అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/అమ్మనుడి కోసం తపించిన 'జంగల్‌ నామా” సత్నాం

సంవ్రదాయం - సాధికారత

డా. పి. శివరామకృష్ణ 'శక్తి ' 9441427977


అమ్మనుడి కోసం తపించిన 'జంగల్‌ నామా” సత్నాం

పంజాబి రచయిత సత్నాం- గెరిల్లా దళాలతో కలిసి, బస్తర్‌ తిరిగి రాసిన అనుభవాలను 'జంగల్‌ నామా 'గా


అంగ్లంలో, అదేపేరుతో తెలుగులో వచ్చింది. ఆఫ్రికన్‌ రచయిత గుగిలాగే అతడు గోండుజాతి జ్ఞాపకాలను వినాలని తపించాడు. 'గోండుతెగవారిలో కథలు చెప్పుకునే సంప్రదాయం ఒకటి ఉంది ఉంటుంది. కానీ గెరిల్లాదళ నాయకుడు రాజు నడిగితే తను ఇప్పటివరకు విన్న కథలేవీ లేవన్నాడు.నేను చాలామందిని అడిగాను కానీ వారికీ కూడా మనవళ్ళకు మనవరాళ్ళకు కథలు చెప్పే తాతయ్యలు, నాయనమ్మలు కనబడలేదట. దక్షిణ బస్తర్‌లో గిరిజనులకు పాటలు పాడుకునే సంప్రదాయం ఉన్నది. కానీ రాజు అతని మిత్రులకు తెలియని కథలు ఏవో ఉండి ఉంటాయి. కథ అంటే ఒక ఆలోచనల సమాహారపు సృష్టి, లేదా మనిషి సాధించిన విజయాల జ్ఞాపకాలను సజీవంగా ఉంచే ప్రయత్నం. ఒకతరం నుండి మరోతరానికి అందివచ్చే క్రమంలో ఇవే పురాణాలుగా మారతాయి.

వారు పాడే పాటలు వినండి, మనుషులను ఎలా సంఘటిత పరుస్తాయో ! నారిని నిర్దేశించే వారెవరూ లేకున్నా మొత్తం గ్రామస్తులంతా కలిసి ఆడి పాడతారు. వారి పాదాలను చూడు, ఎంత లయబద్ధంగా నాట్యం చేస్తున్నాయో! లయబద్దత వారికి సహజంగా వస్తుంది. దాన్ని ఏ పాఠశాలలో నేర్పరు. వారికి నిజానికి జీవితమే ఒక పాఠశాల. ప్రతిఒక్కరూ బస్తర్‌ చలామణిలో అటువంటి పురాగాథలు గురించి తెలుసుకోవాలనే నేను ప్రయత్నించాను ఇంకొంచెం సమయం ఉండుంటే ఈ విషయాన్ని లోతుగా పరిశిలించేవాడిని. అయినప్పటికీ ఇటువంటి సాహసగాథ ఒకటి నాకు పరిచయం అయ్యింది. 1910లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన గుండధుర్ అనే సాహసవీరుడి గురించి తెలిసింది. ఎందుకోగాని గుండధుర్‌ కథ అటు పాటలరూపంలో కానీ కథారూపంలో ఇక్కడి ప్రజలలోకి వెళ్ళలేదు. దండకారణ్యంలో గెరిల్లాలు నిరహించిన సదస్సులో తెలుగుపాత్రకేయ మిత్రుడొకడు నాకు గుండధుర్‌ గురించి ..గోండులు ఇతర గిరిజనులపై ఎన్నో పుస్తకాలు రాసిన వేరియర్‌ ఎల్విన్‌ గురించి కూడా చెప్పాడు ఇలా గుగీ లాగా, సత్నామ్‌ వాళ్ళ జ్ఞాపకాలు తెలుసుకోడానికి తాపత్రయ పడుకుంటే, వాళ్ళ ఆకలి బాధకు అవి ఎగిరిపోయాయి. గెరిల్లాలు పాడే విప్లవ గీతాలే మిగిలాయి అంటారు తెలుగు అనువాదం సంపాదకులు. దక్షిణ బస్తర్‌లో ఉన్న సంప్రదాయం విప్లవ రాజ్యంలో అంతరించడం విచారకరం.

