్రచురణలు.
నత్తారామేశ్వరం.
(వయా) పెనుమంట్ర, పశ్చిమ గోదావరి జిల్లా.
గౌరవ సంపాదకులు :
మహీధర జగన్మోహనరావు
1966 మార్చి ముద్రణ
అవంతీ ప్రెస్, రాజమండ్రి-2.
ప్రతులు:వేయి | వెల:6- |
మనవి.
1963 నవంబరులో మా ప్రధమ ప్రచురణ “సూక్తిముక్తావళి” తో ఆరంభించి 13 పుస్తకములను ప్రచురించితిమి. కీ.శే. కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులుగారి గ్రంధములు 11టిని వెలువరచి, ప్రస్తుతము ‘గణపతి’ పూర్తిగ్రంథము ప్రకటించుచున్నాము. ఇక 1966లో పంతులుగారి లఘుగ్రంథములు మరికొన్నిటినీ, జీవితచరిత్రలనూ వేయ దలపెట్టియున్నాము. చిలకమర్తి వారి గ్రంథములన్నీకూడ విశిష్టత గలట్టివే ఆంధ్రభాషకు, ఆంధ్రదేశమునకు అనన్యసేవ గావించిన ఈ మహానీయుని గ్రంధములు మంచి గ్లేజుకాగితముపై, తప్పులు లేకుండ, మంచిగెటప్ తో ప్రచురించి, తెలుగు దేశములోని గ్రంధాలయములకు వెలలేని భూషణగా యివ్వతలపెట్టిన మాకు గ్రంథాలయాధికారులందరూ తగుప్రోత్సాహ మీయగోరుచున్నాము. విద్యార్ధిదశలోనే చిలకమర్తివారి రచనలను చదివినవారు ఉత్తమపౌరులుగా తయారగుదురని నిస్సందేహముగా చెప్పనగును.
అంతేగాదు. 1987లో శ్రీ చిలకమర్తివారి శతవార్షికోత్సవము రానున్నది. అప్పటికి శ్రీవారి గ్రంధములన్నీ వెలువర్చదలచితిమి. వారి గ్రంథములులేని గ్రంథాలయము అసమగ్రమనుట సాహసము గాదు గాన గ్రంథాలయాధికారులు, కార్యకర్తలు, విజ్ఞులు యీ గ్రంథము లన్నీ తెప్పించి, తమ పాఠకుల కందించుటయే పంతులుగారికి మన మొనర్చు గౌరవము కాదగును. విద్యాశాఖాధికారులు ముఖ్యంగా యీ విషయములో చేయదగిన దెంతైన గలదని మా మనవి.
‘సూక్తిముక్తావళి’ ప్రథమ ముద్రణపు ప్రతులు రెండేండ్లలోనే పూర్తిగా ఖర్చగుటచేత దానిని పునర్ముద్రించ దలపెట్టితిమి. ఆంధ్రపాఠక లోకము, పత్రికాప్రపంచము, పండితవర్యులుకూడ యీ గ్రంథము నెడ మంచి అభిప్రాయము నిచ్చియున్నారు. గతములోని 1250 శ్లోకములకు మరి 750 కూడ చేర్చి, గ్రంథమును మరింత శోభాయమానముగా రెండవ కూర్పులో తెచ్చుచున్నాము. ఇందులకై బహుపరిశ్రమ గావించి, యీ మార్పులు, చేర్పులు గావించిన శ్రీ మహీధర జగన్మోహనరావుగారికి కృతజ్ఞులము. మా గ్రంథమండలికి గౌరవసంపాదకులుగా ఉండి, వారు గావించుచున్న సహకారము అనన్యమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి సహకారమే మే మీ సేవలు గావించుటకు ముఖ్యకారణము అని చెప్పిన చాలును.
ఇక యీ నవలను గురించి నాలుగు మాటలు, ఆంధ్రదేశములో గోదావరీతీరస్థమైన కోనసీమ యీ నవలకు ప్రధానరంగము. కోనసీమ బ్రాహ్మణులు విద్యావిజ్ఞానములకు సుప్రసిద్ధులు. కాని యీ గ్రంధములో వర్ణించబడిన గణపతివంశచరిత్ర ఏమాత్రమున్నూ ప్రతిష్టాకరమైనది కాదు. బ్రాహ్మణులలోని అతినికృష్టమైనవిగా దీనిలోని పాత్రలను మనము తీసికోవచ్చును. అట్టిపాత్రలను ప్రవేశపెట్టుటవల్ల గ్రంథకర్త సాధించదలచిన ఆశయమేమి? పాఠకుల మనస్సులలో నవలలోని పాత్రలపట్లనూ మెత్తంగా బ్రాహ్మణులమీదనూ అనాదరమును, ఏహ్యభావమును కలిగించుటకా? లేక మరొక మహదాశయ మేమైన దీనివల్ల సాధించుటకా?
