కాశీమజిలీకథలు/ఆరవ భాగము/58వ మజిలీ

అని చదివిన నీతిపద్యము జ్ఞాపకముండిన నట్లు చెప్పవుగదా! యని యాక్షేపించినది.

అంతటితో నాప్రసంగము ముగించి హేమ యితర క్రీడావిశేషంబులఁ గాలక్షేపముఁ గావించినది. అని యెఱిగించువఱకు వేళయతిక్రమించుటయు మణిసిద్ధుఁడు తదనంతరోదంతంబవ్వలి మజిలీ యందిట్లని చెప్పఁదొడంగెను.

ఏబది యెనిమిదవ మజిలీ.

వీణావతికథ

శా. వీణాదండమః నీకతంబునఁగదా విద్వాంసులెల్లన్ ననున్
     వాణీతుల్య యటంచు నెల్లసభల న్వర్ణింతు రే నయ్యయో
     ప్రాణంబుల్వలెఁ జూచికొందు నిను నీ పాలింటికి న్వచ్చె న
     య్యేణీలోచన మృత్యువై యకటఁ నాకేదింక దిక్కె య్యెడన్.

హా ! వల్లవీరత్నమా ! తరతరంబులనుండి నీవు మాయింటగృహదేవతవలె బూజింపబడుచుంటివి గదా! నీకతంబునఁగాదె మావంగడము వారెల్ల సంగీతవిద్యా విశారదులని బిరుదములఁ బడసిరి. అయ్యో ! నేటితో నీఋుణము చెల్లి పోయినదియా? ఆహా! భవదీయ తంత్రీనాద మాధుర్య మెన్న నన్నారదాదులకు సక్యము కాకున్నది. నారదుని మహతికన్న నిన్నెక్కుడుదానిగ మురియుచుంటి. అంగుళీయస్పర్శ మాత్రంబున మొలచినట్లు నీయందు స్వరము లుత్పన్నములగుచుండు. అక్కటా! నిన్ను సతతము విడువకుండుటం బట్టియే నాకు వీణావతియని యభిఖ్య వచ్చినది. ఇప్పుడా పేరెట్లు చెల్లును? నీవంటి సాధనరత్న మీవంటివలతి మరియొకటి యున్నదియా? ఆ రాజపుత్రిక నిన్నుఁ ద్రొక్కక నన్ను గట్టిగఁగొట్టి విడచినను నింతచింత యుండకపోవునే? యని విఱిగిన యొక వీణ ముందిడుకొని వీణావతియను గాయనీమణి యొకతె గిరిదుర్గపట్టణంబున నొకయింటిలో విచారించుచుండెను.

అంతలో దానితల్లి లీలావతి యనునదివచ్చి యచ్చిగురుబోణితోపట్టీ! నీవు నిన్నటిరాత్రినుండియు నిట్లు చింతించుచుంటివి. దానం ప్రయోజనమేమి? ఇత్తెఱఁగంతయు రాజుగారి కెఱింగించితిని. ఆయన మిక్కిలి పరితపించుచు నిన్నో దార్చుట కిప్పు డిచ్చటికి వచ్చుచున్నాడు కన్నీరుఁ దుడిచికొనుము. అలకల ముడిచికొనుము. వారియెదురు రాజపుత్రిక నేమియు నిందింపకుము ఆమె వారికిఁ బ్రాణములలోఁ బ్రాణమయ్యె. ఇది మన గ్రహచారదోషమని నుడువుచుండగనే పుడమిఱేఁడు తత్తడి నెక్కి యొక్కరుఁడ యక్కడికివచ్చెను. లీలావతి యెదురువోయి లోపలికిఁ దీసికొనివచ్చినది. సంభ్రమముతో లేచి వీణావతి నమస్కరించి యెదుర నిలువంబడినది. పీఠోపవిష్టుండై యా భూపాలుండు వీణావతివి నీవేనా? నీవీణ మాస్వయంప్రభ విఱుఁగఁగొట్టినదఁట? యేమిటికి? అక్కడకుఁ బోయి నీవేమిచేసితివి? జరిగిన విశేషము లన్నియు సాంతముగా నుడువు మనుటయు నక్కుటిలాలక యలకలు సవరించుకొనుచు కన్నీరు దుడిచికొని యిట్లని చెప్పఁదొడంగెను.

దేవా ! దేవరయనుజ్ఞగొని సంగీతము పాడునిమిత్త ముమ్మ త్తకాశిని చెలిక త్తయ హేమయను చిన్నది నన్నాయుద్యానవన సౌధములోనికిఁ దీసికొని పోయినది. నేను భర్తృదారికం గాంచి నమస్కరించి యెదుర నిలువంబడినంత నన్నా నెలంత నేత్రాంతంబులం జూచుచు నీ వెవ్వతే వేమిటికి వచ్చితివి? యని యడిగినది. ఏ నెద్దియో చెప్పఁబోవుడు నామాట కడ్డమువచ్చి హేమ ఇందుముఖీ! ఈకుందరవదన వారసుందరి. దీనిపేరు వీణావతి ఈ గాయనీమణిని గాంథర్వంబులో సరస్వతి యపరావతారమని చెప్పుచున్నారు. దీని సంగీతమువిని మన మానందించు నిమి త్తమయ్యగారు దీని నిచ్చటికిఁ బంపిరి. పాట కనుజ్ఞయిత్తువే యని యడిగినది.

