ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911/చిత్రపటముల వివరణము
చిత్రపటముల వివరణము.
శ్రీరాధాకృష్ణులు.
శ్రీపంచమజార్జి రాజేంద్రుడు.
శ్రీ విక్టోరియా మేరీరాణి.
హార్డింజి ప్రభువుగారు.
క్రూ ప్రభువుగారు.
నైజాము యువరాజుగారు.
మైసూరు యువరాజుగారు.
ఆనందగజపతి మహారాజుగారు విజయరామ గజపతి మహారాజుగారు
శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడుగారు.
కాంచన గంగాశిఖరము.
నవాబు సర్ సాలార్‌జంగ్.
మహారాజా సర్ కిషన్‌ప్రసాద్ బహదూరు.
దర్భంగ మహారాజుగారు.
బర్దవాను మహారాజుగారు.
సర్ విలియం వెడ్డరుబర్న్
ఏ. ఓ. హ్యూముగారు
గౌరవనీయులగు గోపాలకృష్ణ గోఖలెగారు.
సర్ ఫిరోజిషా మెహతా.
రైటానరెబిల్ అమీరలిగారు.
శ్రీ ఆగాఖాన్ గారు.
గౌరవనీయులగు అలీమాంగారు.
కీర్తిశేషులైన బదురుద్దిన్ తయబ్జీగారు.
సర్ నారాయణ గణేశచంద్రావార్కరుగారు.
దిన్షాయెడల్జి వాఛాగారు.
మహాదేవ గోవిందరానడిగారు.
హిందూదేశసేవక సమాజము
పునహాలోని హిందూవితంతు శరణాలయము.
ట్రాన్స్వాలు భారతీయులు.
పిఠాపురమురాజావారి యనాధ శరణాలయము.
కాకినాడ స్త్రీవిద్యాభివర్ధనీ సమాజము.
మహానందీశ్వర దేవాలయము.
తాజమహల్ దివ్యమందిరము.
విక్టోరియా టర్మినసు రయిలుస్టేషను, బొంబాయి.
బొంబాయిపట్టణ పాలనా సభామందిరము.
శ్రీ కాళహస్తి.
చిదంబరము.
గన్నవరం ఆక్విడక్టు.
శ్రీరంగము.
జటప్రోలు రాజాగారు.
గౌతమ బుద్ధుడు.
ఏసుక్రీస్తు.
శ్రీ రామకృష్ణ పరమహంస.
ఈశ్వరచంద్ర విద్యాసాగరుఁడు.
స్వామి దయానంద సరస్వతి.
కే. ఆర్. కామాగారు.
కౌంటు టాల్‌స్టాయిగారు.
వివేకానంద స్వామి.
రివరెండు క్లా దొరగారు.
శశిపాద బెనర్జిగారు.
పండిత శివనాథ శాస్త్రిగారు.
బ్రహ్మానంద కేశవ చంద్రసేను.
మహర్షి దేవేంద్రనాథ ఠాగోరుగారు.
బందరు జాతీయ కళాశాల.
విద్యాగౌరులు రమణాబాయి, శారదాబాయిగారలు
సౌభాగ్యవతులు సుబ్బమ్మ, శ్రీరంగమ్మ, రుక్మిణమ్మగార్లు.
శ్రీమతి తెలికచర్ల వేంకటమ్మ అమ్మవార్లంగారు.
డొక్కా సీతమ్మగారు.
శ్రీమతి కొచ్చర్లకోట బంగారమ్మగారు.
శ్రీమతి వేమూరి శారదాంబగారు.
లేడీ హార్డింజిగారు.
క్లార్కు దొరసానిగారు.
లేడీ లాలీగారు.
కూచ్ బేహారు మహారాణిగారు.
అనిబెసంటు దొరసానిగారు.
ఎం. ఇ. ఆర్చిబాల్డు దొరసానిగారు.
మిస్‌ఎస్ పిట్ దొరసానిగారు.
డాక్టరు బేయరు దొరసానిగారు.
శ్రీమతి కుముదిని మిత్రగారు బి.ఎ.
శ్రీమతి స్వర్ణకుమారీ దేవిగారు.
శ్రీమతి పారుకుట్టి అమ్మగారు బి.ఎ.
