అమెరికా సంయుక్త రాష్ట్రములు/ఏడవ అధ్యాయము

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

స్వతంత్ర యుద్ధము — ప్రధమభాగము.

(1)

{యుద్ధ ప్రారంభము}

ఆంగ్లేయ సామాజ్యముపై అమెరికా వారు స్వతంత్రముకొఱకు చేసిన యుద్ధము రెండుభాగములుగ విభజించవచ్చును. 1776 మొదలు 1778 వరకు ఆమెరిశా రాష్ట్రము లితరుల సహాయములేకనే ఆంగ్లేయులతో పోరుపలిపిరి, ఇది ప్రధమభాగము 1778 మొదలు. 1783 వరకు జరిగిన యుద్ధములో పరాను. వారుసు, స్పెయినువారును, అమెరికనులకు తోడ్పడరి. ఇది రెండవ భాగము. బాస్టనుపట్టణమునకు పదునైదు మైళ్ళ దూర ముననున్న కంకార్డు గ్రాయమున ఒక ఆయుధాగారము గలదని ఆంగ్లేయ నేనాధిపతి జవరలు గాజునకు తెలిసి దాసిని నిర్మూ లింపచేయుటకును ప్రజానాయకులగు హాన్ కాకు సామ్యుయలు ఆడస్సులను పట్టుకొనుటను లెఫ్టినెంటు కలు లుస్మిత్తును ఎనిమిది వందల సైనికులతో 1775 సంవత్సరము ఏప్రియల్.. - .

నెల 18వ తేదీన రాత్రి పదకొండు గంటలకు బంపెను. ఈసంగతి ప్రజలకు ముందుగనే తెలసి ఎదిరించుటకు సిద్ధపడిరి. కల్నలు స్మితు ముందు పంపిన పటాలమును బాస్టనుకు 10 మయిళ్ళ దూరముననున్న లెక్సంగ్టగన్ వద్ద ప్రజలసైన్యమడ్డగించెను. ఉభయులునొకరిపై నొకరు తుపాకీల నుగాల్చిరి. ఇంతలో స్మిత్తు యొక్క తక్కిన సైన్యములు వచ్చి చేరినందున ఆంగ్లేయ సైన్యము లుదయము ఏడుగంటలకు కంకార్టు గ్రామము చేరెనుగాని ఆయుధములలో కొద్దిభాగము మాత్రమే వారికి దొరకెను. ఇంతలో అమెరికను ప్రజా సైన్యములు వచ్చెను. అప్పుడు జరిగిన యుద్ధ ములో ఆంగ్లేయుల పక్షమున 65 మంది సైనికులు చనిపోయిరి. 180 మందికి గాయములు తగిలెను, ఇటువది ఎబమిది మంది అమెరికనుల చే ఖైదు చేయబడిరి. అమెరికనులలో యేబది తొమ్మిదిముంది మరణించిరి.ముప్పది తొమ్మిదిమందికి గాయములు తగిలెను. అయిదుగురు మాత్రము ఆంగ్లేయులచే జిక్కిరి. త రిబీతు నొందిన ఆమెరికను ఐచ్చిక భటులగు రైతులచే పరాజయము నొందినందున అంగ్లేయుల ఖ్యాతి నశించెను. అమెరికను సైనికులు వెంటనంటి తరుచుగా ఆంగ్ల సైనికులు పారిపోయిరి.

{పారిపోయెను
పారిపోయెను

జనరలు గాజు యొక్క సైన్యములు మిక్కిలి తొందరగా మూడుగంటలలో నిరువది మైళ్ల దూరము అమెరికనులు వెంబడించిరిగాని అంత తొందర గా పోజాలక వెనుకకు తగ్గిరి. ఇది యుద్దప్రారంభము.

దీనిలో దేశమునందంతటను గొప్పకలవరము జరిగెను. ఇంతటినుండియు తమగవర్నరగు జవరలు గాజున కెట్టి విధేయ

తనుచూపకూడదనియు తమ దేశమున కాయన గర్భశత్రువనియు మెసషు సిట్సు రాష్ట్రీయసభ వారు తీర్మానించిరి. " కొలది దినములలో నిరువది వేల అమెరికను సైన్యములు బాస్టను ను ముట్టడించి అందలియాంగ్లేయ సైన్యముల కాహారపదార్ధ ములు బయట నుండి రాకుండ చేసెను. దక్షిణమున చాల చూరమున నున్న యుత్తర కారొలీనా రాష్ట్రములోని యొక పట్టణ ప్రజలు తమ కాగ్లేయ గాజునందు రాజభక్తి లేదనియు స్వతంత్రమును పొందితిమనియు ప్రకటించిరి. -

