ఆంధ్రభాషార్ణవము/ద్వితీయ కాండము
ద్వితీయకాండము
క. | శ్రీరఘునాథాఖ్యాకమ, హీరమణమనోబ్జభృంగ హీరనిభాంగా | 1 |
క. | ధరణి పుర శైల వన మృగ, నర వర్ణచతుష్క వర్గ నద్ధత | 2 |
భూవర్గము
ఆ. | పుడమి నేల యనిన భూవాచకం బగుఁ, బొల మనంగ నూరిపొత్తు నేల | 3 |
ఆ. | గురువు గరుసు నాఁగ ఖరభూమి విలసిల్లు, దువర తుస్సి నాఁగఁ దువరభూమి | 4 |
సీ. | మృత్తికాహ్వయములౌ మిత్తిక యం చన మట్టియం చనఁగను మ న్ననంగ | 5 |
తే. | పరఁగు నెద్దడినే లన మరుధరిత్రి, కొఱ కనంగను బీడునాఁ గొఱ ననంగఁ | 6 |
సీ. | పాండవబీడు నాఁ బరఁగుఁ జిరాప్రహతము పాడు నాఁగను దనరు నప్ర | 7 |
సీ. | మొరపనేల యనంగ మొరసునేల యనంగ శర్కరిలావనీసంజ్ఞ వెలయు | |
| బరిసరంబుగఁ దోఁచు వరసంది చేరువ కట్ట కత్తువ కర గనిమ యనఁగ | 8 |
సీ. | బాట యనంగను బండిబా టనఁ దగు ఘంటాపథము దోఁచుఁ గాలిత్రోవ | 9 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ భూమివర్గ మిట్లు | 10 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
పురవర్గము
ఆ. | ప్రోలు వీడు నాఁగఁ బురసంజ్ఞ లై యొప్పుఁ, గంచినాఁగ నోరుఁగల్లు నాఁగఁ | 11 |
సీ. | అంగడి మలిగనా నాపణసంజ్ఞ లౌఁ బేట యం చనఁగను విపణి యొప్పు | 12 |
సీ. | పొరకటి యిడుపు నాఁ బొసఁగు ద్వారప్రాంతకుడ్యము మదురు మగలనఁ గుడ్య | 13 |
సీ. | హాజారము హజార మనునివి రెండును మోసాల మొగసాల మోస లనెడి | |
| కొల్లా రనఁగఁ జుట్టుకొల్లారు నలుసాల యనఁ జతుశ్శాలయౌ నల్పగృహము | 14 |
సీ. | బొమ్మరి ల్లనఁగను బుత్రికాగృహ మొప్పుఁ గుంజంబు పొదరి ల్లనం జెలంగు | 15 |
సీ. | చప్పరం బనఁగను జనుఁ గాయమానవిశేషంబు కురుజునా స్థిరరథ మగు | 16 |
సీ. | హర్మ్యాఖ్య మిద్దెనా నలరు నట్టిక యన మచ్చునా నల్పహర్మ్యంబు వెలయు | 17 |
తే. | సిగర మనఁగను విలసిల్లు శిఖరసంజ్ఞ పొలుచు శిఖరపుఁగొనపేరు మోరునాఁగ | 18 |
క. | పెర డనఁ బెడ లనఁ బె ళ్లనఁ, బరఁగున్ గృహపృష్ఠసీమ పంచ యన న్మం | 19 |
సీ. | దూలమం చన గృహస్థూలతిర్యగ్దారుసంజ్ఞ యై విలసిల్లు స్తంభసంజ్ఞ | |
| తిర్యగాబద్ధదండంబు తేజరిల్లుఁ, జిలుకకొయ్యన పడెనాఁగ జెలఁగుచుండు | 20 |
సీ. | దోఁపుచూ రనఁగను దోఁచు నంతచ్ఛది కొణిగచూ రనఁగ నగు న్వలీక | 21 |
సీ. | రోలుమ్రా నుదుకనాఁ బోలుఁ గవాటమూ లాలవాలాభిధ యర్గళాఖ్య | 22 |
సీ. | కలువడంబు కలాపి కలయంపి చానపి యన గోముఖాఖ్యలై యలరుచుండు | 23 |
క. | పొలిమే రన గడి యనఁగాఁ, బొలిమెర యన నెల్ల యనఁగఁ బోలును సీమా | 24 |
తే. | అగడిత యగడ్త యనఁగ ఖేయంబు దనరు, మందుపట్టడపేరు చెన్నొందు బాణ | 25 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగఁ బురవర్గ మిట్లు | 26 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
శైలవర్గము
క. | మె ట్టనఁ గొం డన మల యన, గ ట్టన గుబ్బలి యనంగఁ గరువ యనంగా | 27 |
సీ. | చుట్టుకొం డన మేరగ ట్టనఁ జక్రవాళాచలసంజ్ఞలై యలరుఁ బొడుపు | 28 |
సీ. | రాయి కల్లనఁగ శిలాఖ్య యాఁ జట్టన క్ష్మామగ్నశిల యొప్పుఁ జాఁపఱాయి | 29 |
సీ. | శిఖరాఖ్య యొప్పును సిగరము గుబ్బ పే టనఁ జఱి జఱియ పడకు పణ కన | 30 |
తే. | గొంది యనఁగను గిర్యల్పకోణ మొప్పు, లోయ యన లొద్ది యనఁగఁ బొల్పొందుచుండు | 31 |
తే. | గని యనఁగ నాకరం బగు గైరికంబు, జేగుఱం చన విలసిల్లుఁ జెలఁగును గుహ | 32 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ శైలవర్గ మిట్లు | 33 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
వనౌషధివర్గము
సీ. | అడవి కాన యనంగ నటవి యై తగును బేరడవి నాఁగను నరణ్యాని చెలఁగు | |
"
| రేఁక యనఁగను రేఖయై రీతిగాంచు గర యనఁగఁ దద్విశేష మై పరగుచుండు | 34 |
సీ. | మొలక మొలవ మొక్క మోక మో సీరిక మొటిక నా నంకురం బొప్పుచుండు | 35 |
సీ. | మోడు మో టనఁగ నొప్పును స్థాణునామంబు గున్న యం చనఁగను క్షుపసమాఖ్య | 36 |
సీ. | రెమ్మ రెబ్బ రివట రివ్వ సెలగ చివ్వ చివక మల్లె జబర చివర సురిగ | 37 |
సీ. | ములు వసి యనఁగను జెలఁగుఁ గంటక సంజ్ఞ తొడుగఱ్ఱ యీడిక సుడుము కంప | 38 |
