ఆంధ్రభాషార్ణవము/తృతీయకాండము
తృతీయకాండము
విశేష్యనిఘ్నవర్గము
క. | శ్రీతరుణీశతజనకీ, భూతాక్ష తురంగితోక్ష మురభిత్ప్రముఖో | 1 |
గీ. | చను విశేష్యనిఘ్న సంకీర్ణ నానార్ధ, కావ్యయ క్రియాఖ్య లమరువర్గ | 2 |
సీ. | మను మేలువాఁ డనఁగను శుభకరసంజ్ఞ మంచివాఁ డనఁగ శోభించు సుకృతి | 3 |
గీ. | పరఁగు దాళీకుఁ డనఁగ దీర్పరి యనంగఁ, గార్యకర్తకుఁ బేరుగా ఖ్యాతసంజ్ఞ | 4 |
గీ. | తనరు నడ్డములేనివాఁ డనఁగ నిచ్చ, నుండువాఁ డన నిరవగ్రహుండు చాలు | 5 |
సీ. | మదట తొండొరుతొండు నుదల మాలుగుఁబోతు చండి సోమరి నలి తిండికాఁడు | 6 |
సీ. | ఆఁకొన్నవాఁ డన నదనైనవాఁ డన శోభిలుచుందురు క్షుధితసంజ్ఞ | 7 |
గీ. | మొరసు మోటు సిసాళినా మూఢుఁ డొప్పుఁ, దనరు శాలీనసంజ్ఞ మేదకుఁ డనంగ | 8 |
సీ. | అలరుఁ దంటలమారి యన నవినీతుండు భయశీలుఁడౌ వెఱపరి యళుకరి | 9 |
సీ. | ఉత్పతిష్ణువుసంజ్ఞ యొప్పును నెగయువాఁ డనఁ దాఁటువాఁ డనఁ దనరు లంఘి | 10 |
సీ. | జట్టికాఁ డనఁగను జనుఁ గ్రేత తరుగరి యనఁగను దత్సహాయాఖ్య చెలగు | 11 |
సీ. | పొలుచు నసత్యుండు బొంకరి యన రజ్జులాఁ డనంగను జల్లికాఁ డనంగ | 12 |
సీ. | కొండెకాఁ డనఁగను గొండెగీఁ డనఁగను గొండియుఁ డనఁ బిశునుండు వెలయుఁ | 13 |
సీ. | పశ్యక్రియావేది వఱలు మందులమారి యన వేడువాఁ డన యాచకుఁ డగు | 14 |
సీ. | మక్కు మాసినదినా మలినంబు విలసిల్లు సుద్దమం చనఁగను శుద్ధమొప్పు | 15 |
సీ. | బహుత నన్యులఁ దెల్పుపట్ల హేమాహేము లనుపల్కు పూజ్యార్థ మగుచునుండు | 16 |
క. | పలపల యన వెలితి యనన్, బలచన యన విరళసంజ్ఞ భాసిల్లును ని | 17 |
క. | వెడఁద యన విశాలమగున్, నిడుద యనన్ వాసి యనఁగ నెగడును దీర్ఘం | |
గీ. | ఒప్పును సదాటునాఁగ వక్రోన్నతంబు, వంక రన సొట్ట యనఁగను వక్ర మెసఁగుఁ | 19 |
గీ. | ఒమ్ము గాత్రమ్ము గమకము హొమ్మునాఁగ, స్థూల మగుఁ బెక్కునాఁగను దోఁచు బహుళ | 20 |
గీ. | దండ చేరువ చెంగట యండ సరస, ప్రాపు చక్కి కురంగట సజ్జచెంత | 21 |
గీ. | ఏడుగడ నా నియంతసంజ్ఞెల్ల యనఁగఁ, దనరుచుండును సర్వాఖ్య దవ్వునాఁగ | 22 |
గీ. | గట్టి కటికి యనంగఁ గన్పట్టు దృఢము, క్రొత్తమిహిహొస యనఁగ మీఱును నవంబు | 23 |
సీ. | మరు మెత్తనిది గోము మన్వ మనంగను మృదుసంజ్ఞ ప్రథమ మౌ మొదటిది యనఁ | 24 |
సీ. | ఒంటియనంగను నొప్పు నేకాకియై సగటు నాఁగను సరాసరి యనంగ | 25 |
సీ. | ఇరుకట మనఁగను బరఁగు సంకటసంజ్ఞ గహనయి జీఁబు నాఁగను జెలంగు | 26 |
