కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/కొత్తరకం ఈతి బాధలు
కొత్తరకం ఈతి బాధలు
యిదివరలో మన పూర్వులు ఆకాలాన్నననుసరించి చెప్పిన యీతి బాధలని గూర్చి వక విపులమైన వ్యాసాన్ని వ్రాసివున్నాను. యిప్పటి దేశకాల పాత్రాలనుబట్టి చూస్తే యెన్నో యీతిబాధలు కొత్తరకాలు కనపడతాయి. యివన్నీ చాలాభాగం యీ యిరవయ్యో శతాబ్దంలోనే యెక్కువ వ్యాప్తిలోకి వచ్చి గృహస్టులను పట్టి పీల్చి పిప్పిచేస్తూ వున్నాయి. యీ బాధలు పట్నవాసాలలో వుండేవాళ్లకి చెప్పనే అక్కరలేదు. పల్లెటూళ్ల వాళ్లని కూడా కొంతవఱకు బాధిస్తూవున్నాయి. వీట్లని యిన్నీ అన్నీ అని చెప్పడానిక్కూడా శక్యంగావున్నట్టు తోచదు. యివి యెప్పటికప్పుడు వుద్బవిస్తూ సంతానవంతులకి మటీ బాధకరంగా వున్నాయి. వాండు బ్రతికి బట్టకట్టే యీడు వచ్చేలోcగానే వాండికి రోజు వక్కంటికి వొకటో రెండో పెట్టెలు సిగరెట్లు లేక బీడీలు వుండితీరాలి. అందులో అనేకరకాలు. వొక్కొక్కటి రు.0-3-0 అణాలుకూడా ఖరీదు వుండే సిగరెట్లు (పెట్టి కాదుసుండీ) వుంటాయనిన్నీ అట్టివి తప్ప తనకు పనికిరావనిన్నీ వక వైదిక బ్రాహ్మణ కులసుండు, పూర్వపురకం ప్లీడరీలో బాగా సంపాదించిన ప్రయోజకుని పౌత్రుండు, విదేశాలకు వెళ్లి అక్కడి విద్య మాత్రం వినాగా తక్కిన అలవాట్లలో చాలాభాగం అబ్బినభాగ్యశాలి చెప్పంగా విన్నాను. అసలు మనదేశంలో వుండే ప్రజలలో వొక్కొక్కనికి యావరేజిని రోజుకి 6 పైసలో, 7 పైసలో ఆర్జన కనపడుతుందని యెవరోప్రాజ్ఞలు వ్రాయంగా యేదో పత్రికలో యెప్పుడో చదివినట్టు జ్ఞాపకంవచ్చి అనుకున్నానుగదా!- యీయన పితామహుండు బాగాగడించి ఇచ్చి పోయినాండు కనక ఈ ఆగర్భ శ్రీమంతుడు, ఈ అదృష్టశాలి ఇంత వెలగల సిగరెట్లరోజూ కాల్చుకుంటూ ఆయన ఆర్జనకు సార్ధక్యాన్ని కలిగిస్తూవున్నాండు, ఇతరులగతియేలాగ? అనివిచారపడ్డాను. ఈలాటివాళ్ల కోసం నానాపాపాలకూ లోcబడి ఆర్జించడం ఎంతేనా అనుచితంకాకపోదు. అయితే బీదలు యీలాటి అభ్యాసాలే మానుకుంటారేమో? అని సమాధానం చెప్పకోcబోయాను, గానికుల్జకారులో సిగరెట్లు నోట్లోలేని వ్యక్రేనాకు కనుపించిందికాదు. సుమారు యిప్పటికి యెనిమిదేళ్లనాఁడు గుడివాడ నుంచి స్వగ్రామానికి జరూరుపనిమీంద రావలసివచ్చి శివరాత్రి రేపనేనాండు చిక్కుగా వుంటుందని యెడింగికూడా రైలెక్కాను. కోటప్పకొండ అడావిడి రోజవడంచేత ఆవేళ రైలులో వున్న తొడితొక్కిడి వ్రాయడానికి వశంకాదు. ఆ రైలులో వక బ్రాహ్మణ కుబ్జవాఁడు అంతకు మునుపు తెచ్చుకొన్న సిగ్బ అయిపోవడమున్నూ స్టేషనులో యొక్కడేనా కొనుక్కుందామంటే, వున్నచోటునుంచి కదలడానికి వీలులేకపోవడమున్నూ తటస్థించి పడ్డ బాధ నేను చూడలేకపోయాను. యెందటినో "అగ్నేయంతి" చేశాcడుగాని యెవళూ భిక్షపెట్టలేదు. ఆ కుట్టాండి వయస్సు సుమారు పదేళ్లు. అప్పడు నా వద్ద మారెండో చిరంజీవి అదే యీడువాఁడున్నాండు. వాండుకూడా చాటునామాటునా అప్పటికే అలవాటు పడ్డాడేమో? అని నాకు అనుమానం వుండడంచేత- "చూచావా, నాయనా! ఆ పిల్లాండు పడేబాధ చూచావా?" అంటూ యేవో నీతివాక్యాలు కొన్ని బోధించాను. ఆకారణంచేతో యేమో వాండుమాత్రం యీ అలవాటుకు లోCబడలేదు. బీడీలు యింతింత వెలగల వున్నాయో లేవో కాని మన దేశంలో వాట్ల ప్రచారమున్నూ ఆబాలవృద్ధంగా వ్యాపించేవుంది. మూ చిన్నతనంలో చుట్టలేకాని యివిలేవు. డబ్బు 1కి యిరవైచుట్టలదాకా యిచ్చేవారు. సిగరెటూ, బీడీలు వచ్చాక చుట్టలేమేనా చవకైనాయేమో? అనుకుంటే అదిన్నీ కనపడదు. అవి డబ్బు 1కి రెండుమూCడుగా వున్నాయి. మొత్తం యీ మూCడుగాని యిందులో రెండుగాని అధమం వకటిగాని అభ్యాసం లేని బాలవ్యక్తి నూటికి యే వొకటో తప్ప కనపడనే కనపడడు. కాస్త నాగరికత కలవాళ్లు మాత్రం చుట్టజోలికి రారు. యేబ్రాసులుగా వుండే పైల కాపుకుeూళ్లు చుట్టలూ కాలుస్తారుగాని వీట్లల్లో యేదో మహావిశేషం వుందని యీ నాగరికపు చుట్టలు (సిగరెట్లు, బీడీలూ) కూడా పండుగ పబ్బాలు తటస్థించినప్పుడు మాధానంగా కాల్చుకుంటూ వుంటారు. యిది యిప్పటికాలానికి సామాన్యసంసారులకు వక యీతిబాధగానే కనపడుతుంది. కొంచెం వైదికవేషంగా వుండేవాళ్లకో? చెప్పనే అక్కరలేదు. యిది చుట్టకంటేకూడా అనారోగ్యమనిన్నీ యింగ్లీష్పడాక్టర్లు చెప్పడమే కాకుండా పత్రికలలో కూడా వ్రాస్తూవుంటారు. కాని ఆ మాటలు యెవరూ పాటిచేసినట్టు కనపడదు. యితరుల మాటదాcకా యెందుకు? ఆ డాక్టర్లే సిగరెట్లను శరపరంపరగా కాలుస్తూవుంటే, యేమనుకోవాలి? పాశ్చాత్య నాగరికతకు యిది వక శిరోభూషణంగా ವಿನ್ಚಿಟ್ಟು 안9 నాగరికతకు అలవాటుపడినవారి ప్రవృత్తివల్ల గోచరిస్తుంది. యెందరో యిది నోట్లో వుంటేనేకాని మాట్లాడనేలేరు. మనదేశస్టులలో చుట్టకంటె నస్యానికి సభాపూజ్యత వున్నట్టే ఆదేశంలో సిగరెట్లకున్నూసభాపూజ్యత వున్నట్టు