ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము/ఉపోద్ఘాతము

శ్రీ

ఆంధ్రాభాషా చరిత్రము

ఉపోద్ఘాతము.

ఆంధ్రభాష ద్రావిడభాషలలో నొకటిగా నేడు పరిగణింప బడుచున్నది. ద్రావిడ భాషలకును ఇండో యూరోపియను భాషలకునుగల సంబంధమును గూర్చి వివిధాభిప్రాయము లున్నవి. ఈ యభిప్రాయములు మఱియొక యధ్యాయయనందు వివరింపబడును. ఆంధ్రభాష యిప్పటి స్వరూపముతో క్రీస్తుశకము 8 వ శతాబ్దము నుండియు నుండినట్లు నిదర్శనములు కానవచ్చుచున్నవి.

భరతవర్షమున వాడుకలోనున్న భాషలలో జనసంఖ్యనుబట్టి యాంధ్రభాష మూడవస్థానము నాక్రమించుచున్నది.. హిందీ, బంగాళీ భాషల తరువాత నెక్కువ ప్రచారములోనున్నదియు నెక్కువ ప్రదేశమునందు వాడుకలో నున్నదియునగు భారతీయభాష యాంధ్రభాషయే. ఈ గ్రంధ వివరములు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, 4- పుటమునుండి తీసికొనబడినవి.

ఆంధ్రము గృహభాషగానున్న వారిసంఖ్య.

1891 సం. జనాభా 1901 సం. జనాబా
మధ్యపరగణాలు 99,527 79,927
చాంద 69,000 71,789
బస్తరు 30,527 8,138
1891 సం.జనాబా 1901 సం. జనాబా
బేరారు 28,750 23,006
బంగాళారాజధాని 11,522 14,226
కటకము 4,800 6,292
పురి 4307 4150
ఒరిస్సాసామంతరాజ్యములు 2,525 3,784
11,632 14,226
చెన్నరాజధాని 12,017,002 12,575079
గంజాము 72,287 342,910
గంజాము (ఏజెన్సీ) 3,366 5,864
విశాఖపట్టణము 1,881,678 1,999,791
విశాఖపట్టణము (ఏజెన్సీ) 113,052 153,168
గోదావరి 1,914,769 2,099,417
గోదావరి (ఏజెన్సీ) 96,784 119,503
కృష్ణ 1,739,326 2,015,815
నెల్లూరు 1,364,445 1,385,097
కడప 1,139,891 1,160,567
కర్నూలు 717,140 763,085
బళ్లారి 267,327 282,791
అనంతపురము 570,921 333,796
చెంగల్పట్టు 242,737 312,946
ఉత్తర ఆర్కాడు 842,880 856,480
సేలము 360,915 416,120
బనగానపల్లి 28,021 26,139
సండూరు 1,463 1,590
12,017,002 12,575,079

గృహభాషగా గాక యితర ప్రాంతములలో నాంధ్రమును మాటలాడువారి సంఖ్య.

1891 సం. జనాభా 1901 సం. జనాబా
అండమాను నికోబారు దీవులు ..... 212
అస్సాము ..... 5,259
1891 సం. జనాభా 1901 సం. జనాబా
బెలూచిస్థానము ..... 36
బంగాళారాజధాని ..... 4,454
బీరారు 14,488 12,425
అమరావతి 3,593 3,221
ఆకోల 3,170 3,312
ఎల్లిచిపురము 1,225 1,315
బుల్డాన 2,759 2,606
14,488 12,425
బొంబాయిరాజధాని 62,860 109,988
బర్మా ..... 96,601
మధ్యపరగణాలు 21,295 22,654
కుడగు 3,751 2,974
చెన్న రాజధాని 16,94,466 17,60,361
మద్రాసు 1,03,423 1,08,496
కోయంబత్తూరు 4,40,307 4,68,135
నీలగిరులు 4,332 4,391
దక్షిణ ఆర్కాడు 2,27,055 2,28,260
తంజావూరు 80,630 94,872
తిరుచానపల్లి 1,61,342 1,69,784
మధుర 3,67,613 3,94,358
తిరునల్వేలి 2,59,048 2,59,936
మలబారు 20,309 19,587
దక్షిణకనరి 2,096 1,340
పుదుక్కోట 10,797 11,066
కొచ్చిరాజ్యము 12,087 11,676
తిరువాన్కూరు 5,426 7,460
పశ్చిమోత్తరపరగణాలు ..... 203
పంజాబు ..... 7
సంయుక్తపరగణాలు ..... 640
బరోదా ..... 322
1891 సం. జనాభా 1901 సం. జనాబా
మధ్య యిండియా ..... 777
రాజపుత్రస్థానము ..... 61
17,96,860 2,16,974

ఆంధ్రభాషతోసంబంధించిన చిన్న చిన్న మాండలికభాషలను

మాట్లాడు వారిసంఖ్య యీక్రిందచూపబడినది.

1891 సం. జనాభా 1901 సం. జనాబా
కోమ్టావు 3,827 67
సాలేవారి 3,660 .....
గోలరి 25 22
బేరాది 1,250 .....
వడరి 27,099 3,860
కామాఠి 12,200 4,704
మొత్తం 48,061 4,704

పై యంకెలనన్నిటినిగూడిన నాంధ్రభాషను దానియుప

భాషలను మాట్లాడువారి సంఖ్యవచ్చును.

1891 సం. జనాభా 1901 సం. జనాబా
ఆంధ్రముగృహభాషగాగలవారు 17,938,980 18,675,586
ఆంధ్రేతరప్రదేశములలో 1,796,860 2,016,974
ఉపభాషలను మాట్లాడువారు 48,061 4,704
మొత్తము 19,783,901 20,697,264

ఆంధ్రులజనసంఖ్య గడచిన ముప్పదివత్సరములలో నీక్రిందిరీతిగా పెరిగినది.

(చెన్నరాజధానిలో 10,000 మందికి.)

1901 1911 1921 1931
3,706 3,769 3,772 3,768
ఖాళీ పుట.

విస్తీర్ణము.

ఆంధ్రభాష ప్రచారములో నున్న ప్రదేశమునకు తూర్పుదిక్కున నంతయు బంగాళాఖాతమున్నది. దాని కుత్తరపు స్వాభావికమయిన యెల్ల ఋషికుల్యానది. ఆనది కుత్తరమునగూడ నాంధ్రులు వాసమేర్పఱచు కొని యున్నారు. ఋషికుల్యనుండి పడమటగా నాయెల్లపోయి తూర్పుకనుమలను దాటి నైఋతిమూలగా బస్తరు సంస్థానములోని సుంకము, బిజ్జితాలూకాల సరిహద్దయిన శబరీనదిని దాటి, బేలదిలగుట్టలవెంబడి జరగి యింగ్రానదివఱకుబోవుచున్నది. అక్కడనుండి యానది యొడ్డునసాగి, యది గోదావరిని గలియువఱకుబోయి, చాందాజిల్లా దక్షిణభాగ మంతటిని దనలో నిముడ్చుకొని, యింకను దూర్పుగ సాగి పూనుజిల్లా దక్షిణభాగమునంతటిని దనలో జేర్చుకొనుచున్నది. అచ్చటనుండి దక్షిణముగ మంజీరానది గోదావరియందు సంగమించు స్థానమువఱకునుబోయి యింకను దక్షిణముగసాగి బీదరు మండలమున కన్నడముప్రచారములోనున్న ప్రదేశములోనికి చొచ్చుకొనిపోవుచున్నది. అచ్చటనుండి సరిగ దక్షిణముగ నైజామురాష్ట్రములోని యాఱు జిల్లాలను దనలో జేర్చుకొని, తిరిగి బ్రిటిషు ఇండియాలోని బళ్లారి జిల్లాను సరిగ రెండుభాగములు చేయుచున్నది. ఆ తరువాత నది యట్లేసాగి యనంతపురము జిల్లా ద్వారా మైసూరుసంస్థానమును చొచ్చుకొని యందలి బెంగళూరు, కోలారు, నందిదుర్గము, చిత్రదుర్గము జిల్లాలను దనలో జేర్చుకొనుచున్నది. అక్కడనుండి యుత్తరఆర్కాడు, చెంగల్పట్టు జిల్లాల మధ్యభాగముగ సాగి తిరిగి బంఘాళాఖాతమును జేరుచున్నది.

ఆంధ్రమున కుత్తరమున ఒఱియాభాష, హళబీ ఉపభాష, గోండి, మరారీభాషలును, పశ్చిమమున మరారీ కన్నడములును, దక్షిణమున తమిళమును బ్రచారములోనున్నవి. ఆంధ్రమున కితరభాషలతో సంయోగము కలుగుకొన్నిచోట్ల నది చల్లచల్లగ వ్యాప్తమగుచున్నది. గంజామున కుత్తరమున నొరిస్సాలోను, మధ్యపరగణాలలోను, నైజామురాష్ట్రములోను, నది నానాటికిని విస్తరించుచున్నది. మైసూరు సీమలో కన్నడ మాంధ్రమును వెనుకకు తఱము చున్నది.

ఆంధ్రమునకు సంబంధించిన యుపభాషలు.

ఆంధ్రము మాతృబాషగానున్న ప్రదేశమునందంతటను నొకటే రూపమున నుండక యీషద్భేదములను గలిగియున్నది. సరిహద్దు ప్రాంతములం దితరభాషలతో సంయోగము గలిగినచోట్ల నాయాభాషల శబ్దజాలమును, కొంచెము మట్టుకు భాషారూపమును నాంధ్రము సంగ్రహించుట వింతగాదు. గంజాముజిల్లాలో బరంపురము, ఛత్రపురము మొదలగు ప్రాంతములం దోడ్రపుమాట లెక్కువగా నాంధ్రమున గలియుచుండును ఉండెను అనుటకు ఉంటిడి యను రూపమిచ్చట వింతగా గానవచ్చును. బళ్లారి మొదలగు ప్రాంతములందు 'కొఱకు,' అనుటకు 'కోస్కరము' అని తెనుగు 'కు' ప్రత్యయమునకును కన్నడపు ఓస్కర ప్రత్యయమునకును సమ్మేళనము కలిగినది. ఇట్టి కొంచెపు భేదములను పాటింపనిచో నాంధ్రభాష యన్నిప్రదేశములందును నొక్కతీరుననే యున్నదని చెప్పవచ్చును. ఏసనుబట్టియు పదములపై మాట్లాడువారుంచు నూతగలస్థానములబట్టియు పదములు వివిధ వికారములను బొందుటయు స్వాభావికమే. ఇదిగాక యాయాప్రదేశముల చరిత్రమును బట్టియు నందలి యన్యదేశీయుల ప్రాబల్యమును బట్టియు శబ్దజాలము కొంతవఱకు వేర్వేరుగా నుండుట సంభవించును. ఏప్రాంతమునందైనను జీవద్భాష యెల్లఫ్ఫుడు నొక్కటే తీరున నుండుట యసంభవము. ఏప్రాంతపు భాషయయినను పరిశుద్ధమయినదని చెప్పుటకు వీలులేదు. గోదావరీ కృష్ణా మండలములవారిభాష యుత్తమమయినదనియు బరిశుద్ధ మయినదనియు గొంద ఱనుకొనుట గలదు. కాని, యిట్టి యభిప్రాయము కేవల మభిమాన ప్రేరితమని వేరే చెప్పనక్కఱలేదు.

జాతివర్ణములబట్టియు వృత్తులనుబట్టియుగూడ నుడికారము మారుచుండును. ఏక కాలమునందే, ఏకప్రదేశమునందే వివిధములగు నుచ్చారణములు వినబడుట యనుభవసిద్ధము, మాటలతీరునుబట్టి యొకడు బ్రాహ్మణుడో, క్షత్రియుడో, వైశ్యుడో, శూద్రుడో, ఇతర జాతివాడో వెంటనే పోల్చుకొనవచ్చును. ఇదిగాక మాటతీరునుబట్టి యొక డేమండలమువాడో కూడ తెలిసికొనవచ్చును. ఇట్టి యుచ్చారణభేదము లన్నియు నే భాషయందైనను స్వాభావికముగ నుండక తప్పదు. అంతమాత్రమున నవియన్నియు భాషాభేదములని యెంచరాదు.

అయినను, సాధారణాంధ్రభాషకు మిక్కిలి విలక్షణముగా గనబడు కొన్ని యుపభాష లాంధ్రేతరప్రదేశములందు ప్రచారములోనున్నవి. మధ్య పరగణాలలోని చాందాజిల్లాలో నాంధ్రభాషకు, కోంటావు, సాలేవారి, గోలరి అను పేళ్లున్నవి. ఈమూడును వేర్వేరగు నుపభాషలుగా నెంచుటకు వీలున్నను వానియుచ్చారణమును, సుప్తిజంతవిధానమును నొక్కతీరుగనే యున్నవి. కర్ణాటక దేశములోను బొంబాయి యందును, నాంధ్రమునకు సంబంధించిన కొన్ని యుపభాషలు కలవు. అవి కొన్నివృత్తులకు సంబంధించినవారి యాంధ్రభాషా వికారములుగా నున్నవి. బెల్గాము జిల్లాలో బేరాది, దాసరి, యనుభాషలును, బొంబాయి పట్టణమునందలి కామారీభాషయును, బొంబాయిరాజధాని, బేరారు మొదలగు ప్రదేశములలో సంచారశీలురగు నొకజాతివారు మాటలాడు వడరీ భాషయను నట్టివి ఇవియెవ్వియుగూడ సాధారణవ్యవహారభాష కెక్కువ విలక్షణముగ నుండక పోవుటచే వీనినిగూడ బ్రత్యేకోపభాషలుగా బరిగణింప నక్కఱలేదు.

గ్రాంథిక భాష, వ్యావహారిక భాష.