{ఆంగ్లేయులు
లోబడుట

న్యూయార్కు రాష్ట్రములోని రెండువందల డెబ్బది మంది సైనికులను వెంటబెట్టుకొనిపోయి యీ ఆంగ్లేగులు .యీధను ఆలను అను అమెరికను సేనాని మే 10 వ తేదీన ఆకస్మికముగా ఆంగ్లేయుల స్వాధీనమం దున్నట్టి కొండరీనా యనుకోటను ముట్టడించెను. అందులోని ఆంగ్లేయ సేనాధిపతిని సైన్యములను భగవంతుని పేరను అమె రికా దేశీయ మహాజన సభా పీరను తనకు లోబడమని కోరెను. ఎదిరించుటకు శక్తి జాలక ఆంగ్ల సైన్యములోబడెను. సూట యిరువది రెండు ఫిరంగులు ను విశేష సంఖ్యగల పడవలును చాలగ నాయుధ సామగ్రులును తుపాకిమందును నాకోటలో కూడ అమెరికెనులవశమయ్యెను. రెం డుదినముల తరువాత నీ అమెరికను సైన్యములు ఎట్టిఆటంకము లేకుండ మరియొక కోటను లోబర్చుకొనిరి. మే 10 వతేదీన అమెరికా దేశీయ మహాజనసభ రెండవసారి ఫిలడల్ ఫియా పట్టణముస సమావేశమయ్యెను. వచ్చి ప్రతినిధులలో ముందు సంయుక్త రాష్ట్రముల కధ్యక్షులుకాబోవు వాషింగ్టన్ - థామను జఫలసన్ జూ ఆదమ్సులు కూడనుండిరి. మె స. మన సెట్సు రాష్ట్ర ప్రతినిధులచే నుపపాధింపబడి ఆంగ్లేయులతోయుద్దము చేయుటకు దేశీ యమహాజనసభవారు తీర్మానించి ... పది హేను వేల సైన్యములను, ఇరుపదిలక్షల డాలరుల ఋణ "మును పోగుచేయుటకును తీర్మానించిరి.

{జార్జివాషింగ్టన్
అమెరికను సేనలకు
సర్వ సేనాధిపతి
అగుట}

దేశీయమహాజన సభ వా రిటులతీర్మానములు చేయు.చుండగా రెండు వేల మంది సైనికులలో నొక ఆంగ్లేయనాళాదళము బాస్టను రేవులోనికి వచ్చెను. జూన్ 12 వ తేదీన జనరలు గాజు సైనిక శాసనమును ప్రకటించెను. ప్రజానాయకులగు సామ్యయలు ఆడస్సుహంగా కులు తప్పమరియెవరైన ప్రజలు తమలో చేరినయెడల క్షమా పణనొసగెదసనికూడ ప్రకటించెను. ఈ ప్రకటనమును లక్ష్యంముచేసినవారెవరును లేరు. దేశీయమహాజససభ వారు అమోరకను సైన్యములపై జూర్జివాషింగ్టన్ ను సర్వ సేనాధి పతిగ నియమించిరి వాషింగ్టనున కిప్పుడు నలుపదమూడు సంవత్సర ములు వయసు గలదు. పదుహేను సంత్సరములనుండియు పర్షినియారాష్ట్ర ప్రజాప్రతినిధిసభలో సభ్యుడుగా నుండెను, ఇది వరకొంగ్లేయ ప్రభుత్వపక్షమున వర్జీనియా సైన్యములకు సేనా ధిపతియై యేడుసంవత్సరములు యుద్దములో పరాసువారి: పై యుద్ధము చేసెను. విషయజ్ఞానమునందును సరియగు నా లోచనము సందును అమెరికాలో సప్పుడున్న ప్రముఖులందరి లోను ఇష్టుడని ఈయనను గూర్చి హెనీ పాటికు చెప్పెను.ఆమెరికను సర్వసైన్యాధిపత్యమున కాయన జీతము పుచ్చుకొనుటకు -

నిరాకరించి తనకగు ఖర్చులు మాత్రము తీసుకొనుటకొప్పు కొనెను. వాషింగ్టన్ సర్వ నేనాధిపత్యము వహింపకమునుపే బంకరు కొండవద్ద యుద్ధము జరిగెను. ఇది బాస్టను పట్టం మునకు. సమావముననున్న 110 అడుగుల ఎత్తుగల మిట్ట పదేశము - జనరలు గాజు దీని నాక్ర మించి అచట నొక చిన్న కోటను నిర్మింపబోవుచున్నాడను వార్త తెలిసి ప్రెస్కాటు నేనాని నెయ్యిమంది. అమెరికను సైనికులతో వెళ్ళి ముందుగనే నా ప్రదేశమున ప్రవేశించ దలసెను. గాని బంకరు కొండకు మారుగ అమెరికను సైన్యములు పొరబాటున దానికి దక్షిణముననున్న బీడు' కొండ నాశ్రమించెను. ఇదియు సనుకూలమైన ప్రదేశమే. మూడు వేల మంది ఆంగ్ల సైనికు లచటికిపోయి అమెరికను సైన్యములన ముట్టడించిరి. అవుడు జరిగిన యుద్ధములో ఇంగ్లేయులలో నెక్కువ మంది హతులగుట7యు గాయములు పొండుటయూ జరిగెను. గాని ఆ మెరికనుల యుద్ధసామాగ్రులయి పోయినందున (ఎస్కాటు సేవాని భూప్రదేశమును వదలి తన అమెరికను సైన్యములను సురక్షితముగ నొక మైలు దూరముసనుషు ప్రాస్పెక్టు కొండకు చేర్చారు. ఈ యుద్ధము బాస్టసున కు సమీసమున జరిగియుండుటఁబట్టి బాస్టం ప్రజలు గుంపులు గుంపులుగా మిద్దెలమీద నుండియు మేడలమీదనుండియు చూచుచుండిరి. ఆంగ్లేయసై నికులు చార్లెస్టన్ పట్టణము వంతయు తగుల బెట్టి భస్మీపటలము గావించిరి.