సీ. | పాదరజస్సంజ్ఞయౌ సద యనఁ జిగు రిగురు తలి రనంగ మీఱును గిసలయ | |
| బ్రబలు నత్యంతబాలశలాటుసంజ్ఞ మనును శుష్కశలాటునామంబు వట్టు | 39 |
సీ. | పేసె మనంగను బేసాఖ్య విలసిల్లుఁ బసురు పస రనంగ స్వరస మొప్పుఁ | 40 |
సీ. | మొల్లలు మల్లెలు మొదలైనశబ్దము ల్బహుతను దముదుపుష్పముల దెలుపు | 41 |
సీ. | రావియం చనఁ గుంజరాశన మగు గంగరావియం చనఁగను బ్రహ్మదారు | 42 |
సీ. | వరుణనామము లులిమిరి యన మొగలింగ నాఁగ నిసుకమ్రాను నాఁగఁ దనరుఁ | 43 |
సీ. | ఊడుగు నాగను నొప్పు నంకోలంబు నెగడుఁ గింశుకము మోదుగ యనంగఁ | |
| పరఁగు మారే డనంగను బ్లక్షసంజ్ఞ నివ్వటిలు జువ్వి యనఁ గలుజువ్వి యనఁగఁ | 44 |
సీ. | లొద్దుగనాఁగను లోధ్ర మౌ | 45 |
సీ. | ములువెలమ యనంగఁ జెలఁగును స్వాదుకంటకనామధేయ మీడ యనఁ బరఁగు | 46 |
సీ. | చింత యనంగను జించయౌఁ దత్ఫలైకాంశంబు గుడిసెయం చనఁగ వెలయుఁ | 47 |
సీ. | నెమలియడుగుమ్రాను నెమిలియం చనఁగను బతికరంజంబు పొల్చుఁ జండ్ర | 48 |
సీ. | కచ్చగ చ్చనఁ జెల్వుఁ గాంచుఁ గాచస్థాలి ప్రేంకడ మనఁగను బ్రేంకణ మనఁ | |
| శింశుపానామ మై చెలఁగు నిరుగు డన దిరిసెము గిరిసెము దిరిసెన మనఁ | 49 |
సీ. | కరకయం చనఁగను బరఁగు హరీతకి యళదయం చనఁగను హళది యనఁగ | 50 |
సీ. | పాలకొడిసె యనఁబడు శ్వేతకుటజంబు కలిపినాఁ గృష్ణపాకఫల మమరుఁ | 51 |
సీ. | నాగమల్లె యనంగ నాగమల్లిక మీఱు శ్రీహస్తీనీసంజ్ఞ చెలఁగు గురువు | 52 |
సీ. | మైద గోరంటనా మనుఁ గురంటకసంజ్ఞ కొరవినాఁ గ్రోవినాఁ గ్రొమ్మినాఁగఁ | 53 |
సీ. | బదనిక పదనిక బవనిక యన వంద చనుఁ దిప్పదీఁగెనాఁగను గుళూచి | |
| దూలగొండి యనంగ దురదగొండి యనఁగఁ దీఁటకోవెలయనఁ దేజరిల్లుఁ | 54 |
సీ. | కోలపొన్న యనంగఁ గొమరారుఁ బృశ్నిపర్ణియుఁ గ్రోష్టుపుచ్ఛియౌ నేలపొన్న | 55 |
సీ. | అడ్డసర మనంగ నటరూషనామమౌ గింటెన యనఁగను దింటెన యన | 56 |
సీ. | గిలిగిలచెట్టునా గిలిగింతచెట్టునా గిలిగిచ్చచె ట్టన గిలకచెట్ట | 57 |
సీ. | అరఁటి యరం టంటి యనఁటి యనంటినాఁ గదళికాహ్వయములై పొదలుచుండుఁ | 58 |
సీ. | వంగ యనంగను వార్తాకమై యొప్పు నీరెత్తువంగ నా నీరు వంగ | |
| దచ్ఛలాటువుఁ బల్కఁదగును వంకాయనఁ గంటకి చను ములుక యన నేరు | 59 |
సీ. | బీరన బీఱనా వెలయుఁ గోశాతకి నేతిబీఱ యనంగ నెగడుచుండుఁ | 60 |
సీ. | చెప్పుత ట్టనఁగను జెలఁగు గోదావరి నేలతాడియనంగ నెసఁగు ముసలి | 61 |
సీ. | ఆరెపు వ్వనఁగను నారె లనంగను ధాతకీకునుమంబు దనరుచుండు | 62 |
సీ. | పెన్నే రనంగను బెన్నెర నంగను దొమ్మడో లనఁగను దోఁచు నశ్వ | 63 |
సీ. | వాలు డనంగను వాతారి విలసిల్లు గురుగటం చన్నను గురి యటన్న | |
సీ. | యెసగంగ క్షమ యొప్పు నెఱ్ఱగిసె యనంగ బర్బుర మలరు బొబ్బలి యనంగఁ | 64 |
సీ. | గవ్వగుత్తిక యన గవ్వగుత్తి యనంగ జనుఁ గపోతాంఘ్రి దూసర యనంగ | 65 |
సీ. | పులుగు డనంగను బులిసరి యనఁగను బాలకినీసంజ్ఞ పరఁగుచుండు | 66 |
సీ. | ఆకు పువ్వును గాయ యాదిగా నివి యెల్ల గూరయం చనఁగను మీఱుచుండుఁ | 67 |
సీ. | తనరు విశల్యయై తరిగొఱ్ఱ చెన్నచెఱుకు పొత్తి నాఁగఁ గారుమిను మనఁగఁ | 68 |
సీ. | స్థలపద్మ మగు మెట్టతామర యనఁ బైఁడితామర యనఁ బచ్చతామర యన | |
| యుల్లియం చనఁగ నీరుల్లినాఁగఁ బలాండు వొప్పు లశునము వెల్లుల్లి యనఁగ | 69 |
సీ. | జ్యోతిష్మతీసంజ్ఞ యొప్పు నెక్కుడుఁదీఁగె యనఁగ వారాహి పాఁ చనఁగఁ బరఁగు | 70 |
సీ. | గుమ్మడి యనఁగను గూశ్మాండ మగుఁ బెద్దదోసనాఁ ద్రపుసము దోఁచు నక్క | 71 |
సీ. | చిరుగడం బనఁగను జెలఁగును మధురకందంబు గండీలంబు దనరుఁ బెండ | 72 |
సీ. | గంజాయియం చన గాంధారి చెన్నొందు గాఁజరయం చనఁగాఁ గళంజ | 73 |
సీ. | కుచ్చలియం చనఁ గుచ్చెలి యనఁగను గోళి యటన్నను గోలి యొప్పుఁ | |
| తుంగ యనంగఁ జెలంగు ముస్తాభిధ వేణునామం బగు వెదు రనంగఁ | 74 |
సీ. | ఇక్ష్వాదికాండాఖ్య యెసఁగును గడ యన వాడెదవ యన నిక్ష్వగ్ర మొప్పు | 75 |
సీ. | క్షారతృణం బగుఁ గారెనాఁ గామంచి కావంచి యనఁదగుఁ గత్తృణంబు | 76 |
సీ. | యావనాళాదిదండాఖ్య దం టన మీఱుఁ బచ్చిక యనఁ జను బాలతృణము | 77 |
