కామకళానిధి/ద్వితీయాశ్వాసము

కామకళానిధి

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరమాచంద్రపదప
ద్మారాధనముదితహృదయ యఖిలార్థిజనా
ధార మహనీయకవితా
సారా జయసింగధీర సద్గుణహారా.


వ.

అవధరింపుము నాయికానాయకరత్నంబు
ల బ్రకృతిభేదం బెఱింగించెదను. అందు శ్లేష్మప్రకృతి లక్షణం
బెట్టిదనిన.


సీ.

చల్లనిచామనచాయ శరీరంబు
                     తమ్మిరేకులసౌరు దాల్చుకనులు
నున్ననినఖములు సన్ననిదంతముల్
                     పొలయల్క మిక్కిలి గలిగియుండు
బ్రియతముపైఁ జాలఁ బ్రేమ గల్గి రమించు
                     మరునిల్లు నతిశీతమాంసలమగు
చెలువు గల్గిన యది శ్లేష్మప్రకృతి యగు
                     కఫవేళయందు సంగతి యెఱింగి

కూడి క్రీడింపవలయు నిక్కోమలాంగి
సులభముగ సాధ్యయగుఁగాన నుదతులందు
నుత్తమ యటంచుఁ బల్కుదు రుర్వియందు
గరిమఁ గామకళావిద ల్గురుతెఱింగి.


వ.

పైత్యప్రకృతి లక్షణ మెట్లనిన.


సీ.

గౌరవర్ణము మేనుఁ కనుఁగవ కొనలును
                     అరచేతు లరకాళ్ళు నరుణము లగు
గోరులు దంతముల్ గొంచెము రక్తముల్
                     కుచములు పిఱుఁదులు గొప్ప లగుచు
బలిసియుండును మేనఁ గల్గిన చెమ్మట
                     వెగటువాసన గల్గి వెలసియుండు
మమత మిక్కిలి గాన మరునిల్ సుఖోష్ణమై
                     చేయు సోఁకినయంతఁ జెమ్మగిల్లుఁ
జాలఁగాసికిఁ దాళదు చంచలించు
క్షణము కోపము ముదమును క్షణమై యుండు
నంగనలయందు మధ్యమ యనఁగ నొప్పు
వసుధఁ బైత్యప్రకృతి యగు వామనయన.


వ.

వాతప్రకృతి లక్షణ మెట్లనిన.


సీ.

అతినీలవర్ణమునైన ధూసరవర్ణ
                     మైనఁ గల్గినమేను నవయవమ్ము

కామకళానిధి/పుటలు44-45

కర్ణముల్ ముఖమును గళమును పొడవులు
                     కోమల మంగంబు కుచయుగంబు
పిఱుఁదులు గొప్పలు విరుదలఫలకవి
                     స్తారమైయుండు గంభీరనాభి
గొప్పచెవులును నుదరంబు గొంచ మగును
పొందు గల్గిన భుజములు భోజనంబు
నిదుర మిక్కిలి కోపంబు నిండ గలిగి
మనసు చలనంబు గల్గిన మగువ బడబ.


గీ.

పాణిపాదంబు లెర్రని పద్మ మటుల
మరునియిల్లు నవాంగుళపరిమితంబు
తేనెవాసన రతివారి తెలియతడవు
గా ద్రవించును బడబాఖ్య కాంత కరయ.


సీ.

కంఠంబు చెక్కులు కర్ణంబు నాసిక
                     తోరంబులైయుండు తొట్రుపెదవి
పచ్చనికన్నులు బలుగట్టికణుపులు
                     గల్గినవేళ్ళు వక్రమ్ము లయ్యు
కురుచలై దళములౌ కురులును స్థూలముల్
                     కాళ్ళు చేతులును తీక్ష్ణములు దంత
పంక్తులు మైచాయ బహువిధంబులు చన్ను
                     గవతోర మధికరూక్షస్వరంబు

కలిగి కడుమట్టురూపమై వెలయునడక
దుష్టము దలంచు బాసలు దొడ్డభోజ
నంబు కలయది కరిణియై.............
...........................నయము జెందు.


గీ.

చాలనిర్దయురాలు దుస్సాధ్య పతికి
మరునియిలు ద్వాదశాంగుళపరిమితంబు
మదనతోయంబు నేనుంగుమదపుఁగంపు
వెలయుకామిని కరిణియై వినుతిగాంచు.


వ.

