కాశీమజిలీకథలు/ఆరవ భాగము/76వ మజిలీ

శ్రీరస్తు.

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీ మజిలీ కథలు

డెబ్బది యాఱవ మజిలీ

ఆరవభాగము

గురువరా ! ఇవ్వీఁటి మేటి శృంగాటకంబున కటకారముగా జనులు మూఁగి చూచుచుండ దొమ్మరవాండ్రు మనోహర తుంబీశ్వరములు వెలయింపుచు నాడుచుండిరి. నే నందువోయి యా యాట సాంతముగాఁ జూచితిని. అహా ! ఆ దొమ్మరవాఁడు తా నంతకుమున్ను వెలిపుచ్చిన యొక సంచినుండి వెండి బంగారము నాణెములను బాత్రములు పళ్లెములు గొ ప్పెరలూరక పైకితీసి విరజిమ్మివై చెను. వాని సామర్ద్యమునకు నాకుఁ జాలనివ్వెర తోచినది. పిమ్మట నా దొమ్మరవాఁడు లేచి పళ్లెముఁ గైకొని యందరిని నడిగికొనెను తల కొకకానియు నందు వైచిరి. స్వామీ! వాఁడు స్వయముగా రూప్యములు చేసికొనగలడు గదా? మరల నొరుల యాచించనేల? వాని కట్టిశక్తి యెట్లుఁ గలిగినది? మీ రట్లు సంచిలోఁ జేయివైచి వస్తువులు తెప్పింపఁ గలరా ? చెప్పుడని యడిగిన శౌనకుని మాటలు విని మణిసిద్ధుండు నవ్వుచు నిట్లనియె.

గోపా! మా కట్టి సామర్థ్యములేదు. ఇంద్రజాలాది మాయా విధ్యల వలన నట్టి వస్తువులు చూపించుచుందురు. అవి నిలుచునవికావు అయినను దొమ్మరవాండ్ర కమ్మహా విద్యలు శక్యములగునా? వాండ్రు హస్త లాఘవము నేరిచి కొని యంతకుముం దుందుంచిన వస్తువునే తీసి చూపింతురు. దానంజేసి వాఁడు జనుల యాచించె. నిదియే దీని వృత్తాంతమని చెప్పిన నా గోపాలుఁడు నవ్వుచు మహాత్మా! ఇంద్రజాలాది మహావిద్యల వలన వింతలు సూపించవచ్చునని నుడివితిరి. ఆ విద్యలెట్టివో వానింగురంచి జరిగిన కథ లేదేని వక్కాణించి నేఁడు కాలక్షేపముఁ గావింపుడని వేడికొనియెను. అయ్యతిపతి ఔరా! నీ వడిగిన ప్రశ్న నుత్తరముఁ జెప్పితినిగదా? ఇఁక జపముఁ జేసికొంద మనుకొంటిని. నీ వూరక ను =? * వేల్లఖ- వేతనము ముట్ట / బెప్పక తీరచని పలుకుచు చనమణి హాల వ్వ్‌సించి సునసుస్‌కుం అత: ప్టాటయా పింతపడి బాసి వెఎగసమల గిల! 'ప్పచున్నాను, సావధాన (యై సమ్‌మసి యుట్లు చెప్పం

కామగ్రీవుని కథ

అరువదియేండ్ల ప్రాయముఁ గలిగి తపస్సముపార్జితంబగు యశోవిసరము తలయెక్కి మెఱచుచున్నదో యన పండిన వెండ్రుకలతో నొప్పుచు నంగకమ్ములన్నియు నించించుక మడతలు వారినను దేజోవంతమైనకాంతిఁగలిగి నిలువ నూతగాఁ బూనిన దండంబును వార్దక్యదోషంబు మాటుపడ విలాసముగాఁ ద్రిప్పుచుఁ గామగ్రీవుఁడను బాహ్మణుఁడొకనాఁడు అల్లంతఁ బ్రొద్దెక్కినంత విప్రగూటమను నగ్రహారపు నడి వీధి నరుగుచుండెను

అట్టితరి నా యూరిపారుతలు పుట్టములు దట్టముగాఁ గ్రుక్కిన కలశముల నంసమున నిడికొని తటాకమున కరుగువారును, తటాకమును౦డి జలపూర్ణ కుంభంబుల భుజ౦బుపై నిడికొని యిళ్ళకు వచ్చువారును బెక్కం డ్రాపారునకు నేత్రపర్వముఁ గావించిరి. అప్పుడా బ్రాహ్మణుఁడు ఆహా! నాకు రాత్రి భోజనములేదు. ఆకలి బాధించుచున్నది. ఈ యిల్లాండ్రందరు నన్నుఁజూచి యోసరించి పోవుచున్నారు. కాని యింటికిఁ గుడువరమ్మన్న గేస్తురా నొక్కెతెయులేదు. ఇరుదెసల వేదికలపై గూర్చుండి యేగ్రామము? ఎందుఁ బోవుచున్నారు? పేరేమియని యడుగుదురే కాని యీ బ్రాహ్మణులలో నొక్కరుఁడు నింటికి రమ్మని చీరినవాఁడు లేడు. స్వాద్యాయ ఘోషము‌ శాస్త్రవాదములు మాత్రమూరక వినంబడుచున్నవి. భూతదయలేని వీరి చదువేమిటికో తెలియదు. అని నిందించుచు మరికొంతదూరము నడిచెను.

అప్పుడా ప్రాంతమందలి యొకయింటిలోనుండి చక్కని బాలిక యొకతె యీవలకు వచ్చినది. ఆ కన్నెమిన్నంజూచి యాజన్నిగట్టు తలయూచుచు నందు నిలువంబడి యోహో! ఈ బాలికకు బండ్రెండేండ్లు దాటిన ప్రాయము గలిగియున్నది దీనిం బెండ్లి యాడిన నాఱుమాసములకే కాపురమునకు వచ్చును. వత్సరములోపుననే సంతతిఁ బడయవచ్చును. దీని నాకిత్తురేమో యడుగుదునా?! అక్కటా! తల నరసిదోష మొక్కటియే నన్ను ముసిలివాఁడని సూచించుచున్నది. అయినను నాకు నేను జూచికొనినంత పెద్దవాఁడువలెఁ కనంబడను. నావిద్యాసంపదల తెరవెరింగిన దీనితండ్రి నాకీయక మానఁడు ఈ పూట వీరింటఁగుడిచి స్నేహముగలిపి పిల్లనిమ్మని యడిగెదనని నిశ్చయించి యబ్బాలికంజూచి బాలామణీ! నీ పేరేమి? ఈ యిల్లు మీదేనా! నాకీ పూటభోజన సదుపాయము చేయింతువా? అని యడిగిన నాకన్నియ యిట్లనియె.