సీ. | తాళాదికశలాటు తనరు బొండ్ల మనంగఁ గెంగటం చనఁగఁ జెలంగుఁ దాళ | 78 |
ఉ. | కేరును గేతకి నొగలి గేదఁగియం చనఁ బేరులొప్పుఖ | |
| ర్జూరిక తాడి మున్నగుతరు ల్పులు మ్రాకు లనంగఁ బోలు నీ | 79 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగును వనౌషధీనామవర్గ మిట్లు | 80 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
సింహాదివర్గము
క. | మెకములఱేఁ డనఁ దెరవా, మెకమన సింగమన బొబ్బమెకమనఁ జనుఁ జు | 81 |
సీ. | బెబ్బులి యం చన వెలయు మహావ్యాఘ్ర మల్పశార్దూలాఖ్య యలరుచుండుఁ | 82 |
సీ. | హనుమఁడం చనఁగను హనుమదాఖ్యయుఁ గ్రోఁతి తిమ్మడం చన వానరమ్ము దనరు | 83 |
సీ. | పిల్లియం చనఁగ జెల్లు బిడాలాఖ్య బావురుపిల్లినా బావు రనఁగఁ | 84 |
సీ. | కొండగొఱియనాఁ దగును రోహిషాభిధ గోకర్ణనామం బగును గడంజు | |
| యనఁగ రామంబు చను గవయమ్ము గోవ నాఁగ గొఱపోతునాఁగ దనర్చుఁ జెవుల | 85 |
సీ. | ఇప్పుడు చెప్పినయివియును సింగంబు మొదలుగా నావులు మొదలుగాను | 86 |
సీ. | ఉఱుతనా నుడుతనాఁ దరుమూషికం బగుఁదోఁచు నూసరవెల్లి తొండ యనఁగ | 87 |
సీ. | కాళ్లజెఱ్ఱి యనంగఁ గర్ణజలూకాఖ్య వెలయుఁ దే లనఁగను వృశ్చికంబు | 88 |
సీ. | పారావతం బగుఁ బావురాయి యనంగఁ బారువ మనఁగను బావుర మనఁ | 89 |
సీ. | సాళ్వము జాలె వేసడము డేగలగుడు బైరి కణసరంబు నోరణంబు | |
| కత్తె మన్నను దన్నఖాహతికిఁ గేలఁ దొడిగియుండినచర్మంబు దోఁచియుండు | 90 |
సీ. | గూబ కోటఁ డనంగ ఘూకంబు విలసిల్లుఁ బరఁగు నేట్రింతనాఁ బసులపోలి | 91 |
సీ. | కోడి యనంగను గుక్కుటస్త్రీ పుంస సామాన్యసంజ్ఞయై చనును గుక్కు | 92 |
సీ. | మ్రానిపోటుపులుఁగునా నొప్పుచుండు దార్వాఘాటనామంబు వాయసంబు | 93 |
సీ. | గాఁ జనఁ గై జనఁగాఁ గపింజల మొప్పు బెగ్గు రుయ్యలచేఱుపిట్ట యుయ్య | 94 |
సీ. | మక్షిక యీఁగ నా మను మధుమక్షిక తేనిఁగ జుంటీఁగ నా నెసంగుఁ | |
| యనఁగ వెలయును జిమ్మట యనఁగ ఝిల్లి దనరు మిడుతన శలభంబు చను మిణుఁగుఱు | 95 |
సీ. | అళివిశేషంబుగా నడరును దూనీఁగ నెమిలి నట్టువపిట్ట నెమ్మి యనఁగఁ | 96 |
సీ. | తీతువ యనఁగను దిత్తిరి యగుఁ గుక్కుభంబు గబ్బులుఁగు గుంపపులుఁ గనఁగ | 97 |
సీ. | గిజిగాఁడు పూరేడు కేర్జంబు పొన్నంగి వెన్నడాయి పరిక బెళవ రివ్వ | 98 |
సీ. | గఱి యీఁక చట్టుకు యెఱకడా కన నొప్పుఁ బక్షంబు లెక్కనాఁ బక్షతి యగు | 99 |
సీ. | గండనఁ బోతనఁగాను దిర్యక్పురుమాఖ్యయౌఁ దత్స్త్రీసమాఖ్య పెట్ట | |
| తుటుము మొల్లము మొల్లమి తుట్టె వర్గు వనఁగ వర్గము తగు మూఁక యనఁగ సంఘ | 100 |
తే. | ప్రోక యనఁ బ్రో వనంగను బ్రోఁగునాఁగఁ, గుప్ప యన రాసి యనఁగను గువ్వ యనఁగ | 101 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరు జేయుకతనఁ, బరఁగుచుండును సింహాదివర్గ మిట్లు | 102 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
మనుష్యవర్గము
సీ. | మానిసి మనిసినా మనుజసామాన్యంబు మందియం చన నగు మనుజవితతి | 103 |
సీ. | బోటి చేడియ చేడె ప్రోయాలు పైదలి పొలఁతుక పొల్తుక పొలఁతి పొల్తి | 104 |
సీ. | చిగురుబోఁడి మిటారి చిలుకలకొల్కి వాల్గంటి మెఱుఁగుబోఁడి కలువకంటి | 105 |
సీ. | కన్యాభిధానంబు కన్నె కన్నియ కన్య యన మూఁడుపేళ్లచే నమరియుండుఁ | |
| ఱంకులాడి నాఁ జెడిపెనా ఱంకుటాలు నాఁ గులట యౌ ననాద యనదనఁ దగును | 106 |
సీ. | సకి సకియ యనంగ సఖి యొప్పు బోటినా బోటి కత్తియ యనఁ బోలు దూతి | 107 |
సీ. | నాగప్పసాని నా నాపసాని యనంగ నాకబలిచిరంటి నామ మెసఁగు | 108 |
సీ. | మాచకమ్మ యనంగ మనుఁ బోట ముట్టుది యనఁగ నుదక్యయై తనరుఁ గుసుమ | 109 |
సీ. | ప్రసవమంత్రజ్ఞదాఁ బరఁగు మంతరసాని నాఁదగు దైవజ్ఞ సోదెకత్తె | 110 |
సీ. | పట్టి బిడ్డనఁగ నపత్యంబు దగఁ గన్నకొడుకు కొమారుఁడు కొమరుఁ డనఁగఁ | 111 |
సీ. | అయ్యబ్బ తండ్రి యం చన జనకుం డొప్పు నమ్మవ్వ తల్లియం చనఁగ మాత | 112 |
సీ. | తోఁబుట్టు తోడు సైఁదోడు నా సహజుఁడౌ నన్నయం చనఁ దగు నగ్రజుండు | 113 |
