కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/గర్భాధానం



గర్భాధానం

దీన్నిగుఱించి నాలుమాటలు వ్రాస్తునా? "యేమంత నూత్నవిషయం యిది, దీన్ని గుఱించి వ్రాయడాని" కనుకుంటారేమో? చదువర్లు. అందఱూ యెఱిఁగిందిన్నీ అనుభూత మయిందిన్నీ అయినప్పటికీ యిది రానురాను యెన్ని విధాల వ్యవహరింపఁబడుతూ వచ్చిందో, ఆలా నానావిధాల వ్యవహరింపఁబడడానికి కారణమేమిటో సర్వసాధారణంగా అందఱికీ అవసరమైనా కాకపోయినా కవిత్వం చెప్పకొనేవాళ్లకు మాత్రం చాలా అవసరం అందుచేత వ్రాయవలసివచ్చింది.

కొన్ని మాటలు పృథివి పుట్టేటప్పటికి యేలా వున్నాయో? యిటీవలకూడా ఆలాగే వున్నాయి, వుంటాయికూడాను. కొన్నో పాశ్చాత్య వైద్యంలాగ దేశాటనం చేసేవాళ్ల మనోభావాలలాగ క్షణేక్షణేమాఱుతూ వుంటాయి. అందుకువుండే కారణాలు కొంతవఱకు అక్కడక్కడ సూత్రప్రాయంగా వివరించే వున్నాను. దాన్నే యిందులో విస్తరించతలంచి యీ వ్యాసానికి ఆరంభం చేశాను. గర్భాధానం మొదలైనపదాలు మాఱడం అంటే తత్సమతద్భవాలలాగ కాదు. చాలా దూరదూరంగా మూల9డానికి మొదటికారణం సిగ్గు ఆంపడానికి సరిగా అర్థం చెప్పవలసివస్తే గర్భ = కడుపు యొక్క లేక - గర్భమందువుండే వొకానొక జంతువుయొక్క ఆధానం అంటే? చేయడం యిది వ్యాకరణశాస్తానికి లోపం రాకుండా “కర్తృకర్మణోఃకృతి" అనే సూత్రప్రకారం చెప్పే అర్థం. యింక సామాన్యంగా చెప్పేపిండితార్థమో? "కడుపుచేయడ" మనియ్యేవే. యీఅర్థం స్త్రీలకే కాదు పురుషులక్కూడా లజ్ఞాకరంగానే కనపడుతుంది. యిట్టిలజాకరమైన మాటను వుచ్చరించి వూట్లో పిన్న పెద్దలని ఆహ్వానించడానికి & పురుషాదులు బాజాబజంత్రీలతో బయలుదేఱడం నానాంటికి హేయంగా తోంచడంచేతనే కాcబోలును! క్రమంగా గర్భాధానపదానికి దాదాపుగా వుండే యితర పదాలతో ప్రస్తుత శుభకార్యాన్ని వ్యవహరించడం మొదలు పెట్టినట్టు తోస్తుంది. వైదిక పదంమాత్రం అనాదిగా గర్భాధాన మనియ్యేవే. గర్భాధాన ఖండ లోనైన వుదాహరణాలు “గర్భాధానాఖ్యం కర్మ కరిష్యమాణః" అని సంకల్పంకదా! అయితే యింకొకటి కల్పి తప్పేరు తప్ప దీనికి ప్రత్యేకించి పేరు పుట్టినట్టులేదు. నిషేకమనేది వకటి వుంది గాని అది రజస్వలాత్పూర్వం జరిగే నూత్నదంపతుల సమావేశానికే రూఢంగా మా వైపున వాడడం. గర్భాల_లి_ధాన పదం గర్భ + ఆధానం. అని రెండిటి కూడికవల్ల యేర్పడ్డదని వేటే వ్రాయనక్కఱలేదు. జ్యోతిష గ్రంథాల్లో "గర్భాధాన మరిష్ట మష్టమ విధౌ అంటూ యీ కల్పితప్పేరునే వాడుకొన్నారు. కాళిదాసుగారు “గర్భాల__ధానక్షణ పరిచయాత్' అన్నారు మేఘసందేశంలో, అప్పటికింకా ప్రజలకు దీనియందు లజ్ఞాకరత్వం ప్రసక్తించినట్లులేదు; యద్వా ప్రజలకు లజ్ఞాకరంగావున్నా దానిని కాళిదాసు లెక్కించనే లేదో? కాళిదాసు ప్రజల వ్యవహారానికి వ్యతిరేకంగా వాడిన పదం యింకొకటివుంది. అది "అవిధవే" అనేది; ఆ పదానికి మగడు బ్రతికివున్నదానా? అని అర్థం. యక్షుండు తన పెండ్లానికి తన క్షేమ వార్తను పంపుతూ మేఘుండిచేత ఆలా పిల్వమని చెప్పతాండు. ఆ పిల్పులో కలిగిన లాభం తనభర్త బ్రతికివున్నట్టు వెంటనే యామెకు తెలియడమే. వాల్మీకికూడ ఆంజనేయులచేత శ్రీరామమూర్తికి సీతామ్మవారి వార్త తెల్పడంలో యీలాటిసొగసే కనపఱిచాడంటూ వ్యాఖ్యాతలు చెపుతారు. ‘సీతాదృష్టా" అనక “దృష్టాసీతా" అన్నాడంట! ముందుగా సీతాపదశ్రవణం జరిగేయెడల నష్టావా భ్రష్టావా అని పరిపరివిధాల రాముడు ఆందోళన పడవలసివచ్చునంట? ఆయీ విశేషాలు వ్యాఖ్యానాలవల్ల తెలియ వస్తాయి. ఆంజనేయుడు కోఁతిగదా యింత తెల్వితేటల కవకాశం లేదనుకోకండి. మహాకవి, నవ వ్యాకరణవేత్త హనుమన్నాటక మంటూ వకటి స్వయంగా శ్రీరామాయణ గాథను పురస్కరించుకొని రచియించివున్నాండు. అందులోదే యీ శ్లోకం

శ్లో "కస్త్వం వానర! రామరాజభవనే లేఖార్థసంవాహకో
    యాతః కుత్ర పురాగత స్పహనుమా నిర్దగ్ధ లంకాపురః
    బదో రాక్షస సూనునే తికపిభి స్సంతాడిత స్తర్షిత
    స్పన్రీడా త్త పరాభవో వనమృగః కుత్రేతి నజ్ఞాయతే."

యిందులో ఆంజనేయుండు తన్నుగూర్చి యెంతో నైచ్యంగా వ్రాసుకొని వున్నాండు. అందుచేత యిది అతని కవిత్వమే అని విజ్ఞలంటారు. యిది అంగదరాయబార ఘట్టంలోది. యిది యిలా వుంచుదాం, వెధవ కానిదానా! అని యేపుణ్యస్త్రీనైనా మనం పిలిస్తే బాగుంటుందేమో చూడండి. కాళిదాసు నాcటికి గర్భాధాన పదంలాగే యీ సంబోధనకూడా హృదయంగమంగావుండే దేమో? అదంతా యిక్కడ చూపవలసివస్తే వ్యాసం చాలా చేదస్తంగా వుంటుంది. ప్రస్తుతం కాళిదాసుగారు “ఓ వెధవ ముండ కానిదానా" అనే అర్థంయిచ్చేమాట అవిధవే అని యక్షుండి పెండ్గాన్ని మేఘండిచేత సంబోధింపచేయడం ఆవిడకు భర్తృ క్షేమం తొలుదొల్తనే చెప్పినట్లనడాని కంటూ వ్యాఖ్యాతలు స్వారస్యాన్ని నిర్వచించడం యీ నిర్వచించడమయితే చాలా యుక్తియుక్తంగానే వుంది గాని వాల్మీకి “దృష్టా సీతా" అన్నచోట వున్న సొగసిక్కడ కనపడడం లేదని నాకు తోస్తుంది. యిక్కడ వక