కాశీమజిలీకథలు/ఆరవ భాగము/74వ మజిలీ

జాలు. నీ యల్లుని గుణమెరుంగని వాడుంబోలె గోఁడుబూనితివి కృతవర్మ శకుని కన్న నధికుండు‌ జుమా! మనయింట భుక్తికి నిలిచెదనని మీరేమో యనుకొనుచున్నారు. అని కృతవర్మను బొగడుచు మగని నిందింప దొడంగినది. -

మేఘనాధుఁడు వినత చెప్పిన యుపన్యాసము మంతయు సత్యమని నమ్మి యల్లునియొద్దకుఁబోయి తన పుత్రిక కడు నుత్తమురాలని పొగడుచు నతనిం దద్దయుం బూరి పారఁగొట్టెను.

అంతలోఁ బ్రయాణ ముహూర్తము సమీపించుటయు మేఘనాధుండు నాటకోపకరణములన్నియు శకటంబులపై నెక్కించి కుటుంబ పరివార సహితముగా బయలుదేరి దేశాటనముఁ జేయుచు గొప్పపట్టణముల నిలిచి నాటకప్రదర్శనములఁ గావింపుచుఁ బారితోషికములందుచుఁ గొంతకాల మీరీతి దేశములఁ జరియించి కాశీపురంబున కరిగెను.

అని యెరింగించి పిమ్మట నగు వృత్తాంత మక్కథకుండు అవ్వలి మజిలీయందుఁ జెప్పఁబూనెను.

డెబ్బది నాలుగవ మజిలీ కథ

శబరదంపతులకథ

తారావళీ ! చిదంబరయోగి వట్టి జారుఁడట, మంత్రోపదేశ కై వతంబున నా బాలయోగినిని జేరదీసెనఁ టయ్యారే ? ఎంతవంత ఆతఁ డిచ్చిన మంత్రభస్మము మనకేమి ప్రయోజనము ? నిన్నుఁజూడక యాతం డింత యుపేక్షించుచున్నాడు. నేడు చక్కగానలంకరించుకొనుము. వానియొద్దకుఁ దీసికొనిపోయి యడిగెద నని కిన్నరదత్తుని భార్య యొకనాఁడు తారావళితో ముచ్చటించిన నమ్మచ్చకంటియు నందుల కనుమోదించి దివ్యమణి భూషాంబర మాల్యాను లేపనాదులచే సింగారించుకొని మేనత్తతోఁగూడ శశాంకునొద్ద కరిగినది.

శశాంకుఁడు వారిరాక పరిజనులవలనం దెలిసికొని యెదురువోయి తల్లికి నమస్కరించుచుఁ దోడ్తెచ్చి యుచితపీఠంబునం గూర్చుండఁ బెట్టెను. తారావళి మేనత్త గద్ధియనాని వెనుక నిలువంబడినది. అప్పుడు రాజపత్ని వత్సా ! శశాంకా ! నీ వీ దేశపుఁబ్రజలపుణ్యంబున రాజువైతివి. మీతండ్రియుఁ గృతకృత్యుడయ్యెను. నీ సుగుణంబులు లోకులు కొనియాడుచుండ విని యానందించుచుంటిమి‌ అన్నిటం బ్రియకరుండ వైతివి. విను మిప్పుడు నీవు యౌవనవంతుండ వగుటఁ బెండ్లి యాడ‌ వలసి యున్నది. అప్పని యుపేక్షించుచుంటివి. అందులకుఁ దొలతనే మీతండ్రి నిశ్చయించియున్నారుగదా ? వారు చెప్పిన తారావళి నీ మేనమామ కూతు రిదియె. మంచి గుణవంతురాలు. సంతతము నీ గోష్టియే చేయుచుండును. ఈ చిన్నది రూపమునఁగాక విద్యాశీలంబుల వాక్సతిని మీరియున్నది సుమా ? దీనిం బెండ్లి యాడి మా కల ముద్దరింపవలయు నిదియే నా కోరిక యని పలికిన వినయ వినమిత శిరస్కుఁడై యతం డిట్లనియె.

