కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/ఈతి బాధలు
ఈతి బాధలు
శ్లో “అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభా శ్శుకాః
అత్యాసన్నాశ్చరాజాన షడేతా ఈతయ స్స్మృతాః"
అంటూ ఈతిబాధలను పూర్వులు ఆటింటినిగా పరిగణించివున్నారు. యీ ఆఱింటిలో ప్రతివొక్కదానిలోనున్నూ మటికొన్నింటికి అంతర్భావం చెప్పవలసివుంటుంది. ఆలా చెపితే దొంగలబ్లాధ, దోమలబాధ, రోగబాధ, వగయిరాలుగూడా కలిసివస్తాయి, అసలు శ్లోకానికర్థం వ్రాసి వ్యాఖ్యానం చేస్తాను
'అతివృష్టి' అంటే అబిసీనియాలోలాగ విశేషించి యెప్పడూవరాలు కురియడం. దీనివల్ల ముఖ్యంగా ఆ చెట్టునీడనూ ఆ చెట్టునీడనూ సంసారాన్ని వెళ్లంబుచ్చుకొనే ఆగర్భభిక్షాటన జనమున్నూ, పశువులున్నూ, పక్షులున్నూ మిక్కిలీ కష్టపడవలసివస్తుంది. వ్యవసాయానికికూడా యిది చాలా అపకారకమే కాబట్టి లోకానికి యిది మిక్కిలీ పీడాకరమని వేటే చెప్పవలసివుండదు. 'అనావృష్టి అంటే? దత్తమండలం వగయిరా ప్రదేశాలలోలాగ అసలే వరాలు యెగేయడం. అతివృష్టివల్ల వచ్చే చిక్కులవంటివే దీనివల్లా కొన్ని వస్తాయి. కనక విస్తరించేది లేదు. "మూషకాః దీన్ని గుఱించి వ్యాసాంతమందు విస్తరించ తలంచి యిక్కడ వ్రాయలేదు. శుకాః’ చిలకలు. చిలకలంటే? వక్క చిలకలే అనుకోనక్కఱలేదు. తల్లక్రిందులు పక్షులు వగయిరా మణికొన్నింటినికూడా వీట్లతోపాటు చూచుకోవాలి. యివి పూర్తిగా తల్చుకుంటే ఫలజాతిని సర్వాన్నీ వొక్కరోజులోనే నాశనంచేసి మనుష్యజీవితాన్ని సాగనియ్యవు. అన్నట్టు శలభాః అనే పదం యెత్తుకొనేలేదు. "రొట్టెకు రేవేమిటి?" అదిన్నీ టెక్కలతో యెగిరేదే కనక చిలకలు వగయిరా పక్షిజాతిలో అంతర్భావం చెప్పినా చెప్పవచ్చు. పక్షిజాతికంటేకూడా యీమిడతజాతి సస్యనాశనానికి పెట్టింది పేరు. “మిడతల దండు" అంటూ పెద్దలు చెప్పకోవడమేకాని యిప్పటికి సుమారు 25 యేళ్లకుపూర్వం నేను వీట్లనుగుఱించి యెఱంగనేయెఱంగను. 25 యేళ్లనాండు కోట్లకొలదిగానో అర్బుదాలకొలది గానో మిడతలు బాగా లొడితెండేసి ప్రయాణంలో వున్నవి మనజిల్లాలు కొన్నింటిని ఆక్రమించి ఆకాశంమీంద వున్నంతసేపు సూర్యరశ్మినిన్నీ భూమిమీంద వాలినంతసేపు సర్వసస్యాలనున్నూ మటుమాయంచేసి భగ్గంపాడుచేసి వదలిపెట్టాయి, అవి సంచరించి \ నంతల్లో దేశములో వున్న చేలన్నీ ‘అయ్యవార్లంగారి నట్టిళ్ల క్రింద మాటిపోయాయి. కాని వీట్ల జీవితమంతా కలిపితే సుమారు 24 గంటల కాలం కంటే యొక్కువ వున్నట్టులేదు. యిది యెందుకు పుట్టవలసి వచ్చిందో? అంతల్లోనే యింతటి లోకాపకారానికి హేతుభూతాలై వెంటనే నశించడాని కారణమేమో? అని ప్రశ్నవేసుకుంటే మాత్రం జవాబు సుఖసుఖాల తేలదు. యొక్కువ పరిశీలనతో ఆలోచించిచూస్తే మనుష్య జీవితానికి మాత్రం యింతకన్నప్రయోజన మేం కనబడుతుంది? అందులో స్వోదర పోషణకోసం పరాపకారమే నిత్యవ్రతంగా ప్రవర్తించే వాళ్ల జీవితాన్ని గుఱించి వేటే చెప్పనే అక్కఱలేదు, అందులోనున్నూ పూర్వజన్మకృత సుకృతంవల్ల యేదోరాజకీయాధికారం పట్టి, ఆ అధికారాన్ని లంచగొండితనం కింద వినియోగపఱిచే పుణ్యజనులు యీ మిడతల జీవితంతో తమజీవితాన్ని పోల్చి చూచుకుంటే వెంటనే ఆదుర్వృత్తి వదలకపోయినా కొంత పశ్చాత్తాపమేనా కలిగితీరుతుం దనుకుంటాను. వీట్లని యిందుకోసమే భగవంతుడు లోకానికి పంపివుంటాండేమో? మిడతలదరీడు 25 యేళ్లనాడు చూడడమైంది. రామదండు సుమారు 50 ఏళ్లకు పూర్వం చూచాను. అది యొక్కడ పుట్టిందో తెలియదు. వొకవూరునుంచి యింకోవూరు రావడమున్నూ, వచ్చేటప్పడు తోవపక్కనువుండే చెటూ చేమలూ విఱిచి పాడుచేయడమున్నూ చూస్తే రామదండు అంటే కోంతులు కనక ఆపేరు సార్థకపఱచడంగా కనపడింది. ఆయాగ్రామాల్లో సంతర్పణలూ సమారాధనలూ అనుభవించడం, ఆవూరివాళ్లద్వారా యింకోవూరు సమీపంలో వున్నది వెడుతూ వుండడం యిదే ప్రకారం "గతానుగతికంగా కొన్ని మాసాలు జరిగింది. దీనిలో వక్క విశేషం మాత్రం వుంది. శ్రీరామనామస్మరణ. యిది అంటే యీ దండు చివరకు యేవూల్లో అంతరించిందో మాత్రం తెలియలేదు. యొక్కడపుట్టిందో? అంతకుముందే తెలియదు. దండుశబ్దసామ్యం వుండడంచేత దీన్ని యిక్కడ వుటంకించవలసివచ్చిందే కాని అంతో యింతో వీథి పక్కని వుండే చెట్లకొమ్మలకు తప్ప యితర సస్యాలకు మిడతల దండువల్ల కలిగినట్టు యీ దండువల్ల లేశమున్నూ నష్టం కలిగినట్టు లేదు. యింక "అత్యాసన్నాశ్చ రాజానః" అంటే? మిక్కిలీ సమీపంలో, అనంగా తన యింటికి దగ్గిఱగా వుండే రాజులు లేదా? రాజానుగ్రహపాత్రులైన రాజపురుషులు. వీరు కూడా యీతిబాధలలోకే చేరతారా? అంటే? వినండి. त्७० చిన్నతనంలో పదేళ్లవయస్సుపిమ్మట సుమారు వక పుష్కరకాలం ఫ్రెంచిటవును యానంలోనే వెళ్లింది. ఆ వూల్లో కీl శే శ్రీ మన్యం మహాలక్ష్మమ్మ జమీందారురాలు నివాసంగా వుండడంవల్ల యెన్నో వైదికానికి సంబంధించిన పుణ్యకార్యాలు వారి మేడకు ఎదురుగా వుండే సత్రంలో తఱుచు జరుగుతూ వుండేవి, వేదంలో ప్రసిద్దులైనవారు వచ్చి నవరాత్రోత్సవాలల్లో శ్రావ్యంగా స్వస్తివగైరాలు పరస్పర గాత్రాలుకల్పి ఉచ్చైస్వరంగా - -- །---- o* i- చెపుతూవుంటే తెలిసినా తెలియకపోయినా విని సంతోషించడానికి బదులు ఆ సమీప గృహంలోనే నివాసంగా వుండే పోలీసుశాఖాధికారి ఆ వేదఘనోష తనకు నిద్రాభంగానిక్కారణ మయిం దంటూ “లీగల్గా నిషేధించడం నేను బాగా యెఱుఁగుదును. అత్యాసన్నులు రాజులుగా వుంటే వుండే చిక్కు కొంచెంమాత్రం సూచించాను. దీన్నిబట్టి యింకా వుండే చిక్కులను చదువరులు వూహించుకోలేకపోరు. పూర్వరాజుల ప్రభుత్వాన్ని కవులు వర్ణించేటప్పుడు నీరీతి’ పదంతో వర్ణించడం అందఱూయెఱిఁగిందే. యీతిబాధారహితంగా ప్రభుత్వం వుందంటే ప్రజలుమిక్కిలీ సుఖిస్తూవున్నారన్నమాటే. అయితే అతివర్షాదిబాధలు దైవికాలు గదా, వాటిని రాజు తొలంగించడం యేలా గంటూ సూలదృష్టులు శంకిస్తారేమో కాని అందుకు శాంతిక్రియలు చేయించినట్లు గ్రంథ దృష్టాంతాలుకొన్ని కనపడతాయి. యింక మిగిలిందల్లా మూషకబాధ. పందికొక్కులుకూడా వీట్లలోనే అంతర్భావంగా చూచుకోవాలి. యిప్పడేమో వీట్లవల్ల ప్లేగుజాడ్యం వృద్ధిచెంది ప్రజానాశకంగా పరిణమించడంచేత ఆయాప్రదేశాలల్లో వీట్లని మారణంచేయడం జరుగుతూ వుంది. వెనుకటి కాలంలో వీట్ల బాధ ఏలా నివారించు