సీ. | అత్తయం చనఁగను నలరు నన్యోన్యంబు జాయాపతులకును జనను లైన | 114 |
సీ. | సవతియం చనఁగను జనును సపత్న్యాఖ్య మాతులుం డగు మేనమామ యనఁగ | 115 |
సీ. | విటనామధేయమౌ విటకాఁడు వేడుకకాఁడు బొజుఁగు నన్సుకాఁడు లంజె | 116 |
సీ. | ఏలుకోటి యనంగ నెసఁగుఁ బ్రజాకోటి సదురం చనఁగ మనుజదశక మగు | 117 |
సీ. | నిండుజవ్వన మగు నెలజవ్వనం బన ముదిమి ము ప్పనఁదగు ముసలితనము | 118 |
సీ. | ముదినాఁడు ముదుసలి ముసలి పెద్దముదుకుఁడొక్క టొక్కు ముదురు పక్కు పన్న | 119 |
సీ. | బొజ్జవాఁ డనఁగను బొఱ్ఱవాఁ డనఁగను బొట్టవాఁ డనఁగను బొసక యనఁగ | 120 |
సీ. | మిడిగ్రుడ్లవాఁ డన మీఱు నున్నేత్రుండు నడ్డిముక్కుఁగలాఁ డన నతనానుఁ | 121 |
సీ. | ఖంజుఁడు కుంటి నాగఁ గునిస్టి నాఁగను దోఁచును బ్రజ్ఞుండు డొడ్డికాళ్ళ | 122 |
సీ. | పొట్టి మొటిమె గిటర పొదిటి పొదడుగున్న పొనుఁగు బుడుత గుజ్జు బురుక బుడిగి | 123 |
సీ. | బాధిర్యసంజ్ఞ యై పరఁగును జెవు డన నంధభావంబు గు డ్డనఁగ వెలయు | 124 |
సీ. | పశుపాదరోగంబు పరఁగు నడుప యన నలరును మలిమిడి యనఁగను బశు | 125 |
సీ. | గృధ్రసి పే రగుఁ గిరుదెస యనఁగను దిమిరంబు వెలయును దిమిరి యనఁగఁ | 126 |
సీ. | రొండు రోజు వగర్పు రొప్పన శ్వాసమౌ వెక్కనా వేక్రి నా వెచ్చ యనఁగ | 127 |
సీ. | కడుపుబ్బునాఁగను నడరు నానాహాఖ్య యఱుకు వఱక మఱ్ఱె మన నజీర్తి | 128 |
సీ. | సిబ్బెము సోబె నా సిధ్మము విలసిల్లు మంగు డనంగను మం గనంగ | 129 |
సీ. | ముండిలూటి యనంగ మర్మవ్రణం బొప్పుఁ జంతిక పుండునాఁ జను ననేక | 130 |
సీ. | ఆనెయం చనఁగను నాణెయం చనఁగను దద్దురం చనఁగను ద ద్దనంగ | 131 |
సీ. | రక్తాభిధాన మెఱ్ఱ యనంగ నెత్తు రనంగను నెగడుచుండు | 132 |
సీ. | మస్తిష్కనామంబు మను మెద డంచనఁ గండచుక్క యనంగఁ గాలఖండ | 133 |
సీ. | మలవాచకం బగు మసటు నింపిరి మస్టు ముఱికి యనంగను మూర్ధమలము | 134 |
సీ. | ఆయంబు కీలునా నలరు మర్మంబు పాదాగ్రము ముంగా లటం చనఁ దగు | 135 |
సీ. | గజ్జనాఁ దనరు పంక్షణ మండె యనఁగను నూరుమూలాభిధ యొప్పుఁ బొత్తి | 136 |
సీ. | బొఱ్ఱనా బొజ్జనాఁ బొట్టనా డొక్కనాఁ గడుపనఁ గుక్షికాఖ్యలు చెలంగుఁ | 137 |
సీ. | పక్షంబు వెలయును బక్క పక్కియ నొక్క బరి రెట్ట నాఁగను భార్య సంజ్ఞ | 138 |
సీ. | మీఁజెయి నాఁగను మీరుఁ గరోపరిభాగంబు కరపృష్ఠభాగ మొప్పుఁ | 139 |
సీ. | చిటికెనవ్రే లనఁ జిటివ్రే లనంగను మీఱుఁ గనిష్ఠాఖ్య గోరు నాఁగఁ | |
| పేట మొప్పును జీరనా వెలయుఁ బ్రసృతి పొలుపగు నికుంజహస్తంబు పుడిసిలి యన | 140 |
సీ. | పిడికిలి పిడియన నడరును ముష్ట్యాఖ్య పాణివిశేషంబు పరఁగును గమి | 141 |
సీ. | మెడవంపునాఁగను మీఱు గ్రీవాగ్రభాగము పెడతలనాఁ గృకాటిక దగు | 142 |
సీ. | చెక్కు చెక్కిలి చెంక చెంప గౌద యనంగ గండస్థలాఖ్యయై యుండు హనువు | 143 |
సీ. | పర పొర యనఁగను బటలంబు విలసిల్లుఁ గన్ను నా లోచనాఖ్య దనరారుఁ | 144 |
సీ. | ఔదల ముందల యన శిరోగ్రము మీఱుఁ జనుఁ బెడతలనఁ బశ్చాచ్ఛిరంబు | |
| కొప్పు క్రొవ్వెద మూలనా నొప్పుఁ బేళ్ళుఁ గేశబంధవిశేషాఖ్య గేరుఁ గ్రొమ్ము | 145 |
సీ. | పావట యనఁగను బరఁగు సీమంతంబు జుంజురు సిక జుట్టు చుం చనంగ | 146 |
సీ. | అడరు భూషణసంజ్ఞ, తొడగు తొడవు మిన్న సొ మ్మనంగను గిరీటమ్ము వెలయుఁ | 147 |
సీ. | చెవులపువ్వు బొగడ బవిరె రారేక కుంపెన రావిరేక ముర్వనఁగఁ గర్ణ | 148 |
సీ. | పదకము తాళి నేవళము లంబెస సరిపెన సరపణిగొలుసన లలంతి | 149 |
సీ. | జేయూరనామంబు తాయె తనంగను సందిదండ యనంగ సందికడియ | |
| నాఁగఁ బాదాంగదం బొప్పు నందె యనఁగఁ బెండె మనఁ బెండియంబనఁ బెండెర మన | 150 |
సీ. | గంటయం చనఁగను ఘంటయౌను బురుజు చిఱుగంట మువ్వ గజ్జె యన క్షుద్ర | 151 |
సీ. | విరళవస్త్రము పేరు వెలయం నుడుగరనా నడరు గడితము సుగ్గడిత మనఁగ | 152 |
సీ. | బద్దెయం చనఁగను వత్తి యనంగను జేకమం చనఁగను జెలఁగు దశలు | 153 |
సీ. | కావియం చనఁగను కాషాయమై యొప్పుఁ జందురుకావినాఁ జనును రక్త | 154 |
సీ. | జరబాజు నేరాజు బురుసా తగటియనఁ గల ధౌతవస్త్రము ల్చెలఁగుచుండు | |