{సేనల
హెచ్చిరిక

ఈ యుద్దము జరిగిన దినముననే దేశీయమహాజన సభవారు నలుగురు సేనాధిపతులను ఎమిది మంది సహాయ నేనానులను కూడ నియమించిరి. ఎర్రయిండియనులు తటస్థముగ నుండుసట్లేర్పాటు చేయుటకై కొంత దవ్యముతో కొందరు రాయబారులను పంపిరి. జూను 21 వ తేదీన జార్జి షింగ్టను, సర్వసేనాధి పత్యమూ వహించుటకు బయలు చే రెను. త్రోవలో బంకరు కొండ యుద్ధసమాచారము తెలసెను. సైన్యములవద్దకు, చేరగనే వారివుడు అమెరికా సంయుక్త రాష్ట్రముల సైనికులనియు రాష్ట్ర భేదములు నశించి యందరిని యొకేజాతీయభావము పురిగొలు పవలెననియు మనమందర వలంబించి మున్న పోరాటములో నెవ రెక్కువ సేవచేయుదురను తలంపుమాత్రమే వారి మనను కందుఁడవలెననియు సేనలతో హెచ్చరికను బంపెను. గాని సేనలు మంచిస్థితియందు లేవు, సేనాధిపతులు అసమర్ధులు, సైనికులు అవిధేయులు, వాషింగ్టను తరుచుగ సైనికులను కఠినముగ శిక్షించుచు వారిలో జాగ్రత్తను విధేయతను కలుగ జేసెను. సేనలన్ని యు బాస్టను పట్టణము చుట్టునుంచబడినవి. ఆంగ్లేయ సైనికులకును అమెరికను సైనికులకును తరచుగ చిన్న చిన్న కలహములు కలుగుచుండెను. వాషింగ్టనేమి చేయుటకును మందుగుండుసామాను బహుస్వల్పముగనున్నది. అదయి పోగానే చేయవలసిన దేమియో తోచకుండెను. రోడు. అయిలండు న్యూయార్కు మొదలగు రాష్ట్రముల వారికి , మందు గుండు సామానెంత స్వల్పముగ లభించినను పంపవలసిన దని వ్రాసెను. ఇంతలో సైనికుల నిర్నయకాల సమాప్తి,


సమీపించుచున్నది. కొంతగడువు వరకు మాత్రము పనిచేయు వలెనని వివిధ రాష్ట్రములనుండి ఐచ్చిక జాతీయ సైనికు లను పోగుచేసి యుండిరి, గడువుకాగనే వారు స్వగృహములలో చేరెదరు. కనెక్టికటు, రోడుఆయిలండు సైనికుల కాలము డిశంబరు ప్రధమ తేదీనను మెసషు సెట్సు నుండి వచ్చినవారి గడువు డిశంబరు నెలాఖరునను ముగియును. . ఆ దేశీయమహా జన సభ వారికి ఋణములు తగినంత పోగుకాలేదు. చేతిలో సొమ్ము లేదు. కాని బాస్టనును వాషింగ్టను స్వాధీన పరచు కొనవలెనని మాత్రము దేశములో నాత్రత యుండెను. ఈ సందర్భములలో బాస్టనును ముట్టడించుట వెర్రితనమని వాషింగ్టన్, నీసంగతుల నన్నింటిని దేశీయమహాజన సభ వారికి విపులముగ తెలియచేసిన మీదట బెంజమిను ఫొrక్లీను అధ్యక్షత కింద నిరువది మూడు వేల మంది సైనికులను జమచేయుటకును వాషింగ్టనుతో సంప్రదించుటకును నొక యపసంఘము నేర్పాటుచేసిరి.


2

{రాష్ట్రములలో
స్వతంత్ర స్థాపనము}

ఈ సమయమున . దక్షిణ రాష్ట్రములలో సొంగ్లేయురాజ్యాధికారము తొలగిపోవుచుండెను. వర్జీనియా రాష్ట్రపుగవర్నగు డను మొరు ప్రభువుఅక్కడి మందుగుండు సామానును వశపరచు కొనెను. రాష్ట్ర ప్రతినిధిసభ వారు సమావేశమై యా మందుగుండు సామాగి యొక్క మూల్యమును గవర్నకువద్ద నుండి బలవంగముగ వసూలు చేసి యాసొమ్మును దేశీయ మహా జనసభవానికి పంపిరి. తరువాత కొలది కాలముసకు ప్రజలకు


