ఆంధ్రనాటక పద్యపఠనం
సర్వసామ్యములు
గ్రంథకర్తవి
ప్రథమ ముద్రణము 1957
వెల రెండు రూపాయలు
రాజమహేంద్రవరము శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావుగారిచే
సరస్వతీ పవర్ ప్రెస్సున ముద్రించబడ్డది.
Principal. O. J. Couldrey Eq.. who kindly complied with my request to permit me to dedicate this work of mine, Delivery of Andhra Dramatic Verse', to him, and who affectionately blessed me and my work. I am also obliged to Sri Yelury Venkata Rao of the Venus Studio. Rajahmundry, who carefully reproduced the letter of our old Guru Dev. published herein.
In his letter Sri Guru Dev writes he remembers rather that he had remarked: 'Your poetry is no separate art. True. That is what I remember too, and what exactly I wrote in the book (p. 1. 1. 16). But in my letter to him, I wrote that he had remarked: "Your poetry is no art. This version of mine in the letter is inexact. Bowing to Guru Dev's memory, I apologised to him. I assured him that I had represented him truly to the public, for in Section I of my book referred to above, I used Pratyeka Kala' which means separate art.
Rajahmundry
25-9-1957
B. KAMESWARA RAO
(True COPY OF THE LETIER)
10th Sep 1957
3 St Michael's Avenue
Abingdon,
Berks
ENGLAND
Dear Mr Kameswara Rao,
It is with real pleasure that I accord you the permission. for which you ask, that you should dedicate your work on the Delivery of Andhra Dramatic Verse to me But I should like to believe that my remark in the lecture room to which you refer was not quite so absolute as it appears to stand in your recollection Perhaps I said that your poetry was not a separate art, giving my reason for this opinion very much as you remem- ber it and report it in your letter As to my tentative criticism of the usual delivery, I should of course have been wiser to refrain from hazarding even a guess on the difficult subject During all my time in India, no one was able to make me clearly understand what the nature and function of the ragam is, or whether it was liker to what we call a scale or to what we call a tune. This no doubt was due to vagueness and uncertainty of the usual translations of the technical terms involved More over I found English books on the subject eqally unenlightening I wish Fox-Strangway's book, published I think in 1914, had come my way I haven't studied it even now but I have Popley's little book in the Heritage series which is largely based on it and moreover is particularly attentive to the southern custom This would have been a priceless boon if I had had it in time to enjoy living examples in the light of its explanations
I was very much interested in the summary which you give me of your treatise and in the account of your active and versatile career and its bearing on the subject which you have chosen to write about I feel sure that your experience and your literary endowments have eminently fitted you to write of it with authority and charm For the rest, the news which you give me of my friends was very kindly thought of. I hope that the book which you regard as your life's work will have all the effect which you desire, and all the acclaim, which I feel sure, that you deserve With every good wish from your old teacher,
(Sd) OSWALD COULDREY
పీఠిక
ఈ సంపుటంలోని 2, 8, 9, 10, 12 అనే సంఖ్యలుగల శీర్షి కల కింది వృత్తాంతం మాత్రమే 1924 సంవత్సర పూర్వపు రచన. తక్కిన శీర్షికలకింది సంగతులు తరవాత తరువాత వెలిసిన రకం.
సంగీతనటుడు నాటకపద్యాన్ని రాగిస్తూ నటించేటప్పుడు మూడు కళల డొంకలు కదుల్తాయి. పద్యానికి ఉంటూండే సహజ గమనం సంగతి విస్మరించి, అన్యవ్యక్తిత్వం గల రాగం - తాను విన్నంత కన్నంత, తనకి తెలియవచ్చినంత - అన్యుడై ఒప్పవలసిన వాడు తెచ్చి పద్యానికి సంధానం చెయ్యడం అనేది ఒక సమస్య. ఈ సమస్య నాకు ఎంతో ఆరాధ్యం అయింది. ఆంధ్ర రచనల్లోని పద్య సంభాషణ ఘట్టాలు పాఠం చెయ్యడం, పద్యరూపంలో ఉండగల భావాల్ని గుర్తించి, మన్నించి, మెచ్చి, ధరించి, అవసరం చొప్పున వాటి సహజగమనంతో వాటిని పఠించి సంఘానందం జనింపచెయ్యడం, మొదలైన మేళ్ళు నాకు ఇందువల్లే కలిగాయి.