చిక్కుంది. యేమిటంటే? “ఓ వెధవముండకానిదానా!” అని కాళిదాసుగారు సంబోధింపజేసినట్టే మనంకూడా యేగృహస్టురాలినో సంబోధిస్తే యేలా వుంటుందో? పైంగా దానిమీంద మనకు జరిగే మర్యాద యెట్టిదో? ఆలోచించి చూడండి. నిషధయోగ్యుండుగా వుండే యేమర్యాదసుణ్ణినా మనం “అయోగ్యుండవు కాకుండా వుండే వో మహానుభావా!" అని సంబోధిస్తే యేలా వుంటుందో? ఆలోచించండీ? అయితే కాళిదాసంతవాండు ఆలా సంబోధింపచేస్తే, మనమా దాన్ని విమర్శించే వాళ్లమంటే చెప్పే జవాబు లేదు. శంక యుక్తంగా వందో లేదో సహృదయులు పరిశీలించాలి. కాళిదాసుగారు మటోచోటకూడా యీలాగే వాడివున్నారు. రఘువంశంలో-

“అపాంసులానాంధురి కీర్తనీయా" అని సుదక్షిణాదేవికి విశేషణం చేశారు. పాంసులా అంటే? కులట. తద్భిన్నురాలు, అపాంసుల, అనగా? లంజకానిది. అంటే? మహాపత్రివ్రత అన్నమాట. అట్టివారలలో అగ్రగణ్యురాలు సుదక్షిణాదేవి అని తాత్పర్యము. మహాపతివ్రత అని చెప్పడానికి ముందు లంజ పేరెత్తుకొని ద్రావిడ ప్రాణాయామం చేయడంలో వున్న విశేషమేమిటో నాకు బోధపడలేదు. యెవరేనా విజ్ఞలు తెలిపితే తెలుసుకో తగ్గస్థితిలో వున్నాను. పిడివాదానికి వుపక్రమించే ప్రకృతి నాది కాదని సహృదయులకు నమ్మికవుంటే తెలుపుతారని నావిశ్వాసము. యిది విషయాంతరం. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటూ వున్నది గర్భాధానాన్ని గూర్చి యీపదంలో స్త్రీలకు ముఖ్యంగా లజ్ఞాకరమైన అర్థం వున్నట్టు యిటీవలివారు భావించి దీనికి పర్యాయపదాలు కొన్ని కల్పించుకోవడం సర్వానుభవసిద్ధమే అయినా కొంచెం వ్యాఖ్యానం చేస్తాను. దానిలో మన దేశంలో వైదికకుటుంబాలల్లో బయలుదేటిన పదం, బహుశః ఔపాసన అనేదనుకుంటాను. గర్భాధానంరోజున పగలు అగ్నిహోత్రం వుంచి ఆ దంపతులచేత హోమాలు చేయించడం సుప్రసిద్ధం. అందుచేత ఈమాటలో దీనికి సుమారు పది పండ్రెండు గంటలకాలంలో జరగCబోయేదాన్ని వాడితే అంత లజ్ఞాకరంగా వుండదని ఆలోచించి అలా లాక్షణికపదంతో వాడడం మొదలెట్టారని తోస్తుంది. కాని క్రమంగా ఆపదం కూడా అవయవార్థజ్ఞాన శూన్యంగా లజ్ఞాకరమైన అర్థాన్నే యివ్వడం మొదలుపెట్టింది. అంతటో, ఆ పదాన్ని వదలుకొని "పునస్సంధాన" పదంతో ఆ గర్భాధానాన్ని వాడడం మొదలుపెట్టేరు. ఈ పదం వాడేవారి అభిప్రాయం యేలాటిదో. నేను బాగా నిశ్చయించలేను గాని తోcచింది వ్రాస్తాను. వివాహంలో అగ్నిహోత్రాలు వుంచి సంకల్పం చేయడంలో - “యావజ్జీవం హోష్యామీత్యావయో