అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/అక్షరాలతో ఆటలు - 2
చదువు-ఆటలు
సి.వి. క్రిష్ణయ్య 93965 14554
అక్షరాలతో ఆటలు - 2
గత సంచికలో పిల్లలు భాషా సాహిత్యాలతో ఆనందించాలనీ, అందుకు లిపి నేర్చుకునేటప్పుడే అక్షరాలతో ఆటుకోవడం నేర్పాలని చెప్పుకొన్నాం. ఈ సంచికలో అక్షరాలతో ఆటలు ఎలా తయారుచేయాలో, ఎలా నేర్పాలో, పిల్లలు తెలుగు భాషను ఇష్టపడేటట్లు ఎలా చేయవచ్చో తెలుసుకొందాం.
ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా తరగతి గదిలో ఒకరిద్దరు పిల్లలు చురుగ్జా ఉండి, అన్నీ తామే చెబుతూ ఉంటారు. మిగిలిన పిల్లలుప్రేక్షకులుగా మిగిలిపోతారు. స్వయంగా ఆలోచించడం మరచిపోయి ఉంటారు. ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి పాల్గొనేలా ప్రయత్నించాలి. ఇందుకు రెండు పద్దతులు పాటించాలి. 1 జట్టు పద్దతి. (ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు) 2, ఏకాంతంగా ఒక్కరే పాల్గొనడం. ఏకాంతంలో ఆలోచిస్తారు. జట్టులో చర్చిస్తారు.
ప్రస్తుతం ౩వ తరగతి స్థాయి, ఆపై తరగతుల పిల్లలకు ఉపయోగపడేట్టు ఉన్న ఆటలు పరిచయం చేస్తున్నాను. ఒకే ఆటను పిల్లల స్థాయినిబట్టి తేలికనుండి క్లిష్నతరంగా ఉండేటట్లు పదజాలం పరిచయం చేయవచ్చు.
3వ తరగతి పిల్లల స్థాయి ఎలా ఉంటుంది? ఇప్పుడిప్పుడే కూడికూడి చదువుతూ ఉంటారు. సరిగ్గా రాయడం రాదు.
ఇప్పుడు మనం పిల్లలకు కొత్త పదజాలం పరిచయం చేయడంలేదు. వారికి తెలిసిన పదాలను బయటకు లాగి వాటిని పలురకాలుగా వాక్యాలలో ప్రయోగించి అర్దాలు తెలుసుకొనేటట్లు చేస్తున్నాం.
మన మెదడుకూడా కంప్యూటర్ లాంటిదే. కంప్యూటర్లో మనకు కావలసిన దానిని ఎలా వెదుకుతామో, అలాగే మన మెదడులో ఉన్న జ్ఞాపకాలను (జ్ఞానాన్ని వెలికితీయాలి. ఇందుకు మనం సరైన ప్రశ్నను సంధించాలి. మళ్ళీ ఎదురు ప్రశ్న వేసేటట్లు (సందేహించేటట్లు) ప్రశ్న ఉండకూడదు.
ఈ క్రింది ప్రశ్నలను చూడండి.
- 1.ఏదొ ఒక పదం చెప్పండి?
ఏ పదం చెప్పాలి? అనే ప్రశ్న ఉదయిస్తుంది.
- 2. ఒక చెట్టు పేరు చెప్పండి?
ఏ చెట్టు పేరు చెప్పాలి? అనే ప్రశ్న ఉదయిస్తుంది.
- ౩. ఒక పండ్ల చెట్టు పేరు చెప్పండి?
అరటి, మామిడి, జామ, సపోటా - ఇలా చాలా పదాలు వరసగట్టి వస్తాయి.