ఈ గ్రంథంయొక్క చదువర్లు నాఅభిప్రాయం స్పష్టంగా గ్రహించుకోగలగడానికి వీలైనంత విశదంగా రాయడానికి నేను యత్నించాను. 'మానవుల అభిప్రాయాలలో వైవిధ్యమే సాధారణ లక్షణం ' గనక చదువర్లలోచాలమంది నా (సారాంశ) అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. కాని, వాళ్ళు నా అభిప్రాయంయొక్క త్రికరణ శుద్ధి గమనిస్తే చాలు నాకు. ఒక సంప్రదాయ ప్రవాహానికి నాది ఎదురీత అయినా, ఈ క్రింది భావాలవంటి వాటిలోని యాథార్థ్యం నేను విశ్వసించేవాణ్ణి అవడంచేత, ఈ గ్రంథం ప్రకటించడానికి సాహ సిస్తున్నాను: "ఎవడేనా ఒక కొత్త నియమం ప్రతిపాదించాడనుకోండి. ప్రజాభిప్రాయం విధిగా అందుకు ప్రతికూలమే. " (రీడ్)
"సత్యాన్వేషణ మానవుని ఉత్కృష్టతమ కృషి. దానిప్రకటన మానవుని విధాయకకృత్యం ” (స్టయేల్ సతి)
"యథార్థ తత్త్వం దేనినీ కొత్తగా సృష్టించదు, ఉన్నదానినే స్థాపించి వక్కాణిస్తుంది.” (కజిన్)
"ఒక సత్యం ఎవడైనా గ్రహించడానికి ఏడేళ్ళపాటు దీక్షతో కూడిన పరిశోధన అవసరం. కాని, దాన్ని తన సాటిమానవులు అవగాహన చేసుకోగలగడానికి అతడు అవలంబించవలిసిన విధానం అతడు నేర్చడానికి పధ్నాలుగేళ్ళు అవసరం. " (ప్లేటో)
"ఒక కవిరచన నేను చదివి, అందులోని అభిప్రాయం నాకు అనుగుణం అయితే, ఆకవి అద్భుతమైన రచన చేశాడంటాను. కాని, ఆ అభిప్రాయం నాకు ప్రతికూలించితే, ఆకవి తప్పుడు రచన చేశాడని వాక్రుచ్చుతాను. ” (స్విఫ్ట్)
“సత్యాన్వేషణ చేసేవాడికి ఒక దేశమంటూ ఉండకూడదు. " (వోల్టేర్)
ఈగ్రంథాన్ని వాత్సల్యంతో ఆశీర్వదించిన గురువరేణ్యులు శ్రీ కాశీ కృష్ణాచార్యులుగారికిన్నీ సౌహార్దంతో పరిచయ పరిచిన ఇష్టులు శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారికిన్నీ నమ స్కృతులు అర్పిస్తున్నాను.
శ్రద్ధతో దీనిని ముద్రించి ప్రకటనకి వేగిరపడిన శ్రీ సరస్వతీ పవర్ ప్రెస్సువారికి కృతజ్ఞత.