కనబడుతుంది. యెంతవఱకు సత్యమో? కాని కొన్ని బ్రాహ్మణాగ్రహారాలల్లో నవనాగరికత ముదిరిన బాలికలుకూడా పేకాడుకుంటూ సిగరెట్లు కాల్చుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూవున్నట్టు వినడం. అయితే నవనాగరికులు స్త్రీస్వాతంత్ర్య ప్రథమ సోపానంగా భావిస్తారనుకొంటాను దీన్ని చుట్ట కాల్చడంకూడా పూర్వం స్త్రీలలో అంతో యింతో లేకపోలేదుగాని ఆ ခြီဃ వేశ్యలూ యింకా తక్కువ తరగతివాళూగాని బ్రాహ్మణాగ్రహారాల కర్మం యీలా కాలినట్టు తెలియదు. కొంచెం వెలమ జమీందారులలో కూడా యీ కాల్పు వుందని వినికి. విజయనగరం సంస్థానంలో యేడువందల బ్రాహ్మణా గ్రహారాలున్నట్టున్నూ శ్రీ ఆనందగజపతి మహారాజులుంగారి తండ్రో, లేక తాతగారో, ముత్తాతో వక పరియాయం ఆ అగ్రహారాలు చూడడానికి వెళ్లేటప్పటికి వేదశాస్త్రప్రచారం కలికంలోకి కూడా కనపడక యొక్కడచూచినా చుట్టకాల్పులున్నూ వీట్లకు సంబంధించిన పరికరాలున్నూ కనపడేటప్పటికి ఆయన చాలా నొచ్చుకొని– “అన్నా తుట్టతుదకు ఆలాటి వంశస్టులంతా యీ స్థితికి వచ్చారుగదా! అని చింతపడి దీనికి వుపాయం యేమిటని ఆలోచించి వెంటనే- “అగ్రహారాలన్నీ జప్తుచేశామని ప్రకటించేటప్పటికి యే కొంతమందో రాజుగారి దర్శనం చేసుకొని మనవి చేసుకోవడానికి అర్హతకల తలకాయలు అక్కడక్కడ విత్తనాలలాగ ఇంకా వున్నారు కనుక వారువచ్చి నెత్తీ నోరూ మొత్తుకుంటే మహారాజులుంగారు- "మీకు యీ అగ్రహారాలు యెందుకైతే పుట్టివున్నాయో 영9 స్థితిలో వుండేపర్యంతమున్నూ వక్క పైసాకూడా మీకు ముట్టదు. యీలోగా మేం వసూలుచేసి మంచిస్థితికి వచ్చినవెంటనే యావత్తున్నూ మీకు యిచ్చి వేస్తాము" అని శాసించేటప్పటికి "జహద్దేవరా” అని మళ్లా అగ్రహారాలవారందఱూ తల తడిమిచూచుకొని వేదశాస్తాలలో కృషిచేసినారనిన్నీ మహారాజులుంగారి మెప్పనుపొంది మళ్లా అగ్రహారాలు నిలబెట్టుకున్నారనిన్నీ వినడం. యిప్పుడు ఆలా శాసించి మనలని బాగుచేయడాని కెవరున్నారు? అన్నింటికీ కాంగ్రెస్సువారే కనపడతారు. వారు యెన్నిటికని కలగంజేసు కుంటారు పాపం! వొకజిల్లాలో మద్యపాన నిషేధానికి వుపక్రమిస్తే 24 లక్షలు బడ్జెట్టులో లోటు కనిపిస్తూవుందిగదా? యీ సిగరెట్ల దిగుమతీని నిషేధిస్తే యెంతలోటు కనిపిస్తుందో? యివన్నీ పూడ్చాలంటే శక్యమో? కాదో? అదిన్నీకాక ఆ యీ వస్తువులు లేకుండా చేసి మాన్పించడమనేది కొత్తపంథ. మన పూర్వుల పంథ యిది కానే కాదు. నీతిచేత మనుష్యులు దుర్వ్యసనాలనుంచి తప్పించుకోవలసిందనే కాని, స్త్రీలను లేకుండాచేసి పురుష వ్యభిచారాన్నీ పురుషులను లేకుండా చేసి & వ్యభిచారాన్నీ మద్యం లేకుండా చేసి తాగుడ్డీ తగ్గించడం కానేకాదు. సమస్తమూ వుండనే వుంటాయి. వున్నా యెవండు యోగ్యండుగా వుంటాండో వాండే గణనీయుండని వాళ్ల తాత్పర్యం. అట్టి యోగ్యత కలగడం యేమహావ్యక్తులకోతప్ప దృశ్యాదృశ్యం. కనక పదార్థం దొరకుండా చేస్తే - “పురుషాణా మభావేన సర్వానార్యః పతివ్రతాః అనే మాదిరి నేcటి ప్రాజ్ఞలు సదుద్దేశంతోనే వక కొత్తమార్గం తొక్కుతూ వున్నారు. దీన్ని కాదనడానికి అంతకన్నా మంచిమార్గం చూపించే వారయితే తప్ప చేతంగాని ఆక్షేపకులకు యుక్తంకాదు. కాCబట్టి యీ యీతిబాధను తప్పించడానికి యీ సిగరెట్ల దిగుమతీ లేకుండా ఏదేనా సదుపాయం యిప్పటి గవర్నమెంటు చేస్తే చాలా విధాల బాలకులు బాగుపడతారని నాకు తోస్తుంది. కల్లు దుకాణాల స్థానంలో “టీ-కాఫీ" వగైరా పానపదార్థాలు విక్రయించే దుకాణాలు వెలిశాయంటూ కొన్ని పత్రికలు సంతోషాన్ని వెలిపుచ్చాయి. కాని ఆ సంతోషం కొంత ఆపాతరమణీయంగా లేకపోలేదుగాని బాగా విచారిస్తే మన పూర్వజీవితానికిన్నీ మన ఆంధ్రదేశానికిన్నీ యివీ అనర్ధాపాదకాలే అవడంచేత- “ముల్లు వుచ్చి కొట్టడంచిన" చందమే అనుటకు సందేహంలేదు. కాని ప్రపంచదృష్టిలో మాత్రం యిది "గుడ్డిలో మెల్లగా కనబడుతుంది. అయితే యీ వుద్యమాన్ని నడిపేవారు దాక్షిణాత్యులు కావడంచేతనేమి, వారికి "కాఫీ-టీ" పానం అనుశ్రుతంగా వున్నదే అవడంచేతనేమి దీనికి వారు సంతోషించారంటే వింత కనపబడదు. మనదేశంలోకూడా యజ్ఞంలో శ్రాతులదగ్గిఱ నుంచిన్నీ సర్వదా సదాచారాలలో అసిధారావ్రతంగా సంచరించే వితంతువుల దగ్గిఱనుంచిన్నీ పితృకార్యాలలో నిమంత్రితులైన భోక్తల దగ్గిఅనుంచిన్నీ దీనికి అలవాటుపడి పవిత్రమైన దాన్నిగా భావిస్తూ వుండడంచేత విధిలేక దీనికి మన ఆంధ్రులున్నూ సంతోషించతగ్గదే. మొత్తం యీ కాఫీ-టీలుకూడా గృహసులకు వక విధమైన యీతిబాధలలోకే చేరతాయని నా వూహ. అయినా మద్యపానమంత బట్టవిప్పకొని నాట్యంచేయించే శక్తివీట్లయందు లేదు కనక తదపేక్షయా దీన్ని యీకాలంలో అంగీకరించక తీరదు. నల్లమందు అలవాటయినవాళ్లకు సమయానికి అది పడకపోతే కాళూ చేతులూ లాగడం వగయిరా దుర్గోషాలు బయలుదేటినట్టే యీ కాఫీ-టీలు కూడా సమయానికి