తల్లీ ! మీ యుల్ల ముల వేరొక తెరఁగున తలంపకుఁడు. మీ యానతి వడువున నడచుచుండ. ఈ నడుమ ప్రభాసాగరునికి సహాయముగా సత్వవంతుఁడను దండనాయకు ననిపితిని. అతండు శత్రురాజుల నెల్లఁ గాందిశీకులం గావించెను. దానంజేసి యిప్పుడు రాజులు పెక్కండ్రు మనకు విరోధులైరని వినుకలి కలిగినది మరియు నా సత్వవంతుని బ్రభాసాగరుఁడు తనయొద్ద నునిచికొనఁ దలంచినట్లు వార్త వచ్చినది. వానిం దీసికొనిరా నే నరగుచుంటి. నటనుండి వచ్చిన తరువాత వివాహ నిర్దేశముఁ జేసికొందముగాక. అని పలికిన యామెకు సంతసముఁ గలిగించెను,

అప్పు డామె తారావళి కేదియో సంజ్ఞఁ జేసినది ఆ బాలిక యొక పుష్పమాలిక యెత్తి తత్తరమందు చిత్తముతో శశాంకుని కంఠమున వైచినది. అతం డా దామంబు సవరించుకొనుచు మందహాసముఁ గావించెను. పిమ్మట‌ రాజపత్ని యీ మాటయే పలుమారు సెప్పి తారావళితోఁగూడ శుద్ధాంతమున కరిగినది.

తారావళి యత్తగారితో శశాంకు డాడుదికాని మగవాఁడు కాఁడనియు నాకార చేష్టాస్వరముల లక్షణంబులిట్టున్న వని వాదించిచెప్పిన వెరగందుచు నామె యా విషయము పరీక్షింపఁ జురికయను తనదాది నొకదాని రహస్యముగా నతని వెనువెంటఁ దిరుగునట్లు నియమించినది

శశాంకుఁడును సత్వవంతుం దీసికొనివచ్చు తలంపుతోఁ దగు పరి వారము సేవింప దురగారూడుడై యొకనాఁడు బయలుదేరి సౌగంధిక నగరమున కరుగుచుండెను. దారిలో గిరాతమిధున మెదురుపడి నమస్కరించుటయు గుఱ్ఱమును మెల్లగా నడపించుచు మీరెవ్వరు ? ఏమిటికి వచ్చితిరని యడిగిన వారు వారువముతో నడచుచు ని‌ట్ల నిరి.

అయ్యా మేము కొండవారము. మాకు లేక లేక సత్వవంతుడను బొట్టెడు పుట్టెను. వాని మీరెక్కడికో పంపిరని మాపల్లెవాండ్రువచ్చి చెప్పిరి. వాఁడెన్నఁడును మాకొండదొరియ విడిచి యరిగియెరుఁగడు. తండ్రీ ? వానినేమి చేసితిరి? బ్రతికియుండెనా ? బాబు ! చెప్పుము. అని ధైన్యముతో దుఃఖించిన వారించుచు నతండు గుర్రము నాపి యేమీ ! సత్వవంతుండు మీ కుమారుండా ? బాపురే వానికొరకు శోకించెదరేలఁ అతండు భద్రముగా నున్నవాఁడు. మిక్కిలి యన్నతదశలోనికి రాఁగలడని పలుకుచు వానిపుట్టుకను గురించియు, విద్యను గురించియు బలమును గురించియూ గ్రుచ్చి గ్రుచ్చి యడుగుటయు. నా కిరాతుం డిట్ల నియె

స్వామీ ! నాపేరు కాసరుండు. నాభార్యపేరు పింగళిక. మేమా కొండలలోని కెప్పుడు పోయితిమో చెప్పజాలము. ఈ పిల్లవాఁడు కొండ దొనలోనే జనించెను. వాఁడు కొండికతనము నాటినుండియు వెరపులేక మెకంబుల కెదురుపోయి పారఁదోలు చుండును. విల్లు వంచుటయు నమ్మువేయుటయు వానికిఁ దొలుత సులభముగా నలవడినవి. విద్యయంతయు నొక యేటిలో మకరాంకుఁడను వానివలన నేరుచుకొనియెను. వాఁడే మావాని నింటికడ నుండనీయక పత్తనములని పెత్తనముఁ జేసి తీసికొని పోయెనని యా వృత్తాంత మంతయుం జెప్పెను.

అప్పుడు శశాంకుఁడు మిక్కిలి వెరగుపడుచు అయ్యా ! సత్వవంతు నప్పుడే నీ వెవ్వండవు ? విద్య లెక్కడ గరచితివి ? నీ తెరఁ గెట్టిదని యడుగక పోయితింగదా? మకరాంకుఁడు వానితో మావీటికి వచ్చియే యుండును వానికి నాయునికిఁ దెలియదుగదా? అని యే మేమో ధ్యానించుచుఁ గాసరా ! మీరు నాతో రండు నేనును మీ కుమారునొద్దకే యరుగుచున్నాడ. వానిఁ జూపెదనని పలికి వారితోఁగూడఁ గతిపయ ప్రయాణముల సౌగంధిక నగరమున కరిగెను.