| పైయెద పయంట నాఁగను బరఁగుచుండుఁ బ్రబలువస్త్రముకుటము కుల్లా కుళాయి | 155 |
సీ. | పాగయం చనఁగను బరఁగు నుష్ణీషంబు తద్భేదసంజ్ఞయై తగు రుమాల | 156 |
సీ. | దోవతియం చనఁ దోఁచుఁ గటీపట మొల్లె పంచె యనంగ నొప్పు నర్థ | 157 |
సీ. | చల్లాడ మనఁగను జల్లడ మనఁగఁ జె న్నలరుఁ బుమంతరీయంబు లుంగి | 158 |
సీ. | కొఱలు గుడారము గూడారము గుడారు గూడా రనఁగను నాల్గు పటగేహ | 159 |
సీ. | తలయం టనంగను దలగడు గనినను నభ్యంగనామ మై యతిశయిల్లుఁ | |
| బొ ట్టనఁగఁ జు క్కనఁగఁ జుక్కబొ ట్టనంగఁ బొలుచుఁ జాఱిక పత్తిరిబొ ట్టనంగఁ | 160 |
సీ. | చెందిర మనఁగను సిందూరము చెలంగు లక్కయం చనఁగను లాక్ష వెలయు | 161 |
సీ. | చను జవాది జవాజి జవ్వాది జవ్వాజి యనఁగ సంకుమదాఖ్య దనరుచుండు | 162 |
సీ. | యక్షకర్దమసంజ్ఞ యలరుఁ గదంబమ్ము కలపము నాఁగను వెలయు సేస | 163 |
సీ. | ఖట్వాఖ్య రాజిల్లుఁ గంకటి యం చనఁ బట్టెమంచం బనఁ బరఁగు మృదుల | 164 |
సీ. | దీవటీ దివ్వటి దివటి పంజనఁగను గరదీపికాఖ్యయై పరఁగుచుండు | |
| దక్కటి యనంగఁ బీఠంబు దనరుచుండు | 165 |
సీ. | పలక యనంగను ఫలకయౌ శయ్యార్థఫలక మొప్పును విసిపలక యనఁగ | 166 |
సీ. | పూగభాగమ్ములు పొలుచు బాగాలన నెలవతి యనఁగను వెలయు ఖాది | 167 |
సీ. | చర్వితతాంబూలసంజ్ఞ యౌఁ దమననాఁ బరఁగుఁ గళాచిక పడిగ మనఁగఁ | 168 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ నరవర్గ మిట్లు | 169 |
ᛟᛟᛟᛟᛟᛟ
బ్రహ్మవర్గము
సీ. | సంతు కొలము వంగసము పదు గన వంశసంజ్ఞ యై యలరుచుండుఁ | |
| పుడమివే ల్పన బ్రాహ్మణ్యము దనరారు బాఁపఱిక మనఁ దనరును బండితాభి | 170 |
సీ. | ఒప్పు నుపాధ్యాయుఁ డొజ్జ యనంగను జన్న మనంగ యజ్ఞంబు చెలఁగుఁ | 171 |
సీ. | అగ్నిసాధనవిశేషాభిధ చెకుముకి యనఁ దనరును హవిష్యంబు చెలఁగు | 172 |
సీ. | వెదుకుడు తడవుడు వెనుకుడు రోయుడు నెమకు డనంగ నన్వేషణ మగు | 173 |
సీ. | త్రిమ్మట త్రిప్పట తిరుగుడు తిరుగునాఁ బర్యటనాఖ్య యై పరఁగుచుండు | 174 |
సీ. | వస్తిల్లి నుంకు నిప్పస్తు ని ట్రనఁగను నుపవాససంజ్ఞయై యొప్పుచుండు | |
| నల్లొనేరేళ్ళు జోదిళ్ళు ననఁగఁ దనరు వేఁడికోలనఁ బ్రార్థన వెలయుచుండు | 175 |
సీ. | అవిరక్తభిక్షకుఁ డలరును బికిరాలమారి బికాసి బికారి తిఱ్ఱి | 176 |
సీ. | పొసఁగుఁ గమండలు బుడిగ యనంగను బుడ్డిగ యనఁగను బుడ్డి యనఁగ | 177 |
సీ. | వడుగు పెండ్లిండ్లలోపలఁ దృతీయదినంబు పాకెన్న యనఁగను బరఁగుచుండు | 178 |
సీ. | పొత్తనఁగ సజగ్ధి పొలుచు బువ్వ మనంగ స్వజనవివాహసజగ్థి దనరు | 179 |
సీ. | ఉపరిసురతసంజ్ఞ యొప్పును మగపోల్కి కూటమి యనఁగఁ బైకూటమి యన | |
| గోరువంకలు చందురుకూన లనఁగ ముద్దు నాఁగను జుంబనం బొప్పుచుండుఁ | 180 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁజేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ బ్రహ్మవర్గ మిట్లు | 181 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
క్షత్త్రియవర్గము
సీ. | రాచవాఁ డనఁగను రాజన క్షత్త్రియుఁ డొప్పు నేలిక సామి యొడయఁడు దొర | 182 |
సీ. | విరటుఁ డనంగను వెలయు విరాటుండు మండలేశ్వరుఁ డొప్పు మన్నెవాఁడు | 183 |
సీ. | కటికవాండ్రనఁగను గట్టిక లనఁగను ఫణిహారు లనఁగను బరఁగుచుండు | 184 |
సీ. | చుఱుకరి యనఁగఁ దెంపరియన శూరాభిధానంబుగాఁగను దనరుచుండు | |
| మనును నొంటనివాఁ డన మార్తుఁ డనఁగఁ బగతుఁ డనఁ బగ ఱనఁ బగవాఁ డనంగఁ | 185 |
సీ. | చుట్టము పక్కము చుట్ట నెచ్చెలి చెలికాఁడు నెయ్యుఁడు సంగడూఁడు పొందు | 186 |
సీ. | నమ్మినవాఁ డన నచ్చినవాఁ డనఁ జనవరి యనఁగను దనరు నాప్తుఁ | 187 |
సీ. | బొట్టన సున్ననఁ బొలుపొందు బిందువు నిడుదన దీర్ఘంబు నెగడుచుండు | 188 |
సీ | గంట మనంగను గనుపట్టు లేఖిని కలమము కలము నాఁగను దనర్చు | 189 |
సీ. | వాఁడిమి జతనము మంతనం బనునట్టి యివిమూఁడు శక్తులై యెసఁగుచుండుఁ | |
| దండు వన దండు గనఁగను దండమునకుఁ బ్రతినిధిగఁ దీయుద్రవ్యంబు పరఁగు విజన | 190 |