కొనేవారో తెలియదు. మనుష్యులలో కలిసి మెలిసి తిరిగే జంతువులలో యింత కొంటె జంతువులేనేలేదని నాకుతోస్తుంది. ఆహారానికిపాట్లు పడడం ప్రతిప్రాణికిన్నీ తప్ప దనుకుందామంటే నిర్ణేతుకంగా చక్కనిపుస్తకాలు కొటికి పాడుచేస్తుందిగదా! యీ పనికిమాలిన జంతువు. అది కొంటెతన మనుకుందామా! లేక యేదో కొఱుకుతూవుంటేనేకాని దానికి కాలక్షేపం కాదనుకుందామా! యిందులో పందికొక్కు జాతివుందా? దానిశక్తి మటీ అద్భుతం. దాని కోఱలకల్లాలొంగనిది యినుమున్నూ గట్టిజాతి రాయిన్నీ కనపడుతుంది. కఱ్ఱజాతిలో శ్రేష్టమయిందిగదా? అని కొంచెం పచ్చగావున్న సంసారులు కిటికీలూ ద్వారబంధాలు తలుపులూ టేఁకువి చేయించుకొంటారు. యీ పందికొక్కులు ఆజాతికఱ్ఱను అప్పడంకన్నా తేలికగా కొటికి తనకు కావలసినంతద్వారాన్ని కల్పించుకుంటుంది. మాగ్రామంలో వున్నయిళ్లల్లో మాయిల్లుచాలా కట్టుదిట్టమయిందని అంతా అనుకుంటారు. యెలకలు మా యింట్లోవున్నన్ని యొక్కడాలేవు. వాట్లనియింట్లో ప్రవేశించకుండా కట్టుదిట్టంచేయడానికి వుపాయంలేనేలేదు. వాట్లకుసమృద్ధిగా తినడానికి ధాన్యం వుండడంచేత అవి మాయింట్లోచేస్తూవున్న హంగామాకుపరిమితే కనపడడంలేదు. కిందనుంచి కిటికీలోకి యెగరడానికి మధ్యమకాంగా ఆసమీపంలో మడత మంచంమీంద పడుక్కున్న నన్నే యేర్పఱుచుకున్నాయి. పుస్తకాల బీరువాలల్లో ప్రతిరోజున్నూ వీట్లకుసంబంధించిన పురుళ్లు జరుగుతూనే వుంటాయి. యింటిచూరులనిండా వీట్లకలకలధ్వనే వినపడుతుంది. సరంబీమీఁద వీట్ల చెడుగుడియాటల ధ్వని కొత్తవాళ్లకు కొంత భయంకరంగాకూడా కనపడుతుంది. మాకు జతపాటుగా \ వుండడంచేత నిద్రాభంగం వగయిరాలు కలగడంలేదు. కొందఱు బోనులు పెట్టివీట్లని పట్టించి తగ్గించాలని ప్రయత్నంచేసి విఫలమనోరథులు కావడంనేను స్వయంగానే యెటింగివుండడంచేత ఆ ప్రయత్నంయొప్పుడూ చేయలేదు. ప్లేగువ్యాధి గోదావరిజిల్లాకు భగవదనుగ్రహంవల్ల యింతవఱకు సోఁకకపోC బట్టిగాని సోంకే యెడల వీటి బాధ గ్రామపారిశుద్ధ్యంకొఱకేర్పడ్డ సంఘం వారు యేదేనా వుపాయంచేసి తగ్గించే వారేమో? వీట్ల అభివృద్ధికి పరిమితే కనపడడంలేదు. పంచాంగాలల్లో వుండే వృద్ధి క్షయాలు సరిపోవడంలేదు. క్రమంగా " మాయింట్లో మాకోసంనిలవచేసుకున్న ధాన్యంలో భాగస్వాములుగా యివియేర్పడ్డాయి. వీట్ల బాధ పడలేక యెంతో కట్టుదిట్టంగా వేలే వకగాదె కట్టిస్తే కట్టించినన్నాళ్లేనా పట్టలేదు. దాన్ని కుచేలుని వస్త్రంకన్నా మిన్నగా జల్లెడతూట్లతో చిత్రించి వదిలిపెట్టాయి. యిప్పడు వీట్లల్లో పెద్దజాతి పందికొక్కులు కిటికీలను పూర్తిగా చిత్రికపట్టు పడుతూవున్నాయి. యిదంతా మనఅహింసా పరత్వానికి ఫలితం అనుకోవలసిందేకాని మతేమనుకోవలసింది? ఆమధ్య యీబాధ పడలేక వకవూల్లో వకగృహస్టు మంచిచెడ్డ లెటింగినవాండే యింతపాషాణం తెచ్చి కోడలికో కూCతురికో యిద్దటికో యిచ్చేటప్పటికి దాన్ని పెరుగుఅన్నంలో కలిపి వకచోట పెట్టేటప్పటికి ఆపందికొక్కులుతిని గోండ్రిసూపరమపదించే ప్రయత్నంలో వుండడం ఆయింట్లోనేవుండే వకముసలివృద్దుచూచి యిదేమిటని ప్రశ్నించేటప్పటికి గతంలో జరిగిన విషయం చెప్పేశారు ఆయజమానురాండ్రు. అదివిని ఆయన ‘పిల్లాజెల్లాతో కాపురంచేసేవాళ్లం మనం యీలాటి పని చేయవచ్చునా?” అని మందలిస్తేవాళ్లు - "దుష్టజంతువును చంపితే పాపంలేదని జవాబుచెప్పారంట! యివి పాములూ తేళూ వగయిరాల వలె దుష్టజంతువులు కావుగదా! అంటే? “పాములుమాత్రం అన్నీ దుష్టజంతువులా? కొన్ని అంటేబురదపాములు నీరుకట్టెలు వగయిరాలకు విషంవుండనేవుండదు: ఆకారసామ్యాన్నిబట్టేవాట్లని చూచికూడా భయపడుతూవుంటారు. ఆలాగే యీఎలకలలోకొన్ని విషజంతువులుగా వుండకపోయినా కొన్ని విషజంతువులున్నూ వుండడం సుప్రసిద్ధమే. అవికటిస్తే వెట్టికుక్కవెట్టినక్కలతోపాటు చిక్కుతేవడం అందఱూయెఱిఁగిందే వెట్టి కుక్కలకూ వెట్టినక్కలకూ అంటే వీట్లకాట్లకు తరుణంలో అయితే నీలగిరిలో అవ్యాహతంగా కుదిర్చే వైద్యశాల రాజకీయమైనది వకటివున్నట్టు వినబడుతూంది. గాని యొులకకాటుకు అట్టి ఆధారంకూడా వున్నట్టులే" దంటూ ఆ యజమానురాండ్రు జవాబు చెప్పేటప్పటికి ఆ ముసలాయన జవాబు చెప్పలేకవోహో వీళ్లుధర్మసూక్ష్మాలు యెటింగినవాళ్లుకారు. యెప్పడో మనకి కూడా వీళ్లీలాటి వుపాయం చేస్తారు. యేమంటే? అవి వృథాగా చావల్ ఖరాబు చేసినట్టేనేనున్నూ చేస్తూ వున్నట్టు వీళ్లకు తోస్తే గతేమి? టనిచెప్పి ఆస్థలాన్నుంచి మటోస్థలానికి మకాంమార్చుకొన్నట్టు i
- Taجي-o
ఆయనేచెప్పగా విన్నాను. అహింసాతత్త్వం తెలుసుకోవడం మిక్కిలి దుర్ఘటంకదా! పూర్తిగా కృతకృత్యులయితే కాలేదుగాని యిందుకోసం ప్రయత్నించేవారు భారతీయులే. అందులో బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులలో “శ్లో 1. ఆంధ్ర, 2. ద్రవిడ, 3. కర్ణాట, 4. మరాటా, 5, ఘూర్ణరా స్తథా, 1. సారస్వతాః, 2. కాన్యకుబ్దా, 3. గౌడా, 4. ఉత్కల, 5. మైథిలాః" అనే దశవిధ బ్రాహ్మణులలోనున్నూ మొదటి అయిదు తెగలవారినీ పంచ ద్రావిడులనిన్నీ రెండో ఐదుతెగలవారినీ పంచగౌడు లనిన్నీ అంటారు. యిందు మొదటి ద్రావిడతెగవారు బొత్తిగా మాంససంబంధంగాని మత్స్య సంబంధంగాని ఎఱంగనివారు. గౌడులందఱున్నూ మత్స్యభుక్కులు. వారికి కులాచారమేమో, మత్స్యభక్షణంవరకే అభ్యనుజ్ఞనిస్తుంది కాని అందులో యెవరో శిషులమాటచెప్పలేంగాని తక్కినవారు మాంసాశనానికూడా అలవాటుపడ్డవారే అనివినడం. ఆయా ద్రావిడపంచకంలో యేమి, గౌడపంచకంలో యేమి అంతర్భావం చెప్పకోCదగ్గబ్రాహ్మణులు చాలామంది వున్నారు. ఉత్కళ బ్రాహ్మణులలో బంగాళీలకు అంతర్భావం చెప్పవలసివుంటుంది- మందసాలో వుత్కళ బ్రాహ్మణులవాడలో మహాపండితులనంబడే శ్రీ విద్యా భూషణంగారి గృహబహిర్వేది మీంద ఆయనతో యేదో ముచ్చటిస్తూ కూర్చున్నప్పడు ఆ వీథిని మనవైపున శూద్రవాడలో మోస్తరుగానే చేయలమ్మకొనేవాళ్లు రావడం చూచేటప్పటికి నాకేమో విడూరంగా కనపడి మనస్సులో దాcచుకోలేక నేను- “అయ్యా! మీరు మహా విద్వాంసులుగదా! యిది మీకు హేయంగా తోంచదా? దీన్ని మీ రెందుకు వర్ణించలేదు?” అని ప్రశ్నించాను. దానిమీంద ఆయన- "నేనెన్నండూ దీన్ని ముట్టను కాని యింట్లో ఆండవాళ్లు వగయిరా భక్షిస్తారు.” అనిచెప్పి మళ్లా అన్నారుకదా "అయ్యా! మీరు దీన్ని వర్ణించి