కాశీమజిలీకథలు/ఆరవ భాగము/57వ మజిలీ

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్న మస్తు

కాశీ మజిలీ కథలు

ఆఱవభాగము

ఏబదియేడవ మజిలీ.

క. శ్రీ కాశీనగర వరా
   లోకమున సమ్మోద మెడదఁలో బలియన్ సు
   శ్లోకుడుఁ మణిసిద్ధుం డ
   య్యేకాంతచ్చాత్రుతోడ నేగుచుఁ గడకున్.

ఏబదియేడవ మజిలీయందు సమాచరిత నియతక్రియా కలాపుండై తత్ప్రదేశ విశేషంబులం జూడఁబోయిన గోపకుమారుని యాగమనం బభిలషించుచున్నంత నయ్యంతేవాసి యా ప్రాంతమునందలి వింత లన్నియు నరసినాఁడు తనకేదియుఁ బ్రశ్నావకాశంబునకుఁ దగిన విషయంబు బొడగట్ట యిట్టట్టు చూచుచువచ్చి తాను వసించిన మఠముకుడ్యమునందలి లిపి విశేషంబుల నన్నియుం జదువుచు.

గీ. పెండ్లియాడననుచు బిగియించుకొనియున్న
   ముగుదఁ గోరికొనియె ముగుర మగల
   నెలతుకులవ్రతంబు నీటిపైఁ జేవ్రాలు
   గాలిఁ గదలు దీపకళిక సూవె.

అని యొకదెస వ్రాయఁబడియున్న పద్యమును జదివి యుప్పొంగు నంతరంగముతో నయ్యవారి క తైరం గెఱింగించి దాని యర్ధంబు సెప్పుమని కోరిన నతఁడు --------- దదుదంతమ్మణి మహిమంబునం దెలిసికొని యాశ్చర్యం --------------- హృదయుండై భుక్తనిరవశిష్టుండై యున్న శిష్యుని కాకథ యిట్లని చెప్పం

స్వయంప్రభకథ

గిరిదుర్గంబను బట్టణంబున నింద్రమిత్రుఁడను రాజు మనోహారిణీ యను భార్యతోఁ బ్రజలఁ బ్రజలపోలికం జూచుచు ధర్మంబునఁ దొంటి నృపతులంబోలి రాజ్యంబు సేయుచుండెను. అమ్మహారాజు ప్రాయంబున నపత్యరహితుండగుట సామ్రాజ్యసుఖంబు సంతోష విముఖంబై క్రమంబున విషసబంబై యొప్పుచుండఁ దత్ప్రాప్తికై పత్నితోఁగూడ నెన్నియేని దానంబుల, వ్రతంబుల, యాగంబులం గావించియుఁ గృతార్ధత వడయఁడయ్యెను. కనబడిన వేల్పు నర్చించుచు, వినంబడిన వ్రతము నాచరించుచు, చెప్పిన దానంబులం గావించుచు యాత్రల కరిగి, నదుల మునిఁగి, తీర్థములఁ దిరిగియు సార్థకముగానక మనసువిఱిగి చివురకద్ధరణీపతి ధర్మంబున నిందింప దొడంగెను. వ్రతంబుల నేవగింప మొదలుపెట్టెను. యాగంబుల నిరసింపఁ బ్రారంభించెను. పుణ్యకార్యంబులఁ దల పెట్టినవారిం బట్టికొని శిక్షింపఁ దొడంగెను. మఱియు,

ఉ. తా నిల నెవ్వఁ డెట్టి నియతక్రియనైననుఁ బూని నాకు సం
    తానము గల్గఁజేసి ముదంబున నాతని నర్దనాయకుం గా
    నొనరింతుఁ దప్పి యటుగాక వృధా నను ఖేద పెట్టినన్
    వాని శిరంబుఁ ద్రెంచి పురివప్రముఖంబునఁ గట్టఁ బుచ్చెదన్.

అని యొకశాసనము వ్రాయించి యిదియెల్లరుఁ జూచునట్లు గోపుర ద్వారంబునం గట్టించెను. ఆ ప్రచురము విని యెవ్వఁడును నప్పనికి బూనికొనఁ డయ్యెను.