రాజమండ్రి
24-8-1957
భమిడిపాటి కామేశ్వరరావు
ఆశీస్సు
ओम्
श्री रामायनमः
ఆశీరాద్యుపరి. తమరు నాకు బంపిన 'ఆంధ్రనాటక పద్యపఠనం'
అను తమ హృద్యగద్య ప్రబంధము నాకంది చిరకాలమయినను, తదుపరి
తమరు వ్రాసిన కార్డు కొంతతక్కువ చిరకాలమున కందినదయినను,
మరల తామంపిన కార్డు అంది పై రెంటికంటె తక్కువ చిరకాల
మయినను, నాకందిన పై మూడును తటాకమృత్తిక శ్మశానమృత్తిక
మున్నగు నిర్వీర్యౌషధములవలె నాయీడునకు సంబంధించి, గల్గిన
శక్తిదౌర్బల్య జాడ్యమును మాన్పలేకపోయెను. కాని, మొన్న శనివా
రము నాటి తమ తంత్రీవార్త,
శ్లో॥ సాధ్యాసాధ్యరుజో నిహన్తి తరసా త్రైలోక్యచింతామణిః
అని, వర్ణింపఁబడిన త్రైలోక్య చింతామణివలె నాతత్వానికి
చక్కగా పనిచేసినది. వెంటనే సర్వవిధ జాడ్యములు నిర్మూలము
లాయెను. వైటాలిటీ ద్విగుణిత మాయెను. చురుకుఁదనము త్రిగుణిత
మాయెను. ఆక్షణము మొదలు నేటి పోస్టల్ టైమువఱకు, రోజునకు
8 గంటలచొప్పున 24 గంటలు మీ గ్రంథమును తదేకదృష్టితో చదివి,
యేదో యొక రేవుపట్టి అద్వైతి బ్రహ్మనై యీజాబు వ్రాయగల్గితిని.
ఆలస్యమును క్షమింపుఁడు. ఇన్నాళ్ళూ మీ గ్రంథమును చూడలేదను
కొనకండి. మాతాత భోజనం కాగానే వెలకిలపడుకొని ఒక చిటికెఁడు
వేయించిన కందిపప్పుగింజలు నములుచు పిమ్మట నిద్దుర పోయేవాడు. అటులనే, నేనును వేపడపు కందిగింజలకంటె కమ్మతనంగల మీగ్రంథ
మును రోజూ కొంచెం కొంచెం నమిలి నిద్దురపోయేవాడను. ఇది
మధ్యాహ్నభోజనానంతరమే. మఱి రాత్రికి లేదు. ఏక భుక్తమే.
అటుల కొంచెంకొంచెంగా మీవేపడపు, గద్యకావ్యాన్ని ఆస్వాదించు
టకు కారణములు, ఓపికలేమి ఒక జాడ్యము. ద్విజిహ్వ వేష్టిత చందన
తరువున్వలె విలక్షణ ధ్వన్యాచ్ఛాదిత మాధుర్యమును, మీగద్యము
నుండి త్వరత్వరగా గ్రహింపఁజాలు మదిలేమి, రెండవజాడ్యము.
ఈరెంటిలో రెండవదే మొదటిదీ, మొదటిదే రెండవదీ అనుకోండి
ఈరెండుజాడ్యములనూ మొన్నటి మీటెలిగ్రామ్ చింతామణి రూపు
మాపినది. మీకందిపప్పురుచి బాగా చవిగొన్నానను కొనుచున్నాను.
ఈవ్రాసిన లేఖ మీకు కర్ణారుంతుదము కాదనుకొనుచున్నాను. 13 ప్రక
రణములను మూడేసిమార్లు మీచింతామణి మహాత్మ్యమువలన చదువ
గలిగి సారగ్రాహినైతినిగదా ! యని లోలోన నవ్వుకొనుచున్నాను.