భాష కేవలము వాగ్రూపముగా నున్నంతకాలమును మార్పులను పొందుచుండుట సహజము. కాని, దానిని వ్రాతరూపమున బెట్టిననాట నుండియు గొంత స్థిరత్వ మేర్పడుచుండును. వ్రాతను చదువనేర్చినవారు పూర్వకాలపు శబ్దస్వరూపమును నిలబెట్టుటకు బ్రయత్నించుచుందురు. ఈ ప్రయత్నము సంపూర్ణముగా సాధ్యము కాకపోవచ్చును. లిఖిత భాషా స్వరూపము గూడ వ్యవహారభాష ననుసరించి మారుచుండుట యసంభవము కాదు. కాని వ్యవహారభాషయంత శీఘ్రముగ లిఖితభాష మాఱ జాలదు. కొన్నినాళ్ల కాభాషయం దుత్తమగ్రంధములు వెలువడినచో నాగ్రంధముల యందలిభాష తరువాతివారికి మార్గదర్శకముగా నేర్పడును. దానికొక ప్రమాణత్వము గలుగును. సాధ్యమగు నంతవఱకు దరువాతివా రాభాషనే యనుకరింప బ్రయత్నింతురు. అయినను, వ్యవహారభాషనుబట్టి యాగ్రంధకర్తల గ్రంధములందలి భాషాస్వరూపమును మాఱుచుండును. భావములనుబట్టియు రుచులనుబట్టియు నాయాగ్రంధకర్తల నుడికారము మారుచుండుట వింతగాదు. అందుచేత నిదియే ప్రమాణ గ్రాంధికభాషయని నిరూపింప వీలులేదు. తొలుదొల్త వ్యావహారికభాషయే గ్రంధస్థమై యుండినను నానాటికిని దానికిని గ్రాంధికభాషకును నంతర మెక్కువయగుట సంభవించి, యారెండును వేర్వేరుగ నేర్పడుచుండును. గ్రాంధికభాష మిక్కిలి మెల్లగ మాఱుచువచ్చుచుండ, వ్యావహారికభాష ముందంజవేయుచు దన సహజమార్గమున మార్పులు పొందుచుండును. ఏభాషకైనను నీగ్రాంధిక వ్యావవారికావస్థా భేదములు తప్పవు. ఇతరదేశములలో గ్రంథకర్త లీయంతరము నెక్కువగా నుండనీయక వ్యవహారమునే లక్ష్యముగ నుంచుకొని యుండ, భారతీయభాషలు గ్రంధస్థ భాషనే పరమలక్ష్యముగ జేకొనియుండుటచే వ్యవహారమునకును గ్రంధస్థ భాషకును మిక్కిలి యంతరమేర్పడినది. సంస్కృతభాషా ప్రాబల్య మిందుకు ముఖ్యకారణమని వేరేచెప్ప నక్కఱలేదు. సంస్కృతభాష పాణినీయాది వ్యాకరణములమూలమునను నిఘంటువులమూలమునను స్థిరీభూతమగుటచేతను, వ్యవహారభ్రష్టమగుటచేతను, నందు చాలవఱ కెట్టిమార్పును గలుగకుండెను. కాని నాటనుండి నేటివఱకు బ్రవాహరూపమున వచ్చుచున్న జీవద్భారతీయ భాషలుగూడ సంస్కృతభాషానుయాయులగుటచే గ్రంధస్థభాషకును వ్యవహారభాషకును నింతటి భేదమేర్పడినది. ఈ యంతరముండుట మంచిదా కాదా యనువివాద మన్నిభాషలయందును గలదు. అన్ని ప్రాంతముల యందును వ్యావహారికభాష పూర్వకాలపు గ్రాంధికభాషను గొంతవఱకైనను త్రోసిపుచ్చి, యాస్థానము నాక్రమించుకొనుచున్నది. ఇట్లుండ బూర్వగ్రాంధికభాషతోడి పరిచయము సంపూర్ణముగ లేకపోవుటచేతను. వ్యవహారము నతిక్రమింప సాధ్యము కాకపోవుటచేతను, గ్రంధకర్తలు కొన్నికృతకరూపముల గల్పించుకొనుట సంభవించుచున్నది. ఈ కృతకరూపములు కొన్నియెడల వ్యవహారములో గూడ స్థిరములగుట సంభవించుచుండును. ఈరీతిగ నాంధ్ర భాషయందును వివిధములగు మార్పులు కలుగుచున్నవి. ఈ మార్పులన్నియు నేరీతిగ నేయే కారణములచే గలిగినవో తెలియ జేయుటయే యాంధ్రభాషా చరిత్ర ముఖ్యోద్దేశము.

ఆంధ్రులు.

ఆంధ్రులను జాతివారినిగుఱించి మనకు వేదకాలమునుండియు దెలియవచ్చుచున్నది. ఐతరేయ బ్రాహ్మణమున నీక్రింది వాక్యములున్నవి. "తస్యహ విశ్వామిత్ర స్యైకశతం పుత్రా ఆను; పంచాశత్ ఏక జ్యాయాంసో మధుచ్ఛందస:; పంచాశత్ కనీయాంస:; తద్వై జ్యాయాంసో నతే కులమ్ మేనిరే. తాన్ అనువ్యాజహారన్ తాన్‌వ:ప్రజా భక్షిస్తేతిత ఏతేంధ్రా: పుండ్రా: శబరా: పుళిందా మూతిబా ఇత్యుదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనామ్ భూయిష్ఠా:" - పైదానిప్రకార మాంధ్రులు విశ్వా మిత్రుని సంతానమైనట్లును, వారు పుండ్ర, శబర, పుళింద, మూతిబాది జాతులతో దన్యులుగా బరిగణింప బడినట్లును దెలియుచున్నది మనుస్మృతిలో - "కారవరం నిషాదాత్తు చర్మకారాం ప్రసూయతే | వైదేహకా దంధ్రమేదౌ బహిర్గ్రామవ్యవస్థితౌ" అని యున్నది. దీనిప్రకారము ఆంధ్రులు వైదేహకులకు జనించినవారనియు, వారు గ్రామములకు బయట నుండవలసిన వారనియు దెలియుచున్నది. పురాణములలో నాంధ్రుల ప్రశంస గానబడుచున్నది అం దంధ్ర, ఆంధ్ర శబ్దములు రెండును కానవచ్చుచున్నవి. వాయు మత్స్యపురాణములలో నంధ్రులనుపేరును, వాయుపురాణమున నంధ్రియలను పేరును గానవచ్చుచున్నది. భాగవత పురాణమున చాణూరమల్లు డాంధ్రుడని యున్నది మెగాస్తనీసు అను గ్రీకు రాయబారి యాంధ్రులను బేర్కొనియున్నాడు. అశోకుని శాసనములందు ఆంధ్రశబ్ద మున్నది. అశోకుని గిర్నారు శాసనములందు 'అంధ పిరిందేషు' అనియు, షాబాజుగడీ శాసనములందు 'భోజపితిని కేషు ఆంధ్ర పులిదేషు' అనియు నున్నది క్రీ పూ. 150 సంవత్సరపు హాధీ గుంఫా శాసనమున నాంధ్రవంశములోని మూడవరాజగు శాతకర్ణి పేర్కొనబడి యున్నాడు. ఇతడు కళింగరాజగు ఖారవేలునకు సమకాలికుడు. కృష్ణాజిల్లాలోని చిన్నచిన్న యను గ్రామమునకు సమీపమున కృష్ణానదికి దక్షిణమున సముద్రతీరమున నాంధ్రరాజగు యజ్ఞశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి 27 వ రాజ్య సంవత్సరపు శాసనమొకటి దొరకినది. పులమావియను నాంధ్రరాజు నేడవరాజ్యసంవత్సరపు శాసనమొకటి కార్లేయొద్దను, మఱియొకటి భీల్సావనము నొద్దను దొరకినవి. గుంటూరుజిల్లాలోని యమరావతియొద్ద గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత రాజ్యమునేలిన వాసిష్ఠీపుత్ర శ్రీపులుమావి శాసనము చిక్కినది క్రీ శ. 554 లోని హరహ శాసనమునం దాత డాంధ్రపతిని జయించినట్లున్నది. విగ్రహపాలుని పండ్రెండవరాజ్యసంవత్సరపు శాసనమున - "మహత్తమోత్తమకుటుంబి పురోధార్ మేదాంధ్ర చండాల పర్యంతం" అని యున్నది. దీని ప్రకార మాంధ్రులు మేదులతోడను చండాలురతోడను చేర్పబడినట్లు దెలియుచున్నది. క్రీ.శ. 1115 సంవత్సరపు జాజల్లదేవుని రత్నపుర శిలాశాసనమున నాంధ్రకిమిడి, కోసలాంధ్ర కిమిడి యను నామములు గానవచ్చుచున్నవి. క్రీ.శ. 1171 సంవత్సరపు మదగిహల్లు శాసనమును బిజ్జలుడు ఘూర్జర మగధ కళింగాంధ్ర సౌరాష్ట్ర వేంగీ రాజులను జయించినట్లున్నది. క్రీ.శ. 1358 సంవత్సరపు ఒక శాసనమున ముమ్మిడి నాయకునిగూర్చి "ఆంధ్రశ్రీశో దేశానంధ్రాన్ రక్షితుం" అని యున్నది. క్రీ.శ 1368 సంవత్సరపు సింగనాయకుని అక్కలపూడి శాసనమున నాంధ్రదేశప్రశంస యున్నది. క్రీ.శ. 1466 సంవత్సరపు విరూపాక్ష దేవుని శ్రీశైల తామ్రశాసనము నందాతనికి ద్రావిడాంధ్ర మహీపతి అను బిరుదమున్నది.

పై శాసనముల బట్టియు నితరాధారముల బట్టియు నాంధ్రులు తొలుత మ్లేచ్ఛులుగా బరిగణింప బడియు నానాటికి దేశమందంతటను వింధ్యపర్వత ప్రాంతములనుండి నానాముఖముల వ్యాపించి ప్రబలులై రాజ్యముల స్థాపించుకొన్నట్లును వారు వ్యాపించిన దేశమున కాంధ్రదేశమను సంజ్ఞ కుదురుకొన్నట్లును దెలియనగును. ఈ యాంధ్రదేశమును క్రీస్తు శకారంభమున శాతకర్ణులను వారు జయించి రాజ్యమును సాగించినట్లు గొందఱు చెప్పుదురు. శాతకర్ణు లాంధ్రులేయను వాదముగూడ గలదు. ఈ శాతకర్ణులలో గౌతమీ శాతకర్ణులు, వాసిష్ఠీపుత్ర శాతకర్ణులు, మాడరీపుత్ర శాతకర్ణులు, అను మూడు విధములవా రున్నట్లు రాజుల పేళ్లనుబట్టి తెలియవచ్చుచున్నది. ఈ యాంధ్రరాజ్యము తూర్పుతీరమునుండి పడమటితీరమునకు వ్యాపించినదో పడుమటనుండి తూర్పుతీరమునకు వ్యాపించినదో యను విషయమై వివాదములున్నవి. కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళ మాంధ్రరాజులకు మూలస్థానమను వా రాంధ్రులు పశ్చిమమునకు వ్యాపించినట్లు చెప్పుదురు. నాసిక మూలస్థానమను వా రాంధ్రులు తూర్పునకు వ్యాపించినట్లు చెప్పుదురు.

ఇట్లాంధ్రులనియు నాంధ్రదేశమనియు వ్యవహరింప బడుచున్న శబ్దము లాంధ్రరాజుల శాసనములందు కానరాకుండుట చిత్రముగా నున్నది. ఆంధ్రభాషయను పేరుగూడ నాంధ్రరాజుల శాసనములందు గానరాదు. తిక్కనకాలమువఱకును తెనుగున కాంధ్రనామమున్నట్టు నిదర్శనములు లేవు. ఆంధ్రరాజుల శాసనములన్నియు బ్రాకృతమునందున్నవి. ఇవి నాసిక కార్లేయను పశ్చిమతీర ప్రదేశములనుండి గోదావరీ కృష్ణానదీ మార్గముల ననుసరించి యిప్పటి యాంధ్రదేశమునకు గర్భమనదగు గుంటూరు సమీపమున నున్న అమరావతి, ధాన్యకటకము, నాగార్జునకొండ మొదలగు ప్రదేశములందు నిబిడములై తూర్పు సముద్రతీరమున కృష్ణానదీముఖమువఱకు వ్యాపించి యున్నవి. ఈ శాసనముల భాష యాంధ్రభాష యనుకొనినచో నది నేటి తెలుగు రూపమును దాల్చువఱకు నెట్టి పరివర్తనముల బొందినదియు దెలిసికొన వచ్చును. ఈ యాంధ్రదేశపు భాష యెట్టిప్రాకృత మనువిషయముగా వివిధాభిప్రాయములు కలవు. క్రీస్తు శకారంభమున నీ ప్రదేశమంతయు బౌద్ధమతాక్రాంతమై యున్నట్లు చరిత్రమువలన దెలియుచున్నది. సింహళ ద్వీపమునం దేర్పడిన తిపిటకములను బౌద్ధ ధర్మగ్రంధములభాష పాలిభాషయని పిలువబడుచున్నది. ఈ పాలిభాష యెక్కడిదను విషయమును ఓల్డెర్ బర్గు పండితుడు తాను సంపాదించిన తిపిటకములను గ్రంధము రెండవ సంపుట మగు ఛుల్లనగ్గమ నకు వ్రాసిన పీఠీకలో నా పాలిభాష యశోకుని పుత్త్రుడగు మహిందుని జన్మస్థానమగు నుజ్జేనీభాష కాదనియు గళింగాంధ్రదేశములందాకాలమున బౌద్ధమతము మిక్కిలి ప్రచారములో నుండెననియు, బుద్ధఘోషు డాంధ్రులకు సంబంధించిన బౌద్ధగ్రంధమగు అట్ఠకధను తఱచుగ స్మరించినాడనియు, కావున నీ పాలిభాష యాంధ్రదేశమునందలి ప్రాకృత భాషయే యనియు, నాంధ్రరాజుల శాసనముల భాషకును పాలిభాషకును నెక్కువభేదము లేదనియు, గావున నాకాలమున నాంధ్రులభాష పాలిభాషగా నుండి యుండవలెననియు నభిప్రాయ పడియున్నాడు. ఈ యాంధ్ర శాసనములలోని నాగార్జునకొండయందలి శాసనము లింకను బ్రచురింప బడలేదు. మనకు లభ్యములగు నాంధ్రశాసనములలో నెక్కువగా లభించినవి నాసిక యందలి శాసనములు కావున వానియందలి భాష కుదాహరణముగా మూడవ గుహ వసారా వెనుకగోడపై ద్వారమునకు బైగానున్న యీ శాసన ముదాహరింప బడుచున్నది.

1. సిద్ధం1 రఞి' వాసిరీపుతస2 సిరిపుళుమాయిననవీచ్ఛదె3 ఏకుననీసె 19 గీమ్హాణ4 వఖె బితీయె 2 బనసె తెరసె 13 రాజరఞో గోతమీపుతస హిమనత - మెరు-

2. మదర - వనత సమసారప అసిక - అనక5 - ముళక - సుదర - కుకు - రాసరంత6 - అనుప - విదభ - ఆకరావతి - రాజసవిఝ - చ్ఛనత - సారిచాత7 - నహ్య - కణ్హగిరి - మఛ - సిరిటన - మలయ - మహిద -

3 సెటగిరి - చకొర - సనతసతిన సనరాజలోక8 మడల పతి - గహీతసాసవన దినసకరకర10 విబోధిత కమల వినుల సదిసవదనప తినముద - తోయపీతవాహన సనటిపుణ చదమడల నసిరీక-

4 పయదసవన వరవారణ వికమ చారువికమస భుజగపతి భోగసవవాట11 - విపులరీఘ సుద భుజస12 అభయోచక దాన కిలివనిభయకరస అవివన మాతు సుసూ సాక ససు విఛతతివగ దెసకాలస-

5 పొరజన నివిసెన సమసుఖ దుఖస ఖతియద సమాన మదనస14 సక - యవన - పల్హవ - నిసూదనస ధమొపజితకర వినియోగకరస కీతాప రాధెపి సతుజనె అపాణహిసారుచిస దిజావరకుటుబ వివధి-

6. నస ఖఖరాతవస15 నిరనిరవ సెసకరస సాతవాహన కులయస పతిథాపన16 కరస సవమదలా17 బివాడితచ ణసవినివతిత చాతువణస కరస అనెక సమరావజిత సతుసఘస అపరాజిత విజయపతాక సతుజన దు - పధసనీయ18 7. పురవరస కులపురిస వరపరాగత విపులరాజసదస ఆగమాన19 - నిలయస సపురిసానం అసయస సిరీయ్ - అధిరానస ఉపచారన20 పభవస ఎక కునస ఎకధనుధరస ఎక సూరస21 ఎక బమ్హణస రామ-

8. కేస - వాజున - భీమసెన - తులపరకమస22 చ్ఛణఘను సన-23 సమాజకారకస నాభాగ -24 సహుస - జనమెజయ - సకర - యయాతి - రా - మాబరీస - సమతెజస అపరిమితం అఖయమ్ అచితమ్ అభుత25 - పవన - గరుళ -26 సిధ - యఖ - రఖస - విజాధర - భూత - గధవ - చారణ-

9. చద - దివాకర - వఖత - గహ - విచిణసమరసిరసి జితరిపుసఘసనాగ27 వరఖధాగగన తలమ్ అభివిఘాడస కులవిపులసిరి కరస సిరి - సాతకణిస మాతుయ మహా - దేవీయ28 గొతమియ బలసిరీయ సచవచన దాన ఖమా29 హిసా30 నిరతాయ తప - దమనియ -

10. మొపవాస తపరాయ రాజరిసి మధుసదమ్31 అఖిలమ్ అను - విధీయమానాయ కారిత దెయ ధమ ... ... ...32 సిఖరసదిసె తిరణ్హు - పవతసిఖరె విమ్33 వర - నివిసెస మహిడీకలెణ ఎతచలెణ మహాదేవ మహా రాజమాతా మహారజస్ X తామహీ34 దదాతి నికాయస భదావని - యానం35 ఖిఖుసఘస36.