తాతగారూ ఈ గృహము మాదే రండు రండు. ఈ వేదికపై విశ్రమింపుఁడు. ఈ పూట కాదు. పది దినము లిందుండవచ్చును. భోజనమున కేమియు నభ్యంతరములేదు. మా తండ్రిగా రింతకుముందె శిష్యులతోఁ డే రంగలచు. అ... పలుకుచు లోపలికిటేయి శ లమ). ో అప్పుడా కామగ్రీవుఁడు మిగుల సంతిసించుచుఁ దనమూట జిగిలిపయింబెట్టి యాచెంబందికొని కొంచె మవ్వలికిఁ దీసికొనిపోవుచుండ వణుకుచున్న చేతిలోఁ జెంబు నిలువక జారి నేలం బడినది. నీళ్ళు కారిపోయినవి. అందులకు సిగ్గుపడుచున్న యప్పాఱుంజూచి నవ్వుచు నబ్బాలిక తాతగారూ! మీరు పెద్దలుగదా! చెంబు జారినది. పోనిండు. మరల నీళ్ళుతెత్తునా? కలశమిటు తెండని పలుకుటయు నప్పలుకులు చెవులకు ములుకులై సోక నతఁడు పిల్లా! నన్ను తాతగారని పలుమారు పిలుచుచుంటివి. నేనంత పెద్దవాఁడ‌ ననుకొంటివా? ఈనడుమఁ దెలుగు పడుటచే దలనెరసినది. కాని మరియొకటి గాదు అనుడు నాజన్నిగట్టుపట్టి గట్టిగ నవ్వుచు నిట్లనియె. అయ్యా! మీకు నెఱకలు నెరిసినవి. దంతము లూడినవి. వణకు పుట్టినది. దండముజేతికి వచ్చినది. ఇంకను తాతగారనినఁ గోపము చేసెద రేలయని యడిగిన నతం డిట్లనియె బాలామణీ! నీ పలుకులు గడునింపులుగా నున్నవిగదా? నా పండ్లన్నియు గట్టిగా నున్నవి. నడిమిపన్నొక్కటియే యూడినది. అందలి కారణ మానక చెప్పెదను. నేనీ దండము విలాసమునకు ధరించితినిగాని బలహీనమునఁ గాదు. మఱియు నా చేతిలో చెంబు వణకుచేత జారిపడిన దనుకొంటివా?

అయ్యో! కాదు కాదు. పట్టువదలి పడినది. అని యేమెమో సమాధానముఁ జెప్పెను. ఆ మాటలు విని యాకన్నియ పోనిండు. ఎట్లయినను సరియే మీరు కడు బడలితిరి. ఇక్కతంబున విశ్రమింపుఁ డని పలుకుచు నతండు పండుకొనియు౦డఁ దాళవృంతముందెచ్చి విసరు చుండెను. కామగ్రీవుఁ డాచిన్నదాని మొగంబుఁ జూచుచు అయ్యో! నేను దీనింబెండ్లి యాడం దలంచుకొనియుండ నిది నన్నుఁ దాతయని పరిహాసమాడుచున్నది. దీనికెట్లు సమాధానముఁ జెప్పుదును. ఇది కడుగడుసుది. మరియుఁ గొంత ముచ్చటించి హృదయాశయ మెరింగెదంగాక యని తలంచుచు వాల్గంటీ! నీ తండ్రిపేరేమి? ఆహా? నీసుగుణంబులు మిగుల గొనియాడఁదగియున్నవి. నీకు మంచి మగడు రాగలఁడు మీకులశీలంబు లెట్టివని యడిగిన నబ్బాల అయ్యా! నాపేరు సావిత్రి మాతండ్రిపేరు భట్టపాదుడు. సకలశాస్త్రములం జదివినప్రోడ. అని తన వృత్తాంత మంతయుఁ జెప్పినది. అప్పుడతండు నీ తండ్రి పండితుండగుటనా నీ‌కిన్ని యేండ్ల దనుకఁ బెండ్లిఁ జేయకున్నాఁడు? పదియేడ్లు దాటిన క‌న్నియ రజస్వలాతుల్యయని శాస్త్రములు చెప్పుచున్నవి. నీకు మంచి సంబంధమెక్కడను దొరకలేదా యేమి? యని యడిగిన నా సావిత్రి ముసిముసి నగవుతో నాకుఁ బదియేండ్లు దాటలేదు. మీకట్లగుపడుచున్నానని చెప్పినది. ఓహో! నాకుఁ జత్వారము వచ్చిన దనుకొంటివా? సూదిలో దారము గుచ్చఁగలను. పోనిమ్ము. మంచిసంబంధమున్నది. పెండ్లియాడెదవా? అని ---------- యడుగుచుండ సిగ్గుపడుచు నాపడుచు విసనకర్ర నక్కడ విడిచి దిగ్గున లోనికిం బోయినది. అంతలో భట్టపాదుండు విద్యార్థులతో స్నానముఁ జేసివచ్చి యతిధింగాంచి స్వాగత మడిగి లోనికింబోయి భార్యతో నభ్యాగతుండు వాకిట నున్నవాఁడు చూచితివా? అని యడిగిన నామె అమ్మాయిచూచి తీసికొని వచ్చినదట. సపర్యలన్నియు నదియే కావించినది‌. విసరుచుఁ బెండ్లి మాట యడగినంత సిగ్గుపడి యిప్పుడే లోపలికి వచ్చినది. మంచిసంబంధ మెచ్చటనో యున్నదని చెప్పిరఁట. ఏదియో యడిగి తెలుసుకొనుఁడని మగనికి బోధించినది.

అతండు సరియే చూతమని పలుకుచు శిష్యముఖముగాఁ గామగ్రీవుని స్నానముఁ జేసి రమ్మని నియమించి తాను దేవతార్చనఁజేయుచుఁ గూతుంజీరి అమ్మా! అతిధిని స్వయముగాఁ దీసికొనివచ్చి పూజించితివట. మంచిపని జేసితివి అట్లే చేయుచుండుము. అని యభినందించిన నవ్వుచు నబ్బాలిక తండ్రీ! ఆయనకుఁ తాత యనఁ‌ గోపము వచ్చినది. తాను జిన్నవాఁడట. వింటివా యని యా సంవాదప్రకార మంతయుం జెప్పినది. అంతలోఁ గామగ్రీవుండు స్నానముఁ జేసి వచ్చుటయు నా విప్రపత్ని వారినెల్ల మృష్టాన్న సంతృప్తులం జేసినది.

భోజనానంతరము భట్టపాదుండు చావడిలో గూర్చుండి యిష్టాలాపము లాడుచుఁ గామగ్రీవునితో మీ దేగ్రామము? ఎందుఁబోవుచున్నారు? మా పిల్లకు మంచి సంబంధమెందో యున్నదని చెప్పి‌రట. ఎందున్నది? తద్వృత్తాంత మెఱింగింపుఁడని వినయముగా నడిగిన నతం డిట్లనియె.

అయ్యా! మనము వివక్తమునఁ గూర్చుండి మాట్టాడుకొనవలయును. మీతో నొకరహస్యోదంతము నెరింగింపఁ దలచికొంటి లెండు లోని‌కింబోవుద మనుచు నతండందున్న శిష్యులనెల్ల దూరముగాఁ బొమ్మని యందే యక్కథం జెప్పుమనుటయు నతం డిట్లని చెప్పందొడంగెను.