శ్రీమతి సరళాదేవి చౌధరాణిగారు బి.ఏ.
శ్రీమతి శోకరీబాయి బి.ఏ.
శ్రీ భారతీ సమాజము, విశాఖపట్టణము.
శ్రీమతి మొసలిగంటి రామాబాయమ్మగారు.
శ్రీమతి హమాబాయి పెటీట్‌గారు.
శ్రీమతి అలి అక్బరిగారు.
పండిత రమాబాయి సరస్వతిగారు.
డాక్టరు ద్వారకాబాయి కమలాకరుగారు ఆమెభర్త.
కాముక సమావేశము.
శ్రీమతి అన్నపూర్ణాదేవి.
శ్రీమతి కాళహస్తి అలివేలు మంగమ్మగారు.
బొమ్మవరపు వేంకటరత్నమాంబగారు.
శ్రీయుత గాంధిగారు.
లాల్‌శంకరు, ఉమాశంకరు.
జీవన్జీగారు.
లాల్‌భాయి దలపత్‌భాయి.
జెంషెడ్జి నస్సర్వాంజీ తాతాగారు.
సర్ చింనాభాయి మాధవలాలు. సి. ఐ. ఇ.
చేసినాడు. విద్యాలయములకు సహాయము చేసినాడు. విద్యార్థులకు భోజనవసతులకయి గృహములను కట్టించినాడు. బొంబాయి దొరతనమువారు సర్ అను కితాబునిచ్చి గౌరవించినారు.
సర్ కరింభాయి యిబ్రహిం.
ఈయన బొంబాయి పురవాసి. బారొనెట్ అను యెంత ధనికులకయినను లభింపని గౌరవ మీయన కీయబడినది. ప్రకృతిశాస్త్ర విద్యాలయమునకు 10 లక్షల రూపాయలను దానమిచ్చినాడు. బొంబాయిలోని మహమ్మదీయులకు సతతము దానము చేయుచుండును. బొంబాయిలోని మహమ్మదీయ నాయకులలో నగ్రగణ్యుడు.
రతన్ తాతాగారు.
తాతాగారి కుమారుడు కులపావనుడు. మహాదాత. వాణిజ్యవ్యాపారములందు మంచి సమర్ధుడు. ట్రాన్సువాలు భారతీయ నిధికి 50,000 రూపాయలిచ్చెను.
రాజా రవివర్మగారు.
ఈయన వ్రాసిన పటములు హిందూదేశములో ప్రతికుగ్రామమునందును అల్లుకొనినవి. వీరిపేరు భరతఖండమునందు యెఱుంగని వారుండరు. మనపూర్వచారిత్రములను, ఔన్నతమును చిత్తరువుల రూపమున వ్రాసి జాతీయజీవనములో నూతనోజ్జీవమును కల్పించినాడు. ఈయన చిత్తరువులు భరతభూమికి గౌరవమును దెచ్చినవి.
డాక్టరు ఆనంద కుమారస్వామి.
ఈయన చిత్రకళాశాస్త్రమునందెక్కువ పరిశ్రమను జేసినాడు. యూరపుఖండమునందును నివసించుచుండును. చిత్రపరిశోధనములో నీయనతో సమానులు ఇండియా యందేమి ఇంగ్లండునందేమి బహు అల్పముగ గలరు. అలహాబాదు చిత్రవస్తుప్రదర్శనములోని చిత్రకళాశాల కుమారస్వామిగారి యాధిపత్యముక్రింద నుంచబడెను. చిత్రశాస్త్రసంబంధ వ్యాసములను వార్తాపత్రికలకు వ్రాయుచుండును.
రచయిత:రవీంద్రనాథ ఠాగూరు
ఈయన మహర్షి దేవేంద్రనాధ టాగోరుగారి కుమారుడు. చిత్తరువులు వ్రాయుటయందు అసమాన ప్రజ్ఞావంతుడు. రాజారవివర్మతో నీవిద్యయందు సరివోల్చదగినవాడు.
ఆర్. వెంకయ్య నాయుడుగారు.
ఈయన చెన్నపురియందు సుప్రసిద్ధమగు రూపపటముల ఉత్తమ కార్యస్థానముగలవాడు. చిత్రచాతురియు గలవాడు. స్వశక్తివలన ధనమార్జించి చెన్నపురిలో పెద్దవారయిన ఆంధ్రులలో వెంకయ్య గారొకరు.