11. ఎతస చలెణస చితణ నిమిత37 మహాదెవీయ అయకాయ సెవ - కామొ పియకామొ చణట్ ... ... ...39 వధెసరో40 పితుసతియొ ధమ సెతుస దదాతి గామ41 తిరణ్హు పవతస అపరదఖిణ పసె పిసాజిపతకం42 సవజాతభొగనిరఠి.

పైదానిలో వివిధపండితులుచేసిన సవరణలు.

1. సిద్ధర. 2. సిఠిపు. 3. సవచ్ఛరే, సంవచ్ఛరే. ('నీ' లోని 'ఈ' స్పష్టముగా నున్నది. అశోకుని సాహస్రము శాసనములో 'సంవిచ్ఛల' అని యున్నది. ప్రాకృతములో 'అ' 'ఇ' గా మాఱుట గలదు. 4. గిమ్హాణ. 5. అసిక - సుసక. 6. పరాత. 7. పరివాత - 8. 'లో' అంత స్పష్టముగా లేదు. 9. మండల. 10. రెండవ 'కర' లోని 'క' అంత స్పష్టముగా లేదు. 11. పీనవట 12. 'ర' ను పండితులు పూర్తిచేసినారు. 13. నుసుణ. 14. 'దన' లోని 'న' మీది తలకట్టు పరుండి యున్నది. 'మదణస' అని లేఖకుని యుద్దేశమేమో. 15. వంస. 16. పతిఠాప, 'ధ' తోడిరూపమే సరియైనది. 17. మండలా. 18. పధనసనియ. 19. మానం. 20. చారానం. 21. ఎకసూరస - దీని నొక పండితుడు చదువక విడిచినాడు. 22. పరాక. 23. చ్చణయనుస. 24. నభాగ. 25. భుతం. 26. గరుడ. 27. ణగి. 28. డెవియ. 29. ఖమా. లోని 'మా' మీది ఆత్వము సంశయాస్పదముగా నున్నది. 30. హింసా. 31. వధూసదమ్. 32. [కెలాస] ప [వత] - అని యొకరు పూర్తిచేసినారు. 33. విమా[న] - అని యొకరు పూర్తిచేసినారు. 34. పతామ, పితామ ('పి' మీదిగుడి యింకను కానవచ్చుచునేయున్నది.) 35. నియా. యానభి." 36. సంఘన. 37. చితనా. 38. సెనాకామొ. 39. ణ [తా ... ... ... దఖిణా.] 40. పరిసరో. 41. గామం. 42. పీసాచి.

నాసికయందలి యీ శాసనములో లేఖకుడు సున్నలను, జడ్డక్కరములను, ఏ ఓ లమీది దీర్ఘములను చెక్కక విడిచినాడు కొన్నిచోట్ల క్రింది యొత్తులు కానవచ్చుచున్నను నవి క్వాచిత్కముగానే యున్నవి. ఈ శాసనములందు ఋ ఌ ఐ ఔ: ఙ ఫ ష అను నక్షరములు కానరావు. చ్ఛొత, ఒత్తరాహ అను పదములయందు హ్రస్వ ఒకారమును, చెతియ, నెకమ అను పదములయందు హ్రస్వ ఎకారమును నున్ననని యూహింపనగును. శవర్ణ మీశాసనములందు సాధారణముగ కానరాక సవర్ణముగానే యున్నది. శవర్ణము మాగధీ ప్రాకృతమునకు సంబంధించినది. అయినను కుశణ, శొర్పా-రగ, శక, సకశ=శకస్య అను పదములయందు శవర్ణము కానవచ్చుచున్నది. సాధారణముగ నేకాక్షర ద్విత్వములే కానవచ్చుచున్నను, ణ్హ, న్హ, య్హ, ర్ణ, ర్ప, లు కనబడుచున్నవి. పదమధ్యమందు కేవల మచ్చులుండుట 'మహా అరియక,' 'పులుమాఇ,' 'పనఇత' అను పదముల మధ్యమందచ్చు కనబడుచున్నది ణకారముతో శబ్ద మారంభింపవచ్చును;

ఉదా. ణియాతం (నిర్యాచితమ్)

అచ్చులయందలి మార్పులు.

సంస్కృతమునందలి యచ్చు లీ క్రింద విధముగా నాసికయందలి యాంధ్ర శాసనములందు మాఱినవి.

అ = అ - పనత (పర్వత)

అ = ఈ - సవీచ్ఛరే (సంవత్సరె)

అ = ఇ - ససిరీక (చందరీక)
అ = ఒ - యొణకస (యవనకస్య)
అఉ = ఓ - చఉత్థ, ఛొత్థ (చతుష్పధ)
అప = ఓ - ఓనరకో (అపనరక:)
అయ = ఏ - పరిహారేర (పరిహారయధ)
అవ = ఓ - అనోమస (అననమృశ్య); లోణ (లవణ)
ఆ = అ - అపరంత (అపరాంత), పురిసానం (పురుషాణాం), పరకమస (పరాక్రమస్య.)
ఇ = ఇ - సిద్ధం (సిద్ధం); వాసిరీ వాసిష్ఠీ.)
ఈ = ఈ - ససరీక (చంచరీక.)
ఈ = ఇ - పతిగయ్హ (ప్రతిగృహీత = పతిగహియ = పతిగయిహ = పతిగయ్హ.)
ఉ = ఉ - రిపు (రిపు.)
ఉ = ఇ - పురిస (పురుష.)
ఉ = ఈ - దీహితు (దుహితు:)
ఋ = అ - కణ్హగిరి (కృష్ణగిరి); వధి (వృద్ధి); గహవతి (గృహపతి) తతియే (తృతీయే); పతిగహీత (ప్రతిగృహీత.)
ఋ = ఇ - సదిసే (సదృశే), కితాపరాధే (కృతాపరాధే.)
ఋ = ఇ = యి - పులమాయిన (పృథుమాతృకస్య.)
ఋ = ఉ - వుధిక (వృద్ధిక), సుజమాన (సృజ్యనాన), మాతు (మాతృ)
ఋ = ర - రసి (ఋషి); రతు (ఋతు).
ఋ = రు -రుతుం (ఋతౌ.)
ఋ = రి - రాజరిసి (రాజర్షి.)
ఏ = ఏ - నివిసేస (నిర్విశేష.)
ఏ = ఇ - మహిద (మహేంద్ర)
ఏ = ఆ - వాధవాసు (వాస్తవ్యేషు)
ఏ = ఓ - దొ (ద్వే), ఇచ్చట వకారసంయోగమువలన నిట్టిమార్పు గలిగినది.
ఐ = ఏ - వేజయంతియే (వైజయంత్యా:), వేశాఖమాసె (వైశాఖ మాసె), చేతియ (చైత్య.)
ఐ = ఎ - నెకమ (నైగమ.)
ఐ = ఈ - ఏకీకస (ఏకైకస్య.)

ఓ = ఉ - ఏకునవిస (ఏకోనవింశతి.)
ఓ = ఓ - చకోర (చకోర); తోయ (తోయ.)
ఔ = ఓ - గోతమీ (గౌతమీ); పోర (పౌర); కోసిక (కౌసిక.)
ఔ = ఒ - ఒతరహ (ఔత్తరాహ.)

హల్లులయందలి మార్పులు.

క = క - కుల (కుల)
క = గ - గిలాన (క్లిన్నానాం.)
ఖ = ఖ - సుఖ (సుఖ.)
ఖ = ఘ - లేఘక (లేఖక.)
గ = గ - గిరి (గిరి); నెకమ (నైగమ.)
గ = క - సకర (సగర.) ఈ మార్పు పైశాచీభాష ననుసరించి యున్నది.
చ = చ - చకోర (చకోర.)
చ = స - సెటగిరి (చైత్యగిరి); ససిరీక (చందరీక.)
జ = జ - రాజ (రాజ.)
ట = ట - వాట (వాట.)
ట = డ - కుడుంబినియ (కుటుంబిన్యా:)
డ = డ - మండల (మండల.)
డ = ళ - గరుళ (గరుడ; సోళస (షోడశ.)
ణ = ణ - బమ్హణస (బ్రాహ్మణస్య.)
ణ = న - పురిసానం (పురుషాణాం.)
త = త - గోతమీ (గౌతమీ); తతియే (తృతీయే) - ఈ రూపము పశాచీభాష ననుసరించినది.
త = ట - పటిపుణ (ప్రతిపూర్ణ); కటా (కృతా); క్షహరాటస (క్షహరాతస్య.)
త = ధ - ఏధ (ఏతత్.)
త = అ = య - పతిగయ్హ (ప్రతిగృహీత = పతిగహిఅ = పతి గహియ = పతిగయిహ = పతిగయ్హ)
త = ద - సదకణి (శాతకర్ణి.)

త = డ - పడిక (ప్రతీక); అపడి దాతవా (అప్రతి దాతవ్యా.)
త = ర - సతరి (సప్తమి.)
ధ = ళ - పుళుమాయిన (పృథుమాతృకస్య.)
ధ = ర - సురర (సురధ); పరిహారేర (పరిహారేధ.)
ధ = ద - మదనస (మధనన్య.)
ద = ద - దివసే (దివసే మందర (మందర.)
ద = ర - తేరస (త్రయోదశ), బారసక (ద్వాదశక.)
ద = య - సాయూన (సాదోన.)
ధ = ధ - సిద్ధం (సిద్ధం.)
ధ = న - నిధి (నివి) - ధకారము వకారముగమారుట వింతయే. నిధి = నిఇ, అయి వకారమాగమముగా వచ్చినది.
న = న - వాహన (వాహన)
న = ణ - విచిణ (విచ్ఛిన్న) కుటుమ్బిణియ (కుటుంబిన్యా:) ణియుత (నియుక్తా; మహామతేణ (మహామాత్యేన); కుటుంబకేణ (కుటుంబకేన); మహాసేణాపతిణియ (మహాసేనాపత్న్యా:.)
ప = ప - పీత (పీత); పటిపుణ (ప్రతిపూర్ణ.)
మ = మ - పంచమే (పఙ్చమే); మందర (మందర.)
య = య - తోయ (తోయ); మలయ (మలయ.)
ఇ = ఇఅ - పవయిత (ప్రవర్తయితృ.)
య = చ - పారిచాత (పారియాత్ర); - ఈమార్పు పైశాచీభాష ననుసరించి యున్నది.
య = జ - భరిజాయ (భార్యాయా:.)
ర = ర - రాజ (రాజ.)
ర = ల - నాలిగేరాన (నారికేలానాం.)
ల = ల - మలయ (మలయ.)
ల = ర - నాలిగేరాన (నారికేలానం.)
వ = వ - దివసె (దివసె)
వ = బ - బితీయె (ద్వితీయె.)
వ = అ = య - భయంత (భవంత: = భఅంత = భయంత.)
వృ = ఉ - ఉసభదతేన (వృషభదత్తేన.)
శ = స - ఏకునవిస (ఏకోసవింశతి:) సాసనన (శాసనస్య); సుసూసా (శుశ్రూషా); నివిసేస (నిర్విశేష); సక (శక); వంస (వంశ); యస (యశస్);

సాతవాహన (శాతవాహన); నిరవసేస (నిరవశేష); సిరసి (శిరసి); దాసక (దాశక); బారసక (ద్వాదశక); సత (శత): సోళస (షోడశ); కోసిక (కౌశిక.)
శ్య = స్స - అపావేస (అప్రావేశ్యమ్); అనోమస (అనవమృశ్యమ్.)
ష = ఛ - చ్ఛరే (షష్ఠే)
ష = స - నిసూదన (నిషూదన); సహుస (సహుష); అంబరీస (అంబరీష); నివిసేస (నిర్విశేష); ఉసభదతేన (వృషభదత్తేన); సోళస (షోడశ.)
స = స - దివసె (దివసే), సిద్ధం (సిద్ధం); సమసారస (సమసారస్య)
= ఓ - గామో (గ్రామ:); తతో (తత:)
హ = హ - హిమవత (హిమవత్.)
హ = ఖ - ఖఖరాత (క్షహరాత.)

సంయుక్తాక్షరములు.

క్త = త్త - వతవో (వక్తవ్య:); విభతా (విభక్త.)
క్ర = క్క - వికమ (విక్రమ); పరకమ (పరాక్రమ.)
ఖ = ఖ్ఖ - దుఖ్ఖ (దు:ఖ.)
క్ష = ఖ - ఖహరాటస (క్షహరాతస్య)
క్ష = ఖ్ఖ - అఖ్ఖయ (అక్షయ): ఉపరఖ్ఖితో (ఉఅపరక్షిత:); పఖ్ఖే (పక్షే); అఖ్ఖయం (అక్షయం); యఖ్ఖ (యక్ష); రఖ్ఖస (రాక్షస); నఖ్ఖత (నక్షత్ర): దఖ్ఖిన (దక్షిణ.)
క్ష = ఖ - ఖెతన (క్షేత్రస్య): ఖతియ (క్షత్రియ); ఖఖరాత (క్షహరాత.)
జ్ఞ = ఞ్ - ఞాయతే (జ్ఞాయతే.)
జ్ఞ = ఞ్ఞ్ - యఞ్ఞ్ (యజ్ఞ); అఞ్ఞాతియ (ఆజ్ఞస్త్యా); రఞ్ఞొ (రాజ్ఞ:)
జ్ఞ = ణ - ఆణత్తం (ఆజ్ఞప్తమ్.)
జ్ఞ = న - ఆనపయితి (ఆజ్ఞాపయతి.)
జ్య = జ్జ - భోజ్జా (భోజ్యా:); సుజ్జమాన (సృజ్యమాన.)
త్త = య్య - దేయ్య (దత్త.)
త్ప = ప్ప - తప్పర (తత్పర.)
త్య = త్త - మహామత్తేణ (మహామాత్యేన)
త్య = చ్చ - అమచ్చ (అమాత్య.)