యెన్నాళ్లయిం?” దన్నారు. అంటే ఆయన వుద్దేశంలో “మీరు" అనేది నన్ను మాత్రమే వుద్దేశించినమాటకాదు, మీ పంచద్రావిడమున్నూ, అనే తాత్పర్యంలో వుపయోగించినమాట. దానికి నేను తగిన జవాబు చెప్పలేకపోయాను. మనకు దొడ్లల్లో గుమ్మడి, ఆనప, పొట్ల, బీర పాదులు మాదిరిగానే వంగదేశంలో వారివారి పెరళ్లల్లో మత్స్యాలు ఫలించే బావులుంటాయని చెప్పఁగా విన్నాను. నవద్వీపం చదువుకొనడానికి వెళ్లిన మన పంచద్రావిడ విద్యార్థులు బంగాళీ గురువులకు బజారునుంచి మత్స్యాదులు కొని తెచ్చిపెట్టడంమట్టుకు అప్పుడప్పుడు తటస్థిస్తూ వుంటుందని కీ|| శే శ్రీమాన్ సముద్రాల వెంకటప్పలాచార్యులవారు చెప్పంగా విన్నాను. అయితే ఆయీ మత్స్యమాంసభక్షకులైన వారిలో కూడా భక్షించే జంతువుల విషయంలో తప్ప యితర జంతువిషయంలో చాలాదయాంతఃకరణులు కనపడతారు. శ్రీ నూజివీటి నారయ్యప్పారావుగారు (శ్రీరామచంద్రాప్పారావు గారి ప్రథమ పుత్రులు) వేంటలో మిక్కిలీ నేర్పరులు సమర్డులున్ను యీయన వకరోజున బోనులోపడ్డ యొలకలను జాగ్రత్తగా వూరివెలుపల వదిలిపెట్టి రావలసిందని నవుకర్లకు ఆజ్ఞాపిస్తూవుంటే నేను"అయ్యా! మీరు స్వయంగా యెన్నో జీవాలను పశుపక్ష్యాదులను వేంటలో సంహరిస్తూ వుంటారుగదా! యీ యొలకల విషయంలో యింత దయచూపడం అక్కజంగా వుందన్నాను. దానిమీంద ఆయన వేంటలో వున్నప్పడు మాకు గుఱికి సరిగా ఆనడం తప్ప యితర విషయం లేశమున్నూ తట్టనే తట్టదనిన్నీ యితరత్రా మీరెంతో మేమున్నూ అంతే అనిన్నీ Ꮛ8Ꮌ❍PᏋᏇᏇ చెప్పారు. కాCబట్టి యీ యొలకల విషయంలో యేమి, పందికొక్కుల విషయంలో యేమి అందఱున్నూ బాధకేనా సహిస్తారు కాని చంపడానికి వప్పుకోరు. ఎవశ్లో బొత్తిగా నిమ్నజాతులవాళ్లు మాత్రం పందికొక్కులను తినడం కూడా వుంది. కొందఱు వీట్ల బాధ తొలంగడాని కంటూ పిల్లులను పెంచడం ఆచారంగా వుంది. కాని అంతమాత్రంచేత ఆ బాధ నివారించదుసరికదా! పైCగా వీట్లబాధకూడా తటస్థిస్తుంది. అదిన్నీకాక పిల్లులకు పందికొక్కులు లేశమున్నూ జంకవుకూడాను. పిల్లులవల్ల యొలకలున్నూ ముంగులవల్ల పాములున్నూ లేకుండా పోతాయనుకోవడం పిచ్చిమాట. వాట్లకీ వీట్లకీ పరస్పర వైరమన్నమాట నిజమే కాని అవి వీట్లను పూర్తిగా వారించడం వట్టి కల్ల. అశ్వత్థామ యెప్పడో ఆగ్నేయాస్తాన్ని కాంబోలును ప్రయోగించి దానితో సర్వసైన్యమూ హతమయిం దనుకొని సంతోషించబోయేటప్పటికి మళ్లా కొంత సైన్యం సజీవంగావుండి కృష్ణార్డున సహితంగా యుద్ధానికిసిద్ధపడేటప్పటికి భీ! అని విరక్తితో యుద్ధపరాజ్ముఖుడు కావడమున్నూ పిమ్మట వ్యాసులవారు యేదో బోధించడమున్నూ భారతద్రోణ పర్వంలో అందఱూ చదివేవుంటారు. లోకంలో యెన్నెన్నికలరాలు, యెన్నెన్ని ప్లేగులు, యెన్నెన్ని యుద్ధాలు వసూవున్నాయికావు. అంత మాత్రంచేత జనం పూర్తిగా కాదుగదా, యెన్నోవంతు నశిస్తూవుంది? అసలు నశించడమే లేదని చెప్పగలమా? ఆలాగే ప్రస్తుతవిషయమూ అనుకోవాలి. కాని లోగడ వుదాహరించిన పాషాణప్రయోగం మాత్రం వరసగా కొన్నాళ్లు జరిగితే కొంత శాంతిస్తుందేమో కాని ఆపనికి యే మాత్రం మనస్సంటూవున్నా శుద్ధకటికవాడైనా కూడా అంగీకరించండని వేటే చెప్పవలసివుండదు, బాధకజంతువుల సంహారానికి కూడా కొందఱు స్వయంగా సిద్ధపడరు. యెవళ్లేనా చేసేవాళ్లుంటే వాళ్లకు డబ్బోదస్కమ్లో యివ్వడం మాత్రం వుంది. యీ మధ్య మా వూరిరైతులు లేళ్లవిషయంలో ధనమైతే యివ్వలేదు గాని అలాగే చేశారు. పూర్వమెప్పడో మా గ్రామ పొలాలలో లేళ్లు విశేషించి వుండేవంటూ మాతండ్రులకాలంలో వుండే పెద్దలవల్ల వినడం. లేళ్లు సంచరించే ప్రదేశం పరమపవిత్రమైనదని వేదవేత్తలు చెపుతారు. మోదుగచెట్లు వుండే ప్రదేశంకూడా అలాటిదే అంటారు. దర్భలు వగయిరా వుండే ప్రదేశం కూడా అలాటిదే. ప్రస్తుతం యెప్పడో సుమారు నూతేళ్లనాంటి మాదిరిగా లేళ్లమందలు మాతోంటల ప్రాంతంలో
- \*
v. పెరిగిఁపోయాయి. మావూరి కాపులేమి లంకకాపులేమి వాట్లను స్వయంగా కొట్టడంగాని యితరత్రనుంచి వచ్చేవేంటకాళ్లు కొట్టడానికి అంగీకరించడం గాని లేకపోవడంచేత మందలుమందలుగా పెరింగి పూర్తిగా చేలు నాశనం చేయడాని కారంభించేటప్పటికి తుదకు విధిలేక వ్యవసాయదారులు స్వయంగా వాట్లను కొట్టడమైతే జరగలేదుగాని కొట్టేవాళ్లను వారించకపోవడం మట్టుకు జరిగింది. యీ అహింసాతత్త్వం చాలా దుర్విజ్ఞేయం అని మొట్టమొదటే వ్రాసివున్నాను. వృత్రాసురవధ విషయంలో యింద్రుండికి అంతోయింతో సలహాయివ్వడంలో ఋషులున్నూ వున్నారు. అంత ప్రధానంగా కాకున్నా యే కొంచెమో యితరదిక్పాలకులున్నూ వున్నారు. తుట్టతుదకు యింద్రుండు బ్రహ్మహత్య చేశాండు గనక యీ యింద్రపదవికి అరుండు కాండని ఆక్షేపించి పదభ్రష్టుణ్ణి చేయడంలోకూడా ఆ యీ ఋష్యాదులే కారకులుగా వున్నట్టు కనపడుతుంది. ధర్మప్రతిష్టాదకంగా వుండే సత్కార్యాల్లోకూడా చిత్రవిచిత్రమైన చిక్కులు మన వేదశాస్తాలల్లో కనపడతాయి. యజ్ఞం చేయడమేమో మహా పుణ్యకార్యంగదా! అందులో సోమవిక్రయణం పాపం. ఆ సోమ మంటూ లేకుండా యజ్ఞం సాగదు. ఆ యజ్ఞభేదాలల్లో కొన్నిటిలోనో లేక మహావ్రత మనేదానిలోనో వక బ్రహ్మచారికిన్నీ వక దాసీకిన్నీ ఆ అగ్నిగుండం సమీపంలోనే కొంతయెత్తు ప్రదేశంలో యేర్పఱచిన మంచెమీందే అనుకుంటాను సమాగమం జరగాలంటూ చెపుతారు, యింకా కొంత వ్రాయవలసి వుందిగాని “అనుక్తమన్యతో గ్రాహ్యం" కనక సామాన్య ప్రజలు హేయంగా చూస్తారని వదిలిపెడుతూ వున్నాను. అలాటిహోమం యజ్ఞ పురుషప్రీతికరమై యజ్ఞకర్తకు వత్తమలోకావాప్తి సంపాదకం యేలా అయిందంటే? అది వేద విశ్వాసం వుండేవాళ్ల ప్రశ్నకాదు. వేదములు రాజ సమ్మితాలుకదా! నా చిన్నతనంలో యానాంలోనే పల్లీలతాలూకు వివాహం వకటి దేవాలయంలో జరిగింది. వాళ్లకేమో వివాహంలో హోమాలు చేయడం ఆచారమంటూ వకముసలమ్మ కొంత జరిగాక చెప్పింది. అప్పడు ఆ పురోహితుండు లేంత కొబ్బరిమొవ్వు కావాలని చెప్పేటప్పటికి ఆనిశిరాత్రివేళ క్షణంలో వాళ్లు తీసుకువచ్చారు. ఆ మొవ్వటాకులు స్రుక్కూ స్రువంగా యేర్పటిచి పురోహితుండుగారు ఆముదంతో హోమాలతంతు సాగించారు. కొబ్బరి మొవ్వెందుకంటే? - ప్రభుసమ్మితత్త్వ మనేదే జవాబు. ఆ పురోహితుండు వీళ్లకు నాన్బ్రామిన్సుకు హోమాలేమిటి అనే దురుద్దేశంతో చేశాడనుకుంటే తీరిపోతుంది. ప్రస్తుత దాసీ బ్రహ్మచారి