కొంతకాల మరిగినంత నొక వసంతకాలంబున రాజపత్ని పుష్కరిణియను పరిచారికం గూడికొని దేవీపుష్కరిణియను తటాకాంబున కరిగి యందు తీర్థం దాగి కొంతదనుక గురుదత్తుంబను మంత్రంబు జపించి మరల నింటికిం బోవుసమయంబునఁ బరిచారిక యరుదెంచి యిట్లు విన్నవించినది. దేవీ! మనపురి కనతిదూరంబున రత్నకూటంబను గిరివరంబుఁ గలదు. అన్నగరశిఖరంబున దేవతలు విహరింతురను వాడుక యున్నది. రామాయణకథయందు హనుమదాది వానరులు ప్రవేశించిన స్వయం ప్రభాదేవికందర మం దున్నదని పెద్దలు వక్కాణింతురు. అందులకు నిదర్శనముగా నగ్గిరిపాదంబున స్వయంప్రభాదేవి దేవళ మొకటి విరాజిల్లుచుండెనఁట. అద్దేవీ ప్రభావం బాశ్చర్యకరమని వినుకలి గలదు. ఒకరేయి యిద్దేవళంబున దంపతు లుపవసించి జాగరము జేసి యర్పించిన నద్దేవి కామిత మీడేర్చునట అవ్వార్త నే నింతకు మున్నె విని యందలి విశేషంబులం దెలిసికొనఁ దదర్చకులకు సందేశ మంపితిని. వారును వచ్చియున్నారట. ముదలయేని యెదురకు రప్పింతుననుటయు మనోహారిణి నవ్వుచు నిట్లనియెను. ఓసీ పుష్కరిణి ! నీకీవెఱ్రి యింకను బోలేదా? చాలుఁజాలు. నాకీ జన్మమునకు సంతతిఁ గలుగదు. ఇంతకుమున్ను మనమారాధించిన వేల్పులకన్న నీదేవి మిన్న దైనదా? మనపురాకృతము వేరొకరీతి నుండ వేల్పు లేమిచేయగలరు? పోనిమ్ము. ఆ ప్రయత్నములిఁకఁజేయఁ దలంచుకొనలేదు. నియమముల మాటఁ దలపెట్టిన నయ్యగారి కెట్టికోపము వచ్చుచున్నదో చూచుచుండలేదా? పాప మాయన యేపాప మెఱుంగక సంతతి గలుగునని మనము చెప్పిన నియమము లన్నియుఁ జేసి శరీరమాయాస పరచికొనిరిగదా ! అక్కటా! ధాత్రీపతి నాటి శివరాత్రి గాలకంఠునిగుడిలో నాఁడుదాని వలెఁ ప్రాణాచారమువడిన తెఱంగుఁ దలంచుకొన విషాద మగుచున్నది. అర్చకులకుఁ బారితోషిక మిచ్చి యంపుము. అని చెప్పిన విని పరిచారిక వెండియు నిట్లనియె.

దేవీ! నీ వనినమాట సత్యమే: కాని యేసమయమున కెట్లుజరుగునో యెవరు నిశ్చయింపగలరు. ఒకసారి చేసిన ప్రయత్నంబు నిష్ఫలం బైనను మఱియొకప్పుడు చేసిన సఫలమగుచుండును. దశరథున కెన్నియేం డ్లకు సంతతిఁ గలిగినది. కావున నావిషయ మవిచారణీయమైనది దీనమనకు వచ్చినకొదవ లేదు. వారివలనఁ దచ్చరిత్ర మెట్టిదియో విని పిమ్మటఁ గర్తవ్యమేమియో విచారింతముగాక యని చెప్పుటయు నప్పఁడతి యర్ధాంగీకారముగా నూరకొనియెను. పిమ్మట నాకొమ్మ వేఱొక పరిచారికం బంపి యాయర్బకుల రప్పించినది. వారి వికృతరూపములఁ జూచి నవ్వుచు రాజపత్ని యర్బకురాలితో నిట్లు సంభాషించెను.

రాజపత్ని - ఓసీ ! నీ పేరేమి?

అర్బకురాలు — అమ్మా ! నా పేరు దురద.

రాజ — (నవ్వుకొనుచు) అది యేమి పేరు ?

అర్బ - అమ్మా: సంపబ్బ పేరు.

రాజ - వాఁడు నీ కేమి కావలయును ?

అర్బ - బగడు.

రాజ — (నవ్వుచు మగవానితో) ఓరీ! నీపేరేమి?

మగ - నా పేరు బరగడు.

రాజ — ఇది నీ కేమగును?

మగ - ఈ దురద నాకు పెండలము.

పుష్క - (నవ్వుచు) దురదకందకుగాని పెండలమునకుండుదురా

మగ — అయ్యో ! సానీ ! ఇది నా బర్రమ్క.

రాజ - (పుష్కరిణితో) వీరిమాటలు నీకేమైన తెలిసినవియా !

