కాశీమజిలీకథలు/ఆరవ భాగము/75వ మజిలీ

డెబ్బది యైదవ మజిలీ

మాయాతురగము కథ

అయ్యో ! మొదట మే మిల్లు వెడలునప్పు డెవ్వ రెందు డఱిగినను జివరకుఁ గాశీపురంబుఁ జేరుకొనవలయునని నియమముఁ జేసికొంటిమి. అమ్మితి దాటిపోయినది. సఖురాండ్రజాడ యేమియుం దెలియదు ఒక్కరితయు నిక్కడికి వచ్చినట్లు తోచదు. ఏదియో యిక్కట్లుఁ జెందినట్లే తలంచెచను. నేనొక్కరితను జీవించి యేమి చేయుదును. అదియునుంగాక స్త్రీ వేషముతోఁ దిరుగుదమన్న వ్యాసమఠంబున నాఁడు నిందపాలై తిని. ఈ పురుషవేషముఁ గప్పుటకు జాలశ్రమ పడుచుంటిని. చిక్కులేమిటికి ? నీ యవిముక్త క్షేత్రంబున దేహంబు విడచి ముక్తిఁ జెందెదంగాక యని ఒకనాఁడు కాశీపురంబున మకరాంక నామముననున్న రూపవతి తలంచి సాయంకాలమున నించుక చీకటిపడుచుండ మణికర్ణికా ఘట్టమునకుఁబోయి గంగలో గుభాలునదుమికినది. అప్పుడు గుప్తవర్మయు సత్వవంతుడును జల్లగాలి సేవింపుచు నా గంగయొడ్డున విహరించుచుండిరి. సత్వవంతుం డాపాటుఁజూచి తొట్రుపాటుతోఁ దోడన నందురికి తచ్చిరోజములం బట్టుకొని పైకి లేవనెత్తి యొడ్డునం గూర్చుండఁబెట్టి‌ సేదఁదీర్చుచు అయ్యా ! నీవెవ్వఁడవు ? ఏమిటికిట్లు పడితివి? నీకుఁ జావవలసిన యిబ్బంది యేమి వచ్చినది ? చెప్పమని యడిగిన మకరాంకుఁడు పుట్టము సవరించుకొనుచు నిట్లనియె.

ఓహో ! నాజోలి నీకేమటికి ? నన్నేమిటికిఁ దీసితివి? ముక్తిఁ జెందవలయునను తలంపుతో నిం దురికితిని. అంతరాయము గలిగించితివిగదా యని చెప్పిన వని యతండు నవ్వుచుఁ జాలుఁజాలు ఇదియా నీ సంకల్బము. బలవన్మరణమువలనఁ బిశాచజన్మము వచ్చునని మాగురువు మకరాంకుఁ డొకప్పుడు నాకుఁ జెప్పియున్నాఁడు. అది కడుపాపము. ముక్తికిదియా తెరవు. వేరొకమార్గములేదా ? యని మందలించిన విని మకరాంకుడు మేనం బులక లుద్భవిల్ల నుల్లము వికసింపఁ గన్నులెత్తి చూచుచు నీవు సత్వవంతుఁడవా యేమియని యడిగినది.

అవును. సత్వవంతుడనే నాపేరు నీకెట్లుఁ దెలిసినది. నీవెవ్వఁడవు ? నీవృత్తాంతముఁ జెప్పుము. నీకంఠధ్వనివిని నెప్పుడో పరిచయము చేసినట్లేతోచుచున్నది. నీవు మాగురువు మకరాంకుడవే కావుగదా అని యతం డడుగుటయు నేమియు మాటాడక యొక్కింత తడ వూరుకొని యతండు పలుమారు చెప్పుము చెప్పుము అని యడుగుచుండ నట్లే తలంచుకొనుమని పలికెను.

అప్పుఁడు గౌగలించుచు మిత్రమా ! నేను కృతజ్ఞుఁడనని కాబోలు నాతోఁదలయెత్తి మాటాడకున్నావు. దైవికంగా నప్పుడు పోవలసి వచ్చినది. ఇప్పటిదాక నీనిమిత్తమే తిరుగుచున్నాను. అయ్యో ! నీ విట్లు

అం ఆ క్యలివచ్యా

మనస్‌ నీవ రొటా దప్పితప అన్నిన్న్యాం ఎ ఎషెయి దాటిన ము..(గిపోప్పుుపునిదొః యని బింగిల్పుచుంఎ. సతనికందె బంచుకన.ంచు నడచి యతనినాత. చేచుచు సలునంబడి యున్న గుప్తవర్మ మరల వెనుకకువచ్చి సత్వవంతా ! అందు నిలచితివేల? రమ్ము రమ్ము ప్రొద్దుపోయినదని పిలచెను.

అప్పుడు సత్వవంతుఁడు సంభ్రమముతో వయస్యా యిటురా ! దైవికముగా మద్గురువరుం డిందుఁ గాన్పించినాఁడు అని పిలుచుటయు నతండు సమీపించి‌ యీయన యెవ్వండు; అని యడిగిన నతం డితడే మదీయప్రాణబంధుండు మకరాంకుడు. వీని యనుగ్రహముననే విద్యా చ్త దృక్సంపన్నుఁడనైతిని. అని చెప్పుటయు గుప్తవర్మ ఓహో ! ఆయనదర్శనమె యైనదా ! యని యగ్గడింపుచు అయ్యా ! మా సత్వవంతుఁడు త్రికాలము లందు మిమ్ము స్మరింపనిగడియలు లేదు. ఏ మాటవచ్చినను మీ మాటయే యుదహరింపుచుండెను. మిమ్ముంగదిలో విడిచి వచ్చెనట. అందుకూరక పశ్చాత్తాపముఁ జెందు చుండును. మీ నెలవేదియో యెరుగక పోవుటచే దేశములు తిరుగుచున్నాఁడు అని చెప్పెను.

ఆ మాటలు విని మకరాంకుఁడు అయ్యా ! మా సత్వవంతుఁడను చున్నారు. తమరెవ్వరు? సత్వవంతుఁడు మీ కెట్టిచుట్టము అని యడుగుటయు సత్వవంతుండా గాధ యంతయుఁ జాలయున్నది. నేను చెప్పెద నింటికిఁ బోవుదము రమ్ము. ప్రొద్దు పోవుచున్నది. అని పలికి హస్తగ్రహణము స్మగహణము లేవనెత్తెను. మకరాంకుఁడును దత్సంపర్కంబు మకరాం కాంకములు మోసు లెత్త నుత్సాహముతో లేచి యతని కై దండఁ గొని నడువసాగెను. రెండవదెస గుప్తవర్మ నడుచుచుండెను.

