అశోకుడు/పదునేనవ ప్రకరణము
పదునేనవ ప్రకరణము
మఱియు ననేక పుణ్య చరిత్రములను వినుచుఁ గ్రమముగా బౌద్ధపరివ్రాజకుల యోగ బలమాహాత్మ హాత్మ్యములంగూడ స్వయముగఁజూచి తెలిసికొనుచుండెను.
అశోకుని రాజ్యలోభకారణమున రాజ్యరక్షణమున కై యనేకులగు నపరాధులును, నిరపరాధులును, శత్రులును, మిత్రులును, తనవారును, బెజువారునుగూడఁ గఱకు కత్తులు పాలై పోయురి. ర క్తప్రవాహములతో నాలుగుసంవత్సరము లీవిధముగఁ గడచిపోయినవి.
పదునేనవ ప్రకరణము
అభిషేకము
52
అ శో కుఁ డు
కాతని కాపాటలీపుత్రమున - ఆర క్తరంజిత రాజమార్గమునఁ బట్టాభి షేక మహోత్సవము గావింపవలయునని యాలోచనతో చెను. "రాజధర్మము — రాజచరిత్రమైనది !!!
సర్వసంతాపసంహారకం బగుసమయము. ఈ నాలుగేండ్లలోనను రాజాంతఃపురమునందలి యనేకులు తమ శోక తాపములను మరచిపోయెయుండిరి. నగరమున శాంతి నెల కొల్పఁబడినది. నాగరకులు మరల సుఖ సంతోషములచే నుల్లసితహృదయులై సంచరించుచు రాజపథశోభాపరంపరల వర్ధిల్లఁ జేయుచుండిరి. శాంతి ప్రియులును, సుఖప్రియులు నగునగర జనుల హృదయములయందు మరల రణ భేరీనినాదము చెవులఁబడుట తటస్థించు నేమో యనుసం దేహ మైన నుదయించుట లేదు. ఇప్పుడు సంధ్యాసమీరణములచే నగర తోరణ స్తంభములయందలి విజయపతాకలు సవిలాసముగ సంచలితము లగు చుండెను. విజయ భేరీ మధుర నినాదములును, బూర్వవాహిని యగు జాహ్నవీతరంగకలకల నినాదంబులును గలసి మెలసి యపూర్వసంగీతస్వనంబును బ్రదర్శించుచుండెను. సంధ్యా సమయదీపమాలికలును, దిగంత వ్యాప్తంబు లగువిజయ భేరీనినాదములును, కలకలని నాదినియు, మందగామినియు నగు జాహ్నవీతరంగిణియందలి జలశీకరంబులచే నభిషి క్తంబులగు వాతపోతంబులును వారిత్వక్చక్షుశ్రోత్రంబుల స్పృశించుచు వారి పూర్వపు సంగతుల నన్నిటిని మఱపించుచుండెను. రాజాంతః పురమునందలి పతిపుత్రవియోగ దుఃఖితలగు పదునేనవ ప్రకరణము
53
కొందఱు రాజమహిషులును నగరమునందలి ప్రతిహింసాపరాయణులును బలవంతులు నగుకొందఱుజనులునుమాత్రము గాక తక్కినజనసామాన్యమంతయు బిందుసారునిమాటయు, యువరాజగుసుషీముఁ డు మొదలగునితర భ్రాతృవరులహత్యలును, రాధాగుప్తుని కౌటిల్య చరిత్రమునుగూడ సంపూర్ణముగ మఱచిపోయిరి. సాధారణజనులు తమతమ వ్యాపారములు క్రమముగ జరుగుటయే చూచుకొనువారు కావున వారికీయాలోచనయే లేదు. వారి సదుపాయములకు లోపము లేకుండ నున్నప్పుడే రాజ్యము నేరాజు పాలించిన వారి కేమి? న్యాయాన్యాయ విచారణ చర్చయు బ్రతిహింసాచరణాలోచనయు జాలకాలము వఱకు వారి హృదయములయందు మెఱయుచుయుండెను; కాని నాలుగు సంవత్సరములు భయంకరముగ శోణిత వాహినులు ప్రవహించినతరువాత వారికి మరలా మంచి కాలము వచ్చినది. ఇప్పు డా రాజ్యమునందలి ప్రజ లందఱును ముక్తకంఠులై కౌముదీపులకితంబగు నారాత్రియందు
విమలచంద్రికానగరమునందుఁడి యుచ్చైస్వరమున నీవిధముగ సాధువాదము లంగావించు చుండిరి - "జయమగుఁగాక మహారా జశోకునకు జయమగుఁ గాక ! " రాజమందిరము, నందును, సమున్నత ప్రాసాదములయందును, ప్రకోష్ఠములు యందును, మందిరముల యందును, మఠములయందునుగూడ. నావిజయనాదము లే ప్రతిధ్వనించు చుండెను"——" జయమగుఁగాక ! మహారాజగునశోకునకు జయమగుఁగాక !"—— 54
అ శో కుఁ డు
అది జ్యేష్ఠమాసము; శుక్ల పక్షము; పంచమితిధి - సార్వ భౌముఁడగున శోకునిపట్టాభిషేక క్రియలు సర్వము:ను సంపన్నంబు లయ్యెను.
పదునాఱవ ప్రకరణము
దిగ్విజయము.
సార్వభౌముఁడగు నశోకుని ప్ర తాపము దశదిశాపరి వ్యాప్తమయ్యెను. సమస్తసామంత మహీపాలురు నాతని సార్వభౌమత్వము నంగీకరించిరి. అతని బాహుబలపరాక్రమము లందఱకును బరిచితము లయ్యెను. ఆతని చతురంగబలములు దినదిన ప్రవర్ధమానము లగుచుండెను. వారు కేవలము రాజ్యము శాంతిరక్షణము గావించుట చేతనే తృప్తి వహించియుండుట లేదు. పశుబలము ధర్మబలము చే నియమితమును సంయతమును గాకు న్నచో నది క్రమముగ ధర్మబలమును మించి యతి క్రూరముగఁ బరిణమింపఁగలదు. సేనా నాయకు లాసంగతిని బాగుగ గ్రహించి యడిరి. మంత్రిగణముకూడ గ్రహించియుండెను. ఇప్పటికి నాలుగుసంవత్సరములనుండి మహారాజు యుద్ధవిద్రోహములలో నే మునింగియుండెను. శాంతిని వహించి యెంతయో కాలము కాలేదు. ఇప్పుడు మరల దిగ్విజయార్థమై యుద్ధయాత్ర చేయవలయు ననిన సైనికులకుఁ గష్టముగ