ఆమాట విని యాపాటలగంధి యించుక యాలోచించి తండ్రిగారి యానతి రిత్తపుచ్చనేల? యట్లె పాడవచ్చునని పల్కుచు నుద్యానవనవిహారార్ధమై బయలు వెడలుటయు హేమ నన్నుఁజూచి వీణావతీ! మే మిప్పుడే రాఁగలము. ఇంతలోఁ దంత్రుల మేళగించుకొనుచుండుము. అని చెప్పి యాయువతి ననుగమించి యరిగినది. నేనందు గూర్చుండి విపంచి నాలాపించుచుండ నయ్యండజయాన లిరువురుఁ బెక్కండ్రు చెలిక త్తియలు పరివేష్టింప వచ్చి యక్కూటంబునంగల పీఠంబులం గూర్చుండిరి.

పిమ్మట రాజపుత్రిక నామొగము చూచుచు నీకుఁబెండ్లియైనదాయని యడుగుటయు పల్కరించుటయే బహుమానముగాఁ దలంచి మురియుచు వినయముతో దేవి! నేను పెండ్లియాడలేదు. మాకులంబునఁ బెక్కండ్రు గన్యకలుగానే యుందురని యుత్తరము సెప్పితిని. అప్పుడా మగువ మొగంబున సంతోష మభినయించుచు స్త్రీలలోఁ బెండ్లి యాడనివారే యుండరఁట వరుని వరించనిచోఁ గులంబులో వెలి వేయుదురఁట నాకు లోకానుభవము లేదఁట: ఈ హేమ పెండ్లియాడుమని నన్నూరక నిర్భందించు చున్నది, నీకథఁజెప్పి, దాని కొకసారి బుద్ధిఁజెప్పుము. నీకు మంచి పారితోషిక మిప్పింతు ననుటయు హేమ పక్కున నవ్వినది.

అప్పుడా యించుబోణి యించుక యలుక మొగంబునందోప హేమమొగంబుఁ జూచి తలయూచుచు కానిమ్ము. నామాటలన్నియు నీకు నెక్కసక్కె ములుగా నున్నయవిలే అని పలికినది. చిరునగవుతో హేమ నాకు పాడుమని కనుసన్నఁ జేసినది అప్పుడు నేను చక్కని రాగమాలాపించి. ——— కవిన్నం మౌసనం వనంవా॥ మహోవారంలులగు శ్లోకంబులుచది. మరికొన్ని కృతులు నాలాపింపఁణో గోరంగిరిజన కయ్యంబు యక్షిణరౌద్రావేశంతో నక్షి యుగం విఱ్ఱఁజేయుచు బా.. సతౌత్తాః భక్తిరసావేశములగు కీర్తనలుఁ బాడక పాడ బూతుకూత లేమిటికి పాక్షితివి? ఆడుదానవుకావా! పెండ్లికూడ నాడలేదని చెప్పితినే॥ నిన్నేమిఁ జేసినం దప్పులేదని తిట్టుచు నొక్క పెట్టున నరుదెంచి నావిపంచి నట్టనడుమ తనకుడి కాలితో నొక్కితొక్కుత్రొక్కి యక్కడనిలువరి యవ్వలికిబోయినది. హేమయుఁ బరిచారికలును మారుపలుకనేరక యూరక యా నారీమణివెంట పొందుటవలకు 40 అశిన భాగము నా ప్యలం దండంబు చందంబున సర్వివలె తీఁగ లల్లాడుచుండెను. చీలలూడినవి పెట్టుకదలినవి. నరిగిరి. స్వామీ: ఏమని మనవిచేయుదును? రామభద్రునిచే విరువంబడిన హరకో నా వీణాదండంబు పెళుక్కుమని రెండుముక్కలైనది. తుంబీఫలంబుకొప్పెలవలె తుత్తునియలైనది. అట్లు శకలములైన వల్లకిం జూచి నా యుల్లము వికలమైనది. ఒడల చెమ్మటలు గ్రమ్మినవి. మూర్ఛవచ్చినది. దేవాః నాతో రహస్య ముగా హేమ శృంగార భంగీతరంగితమై సంగీతము పాడుమని నాకంతకుమున్ను యెఱింగించియున్నది. కావున నట్లు పాడితిని. ఇది నా తప్పా? చెప్పుడు. అప్పుడు నేనాఖండముల నక్కునం జేర్చుకొని బిట్టు వాపోయితిని. నా శిష్యురాలు గాక నన్నోదారు. వారెవ్వరును లేకపోయిరి. మాకు మేమ యుపశమించుకొని యా ఖండములు మూర్తుఃంబెట్టుకొని యిక్కడకు వచ్చితిమి. రాత్రియెల్ల నిద్రపట్టినది కాదు. ఇవ్వలదింగము లివిగో చూడుఁడు. అని కన్నీరుఁ గార్చుచు నా తనియ భూపతికిఁ జూచినది. R మీణ నిర్వదా సేవనీయం కనుసం సుండరీకాం ఎర్మా విష్ణు మహేశ్వరులతో బని లేదు. క్షణక్షణము వృద్ధి గబ్బిగుబ్బుల యుబ్బున రవికెను జించెడి యువతులు జనవరించుచున్నాము. ములగు మాటలు పెక్కులేల? పురుషులకు సేవింపదిగినది. వనము. అది యబ్బసిలో వనమునకే పోవలయును. ఆకథవిని యా భూపతి యపరిమిత పరితాపము నొందుచు, పూఁబోణీ ! వీఱెలకేమి? పదివేలు సంపాదించుకొనవచ్చు నామచ్చకంటి చిత్తము మరలినదికాదు. ఎంతఁజెప్పినను వినదు వైరాగ్యముఁ జెంది యున్నది. అందులకే నిన్నక్కడి కంపినది. కార్యముదీరినదికాదు పోనిమ్ము. నీవీణకుందగినవెల నిప్పింతునులే! విచారింపకు మని పలుకుచు నా రాజు గుఱ్ఱమెక్కి యింటికిం జనియెను.