పడకపోతే తలనొప్పి వగయిరా దుర్దోషాలు కనపడతాయని వారువారు అనుకుంటూవుంటే విన్నాను. నల్లమందు బాలవృద్ధాతురుల రోగాలకు మందుగా అనాదిగా మనదేశంలోనూ యితర దేశాలలోనున్నూ వాడుతూ వున్నవిషయం యెఱింగిన్నీ దాన్ని నిషేధింపC బూనినవారు తత్తుల్యమే అయిన దీన్నికూడా క్రమంగా నిషేధిస్తారనే వూహించాలి. యింక సబ్బునుగూర్చి మాట్టాడుకుందాం. పైపదార్ధాలలాగ యిది లోపలికి సేవించే దైతే కాదు గాని బీదలకు దీనివల్ల కొంత అనవసరపుఖర్చు కల్పిత మవుతూవుంది. నాలుగు కుంకుడుకాయలో, కాస్త సీకాయో వుపయోగించే దానికి పట్నాలు సరేసరి, ప్రతీపల్లెటూరు గృహసులున్నూ దీన్ని విశేషించి వాడుతూ వున్నారు. దీనిలోనూ సిగరెట్టులోలాగే అనేక రకాలు ఉన్నాయి. అందులో హెచ్చువెలకలవి యెన్నో వున్నాయి. ధనికులు ఆలాటివాట్లను తృణప్రాయంగా వాడి చాలా సొమ్మ వృథాచేస్తూన్నారు. కాని అది వారి కొకలక్ష్యంలోది కాదు– “పులినిచూచి నక్కవాంత పెట్టుకుందన్నట్టు పల్లెటూరి బీదలుకూడా ఆలాటి సబ్బులకే ప్రయత్నిస్తూన్నారు. ముఖ్యంగా వీట్ల అవసరం స్త్రీలకు. వాళ్లనాగరికత గడియకొకరీతిని మారుతూవుంది. పాశ్చాత్యుల భార్యలు నవనాగరికతకు తగ్గ వస్తువులు తేలేక యెందఱో బ్రహ్మచారులుగానే వుంటారని వినడం. ఆయోగం యీ కొత్తనాగరికతను అవలంబించే స్త్రీలవల్ల మనభారతీయులకుకూడా తారసిస్తుందని తోస్తుంది- దీనితో కొన్ని పౌడర్లుకూడా చూచుకోవాలి. పూర్వం యీమాత్రం నాగరికత లేకపోలేదుగాని అది సార్వత్రికం కాదు- యీ పౌడరుకు బదులుగా లో ధ్రపుష్పచూర్ణాన్ని వాడేవారని- "నీతా లో ధ్రప్రసవరజసా పాండుతా మాననే శ్రీః" అనే మేఘసందేశంవల్ల తెలియవస్తుంది. ధనికుల కేవిన్నీ బాధించవుగాని సామాన్యగృహస్టులకు యివన్నీయితిబాధ తరగతిలోవే. అధమం నెలకు నూఱురూపాయీలేనా సంపాదించేవాఁడయితే తప్ప ఆయీ నాగరికతకు సంబంధించిన సామాన్య సంసారాన్ని యీందంజాలడు. మా చిన్నతనంలో నెలకు పదిరూపాయిలు తెచ్చుకునే గృహస్టుచకంగా సంసారాన్ని యీcదుకోcగలగడమే కాకుండా పైంగా అతిథి అభ్యాగతులనుకూడా శక్తికొలందిని ఆదరించేవాండు. యిప్పడు నూఱురూపాయిల జీతగాఁడు పిడికెండుబియ్యం ముష్టికూడా పెట్టలేకపోతూ వున్నాండు. అప్పడు యీ కాలంలోవుండే దుబారాఖర్చులు యేవీలేవు సరిగదా! ధాన్యాదుల వెలలు చాలాతక్కువలో వుండేవి. నా స్వానుభవవిషయం వకటి వ్రాస్తూవున్నాను. నేను 1903లో బందరు హైస్కూలులో తెలుంగు పండితుండుగా రు 25-0-0 రూపాయిల జీతంమీంద హఠాత్తుగా ప్రవేశించాను. అప్పటికి నాకు రూపాయి వడ్డీమీంద రు.600-0-0ల రూపాయిలు అప్పవుంది. అప్ప మాన్యంమీంద వచ్చే రు. 100–0–0 శిస్తువల్లను శ్రీనూజివీటి రామచంద్రాప్పరావుగారు ప్రతియేంటా వెళ్లినా వెళ్లకపోయినా తప్పకుండా యిచ్చే నూటపదహార్ల వార్షికంమీందనూ తీరుతుంది గదా అనిన్నీ రు.25-0–0 ల జీతంతో పట్నవాసంలో నేనూ భార్యా యెవరో తోవాసం వకపిల్లవాఁడున్నూ మొత్తం ముగ్గురువుండే నా కుటుంబమున్నూ, యింటివద్ద మాతల్లిదండ్రులూ, యెల్లప్పడూ తఱచుగా యా ఇంటనే వుండే యిద్దఱు తోCబుట్టువులూ, వాళ్లపిల్లలూవుండే పెద్ద కుటుంబమున్నూ యేలోపమూ లేకుండా చకంగా జరిగేది. దీనిక్కారణం ముఖ్యమైన ఆహారపదార్థాలు. ఆముదందీపాలు, యెప్పడో అవసరమైతే నాకవిత్వ రచనకు మాత్రం కొవ్వొత్తిదీపం, దొడ్లో ఆకూ కూరా వగయిరాలతో యింట్లోవున్న పాండితో సంసారం నడుపుకోవడమే. యిప్పడో ఈ రెండు కుటుంబాలకున్నూ, రు. 25-0-0 రూపాయిలు కాఫీ -టీ -సిగరెట్లకుకూడా సరిపోవనుకోవాలి. యీ వాతావరణం పూర్తిగా వేళ్లు నాటుకుపోయింది. ప్రతి పల్లెటూల్లోకూడా కాఫీహోటళ్లు వెలిశాయి. కాఫీహోటళ్లంటే జ్ఞాపకం వచ్చింది. ఆమధ్య వక సంవత్సరంకింద వక అతిథి, మా యింటికి వచ్చాండు. ఆయన మైసూరు ప్రాంతం వాణ్ణని చెప్పాండు. యేంపనిమీంద యీదేశం వచ్చావని అడిగాను. “కాఫీ హోటలు పెట్టుకోవడానికి ఏదేనా వూరు వెదుక్కొవడానికని బయలుదేలాను. యొక్కడా కాళీగావున్న పల్లెటూరు దొరకలేదన్నాండు. యీ హోటలుగాని అన్నంపెట్టే హోటలుగాని పెట్టుకోవడం మన ఆంధ్రులకు పూర్వం చాలా నీచంగా వుండేది; ఇప్పడు దీన్ని అవలంబిద్దామన్నా అవకాశమే కనపడడంలేదు, సుమారు 40 యేళ్లనాండు గద్వాలనుంచి వస్తూ గుంతకల్లు స్టేషనులో హోటలు భోజనం చేయవలసి వచ్చింది. తీరా భోంచేసేవేళకు- యజమాని నపడి మమ్మల్ని ఎంతో ప్రత్యుత్థానం చేసేటప్పటికి హోటలుకీపరేమిటి? యీ ప్రత్యుత్థాన వాక్యాలేమిటి? పైCగా యీ బ్రాహ్మడి తేజస్సు హోటలు పెట్టుకోవడానికి తగ్గదిగా లేదనుకొని కొంచెం కదిలించి చూస్తిమి గదా! ఆయనకు వేదం అశీతిద్వయమున్నూ చకంగా వచ్చును. ఇట్టి శుద్ధశ్రోత్రియుండికి యీగతి పట్టడానికి కారణమేమిటో? అని ఆట్టే విచారిస్తే అనారోగ్య హేతువును బట్టి విధిలెక జీవనార్థం యీ అకార్యంచేస్తూ వున్నానని విచారిస్తూ ఆయనే చెప్పారు: యెందటో దాక్షిణాత్యులు యింగ్లీషులో పెద్ద పెద్ద పరీక్షలు ప్యాసంుకూడా Ο ΧJo హోటలువృత్తిని అవలంబించి గొప్పగొప్పస్థితులు సంపాదించి గౌరవజీవనం చేస్తూవున్నట్టు కనపడుతుంది. "శ్లో అట్టశూలాజనాపదాః. అట్ట మన్నమితి ప్రోక్తంశూలో విక్రయ ఉచ్యతే" అంటూ విష్ణుపురాణాదులలో ΟΟΟΟ అవస్థ భవిష్యత్కాలంలో కలుగుతుందని వ్రాయడమున్నూ తుదకది ప్రత్యక్షం కావడమున్నూ చూస్తే ఆ ఋషుల దీర్ఘదర్శిత్వం అవగతమవుతుంది. చెప్పొచ్చే దేమిటంటే? పూర్వరీతిగా దుబారా ಭರಿುುಲು లేకుండా మితంగా కాలక్షేపం చేదామని ఏగృహస్టేనా ప్రయత్నించినప్పటికీ 89OOՄo హోటళ్లు బీడిసిగరెట్లతోపాటు సర్వత్రా అలుముకున్నాయి. గాంధీగారు జీవితచరిత్రలో వ్రాసుకొన్నట్టు కొందఱు యీ సిగరెట్లు కొనుక్కోవడానికి శక్తిలేక చిలకకొట్లద్వారా తమ వ్యామోహాన్ని తీర్చుకొనేవాళ్లున్నూ- కనపడతారు. యీ దురవస్థ తల్చుకుంటే దుర్వ్యసనం యేలాటి అకార్యాలు చేయిస్తుందో స్పష్టపడుతుంది-వాళ్లమాట యేలావున్నా కాస్త గౌరవంగామప్పితంగా కాలక్షేపం చేదామన్న - గృహస్తుకు - యివన్నీ యీతిబాధలు ਨੀ కనపడుతున్నాయి. నా చిన్నతనంలో తోడి బ్రాహ్మణ పిల్లలతోపాటు నేను డబ్బుకూ దసానికీ సంభావనకి వెళ్లకపోయేటప్పటికి మా తల్లిదండ్రులు “నీకు ముందుముందేలా గడుస్తుంది. యెక్కడికీ వెళ్లవనేవారు. దానికి “నాకేం నెలకు పదిరూపాయిలు యిప్పడు చదువుకున్న చదువుకే యిస్తారని గర్వంతో జవాబు చెప్పేవాణ్ణి. అప్పటికి నా చదువు "తెలుంగుస్కూల్లో లోవర్ప్రైమరీ సర్టిఫికట్టు" కలిగివుంది. ఆ కాలంలో ఆ మాత్రం చదువున్నూ అక్కఱ లేకుండానే యినస్పెక్టర్లు స్కూలు మాస్టరీ యిస్తూండేవారు. అట్టి స్థితిలో నేను పల్లెటూరి మాస్టరీకే వెళ్లవలసివస్తే యిన స్పెక్టర్లు నన్నెంత ప్రేమిస్తారో ఆలోచించండి. యేంకర్మమో? కాని అప్పుడు వంటబ్రాహ్మలు స్కూలుమాస్టర్లుగా వుండే స్కూళ్లల్లో చదివికూడా బాలురు మంచి భాషాజ్ఞానం కలవాళ్లుగా వుండేవారు. యిప్పుడు మంచి మంచి పరీక్షలిచ్చినవాళ్లు మాస్టర్లుగావుండే స్కూళ్లలో చదివికూడా ప్రధాన పదార్థం సర్వ శూన్యంగానే కనపడుతుంది. విద్యావిషయాన్ని విచారిస్తే యిప్పటి స్కూళ్లుకూడా యీతిబాధలకిందకే వస్తాయి. అప్పడు సంవత్సరానికి వకసారి. కొన్నింటికి రెండుసార్లు కాంబోలు పరీక్ష చేసేవారు యిన స్పెక్టర్లు. యిప్పడో "ముద్ద ముద్దకీ బిస్మిల్లా" అన్నట్టు యెప్పుడూ పరీక్షలే, అయినా ప్రయోజనం శూన్యం. అయిదేళ్లు యెలిమెంటరీ స్కూలులో చదివిన వొకపిల్లవాండికి రఘువంశం మొదలెట్టి చెప్పవలసివస్తే వర్ణక్రమం దగ్గిఱనుంచీ, చెప్పవలసివచ్చి "సన్యాసాడి పెళ్లికి జుట్టుదగ్గిఱనుంచీ యెరు” వన్నట్టు కనపడింది. విద్యాశాఖకు అవుతూవున్న వ్యయం బోలెండు కనపడుతుంది. విద్యగతి యిలావుంది. పూర్వంకన్న విద్య చాలా వ్యాపకస్టితిలో వున్నట్టు రిపోర్టులవల్ల పై అధికారులు తెలుసుకొని తృప్తిపడుతూవుంటారు. అయితే వకటిమాత్రంవుంది. పూర్వకాలంలో ప్రతివ్యక్తికిన్నీ చేవ్రాలుచేసే శక్తి కూడా వుండేదికాదు. యిప్పడాలాకాదు. నూటికి యేభై మందికేనా మాతృభాషలోనేకాదు; హూణభాషలోకూడా చేవ్రాలుచేసే శక్తి మట్టుకేనా కనపడుతుంది యెంతోసొమ్మ గవర్నమెంటు వ్యయపఱచ డానికి యుదేఫలిత మయేయెడల-“మహతా ప్రయత్నేన లట్వాలి.__కృష్యతే అన్నట్టవుతుంది. ෂටඹී? పెద్ద బ్రహ్మాండమంత ప్రయత్నంచేసి వకచిన్న పిట్టను పట్టుకొన్నాండన్నట్టయింది. కాCబట్టి యిప్పటి పల్లెటూరి స్కూళ్లున్నూ యీతిబాధలలోకే చేరతాయి. యింక ముందు నిర్బంధ విద్యా విధానంకూడా వస్తే యితరత్ర చదువుకొని బాగుపడేవాళ్లుకూడా యీ స్కూళ్లలోకి వెళ్లిచెడిపోవలసిన దుస్థితి తటస్థిస్తుంది కాంబోలును. యొక్కడో నూట నాట తప్ప యింట్లోకాని అన్యత్రగాని చదువుకొని బాగుపడవలసిన వీళ్లు కూడా నశించి చాలాకాలమయింది. నా చిన్నతనంలో పల్లెటూళ్లల్లోనే కాదు; పట్నవాసాల్లో కూడా ప్రైవేటుట్యూషన్లంటూ వున్నట్టెఱంగను. యిప్పుడో శివారు గ్రామాల్లోకూడా యీ ట్యూషన్లు వ్యాపక స్థితిలో వున్నాయి. వకటీ, రెండూదాంకా జీతాలున్నూ యిస్తారు. యీ సందర్భంలో జ్ఞాపకం వచ్చింది. నేను రఘువంశం మొదలెట్టేముందు వకతేలీ గృహస్టు నన్ను తనపిల్లవాండికి రోజూవచ్చి కాస్తసేపు చదువు చెప్పవలసిందని కోరాండు. వకనెల్లాళ్లు కాంబోలు చెప్పాను. నా సరదా తీరేదాకా గానుగుబల్లమీఁద యొక్కితిరిగేవాణ్ణి అర్థరూపాయి కాCబోలును జీతం యిచ్చేవాఁడు. యిప్పడామాత్రం చదువుకు జీతం హెచ్చుగానే దొరుకుతుంది కాని అప్పుడు ఆ అర్థరూపాయితో జరిగినపనిలో యిప్పుడు యెన్నో వంతూ రెండురూపాయిలతో జరగదు. ఆ కాలంలో రూపాయికి యెనిమిది సేర్లబియ్యం అమ్ముతున్నారంటే? పెద్దకరువు వచ్చిందన్నమాటే! అలా అమ్ముతూ వున్నరోజుల్లోనే దత్తమండలాన్నుంచీ, గుంటూరు డిఫ్రిక్టు నుంచీ యెన్నో కుటుంబాలు మా గోదావరిజిల్లాకు వలసవచ్చాయి. ఆ కుటుంబాల నన్నిటినీ వకయేడో రెండేళ్లొ శ్రీ బచ్చు రామేశంగారు పోషించి పరలోకంలో శాశ్వతమైన వున్నతస్థానాన్ని సంపాదించుకొన్నారు. కాకినాడ అవధానంనాఁటికి యింకా యీ విషయం లోకానికి అంతమఱుపు తగలలేదు. యెవరో అడిగారు యీ పద్యం చెప్పాము. శా. "ధారాపాతము లేక సస్యవితతుల్తప్తమ్మ లయ్యెన్ గడున్ జేరెన్ సర్వజనంబు నీపురమునే జీవింప, వా రెల్లరన్ శ్రీరామేశఘనుండు ప్రోచి మును దా శ్రీవృష్టి నాక్షామముం బాలందోలెను దానిఁ గోర మరలన్ బాగెట్లగున్ దెల్పుమా?” యీయన చేసిన యీవుత్తమ కార్యానికి గవర్నమెంటువారు కూడా చాలా ఆశ్చర్యపడ్డట్టు వినికిడి. అప్పటి శ్రీ పిఠాపురం రాజాగారు యేదో గవర్నరు సభకు వెళ్లినప్పుడు కాకినాడ ప్రశంసవచ్చి గవర్నరుగారు- “ఓహో! బచ్చురామేశం వున్న వూరు కాదా?" అనేటప్పటికి రాజాగారికి అవమానంగా కనపడి-“రామేశం మాయెస్టేటు గ్రామాలలో వక వూల్లో వక వీథిలో వక వైపునవుండే వక గృహస్టు" అని జవాబు చెప్పినట్టు చెప్పుకోవడం. యీ రాజాగారేమో నాఁటిరోజుల్లో దానకర్ణుండని ప్రసిద్ధివహించి కోట్లకొలంది ధనమున్నూ పుట్లకొలందిభూమిన్నీ సద్వినియోగంచేసిన మహావ్యక్తి. రామేశంగారి కీర్తి యీ మహావ్యక్తి కీర్తినికూడా మఱపించింది. కారణం ఆలోచిస్తే యిది మటీ అవసరమెటింగిచేసిన దానం కావడమే. ప్రస్తుతకాలంలో కోట్లకొలంది వెచ్చిస్తూవున్న ధనదాతలు వున్నప్పటికీ యిట్టి యుక్తవ్యయం చేసేదాతలు మిక్కిలీ మృగ్యమవడంకూడా యీతిబాధలకిందికే వస్తుంది. మునుపు మార్గసులకు; అందులో ముఖ్యంగా కాశీ రామేశ్వరాలు వెళ్లే యాత్రీకులకు సత్రాలంటూ వుండేవి. రైళ్లమూలాన్ని అవి వెనకబట్టాయి. అక్కడక్కడ యింకా కొన్నయితే మిక్కిలీ స్వల్పంగా శేషించి వున్నాయి. కాని అవి దాతల వుద్దేశాన్ని నెఱవేర్చక అన్యథాగా నడుస్తూవుండడంచేత యిప్పడు కొత్తగా యెవరేనా ధనాధ్యులు లోకోపకారార్థం అలాటి ధర్మాలు చేయడానికి వెనుకందీస్తూ వున్నారు. దాతలవుద్దేశానికి పూర్తిగా అన్యథాగా ప్రవర్తించే యజమానులు ధర్మ సంస్థలకు దాపరించడముకూడా యీతిబాధలోనే చేరుతుంది. వక గ్రామములో దేవాలయాదాయము లోన్నుంచి వేదశాస్త్ర పాఠశాల నడిపిస్తూ వుండేవారు. యిటీవల దానియాజమాన్యం వోట్లలెక్కనుబట్టి బ్రాహ్మణేతరులమీందకి వచ్చింది. ఆయన అధ్యాపకుణ్ణి, బ్రాహ్మణేతరుల క్కూడా వేదం చెప్పవలసిందని శాసించారు. అధ్యాపకుండు, ఛాందసుండు చెప్పనన్నాండు. దానిమీంద ఆ యజమాని అసలు వేదానికే సున్నచుట్టినట్టు యీ మధ్యనే విన్నాను. అసలు ధనదాతవద్దేశమేమో తప్పో? వొప్పో? శాస్త్రీయమైన కార్యాలకు వినియోగించడమే కాని అన్యంకాదు. తుదకి మధ్యవచ్చిన యజమానులవల్ల ఆ వుద్దేశం మాటి యేలా \ పరిణమించిందో చూడండి. యీ యాజమాన్యాలు “మూణాళ్ల ముచ్చట్లు" దీనిలో యిన్ని వికారాలు, వేదాధ్యయనానికి వుపనయనం కావాలాయెు. ఆ వుపనయనం ఆబ్రాహ్మణ చండాల పర్యంతమూ జరగcదగ్గదిగా కనిపించడం లేదాయె. “లేకపోయేదేమిటి? చేసుకుంటే - వుంటుందని చేసుకుంటారా? చేసుకోండి, ఉత్తమత్వప్రాప్తికికదా! యవరేపని చేసుకున్నా అట్టివత్తమత్వం అశాస్త్రీయ కార్యాలవల్లకూడా కలిగేయొడల సంతోషమే. కానివ్వండి" అంటే తీరిపోయే దానికి కొందఱు బ్రాహ్మలు యేదో పుట్టి మునిఁగినట్టు దీనికోసం పరితపిస్తారు. అదిన్నీకాక యెవరికి అధికారంవుందో వారిలో యెందఱు వేదం చెప్పకుంటూ వున్నారు? వేదం దాఁకా యెందుకు? అధమం సంధ్యావందనమేనా చెప్పకుంటూ వున్నారా? అట్టిరోజుల్లో యీవిధినిషేధాలెందుకు? యీ వేదశాస్త్రాలు ద్విజులవల్ల యేలాగా కాపాడబడేటట్టులేదు. ద్విజేతరులవల్లనేనా కాపాడCబడతాయేమో? అని బ్రాహ్మలు ఆలోచిస్తే యేమయ్యేదోగాని ఆలా ఆలోచిస్తూ వున్నట్టు కనపడదు. బాహాటంగా హరిజనులక్కూడా వేదశాస్తాలు చెప్పడానికి ఛాందసులు సిద్ధపడేటట్టయితే యేమవుతుందో? చూడాలని నాకు యెంతో కుతూహలం వుంది. యీలాటి ఆలోచనలవల్ల కాదుగాని కొందఱు కడుపుకక్కుర్తివల్లమాత్రం అక్కడక్కడ ద్విజేతరులకు చెపుతూ వున్నారేమో? అన్నట్లు చెప్పడమెందుకు? అచ్చుపుస్తకాలుండనే వున్నాయికదా! వాట్లవల్లనే ఆ వేదాన్ని వారు సాధించవచ్చు ననుకుంటాను. అయితే అది శ్రుతికదా! అది శ్రవణంవల్ల సాధించవలసివుంటుందే? అవన్నీ యెవరిక్కావాలి? ఏదోవిధంగా సాధించడమేకావలసింది. - శాస్తాన్ని వుల్లంఘించి చేసేపనికి మళ్లా ఈ విషయంలో శాస్త్ర ప్రతిబంధక మెందుకు? ఆ పక్షంలో యెవరికీ వచ్చేదీలేదు యేమీలేదుగాని ఆవేదం మాత్రం చెడుతుంది. దీన్నిబట్టి ఆలోచిస్తే ఈమూమెంటు వేదంపాలింటికి యీతిబాధగానే కన్పిస్తుందిగదా! ప్రస్తుతకాలంలో దేన్ని పడితే అదే యీతిబాధగానే కన్పిస్తుందే! పూర్వం విశ్వామిత్రసృష్టి