గంజాం వేంకటరత్నం పంతులుగారు.
లాలా లజపతిరాయిగారు.
బాబు బిపిన్ చంద్రపాలుగారు.
పళ్లే చెంచెల్ రావు పంతులుగారు.
గాజుల లక్ష్మీనరసు నాయుడుగారు.
బెహరాంజి మలబారిగారు.
దామోదరదాసు సుఖడ్వాలా. మాడపాటి వెంకటేశ్వరరావు పంతులుగారు.
గౌరవనీయులగు గోస్వామిగారు.
గౌరవనీయులగు భూపేంద్రనాథ్ బోసుగారు.
గౌ. మోచర్ల రామచంద్రరావు పంతులుగారు.
కోలాచలం వెంకటరావుగారు.
భద్రాచలం జమీందారుగారు, వారిపుత్రుడు.
శ్రీరాజా వత్సవాయి గజపతిరాజుగాఅరు.
మైలవరం జమీందారుగారు.
రామచంద్రపురం జమీందారుగారు.
రాజా విశ్వేశ్వర నిశ్శంక బహద్దరు శ్రీ సంగమవలస జమీందారుగారు.
దేశరాజు శీతారామారావు పంతులుగారు.
రావుబహద్దరు దేశరాజు కృష్ణయ్యపంతులుగారు.
రచయిత:జయంతి రామయ్య
వీరు 20 సంవత్సరములనుండి చెన్నపురి దొరతనమువారి కొలువులో నున్నారు. ప్రస్తుతము మదరాసులో మూడవ ప్రెసిడెంసీ మేజస్ట్రేటుగ నున్నారు. తెలుగుబాసయందు గొప్ప పాండిత్యము గలవారు. పురాతనవస్తు పరిశోధనము నందీయన కెక్కువగా నభినివేశము గలదు. వి. గోపాలయ్యగారు.
మంగు శ్రీనివాసరావుగారు.
పి. టి. శ్రీనివాస అయ్యంగారు.
ప్రిన్సిపాల్ డాక్టరు లాజరస్ బి. ఎ. గారు.
మల్లాది వేంకటరత్నముగారు.
శ్రీరాజా మంత్రిప్రగడ భుజంగరావుగారు.
పేర్ల రామమూర్తి శ్రేష్ఠిగారు.
రాజా శ్రీ పద్మనాభ నారాయణదేవుగారు.
శ్రీరాజా వీరప్రతాపరుద్రగౌరచంద్ర గజపతి నారాయణదేవు బహద్దర్‌గారు.
శ్రీ దంతులూరి వెంకటవిజయ గోపాలరాజుగారు.
వీరు బవులివాడ మొఖాసాదారుగారు. ఆంధ్రభాషాభిమానులు. ధనవంతులు. ధర్మకార్యములను చేయుచుండువారు.
రాజా వత్సవాయి తిమ్మగజపతి రాజుగారు, రాయ జగపతి రాజుగారు.
బచ్చు రామేశంగారు.
పైడా రామకృష్ణయ్యగారు.
వెలగపూడి సుందరరామయ్య పంతులుగారు ఎం.ఏ., బి.ఎల్.
వీరు ఆంధ్రులందఱికిని లలామభూతులు. మద్రాస్ యూనివర్సిటీ పెట్టిన తరువాత మొట్టమొదట ఎం. ఏ. పరీక్షలో గృతార్థులయినవారు వీరే. వీరు 1848 వ సంవత్సరమందు జననమొందిరి. మచిలీబందరునందు నున్న నోబిలు కాలేజీలో వీరు విద్యాభ్యాసముజేసి 1864 లో ఎఫ్. ఎ. ప్యాసుచేసిరి. తరువాత చెన్నపట్టణమునకు బోయి బి. ఏ., ఎం. ఏ. పరీక్షలనిచ్చిరి. వీరు ఎం. ఏ., ప్యాసుచేయువరకు మద్రాసు రాజధానిలో నాపరీక్ష యిచ్చినవారు ఎవరును లేరు. కావున వీరు ఎం. ఏ. పరీక్షనిచ్చినతోడనే 20 తోపులుచేసిరని చెప్పెదరు. ఆంధ్రులకట్టి గౌరవము గలుగజేసిన సుందరామయ్యగారిని ఎంత పొగడినను చాలదు. వీరు బి. ఎల్. పరీక్షకూడ నిచ్చిరి. వీరు డిస్ట్రిక్టు మునసబు పనియు సబ్ జడ్జిపనియు జేసి 1880వ సంవత్సరమున అనగా 32 సంవత్సరములకే పరలోకగరులైరి. వీరు ఇంకను బ్రతికియుండిన యెడల హైకోర్టు జడ్జి అయి యెంతయు గౌరవముజెందియుందురు. వారియకాల మరణమువలన ఆంధ్రులకు నపారమైన నష్టము కలిగినదని చెప్పుటకు సందేహము లేదు.