ఈ ప్రక్రియ తెలుగుభాషలో నూతనమనియే చెప్పదగును. పాశ్చాత్యనవలలో సుప్రసిద్ధమైన “డాన్ క్విక్జోట్” ద్వారా సాధించ దలచిన కవి సాంఘిక పునరుజ్జీవనమునే చిలకమర్తివారు దృష్టియందిడుకొని, గణపతిపాత్రను సృష్టించిరని తోచును. పాతసమాజములోని విలువలు, యోగ్యతలు మారినప్పుడు కాలానుగుణ్యమైన నూతనమార్పులు సాధించిన వ్యక్తుల, సంఘముల సాంఘికోపయుక్తత నిలచునే గాని లేనిచో క్షీణత సర్వదా తప్పదని వ్యంగముద్వారా యీ నవల సూచించుచున్నదని విజ్ఞుల అబిప్రాయము. ‘గణపతి’ నవల చదివి, గణపతివలె హాస్యాస్పదులు కాకుండుటకు యత్నించుమనియే కవిగారి సందేశమని ఊహింపవచ్చును.
ఆంధ్రమహాజనులు మా కృషికి దోహద మొనర్పగోరుచు సెలవు దీసికొందును.
సత్తారామేశ్వరం (వయా) పెనుమంట్ర పశ్చిమ గోదావరి. |
ఇట్లు, |
మనవి
మిత్రులు శ్రీ వెలగల వీర్రెడ్డిగారు దేశభక్తి, భాషానురక్తి గల వారు, 1962 లో తమకున్న భాషాసేవ గావించు ఉద్దేశ్య మున్నదనిన్నీ, అందులోనూ అభ్యుదయ భావవ్యాప్తి గావించుటకై గ్రంథమండలిని నడుపుటకు తమకు చేయూతనిమ్మనీ అడిగినప్పుడు వారితో మాకుగల చిర పరిచయంవల్లనే అందు కంగీకరించాను. కాని యీఉద్దేశ్యం యేడాది వరకు కార్యరూపం ధరించనేలేదు.
1963 లో వారు స్ధాపించబోవు ప్రచురణ సంస్ధకు గౌరవసంపాదకులుగా నన్నుండ మని కోరుటయేగాక నేను పాతికేండ్లుగా సేకరిస్తూ వచ్చిన సూక్తులను ప్రచురణకై తమ గ్రంథమండలిలో ప్రథమ కుసుమముగా చేసెదమనిన్నీ, తమకు ఆ అవకాశము నిమ్మనీ కోరిరి. ఆ సూక్తిముక్తావళి గా వెలువడుటయు, సంవత్సరము న్నరలోపే ప్రతులైపోయి, పునర్ముద్రణ గావించుటయు జరిగినది.
దాని తరువాత కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి గ్రంథములను వరుసగా ముద్రించ బూనికొని, అందముగా, నిర్దుష్టముగా ప్రచురించ నారంభించితిమి. గతమున ప్రచురించిన 11 పుస్తకములు గాక యిప్పుడీ సంవత్సరము 'గణపతి' 1, 2 భాగములను కలిపి ఒకే బైండు, లైబ్రరీ ఎడిషనుగా వెలువర్చితిమి. త్వరలోనే మరిన్ని కూడ వెలువడ గలవు.
భాషకు పుష్టిని కూర్చగల మహామహుల రచనలనే ప్రచురించ బూనుకొని యన్ని "కాలచక్రం ప్రచురణలు" ప్రజలయు, భాషాభిమానులయు సహాయ సహకారములు పొందగలదని ఆశించుచు సెలవు దీసి కొందును.
10-3-1966, రాజమండ్రి |
మహీధర జగన్మోహనరావు, |
విషయసూచిక
మార్చువిషయసూచిక
9 |
15 |
24 |
59 |
75 |
84 |
99 |
118 |
149 |
173 |
189 |
203 |
220 |
231 |
257 |
266 |
290 |
309 |
325 |
335 |
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.