ఇలాగే భాషకు సంబంధించి “అ"తో వచ్చే పదాలు చెప్పండి. “క "తొ వచ్చే పదాలు చెప్పండి అని అడిగినప్పుడు ఆయా పదాలు వెంటనే గుర్తుకొస్తాయి. “క " గుణింతం చెప్పండి అని అడగడానికి, రాయమని చెప్పడానికి బదులు మొదటి అక్షరం దీర్హం ఉండే పదాలు (కాయ, పాప, తాత) రాయండి అని అడిగితే పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. 'ప 'గుణింతం ఉన్న పదాలు రాయండి. (పిలక, పీట, పూలు, చేప సపోటా) అని అడగవచ్చు. కేవలం ఒక అక్షరానికి సంబంధించి గుణింతం (క్ర,కా,కి, కీ, కు...... ) రాసినందువల్ల పిల్లల్లో ఆలోచనలు రావు.
ఇందులో సృజనాత్మకత లేదు. విసిగిపోతారు. ఇంతకంటే మెరుగైన పద్ధతులు చాలా ఉన్నాయి.
తెలుగు భాషలో ప్రాసకు చాలా ప్రాధాన్యత ఉంది. అకారాంత, ఉకారాంత పదాలు (పలక, పడక) (వారు, తాడు) ఎక్కువ. ఇలాగే అచ్చతెలుగు ద్విత్వాక్షర పదాలు (అట్ట, జిడ్డు) కూడా ఎక్కువే. ఈ పదాలతో ప్రాసవచ్చేటట్లు ఆటలు రూపొందించుకోవచ్చు.
- 1. కాలు, పాలు.....(చివర “లు” ఉండే పదాలు రాయండి)
- 2. పాము, రాము.....(ఛివర “ము” ఉండే రెండు అక్షరాల పదాలు రాయండి)
- ౩. అట్టు, చెట్టు.....(చివర “ట్టు” ఉండే పదాలు రాయండి)
పై పట్టికలో నిలువు మొదటి వరుసల్లో ఉన్న అక్షరాలతో అడ్డం మొదటి వరుసల్లోని అక్షరాలను కలుపుతూ ఏవి అర్ధవంతమైన పదాలుగా వస్తాయో ఆ అక్షరాలను గదుల్లో నింపాలి. విడిగా వాక్యాలలో ప్రయోగించాలి. ఉదాహరణకు ఒకటవ పట్టిక చూద్దాం. 1వ పట్టికలో నిలువు ఒకటో నెంబరు వరుసలోని అక్షరాలను అడ్డం 1వ నెంబరు వరుసలో అక్షరాలు కలిపితే వచ్చే పదాలు మొదటి వరుస "కా” కు కలిపి చూద్దాం . కాచు, కాటు, కాపు, కాగు, కాదు, కాను, కాము, కారు, కాలు, నీరు కాచుకొంటారు. పాము కాటు వేస్తుంది. చెట్టు కాపుకు వచ్చింది. నీళ్లు కాగుతున్నాయి.
తీపి ఆరోగ్యానికి మంచిదికాదు. నేను చెడ్డదాన్నికాను. మేము ఈ వూరి వాళ్లము కాము. కారులో ఊరికి వెళ్లాము. కాలు నొప్పిగా ఉంది.
పిల్లలు అర్జాలు విడిగా చెప్పలేకపోతే టీచర్ వాక్యంలో ప్రయోగించి అర్ధం అడగాలి.
పట్టికలో అడ్డం వేరే అక్షరాలు ఉపయోగించి మళ్ళీ కొత్త పదాలు సృష్టించవచ్చు. నిలువు అక్షరాలు మార్చి కొత్త పదాలు సృష్టించవచ్చు - ఇలా వందల పట్టికలు తయారవుతాయి.
5.అంత్య ప్రాసలతో అటలు
అక్క | తుక్కు | అన్న |కన్ను| అట్ట |అట్టు| నక్క| చెక్కు | నిన్న| తున్ను |కట్ట |పుట్టు| చక్క| పొక్కు | మొన్న| జున్ను| తట్టు| చెట్టు\
ఈ పట్టికలో ఉన్నట్లు బోర్డు మీద రాసి పిల్లల్ని తమ నోట్ పుస్తకంలో రాసుకొని వాటి కింద అలాంటి పదాలే రాయమని అడగాలి.
(అ)ఏకాంతంగా ఎవరికి వారు ఆలోచించి స్వయంగా ఠాయాలి.