స్సంకల్ప" అని వుపక్రమించడమేకాని యే వొకరో తప్ప మళ్లా ఆ అగ్నిహెూత్రాలవిషయం తలపెట్టినట్టే కనపడదు. కాని గర్భాధానంనాండు మళ్లా, అగ్నిహోత్రం వుంచి హోమం జరిగిస్తారు. ఆ జరిగించడానికి ముందు చేసే సంకల్పంలో- “విచ్ఛిన్న మగ్నిం పునస్సంధాస్యే అని సంకల్పం జరుగుతుంది. దానికి అర్థం, వివాహానంతరం అనంగా శేషహామంతో పరిసమాప్తి పొందిన అగ్నిహోత్రాన్ని మళ్లా సంధానం చేస్తూన్నాను అని. కనుక ఆ పదంతో అంటే "పునస్సంధాన" పదంతో వ్యవహరించవలసి వచ్చిందను కుంటాను. యీ అర్ధాన్ని నేను కొందఱు సంప్రదాయవేత్తలైన పండితులు వున్న సభలో వుపన్యసించి వున్నాను వారు సమ్మతించినట్లే తోచింది. కాని ఆ పండితులకు, శిరోమణి అని కాని “ఉరోమణి" అని కాని బిరుదాలు లేక డిగ్రీలు వున్నట్టు లేదు. పూర్వపు రకంగా వేద, వేదాంగాలు అభ్యసించి యునేక తరవాయులు శిష్యులకు చెప్పిన మహామహులు. యిప్పడు ఆ పండితులకు అంతగా గణ్యత కనపడదు. చూడండీ“అమవసనిసి యన్నమాట" అనే సందర్భంలో యీమధ్య వక శిరోమణిగారు ఆలంకారిక సమయాలెన్నో చూపివున్నారు. పైగా బ్రహ్మదేవుడికి లక్ష్మీగర్భవాసత్వాన్ని కూడా ఆ సందర్భంలో ఆపాదించారు. ముఖ్యంగా నాకు ఆలాటివారి పాండిత్యమంటే భయంవేస్తుంది. వారిని తలపెట్టకపోయినా కలగచేసుకొని యేదో వారు వ్రాయకమానరు. కాబట్టి మంగళార్థంగా వారిని కొంచెం స్మరించి వ్రాసుకొనేది వ్రాసుకోవడమే యుక్తమనుకొని ఆలా స్మరించి ప్రస్తుతాన్ని వుపక్రమిస్తాను. “ఔపాసన" పదంవంటిదే పదమున్నూ కాని కొంచెం శంకకస్థూత్రం అవకాశం లేకపోలేదు. పెండ్లికొడుకు గర్భాధానకాలం వఱకున్నూ జీవత్పితృకుండుగా వుంటే యీలోంగా అగ్నిహోత్రంతో ప్రసక్తివుండదుగాని అన్యథా ෂඨි పద్ధతిని తండ్రి తద్దినం లేక తల్లి తద్దినం తటస్థించినప్పుడు సమంత్రకంగా పెట్టేఎడల అగ్నిహోత్రంతో సంబంధంతప్పదు. అప్పడు ఈ శుభకార్యానికి వాడే "పునస్సంధాని" పదం ఆబ్దికానిక్కూడా వాడవలసివస్తుందేమో? అని శంకయితే ఇప్పడు నాకే కలిగిందిగాని లోకంలో గర్భాధానానికే కాని ఆబ్దికానికి అట్టివాడుక లేకపోవడంచేత అదిప్రస్తుతానికి బాధకంగాదు. అన్నిటికంటే వ్యవహారం ప్రబలమని ముందు తేలుతుంది. కాబట్టి విస్తరించేదిలేదు. దీని కోసం యితరోదాహరణాలు చూపవలసివస్తే అమరమూ, దాని వ్యాఖ్యానమూ పూర్తిగా వుదాహరించవలసివస్తుంది కనక స్పృశించి వొదులుతూ వున్నాను. యిప్పటికి, గర్భాధానం, ఔపాసనగానున్నూ పునస్సంధానంగానున్నూ కొన్నాళ్లకు లాక్షణికపదంగా మాటినట్లయింది. గద్వాల ప్రాంతంలో యీ పదాలతో యీ మహోత్సవాన్ని వాడుతూవున్నట్లులేదు. వారు “ప్రయోజనం" అనేమాటతో వాడుతూ వున్నారు. మేము હૈં ఆత్మకూరి ఠాజుగారికి కృతిగా ఆంద్రీకరించిన శ్రీనివాసవిలాసంలో మంగళ పద్యంలో-