“బంగారపు కంచానికైనా గోడ చేర్పు “అమ్మనుడి. కావాలి.

వరంగల్‌ జిల్లాలో బంజారా పిల్లలు ఎక్కువగా చదివే ప్రాంతంలో కారేపల్లి జూనియర్‌ కళాశాలలో ఉపాధ్యాయుడు సీతారాం ఏంతో విమర్శనాత్మకంగా రాసిన అనుభవాలు కారేపల్లి కబుర్లు .ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ “ప్రతివిద్యార్థి ఇంగ్లీష్‌ ఖచ్చితంగా పాస్‌ అయ్యేందుకు కృషి చేశారు. స్వయంగా ఆంగ్లం భొధించారు. స్లిప్‌ టెస్ట్‌లు పకడ్బందిగా పెట్టారు. చదువు తప్ప మరోపని లేకుండా చేశారు .ఆయన కృషి ఒక విపరీత సంస్కృతి ఏర్పరిచింది అంటున్నరచయిత సీతారాం. పరిశీలన, చిరకాలం గిరిజన విద్యారంగంలో పనిచేసిన చినవీరభద్రుడి 'కొన్ని కలలు, మెలకువలు ' ఆయన సంతోష చంద్రశాలలో చదువుకొత్తల అనుభవాలతో రాసిన “బడికతలు” గుర్తుకు వస్తాయి. ఆ విపరీత సంస్కృతి గిరిజనపిల్లలను మరబొమ్మలుగా మార్చిన క్రమాన్ని సీతారాం ఇలా వివరిస్తాడు.

'గిరిజన పిల్లల్లో ఉండే పట్టుదలను ప్రిన్సిపాల్‌ channelse చేయగలిగారు. అయితే ఆ పిల్లల సృజన సామర్ధ్యాలను పెంచటంలో జరిగిన కృషి పెద్దగా ఏమీలేదు. పిల్లలు ఎంత మెటిరియల్‌ ఇచ్చినా చదివి పారేస్తారు తప్పు స్వయంగా ఆలోచించరు. ఫలితాల సాధన అనే మహత్తర లక్ష్యం ఉపాధ్యాయుల ముందు ఉండటం చేత విద్యార్థుల సృజనసామర్థాన్ని గురించి ఆలోచించే వ్యవధిని వారు తీసుకుపోలేకపోయారు. కాంట్రాక్టు పద్ధతిలోని టీచర్ల భయం, జిల్లా సగటుకన్నా తగ్గితే ఉద్యోగం పోతుందనే భయం వల్ల ఆ భయం పిల్లలకు బదిలీ అయింది. వాళ్ళు కూడా తమకు ఆలోచనాశక్తి ఉందనే విషయాన్ని విస్మరించారు. పోనీ ఇదైనా జరిగితే మేలే అని సరిపెట్టుకోడానికి వీలుచిక్కటం లేదు. పిల్లలు ప్రశ్నించటం మరిచిపోయారు. జ్ఞాపకం ఉండటమే జ్ఞానం అనేస్థాయికి చేరుకున్నారు.

తరగతిలో పాఠం వింటున్న పిల్లలకు ప్రశ్నలు పుట్టటం లేదంటే ఆలోచించే శక్తి ఆగిపోయింది అని. ఒక వేళ ప్రశ్నించమని ప్రొత్సహించినా ఏం అడగాలో తెలియని పరిస్థితికి పిల్లల మెదళ్ళు మూసుకుపోయాయి. రాష్టంలో రెండవ స్థానంలో ఫలితాలు సాధించిన కళాశాల సాధించిందేమిటి?

గిరిజన విద్యార్థులను, వారి అభ్యసనపద్దతులను గమనిస్తే మనకొక సంగతి విశదమౌతుంది ఈ పిల్లల భాషాసామర్ధ్యాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. తమది కాని భాషలో వీళ్ళు విద్య నేర్చుకుంటున్నారు. మాతృభాషా ప్రభావం ఈ పిల్లల మాధ్యమభాషమీద బలంగా పడుతున్నది. మాతృభాషలో ఉండే... కల్పనలు, విద్యాభాషమీవ ఉండటంతో, ఈ భాష పిల్లలకు క్లిష్టంగా మారింది. ఈ క్లిష్టత వారిలో ఒక న్యూనతకు కారణమౌతున్నది. భాషను ధారాళంగా మాట్లాడటం చేత ప్రసంగాలు చేయించి, వారికి ఈ భాషపట్ల ఉన్న క్షిష్టత తొలిగిపోయేలా చేయాలి. వేగంగా విషయాన్ని చెప్పటం నేర్చుకుంటే వేగంగా వినటం వస్తుంది. గ్రహింపులో వేగం చదవటంపై ఆసక్తి కలిగిస్తుంది. ఈ ఆసక్తి భాషానైపుణ్యాన్ని పెంచుతుంది.