సీ. | అప్రయోజకసంజ్ఞ యలరుచుండును గొఱగానివాఁ డనఁగ గిగ్గాడి యనఁగ | 27 |
తే. | శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగును నిశేష్యనిఘ్నాఖ్యవర్గ మిట్లు | 28 |
ᛟᛟᛟᛟᛟᛟ
సంకీర్ణవర్గము
సీ. | కోపురం బనఁ జెట్లకొన కెక్కి వైరులఁ జూచుట కర్థమై తోఁచియుండు | |
| నల్లిబిల్లి యనంగ నలుఁ బెనంకువ నిలకడ దనరును నిట్టల మనఁ | 29 |
సీ. | అదనునాఁ దఱినాఁగ నలరును సమయంబు గద్దింపు వెలయును గద్దన యన | 30 |
గీ. | భుజయుగంబున జందెముల్ పోల్కి మెలిని, బెట్టి యున్నట్టిదుప్పటి గట్టిగాఁగఁ | 31 |
సీ. | బద్ధపరికి యనఁ బలుచనిబిళ్లయౌ నెదరు నా సందుక ట్టెసఁగుచుండుఁ | 32 |
గీ. | పరఁగు నాకస్మికంబు డబ్బా టనంగఁ దనరుఁ బెడకంత యనఁగను దప్పుత్రోవ | 33 |
గీ. | నెమలియీఁకలఁ బేనుదారములపాగ, పెట్టమని పల్కఁగాఁ దగుఁ దెట్టు కొఱకు | 34 |
గీ. | గాదె పోలిక నుండెడి కాఁగు పేరు, రంజణి యనంగ వెలయు నార్జనసమాఖ్య | 35 |
గీ. | ఘటవిశేషంబు లైరేని కడవ లనఁగ, బూజుగు లనంగ బుడ్లనఁ బొలుచుచుండు | 36 |
గీ. | చెంపలను మూసికట్టుట చెలఁగు గౌద, కట్లనంగను గడుపులోఁ గలుగుజాలి | 37 |
గీ. | పల్లముల నిరువంకలఁ బరగుఁ పట్టు, త్రాళ్లు వెలయుచునుండు లాలసరు లనఁగ | 38 |
గీ. | కీలుకీలుకు విఱుచుట గేరును విట, తాట మనఁగాను మెక మెకపా టనంగ | 39 |
గీ. | బెస్తలు భుజంబులందును బెట్టుకొనెడి, యార్ద్రపటములు మాలుగు లనఁగ వెలయు | 40 |
గీ. | సోయగంబు సొబగుఁ జోక మురువు కొమరు, చెలువు తీరు సౌరు పొలుపు చెన్ను | 41 |
గీ. | వన్నె హెచ్చినయట్టిక్రొంబసిఁడికడ్డి, కత్తిరించిన తావునఁ గానిపించు | 42 |
తే. | శ్రీలు వెలయంగ నీపేరఁ జేయుకతనఁ, బరఁగు నిచ్చలు సంకీర్ణవర్గ మిట్లు | 43 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
నానార్థవర్గము
సీ. | గౌరన నేనుఁగు కాహళి విలసిల్లు డంబు నాఁగను గాంతి డంబము నగుఁ | 44 |
సీ. | పక్షశౌర్యంబులు పరఁగుఁ డాక యనంగఁ దెమ్మనాఁ బెల్లయుఁ దేమ వెలయు | 45 |
సీ. | రోషజుగుప్సాఖ్య లొప్పు సేవ యనంగఁ గొఱఁత నాఁ దక్కువ కొఱ్ఱు వెలయు | 45 |
సీ. | సాస్నయుఁ బెద్దడో లను గంగడో లనఁ బడగనా టెక్కము ఫణము దనరు | 47 |
సీ. | మొసలియు డేగయుఁ బొల్చు బైరి యనంగ రాజరాత్రులు రేలు నాఁగఁ దనరుఁ | 48 |
సీ. | సమమిత్త్రసంజ్ఞలై చను బోటిగాఁ డన ముకుళంబు నిగ్గు పూమొగ్గనఁ దగుఁ | 49 |
