అశోకుడు/పదునెనిమిదవ ప్రకరణము
63
పదునెనిమిదవ ప్రకరణము
ఆ బాలయోగిగాన రూపబోధనమువలన నామహారాజు హృదయమున మఱపునఁబడిపోయిన యెన్ని యోసంగతులు స్మృతికి వచ్చుచుండెను. అతని ప్రాణములు చేతనారహితము లై పోయెను. అప్పుడేమి చేయవలయునో యాతని కేమియుఁ దోచుట లేదు. బాలకుఁడు మర లమరలఁ బాడఁదొడంగెను—— " లెమ్ము ! ఆలసుఁడవై యుండఁబోకుము. ధర్మాచరణముం గావింపుము-ధర్మాచరణుఁ డిహలోకము నందును బరలోకమునందునుగూడ సుఖియింపగలడు. సత్కర్మములను జేయుము ! అసత్కర్మములను జేయవలదు, ధర్మచారియగువాఁ డిహపరలోకములయందు యుండఁగలఁడు."
మహా రాజగునశోకుని హృదయమునందుఁ గింకర్త వ్యతావి మూఢత్వము వదలిపోయినది. ఆతని హృదయము నుండి సందేహాంధ కారచ్ఛాయయుఁ బ్రదీపాంధకార చ్ఛాయయునుగూడ సశించిపోయినవి. అతఁడు తన జీవితమును బౌద్దధర్మ ప్రచారమునం దే గడపవలయు నని నిశ్చయించుకొన్న సంధిసమయ మిదియే.
పదునెనిమిదవ ప్రకరణము
నవజీవనము
64
అ శో కుఁ డు
ధర్మమిదియే. మృత్యు మధ్యమునుండి యే యమృతమును బొందుట-భోగమునందు లభియింపనిది కూడఁ ద్యాగము నందు లభియింపఁగలదు. --సంభోగమున లేనిసుఖము సంయమనమునందున్నది. విలాసమున దుర్లభమైన యానందము విరాగమున సులభమైయున్నది. కాని యీ సంగతి యందఱు నెఱుంగరు. ఎఱింగినను గ్రహియింపఁ గలిగినవారు కొంతమంది మాత్రమే-గ్రహించినను విశ్వాసముతోఁ బని చేయువారు చాలఁదక్కువగా నుందురు.
రాజభోగములును, విలాసవిభ్రమములును నపరిమితము లే యైయున్నను వానియం దశోకునకుఁ దృప్తికలుగ లేదు, ఆతని హృదయము విలాససుఖంబులఁ దేలియాడుచున్నను విచారించుచు నే యుండెను. ఆ కారణము చేత నే యాతఁడు తన ప్రాణములను బౌద్ధధర్మములకుఁ బూజోపహారములుగఁ జేసి వైచెను. అందువలన నప్పుడాతనికి నవజీవనలాభము కలిగెను.
ఆనవజీవనమునం దాతఁడు నవనవజ్యోత్స్నాంత రాళమున నవనవాదర్శములం జూడఁగలిగెను. ఆతనికప్పుడు కర్తవ్యము బోధపడి యెను. ఆనూత్న విజ్ఞాన తేజస్సాహయ్యము చే నాతఁడు ముందుగఁ దనగృహమున సంస్కరణమున కారంభించెను. జీవునకుఁ బ్రేమసంయోగము లభించినది. నిరంతరముఁ ద నయాహారమునకై య నేకములగు మృగములును బక్షులును సంహరింపఁబడుచుండుట నాతఁడు కనుంగొనియెను, ఉదరపో పదునెనిమిదవ ప్రకరణము
65
షణమునకై యించుక యన్నమును జలమును లభించినచోఁ బరితుష్టినందవచ్చు నని యాతఁడు భావించెను. “అందుకొఱకు జీవహింస చేయుట యెందులకు?” అని ప్రశ్నించుకొనియెను. పిమ్మట మహారాజగునశోకుఁడు తన యాహారము కొఱకు మృగపక్ష్మి మారణము గావింపఁగూడదని యాజ్ఞాపించెను.
రాజానందము కొఱకును, మంత్రుల సంతోషము కొఱకును, నిత్యనూతనంబు లగు చిత్ర విచిత్ర ఖేలనములు జరగుచుండెడివి; అందుకొఱకొక విశాల ప్రాంగణమునఁ బశుపక్షి, మృగాదులద్వంద్వయుద్ధములు జరగుచుండెడివి. ఒక్కొక్కప్పుడు దుర్దాంతములగు సింహములతోడను, మద గజములతోడను, క్రూరశార్దూలములతోడను; ప్రబల వృషభముల తోడను, నపరాధులగు ప్రజలను బోట్లాడించి వారి బలపరిమాణములు గ్రహియింపఁబడు చుండెను. ఈ సకల వినోదవ్యాపారములును దుట్టతుద కేమైనవో మనము సులభముగ గ్రహియింపఁగలము, ఒకప్పు డట్టివిలాస క్రీడ లానంద దాయకములుగ నే యుండెను. ఇప్పుడా కాలము తిరిగిపోయినది. సూత్న తేజమునందు విస్పష్టముగఁ గానవచ్చుచున్న యార్తుల యశ్రు వర్షములును శిక్షితుల రక్తప్రవాహములును నాతని కసహ్యపరి వేదనముం గల్పించు చుండెను, ఆతని కరుణార్ద్రహృదయమునందు సర్వభూతసమానుభావ ముద 66
అ శో కుఁ డు
యించెను. ఇఁక నాతఁడు చూచుచు నూరకుండఁజాలక పోయేను. అది మొదలుగ నా మహారాజు నిష్ఠురఁబులును నిర్దాక్షిణ్యంబులు నగునట్టి కౌతుక క్రీడలను నిలిపి వేయున ట్లాజ్ఞాపించెను.
ప్రేమావ తారుఁ డైనబుద్ధదేవుని ప్రియశిష్యుఁడగు నశోకుని హృదయమునం బ్రేమశక్తి యుదయించినది. ఆ శక్తియే మహారాజు పాకశాలను, ప్రాసాదములను, బ్రాంగణములను గూడ బరిశుభ్ర పఱచి రాజ్య మందంతటను వ్యాపించి పరిపాలింప నారంభించెను. మహా రాజగునశోకుఁ డిన్నాళ్ళవఱకును విహారార్థము వేటకుఁ బోవుచుండెను, ఆ వేఁట చాల నాశ్చర్యకరమైనది. ఇప్పుడు వేఁట యనినం గొందఱు వేఁటగాండ్రును గొన్ని యేనుఁగులును, గొంతపరి వారమును, గొన్ని తుపాకులును, బల్లెములును మనకు జ్ఞప్తికి వచ్చును. కాని మహా రాజగు నశోకుని కాలమునందు మాత్రము వేఁట మఱియొక విధముగా నుండెను. అతఁడొ కప్పుడు బంగారుపల్లకి నెక్కియు, మఱియొకప్పుడు గజారోహణము చేసియు వేఁటకుఁ బోవుచుండెడివాఁడు. ఆతని నలువంకలను నాయుధహస్తులగు సైనికులును, నమూల్య వేష
భూషణాలంకృతలగు వార నారీమణులును గూడఁ బోవు చుండిరి. చుట్టును బరి వేష్టించియున్న రజ్జు మధ్యము నుండి వారఁ దఱును నడచుచుందురు. ఆరజ్జుమండలము చుట్టును శస్త్ర ధారిణు లగు వీరనారీమణులు వేలకొలఁది తిరుగుచుం పదునెనిమిదవ ప్రకరణము
67
దురు. దురదృష్టవశమునఁ దెలియక యం దెవ్వఁడైన నావీర నారీమణులు ధరియించి వచ్చుచున్న యారజ్జుసీమ నతిక్రమించినచోదత్క్షణ మే యాతనికి మరణదండన మగుచుండెను.
ఈ విధము లగునరహత్య లే విలాస క్రీడలుగానున్నప్పు డిఁకఁ బశుపక్ష్మి మృగాదులమాట చెప్పవలసిన దేమున్నది? మహారాజగు నశోకుఁడు, బౌద్ధ ధర్మము నవలంబించిన తరువాత
నిట్టి దారుణ సమారోహణముల నన్నిటిని రూపుమాపి వైచెను, అతని హృదయమునందలి కరుణాప్రవాహము మహారణ్య సీమ వఱకును బ్రవహించుచుండెను. భయంక రారణ్యముల
యందలి జీవులుకూడ నిర్భయముగ సంచరించుట కవకాశము కలిగెను.
అశోక సార్వభౌముఁడు ప్రేమ ధర్మ దీక్షితుఁడై క్రమక్రమముగా నిట్లే భోగవిలాసములను, గ్రీడాకౌతుకములను, వ్యసనములను గూడఁ బరిత్యజించి వైచెను. భోగపరివర్తనమున సంయమన మారంభ మయ్యెను. నవజీవనలాభమునఁ జండా శోకుఁడు ధర్మాశోకుఁ డయ్యెను. బిందుసార సార్వభౌముని యప్రియ పుత్రుఁ డిప్పుడు దేవతలకుఁగూడఁ బ్రియ దర్శను డయ్యెను.