అయ్యా!వినుండు. నా కాపురము కాంచీపురము. నా పేరు కామగ్రీవుండు. నేను జనించిన కొంచెము కాలములో నా తలిదండ్రులు దివి కఱిగిరి. దిక్కులేనివాడనై బంధువులచేఁ బోషింపఁబడితిని. చదువేమియు వచ్చినదికాదు. తిరిప మెత్తికొనుచు గొన్ని దినములు గడపితిని. నాతోడివారెల్ల భాగ్యవంతులై గజాశ్వాంబోరాదులెక్కి తిఱుగు చుండుటయు నాకుఁ దినుట కన్నమైన లేకపోవుటయుం దలంచి మిక్కిలి దుఃఖించుచు నొకనాఁడు మా గ్రామములో నొకపండితునాశ్రయించి ధన మెట్లు లభించునని యడిగితిని. పండితుండు నా కోరిక విని నవ్వుచు నీక్రింది శ్లోకముఁ జదివెను.

శ్లో. ధనినం చాప్రదాతారం దరిద్రం చా తపస్వినం
    ద్వావభసి వినిక్షి ప్యౌగళే బధ్వా బృహచ్చిలాః

దానముఁ జేయని భాగ్యవంతుని

రాయిగట్టి నీటిలో ముంచంద! గొంత య్దేన్నవగానే తసంబిన

కేమికావలయును. తపంబున నన్నికార్యములు సిద్ధించును. తపంబునఁ బావములు నశించును. తపంబున సార్వభౌముడు కావచ్చును. నీ వట్టితప౦బుఁ గావింపుమని యుపదేశించుటయు స్వామీ! తపంబెట్టుఁ జేయవలయును. విధాన మెట్టిదని యడిగిన నతం డిట్లనియె.

కాశి కవ్వల హిమవత్పర్వతము కలదు. అక్కడకిఁ బోయిన మహాత్ములు పెక్కుండ్రు కనంబడుదురు వారి నాశ్రయించి మంత్రోపదేశముఁ బొందుము. తపోవిధానము వారే యెరింగింతురని బోధించిన విని సంతసించుచు నేను నాఁడే బయలుదేరి పయనములు సేయుచుఁ గడు నిడుములు పడి యారునెలలకుఁ గాశీపురంబుఁ జేరితిని. అందున్న మహాత్ముల సేవించి భాగ్యముఁ గలుగు తెఱ వుపదేశింపుడని యడిగిన నొక్కరుఁడును దగిన సమాధానముఁ జెప్పినవాఁడు లేఁడు.

విశ్వేశ్వరుని యాలయము వెనుక జ్ఞానవాపిచెంతఁ దపంబుఁజేసి కొనుచున్న యొక మహాయోగి నారుమాసము లాశ్రయించితిని. అతండు నా శుశ్రూషకుమెచ్చి నా కోరికవిని పూర్వపుణ్య పరిపాకంబునంగాని భాగ్యము లభింపదు. తపంబు ముక్తికిఁ గారణమని యుత్తరము జెప్పెను. వారి మాటలయెడ విశ్వాసము లేకనేనటఁ గదలి రెండు నెలలకు గంగోత్తర కరిగితిని. అది గంగానది జనించిన తావు. కడు పుణ్యక్షేత్రము. సంతతము మంచువర్షము కురియుచుండును. అక్కడి చలిబాధ యమలోకమునసైతము లేదు. ఆ స్థలమందనేకులు దిగంబరుల్జై తపముఁ జేసికొనుచున్నారు. వారి‌ నందర నాశ్రయించితిని. ఎవ్వరికి నాయం దనుగ్రహము వచ్చినదికాదు. సీ? ఇఁక నీ జన్మముఁబాసి యుత్తరజన్మములో నుత్త ముండనై యుండెదను. ఇప్పుడు నా కామ్యము తీరదు. అని చావ నిశ్చయించి యొకనాఁడు రెండు క్రోశములదూరములోనున్న శ్రీకూటమను‌ పర్వతమెక్కి నలుచక్కిఁ దిరిగి మరణకృత నిశ్చయుండనై తత్సాధన మరయుచుండ నాదండ నొక విశాలసాలవృక్షము కనంబడినది. ఆ మ్రానెక్కి చేతులు జోడించి యిట్లుఁ బార్దించితిని. వేల్పులారా? నేను సంపదలనిమిత్తము చాలకష్టములఁ బడితిని. కాసంతయుఁ బ్రయోజనములేక పోయినది. ఇట్టి నికృష్టపుఁ జీవనము సహించుటకంటె సకలబాధా విస్మరణ కారణంబగు మరణంబు శ్రేయము. ముందుజన్మమునందైన నన్ను భాగ్యవంతునిగాఁ జేయుఁడని కోరుచుఁ గన్నులు మూసికొని నేల కుఱయబోవు సమయంబున, ఓహో! వలదు. వలదు. సాహసము సేయకుము. నీ వెవ్వండవు? అని యా పాదపము మొదటినుండి యొకధ్వని బయలు వెడలినది.

ఆ నినాదమువిని‌ నే నదరిపడుచు నా కామిత మీడేర్ప భగవంతుండరుదెంచి యిట్టిమాటఁ బలికెనని యుబ్బుచు నేలవంకఁ జూడ్కులు నెఱయఁ జేసితిని ఆ చెట్టు మొదట డొంకలలో జడలచే నావరింపఁబడిన శిరము కలిగిన యొక తపస్వి నా కన్నులం బడియెను.


జూచి మురియుచు మెల్లన నత్త రువు దిగి తదీయ చరణంబుల మ్రోల వ్రాలి మహాత్మా! రక్షింపుము. రక్షింపుము. అని వేడికొంటి. కరుణ కటాక్షములు నా పైఁ బరగించుచు నమ్మహర్షి నీ వెవ్వఁడ వేమిటికిట్లుఁజావఁ బ్రయత్నించుచున్నావని యడుగుటయు నా కథ యంతయుం జెప్పితిని.

మూఢుఁడా మోక్షేచ్చ వదలి యస్థిరములై సంపదలకొరకిట్టు చింతించు చున్నావేమి? వినుము. నీవలెనే నేనును సంపదల కాసఁజెంది యిరువదియేండ్లు గురుకులవాసముఁ జేసి యింద్రజాలమను విద్య సంపాదించి భూమి యంతయుం దిరిగి కోట్ల కొలది ధనము ప్రోగుచేసితిని. దానితోఁ దృత్తిఁ బొందక పరకాయ ప్రవేశవిద్య గ్రహింపఁగోరి యీ యరణ్యమునకు వచ్చితిని. ఇక్కడికి మూఁడు యోజనముల దూరములోఁ ద్రికూటమను నగరంబున దీర్ఘ తముండను మహర్షి యున్నవాఁడు. అతని కా విద్య తెలియునని మునులవలన విని యతనియొద్దకు బోయి యెనిమిది వత్సరము లాశ్రయించితిని. అమ్ముని కప్పటికి నా యెడఁ గనికరముఁ గలిగి నీ యబిలాష యేమని యడిగెను. దేవా! నే నింద్రజాలమను విద్య సంపాదించి భాగ్యవంతులలో నధికుఁడనని పేరుబొందితిని. కాని ప్రభుత్వచిహ్నము దానివలన లభించినదికాదు. పరకాయ ప్రవేశ విద్యవలన నట్టిలాభము కలుగునని యా విద్యకొరకు దేవర నాశ్రయించితిని. ఇదియే నా కోరికయని ప్రార్థించితిని.