భయబడి గవర్నరు పారిపోయి మిక యూంగ్లేయ నౌకలో చేరను అక్కడ సమావేశము కావలసినదని ప్రజా పతినిధి సభ కాజ్ఞాపించగ వారు పోవుటకు నిరాకరించి యొక స్వతంత్ర పజా, ప్రభు త్వము నేర్పాటు చేసి.. రెండు కారొలీనా రాష్ట్రమములలోను కూడ ప్రజల తొందరలచేత నాంగ్లేయ గవర్నరులు పారిపో యిరి. యాంగ్ల నౌకలలోనికి చేసిరి. ఆ రాష్ట్రములలోను స్వతంత ప్రభుత్వము. లేర్పడెను, ఇక్కాలమున నాంగ్లేయ ప్రముఖుడగు వాల్పోలు అమెరికా పిరికిపందల దేశమని ప్రకటించి తను తేయాకు , తాగనిచో 'ఉపవాసము చేయించెద మని యాంగ్లేయ పార్లమెంటు వారు బెదరించిరి. కొంత సైన్యమునొక పట్టణము మీదికి మా నదియక్కడ చిక్కువడెను. ముట్టడికై సగము నౌకాదళమును పంపిరి. ఫిలడ ల్పియాలో సమావేశమైన అమేరికను మహాసభ ఆంధ్రసైనికులు బాస్టనులో చిక్కువడుటకు చూచి భయపడి రాజీకై ప్రయత్నించినను యాశతో సైనికులనేమియుచేయవలదని యుత్తరువిచ్చిరి. చివరకు సైన్యములను పోరాడుటకాగ్నాపించిరి. రెండుప ర్యాయము లోడిపోగానే 'నొక మమష్యు డైన మిగులకుండ యుద్ధము చేయవలెనని యుత్తరువుచేసిరి. అమెరికా పూర్తిగా నాంగ్లేయులనుండి పోవుటతోగాని తృప్తి చెందద ” . తన స్నేహితునికి వ్రాసెను. 1776 సంవత్సరం ఏప్రిలువెలలో నాంగ్లేయ ప్రముఖుడగు బర్కుతో నమెరికా 'యింగ్లాండు నుండి విడిపోక తప్పదని బెంజమిను ఫ్రార్కులిన్ చెప్పెను . -

{దేశీయ మహా జన
సభ వారి అర్జీలను
ఆంగ్ల పార్లమెంటు వారు
నిరాకరించిరి.}

బర్కు మొదలగు కొందరు పార్లమెంటు సభ్యులు సంధికై ప్రయత్నించిరి. 1763 సంతృరమువరకు నాంగ్లేయ ప్రభుత్వము వారు చేసియున్న శాసనముల నన్నిటిని తాము శిరసా వహింతుమనియు తరువాత చేసిన చట్టములను రద్దుపరచినచో తామాంగ్ల ప్రభుత్వము కిందనే నుందుమనియు మిరియొక మనవి: వ్రాసుకొని అమెరికను దేశీయ మహాజనసభవారీ పక్షమున విలియు పెన్ను 1775 సంవత్సరం జులై నెలలో నాంగ్లేయ పార్ల మెటువారి దర్శన ము చేయుటకు వెళ్ళెను. కాని విలియం పెన్నుకు ఆంగ్ల ప్రభుత్వమువారు దర్శనమిచ్చుటకు నిరాకరించిరి. ఆయన దాఖ లు చేసిన ఆర్టీకి జవాబేమని యడుగగ జవాబు చెప్పుటకు తిరస్కరించి. తరువాత పదిరోజుల కనగ 28 వ ఆగస్టు తేదిన తిరుగబాటును రాజద్రోహమును నణచివేసెదమని యూంగ్లేయరాజు ప్రకటనములు గావించెను.. జనారల్ గాజు సేనానిని పిలిపించి యాయనకు మారుగ కార్లెటన్ , హె, అను ఇద్దకు 'సేనాధ్యక్షులను నియమించిరి. గాజు యొక్క స్వంత దేశమగు హనోవరునుండి యు ఇతర జర్మను రాష్ట్రముల నుండియు జర్మను సేనలను కూడ రావించిరి. హాలెండు, రుష్యా దేశముల ప్రభుత్వముతోను సైన్యములు పంపమని కోరిరి. గాని వారు పంపలేదు.

అక్టోబకు 26 వ తేదీన నాంగ్ల పార్లమెంటు తిరిగిన సమావేశ మయ్యెను. రాజు. యొక్క తీవ్ర

{ఆంగ్ల ప్రభుత్వము
అమెరికనులను
చీలదీయుట}

మగు సుపన్యాసములో అమెరికనులు స్వతంత్రమును పొందుటకు యుద్దము చేయుచున్నారనియు వారిని జయించి లోబరచుకొనుటకు ఆంగ్లేయ, ప్రభుత్వము నిశ్చయించినదనియు నుడి వెను. పార్ల మెంటులోని కొందరు ప్రముఖులగు సభ్యులు ఆమేరికా వారి తో సంధి చేసుకొనవలెనని చెప్పిరి. టోకాని యెక్కువమంది సభ్యులును రాజును మంత్రులను అమెరికా వారి యవిధేయతకు బుద్ధివచ్చునట్లు శిక్షించవలెననియే పట్టుదలను చూపిరి, ఆంగ్ల దేశములోని చాలమంది ప్రజలును రాజు పరముననేయుండిరి. అమెరికాలోని తిరుగబాటు సణచివేయుటకై రావలసిన సైస్వములను బంపుటకును ఈయుద్దమున కవసరమగు వ్రయము చేయుటకుమ మంత్రుల కధికార మొసంగబడెను. ఆమెరిగా లోని పదమూడు రాష్ట్రములతోను నెట్టివర్తకము జరుప గూడదని పార్లమెంటునారు చట్టమును చేసిరి. గాని ఏరాష్ట్ర మునుగాని లేక రాష్ట్రములోని కొంత మంది ప్రజలుగాని ఆం గ్లేయులతో సఖ్యముగ నుండునట్లాడంబడి యెడల వారిమీద యుద్ధము చేయమనికూడ ప్రకటించి ఇట్లు ఆంగ్లేయులతో చేరు వారిని ప్రోత్సహించుటకై కమీషనరులను బంపిరి. ఇది అమెరికాలోని ప్రజలను చీలదీయుటకై యుద్దేశింవబడిపపన్నుగడ. అమెరికాలో కూడ పెనిసిల్వానియా, న్యూజర్నీ, డెలవేరు, మే రీలాండు, అనునాలుగు రాష్ట్రములకును ఆంగ్లేయరాజ్యముతో విడిపోవుటకింక సుయిష్టము లేకుండెను. దేశీయ మహాజనసభవారు అమెరికను నౌకాదళ మేర్పరచి