పూసర్ల చినతమ్మన్న శ్రేష్ఠిగారు.
వీరు విశాఖపట్టణముజిల్లా భీమునిపట్టణము వాస్తవ్యులు. వైశ్య వర్తకులు. ధనికులు, దాతలు.
బసవరాజు గవర్రాజుగారు.
వీరు కందుకూరి వీరేశలింగముగారి ప్రియ స్నేహితులు. వారు చేసిన సత్కార్యములన్నిటియందును జీవించియున్న దినములలో సహాయము సేయుచు వచ్చిరి. కృతజ్ఞతాపూర్వకముగ శ్రీపంతులుగారు గవర్రాజుగారి పెద్దఛాయాపటమును రాజమహేంద్రవర పురమందిరమందుంచినారు.
కోపల్లి వెంకటరమణరావుగారు.
ఈయన బి. ఏ. పరీక్షయందు గడతేరినాడు. వెంకటగిరి యందీయనచే స్థాపించబడిన విద్యాలయము హైస్కూలయి అభివృద్ధిలోనున్నది. జాతీయవాదులలో నొక్కడుగనుండెను. ఆంధ్ర కర్ణాట భాషలయందెక్కువ పాండిత్యము గలవాడు. ఆంధ్రమున కొన్ని నాటకములను రచించెను. వెంకటరమణరావుగారు ఆంధ్రపత్రికను మొట్టమొదట స్థాపించినప్పుడు ఆరుమాసములు సంపాదకుడుగా నుండెను. విషజ్వర పీడితుడై 1909 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో గీర్తిశేషుడాయెను.
దాసువారి కుటుంబము కృష్ణాగోదావరిజిల్లాలలో నెక్కువ ప్రఖ్యాతిని గాంచినది. శ్రీరామపంతులుగారు విద్యాధికులగునారుగురు పుత్రుల జనకుడు. ఆంధ్రభాషాకోవిదుడు. ఆంధ్రదేవీభాగవతము మొదలగు గ్రంథములను రచించెను. వీరు మృతినొంది కొన్ని సంవత్సరములయినవి.
కీర్తిశేషులయిన వావిళ్ళ రామస్వామిశాస్త్రిగారు.
వీరు చెన్నపురిలో ప్రసిద్ధికెక్కిన సంస్కృతాంథవిక్రేతలుగనుండిరి. అనేకగ్రంథములను ముద్రింపించిరి. సంస్కృతాంథ్రములలో మంచిపండితులని పేరువడసిరి.
వీరు గుంటూరుజిల్లా కొండవీటిసీమలోని నరసారావుపేటతాలూకా కొప్పరపు గ్రామవాస్తవ్యులు. అన్నగారిపేరు వెంకటసుబ్బరాయలు. తమ్మునిపేరు వెంకటరమణరాయలు. పెద్దవారికి 25 సంవత్సరములును రెండవవానికి 23 సంవత్సరములును వయస్సుండును. వెంకటరాఅయ్లు 11 వ యేటనే పద్యములల్లువాడు. ఇప్పటికి వీరు నూరు నూటయేబది అష్ఠావధానములేమి, శతావధానములేమి చేసియున్నారు. మొట్టమొదట గంటకు నూరుపద్యములను చెప్పగలిగియుండిరి. ఇప్పుడు గంటకు నాల్గునూరులు చెప్పగలరు. ఇప్పటికి సుమారు 30,000 పద్యముల జెప్పినారు. వీరికి సరస్వతులనియు, ఆశుకవిసింహంబులనియు, ఆసుకవిచక్రవర్తులనియు గౌరవములను నాయాపట్టణముల వారిచ్చిరి. వీరు బంగారు పతకహారంబులను ధరించిచున్నారనిన నది అతిశయోక్తికాదు.