నా మాటవిని యతండు పక్కున నవ్వుచు ముక్కుపై వ్రేలిడికొని ధనమునఁ దృప్తుండవై రాజ్యమున కాసపడుచుంటివి. అదియును లభించిన పిమ్మటఁ దేలికగాఁ గనంబడును. మనుష్యులు వచ్చిన స్వర్గముతోఁ దృప్తిఁ బొందక రాని నరకమునకై యాసఁ బడుచుందురు. పోనిమ్ము. నీకుఁ బరకాయ ప్రవేశవిద్య యుపదేశించెదను. రాజ్యసుఖము లెట్ల నుభవింపఁ గలవన యడిగిన నే నిట్లంటి.

స్వామీ ! భూమి నే భూమపతియైనను మృతిఁబొందినప్పుడు వాని శరీరములోఁ బ్రవేశించి యా రాజ్య మేలగలను. ఇదియే నా యభిలాషయని చెప్పిన విని యతండు యధాజాతశరీరమే యస్థిరమైయుండ సంపదలమాట చెప్పనేల? ఇంత ప్రయాసపడి బుద్భుదములవంటి రాజ్య సుఖంబులఁ గోరికొనుచున్నావా? నీ యిష్టము. ఆలోచించుకొనుమని యుపదేశించినంత నప్పుడే నా హృదయమున వైరాగ్యవృత్తి జనించినది. ఆ మహాత్ముని పలుకే యుపదేశవాక్యమైనది. రాజ్యాది సంపదల నేవగించుకొని మరల మహామంత్ర ముపదేశముఁబొంది నాటంగోలె యిందుఁ దపం బొనరించుచున్నాడ. మోక్షమార్గము సేవింపఁ దగినది. నీవును లోకవాసన వదలి ముముక్షుఁడవై యుండుమని పెద్దగా బోధించెను. కాని నా మది కుదిరినది కాదు. మహాత్మా ! మీరు సంపదలచే విసిగియున్నవారు. కావున రాజ్యాధిక సుఖంబుల నసహ్యము జనింప వెంటనే విరక్తులైతిరి. నేను సంపదయెట్టిదో యెరుంగనివాఁడను. మీ వలనే కొన్నిదినము లనుభవించి తరువాత విరక్తిఁజెందెద. ముందుగా నాకు నైంద్రజాలికవిద్య నుపదేశింపుఁడు. అని కోరికొనిన నమ్మహాత్ముండు పదిదినములు నాచే శుశ్రూషఁ చేయించుకొని నాకా విద్య నుపదేశించెను.

అంతటితోఁ దృప్తిఁ బొందక నేనును నతని యనుమతిఁ బడసి దీర్ఘత మునియొద్ద కరిగి పదియేండ్ల జ్జడదారి నాశ్రయించితిని. అతండు ప్రసన్నుండై కామిత మేమని యడిగిన పరకాయప్రవేశవిద్య నుపదేశింపుమని కోరికొంటిని.

అతం డై హి‌కము తుచ్చమనియుఁ బరముఁ గోరుకొనుమనియు నా కెంతయో బోధించెను. వారి హితబోధ యించకయు నా మనసు దూరినది కాదు. ఆ విద్యయే యుపదేశింపుఁడని వినయముతోఁ బ్రార్ధించితిని. నీ కర్మము. నే నేమి చేయువాఁడనని విసిగికొనుచు నయ్యోగివరుండా మంత్రమును నా కుపదేశించి యిట్లనియె.

కృపణాత్మా ! సంసారసక్తుండవై చాలకష్టములు పడి యీ రెండు విద్యల సంపాదించుకొంటివి. నీ కిప్పుడు పరువము గరించినది. సుఖ మెన్నఁడు పడుదువో తెలియదుఁ ఈ విద్యలు నీకు దంతములున్నంతసేపే ప్రసాదించును. ఒక్క పన్నూడినను బ్రసన్నములు కావు. వేగఁబోయి కామితముఁ దీర్చుకొనుము. అని యుపదేశించెను.

అప్పుడు ప్రహర్షసాగరమున మునుఁగుచు వారివలన నా మంత్రమును వడిసి యా హిమాలయపర్వతము లన్నియు దాటి మరలఁ గాశీపురంబున కరుదెంచితిని. నా జాల మా పట్టణములోఁబన్ని ప్రజల రంజించు తలంపుతో నొకనాఁడు గంగానదికి స్నా నార్థమై యరిగితిని. గంగాతీరమంతయుఁ బృధుశిలా నిర్మితములైన సోపానపంక్తులచే నొప్పుచున్నది. నేనా మెట్లు దిగునప్పుడు మేను తూలి కాలుజారి రాళ్లపైఁ బడితిని. మోము తాకి రక్తము‌ స్రవింప నా పన్నొకటియూడి నేలపైఁ పడినది. నేనా పంటినిఁ జూచుకొని గండెలు బాదికొనుచు గోలుగోలున నేడ్వఁ దొడంగితిని. తైర్ధికుల పెక్కండ్రు వచ్చి నా గాయమునకు మందువైచి రక్త ముఁ గారకుండఁ జేసిరి కాని నా యేడ్పు మానిపింపలేకపోయిరి.

వెర్రి పారుడా ! దంతభగ్నమున కిట్టు వగచుచున్నా వేమి ? నేడు కాకున్న రేపైన నిది యాడునదియే కదా? ప్రాయముమీరినఁవాడవు బాలుడవు కావు. ఊరుకొనుము. దంతము పారవేసి స్నానముఁజేయము. అరచేతం బట్టుకొని చూచుచు దాని విడువలే కుంటివేమి ? అని పలువురు పలుబలుకుల నిందింప నేమియు మాటాడక కష్టోపార్జితములగు నా విద్యల రెంటినిం దచలంచుకొనుచు అయ్యో? ఒక తేపయైన దత్ప్రభావము జూచితికానే ? కాసైనను వానివలన సంపాదింపలేక పోయితిని నే నెన్ని యో యూహలఁ బన్నుకొనియంటి నవి యన్నియుఁ దృటిలో వమ్మైపోయినవి. అని తలంచుకొనుచుఁ బెద్దయెలుంగున వాపోవుచుంటిని.

నన్ను పన్నూడిన విలపించుచున్నాడని జనులు వింతగాఁ జూడఁ దొడంగిరి. రెండు మూడు దివసంబులు నిద్రాహారములు మాని యా గంగ యొడ్డునఁబడి విలపించితిని. అప్పుడు పురరక్షకులు నన్నక్కడినుండి లేవఁగొట్టిరి. మరియొక ఘట్టమునకుం బోయితిని. పన్నూడిన విలపించెడు వెర్రిపారుఁ డితఁడే యని జనులు గుంపులుగా వచ్చి నన్నుఁ జూచుచుండిరి. ఆ విద్యలు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లఁ బెద్ద కంఠముతో నేడ్చుచుందును. జనులు నవ్వుచుందురు.

మరికొన్నిన్నాళ్ళకు నాకునేను యుపశమించుకొని యిట్లుఁదలంచితిని. ఆహా! దీర్ఘతముఁడు తుచ్చభోగములఁ గోరికొంటినని నాఁడే శపించెను. తెలిసికొనలేకపోయితిని. ఇక నే నింటికిఁ బోయి పెండ్లి యాడి సంతతివడసి నా కుమారుని కీ విద్యల నుపదేశించెదగాక. నా తపంబప్పుడు సఫల మయ్యెడిని. అని తలంచి యప్పుడే యప్పురము వదలి పయనము సాగించితిని. అందలి బ్రాహ్మణులకును మనకును నాచారభేదములు చాలఁ గలిగియున్నవిఁ కావున వారి కన్యకల నంగీకరించితిని కాను.