అప్పుడు సత్వవంతుండు గురుఃవరా ! యీతని నిమిత్తమే కదా! శశాంకుడు నన్ను సౌగంధికనగరమునకుఁ బంపెను. రాజపుత్రులనెల్ల విడిచి సౌగంధిక యీతనినికాదె వరించినది ! మీ యందువోలె నీతనియందును సుగుణములు చాలఁ గలిగి యున్నవి. మేముఁ జూచికొనిన గడియ మొదలు నేటిదనుక గడియయైన విడవక కలసి తిరుగుచున్నారము. మిత్రులం గలసికొను తలంపుతో నంతఃపుర‌మునకు వచ్చుచు విడువలేక నన్నిఁ దీసికొనివచ్చెను. నేనును నీవు కనంబడదు వేమో యను నాసతో వచ్చితిని. నామిత్రుఁడు నీమిత్రుఁడే కావున సుహృల్లాభమునకు నీవును సంతసింపఁ దగిన దేయని యతని వృత్తాంతము తా నెరింగినది వక్కానించెను.

పిమ్మట గుప్తవర్మయుఁ బేరెత్తి వయస్యా ! ఈ క్రొత్త‌ చెలికాని వృత్తాంతము నాకును వినవేడుక యగచున్నది ఎరింగింతువే యనుటయు సత్వవంతుఁ డిప్పుడుకాదు. రాత్రి పండుకొని యంతయుం జెప్పుకొందము. ఇతండు మిగుల నొగిలి యున్న వాఁడని పలికెను.

అట్లు వారు మాట్లాడుకొనుచు నింటికిం బోయిరి. చీకటిలోనొకరిమొగ మొగనికిఁ గనంబడమి గురు తెరంగుటకు వీలులేదు. వారి నిమిత్తము వంటఁ జేసికొని పరిజనులు వేచియుండిరి. కావున వెంటనే భోజనములు చేసి సౌధోపరిభాగమునకుం బోయి -------------- గూర్చుండి యిట్లు సంభాషించుకొనిరి. సత్వ :- వయస్యా ! మకరాంకా ! ఇం దాక నీవృత్తాంత మితండు వినఁ గోరికొనియెంగదా? నీ జన్మ భూమియేది? తలిదండ్రు లెవ్వరు? ఏమిటికిట్లు ఇల్లు వాకిలి విడిచి యొక్కఁడవు తిరుగుచుంటివి? నీవిరక్తికిఁ గారణమేమి? మర్మమువిడిచి చెప్పుము. నాడు నిన్నింత గట్టిగా నడుగలేదు గదా ?

మక :- నీవు నాహృదయబంధుండవనియే తలంచుకొంటి. నీకడ మర్మమేల చెప్పెదను వినుము. నాజన్మ భూమి విశాలాపురము. మేము నలువురము సఖులము. దేశములు చూచు తలంపుతోఁ దలిదండ్రుల మోసముఁ జేసి యిల్లు వెడలితిమి తలయొక తెరవునం బడుటచే వారిం గలిసికొనఁ దిరుగుచుంటిని.

గుప్త :- (స్వగతం) నే ననుకొనినిట్లే ఇది రూపవతియే. స్వరమువిని మొదటనే యనుమానపడితిని. అమ్మయ్య! నే డెంత సుదినము తటాలున లేచి కౌఁగలించుకొందునా? ఏమో ! నాయూహ యసత్యమైనచో మోసముగదా? (పకాశం) అయ్యా! మొదటినుండియుఁ దమపే రిదియేనా?

మక :- (స్వ) ఇది శీలవతియా యేమి? రాజబంధువుఁడని చెప్పెను. స్వరము పోలిం స్వరము లుండునేమో? నాకట్టి యదృష్టము పట్టునా? (ప) అట్ల డిగితివేల? మొదటనొక పేరును దరువాత నొక పేరును బెట్టుకొందురా యేమి?

గుప్త :- వేషభాషలు కార్యానుగుణ్యముగా బుద్ధిమంతులు మార్చుకొను చుందురని యడగతిని తప్పా?

మక :- (స్వ) ఓహో! శీలవతియే. సందేహము లేదని సంతసమున (ప్ర) నీవేమైన నట్లు మార్చితివా యేమి? నీ వృత్తాంతము మాత్రము నేను కొంచెము వినవలదా?

గుప్త :- విందువుగదా! చెప్ప కెక్కడికిఁ బోయెదను. మొదట మీరీ నగరంబును జేరికొనునట్లు నియమముఁ జేసికొంటిరా యేమి?

మక :- అవును. (అని సాబిప్రాయముగాఁ దన్ముఖమునఁ జూట్కులు బరగించెను.)

అప్పుడు గుప్తవర్మ తటాలునలేచి హా! రూపవతీ! నిజముఁజెప్పక నన్నింత వేపెదవేల ?నిన్నెన్నాళ్ళకుఁ జూచితిని కౌఁగలించుకొనుటయు అయ్యో! శీలవతీ! నిన్నెరుంగక తొట్రుపడు చుంటినని పలుకుచు నుపగూహనమిన్చినది. అట్లిరువురు బిగ్గరగా గౌఁగలించుకొని దుఃఖింపఁ దొడంగిరి.