త్య = త్త = ట్ట - సెట్టగిరి (చైత్యగిరి = చెత్తగిరి = సెట్టగిరి.)
త్ర = త్త - నఖత (నక్షత్ర); చిత్తణ (చిత్రణ); సతుసఘస (శత్రుసంఘస్య); పుతస (పుత్రస్య)
త్త్ర = త్త - ఖత్తియ (క్షత్రియ.)
త్త్వ = త్త - సత్తకం (సత్త్వకమ్.)
త్స = స్స - ఉస్సవ (ఉత్సవ)
త్స = చ్ఛ - సంవచ్ఛరే (సంవత్సరే.)
త్స్య = చ్చ - మచ్చ (మత్స్య)
ద్య = జ్జ - విజ్జాధర (విద్యాధర)
ద్ర = ద్ద - చంద్ద (చంద్ర); మహింద్ద (మహీంద్ర); సముద్ద (సముద్ర.)
ద్వ = ద - దో (ద్వే.)
ద్వ = బ - బారసక (ద్వాదశక); బే (ద్వే.)
ధ్య = ఝ్ఝ - వింఝ్ఝ (వింధ్య)
బ్ద = ద్ద - సద్దస (శబ్దస్య)
భ్య = బ్భ - అబ్భంతరం (అభ్యంతరమ్)
ర్ఘ = ఘ్ఘ - దిఘ్ఘ (దీర్ఘ.)
ర్జ = జ్జ - అజ్జున (అర్జున); ధమ్మోపజ్జిత (ధర్మోపార్జిత.)
ర్ణ = ణ్ణ - చాతువణ్ణ (చాతుర్వర్ణ); పటిపుణ్ణ (ప్రతిపూర్ణ)
ర్త = త్త - వివత్తన (వివర్తన); నినివత్తిత (వినివర్తిత.)
ర్థ = ద్ద - చొద్దె (చతుర్థే)
ర్ధ = ద్ధ - గోవద్ధనె (గోవర్ధనే); ధనుర్ధరస (ధనుర్ధరస్య); వివద్ధనస (వివర్ధనస్య.)
ర్ప = ప్స - దప్ప (దర్ప)
ర్భ = బ్భ - గబ్భం (గర్భం); నిబ్భయ (నిర్భయ); విదబ్భ (విదర్భ.)
ర్గ = గ్గ - చతుగబ్భం (చతుర్గర్భం)
ర్మ = మ్మ - ధమ్మ (దర్మ)
ర్య = య్య - ణియ్యాచితం (నిర్యాచితం.)
ర్వ = న్వ - గంధన్వ (గంధర్వ); చాతువణ్ణ (చాతుర్వర్ణ); నివ్విసేస (నిర్విశేష); సవ్వ (సర్వ; పన్వత (పర్వత.)
ర్శ్వ = స్స - పస్సే (పార్శ్వే)
ర్ష = స్స - వస్సపఖ్ఖే (వర్షపక్షే) ; దుప్సధస్సనీయ (దుష్ప్రధర్షణీయ.)
ల్య = ల్ల - ముల్లేన (మూల్యేన.)

వ్య = వ్వ - వతవో (వక్తవ్య:)
శ్మ = ణ్హ - తిరణ్హు (త్రిరశ్మి-.)
శ్ర = స - సమణేహి (శ్రమణై:)
శ్ర = స్స - సుసుసా (శుశ్రూషా)
శ్వ = స్స - పడేసరో (పడేశ్వర:)
ష్క = క్ఖ - పాక్ఖరాణి (పుష్కరాణి)
ష్ట = ర్ఠ - అర్ఠ (అష్ట)
ష్ఠ = ర్ఠ - చ్ఛఠే (షష్ఠే), అధి-- (అధిష్ఠా-)
ష్ఠ = ధ - పతిధాపన (ప్రతిష్ఠావన) విరధాంత (విష్ఠాంత)
ష్ట్ర = ట్ఠ - రట్ఠ (రాష్ట్ర)
ష్ప్ర = ప్ప - దుస్పధననియ (దుష్ప్రధక్షణేయ)
ష్ణ = ణ్హ - విణ్హుపాల (విష్ణుపాలక), కణ్హ (కృష్ణ)
ష్ణ = న్హ - కన్హ (కృష్ణ)
ష్మ = మ్హ - గిమ్హ (గ్రీష్మ.)
ష్య = స్స - భవిస్సతి (భవిష్యతి)
స్క = ఖ్ఖ - సివఖాల (శివస్కదిల), ఖధా (స్కంధాత్.)
స్త = ధ - వాధవస (వాస్తవ్యవ్య); హధే (హస్తే)
స్త = ర - నిరరి (నిరసి)
స్థ = ర - నిరవాపిత (నిష్ఠాంత.)
స్య = స్స - పుతస (పుత్రస్య.)
స్వ = స్స - సతకం (స్వత్వకం.)
హ్మ = మ్హ - బమ్హణ (బ్రాహ్మణ)
హ్ల = ల్హ - పల్హవ (పహ్లవ)

కొన్నిచోట్ల గొన్ని వర్ణము లాగమములుగా వచ్చును:-

వరిసాణి (వర్షాణి); నిరపాపిత (నిష్ఠాపిత), చెతియ (చైత్య), జామాతరా (జామాత్రా); సిరి (శ్రీ), కలిన (క్లిన్న).

కొన్నిచోట్ల శబ్దములలోని వర్ణములు లోపించును:-

ఏవఇత (ప్రవర్తయితృ), బితియే (ద్వితీయే), దిజావర (ద్విజవర), తేరస (త్రయోదశ), కీణితా (క్రీణితా), పరాణ (అప్రాణ), పటిపుణ (ప్రతిపూర్ణ); తిసముద్ద (త్రిసముద్ర), పతిగహీత (ప్రతిగృహీత); గహ

ఈ పుట అక్షరములు సరిగా తెలియనందున వ్రాయలేదు. తెలిసినవారు వ్రాయగలరు.

విభక్తులు.

ఈ క్రింది విభక్త్యంతములుగల రూపములు గానవచ్చుచున్నవి.

ప్రథమైకవచనము.

సేవకామో (సేవాకామ:); పియకామో (ప్రియకామ:); ఆణితో (ఆజ్ఞప్తి:); సామకో (సామక:); వతవో (వక్తవ్య:); గామో (గ్రామ:); ఓవరకో (అపవరక:); ఘరో (గృహం); ఉపరఖితో (ఉపరక్షిత:)

ప్రథమాద్వివచనమునకు బహువచనము.

ఫోడియో.

తృతీయైక వచనము.

మెధునేన, వెణ్హుసాలేన, అవియేన; అమచేన, సివగుతేన, తాపసేన; ఉసభదతేన; పుతేన; నాసికతేన; సమణేన; కుటుంబకేణ; దణమేణ; - ఈ రూపములలో సంస్కృతములోని ఇన ప్రత్యయము చేరినది. కొన్నిచోట్ల సంస్కృతమునకు విరుద్ధముగా నకారమునకు బదులు ణకారము కానవచ్చుచున్నది. భమనందిన అను రూపమునందు నకారాంతశబ్దమునకు వలె రూపమున్నది.

తృతీయా బహువచనము.

సంస్కృతము నందునలె గాక యిందు ఏభి: అను ప్రత్యయమునకు వికారమైన (ఏహి). అను ప్రత్యయము తృతీయా బహువచనమున జేరుచున్నది:- సమణేహి (శ్రమణై:), వాసేహి (వాసై:), భదాయనియేహ (భద్రాయణై:); పరిహారేహి (పరిహారై:); మహాసామయేహి (మహాస్వామిభి:) మాలయేహి (మాల్యై:), సహస్రేహి (సహస్రై) - అకారేతరాజంత రూపములపై 'హి' మాత్రము చేరును:- చతుహి (చతుర్భి:), బిఖ్ఖుహి (భిక్షుభి:)

పంచమ్యేకవచనము.

ఇందు అత్ ప్రత్యయములోని తుదితకారము లోపించును:- ఖదా (స్కంధాత్); ఖధావారా (స్కంధావారాత్); భటారకా (భట్టారకాత్.)

పంచమ్యేకవచన షష్ఠ్యేకవచనములందు స్త్రీలిం గాజంతశబ్దములకు వలె కొన్నిరూపములు గానవచ్చుచున్నవి:- అనువిధీయమానాయ (అను-విధీయమానాయా:), మాతుయ (మాతు:); మహాదేవీయ (మహాదేవ్యా:); గోతమియ (గౌతమ్యా:), ఒలసిరీయ (బాలశ్రియ:); నిరతాయ (నిరతాయా:); పరాయ (పరాయా:); కుటుంబిణియ (కుటుంబిన్యా:); నందసిరియ (నంద-శ్రియ:); మహుతయ (మహతు:); అంతేవాసినియ (అంతేవాసిన్యా:); పనయితాయ (ప్రప్రంతాయా:); తాపసివియ (తాపసిన్యా:); భటపాలికాయ (భటపాలికాయా:); భారియయ (భార్యాయా:); క్షపణకమాతుయ (క్షపణక మాతు:) ----------- మమ్మాయా (మమ్మాయా:); భరిజాయ (భార్యాయా:); సేనాపతిణయ (సేనాపతిన్యా:); వాసుయ (వాసో:); కణ్హహినియ (కణ్హహే--); దఖమిత్రాయ (దక్షమిత్రాయా:); వీనాయ (వింశత్యా:), ఉజెనియ (ఉజ్జయన్యా:); బణసాయ (వారాణస్యా:); ఉపాసికాయ (ఉపాసికాయా:); విణ్హుడతాయా (విష్ణుదత్తాయా:); జీవసుతయ (జీవసుతాయా:); రాజమాతుయ (రాజమాతు:); పటిహారఖియ (రక్షితు:) లొటాయ (లోటయా:); అంజ్ఞాతియ (అజ్ఞప్త్యా:); నగరసీమాయ (నగరసీమ్న:); నిగమనభాయ (నిగమనభాయా:)

పితుపతియో (పితు:పతే:), సేనాయే (సేనాయా:), విజయంతియే (వైజయంత్యా:)- అను రూపములును, పురిసదతాన (పురుషదత్తన్య), నదాసిరియావ (నందాశ్రియ:) - అనురూపములను, తసిల్ ప్రత్యయముతో, ఖేతాతో (క్షేత్రత:) అను రూపమును గానవచ్చుచున్నవి.

షష్ఠ్యేకవచనము.

రాజస (రాజ్ఞ:), పతిస (పతే:), సాసవస (శాసనస్య) వాహనస (వాహనస్య), నరవస (నరవస్య), అమచన (అమాత్యన్య), సామకస (సామకస్య), సాతకణిస (శాతకర్ణిస:); వపౌధస (వాస్తవ్యస్య), పవఇతన (ప్రవర్తయితు:) - పైవానిలోన అనుప్రత్వయము శబ్దముల యంతముతో నిమిత్తము లేకుండ నుపయోగింపబడినది.

షష్ఠీ బహువచనము

భదావనీయానం (భద్రావనియానాం), పనజితాన (ప్రప్రజితానాం), తెకిరసిణ (తెకిఋషీణాం), పతివసతాం (ప్రతివసతాం), వాసాన (వర్షాణాం), గిహ్మణ (గ్రీష్మాణాం), నవనావం (నవనసవాం), ఉతమభద్రకానం (ఉత్తమ భద్రకానాం), ఖతిమానం (క్షత్రియణాం), భిఖూనం (భిక్షూణాం); తెరణ్హుకానం (త్రిరశ్మికానాం), వసంతాం (వసతాం), వసౌధాన (వాస్తవ్యానాం); నాలిగెరాన (నారికేలానాం)), దేవానం (దేవానాం); బ్రాహ్మాణామ (బ్రాహ్మణానాం); సహసణ (సహస్రాణాం); గిలాన (క్లిన్నానాం); హేమతాణ (హేమంతానాం), నాసికికానం (నాసికకానాం).

సప్తమ్యేక వచనము.

గిమ్హాణసఖే (గ్రాష్మాణాం పక్షే), భితీయే (ద్వితీయే), తేరసే (త్రయోదశ్యాం), తిరణ్హుమ్హి (త్రిరశ్మిని), అనుగామిమ్హి (అనుగామిని), రాజని (రాజని,

సప్తమీ బహువచనము.

కఖడీసు (కఖడీషు), వాస్తవ్యసు (వాస్తవ్యేషు), ఆగతానాగతాసు (ఆగతానాగతేషు)

క్రియలు

ఈక్రింది క్రియారూపములు కానవచ్చుచున్నవి భవిసంతి (భవిష్యంతి), నబధాపేధ (నిబద్ధాపయధ), వవతి (వావ్యతే); కసతే (కృష్యతే) - ఆత్మనే పదిరూపమిది యొక్కటియే కానవచ్చుచున్నది.

అపావేస (అప్రావేశ్యం); అన్మస (అనవమృశ్యం)

సర్వనామములు.

<poem> అమ్హేహి (అస్మాభి:); అమ్హ (అస్మాకం) ఏధ (ఏతత్); ఎతత (ఏతత్); ఏతో (ఏతత్)? ఏతహి, ఏతేహి (ఏతై:), ఏతస (ఏతస్య); ఇమేస (అస్య)? సో (స:); నేన (అనేన); య (యద్).

అవ్యయము.

దాని (ఇదానీం)

సంధి.

అప + అవసితం = అపయవసితం.

కారకము.

నమ భగతస జినవరస బుధస (నమోభగవతేజినవరాయ బుద్ధాయ.)

ఈక్రింది గ్రామముల పేళ్లు కానవచ్చుచున్నవి.

చలిసీలణ, నాసిక, ధంభిక, దసపుర, ఛాకలేప, దాహనూకానగర, కేకాపుర, ఉజేని, కాపురాహార, చిఖలపద్ర, పిండీల కావడ, సువర్ణముఖ, రామతీర్థ, గోవర్ధన, శొర్పారగ, భరుకచ్ఛ, బెనాకటక, ధనకట, సామలిపద, సుదసన, నవనర, పిసాజపతకం.

ఈక్రింది మనుష్యుల పేళ్లు కానవచ్చుచున్నవి.

ధమ్మదేవ, ఈద్రాగ్నిదత, మాడలీపుత, శివ దత్తాభీర, అభీర, ఈశ్వర సేన, సకగివమ్మ, గణపక, రేభిల, వినవర్మ, సకనిక, శివమిత, రామంణక, వెలిదాత, భటపాలికా, వహహకసిరి, అరహలయ, అగీయతణక, కవణణక సదాసిరీ, సాదవాహన, కన్హ, మమ్మా, భవగోప, బొపకి, దామచిక, పులుమాఇ, ధణమ, సాతకణి, విణ్హుదత, క్షహరాత, క్షతప, సహపాన, దీనీక, ఉషవదాత, గోతమిపుత, సదకణి, విణ్హుపాలిత, అవరకఖడి, సివగుత, మిధున, పుళుమవి, సవస.

ఈక్రింది సంఘముల పేర్లు కానవచ్చుచున్నవి.

ఉత్తమభాద్ర (యోధులసంఘము); (తేకిరసి, ఒక యతులసంఘము); భదాయనీయ (భిక్షుసంఘము); చతిక (ఒక భిక్షుసంఘము); కులరికశ్రేణి (ఒక యంత్రికశ్రేణి,) తిలసిషకశ్రేణి, (వృత్తులకు సంబంధించిన సంఘములు.)

పర్వతములు

తిరణ్హు, గోవధన,

నదులపేళ్లు.