{అమెరికనుల
అపజయము}

దాని నిబంధనలను చేసిరి. ఆంగ్లేయసై నికుల కాహారము తీసుకొని పోవు పడవలసు పట్టుకొనుటకు తీర్మానించిరి. ఆంగ్లేయ సైన్యములను వదలి అమెరికను పరుసచేరిన మాంగము సేనాని కొంత మంది అమెరికను సైనికులతో ఆంగ్లేయ రాజ్యముగు కనడా పైకి దండెత్తి నవంబరు 12వ తేదీన మాంటురీయలు పట్టణమును పట్టుకొనెను. అక్కడనుస్న వరాసులుసు ఎర్రయిండియనులును కూడ అమెరికనులకు స్నేహభావమును చూపిరి గాని అక్కడ చేరిన తరువాత మాంగమరికి నూతన కష్టమెదుర్కొ నెను. తన కింది సెనికులలో చాలమందికి గడువయిపోయినందున తమ స్వగామములకు వెళ్లెదమని పట్టుబట్టిరి. ఇంతలో ఆర్నల్డ సేనానిని పదకొండు వందల మంది అమెరికను సేనలతో కెనడా లోని క్విచకు పట్టణమును ముట్టడించుటకు బయలు దేరెను. గాని తోవలో నాహారపదార్తము లయిపోయెను. కొందరు సైనికులు విడిచి వెళ్లిపోయిరి. మిగిలినవారు తిండి లేక ఎద్దులను కుక్కలకు చంపుకొని తినిరి. తరువాత దుంపలను తినిరి. చెట్ల బెరడులను తినిరి.. ఇవియు దొరకక రెండు రోజులు పూర్తిగ నుపవాసముచేసిరి. చివర నెటులనో ఆర్నల్డు క్విచికు చేరెను. అప్పటికి తొమ్మిది వందల సైనికులుండిరి. వస్త్రములుగాని తగిన అయుధసామానుగాని లేకుండెను. ఇట్టివారితో నేమియు చేయు జాలక కనిపెట్టుకొని యుండగా మాంగుమరీ నేనాని మూడు వందల మంది సైనికులతో వచ్చి కలసెను. ఈస్వల్ప సైన్యముతో, అమెరికనులు ,

మిగుల థైర్యముగా క్విచికోటను ముట్టడించిరి. గాని క్విచికుకోట మిగుల బలముగ సంరక్షించబడినది. లోపల రెండువందల మంచి ఫిరంగులును బయట నుండిన అమెరికనులకు రెట్టింపు సంఖ్యగల 'ఆంగ్లేయ సైన్యములు నుండెను. అమెరికసులు క్విచికోటను వశపరచుకొని పోయిరి. మాంగ మరీ నేనాని హతుడయ్యెను. మూడవవంతు అమెరికను సైనికులాంగ్లేయులచే ఖయిదీలుగా పట్టుకొనబడిరి. అమెరికను " సంపూర్ణముగా నోడిపోయిరి.

{అమెరికను జాతీయ
అతాక మెత్తబడుట}

వర్జీనియా రాష్ట్రము యొక్క ఆంగ్లేయగవర్నరు డనుమొరు ప్రభువు సైనిక శాసనముసు, ప్రకటించెను. 1776 సంవత్సరం 1 వ జనవరి తేదీన నాయనను నారు ఫోరుపట్టణ ప్రజలు వెళ్ళగొట్టిరి .. ఆయన నాంగ్ల సైన్యములతో నాపట్టణమును ముట్టడించి తగల బెట్టెను. ఇందు వలస అమెరికనులలో నాంగ్లేయులయందు ద్వేషమును కసి తీర్చుకోవలెననును ద్రేకమును వృద్ది చందెను. ఆనూతనసంవత్సర ప్రధమదినము ననే ఎరుపు 'తెలుపు వర్ణముల పదమూ డుచారలు గల అమెరికను జాతీయ జండా ఎత్తబడెను. పద మూడు యుద్ధనౌకలుకూడ నిర్మించబడెను.