పిమ్మట వీణావతి తల్లితో నమ్మా! రాజుగారు మన వీణవంటివి యంగడిలో దొరుకుననుచున్నవారలు. దీని గుణదోషములువిమర్శింప వారికేమియవసరము? లక్షయిచ్చినను యిటువంటివీణ సంపాదింపగలమా? గ్రహచారముచాలక యీయూరు వచ్చితిమి. ఈ కానుకచాలును. మరియొక యూరికిం బోవుదము లెమ్ము. అని పలుకుచుండగా నొక పరిచారిక అరుదెంచి వాకిట నిలువఁబడి వీణావతీ ! అని పిలిచినది. ఆమాట విని లీలావతి వాకిటకువచ్చి నీ వెవ్వతెపు? అని యడిగిన నేను స్వయంప్రభాదేవిగారి పరిచారికను. ఆమె వీణావతినిఁ దీసికొని రమ్మని నన్నంపినది. అని పలకటయు, వీణావతి చాలుజాలు ఇంతకుజరిగిన శిక్షచాలదా? మరి యింక నేమి చేయంగలదు? అని ముదలకించిన నమ్మదవతి తరుణీ! నీపుణ్యము పండినదిఁ మారాచపట్టి నీవీణె విఱుఁగఁ గొట్టినందులకు మిక్కిలి పశ్చాత్తాపము చెందుచున్నది. నీకు మంచిపారితోషిక మీయఁగలదు. వడి రారమ్ము. అనుటయు తల్లి వెళ్ళుమని తొందరపెట్ట వీణావతి యాపరిచారికతోఁగూడ బండియెక్కి యుద్యానవన సౌధమున కరిగినది.

అప్పుడు స్వయంప్రభయు హేమయు నెద్దియో మాట్లాడికొనుచుండిరి. హేమ వీణావతింజూచి యాదరపూర్వకముగా యువతీ! కృద్ధుఁడు గురువునైనం జంపునను సామెత యున్నదిగదా! ఈ బాలిక తత్కాలంబునం బుట్టిన కోపంబున నీ వీణ విఱుగఁగొట్టినది. అందులకు జింతిల్లుచున్నది. దానిని నీవు ప్రాణపదముగాఁ జూచుకొనుచున్న దానవని వినిమరియుం బరితపించుచున్నది. దయాశీలురు కారణముచేఁ గ్రౌర్యమును పొందినను సహజగుణంబుల విడువరుగదా? పోయినవీణకు మేమేమియుం జేయఁజాలము, నీవు పెక్కుసభలకుం బోవుచుందువు. ఎక్కడనైనను మా రాజపుత్రిక యిట్టిదని వక్కాణింపకుసుమీ। ఆమె సుగుణములు నీకుఁ బూర్తిగాఁ తెలియకపోవుటచే నింత జెప్పవలసివచ్చినది. అని పలుకుచుండ స్వయంప్రభ చాలుజాఁలు నీ స్తోత్రములతోఁ బనిలేదు. ఊరకుండుమని మందలించుకుఁ దన మెడలోని రత్నహార మొకటితీసి హేమకిచ్చినది. హేమయుదాని బేఁటలు సవరించుచు వీణావతీ! ఇది యమూల్యమైనది. నీ జీవితములో నిట్టి పారితోషిక మందనేరవు. మా రాజపుత్రిక నీకుఁ జేసినమహోపకారమునకుఁగాను యావజ్జీవము సంతసించు నిమిత్తము మిది నీకిచ్చుచున్నది. మా పెద్దలకుఁ దెలియకుండ సత్వరముగా నీ యూరు విడిచి పొండు. అని పలుకుచు నా మణిహార మా నారీమణి మెడలో వైచినది. వీణావతి యాభూషణంబుఁ దాల్చి వీణావిచ్చేదన సంజాతపరితాపంబు కొంత మరుగువడ నుబ్బుచు నబ్బింబోకవతుల యనుమతి వడసి గొబ్బున బస కరిగి యమ్మా! నావీణ తాను విఱిచియు నాకెట్టి పారితోషిక మిప్పించినదో చూచితివా? అని రత్నమాలఁ జూపుచు దావృత్తాంత మంతయుం జెప్పినది. లీలావతి యామె యౌదార్యము మిక్కిలి కొనియాడుచు నాటిరాత్రియే యొరు లెఱుంగకుండ పయనము సాగించి మఱియొకదేశంబున కరిగిరి.

వీణావతి ప్రసిద్ధిపడసిన గాయనీమణియగుట నా యా రాజధానులు కరిగి యందుగల వీణం బుచ్చుకొని పాడుచు కానుకల నందుచుండునది. తనకు సరిపడిన వీణ దొరకలేదను చింతమాత్రము విడిచినదికాదు.