సమాగమవిషయం అలాటిది క్షాదుకదా! దీనిమీంద వేదప్రామాణ్యం వున్నవాళ్లేవళ్లున్నూ ప్రశ్నించడానికి అవకాశం వుండదు. లేనివా? వాళ్లచిత్తం వచ్చినట్టు అడగవచ్చు. వాళ్లకు జవాబు చెప్పేదెవరు? వకాయన యజ్ఞంలో మేంక లోఁకువ జంతువు కనక బ్రాహ్మలు చంపుతూ వున్నారు. పెద్దపులిని చంపవలసివస్తే యీ బ్రాహ్మల పస తెలిసిపోయే' దంటూ అన్నట్టు ఒకరు చెప్పగావిన్నాను. అది పిచ్చిమాట. వేదపురుషుడు పెద్దపులిని చంపి యేదేనా యజ్ఞంలో హోమం చేయవలసిన దని విధించేయొడల దానికి తగు సాధనసామగ్రిమాత్రం శ్రాతులు సిద్ధం చేసుకోలేకపోతారా? వేదంలో యేలావుందో ఆలాగే జరుపుకోవడంకన్న వేటేగత్యంతరం లేదని దానికి సంబంధించిన మీమాంస చెపుతూనేవుంది. అందుచేత ఆ హేయమైన దాసీ బ్రహ్మచారిసమాగమాన్ని నిషేధిస్తే ఆక్రతువు నెఱవేఱదని వొప్పి తీరవలసిందే. పాపం! ఆ దంపతులు ఆ క్రీడాగృహాన్నుంచి యీవలికివచ్చి అందు కేర్పడ్డ దక్షిణతాంబూలాది సత్కారాలతో నిర్గమిస్తూ వుండంగా వారిమీద గోమయోదక సేచనం వగయిరా మర్యాదలు జరుపుతారనికూడా వినడం. అన్నింటికంటే కూడా యీ జంట ధనంకోసం అంగీకరించడం చూస్తే దానికిమించిన దేదిన్నీ లేదని తేలుతుంది. దీనికేంగాని యెంతసరిపెట్టుకుందా మన్నాయినా లజ్ఞాకరమైన కృత్యాన్ని కూడా పరమపవిత్రమైన యజ్ఞములో చేర్చుకోవడానికి వేదార్థ వేత్తలు యేలాసమ్మతించారో అది దురూహంగానే వుంటుంది. వెధవ యొలకలగోలలో నుంచి పెద్దపెద్ద క్రతువుల విషయంలోకి పాంకింది మన వుపన్యాసం. యేమీ? యెందుకు పాంకకూడదంటాను. ఎలకేలాటి జీవమో, మేంకా ఆలాటిజీవమేకదా! మేం కదాంకా యెందుకు? దోమమాటచూడండీ దానిశరీరమెంతో, దానిలో ఉదరభాగ మెంతో, దానిలో వాయువు పుట్టడాని కవకాశ మెంతవుంటుందో, ఆ అవకాశంలోన్నుంచి యేమాత్రంధ్వని పుట్టడానికి వీలుందో ఆలోచించండి! భగవద్విలాసం అనిర్వచనీయం కాకపోతే ఆస్వల్ప జంతువుగర్భంలోన్నుంచి వకవిధమైన - అతిసూక్ష్మమైన సున్నితమైన నాదం శ్రావ్యమైనదే వినపడుతుందిగదా! దీన్ని గుఱించి యే మనుకోవలసి వుంటుంది? (అణోరణీయాన్) అంత శ్రావ్యంగా గానం చేస్తూ చెవిదగ్గఱ నాట్యంచేసే దోమలెన్నో మనచేత చంపఁబడుతూనే వున్నాయి. కాని మన ఆర్యులమతంలో యజ్ఞంలో చంపCబడే పశువుల విషయంలోనే గత్యంతరం కనపడదుగాని యీలాటివాట్లకు వైశ్వదేవమంటూ వొకటి నివారకం కనపడుతుంది. యజ్ఞంలో కావాలని బుద్ధిపూర్వకంగా చేసే పశుహింసను మనవారు హింసలోనే చేర్చలేదు. అక్కఱలేదనుకున్నా తప్పని హింస దోమలు వగైరాలది. నిజమైన అహింసాతత్త్వం అంటే జైనులలో కనపడుతుంది. ఆ మతస్టులు ప్రొద్దుగుంకేలోపునే భోంచేయడంకూడా హింసకు జంకియ్యేవే. సర్వబాధకమైన తేలునుగాని పామునుగాని చంపడానికికూడా ఆమతస్థుండు లేశమున్నూ అంగీకరించండు. అహింసా నిర్వహణంకోసం దంతధావనాది కృత్యాలుకూడా మానిన సన్యాసులు ఆమతంలో వుంటున్నారన్నది ప్రసిద్ధమే. వారు మలినవస్తాలను పరిహరించడమేకాని నీటితో వుతకడంకూడా వుండదు. ఆలావతికేటప్పుడు కొన్నిసూక్ష్మ జంతువులకు హానికలుగుతుందనియ్యేవే. యేవో పూర్వ పక్షాలుచేసి ΟΣΟΦ మతాన్ని మన ఆర్యమతాలవారు ఖండిస్తే ఖడించనియ్యండికాని అహింసాపరమోధర్మ అనే వాక్యాన్ని పట్టి నడిచేవారంటే? వారే కాని మనఆర్యులు కానేకారు. ఇందులో ద్వైతులున్నూ విశిష్టాద్వైతులున్నూ ఆ వాక్యార్థందరికేనా వెళ్లంగలుగుతారు కాని అద్వైతులు చాలా దూరంగానే వుంటారు. యీజైనులున్నూ బౌద్దులున్నూ వేదబాహ్యులుగానే మనవారిమతంలో కనపడతారు. జినుండన్నా బుద్దండన్నా పర్యాయపదాలేకాని పై రెండుమతాలలోనూ యేమాత్రమో అవాంతరభేదం లేకపోలేదు. జపాను చైనాలలో ఆనాండు వ్యాపించిన మతం బౌద్ధమతమే అని తోస్తుంది. ఆమత వ్యాప్తికల్లా ముఖ్యఫలితం అహింస. అది చీనాలో యొక్కడేనావుంటే ఉందేమోకాని జపానులో బొత్తిగాలేదు. యెందుచేత? పడమటిగాలి పూర్తిగా సోఁకడంచేతే, సందేహంలేదు. అందులో ప్రస్తుతం జపాను చైనాలో బాలవృద్ధాతురులనుకూడా హింసిస్తూవుందని పత్రికలలో వ్రాసే వ్రాఁతలు నిజాలేఅయితే బుద్ధభగవానుండికి యీ జపాను శిష్యులవల్ల కలిగేకళంకానికి మితే కనపడదు. అహింసావిషయంలోనే కానివ్వండి. యితర విషయంలోనే కానివ్వండి యేదేనామతమంటూ బోధించవలసివస్తే అది నిరుపద్రవకరంగానే వుంటుంది. తీరా ఆచరణలోకి రావడం తటస్థించాక అది నానావిధాలా మాడి వెట్టితల లేయడానికి మొదలెట్టి తుట్టతుదకు మొట్టమొదటి మూలసూత్రాలకు దూరమైపోయి మతకర్తలను దోషదూషితులనుగా కూడా చేయవలసిందవుతుంది. అంతగా చేదస్తాలకున్నూ పోక బొత్తిగా చేదస్తమంటూ అన్నింటినీ వదలుకోక వకమాదిరిగా కాలక్షేపం చేసుకుపోతే మన ఆర్యమతం పంచ సూనాదోషాలతో కాలక్షేపం జరగనిస్తుంది. యీ దోషాలకు కూడా మనవారు వప్పనేలేదు. యీ దోషాలేవో కొంచెం వివరిస్తాను. “సూనా! అంటే హింస. అది ప్రతిగృహస్టుకున్నూ నాంతరీయకతయాఅంటే యెంత చేయకుండా వుందా మనుకున్నప్పటికీ తప్పనివిధిగా అయిదింటిద్వారా సంక్రమించి తీరుతుందనిన్నీ ఆపాపాన్ని కూడా యేరోజుకారోజు పోఁగొట్టుకోవాలనిన్నీ ఆదోషనివృత్తికై వైశ్వదేవం అనే కర్మని విధించారు. దీన్ని చేసిన వారినే పాకయాజిబిరుదంతో వైదికులు వ్యవహరిస్తారు. యిది చేయనిదే బ్రాహ్మణీకం వుండనేవుండదు. ఆ అయిదింటిలోను వకటి ఛుల్లీ అంటే పొయ్యి, దీనిద్వారా యెన్నో పురుగులు చస్తాయి. రెండు పేషణి’ బహుశః తిరగలి. సన్నెకల్లు, రుబ్బురోలు వగయిరాలు అవుతాయి. వీట్లద్వారా కొన్ని సూక్ష్మజంతువులు చస్తూ ఉంటాయి. ఆట్టేగ్రంథం పెంచటం యెందుకు? మనిషి నడిచేటప్పుడు దారిలోనున్నూ వర్షాకాలంలో పొలాలల్లో నేరేడిచెట్ల సమీపంలో వుండే గట్లమీద ప్రయాణం చేస్తూ వుంటే కోటానుకోట్లు కండచీమలు భూమి యీనినట్టు పరమాణువంత మేరకూడా యెడంలేకుండా వుంటాయి. అక్కడనడుస్తూవుంటే యెన్నో చస్తాయి. అక్కడకీ స్వేదజాలుగా వుండే నల్లులూ పేలూ వగైరాలతో సంబంధంలేకుండా శిషులు పిల్లజుట్లు వగైరా లేర్పఱచుకున్నారు. కాని భార్యలకు శిరోజాలుండక \ తప్పకపోవడంచేత తద్ద్వారాగా వచ్చే పాతకాన్ని కూడా చెటిసగం తామే భరింపవలసి వుంటుంది. కనుక మొత్తం వీట్లనన్నిటినీ కల్పి వైశ్వదేవమనే పుణ్యకర్మద్వారా నివర్తింప చేసుకొన్నట్టయిందనుకోవాలి. బాహ్యదృష్ట్యా వైశ్వదేవానికి ఫలితం యిదే