ఇవ్విధంబున మొదలు గామినులు నాల్గువిధంబులు
గలవారు. ప్రత్యేకం బొక్కరొక్కరు డెబ్బదిరెండుభేదంబు
లైరి. కావున నీజాతులను, సత్వభేదంబులును సావధానంబుగ
నిపుణంబుగా బుద్ధిమంతు లెఱుంగవలయు. మొదట పద్మినీజాతి
కాంత దేవసత్వయై శ్లేష్మప్రకృతియై హరిణీజాతియై యుండెనేని
శుద్ధపద్మినీజాతి యనందగును. అటుగాక ఖరసత్వయు, పిశాచ
సత్వయు, వాతప్రకృతియు, కరిణీజాతియు నైయుండిన గురు తెఱుం
గుట దుర్లభంబు. అట్లగుటంగాదె పిశాచసత్వయు వాతప్రకృ
తియునై కరిణీప్రమాణంబుగల పద్మినీజాతి స్త్రీ మాతంగజాతి
యందు గలదని వాత్స్యాయనముని పల్కరించె. తక్కిన
చిత్తినీ, శంఖినీ, హస్తినీ జాతులు నీక్రమంబున నెఱుంగ
వలయు. చిత్తినికి శుద్ధజాతిలక్షణంబు మనుష్యసత్వంబును

బైత్యప్రకృతియు హరిణీప్రమాణంబు గల్గియుండు. హస్తినీ
శుద్ధజాతి లక్షణంబు ఖరసత్వయును వాతప్రకృతియు కరిణీప్ర
మాణంబును గల్గియుండు. తక్కిన సంకీర్ణజాతులందు ముం
దుగా ప్రమాణంబు లెఱింగి వాతపైత్యశ్లేష్మప్రకృతులు కని
పెట్టి సత్వలక్షణంబు లేర్పరిచినపిమ్మట నీజాతియందు సంకీర్ణ
జాతి యని తెలియనగు మరియును.


గీ.

ఇంక సామాన్యధర్మంబు లేర్పరింతు
నీ సరోజాక్షులకుఁ బ్రాయ మెంచిచూడ
నాల్గువిధములుగా నుండు నైపుణముగ
గాంచి తత్కాలములఁ బ్రీతి నించవలయు.


సీ.

పదియాఱువర్షముల్ పరగిన సతి బాల
                     ముప్పదివర్షముల్ మొనయఁ గాంత
తరుణి నాఁబరగు నంతట నేబదైదువ
                     త్సరములుగల చెలి యరయ బ్రౌఢ
యటుమీఁద వృద్ధ నానలరు నీవిధముల
                     వారిలక్షణములు వేఱు, వేఱు
పువులు గంధమును దాంబూలము మొదలైన
                     సొగసులు చీకటి సురతకేళి

బాల కమరును భూషణవస్త్రములును
బ్రేమ మమరినఁ దరుణి సంప్రీతిఁ జెందుఁ
గను ప్రకాశంబుననుఁ బ్రౌఢకాంత ప్రేమ
చేత రుచియించు వెలుఁగునఁ చీఁకటందు.


క.

ఆలాపంబుల మిక్కిలి
లాలించుచు ధనము లిచ్చి రమియింపఁదగున్
కేళిన్ వృద్ధాంగన నది
చాల భరమసహ్యకారి సరసుల కరియన్.


క.

చూళీదత్తుని మతమున
బాలయనన్ గర్భయుక్తిఁ బడయని యతివౌ
నాలీలఁ బదాఱేండ్లకు
గా లక్షణమంచుఁ బల్కెఁ గ్రమ మమరంగన్.


సీ.

యౌవనంబు ప్రసూతి యందాక ననికొంద
                     ఱవతలఁ గళలంట నరిదియండ్రు
మామత మెటులన్న మందలించెద విను
                     మేమేర నైనను నింతిమనము
పురుషునిమన మేకముగఁ బ్రేమ గల్గిన
                     యానందకాలంబు లైనఁజాలు
సత్యంబుఁ బ్రీతియు జాతియుఁ గన్గొని
                     వరుసఁజాతురిఁ గూడవలయు ననుట

నందికేశుని మతమైన నాయికలకు
వయసు పరిమాణ మెంచక పలుకఁబడియె
స్త్రీపురుషులందు నెవఁడైన జెలగ మొదటి
కూటమే బాల్య మంచును గొమరు మిగులు.


గీ.

మేను పొడవయి కృశమయి మెరసెనేని
శుచియు దోర్మూలములలోఁతు సొలసెనేని
మిగుల మగవారితోఁగూడ మెలగెనేని
సుళువుగఁ గరంచవచ్చును జెలియనండ్రు.


గీ.

మేను లావును బొట్టియు మెరపువన్నె
గట్టివై మిట్టలై యుండు కక్షములును
గలుగు చెలిఁ శక్యపడదు కరంగజేయ
నింతటంతట నిశ్చయ మిది తలంప.


సీ.