ఆ వేశ్యాంగన లట్లు కొన్ని దినములు దేశాటనముచేసి యొకనాఁడు సాయంకాలమునకుఁ గాశీగుప్తమను పట్టణమునకరిగి యందొక సత్రంబున బసఁజేసిరి. ఆ సత్రము మిక్కిలి విశాలముగా నున్నది. నానావర్ణములవారును వేరువేర వండుకొనుటకును బండుకొనుటకును విహరించుటకుo దగిన గదు లనేకములు గలవు. అం దొక చిత్రశాలయున్నది. అది రాజకుటుంబంవారి చిత్రఫలకములచే నలంకరింపఁబడి నానాదేశ నిస్తులవస్తు విశేషములచే నొప్పుచు నెంతేని దర్శనీయమైనది.

మఱునాఁ డుదయంబునఁ గాలకృత్యంబుల నిర్వర్తించుకొని వీణావతియుఁ దల్లియు నాచిత్రశాల కరిగి యందుఁగల విశేషములన్నియుం జూచిరి. వారు పలు దేశములు తిరిగి చిత్రశాలలం బెక్కు చూచినవారగుట నందలివింతలు కొన్ని మాత్రమే వారికి సంతసము గలుగఁజేసినవి. ఒకచోట వీణ వాయించుచున్నట్లు వ్రాయఁబడిన యౌవనపురుషుని చిత్రఫలకముం జూచి విస్మయముఁ జెందుచు వీణావతి యందు నిలువంబడి సాతిశయముగా విమర్శించి అమ్మా! ఈ చిత్తరువుఁ జూచితివా? ఈ వీణ నా వీణవలెఁ బెద్దదిసుమీ: ఇట్టివీణ నాకు లభించిన మిక్కిలి యనుమోదింతునుగదా? ఇది చిత్రకారుఁడు వినోదముగా వ్రాసెనని తలంచెద. చూడుమనుటయు లీలావతి పరిశీలించి ఔను. ఇది చమత్కారముగా వ్రాసినదే. కానిచో వీణమాట యటుండనిమ్ము. ఇట్టి సుందరముగల పురుషుఁడు పుడమియం డెక్కడనైన నుండునా? ఇది కడు విచిత్రమని పలికినది.

పిమ్మట వీణావతి యందున్న రాజభటు నొకని నిర్దేశించి యీ చిత్రఫలక మెవ్వరు వ్రాసినదని యడిగినది. ఆ భటుం డిది మారాజుగారి నాల్గవకుమారుఁడు. సహదేవుని చిత్రఫలకము. ఎవ్వరు వ్రాసిరోనాకుఁ దెలియదని యుత్తరము చెప్పెను. ఆమాట విని యాబోటివెఱగుపాటుతో యా నీటుగానిం జూడవలయునని వేడుకపడుచు తల్లితో నమ్మా! నీవరిగి యారాజకుమారుని వృత్తాంతము సాంతముగాఁ దెలిసికొని రమ్ము. అతండు గానప్రియుండని దెల్లమగుచున్నది గానంబున వాని మెప్పించి యీవీణ గానుకగా నందుకొనియెదనని యప్పుడే తల్లిం బంపినది. లీలావతియు బిరుదపత్రములం గైకొని నగరున కరిగి సహదేవుని గృహ మెరిగి యతనిఁగాంచి సమస్కరించినది. అప్పుడా రాజకుమారుం డొకవీణియ ముందిడుకొని పాడుకొనుచు లీలావతిం గాంచి నీ వెవ్వతె వేమిటికి వచ్చితివని యడిగెను. అదియుఁ దనకూతురు వీణావతి సంగీతము పాడఁగలదనియు సభఁ జేయించవలయు ననియును గోరికొనిన సంతసించుచు నతం డారేయియే వారికిఁ బాడుట కనుజ్ఞ యిచ్చెను. లీలావతి యట్టియుత్తరువుఁ గొని సత్వరముగ బస కరిగి వీణావతిం గాంచి పుత్రీ! మనము చిత్రఫలకములోఁ జూచిన రాజపుత్రుం గనుఁగొంటి. వాని యందము చిత్తరువునం దున్న దానికన్న మిన్నగా నున్నది. అతండు వీణఁ బాడుటయేగాక విన్నాణముగా వీణలం జేయఁగలడట అతం డాలాపించెడి విపంచి నీవ ల్లకిం బురడించి యున్నది. ఆసంగీత విద్యావిశారదునియెదుట నీవుపాడి మెప్పువడయఁగలవో లేవో యని సందియమందుచుంటి. ఈ రాత్రియే పాడుటకు సెలవందికొనివచ్చితి. తరువాత నీ యిచ్చవచ్చినట్లు చేయుము. నీకు వీణలేదని చింతయక్కరలే తన వీణమీఁదఁ బాడినవారికిఁ బారితోషిక మిత్తునని యతండు ప్రకటించియున్న వాఁడట. అని వాని వృత్తాంతమంతయుఁ జెప్పుటయు నాలించి యమ్మించుబోణి యిట్లనియె.

అమ్మా! పోనిమ్ము. పాడితినా కానుకలందెదను ఓడినాశిష్యురాలనై విశేషముల గ్రహించెదను. దీన మనకువచ్చినకొదువయేమి యని యుబ్బుచు నావగలాడి రాత్రి యెప్పుడు పడునని తొందరపడు చుండెను. అంతలోఁ బద్మినీకాంతుం డపరదిగంత నికాంత విశ్రాంతికై యరిగెనోయన న స్తమించెను వీణావతియు వ్యభూషణమాల్యాను లేపనాదివస్తువిశేషముల నలంకరించుకొని యావిపంచీ ఖండములఁలట్టుకొని తల్లితోఁ గూడ బండియెక్కి, సహాదేవుని నివాస సౌధంబున కరిగినది.