అయినప్పటికి అంతర్దృష్టినిపట్టి చూస్తే యేజంతువునకు గాని హానిలేకుండా వర్తించరా, పెళ్లికొడకా? అని ప్రతి మనిషికిన్నీ భగవంతుఁడు విధించినట్టు తేలుతుంది. యిట్టిస్థితిలో ప్రస్తుతం నన్నుపీడిస్తూ వున్న యొలకలకున్నూ పందికొక్కులకున్నూ యేం చేయడానికిన్నీ మన మతరీత్యా వుపాయాంతరం కనపడడంలేదు. యథేష్టంగా తిని మదించి రాత్రి తెల్లవారూ పందికొక్కులుచేసే అల్లరికి పరిమితే కనపడడంలేదు. పందికొక్కును చంపితే పైజన్మానికి వుబ్బసం తగులుకుంటుందంటూ పెద్దలు చెపుతారు. దానికి తథ్యంగా యీ మధ్య మా వూల్లో వక సంపన్నగృహస్టు కొన్ని పందికొక్కులని విధిలేక చొరవచేసి చంపించి, చంపించిన కొద్ది రోజుల్లోనే లేదు లేదన్నంతవఱకూ జబ్బుపడి భగవదనుగ్రహంవల్ల మనుష్యలోకంలోకి యిప్పడిప్పుడే వస్తూవస్తూ వుండడం చూస్తే, వాట్ల అధికారం సాగకుండా యేదోవుపాయం చూచుకోవలసిందే కాని వాటిజోలికి వెళ్లడానికి లేశమున్నూ మనకు అధికారం వున్నట్టే బొత్తిగా కనపడదు. వుపాయమల్లా కిటికీలకుగాలి తక్కువ వస్తే వచ్చిందని చెప్పి యేయినపతీంగెలో బెత్తాయించుకోవడం వగైరా. కొట్లు వడ్లు పోసేవి కుచేలుండి బట్టలలాగ తయారైనాయి. వాట్లగతి యీ యేంటికి యేంచేయాలో ఆలోచన పాలుపోవడంలేదు. యీ బాధ అందరికీ వుండేదే. దీన్ని గూర్చి యింతగా వ్రాయడం లోకజ్ఞాన శూన్యత్వానికి గుఱు తనుకోవడానికి తప్ప మటౌకందుకు కాదని కొందరంటారని నేను యెటింగినిన్నీ తీరికూర్చుని దీన్ని వ్రాశాను. యితరులు వీట్లవల్ల యింతటి బాధపడుతూవున్నవాళ్లు లేరనియ్యేవే, అథవా వుంటే వుంటారుకాక, అంతమాత్రంచేత నాబాధ తీరడం యేలాగ? దీనివల్ల నేను నేర్చుకున్న పాఠమేమిటంటే? ఆర్యమతంకంటే ఉత్తమమైన మతమైతే లేదుగాని ఆ మతంలోవుండి ఆ మతధర్మాలు నెఱవేర్చుకోవాలంటే చాలా దుస్తరం, ఆ చేదస్తంలో వుండేవాణ్ణి. అంతో యింతో జ్ఞానం వుండే మనుష్యుల మాటట్లా వుండంగా జ్ఞానంలేని తిర్యగ్డంతువులుకూడా లోంకువచేసి బాధిస్తాయనేదియ్యేవే. నిత్యమున్నూ జంతుహింస చేస్తేనే కాని పొట్ట గడవనివాళ్లేందతో వున్నారు. వాళ్లందఱూ పిల్లాజెల్లా దోసతోcటలాగ వృద్ధిగానే వుంటారు. యేం కర్మమో! యెన్నఁడూ చేయనివాళ్లు కనక యెప్పడేనా ఆఖరికి యేతేలునో యేపామునో చంపడమంటూ తటస్థిస్తే అది వాళ్లకి యెల్లప్పుడూ మనస్సును పట్టి పీడిస్తూనే వుంటుంది. మొత్తం భారతాది గ్రంథాలన్నీ యీ వుద్దేశంతోనే చాలావఱకు ప్రవర్తించాయి. కాని సర్పయాగాది క్రూరకృత్యాలుమాత్రం కోపం తీర్చుకొనే అభిప్రాయంతో ఆరంభించడం మాత్రం సూచిస్తూ వచ్చాయి. దుష్టజంతుమారణంవల్ల లోకానికి యెంతో వుపకారం వుందని యెటింగిన్నీ మహరులు ఆ మారణంవల్ల ఆజాతి అసలేలాగా నశించదని యెఱిఁగి వుండడంచేత కాఁబోలు! వృథాగా యీ హింసారూపమైన పాపాన్ని ΟΟΟΟ మహారాజు చేస్తూవుంటే చూస్తూ వూరుకోవడమెందుకని “ఓం శాంతి శాంతి శాంతిః" చెపుతూ వచ్చారు. చాలా దయాశాలిగావుండే శ్రీనూజివీటి రామచంద్రప్పారావుగారు వక రోజున ప్రసంగవశాత్తూ అహింసాతత్త్వాన్ని గూర్చి మాట్లాడుతూ అన్నారు గదా! మాంసభక్షణం హింసామూలక మవడంచేత పూర్తిగా వర్ణించతగ్గదే కాని ఆ పద్ధతిని యీ జంతువులు అందులో చతుష్పాత్తులలో మేంకలూ గొట్టెలూ ద్విపాత్తులలో అందులో పక్షులలో ముఖ్యంగా కోళ్లు, యివి యేమికావలసి వుంటుందో? బోధకురాదన్నారు. సూలదృష్టిని చూస్తే ఆలాగే కనపడుతుంది. రోజువకంటికి ఆ సేతుహిమాచల పర్యంతంలో తెగుతూవున్న మేంకలూ గొట్టెలూ కోట్ల సంఖ్యకు మించుతాయనడంలో అతిశయోక్తిలవమున్నూ వుండదు గదా? కోడిగుడ్లను లెక్కపెట్టడం భూరేణువులని లెక్కించడంవంటిదే. యిలా మనుష్యులకోసం యివి హతమాఱుతూ వున్న మూలచ్ఛేదం కాక సముద్రంలో తరంగాలలాగ మామూలు వృద్ధిలోనే వుండడంచూస్తే వీట్లని గుణించిన భగవదుద్దేశమేలాటిదో బొత్తిగా మనస్సుకు అందడమేలేదు. యిన్ని జీవరాసులను యీలా చంపుకుతింటూవున్న మాంసభక్షకులను యెవళ్లుగాని నిందించినట్టే కనపడదుగాని వేదవిహితమైనకర్మలు చెడిపోతాయనే భయంతోటి యజ్ఞంలో పరిమితంగా ఆలభనంచేసే మేంకలను గూర్చి చింతించేవారు పలువురు కనపడతారు. యజ్ఞానికి ఆనల్లమేంకనో తెల్లమేంకనో కర్మపరులు తీసుకోవడంమానినంతలో దానికి బలవన్మృతి తప్పతుందేమో అంటే? ‘తిరుమలతాతాచార్లగారిముద్ర" లాగఏలాగాతప్పదు. ఈవేళ సోమయాజులుగారి గండం తప్పినా మఱునాఁటి బిస్మిల్లామంత్ర పాఠకుల గండంతప్పుతుందా? అయితే వకటిమాత్రంవుంది. అహింసాపరులమనిన్నీ భూతదయాపరులమనిన్నీ చెపుతూవుండేవారిని యెవరేనా యేమేనా అనడానికి అవకాశంవుంటుందిగాని యితరులని యెవరేమంటారు? అంతేనే కాని వీరియందు వుండే ద్వేషభావంచేత కాదని విస్పష్టమే. పూర్వకాలంలో జంతుహింసలేదని చెప్పఁజాలంగాని యిప్పటిమాదిరిగా తదర్థమై శాలా నిర్మాణాలు వున్నట్టు గ్రంథదృష్టాంతాలు కనపడవు. భారతంలో ధర్మ వ్యాధుండు చెప్పినమాటలుకూడా యీ వూహనే బలపఱుస్తాయి. మహమ్మదీయ ప్రభుత్వం వచ్చాకైనా శాలానిర్మాణపద్ధతి వున్నట్టుతోచందు. కాని పూర్వంకంటే హింస కొంతతీవ్రరూపం తాల్చిందంటే వొప్పనివారుండరు. ఆ రాజ్యంలోనే గోవధ బాగా విస్తరించివుంటుంది. సందేహములేదు. అంతకు పూర్వం నరమేధంతోపాటుగా బహువిరళంగా గోమేధాలు కూడా వుంటే వుండేవేమోకాని మహమ్మదీయులు గోమేధాలు అజామేధాలతోపాటుగానే సాగించారు. యిటీవల వీట్లకోసమంటూ శాలానిర్మాణాలు కూడా యూరోపియను ప్రభుత్వంలో అయాయి. ఆమధ్య నూజివీటిలో కాంబోలును పందులను చంపడానికంటూ యూనియన్ బోర్డువారు శాలా నిర్మాణానికి ప్రారంభిస్తారని తెలిసి మహమ్మదీయులు గోవధకుకూడా అట్టి సదుపాయంకావాలని ఆందోళనానికి మొదలు వేయడం వఱకున్నూ జరిగింది. బోర్డుప్రసిడెంటు ఆజమీందారులలోనే యెవరోవుండి యేలాగో ఆమాటతమకు దక్కవలసివస్తుందేమోనని చాలా భయపడడంవలకున్నూ మాత్రం నేనెఱుంగుదును. తరవాత యేంజరిగిందో నాకు తెలియదు. నిన్న మొన్నలాహోరుసిటీలోనే కాంబోలును యీ పుణ్యకార్యానికి శంకుస్థాపన గవర్నమెంటువారే చేసి గృహనిర్మాణం జరిగిసూ వుండంగా ఆ ప్రాంతపు హిందువులు మొట్టోమొట్టో అని లబలబలాడి ఆందోళనచేసి విన్నపాలు పంపుకోCగా ప్రజాద్వేషానికిది కారణమవుతుంది కాంబోలు ననియెంచో, లేకవీళ్లమతానికి వ్యతిరేకమయిన కార్యంవీళ్లదేశంలోనే చేయడమెందుకనో అంతటితో ఆcపినారని యేదో పత్రికలలో చదివినట్టు జ్ఞాపకం. యీ విధంగా జరుగుతూవున్న నిర్మాణాన్ని ఆంపడంవల్ల వచ్చిన నష్టమే 50 లక్షల రూపాయిరాలనికూడా ఆపత్రికే వ్రాసింది. నిజంగా అది సంపూర్తికావలసివస్తే లక్షలతో తేలేదికాక కోట్లతో తేలేదని నేననుకున్నాను. •(၅ ಭೌಗಮಿ।