పుష్క - (నవ్వుచు) తెలిసినవి. తెలిసినవి. వీం డ్రాటవికులగుట గ్రామ్యభాషయైనను జక్కగా మాట్లాడలేరు. దురదయనఁగా దుర్గ. సంపబ్బ పేరన స్వయం ప్రభా దేవి పేరు. బగడనగా మగఁడు. బరగ డన భర్గుఁడు. పెండలమన పెండ్లాము. బర్ర యన భార్య. వీరి మాటలు విన నెట్టివారికిని నవ్వు రాకమానదు కదా!

రాజ - సరిసరి ! ఇదియా ! ఈ మాటలకే యింత వ్యాఖ్యానము కావలసి వచ్చినదే! ఇఁక మనమడుగవలసిన విషయము లెట్లు తెలిసికొననగు? నీవే తెలిసికొని నాకుం జెప్పుమని నియోగించుటయు పుష్కరిణి యవ్వికృతభాషతోనే వారినడిగి స్వయం ప్రభాదేవి మహత్మ్యమంతయుం దెలిసికొని పారితోషిక మిచ్చి యంపినది. తరువాత రాజపత్నితో నమ్మా! వీరు చెప్పినమాటల నద్దేవిప్రభావమునఁ దెల్లమైనది. అది యసత్యముకాదు. నీవు మగనితో నొకరేయి నాగుడిలో జాగరము సేయుము. తప్పక కామిత మీడేరఁగలదు అని నిర్బంధించెను. వల్లెయని యప్పల్లవపాణియు నింటికిఁబోయి వల్లభునితో సంతతి గురించి ముచ్చటింపుచుండ ప్రసంగవశంబున నతండామెతో కాంతా సంతతివిషయమై నీవు గావించు కృత్యములన్నియు ముగిసినవియా? ఇంక నేమేనింగలవా? స్త్రీచాపల్యంబునం జేసి వెఱ్ఱిప్రయత్నములఁ జేసితివి అని పరిహసించుటయు నామె మగని కిట్లనియె.

ప్రాణేశ్వరా ! నేను మిమ్మిందులకై కడు బడలఁజేసితినని లజ్జించుచుంటి. ఇఁకఁ గడపటి యభిలాష యొక్కటిగలదు. అదియుం దీర్చినఁ నిక మిమ్మెప్పుడును నెపపెట్టఁబోను. అని స్వయంప్రభాదేవి వృత్తాంతమంతయుం జెప్పినది. అతండును నక్కార్యంబునఁ దనకు విశ్వాసము లేకున్నను భార్య నాశ్వాసించు తలంపుతో వేఁటనెపంబున నొకరేయి నుచితపరివారములు సేవింప భార్యతో స్వయంప్రభాదేవి యాలయంబున కరిగి భార్యచెప్పినచొప్పున నందు నియమంబులం గావించి యొరు లెఱుంగకుండ నింటికింజని యొండొకనెపంబున బ్రాహ్మణసంతర్పణ గావించెను.

అమ్మహాశక్తి శక్తియెటువంటిదో వెంటనే యవ్వాల్గంటికి గర్భిణీచిహ్నములు పొడచూపినవి సహజలావణ్యపూర్ణంబగు మొగంబున వింతకాంతి యొప్పుచుండ నొండు రెండు దివసంబులు పరిశీలించి మించు బోణులు దౌహృదలక్షణంబులని నిరూపించిరి. అన్ని రూపణము బాలిండ్లవై పు దిరపరుపఁ బెనుమురిపెముతో నత్తెఱవ మఱియొకనాఁడు వేడుకపడి లజ్జాసముద్రమునం దేలియాడుచు నత్తెఱంగెఱింగించి మనోహరుని సంతోషసాగరమున మునుఁగఁజేసినది.

ఇంద్రమిత్రుఁడు దేవతల నిందించిన నోటితోడనే స్తుతియింపుచు స్వయంప్రభాదేవియాలయ ప్రాకారమంటపాదులఁ గాంచన మయములుగా నిర్మించి చంద్రోదయమునకు సముద్రుండువోలె బుత్రోదయమున కెదురు చూచుచుండెను. అంత నవమాంసాంతమున మనోహారిణీ యాఁడుశిశువుం గనినది. ఆ వృత్తాంతము విని ధరణికాంతుం డర్దసంతోషంబుతో నర్దుల కర్దంబులు బంచి పెట్టించెను. సూతికాగృహంబున రత్నకళికవలె మెఱయుచున్న యబ్బాలికం జూచి పూఁబోణులక్కజం బడఁ జొచ్చిరి. తరువాత నాభూనేత కూతునకు జాతకర్మానంతరము స్వయంప్రభయను నామకరణము పెట్టి యద్దేవతయందుఁ దనకుగల భయభక్తివిశ్వాసముల నెల్లరకుఁ దెల్లముఁ జేసెను.