పయనంబు నడచి తా బడలిన కోమలి
                     నాట్య మాడినయట్టి నలినగంధి
యభినవజ్వరముల నలసిన పువుఁబోఁడి
                     యార్నెల్లుగర్భిణి యైనమగువ
ప్రసవమై నెలనాళ్ళ నిసువుల జలజాక్షి
                     బహుమానముల నెడబాసిన చెలి
యరయ ఋతుస్నాన మాచరించిన లేమ
                     మద్యంబు ద్రావిన మంజువాణి

తొల్త నవసంగమముఁ జేయుతోయజాక్షి
యొక్కవాసర ముపవాస మున్నతరుణి
యరయ నభ్యంజనము జేసినట్టి కాంత
కరఁగు నతివేగఁసురతంబు నందుఁదలఁప.


గీ.

ఇఁక బ్రమోదవిధంబుల నేర్పరింతు
నెట్టులన నాల్గువిధములై నెసఁగు నవియు
దంపతుల కితరేతరత్వప్రయుక్త
మైన యనురాగమే ప్రీతి యనఁగఁ దనరు.


వ.

అదియు నైసర్గికప్రీతియు వైషయికప్రీతియు నను
నామంబులం జెలంగును. తల్లక్షణంబు లెట్టివనిన.


గీ.

దంపతుల కొకరొకరికిఁ దానె పొడమి
పిన్ననాఁటనె యుండియు వృద్ధిఁ జెంది
యభ్యసింప రాకనె యధికమైన
ప్రీతి నైసర్గిక మటంచు ఖ్యాతియయ్యె.


గీ.

పువులు సొమ్ములు గంధంబు భోజనంబు
మొదలుగా గలవస్తువు లొసఁగఁ గల్గు
ప్రీతి దా వైషయికియని పేరువడియె
సమ యనెడి ప్రీతి యివి రెండు సమములైన.


గీ.

ఆటపాటల మెచ్చుట వేఁటలందు
దేవతోత్సవములయందు భావ మెఱిఁగి

లాలనము సేయఁదగుఁ బ్రీతి లక్షణజ్ఞు
లరసి యభ్యాసికియటండ్రు సరసమతిని.


వ.

ఇక విరక్తి లక్షణమును జెప్పెదను.


క.

కనుఁగొనదు పతికి నుత్తర
మును నీయదు దూరమైన మోదము నందున్
మనసిజకేళికి నొచ్చును
దనరక శయ్యపయి నుఱక తా నిదురించున్.


వ.

ఈవిరక్తికి హేతువు లెఱింగించెద.


సీ.

అతిలోభమున భోగ మనుభవింపక యున్న
                     నేరము ల్సేసిన శూరుఁడైన
మఱియొక్క మగువపై మమత మిక్కిలియైనఁ
                     గస్సున నేవేళఁ గదుముచున్న
తనకు సమ్మతము గాఁదనియుఁ గూడకయున్న
                     ముట్టుమానిన జాల ముసలియైన
గలియుచో మిక్కిలికఠినంబు సేసిన
                     నిందలు మోపిన బందుఁడైన
నాదరింపకయుండిన నత్త మామ
గారితోఁ గూడి మనసీక కఠినుఁడైనఁ
బూయఁగూడను దొడుగను ముడువఁ గుడువ
దొరకదేని విరక్తి దాఁ దోఁచునండ్రు.

సీ.

పొరుగింటికి దరుచు పోవనిచ్చినయేని
                     దడవు పుట్టినయింటఁ దడసెనేని
చెడుగాడువారితోఁ జేరఁగల్గిన బహు
                     దినములు పతి నెడబాసి యున్న
నీసున మాట్లాడకయయున్నఁ బలుమారు
                     పరపురుషులతోడ బలుకుచున్న
నెందుకుఁ గొఱగాక హీనుఁడై వికృతియై
                     ముసలితనమ్మునఁ బురుషుఁ డున్న
తానె యింటికిఁ బెద్దయై తనకు నొకరు
బుద్ధిసెప్పెడివారలు పొసఁగకున్నఁ
బుట్టినిలు భాగ్యమున నుంట బురుషుఁ డెంత
పేదయై యున్నఁ జెలి నయ మేది చెడదె.


క.

తొలుదొల్తఁ గలయునప్పుడు
జెలువుఁడు వేగంబె కరఁగు చెలువకు రెండో
కలయికయందునఁ గరఁగును
జెలువమ్ముగ మనసు శాస్త్రసిద్ధము గాఁగన్.


క.

చెలికిన్ ద్విగుణితభోజన
మలబుద్ధి చతుర్గుణంబు నగు షడ్గుణమై
వెలయన్ సాహస మతిచం
చలకామం బష్టగుణము నరుకన్న భువిన్.

వ.

ఇఁక దేశధర్మంబు లెఱింగించెద.


క.

