అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021
కొాయ్యబోొమ్మృలాట కళాకారుని ఆత్మకథ
“'గొంబే గౌడ'రామన గౌడ కన్నడ మూలం: డా. చంద్రప్ప నొాబటి తలుగు అసువాదం : రంగనాథ రామచంద్రరావు
తెలుగునేల నుంచి కన్నడ లోగిలి చేరిన కొయ్యబొమ్మలాట!
భారతీయ జానపద కళల్లో అకర్షణీయమైన కళ కొయ్యబొమ్మలాట! ఇది ఒక ప్రత్యేక సముదాయానికి చెందిన కళకాదు. ఒక వ్యాపకపు కళ. అయితే అనేక సముదాయాలు ఈ కళాప్రదర్శనను వృత్తిగా చేసుకున్నాయి. ఇలా వృత్తిపరంగా | చేసుకున్న వంశాలలో '“గొంబె'గౌడ రామనగౌడగారి వంశమూ ఒకటి. వీళ్ళు
| రెడ్డిలింగాయత సముదాయానికి చెందినవారు. ఆంధ్రలోని శ్రీశైలం వీరి మూల | నెలవు. శ్రీశైల మల్లికార్జునుని చెల్లెలుగా భావించే హేమారెడ్డి మల్లమ్మ కులం లేదా జై “తం వీరిది. హేమారెడ్డి మల్లమ్మను కులదేవతగా ఆరాధించే సంప్రదాయం వీళ్ళల్లో ఉంది. ఈనాటికీ ప్రతీఏటా జరిగే జాతర కార్యక్రమాల్లో శ్రీశైలానికి వెళ్ళి మల్లికార్జునుని దర్శించుకుని వచ్చే వంశపారంపర్యమైన పద్దతి వీళ్ళల్లో ఇప్పటికీ ఉంది.
విష్ణువు, హరుడు వీరి ఆరాధ్యదైవాలు. కులదైవం శ్రీళైల మల్లికార్జునుడు, హేమారెడ్డి మల్లమ్మలు; కుంకుమ రెడ్ది: శాక్తేయులు. మాతృష్రధాన సంస్కృతి కలవారు. ఆచరణాల సందర్భాలలో కుంకుమను ఉపయోగిస్తారు. ఉదాహరణకు నుదుట కుంకుమ పెట్టుకుంటారు, యల్లమ్మ (ప్రభావమూ వీరిపై ఉంది. వీళ్ళు లింగారాధకులు. అంటే శివుని ఆరాధకులు.
13-14 శతాబ్దాలలో జరిగిన శైవ, వైష్ణవ ధార్మిక ఘర్షణల పరిణామంగా ఏర్చడిన పరిస్థితుల వల్ల శ్రీశైలం కొండ నుంచీ ఈనాటి కర్నాటక ప్రాంతానికి వలస వచ్చినవారు. ఆస్తిఅంతస్థులను అక్కడే వదిలిపెట్టి వలన వచ్చిన కారణంగా కొందరికి సంచార జీవితం సాగింంచవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ దూర ప్రయాణ సమయంలో వీరికి కొయ్యబొమ్మలాటతో పరిచయం ఏర్పడింది. ఆసక్తితో ఆ ఆటను నేర్చుకుని అందులో నైపుణ్యాన్ని సాధించారు. అప్పటి నుంచి కాయ్యబొమ్మలాట ప్రదర్శిస్తూ కర్ణాటకలోని వివిధ గ్రామాలలో తిరిగి ఈనాటి కుందగోళ రెద్దేర నాగనూరు గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. అప్పటికే (గ్రామగ్రామాళల్లో వీళ్లు నిర్వహించిన కొయ్యబొమ్మలాట ప్రదర్శనలు వీళ్ళను ధనవంతుల్ని చేసింది. పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆ కారణంగా అక్కడికి వచ్చి స్థిరపడిన కొంత కాలంలోనే వారికి 'ఊరి గౌడ” పదవి దొరికింది. ఆ కారణంగా అదే గ్రామంలోని మూలనివాసులకు, వలస వచ్చినవారికి మధ్య ఘర్షణ మొదలైంది. ఊరి నాయకత్వపు ప్రశ్న తలత్తింది. ముందు నుంచీ అదే గగ్రామస్టులైన ఊరి గౌద వంశానికి, గొంబెగౌడ పూర్వీకులకు మధ్య గొడవలు జరిగాయి. రాను రాను ఈ గొడవలు తీవ్రరూపం దాల్బటంతో ఇక్కడ ఉండటం ప్రాణాలకు ముప్పని అనుమానించిన '“గొంబొగౌడ వంశస్థులు తమ బొమ్మలను, సంపాదించిన సొమ్ములను మూటకట్టుకుని కుటుంబంతో అక్కడి నుంచి మళ్ళీ వలసపోయారు.