(ఆ) ఇద్దరు లేదా ముగ్గుర్ని జట్టులుగా చేసి రాయమని చెప్పాలి.
(ఇ) పిల్లల్ని జట్లుగా చేసి జట్టుకు నెంబర్లు ఇచ్చి - ఒక్కో జట్టు నుండి ఒక్కొక్మరే వచ్చి ఏదోఒక పదంరాసి పొమ్మనాలి. జట్టులో ముగ్గురుంటే మూడు రౌండ్లు లేదా ఆరు రౌండ్లు రాసేవరకు ఆట సాగాలి. జట్టులో రాని పిల్లలకు నేర్పించి పంపవచ్చు.
6. ఇచ్చిన అక్షరాలతో మాత్రమే పదాలు తయారు చేయండి ప,క,డ,ం,ప - పడవ, పడక, పకపక, వడ, వండడం, వంపదం, వంక, వడకడం, కడవ, కండ, కడ, కంప, కడప,
| తెలుగుజాతి పత్రిక జుమ్మనుడి ఈ మార్చి-2021 |
7. ఇచ్చిన అక్షరాలు, వాటి గుణింతాలు వత్తులతో పదాలు చేయండి. మ,క-మామ,మమ్ము మిమ్ము మేము,ముక్కు మేకళ,మైకా, మొక్కు మెక్కుమాకు, కాక, కాకి, కేకు, కోక, కైక, కుక్క కిక్కు కూకో, కక్కు కామా, కమ్ము, కమ్మీ, కొమ్ము, మమ్ము, కైమా- కేవలం రెండక్షరాలతో ఇన్ని పదాలా అని ఆశ్చర్యపోతారు.
8.రెండక్షరాల ప్రాస : పదం చివర రెండక్షరాలు మారకూడదు. మొదటి అక్షరం మార్చి మరిన్ని పదాలు రాయండి.
పీపాలు నేపాలు
గొడుగు అడుగు
అమల కమల
అలుగు కలుగు
అరుగు నలుపు వరుగు తెలుపు
9. ఇచ్చిన అధారంతో అక్షరాలు పూరించండి
- ప_ వ (నీటిలో ప్రయాణిస్తుంది.)
- ప_ఫు (ఒక రంగు)
- ప_లు (రాత్రి కాదు)
- _ నస (ఒక పండు)
- పం - (ఒక జంతువు)
ఏవైనా మంచి విషయాలు, విజ్ఞానదాయకమైన విషయాలు ఆసక్తిగా చెప్పాలనుకున్నప్పుడు ఆధారంతో కనుక్కోమని అడగవచ్చు. ఉదా౹౹ _______కూరలు (ఈ కూరలు తింటే రక్తం ఉత్పత్తి అవుతుంది. క్యా______ ( ఈ దుంప తింటే కంటికి మంచిది)
విశ్లేషణ - చదువులో ఆసక్తి ఉండాలి. తెలుసుకోవాలనే కుతూహలం కల్పించాలి. ఎప్పుడైతే కుతూహలం పుడుతుందో ఆలోచిస్తారు. అన్వేషిస్తూ ఆలోచిస్తే ఆనందం కల్గుతుంది.
ఆకలి తీర్చుకోడానికి ఆహారం సంపాదిస్తే సరిపోదు. దాన్ని తినాలి. మన పిల్లలు అక్షరాలు పదాలు నేర్చుకుంటారు. చదవడం నేర్చుకొంటారు. కాని వాటిని ఆనందంగా వినియోగించుకోరు. నేర్చుకొన్నందువల్ల ఉపయోగం ఏమిటి?
చూచిరాత, ఉక్తలేఖనం(డిక్టేషన్) వంటి సంప్రదాయ పద్దతులను కూడా క్రీడలుగా మలచవచ్చు. విషయ జ్ఞానాన్నీ పజిల్స్ ద్వారా వినోదపూర్వకంగా నేర్చవచ్చు. పజిళ్లు ఎలా తయారు చేయాలో చూచిరాత డిక్టేషన్లూ ఎలా అటలుగా ఆడించవచ్చో వచ్చే సంచికలో 3వ భాగంలో చూడండి.