ప్రభాసాగరుఁ డితనిరాక విని సంతసించుచు నెదురుపోయి సపరివారముగాఁ దోడ్కొనిపోయి పెద్దగా నర్చించి తన కతఁడు కావించిన యుపకార ముగ్గడించుచు వేతెరంగులఁ గొనియాడెను. శశాంకుడును నప్పటికిఁ దగినరీతి నభినందించుచు సౌగంధికకుఁ బెండ్లి చేసిరా ? మేయల్లుడేడి ? సత్యవంతుం దెందున్నాడని యడుగుటయు నతం డిట్లనియె.

శశాంకా ! సౌగంధిక కింకనుం బెండ్లి చేయలేదు. గుప్తవర్మయను విప్రకుమారుని వరించుట మీరు వినియే యుందురు. అతనికి సత్వవంతునికి నసామాన్యమైన స్నేహము కలసినది. ఇరువురు నేక దేహమట్ల మెలంగఁ జొచ్చిరి. నేను పెండ్లి ప్రయత్నముఁ జేయఁ గాశీపురంబున కరిగివచ్చి‌ పెండ్లి యాడెదనని యాగుప్తవర్మ చెప్పెను.

గుప్తవర్మ రూపంబున ననవద్యుఁడే కాని పరాక్రమ శూన్యుండగుట నా మది కంత నచ్చియుండలేదు. తరుణులు రూపైకపక్షపాతినులుగదా! నేను పొమ్మని పరిణయం బుపేక్షఁ జేసితిని సత్వవంతుఁడును గుప్తవర్మయుఁ గాశీపురంబున కరిగిరి. ఇంకను రాలేదని యావార్తయంతయుం జెప్పెను.

అప్పుడత డేమి చేయుటకుఁ దోచక యోచించుచున్న సమయంబున నిరువురు దూతలు వచ్చి దేవాఁ మేము దేవరచారులము. మీరిచ్చిన పద్యపటంబు దేశదేశములు త్రిప్పితిమి. ఎవ్వరును దగిన యుత్తరమీయరై రి. కాశీపురంబున వ్యాసమఠంబున నొక చిన్నవాఁ డీపద్యమువిని యొక్కింత తడవు ధ్యానించి కన్నీరుఁ గార్చుచు మరల నీపద్యము వ్రాసియిచ్చి మేము రమ్మని యెంత నిర్బంధించినను బాటింపక పొండు పొండు. ఈ పద్య మెవ్వరు వ్రాసి యిచ్చిరో వారియొద్ద కీపద్యము తీసికొనిపోయి చదువుఁడు. అని తిరస్కరించిన మే మింటికి వచ్చి యందు మిమ్ముఁ గానక యిక్కడి

కరుదెంచితిమని పలుకుచు పద్యము చేతి కిచ్చిరి.

గీ. తెలిసికొంటి నీదు నెలవు నేఁడు వయస్య
    గాశిఁ జెంది తుదకుఁ గాశిఁ జెంది
    తిరుఁగుచుంటి నొకత నెరుఁగవేమిటి కింత
    మొదటిచింత గష్టములకు గంత.

ఆ పద్యముఁ జదివికొన్న శశాంకుఁడు ఔరా ! నేను రాజ్యమదాంధుఁడనై తొంటి వృత్తాంత మంతయు మరచితినిగదా ! ఈ పద్యము వ్రాసినది రూపవతియని లిపిచిహ్నములు సెప్పుచున్నవి. అవును. మే మైదేఁడులు దాటెనేనిఁ గాశీపురంబుఁ జేరుకొన నియమముఁ జేసికొంటిమి. నావయస్యు లందరు నీపాటి కావీటి కరిగియుందురు. ఏనును బోవలసినదే. అన్నిగతుల నప్పయనము సమంజసమై యున్నదని తలంచుచు నప్పరివారము సేవింప భిల్లదంపతుల వెంటఁ బెట్టుకొని కొన్ని దినములకు గాశీపురంబున కరిగెను.

సీ. ప్రవహించునేపుర ప్రాంతమం దుత్తర
              వాహినియగుచు దివ్యస్రవంతి
    విశ్వేశ్వరాభిఖ్య వెలయు నెం దభవుండు
              కై వల్య మొసఁగ గంకణముఁ దాల్చి
    రక్షించు నెం దర్దరాత్ర మందై నను
             నన్నపూర్ణాదేవి హస్తభిక్ష
    మణికర్ణి కాతీర్ద మణియాశ్రితాదిత్య
            మణియై యొసంగుఁ గామములనెందు

గీ. నెందుఁ బొలుపొందుడుంఠి విఘ్నేశ్వరుండు
    భైరవుం డెందుఁ దిఱుగుఁ దలారియగుచు
    దండపాణియు బిందుమాధవుఁడు క్షేత్ర
    పాలు రెటనట్టి కాశిపట్టణంబు.

శశాంకుం డప్పుణ్యక్షేత్రంబునఁ బరిజనులతోఁగూడ నాప్తులజాడ నరయుచుఁ గొన్నిదినంబులు వసించి యొకనాఁడు దివ్యరూపసంపన్నులై యరుదెంచిన య క్కిరాత దంపతులంగాంచి విస్మయ రసావేశ వివశ హృదయుండై యిట్లనియె.

పుణ్యాత్ములారా ! మీరంతకుముందు మాతో వచ్చిన శబరిదంపతులని యూహించుచుంటిని. మీ తొంటిరూపులు మారినవేమి? ఉత్తమ బ్రాహ్మణతేజస్సంపన్నులై యొప్పుచుండిరి. మీ రా భిల్లులుకాక వేరొకరా మీ తెరం గెఱిగింపుడని యడిగినఁ గాసరుఁ డిట్లనియె.

సిద్ధతీర్థముకథ

దేవా ! మా చరిత్రము కడువిచిత్రమైసది. వినుండు. దివ్యక్షేత్రంబుల ప్రభావంబు లజ్ఞులకెట్లు తెలియును. తొల్లి మేము మువ్వురము బాలురము మార్గంబునం గలుసుకొని యిప్పురమున కరుదెంచి సహాధ్యాయులమై విద్యాభ్యాసము సేయఁ దొడంగితిమి. అచిరకాలములో విద్యారహస్యములన్ని యు గ్రహించి మా బుద్ధికౌశల్యమునకు మెచ్చుకొనుచు మా యుపాధ్యాయుండు నాకు విద్వత్కేసరి యనియు నొకనికి సోమభట్టారకుండనియు నొకనికి యజ్ఞదత్తుండనియు బిరుదముల నిచ్చెను.

అప్పుడు మాయౌవనమదము విద్యామదము మేనులు తెలియనిచ్చినవికావు. కన్నులున్నను గ్రుడ్డివారమైతిమి. ప్రపంచకమంతయు గోటిలో నున్నదని భావించుచుఁ బెద్దపండితుల నెదిరించుచు వితండవాదములు సేయుచు గర్వాభిభూతులమై తిరుఁగుచుంటిమి.

ఒకనాఁడు మేమిందు విహరించుచు యదృచ్ఛముగా సిద్దతీర్దంబునకుఁ బోయితిమి‌. అప్పుడు పౌరాణికుం డొకండు తీర్దప్రభావముఁజదివి జనులకిట్లు జెప్పుచుండెను.

 
గీ. సిద్ధతీర్ధంబు కాశిక్షేత్రమందు
    జనులపాలింటి దేవభూజంబుసూవె
    దేవులగొని భక్తినుతించి మ్రొక్కి
    యేమిగోరిన దాని నీడేర్చునతఁడు.

జనుల కోరికలు సిద్ధింపఁ జేయుటంజేసె యీతీర్థంబునకు సిద్ధతీర్థం బనియు స్వామికి సిద్దేశ్వరుఁడనియు నన్వర్థనామములు గలిగినవి. అని తన్మాహాత్మ్యము నుడువుచుండ నందు నిలువంబడి మేము మువ్వురము వింటిమి. సోమభట్టారకుఁడు నవ్వుచు నిట్టిగాధలం జెప్పియే యిప్పురవాసులు తైర్దికుల మోసపుచ్చి ద్రవ్యము లాగుదురు. ఈ సిద్దేశ్వరుఁడే యింతమాత్రమునఁ గామ్యముల నొసంగినచో నిఁక జనులకు నేకృషితోను బనిలేదుగదా అని పరిహసించిన నేనిట్లంటి. మ్మితమా ! అట్ల నరాదు. తీర్దంబుల ప్రభావంబతి గుహ్యమై యుండును. అట్టి యుపాఖ్యానములు మనము పెక్కులు చదివి యుండలేదా? అనుటయు నవియు నసత్యములే యని యతండు వాదించెను. అవ్విషయమున యాయిరువురకుఁ బెద్దసంవాదము జరిగినది. యజ్ఞదత్తుఁడు నాతో నేకీభవించెను. అప్పుడు నేను నావాదము స్థిరపరచు తలంపుతో నా సిద్ధతీర్థంబున మునుంగి యా స్వామినివలఁ గొని యెదుర నిలువంబడి యిట్లుఁ గోరుకొంటి.