“తన పునస్సంధానకాలమ్మనన్"

అని వాడేటప్పటికి ఆ సంస్థానపండితులు, పునస్సంధానమంటే యేమిటి? అనడానికి ఆరంభించారు. మేము “యిదేమిటండీ యీమాటకే అర్థం తెలియదా?” అని ఆశ్చర్యపోయాము. అప్పడు "ఎూదేశంలో యీ పదంతో దీన్ని వాడడంలేదని వారు చెప్పేటప్పటికి యేదేశంలో వుండే రాజుకు మేం కృతిపెడుతూన్నామో, &9 దేశస్టులకు తెలిసేపదం- “ప్రయోజనం" అనేదాన్ని వుపయోగించడమే యుక్తంగా వున్నప్పటికీ తీరా మా దేశంలోనికి వచ్చాక యెవరేనా- “యీ ప్రయోజన మేమిటి తిథిప్రయోజనమా?" అని ఆక్షేపిస్తారేమో? అని అమంగళార్ధవ్యంజకమైన ఆ ప్రయోజనపదాన్ని కూడా వదలుకొని మటోమోస్తరుగా సద్దుకున్నాము. ప్రయోజనంతో దీన్ని వాడేవారి తాత్పర్యం వివాహానికి గర్భాధానం ప్రయోజనం కనక ఆలా గోప్యంగా వాడుకుంటూ వున్నారని తేలుతుంది. యేమైనా మనకంటె కొంత అనాగరికమైన దేశమైనప్పటికీ గర్భాధానపదం ఆదేశంలోకూడా క్రమంగా మార్పునే చెందిందిగాని నిలిచివుండలేదనేది యిక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం. ఆయీ మాటలన్నీ రజస్వలా త్పూర్వం జరిగే వివాహాలను పురస్కరించుకొని పుట్టినవే. రజస్వలాత్పూర్వమందు జరిగే వివాహాలవారిలో నాగరిక ముఖ్యులుగా వుండే వెలమ జమీందారులు వగయిరాలు యీ శుభకార్యాన్ని “నగరుcబెండ్లి అనేపదంతో వ్యవహరిసూ వున్నారు. ఆయీ సందర్భాన్ని బ్రాహ్మణేతరులు అంతప్రధానంగా పరిగణిస్తూవున్నట్లే కనపడదు; అంటే, పీంటల మీఁద దంపతులను కూర్చోపెట్టడం వగయిరా తంతు జరపడం లేదన్న మూట. షోడశకర్మలలోను ΟΟΟΟ గర్భాధానం ప్రథమకర్మగా పరిగణింపC బడవలసిందే. అయినను పూర్వకాలంలో “నాన్ బ్రామిన్సు అంతగా లెక్కించినట్లు లేదు. కాని ప్రస్తుతం కేవల బ్రాహ్మణులు యే వొక్కరో తప్ప తక్కిన యావన్మందిన్నీ సంధ్యా వందనానికి సమేతు స్వస్తిచెప్పడంచేత ధర్మశాస్త్రప్రకారం వారికి శూద్రత్వం వచ్చితీరుతూవుంది కనక వారికిన్నీ అనcగా కర్మలోపశూద్రులనcబడే Q9 నామమాత్ర బ్రాహ్మలకిన్నీ జన్మశూద్రులకున్నూ భేదంలేదంటూ యీ మధ్య సద్ర్బాహ్మణ పురోహితసభలో నెవరో ముచ్చటించిన