తిరిగి తిరిగి మీ యగ్రహారముఁ జేరితిని. మీ కూఁతుం జూచిసది మొదలు పెండ్లి యాడవలయునని యిష్టము పుట్టినది. నే నంత పెద్ద వాఁడను కాను. మంచు దేశములో నుండుట నిట్లు పండిపోయితిని. వేగము సంతతిం బడసి నా విద్యలు రెండును బుత్రుల కుపదేశించెదను. అని యుపన్యసించుచు నేను పెండ్లికొడుకునని చెప్పెను.

భట్టపారుండు పక్కున నవ్వుచు బళిరా! కామగ్రీవా ! నీ కోరిక బాగున్నది. నీ మాటలవలన వెనుకటికథ యొకటి జ్ఞాపకము వచ్చుచున్నది. వినుము.

కౌశికుని కథ

నీవలెనే కౌశికుంకుడ బ్రాహ్మణుఁడు బాల్యంబున మాతా పితృ విహీనుండై రక్షించువారును లేక స్వేచ్ఛగాఁ దిరుగుచుండెను. విద్య యేమియు నంటినవికాదు. విటులలోఁ గలసి జూదరులకు మొనగాడైఁ తస్కరులకు నాయకుఁడై పాలసులకు నొజ్జయై క్రుమ్మరుచుండెను. సత్రభోజనమును మఠనిద్రయుఁ గావించి తిరిగెడి యా చెడుగునకుఁ గన్య నెవ్వరిత్తురు? అట్లుఁ బరువంబున గరువంబున నొడ లెరుంగక తిరుగుచుండ నంతలో వార్దక్యచిహ్నములు పొడసూపినవి.

కృష్ణపక్షంబున భ్రమరవృక్షాంచల నిర్మలమగు నాకసంబునఁ బొలుపొందు తారలవలె నడుమ నడుమ ఫలితకేశము లగుపడుచుండెను. సులోచనములైనను సులోచనాపేక్షఁ బ్రవర్తించినవి. రదనంబులు కదలకున్నను గుదుళ్ళప్రటిమ సడలుటఁ గఠిన భక్ష్య భక్ష్యణాసమర్థములైనవి. నడలు జడితఁ గావించినవి. నిద్రకొఱఁత వడినది.

అప్పు డతండు తనకు వివాహము కాలేదను చింత ప్రబలి యందందుఁ బరిభ్రమించుచు నొకనాఁడు రాతిరికొక యగ్రహారము కరుదెంచి యొక విప్రుని యింటి ముంగిటి తిన్నె పైఁ బండుకొని నిద్రపట్టక తన దరిద్రస్థితిని గురించి చింతించుచుండెను. ఇంతలో నా యింటి గవాక్ష వివరమునుండి యిట్టి సంవాదము వినంబడినది.

బ్రాహ్మణుఁడు :- నాతీ! నీ కూఁతురు సంబంధమును గురించి నీకుఁ పెద్దపెద్ద యాస లున్నవి కాని కొనసాగునవికావు. దేశమంతయుం దిరిగితిని. వత్సరమున కిరువదిమాడ లాదాయము వచ్చువాఁడైన దొరకలేదు. ఏమిచేయుదును ? వానికే యియ్యవలసి వచ్చునేమో తెలియదు

బ్రాహ్మణి :- నా బొందిలోఁ బ్రాణముండగా ఆ నిర్భాగ్యునకు నా పిల్ల నీయను. నే నెరుంగుదును. కానుక లీయవలయునని వెనుకఁ దీయుచున్నారు. నా పుస్తిలైన నమ్మి నా పట్టికి మంచి సంబంధముఁ సేయకమానను. నా మనమఁడు రాజ్యమును బాలింపవలయును.

బ్రాహ్మణుఁడు :- చాలుఁ జాలు. గొంతెమ్మకోరికలు కోరకుము. మన మింత రాజ్యమేలుచుంటిమి. శేషించినది, నీ మనుమఁడు పాలింపగలడు. వివాహ వివాదములు సములకే శోభించునని వినియుండలేదా ?

బ్రాహ్మణి :- దాని యదృష్టము మంచిది. మీ రెరుంగరు. చేతిరేఖలు చుచి మొన్న హయగ్రీవసోమయాజి దీనికిఁ బుట్టువాఁడు చక్రవర్తి యగునని చెప్పెను.

బ్రాహ్మణుఁడు :- బాపురే! ముష్టిబియ్యమున కాసపడి చెప్పిన మాటలు నమ్మి పెద్దపోకలు పోవుచు నన్ను వేపుచున్నావు గదా !

బ్రాహ్మణి :- ఆయన సాముద్రిక శాస్త్రములో గట్టివాఁడు పెక్కు సారులు పరీక్షించి చూచితిని. ఆయన మాటలెప్పుడు పీరుపోలేదు ముష్టి బియ్యపుఁ మాటలు కావు.

బ్రాహ్మణుఁడు :- కాకున్న నీ మనుమఁడు చక్రవర్తి యెట్ల గును? అట్ల యిన నీ‌ కూఁతును క్షత్రియునకుఁ బెండ్లిచేయవలయును. బ్రాహ్మణులు భూమి పాలకులు కారుగదా?

బ్రాహ్మణి :- అదృష్టముండిన నెక్కడ నుండియో యూడిపడును.

బ్రాహ్మణుఁడు :- ఎవ్వఁడేని అఖండతపంబులుఁ గావించి నీ కూతుం బెండ్లియాడుటకు రావలయును.

బ్రాహ్మణి :- సందేహమేల? తప్పక నట్టివాఁడె రాఁగలడు.

బ్రాహ్మణుఁడు :- నా మాట వినుము. అత్యాశకుఁ బోకుము. ఆ ----- కుమారునికే యిత్తము. అతఁడు మనకు సమానుఁడు.

బ్రాహ్మణి :- మీరు పిల్ల దానికుత్తుకఁ గోయఁ దలఁచికొన్నారా యేమి? --------------- యత్తగారిముందర నది కాపురముఁ జేయగలదా?

బ్రాహ్మణుఁడు :- ఆమె నీకంటె గయ్యాళియా యేమి. బ్రాహ్మణి :- నే నుత్తమయిల్లాలును గనుకనే మీతోఁ గాపురముఁ జేయుచుంటిని. మీరు పుట్టెడు రట్టులకు మరియొకతె యైనచో నీపాటి కింటికి జిచ్చు పెట్టి లేచిపోవును.

బ్రాహ్మణుఁడు :- అవును. నీ వరుంధతి యంతదానవని నీ కీర్తి స్వర్గలోకములోఁ జెప్పుకొనుచున్నారు. నేను బెట్టెడు బాధలేవియో చెప్పము.

బ్రాహ్మణి :- చెప్పవలయునా? వినుండు. మీ చేష్టలు రామాయణ మంత గ్రంధమగును. రెండుపూటలయందు వంట జేయుట కష్టము. ఒకతేపయే‌ వండి యన్నము రాత్రికి మూతబెట్టెదనన్న నేమంటిరో జ్ఞాపక మున్నదియా ?