రాజకుమారుం డంతకుమున్నే సంగీతసభాభవనము మనోహర దీపమాలికా విశేషములచే నలంకరింపజేసి దానిరాక కెదురుచూచుచుండెను. వీణావతియుఁ దల్లితో బరిచారిక నిర్దిష్టమార్జంబున సభాభవనమునకు వచ్చి తదీయ రూప విలాస విభ్రమాదులకు భ్రమఁజెందుడెందముతో నతనికి నమస్కరించి తదాజ్ఞ నుచితస్థానంబునం గూర్చుండి నూత్న వీణాదర్శనల లాలసయై యుండెను.

అంతలోఁ గింకరు లావల్లకిం దెచ్చి మెల్లగా నప్పల్లవపాణి మ్రోలం బెట్టిరి. ఆవీణం జూచి యాపూఁబోణి యురమున చేయియిడుకొని యమ్మకచెల్లా! ఈ పురుషపంచాననుండు నావిపంచిం గాంచి దీనిం గావించెనా? లేనిచో దాని మాదిరిగా నీవీణ నెట్లు చేయఁ గలడు. ఇది కడు చోద్యము, ఇది విచిత్రమని తలపోయుచు తన వీణాఖండములకుఁ దొలుత నమస్కరించి పిమ్మట నావల్లకిఁబట్టి చక్కగా --------- ------------- బాడినది. రాగమాధుర్యము, స్వరకల్పనలు, అంగుళీ విన్యాస భావము, తంత్రీనాదమేళనము, ముఖవిలాసము, నేత్రాభినయము లోనగు విషయములన్నియు రాజకుమారునికి మిక్కిలి విస్మయముకలుగఁ జేసినవి గానావసానంబున నా నృపసూనుండు నిలువంబడి గాయనీమణీ! వీణావతియను బిరుదము నీకచెల్లు. నావీణె నీవలె మేళగించి పాడినవారి నింతకుమున్ను జూచి యెఱుఁగ. నీగీతము మాకు మిక్కిలి యానందము గలుగఁజేసినది.

అని కొనియాడిన నచ్చేడియ చెలంగుచు లేచి యార్యా! నా గాంధర్వము మనోహరముగా నున్నదని మీరు కొనియాడుటంబట్టి నేను ధన్యురాలనని వేర చెప్ప నేల? అపూర్వవీణానిర్మాణదక్షులైనమీయక్షీణ ప్రభావంబు వేనోళ్ళం గొనియాడఁ దగియున్నదిగదా? నేను భూమండలమంతయుఁ దిరిగి చూచితినింగాని యిట్టివీణ నెందునుంజూచి యెఱుంగను. నావీణయే లోకాతీతమైనదని మెచ్చుకొనుదాన దానికన్న నిది మనోహరధ్వనుల వెలయింపుచున్నది. అని పెద్దగా నుపన్యసించినది

అట్టి సమయమున దానికంఠమునందలి రత్నమాలమణిప్రభలు బుష్పగుచ్ఛమువల మెఱయుచు నా సభాభవన మంతయుఁ గిమ్మీరకాయల నెఱయఁజేసి రాజపుత్రుని నేత్రములకు మిరుమిట్లు గొల్పినవి. అప్పు డతండు వెఱఁగుపడుచుండ నయ్యండజగమన పండితమండనా! ఎట్టి ప్రజ్ఞావంతుల కైనను సాధనములు మంచివి లేనిచో ప్రకాశము కలుగనేరదుగదా? ఏడంతరములనుండి మాయింటఁ బ్రఖ్యాతమై యున్న నా వీణ యీనడుమ భగ్నమైపోయినది. నాటంగోలె నాకేలిం గీలింపందగిన వల్లకి యెందునుం దొరకలే దనుటయు నారాజపుత్రుండు వెండియు నిట్లనియె.

బోటీ! నీవీణ యేమిటికి విరిగినది? నీ వెక్కడిదానవు? నీమెడలో మెఱయుచున్న రత్నహారము నీకెట్లువచ్చినది? నీవృత్తాంతము గొంత వినవలతుం జెప్పుదువేయని యడిగిన నప్పడఁతి వాని కిట్లనియె.

దేవా ! దేవర యీవృత్తాంత మడుగకపోయినను చెప్పఁదలచికొనియే యున్నదానను. వినుండు. మాకాపుర ముజ్జయినీపురంబు మొదటినుండియు మాకులములో సంగీతవిద్య యనపత్యమై యున్నది. విక్రమాదిత్యునికాలమందు హేమావతియను వేశ్యారత్న మన్ముహా రాజునకుఁ బ్రేమాస్పదయై యుండునది యఁట. సంగీత సాహిత్యములు రెండు ---------గనునకు సొమ్ములైయుండె ననుచు నిప్పటి కప్పట్టణ వాసులు చెప్పుకొనుచుందురు. విక్రమార్కచక్రవర్తి యొకప్పుడీ వీణ దేవలోకము నుండి తీసికొనివచ్చి వేశ్యాలలామము గానవిద్యకు మెచ్చికొనుచు కానుకగా దాని కిచ్చరట. ఆమె మాతల్లితల్లికి యమ్మమ్మ. ఈ వీణపై నత్యద్భుతగానము పాడి యా గానయనీమణి శాశ్వతకీర్తి సంపాదించినది. క్రమంబునం దరువాతివారును ------లనియే పిలువంబడుచుండిరి.