సత్వవంతుఁడు వెరగుపడుచు అయ్యో ! అయ్యో ! ఇదియేమి? ఇట్లు శోకించెద రేమిటికి? మీ రొండొరులు తెలసినవారాయేమి? రూపవతీ! యని పిలిచితిరి. వారెవ్వరు ? మీ కథ వినుదనుక నా మనసు వేగిర పడుచున్నది. చెప్పుడు. చెప్పుడు. అని తొందరపెట్టుటయు వారిరువురు నశ్రుజలంబులం దుడిచికొన విడుమర వహించిరి. అప్పుడు గుప్తవర్మ సత్వవంతుని మొగముఁజూచి మహాబలా! మా వృత్తాంతము విని నీవు పరిహసింతువేమో ? అయినం జెప్పకతీరదా! ఆకర్ణింపుము. శీల కళా విద్యా రూపవతులని పేరుపొందిన మేము నలువురము సఖురాండ్రము. విశాలాపురంబున విద్యాభ్యాసముఁ జేయుచుంటిమి. మాలో శీలవతీ విద్యావతులకుఁ గులాచార ప్రకారము తండ్రులు వివాహముచేయఁ బ్రయత్నించుటయు సమ్మతిలేక దేశాటనము జేయు తలంపుతో నా కన్నెల నూరు దాటించి నదిలోఁబడి మునిఁగిరని కళావతియు రూపవతియుఁజెప్పి యాప్తులనెల్ల గష్టములఁ బాలుజేసిరి. వారిలో శీలవతి యను దాననే నేను. ఇదియే రూపవతి. నేనును విద్యావతియు నాటిరేయిఁ బురుష వేషముల వైచికొని పురము వెడలి యొక యడవి మార్గంబునంబడి తురగా రూడులమై యరుగుచుఁ దెల్లవారువరకుఁ బెద్దదూరము పోయితిమి. అప్పటికిఁ దత్తడులు బడలికఁ జెందుటచే వాని విడచి కాలినడకలనే పయనము సాగించితిమి. సాయంకాలమున కొక యగ్రహారముఁజేరి సోమభట్టారకుఁడను పండితునియింట విద్యాభ్యాస కైతవమున బ్రవేశించి నాపేరు గుప్త వర్మయు విద్యావతిపేరు కృతవర్మయనియుం జెప్పి సఖురాండ్రరాక నిరీక్షించుచుఁ గొన్నిదినములు వసించితిమి అట్లుండ నాతని కూఁతురు కురూపిణియగుటఁ కుదిరినపెండ్లి బెడసిపోవుట నడలుచు మమ్మడిగికొని గురుండు నా కాఁడువేషమువైచి యిదియే పెండ్లి కూతురని చూపి తనపని యెట్లో నెరవేర్చుకొనఁ బాటుపడెను. గాని యది విపరీతమైనది మరియు నా పరిణయ మధ్యంబున మజ్జనకుండు యజ్ఞదత్తుం డక్కడికి విరక్తుండై యరుదెంచుటయు మే మందు నిలువక పారిపోయితిమి.‌

మేమట్లు పోయిపోయి యొకనాఁటి మునిమాపున కొక గ్రామముజేరి యొక యింటి జిగిలిపైఁ బండుకొంటిమి. నడక బడలికచే విద్యావతి గాఢముగా నిద్ర వోయినది నా కదియేమియో నాఁకు కూరుకు రామింజేసి యెద్దియో ద్యానించుచుఁ బండుకొంటిని. నడిరేయి యగుడు తురగము పారిపోవుచున్నది. మరలింపుఁడు మరలింపుఁడు అని యరచుచు నొకఁడు వెనువెంటరా నొక త‌త్తడి యడుగుత్రాళ్ళం ద్రెంచుకొని యా వీధి నతిరయంబునఁ బరుగిడి వచ్చుచుండెను.

నేనా రొదవిని తటాలునలేచి యదలించుచు వారువమున కెదురు వోయితిని. కాని యది నిలచినదికాదు. అప్పుడు గొప్పయలుకఁ దెచ్చుకొని వెన్నంటి పరుగిడ రివ్వున నెగసి దానిపయిం గూర్చుంటి. అయ్యారే! ఏమందును ? అప్పుడది కీలుత్రిప్పిన బొమ్మ వలె నెగసి యతి రయంబునం బారఁదొడంగెను. జీనును వాటము లేకున్నను నాఁ దురగమెక్కు పాటవము గలిగియున్నది. కావున నించుకయుం జంకక బింకముగా దాని నడుముఁ గాళ్ళతో నదిమిపట్టుకొని యట్టిట్టుఁ గదలక

సీ. ఇదిమూల మిదియగ్ర మివి శాఖలని నిరూ
              పింప నించుకయుఁ గాన్పించదయ్యె
    నివిమ్రాకు లివిమోక లివివాకలని నిరూ
              పింప నించుకయుఁ గాన్పించదయ్యె
    నిదిపురం --దివసంబని నిరూ
              పింప నించుకయుఁ గాన్పించదయ్యె
    నిదిపల్ల మిదిమెట్ట యని నిరూ
             పింప నించుకయుఁ గాన్పించదయ్యె.

గీ. దరులు గిరులును నదులు గాంతారములును
    భూమి యాకస మొక్కటైపోయె నాకు
    నెట్లు నిలిచితినోకాని యెరుఁగ నందు
    నతిరయంబున నాహయం బరుఁగునపుడు.

అట్లా రాత్రియెల్లఁ బరుగిడి ప్రొద్దుపొడుచువరకు సౌగంధిక నగర బాహ్యోద్యానవనంబుఁ జేరి యా వారువంబు నిలిచినది. దాని మేనంతయుఁ బ్రావాహంబుగాఁ జెమ్మటలు కారుచుండెను. అప్పుడు నన్నుఁ బునర్జీవితుఁగాఁ దలంచికొని దానికడుపున నంటికొనియున్న పాదంబులెట్టకే లాగికొని మెల్లఁగాఁ బుడమికిదిగి కన్నులు తిరుగుచుండ నిలువలేక నేలం బండుకొంటిని.

పెద్దతడవున కలయిక తీరుటయు లేచిచూడ నా బాడబమందు గనంబడ లేదు. అప్పుడు శ్రీరాముని భంగపరచిన తురంగము తెరంగున నీ తురంగము నన్నిక్కడికీడ్చుకొనివచ్చి మిత్రవియోగముఁ గావించినది. ఇది కపట ఘోటకము. అని నిశ్చయించి యటఁగదలి పురములోనికింబోయి వింతలు చూచుచుండఁ బౌరులు గుంపులుగుంపులుగాఁ గూడికొని యెక్కడికో బోవుచుండ వారివెంట నేనుం బోయితిని. అప్పు డప్పురమునకుఁ దూరుపుగానున్న తోటలోని చ్యితశాలలో సౌగంధికయను రాజపుత్రిక స్వయంవర మహోత్సవము జరుగుచున్నది. పిలువం బడిన పౌరులెల్ల నా శాలలోనికిం జని యుచితస్థానములం గూర్చుండిరి. కావలివారలు నన్ను లోనికిం బోవనిచ్చిరికారు. ఆ ప్రాంతమందున్న యశోకపాదపమునీడ నిలువంబడి యా వింత జూచుచుంటిని.