నైపుణ్యం, అమలు సామర్థ్యం మథ్య విడదీయరాని సంబంధాన్ని కేవలం 35 మార్ముల అత్తెసరు పాస్‌ మార్ములుగా మార్చి ఫలితాలు, ఆధిక్యత సాధించామని చాటుకున్నందువల్ల ఫలమేమిటి?. 60కి 60 మార్కులు సాధించిన పిల్లలు కూడా కోకొల్లలుగా ఉన్నారు. వారు సాధించిన మార్కులకు, పొందిన జ్ఞానానికి ఏమైనా సంబధం ఉంటుందా? ర్యాంకులు పొందిన పిల్లలంతా సైన్స్‌ పట్ల మక్కువను పెంచుకుని శాస్త్రవేత్తలుగా మారుతున్నారా! లేక అధిక జీతాలు, పదవులు పొందాలనుకునే ఉద్యోగార్హులుగానే మిగులుతున్నారా, ఈ ఆవేదనలో “మాతృభాషలో కల్పనలు” అవి అమ్మనుడి అంటే జానపద సాహిత్యంలోనే దొరుకుతాయి. వాటిని గుర్తుచేస్తూ బోధిస్తే పిల్లవాడు అల్లుకు పోతాడు. జనపాల శంకరయ్య బంజారా “లంబాడీ జానపద సాహిత్యం” జీవితకాలపుక్ళషి ఈ కారేపల్లి కబుర్ల రచయిత ఆ సాహిత్యంలో కొన్ని పలుకుబడులైనా వాడుతుంటే పిల్లలు దగ్గరయ్యేవారు. 'తెలంగాణ గిరిజన జీవితంలో పాట వ్యాసాలలో కొన్ని పాటలను అమ్మనుడి ప్రచురించింది. తోటి అధ్యాపకురాలు ముందుమాట. 'ఏ టీచర్స్‌ డైరీ లో “విద్యార్దుల భాషాసాంస్కృతిక నేపధ్యాల పట్ల అధ్యాపకులకు అవగాహన ఉండాలి. వారి పూర్వ జ్ఞాన పరిశీలన చేసి అంచనా వేయాలి. * అని పుస్తకపాఠం వల్లించారు.

ఎద్దీనింది అంటే దూడను కట్టేయమన్నట్లు '

ఈ మధ్య విశాఖమన్యంలో కోందు పిల్లలకు బడి నడుపుతున్న అజయ్‌కుమార్‌ ఉపాధ్యాయులను కలిశాను, వాళ్ళు చీపురుపల్లి శోధన వారి పుస్తకాలు, పద్ధతులు యధాతథంగా వాడుతున్నారు. కొంత కోందుభాషలో అనువదించుకున్నారు. నేను కోందుభాషలో పనిముట్టు, నెలలు, జంతువులు, ఆటలు కలుపుంటూ చెప్పమని ఆ పదాల జాబితా కొసరి కొసరి రాయించాను. రెండోసారి నేను వెళ్లేసరికి అజయ్‌ , గిరిజన సంక్షేమ శాఖ వేసిన ఒకటి రెండు తరగతుల వాచకం కొందు భారతి” పట్టుకొచ్చాడు. వాటిలో ఈ ఆట పాటలు కొద్దిగా ఇచ్చారు. ఆ పుస్తకం చూసి ఆ గిరిజన ఉపాధ్యాయులకు ప్రాణం లేచొచ్చినట్రైంది. గబగబా అవన్నీ రాసుకున్నారు. గుసగుసలు మొదలు పెట్టారు. వాళ్ళకు లెక్కలు, ఇంగ్లీష్‌ ఇంకా చాలా చెప్పాలి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపించాలంటూ అజయ్‌ వాళ్ళను మల్లించాల్సి వచ్చింది.