అంటూ చెప్పకోవడం. అవి యివే అంటూ ఆకాశంమీంద యేవో కొన్ని నక్షత్రాలు కనపరచేవారు. భూమిమీంద ఆ విశ్వామిత్ర సృష్టిబాపతు పదార్థాలేవో వివరంగా తెలియదు. ఆవులకు గేదెలనిన్నీ, హింసకు పావురాలనిన్నీ పెద్దలు కొన్నిటిని చెపుతారు. మిరియాలకు మిరపకాయలు విశ్వామిత్ర సృష్టిగానే చెపుతారు. యిటీవలికాలంలో జరిగిన విశ్వామిత్రసృష్టి చాలావుంది. దానిలో కాళ్లనడక్కి బదులు సైకిళ్లనడక వగయిరాలు. వీట్లవల్ల యెన్నో వుపకారాలయితే లేకపోలేదుగాని గజానికీ అరగజానికీ కూడా దీనిమీదేగాని సొంతకాళ్లతో నడవడం యెఱంగనివాళ్లను చూస్తే యేమిటో యిబ్బందిగా కనపడుతుంది. దీనివల్ల కొన్ని వ్యాధులు పుడతాయంటారుగాని పుడితే పుట్టనివ్వండిగాని దీని వుపయోగం, అందులో వైదీకంలో తుట్టతుద జరిగే కర్మ చేయించేవారికి పట్నవాసాలలో వున్న వుపయోగం యింతా అంతా అని చెప్పడానికి వీలు కనపడదు. నేను బందరులో వుండేరోజులనాఁటికి ΟΟΟΟS9 లౌక్యవృత్తిలో వుండే పూర్వరీతివారుకూడా యేదో గుఱ్ఱబ్బందో, యొద్దు బండో యొక్కి వారివారి గమ్యస్థానానికి చేరడానికే యిష్టపడేవారుగాని దీన్ని యొక్కడానికి సంకోచపడేవారు. సుమారు రెండుమైళ్ల దూరాన్నుంచి హిందూ హైస్కూలుకు రావలసిన హెడ్మాస్టరుగా రొకరుండేవారు. ఆయన తఱచుగా నడిచే వచ్చేవారు. కొందఱు ఆయన్ని“మీరు సైకిలుమీంద వెళ్లరాదా?” అంటే?- “సైకిలుమీఁద నేను బయలుదేటితే అంతా నన్నుచూచి నవ్వుతారు" అని జవాబు చెప్పడం నేను యెఱిఁగిందే. ఆ రోజుల్లో దీన్నిగూర్చి వక అవధానంలో అడిగేటప్పటికి యీ పద్యం చెప్పాము శా. “నీరుం గోరదు గడ్డినద్ద దొక కొన్నే నుల్వలన్ వేండ దే వారే నెక్కినం గ్రిందం ద్రోయం దొకండుం బజ్జన్ భటుం డుంట కూరంగా వల దౌర! బైస్కిలునకున్ గోప మ్మొకింతేని లే దౌరా! వాజికిం (గుల్జానికి) దుల్యమైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో?" (అప్పటికి సైకిలు అనేపేరు దీనికి వున్నట్టు నాకు తెలియదు. బైస్కిలు అనే వినడం.) దీన్ని విన్నవారిలో కొందఱు శంకించారుగదా! “యెందటో దీన్ని యొక్కేవారు పడడమూ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోడానికి పడివుండడమూ అనుభూతంగా తెలుస్తూవుంది. మీరీలా చెప్పారే?” మన్నారు. దానికి సమాధానం-అది దాన్ని యొక్కేవాళ్ల తెలివితక్కువగాని ఆసాధనం చేసే పనికాదని జవాబు చెప్పాము. యీ శంకల కేమిటి? చెప్పేవాండుంటే అడుగుతూనే వుంటారు. యింకా దీనిలో- “నీటిన్” అనక నీరున్ అన్నా రేమనికూడా ప్రశ్న మాత్రం యింతవఱకు యెవరూ అడగలేదు గాని అడిగే అవకాశమూ లేకపోలేదు. చెప్పడానికి జవాబున్నూ లేకపోలేదు. యింతకూ కాలినడక్కు కొంతమందికిన్నీ అశ్వాది సాధనాలకి బదులుగా కొంతమందికిన్నీ యిది విశ్వామిత్రసృష్టిగా బయలుదేటింది. అయితే యిది కొత్తరకం యీతిబాధల్లో కెందుకు చేర్చవలసివచ్చిందంటే? సామాన్య సంసారంలో ఆండవాళ్లుకాక మొగాళ్లు యెందఱయితే వుంటారో, అందఱికీ మనిషి వక్కంటికి వొక్కొక్కటి చొప్పన యిది వుంటేనేకాని కాలం గడవడం లేకపోవడంచేత యిదికూడా గృహస్టుకు వకయిూతిబాధే! దీన్ని వకపర్యాయం కొని పడేస్తే అంతతో తీరిపోదు. మధ్యమధ్య బోలెండు మరమ్మత్తులు. అయితే గుట్టానికి బదులుగా దీన్ని వాడుకొనే సంపన్న గృహస్తులకు కొంత దీనివల్ల లాభంవుందంటే వొప్పుకోవచ్చునుగాని ఆపూఁట కాపూCట యెట్లో కాలక్షేపం జరుపుకొనేవాళ్లకి మాత్రం యిది తప్పక వక యీతిబాధే. అన్నింటికీ మించింది యింకోటి కనపడుతూ వుంది. అది “సినిమా”. యీ సినీమా "యెనీమా" మాదిరిగా ప్రతి సామాన్య గృహస్టుకున్నూ వున్నదంతా తుడిచిపెడుతూ వుందనడంలో అతిశయోక్తి లేశమున్నూ కనపడదు. యిది సామాన్య గృహస్టులకు మాత్రమేకాదు; పెద్దపెద్ద సంపన్న గృహస్టులకు కూడా నానావిధాల యీతిబాధ. బాగా ఆర్జించి నిలవచేసిన ప్లీడర్లు వగయిరాల కొడుకులు యొక్కడోగాని మళ్లా తండ్రులమాదిరిని వుద్యోగాదికం చేసి సభ్యత్వాన్ని సంపాదించడం కష్టం. ఆలాటివాళ్లు తండ్రితాతలు సంపాదించిన ద్రవ్యంతో యూ సినిమా “ఫిల్మలు" తయారుచేయించడానికి పూనుకొని 'యెనీమా వల్ల వచ్చేఫలితాన్ని పొందుతూవున్నట్టు వింటున్నాను. అది వర్తకం కనక దానిలో లాభమూ వకప్పడు రావచ్చు, నష్టమూ రావచ్చుననుకొందాం. యితర గృహస్టుల తాలూకు ఆండవాళ్లు యీ ప్రదర్శనాలకు వేలంవెట్టిగా యెగబడడం యేలాటి యీతిబాధో, ప్రతివారికిన్నీ అనుభూతమే కనక విస్తరించి వ్రాయనక్కఱలేదు. యింటిల్లిపాదీ తలుపు తాళంవేసి ఆండాళూ మొగాళూ పసిపిల్ల దేఖీలు సినిమా మహోత్సవానికి వెళ్లడం కనిపెట్టి యిదేసందనిచెప్పి దొంగలు కొంప ‘అయ్యవార్లంగారి నట్టిల్లు చేయడంవల్ల కలిగే హాన్నికూడా గణించనివా రెందటో గృహస్టులు కనపడతారు. కాంగ్రెసు మంత్రులు మద్యనిషేధాన్ని గూర్చి ముందుగా ప్రయత్నిస్తూ వున్నారుగాని అంతకంటే మున్ముందుగా-“ఆదౌ పూజ్యోగణాధిపః" అని సినిమా నిషేధానికి వుపక్రమించడం అవసరమని నాకు తోcచింది. యీ సినిమా సంబంధమైన టిక్కట్లు అంతగా ధనవ్యయాన్ని కలిగించేటట్టు లేదుగాని దీన్నిమిత్తం రాకపోకలకు బళ్లు వగయిరాలు సెట్టిసేరు, లింగం సవాసేరు' అనే లోకోక్తి స్మారకాలుగా కనపడతాయి. స్త్రీలకేమి? పురుషులకేమి? యీ సినిమాలవల్ల అలవడేదుర్నీతి విశేషంగా కనపడుతుంది. కొందఱు యీకథాభాగాలు, సంస్కరించాలనే వారున్నట్టు పత్రికల్లో వుండే రాంతలవల్ల గోచరిస్తుందికాని కల్లుదుకాణాలను సంస్కరించడం యేలాటిదో యిదిన్నీ ఆలాటిదే అనుకుంటాను. యీ బాపతు యితివృత్తాలు కొన్ని పురాణ ప్రసిద్ధాలు లేకపోలేదు. గాని అందులో మధ్యమధ్య నేcటివారు కల్పించిచేర్చేవి యెన్నో దుర్నీతి ప్రధానంగానే వుంటాయి. యెప్పుడో స్త్రీ స్వాతంత్ర్యం రావాలనీ, వస్తుందనీ కొందఱు వుఱూంతలూగుతూ అనుకుంటూ వున్నారుగాని నేను పట్నవాసాల్లో కించిన్న్యూనంగానున్నూ పల్లెటూళ్లలో చాలా న్యూనంగానున్నూ అది యిప్పటికీ వచ్చిందని తలుస్తాను. యెన్నో దుర్వ్యసనాలతో నిండివున్నయీ ప్రపంచాన్ని సంస్కరించడం అంటే, "యెలుంగొడ్డు తంటసప్పని” గానే కనపడుతూవుంది. అట్లని వుపేక్షించడం సంస్కర్తల ధర్మంకాదు. శాయశక్తులా ప్రయత్నించక తప్పదు. యీ దుర్గోషాలన్నీ జ్ఞానంవల్లనే కాని నివర్తించవు. ఆ జ్ఞానం విద్యవల్లతప్ప లభించదు. ఆ విద్యకూడా యీ కాలంలో అనేక యీతిబాధలతో మిళితమై వుండడంచేత యేలా ప్రపంచానికి శ్రేయస్సు కలుగుతుందో? యెన్ని విధాల ఆలోచించినా, ఆలోచనే ^ పాలుపోవడంలేదు. దీన్నిబట్టి చూస్తే ప్రపంచక స్వభావమే అనాదిగా యీలాగు వుందనిన్నీ అది యెవడు యెన్నివిధాల సంస్కరించినా స్వస్వభావాన్ని వదులుకోదనిన్నీ తేలుతుంది. కాని పాశ్చాత్యుల బుద్ధి చాకచక్యం మన భారతీయుల లాగ దేని స్వభావాన్ని దానికి వదిలిపెట్టి వూరుకునేది కాకపోవడంచేతానున్నూ, వారిగాలి పూర్తిగా సోఁకిన బుద్ధిమదగ్రేసరులు సంస్కర్తలుగా వుండడంచేతానున్నూ అస్మదాదులకు “యేటి కెదురీందడం” వంటిదిగా తోCచే సంస్కారాలు నెలకొల్పుతూ వున్నారు. వీట్లని కాదనడంకంటె ఆమోదించడమే మంచి పద్ధతి. మనలోకూడా-ఉ. "దైవమనంగ నెట్టిదగు దానిని జూచినవాఁ డెవండు? కార్యావసరంబు పట్ల నలసాత్ములు పల్కెడిమాట గాక!" అని దైవనిర్ణయానికి అనంగా ప్రకృతి శాసనానికి అన్యథాకరించే తలంపు కలవారు పూర్వమందుకూడా కొందఱున్నట్టు గ్రంథ ప్రమాణం కనపడుతుంది. కాని ప్రకరణాన్ని బట్టి ఆలా సాహసించేవారు అసుర ప్రకృతి కలవారుగా కనబడతారు. యింతేకాదు. దైవం మీఁద సమస్త భారాన్నీ వుంచి ప్రవర్తించే మహావిజ్ఞానులుకూడా అంతతోగత్వా-దైవం నిహత్యకురు పౌరుష మాత్మశక్త్యా యత్నే కృతే యది నసిద్ధ్యతి కోలి_త్రదోషః" అని పురుష ప్రయత్నానికే ప్రాధాన్యాన్ని యిస్తూ వచ్చారు. అనేక యీతిబాధలతో చేరివున్న యీ ప్రపంచ దురవస్థను చూచి శాంతి ప్రియులైన నారదాదులు యెప్పటికప్పుడే "కేనోపాయేన చైతేషాం దుఃఖనాశో భవేద్రువమ్ ఇతిసంచింత్య మనసా విష్ణులోక ముపా__ గమత్ (మనకు విష్ణులోకం అంటే లండనే అనుకోవాలి) అంటూ పురాణాల్లో యెంతో ప్రయత్నంచేసి వాట్ల శాంతికై వ్రతాలూ దానాలూ జపాలూ తపాలూ వుపదేశించినట్టు కనపడుతుంది. యిప్పడో? ఆ మార్గం బొత్తిగా ఆదరించేకాలంగా కనపడక కాంబోలు, యేయేవస్తువులు యీతిబాధాకారకాలుగా కనపడుతూ వున్నాయో, ఆయా వస్తువులు దొరకుండా చేయడానికి ప్రయత్నిస్తూ వున్నారు. అందులో మటీ ముప్పగా వున్నదాన్ని మొట్టమొదట యెత్తుకున్నట్టు తోస్తుంది. క్రమంగా నేనిందులో వుదాహరించిన బీడి, సిగరెట్లు, సినిమా లోనైనవాట్లకుకూడా యత్నిస్తారని వ్రాయనక్కఱలేదు. వక్కసిగరెట్లకే కోట్లకొలఁదిగా గృహస్టుల సొమ్మువమ్మవుతూ ವೊವ್ಲಿಲ್ಲು యేపత్రికలోనో చదివినట్టు జ్ఞాపకం. గాంధీ మహాత్ముని దృష్టిలో యివన్నీ యిదివఱకే పడివున్నాయి. అయినానేనిందులో వ్యాఖ్యానంచేయడం చూసూచూస్తూ వూరుకోలేక కాని మటో ప్రయోజనానిక్కాదు. పూర్వులు చూపిన యీతిబాధలకీ యిప్పడు నేను కొత్తగా చూపిన యీతిబాధలకీ కొంచెం భేదం కనపడుతుంది. యివి చేతులో ప్రభుత్వం వుందికనక యే కాంగ్రెస్సుమంత్రులో వారిస్తే వారింపఁబడతాయేమో? అని అనుకోవడానికి వీలుగా కనపడతాయి. అతివృష్టి వగయిరాలన్నీ కాకపోయినా అందులో కొన్ని బొత్తిగా మనుష్యప్రయత్నానికి లోCబడడానికి అవకాశం లేనేలేనివి. లేనివెంత | సాధ్యపడతాయో వున్నవీ అంతే సాధ్యపడతాయని, కొందఱయితే అంటారు. కాని అట్టనిచూస్తూ వూరుకోవడం ప్రాజ్ఞలలక్షణంకాదు. శంకరాదులు వారి జీవితమంతా పారమార్థికంలో వినియోగించుకొన్నారు. సరే అంతతో తృప్తిపడి వూరుకోలేదుకదా! లోకకల్యాణం కోసమని వారివారి అభిప్రాయాలు గ్రంథరూపంగా స్థిరీకరించికూడా