1939 సంవత్సరపు ఉపన్యాస సంగ్రహంలోని చరమాక్షరము వఱకూ
నాసిద్ధాంతమేగదరా ? అనుకొనుచున్నాను. మీరిపుడు నన్ను చూచి
నచో, ఈముసలివాడు ఇంతపని చేయగలుగుటకు నామందేకారణ
మయినది గనుక నేనెంత వైద్యుడనోగదా! అని మిమ్మును మీరే
కొనియాడుకొనక పోరనుకొనుచున్నాను. మీశక్తి మీకు తెలియ
కుండుటచే, మీరు పైవిధముగాననుకొనలేక పోయిననూ, నేను మాత్రం
మీకు, “టానిక్ వైద్యశిఖామణి, సర్వనాటక విశిష్టతా సంరక్షక
భిషగ్వర మూర్థన్య, ధన్వంతరి ప్రపితామహచక్రవర్తి సార్వభౌమ"
ఇత్యాది బిరుదులను (ఇది ఇన్‌ల్యాండు కవర్ కావటం చేత స్థలం
చాలక ఆపితినిగాని, లేకుంటే, ఇంకనూ నాలుగైదు ఫర్లాంగులపొడవు
గల బిరుదావళిని కూడ) ఈయక తప్పను. మీరు వానినన్నిటిని
గ్రహింపఁగ ననుగ్రహింపుడు. “ వేపడపు, పదమును గద్యమునకు తగిలించితిరే, ఇది సాధుప్రయోగమేనా,” అని మీకుగాని ఇతరులకు
గాని తోచవచ్చును. శ్లో॥ " ప్రాయేణ వైయాకరణాః పిశాచాః" అను
న్యాయప్రకారం, శ్రీ కీర్తిశేషులయిన జయంతి రామయ్యపంతులగా
రిచ్చిన ప్రయోగమే మనకాధారం. వారొకపుడు నాగద్యపద్యములకు,
“వేపడపుపద్యాలు, వేపడపుటుపన్యాసాలూ కాశీ కృష్ణాచార్యులగారి
సొమ్మూ” అని ప్రయోగించారు.
ఈగ్రంథోత్పత్తికి పూర్వమే మీకూ, శ్రీ కవితాకన్యకు - సంబంధబాంధవ్యాలేర్పడక పూర్వమే, కోర్టుషిప్‌డేస్‌లోనే, సుమారు 40 ఏండ్ల క్రిందనే, ఈ గ్రంథ మావిర్భవించుటకు శ్రీ కూల్డ్రేదొర గారు మూలకారణము, అని గ్రహించితిని. ప్రపంచావసరమగు నిట్టి యపూర్వ గ్రంథమునకు నిమిత్త కారణమగు పై దొరగారు నా కగ పడితే యెన్నో ఆశీస్సుమములను దొరగారిక్రాపింగు హెడ్డుమీద గుప్పించి యుందును. నెత్తిపై నిల్వకపోతే గోదులోముంచి మఱీ గుప్పియుండేవాణ్ణి ! నేను 33 సంవత్సరముల క్రిందటినాటి సభలో నధ్యక్షునిగా నున్న పిమ్మట ( యెక్కడనో జ్ఞప్తిలేదు) ఒకపుడు మీనోట సుమారు 500 వివిధ పద్యపాదములను వెనుకంజ వేయక మీరు నాకు చదివి వినిపించినారు. పదస్వరసత, ఝుటితి కవిభావ స్ఫూర్తి, కవితలోని మెఱుగులు, బహిరంతస్ఫురద్రసములు అన్నియు వెంటనే నాకు తెలిసినవి. పద్యవైశిష్ట్యముచూపు పద్ధతి తోపించి తిరి. పద్యమునకు నిరక్షర కుక్షియగు రాగిగాడు తగిలించిన రాగము, పాయసమునకు కెసనాయిలు తగిలించుట వంటిది. అక్షర ముఖుడగు రాగిగాడు కొంచెం రాగం అంటిం పద్యం చదవినను (అక్షరాస్యుడుగాన) పద్యమును చంపివేయడు. 