ು లీపాటికాక సురేంద్రుండు పదత్రయం బడుగనీయల్పమ్మ నీ నేర్చునే?” అన్నట్టుసూర్యోదయ సూర్యాస్తమయాలే యెరుంగని మహాసామ్రాజ్యానికి యెంత సొమ్మైతే మాత్రం లక్ష్యమేమిటి? మాంసభక్షణ చేయడం లేదని పూర్వపురాజుల ప్రభుత్వాన్ని గూర్చి చెప్పడానికయితే ఆధారాలు లేవుగాని యీలాటివిషయాల కీలాటి సదుపాయాలని యింతింత ద్రవ్యం వెచ్చించి కల్పించినట్టు దృష్టాంతాలేవిన్నీ లేవు. దిక్కుమాలిన ప్రారబ్ధం బ్రాహ్మణముండా కొడుకులు గట్టిగా నోరారా యేడవడానిక్కూడా వీలులేకుండా యెక్కడో వకటో రెండో వాక్యాలు అతిథిపూజకు లేcగదూడను కోసిపెట్ట వలసిందని వుండడంవకటిన్నీ గోమేధంఅంటూ వకటిన్నీ వచ్చి అడ్డు తగులుతూవున్నాయి. దీన్ని బట్టి మురారి మహాకవి- o “మేధ్యావత్సతరీ విహస్య వటుభిస్సోల్లుంఠ మాలభ్యతే." - అంటూ వ్రాశాcడు కూడాను. నరమేధప్రయుక్తమంత్రాలే కనపడతాయిగాని జరిగినట్టులేదు. హరిశ్చంద్రుడు చేస్తూండంగా విశ్వామిత్రుడు ఆంపచేసినట్టే పురాణగాథ చెపుతూవుంది. వేదమున్నూ దీనికివ్యతిరేకించదు. యింకోచోట తన పుత్రుణ్ణివోకణ్ణి చంపి యాగంచేస్తే నూరుగురు కొడుకులుకలుగుతారని పురోహితుండు చెప్పినట్టున్నూ వొకరాజు ఆలాటి యాగాన్ని చేసినట్టున్నూ భారతంలో కనపడుతుంది. అది నరమేధం అనిపించు కుంటుందో? లేదో నిర్ణయించతగ్గశక్తి నాకు లేదుగాని ఆ వుపాయం జెప్పిన పురోహితుcడికి సంపూర్ణ ప్రాయశ్చిత్తం పరలోకంలో జరిగినట్టు కూడా ఆ భారతంలోనేవుంది. అయితే ఆ యాగకర్తకు మాత్రం పుణ్యలోకమే వచ్చినట్టున్ను తుదకు ఆ యాగకర్త తన పురోహితుcడి క్కూడా శిఫారసుచేసి ఆ నరకబాధను తప్పించినటూన్నూ దానిలోనే కనపడుతుంది. యింతకన్న నరమేధాలకు ఉదాహరణాలు కనిపించవు. పూర్వయుగంలో రంతి దేవుండు కాcబోలును గోమేధాలు యెన్నో చేసినట్టుకనపడుతుంది. కాని అందులో గోవులు స్వయంగా వెళ్లి పుణ్యలోకావాప్తి కొరకు ఆ మహారాజును ప్రార్థిస్తే ఆయన అంగీకరించినట్టు కనబడుతుంది. అంతేనేకాని బలవంత బ్రాహ్మణార్థ ప్రకరణం లేశమున్నూ లేదు. యీ యుగంలో ఆ గోమేధం జరగడానికి వల్లకాదని మహరులేలాగో - “కలె" పంచ విసర్జయేత్ అని పుణ్యం కట్టుకోవడమైతే జరిగింది గాని అయితే యేంలాభం? ఆ ధర్మశాస్తాలకు కట్టుంబడని మహానుభావులు ఆ రంతిదేవుణ్ణి మించిన యాగాలు చేస్తూవున్నారు. ఆ చర్మాలరాసులవల్ల బయలుదేటిన నీరు ముడికి నీరుగా వుండడానికి బదులు మహాపవిత్రమైన జలంకలనదిగా ప్రవహించినట్టు మన పురాణాల్లో వ్రాయంబడి వుందిగాని యీ చర్మాలవర్తకులు కోటీశ్వర్లై యెంతో పేరుప్రతిష్టలు గణించినట్టు మనకు ప్రత్యక్షదృష్టాంతమే కనపడుతూవుంది. పురాణగాథలతోవ పురాణాలదీ మనతోవ మనదీగా వుండడంచేత ధర్మాధర్మనిర్ణయం చాలా దుర్ఘటంగా కనపడుతూవుంది. "సత్యంబ పల్కంబడున్” అనే ప్రతిజ్ఞతో ముక్కుమూసుకొని జపతపాలతో కాలక్షేపం చేస్తూవుండే “తృణీకృత బ్రహ్మపురందరులు" మహరుల కేమంతకర్మం కాలిందని అబద్ధాలు వ్రాసి లోకాన్ని మోసపుచ్చడానికి? నాన్ బ్రామిన్సులో కొన్ని తెగలవారు యిప్పడు చెప్పేమాటలు చూస్తే "ఋషులేమో బ్రాహ్మణజాతికి సంబంధించిన వాళ్లనిన్నీ అందుచేత బ్రాహ్మణుల కనుకూలంగానున్నూతమకు అననుకూలంగానున్నూ గ్రంథాలు వ్రాసి తమకు మహాద్రోహం చేశారంటూ కనపడతాయి, కాని ఆ ఋషులలో కొందరు జన్మతః బ్రాహ్మణులు కానివారు, క్షేత్రతః బ్రాహ్మణులు కానివారుకూడా వున్నట్లు గ్రంథాలవల్లనే అవగత మవుతుంది - అట్టివాళ్లకూడా తమకు వ్యతిరేకంగానే లిఖించివుంటారా? అనే ప్రశ్నకు జవాబు కనపడదు. మొట్టమొదట యీ వ్యాసం ప్రారంభించడమేమో? యీతిబాధలనుగూర్చి దానిక్కారణం యింట్లో మిక్కిలిగా విజృంభించివున్న యొలకల యొక్కానున్ను పందికొక్కులయొక్కానున్నూ కోలాహలాతిరేకం. యిప్పడు ఋషుల పురాణాలు విషయంగా నడుస్తూవుంది. దీన్ని చూచి లోక మేమనుకుంటుంది? వ్యాసకర్త మతిమాలినవాడని అనుకుంటుంది. లేదా? “కొండనిత్రవ్వి యొలకను పట్టడం అంటే యిదేకాCబోలు"ననేనా అనుకుంటుంది. 55 యేళ్లు దాఁటినవాళ్ల బుద్ధి స్థిరంగా వుండదనే మాటకు అంతతో నవకరీనుంచి తొలంగించి యెందటినో యింట కూర్చోం బెట్టి పోషిస్తూవున్న మన గవర్నమెంటు ప్రవృత్తివల్లనే అందఱూ తెలుసుకొని వుంటారు. కనుక ఆమితికికూడా పుష్కరకాలంలోవున్నవాళ్ల వ్రాతలకు తోవాతెన్నూ వుండకపోవడం అంత విడూరం కాదుగదా? నాలుగు మాటలు వక యితిహాసరూపమయినవి ఆ యీ యీతిబాధలలో మొట్టమొదటిదానికి సంబంధించినవి వ్రాసి దీన్ని ముగిస్తాను. వకబ్రాహ్మణుండు శ్రావణభాద్రపదాలు వస్తున్నాయని సప్రయత్నంగా యింట్లో ఆయీ సామగ్రి జాగ్రత్తపెట్టుకుంటూభార్యతో - "శ్రావణభాద్రపదాలు వస్తున్నాయి సుమా" అని మధ్య మధ్య అంటూ వుండేవాండు. యీ సందర్భం యితరులుకూడా వింటూవుండేవారు. పప్పు, వుప్ప, కట్టెలు, బియ్యం, నెయ్యి, నూని వకటేమిటి? శాయశక్తులా అన్నీ తెచ్చి భద్రంగా జాగ్రత్త పెట్టుకున్నాండు. అంతల్లో యేదోపనిమీద హఠాత్తుగా యేదో వూరికి ప్రయాణం తగిలింది ఆగృహస్టుకు. సరే బయలుదేటి వెళ్లాండు. వెళ్లీవెళ్లడంతోటట్టే యిద్దఱు బ్రాహ్మణులు ఆ యీ సంగతి సందర్భా లెఱింగినవారు దర్భాసనాలతో వచ్చి వాకట్లో కూర్చున్నారు. ఆయింటి యజమానురాలు చూచి నాయనలారా ఆయన గ్రామంలోలేరు తమ రెవరో దయచేశారు. స్వయం పాకస్టుల్లా వున్నారు. ఆ పంచపాళిలో స్వయంపాకం చేసుకోండి అంటూ వుపచారం చెపుతూ వుండంగా ఆ మోసగాళ్లు - మాకాలాటి నియమంలేదు. మేమే శ్రావణభాద్రపదాల మన్నారు. అనేటప్పటికి ఆ అమాయకపు యిల్లాలు - వోహో! తమరేనా! నాయనా! శ్రావణభాద్రపదాలు? మా ఆయన మీరాకను గూర్చి చెపుతూనే వుండేవారు. సమయానికి వారు వూల్లో లేకపోవడం తటస్థించింది రేపో యెల్లుండో వస్తారంటూ చెపుతూ ఆదరం కనపఱచేటప్పటికి మీ ఆయన మాకు వచ్చే త్రోవలో కనపడ్డారనిన్నీ వారు వచ్చేవఱకున్నూ వుండి మటీ వెళ్లవలసిందనిన్నీ తొందర పనిమీంద యొక్కడికో వెడుతున్నాననిన్నీ మటీ మటీ చెప్పారనిన్నీ చెప్పి