ఆ పాపయు శశిరేఖవలె దినదిన ప్రవర్థమానయగుచు నూత్నరు చనిచయ విశేషంబులం బొలుపొందుచుండెను. తల్లిదండ్రులు సంతత మా పుత్రికారత్నముపై ప్రాణములు పెట్టుకొన పోషించుచుఁ దద్రూపాతిశయములకుం దగినవిద్య యుండవలయునను తలంపుతో నుపాధ్యాయులఁ బెక్కండ్ర నియమించి విద్యాభ్యాసము సేయించుచుండిరి. మరియు నంతియ ప్రాయముగల హేమయను బాలికను స్వయంప్రభకు సఖురాలిగను, సహాధ్యాయినిగను, పరిచారికగను నియమించిరి. ఆబాలిక లిరువురు నేక దేహమున పొలిక నత్యంత స్నేహవాత్సల్యములతో నాహార శయ్యా విహారంబుల మెలంగుచుండిరి.

గురువులా బాలికలకుఁ గ్రమంబునఁ గావ్యములను, నాటకములను, పురాణములను పాఠముచెప్పి శాస్త్రములయందుఁ బ్రవేశముఁ గలుగఁజేసిరి. స్వయంప్రభ యుపాధ్యాయులవలనఁ దాను స్వయంప్రభా దేవివరంబునఁ బుట్టినట్లు తెలిసికొని రామాయణమునందలి యా కథను పలుమారు చదువుచు హేమతో ముచ్చటింపుచు స్వయంప్రభాదేవి మహాత్మ్యమును గొనియాడుచు సామర్ధ్యము నగ్గించుచు నీమంబుల స్తుతిఁజేయుచుఁ ద్రికాలములయందును నక్కథయే పారాయణ సేయుచుండెను.

ఒకనాఁడు పూవులు గోయుచున్న సమయంబున హేమకును స్వయంప్రభకు నిట్లు సంవాదము జరిగినది.

హేమ — అక్కా ! నీవు సంతతము స్వయంప్రభాదేవి చరిత్రయే చదువుచుందువని గురువులు కోపము జేయుచున్నారు. చదువవలసినవి పెక్కులున్నవిగదా !

స్వయం — హేమా ! ఇఁక మనము చదువవలసిన వేమియున్నవి ? కావ్య నాటకాలంకార గ్రంథములు చదివి విడచితిమి శాస్త్రముల నెఱింగితిమి. పురాణ గాధల నాలకించితిమి. ఎన్ని చదివిన నేమి? వైరాగ్యప్రవృత్తి గలుగవలయును గదా?

హేమ — అయ్యారే ! కావ్యాదులఁ జూచి విడిచితిమని హేళనగాఁ బలుకుచుంటివి !ఎన్ని యేండ్లు చదివినను జదువవలసినదే ! వానికి బర్యవసాన మెక్కడ !

స్వయం — సఖీ! కావ్యనాటకాదులయందు నాకభిరుచి యేమియును లేదు.

హేమ — వానిభావము నీకుఁ దెలియక యట్లనుచున్నావు. ఆహా ! తద్రన మాధుర్యము సుధను మరపించును గదా!

సయిం — హేమా! తద్రనము నేను చవిగొననిది కాదు. నాకా రసము విరసముగా నున్నది.

హేమ — అమృతము నేవగించువా రుందురా !

స్వయం — అమృతమో విషమో నాకుఁదెలియదు. కావ్య నాటకాదుల యందు శృంగారరసము రససార్వభౌమమని కొనియాడుచు, మూత్ర పురీషాదులచే నిండింపబడిన చర్మభస్త్రికల బంగారు బొమ్మలని పొగడుచు తత్సంగాదులకు లేనిపోని కల్పనలను జేయుచున్నారు. అది నామది కెక్కదు. వినుము.

ఉ. ఆయువు వీచిచంచలము, యౌవన ముల్పదినోచింతంబు పు
    ష్పాయుధకేళిజన్యసుఖ మస్థిర, మర్దము వాంచవోలె సా
    పాయము, భోగము ల్మెఱుపులట్ల భరాబ్ధిలంఘనో
    పాయము బహృచింతనము బాయక సేయుఁడు సజనోత్తముల్.

అని మనము చదివిన పద్యము జ్ఞాపకము చేసికొనుము.

మహే - మేలు మేలు. నీ వాచాలత శోచనీయమైయున్నది. ఇప్పుడే నీ కీ వేదాంతప్రసంగ మేమిటికి?

స్వయం —— సఖీ ! నీతో నిక్కము వక్కాణించెద వినుము. ఆ స్వయంప్రభవలె దివ్యాశ్రమ మొండు కల్పించుకొని యోగినీవేషముతో తపముఁ జేసికొనుచుండవలెనని నాకు మిక్కిలి యభిలాష యున్నది సుమీ ?

