అశోకుడు/పదునాఱవ ప్రకరణము

54

అ శో కుఁ డు

అది జ్యేష్ఠమాసము; శుక్ల పక్షము; పంచమితిధి - సార్వ భౌముఁడగున శోకునిపట్టాభిషేక క్రియలు సర్వము:ను సంపన్నంబు లయ్యెను.


పదునాఱవ ప్రకరణము

దిగ్విజయము.

సార్వభౌముఁడగు నశోకుని ప్ర తాపము దశదిశాపరి వ్యాప్తమయ్యెను. సమస్తసామంత మహీపాలురు నాతని సార్వభౌమత్వము నంగీకరించిరి. అతని బాహుబలపరాక్రమము

లందఱకును బరిచితము లయ్యెను. ఆతని చతురంగబలములు దినదిన ప్రవర్ధమానము లగుచుండెను. వారు కేవలము రాజ్యము శాంతిరక్షణము గావించుట చేతనే తృప్తి వహించియుండుట లేదు. పశుబలము ధర్మబలము చే నియమితమును సంయతమును గాకు న్నచో నది క్రమముగ ధర్మబలమును మించి యతి క్రూరముగఁ బరిణమింపఁగలదు. సేనా నాయకు లాసంగతిని బాగుగ గ్రహించి యడిరి. మంత్రిగణముకూడ గ్రహించియుండెను. ఇప్పటికి నాలుగుసంవత్సరములనుండి మహారాజు యుద్ధవిద్రోహములలో నే మునింగియుండెను. శాంతిని వహించి యెంతయో కాలము కాలేదు. ఇప్పుడు మరల దిగ్విజయార్థమై యుద్ధయాత్ర చేయవలయు ననిన సైనికులకుఁ గష్టముగ

పదునాఱవ ప్రకరణము

55

నుండును. ఈసంగతులన్నియు నాలోచించుకొని వారు మహారాజు చెప్పినట్లు చేయవలయునని నిశ్చయించుకొనిరి. వా రెల్ల సంగతులును విస్పష్టముగ నశోక సార్వభౌమునకుఁ దెలియఁజేసిరి. అశోకుఁడు దిగ్విజయయాత్ర చేయుటకు నిశ్చయించెను. కొలఁది కాలములోనే యందులకుఁ గావలసిన ప్రయత్నములన్నియు సంపూర్ణములయ్యెను.

మగధ దేశాధిపతియగు నశోకమహారాజప్పుడు కళింగదేశ విజయమునకై విశేష సేనాపరివృతుఁడై యుద్ధయాత్ర చేసెను. వర్తమాన కాలమున నుత్కళము (ఉరియా) అను పేరుగల మదరాసు రాజధానియందలి కొంత భాగమప్పుడు కళింగదేశముగ వ్యవహరింపఁబడుచుండెను. కళింగ దేశము నీల సముద్ర సేవిత మై యుండెను. ఆ దేశ మధ్యమునుండి వై తరణీ తరంగిణీ ప్రవహించుచుండెను. నీలాచలము మొదలగు చిన్న పెద్ద పర్వతములవరుస లీ దేశమున వ్యాపించి విరాజమానము లగుచుండెను. అప్పటిసముద్రము, నదులు, పర్వతపంక్తులు నిప్ప

టికి నా దేశమును సురక్షితముగఁ జేసియుంచుట చే నా దేశము నాక్రమించుకొనుట శత్రువులకు దుస్సాధ్యముగ నుండెను. మఱియొక విశేషము —— ఖర స్రోతానదీ యా దేశము కడవఱకును వ్యాపించియుండుట చే శత్రువులకు, దుష్ప్రాప్యమై యుండెను. రఘువంశ కావ్యమునందలి రఘు మహా రాజు దిగ్విజయభాగమును జదివినచో మన మీ విషయములన్నియు సప్రమాణముగ గ్రహింపఁగలుగుదుము. అయోధ్యానాయకు

56

అ శో కుఁ డు

డగు రఘుమహారాజు వంగ దేశము నతిక్రమించి మదమాతంగములతో సేతువు నిర్మించి కపిశానదిని ససైన్యముగా దాఁటియున్నాడు.

" బలయుతుఁడు రఘువు నౌకా
బలసంపన్నులగు వంగ | పతుల గెలిచి ని
ర్మల గంగా స్రోతంబుల
నలవున నాటిం చ ఘనజ | య స్తంభములన్ ."

" ఏనుగుల సేతువులఁ గపి
శానదిఁ దరియించి రఘుఁడు | చనియెఁ గళింగ
స్థానమునకు జయభట సం
తానముతో నుత్కళప్ర | దర్శిత పథుఁడై . "

రఘుమహా రాజు దిగ్విజయయాత్ర చేసిన మార్గము ననుసరించియే మగధాధిపుఁ డగు నశోకమహారాజు కూడ విపుల సైన్యముతోఁ గళింగమునకు గమనోద్యతుఁ డయ్యెను.

అప్పటికళింగ ప్రభుఁడు సామాన్యముగ నశోకునకు లోఁబడ లేదు. ఆ కారణము చే నిరువంకల సేనలకును మహారణము జరిగినది. కరితురంగ పదాదిగణంబుల పదాఘాతములచేఁ బ్రభవించినరజఃపటల మాకాశము గప్పివై చెను. రథ నేమినిస్వనఁబులును, గజబృంహితధ్వనులును, హయ హేషలును, వివిధాయుధఝణఝణారావంబులును గలసి సాగర

పదునాఱవ ప్రకరణము

57

తరంగ నిర్ఘోషమును స్తబ్ధీ భూతముగఁ జేసి వైచెను. రణధరణీ తలమున శోణిత వాహినులు ప్రవహించెను. ఈ విధముగఁ కొన్ని దినములు గడచిన పిమ్మట యుద్ధము ముగిసెను. ఆవిశాల జన పద మంతయు నశోకునియధీన మయ్యెను. కాని దేశము జనశూన్యమైపోయెను. అప్పుడశోకుఁడు రథారూఢూఁడై రణ క్షేత్రమును బరీక్షించెను. ఆభీభత్సదర్శనమున నాతని హృదయ మత్యంత వ్యాకులిత మయ్యెను. ఆ కారణము చే విజయలక్ష్మి యాతనికుల్లాసముక లిగింపఁజాలక పోయెను ఇంతియ కాదు— ఆతనికించుకంతయూరట యైనగల్పింప లేకపోయెను. తన రాజ్యలోభముచే ననేక జనసంఘములు నాశనము లైపోయెఁగదా యని యప్పుడాతఁడను కొనియెను. అందుచే నాతడు మర్మ భేదనంబగువిచారము ననుభవించెను. కాని, యాతఁడాయాంతరికపరి వేదనము నెవ్వరియొద్దను బ్రకటించియుండ లేదు. తదనంతర మాయశోకుఁడు కళింగరాజ్య సింహాసనమునందా ప్రభువు నే మరల బ్రతిష్ఠించి దేశపరిపాలనమున కనుకూలవ్యవస్థలం గావించి స్వదేశమునకు మరలెను . కోలది కాలమున కే యశోకుఁడు రాజధానింబ్రవేశిం చెను. అప్పుడు రాజధాని నగరమున యథావిధిగా విజయోత్సవములు గావింప బడి యెను.