రాజపుత్రా! ఇఁక తమయెదుట దాచనేల? ఆవీణపై నేను చేసినసాధనము సరస్వతియైన చేయలేదని చెప్పగలను. దానంజేసియే వీణావతియను బిరుదము నాకొసంగిరి. నేను ప్రఖ్యాతికొఱకే దేశాటనముఁజేయుచుంటిని. గాని కేవలము ద్రవ్యముకొఱకుఁగాదు, చూచిన యాస్థానమునందెల్ల మంచిపేరే సంపాదించుకొంటిని. దైవికముగా నీనడుమ గిరిదుర్గపట్టణంబున కరిగితిని. తత్పట్టణాధీశుండైన యింద్రమిత్రునకు లేకలేక దర్గాప్రసాదంబున స్వయంప్రభయను కూఁతురు కలిగినది. అమ్మించుబోణి క్రొత్త విరించిచే సృష్టించబడినది గాని పాతబమ్మ సృష్టిలోనిదిగాదు. ఆహా! ఆ మోహనాంగి సౌందర్య యెన్ని యేండ్లు చూచినం దనివి తీరదుగదా! ఆమె కన్నులెత్తి చూచిన మాట్లాడిన మాబోటులకే బ్రహ్మానందపద మందినంత సంతోషము గలిగినది.

ఉ. సౌరభయందు కాంచనఁపు జంత్రపుఁబుత్రిక వాగ్విలాసముల్
    వారక నేర్చురత్నఁపుశలాక తిరంబగు రూపుఁజెందు తొ
    ల్కారుఱుంగు జీవకళఁ గాంచిన చిత్తరుబొమ్మయాన శృం
    గారిణియౌ సుధాసరసిఁగా నుతిఁ జేయఁగవచ్చు నచ్చెలిన్.

ఉ. విండ్లను మేల్తరంబు ఘనవేణి కనుంబొమ్మతోయి బంగరుం
    గిండ్లకు మేటిసాటి తులకించు చనుంగవ లేతతమ్మి పూఁ
    దూండ్లకు మిన్నయన్న జిగిదొల్కెడు చేతులు లోకమందు పూఁ
    బోండ్లను గానమో వినమొ పోలకు తత్సతి కాలిగోరునన్.

క. తొడలందము కటిచందము
   నడుగుందమ్ములబెడంగు లాస్యమురంగుల్
   జడతళుకు న్మెడకులున్
   నడబెళుకునూడ నాఘనస్తని కమరున్.

క. కందరమా చెలిపొక్కి
   కందరమా విలసనంబు కచము రదంబుల్
   కుందరమా సమములు నా
   కుం దరమా పొగడనలకు కుందర సుదతిన్.

గీ. చిన్న చీమల నునుబారు చెలువయూరు
    కదళికాండములమీరు కాంతయూరు
    అందములఁ జెందు రతిగేరు నతివసారు
    దాని కెనయైనవార లిద్దరణి లేరు.

రాజపుత్రా! ధాత్రీతలంబునం బ్రఖ్యాతివడసిన రాచకన్నెల నేనరం జూచియుంటి. మాట్లాడితిని. మెచ్చుకొంటి గాని యీ సుందరీ రత్నమువంటి వాల్గంటి వంటివలంతి నెక్కడను లేదు. లేదు. లేదు. పుడమింగాదు లోకమునను లేదని చెప్పగలను. సుని గరు వారగ సిద్ధి విద్యాధిని గంధర్వ కన్యలకైన లోపము అంచపోవు. ఈ పూఁబోణి కే కొదువయు లేదు. అవయవములన్నియు వ్రాసినట్లు తీర్చినట్లు మెరయుచున్నవిగదా అమ్మకు చెల్లా! అది లావణ్యమా! కుందనమునకైన నట్టి వన్నె యున్నదియా? ఆహాహా! పరారోహ సౌందర్యమున కవసానమని యూరక పొగడుచుండ నాబోటి మాట కడ్డమువచ్చి య చ్చతురుండు వీణావతీ! ఆ యువతికి పెండ్లింయైనదా? యని యడిగెను.

ఆ జవ్వని నవ్వుచు సుకుమారా! చెప్పెద వినుము. ఇంద్రమిత్రుఁడు పురుషాపత్యరహితుం డగుటంజేసి దౌహిత్రులాభంబున పడయఁగోరి యాపట్టి పుట్టినదిగోలె పరిణయప్రయత్నమేఁ జేయుచుండెను. కాని యామానినీమణి యేమిటికో తొలిప్రాయంబుననే విరక్తిఁజెంది పెండ్లియాడనని నియమముఁ జేసికొనియున్నది. శృంగారరసమనిన విషసదృశముగా నేవగించుకొనియెడు ఆ మించుబోణిని రంజించు కొరకే నన్ను సంగీతము పాడుటకై యా చేడియయొద్ద కనిపిరి. శృంగారరస ప్రదీపములగు శ్లోకములు నే నామెయొద్ద చదివినంత కృతాంతజిహ్వకయుంబోలె నితాంతము లగుచు నప్పుడే నావీణ నడఁగ ద్రొక్కినది. అందులచేఁ బశ్చాత్తాపము నందుచు నీహారము నాకుఁ గానుకగా నిచ్చినదని యా వృత్తాంత మంతయు నామూల చూడముగా వక్కాణించి య క్కుమారుని మోహసముద్రములో ముంచివేసినది.