బ్రాహ్మణుఁడు : - ఏమంటినో నీవె చెప్పము.

బ్రాహ్మణి :- నాకు నియమ మున్నది. మధ్యాహ్న పదార్దములు రాత్రి భుజించనని చెప్పలేదా?

బ్రాహ్మణుఁడు : - సరేఁ ఇదియొక నేరమా? మరియొకఁటి చెప్పుము.

బ్రాహ్మణి :- నాఁడు తలకాయ నొవ్వుచుండఁ బాచి చేయలేక వీధితుడిచి యిల్ల లికి నీళ్ళుదెచ్చి వంటచేయమనిన నేమంటిరి ?

బ్రాహ్మణుఁడు :- అదియు నీవే చెప్పుము.

బ్రాహ్మణి :- ఆవల నార్త్విజ్యమునకుఁ బోవలయును. యజ్ఞము జరుగుచున్నది. అని నిలువక పరుగెత్త లేదా ? మీరు మరచిన నేను మరతునా‌ ? ఒక్క నాటికే మీ కింత కష్టముగానుండ నెల్ల కాలము నేనుమాత్రము సేయఁగలనా ?

బ్రాహ్మణుఁడు :- ఇది యొకతప్పా? ఇంకొకటి చెప్పుము?

బ్రాహ్మణి :- వేనవే లున్నవి. చెప్పిన లాభమేమి? మీ ప్రకృతి యెప్పటికిని మారదుగదా ? అల్ల నాడు పొయ్యలక మనినంతనే కదా మూడునాళ్ళు మూతి ముడుచుకొని కూర్చుంటిరి. వాదులు మానిన వాతలు మానునా? నే నింతియే పెట్టిపుట్టితిని. ఆ సోమిదేవి భర్తం జూడుఁడు. దానిం గూర్చుండఁబెట్టి యింటి చాకిరి యంతయు నాతఁడే చేయును. రాత్రులు కాళ్ళు పిసిగి మరియు‌ నిద్రపోవునఁట. దాని యదృష్టమది నా యదృష్టము.

బ్రాహ్మణుఁడు :- ఓహో ? నీ కెంత యూహ యున్నది. నేనుగూడ నట్లు చేయుదునులే. పోనిమ్ము. ఆ గొడవలు పిమ్మట విమర్శింతము. పెద్దన్న కొడుకుమాట యేమి చెప్పెదవు ?

బ్రాహ్మణి :- వాకిటికివచ్చిన యతిధికైన నిత్తునుగాని పెద్దన్న కొడుకున కీయను.

బ్రాహ్మణుఁడు :- పోనిమ్ము. నీ యిష్టము వచ్చినట్లు చేయుము అని మాట్లాడుకొనుచు నంతలో నిద్రవోయిరి.

ఆ సంవాదమంతయుఁ గౌశికుఁడు చెవియొగ్గివిని సంతోషించుచు వేకువ జామున లేచి స్నానముఁజేసి యొడలెల్ల విభూతిరేఖలు మెరయఁ బరమ శ్రోత్రియుండువోలె నొప్పుచు గర్దముని యిల్లెక్కడనిన యక్కడ నక్కడ నడుగుచు వచ్చి వచ్చి తుదకుఁ గర్దనుం గాంచి సాదరముగాఁ జూచుచు అయ్యా! గర్దముఁడవు నీవేనా? పెద్దదూరమునుండి మీ యగ్రహారమును నిన్నును నడిగికొనుచు వచ్చితిని. నిన్నుఁ గాంచితిని. కృతకృత్యుండ నై తినని పలికిన విని యాకర్దముఁడు విస్మయఁ పడుచు నతని కతిధిసత్కారములు దీర్చి సుఖోపవిష్టుండైయున్న యా పూజ్యునకు నమస్కరింపుచు నిట్లనియె. అయ్యా! నేను కర్దముఁడనే ! నా పేరు మా గ్రామము పేరును స్మరించుచు వెదకి యింతదూరము రానేల ? మీ రూపము కడు తేజోవంతముగాఁ గనంబడుచున్నది. ఈ యల్పునిపై మీ యట్టివారి కంత యనుగ్రహము కలుగుటకుఁ గారణము వినఁగోరుచున్నాను. అని యెంతయో వినయముతో నడిగిన నా కౌళికుం డిట్ల నియె.

పెండ్లి చేయవలసిన పుత్రిక నీకుఁ గలదా ? లేదా? నా మాటఁ జెప్పుము. పి‌మ్మట నీ కుత్తరముఁ జెప్పుదు ననుటయు ఆ ! యున్నదని పలికెను. అట్ట యిన నీవే ? సందియములేదు. వినుము నేను పశ్చిమదేశ వాసుఁడను. నా పేరు కౌశికుఁ డందురు నేనుఁ జిన్నతనములో వేదశాస్త్రములఁ జదివితిని. రామాయణములోఁ గౌశికునిచరిత్రము జదివి తపంబున నెట్టికార్యము సఫలమగుననినిశ్చయించి యుత్తరకురు దేశమున కరిగి యిరువదియేండ్లు మహారణ్యములో నివసించి కందమూలం౦బులం దినుచు నిరువదియేండ్లు ఘోరతపముఁ గావించితిని. నా దపమునకు మెచ్చికొనుచు శంకరుఁడు ప్రత్యక్షమై నీకేమి కావలయునని యడిగిన నప్రయత్నముగా నా నోటినుండి చక్రవర్తి యగు కొడుకు కలుగవలయునని వాక్కు వెడలినది.‌.

నా మాటవిని చంద్రచూఁడుడు మందహాసము గావింపుచు వత్సా! ద్రవిడ దేశములోఁ దామ్రచూడమను నగ్రహారము గలదు. అందు ----- యను శ్రోత్రియుఁడు కాపురము చేయుచున్నాఁడు. వాని పుత్రిక వివాహయోగములో నున్నది. నా మాటగాఁజెప్పి యా కన్నియ నడుగుము. వారు నీకిచ్చి వివాహము సేయుదురు. ఆ బాలికకు సార్వభౌముం డుదయింపఁ గలడు. అంతకమున్న యా పట్టి కట్టి వరమున్నది. దానంబట్టి నీ కోరిక సిద్దింపఁ గలదు. వేగఁబొమ్ము. పెండ్లియైన వత్సరములోనే నీకుఁ గొమరుఁ డుదయించునని తానతిచ్చిన విని నేను గోరిన కోరికఁ దలంచుకొని నాకు నేను నిందించుకొనుచు నిట్లంటిని.

దేవా! సకల బ్రహ్మాండములకు హేతుభూతుండవగు నీవు ప్రత్యక్షమై గామన్తేనువను వదెళు భఖ ఎప్పు. లోదులు యం. తు నాము ఏ ళు తున్భవాం ౧తవంల సుతః డక్కర

ఫ్‌! ప్ర లన లను. గోరిరినం యంఠి స్టైంచిని ననుమతింపక గంగొంముంటు పుం పొమ్ము. ఆ విప్రపుత్రిక కడు నుత్తమురాలు. కాలిలో శంఖచక్రము లున్నవి. దానివలన నన్నికోరికలు తీరఁగలవని పలుకుచునే యంతర్దానము నొందెను.