బాణ్ణసా, ఇబా, పారదా, దమణ, తాసీ, కరభేణా, దహనుకా,

పైదానినిబట్టి యాంధ్రరాజుల శాసనములభాష పాలిభాషకు మిక్కిలి దగ్గఱగనున్నట్లు దెలిసికొన వచ్చును. నాసిక యందేకాక నేటి యాంధ్రదేశమున గానవచ్చిన యాంధ్రరాజుల ప్రాకృత శాసనముల భాషయు బైదానినే పోలియుండును. ఆంధ్రదేశమున నశోకుని శాసనములు మొన్నటి వఱకును దొరకలేదు. అనంతపురము జిల్లాలోని గుత్తి కేడుమైళ్ల దూరముననున్న యెఱ్ఱగుడి గ్రామమునకు సమీపమున చిన్నగుట్టలపై చెక్కబడియున్న యశోకుని పదునాలుగు శిలాశాసనములను నేను స్వయముగ ప్రధమమున గనిగొని వాని ప్రతులనెత్తి చదివితిని. అందలి రెండు శాసనముల నీక్రింద నుదాహరించుచున్నాను.

ఏడవ శిలాశాసనము.

1. దేవానంపియే పియదసినే లాజా పవతా ఇఛతి.

(దేవానాంప్రియ: ప్రియదర్శీ రాజా సర్వత్ర ఇచ్ఛతి.)

2.సవపాసండ వసేయు సవే హి తే సయమం భావసుధిం చా
  (సర్వేపాషండా వసేయు: సర్వే హి తే సంయమం భావశుద్ధిం చ.)

3. ఇఛంతి జనేచు ఉచావుచఛందే ఉచావుచలాగే తే సవం ఏకదేశం పి
   (ఇచ్చంలి జన: తు ఉచ్చావచచ్చంద: ఉచ్చావచరాగ:తే సర్వం ఏక దేశమపి.)

4. కఛంతి విపులె పి చు దానే అస వధి సయమే భావసుధి కిటనాతా
   (కరిష్యంతి విపులమపి తు దానం యస్య నాస్తి సంయమో భావ శుద్ధి: కృతజ్ఞాతా.)

5. దిడభతితా చా నిచే బాధం
   (దృడ భక్తితా చ నీచా బాడం.)

________

తెనుగు.

దేవానాంప్రియుడు ప్రియదర్శిరాజు సమస్తజనులను తమ యిచ్చవచ్చినచోట వసింపవచ్చునని కోరుచున్నాడు. వీరందఱును సంయమమును భావశుద్ధిని, కోరుదురుగదా. కాని జనులు వేర్వేరు కోరికలను, వేర్వేరు రాగములను కలిగిఉందురు. వారు తమధర్మములలో అన్నిటినిగాని, కొన్నిటిని మాత్రముగాని నిర్వర్తింతురు. విపులమైన దానమును, సంయమమును, మనశ్శుద్ధియు, కృతజ్ఞతయు, దృడభక్తియు లేనివారు తప్పక నీచులగుదురు.

11 - వ శిలాశాసనము.

1. దేవానంపియే హేవం ఆహా నధి ఏదిసే దానె అదిసే ధయదానే ధంమసంధవే
  (దేవానాంప్రియ: ఏవం ఆహ నాస్తి ఈదృశం దానం యాదృశం ధర్మదానం ధర్మసంస్తవ:)

2. ధంమస విభాగే ధంమసంబంధే తత ఏస దాసభటికసి.
   (ధర్మసంవిభాగ: ధర్మసంబంధ: తత: ఏషా దాసభృతకే.)
   సంమ్యాపటిపతి మాతాపితు సుసుస.
   (సమ్యక్ర్పతిపత్తి: మాతాపితృ శుశ్రూషా.)

3. మితసంథుత నాతికానం సమంస బంభనావం దానే పాణానం.
   (మిత్రసంస్తుత జ్ఞాతికానాం శ్రమణ బ్రాహ్మణానాం దానం ప్రాణానాం.)

   అనాలంభే ఏస వతవియే పితనాపి.
   (అనాలంభ: ఏతద్ వక్తవ్యం పితృణాపి.)

4. పుతేనపి భాతినాపి సువామిక్యేపి మిధసంథుధేనాపి అపటి.
   (పుత్రేణాపి భ్రాత్రాపి స్వామీకేనాపి మిత్రసంస్తుతేనాపి ప్రాతి)

   వేసియేనా ఇయం నాధు ఇయం కటవియే సే తధా.)
   (వేశికేన ఇయం నాధు: ఇయం కర్తవ్యం స తధా.)

   కలంత హిదలోకే చ కల ఆలధే.
   (కుర్వన్ ఇహలోకే చ ఆరార్ధవాన్.)

5. హోతి పాలత చ అనంతపునా ప్రనవలి తేవ ధింమదా.
   (భవతి పరిత్రచ అనంతపుణ్యం ప్రసూతే తేవ ధర్మదా.)

6. నేన
   (నేన.)

తెనుగు

దేవానాం ప్రియు డిట్లు చెప్పుచున్నాడు ధర్మదావము, ధర్మసంస్తవము, ధర్మవిభాగము, ధర్మసంబంధము అనువానిని పోలిన ధర్మములేదు. అందుచేత దాసభృత్యులయెడల ప్రతిపత్తి, తల్లిదండ్రులశుశ్రూష. మిత్రులు, పరిచితులు, బంధువులు, శ్రమణులు, బ్రాహ్మణులు అనువారికి దానము, ప్రాణులను హింసింపక---ట, (-----ధర్మవ్రతము) ఈ ధర్మవ్రతమును గుఱించి తండ్రితోగాని, కొడుకుతోగాని, సోదరునితోగాని, పరిచితునితో గాని కేవలము ఇరుగుపొరుగువారితోగాని, ఇది సాధువుతో గాని, ఇదికర్తన్యము అని చెప్పవలెను ఇట్లుచేసి, ఆధర్మపాశమువలన ఈ కాలమందు సౌఖ్యమును పరలోకములో అనంతపుణ్యమును పొందును-

ఈ క్రిందిశాసన మాంధ్రదేశము--- బ్రత్యేకముగా అశోకునిచే వ్రాయబడినది. దీనిప్రతి బారతవర్షమున మఱియెందును గానరాదు.

1. (అసక) స దేవానంపియే హే--- మ చ ఏకాని.
   (అశోక: దేవానాంప్రియ: ఆహ ఆపి మమ చ ఏకోన.)

2. తేన సంవచర వసంకర కేస నో కస పాజకయాయ.
   (త్రింశద్ సంవత్సరే వాసంకృతం కీదృశం న:కార్యస్య ప్రయోజనాయ.)

3. పు ససాసతే కయం ఖు సవఛలే యమాయా సంయేపధరయే.
   (పున స్స శాస్తి కార్యంఖలు సంవత్సరేయమాజ్ఞా సంజ్ఞావ ధారితా.)

4. మాలభాయే మునీసాసనలేకా చు న మితేకే పమే వుడం ఏతే.
   (మమలాభాయ మనుష్యశాసనాలేఖా తు న మిత్రకే ప్రేమ వృద్ధం ఏతే.)

5. దకనసిపుక దేవపితరే నిరరాసి సూభాపకమస ద-
   (దక్షిణ... ... దేవపితరో నిర్గతా:స్యు: శుభప్రక్రమస్య ధ-)

6. రామమోనేవ దాకియే వో రతమే ఏనకోయే కిసవేనే.
   (రా మమ అనేన నాకం యే వా అర్థతమా: యేనకేనాపి యాదృ కీదృశ్యా.)

   వో పమయా.
   (వా ఉపమాయా.)

7. అపి వ నం పవిఖో సధాకే పులె మోభో అశోకాయ చ.
   (అపి వా అస్మాన్ ప్రవీక్ష్య శ్రద్ధాంకే పురా మమ అభవన్ అశోకస్య చ.)

   అధాయే ఏయం
   (అర్థాయ ఇయం.)

8. హవం యం పకమ హోభవం పు దక మహాధకా ఇమం పి.
   ఏవం య: ప్రక్రమో భవత్యభూత్ పున: దక్షిణమహార్థకా: ఇమమపి.)

   ఏకమోవ అ ఇ
   (ఏకమేవ అతి (ను P) )

9. గవోపి చే యిధం నభేతదమోమపి ఛేచకేబాడి రవివునే.
   (గమిష్యంత్యపచేత్ ఇమం అభీతధర్మమపిచేత్స్యంతి భ్రాత్యజనౌ.)

   జమే వుభా.
   (నావుభౌ.)

ఖాళీ పుట. ఖాళీ పుట.

10. యదేకే ఓనపేం భవాయే రం నహవా వాఉసో వా.
    (యదేకే అవనిపా భవేయు: రాజాన: యే వ్యావృషో వా.)
    
    వడసి భాఅపఏధియా దేయా వివ
    (వర్ధయిష్యంతి భావప్రవృద్ధ్యై ధియా వివ-)

11. దనే ఆదంపిన జనో దిత మభొడస అతసం ధనపియానె నావం-
    (ర్ధనా అర్ధమపి న జనో దత్త మభూ త్తస్యార్థానాం ధనప్రియా విశ్శాలవ-)

    యఇ
    (యితవ్యా:.)

12. పంయన సుతిరా వుతాని చా సుసితవియే జయేయ
    (ప్రజ్ఞాన సుస్థిర వృత్తా: చ సుశ్రావయితవ్యా: జయాయ.)

    వధ ఏయే అం పయధాకదే.
    (వృద్ధ్యై ఏవం ప్రయత్నీ కృతం.)

13. సిసువాయ హమేవ గచు పు సుసువియావహ భడే.
    (సుశ్రావణేనాహమేన గచ్ఛామి పున: శుశ్రావణాయ వ అహంభట:.)

    ఆతధకధా అపి ఆయే పినవా.
    (యధా (తధా) కధమపి ఆగమిష్యామి పున ర్వా)

14. సుసుమ ధంమశవ పవతితని యయేచు దయాని య దయితవయ.
    (శుశ్రూషా ధర్మశాసన ప్రవర్తితాని యానియాని తు దత్తాని యాని దాతవ్యాని.)

    సవే వేతిష్ఠయే
    (సర్వాణి వర్తిత వ్యాని.)

15. యధపధి యాఛేపాసోకారువకోభి ఇయం సుంసుసిత తఏంతి
    (యధాపధి యాదృశిన: ఉపాసకారిణ: అపి ఇమం శ్రావయిష్యంతి.)

    పయాధ దేవానంపియ వనేన వా
    (ప్రయతా: దేవానాంప్రైయ వచనేన అ-)

16. ధ అంతేవాసిని యారాసాధంమవధిక భికాని యదారపవియ.
    (ధ అంతేవాసిన: యాదృశా ధర్మవర్థకా భిక్షుకా: ------)

    అనాని వేసుథె హంవనిపయా అవమ

17. యస యధా నంఝోన ఆచుదయస నాభాకా భాభవారయే యాద-నా పతాయనాయ నామచే దసమోసయా.

18. పరేవచాపి సుయధారప న ఝే అసంపయాసా భికిసు పెవ భాభవియే పేవమే.

19. భారేకసి యాహవంస ధానివసధారి నాసేయా భా యధాపవధం సాప.

20. వసధఏచ అభచాసి యిపయ.

21. ఖాయధన ఆయాపాంసవా.

పైశాసనములలోని యక్షరములన్నియు సుస్పష్టముగా నున్నను పంక్తు లొకదానిలోని కొకటి సంక్రమించి యుండుటచేతనొక పంక్తిలోని యక్షరములు మఱియొక పంక్తిలోనివిగా జదువ బడినదేమో యను సందేహము గలుగుచున్నది. కావున పై శాసనము నర్థమును వివరింపలేదు. పై శాసనముల కును నాసికయందలి శాసనములకును గల ముఖ్యభేదము భేధములు లకారములుగా మాఱుటయని గుర్తింపవచ్చును. ఈమార్పు పైశాచీ మాగధీభాషలకు ప్రత్యేకలక్షణముగా లాక్షణికులు చెప్పియున్నారు.

సంస్కృతములోని చాల నక్షరములు లోపించుటయు నేకపదమునందే యచ్చులు ప్రత్యేకముగ నెట్టి యాగమాక్షరములు లేకుండగను, సంధి కాకుండగను వ్రేలాడుచుండుటయు లాక్షిణికులు దెలిపిన మాహారాష్ట్ర్యాది ప్రాకృతములందు గానవచ్చును. కాని వ్యవహారమునం దాయచ్చులకు సంధి యగుటయో వాని మధ్యమున నాగమహల్లులుచెరి వానిని బాధించుటయో సంభవించెను ఇట్టిమార్పులుజరిగి, భాషలలో ర్థమాగది, జైనమాహారాష్ట్రి, జైనశౌరసేవి, పాలి, యనునవి ముఖ్యములు. వీనిలో ర్థమాగథి, జైనమాహారాష్ట్రి, జైనశౌరసేవి, యను భాషలయందు ---- మతగ్రంధములు విస్థారముగ వెలువడినవి. ప్రాచిభాషయందు బౌద్ధమతగ్రంథములు వెలసినవి వీనిలో గ్రంధస్థములైన భాష స్థిరమై, లక్షణబద్ధమై చాలవఱకు మాఱకుండ నిలిచి పోయినది. కాని వ్యవహారమునందలి భాషనానాటికవి మార్పునొందుచునె యుండెను. దక్షిణహిందూదేశమున నించుమించుగ క్రీ.శ. 6-వ శతాబ్దము వఱకును బ్రాకృతభాషలు తప్ప నితరభాషలు ప్రచారములో నుండినట్లు గానరాదు. తమిళభాష క్రీస్తునకు బూర్వమునుండియు బ్రచారములో నుండెడిదను నభిప్రాయము నేడు విడనాడబడుచున్నది. క్రీస్తుశకము 6,7 శతాబ్దములవఱకు ద్రావిడ భాషలలో సంవత్సరములు నిరూపింపబడిన శాసన ములు గాన్పింపవు. క్రీస్తుశకము 4,5, శతాబ్దముల నుండియు బల్లవరాజుల కాలమున సంస్కృతమునకు బ్రాధాన్యముగలిగి ప్రాకృతముల ప్రచారము వెనుకపడినట్లు గాన్పించును. ఈలోగా బ్రాకృతము మార్పుజెందుచు వచ్చెను. దానికిని నితరభాషలకును వ్యవహారమునం దొలుతనుండియు గలుగుచుండిన సంపర్కమువలన గ్రంధస్థలాక్షణిక ప్రాకృతమని గుర్తింపరాని యొక యవస్థ యేర్పడెను. ఈ తొల్లింటి ప్రాకృతమే మార్పునొందుచు నేటి యాంధ్రభాషగా బరిణమించినదా? అట్లైనచో నా పరిణామక్రమ మెట్టిది? ఆ ప్రాకృతభాషా స్వరూపమెట్టిది? దానితో మేళనము బొందిన యితరభాషల స్వరూపమెట్టిది ? ఆంధ్రమునకును నితర ద్రావిడ భాషలకును గల సంబంధమేమి? - అను విషయములను గూర్చిన చర్చ యీ గ్రంధమున నందందు గాన్పింపవచ్చును. ఆంధ్రము ప్రాకృతభాషా వికారమగు నేమో యను దృష్టితో నీగ్రంధము వ్రాయబడుటచే బ్రాకృత భాషలగూర్చిన ప్రశంస యిందెక్కువగా గాన్పించును.