మాటలను నేను మిక్కిలిగా అభినందిస్తూ వున్నాను. බීඋසී బ్రాహ్మల యెడల ఆ సద్ర్బాహ్మణులు ఆపాదించినదోషము సర్వవిధాలా పడుతూ వున్నది. కాcబట్టి నిజమైన హృదయంకలవా రెవ్వరున్నూ నేంటివారు పైయాక్షేపణకు అభిమాన పెట్టుకోంగూడదని తలుస్తాను. “యీ వక్కటికేనా మీరు అభినందనాన్ని తెలిపేది" అని యెవరేనా శంకిస్తారేమో? ఆ సద్ర్బాహ్మణులు నా అభినందనాన్ని అభిలషించరు కనక ఆ విషయాన్ని విస్తరించనక్కఱలేదు. వారి ప్రచారం వకవిధంగా నేంటి బ్రాహ్మణ నామధారులకు వుపకరిస్తుందేమో అనుకుంటే కాలదెర్భాగ్యం అందుకుకూడా వొప్ప కుంటుందని తోంచదు. యిది విషయాంతరం. యిప్పటికి గర్భాధానం యెన్నో అవతారా లెత్తినట్లయింది. కొన్నిటికి వివరించడం అయింది. దీనికే రజస్వలాత్పూర్వం జరగవలసివస్తే నిషేకం అంటూకూడా యింకో మాట వాడుతూవున్నారు- అనే సందర్భం యిదివఱకే \ సూచించాను. నాన్బ్రామిన్సులో కొందఱు నాగరికులు యీమాటలేమీ వాడక “మా ಅಲ್ಲಣ್ಣಿ తీసుకువస్తామని మాత్రమే వాడతారంటూ బందరులో చెప్పంగా విన్నాను. ఎంత శాస్త్రీయమైనదయినా ఎంత ఆవశ్యకమయినదయినా యీకార్యం అన్ని వర్ణాలవారూ అంతో యింతో లజ్ఞాకరంగానే భావిసూవున్నారు. రాజులలో యింకో ఆచారం వుంది. అదేమిటంటే? భార్య పుట్టింట వున్నప్పడు ముసలితనంలోనేనాసరే అత్తవారింటికి అల్లుండు వెడితే చాలాతప్ప. అందుచేత వెళ్లనేవెళ్లండు. వక్క గర్భాధానాన్ని గూర్చే యేకొంచెమో వ్రాశాను. కాని దీనిలాగే అనేకావతారాలెత్తిన వెన్నో వున్నాయి, అవి లజ్ఞాప్రయుక్తమైన మార్పులుకావు. వాట్లనిగూర్చి మటోమాటు ప్రసంగించుకొందాం. గర్భాధానం యెత్తిన అవతారాలలోనే “శోభనం” అనేదికూడా చేరుతుంది. సర్వశుభకార్యాలకున్నూ పర్యాయంగా వాడుకోవలసిన “శోభన" పదాన్ని యెన్నాళ్లనుంచి వాడుతూ వున్నారో పెద్దలు విడమరిచి చెప్పలేముకాని, ಓಲ್ಟು గోదావరి, విశాఖపట్నం, గంజాం జిల్లాలలో సర్వత్రా వ్యవహరిస్తూ వున్నారనిమాత్రం చెప్పనక్కఱలేదు. ఈ అంశం ప్రతివ్యక్తిన్నీ యెడిగిన విషయమే. కొందఱు విమర్శకులు యీపదముతో గర్భాధానాన్ని వాడడానికిన్నీ అనుమోదించరు కాని వారి మతంలో దామోదర పదాన్ని “దరిద్ర' పరంగా వాడిన కవుల వాడకం కూడా సమన్వయించదు. అలా వాడిన ప్రయోగాలు రెండు మాత్రం జ్ఞప్తిలో వున్నవి చూపుతాను.

(1) “ఆలుబిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదలనుండియు నీవు దామోదరుఁడవె! చిత్రచిత్రప్రభావ!”