ఆ రాజపుత్రిక యందున్న రాజకుమారుల నెవ్వరిని వరింపక పుష్పదామంబు హస్తంబున వ్రేలాడుచుండ మరల నింటికిం బోవుచు దారిలో నన్ను సవిస్తరముగాఁజూచి తలయూచుచు నా చెంత కరుదెంచి యా పుష్పదండ నా మెడలో వైచినది. అప్పుడే పరిచారికలు వచ్చి నన్నందల మెక్కించి రాజోపరివారములతో రాజభవనమునకుఁ దీసుకొనిబోయిరి.

అందులకేకదా యీసుంబూని రా కొమరులెల్ల నట్టహాసముతోఁ గోట ముట్టడించిరి. మీ సహాయంబునంగాదే యా యిక్కట్టుఁ బాసితిమి తరువాయికథ మీ రెరింగినదే గదా? నన్నుఁ బురుషుండని యా చిన్నది వరించినది. పెండ్లియాడుమని నిర్బంధించిన నేనేమి సేయుదాన. యాత్రాకై వతంబున మిషపెట్టి దాటించికొని వచ్చితిని. ఆ సౌగంధికకును భర్తవు నీవేయని యప్పుడే తలంచితిని. అది యట్లుండె. కృతవర్మ నామముతోనున్న విద్యావతి యేమైనదో తెలియదు. అని తనకథ యంతయుం జెప్పినది. రూపవతియు దానిల్లు వెడలినది మొదలు నాటి తుదవరకు జరిగిన వృత్తాంత మంతయుం జెప్పినది.

ఇరువురకథలు విని సత్వవంతుండు భళిరా ! ఎంత చోద్యము ! మీ రాడువారలై యెంతదేశముఁ దిరుగుచున్నారు. ఎంత గట్టివారలు. నేను మీఁతోఁ గలసి తిరుగుచుండియు మీ తెఱంగించుకయుఁ దెలిసికొనలేక పోయితింగదా ? ఔరా ! ఎంతసాహసముఁ జేసితిరి. ఎట్టివ్యూహలు పన్ని యిల్లు వెడలితిరి. అని యూరక యక్కజమందఁ జొచ్చెను. వారు రాత్రియెల్ల నా కథలే చెప్పుకొనుచుండు నంతలోఁ దెల్లవారినది.

అప్పుడు రూపవతి అక్కా! శీలవతీ ! ఈ నడుమ యెవ్వరో యొక పద్యముఁ దీసికొనివచ్చి నా యొద్దఁ జదివిరి. అది కళావతి వ్రాసినదని నిశ్చయించి యిందు రమ్మని మరలఁ పద్యమును వ్రాసిపంపితిని. మన సఖురాండ్రిరువురును నీ వీదే చేరియుందురు. ఇప్పురంబు బహుజనాకీర్ణమగునఁ దెలిసికొనుట కష్టము. పట్టణములన్నియుఁ దిరుగుచుండిన నెందో కనంబడక మానరని చెప్పినది.

విద్వత్కేసరికథ

అందుల కామె యంగీకరించినది. అప్పుడే వారు మువ్వురు స్నానము నెపంబున గంగానదికింబోయిరి. అప్పుడు స్నానముఁ జేయుచున్న విద్వత్కేసరి రూపవతిం జూచి గురుతుపట్టి దాపునకుఁజేరి చిన్నవాఁడా ! నీ పేరు మకరాంకుఁడుకాదా? నీవు నన్నెందైనఁ జూచినజ్ఞాపకమున్నదియా? యని యడిగిన రూపవతి తెల్లపోయి మీపే మసహ€ బరిన్‌య మెక్కడ6 గలిగినదో తెలుపపలయునని పలికినది. అతండు సపు వ్వుచు నేను సత్యవంతుని ళం, సిన్‌, కాసరు(డ. నాడు. కొంది లిక మా మంటనుండి వై వానికి విద్యీలం జెప్పలేదాః నాండుసుత నా సుతుండు న్‌ సిన్ములంబదలేదు, ఎందున్నవాడో యేకందువా! యని యడిగిన విని ఏపనుచు ఆ : ఏమీ: మీరు కాసపం+! భాసరండు కిరాతుండుకాదా? పీ లంవల గసబతుచున్నడేకి మము ఎట్టు. నమ్మందగియన్నట అబన చిమ పోప్పుచని పలికెనం.

చింటు. వాబూ: సిక్కముగా నేను గాసరుచనే, శాషగసుండనె

స ల్‌ (నన నాఁడట్లుంటి నిప్పుడీ క్షేత్రంబునకు వచ్చి తొంటిరూపుఁ గైకొంటినని తన యుదంతమంతయు నెరింగించెను. ఆకథవిని తన మనోరథ మీడేరునని యుబ్బుచు నబ్బురపాటుతో నాపాటలగంధి ఆర్యా! నీకొమరుండడుగో! ఆమూల స్నానముఁ జేయువాఁడే. నీ వాతనిం గురుతు పట్టలేకపోయితివి. అని యెఱింగించిన నందు నిలువక యతండు సంభ్రమముతో నరిగి నాయనా! మమ్ముమరచి దేశములు తిరుగుచుంటివా అని పలుకుచు వానిం బిగ్గరఁ గౌఁగలించుకొనియెను.

సత్వవంతుండు నివ్వెరపాటుతోఁ జూచుచు నయ్యా! తమరెవ్వరో నాకుఁ దెలియకున్నది. నన్నెవ్వరనుకొనుచున్నారు! మీ పేరు వినుదనుక మీకుఁ ప్రత్యుత్తర మిచ్చుట కవకాశము లేకున్నదని పలుకుటయు రూపవతి దాపునకువచ్చి పకపకనవ్వుచు సత్వవవంతా! నీ వీయనను చెప్పికొంటివేని నీకు నూరుదీనారములు కానుకగా నిప్పింతు ఈయన కడుదవ్వువాఁడు. నిదానించి వాక్రువ్వమని నవ్వుమాట నాడినది.

అప్పుడా బ్రాహ్మణుఁడు తండ్రీ! నేను నీతండ్రినే. శశాంక మహారాజు ధర్మమున నిప్పురి కరుదెంచి విగతశాపుండ నైతినని మరలఁ దనకథ యంతయు నతని కెఱింగించెను. సత్వవంతుఁడు తాను బ్రాహ్మణ కులుండనని యెఱింగినపిమ్మట బొందిన యానంద మిట్టిదని నుడువుటకు నా తరముగాదు. శీలవతియు దానికిబ్బడి మురిపెముఁ జెందినది.