సీ. | ఓడ భిక్షాభేద మొప్పును జోగునా నలుఁగునాఁ బరివాహ మాయుధ మగు | 50 |
సీ. | కలుషదేశమ్ములు చెలఁగుఁ గలంకన నెద యన భయమును హృదయ మెసఁగు | 51 |
సీ. | కొమ్మునా వాద్యభేదమును శృంగమౌఁ గందునా శిశుకళంకములు దోఁచుఁ | 52 |
సీ. | ఖట్వాంగరేఖలు కనుపట్టుఁ గోడునా ఘటికార్గళంబులు గడియ యనఁగ | 53 |
సీ. | శ్రవణైకదేశ మాచ్ఛాదనగేహంబు మీఱుచునుండు గుడార మనఁగ | 54 |
సీ. | కంఠభూషాలతికలు దోఁచుఁ దీఁగనా స్థూలము గుణ మొప్పుఁ దోర మనఁగ | 55 |
సీ. | జాతనూతకమును సమ మగుఁ బురుడునాఁ బెంపునా నాశంబు వృద్ధిదోఁచు | 56 |
సీ. | కంఠభూషణమును గనకాక్షినామంబు పైడికంటి యనంగఁ బరఁగుచుండు | 57 |
సీ. | పుష్పచాపంబును బుష్పగేహంబును బూవిల్లు నాఁగను బొదలుచుండుఁ | 58 |
సీ. | కంటకావృతియును గాంతియౌ వెలుఁ గనఁ బవనశైత్యంబులు వలి యనఁ దగుఁ | 59 |
సీ. | ముఖపతితాహారమును దంతవసనంబు వాతెఱయం చన ఖ్యాతిగాంచుఁ | 60 |
సీ. | కబళపరీమళక్షత్యర్థములయందుఁ గనుపట్టుచుండును గడి యనంగఁ | 61 |
సీ. | ధనురగ్రమద్యవృత్తావయవమ్ములు గొఱలుచునుండును గోపునాఁగఁ | 62 |
సీ. | కచబంధమును శిఖ గంధమూషికమును శోభిల్లుచుండును జుంచునాఁగ | 63 |
సీ. | ఆహార మాఁకలి యవనిపన్నగములు పరఁగుచునుండును నెర యనంగ | 64 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు నిచ్చలు నానార్థవర్గ మిట్లు | 65 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
అవ్యయవర్గము
సీ. | అగ్గెడ యక్కడ యచట యచ్చట యాడ యందలి పొనపొన యయ్యెడ యట | 66 |
సీ. | దిగువ క్రింద యనంగఁ దగు నధస్సంజ్ఞయై యొగి లెస్స యనఁగ సాధూక్తిఁ దనరు | |
| బరిపరి యనంగఁ జిందఱవందఱ యన నలరుచుండును గణశోర్థ మగుచుఁ బాట | 67 |
సీ. | సుడి సుమీ నుండి సూ సుమ్మి యనంగను నిశ్చయార్థకముగా నెగడుచుండు | 68 |
గీ. | మగుడ క్రమ్మఱ క్రమ్మటి మరల సారె, వెండి మాటికి తిరుగనా వెలయును బున | 69 |
సీ. | చీటికిమాటికి మాటిమాటికిఁ బలుమరు వేమ రనఁగ సదార్థము లగు | 70 |
గీ. | వేయనఁగ సయ్యన యనంగ వెస ననంగఁ, గ్రచ్చ రన గ్రక్కున యనంగఁ గ్రన్ననయన | 71 |
సీ. | తగు ననిచ్ఛిన్నార్థ ముగను హోరాహోరి యనఁ గాక యనఁగ నుతార్థ మెసఁగు | 72 |
సీ. | మున్ మున్ను మును ముందు మొగి ముంగల యనంగ దగును బురఃపురార్థములుగాను | 73 |
సీ. | ఇంచుకంత యొకింత యించుక యిసుమంత యన నీషదర్థమౌ నటుల నట్లు | 74 |
గీ. | మంచిదే యనంగ వల్లె యనంగను, రెండు సమము లగుచు నుండు నౌను | 75 |