'ఎవరని నిర్ణయించే దిరా,' - ఇది కీర్తన - రాగ, తాళ, పల్లవి, అనుపల్లవి: ఇత్యాది నియమములు కలది. దీనిని, ఎవరు - అని - నిర్ణయించేదిరా, అని చదివినచో ఆకీర్తన ప్రాణములు కోలుపోయినట్లె. 'కుందనమువంటి మేను” ఇది పద్యము. దీనిని, కుంంం, ధనము, వంంం, టిఇఇమే, నుఉఉఊ ... అని కీలుకీలూ మేకులు రివెట్‌చేసి సడిపితిమా ? నడు పుట యెక్కడిదీ! చచ్చినకుక్కను త్రాడుగట్టి కుక్కలరామాయ యీడ్చుకపోయినట్లీడ్చుకోపోవుటే. కావున, నాటకములు, నాట్యములు, పద్యములు, గద్యములు, కీర్తనలు, మున్నగు ప్రత్యేక విశిష్టతగల పదార్థములను, వానివాని ప్రత్యేకవిశిష్టతను సాంకర్యములేకుండా శుద్ధముగా వినుచుటగాని చూపుటగాని సరసవిద్వచ్ఛిరోమణులకు ఆవశ్యకము. అట్టివారికే, వినిగాని చూచిగాని యానందించి కవి, వాగ్గేయకార నట ప్రభృతుల ప్రతిభాస్వరూపము నుగ్గడించుట యావ శ్యకము. ఇతరులకు ఇట్టి యావశ్యకములను విధింపను. శ్లో॥ అప శబ్దభయంనాస్తి అప్పళాచార్యసన్నిధౌ - అన్నట్టు, ఎటులయిననూ నాకు సంతసమే.
నేను ఆశీస్సును కోరితే ఈచేటభారత మేమిటండోయి - అని, మీరు నన్నడుగుదురేమో ! అడుగవలదు - అభిప్రాయ, లేక,- ఆశీః, దాత, గొప్పవాడయి నపుడే ఆగ్రంధమునకు తత్కవికిగూడ గౌరవము. బిరుదావళివిరాజమానుడిచ్చిన యే పిచ్చివ్రాతకయి ననూ విలువకలదు. తెలిసిగాని తెలియకగాని బిరుదముల నిచ్చు టయు తెలిసీ తెలియని వారు పుచ్చుకొనుటయు ఇపు డాచారములలో నున్నవి. నావిషయములో నొక మైలు పొడవుగల బిరుదావళి కలదు. కీర్తిశేషులు సరస కవితావధానాది శకకర్తలైన తిరుపతి వేంకటకవులు 'అవధాని శిరోమణి కృష్ణయాగ్రణీ' గీ॥ 'శిష్టుకృష్ణ మూర్తిశేఖరునకు నిన్నిశక్తులున్నవంచు జగ మెఱుంగు నిపుడు కాశి కృష్ణుడేదక్క నిన్నిట నేర్పుగల్గువాడు నిండుసున్న' - అని పల్కిరి. పిమ్మట విద్యావారి ధీత్యాదు లుత్తరదేశమున నాతలనంటినవి. ఈబిరు దులు వడగళ్ళవాన, గాలిదుమారములవలె మనుజుని విడవు. అటులే నా యాశీస్సులును. ఇవి మీకును గ్రంథమునకునూ గౌరవప్రదమని నమ్ముడు.