నే నప్పు డేమిచేయటకుం దోచక మీ యగ్రహారము పేరును మీపేరును వర్ణించుకొనుచు నట గదలి తిరిగి తిరిగి నేటికి మీ యూరు చేరితిని. మిమ్ముఁ బొడగంటి నిదియే నా వృత్తాంతమని యా కథయంతయుం జెప్పెను.

అప్పుడు కర్దముఁ డుబ్బుచు భార్యను బిలచి సాధ్వీ! నీ మాటలన్నియు బూటకములని పాటించితినిగాని. సత్యములేయైనవి. అమ్మాయికి సార్వభౌముఁడగు కొడుకు పుట్టునని శంకరులే యానతిచ్చిరఁట వింటివా ? అన్నన్నా! హయగ్రీవ సోమయాజి యింత‌ నిదర్శనముగాఁ జెప్పునని యెన్నఁడు నెరుంగనే. అని మెచ్చుచు భార్య కావృత్తాంతమంతయుఁ జెప్పెను.

ఆ యిల్లాలు తన మనుమఁ డప్పుడే చక్రవర్తి యైనట్లుఁ జెలఁగుచు మీకు నా మాటలన్నియుఁ బూటకములుగనే తోఁచును. ఇప్పుడైన‌ నమ్మితిరా ? అమ్మాయి కాలిలో శంఖచక్రములున్నవి. చూడుఁడని నాఁడు జెప్పినమాట జ్ఞాపకమున్నదియా ? కాళ్లు పగిలి యిట్లున్నవి. బీటలుగాని చిహ్నములుకావని మీ రనలేదా ? నన్నును బిడ్డనుజూచిన మీ కొకప్పు దిష్టమున్నదియ? యని యెత్తి పొడుచుటయు నతండు పోనిమ్ము. నీ మాటలన్నియు నమ్మితిని. ఇఁక ముందరికార్యయు చూడుము. మన పిల్ల నీతని కీయవలసినదేనాయని యడిగిన నామె యిట్లనియె.

దాని యౌన్నత్యము చూడలేక మీ కిష్టముకాకున్న లేకపోవచ్చునుంగాని నాకేల యభిమతము కాకుండెడిది. ఇన్ని దినము లాపినది యిందులకే కాదా ? ఇప్పుడు శీఘ్రముగాఁ బెండ్లి చేయఁదగినదియే యని పలికెను. శంకరుఁడు పంపె ననియుఁ దన పుత్రికకుఁ జక్రవర్తి పుట్టునను సంతోషమేకాని యా వార్త నిజమా ? దబ్బరా యను విషయ మించుకయుఁ దలంచినదికాదు.

ఆ దంపతులు పొందెడు సంతసముఁ జూచి కౌశికుఁడు దాపునకువచ్చి మీతో నొండు చెప్పమరచితిని. నా వివాహమైన తరువాతకాని యీ రహస్య మొరుల కెరింగింపరాదని శంకరులు నుడివి యున్నారు. మీరు తొందరపడి యెవ్వరి వద్దనైన నీ మాట వెల్లడింతురు సుమీ! ప్రమాదము జరుగునట అనుడు నా యిల్లాలిట్లనియె.

అవును. ఆ మాటయు నిజమే! మా యిరుగుపొరుగువారలే మమ్ముఁజూచి యోర్వలేకున్నారు. ఈ మాట తెలిసినఁ గన్నుల నిప్పులు గ్రక్కుకొని కార్యముఁ జెడదీయఁ గలరు. ఈ నడుమ రెండు మూడు సంబంధములు వారి మూలముననే తిరిగిపోయినవి. నెవ్వరికిఁ దెలియకుండ రహస్యముగా జరిగించుటయే యుచితము. శంకరులు సర్వాంతర్యాములు గనుకనే యిక్కడి యసూయయు గ్రహించి యట్లానతిచ్చిరి. వారి యాజ్ఞవడువుననే కావింతమని పలికి మగని చేతనే పంచాంగముఁ జూపించి యమ్మరునాఁడే ముహూర్తము నిశ్చయింపఁ జేసినది.

ఆ రాత్రియే తలయంటి పెండ్లి కూతుం జేసి పెండ్లి కొమరునికిని రహస్యముగా దలయంటి యలంకారములుంచి యా రాత్రి యెవ్వరినో నలువురఁ బారులఁ బిలిచి గుడితోఁ బెండ్లిఁ గావించిరి. మంగళసూత్రము గట్టువరకు నే విఘ్నము వచ్చునోయని యా దంపతులు వెఱచుచునే యున్నారు. మూడుముళ్ళు పడినవెంటనే యానందభరితులై తమ్ముఁ గృతకృత్యులుగాఁ దలంచుకొనిరి. ఆ పెండ్లికి దగ్గర చుట్టములనై నను బిలువలేదు. నాలుగవ దివసమునకుఁ గర్థముని యత్తగారువచ్చి యా వృత్తాంతమువిని గుండెలు బాదుకొనుచు నిట్లు కూఁతురుతో సంభాషించిసనది.

తల్లి :- అయ్యో! అయ్యో ! ఇది యేమిపాపము ? ఇన్నినాళ్ళు వెదకి బంగారమువంటి పిల్లను నిర్భాగ్యున కిచ్చితిరేల? ఇది నీ యాలోచనయా ?

కూతురు :- బిగ్గరగా మాట్లాడకుము. ఆయన వాకిటిలో నున్నాఁడు. వినెనేని కోపించును. పిల్లను మా యింటికిఁ బంపడు. లోపమేమి యున్నది? ఇరువురము నాలోచించియే చేసితిమి ?

తల్లి :- వానియం దేగుణముఁ జూచి యిచ్చితివి ? పాయమా ! నలువది యేండ్లు దాటినవి. చదువా సున్న. ధనమెట్టిదో యెరుఁగడు. గుణము విచారింపక దొంగలకు నొజ్జయఁట జూదరులకు విటులకు మొనగాఁడట.

కూతురు :- నీకీ దుర్బోధ యెవ్వరు కావించిరి ఆయన మహా తపశ్శాలి సుమీ? శపింపఁగలఁడు. నోటికి‌ వచ్చినట్లు మాట్లాడుచున్నావు.

తల్లి :- వీనిగురించి యీ గ్రామమంతయు నల్ల కల్లోలముగా జెప్పుకొనుచున్నారు. నీ‌ నోటికి వెఱచి నీయొద్ద నెవ్వరును మాటాడరు వీ డుత్తరదేశముఁలో బరవాసముఁజేసి పెక్కు నీచకార్యములఁ గావించెనట.

కూతురు :- ఆమాట నీతోఁ జెప్పిన గడుసుతొత్తుకొడు కెవ్వఁడో చెప్పుము. జుట్టుపట్టుకొని యడిగెదను. మాకు మంచి సంబంధము వచ్చినదని యీ యూరువా రందరు నేడ్చుచున్నారు. వారి మాటలు నమ్మి మమ్ము మందలించు చున్నావు.

తల్లి :- ఊరివారి నిందించెద వేమిటికి? వారు నీ యైశ్వర్యముఁ జూచి యోర్వలేకపోయిరి కాబోలు? వారి మాట లట్లుంచి నీ యల్లునికిఁ గల యాస్తియేదియో చూపుము.