గీ. | తనరు నంతట యన సమంతాత్సమముగ, నలరు నెల్లప్పు డనఁగ సదార్థ మగుచు | 76 |
గీ. | అలరు మెల్లఁగ నన శనైరర్థ మగుచు, నంతరర్థము లోలోన యనఁగఁ దనరు | 77 |
గీ. | దండ మనఁగ నమోర్థమై తనరుచుండుఁ, బొరు గిరు గనంగ నికషార్థముగఁ జెలంగు | 78 |
గీ. | పరఁగు నిప్పు డనంగ సంప్రతి సమముగ, నొప్పు నేకత్ర తుల్యమై యొక్కట యన | 79 |
క. | ఒక్కోలన నొకపెట్టన, నొక్కుమ్మడి యనఁగ నొక్కయూక యనంగా | 80 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతన, బరఁగు నిచ్చలు నవ్యయవర్గమిట్లు | 81 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
క్రియావర్గము
గీ. | ముందుగాఁగ నకర్మకములను దెలిపి, వెనుకను సకర్మకములను వివరపఱిచి | 82 |
సీ. | వెలసెఁ దనరెఁ దగెఁ జెలఁగెఁ జెలంగెను బరఁగెను బొనరెను మెఱసె సమరె | 83 |
గీ. | అఱచె వాపోయె నేడ్చెను మొఱలిడె ననఁ, దనరు రోదనమును జేసె ననుట కాఖ్య | 84 |
గీ. | ఎడసెఁ బురివిచ్చె నెడమయ్యెఁ గెడసెఁ జెంగెఁ, బాసెఁ గేడించెనాఁగను బరఁగుచుండు | 85 |
గీ. | పఱచె వెళ్లెను బరువెత్తె జరిగె నుఱికెఁ, గదలె ననఁ బాఱె ననుమాటగాఁ జెలంగుఁ | 86 |
సీ. | వచ్చెనం చనుటకు విచ్చేసి వేంచేసె నరుదెంచెఁ జనుదెంచె నరుగుదెంచె | 87 |
గీ. | మ్రొగ్గె డొంకెఁ గుందెఁ దగ్గె డీలయ్యెను స్రగ్గె ముడిఁగె డొంకె సమసె స్రుక్కె | 88 |
గీ. | మీఱె హెచ్చరిలెను మించె రెక్కొనె హెచ్చె, నెచ్చెఁ బెరిఁగె ననఁగ వృద్ధిఁజెందె | 89 |
గీ. | తనరు ఖ్యాత మయ్యె ననుటకుఁ బేరుఁగా, నెగడె ననఃగ వెలయు నిండె ననఁగఁ | 90 |
గీ. | అగిలె విచ్చె విఱిగెఁ బగిలె ననంగను, విరిసె ననుట కాఖ్య వెలయుచుండుఁ | 91 |
గీ. | అంజె నళికె వెఱచె నదరెఁ దద్దిరె దద్ది, రిల్లె, జడిసె ననఁగఁ జెల్లు భయముఁ | 92 |
గీ. | తడిసె నానె ననఁగఁ దనరు నార్ద్రంబయ్యె, ననుట కాఖ్య తెగియె నరె ననంగ | 93 |
సీ. | అచ్చివచ్చె ననంగ నై వచ్చె ననఁగ మే లై వచ్చె ననుటయౌ నావటిల్లె | 94 |
గీ. | ఒడ్డగిలెనాఁగ నొకదిక్కు కొరిగెననుట, యెనఁగు బెండగిలెనునాఁగ నెత్తువడియె | 95 |
గీ. | ఓసరిలెఁ దగ్గె తఱిగెనా నొప్పుఁ దక్కు, వాయె ననుమాట కలచెనా నలరు వలచె | 96 |
సీ. | ఓహటించె ననంగ నోడె నంచును దోఁచుఁ గూఁకె నాఁ గనుపట్టుఁ గ్రుంకెననుట | 97 |
గీ. | డాఁగురించె మఱిఁగె డాఁగె ననంగను, దాఁగి యుండె ననుట గాఁగఁ దోఁచుఁ | 98 |