ప్రయత్నించారు. దానివల్ల అంత ప్రపంచమూ కాకపోయినా యేకొంతో అప్పడే కాకుండా యిప్పడుకూడా పారమార్థికాన్ని నేర్చుకుంటూ ఉంది. ఆలాగే యిప్పటి సంస్కర్తల ప్రవృత్తులున్నూ యేకొంతమందికో వుపకరించి తీఱతాయని చెప్పకతప్పదు. కేవలమూ శంకరాదులలాగ నీతిబోధచేయడం మాత్రమే కాక ప్రభుత్వం చేతులో వుండడంవల్ల దాన్నికూడా దీనికి జోడించిపనిచేస్తూ వున్నారు కనక– “దండం దశగుణం భవేత్" అనే అభియుక్రోక్తి సార్థకమై పూర్వపు సంస్కర్తల ప్రయత్నంకన్నాయిప్పటి సంస్కర్తల ప్రయత్నం యొక్కువగా జయప్రదమై లోకకళ్యాణ దాయకం అవుతుందేమో అని తోస్తుంది. శంకరాదులుకూడా దుర్నీతినివారణానికి అప్పటి ప్రభువుల తోడ్పాటును కైకొన్నట్టే చరిత్రజ్ఞలు చెపుతూవుంటారు. విద్యాధికుల విషయంలో చేసే సంస్కారాల కంుతే దండోపాయ సహాయ్యంతో పని వుండదుగాని తదితరులను సంస్కరించవలసి వస్తే కేవల నీతివాక్యోపన్యాసాలు పనిచేయవని వ్రాయనక్కఱలేదు. అప్పుడే మద్యనిషేధం ప్రారంభించిన సేలం జిల్లాలో యెందటో తాగుబోతులు ఆదురలవాటుమాని దానిఫలితాన్ని గ్రహించి తమతమ అభినందనాలు సంస్కర్తలకు తెలుపుతూ వున్నట్టు పత్రికల వల్ల నైతే తెలుస్తుంది గాని యీ పత్రికల వ్రాఁతలు వారివారి పక్షగతాభిప్రాయాన్నిబట్టి వుంటూ వుండడం ప్రాయశః కనపడడంచేత పూర్తిగా విశ్వసించడానికి అవకాశంలేదు. వ్యతిరేకాభిప్రాయం కల వకపత్రిక వకమద్యపాయి యింకా నిషేధం అమల్లోకి రాకపూర్వమే ఆత్మహత్యవల్ల ప్రాణాన్ని గోల్పోయినట్టురాసిన రాంతకూడా చదివాను. భవతు. దానికేమి? యేమైనా పూనినపూనికి మంచిది. యిది నెగ్గితే మటి కొన్నింటికి వారు పూనడానికి వారికి వుత్సాహం కలుగుతుంది కనక దీన్ని నెగ్గించవలసిందని లోకం భగవంతుణ్ణి ప్రార్థించవలసివుంటుంది. యేలాగో పడమటిగాలిద్వారా మన భరతఖండంలో యీ శతాబ్దంలో వ్యాపించిన యీతిబాధలు తొలంగితే తప్ప సామాన్యగృహస్టులు జీవయాత్ర గడపడం పొసంగనే పొసంగదనే నిశ్చయంతో నేను ఆయాయి యీతిబాధలను యిచ్చట పేర్కొనవలసివచ్చింది. యిందులో కొన్నిగాని, అన్నీగాని ఆహ్లాదకరాలంటూ వాదించే వారుంటారనిన్నీ యెఱుంగుదును. ఆలా వాదించే ఎడల మద్యంకూడా ఆహ్లాదకరమే అని అంగీకరించవలసి వస్తుందికదా! లోలంబరా జీయం అనే వైద్యగ్రంథంలో దుఃఖనివారణకు మందేమిటంటూ ప్రశ్నించుకొని దానికి మద్యపానాన్ని మందుగా వ్రాశాఁడు గ్రంథకర్త. కూసుమతం అనే \ వామాచార వైష్ణవమతంలో చనిపోయినవాళ్ల దినవారం తుట్టతుదను చాత్తాని వైష్ణవులున్నూ చనిపోయిన వ్యక్తితాలూకు బంధుమిత్రులున్నూ యధేష్టంగా మద్యాన్ని సేవించడం యిప్పటికిన్నీ ఆచారంగా జరుగుతూ వుంది. దీనిపేరే “తొళ్లకం" అంటారు. దీనిపేరునుబట్టి విచారిస్తే యీ ఆచారము అఱవదేశం బాపతని తేలుతుంది. దీన్నిబట్టి యిది దుర్వారమైన దుఃఖాన్నికూడా పోఁగొట్టే శక్తికలదని యేదో వకమతం వారు భావించడం కనపడుతూ వుందిగదా! అయినా సేవించిన ಪಿಮ್ಮಿಟು దీనివల్ల కలిగే చెడుగులు ఎక్కువగా వుండడంవల్ల దీన్ని సేవించిన వాఁడు పంచమహాపాతకులలో వకండుగా పరిగణింపCబడ్డాండు. పాతకం మాటకేంగాని ప్రత్యక్షంలో యీపానం సంసారికి అన్ని యీతిబాధల కన్నా యొక్కువ యీతిబాధగా కనబడుతుంది. యిట్టి పాతకకార్యాలు చేయించేవి గాకపోయినా సిగరెట్లు వగయిరా లోcగడ నేను వుదాహరించినవన్నీ యీతిబాధలనడానికి సంశయంలేదు. ఇవి అనాదిగా అపరిహార్యాలుగావున్న యీతిబాధలేమో అంటే, ఆలాటివికావు. యితరదేశ సంపర్కంవల్ల మనదేశానికి రవాణా అయి యీ దేశాన్ని ఆరోగ్యాన్నీ భంగపఱిచి యితరదేశాన్ని పోషించడానికి వుపయోగ పడుతూ వున్నాయి. కనక సంస్కర్తలకు భగవంతుండు తోడ్పడి యీదేశ కల్యాణాన్ని సంపాదిస్తే యెందటోగృహస్టులు సంతోషిస్తారు. అమితవ్యయం తగ్గుతుంది. ధనాఢ్యులు వీట్ల నిషేధానికి తోడ్పడరు కాCబట్టి దీనివల్ల వచ్చే ముప్పసామాన్యులకు ఏలాగా తప్పదు. దీనికి వక విధమైననైతికశక్తి సామాన్య గృహస్టులలో అంకురించడమే వుపాయం. అట్టి మహాభాగ్యం సామాన్య గృహస్టులకుకూడా సర్వేసర్వత్ర కలగడమనేది చిత్తశాంతివల్లనే గాని అన్యథాగా కలగదు. అట్టి చిత్తశాంతి కలిగేయొడల యీ "కల్పనారుచు"ల యందుండే వ్యామోహం తగ్గుతుంది. కాని అదిచాలా దుర్ఘటం. దానికై పత్రికలున్నూ వుపన్యాసకులున్నూ శాయశక్తులా ప్రయత్నించవలసి వుంటుంది. యీ అభిప్రాయము నాకిప్పుడు కలిగింది మాత్రమే కాదు; యిప్పటికి సుమారు నలభైయేళ్లనాండే కలిగింది. దాన్ని మా మొట్టమొదటి కామేశ్వరీశతకంలో వుదాహరించి కూడా వున్నాను. ఆ పద్యాన్ని యిక్కడ వుటకించి దీన్ని ముగిస్తాను మ. “అనుమానింపక కల్పనారుచులపై నాసల్ పిసాళించునె మ్మనముం ద్రిప్పఁగలేక దుర్విషయముల్ మన్నించుచున్సాధు స జ్జనసాంగత్యము వీడినట్టి పరమాజ్ఞాని ననున్ శుద్ద వ so ఇ+ ெ ర్తనకుం దార్చిన నీకృపారస మపారం బంబ! కామేశ్వరీ!"
★ ★ ★