| నమ్మికనాఁగను నచ్చికనాఁగను విశ్వాససంజ్ఞ యై వెలయుచుండు | 191 |
సీ. | ఆరి బడి యప్పన ముప్పున పంగము పంజి పన్నాడి కో ల్పగిది బెడిగ | 192 |
సీ. | కానుక కానిక కప్పము సూడిద యులుపా యుపారంబు నులుప యనఁగఁ | 193 |
సీ. | వేలము పాళెము వీడుపట్టు బిడారు విడిది యంచనఁగ నివేశ మొప్పుఁ | 194 |
సీ. | మదము రాజిలు మస్తు మత్తు మత్తాయన నాలానసంజ్ఞ యై యలరుఁ గట్టు | |
| నొప్పుఁ జౌడో లనంగ దంత్యుపరిడోల వారి పంగెన యనఁగను బంగిడి యన | 195 |
సీ. | పరఁగు నశ్వంబు బాబా వాపురము వారువము జక్కి తత్తడి మావు గుఱ్ఱ | 196 |
సీ. | తేజినా నున్నతవాజియై విలసిల్లు బడబ గోడిగ నాఁగఁ బరఁగుచుండు | 197 |
సీ. | జంగనడపునాఁగ జంఘాలగతి యొప్పుఁ జనును లుక్కనఁగ నీచగతిపేరు | 198 |
సీ. | అశ్వతనుత్రాణ మడరుఁ బక్కెర యనఁ బల్యాణ మొప్పును బల్ల మనఁగ | 199 |
సీ. | అంకవన్నె యనంగ నశ్వపార్శ్వాలంబి రజ్జుసమాఖ్య యై ప్రబలుచుండుఁ | |
| వ్యాసటీక విలసిల్లును నరద మనఁగఁ దేరు నాఁగను రథసంజ్ఞ మీఱు బండి | 200 |
సీ. | కంబళవాహ్యకాఖ్యలగుఁ గొల్లార్ బండి పాటబండి హొయలుబండి యనఁగ | 201 |
సీ. | అను సనఁ దొడు పనఁ నాందోళికాదిదండాగ్రసంధేయాఖ్య యలరుచుండుఁ | 202 |
సీ. | చీల జంజడ యాణి చిలుకయం చనఁగను దైనితకాభిధగాను దనరు | 203 |
సీ. | గుల్లా మన గుఱాలగోచనఁగా గులప యనంగఁ దగు నశ్వపాలకుండు | 204 |
సీ. | సన్నాహనామంబు సమకట్టినది యాయితము సజ్జ కట్టాయిత మన వెలయు | |
| డలరుఁ దద్విద్య సాదన యనఁగ నెగడు నఱుకు పరుపడి గాయమానంబు విసరు | 205 |
సీ. | సాధనాయుధములు సానకత్తి యనంగ బొందకోల యనంగఁ బొలుపుఁగాంచు | 206 |
సీ. | మనును జెట్టి యనంగ మల్లాభిధానంబు తద్విద్య సా మనఁ దనరుచుండుఁ | 207 |
సీ. | బిరుదువేసిన జెట్టిపరివార మగునట్టి వా రొప్పుదురు హొంతకారు లనఁగ | 208 |
సీ. | కల్లంబు రాటంబు కత్తి కొక్కిస తొట్టు రూణింపు బరిపోటు రొండివ్రేటు | 209 |
సీ. | వెంబడి బాసట వెంట తో డనుగల మనుఁ గనఁగను సహాయాఖ్య దనరుఁ | |
| వెలయు సంపద సిరి లచ్చి కలిమి యనఁగఁ బరఁగుఁ బేదఱికంబు నిప్పచ్చరము | 210 |
సీ. | చేటు చెడిది చెట్ట సేగి సిలు గనంగ నాపదభిఖ్య లై యలరుచుండుఁ | 211 |
సీ. | అమరు గుణారోహణాభిధానం బెక్కుపెట్టుట యనఁగ మోపెట్టుట యనఁ | 212 |
సీ. | పారవాత మ్మనఁ బరఁగుచునుండు విశాలముఖం బైనసాయకంబు | 213 |
సీ. | తరకసమ్ము పొది బత్తళిక పాణివడమ్ము దొన యనఁ దూణీర మొనరియుండు | 214 |
సీ. | పట్టసనామము ల్పట్టెమన మొహదా యన నడ్డ కత్తినా నలరుచుండు | |
| పరుఁ జనఁ బరుం జనంగను బరఁగు నదియె చనును నెమ్మిలిపరుఁజునా జాపరుఁ జనం | 215 |
సీ. | పరుఁజులోపలఁ జీలపట్టించునలుగువా యమరుపయోగ్యమైనట్టితావు | 216 |
సీ. | ఖండపరశు వొప్పు గండ్రగొడ్డలి యన బరిస బడిత యనఁ బరిఘ మొప్పు | 217 |
సీ. | వాయిదా రనఁబడు వంకలు గలకత్తి దోదుమ్మి సై బనఁ దోఁచుచుండు | 218 |
సీ. | బాదరు నాఁగను బరఁగుఁ దుపాకిలోపలను జానకిత్రాఁడు నిలుపుతావు | 219 |
సీ. | వెలువడుట యనంగ వెడలుట యనఁగను నిర్గమనాఖ్యగా నెసఁగుచుండు | |
| దుమ్ము దువ్వ దుమారము త్రుమ్ము తుమురు దన సదటు బుగ్గినాగఁను దనరుధూళి | 220 |
సీ. | డాలు టెక్కెంబు సిడమ్ము పడగ యనఁ గేతునామంబులు గేరుచుండు | 221 |
సీ. | పోరాట పోట్లాట పోరు కయ్యము చివ్వ కంగారు కంగిస కలను దురము | 222 |
సీ. | ఆర్పు బొబ్బ యనంగ నగు సింహనాదంబు క్రం దనఁగాఁ దగుఁ గ్రందనంబు | 223 |
సీ. | పగయీఁగు టనఁదగు వైరశుద్ధి పరుగు పరువు పాణు టన భావనము చెలఁగు | 224 |
సీ. | సమయుట యీల్గుట చాపు చక్కడఁగుట క్రుంగుట త్రుంగుట కూలుట దుది | |
| నడరు శవయానముగఁ బాడె బడయ యనఁగఁ గాడు మసనంబు పలికినాఁగను శ్మశాన | 225 |
తే. | అడరుఁ గారాగృహంబు గుయ్యారము చెఱ, సాల బందిగ మనఁగను జప్ప యనఁగ | 226 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు నిద్ధర క్షత్రియవర్గ మిట్లు | 227 |
ᛟᛟᛟᛟᛟᛟᛟ
వైశ్యవర్గము
సీ. | వైశ్యనామంబులు వఱలుఁ గోమట్లన బేహారు లనఁగను బేరు లనఁగ | 228 |