అలా బయలుదేరిన వాళ్లు వోవేరి జిల్లాలోని రాణిబెన్నూరు తాలూకా అంతరవళ్ళి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు.
'గాంబొగౌడ పూర్వీకులు తెలుగే మాట్లాడేవారట. ఆంధ్ర సరిహడ్డు ప్రాంతాల్లో ఉన్న రెడ్దిలింగాయతుల్లో ఇప్పటికీ 'తెలుగు వాడుక ఉంది. బళ్ళారి, చిత్రదుర్గ జిల్లాలలో ఈ 'తెలుగు భాషు వాడకం ఎక్కువ ఉనికిలో ఉంది. అందుకు నివసించే ప్రాంతం ముఖ్యమైంది. సరిహాద్దు ప్రాంతాలతో పోలిస్తే 'మధ్య కర్నాటకలో ఈ తెలుగుభాషా ప్రభావం తక్కువ. సుమారు నాలుగైదు తరాల నుంచి తెలుగు వాదకపు గురుతులు వీళ్ళల్లో లేవు.
వీరి వంశంలో కొయ్యబొమ్మలాట కాయకపు చరిత్ర సుమారు 600 సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంది.
విజయనగరం రాజు కృష్ణదేవరాయల కళాపోషణ ఈ కళా ప్రదర్శకుల జీవనానికి ఎంతో ఆలంబన అయింది. వీరి కళా గొప్పదనాన్ని మెచ్చుకున్న విజయనగర రాజులు వీరికి రాగి శాసనాలు ఇచ్చారు. అప్పటి నుంచి వీరి పూర్వీకుల ఇంటిపేరు 'జీవనగౌడి అన్నది మరుగై 'గొంబౌగౌడ అనే ఇంటిపేరు ముందుకొచ్చింది. ఇది వీరి కళానైపుణ్యాన్ని తెలియజేస్తుంది.
వీరు ఈ కళలో చేసిన సాధనకుగాను కర్నాటక ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రాజ్యోత్సవ పురస్కారం? ఈ ఇంటికి చెందిన నలుగురికి లభించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఈ పురస్మారం అభించటం ఈ కాయ్యబొమ్మలాట కళాప్రదర్శన” గొప్పదనానికి నిదర్శనం అని చెప్పవచ్చు.
ఫిబ్రవరి సంచిక నుండి ధారావాహికంగాఅవమ్మునుజెలో వెలువడుతుంది లోపలి పుటలలో....
సంపాదకహృదయం: భాషాపెత్తనం దిశగా కేంద్రప్రభుత్వ విధానాలు... 07
'భారతీయభాషల సంస్థ' విశ్వవిద్యాలయంగా మారుతోందా?!... 09
కొత్తమాటల పుట్టింపు... 11
యంత్రానువాదంలో 'వాక్యవిశ్లేషకం' అక్కర... 16
వాణిజ్యం - స్థానిక నుడులు... 18
అమ్మనుడి కోసం తపించిన 'జంగల్ నామా” సత్నాం... 19
మేధోశిఖరం, గాంధేయవాది అంతర్జాతీయ ప్రముఖుడు ఇ. ఎస్. రెడ్డి... 25
[[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/భారతీయ భాషాశాస్రజ్జుల సంఘం అధ్యక్షుడుగా ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు]]... 31
ఒక కథ - యెన్నో ప్రశ్నలు... 37
పదనిష్పాదనకళ... 27
మాఊరు... 39
జగమునేలిన తెలుగు - 14... 43
పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద... 19 జ వూ
ఇ 4 (ట్ర. 4 1
నుడె నాడు నెనరు
. క ౭ గ
గ్
ళ్‌్గ్లో
గ్ర గా న్నా రైలు పయో
లా చందా వివరాలు జీవిత చందా రూ.5000 4 సం॥ చందా రూ.1000 1సం॥ చందా రూ. 300
ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు చెక్కు లేదా డి.డి.ని వెలయిగుబాతైు' పేర పంపాలి.