అప్పుడారాజపుత్రిక చరిత్రము వినినయంత యతని స్వాంతతము భేదించి పంచశరుఁడు లోనం బ్రవేశించెను. ఆ వికారము దెలియనీయక ముదితా! ఏదీ నీవీణ నిటుఁ దెమ్ము. ఎట్లు జరిగినదో చూచెదంగాక యని పలుకుటయు నక్కలికి కులుకుచు తొడుగులూడ్చి యా రెండు బండముల నతనినండ నిడినది. ఆ విన్నాణి వానింగలిపి పరీక్షించి విస్మయ మభినయించుచు నగునగు నా వీణియకు దీనికిం జాలభాగము పోలిక యున్నది. ఇది మంచి విపంచియే యని యిటు నటు త్రిప్పి యోహో అక్కలికి దీని విఁరుగఁ ద్రొక్కిననని యూరక నిందించితివిగాదా? ఇది విరుగలేదు. నడుమ నదురుఁ గలిగియున్నది. దానంజేసి మృదుపదాఘాపంబున విడిపోయినది గాని విరుగలేదు. దీని మరల సందించి యధాగధతిం బలికించుజూడ నా కేమి పారితోషిక మిత్తువని యడిగిన నా ప్రోడ యిట్లనియె.

దేవా ! దీనివలన నా కేబహుమానము దొరికినదియో యది మీవరకు సమర్పించుకొనుటయే గాక జీవితాంతముదనుక దాసురాలనై మీ పాదసేవ జేయుచుండెద ననుటయు నతం డాఖండముల రెంటింగైకొని యా వాల్గంటి నింటికిం బంపి వేసెను మఱియు సహదేవుఁడా రాత్రియెల్లఁ బనిఁజేసి కొండొక తుంభీఫలంబు సంఘటించి యతుకులుగలిపి చీలలుబిగించి తీగెలసవరించి మెట్లునమరించి రంగువైచి మెరగుఁదుడిచి తెల్ల వారుసరికి నా వల్లకిని యధాస్థితి నమరించి పలికించుచుండెను.

అంతలో వీణావతి యత్యుత్సవముతో సహదేవుని మందిరమున కరుదెంచెను. అతండు ముదితా ! ఇదిగో నీవీణియ చూఁడమనుచు నయ్యెలనాగ యేదీ? ఇది నావీణయే? నా ప్రాణమే? నా పుత్రికయే? దీనిం బ్రతికించతిరా? ఔరా? ఏమి మీ సామర్త్యము! ఆయ్యారే! ఏమి మీ నైపుణ్యము అని యనేక ప్రకారంబుల. స్తుతియించుచు నా విపంచిం గౌఁగిలించుకొని ముద్దుఁబెట్టుకొని సారెలు సవరించి తీగెలు బిగియించి సీలలు ద్రిప్పి పలికించి మేను పులకించ లేచి యా రాజపుత్రుని పాదములకు సాష్టాంగ నమస్కారములు గావించి తన మెడలోని మణిహారముం దీసి దేవా! నా యావజ్జీవము వీణ పాడినపుడెల్ల దొలుత మీ నామమును స్మరించుచుండెదను. మఱియు నా జ్ఞాపకమునిమిత్త మిదిగో యీ హారమును మీ కిచ్చుచున్నదానఁ గైకొనుఁడని పల్కుటయు మందహాసము సేయుచు నా నృపనందనుం డిట్లనియె.

బోటీ ! మాటవరుస కట్లంటినిగాని యిది మాకుఁ గావలయునా క్షత్రియు లొరులయొద్దఁ గాన్కలు గొందురా? నీ సాహసమునకు సంతసించితిని. నీవే యుంచుకొనుము. ఆ రాజపుత్రిక ప్రీతిగా నీకిచ్చినది. దీనిని నీ వొరులకిత్తువేని యనాదర సూచనగాదా! యని పలికిన నగ్గణిక యిట్లనియె. ఆర్యా ! ఆడితప్పిన దోషముకంటె పరిగ్రహదోషము పెద్దదికాదు. మీరుదీనిం గొనరేని యిరువురము నసత్యవాదుల మగుదుమని యేమేమో చెప్పి పరిగ్రహింపవలయునని బలవంత పెట్టుచుండెను. అతండు వలదని త్రోసివేయుచుండెను. ఆ సంవాదమంతయు విని యతని సహోదరి సావిత్రియను చిన్నది వారికి మధ్యవర్తినియై యిట్లు చెప్పినది.

వీణావతీ! క్షత్రియుడు వేశ్యలవలనఁ గానుకలఁ బరిగ్రహించిన ధర్మవంచన యగును. వేశ్యయుఁ దగని యీవిఁ గావించిన నింద్యురాలగును. దీనికిఁ దగిన వెల యిచ్చి కొనుట కితనియొద్ద సరిపడిన ధనములేదు. కావున నతనియొద్దనున్న ధనమంతయు నీకిచ్చువాఁడు. నీ వీ హార మతని కీయవలయును. ఉచితమ యిచ్చినట్లు సంతసించి యతండది యందు కొనుగాక. దీని నిరువుర శపధములు కొనసాగఁగలవని చెప్పి వా రిరువురను సంతోషపెట్టినది. సహదేవుఁడు తండ్రి తన కావత్సరములో నిచ్చిన పదివేల నిష్కము లప్పుడే యా గణికారత్నమున కిచ్చి యా హారముఁ గైకొనెను.