వీరు పిఠాపురము సంస్థానమునం దాస్థానకవీశ్వరులుగ నున్నారు. శతావధానము చేయగలరు. ఆంధ్రదేశమం దిప్పుడిప్పుడే కీర్తిని వహించుచున్నారు. కవితాపత్రికా సంపాదకులు.
కృష్ణాజిల్లా తణుకు వాస్తవ్యులు. శతావధానమును చేయుటయేగాక జనోపయోగమయిన గ్రంథములను పెక్కులు రచియించి ప్రసిద్ధి కెక్కినారు. ఈసంచికలో గొన్ని పద్యములచ్చటచ్చట వీరు వ్రాసిపంపినవి ముద్రింపబడినవి.
కంఠమనేని రంగయ్య, హనుమోర రామస్వామిగార్లు.
కవుతవరములో జరిగిన ప్రథమకమ్మ మహాజనసభకు రంగయ్యగారు అధ్యక్షుడుగను రామస్వామిగారు ఆహ్వానసంఘాధ్యక్షుడుగను నుండిరి. ఈసభ సమావేశసంకల్పములు ఫలించినవనుటకు కృష్ణామండలములో నిప్పుడు కమ్మవారిచే నేర్పఱుపబడుచున్న బాలబాలికాపాఠశాలలు పంచాయితీసభలు సాక్ష్యముగనున్నవి. కొవ్వూరు బసివిరెడ్డిగారు, ములుకుట్ల అచ్యుతరామయ్యగారు.
బసివిరెడ్డిగారు కృష్ణాజిల్లా నిడదవోలులోనుండు గొప్పవ్యాపారులు. రయిసుమిల్సుకు అధిపతి. దానధర్మములు చేయువాడు. అచ్యుతరామయ్యగారు న్యాయవాది. దానధర్మపరుడు.
ఎం. రామలింగారెడ్డిగారు.
ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పట్టపరీక్షలో నుత్తీర్ణుడయినవాడు. దేశచరిత్రా పరీక్షలయందు బహుమానములను గడించిన విద్యార్థి. వేతనములను గడించినవాడు, తెలుగుభాషలో గొప్పపాండిత్యము కలదు. మైసూరురాజ్యములో విద్యాశాఖ యందిప్పుడొక యుద్యోగిగ నున్నాడు.
ఈయన విజయనగరం కాపురస్తుడు. అలహాబాదులో నాంగ్లేయభాషలో బ్రచురింపబడుచున్న లీడర్ అను దైనికపత్రికకు సంపాదకుడుగనున్నాడు. "హిందూసంఘసంస్కరణమను" గ్రంథమునకు సంపాదకుడుగ నుండెను. ఇంగ్లీషుభాషయందు గొప్పపాండిత్యము కలదు. ఆంధ్రులలో ఆంగ్లేయ దైనికపత్రికకు సంపాదకుడుగా నుండునట్టి యదృష్టము మరియెవ్వరికిని లభించలేదు. చింతామణిగారు దేశభక్తులు. వ్యవసాయపరాయణులు. వీరికి మున్ముందు గొప్పగౌరవము లభించునని తలంపడుచున్నవి.
పి. కర్షాప్సుగారు.
శొంఠి రామమూర్తిగారు.
కూచి నరసింహము పంతులుగారు.
గిడుగు వేంకటరామమూర్తిగారు.
బుర్రా శేషగిరిరావుగారు.
అత్తిలి సూర్యనారాయణగారు.
ధర్మవరం కృష్ణమాచార్యులుగారు.
పాలెం గోపాలముగారు.
మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు.
కోలాచలం శ్రీనివాసరావుగారు.
మహామహోపాధ్యాయ తాతా సుబ్బరాయశాస్త్రిగారు.
శీతారామ ఘనపాఠిగారు.
శ్రీమాన్ శ్రీపరవస్తు శ్రీనివాసభట్టరాచార్యులయ్యవార్లంగారు.
మున్నంగి రామయ్యపంతులుగారు.