---౮౮౮ బ్యాంక్ ఖాతా, ఫోను వివరాలు ఆన్‌లైన్ ద్వారా చందాను పంపేవారు [౬౯౫ /౧769 ద్వారా “తెలుకుజాణె'-యాక్సీస్ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. లయం ఉతర -తుయుం 9టాంరుటాతు.! అక్కౌంట్ నెం. 914020020887880
1.౯5౮ ౮౦646 : 1190000556
గూగుల్ పే/ ఫోన్ పే ద్వారా కూడా చందాను చెల్లించవచ్చును
ఆన్‌లైన్‌లో చందాను పంపేవారు వెంటనే ఇంటినెంబరు, వీధి పేరు, పోస్టాఫీసు, పిన్‌కోడ్‌నెంబరులతో కూడిన తమ పూర్తి చిరునామాను, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి తదితర వివరాలను జాబు ద్వారా తెలుపగలరు. 94929 80244 ఫోన్‌కు సందేశం గాని, వాట్స్‌యాప్ ద్వారా గానీ తెలుపగలరు.
చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలకు చిరునామా
దాః సామల ఐక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి” 8-3886, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి, గుంటూరు జిల్లా - 522 211. ఫోన్ : 94929 80244 ఇ-మెయిల్ : ఇగగ&6401201 5 అం్రగిణ! 00%
పాలనే
తెలుగుజాతి పత్రిక
లుటె
ఎం చందాదారులకు సూచనలు అాాాా
1 చందా కాలం, ముగింపు తేదీ- పత్రిక కవరుమీద మీచిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి.
. చందా కాలం ముగిసిపోయిన తర్వాత పత్రిక పంపబడదు. దయచేసి వెంటనే చందా పైకం పంపి, చందాను కొనసాగించుకోగోరుతున్నాము.
. చందా పూర్తయ్యేండుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి.
. మీ ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామాను, పిన్‌కోడ్ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్ నెంబరును, వుంటే మీ మెయిల్ ఐడి ని తెలుపండి.
. మీ చిరునామా మారినట్లయితే ధయచేని వెంటనే తెలియజేయండి.
. “అమ్మనుడి” పత్రికను చందాదారులకు మాత్రమే పోస్టులో వంపించగలము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు పెట్టడంలేదు. కనుక కావలసినవారు దయుచేని చందాదారులుగా చేరవలనిందిగా కోరుతున్నాము. చందాదారులు కోరినట్లయితే ఆన్‌లైన్‌లో కూడా పత్రికను పంపగలము. మీ ఇ-మెయిల్ ఐడిని తప్పక తెలియజేయండి.
“అమ్మనుడి పత్రికను నడపడం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ముఖ్య ఆధారంగా ఉన్నది గనుక - మీరు చందాదారులుగా చేరడంతో పాటు, మీ మీత్రులను, సంస్థలను ప్రోత్సహించి వారిని చందా
దారులుగా చేర్చించగోరుతున్నాము. ప్రచురణకర్త
౮౮౮ ప్రోత్సాహకులుగా చేరండి అాాలా
రు. 10,000/-లు, ఆపైన- విరాళంగా పంపి, “తెలుగుజాతి ట్రస్టుకు పప్రోత్సాహకులుగా మాతో చేరి సహకరించగోరుతున్నాము. అట్టి 'ప్రోత్సాహకులకు పత్రికను శాశ్వతంగా పంపుతూ, (ట్రస్టు ప్రచురించే ఇతర పుస్తకాలను కూడా వారికి సాదరంగా పంపగలము. దయచేసి మీరు ప్రోత్సాహకులుగా చేరి మా కృషికి తోద్చడగోరుతున్నాము.
తెలుగుజాతి (ట్రస్టు) (ప్రచురణ
| తెలుగుజాతి పత్రిక అవ్వ్మునుడె ఈ బనవరి-2021 |