ఆంధ్ర రచయితలు/ముడుంబ నృసింహాచార్యకవి

ముడుంబ నృసింహాచార్యకవి

1841- 1927

శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. జన్మస్థానము: శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు అచ్యుతపురి. జననము: ప్లవంగ సంవత్సర భాద్రపద బహుళ నవమి 1841 సం||రం సెప్టెంబర్ 22. నిర్యాణము: ప్రభవ సంవత్సర భాద్రపద బహుళ ద్వాదశి. 1927 సెప్టెంబరు 22 తేదీ. గ్రంథములు: 1. రంగేశ శతకము. 2. ప్రౌఢా శృంగారము. 3. ముగ్ధా శృంగారము. 4. కామినీదృష్టి శృంగారము. 5. అంగశృంగారము. 6. సంకీర్ణ శృంగారము. 7. శ్రీకృష్ణచాటువులు. 8. సత్య శతకము. 9. వృష్టిపంచాశక్తు. 10. గరుడాచల నాటకము. 11. కృతులు. 12. హరికథలు- సంస్కృత గ్రంథములు: 1. బ్రహ్మసూత్ర భాష్యము. 2. బ్రహ్మసూత్రరోమధము. 3. ప్రపత్తి చింత. 4. నృసింహ శారీరక భాష్యము 5.ఉజ్వలానంద చంపువు 6.వాసవ పరాశరీయ నాటకము. 7. జయసింహాశ్వమేధీయము. 8.. చిత్సూర్యాలోకము. 9. కావ్యసూత్రవృత్తి-ఇత్యాదులు. వీరు సంస్కృతమున వ్రాసిన తత్త్వగ్రంథముల సంఖ్య 22. సాహిత్యగ్రంథములు 14, నీతిశాస్త్ర రచనలు 2.

శ్రీమన్నరసింహాచార్యస్వామికి 'భగవత్కవి' యని బిరుదము. సింహాద్రినాథు నీయాచార్యు డుపాసించుచు దనకృతులు నన్నిటి నాతనికే యంకితముచేసెను. ముప్పదియేండ్లయీడున నున్నపుడొకప్పుడు వేదవ్యాసులు వీరికి గలలో గనబడెనట. స్వప్నమున వచ్చినదేవులగు------నడిగినట్లు వీరిని కృతి యడుగలేదు. వచ్చి దర్శన మిచ్చి--------అప్పటినుండియే యీయనలో నార్షప్రతిభ రేకెత్తెను. .... ...... కేశవస్వానుబు ..... ..... ....... ............ ............ ( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) పదవయేట సహజముగ గవితాధారయలవడినది. అచ్యుతపురాగ్రహారములో జిన్నతనమునాటి యొకవృత్తాంత మిట్లు చెప్పుదురు. అప్పన్నయను కుట్టుపనివాడు పట్టుగుడ్డతో నొకసంచి కుట్టి యమ్మకమునకు దెచ్చెను. ఈయాచార్యకవి బాలుడు దాని నాసించెను. కాని చేత గానిలేదు. తక్షణమే యీపద్యము వానిపై నాశువుగ జదివెను.


మునియాగరక్షకుండును

మునిపత్ని రక్షకుండు మోదముతోడన్

నిను గనుగొని ప్రోచుసుమీ

జరిజీ అప్పన్న నామ ! సద్గుణధామా !


చదువుకొన్నకుఱ్ఱ డని అప్పన్న సంతోషించి సంచి పట్టుకపొమ్మనెను. ప్రాసము పోయినదని యత డెఱిగిన సంచి యీయకపోయియుండు వాడు.


క్రమముగా నరసింహాచార్యకవి పండితుల తలలూపించు కవిత్వము వ్రాయ మొదలిడెను. పఠనీయములగు సంస్కృతాంధ్ర గ్రంథము లధికరించెను. శాస్త్రపాండితిని సంపాదించెను. కంఠము మంచి దగుట సంగీతముకూడ నేర్చెను.