(3)

{అమెరికావారి
దుస్తితి.}

వాషింగ్టను సేనాని స్వల్ప సైన్యములతో బాస్టను పట్టణము బయట విడిసి యుండెను. ఆయసద్ద తగిన మందుగుండు సామానుగాని ద్రవ్యముగానీ లేకుండెను. సైనికులు ఇండ్లకు పోవలెనని యాతురపడుచుండిరి. ముఖ్యముగా


కనెక్టికటు రాష్ట్రమునుండి వచ్చిన సైనికులు నిర్నయకాలమూ, రాకముందే గృహములకు వెళ్ళిరి. ఇంకకొన్నిన్ని రాష్ట్రములు వారును గడుపుకాగనే వెళ్ళిరి. కొత్తసైస్యములు కొన్ని వచ్చిచేరెను, కాని తగిన శిక్షణ పొందియుండ లేదు. దేశీయ మహా జన సభ వారు బాస్టను పట్టణము ను మట్టడించవలసినదని వాషింగ్టను కుత్తర విచ్చియుండిరి.. తనవద్దనున్న యుద్ధపరికరములు చాలక, ఆయన సమయమును వేచి యుండెను. మానువ చరిత్రలో నెక్కడనై న వెదుకము. మావఁంటి దీన స్థితి ఎవరికైన కలిగినాయని. పశ్నించుచున్నాను. బలవంతమ యిన ఆంగ్ల సేసలు బాస్టనలోనుండగ ఆఫట్టణము బయట తుపాకి మందు కూడ లేక మే మారు నెలలనుండియు నూరక కాచుకొని యున్నాము. మా సైన్యములలో నొకటి విడి పోవుటయు మరియొక దానిని నూతనముగా తరిబీదు చేసుకొను టయు జరుగుచున్నది. ఈ పరి స్థితిలో ""మే మేమిచేయగలము? గాని యెటులో పరమేశ్వరుడు మాతత్రువుల కన్నలకందకారముగప్పునని మాత్రము త్రికరణ శుద్దిగనమ్ముచున్నాను అని వాషింగ్టను ఒక స్నేహితునికి వ్రాసెను.' గాని ఇట్టికష్ట స్థితిలో గూడ నమెరికా వారు స్వాతంత్ర్య ప్రకటనము గావిం పక తప్పదని ఆయన నిశ్చయించెను.

{వాషింగ్టన్ యొక్క
విజయము}

తుట్టతుదకు మార్చి 4వ తేదీన ఆకస్మికముగా నొకరాత్రి వాషింగ్టను సేనాని బాస్టను పట్టణము నకును దాని సముద్ర రేవునకును ముఖ్యబల మైన డార్చెష్టరు మిట్టప్రదేశమును పట్టుకొని స్వాధీనమును పొంది అక్కడ కందకములు, తవ్వి కోటబురు

జులను కట్టి సంరక్షణ యత్త పరచుచుండెను. గొప్ప తుపాను కలిగి ఆంగ్ల నౌకాదళము నిష్ప్రయోజక మయ్యెను. అమెరికను సైన్యములు మిట్టప్రదేశములనుండి బాస్టనులోని ఆంగ్లేయ సైన్యములపై కాల్చుచుండెను. 17వ మార్చి తేదీన ఆంగ్లేయ సైన్యములు బాస్టను పట్టణమును వదలి వెళ్ళిపోయెను. మార్చి 20వ తేదీన వాషింగ్టను తన అమెరి కను సైన్యములతో పురవాసుల జయజయధ్వానముల మధ్య బాస్టసుపుర ప్రవేశము గావించెను. పదిరోజుల తరువాత బాస్టను 'రేవునకు సమీపముననున్న ఆంగ్లేయ నౌకాసైన్యము కూడ వెళ్ళిపోయెసు. న్యూ ఇంగ్లాడు రాష్ట్రసముదాయ మంతయు నింతటి నుంచి ఆంగ్లేయుల నుండి విముక్తి నిచెందెను.


దేశీయ మహాజన సభ వారి యుత్త రువుల ననుసరించి అమెరికను యుద్ధనౌకలు ఆంగ్ల యోడలను వెంబడించుచు తరుముచుండెను.' ఐర్లాండు దేశవు నౌకల జోలికి పోవుట లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రములలోనికి ఇంతటి నుండియు బాని సలను దిగుమతి చేయకూడ దని దేశీ యమహాజనసభ నిషేధించెను. ఏప్రిలు 6వ తేదీన "ఇంగ్లాండురాజునకు లోబడి యున్న ప్రదేశములు” గాక మిగిలిన యావ తృపంచముతోను స్వేచ్చగా వాణిజ్యము చేయుటకు దేశీమహాజనసభవారు తీర్మానించిరి. దీనితో అమెరికనుల వర్తక స్వాతంత్యము పూర్తి యయ్యెను.