హేమ - బాగుబాగు సఖీ ! ఇందులకా నీ వెల్లప్పుడు నాసుందరిచరిత్రమునే చదువుచుందువు? ఇసిరో ! నీకిట్టివృద్దుల యభిలాషగలిగిన దేమి.

స్వయం -- ఏమెయో చెప్పజాలను. నా కామిత మీడేరునా ?

అని వారు సంభాషించుకొనుచున్న సమయంబున నొక పరిచారిక వచ్చి భర్తృదారికా ! అయ్యగారును అమ్మగారును వచ్చి తోఁటలోని క్రీడాసౌధంబున వసియించి యున్నవారు. మిమ్ము వడిగాఁ దీసికొనిరమ్మని సెలవిచ్చి రనుటయు రాజపుత్రిక వెఱచుచు హేమా ఆ సమయంబున తలిదండ్రు లిక్కడకు రానేల ? మన విషయమై గురువు లేవేని నేరములు చెప్పియుండలేదుగదా? అని పలికిన హేమ నవ్వుచు నిట్ల నియె. కాంతా ! నీవింత యెఱుఁగనిదాన వైతివేమి ? నీ తలిదండ్రులకు నీయందెట్టి ప్రేముం నదియో తెలిసికొనలేవు. లేక లేక కలిగినదానవగుటఁ దమప్రాణంబుల నీయం దుంచికొనియున్నవారు. "అత్యంత ప్రేమ, పాపశంకి" యను నార్యోక్తి వినియుండలేదా? నిన్నుజూచుటకే వచ్చియుండిరని చెప్పినది.

అప్పుడు సంతసించుచు నమ్మించుఁబోణి పూవులఁ గోయుటఁ జాలించి హేమతోఁ గూడ తలిదండ్రులయొద్ద కరిగెను. వారుద్ధవిడి నమ్ముద్దియను తొడపై నిడికొని దద్దయుం బ్రీతి ముద్దు వెట్టుకొనుచు పెద్దతడవు గారవించిరి. ఆభూతి దాపున నిలువంబడిన హేమఁ జూచి బాలికా! మీరు శ్రద్ధగాఁ జదువుకోనుచున్నారా యని యడుగుటయు నాచేడియ ప్రోడవలె వినయముఁ గనపరచుచు నయ్యగారూ! మేము శ్రద్ధగానే చదువుకొనుచుంటిమి. మా యుపాధ్యాయుల నడిగి తెలిసికొనుఁడు అని యుత్తరము సెప్పినది. దానిమాటలకు మిక్కిలి సంతసింపుచు నతండు హేమా! నీ సఖురాలికి వివాహముఁ జేయవలసియున్నది. పుడమిగలరాజపుత్రుల చిత్రఫలకములెల్లఁ దెప్పించితిని. వానిని నీవు చక్కగా విమర్శించి నీవయస్య కే రాజకుమారుం డనుకూలుండో యేరికొనుము. అని పలుకుచుఁ దాఁ దెచ్చిన చిత్రఫలకముల నూరింటిని దానియెదుర వరుసగా నిలఁబెట్టించెను.

వారివారివృత్తాంతము లన్నియు నాపటములప్రక్కనే వ్రాయఁ బడియున్నవి. అప్పుడు హేమా వానినెల్ల సాంతముగాఁ బరిశీలించి చరిత్రాంశములనెల్లఁజదివి తలద్రిప్పుచు ఱేనితో నిట్లనియె. దేవా ! ఈభూవరసూనులలో నొక్కరుఁడును నావయస్య వరింపఁదగినవాఁడు కాడని నిరూపణపూర్వకముగాఁ దప్పులు పట్టినది. అప్పుడు రాజు మిక్కిలి వెఱఁగుపడుచు భార్యతో రమణీ ! ఇదియేమిచిత్రము ! ఇప్పుడు రాజ్యము సేయుచున్న చక్రవర్తులపుత్రుల చిత్రఫలకములన్నియుం దెప్పించి చూపితిమి. ఈ హేమ వీరికందరకుఁ దప్పులు పట్టినది భూమండలమున రాజ్యార్హుండైన మరియొక రాజకుమారుం డెవ్వఁడును లేడు ఇంకముందు జనించువారి బెండ్లి జేయుదమాయేమి? అనిపలుకుచు మరల హేమతో బోటీ! నీమాటలు గడువింతలుగా నున్నవి. నీవు చూచిన వారలందరూ యువరాజులు. ముందు రాజ్యములు వీరికి సంక్రమింపఁగలవు. ఎవ్వఁడును బనికిరాడని నిరసింపఁదగదు! వీరిలో మంచివాని నేరికొనుము. బ్రహ్మసృష్టిలో లోపములేనివారుందురా నిదానించి మరలఁజూడుమని పలికిన విని యా కలికి మరలవిమర్శించి చూచి దేవా? తమ రేమనినను లెస్సయేగాని నావయస్య వీరిలో నొక్కరిని వరింపదని చెప్పినది.