ఈభాష కాంధ్రమనుపేరు నన్నయభట్ట రచితమైన నందంపూడి శాసనమున దొలుత గానవచ్చుచున్నది అందాతడు నారాయణభట్టు నాంధ్రభాషా కవీశ్వరునిగా బేర్కొనియున్నాడు. ఆనాటికే యీభాషకు దెనుగను నామము గురుగుకొని యుండెను. భారతమును తెనుగున రచింపుమని రాజరాజు తన్ను గోరినట్లు నన్నయభట్టు చెప్పియున్నాడు. ఈ తెనుగను పదము స్వరూపమునుగూర్చి విచారింతము.

తెలుగనుపదము త్రిలింగ శబ్దభవమని పండితుల యభిప్రాయము. ద్రాక్షారామ, శ్రీశైల, కాళహస్తులను మూడు ప్రసిద్ధ శైవక్షేత్రములకు నడుమనున్న దేశము త్రిలింగమనియు నదియే తెలుగుదేశమనియు నప్పకవి చెప్పియున్నాడు. అంతకుబూర్వము కాకతీయులు రాజ్యముచేసిన దేశమునకు ద్రిలింగమని యనుకొనుచుండినట్లు విద్యావారి కవికృతమగు ప్రతాపరుద్రీయమున బ్రతాపరుద్రుడు త్రిలింగాధిపతియని చెప్ప బడుటచే దెలిసికొనవచ్చును. అంతకు బూర్వము తెలుగుదేశమునకు ద్రిలింగసంజ్ఞ యుండెనో లేదో తెలియదు. శాసనములం దీదేశమునకు తెలింగ, తెలుంగ, తిలుంగ, తిలంగ, తెలగ, తిలింగ, యనుపేళ్లు గానవచ్చుచున్నవి. శా.శ. 1194 ప్రాంతముల రాజ్యమేలిన యాదవరాజగు రామచంద్రునికి "తెలింగ తుంగ తరూన్మూలన దంతానల" యను బిరుదముండినట్లు తెలుపబడినది. కుంతల దేశాధీశుడగు రాచమల్లదేవునకు బెలగలమారి యను బిరుదముండెను.

      "పక్ష్చాత్పురస్తాదపి యన్యదేశా
       ఖ్యాతౌ మహారాష్ట్ర కలింగసంజ్ఞా
       వవాగుదక్ పాండ్యక కన్యకుబ్జౌ
       దేశస్సత త్రాస్తిత్రిలింగనామ.
       పురా త్రిమ్లింగాన్ ప్రతిమంచి కొండా
       వావానయన్ నాయకవంశ ముఖ్యౌ
       తాభ్యాం వినిర్మాపితమాత్మ నామ్నా
       పురం మహచ్చ ప్రథితేంధ్రదేశే."

అను శ్లోకము ఎపి గ్రాఫియా ఇండికా 14-వ సంపుటమున వ్రాయబడియున్నది. శా.శ. 1539 సంవత్సరమున మీసర గండకఠారిసాలువ తెలుంగురాయు డుండినట్లొక శాసనమువలన దెలియుచున్నది. ప్రతాపరుద్రీయమున త్రిలింగశబ్దము వాడబడియున్నది. అల్లాఉద్దీనను తురుష్కరాజు తిలంగదేశమును జయించినట్లు తెలియుచున్నది. తిలుంగు బిజ్జలుడనువాడు నెల్లూర రాజ్యమేలిన తెలుగుచోడుల వంశములోనివాడు. ఈరీతిగానున్న దేశపుపేళ్లను సంస్కృతీకరించి త్రిలింగ శబ్దమును పండితులు కల్పించినారని యనుకొనుట కవకాశమున్నది.

తెలుగుశబ్దము త్రినగశబ్ద భవమని మఱికొంద ఱందురు. మహేంద్రము, శ్రీశైలము, కాళహస్తి యను మూడు నగముల మధ్యనున్న ప్రదేశము త్రినగదేశమనియు ద్రినగశబ్దమే తెనుగుగా మాఱినదనియు వారి యభిప్రాయము. త్రినగశబ్దము నందు లేని యనుస్వారము తెనుగుశబ్దమునం దుండుటయు, తెనుగుదేశమునకు ద్రినగమను వ్యవహార మేనాడును లేకుండుటయు నీ వ్యుత్పత్తి కాథారము లేనట్లు తెలుపగలదు.

త్రికళింగ శబ్దభవము తెలుగని మఱికొంద ఱనుచున్నారు. త్రికలింగశబ్దము ప్రాకృతమున 'తిఅలింగ' యని మాఱి తెలింగ, తేలింగ యనురూపములను పొందుట సాధ్యమేయయినను తెనుగుదేశ మంతటికిని త్రికలింగసంజ్ఞ లేకుండుటచే నీ వ్యుత్పత్తియు నిరాథారమగు చున్నది. త్రికళింగ మనున దిప్పటి గంజాము, విశాఖపట్టణము జిల్లాలును వానికి పడుమట మధ్యపరగణాలలోని కొంతభాగమును నయి యుండెను. నేటి ముఖలింగమున్న ప్రదేశమునకు మోదోగలింగే యను పేరు గ్రీకు చరిత్రకారుల వ్రాతలయందు గాన్పించుచుండుటచే మోదో అనగా మూడగు అని అర్థము చెప్పుటచే త్రికళింగమునకు మూడగు కళింగమని యర్థముచెప్పి యాత్రికళింగమునుండి తెలుగను పదము పుట్టినట్లు కేంబెల్ మొదలగు పాశ్చాత్య పండితు లభిప్రాయపడిరి. మోదోగలింగ మనునది మధూకలింగ శబ్దభవము గాని మూడగు కళింగము అనుదాని మాఱురూపము కాదు. మూడగు కళింగమని త్రికళింగమున కెన్నడును వ్యవహారము లేదు.

తేనె + అగు, అనగా తేనెవలె తియ్యనిదగుటచే తెనుగయ్యెనని కొందఱును తెలి + అగు = తేలికయగు, లేక స్వచ్ఛమగునట్టిది కావున నీ భాషకు దెలుగను నామము వచ్చెననియు గొందఱి యభిప్రాయము. ఈ వ్యుత్పత్తి కేవలము స్వాభిమాన పూరితమని వేఱె చెప్పనక్కఱలేదు. తెన్ అనగా దక్షిణమని తమిళమున నర్థముండుటచే దక్షిణదేశపు భాషగావున దెనుగనుపేరు గలిగినదని కొందఱనుచున్నారు. తమిళులకు దెలుగువా రుత్తరమున నుండుటచేతను, తెలుగువారు తమ్ము దక్షిణదేశపు వారమని చెప్పుకొనుట యసంభవ మగుటచేతను నీ వ్యుత్పత్తికూడ సమంజసముగ లేదు.

కన్నడకవియగు నృపతుంగుడను రాజు తాను రచించిన కవిరాజ మార్గమను లక్షణగ్రంథమున గోదావరినుండి కావేరివఱకుగల ప్రదేశమంతయు గర్ణాటకసంజ్ఞను గలిగియున్నదని చెప్పియున్నాడు. కన్నడమునం దాదికవులగు పంప, రన్న, పొన్న, యనువారు వేంగీదేశవాసులయినట్లు వారి గ్రంధములవలన దెలియుచున్నది. ఇంతేకాక పూజ్యపాదుడు (క్రీ.శ. 470) దండి (క్రీ.శ. 7-వ శతాబ్దము), నాగార్జున (క్రీ.శ. 8 శతాబ్దము), నాగవర్మ (క్రీ.శ. 990), రాజాదిత్య (క్రీ.శ. 1120), మైదునరామయ్య (క్రీ.శ. 1160), మోళిగయ్య (క్రీ.శ. 1160), మరుళదేవ (క్రీ.శ. 1160), మల్లికార్జున పండితారాధ్య (క్రీ.శ. 1160), హరీశ్వర, రాఘవ, కెరెయపద్మరన (క్రీ.శ. 1165), చక్రపాణి రంగనాధ (క్రీ.శ. 1195), పోలాళ్వ దండనాథ (క్రీ.శ. 1223), భీమకవి (క్రీ.శ. 1369), - వీరును నిట్టివారు మఱికొందఱును తెనుగుదేశమువారు కన్నడముస గ్రంథములను రచించియున్నారు. ఓరుగంటియందును హంపీ - విజయనగరమునందును రాజులు తెలుగు కన్నడముల నొక్కరీతిగ బ్రోత్సహించియుండిరి. శ్రీనాథు డానాటి వాడుకను బట్టి కాబోలు తెలుగును కర్ణాటభాష యన్నాడు. ఇట్లే కన్నడదేశము నందును తెను గెక్కువ ప్రచారములోనున్నది. నేటి కర్నాటక దేశమగు మైసూరు సీమయందలి కోలారు, బెంగుళూరు, చిత్రదుర్గము, నందిదుర్గము జిల్లాలయందు చాలవఱకు దెలుగే ప్రచారములోనున్నది. దీనినిబట్టి కన్నడమువారును తెలుగువారును మొదటినుండియు గలసియుండుటయేకాక యొకరిభాష నొకరు బోధపరుచుకొన గలిగియుండిరని యూహింపవచ్చును. ఈ రెండుజాతుల వారికిని వ్రాతవలెనే భాషయు నొక్కటియై యుండబోవును. ఆచార వ్యవహారము లందును మతాది సంప్రదాయము లందును నీరెండు జాతులవారికిని నొకరీతి యైక్యముండినటుల గోచరించును. కన్నడభాష యయిదు విధములుగా నున్నదనియు నందొకరీతి కన్నడమునకు దెళుగన్నడమను వ్యవహారమున్నదనియు, దెళుగన్నడమనగా కన్నడులు తమ మూలస్థానమును విడిచి దూరదేశములకు బోయి తమ భాషను తేలికగా నుచ్చరించుట వలన గలిగిన భాషయనియు, నొక కర్ణాటక లాక్షిణికుడు చెప్పియున్నాడు. ఇట్లే "కుండ" అనగా కొండలయందున్న కన్నడులు మాట్లాడు భాష కుడ గన్నడమనియు, కుడగన్నడమే నేటి కుడగు భాషగా వ్యవహారమందున్న దనియు జెప్పుదురు. ఈ సాదృశ్యము ననుసరించి తెలుగన్నడము తెలుగుగా వ్యవహరింప బడుచున్నదని యూహింపవచ్చును. శబ్దజాలము నందు దెలుగు కన్నడములకు నూటికి డెబ్బదివంతున సమానముగ నున్నది. అట్లే ప్రత్యయాది సంబంధమును మిక్కిలి దగ్గఱగనున్నది. ఈ కారణముల చేత దెలుగు కన్నడము లొకప్పు డేకభాషగా నుండెననియు గాలక్రమమున మాండలిక భేదమునుబట్టి యవి భిన్నము లయ్యెననియు నూహించుట కవకాశము గలదు.

తెనుగు శబ్దములోని గు ప్రత్యయమును గూర్చి కొంత విచారము చేయవలసి యున్నది. గు,కు, క,గ, క్, గ్, ంక్, ంగ్, కి, మొదలగు ప్రత్యయము లంత మందుగల భారతీయ భాషలనుగూర్చి విచారించినచో దెలుగు శబ్దమునందలి గుప్రత్యయ తత్త్వము తెలియవచ్చును. దక్షిణ హిందూ దేశ భాషలలో గన్నడమునకు "హవిక" యను మఱియొక పేరున్నది. తమిళమును కొన్ని ప్రాంతములలో "సొలగ" లేక "షోలగ" యని పిలుతురు. "వుల్‌రంగ్" అనునది తమిళభాషామాండలిక భేదమగు బుర్గండీభాషకు మఱియొకపేరు. నీలగిరులలో దమిళభాషా భేదమగు ఇరులభాషకు "ఎరిలగారు" అను మఱియొక పేరున్నది. తమిళభాషాభేదమగు కొర్వా భాషలో "ఎర్న్‌గ" లేక "సింగ్లి" యను పేరున్నది. కోర్వాభాషకు "కోడా-కూ", కోఱా-కూ అనియు కొరగ, కొర్కూ, కూర్కూ, కోఱ్-కూ, యనుపేళ్లు గూడ నున్నవి. బడగభాషయనునది కన్నడభాషావికారము. దీనిని బడక్ అని కూడనందురు. కొడగుభాష కన్నడభాషావికారము. పేంగ్ అనునది తెనుగుతో సంబంబంధించిన "కుయి" అను భాషకు మాండలిక భేదము. "కోయ్ లోంగ్" అనునది కోంకణీ మళయాళభాషల సమ్మేళనము వలన గలిగినది. భత్కల్, బుత్కల్ అనుభాష మరాఠీభాషావికారమైన కోంకణీభాషా భేదము. "ధనగరీ" యనునది మరాఠీభాషకు మాండలిక రూపము. ఇట్లే దేషరుక్, కాంగ్ సౌంగ్, తోతిగ, యనునవి గూడ మరాఠీభాషా వికారములే.

టిబేటు దేశములోని భోటియా మండలమునందు గ్యారూంగ్, కైగిలి, డాన్జొంగ్-కా, యను భాషలున్నవి. ఇక బర్మాదేశములో జాలవఱకు భాషలు కంఠ్య వర్గాక్షరాంతములుగా గానబడు చున్నవి. ఉదాహరణములు:- ఘేక, గకు, హిరోఇలమ్‌గాంగ్, గన్న్‌గ, హ-అంగ్, హ్మెంగ్, హ్మాంగ్, హోమైంగ్, హోమోంగ్, హోర్‌త్సెంగ్, హ్రాంగ్, ఖొల్, ఇంఒంగ్, ఈషంగ్, జక్ తుంగ్, హు అల్న్‌గో, క-హంగ్, కంగ్, కత్‌లంగ్, ఖె-లోంగ్, ఖుగ్-నాన్, ఖుగ్నీ, ఖులుంగ్-ముదున్, ఖున్‌లోంగ్, ఖ్యంగ్ (చ్యంగ్), ఖ్యెంగ్, క్లున్ లోంగ్, ఖానుంగ్, నుంగ్, కోమ్‌రోంగ్, కోల్హ్ రెంగ్, కోతంగ్, కున్‌లోంగ్, క్విన్‌పంగ్, క్వోయ్‌రెంగ్, (లీయాంగ్)లకూ, లల్లెంగ్, లాలుంగ్, లంగ్రోంగ్, లంగ్‌తుంగ్, లథంగ్, లౌక్‌లంగ్, లెంగ్‌రెంగ్, మోంగ్, లోంగ్, మోషాంగ్, మ్రంగ్, ములుంగ్, ముంగ్, ముంతుక్, నమ్‌సంగ్, నరింగ్, పల్లంగ్, పల్లెంగ్, ఫడంగ్, ర-అంగ్, రాఒ-క్వంగ్, రవంగ్, రేఅంగ్, రి-అంగ్, రొంగ్, రుబ్రంగ్, సైంగ్ బౌంగ్, సెరంగ్, సెంకదొంగ్, సెంతుంగ్, షైయాంగ్, తాంగ్-ఖుల్, షామ్ తురూంగ్, సిన్లెంగ్, సీయంగ్, సొంగ్‌లోంగ్, స్తీఎంగ్, తఅంగ్, తబైంగ్, తబౌంగ్, తబ్లేంగ్, తైచౌంగ్, తైఖౌంగ్, తపోంగ్, తరేంగ్, తవ్‌హ్వౌంగ్, తయంగ్, తయింగ్, త్లంత్‌లంగ్, త్విలిఛంగ్, వెలౌంగ్, యబైంగ్, యకైంగ్, యల్లెంగ్, యమ్‌లంగ్, యంగ్‌కౌలెంగ్, యెమ్‌షాంగ్, రి అంగ్, అంగ్‌క,అక, అకో, ఆంగ్‌కూ, ఆంగ్‌వాన్-కూ (తబ్లెంగ్) అనుంగ్, నుంగ్, ఖునుంగ్, అయైంగ్, బెయ్క్, బోకి, ద-అంగ్, ద-ఎంగ్, దరాంగ్, పతాంగ్, దిగారు, దులేంగ్.