రూపవతి శశాంకుని పేరువిని యతండు కళావతియైనచో మనము మిగుల ధన్యులముగదా? కళావతికి రాజ్యమెక్కడిది? అయినను జూచివచ్చుట లెస్సయని శీలవతితో నాలోచించినది. విద్వత్కేసరియు వారినందర వెంటఁబెట్టుకొని శశాంకుని సౌథంబునకుఁ బోయెను.

రూపవతి దూరంబుననే శశాంకుని జూచి గురుతుపట్టి శీలవతితో అక్కా! మన మిప్పటికిఁ గృతకృత్యుల మైతిమి. విద్యావతియు నీయూరనే యుండును. దైవ మిప్పటికి మరలఁ మనలఁ గూర్చెగదా? నన్ను గురుతుపట్టునో లేదో జూతముగాక అని మాట్లాడుకొనుచు వారు దాపునకుఁ బోయిరి.

అప్పుడు విద్వత్కేసరి మహారాజా! ఇదిగో మా సత్వవంతుఁడు గంగానదిలో స్నానముఁ జేయుచుండఁ గనంబడియెను. వీరు వీనిస్నేహితులు. పొతునల 2 సప్పిన మకరాలకుం గేశండే. వైవికముగా సితండును పనిం గలిసికొన ఎను. పరం పండగనే యంకడుమున్ను సత్వవంతు9 పె, బసరింప(జీసిన తశ్క.చుపుటబుపరలించి నుం ంకుం ఖూచుచు దూటున లేచి యోహోః యీమి ౮ మ గా అపసిం ,తగలించకాసుచు వయనాఖి ౫ న్నేన్వరనుకాంచఏ? గురుతు స స? బములో వెడిచి వచ్చిదనం కోపించితి? నాతప్ప్ర మ, ్నఆపునం అదియంను ప్‌యం యేమమా ముచ్చటిెంచెను. అప్పుడు రూపవతి అన్నా! నీవు రాజువు కావున మరచిన మరతువు. నాకేల తెలియకండెడిని. ఈతం డెవ్వడో యెరుఁగుదువా? నీప్రజ్ఞ చూతము చెప్పుము. అని శీలవతింజూపుటయు నతండు మాటాడినంగాని చెప్పఁజాలనని ప్రత్యుత్తరమిచ్భెను.

బాల్య యౌవనాంతరదశల యందును యౌవనవార్దక్యాంతర దశలయందును జూచుట యించుక యెడమయ్యెనేని నెట్టివారికి గురుతుపట్టుట కష్టము. రూపవతి శీలవతిని మాటాడవద్దని సంజ్ఞఁ జేసినది శశాంకుఁ డించుక‌ మొగము పరిశీలించి చూచి ఆ! తెలిసికొంటిఁ దెలిసికొంటి మన మొదటిమిత్రుఁ డితఁడే. అన్నన్నా! నన్నింత మోసముఁ జేసితిరి. అని పలుకుచు నతని నాలింగనముఁ జేసికొనియెను.

శీలవతి నవ్వుచు నిప్పటికిఁ దెలిసికొంటివిగదా! యని యభినందించుచు నప్పటికిఁ దగినరీతి సంభాషించినది. సత్వవంతుం డది యంతయుఁ జూచి నవ్వుచు నిమ్మహారాజు మీనలువురలో నొకఁడాయేమి? పోలికఁ జూడ నట్లే కనిపించుచున్నది. బళిరా! మీరెంత చేయఁగలవారు? మీకు మీర సాటియని యతం డాశ్చర్యము జెందుచుండ శశాంకుఁడు రూపవతివంకఁ జూచి యీతని నెరింగించితిరా? యని సంజ్ఞఁ జేయుటయు నెరింగించితిమని సూచించినది.

అప్పుడా మువ్వురు పువ్వుబోణులు రహస్యముగాఁ గూర్చుండి యొండొరులు పడిన కష్టసుఖంబుల నొండొరు లెరింగించు కొనిరి. విద్యావతి జాడయే తెలియవలసియున్నదని తలంచుచు నాఁడు సుఖముగా వెళ్ళించిరి.

విచిత్రనాటకము కథ

మరునాఁడు వారు వాకిటఁ గూర్చుండి‌ ముచ్చటించుకొను చుండఁగా వీధిలోఁ జాటింపు వినంబడినది. అది యేదియో తెలిసికొని రమ్మని పరిచారకు నొకని బంపుటయు వాఁడు వోయి యొక నాటక వ్రకటనపత్రికం దెచ్చి వారికిచ్చెను. అందిట్లు వ్రాయఁబడియున్నది.

“కృతవర్మయను కవిచే రచింపబడినది శీలకళావిద్యారూపవతుల చరిత్రము. కరుణరసప్రధానము. ఈ కన్నెలు నలువురు మిక్కి.లి చక్కనివారలు. పెద్దగాఁ జదివిరి. వీరిలో శీలవతికిని విద్యావతికిని దండ్రులు పెండ్లి చేయవలయునని ప్రయత్నముఁ జేయ నిష్టములేమింజేసి పెండ్లికూఁతుండ్రు నదిలో మునిగిరని ప్రధఁ గల్పించి కళావతీ రూపవతులు వారి నూరు దాటించుట (కడునాశ్చర్యము) వారు సఖుల జాశ వేచి యొక యగ్రహారములో విద్యాభ్యాసము సేయుట శీలవతి పెండ్లికూతురు వేషము వైచుకొని గురువుపుత్రికకుఁ బెండిఁ జేయఁబూనుట. (హాస్యారసము) అని యీ ను ప్రచుకొని గుకుపు తికకు( బెండ్లి ( నేయగలూనుర. (నోస ఎవి తెంఆల్య గబా మంఠయునుపేన య్‌ ఇ గాచు వినాచు * సాలతచును రచంగనవత సెం వ్యతపత్మయే ఎ నిందఎములేదు... మనలం బలినకోను తలంపుత' ౧.౪ వర్మింప( జేయఁబూనెను. కానిమ్ము మననోము లిప్పటికిఁ బండినవిగదా యని తలంచుచు నప్పుడే యొక పరిచారకుని నాటకశాలయొద్ద కరిగి యా కృతవర్మ యెందుండునో తెలిసికొని రమ్మని పంపిరి.