అప్పుడు రాజు మిక్కిలి యక్కజఁబడుచు ముక్కుపచ్చలారని దాని నిన్నేరికొమ్మనుట మాదియే తప్పు. కానిమ్మని మరికొన్ని పటంబులఁ దెప్పించి చూపుచు వీరింగూడఁ జూడుము. వీరు రాజ్యార్హులు గారు, రాజవంశసంజాతులు. వీరిలో నెవ్వఁడైన నీకునచ్చునేమో చూడుమని పలుకుచు మరికొన్ని పటములిచ్చెను. అప్పుడు హేమ యా ప్రతిమలన్నియు నేరి చూచి చదివి యొకచిత్తరువుపై గురుతువెట్ట యీతండే నా సఖురాలు వరింపఁదగిన రాజపుత్రుఁడని పలికినది.

ఆ మాట విని సాక్షేపముగా నా క్షితిపతి యవిక్షేపముఁ గావించుచు వీఁడు భూరిశ్రవుఁడను నృపతికి నాలుగవకుమారుఁడు. వీనికెప్పటికిని రాజ్యాధికారమును గలుగనేరదు. ఇట్టివానింజేపట్టి నాపట్టిసామాన్యవలెఁ గష్టములఁ బడగలదా? సామ్రాజ్య పట్టభద్రునికిగాని నాముద్దు పట్టిం బెండ్లి సేయను సంపదలేనివాఁ డెట్టిరూపవంతుఁడైనను కురూపియగు ఎట్టి విద్వాంసుఁడైనను యధాజాతుఁ డనిపించుకొనును. ధనవంతుఁడే కులీనుఁడు. భాగ్యవంతుఁడే పండితుఁడని యెన్నియో దృష్టాంతరములు సెప్పి హేమను మాటాడకుండఁ జేసెను. అతని మాటలు తనకుఁ దృప్తికరముగా లేకున్నను ప్రభువని తలంచి మారు మాటఁ జెప్పినదికాదు. ఆ సంవాదము జరుగునప్పుడు స్వయంప్రభ కన్నులు మూసికొని యెద్దియో ధ్యానించుచుండెను. అప్పుడు రాజు పుత్రికంజూచి కన్నతల్లీ! కన్నులు మూసికొనియెద వేమిటికి? నీ సఖురాలి యనుమతియే నీయనుమతియా యేమి? చెప్పుమని యెంతయో లాలించి యడిగెనుగాని యేమియు సమాధానముఁ జెప్పినదికాదు. కన్నులెత్తి యాచిత్రఫలకములం జూచినది కాదు. అతండు మరియుంబుజ్జగించి యడుగుచుండ వారించుచు రాజపత్ని పోనిండు. ఇప్పుడు వచ్చిన తొందరయేమి? మనమిప్పుడే పెండ్లి చేసితిమా? దీనికి మొదటినుండియు సిగ్గు మెండు. నాతోనైనను దలయెత్తి మాట్లాడదు. అని పలికిన విని యన్నరపతి సతీమణీ ! అట్లయిన నీవు మెల్లగా బోధించి దీని వాంఛితమెద్దియో తెలిసికొనుము ఆపగిదిఁ గావించువాఁడనని చెప్పి యతండు విహారార్ధమై యరిగెను.

పిమ్మట రాజపత్ని పుత్రికను బలుగతుల లాలించియు, బుజ్జగించియు, బోధించియు బ్రతిమాలియు మంచలించియుఁ గోపించియు నడిగినది. ఆ చిన్నది యేమియు మాటాడినదికాదు. అప్పు డబ్బిసరు హాక్షి విసిగి హేమతో ఓసీ! నీయభిప్రాయమే నీసఖురాలి యభిలాష కాఁబోలును ! దానికిఁ దండ్రి విపరీతముగాఁ బల్కిరని మాటాడకున్నది. దానికింత కోపమేల? అతఁడే యిష్టమైనచో వానినే పెండ్లి సేయుదుమని చెప్పుము. పోనిమ్ము. వానికి రాజ్యములేకున్న మా రాజ్యమే యేలికొనఁగలడు. ఇంతకన్న నింకెవ్వరుండిరి. అనుటయు హేమ సంతసించుచు అమ్మా! ఆమాటయే నిక్కువము. ఆ రాజకుమారునియందు విద్యారూపములు స్తోత్రపాత్రములై యున్నవి. అయ్యగారు వానికి రాజ్యములేదని సంశయించుచున్నారు. పెద్దలకు మేమెదురాడ గలమా? అందులకే నా సఖురాలు మీమాటల కుత్తరము సెప్పినది కాదు. అని పలుకుచుండ విని స్వయంప్రభ కనులెఱ్ఱఁజేసి హేమపై వేడిచూడ్కులు నెఱయఁజేయుచు మూఢురాలా! నిన్నీమాట లెవ్వరు చెప్పమనిరి? పోపొండు. నాకెక్కడి పెండ్లి? అని పలికి యలుకతోఁ జివాలున లేచిపోయినది.