ఈ క్రిందిభాషలు టిబెటో-బర్మనుభాషా వర్గమునకు జేరినవి:- గురుంగ్, విదంగ్, లీయంగ్, లోయ్‌లోంగ్, మంగ్, తొంగ్, లొంగ్, మ్హంగ్, ఆర్లెంగ్, అరుంగ్, ఎమ్పేన్ ఛేపాంగ్, ఛిన్‌బోక్, చ్యంగ్, ఖ్యంగ్,

ఈక్రిందిభాషలు అస్సాము దేశములోనివి:- ధేకేరి, ఛిబోక్, డైకో, ఖంగోయ్, కోన్యక్, మయాంగ్, మిలెననంగ్, మించాణంగ్, మియాంగ్‌ఖంగ్, మూజుంగ్, వనాంగ్, అస్సిరింగియా, అనురింగ్, ఆతింగ్, ఆతోంగ్.

ఈక్రింది భాషలు నేపాళదేశములో వ్యవహారములలో నున్నవి:- ఛింగ్‌తాంగ్, గోర్‌ఖాలీ, గోర్ఖియా, ఖాలింగ్, కూలుంగ్, ఖంబూ, వాలింగ్, లింబూ, బాహింగ్. ఉత్తర హిందూస్థాన భాషలలో ఓడ్రభాషావికారములగు గచికోలో, కంగాలి, ఉత్కలీ భాషలును, తూర్పు హిందీభాషావికారమగు "కలంగ" భాషయును పశ్చిమ హిందీభాషావికారములగు పింగళ్, డాండా భాంగ్, డాంగీ, భాషలును, బంగాళము, ఒరిస్సా, బేహరము, ఛోటానాగపూరు దేశములలో సంచారశీలురగు నొకజాతివారు మాట్లాడు "గుల్ గులియా" భాషయను, బంగాళాదేశములోని బంగ, హైజోంగ్, ఆబెంగ్, అరంగా, భాషలును, మాఱ్వాడీ భాషావికారములగు డటకీ, డింగళ్, అనుభాషలును, నిట్టి ప్రత్యయములనే కలిగియున్నవి. కాంగ్రాయనునది పంజాబీ భాషావికారము. అవాంకారీ, అవాంకీ, అనుభాష పశ్చిమోత్తర పరగణాలలోని కోహత్ జిల్లాలోనిది. ఇది లహందా భాషావికారము. గంగోలాయనుభాష హిమత్పర్వత పాదమునందలి పహాడిభాషకు మాండలిక రూపమైన కుమౌనీ భాష యంతర్భాగము, డుంగరీ, డంకీ, యనునవి బెలూచిస్థానములో బ్రచారమున నున్నవి. పశ్చిమోత్తర పరగణాలలోని హింద్కో భాషయందు గూడ నీ ప్రత్యయము కనబడుచున్నది. వైగలీయను పిశాచభాష కాశ్మీర ప్రాంతమునందలిది. జ్ఞాంగ్, డంగార్, దిక్కూకాజీ, ఔరంగ్, ఉరంగ్ అనునవి ముండా భాషావిశేషములు.

బర్మాలో తలైంగ్ అనునొక భాషయున్నది. ఇది ఆష్ట్రో-ఏషియాటికు భాషా కుటుంబమునకు జేరిన మోన్-ఖ్మేర్ శాఖకు సంబంధించినది. దీనిని మాట్లాడువారి సంఖ్య 224424. ఇది బర్మాలోని అమ్హర్‌స్టు, థాటోను జిల్లాలో బ్రచారమున నున్నది. తలైంగ్-కలసీ యనునొక భాష బర్మాలోని యామేథిను జిల్లాలో వాడుక యందున్నట్లు తెలియవచ్చుచున్నది. తలైంగ్ కయిన్, అను మఱియొకభాష బర్మాలోని చాలజిల్లాలలో వాడుక యందున్నట్లును దానిని 352466 మంది మాట్లాడుచున్నట్లును బర్మాదేశపు జనాబా లెక్కల వలన దెలియుచున్నది. బర్మాలోని యుత్తర భాగమున తైలోంగ్ అనునొక భాషను 18074 మంది మాట్లాడుచున్నారట. అస్సాముదేశములో తురూంగ్ అను మఱియొకపేరుగల తైరోంగ్ భాషయున్నది. నేపాళదేశములో థూలుంగ్ అనునొకభాష మాట్లాడ బడుచున్నది. బర్మాలోని తెలైంగ్ దేశమునకును తెలుగుదేశమునకును చిరకాలమునుండి వాణిజ్యాది సంబంధముండినట్లు బర్మాదేశపు చరిత్రమువలన దెలియనగును. కాని తెలుగు భాషకును తెలైంగ్ భాషకును నేడెట్టి సంబంధమును సన్నిహితమైన దానిని కనిపెట్టుటకు వీలులేకున్నది. నేడు ప్రిజులిస్కీ మొదలగు పండితులు ఆష్ట్రిక్ భాషలకును ద్రావిడభాషలకును సంబంధమున్నట్లు తెలియ జేయుచు దద్విషయమై పరిశోధనముల గావించుచున్నారు. పరిశోధనముల మూలమున ద్రావిడభాషలకును ఆష్ట్రిక్ భాషలకును కొన్ని సంబంధములు నిరూపింపబడినవి. ఈ పరిశోధనములవలన నీరెండు భాషాకుటుంబములకును సంబంధ, మేర్పడిన యెడల నాష్ట్రిక్ భాషలకే సంబంధించిన తెలైంగ్ భాషకును తెలుగుభాషకును సంబంధ మేర్పడవచ్చును. అ సంబంధము తేలువఱకును నీ విషయమై ఇదమిత్థమని చెప్పుటకు వీలులేదు.

పైని వివరించిన గుప్రత్యయ విచారమునకు సంబంధించిన యొక విశేషము గలదు. ప్రాకృత వైయాకరణులు పైశాచీభాష కాంచీ, పాండ్య, పాంచాల, గౌడ, మాగధ, వ్రాచడ, దాక్షిణాత్య, శౌరసేన, కైకయ, శాబర, ద్రావిడ, బాహ్లిక, సహ్య, నేపాళ, కుంతల, గాంధార, సుదేష్ణ, ఘోట, హైవ, కనోజన, దేశములందుండునదని వివరించిరి. ఆర్యభాషల యందు ముండా, ద్రావిడ, భాషల సంబంధమువలన గలిగిన భాషావిశేషములే పైశాచీ భాషలుగా బరిణమించి యుండవచ్చునని హొయర్‌నెల్, సెనార్టు, పండితు లభిప్రాయపడియున్నారు. ఇంతకుముందు గుప్రత్యయాంతములుగా వివరింపబడిన భాషలన్నియు పైశాచీభాషా ప్రదేశములందలి వనిప్రాకృత వైయాకరణులు తెలిపిన ప్రదేశములందే సరిగానుండుట విచిత్రముగా నున్నది. గుణాడ్యుడు బృహత్కథను పైశాచీభాషయందు వ్రాసి యుండెనను ప్రతీతియందు సత్యమున్నచో నాంధ్రభాష పైశాచీభాషావిశేషమై యుండవచ్చును. ఈ యూహల కాంధ్ర వైయాకరణుల యభిప్రాయమును దోడ్పడు చున్నది. ఇందువలన తెనుగుభాష నేడుగూడ కేవలము పైశాచీ భాషతోనే సంబంధించినదని యనుకొనగూడదు. ఒక భాషయొక్క చరిత్రయం దెన్నోమార్పులు కలుగుచుండును. తనతో సంబంధించి నట్టియు సంబంధింపనట్టియు నెన్నోభాషలతో దానికి సంపర్కము కలుగవచ్చును. అందుచేత నాభాష కేవలము మూలభాషా రూపముననే నిలిచియుండుట యసంభవము. అయినను నది మూలభాషా సూత్రముల ననుసరించియే మార్పులను బొందు చుండును. ఈ విషయమై తెనుగునకు సంబంధించినంత మట్టుకు మఱియొకచోట వివరింపబడును.

తెనుగుశబ్ధమును గూర్చి విచారించు నపుడు భరతవర్షమునకు దూర్పు తీరమున వరుసగా నంగ, వంగ, కళింగ, తెలింగ, దేశములున్ననను విషయము గొచరింపక మానదు. కలింగయనగా నెత్తైనదేశము, తెలింగయనగా బల్లపుదేశమనియు గళింగ తెలింగములు వాస్తవముగ నొక్కటేదేశమనియు, గొందఱు చెప్పుదురు. కళింగాంధ్రములకు భాషయొక్కటియే యని కుహున్ పండితు డభిప్రాయపడియున్నాడు. కలింగదేశపు భౌద్దగ్రంధముల భాషయు ఆంధ్రదేశమునకు సంబంధించిన బౌద్ధమత గ్రంథమగు అట్ఠకథలోని భాషయునొక్కటియే యయియుండు టీయూహ కాథారము.

గ, గు, ప్రత్యయములు సంస్కృతములోని కప్రత్యయమునకు బ్రాకృతాభాషా వికారములని చెప్పుట కవకాశమున్నది. మాదిగ, గోసగి, మడంగి, కోణంగి, వడ్రంగి, మొదలగుశబ్దములలోని ప్రత్యయములు సంస్కృతములోని క, కి, ప్రత్యయ వికారములే. మధ్యపరగణాలలోని తేల్‌నదీ ప్రాంతమునుండి వచ్చినవారగుటచే తెలుగులను నామము కలిగినదని కొందఱు చెప్పుదురు. తైలికశబ్దభవము తెలుగని కొందఱి యభిప్రాయము. తెలివిగలవారు కావున తెలుగులను పేరు గలిగినదని కొందఱందురు. తెల్‌ అను పదము సంస్కృతములోని ధవల, తృప్త, దృప్త మొదలగు శబ్దముల ప్రాకృతవికారము కావచ్చును. ఈ వ్యుత్పత్తు లన్నియు నూహామాత్రములు. తెలుగుశబ్దము వ్యుత్పత్తినిగూర్చి ఇదమిత్థమని చెప్పుటకు నేటికిదగిన యాధారములు లభింపలేదని మాత్రముచెప్పి యింతటితో విరమింపవలసి యున్నది. ఈ విషయమై "జనపదేలుప్; తదశిష్యం సంజ్ఞాప్రమాణత్వాత్." " లుబ్యోగా-ప్రఖ్యానాత్" "యోగప్రమాణేచ తదభావే దర్శనంస్యాత్." "ప్రధాన ప్రత్యయార్థవచన మర్ధస్యాస్య ప్రమాణత్వాత్," అను పాణినీయ వచనములను స్మరింపవలసియున్నది.

తెనుగు భాషకు దమిళదేశము నందు వడుగ, బడగ, యను పేర్లున్నవి. పోర్చుగీసువారు తెనుగును బడగేస్ అని పిలుచుచుండిరి. జర్మనులు దానిని వరుగ యనిరి. ఐరోపియనులు తెనుగును జెంటూ భాషయని పిలుచుచుండిరి. ఈపదము పోర్చుగీసు శబ్దమగు జెంటియో, (అనగా మ్లేచ్చుడు, క్రైస్తవేతరుడు) అనుపదమునకు వికారము.

తెలుగునకు సంబంధించిన కొన్నివికార రూపములనుగూర్చి యింతకు ముందు దెలుపబడినది. వానికీ క్రింది యుదాహరణములు లింగ్విష్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 4-వ సంపుటమునుండి తీసికొనబడినవి.

కోంటావుభాష.

ఒక మనిషికి యిద్దఱు పిల్లగాండ్లు వుండిరి. వాండ్లో చిన్నవాడు తండ్రితో అంటాడు, "తండ్రి, యేదో మాలమతది నాకు వచ్చెవలది అది యవ్వు." వెనకవాడు పిల్లనికి ధనము పంచి ఇచ్చిండు. వెనక కొన్ని దెవములకు చిన్నపిల్లడు అంత సొమ్ము జమాజేషి దూరదేశానకు పోయిండు యింక అక్కడా అవిచారముతో నడ్చి తన సంపత్తు పాడుగొట్టినాడు. తర్వాతా వాడు అంతా వొడ్శినంక ఆ దేశములో లావుకరువు బడది. అందుకు, వానికి కఠినము బడది; అప్పుడు వాడు దేశములో ఒక్కమనిషి దగ్గిర పోయి వున్నడు. వాడేతేసు వాని పందులు కాషేకొరకు తన చేండ్లోకి తోల్లాడు. అప్పుడు పందులు తినేది పట్టుతో వాడు తన పొట్ట నింపుకోవలె అని వానికి అనిపించింది, యింకా యెవ్వరు వానికి యివ్వలేదు. తర్వాతావాడు తెల్వి మీదికివచ్చి అన్నాడు; మాతండ్రి యింట్లో యెందరు నవుకరలకు పుష్కళంగా అన్నం వున్నది, యింకా నేను ఆకలితో చస్తా. నేను లేశి నా తండ్రి దిక్కుకు పొయ్యేను. వానితో అనెను, "ఓతండ్రి, నేను యీశ్వరుని విరుద్ధం నీముందర పాపం జేసినాను; యిక్కడినుంచి నీ కొడుకును అనేటందుకు నేను యోగ్యని కాను. నీ ఒక్క నౌకరివానివలె నన్ను వుంచు."

కామాఠీభాష.