వావిలివలస ప్రభుని దర్శించుట కొకప్పు డాచార్యులు పయనమైరి. ఆ దొరపేరు సీతారామయ్య. కవు లనిన నా ప్రభువున కభిమానము. ఆయనను దర్శించి నరసింహాచార్యు డీపద్యము చదివెను.


వెండికొండకు నీకీర్తి వెలిగలీబు

పాలకడలికి మీగడ పవికి దళుకు

శశికి దనకందుమానుప జాలుమందు

కొన డదేలొకొ శ్రీరామకువలయేశ


ఇదివిని రాజు రసికుడగుట నరసింహాచార్యుని తన యాస్థానకవిగ నుండ నడిగించెను. ఇత డిది యంగీకరింపక యిట్లు చెప్పెను. "నేను కొంతకాలము క్రితము శ్రీ విజయనగరము మహారాజు విజయరామగజపతి వేటకై యడవి కేగుచు పాలకొండ గ్రామమున విడిసినపుడు నేనాయన దర్శనము చేసియుంటిని. ఆ మహారాజు నా పద్యములు విని యానందించి విజయనగరము రమ్మని సెలవిచ్చెను. ఆయనయాజ్ఞచే మఱొకపుడు రాజధానికి బోయి జమ్మి వాసుదేవ రావుపంతులుగారి సాహాయ్యమున ఆనందగజపతి కుమార రాజేంద్రుని సందర్శింప గలిగితిని వారు నాకవితాధోరణి కానందపడి నన్ను దమయొద్ద నుంచెద మనిరి. ఇంతలో మహారాజుగారు సకుటుంబముగా గాశికి బోవ నయ్యెను. నన్నును దమతో రమ్మని చెప్పిరి. కాని నేను వెళ్ల వీలుగలుగలేదు. మేము తిరిగి వచ్చినతరువాత దర్శనము చేయుడని నాకు జెప్పివా రేగిరి. కావున నే నన్యాశ్రయము చేయజాలను."


నరసింహాచార్యునిమాటలు విని వావిలివలస ప్రభువు అబ్బురపడెను. అప్పటి కీకవివయస్సు ఇరువదిరెండేండ్లుమాత్రము, 1864 లో నీకవి తల్లితో దక్షిణదేశయాత్ర చేయుచు శ్రీరంగమునకు వచ్చి యచ్చట గొంతకాల ముండెను. అపుడే "వీతభవతృష్ణ! రంగేశ వేషకృష్ణ" అను మకుటమున నొక శతకము రుక్మిణీకల్యాణ కథాత్మకముగ రచించెను. ఈశతకము వావిళ్ళవారును, చెలికాని లచ్చారావుగారు నుద్ధరించి శతక సంపుటములలో బ్రకటించిరి. అందలి యొకపద్యము:


నీ కట్టివదలిన నెఱిక కన్నుల నద్ది
            యుత్తరీయంబు నుంచుకొందు
నీచుట్టిడిచిన నిరుపమ మాల్యముల్
            ముదమంది కొప్పులో ముడిచికొందు
నీ మహత్తర పాద నీరేజ తీర్థంబు
           చేఁద్రావి శిరమునఁ జిలికికొందు
నీ నోటికవ్రంపు నెఱివీడె మిచ్చుచ
           నమృతంబుగాఁ గేల నందుకొందు
నీదు పాదుక లౌదలఁ బాదుకొల్పి
చెనఁటి జన్మంబు సఫలతఁ జేసికొందు
నయ్య దాస్య మొసంగఁగదయ్య నేఁడు
వీతభవతృష్ణ! రంగేశ వేషకృష్ణ!

( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు) శ్రీరంగమున నొకవత్సర ముండి నరసింహాచార్యు డింటికివచ్చెను. శ్రీవిజయనగర ప్రభువులును గాశినుండి వే చేసిరి. మన కవి మరల మహారాజ దర్శనముచేసెను. ఆనందగజపతియు వీరి కవిత్వగోష్ఠి కలరి వీరిని మరిమరి ప్రేమించుచు వార్షిక బహుమాన మొనగుచుండెను. ఆనందగజపతి చెప్పుటచే మహారాజు విజయరామగజపతికిని నరసింహాచార్యుని కవిత్వపాండిత్యాదులపై విశ్వాసము కలిగినది. అప్పు డా మహారాజుపై మన కవివరు డిట్లు చెప్పెను.