సీ. | చేకుఱెఁ జేకూఱెఁ జేకూడె నంచన నేకార్థములు గాఁగ నెసఁగుచుండు | 99 |
గీ. | డిల్లపడె ననంగఁ జెల్లును ధృతివీడె, ననుట జాగుచేసె ననుట కొప్పు | 100 |
సీ. | ఆశ్చర్యమును జెందె ననుమాట కర్థమై తటకాపడె ననంగఁ దనరుచుండు | 101 |
గీ. | వగచె దురసిల్లె వందురెఁ బల్లటిల్లెఁ, బొక్కె నన నంగలార్చెనాఁ బొల్చియుండుఁ | 102 |
గీ. | బీరువోయె ననంగను మీఱు వ్యర్థ, మాయె ననుటయు మెల్లనపోయె ననుట | 103 |
గీ. | పణతపడె ననఁ దగును దవడనరాలు, పట్టుకొనె ననుటకు బడల్పడియె ననఁగఁ | 104 |
గీ. | చెలఁగుఁ బరిపోయె ననఁగను బెదరె ననఁగ, నయిదుపది చేసె నన ముందరడుగు వెనుకఁ | 105 |
గీ. | చేను కావించెఁ బైరిడెఁ జెట్లు గొట్టె, ననెడుమాటకుఁ బొదికొట్టె ననఁగఁ జెల్లు | 106 |
క. | పురులోమె నాఁగ క్షాత్త్రము, మెఱియించె నటంచుఁ దోఁచు మీఱుచు నుండున్ | 107 |
గీ. | ఒరులు చెప్పిన వెనుకఁ దా నొకటి చేసె, ననెడిమాటకు మొండొడ్డె ననఁగఁ దోఁచు | 108 |
గీ. | అతిశయముఁ జేసె ననుమాట కాఖ్యగాను, బొలిచియుండును బొంపిరివోయె నాఁగఁ | 109 |
క. | కనిపించె ననెడిమాటకు, వినిచె ననం జెల్లుచుండు వీఁగె ననంగా | 110 |
గీ. | సోలె ననఁగను దగు వాడివ్రాలె ననుట, మనును సొమ్మలవోయె సొమ్మసిలె ననఁగ | 111 |
గీ. | అఱచె ఱంపిలె ననఁ గూసె ననుట వెలయు, సరిగె నెదిరించె ననుమాట చనును మాఱు | 112 |
గీ. | లంబనంబాయె ననుటకై వ్రాలెననఁగఁ, బొలుచుఁ దగుఁ బొడమె ననంగఁ బుట్టెననుట | 113 |
గీ. | మళ్లె మరలెఁ దిరిగె మగిడె ననంగను, గ్రమ్మఱిలె నటంచుఁ గానఁబడును | 114 |
గీ. | చిక్కుపడియె దొరకెఁ జేపడె నగపడెఁ, దనిలెఁ బట్టుపడియెఁ దగులువడియె | 115 |
గీ. | దోఁపువోయె ననుట దోఁచు నులిపడె న, నంగ దిమ్ముపడె ననంగ డిందు | 116 |
గీ. | పొదివెఁ గవిసెను గ్రమ్మెనాఁ బొలుచు నావ, రించె ననుమాటగాను మలంచెఁ జుట్టె | 117 |
గీ. | మెసవెఁ దినియెఁ గుడిచె మెక్కె బోసేసెను, నమలె నారగించెనా భుజించె | 118 |
సీ. | పొందె హత్తెఁ గలిసెఁ జెందెఁ దార్కొనెఁ గూడె బెరసెఁ గ్రిక్కిరిసెను బెనఁగె దొరసె | 119 |
| అడ్డగించె దటాయించె నానె నాగె, నిలిపె నరికట్టె ననఁగను వెలయుచుండు | 120 |
గీ. | పురిగొలిపె నంచెఁ బుత్తెంచెఁ బుచ్చె నంపెఁ, బంచెఁ బంపెను బంపించెఁ బనిచె ననఁగ | 121 |
సీ. | కనుఁగొనెఁ దిలకించెఁ గాంచెఁ జూచెను గనె ననఁగను గనియె నంచనఁ జెలంగు | 122 |
సీ. | నుగ్గాడెఁ బరిమార్చె నులిమెను దెగటార్చెఁ జదివెఁ జంపెను సదమద మొనర్చెఁ | 123 |