సీ. | అప్పులవాఁ డన నగు నుత్తమర్ణాఖ్య యధమర్ణుఁడు చెలంగు నరువరి యనఁ | 229 |
సీ. | చే ననఁ జెలిక నా క్షేత్రంబు విలసిల్లుఁ గుచ్చెల యన రాశి కొఱలుచుండు | 230 |
సీ. | ములుకోల యనఁగను బొల్చును దోత్రంబు కొఱలు లవిత్రంబు కొడవలి యన | 231 |
సీ. | లాంగలాదికము చెలంగు నే రనఁగను బరఁగుఁ దర్థాభిఖ్య యరక యనఁగఁ | 232 |
సీ. | గుంటుగ నాఁగను గొఱ్ఱునా దంతినాఁ బాపడ మనఁగను బరఁగును గృషి | 233 |
సీ. | గుంజనాఁగను గట్టుకొయ్యనాఁగను మేధి పయి రన సస్యంబు పరఁగుచుండుఁ | 234 |
సీ. | సజ్జయం చనఁగను సర్జము విలసిల్లు శ్యామాక మొప్పును జామ యనఁగ | 235 |
సీ. | ఒప్పుఁ గుళుత్థాఖ్య యులవయం చనఁగను దిలసంజ్ఞ నూవనఁ దేజరిల్లు | 236 |
సీ. | కణిశైకదేశంబు కనుపట్టు రెల్లనాఁ గణిశభారమ్ము ముంగ యనఁ దనరు | 237 |
సీ. | దంటనఁగా సస్యదండము విలసిల్లుఁ బరఁగు నీన యనంగఁ బత్త్రనాడి | 238 |
సీ. | ధాన్యశకలములు దనరు నూక లనంగ నూక పొ ట్టుముకనా నొప్పుఁ దుషము | 239 |
సీ. | చేటనా శూర్పంబు చెలఁగు మొంటె మొరిఁటె యనఁ బ్రహ్వశూర్పాఖ్య యలరుచుండు | 240 |
సీ. | వంటయి ల్లనఁగను వంటి ల్లనంగ విలసిలుచుండును మహానససమాఖ్య | 241 |
సీ. | ని ప్పింగలము మల్లె నిప్పుక వైరాలు లైరవు లనఁగ నంగార మొప్పుఁ | 242 |
సీ. | భస్మవిశేషంబు పరఁగును గరు కన మసి యన మషి యొప్పు మంగల మన | 243 |
సీ. | చనును జిత్తెడ నాన శష్కులికాప్రముఖసముద్ధరణసాధకాహ్వయంబు | 244 |
సీ. | తామ్రాదికలశాభిధానము ల్చెలువొందుఁ దంబిగ యనఁగను జెం బనంగ | 245 |
సీ. | కడవ యనంగను ఘటనుగు ఛుల్లిని కటఘటమౌఁ బొంతకడవ యనఁగఁ | 246 |
సీ. | నిమ్నభాండాభిధ నెగడు లోవి యనంగ నతభాండసంజ్ఞ గూనయనఁ బరఁగు | 247 |
సీ. | సిబ్బిమూఁకు డనంగఁ జెలఁగు శరావంబు పరఁగు దడ్డెము సావ బట్లె మల్ల | 248 |
సీ. | ఇంగు వనంగను హింగువు పసుపు బందారు నాఁగను హరిద్ర చను సోపు | 249 |
సీ. | తండులక్షాళనోదకము రాజిల్లును గుడితి యనంగను గడు గనంగఁ | 250 |
సీ. | మీఱు యూషము కట్టు చారు పణిద మనఁ బాగనఁగా గుడపాక మెసఁగుఁ | 251 |
సీ. | లవణభానితశలాటువు మీఱు నూరుఁగా యన మాంసరస మొప్పు నాణ మనఁగఁ | 252 |
సీ. | బోరు లనంగను బొరుగు లనంగను ధానాసమాఖ్య లై తనరుచుండుఁ | 253 |
సీ. | ఆక్షుణ్ణతండులాహ్వయము చేరుళ్ళునా దంగుళ్ళు నాఁగను దనరుచుండు | 254 |
సీ. | సేవె లనంగను జేవికల్ విలసిల్లు నుత్కారిక వెలయు నుక్కెఱ యన | 255 |
సీ. | చక్కిల మనఁగను శష్కులి విలసిల్లు సుకుని యనంగను సుఖిని చెలఁగుఁ | 256 |
సీ. | భక్ష్యసామాన్యంబు పరఁగును బిండివంట లనంగ నన్నంబు వెలయుచుండు | 257 |
సీ. | తైలాభిధానంబు దనరు నూనె యనంగ నేరండతైలంబు మీఱు నాము | 258 |
సీ. | మీఁగడ యంచన మీఱు మండాభిధ నవనీతసంజ్ఞ వెన్న యన వెలయు | 259 |
సీ. | ఆఁకలి యన గొద యనఁగ నాకొంట నాఁ గను క్షుత్తుపేర గాఁ దనరుచుండు | 260 |
సీ. | ఎంగిలినాఁగఁ జెలంగు నుచ్ఛిష్టంబు గోపాలకుం డొప్ప గొల్లవాఁడు | 261 |
సీ. | మూఁపురమంచనఁ నూఁపురమంచనఁ గకుదభిధానమై క్రాలుచుండు | 262 |
సీ. | గొడ్డన వంజనా గొంజనా వంధ్యయౌఁ బొదలును సంధిని వెద మొద వన | 263 |
సీ. | చనును గర్భస్రావసంజ్ఞ కట్టుకయనఁ బొల్చు బీజావాపము వెద యనఁగ | 264 |
సీ. | తరికంబ మనఁగను దనరును గుటరమ్ము తరుచుట చిలుకుట త్రచ్చుట యన | 265 |
సీ. | గాడిద యంచన గర్దభనామమౌ గోనెయం చనఁగను గోణి పరఁగుఁ | 266 |
సీ. | తనరు గోణ్యుద్ధారిదండాఖ్య యెత్తనగో లన బట్టనగోల యనఁగఁ | 267 |
సీ. | ఒకటి యొక్కటి యొకం డొండొక్కఁ డనఁగను నేకసంఖ్యాఖ్యయై యెసఁగుచుండుఁ | 268 |
సీ. | కరిసె యనంగను గాలుపలం బొప్పు నరపలం బనఁగఁ గర్షాఖ్య యొప్పుఁ | 269 |
సీ. | తనరారు సోల యంచనఁగ నికుంచాఖ్య యద్దయం చనఁగఁ దదర్థ మొప్పుఁ | 270 |
సీ. | ప్రస్థపంచకసంజ్ఞ పరఁగు నేఁగుస యన షట్ప్రస్థపే రాఱు ననఁగ వెలయు | |
| బందుమంచు దశాఢకి పలుకఁబడును బొదలు నేకాదశాఢకి పదునొకల్తు | 271 |
సీ. | కాణి యనంగను గాకణి విలసిల్లు వెలయుఁ దద్వయ మరవీస మనఁగఁ | 272 |
సీ. | దీనారమందు ద్వాత్రింశదంశం బైన బేడయం చనఁగను వెలయుచుండు | 273 |
