అశోకుడు/పదునాలుగవ ప్రకరణము

పదునాలుగవ ప్రకరణము

47

చుండిరి! ఒక్క టేశరీరముగ భావించుకొనుచుండిరి. ఇఁకనట్టి రాజ్యమునకుఁ గొదవ యేమున్నది ? అశోకున కప్పటికిని భ్రాతృసంబంధశత్రుత్వము నిశ్శేషము కాలేదు. అశోకుఁడు కేవలము తదేక దృష్టితో విద్రోహులగుసోదరులను సపరివారముగ నశింపఁ జేయుటకై ప్రయత్నించుచు నే యుండెను. ఇట్టికల్లోలములచే నశోకునకుఁ బితృసింహాసనము లభించినను బట్టాభి షేకము జరుగుట కాలస్యము కావలసివచ్చెను——


పదునాలుగవ ప్రకరణము


రక్తప్రవాహము

అశోకునకు సర్వరాజ్యమును లభియించినది. ఆతని ముఖ్యశత్రువులు నిహతులై పోయిన సంగతియు సత్యమే. కాని యాతనికంతమాత్రమున నిశ్చింతుఁడై యుండుట కవకాశము కలుగ లేదు. పూర్వమునుండియు రాజ్యమునందలి ప్రజలును రాజోద్యోగులును రెండుపక్ష ములుగ నేర్పడియుండిరి. కొందఱశోకునిపకక్ష మువారుగను, మణికొందఱు సుషీమునిపక్షము వారుగనునుండిరి. అశోకునిపక్షమువారు ప్రజ లేయయ్యును గొలఁదిమందిమాత్ర మేయుండిరి. ప్రజాసామాన్యమునఁ జాలమంది. సుషీనునిపక్షము వారే యైయుండిరి. మానవలోక

48

అ శో కుఁ డు

మెంతవికృతముగ మారిపోవుట తటస్థించినను, ధర్మాధర్మ జ్ఞానము' న్యాయాన్యాయ విచారణశక్తి, పాపనిందనము, పుణ్యకాంక్ష మొదలగు సద్గుణము లన్నియు నొక్క సారిగ నాశనము లై పోవఁజాలవు. సుషీముఁడు యువ రాజుగ నుండెను-సత్యధర్మానుసారముగ నాతఁడు పితృసింహాసనమున కుత్తరాధి కారియై యుండెను. బాల్యచాపల్యము చే నై న లోపము లాతనికడ నేవియైననుండిన నుండుఁగాక ! సమయానుకూలముగ వానినన్నిటిని నాతఁడు సవరించుకొనఁ జాలక పోఁడు.”అని యీవిధముగ భావించుకొనుచుఁ బ్రజలలోనను, మంత్రులలో నను జాల భాగమువఱకును సుషీమునియెడలనే యధిక విశ్వాసము కలిగెను. వారి కశోకుఁడు రాజగుట సంతోషకరముగ లేదు. ఇంతియ కాక సర్వవిధముల రాజ్యార్హుఁ డగు సుషీ ముఁడు కపటమార్గమున నన్యాయముగఁ జంపఁబడి పోయెను. అందువలనఁ బ్రజలలోఁ జాలమందికి సుషీముని యెడల జాలి కలిగెను. వారాతనిలోపముల నన్నిటిని మఱచి పోయిరి. అందఱు నాతని కొఱకే తమవిచారమును సూచించుచుండిరి—పతి పుత్ర విహీనలును, మహామహిషీమణులు నగునశోకుని సవతితల్లుల యెడలఁగూడఁ బ్రజాభిప్రాయము సానురూపముగ నుండెను. ప్రజలందఱును వారికష్టములకు విచారించుచుండిరి. ఇట్టి కారణములచే న నేకు లశోకునకు బహిరంగ శత్రువులై పోయిరి. ఇంకను మిగిలియున్న యశో

శుని వై మాత్రేయ సోదరులు కూడ నాతని యెడల విరుద్ధాచరణముల నాచరించుచుండిరి,

పదునాలుగవ ప్రకరణము

49

ఈ సకలకారణములవనను నశోకున కొక్కప్పుడును నెమ్మదియనుమాట లేదయ్యెను. అప్పు డాతఁ డేవిధముచే నైనను శత్రుసంహారము చేయవలయు నని కృత సంకల్పుఁడయ్యెను. ఆతఁడ నేకు లగుగూఢచారులను నియమించి యుంచెను; వారందఱును జండి కాలయములు, దేవాగారములు, సైన్యావాసములు, పుణ్య క్షేత్రములు మొదలగు నానాప్రదేశముల నానా వేషధారులై సంచరించుచు నానా సమాచారములను సంగ్రహించుకొని వచ్చి యశోకు నకు నివేదించుచుండిరి. ఎవ్వ రెచ్చట నేవిధముగ రాజ ద్రోహ కార్యములం చేయవలయు నని యాలో చించుకొనుచుండిరో యంతయు నశోకున కతిని గూఢముగఁ దెలిసిపోవుచుండెను. క్రమముగ నెందఱో రాజద్రోహులు రాజ్యమునందు నిండి యున్నట్లు తెలియవ చ్చెను. రాజపరివారమునందుఁగూడ ననే కులనామము లావిద్రోహ నామసహితము లై వినఁ బడు చుండెను. ఆ కాలమునందు రాజద్రోహాపరాధులకు మరణ దండనముకంటె మఱియొక శిక్ష యేదియును లేదు. రాజద్రోహుల సంఖ్య వృద్ధియగుచున్న కొలందిని నర హత్యల సంఖ్యకూడఁ బ్రవర్ధిల్ల నారంభించెను. క్రమముగ నీనరహత్యల కొక విశాలావాసము కూడ నిర్మింపఁబడియెను. ఆ గృహమునకు నరకమని పేరు పెట్టఁబడియెను. పొరపాటు