ఫాన్సువారి సహాయ మన్వేషించుటకొర రహస్య యుపసంఘ "మేర్పాటు చేయబడింది. ఆమెరికను రాయ

{పరాసు వారు
సహాయముచేయుటకు
తీర్మానించుట

బారి పరాను దేశములోని ముఖ్యుల సానుభూతికై ప్రయత్నించుచుండెను. ఇరువది యైదువేల అమెరికను సైనికులకు సరియు యుద్దపరికరములను మందుగుండు సామాగ్రిని దుస్తులను నూరుఫిరంగులను ఇవ్వవలసినదని ఫెంచివారినికోరిరి. ఆమెరికను రాయబారి రాకమునుపే అమెరికనులకు సహాయము చేయు విషయమను గూర్చి పరాసు మంత్రివర్గమువారు యోచించ సాగిరి. ఏప్రిలు 6 వ తేదీన సమావేశమయిరి. ప్రధాన మంత్రి తుర్గోకు పరాను దేశము నెట్టియుద్ధములోను దింపుట కిష్టము లేకుండెను " అమెరికినులు స్వాతంత్ర్యము పొందక తప్పదు. ఈనాడు కానిచో రేపయినను పొందుదురు కాని మన మాంగ్లేయులతో యుద్ధములో ప్రవేశించుట నాకిష్టము లేదు. అని ఆయన చెప్పెను. 'విదేశ వ్యవహారమంత్రి వర్డెన్ ఆమెరికనులకు సహాయము చేయవలెనని పట్టుదలకలిగి యుండెను. అమెరికను లోడిపోయినచో, మానవకోటి యొక్క స్వాతం త్యమునకు గొప్పనష్టము కలుగును, తిరిగి పెట్టి స్వాతంత్రోద్యమముసు తల పెట్టుటకును ఏజాతీయు సాహసించదు. అని ఆయన సుడివెను. మంత్రివర్గములో అధిక సంఖ్యాకులు సహాయముచే యుటకే తీర్మానించిరి. మే నెలలో పరాసు దేశపురాజు తాము పదిలక్షల పరాసు లిపరీలను అమెరికను సహాయార్దము పంప బోవుచున్నామని స్పైన్ రాజునకు తెలియ చేసెను. స్పైన్ రాజుకూడ మరియొక పదిలక్షల లిపరీలను పంపెను.

ఈ మధ్య కాలమున అమెరికను రాష్ట్రములలో నాం.గ్లే

{రాష్ట్రములలో స్వతంత్ర
ప్రకటనములు.}

యప్రభుత్వము కూలిపోవుచుండెను. 26 వ మార్చి తేదీన దక్షిణ కారోలీనా రాష్ట్రము స్వతంత్ర ప్రభుత్వమును స్థాపించుకొనెను. ఉత్తర కారొలీనా రాష్ట్రములోని న్యాయస్థానము తెరవగ నే ప్రధాన న్యాయాధిపతి ' ఆంగ్లేయరాజు మూడవ జూర్జిప్రభుత్వ విసర్జనము చేసెననియు మమీదనాయన కేట్టి. యధికారము లేదనియు మన మాయని కెట్టి రాజభక్తినిచూప నవసరము లేదనియు” ప్రకటించెను, 4 వ మే తేదీన రోడు అయిలాండు లోని ప్రప్రజాప్రపతినిధిసభవారు” ఈ రాష్ట్రములోని ప్రజ లాంగ్లేయ రాజునకు లోబడిన పాలితులు కారు " అని ప్ర కటించిరి. 6వ తేదీన” ఆంగ్లేయ రాజు చేతను పార్లమెంటు తమకుగల అరాదిసిద్ధమగు హక్కులు భగ్నము కావింపబడినందున వారితో నెట్టి సంబంధము తమకు లేదని" పర్జీనియా రాష్ట్రీయసభవాగు తీర్మానించిరి. మే 15 వ తేదీన అమెరికాసంయుక్త రాష్ట్రములు ఆంగ్లేయరాజుకును పార్లమెంటుకును లో బడని స్వేచ్ఛాయుతమైనట్టియు స్వాతంత మైనట్టి యూ రాష్ట్రములని ప్రకటించుటకు " దేశీయమహజనసభలో సుపపాదించవలసినదని వర్జీనియానుండి వెళ్లిన ప్రతినిధుల కాజ్ఞాపించిరి. జూ. 12వ తేదీన నొక సుప్రసిద్ధమైన హక్కుల ప్రకటనమును గావించిరి. దీనిని బట్టియే దేశీయమహాజన సభవారు 4 వ జులై తేదీన తమ ప్రకటనమును చేసిరి. ఇంతలో" అమెరికను రాష్ట్రముల ప్రజలు ఆంగ్లేయరాజు యొక్క పాలనమునందండుట న్యాయమునకును మనస్సాక్షి కీని వ్యతిరేక మయినందున ఆంగ్లేయ. పాలనమును పూర్తిగా కూలద్రోయట అత్యవసరమ”,ను. సుపోద్ఘాతముతో ప్రతిరాష్ట్రమ్మును తమకనుకూలమగు స్వాతంత్ర రాజ్యాంగ విధానమును ' తయారు చేసుకొనవలసినదని దేశీయ మహాజనసభ తీర్మానించెను. జూన్ 7వ తేదీన "సం యుక్త రాష్ట్రములు స్వతం,తమును ' పొందినవి. 'గావున విదేశములలో నొడంబడికలు చేసుకొనుటకును - సంయుక్త రాజ్యాంగ విధానమును తయారుచేయుటకును” దేశీయమహాసభ వారు మరియొక తీర్శానమును కూడ చేసిరి. వీటి నమలులో పెట్టుటకు నంఘములను నియమించిరి.