'శోధన ' పద్దతి మనోహర్‌ ప్రసాద్‌ కోయలలో, కొండరెడ్లలో, గోండులలో పాటిస్తున్నారు. శోధనబ్బందమే వారికి శిక్షణనిస్తున్నారు. మనోహర్‌ ప్రసాద్‌తో వెళ్లి శోధన కామేశ్చరరావు గారిని కలిసినప్పుడు “మీరు ఆయా ప్రాంతాలలో, ఆయా సామాజిక వర్గాలకు, తెగలకు శిక్షణనిచ్చేటప్పుడు కాస్త “లోకలైజ్‌ చేయండి అని చెప్తూ వీళ్ళంతా 'ఎద్దీనింది అంటే దూడను కట్టేయమన్నట్లు ' మీ పద్ధతి నకలు కొడుతున్నారు. అని అజయ్‌ ఉదాహరణ, మనోహర్‌ ప్రసాద్‌తో నా అనుభవం చెప్పాను. అంతేసంగతులు.

ఈ మధ్య గిరిజన సంక్షేమ శాఖ ప్రధానోపాధ్యాయులకు కరదీపికలలో గిరిజన సంస్కృతి -కొండరెద్ల, విశాఖ గిరిజన సంస్కృతి వాచకాలు తయారు చేయించింది. కానీ వాటినీ అచ్చువేయలేదు. తెలుగు విశ్వవిద్యాలయం కొండరెట్ల ఆశ్రమ పాఠశాలలో పిల్లలు పాడుకునే పాటలతో రెండుపుస్తకాలు అచ్చువేసారు. యాదయ్య దశాబ్దం పాటు కోయలలో కొండరెడ్లలో పనిచేసి వాచకాలు. ఈ మధ్యన వాళ్ళకోసం బాలసాహిత్యం తయారు చేశారు.

భజన చేసే విధము తెలియండి

అజయ్‌ బృందం, ఈ మధ్యన చింతూరు గిరిజనాభివృద్ధి సంస్థ వారు ప్రారంభించిన కొండరెడ్ల బడులకు శిక్షణ నిచ్చారట. వాళ్ళ పాట ఒకటైనా తెలుసుకున్నారా అని ముఖపుస్తకంలో అరా తీసాను. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందరు చుట్టూ కమ్మేసేసరికి గిరిజనుడు తనెవరో తాను మరిచి పోతున్నాడు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నాడు. ఈ మధ్య పర్యాటక సౌకర్యాలు పెరిగి రచయితలు, కవులు అడవుల వెంట పడుతున్నారు. గిరిజనుడు ఈ అధికారుల, విద్వావేత్తల, రచయితల భజన చేస్తున్నాడు. మల్లిపురం జగదీశ్‌ అన్నట్లు ఐ.టి.డి.ఏ ముందు క్యూ కడుతున్నాడు. అదేకదా కావలసింది!.

మానవశాస్త్రవేత్త హైమెండర్స్‌ దంపతులు 1945లో రెండేళ్ళు తిరిగి కొండరెడ్ల మీద ప్రపంచ ప్రసిద్ధమైన రచన “ది రెడ్డీస్‌ అఫ్‌ బైసన్‌ హిల్స్‌ " రాసిన ప్రాంతమిది. ఆయన చెంచులమీద కూడా మరో ఉద్గంధం రాసాడు. ఆయన శిష్యుడు గొండు, కొలాముల మీవ చిత్రం తీసిన మైఖేల్‌ యార్న్‌ను పిలిచి తెలంగాణా ప్రభుత్వం పండుగ చేసింది. ఆదిలాబాద్‌ ఆకాశవాణిలో సుమనస్పతి వాళ్ళ పాటలు రికార్డు చేస్తున్నాడు. రంపచోడవరం గిరిజనాభివృద్ధి సంస్థ గిరిజనుల జ్ఞానాన్ని కాలెండర్ల రూపంలో ప్రచురించింది. ఇంత సమాచారం దొరుకుతున్నాా మనం మాత్రం వాళ్ళగురించి తెలుసుకోకుండా, మనచదువులు వాళ్ళనెత్తిన రుద్దటానికి కొత్త కొత్త ప్రయోగాలతో నేలవిడిచిసాము చేస్తున్నాము.

' భజన చేసే విధము తెలియండి! ' జనులార మీరు .......