కే. వి. ఎల్. నరసింహంగారు.
దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారు.
కనకపల్లి భాస్కరరావు బి.ఏ. గారు.
వేదుల కామశాస్త్రిగారు.
యం. బుచ్చికామకవిగారు.
ఆకొండి వ్యాసమూర్తిశాస్త్రిగారు.
పురాణకొండ మల్లయ్యశాస్త్రిగారు.
ఈయన చాలకాలమునుండి పాఠశాలా ప్రధానోపాధ్యాయుడుగానుండి యాంద్రమున గొన్ని గ్రంథములనుపద్యగద్యాత్మకముగా రచియించెను. మర్చెంటు ఆఫ్ చెనీస్ అను షేక్స్పియరు వ్రాసిన నాటకమును హృదయరంజకముగా దెలుగులోనికి భాషాంతరీకరణముజేసి రిగోదావరీమండలోనుపాధ్యాయసభ స్థాపించి ఎనిమిదేండ్లు కార్యదర్శిగనుండిరి. పెక్కూఅంధ్రపత్రికల కుపవిలేఖరుడై బోధకుల నుపకరించు శారదయను పత్రికను గొంతకాలము ప్రచురించిరి.
కామిశెట్టి పేరమ్మనాయుడుగారు.
గోదావరిజిల్లాలో ఫ్రెంచివారి పట్టణమగు యానాంపుర వాస్తవ్యుడు. ఇచ్చటా కీర్తివడసిన మహాజనులలో నీయనయొక్కడు. ఆపట్టణమునకు మేయరు (పురపాలనాధ్యక్షుడు)గ నుండెను. ఈయన దానధర్మములనుగూడ చేసినారు.
గ్రంధి రంగయ్యార్యులు.
ఈయన గుంటూరు కాపురస్థుడగు వైశ్యుడు. సంగీతవిద్యాపాండిత్యము గలవాడు. శృతిస్మృతి పరిచయుడు. సంస్కృతభాషాజ్ఞాని. ఆర్యవైశ్య సభా కార్యదర్శి.
శ్రీ విక్రమదేవ వర్మగారు.
విశాఖపట్టణము జిల్లాలోని జయపురాధీశ్వరుని పితృవ్యపుత్త్రుడు. సంస్కృతభాషయందు కొన్ని పుస్తకములను, ఓఢ్రభాష యందును ఆంధ్రభాషయందు కొన్ని నాటకములను వ్రాసెను. మాలతీ, కృష్ణార్జునుల చరిత్రములనునవి చెన్నపురి విశ్వవిద్యాలయ ప్రథమ పట్ట పరీక్షల కొకప్పుడు బఠనీయగ్రంథములుగా నిర్ణయింపబడెను.
న్యాయపతి వెంకటరామారావుగారు.
వీరు గంజాంజిల్లా టెక్కలి వాస్తవ్యులు. కృష్ణదేవుగు ఎస్టేటుకు మేనేజరుగ నున్నారు. ఆంధ్రమున కొన్ని పుస్తకములను వ్రాసినారు.
ఆంధ్రమున కొన్ని గ్రంథములను, నాటకములను రచించిరి.
ఈయన మహమ్మదీయుడు. వీరి కుటుంబమున ఆంధ్రభాషాజ్ఞానము పరంపర్యముగ వచ్చుచున్నది. ఈయన వయస్సు 25 సంవత్సరములకు మించదు. కవిత్వము ధారాప్రదముగా జెప్పగలరు. సీతాపతి పరిణయము, శారికాస్వయంవరము, మణిమాల, విచిత్రబిల్హణీయము, చంద్రగుప్త, ప్రహ్లాద, ఇత్యాది నాటకములను, ప్రబంధములను వ్రాసినాడు. కాపురస్థలము గోదావరి మండలములోని పిఠాపురము.
ఉత్తరసర్కారులలో నారాయణదాసుగారితో సమముగ హరికథలను చెప్పువారు వేరొకరుండరు. ఈయన ఆంధ్రగ్రంథకర్త. వీరిచే వ్రాయబడిన కొన్ని పుస్తకములు చెన్నపురి విశ్వవిద్యాలయ పరీక్షకు బఠనీయ గ్రంథములుగ నిర్ణయింపబడినవి.