(2) “అవక్రవిక్రమ విరాజద్రాజదోర్టండమండిత సామ్రాజ్యవధూటి చేరంజనునే? నిర్భాగ్య దామోదరున్,"

యింకా వున్నాయి. యెంత పరీక్షించినా దామోదరపదానికి దరిద్ర పరమైన అవయవార్థం కనపడదు. కాని యేకారణంచేతో యీ అర్థంలో లోకంలో వాడుక కలిగింది. దాన్నికవులు గ్రంథాల్లోకి యొక్కించారు. సంస్కృత భాషాకవులకన్నయీలాటి విషయాలకు దేశభాషాకవులు మిక్కిలిగా స్వతంత్రిస్తారు. కవిత్వమనేది తన హృదయాన్ని యితరులకు విప్పి చెప్పే వుద్దేశంతో పుడుతుంది. అలా చెప్పడానికి నిఘంటువులు వగయిరాల వల్ల తెలిసేపదాలకన్న వ్యవహారంలో వుండే అగ్రామ్యపదాలు యొక్కువగా వుపకరిస్తాయి. గ్రామ్యపదాలున్నూ వుపకరిస్తాయి కాని అవి గ్రామ్యదోషాన్ని ఆపాదిస్తవి. యీ సందర్భం దేశభాషాకవులకు మాత్రమే కాదు; సంస్కృత కవులకున్నూ కనుకనే శాబ్దబోధోపకరణాలలో - వ్యవహారతశ్చ అని చేర్చివున్నారు. దాన్నిబట్టే మేము మా దేవీభాగవత పీఠికలో“కేవల గ్రామ్యపదముల నేవగించి, జనులు వాడెడి పదములు సమ్మతములు." అని వ్రాయడము తటస్థించింది. శాబ్దబోధోపకరణాలలో లాక్షణికులు వుదాహరించిన సామగ్రిలో వ్యవహారమే అగ్రస్థానాన్ని వహిస్తుందంటే వొప్పనివారుండరు. యిలా వ్రాయవలసివస్తే యెన్నో పదాలకు వ్రాయవలసి వుంటుంది. దీన్ని వుపలక్షణంగా పెట్టుకొని తక్కినవాటిని గ్రహిస్తారని ప్రస్తుతం దీనితో ముగిస్తూ యీవక్కమాటా వ్రాస్తాను. గర్భాధానం యెత్తిన అవతారాలు యెన్నో వున్నా అందులో మిక్కిలీ మృదువైనదిన్నీ ఆంధ్రదేశంలో చాలా వాడుకలో వున్నదిన్నీ శోభనమనే అవతారమే కనక దాన్ని వదలుకోకూడదని భావికవులను హెచ్చరిస్తూన్నాను. దీనికి మహాకవి ప్రయోగంకూడా ఉందని శ్రీగిడుగు వారనంగా విన్నాను. కాని దీనికి ప్రయోగంతో కూడా అవసరమే లేదని నా తాత్పర్యం. కృష్ణా డిస్ట్రిక్టులో కార్యమనికూడా అనడం కలదు. బహుశః యీ కార్యం గుంటూరు డిస్టిక్టులోనున్నూ వ్యవహరించేదే కావచ్చును! యింకా దీన్ని గూర్చి చర్చిస్తే మటికొన్ని యిలాటివే దొరికితే దొరుకుతాయేమో కాని వీటికన్నిటికిన్నీ శిరోమణి శోభనపదమే. యీ శోభనపదము సర్వశుభక్షార్యములకున్నూ వాచకమే అయిననూ ప్రస్తుతాన్ని విశేషించి చెప్పడం యోగరూఢిచేతనని విజ్ఞలకు తెలప నక్కఱలేదు. పంకజపదము అవయవార్ధమును పుచ్చుకొనే పక్షంలో నత్తగుల్లకుకూడా వాచకం కావలసి వున్ననూ రూఢిని పురస్కరించుకొని పద్మమాత్రమందు శక్తమయినట్లే అని వ్రాయనక్కరలేదు గదా? వ్యాసం విస్తరిస్తూవుంది. గర్భాధానపదం మోటుతనంగావుందని తోcచకపోతే దాన్నే వాడుకోండి, ಟ್ು “శోభన"పదాన్నే వాడుకోండి. అసలు నిఘంటులలో భుక్తికి, నిద్రకు కొన్ని ಮೆಳ್ತಲ್ಲಿನ್ಸ್ಯು. గాని దీనికిమాత్రం లేవు. యభనం వగయిరాలు వున్నాయంటారా? అవి బూతులలో చేరతాయి. అందుచేత శోభనమే ఆధారం. దీన్ని వదలుకోవడమనేది నేల విడిచిన సామువంటిదని మనవిజేస్తూ ముగిస్తున్నాను.

  • * *