కూతురు :- ఉన్నదేదియో యన్నది. ఈ ప్రశ్న నీ కేమిటికి?

తల్లి :- వాఁడు మిమ్ము మోసముచేసి రత్నమువంటి పిల్లను హరించెను. అయ్యో? నేనేమి చేయుదును. (అని దఖించుచున్నది ) కూతురు :- ఇందులకు నీవు విచారింప నక్కరలేదు. పిమ్మట నీవే యాశ్చర్యపడగలవు.

తల్లి :- అదియేదియో వెళ్ళగ్రక్క రాధా ? దాచినలాభమేమి ?

కూతురు :- నీ మనుమరాలి కాలిలో నేమియున్నదియో చూచికొనుము. పిల్లా! నీ యరికాలు ముసలిదానికిఁ జూపుము. (అని పెండ్లికూఁతురుతోఁ జెప్పు చున్నది.)

తల్లి :-- (చూచి) కాలిలోనేమి యున్నది. దుమ్ము ధూళి యున్నది.

కూతురు :- తిట్టక - నా మాట మెల్లగా విందువేని యంతయుం జెప్పెదను వినుము. దీనికి‌ జక్రవర్తి యగు కుమారుఁడు పుట్టగలఁడు. శంకరుఁడతని కట్టి వరమిచ్చెనని యా కధ యంతయు జెప్పినది.

అప్పుడా వృద్ద మరియు నురము బాదుకొనుచు అయ్యో ? అయ్యో ? ఆ మాయలతొత్తు కొడుకుమాట మీ రేల నమ్మితిరే? వాఁడెక్కడ ? తపమెక్కడ ? శంకరుడెక్కడ ? ప్రత్యక్ష మెక్కుడ ? అక్కటా ! ఎట్టివ్యూహముఁ బన్నెను. మీరు గాక యీ కల్పన మెవ్వరై న నమ్ముదురా ? పిల్ల గొంతును గోసితిరి. వీనికి సంతానము కలుగునా ? రోగములపుట్టయఁట ఛీ! ఛీ! అందులకే యీ యగ్రహారములో వా రందరు మీ కథ ప్రహసనము లాగునఁ జెప్పుకొనుచున్నారు. శంకరుఁడు కనఁబడినందులకు నిదర్శన మేదియేని జూపింప మనుము అప్పుడు నమ్మవచ్చును. అని యూరక వగచుచుఁ బెండ్లి కూఁతు నెత్తుకొని మొత్తుకొనఁ దొడంగినది. కూఁతురు తెల తెలఁ బోవుచుండెను. ఇంతలోఁ గర్దముఁడువచ్చి‌ యత్తగారి విచారమువిని కౌశికునిం జేరి నీకు నీశ్వరుఁడు గనంబడెనంటివిగదా ? దృష్టాంతమేమని యడిగిన నతం డారు వేళ్ళు చూపుటయు నందలి భావమేమన పుడు నిఁక నారుమాసములకు నా మహిమఁ జూపఁగలనని సూచించెను.

అప్పుడు మిగిలిన కార్యమునకు వగచుట నిరర్థకమని తలఁచి క్రమముగా విరక్తిఁ జెందిరి. ఆరుమాసములై న వెనుక వాని దుశ్చేష్టితము లన్నియు వెల్లడి యైనవి. ఆ దంపతులు నెత్తి మొత్తుకొనుచు లోలోపల దఃఖించుచుఁ గొన్ని కొన్ని యొరులకుం దెలియనీయక వాని నుత్తముఁడేయని పొగడుచు వాని మూలమున బంధువుల కందరకు విరోధులైరి. కొన్ని నెలల కా చిన్నది యీడేరటయు నప్పుడు పునస్సంథాన మహోత్సవముఁ గావించిరి. వెంటనే చికిత్సోత్సవముగూడఁ జేయవలసి వచ్చినది.

మరికొంత కాలమునకుఁ గొమరుం డుదయించుటయు వానికిఁ జక్రవర్తియని పేరు పెట్టెను. రాజ్యమేదియని మామగారడిగినఁ గౌశికుఁ డెవ్వనియింటికి వాఁడే చక్రవర్తి. రాజ్యముతోఁ బనిలేదని యుత్తరముఁ జెప్పెను. మరియు నెవ్వరేని నీ శంకరు వరమేమైనదని యడిగినప్పుడు మనుష్యులవలె దైవములుగూడ మాయలు






నో నేర్చుకొనుచున్నారు. శంకరుఁడు నన్ను మోసముఁ జేసెనని నిందించుచుండును. కావున నో భూసురుఁడా ? నీవా కౌశికునివలె మోసము పన్నుకొని వచ్చితివేమో యెవ్వఁ డెరుఁగును? మే మట్టి మాయలం జిక్కువారము కాము. నీ దారి నీవు పొమ్ము. మా పిల్లనీయము. అదియునుంగాక-

శ్లో. వర్ణం సితం శిరసి వీక్ష్య శిరోరుహాణాం
    స్థానం జరాపరిభవిష్య తదా పుమాలనం
    ఆరోపితాస్థిళకలం పరిహృత్య యాంతి
    ఛండాలకూపమివ దూరతరం తరుణ్యః.

అని యెఱింగించువరకు వేళ యతిక్రమించినది తరువాత కథ తదనంతరావసంధంబున నిట్లని చెప్పం దొడంగెను.

డెబ్బది ఏడవ మజిలీ

కరభశరభుల కథ

శరభుడు :- కరభా ! నిన్న నా విదేశ బ్రాహ్మణునితోఁ దలుపు వైచికొని మన గరువుగా రెద్దియో ముచ్చటిందిరి. ఆ రహస్యముఁ దెలిసికొంటివా ?

కరభుఁడు :- వారు రహస్యముగా మాట్లాడికొన్న విషయము మన కెట్లు తెలియఁబడును ?

శరభుఁడు :- మనల దూరముగాఁ బొమ్మని నంత నేదియో వింత యుండక పోదని తలంచి రహస్యముగా నటుకపైఁ జేరి వీరి యేకాంతలాపము లాలకించితిని.

కరభుఁడు :- అందలి విశేషములేమి ?

శరభుఁడు :- ఆ బ్రాహ్మణుఁడు పెద్దకాలము తపముఁజేసి యింద్రజాలము పరకాయప్రవేశము అను విద్యలు రెండు సంపాదించి యంతలో దంతభగ్న మగుట నవి ప్రసాదింపమి సంతానాపేక్షఁ బెండ్లి యాడఁ దలంచి గురుపుత్రిక సావిత్రినిమ్మని యాచించెను.

కరభుఁడు :- అందులకుఁనొజ్జ లేమనిరి ?

శరభుడు :- కౌశికుఁడను బ్రాహ్మణునికథఁ జెప్పి నీవు మిగుల వృద్ధుండవు. నీకుఁ బిల్లనియ్యనని చెప్పిరి.

కరభుఁడు :- తరువాత తరువాత.

శరభుఁడు :- అతఁడు సిగ్గుపడి మరుమాటఁ బలుకక యిప్పుడే యీ యూరు విడిచి మరియొకయూరికిం బోయెను.

కరభుఁడు :- పోవుగాక మనకేమి.

శరభుఁడు :- మన మెన్నియేం డ్లేడిచినను రామశబ్దమైన తిన్నగారాదు.