{కనడాలో ఆమెరికనులు
ఓడిపోవుట}

జూన్ 28వ తేదీన చార్లెసుటనులో జరిగిన యుద్ధము సందు ఆంగ్లేయ సైనికులలో రెండువందల అయిదుగురును, అమెరికనులు ముప్పది యేడుగురును హతులైరి, ఇదికూడ అమెరికను పక్షముసకు కొంత ప్రోత్సాహమును కలుగచేసెను, కాని కనడాలో నమెరికనులకు గొప్ప పరాభవము కలిగెను. మాంగు మరి సేనాని చనిపోయినతరువాత కొద్ది సైన్యము , ఆర్నల్డు సేనాని క్విబికు వద్ద నేయుండి ఇంకకొంత సైశ్యముని తెప్పించు కొనెను. కాని వీరును ఆంగ్లేయులముందర చాలలేదు. ద్రవ్య ముగాని సొమగ్రుగాని అమెరికనులకు తగినంత లేకుండెను.మొదట వీరియందు సానుభూతిని చూపిన కెనడా ప్రజలు వీరికి వ్యతిరేకు లైరి. వాషింగ్టను కూడ మూడు వేలసైనికులను వీరికి సహాయముగా పంపెను. కాని అంతము వ్యర్ధమయ్యే ను. అమెరికను సెన్యములలో స్పోటకము వ్యాపించెను. ముట్టడిని వదలి మరలి రాసాగిరి. ఆంగ్లేయులు 'వెంటటనంటి తరిమి సంయుక్త రాష్ట్రములు ఆమెరికనులు పారిపోయిరి. త్రోవలో జాడ్యమువలననూ. తిండి లేకను శత్రువులవలనను అనేకులు మరణించిరి. కొందరు. ఆత్రువులచే జిక్కిరి. బహుస్వల్ప సంఖ్య మిగుల దౌర్భాగ్మగు స్థితిలో కనడా సరిహద్దును దాటి అమెరికను రాష్ట్ర ములలో ప్రవేశించెను.


{అమెరికను సైనికుల
దౌర్భాగ్యస్థితి

బాస్టను స్వాధీనమయిన తరువాత వాషింగ్టను న్యూయార్కు పట్టణమును తన సైన్యములకు ముఖ్య స్థానముగా చేసికొనెను. న్యూయార్కు సందు కొంద రాంగ్లేయుల యందు , భక్తిగల వారు గలరు. ఇది మిక్కిలి అపాయకరమైన స్థితి కాన వాషింగ్టను న్యూయార్కు సంరక్షణకై కోటలను నిర్మించెను. గాని ఆయన క్రింద నుండిన సైన్యములు మిగుల హీనస్థితిలో నుండెను. ఏడు వేలమంది సైనికులు మాత్రముండిరి. ' ఆయుధ సామగ్రి జాలదు. ద్రవ్యము లేదు. దుస్తులు లేవు. సైనికు లిండ్లకుపోవుటకు తొందర పడుచుండిరి. ఇంతలో అమెరికను సైన్యములలో కొందరాంగ్లేయుల పక్షము నచేరుటకు కుట్ర సలిపినట్లు కూడ బయల్పడెను. విచారణ చేసి కుట్రదార్లలో ముఖ్యులను సైనికాధి కార్లును ఉతీసి.. జూన్ నెల చివరభాగమున మూడు సంవ త్సరములవరకుగాని లేక యుద్దమాఖరగువరకు గాని కొలువు లోనుండు షరతుతో సైనికులను పోగుచేయుటకు దేశీయ సభవారు తీర్మానించిరి. జూన్ 29వ తేదీన నలుబది యెదు. ఆంగ్లేయనౌకలు ముప్పది వేల మంది సైనికులతో సాండిహుకు రేవులో దిగెను. ఇంకను కొన్ని యోడలువచ్చు సమాచారము కూడ తెలిసెను, ఈ సంగతి వాషింగ్టను దేశీయమహా ఖాళీ
1776 సం॥ 4వ జూలై తేదీన స్వతంత్ర ప్రకటనము గావించిన సంయుక్తరాష్ట్రముల దేశీయ మహాజన సభాసమావేశము.


'నసభ వారికి తెలిపెను. కానిచేయునదేమి? ఎటు చూచినను క్లిష్టమగు పరిస్థితులెదుర్కొనెను. వాషింగ్టను క్రిందినహాయసేనానిగనున్న 'జోసెఫు రీడు నిరాశాశ చెంది తనకు స్థితిగతులెంత హీనముగనున్న వని ప్రధమముననే తెలిసియున్నచో - నీయుద్ధములో ప్రవేశించియుండనని వాషింగ్టనుకువ్రాసెను.


(5) అమెరికా సంయుక్త రాష్ట్రముల స్వతంత్ర ప్రకటనము.

(1776 సంవత్సరము" జులై 4వ తేదీ)

{దేశీయ మహాసభ
వారి స్వాతంత్ర ప్రకటన}


ఈ కష్టమగు పరిస్థితుల మధ్య నే 1776 వ సంవత్సరం 4వ జులై తేదీన అమెరికా దేశీయమహాజగసభ వారు. సమావేశమై చరిత్రలో మిగుల ఖ్యాతి వడిసినట్టియు మానవకోటి కాదర్శప్రాయమైనట్టియు స్వాతంత్ర్య ప్రకటనమును గావించిరి. "మానవులందరుమ పుట్టుక వల్ల సమానులు, స్వభా వముగ సృష్టికర్త మానవులకందరకును ఎప్పటికిని భంగము చేయబడగూడని కొన్ని హక్కుల నిచ్చియున్నాడు. అని ప్రాణము స్వతంత్రము సౌఖ్యము పొందు ప్రయత్నము మొదలగునవి. ఈసహజ హక్కులను కాపొడుటకై మానవులు బుద్ధి పూర్వకముగ : ప్రభుత్వముల నేర్పరచుకొని యున్నారు. ప్రభుత్యములు చెలాయించు సధికారములన్నియు పాలితు లిచ్చిన వేగాని పభుత్యములకు స్వంతమగు హక్కు లేమియు లేవు. ