అశోకుడు/పదునేడవ ప్రకరణము
పదునేడవ ప్రకరణము.
సంధిసమయము.
పాటలీపుత్రమునఁ గొన్ని దినములవఱకును విజయోత్సవములు జరిగినవి. క్రమముగా నుత్సవోచ్ఛ్వాసములు తగ్గ నారంభించెను. ఆనందతీవ్ర ప్రవాహములు మందీభూతములగు చుండెను. గజతురంగ పదాతి గణంబుల కిఁక నిప్పుడు యుద్ధ యాత్రానుకూపంబులగు వేష భూషణము లెంతమాత్రమును లేవు. నగరతోరణములయందలి పత్ర పుష్పమాలికలు వాఁడి పోయినవి. పట్టణమంతయు బూర్వమువలె నెమ్మదితోనుండెను; దూరమునుండి రణ భేరీధ్వనులనాలకించి యుద్ధయా త్రామహోత్సవముం జూడవలయు నను నుత్సాహముతో, గుల వధూజనము గృహ కార్యములను విడిచి గవాక్షములయొద్ద నిలిచియుండుట లేదు; వృద్ధులగువార లింటిముంగిలి దాటివచ్చుట లేదు. యౌవనులు స్వకార్యములను వదలి వీధుల వెంటఁ దిరుగుట లేదు. బాలకులు తమపు స్తకములను బాఱవై చి వీథుల లోనికిఁ బరు గెత్తుకొని వచ్చుట లేదు. ఇప్పుడు నగరజనులందఱును నెమ్మదితోఁ దమతమ పనుల నిర్వహించుకొనుట కారంభించిరి. 'రాజధానియందును రాజస్థానమునందును మరలఁ
బూర్వావస్థ నెలకొనియెను. పదునేడవ ప్రకరణము
59
రాజ్యమంతటను బ్రజలందఱునుబూర్వరీతిని నెమ్మదితోనుండిరి, కాని మహా రాజగు నశోకుని మనో భావము మాత్రము యథాపూర్వముగ నున్నట్లగపడుట లేదు. ఇంత కాలమువఱకు మహా రాజగునశోకుఁ డెట్టిస్థియం దుండెనో యితరులుకూడ నా స్థితియం దేయుండిరి. తనహృదయమునం దెట్టివిషమచ్ఛాయ ప్రసరించుచుండెనో యింతకాలమువఱకు నశోకుఁడు గ్రహీంపఁ జాలక పోయెను. ఆమహారాజుముఖమండలమున నా ఛాయ యావరించి యున్నట్లితరులు కూడ నెవ్వరును గను పెట్ట లేక పోయిరి. ఇప్పుడు ప్రజల కండఱకును మంచిసమయము వచ్చినది. అందు చేత నే యశోకుఁడు తన హృదయమునఁ బ్రసరించియున్న విషమచ్ఛాయను బాగుగ గ్రహింపగలిగెను. మంత్రులుకూడ నా సంగతిని దెలిసికొనఁ గలిగిరి. మహా రాజగు నశోకుని వాక్యోపవాక్యములవలనను, కాచార వ్యవహారములవలనను, నా దేశోప దేశములవలనను నాతనిభావ వై లక్షణ్య మెల్ల రకును స్పష్టముగ బోధపడుచుండెను.
క్రమముగ మంత్రులందఱు నీ విషయముంగూర్చి యాలో చింప నారంభించిరి. ఒక నాడు మహారాజు దైనందిన రాజకార్యములు నిర్వర్తించుకొని సభచాలించి నగరు నకుఁ బోయెను. తరువాతఁ గొలఁది సేపటిలోన నే మంత్రులందఱు నాస్థానమునుండి వెలుపలకు వచ్చిరి. వారిలో నొకడు "అంతః పురమునం దేదియో జరిగియుండును” అని 60
అ శో కుఁ డు
యెను. మఱియొకఁడు “ అట్లు కాదు. నేను వినియుంటిని. చండగిరికునికృత్యముల కాతఁడు మిగులఁ గ్రోధావిష్టుఁ డై యున్నాఁడు. ఆ చండగిరుకుఁడొకనాఁడు నిరపరాధియు, నలౌకికశక్తి శాలియునగు సముద్రగుప్తుఁడనునొక బౌద్ధసన్యాసిని జంపబోయెను; కాని యాతని యమానుషశక్తిం జూచి విస్మితుఁడును భయావహుఁడునై యావృత్తాంతమును మహా రాజున కెఱింగించెను. మహా రాజు స్వయముగ నరకగృహంబునకు వచ్చి యాసన్యాసి యత్యద్భుత మహిమలను గన్నాఱఁ గనుఁగొని యాతని సందర్శించెను; అతని యొద్ద బౌద్ధధర్మములం గూర్చి వినియుండెను. ఆ పిమ్మట నే నరక మందిరము నేలమట్టమై పోయినది. చండగిరికునకుఁ బ్రాణదండనము విధింపబడినది. అప్పటినుండియు మహారాజునకు మనసు తిరిగిపోయినది "అనియెను. అంతట మఱియొఁకడు ' ఇదియే సత్యమైయుండును' అని యాతని వాక్యములను సమర్థించెను. మరల నాతఁడు తక్కిన మంత్రివర్గముంజూచి “మహారాజు కళింగ దేశ యుద్ధ క్షేత్రమున నసంఖ్య జనక్షయముంగాంచి యతివిక లహృదయు డయ్యెననియు, నిఁక నెన్నఁడును రాజ్య లోభముచే యుద్ధము చేయఁగూడదని నిశ్చయించుకొనియె సనియుఁ బ్రధాన దండనాయకుని వలన నేను వినియుంటిని, 'రాజధర్మము సూక్ష్మ తమమై నది. రాజనీతి కృత్రిమ మైనది — సరళ భావముతో సకలవిష
యములను బ్రదర్శించుట యీ రెంటికిని విరుద్ధము. కేవలం మెల్ల విషయములను బాహ్యదృష్టితోఁ జూచుటయే యావ పదునేడవ ప్రకరణము
61
శ్యకము. కాని యంతమాత్రమున నేమగును ? మహారాజు యొద్దనిరంతరము నుండు సన్నిధానవర్తులకు మాత్రమే యాతని మనోభావములు బోధపడుచుండును. అట్టివారియొద్ద నాతఁడు తన మనో భావముల నెట్లుదాఁపఁగలుగును ? మనో భావములు ముఖమునందును మాటలయందును బ్రకాశితములగుచు నే యుండును" అనియెను.
ఆ నాఁడు మంత్రులీ విధముగ నాలో చించుకొని తమ తన వాహనముల నధిరోహించి మందిరములకుఁ బోయిరి. అనంతర మొకనాఁ డశోక సార్వభౌముఁడు తన విలాస సౌధమున వాయువిహారము చేయుచు జాల కాంతరముల నుండి వీథిని బోవుచున్న పరమసుందరుఁడగు నొక బాలకునిజూ చెను. ఆ బాలకుని శిరస్సు ముండిత మైయుండెను; ఆతఁడు కాషాయ
వస్త్రములను ధరించియుండెను; ఆతనిహస్తమునఁగమండలు వుండెను. మృణాళ సదృశంబులును, కోమలంబులును, సువృత్తంబులు నగు నా బాలకుని బాహువులు కావివసనము చే నర్ధావృతము లై యండెను. అందుచే నా బాలకుని శరీరకాంతి మఱింత స్పష్టముగను దేజోవంతముగను గానవచ్చు చుండెను. అతని ముఖమండల మపూర్వ తేజ సంపన్నమై యుండెను. అతని విశాల నేత్రద్వయమునుండియ, హృదయ నిర్మలానందమును స్నిగ్ధకరుణామృతభావమును బహిర్గతము లగుచుండెను. అశోకుఁడు చాల సేపటివఱకు నా బాలకుని తదేక దృష్టితోఁ జూచుచుండెను. ఆ బాలుఁ డప్పుడు తనలో 62
అ శో కుఁ డు
నేమేమియో పాడుకొనుచుఁ బోవుచుండెను. అతని వంకను జూడవలయుననియు నాతనిగానము బాగుగానాలకింపవలయు ననియు మహా రాజు మిగులఁగుతూహల పడియెను. అప్పుడొక సేవకున కాజ్ఞాపించుట చే సేవకుఁ డాబౌద్దబాలసన్యాసి నచ్చటకుఁ దీసికొని వచ్చెను.
మహారాజు పరమాదరముతో నా బాలయోగి నుచితాసనమునఁ గూర్చుండఁ జేసెను; ఆతని యోగక్షేమములం దెలిసికొనియెను. అప్పుడా బాలయోగి తన నామము నిగ్రోధుఁడనియుఁ దన గురుని పేరు తిష్యుఁడనియుఁ దెలియఁ జేసి యీ క్రిందివిధముగ గానము సేయఁదొడంగెను. దాని భావమిది--
జీవునకు దేహము గేహమువంటిది. దేహరూపంబగు నీగృహమును నిర్మించిన తృష్ణం గూర్చి యన్వేషించుచు నే ననేక పర్యాయము లీజగంబునకు వచ్చియుంటిని; అనేక జన్మములను గ్రహించియుంటిని, మరలమరల నెల్ల కాలమును జన్మాంతరముల నందుచుండుట ఎంతదుఃఖకరము ! ఓగృహ నిర్మాణ కారిణీ ! నే నిప్పటికి నిన్ను బ్రత్యక్షముగఁ జూడఁ
గలిగితిని. ఇఁక నీవు మరల నీగృహమును నిర్మింపఁజాలవు. గృహ స్తంభములను, బార్శ్వదండములను గూడ సంపూర్ణముగ నేను భగ్నము చేసి వైచితిని. సంస్కార విహీనం బగు నాహృదయ మిప్పటికిఁ దృష్ణాక్షయసాధనమును గ్రహింపఁగలిగినది." 63
పదునెనిమిదవ ప్రకరణము
ఆ బాలయోగిగాన రూపబోధనమువలన నామహారాజు హృదయమున మఱపునఁబడిపోయిన యెన్ని యోసంగతులు స్మృతికి వచ్చుచుండెను. అతని ప్రాణములు చేతనారహితము లై పోయెను. అప్పుడేమి చేయవలయునో యాతని కేమియుఁ దోచుట లేదు. బాలకుఁడు మర లమరలఁ బాడఁదొడంగెను—— " లెమ్ము ! ఆలసుఁడవై యుండఁబోకుము. ధర్మాచరణముం గావింపుము-ధర్మాచరణుఁ డిహలోకము నందును బరలోకమునందునుగూడ సుఖియింపగలడు. సత్కర్మములను జేయుము ! అసత్కర్మములను జేయవలదు, ధర్మచారియగువాఁ డిహపరలోకములయందు యుండఁగలఁడు."
మహా రాజగునశోకుని హృదయమునందుఁ గింకర్త వ్యతావి మూఢత్వము వదలిపోయినది. ఆతని హృదయము నుండి సందేహాంధ కారచ్ఛాయయుఁ బ్రదీపాంధకార చ్ఛాయయునుగూడ సశించిపోయినవి. అతఁడు తన జీవితమును బౌద్దధర్మ ప్రచారమునం దే గడపవలయు నని నిశ్చయించుకొన్న సంధిసమయ మిదియే.
పదునెనిమిదవ ప్రకరణము
నవజీవనము
“ ప్రాణములను రక్షింపవలసివచ్చినచోఁ బ్రాణ దానము నే చేయవలయును.” అమరత్వము నాపాదించుసనాతన