స్వామీ ! సిద్దేశ్వరుఁడా ! నాకు మిక్కిలి చక్కనిభార్య‌ దొరకవలయును. అది నాకనుకూలయై వర్తింప నడవిలోనున్న స్వర్గములో నున్నట్లు సంతోషము గలుగవలయును. ఆ భార్యయందుఁ ద్రిలోక మోహజనకుండగు కొమరుం డొక్కరుఁడేమ గలుగ వలయును. వాని కొక్కవత్సరములో విద్యలన్నియు రావలయును. వాఁడు మిగుల సత్వవంతుడై స్వభుజలార్జితములై న రాజ్యంబులు నాలుగు దెసలయందును బాలింపవలయును. ఇదియే నా కోరిక. నీయందు మహిమ యుండిన నాకామితము తీరుపకపోవు అని మ్రొక్కితిని.

నా కోరికవిని యజ్ఞదత్తుండు మిత్రమా ! కొంచెమే కోరికొంటివిగదా? అని నవ్వుచుఁ దానుగూడ నావలెనే స్నానముఁ జేసివచ్చి స్వామీ ! నీవీవిద్ద్వకేసరి కామితముఁ దీ‌ర్తువేని వీనికి జనించిన కుమారునికిఁ దగిన భార్య యుండవలయుంగదా? శీలవతియుఁ గళావతియు విద్యావతియు రూపవతియు ననఁ బేరుపొందిన పుత్రికను నాకుఁదయ జేయుము నాలుగు జాతుల యందములు దానియం దుండవలయును.

ఇదియే నా కామితమని మ్రొక్కికొనియెను. మా యిద్దరి యభిలాషలు విని సోమభట్టారకుఁడు పకపక నవ్వుచు నెదురనిలువంబడి దేవా సిద్దేశ్వరా ! పాషాణస్వరూపా ! నీకు గోరికలఁదీర్చు సామర్ధ్యముఁగలిగియున్నచో నాకు మసిమంగళమువంటి మొగముఁగలిగి చూచువారి కసహ్యకరమగు నాడుశిశువుఁ గలిగింపుము. నీ మహిమ యదార్థమని నమ్మెదను. లేనిచో నల్లరాయివే యని పరిహాసముగాఁ గోరికొనియెను.

ఆ మాటవిని నేను తధాస్తు అని పలుకుచు స్వామి ! వీని కామితము ముందే తీర్పవలయుం జుమి ! యని యనువదించితిని. నా మాట కతం డళుగుచు నౌరా ? నీ కడుపున నెట్టియూహలున్నవి. నిక్కముగా నీకుఁ జక్రవర్తిపుట్టునని గరువముఁ జెందుచు నాకుఁ గురూపిణి యుదయింపవలయునని తలంచుచుంటివా ? కానిమ్ము. ఈలాటి నల్ల శిలలకే యట్టిసామర్థ్య ముండిన లోకములు నిలచునా? నీకా నమ్మకమే కలిగియున్నచో నేనువేరొక కోరికఁ గోరెదం జూడుము. ఓ సిద్ధేశ్వరుఁడా ఈ కేసరి చక్కని భార్యం బెండ్లి యాడినతోడనే మతిచెడి విద్యల మరచి కొండలకరిగి కిరాతుఁడై. మెలంగ వలయును. యజ్ఞదత్తుండునునట్టి కూతురుపుట్టునేని దానిమూలమునఁ తగనివావు ౬6 బడుంగాత. ఈనా కోరికలు న్‌వు సీర )కనోముతి నని నీవు సి సశ ్రరుంచనుకాము ను యని మఠల గోరికొ..యెను. అప్పుడు నేనాశన నందించుచు". న క నిం బలిహసించుచు. గోరిన కొరిక గిప్పింపవలయ! సెనినంతన గోపి సంచి నొ దేవత్సాదోపళ(గవు.. నీ మాటలు చేల్పులు మగ్నంతు.": మన్నించిన అ గాశికి పచ్చి యాసిద్దలింగము నాశాథంచి నాకికావత్వమ.( బాపుక ౨2 అతః సీ క! త్రిరముం ఇప్పతిని. మా తగవ్పలు వారించుచు యజ్ఞచత్తుండు ఖట్దారకాః సీ నివు ...దగ షి “పగతో న వృట్రతంతునం.9 హోరి: ]ల సిద్ధించిన సిద్ధింపక నోయినకు. మంటోగపుథే హతుతు ఖీద్ద నెల్లు “పలస్లి సం భ్‌ న. సాలన్‌ [లన్న ము చిబముగాం. చన ఎరు సించవించుదు.: న్నారు లోన. బాపురేః ఎంతచోద్యము. మిత్రమా ! పోనిమ్ము. నీకు జక్కని కూతురు పుట్టుంగదా? దానినే చూపి నా పుత్రిక కన్యాత్వ మెట్లోఁ బాపికొనియిదనులే యని సమాధానముఁ జెప్పెను.