సీ. | ఎడబె ట్టనంగను నెరుసనా బారిముద్ర యన దీనారభేదములు చెలఁగు | 274 |
సీ. | పంపు పాల్ వంతునా భాగంబు విలసిల్లు నాస్తినా సర్వస్వ మలరుచుంచు | 275 |
సీ. | పచ్చ యనంగను బరఁగు మరకతంబు గారుత్మతం బొప్పు గరుడపచ్చ | |
| నదియె నెరడైన గొగ్గియం చనఁగ వెలయుఁ జిప్పముత్తెం బటండ్ర దే చేయఁబడిన | 276 |
సీ. | పద్మరాగాభిధ పరఁగు గెంపన నది వన్నె తగ్గిన గరపక్క యండ్రు | 277 |
సీ. | పొలుచును వజ్రంబు మూలరా లన మగరా లనంగ గురుజరా లనంగ | 278 |
సీ. | కాంచనాభిధలు బంగారు బంగరు హొన్ను పసిడి పసిండి పొన్ పైఁడి పయిఁడి | 279 |
సీ. | లోహమలాభిధ ల్పొలుపారుచుండును ద్రుప్పనఁ జిలు మనఁ ద్రుక్కనంగఁ | 280 |
తే. | శ్రీలు వెలయంగఁ నీ పేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగ వైశ్యవర్గ మిట్లు | 281 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
శూద్రవర్గము
సీ. | శూద్రనామంబులు శోభిలు నాలవకొలమువారలని గాఁపు లని పల్కఁ | 282 |
సీ. | తంతువాయాభిధ దనరు మగ్గరి యన నేతకాఁ డనఁగను నేతరి యన | 283 |
సీ. | కమ్మరి కనుమరి కరుమలి యనఁగాను మీఱుచుండును నయస్కారసంజ్ఞ | 284 |
సీ. | పాదకుం డొప్పు సువారంపువాఁ డనఁగను బూటకూళ్ళవాఁ డనఁగ వంట | 285 |
సీ. | పదవిజ్ఞుఁ డెసఁగుఁ జొప్పరి జాడకాఁ డన సంకులవాఁ డన శాంఖికుఁ డగు | |
| మటుమాయకాఁ డన మాయదారి యనంగ మాయకాఁ డనఁగను మతకరి యన | 286 |
సీ. | నటుఁ డొప్పు నట్టన నట్టువుం డనఁగను దారినాఁ దగు సూత్రధారకుండు | 287 |
సీ. | వైతనికుండు సంబళకాఁ డనఁగ జీతకాఁ డనంగను కూలివాఁ డనఁదగు | 288 |
సీ. | పరఁగుఁ జండాలుండు సురియాళు వనఁగను మాల డనంగను మాల యనఁగఁ | 289 |
సీ. | తురక యనంగను దోఁచుఁ దురుష్కుండు మెంచ యనంగను మ్లేచ్ఛుఁ డొప్పు | 290 |
సీ. | దొంగ తెక్కలికాఁడు దోఁపరి ముచ్చుజాబరకాఁ డనంగఁ దస్కరుఁడు వెలయు | |
| ముళ్ళు విప్పెడువాఁడు ముడియవిడు పనంగ గండిదొం గనఁ గన్నకాఁ డనంగఁ | 291 |
సీ. | పరఁగుఁ దెక్కలి యన బందిపో టనఁగను గిలు వనఁ గాసులంకింపునాఁగ | 292 |
సీ. | బొండ యనంగను బోననఁ గూటయంత్రాభిధానంబుగాఁ దనరుచుండు | 293 |
సీ. | తంతుసంతతిసముత్పాదనయంత్రంబు రాట్న మంచనఁగను రహికి నెక్కుఁ | 294 |
సీ. | ఆసునాఁ జెలఁగుఁ దంత్వావర్చనాభిధ దనరు సూత్రము నూలు దార మనఁగఁ | 296 |
సీ. | అలరు లాక యనంగ నర్చాభిధానంబు తగుఁ బడు గనఁగ నాతానసంజ్ఞ | |
| తొట్టినాళ యనంగఁ దురి పేరు విలసిల్లుఁ గుంచిక తనరును గుంచె యనఁగఁ | 296 |
సీ. | సూదియం చనఁగను సూచియౌ నది గొప్ప యైన దబ్బన మన నలరుచుండుఁ | 297 |
సీ. | పాదరక్షాభిధ పరఁగును జెప్పన మలకడ మ్మనఁగ సమ్మాళి యనఁగఁ | 298 |
సీ. | తనరును లోహసంతాడనాధారంబు డాకల్లు పట్టడ డాగలి యనఁ | 299 |
సీ. | త్రాసు తరాసునాఁ దనరును నారాచి తూనికకోలనాఁ దూనుకోల | 300 |
సీ. | ఱంప మనంగను గ్రకచంబు తరగంపె యనఁ గరపత్త్రభేదాఖ్య మీఱు | |
| మంగలకత్తి యనంగ క్షురము తగుఁ గకపాల యనఁగను గక్షసాల | 301 |
సీ. | తిలయంత్రసంజ్ఞయై యలరు గానిగ యనఁ దిలకల్క మలరును దెలకపిండి | 302 |
సీ. | తెఱఁగు చందము పగిది విత మనంగను మీఱుచునుండుఁ బ్రకారసంజ్ఞ | 303 |
సీ. | లాహిరీవస్తువు ల్కలయఁజేర్చిన మందు మబ్బురాయుం టన మనుచునుండు | 304 |
సీ. | అష్టాపదాభిభ లగుఁ జదరంగపుఁబలకనా నెత్తపుఁబలక నాఁగఁ | 305 |
సీ. | తిగ ముచ్చ యనఁగను ద్రికము పేరగుఁ దిగ పంచ చౌకమ్ము తీవంచ యడ్డ | |
| నిత్తిగ చక్కన నెసఁగును షట్కబు సత యన విలసిల్లు సప్తసంఖ్య | 306 |
సీ. | బొంగర మనఁగను బొమ్మర మ్మనఁగను భ్రమరాభిధానమ్ము పరఁగుచుండు | 307 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ శూద్రవర్గ మిట్లు | 308 |
ఉ. | రంగ మహీనిషంగమ ధరాధరశృంగమసహ్యరామరు | 309 |
పృథ్వీ. | పటీకృతహరిత్తటీ స్ఫటిక నిర్మలస్వాకృతీ | 310 |
గద్య. | ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాధికతిపయగుణస్వ | |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
- ↑ గాండ్లవాఁ