చిత్రాలంకారములు ప
విత్రాచారంబు మదనవిద్యారతియున్
చిత్రగతిఁ జెందిన ఖర ద
కృత్రిమములు గొనదు మధ్యసీమాంగన దాన్.


గీ.

బాహ్యసంభోగమునఁ బ్రీతిఁ బడయుఁ దడవు
గారవించిన మోదంబు ఖరనలాది
తాడనంబుల హర్షించు దయగలయది
యరయ నాభీరదేశపద్మాయతాక్షి.


గీ.

చాల నాలింగనమ్ముల సంతసించు
నవ్యసుకుమారతనువు సౌందర్యవతియు
నై రదక్షతకరఘాత మంది కరఁగు
మేటిరతివేళ నటియించు లాటకాంత.


గీ.

చాల మృదుదేహమును దురాచారనిరతి
గల్గియు మనోరమాంగులై ఘనతరముగ
నార్తిఁజెందియుఁ గ్రీడింతు రతిదయావి
హీన లాంధ్రకర్ణాటదేశేందుముఖులు.


గీ.

మరునిగృహమున నేవేళ దురదగల్గి
తడవున గరంగును బ్రచండదంతఘాత

ముల సహించి రతమ్మున ముదముఁ జెందుఁ
జతుర కోసలదేశీయసతి తలంప.


వ.

ఆడుమళయాళంపుస్త్రీలకును నిదియే లక్షణము.


గీ.

చిరునగవు చక్కఁదనము సంక్షేపవచన
రచన చపలత్వము మధికనిర్లజ్జ కళల
నేర్పు గాఢానురాగంబు నిచ్చసొగసు
గల్గువారు మహారాష్ట్రకాంత లరయ.


గీ.

పువులవంటిమేను వివిధములౌ క్రూర
చేష్టల ప్రియమమరునఁ జిత్తజన్ము
కేళి కొంచ మాస చాల బాహ్యరతంబు
గలుగుచెలులు వంగగౌడభవలు.


గీ.

ప్రేమ మిక్కిలి గలయది విగతలజ్జ
యుపర తీగోరు నెలవంక లందఁగోరు
మదనువేఁడిమి నేవేళ మగ్నయగును
దలఁపనౌ నంగరాజ్యంపు జలజనయన.


క.

అనురాగము సొగసును గల
వనయము ప్రియభాషలాడు నతిమృదుదేహం
బెనయునెడ గరఁగు వేగమె
వనితామణి కామరూపవరదేశజయౌ.

క.

తనదోషము దాచును పర
జనదోషము సంగ్రహించు సంతతము మదిన్
తను వతిదృఢమై తగునది
వనదేశోద్భవలతాంగి వర్ణింపఁదగున్.


గీ.

నేర్పుగలయది శుభవేషనియతి గలది
భోగములఁ బ్రీతి గలయది పొందునపుడు
నులువునగఁరంగు జక్కని చూడ్కి గలది
ధనము లార్జించు గుజరాతితరుణి దలఁప.


గీ.

బహువిధములైన భోగము ల్పరగ రతిని
చతురయై కూడుఁ గడుసంతసము నొంది
ప్రియున కుత్సాహము నటించఁ బ్రియము గలది
మతి రహించనె సాగరానూపకాంత.


గీ.

సతతసంభోగచతుర లజ్జాసమేత
మది నలంకారములఁ గోరు మంచిరూపు
గోరును బ్రచండవేగంబు గుణముఁ గలది
చెలులమేటి త్రిలింగదేశీయకాంత.


గీ.

మెత్తనైనమేను మిగులసాహసమును
గొంచమైన రతియు మంచిపలుకు
కలుగునండ్రు వెఱపు గలుగదు పశుతుల్య
బరవసతులు లజ్జ యెఱుఁగరండ్రు.

వ.

మలయసౌవీరదేశకాంతలకును నిదియలక్షణము.


గీ.

దుష్టమతులు మిగులధూర్తులు కోపనల్
చండసురతవాంఛ జరుగువారు
నఖము లుంచఁ గళలు నటియించుకొనరు కాం
భోజపాండ్యదేశరాజముఖులు.


గీ.

మిగుల కొంచము సురతంబు మేను వెగటు
చుంబనాలింగనమ్ముల సోలలేరు
వలచినప్పుడె కామించి వత్తు రింతె
తెలియఁ గాశ్మీరగాంధారదేశసతులు.


వ.

పర్వతప్రాంతముల నుండువారికి నిదియ లక్షణము.
ఇంక జంద్రకళాలక్షణం బెఱింగించెద. ఈ చంద్రకళాస్వరూ
పంబు నందికేశ్వర శ్వేతకేతు పాంచాల కుదంతక చారా
యణ శరసువర్ణనాభ ఘోటకముఖ గోవర్ధగోణికాపుత్ర కూచి
మార వాత్స్యాయ నౌద్దాలిక బాభ్రవ్యప్రభృతులు తేట
పడ నెఱింగించిరి. వారిమతంబులు సంగ్రహంబున వచియించి
వర్ణించెదను. అందు నందికేశ్వరమతము ననుసరించి సర్వస్త్రీ
సాధారణమైన చంద్రకళ వివరించెద.


సీ.

శుక్లపక్షమునందు నుదతుల కెల్లను
                     కుడిపార్శ్వమున నుండి కొమరు మిగులు

కృష్ణపక్షంబున నెడమపార్శ్వంబున
                     వసియించి తల నుండి వరుసగ దిగుఁ
దత్క్రమం బెఱిఁగింతు దగశుద్ధపాడ్యమి
                     నాఁడు బొట్టనవ్రేలినడుమ నుండు
విదియనాఁ డఱకాలఁ గదిసి వర్తించును
                     దదియను మడమల నొదిగియుండు
జవితి మోకాళ్ళలోపలఁ దగిలియుండు
పంచశరునింటియం దుండు పంచమితిథి
నాభియం దుండుట నాషష్ఠినాఁడు దలఁప
సప్తమిని నుండు హృదయదేశమ్మునందు.


సీ.

అష్టమితిథియందు నట కుచంబున
                     నుండు నవమిని కర్ణంబునందు నలరు
దశమిని ..................................
                     జెక్కున నేకాదశిని వసించు
మొనసి ద్వాదశినాఁడు మోవిపై నివసించు
                     గంటఁ ద్రయోదశి నంటియుండు
నుదుటఁ జతుర్దశిఁ గదిసి వసించును
                     శిరమునఁ బౌర్ణమాసిని వసించు
కృష్ణపక్షమందు నీగతి సీమంత
మాది యగుచుఁ బ్రతిపదాదిగాను

గ్రమము గాఁగఁ జంద్రకళ యవరోహించు
నెడమపార్శ్వమందు నింతులకును.


సీ.

ముంగురు ల్దువ్విన మొనసి ఫాలమ్మున
                     జనియిండు నింక లోచనములందు
జుంబనమునఁ గల్గు బింబాధరము మొన
                     పంట నొక్కినఁ గళ ప్రస్ఫురించుఁ
జెక్కుకు ముద్దిడ జెవులగ్రిందటను దో
                     ర్మూలమ్ములను మోపి నిలువ
పాలిండ్లు గట్టిగాఁ బట్టి వక్షమ్మున
                     బిడికిటఁ దాటించ వృద్ధిఁజెందు
నఱచెయిని నాభిపై నుంచి యప్పళింపఁ
గరికరక్రీడ మరునిమందిరమునందుఁ
జేయ నుదయించు శశికళ చిగురుఁబోండ్లు
కని కళోద్రేకముల క్రమం బరయవలయు.


గీ.

పడతి జానుగ్రుల్భపాదంబులను నంఘ్రి
యంగుళములఁ గూర్చి నడుమగాను
కడఁక నొత్తగాను గ్రమమున జనియించు
చంద్రకళ మనోజశాస్త్రరీతి.


సీ.

ఏకార మైకార మీకార మాకార
                     ములును కారము బిందువులును గూడి

యరవిందమాదియౌ నస్త్రపంచకమున
                     కాధారమంత్రంబు లగుచునుండు
నీయస్త్రముల నరుఁ డీక్షణంబుల రెంట
                     గూర్చి యగ్నిప్రభ జేర్చి మదిని
ధ్యానంబు గావించి తగబ్రయోగించి యా
                     వల శశికళ నంటవలయు నండ్రు
వరుస నీయస్త్రముల నేయ వనితయొడల
స్థానము లెఱుంగవలయు నిశ్చయము హృదయ
కుచనయనగుహ్యకక్షముల్ గొమరుగాఁగ
....................................................


వ.

ఆ సిద్ధమంత్రంబు దనకన్నులను, వింటియందును
గూర్చి యగ్నికణాకారముగఁ బ్రయోగించవలయు. ‘ఐం’ అను
మంత్రము నట్లే కుచములను, ‘అం’ అనుదాని గన్నులను,
‘ఇం’ అనుదానిని శిరమునను, ‘ఉం’ ఆనుదానిని మదనమందిర
మునను బ్రయోగించి యగ్నికణములవలె నాస్థానములయందు
నాటినయట్లు భావనజేసి చంద్రకళను స్థానమెఱిగి పట్టవలయును.
ఈ మంత్రము లైదును అక్షరలక్షంబు జపంబు సేసి తద్దశాం
శంబు క్షీరంబుల నర్ఘ్యంబును, తద్దశాంశంబు ఘృతంబున హో
మంబును, తద్దశాంశంబు బ్రాహ్మణభోజనంబును జేయ మంత్రం
బులు వశంబులు. ఆమంత్రములం దొకటి యభిమంత్రించి తృ

ణాదులతోఁ దత్తత్తిథులఁ దత్తత్స్థానంబుననే చాలుఁ గళో
యంబగు. ఇది శ్రీనాథకవి మొదలైనవారి కనుభూతంబు.
ఇంక గోణికాపుత్రమతంబు నెఱింగించెదను.