వాఁడు పోయి వచ్చి అయ్యారే! నాటకసంఘమువారు. మహా రాజులకన్న నెక్కుడు వైభవముతో నున్నారు. మాబోటివారితో మాటాడుదురా? నామాట వినిపించుకొనినవాఁడే లేడని చెప్పెను. పోనిమ్ము. ఈ రాత్రి నాటకమునకుఁ బోయి యా యాటఁ జూచి పిమ్మట నతని విమర్శింతు మని పలికిరి. సత్వవంతుండు మీ చరిత్రము రామాయణమువలెఁ బ్రసిద్ధికెక్కినదని పరిహాస మాడుచుండఁ గథానాయకుఁడవు నీవేకాదా? నీకుం బ్రఖ్యాతి రాగలదని యుత్తరము చెప్పినది.

అట్లు వా రా పవలెల్లఁ బరహాసోక్తులతోఁ గడపి రాత్రిపడినతోడనే విద్వత్కేసరి తోడురా దివ్యమాల్యాంబరాను లేపనాదుల ధరించి నలువురు గలసి యానాటకశాలకుఁ బోయిరి. దేశాధిపతులును సామంతులును గూర్చుండఁ దగిన పీఠములు శ్రేణిగా నాశాలయం దగ్రభాగమున నమరింపఁబడి యున్నవి. వీ రేగురును దొలుతనే పోయి యాపీఠములనే యధిష్టించిరి. తరువాతఁ గ్రమంబునఁ బెక్కుండ్రు మహరాజులు వచ్చిరి. లన్నియు సరిపోవమింజేసి కొందరు రెండవశ్రేణి గద్దియలం గూర్చుండిరి. పౌరు లనేకులు వచ్చి యా యా భాగంబులన్నియు నిండించిరి. పెక్కు లేల నాటకశాల యంతయు జనులచే నిండింపబడి యిసుఁగ జల్లిన రాలకకుండ దట్టమై యుండెను.

అప్పుడు నియమింపబడిన కాలమునకే నాటకము ప్రారంభింపఁబడెను. నాందియైన తరువాత సూత్రధారుండు తెర వెలుపలికి వచ్చి చెప్పవలసిన మాటలఁ జెప్పి లోపలికిఁ బోయెను. అంతలో శీల కళా విద్యావంతుల వేషములు ప్రవేశించినవి. కృతవర్మ విద్యావతివేషము వైచికొనినను వారు ధరించు నగలును బట్ట-------- మాల్యాను లేపనాదులచే యా భూమికలు దాల్చుటచే నచ్చముగా వారి పోలికనే యొప్పు చుండెను.

అందుఁ గూర్చున్న శీల కళా రూపవతు లాభూమికలఁ జూచి తమ ప్రతిబింబములాయని విస్మయపడఁ జొచ్చిరి. అవేషములఁ జూచి యాసభలోఁ గొందరు పీఠములనుండిలేచి నిలువంబడి హా! పుత్రీ! శీలవతీ! హా! కళావతీ! హా! విద్యావతీ! హా! యని యార్తనాదములు కావించుటయు రక్షకభటు లాకోలాహలము వారించుచు వారినెల్ల మరలఁ బీఠములఁ గూర్చుండఁ జేసిరి.

పిమ్మట నాభూమికల సంభాషణములు సభ్యులకుఁ మిక్కిలి విస్మయముఁ గలుగఁ జేసినవి. చరిత్రాంశములనెల్ల మనోహరముగా బ్రదర్శించిరి. నాటకాంతరమున మంగళగీతములఁ బాడినతోడనే పీఠమునుండి యొకఁడు లేచి నిలువంబడి యిట్లనియె.

అయ్యా! యీనాటకము రచించిన కృతవర్మ యీ కధాకల్పన మెట్లుఁ





. గావించెనో తెలిసికొనవలసియున్నది. నే నా శీలవతి తండ్రిని. యజ్ఞదత్తుండ ఇందు శీలవతియు విద్యావతియు నదిలో మునుంగుట యసత్యమని వ్రాయబడినది. మే మందులకు దుఃఖించుచు దేశముల పాలై తిరుగుచుంటిమి. మీ నాటకప్రకటనపత్రిక యందలి కథాసంగ్రహముఁజూచి యవ్విధముఁ దెలియఁగోరి యిక్కడికి వచ్చితి ననుగ్రహించి యాకృతవర్మం జూపుఁడని వేడికొనియెను.

ఆవెనుకనే మరియొకఁడులేచి అయ్యా! నేనా విద్యావతి తండ్రిని. ధనపాలుండ. నాకన్నె నిమిత్తమే విరక్తిఁజెంది యిప్పురమునకు వచ్చితిని. ఈ కథయందలి నిజానిజంబులు నాకునుం దెలిసికొనవలసిన యవసర మున్నదని చెప్పెను. అప్పుడే వృషాంకుఁడు లేచి తన కులశీలనామంబులు తెలియపరచి సభాప్రవృత్తి యెట్టిదో నుడువుడఁని యడిగెను.

ఆమాటలన్నియు విని యాసభకు వచ్చియున్న ధర్మపాలుండును నిలువంబడి యోహో! నేడెంత సుదినము. ఈ నాటకసమాజమువారు మా కెట్టి యుపకారముఁ గావించిరి? నామిత్రు లందరు నిందే కూడియుండిరి. పుత్రికా వియోగముకన్న నీ యజ్ఞదత్తు నిమిత్తము నేను మిక్కిలి చింతించుచున్నాను. ఈ తండు నా మంత్రి యేదియో నిందించెనని కోపించి మరల నా చెంతకు రాడయ్యెను. నేఁ డీ మహాత్ముం గంటిని. మరియు నీనాటకము వ్రాసినట్లు వారిమరణము లసత్యములై నచో మేము మహా పుణ్యాత్ములముగదా? కృతవర్మ మాకా మర్మ మెరింగించి యనేక దానధర్మముల పుణ్యము నొందుగాక యని యుపన్యసించెను. అప్పుడు సభాస్తరులందరు నామాటలు విని మిక్కిలి యక్కజమందుచుఁ గృతవర్మ వచ్చి యేమిచెప్పునోయని యవనికాభిముఖులై చూచుచుండిరి. అంతలో సూత్రధారుఁడు వచ్చి అయ్యా! నాటక కథలోఁ గొంత బూటక ముండునని మీ రెరింగినదేకదా? ఈ కృతవర్మ వారి వివాహకాలమందుండుటచేఁ గథ నిట్లు మార్చి రచించెనని తలంచుచున్నాఁడ. అయినను గృతవర్మ నేఁడు జ్వరపీడితుఁ డగుట నిప్పుడు మాట్లాడుట కసమర్ధుండై యుండెను. ఈ విషయములు వినఁగోరువారు రేపు మధ్యాహ్న మీ సభకు రా వేడుచున్నాము. ఆతం డా తెఱంగంతయు నప్పుడు వివరింపఁగలడని చెప్పి లోపలికిఁ బోయెను. ఆమాటవిని సభ్యులందరు గోలాహలధ్వనులతో లేచి నాటకశాల వెడలి యవ్వలికిఁ బోయిరి. వీరుమాత్ర మందుఁ గూర్చుండిరి. అప్పుడు కొందరు పరిజనులు వచ్చి మీకింకను గూర్చుండిరేల? తలుపులు బంధింపవలయు నవ్వలికి దయచేయుఁడని వినయముగాఁ బ్రార్దించుటయు మే మా కృతవర్మ మిత్రులము. వానితో మా మాట చెప్పిరండు. పొమ్మన్నఁ బోయెదము. గుప్తవర్మ పిలుచుచున్నాడు. అని చెప్పుడని పలికిన వారువోయి యా మాట చెప్పిరి. కృతవర్మ యతిరయంబున జనుదెంచి గుప్తవర్మ యెందున్నాడని పిలుచుచు నతనిం జూచి బిగ్గరఁ గౌఁగలించుకొని అన్నా! యెట్లు వచ్చితివి? నాఁడేమై పోతివి? -------------- యేమైనం తెలిసినదా? అని యడుగుచుండ నవ్వుచు వీ రెవ్వరో చూడమని పలికెను. వానింజూచి గురుతుపట్టి సాధు సాధు నాయత్నము సఫలమైనదిగా? నా తలంచిన కార్యము సాద్గుణ్యము నొందినది. నా సఖులందరుఁ జేరికొనిరని పలుకుచు వారి నభిజ్ఞాన పూర్వకముగా నానందింపఁ జేసెను.