యోగి శ్రీనివాసశాస్త్రిగారు.
(భారతీసమాజ పటములో వీరుగలరు.)
సంఘసంస్కరణము కొరకును, స్త్రీవిద్యాభివృద్ధి కొరకును వీరు చాల పరిశ్రమ చేయుచుందురు. యోగము చేసి చూపగలరు. ఈమధ్య రాజభక్తిని పురిగొల్పుచు కొన్ని యుపన్యాసముల నిచ్చియున్నారు.
గుమ్మలూరి లక్ష్మీనరసింహశర్మగారు.
ఈయన గానవిద్యానిపుణుడు. గుమ్మలూరి వేంకటశాస్త్రులు గారిపుత్రుడు. పదునొకండేండ్లనుండియు కవిత్వమును జెప్పు సామర్ధ్యమును గలిగియుండెను. గర్భచిత్రబంధ కవిత్వమునందును నేర్పుకలదు. నీతిదర్పణము, సావిత్రీచరిత్రము, జానకీపరిణయము ఇత్యాది పుస్తకములను వ్రాసినారు. కాపురస్థలము విజయనగరము.
బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు.
ఈయన అతిబాల్యమునుండియు ననాయాసముగా గవిత్వమునుజెప్పు నేర్పును కలిగియుండిరి. ప్రాయము పదునెనిమిదేండ్లుండవచ్చును. ఘోషయాత్ర, ప్రభావతీపరిణయము, ప్రచండపాండవము ఇత్యాది నాటకములను, విమలాదేవి యను నవలను, కృష్ణకుమారియను ప్రబంధమును రచించినాడు.
బాలాంత్రపు రామచంద్ర సత్యనారాయణ.
ఈబాలకుడు పదునేను సంవత్సరములు మాత్రమే జీవించెను. ఈపిన్నవయస్సుననే రుక్మిణీకల్యాణము, ద్రౌపదీస్వయంవరము, శ్రీరామవిజయము అను చరిత్రములు గల గ్రంథములను వ్రాసెను. శైశవమున నింతటి మేధానిధియగు నీ బాలకుని జీవితము బలకులకెల్ల నాదర్శముగ నుండనోపును.
ఈయన అష్టావధానమును చేయగలరు. కృష్ణాజిల్లా అంగలూరు పురవాసి. ఇంగ్లీషునందు బ్రవేశపరీక్షలో గృతార్థులయినవారు. సంఘసంస్కరణాభిలాషి. ఆంధ్రభాషలో మంచిప్రవేశము గలదు. కొన్ని గ్రంథములను రచియించియున్నారు. కమ్మకులస్థులు.
దేశీయ విద్యాలయము, రాజమండ్రి.
వితంతు శరణాలయము.
ఈమె యీసంచికలో నొకవ్యాసమును వ్రాసియున్నది. ఆంధ్రభాషను జక్కగా జదువుకొనిక నారీరత్నము. కాకినాడ స్త్రీసమాజములో నీమెయప్పుడప్పుడు వ్యాసములను వ్రాసి చదువుచుండును.
రావుబహద్దరు విలియం వేంకటరామయ్యగారు బి.ఏ.బి.ఎల్.
ఈయన బరంపురములో న్యాయవాదిగనున్నాడు. కల్లికోట కళాశాలకు ఉపాధ్యక్షుడు. గవర్నమెంటు ప్లీడరు. డిస్ట్రక్టుబోర్డు మెంబరు. దేశాభిమాని.
సుబ్బారావుగారు నియోగిబ్రాహ్మణులు. 1856 సం॥ గోదావరిమండలములో జన్మించిరి. బి.ఏ; బి.ఎల్; పరీక్షలలో నుత్తీర్ణులై చెన్నపురిలోనున్నత న్యాయసభలో న్యాయవాదిగనుండిరి. అత్యద్భుతమేధాసంపన్నుడు. బ్రహ్మవిద్యావిశారదుడు. ముప్పదినాలుగవయేటను లోకాంతరగతులైరి. వీరు జీవించియుండిన గొప్పస్థితిలో నుండియుందురు.
ప్రవృత్తిమార్గము.
మ. రా. శ్రీ. చెన్నాప్రగడ భానుమూర్తి బి.ఎ., ఎల్.టి. గారిచే రచియింపబడినది.