అక్కడే తిష్టవేసి- అమ్మా మీవంటి శిష్టాచార సంపన్నుల గృహాల్లో మాకు స్వయంపాకంతో అవసరంలేదు. నీవు మహాయిల్లాలవు, నీచేతి ప్రసాదమంటే? సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి ప్రసాదమే అని స్తుతిచేసి వచ్చించి దేవతార్చనలు చేసుకుంటూ సుఖంగా భోజనం చేస్తూ గృహయజమాని వచ్చేవఱకున్నూ ఆయన కూడఁబెట్టిన సామానంతా వ్యయపరచి యజమాని వచ్చిన సడి కనిపెట్టి మెల్లిగా పప్పుజాటినట్టు జాటినారు. ఆయన యిల్లు చూసుకుంటే “అయ్యవార్లంగారి ನಿಬ್ಲಿಲ್ಲ” లాగేవుంది. ఆపట్టాన్ని పదార్ధమంతా యేమయిందని భార్య నడిగేటప్పటికి ఆ వెట్టి యిల్లాలు. మీరు చెప్పినవారు మీరూ గ్రామాంతరం దయచేసిన వుత్తర క్షణంలోనే వచ్చారుసుమండి! యింకా యిక్కడేవున్నారు. యిప్పడే యొక్కడికో వెళ్లారు. అంటూ యేమేమో చెప్పతూవుండగా పాపం! ఆగృహస్టు ++ నిర్ధాంతపోయి నీయమ్మకడుపు బంగారం గానూC నేను చెప్పినవారెవరే? అని అడిగేటప్పటికి - “మఱచిపోయారు కాcబోలును. శ్రావణభాద్రపదాలు ఇద్దరు" అని బదులు చెప్పింది. దానితో ఆయన ఎవరో మోసంచేసి తినిపోయారనుకొని పోనీ "సర్వం బ్రహ్మార్పణం" అని సరిపెట్టుకొని పెళ్లాము తెలివి హీనతకు విచారపడి “స్త్రీలకు విద్యావాసన లేకపోవడంవల్ల కొన్నియీలాటి ప్రమాదాలు వస్తా" యనుకొని శ్రావణభాద్రపదాలు రెండు మాసాలున్నూ యీ యింటిమీంద కాకి ఆ యింటిమీంద వాలడానికి వీలులేకుండా వర్షాలు కురిసేరోజులనిచెప్పి గృహస్టులు సాధనసామగ్రి జాగ్రత్త పెట్టుకుంటారు. అవి మాసాలు. యీమాత్రము నీకు తెలియదని నేను అనుకోలేదని చెప్పేటప్పటికి ఆ యిల్లాలు తన తెలివితక్కువకు తనలోతానే సిగ్గుపడి భర్తను క్షమాపణ నేడుకొన్నట్టు పుక్కిటిపురాణంగా యెవరో చెప్పంగా చిన్నప్పుడు విన్నాను. యీ యితిహాసాన్నిబట్టే అనుకుంటాను యానాం సమీపంలోవున్న వొకపల్లెటూళ్లో కొంచెం పప్పుభోట్లు మాత్రం వచ్చిన వక బ్రాహ్మణ సోదరద్వయాన్ని శ్రావణభాద్రపదాలని వేళాకోళంగా మాఱుపేరుతో వాడుతూ వుండేవారు. ఆ సోదరద్వయం వేఱువేఱు స్థలాల్లో వొకటేరోజున రెండు బ్రాహ్మణార్థాలు చేసేటట్టున్నూ అదికూడా మోసంలోకే చేరుతుంది కనుక యీ పేరు వాళ్లకు వచ్చినట్టున్నూ చెప్పంగా వినడం. మొత్తం యీతిబాధల్లో అతివృష్టి మొట్టమొదటిదన్నమాట. యీరోజుల్లో సన్యాసులుకూడా సంచారం చేయరు. యీతిబాధలు లేనిదేశమే నివాసయోగ్యమైనది. అట్టిది ప్రపంచంలోకల్లా మనభరతఖండమే అని చెప్పకుంటారు. అలాటి దేశంకూడా యితరదేశ సంపర్కంవల్ల యిప్పడు యెన్నోయీతిబాధలకు కొత్తకొత్తరకాలకు స్థానభూతం కావలసి వచ్చిందికదా! అని విచారం కలుగుతుంది. దీపం దగ్గిఱనుంచీ యిప్పడు మనం పరదేశాలమీఁద ఆధారపడి జీవించవలసిన దుస్థితిలో వున్నాము. పంపులున్నాయని నూతులు కప్పేసుకుంటూ వున్నచోట్లెన్నో కనపడతాయి. యేకారణంచేతేనా పంపు మరమ్మతుకు వస్తే అది సవరణ అయేదాకా దాహానికి నీళ్లు సున్నా అన్నమాటేకదా! మోటారూ, సైకిళూ కాలినడకకు స్వస్తిచెప్పాయి. మరబియ్యం దంపుడు బియ్యానికి కొక్కెట్టాయి. డబ్బాపాలు తల్లిపాలని తోసిరాజన్నాయి. యిలా వ్రాస్తే యెన్నిటినో వ్రాయాలి. పూర్తిగా జీవనం పరాధీనమైపోయింది. రాజకీయ విద్యలకు ధనాపేక్ష విధాయకమే అనుకుందాం. స్వదేశ విద్యలకుకూడా దానితో సంబంధం కలిగింది. ఆ యీ సందర్భాలన్నీ పూర్వంకంటేకూడా యిప్పడు ప్రపంచాన్ని యీతిబాధామయంగా చేసివేసినట్టు తోస్తుంది. విస్తరించినకొద్దీ యీ విషయం పెరుంగుతూనే వుంటుంది. ప్రస్తుతస్థితిని బట్టిచూస్తే సంసారజీవితమంతా యీతిబాధలతోనే నిండివుంది. పట్నవాసం కంటె పూర్వం పల్లెటూరు కొంత యీతిబాధారహితంగా వుండేది. ఇప్పుడో అక్కడవుండే సదుపాయాలు పల్లెటూళ్లల్లో కనపడవుగాని అక్కడవుండే యీతిబాధలు మాత్రం కనపడతాయి. కొన్నివూళ్లకి కోఁతులబాధ విశేషించి కనపడుతుంది. యీ కోఁతులు తాటాకు కొంపలవాళ్లకన్నా పెంకుడు కొంపలవాళ్లని యొక్కువగా బాధిస్తాయి. కొన్ని వూళ్లవాళ్లు వీట్లకుజంకి పెంకుటిళ్లు
o కట్టుకోవడమే మానుకున్నారు. యివి యెంతబాధ పెట్టినాసరే యేదో బెదరించడమేకాని వీట్లను చంపడానికి మన హిందువులలో యెవరున్నూవప్పుకోరు. దీనిక్కారణం రామాయణ కాలంలో యీజాతి శ్రీరాములవారికి చేసిన సాయమే అనితోస్తుంది. సుమారు యేడెనిమిదేళ్లనాఁడు మావూల్లో వక కోఁతి ప్రవేశించి గృహస్టుల నందఱినీ అల్లకల్లోలపెట్టి బొత్తిగా నిలవనిచ్చిందికాదు. కోంతులు కుక్కలకు భయపడడం సర్వ సామాన్యంగా కనపడుతుంది. ఆ కోంతి కుక్కలను లక్ష్యపెట్టేదికాదు సరికదా వాట్లని పట్టుకొని చెంపకాయలు కొట్టేది. కోఁతిజాతిపగలేగాని రాత్రి చెట్టుదిగిరాదు. యీ కోఁతి రాత్రికూడా సంచరించేది. యిద్దఱు ముగ్గురుంటే తప్ప మనుష్యులమీఁద తిరగబడేది. యెక్కడో వక పిల్లిపిల్లను సంపాదించి దాన్ని వకకాలుతో పట్టుకొని తక్కిన మూండు కాళ్లతోటీ రెండు మూండురోజులు ప్రతి యింటిమీందను తిరుగుతూ వుండడంచూచి యిది చంటిపిల్లలినెక్కడ యెత్తుకుపోయి యీలాగే తిప్పతుందో అని గ్రామం గ్రామమంతా హడలిపోయారు. తుదకు ఆ పిల్లిపిల్ల దానిచేతిలోనే చచ్చింది. చెప్పేదేమిటంటే? యింత దుర్మార్గంగా వర్తించినప్పటికీ దాన్ని చంపడానికి యెవ్వరూ అంగీకరించలేదు. పట్టుకొని గోదావరి దాంటిస్తే వాళ్లకు కొంత సొమ్మివ్వాలని గ్రామస్టులు యేర్పఱచుకున్నారు. యెవశ్లో వచ్చి అందుకు ప్రయత్నంచేస్తూ వచ్చారు కాని వాళ్లకున్నూ అది దొరికిందికాదు. పట్టు కోవడమంటే మాటలా? మా గ్రామానికి అంటుమామిళ్లతోపాటుగా చాలాకాలాన్నుంచి దొంగలవల్లకూడా కొంత పేరు ప్రతిష్టలున్నాయి. దొంగలంటే? సామాన్యంగా కన్నాలేసే దొంగలున్నూ తోవలుకొట్టే దొంగలున్నూకారు. రాజులచేత మెప్పపొంది మడిమాన్యాలు గడించిన దొంగలు. ఆ మాన్యాలు యింకా అనుభవిస్తూవున్న కుటుంబాలు కొన్ని వున్నాయి. గర్భాధానంరోజున రాజుగారి కొమార్తె కట్టుకొన్న చీరెను చమత్కారంగా దొంగిలించి తెచ్చినప్పుడు అట్టి సమ్మానం జరిగినట్టు చెప్పకుంటారు. ఆ క్రీడాగృహానికి బల్లసరంబీ చేసివుంది. ఆ సరంబీమీంద సాధన సామగ్రితో యేలాగో ప్రవేశించి చిన్నరంధ్రం చేసి తద్ద్వారాగా తామర తూండుగుండా నిద్రాసమయంలో ఆమె కట్టుకున్న చీర తడిసేటట్టు చేయడముతోటట్టుగానే అది చాకిరేవుకు రావడం కలిగిందనిన్నీ అక్కడ నుంచి దొంగిలించడానికి సులువు కలిగిందనిన్నీ చెప్పకుంటారు. ఆలాటి చమత్కారపు దొంగతనాలు కుటుంబాలవాళ్లు మాతండ్రులరోజుల్లో యెవళ్ల దగ్గలేనా తృణమో వీసమో అప్పుచేయవలసివస్తే "యేలా తీరుస్తా?"