వీణావతియు నావీణం గైకొని సహదేవుని యనుమతి వడసి ద్రవిణంబుఁ బట్టించుకొని సత్రంబునకుఁబోయి తల్లి కావృత్తాంతమంతయుం జెప్పినది. అవేశ్యమాత పెనుభూతమువలె బొబ్బలిడుచు నోసీ ! దుష్టురాలా! నాతోఁజెప్పక స్వతంత్రురాలవై యామండన మాతనికేమిటికిచ్చితివి? దానివెల మెంతయో నీవెఱుంగుదువా? ఇది యమూల్యమని రాజుపుత్రిక చెప్పినమాట జ్ఞాపక మున్నదియా? ఈముష్టివీణ లేక పోయిన కొదుయేమి? అయ్యో! నేను రాకపోవుటచే నెంతముప్పు దెచ్చి పెట్టితివి? నీవు బోగముదాని కెట్లుపుట్టితివో కాని యొక్క గుణమైన మంచిదికాదు గదా? అతండా వస్తువ వలదని నుడివినతోడనే మెడలో వైచికొని రాక డాంబికఁపుమాట లేమిటి కాడవలయును. నీవు పుట్టినది మొదలు వ్యయమేకాని లాభమేమియు లేదు ధనవంతులఁ సూచి యిచ్చకఁపు వలపులు మరపి బిచ్చగాండ్రఁ జేయుచు ధనమార్జింపక దేశాటనమని పేరుఁజెప్పి యూరకఁ జంపుచుంటివి దొరకిన ముల్లెప్రయాణములకె సరిపడకున్నది దైవికముగా వచ్చిన నిక్షేపము తృటిలో నిర్మూలముఁజేసితివి. నీవునాకు కూతుఁరవు గావు యభి యాతినివి. నీవిప్పుడు మరల నతనియొద్దకుఁ బోయి నాతల్లి యొప్పుకొనలేదని చెప్పి హారము దీసికొనిరమ్ము. లేనిచో నిన్నుఁ జంపి నే నురిఁబోసికొనియెదనని బెక్కు నిష్టురము లాడినది.

ఆమాటలు విని నవ్వుచు వీణావతి అమ్మా ! నీవింత తొందరపడియెదవేల? నే నాలోచింపక చేసితి ననుకొంటివా? నీకడుపునంబుట్టి చేతిలోఁ బెరిగిన నాకు వేశ్యా ధర్మములు బోధింపవలయునా? నే చేసినపని మంచిదని విచారించిన నీకే తెలియఁగలదు, కోట్లకొలది వెలఁగల యా హారము పెద్ద లెఱుంగకుండ నారాజపుత్రిక మన కిచ్చినది. గదా? తరువాత నా వార్త తలిదండ్రులకుఁ దెలియక మానదు. కూఁతు మందలింపక మానరు. మనలం బట్టికొనుట కీపాటికిఁ గింకరులం బంపియే యుందురు. అది యంతయుం దెలిసియే మనకు బ్రమాదము వచ్చునని భయముతో నిట్లు చేసితిని. అది తప్పంటివేని యిప్పుడుపోయి యా రవణము దీసికొని వచ్చెద. నతం డీయనివాఁడు కాడు. ఏమనియెదవు? విచారించి నుడువు మనుటయు నా వేశ్యమాత పోనిమ్ము ఏదియో చేసితివిగదా? దాని మరలఁ దిరుగఁ దోడనేల? నీ వాలోచించి నదియుఁ గొంత యుచితముగా నున్నది. అని సమాధానపడి యావారనారి యూరకొనినది.

అని యెరిగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి మజిలీయందిట్లని చెప్పందొడంగెను.

ఏబది తొమ్మిదవ మజిలీ కథ

ఆహా? లోకులెట్టి యక్రమ నిందావ్యాపకులోగదా? మాయన్న యేపాప మెరుఁగనిదే దుర్వ్యాపారియని యపనిందమోపిరి. దుస్సహవాస మెట్టివారికి నపఖ్యాతి మూలకము కాకపోదు. ఈవార్త మాయన్న బెరింగించెదనని తలంచుచు సావిత్రి యొకనాడు సహదేవుని మందిరమున కరిగినది. అప్పు డతండు మంచముపై శయనించి యెద్దియో ధ్యానించుచుండెను. అతనింజూచి యాచిగురుబోణి వెఱఁగుపడుచు అన్నా ! ఇదియేమి? అకారణముగాఁ బండుకొంటివి. తండ్రిగారన్న మాట వింటివా యేమి ? అనుటయు నతం డదరిపడి లేచి తండ్రిగారు నన్నే మనిరి చెప్పుము, చెప్పుము. అని యడిగిన నప్పడఁతి యిట్లనియె.

అన్నా ! మొన్న నీవు మణిహారముంగొని పదివేలనిష్కము లవ్వేశ్యల కిచ్చితివిగదా? ఆయీవి వేఱొకతెఱగునఁదలంచుచు నిన్ను వేశ్యాలోలుండని జనులు నిందించుచుండ తండ్రిగారువిని నన్నుఁబిలిచి నీయన్న నిష్టలు వింటివాయని యడిగిరి. ఆపలుకుల కులికిపడి నే నతండేమిచేసెనో చెప్పుడని యడిగితిని. మొన్న వీణావతియును వేశ్య కొక్కదినమునకే పదివేళ నిష్కము లిచ్చెనట. చక్కనికన్యలఁ దెచ్చిన బెండ్లి యాడక జితేంద్రియుండువోలె నే మేమొ చెప్పి యిప్పుడిట్టి తుచ్చపుంబనులఁ జేయ వచ్చునా? ఇంతలో తనకుఁ గలిగిన పరస్త్రీ పరాజ్ముఖుఁ డనువాడుక చెడఁగొట్టుకొన