అసలు ఈబిరుదములన్నియు నాకిష్టములేదు. వానికి తగనని నా విన్నపము. కూలంకషంగా నాస్వరూపము నెఱిగి ఈయఁబడినవి గావు. నిజమయిన నాబిరుదము నాకేతెలియును. దానిని నాకు నేనే యిచ్చికొనవలె. పుచ్చుకొనవలె. 'ఆద్వైతి బ్రహ్మ,' లేక, 'అద్వయవాది బ్రహ్మ' - ఈ రెండు బిరుదులకు నే నర్హుడను. మొద టిది నిర్గుణ - నిర్విశేష - నిర్ధర్మిక బ్రహ్మ. రెండవది (శూన్యం). లోకరీత్యా, శుద్ధ బ్రహ్మంతవాడనగు నేనిచ్చిన అభిప్రాయము గనుక, మీకును మీగ్రంథగౌరవమునకును లోటులేదు. టెలిగ్రామ్ ఖర్చుకు ఒకటో రెండో మీరుపెట్టిన డబ్బుకు దండుగలేదు. భారతీయులకు చతుష్షష్టి కళలున్నవని కింవదన్తి. కాని మ॥ రా॥ ఆచంట లక్ష్మీపతి గారి 'ఆయుర్వేద శిక్ష' అను గ్రంథముననో మఱెక్కడనో, అయి దాఱు రకాల చతుష్షష్టి కళలు మనకున్నట్లుగా నేను చూచాను. గామ్ర్య భాషలో అందముగా గద్య పద్యాదులు వ్రాయుట ఒకకళ. అదేమిటిదేమిటి చౌర్యమొకకళ. తుదకు పొడుముకూడా ఒక కళయే. దానిని తయారుచేయుట - పొగాకు తత్త్వజ్ఞానం - పొడుం పీల్చుట - ప్రక్కనున్నవారు అసహ్యపడకుండా - నస్యసారపు చిన్న తుంపురై నా, యెటూచెదరకుండా కరవస్త్రంలోగాని, జేబురుమాల్లో గాని మాయంచేయుట - ముక్కుబెజ్జములను రహస్యంగా శుద్ధిచేసి తిరుచూర్ణముల జంటవలె నుంచికొని శ్రావ్యమగు అనునాసిక ధ్వనితో సరససల్లాపములతో మాట్లాడుచు నెదుటివారిని ఆనంద సముద్రంలో నోలలాడించుట - మున్నగు బహువిశేషములతోకూడిన ప్రత్యేక విశిష్టకళ, పొడుంపీల్చుకళ - అంటారు. కాని యీమీగ్రంధమునకు - 'ఆంధ్రనాటక పద్యపఠన శాస్త్రము' అనుపేరు సముచితమని నాఆశ యము. శాస్త్రమనగా తత్వజ్ఞాన జనకమని చెప్పుదురు. నాటకపద్య పఠన తత్త్వజ్ఞానము దీనిద్వారా కలుగ గలదు. మీరడిగినది ఆశీస్సు. నేనిచ్చినది కొండవీటి చేదుత్రాడు. దీనిని ఆశీస్సనుకుంటారో, అభి ప్రాయమనుకుంటారో, విమర్శ అనుకుంటారో, అసంబద్ధప్రలాపసంధి అనుకుంటారో, ఏదీకాదనుకుంటారో, ఆవికల్పాలన్నీ నావలన కల్గిన వని వానిని నాపేరునఁదగిలించి, యిందులోనున్న ఒక్కఅక్షరమేని, విడువక అచ్చు వేయించి మఱల నొక కాపీ నాకు పంపండి. ఇదివఱకే యిస్తినిగదా అనుకుంటే ఖరీదుపెట్టి వి.పి. గా పంపండి. వి. పి. మీకే తిర్గివస్తే నేనూళ్లో లేననుకొండి. ఇట్టిగ్రంధముల నింకను వ్రాయండి. ఇదియే మీరుకోరిన నా ఆశీస్సు,
అగ్రహారము
గుంటూరు
K. K.
1-8-57
కాశీ కృష్ణాచార్య
పరిచయం
శ్రీ భమిడిపాటి కామేశ్వరావుగారు ఆవిష్కరించిన గ్రంథ
సర్వస్వం ఒకయెత్తూ, ఆయన 'త్యాగరాజు ఆత్మవిచారం' ఒకటీ
ఒకయెత్తూ అని ఒకసందర్భంలో వ్రాసుకున్నాను. దానికి అపవాదంగా
ఒక మాట : 'ఆత్మవిచారం' తో సహా వారి సారస్వత మంతా ఒక
యెత్తూ, ఇప్పుడీ ' ఆంధ్రనాటక పద్యపఠనం' ఒకటీ ఒకయెత్తూ అని
చెప్పగలుగుతున్నాను.