అప్పుడు హేమ రాజపత్నితో అమ్మాః స్వయంప్రభకు పెండ్లి యందే యిష్టము లేదు. స్వయంప్రభవలె నొకయాశ్రమముఁ గల్పించుకొని యోగినివేషముతోఁ దపము చేసికొనవలయునని యభిలాషగా నున్నదఁట. ఆకోరిక నాతోఁ బలుమారు చెప్పుచుండ తగదని మందలించుచుంటిని. ఇప్పు డయ్యగారు చెప్పినమాటవలన మఱియుం గినుకఁ జెందినది. నేను మెల్లగాఁజెప్పి యడిగి కోరికఁ దెలిసికొనియెద. మీరిప్పుడింటికి జనుడని నుడువుటయు రాజపత్ని సంతసించుచు పరిచారికలతోఁగూడ శుద్దాంతమున కరిగినది.

తరువాత హేమ స్వయంప్రభను గలిసికొని సఖీ! ఆచిత్రఫలకముల నీవు చూచితివికావేమి ? అందు నేనిరూపించిన రాకొమరుండు కడు సుందరుఁడుసుమీ అన్నన్నా! విధి వానినే నీకుఁగూర్చిన కడుస్తోత్రపాత్రుఁడుగదా! వానికి ప్రాయముకన్న విద్య పెద్దది. మీతండ్రి నిన్నడిగిన వానినేకాని యితరుని వరింపనని గట్టిగఁ జెప్పవల ముంజుమీ! రాజ్యవైభవముల కాసపడి విద్యాహీను గోరికొనరాదు. అని యేమేమో చెప్పుచుండ వినియు విననట్లు పెద్దతడ వూరకొని వేడినిట్టూర్పు నిగుడింపుచుఁ గొంత తడవునకు హేమ కిట్లనియె. అబలా ! నాయాశయము గ్రహింపక యూరక వాగెదవేమిటికి చర్మా స్తిమయమై హేయంబగు కాయంబునకుఁ జేవఁదెచ్చుచు పొగడుచుంటివి. సౌందర్య మననేమి? మేనిపై తోలు, రంగుజూచి భ్రమపడుచుంటివా; అయ్యో: నీపిచ్చిమాటలకు నాకేమియు నుత్తరముతోచదు. నాకు పెండ్లియం దిష్టములేదని నీతోఁ జెప్పిన మాటలన్నియుఁ గంగపాలుఁజేసి మాతల్లితండ్రులతోఁ బ్రోడవలె నేమేమియో ముచ్చటించితివి. నాకు భోగములయం దిచ్చలేదె: కామములయం దభిలాషలేదు. ఇఁకఁ బెండ్లియాడిన బ్రయోజనమేమి? ఏదియో యొక యాశ్రమంబున బ్రహ్మచారిణినై తపముఁ జేసికొనుచుండెద. నీవు మంచి మగనిఁ బెండ్లియాడి సుఖింపుము. అదియే పదివేలు.

చ. కడు వెఱపించుచున్ ముదిమి గద్దరి బెబ్బలి మాడ్కినున్న దె
    క్కుడు పగదాయలుంబలెఁ దెగుళ్ళు శరీరము నొందుచున్న వె
    ప్పుడుజను భిన్నకుంభజలముంబచే నాయవు లిట్టులయ్య దా
    నుడుగక మానవుల్ దురితమోతి నొనర్చుచు చున్నవా రహొ.