అప్పుడు మా పరిహాసవచనములే కలహములై క్రమంబునఁ బరుషములగుటయు నొండొరుల గట్టిగాఁ దిట్టికొంటిమి. మరల గొంత సేపటికి సమాధానపడి కలిసికొని మఠంబునకుం బోయితిమి. అట్లు గాశీపురంబున విద్యలం జదివి నేను ముందుగనే దేశమునకుం బోయితిని. చక్కనిపిల్లం బెండ్లి యాడితిని. అది కాపురమునకు వచ్చినతోడనే మా యిరువుర మతులు పూర్వస్మృతిలేక చెడిపోయినవి అడవులపాలై పోయితిమి. కొండలలోఁ గాపురముంటిమి పెక్కులేల? అప్పుడతండు తిట్టిన తిట్టంతయు దగిలినది. సిద్దేశ్వరుని కరుణచే నా కుమారుఁడు నట్టివాడేయై సంవత్సరములో విద్యలన్నియుం జదివెను.

మీరు సెప్పిన కథవలన నతండు పరాక్రమశాలియైనట్లు తెల్లమగుచున్నది కదా? మఱియు వెనుకటియెఱుక యించుకయు లేకున్నను మీ దయవలన నీపుణ్యక్షేత్రమునకు వచ్చుట తటస్థించినది. దై వికముగా మేమిరువురము నాసిద్దతీర్దంబునకుఁబోయి స్నానముఁ చేసితిమి. పూర్వవృత్తాంత మంతయు జ్ఞాపకము వచ్చినది. చదివిన విద్యలన్నియుం స్పురించుచున్నవి. రూపములు మారినవి. సంతోషముతో మీయొద్దకు వచ్చితిమి. ఇదియే మావృత్తాంతము. నరేంద్రా ! సిద్దేశ్వరప్రభావమెట్టిదో చూచితిరా ? మేము పరిహాసముగాఁ గోరినవన్నియు జరిగినవి నాకుమారుఁడు -------- దేశములు పాలించుట జూడవలసియున్నది. అని తన కథ యంతయుం జెప్పిన విని శశాంకుం డమృత హృదయంబున మునిఁగినట్లు మురియుచు ముక్కు పై వ్రేలిడికొని యొక్కింత తడవు ధ్యానించి యిట్లనియె.

ఆర్యా ! సర్వకార్యములు భగపంతుఁడే చక్కపెట్టుచుండును. మనమొక్కటియుఁ జేయజాలము. దైవసంకల్పమున కనుగుణ్యములై న బుద్ధులు మనకుఁ బుట్టుచుండును. వాని ననుసరించియే చేయుచుందుము. నాఁడు మీరుకోరినప్రకార మంతయుం జరుగుటకు సందేహములేదు. యజ్ఞదత్తు నేనెఱుగుదును. మీ కోడలు పుట్టియే యున్నది. ఆ వృత్తాంతము ముందుమీకు వివరించెదను.  మీ కుమారుఁడు సత్వవంతుఁ డీవీటనే యున్నవాఁడు. కావున వెదకిరమ్మని పలుకుటయు నాభూసురుండట్టి ప్రయత్నములో ఆపట్టణమంతయుఁ దిఱుగుచుండెను.

అని యెరింగించి యప్పటికిఁ గాలాతీత మగుటయు నతండు తరువాతికథ అవ్వలిమజిలీయం దిట్లుఁజెప్ప మొదలుపెట్టెను.