క.

శిరమును బాదము దక్షిణ
కరమును జనుగవయుఁ దొడలు ఘననాభియు నా
మరునిలు నురుజఘనముఁ గటి
మురువుగల్గు విపులకక్షములు జఘనంబుల్.


గీ.

శుక్లపక్షమందు సొరిదిగాఁ బాడ్యమి
యాదిగాఁగ జఘన మాదిసేసి
మరుఁడు మీదికెగయు మంత్రకంబుల నాలు
బిందుయుతము లగుచుఁ బెంపుఁజెందు.


గీ.

అగ్నికణములట్ల ధ్యానంబు గావించి
యంగసంఖ్యయైన యక్షరంబు
మునుపు జెప్పినట్లు కనుల నావేశించి
యవలఁ గళలనంట నమరునండ్రు.


వ.

ఇంక వాత్స్యాయనమతం బెఱింగించెద.

సీ.

పద్మినీజాతికిఁ బాడ్యమి విదియయుఁ
                     జవితి పంచమియును సౌఖ్యదములు
చిత్తినియగు ప్రేయసికి షష్ఠి యష్టమి
                     దశమి ద్వాదశియును ద్రావకములు
శంఖిని తదియయు సప్త మేకాదశి
                     యల చతుర్దశి దినముల ద్రవించు
నవమి త్రయోదశినాఁ డమావాస్యయుఁ
                     బున్నమ హస్తినిఁ బొందుదినము
వీరి కొక్కొక్కదినమున వేఱువేఱు
స్థానములు వల్కఁబడునవి సంగ్రహించి
చంద్రకళ లుబ్బు జాతుల సంగతి గనఁ
దేటగాఁ బల్కరించెదఁ దెలిసికొనుడు.


మ.

బిగిగాఁ గంఠముఁ గౌఁగలించికొని నాభి న్బ్రక్కలఁ జెక్కులన్
సొగసైయుండు నితంబభాగమున నంచు ల్మ్రోవ గోళ్ళుంచి నె
మ్మొగ మాఘ్రాణము సేసి మోవి గొని యామోడించి సత్కారముల్
దగఁ జుంబించుచు వాలమున్ బ్రతిపదిన్ దా బర్మినిన్ దేల్చుతన్.

చ.

విదియను పద్మినీసతిని వేమరు మోవిని దంతపంక్తిచే
గుదిగొన నొక్కి చెక్కులను కోమలమౌ జఘనంబునందునన్
బదముల గబ్బిచన్నులను బక్వ మెఱింగి నఖంబు లుంచి దా
గదిసిన మోద మందదె సుఖద్రవమోహితమానసాబ్జయై.


శా.

నిండారం బిగగౌఁగిలించి కుచముల్ నెమ్మిం బిగంబట్టి మే
నిండన్ జుమ్మనుచుం గగుర్పొడువగా నిండన్ దొడల్ గోరులన్
దండి న్నొక్కి రదంబులన్ బెదవిమీఁదన్ బెట్టి గిల్గింతలన్
మెండై యుండగఁ బద్మినిన్ గరములం బేర్మిన్ గూడి రాగిల్లదే.


చ.

మోవిరసంబు గ్రోలి కుచముల్ గడుగట్టిగ బట్టి చన్మొనన్
వావిరి మందుఁ బెట్టుకొని వై పమరన్ గుడిచేత ముంగురుల్

దూవుచు గద్దుపూని మదిమెచ్చుగ విహ్వలభావమందు....
భావజకేళిఁ గూడఁదగు పంచమినాఁడు కళల్ రహించఁగన్.


వ.

ఇంకఁ జిత్తినీజాతికిఁ జంద్రకళల్ దెచ్చు మార్గము.


గీ.

అధరమాని కంఠ మాలింగనముఁ జేసి
పిరుఁదులందు గోరు లెఱుఁగనుంచి
షష్ఠినాఁడు మిగుల సరసుఁడై చిత్తిని
సతికిఁ గరఁచవలయుఁ జతురమతిని.


చ.

కర మొకచేత.........................................జేరిచి యాపయో
ధరములు ముట్టి మోవిపయి దంతము లుంచి నఖాళినాభి పు
ష్కరమున వ్రాసీ మేన పులకల్ జనియింపఁగ మారునింటిలో
గరికరలీలఁ గూర్పఁ గళ చిల్కదె యష్టమినాఁడు చిత్తినిన్.