అనుటయు హేమ ఇంతీ! నీ వేదాంతము లభించుదనకయే సుమీ నిలుచునది: అనేక పురాజును 17 గల పురుషుఁడు లేదు. మహాశ్వేత లడు మరిహమున యోదమని నియమము చేసికొని యందును యని గంధర్వపుత్రిక పుండరీకుఁడను మునికు జాన్ మెట్టమొదరిచే సమసిన వీర కింజెందిన (పెత స్వయం పరమాత్రము దైవాలేదు పి మనదియా యేమి? ఎందుగ దీన యాడు తలంపుతో సట్టినీమమం బూరుషంద మండితంబైన శృంగారవనంబులో కనకమణమయ గృహం ఏమిటికి నసింప వలయును? విరక్తుల కలంకారము లేమిటికి? మఱియుమతియు సీతయు లోనగు మహాపతివ్రతలకు వచ్చిన ప్రభావము మనము నీ వేమిటికి వెళ్లినీమములం దలంచెదవు: నీమాట సాగరం.... సుడివిన రాజకుమారుని వరింపుము. పతిదేవతా వతంల రవి వైరాగ్యముఁ జెందుటకుఁ నీకిది సమయము కాదు. అని తెగిన చోటిక నవ్వుచు పెట్టలేదు. నీయభీష బ్రహ్మ దారికి రంపాదింపుము. స్వయం ప్రధ యింద్రియ


చ. ధృతికొని రోగముల్ జరయుదేహము ----------- యింద్రియ

   ప్రతిహతి లేకముందె తన ప్రాణానామణం

డితడినుఁ వాచరింపఁదగు ఠీవిఁ బ్రయత్నము ముక్తికి స్మహో గాలుతరిఁ దాలిమి నూఁతులు తప్పుటొప్పునే: సం ప్రతి శిఖ అని చదివిన నీతిపద్యము జ్ఞాపకముండిన నట్లు చెప్పవుగదా! యని యాక్షేపించినది.

అంతటితో నాప్రసంగము ముగించి హేమ యితర క్రీడావిశేషంబులఁ గాలక్షేపముఁ గావించినది. అని యెఱిగించువఱకు వేళయతిక్రమించుటయు మణిసిద్ధుఁడు తదనంతరోదంతంబవ్వలి మజిలీ యందిట్లని చెప్పఁదొడంగెను.

ఏబది యెనిమిదవ మజిలీ.

వీణావతికథ

శా. వీణాదండమః నీకతంబునఁగదా విద్వాంసులెల్లన్ ననున్
     వాణీతుల్య యటంచు నెల్లసభల న్వర్ణింతు రే నయ్యయో
     ప్రాణంబుల్వలెఁ జూచికొందు నిను నీ పాలింటికి న్వచ్చె న
     య్యేణీలోచన మృత్యువై యకటఁ నాకేదింక దిక్కె య్యెడన్.

హా ! వల్లవీరత్నమా ! తరతరంబులనుండి నీవు మాయింటగృహదేవతవలె బూజింపబడుచుంటివి గదా! నీకతంబునఁగాదె మావంగడము వారెల్ల సంగీతవిద్యా విశారదులని బిరుదములఁ బడసిరి. అయ్యో ! నేటితో నీఋుణము చెల్లి పోయినదియా? ఆహా! భవదీయ తంత్రీనాద మాధుర్య మెన్న నన్నారదాదులకు సక్యము కాకున్నది. నారదుని మహతికన్న నిన్నెక్కుడుదానిగ మురియుచుంటి. అంగుళీయస్పర్శ మాత్రంబున మొలచినట్లు నీయందు స్వరము లుత్పన్నములగుచుండు. అక్కటా! నిన్ను సతతము విడువకుండుటం బట్టియే నాకు వీణావతియని యభిఖ్య వచ్చినది. ఇప్పుడా పేరెట్లు చెల్లును? నీవంటి సాధనరత్న మీవంటివలతి మరియొకటి యున్నదియా? ఆ రాజపుత్రిక నిన్నుఁ ద్రొక్కక నన్ను గట్టిగఁగొట్టి విడచినను నింతచింత యుండకపోవునే? యని విఱిగిన యొక వీణ ముందిడుకొని వీణావతియను గాయనీమణి యొకతె గిరిదుర్గపట్టణంబున నొకయింటిలో విచారించుచుండెను.

అంతలో దానితల్లి లీలావతి యనునదివచ్చి యచ్చిగురుబోణితోపట్టీ! నీవు నిన్నటిరాత్రినుండియు నిట్లు చింతించుచుంటివి. దానం ప్రయోజనమేమి? ఇత్తెఱఁగంతయు రాజుగారి కెఱింగించితిని. ఆయన మిక్కిలి పరితపించుచు నిన్నో దార్చుట కిప్పు డిచ్చటికి వచ్చుచున్నాడు కన్నీరుఁ దుడిచికొనుము. అలకల ముడిచికొనుము. వారియెదురు రాజపుత్రిక నేమియు నిందింపకుము ఆమె వారికిఁ బ్రాణములలోఁ బ్రాణమయ్యె. ఇది మన గ్రహచారదోషమని నుడువుచుండగనే పుడమిఱేఁడు తత్తడి నెక్కి యొక్కరుఁడ యక్కడికివచ్చెను.