సీ. | అదలించి, గద్దించె నడలించె ననఁగను గదిమె నంచనుమాటగాఁ జెలంగుఁ | 124 |
గీ. | అరసెనాఁగ విచారించె ననుట కొప్పుఁ, బూసెఁ బట్టించెఁ జమరెనాఁ బొలుచు నలమె | 125 |
గీ. | ఎలిచెఁ దలఁచె ననం జను నెంచె ననుట, చీఱె నన నుత్తరించెనాఁ జించె ననఁగ | 126 |
గీ. | ప్రామెఁ దొలిచెను వెలనెను దోమె రుద్దె, ననఁగ నిర్మల మొనరించె ననుట యొప్పు | 127 |
గీ. | తెలచె నెరఁగె నెఱంగెఁ జాగిలెను మ్రొక్కె, నన నమస్కారమును జేసె ననుట కొప్పు | 128 |
గీ. | గనుపుగొట్టె ననంగను దనరు నూఁచ, ముట్టుగాఁ గొట్టు ననుమాట పట్టుకుపడె | 129 |
గీ. | పెట్టెఁ గీలిండె నాఁగను వెలయుచుండు, నుంచె ననుపల్కునకు నేదె నుజ్జగించె | 130 |
క. | ఒప్పించె నొప్పగించెను, నొప్పరగించె నన మూఁడు నొకయర్థంబౌం | 131 |
సీ. | గొనెమారెఁ జదిపె నాఁగను గొట్టె నని తోఁచుఁ దఱిగె ననంగను నఱకె ననఁగ | 132 |
సీ. | నిమిరెను దడవెనా నిమిరె నంచని యొప్పు నచ్చె ననం దగు నమ్మె ననుట | 133 |
గీ. | ఓసరించె ననఁగ నోరఁజేసె ననుట, వెలయు విలిచె ననఁగఁ బిలిచె ననుట | 134 |
గీ. | పోఁజె ననఁగ వెలయు ముంటఁ జీల్చె ననుట, చెప్పె ననుట ఫలముఁ జెందె ననుట | 135 |
సీ. | పంచించె ననుటకుఁ బండించె ననఁగను గికురించె ననఁగను గేరుచుండు | 136 |
గీ. | మించు రిక్కించె ననఁగ నిక్కించె ననుట, చనును పారువఁ జూచెనాఁ జక్కఁగాను | 137 |
క. | పటుతాళించె నవంగను, నటునిటు బెళుకంగఁ జూచె ననుటకుఁ దోఁచున్ | 138 |
గీ. | అడిగెఁ బతికె వండె నడ్డగించెను గోసె, ననఁగ నిట్లు కొన్ని యగు ద్వికర్మ | 139 |
సీ. | ప్రోచుచున్నాఁ డనఁ బ్రోచుచున్నా వనఁ బ్రోచుచున్నా ననఁ బొలఁచు లట్టు | 140 |
గీ. | ప్రోవఁబడె ననఁ గర్మార్థమునఁ జెలంగుఁ, జనును బ్రోపించె ననఁగ ణిఙర్థరీతి | 141 |
గీ. | భావమునఁ బ్రోవు ప్రోచుట బ్రోవడ మనఁ, బరఁగుఁ గర్మార్థమునఁ బ్రోవఁబడినది యన | 142 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగఁ క్రియావర్గ మిట్లు | 143 |
ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ
గీ. | అశ్రుతగ్రామ్య విస్మృత వ్యర్థసులభ, శంకితాలస్య నిరుక్తశబ్దవితతిఁ | 144 |
చ. | చరణసమజ్జనావనవిశారద | 145 |
మాలిని. | సకలభువననాథా సంతతస్వావబోధా | 146 |
గద్య. | ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాదికతిపయగుణస్వ | |
సంపూర్ణము