మ.

స్తనమధ్యంముల నూబుకాండముల బృష్ఠంబందుఁ కర్ణంబులన్

వనజాక్షాస్త్రుగృహంబునన్ బిఱుఁదులన్ వామాఖ్యహస్తంబులన్
గొన బుంజిన్నెలు గల్గినట్టి కొనగోరుల్ కందువల్ నొక్కి పెం?
పున ఫాలమ్మున ముద్దుగొన్న దశమిన్ బొందున్గళల్ చిత్తినిన్.


చ.

కడుబిగియారఁ గౌఁగిటను గ్రమ్మి రదమ్ముల మోవి నొక్కి యిం
పడరఁగ పోలచుంబునముఁ గైకొని కర్ణములం బిఱుందులన్
వెడవెడ గోరు లుంచి తనివిన్ గనుఁ దమ్ములు మూసి నీతియుం
బొడమఁ గురుల్ స్పృశింప సుఖముల్ గను జిత్తిని ద్వాదశిన్ దగన్.


వ.

శంఖినికిఁ జంద్రకళ గల్గెడు మార్గము.


చ.

చెలి తనుఁ గౌఁగలించి వికసింప మనం బధరంబు నొక్కఁగాఁ
జెలువుఁడు బాహుమూలముల జిన్నెలుగా గొనగోళ్ళ దువ్వుచున్
బలితపుగబ్బిచన్నుగవపై నెలవంకల గుంపు లుంచుచున్
గలయ ద్రవించు శంఖిని సుఖం బొనరన్ దరియన్ ద్రవంబుగన్.


గీ.

కంఠహృదయకర్ణగండభాగంబుల
గడిఁది గోరు లుంచి కౌఁగిలించి
మరునినిల్లు నివిరి సరసుఁడై సప్తమి
నాఁడు శంఖినిం జెనంగవలయు.

గీ.

నఖము లుంచి మదనునగరమ్ముచుట్టును
గౌఁగిలించి మోవి గరచి నొక్కి
తనవశంబు సేయఁదగును నేకాదశి
నాఁడు కామశాస్త్రనయవిదుండు.


వ.

ఇఁక హస్తినికిఁ జంద్రకళ దెచ్చెడి మార్గము.


చ.

మదనునియింటి కుచ్చరతమార్గము బేడిదఁ జాపి పైని నిం
పొదవగ నాభిమూలమున నొక్కవగన్ గిలిగింత వెట్టుచున్
ముదమున మోవి యాని గొనచు న్నునుగోరుల బ్రక్క లంటచున్
మదవతిఁ హస్తినిన్ నవమినాఁడు గరంచగ వచ్చు నేర్పునన్.


క.

చనుగవ ముద్దిడి చంకల
నునుగోరుల నుంచి మెల్ల నొక్కి మరుగృహం
బునఁ గరికరలీలాయిత
మునను జతుర్దశిని కరిణి ముదమునఁ జెందున్.


శా.

నానాలింగనచుంబనంబులను విన్నాణంబునం జూపి పెం
పూనన్ గక్షకుచోరుదేశముల నత్యుగ్రంబుగా గీరుచున్
......................నర్ధచంద్రకరసన్మానంబులన్ సల్పుచున్
పూర్ణాహస్తిని దర్శపూర్ణిమల సంపూర్ణార్ద్రతం జెందదే.


క.

తనపై ననురాగము గల
వనితకు నివి పనికివచ్చు వట్టిచెలులకీ

యనువులు కొరగావనుచును
ముని వాత్స్యాయనుఁడు దెలిపె మొదలన్ గృతులన్.


గీ.

హరియు శ్రీనాధుఁ డాదియౌ సరసమతుల
నెట్టి దుష్కరమతినైన వృద్ధనైనఁ
గూడి ద్రవియింపఁజేయఁగాఁ గొన్నిగతుల
ననుభవము గల్గి పల్కి రదెట్టులనిన.


గీ.

మదనమందిరమున మృదువయి తామర
రేకువలెనె యుండు నేకనాడి
యైదువేళ్ళు మునుఁగు నట్లు వర్తులమయి
కుదురువలెనె యుండు నిదియు నొకటి.


గీ.

ముడుతపడినరీతి ముట్టిన మృదువయి
నుండు నొకటి మఱియు నొకటి తలప
నావు నాల్క రీతి నధికంపు బిరుసుగా
నుండు వీటితావు లొనర వినుతి.


క.

మదనగృహద్వారమునకు
నెదురుగ బొడవుగను రంధ్ర మిసుమంతది దా
మృదువయి చెలఁగును...దటుల
మొదవించుచు లింగశీర్షమున మదియింపన్.


గీ.