ననో, కాక గూఢచారులయసత్య సమాచారమూలము ననో గాని యొకనాఁ డొక బౌద్ధసన్యాసి యాహ త్యాగారమునఁ

50

అ శో కుఁ డు

బ్రవేశ పెట్టఁబడి యెను. చండగిరికుఁ డను సాలెవాఁడొకఁడు రాజద్రోహులశిరంబుల ఖండించు కార్యము నందునియుక్తుఁడై యుండెను. ఆతఁడప్పుడందఱవలెనే యాసన్యాసిని గూడ నఱకుటకు సన్నద్ధుఁ డయ్యెను: కాని యా సాధు వేమేమి యో చెప్పుటవలన నాచండగిరికుఁ డాతనికిఁ గొన్ని దినములు గడు విచ్చెను. ఈ గడువు లోపలనే యా భౌద్ధపరివ్రాజకు ని యపార యోగ బల మాహాత్మ్యము ప్రకటిత మయ్యెను. ఆసంగతి యథాసమయమున మహా రాజగున శోకుని చెవులఁ బడియెను. తోడ నే యశోకుఁడు స్వయముగ నచ్చటికిఁ బోయి యాసాధు శేఖరుఁడు నిరపరాధి యని సప్రమాణముగ గ్రహించుటయే కాక యాతఁడు మహాయోగి యనికూడఁ దెలిసికొనియెను. అప్పు డశోకుఁ డాతనికి నమస్కరించి తనయపరాధమును క్షమింపఁ ప్రార్థించి యామహాత్ముని విడుదల చేయించెను, అప్పు డానరఘాతుకు డగుచండగిరికుఁడు తొనదివఱకుఁ జేసిన మహోద్ధత కార్యములం గూర్చి యశోకునకు విన్నవించెను. నిందనీయంబగు నీవ్యాపార మంతయు నప్పు డశోకునకు రాక్షసకృత్యముగ నగ పడి యెను. తత్క్షణమె యశోకుఁడాహత్యామందిరము భస్మీభూతముగఁ జేయవలయు నని యాజ్ఞాపించెను. అది మొదలుగ రాజద్రోహులకు మరణ దండనము తప్పిపోయినది; అట్టివారిని వారి యప రాధములకుఁ దగురీతిని దండించుట కారంభమయ్యెను.

అదియే కారణముగా నంతటినుండి నవీనసార్వభౌముఁ డగునశోకుఁడు బౌద్ధయతులవలన బౌద్ధధర్మములను

పదునేనవ ప్రకరణము

మఱియు ననేక పుణ్య చరిత్రములను వినుచుఁ గ్రమముగా బౌద్ధపరివ్రాజకుల యోగ బలమాహాత్మ హాత్మ్యములంగూడ స్వయముగఁజూచి తెలిసికొనుచుండెను.

అశోకుని రాజ్యలోభకారణమున రాజ్యరక్షణమున కై యనేకులగు నపరాధులును, నిరపరాధులును, శత్రులును, మిత్రులును, తనవారును, బెజువారునుగూడఁ గఱకు కత్తులు పాలై పోయురి. ర క్తప్రవాహములతో నాలుగుసంవత్సరము లీవిధముగఁ గడచిపోయినవి.


పదునేనవ ప్రకరణము


అభిషేకము

మహారా జగుబిందుసారుఁడు లోకాంతరగతుఁడై యిప్పటికి నాలు గేం డ్లయ్యెను. రాజ్యలోభపరవశుఁ డై యున్న యశోకునకుఁ బితృమరణముంగూర్చి దుఃఖించుట కెప్పుడు నించుకంత యవకాశము దొరికినదిగాదు. ఆతఁడు తన రాజ్యరక్షణమున కై సోదరులనైనఁ జంపించుట కెంత మాత్రము ను శంకించియుండ లేదు. ఎందఱో భ్రాతలను, మఱియు నెందఱో పురజనులనుగూడ సంహరించి యాతడిప్పుడు నిరపాయుఁడై నిష్కంటకుఁ డై యున్నాఁడు. ఇన్నాళ్ళ