అప్పు డందరుం గలసి శశాంకుని నెలవుకుం బోయి సౌధోపరిభాగంబునం గూర్చుండి మరలఁ దమ వృత్తాంత మొండొరులకుం దెలియజేసికొనుచు నిట్లు సంభాషించుకొనిరి.

రూపవతి :- సఖులారా ! ఇప్పుడు మన తండ్రులు నలువురు నిచ్చటికి వచ్చినట్లు తెల్లమైనదిగదా? రేపు వారికి మనము తెలుపుకొన వచ్చునా రాదా! అప్పుడు నా కేమియుం దోచక నట్లు చెప్పించితిని.

శీలవతి :- చాలుఁజాలు నింకనుం దెలుపక యేమిచేయుదము? ఈ పడిన పాటులు చాలవా?

విద్యావతి :- అవశ్యము కనఁబడవలసినదే. ఇందాఁక వారి దైన్యాలాపములు వినఁ జాలజాలివేసినదిగదా ? పాప మా యజ్ఞదత్తుఁ డట్టి శోకమున కర్హుఁడా ?

కళావతి :- మనకు మనమైపోవుట యుక్తిగాదు. ఆ కేసరి నంపి వారి నిక్కడికే రప్పించవలయను.

రూపవతి :- ఆయనకు మన రహస్యములు వెల్లడించినారా ?

కళా :- లేదు. లేదు. ఈ గొడవయేమియు నెరుఁగడు. మనము మగవారనియే యతని యభిప్రాయము.

విద్యావతి :- సత్వవంతుఁ డెరుఁగునా ?

కళా :- వానికిం జెప్పితిమి. మన మాతనిని వరించుట కందరికీ నిష్టమేనా?

రూప :- అది మనయిష్టముకాదు. భగవంతుని యిష్టమే.‌ ఆ కథ యంతయును విని మరల నా మాట యడిగెద వేమిటికి? అతని యిష్టము తెలిసికొనుట లెస్స.

కళా :- విధిలిఖిత మాతఁడు మాత్రము తప్పింపఁగలడా ?

రూపవతి :- అడిగి చూడరాదా ? ఇట్టె వచ్చుచున్నాఁడు.

సత్వవంతుఁడు :- (ప్రవేశించి) నన్నుఁజూచి నవ్వుచున్నా డేమి? మీ రహస్యముల కంతరాయముఁ జేసితినా యేమి?

శీలవతి :- నీకడ రహస్యములు లేవుగా ? మరేమియునులేదు. నీవు మాకుఁ జేసిన యుపకృతికిఁ బ్రతియేమి చేయవలయునని యాలోచించుచుంటిమి.

సత్వ :- మీకు నేనేమి చేసితిని?

శీలవతి :- అరులచేఁ గట్టబడిన నన్ను విడిపించినది మరతునా? అదియునుంగాక మీ తండ్రి రూపవతికి దాహమిచ్చి కాపాడలేదా ? ఇంతకన్న నుపకార మేమి యున్నది? సత్వ :- సరిసరి యిదియా? చాలుఁ జాలు. ఈ మాత్రమునకే ఇవి నిందాలాపములా యేమి?

కళా :- కావు నిరూపణాలాపములే.

శీల :- ఇఁక దాచనేల? మే మందరము నీకు బరిచారికలమై యుండ దలంచుకొంటిమి. ఉత్తమ బ్రాహ్మణ పుత్రుఁడవుగదా ?

సత్వ :- మీ వరపుఁడుతనము నేను భరింప నోపుదునా ?

కళా :- నీకంటె సత్వవంతుఁ డెవ్వఁడు ?

అని యీ రీతి ముచ్చటించుచుఁ గ్రమంబునఁ దమ హృదయాశయము వెల్లడించిరి. అతం డెరింగియు నెరుఁగనిఁవాడు బోలె వాండ్రం జిక్కులు పెట్టెను. శీలవతి విద్యాభాస్కరునిచే మెడలో మంగళసూత్రముఁ గట్టించుకొన్నదిగదా ? దాని కేమి చెప్పుదురని యడిగిన నయ్యింతి మంగళసూత్రము గట్టినప్పుడు వ్రేలడ్డు పెట్టుకొంటి.‌ దానంజేసి దోషము బాసినదని శాస్త్రముఁ జూపినది. అప్పుడు సంతోషముతో నతండు వారిని బెండ్లి యాడుట కంగీకరించెను. అంతలోఁ దెల్లవారుటయు నా కేసరి మధ్యలావిద్వత్కేసరిగా రహస్యమంతయు నప్పుడు వినిపించి యతండు ప్రహర్ష ప్రవాహమున నీదులాడుచుండ దమ తండ్రుల నక్మడకుఁ దీసికొనిరమ్మని కొన్ని వచనంబు లుపదేశించి యంపిరి.