వక్క మనశికి ఇద్దరు కొడుకులు ఉండుండ్రి. చిన్నోడు తండ్రికి అంటడు "అయ్యా, నా అంతుకు యేమి జిందగి అస్తది అది నాకు ఇయ్యానా." మరి తాను అది ఇద్దడ్కి పంచి ఇచ్చిండు. తోడ్యం దినాల్గు కాలే, ఇంతట్లా చిన్నకొడుకు తనది అంత హిస్స జమాచేసిదూరం దేశంకు యెల్లిపోఇండు. అడ అంత ముల్య మజాలా యగరకొట్టిండు. యప్పుడు అంత ముల్య యగర కొట్టిండు అప్పుడు ఆ ఊరల్యాకా పెద్దకాలం పడిండ్యా. అప్పుడు తనకు తిండికి మోతాదు ఆయా. మరలా ఆడు ఆ ఊరల్యా దండ్యోడు దగ్యరపోఇఅ ఉండ్యా. మరి ఆడు ఆడ్కి తన శేనులా పందులు మేపతనకు తోలిండు. పందులు తినేటి పొట్టు తిని పొట్టనింప తనకు తాను కబుల్ ఆయా గని అది బీయవ్వరు ఇయ్యరు. యప్పుడు ఆడు నుద్దిమిద అచ్ఛా. అప్పుడు మనసుల అనకుండ్యా," నా అయ్యా ఇంట్లా యంతమంది నౌకీర్‌చేశి సుకంగా పొట్టనింపుకుంతరు, ఇంకా నేను ఇడ ఉపాసం సస్తా. నేను ఇప్పుడు లేశి నాతండ్రి దగ్యర పోతా. ఇంక నేను ఆడ్కి అనేను, "అయ్యా, మీదీ వ దే వరుదీ అపరాధీ ఉన్నాను. దానికోసంకి మీకొడకు అనపించు కునతందుకు లాయక్‌కాను. నీవు నాకు నౌకరోడు మేరగా ఉంచు" అప్పుడు లేశి తండ్రి దగ్యర్కి పోయా. ఆడ్కి దూరంకెల్లి కొడకు రాంగా తండ్రి సూశా. ఇంక గోశావచ్చి తండ్రి ఉర్కి అల్ముకున్యా. ఇంక ఆడికి ముద్దిచుకున్యా. మరలా కొడుకు తండ్రికి చప్యా, "అయ్యా, నీ ముంగట నేను సామిది పాపం చేసినా. గందుగోసంకి ఇప్పుడు మీకొడుకు అనిపించుకుంతనకు నాకుసిగ్గు అప్తది." మరలా తండ్రి నౌకర్‌గాల్లకు చప్యా కీ, "మంచిబట్టలు తండ్రి. ఇంక ఈడకి తొడగిపియుండ్రి. ఈడిచేతికి ఉంగ్రం పెట్టుండ్రి, ఇంక కాల్లకు పావసాలు తొడకుంతనకు ఇయుండ్రి, ఇంక మనము తిని చేసి ఆనందము చేస్తాము, కారణము ఈనా కొడుకు నచ్చి ఇండ్యా, ఆడు ఇపొద్దులేశి అచ్చిండు; ఆడు కారి పోఇండ్యా, గని ఇపొద్దునాకు దొర్కండు." మరలా ఆల్లు తా ఆనందము చెయ్య తలగిరి.

__________

దాసరీ భాష

ఒక్కోడొక్కోడ్ మనిసికె ఇద్దర్ మగపిలగాళు ఉండ్లి. వాళ్నోన చిన్నాపిలగడు తన తండ్రికె అనె. "తండ్రీ, నీ బడకల్నోన నాకె వచ్చ్యట్టి పాల నాకె ఈ". తండ్రివాళ్నోన తన బదక పంచిఇచ్చె. చిన్నాపిలగడు తన పాల తిస్కోని దూరము నాట్కపొయ్యి, శినా వద్దల్ ఆవలేదు, అంతట్ల్నో వాడు శన ఖర్చ శేశి తనబదకంతా పాడశేసె. వాడు ఇట్ల శేశిన మంట్కె ఆదేశమ్లోన పెద్ద్ కరవపడి వానికి ప్యాదర్కెం వచ్చె. వాడు ఆదేశంలోన ఒగ మనిశికి పక్క చాక్రి జేరే. ఈ మనిశి వాని పందలి మేపడన్కి తన చేనక తోలే. ఆడా ఆకల్గోని కళవళికుటి పంది తినేట పట్టు సుదా తినె కడపు నింపకుతుండె, ఆతె వాంకి యవళ్నించి ఏమీ చికకుండె. ఇట్ల తోడెం వద్దల్ పాయె; తన ఎనకటి జ్యలమం నెప్పయ్యి వాడు మన్‌సల్నోన అనె, "నాతండ్రి పక్క ఉండేట చాక్రిమంద్కి కడపు* నిండి ఎక్కొయిటంత ఇరిపెము చికతడి. ఆతె ఈడా నానూత్రన్కి ఆకల్గోని తప్తా, నా లేని నా తండ్రి తక్క పొయ్యిఅనె, "తండ్రీ నాద్యావర్ది కర్మం తండ్రీకర్మం కట్కోన్న్. నాను నీ పిలగడంటని అనిపిచకోగడ దాన్కి బాగలేదు. నన ఒగ చ్యాక్రీ మనిశి తిరశీ నీ పక్క్ పెట్టకో, "వాడు ఆనించి లేసి తన తండ్రికాడికి వష్తె వడు తండ్రి దూరంనించి వాని తూసి అంతకరణం పుట్టి ఉర్తపొయ్యి పటకోని ముద్దాడె. అప్పడ పిలగడు తండ్రికె అనె, "తండ్రీ న ద్యావరముందలా ముందలా తప్పశేస్న, నన నీ పిలగనంట్ పిలవకు. "దీన్కి తండ్రి తన --క్రీమండ్కి అనె, "మంచిది ఏశెంతెచ్చి నా పిలగన్కి తోడగుండి, ఏలుకోవ ఉంగరం ఏయిండి, కాళ్నోన్న చ్యప్పులు ఏయిండి, తినిపిచిదన్కి తయార శేపిచ్చుండి, మాము తిని సంతోసం ఆతం. ఏమంటె ఈ నా పిలగడు తచ్చిండె, తిరగా జీవవచ్చె? తప్పిచ కోనండె, చిక్కినడు." దీని ఇని అందర్కి బాగఆయె.

ఈ యాళాకు వాని పెద్ద్‌పిలగడు చ్యాన్లాఉండె. వాడు ఇంట్లిపక్క వచినెప్డు వాన్కి పాడ ఎడ్దిచాలి బట్టెడ్ది ఇనవచ్చె. వాడు చాక్ర్యోళ్నోన ఒగనిపిల్చి, "ఏయ్‌నడచింది"? అంటా అడిగె. దాన్కివాడు, "నీ తమ్మ," వచినాడు? వాడు బాగ వచ్చి పట్టే కారణమ్ నీతండ్రి తినిపిచినాడుడు అంటా చెప్పె. దీని ఇని వాని పెద్ద్‌పిలగడు కోపమెయ్యి నోన్కి పాకపాయె. దానించి వన తండ్రిబేల్క్ వచ్చిన్నోన్కి దాఅంటని వాన్క్ శన చపకోని, దాన్కి వాడు తనతండ్రికె అనె, "నా గెణెకాళ్న్ కూడపకోని తినిపిచిడ దన్కి నివ్వు నాకు ఎప్పడూ ఒగమ్యాకునుదా ఈయక్‌పోతివి. ఆతె లంజెల్ కాల్ సోబతీ కూడి నీ జింజిగెంత మింగెనంత్ ఈ నీ పిలగడు ఇంటకూ వచిన మంట్కె నివ్వు వానించి తినిపిచినావు." తండి పిలగన్కి అనె, "నివ్వు పగ లెల్లానా పక్కుంటావు. నాత ఉండడంత నీదె తచ్చిని నీతమ్మడు, మళ్లా జీవంతడాయె? తప్పిచ్క్ పోయినోడు చికినడు, అంటని మాము సంతోసం ఏడ్ది మంచిది. ఉండది.

బేరాదీ భాష-1

ఒకనికొకనికి గిరెస్తనక్ ఉద్రుపటి బిడ్ల్ ఉడ్రి. వర్దానాన్ సణ్ణ్, కొడక్ తన్ ఐకె అందె, "అయ్యా, నీ జిందిగినాన్ నాకివసన్ పాల్ ఈయి," అంటండె. అయి వర్దానాన్ తన్ బదక్ పంచిశిదె. సణ్ణ్ కొడక్ తన్ పాల్ చికోని దూర్ రాజనక్‌పోయి బాళ్ నాద్ల్ అగ్గల్యా. హంత్నాన్ వాడు దుందుకేశి తన బదుక్తెల్ హాళ్ కేశడి. వాడు హిళ్ళ్‌కేశడిపైని ఆదేసనాన్ పెద్ద్ బరపడి వనికె బడతన్ వశా. వాడు ఆ దేసనాన్ బకన్ బల్లి చాక్రి-చ్చి. ఈ గిరెన్త్ వాంత్ పందల్ మేబసగ్ తన్ సేనక్ అంపిశిడె. అంద్ సర --నుటి కళవళస్తి పంది తాగ్‌హంతాది పోట్టోసుద్దె తిని బళ్ళ్ నిప్పికోతుడతె. --గితేన్ వానికె యార్నుటి ఏమీశిక్కగల్యా. హిళ్ళ్‌కొంత్ యాళేమపోయి ఎనక్ అగింది నెనపగి వాడు తన్ మనసనాన్ అండె, "మాయయ్యీ హెంతోచాకర వర్క్ బళ్ళ్ నిప్పి సాలగనంత్ అన్నం శిక్క్దాయి, అగి హింద్ నానటూ సగర సస్తాన్. నాను లేశి మాఅయ్య బల్లి పోయి, అయ్యా, నా దేవరదు పాపం అయ్యెన్ పాపం కట్టికోడాన్. నాను నీ కొడక్ అనిబిలుసుకోగా చలూ లేదు. నత్త్ బక్ ఆళ్కోడక్ తలె నీ బల్లి పెట్టికో." అంటు అందుటి లేశి తన్ అయ్య బల్లివసిసావద్, అయ్య వాంత్ దూర్నుటి మాది పిరితివశి పారిపోయి పటికోని ముద్దిశిడి, అవడ్ కొడక్ అయ్యక్ అండె, "అయ్యా, నాను దేవర్ బల్లి నీ బల్లి తప్ప్ కేశుడతె. సత్త్ నీ కొడక్ అంట బడరొద్ద్".దినికె అయ్యి తన్‌చాకరికె అండె. " చలు పోశాక్ తెశి నా కొడక్క్ పెడస్, బొట్టనాన్ ఉంగరం యయ్యి, కాలాన్ శెప్పల్ పెడన్, ఊటం తయారంకేబ్స్. నాము తగి సంతోసగదం. యాలంటేన్ ఈ నన్ కొడక్ నశుడ్డె, మర్కళి జీమగడాడ్? తెపిసికోడాడు, శిక్కిడి" దీత ఆలిసి అల్లారు సంతోసం అగిరి/

ఈ యాలేమ వన్ పెద్ద్ కొడక్ శేనాన్ ఉడ్ది. వాడు గుడస్ బల్లి వశినావడ్ వానికి పాట్లా కున్‌సందా ఇనివశ్యా. వాడు ఆ చాకరినాన్ బకంత్ బదరి, "ఇదేమ్ అగ్గడాయి"? దాత్ అడిగితి. దానికె వాడు అండె, "నీ తమ్ండ్ బన్‌డాడ్. వాడా చలూనాన్ ముట్టిందికారణమా మీ యయ్యి ఊటం కేబన్ డాడ్", అంట్ శెప్పిడి. దీత్ అడిగి ఆ పెద్ద్‌కొడక్ శిట్ట్ కేళి నొనికె పోకయిడి. దన్నుటి వారయ్యి ఎలికివశి, "నొనికెదా," అంట్ వానికె బాళం శెప్పికోడి. దానికె వాడా తన్ ఐకె అండె, "నా ఇన్ని వరసల్ తన్కానీ చాకరి కేశి యండూ నీ మాత్ మీర్కగతి. ఇంతూనాను నా గెణేలు కూడికొని ఊటమ్ కేబసగ్ నివ్వు ఎండూనాకె బక్క్‌మక్ సుద్దె ఇసకగతి కాదు. అగితేన్ సూళిగార్ సోబతి పట్టినీ బదుక్ తెల్ల నుంగినంటా ఈ నీ కొడక్ గుడన్క్‌వశిన్ బారక్ నివ్వువాన్ కడిశింద్ ఊటమ్‌కే బస్డ్.' అయ్యి కొడక్ అండె, "నివ్వుపోగలెల్లా నా హింమాల్ ఉడతావు. నా బల్లి ఉణ్ణిదెల్లా నీదే. నశిన్వాడ్ నీతమ్మడ్, తిరిగి జీమగడాడ్? తెపిసుకోని పోని వాడ్, శిక్కాడ్, అంట్ నాము నంతోన్ అగితెమె పాడు ఉడాయి."

బేరాది. 2.

చండుకోలాట్.

రంగంత్ హుడిగేడ్ గోవిందనక్ శపకాడ్, "గోవిందా, రేపు ఆపక్కె ఉసల్ బైల్నాన్ చండుకోలాట్-ఆడగ్ బాళం హుడిగేల్ పోడార్. నాను ఆకడిగె, పోతాను. నివ్వు వస్తావు కాద్?"

గోవింద్:- "హొంద్, అగితేన్ మాయవ్వ గుడసాన్ లేదు. దాన్ అపణి ల్యాక్ హెళ్ళ్ బత్తు? అది గడసక్ వశిన్ బళక్ నామ అడిగి ఒస్తాన్. అవ్వ ఎలికె పోనావన్, "గుడన్ తిడిసి వక్కడూ పోవద్ద్" అంట్ నాకె అవణి కేసడాయి." ఖాళీ పుట.
రంగ్:- మీ యవ్వ్ యాతడ్ ఒస్తా-----------------ద్దర్. అంద్ ఆట్ ఒళేబారక్ --------------- చలుదు? నాను అవడీ పోతుడత అగితె --------------- నద్ ఒదర్" అంటు నివ్వు మొన్నా శెప్పిరాదడి -------------- ఒస్తి? నీకి ఒనంద్ మవసా ల్యాకుడెన్ నా ---- పోతాను."

గోవింద్:- "రంగా, నివ్వు హిళ్ళ్ కే సంది చెలువా? జరా 'నిచ్‌', మా యావ్వ ఇవుౝ ఒసన్."

రంగ్:- "మీ యవ్వ్ ఎంద్ పాడాయి? ".

గోవింద్:- "మా సినవ్వ్ కూత్రమెయనాన్ చలూలేదు? దాత్ మాడాడస్ పోడాయి."

రంగ్:- "హళగితేన్ ఆదేమ్ లగ్గ్ ఒస్తాయి? అందునాల్ గళగలా కుసర్బడి, దన్ వైని వసన్? దన్నుటి నివ్వు కుసర్బడు, నాను పోతాను. ఈపొద్ద్ ఆట్ ఒళె చమత్ అగతాయి."

____________

ఆర్యభాషలు.

____________

1. ఇండో యూరోపియను భాష లీ క్రిందివిధముగఁ బాశ్చాత్య పండితులచే విభజింపఁ బడియున్నవి.

1. ఇండో ఐరేనియను శాఖ.
2. ఆర్మేనిక్ శాఖ.
3. బాల్టిక్ - స్లావిక్ శాఖ
4. ఆల్బేనియన్ శాఖ.5. హెల్లెనిక్ శాఖ.
6. ఇటాలిక్ శాఖ.
7. కెల్టిక్ శాఖ.
8. జర్మానిక్ లేక ట్యూటోనిక్ శాఖ.

ఈ శాఖలలో మొదటిదగు ఇండో - ఐరేనియను, లేక ఆర్యశాఖకు సంబంధించిన భాషలు మనకు ముఖ్యములైనవి. ద్రావిడభాష ఆర్యభాషలతో సంబంధ----------ప్రాయమును విమర్శింపవలసి యున్నది. కావున వానిని గూర్చి యిచట ముచ్చటించుట యావశ్యకమగుచున్నది.