ఈ జగమందు నిందు నటులెల్లరకుం గనువిం దొనర్చు మై
యోజ గనంగ రాజనుట కుల్లము సందియ మొంద దిందునన్
రాజను మాట మా విజయరామనరేంద్రునకే పొసంగు పై
రాజులు శోకవహ్ని మదిరాజుట రాజు లనంగ జెల్లెడిన్.


డక్కా డడాంకరణ రవ
ఫక్కత్ఫణిప ఫణమణి నిపతనజ శూల
స్స్పక్కర్ణ కుహార ఘర్ఘుర
ముక్కోలపభీత గుప్తముఖ కూర్మేంద్రా!


ఈ పద్యములు విని విజయరామరాజు చాల సంతోషించి నరసింహాచార్యుని తన సంస్థానకవిగ నాదరించెను. భర్తృహరి మున్నగు కృతులు మహారా జీ పండితునికడ బఠించెను.


కూరెళ్ళ రామశాస్త్రియను పండితు లొకరు "ఉమాముఖం చుంబతి వాసు దేవ," అను సమస్య నిచ్చి పూరింపుడని నరసింహాచార్యుల నడగినపు డాయన తడవుకొనకుండ


భవష్యదీశోపయమం విచింత్య
హిమాలయస్యాలయ మేత్య కిం తే
సుతేతి చోద్ధృత్య శిశుత్వ ముగ్ధ
ముమాముఖం చుంబతి వాసుదేవ.


అని చదివెను. ఆశువున నింత యందముగ జెప్పుట యబ్బురము. సంస్కృతాంధ్రములు రెండిటను వీరికవిత ప్రౌడతరము. తెలుగున వీరు వ్రాసినవి తక్కువగ నున్నవి. ఈ సమస్యాపూరణ మెంత రమణీయముగ నున్నదో యరయవచ్చును.


స్నిగ్ధత దేవదానవులు చెచ్చెర మందర భూధరంబునన్
ముగ్ధత వాసుకి న్బొదివి మ్రోయ మధింప హలాహలంబు వి
ర్దగ్ధము సేయ నద్రిశిఖరంబులు విచ్చి శరణ్యు దుండియున్
దుగ్ధ పయోధిమధ్యమున దుమ్మది గ్రమ్మె నదేమి చిత్రమో!


కవికల్పద్రుమ మనందగు నానందగజపతి 1897 లో బరమపదమందెను. ఆయన గతించినవెనుక నరసింహాచార్యుని కల మాగిపోయినది. ఇక విరక్తి నంది భగవదుపాసనమున గడపుచు నీభగవత్కవి యెనుబది యేండ్లు జీవించి 1927 లో జీవయాత్రచాలించెను. కూచిమంచి తిమ్మ కవివలె నరసింహాచార్యులును నలుగురు ప్రభువులకాలమున నుండెననుట యొక విశేషము.


ఈకవి తెనుగుకృతులలో గొన్ని చాటువులు, రంగేశ శతకమును శాశ్వతముగ నుండగలవు. సంస్క్ట్తాంధ్రములలో వీ కవిత్వపు మచ్చులు మఱిరెండు:


రాగోయం మధురాధరే క్షిపతి మాం సింహాచలాధీశ తే
జ్ఞానం త్యశ్పదపద్మ శుభ్రవఖరజ్యోత్స్నా మధ: కర్షతి
లో సింహాచలనాధ పాహి లలితం ద్వేధాశ్రమా పాదనామ్‌.
ద్యత్రార్హ్యాన్ధితి రస్యతత్ర ననతిం దేహి ప్రభోమాచిర.

...............

............

.........

................( ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)