అర్ధచంద్రనాడి యందురు దా
నిదియె పద్మపత్రమృదువు దలప

దాని కూర్ధ్వమందుఁ దగ నువ్వుపువులీల
ముడుత గల్గియుండు ముక్కురీతి.


గీ.

మన్మథఛత్రమున నొప్పు మదజలంబు
లియ్య రెండవపర్యాయ మిది తలంప
మదనసదనరంధ్రమధ్యభాగంబున
ఘుటిక యొకటి యుండు గుండు గాఁగ.


గీ.

అదియు సంకుమడిమ యట్లసచ్ఛిద్రమై
యుండు నందు శుక్ల మొదిగిపడిన
గర్భమగుచు నిలుచుఁ గామాంకుశం బని
మదను డోలయనుచు మౌను లనిరి.


గీ.

దానిచుట్టును గ్రిమితతి గదవసించు
నవియ గండూతిఁ గల్గించు నతివలకును
దానిక్రిందను బిరుసుగా దళముగల్గి
యావునాలికగతిఁ గడు నడఁగునండ్రు.


గీ.

దానిపై లింగ మెనసినయేని వ్రణము
లూన జనియించు నధమమౌ స్థాన మదియ
గాన నీ నాల్గుతావుల మాన మెఱిగి
యంగుళుల బాహ్యరతి సేయ నమరు సుఖము.

క.

కరికర................
బరయఁగఁ గామాంకుశంబు నర్ధేందు వనన్
ధర నంగుళివిన్యాసము
లెఱిఁగి తలిర్పగను సేయ నెసఁగున్ కృతులన్.


సీ.

అంగుష్ఠము కనిష్ఠ యని రెండుగాకను
                     మూఁడువ్రేళ్ళును గొంత ముడిచిపట్టి
నడిమివ్రే ల్సాచిన నయమగు కరికరా
                     కారహస్త మ్మిదిఁ కాముకులకు
పరమసాధనమగుఁ దరుణులఁ రమియింప
                     దీన నేమానియైనఁ గరఁగు
నటుగాన మధ్యమం బంగుళిద్వయముతో
                     మదనమందిరమునఁ బొదలఁజేయు
వృద్ధయైనను ద్రవియించి వేడ్కఁ జెందు
ననుచుఁ గొక్కోకకవి మొదలయినవారు
బాహ్యసురతాంగముగ ముందు వల్కికొనిరి
సర్వసమ్మతముగఁ గామశాస్త్రమందు.


వ.

ఫణిభోగమునకు లక్షణ మెట్టిదనిన.


గీ.

పాముపడగరీతిఁ బంచాంగుళులు గూర్చి
కదియఁజేసి మదనసదనమందు

నడుగుముట్టనుంచ నది ఫణిభోగంబు
నాఁగవెలయు దర్పకాగమమున.


వ.

ఈహస్తంబు హస్తినీజాతివారి కమరియుండు మఱియును.


క.

తర్జనీమాత్ర మంగజాగారసీమ
ఘుటికపై నుంచ ద్రవియించుఁ గొమరుమిగుల
నదియ కామాంకుశంబని యఖిలకామ
శాస్త్రవేత్తలు తెల్పిరి సమ్మతముగ.


క.

అంగుష్ఠము తర్జునియును
సంగతిగా నర్ధచంద్ర సరవి నిల్పుచో
నంగుళు లర్ధేందుదగన్
రంగుగ నంగనలనెల్లఁ ద్రవియింపఁదగున్.


వ.

ఈయర్ధేందుహస్తంబుఁ బడబాజాతినాతులకుఁ దగి
యుండు. దీనిమార్గంబు నంగుష్ఠంబు చంద్రనాడియం దుంచి
తర్జని కామాందోళికలందు నిల్పి చలింపఁజేయ సురతజలంబు
బహుళంబుగాఁ గల్గి కళోదయంబగు మరియును.


క.

రాధానందన వితరణ
రాధానందనపరాక్ర మస్మరణనిభా

రాధానందన సంభృత
రాధానందనరపాల రాజప్రణుతా.


పృథ్వీ.

దహళకురుకొంకణద్రవిడలాటఖోటాంగదం
పహూణశకగౌళటెంకణకళింగరాట్కన్యకా
ముహుర్ధృతకళాచికాముఖరవీటికాపేటికా
మహాసిముఖసర్వత.........తభూమిభృల్లాంఛనా!

గద్య. ఇతి శ్రీ గురుచరణారవిందమిళిందాయమానమానస
నెల్లూరి వీరరాఘవామాత్యతనూభవ సూరమాంబా
కుమార సంస్కృతాంధ్రసాహిత్యలక్షణ
సార్వభౌమ శివరామనామప్రణీతంబైన
కామకళానిధియను కామశాస్త్రంబున
ద్వితీయాశ్వాసము.