ఆ విద్వాంసుండు ధర్మపాలుని బస యడిగి తెలిసికొని యచ్చటికిం బోయెను. అంతకమున్న యజ్ఞదత్త ధనపాలు నృపాలకు లక్కడికి వచ్చికూర్చుండి రాత్రి జరిగిన నాటకకథను గురించి సత్యమా ? యసత్యమా ? అని వితర్కరించుచుండిరి. అంతలో విద్వత్కేసరి లోనికిం బోయెను. అతనింజూచి యజ్జదత్తుండు గురుతుపట్టి యోహో నా బాలసఖుఁడు విద్వత్కేసరి‌ కాబోయి. ఎన్నినాళ్ళకుఁ గనుపించితివి. ఎందుండి వచ్చుచుంటివి? పిల్లలెందరు అని భావక ప్రశ్నఁ గావించుచు నుచిత పీఠోప విష్ణునిజేసి ధర్మపాలునితో నతని వృత్తాంత మెరింగించెను.

అప్పుడా కేనరియు ధర్మపాలాదుల నమస్కారము లందుకొని యాశీర్వదించుచుఁ దొల్లి కాశీపురంబున విద్యార్దులై యున్నప్పుడు తాను సిద్ధతీర్ధమునకుఁ పోవుటయు లోనగు వృత్తాంత మెరింగించి‌ యా యజ్ఞదత్తుండు తన కూఁతుని నా కోడలిగాఁ జేతునని వాగ్దత్తముఁ జేసియున్నాడుఁ ఆ మాట చెల్లించుకొనసమయము వచ్చినది. నా కుమారుని దీసికొని వచ్చితిని. మీరుఁగూడా నచ్చఁజెప్పి పిల్ల నిప్పింపుడని యుక్తి యుక్తముగా వక్కాణించెను.

ఆ మాటవిని ధర్మపాలుండు కన్నీరు విడుచుచు అయ్యో ? వెఱ్ఱిపారుఁడా? నీ వక్కథ నెరుంగక నిట్ల డుగుచున్నావు. ఈయన కూఁతురు నదిలోఁబడి కడతేరినది. అందులకే మే మందరము నిట్లు విరక్తిఁజెంది తిరుగుచున్నారమని నుడువ నవ్వుచు డీలా ? మీరుకూడా తబ్బిబ్బు పడుచుంటిరేల? ఇంతకు ముందుకాదా వీని కొమరితను నేను జూచివచ్చితిని ఇష్టములేకున్న వేరొకమాటఁ జెప్పుఁడు అమంగళము లాడవద్దు అని పలికెను.

ఆ మాటవిని వారందరు సంభ్రమాశ్చర్యములతో ఏమేమి? నీవు శీలవతింజూచితివా ? ఎందుఁ జూచితివిఁ ఆ చిన్నదాని గురుతెరుంగుదువా ? దాపున నెవ్వ రున్నారు చెప్పుమని యడిగిన నతం డిట్లనియె. నే నంత యెరఁగనివాఁడను కాను. శీలవతీ రూపవతులతో ముచ్చటించుచుండఁ జూచితిని. సందియమున్న నాతో రండు చూపెదనని పలికెనో లేదో, పద పద చూపుమని యా నలువురులేచిరి.

అందరిని వెంటఁబెట్టుకొని యతండు వారి నెలవునకుఁ దీసికొని పోయెను. అప్పుడు బాలికలు నలువురు దొంటిరూపముల నొప్పుచు గద్దియలం గూర్చుండి ముచ్చటించుచున్నట్ల త్యంభాతురులై యరుదెంచిన తండ్రులంగాంచి లేచి పాదములకు నమస్కరించుచు మా తప్పులు మన్నింపుఁడు. బాల్య చాపల్యమునంజేసి మిమ్ముఁ గడు బాములు పెట్టితిమి. తొల్లి మా గురువులు కాశీపురంబున సిద్దతీర్థంబునం గోరిన వరంబులే మా యెత్తి కోలునకుఁ గారణంబులని పలుకుచుఁ దమ తమ వృత్తాంతము లెరింగించి వారినెల్ల సంతోషశోకవిస్మయ రసాయత్త చిత్తులఁ గావించిరి.

ధర్మపాలుఁడు సత్వవంతుని శౌర్యసాహసాది గుణంబు లంతకుమున్నె వినియున్నవాఁడు కావున నతం డట్ల గుటకు మిక్కిలి సంతసించుచుఁ గాలవ్యవధి సైరింపక యప్పుడే సుముహూర్తము నిశ్చయించి తారావళీ సౌగంధికలఁగూడ నచ్చటికి రప్పించి యా కాశీక్షేత్రంబున విశ్వేశ్వరుని మ్రోల దేవతా వైభవముతో వివాహ మహోత్సవములు కావించెను.

సత్వవంతుఁడు తొలుత శీలవతిం బెండ్లి యాడి తరువాతఁ గళావతీ తారావతీ సౌగంధికలకు మంగళసూత్రములఁగట్టి పిమ్మట విద్యావతీ రూపవతుల భార్యలుగా స్వీకరించెను. అట్లు సత్వవంతుండు వారివారి రాజ్య వైభవములతో నార్వుర భార్యలను స్వీకరించి భుజబలంబున మరికొన్ని దేశంబులు సంపాదించి నిజయశోవిసరంబులు దిగంతములకు నలంకారములై శోభిల్ల పూర్వ భూపతులవోలె ధర్మంబున రాజ్యంబు సేయుచుండెను. అతని చరిత్రము విద్వాంసులు గ్రంథములుగా రచించిరి.

గోపా! విను మా సత్వవంతుండు శీల కళా విద్యా రూపవతులతోఁ గొంతకాల మీ నగరముఁ బాలించెను. అతని భార్యలు నలువురు నీ యుద్యానవనమున విహరించుచు నీ తరులతా విశేషంబుల నప్పుడప్పుడు తమతమ నాఅమంబులతో నాటించిరి. దానంచేసి యిందున్న తరులతా జాతులన్నియు నాలుగేని వడుపున నుండుటకుఁ గారణమైనది. సిద్దతీర్థ ప్రభావంబుఁగూడ దీనం దెల్లమైనదికాదే? రెంటికిని నీ కథయే సమాధానమనిచెప్పిన సంతోషించుచు శిష్యుండు గురునితోఁగూడ నా రేయి సుఖముగా వెళ్ళించెను.