వని అడిగే ఋణదాతకు - కోటిపల్లి తీర్థానికో - అంతర్వేది తీర్ధానికో తీరుస్తానని చెప్పడం కూడా యెఱింగినవాళ్లు నిన్న మొన్నటిదాంకా వున్నారు. వీళ్లు బ్రాహ్మలు వేదం చెప్పకొనేచోట యెందుకో కూర్చున్నట్టు కూర్చుని కొన్నిపప్పభౌట్లు సంగ్రహించి పరదేశాలకు వెళ్లి బ్రాహ్మణవేషంవేసుకొని సంపన్నులయిన బ్రాహ్మణగృహాల్లో దేవతార్చన బ్రాహ్మణులుగా చేరి గుటూమటూ కనిపెట్టి వీలిచ్చినప్పుడు వెండిబంగారాలు అంకినంతమట్టుకూ సంగ్రహించుకురావడం జరిగేదని చెప్పకుంటారు. యీ బాపతు వాళ్లిప్పడు యేస్వల్పమో తప్ప లేరుగాని యిప్పటికి పన్నెండేళ్లకు పూర్వం వొక దొంగ చాలా దారుణమయినవాండు వుండేవాడు. మృచ్ఛకటిక నాటకంలో వున్న శర్విలకుడికన్నా వాఁడి సామర్థ్యం హెచ్చని నేను అనుభవ పూర్వకంగానే వ్రాస్తూన్నాను. - వాణ్ణియెన్నోసార్లు ఖయిదులో పెట్టినా మళ్లావచ్చింది మొదలు ఆ పనే చేసేవాఁడు. కేళీలను పరీక్షించడం పోలీసువారికి తప్పనిసరి గనుక బీటుతిరిగే పోలీసులు వాణ్ణి పరీక్షించడానికి వెళ్లేటప్పుడు వొంటిప్రాణంతో వెళ్లవలసివచ్చేది. ఆ సమయంలో వాండు తాగివున్నట్టాయెనా వీళ్లను సుఖసుఖాల వదలిపెట్టక యేదో అమర్యాదచేసే వాండు. వాండంటే వీళ్లకుభయం. మొండివాండు రాజుకన్నా బలవంతుండు గదా! తాపీపనిలో చాలా గట్టివాఁడయివుండికూడా వాండు అది నౌకరీ అనిపించుకుంటుందని కాంబోలును మళ్లామళ్లా యీవృత్తిలోనే తిరిగేవాండు - “నిక్కమ్ముగ నొక్కనిన్ గొలుచుకొన్నను దొంగటికమ్ముతక్కువే" అన్న మృచ్ఛకటికకు వాండే యిటీవల వుదాహరణంగా కనంపడతాడు. మనిషిని చంపడమంటే వాండికి కోడినికాదు దోమనిచంపడంకన్నా యొక్కువకాదు. వాcడి జీవితంలో కొన్ని హత్యలయితేచేశాండు కానివాcడికి వురిశిక్షపడలేదు. పట్టపగలు మారోడ్డున వంటెద్దుబండి వెడుతూవుంటే అందులో నగలూ నాణేలూ వున్నాయంటే యెందరు చూస్తూవున్నాసరే! దొంగించాండన్నమాటే. చూచినా చూచినట్టు సాక్ష్యం చెప్పేటట్టయితే శిక్షలోనుంచి వచ్చాక చంపేస్తాండనే భయంచేత సాక్ష్యం చెప్పేవారుకారు. సుమారు వాండికి అఱవై యేళ్లు దాంటీదాంకా యీలాగే నడిచింది. అసలింటికాపులని యెందఱినో యేమిరా అనే పిలిచేవాఁడు. యేపొలాన్నంచేనా వచ్చేటప్పుడు నేనుకనక వాండికి తారసిస్తేయెంతో వినయంగా నమస్కారాలు చేస్తూ వెంటCబడేవాఁడు. ఖయిదులో వున్న రోజుల్లో యితర జిల్లాల ఖయిదీలున్నూ తానున్నూ కలిసికొని మాట్లాడుకొనేటప్పడు తనవూరు కడియమని తెలియడంతోటట్టేవాళ్లు నన్నుంగూర్చి అడిగేవారంటూ కూడాచెప్పేవాఁడు. ఖయిదులో వున్నరోజులలో తానుచేసే చిత్రవిచిత్ర చర్యలు వర్ణిస్తూ యింటిదాంకా వచ్చేవాఁడు. తాగికూడా వుండడంచేత సుఖసుఖాల వదిలిపెట్టేవాండుకాండు. వదలించుకోవడానికి ప్రయత్నిస్తే కనిపెట్టి అనేవాండుకదా? "అయ్యా! నేను దొంగననే హేతువుచేత మీరు భయపడుతూన్నట్టున్నారు నేను దొంగనే అనుకోండి నిజమేకాని సామాన్యులయిళ్లల్లో నేనెన్నఁడూ దొంగతనం చేయను సుమండీ!" అనేవాఁడు. తుదకు ఇప్పటికి 13 ఏళ్లన్నాండు కోరుకొండ తీర్థంతోవలో వొక దొంగతనంచేసి వచ్చి దాన్నిగుడించి వూల్లోవాళ్లు సాక్ష్యం తనకు అనుకూలంగా యివ్వమనేటప్పటికి వాళ్లనందఱినీ నఱకడానికి సంకల్పించుకొని మేదరాణ్ణి బెదిరించి కత్తి సంపాదించి వొకట్టి నడిరోడ్డుమీంద పడవరేవుదగ్గిఅ మొగంకడుక్కుంటూ వున్నప్పడు నటికి యింకోఆండమనిషి యెప్పడో అఱువడిగితే బియ్యం యిచ్చింది కాదని దాన్ని జెబ్బమీంద నఱికి వూరంతా 5-6 గంటలు ಅಟ್ಟುಡಿಕಿನಿಟ್ಟು వుడికించి యేకచ్ఛత్రాధిపత్యంగా ప్రభుత్వం సాగించి పోలీసువారు వస్తూన్నారని తెలిసి వొక చెట్టెక్కి సాయుధుండుగా కూర్చున్నాండు. ఆ చెట్టుయెక్కడంలో యేకోంతిన్నీ వాcడికిపోలదని నేను అనుకున్నాను. వాణ్ణి పట్టుకోవడానికి శక్యమయిందికాదు. తుదకేలాగయితేయేమి కిందపడేటట్టు చేశారు. చేతులోవున్న బ్రాందిబుడ్లు పగిలి గాజుముక్కలు గుచ్చుకొని చచ్చాండన్నారు. చెప్పేదేమిటంటే? వానరజాతిగూడా యించుమించు నరజాతికి దీటయిందే. కాదుకాదు లాఘవంలో చాలాఅతిశయిస్తుంది. దాన్ని పట్టుకో వలసివస్తే సుఖసుఖాల జరుగుతుందా; దానిచేత గాయాలుపడి చాలామంది ఆసుపత్రిలో కట్టుకట్టించుకోవలసి వచ్చింది. తరవాతయోవత్లో పట్టుకుంటామన్నారు. యిఱవైయైదు రూపాయిలిమ్మన్నారు. దస్తుచేసి యిచ్చుకున్నాము. సకలచిక్కులుపడి యేలాగయితే యేమి ప్రాణావశేషంగా వున్నప్పడే పట్టుకున్నారు. కొవ్వూరు ప్రాంతంలో వదిలిపెట్టినట్టున్నూ తరువాత అది అక్కడ మరణించినట్టున్నూ విన్నాము. చెప్పేదేమిటంటే? యెంత చిక్కువచ్చినా కోంతినిగాని పందికొక్కునుగాని చంపడానికిఁగాని చంపించడానికిఁ గాని మన హిందువులు సమ్మతించరు. మాంసభక్షకులు స్వహస్త పరహస్తాలచేత యేవో కొన్ని జంతువుల చావుకు సమ్మతించేవారే అయినా పయి జంతువుల విషయంలో బ్రాహ్మణులతోపాటువారే. ΟΟΟΟ విషయంలో పాశ్చాత్యులే అయితే లేశమున్నూ వెనుదీయరు. వారికిదానివల్ల ప్రత్యవాయం కలిగినట్టున్నూ వినం. మనకయితే వెంటనే కలిగి తీరుతుంది. దానితోపదిమందిన్నీ“అదుగో ఆ పనిచేశాండు. వెంటనే దృష్టాంతం కనపడిందంటారు. “యదనంతర" న్యాయాన్ని బట్టి అదీనిన్నీ సరిగానే తోస్తుంది. పూర్వం యేదేనా ఫచోరకృత్యం చేయవలసివస్తే యేకచ్ఛత్రాధిపత్యంగా యేలే చక్రవర్తికూడా జంకేవాcడు. యిప్పడో పేరుకు గుజ్లో ప్రముఖులెవరో కొందఱుగా వుండడం చేత ప్రత్యవాయజనకమైన పనులు చేసినా వాట్లవల్ల వచ్చే ప్రత్యవాయాలు సంఘముమీఁద "తిలాపాపం తలో పిడికెండు"గా సరుకుపోతూ వున్నాయి. కాని బాధిస్తూ వున్నట్టు లేదు. యేదో ప్రసక్తాను ప్రసక్తంగా యింత వ్రాశాను. గృహస్టుకు యీతిబాధారాహిత్యం చాలా అవసరం. అట్టి యీతిబాధలను కొన్నిటిని కనపటిచి వ్యాఖ్యానించివున్నాను. మటికొన్ని యింకా లేకపోలేదు. అవీ వ్రాస్తాను. భగవంతుఁడు సర్వదయాపరుండు. అట్టియిమోతిబాధలను తొలగించి తనప్రజలకు సర్వవిధాలా సుఖప్రదాత అగుంగాక అని ఆశీర్వదిస్తూ దీన్ని ముగిస్తున్నాను. , ★ ★ ★