కామేశ్వరరావుగారు దరిదాపు నాలుగు దశాబ్దాలుగా ఊహించుకునే తలపులకూ, సాధించుకున్న ఒక వినూత్న వ్యవసాయా నికీ ఫలరూపంగా నిలబడే గ్రంథం 'ఆంధ్రనాటకపద్యపఠనం.'
‘కూల్డ్రే’ దొరగారు వేసిన ఒక మాట పునాదిమీద కామేశ్వర రావుగారు అపూర్వశిల్పశోభితంగా నిర్మించిన అభినవసౌధం ఈగ్రంథం.
ఆంధ్రనాటకపద్యాలు సరాగంగా చదవడంవల్ల చుట్టుకునే అనర్ధాలూ, విషయమీమాంస, వాదప్రతివాదనలు, ఆక్షేపణలు, సమాధానాలు ఈ గ్రంథంలో శాస్త్రీయమైన క్రమపద్ధతిలో నడిపిం చారు. పద్యపఠనానికి సంబంధించిన ఒక నవీన 'శాస్త్రం' గా సంత రించడంలో భమిడిపాటివారి ప్రతిభావైభవం అనుపదమూ ఈగ్రం థంలో పరిమళించడం పాఠకుడు గుర్తిస్తాడు. “అనభ్యాసేవిషంశాస్త్రం" అన్నారు పెద్దలు.
'కవిత్వము - పద్యము ' ఈ రెండు శబ్దార్థాలకు ఉన్న సుసూక్ష్మమైన భేదం, ' రాగం - నాదం ' వీనికి సంబంధించిన తత్త్వ సంవాదం, పాటకూ, పఠనానికీ ఉండే ప్రత్యక్ష విభిన్న తా సామా న్యులకే కాదు, మాన్యు లనుకొనే వారికికూడా విస్పష్టంగా తెలుసు ననడం క్వాచిత్కం. ఈ రహస్యాలు ఎంతో లోతుగా పరిశీలించి భావించి సువిశదం చేయడంలో కామేశ్వరరావుగారు సంగీత సాహి త్యోభయ కళామిత్రులు అవుతున్నారు.
హృదయానుభవమూ, ఆత్మానుభావమూ కలిగి, ఒక వాదంపట్ల తమకుఉన్న ప్రత్యయం వాడిగా వేడిగా ప్రదర్శించడం ఒకటీ - శాస్త్ర క్లిష్టమైన విషయం కళ్ళాపుష్టంచేసి హాసమధురంగా పఠితకుఅందించడం రెండు - ఇవి కామేశ్వరరావుగారి రచనలో నేను గుర్తించుకున్న విషయాలు.
ఇటువంటి సగుణరచనలో తెలుగులోకానికి అచుంబితమూ, అపూర్వమూ, అవశ్యాచరణీయమూ అయిన పద్యపఠనవిషయం ఇంతగా పరిశోధనచేసి వెల్లడించినవారు కామేశ్వరరావుగారుతప్ప మరి ఎవ్వరూ నేను ఎరిగినవారులేరు. ఎంతగా పరిశోధన చేసిన వారూ లేరనడం సాహసం కాదు.
రెండు మాటలతో హృదయం వెల్లడిస్తాను.
కవిత్వముకాని నీరసపద్యరచన ఈ గ్రంథవాదం ముందు మందుకైనా నిలబడలేదు. యథార్థమైన కవిత్వ తత్త్వానికి ఈగ్రంథం కర్పూర నీరాజనం పడుతున్నది. భాషావివాదం విడిచి విశ్వవిద్యాల యాలు "ఆంధ్రనాటక పద్యపఠనం " కళార్థిబృందంచేత చదివింప చేయడం తరతరాలకు మేలుచేయడం.
రాజమహేంద్రవరము
హేమలంబ: శ్రావణి -
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి
విషయములు
1 |
15 |
28 |
37 |
45 |
50 |
52 |
54 |
64 |
85 |
120 |
129 |
132 |
148 |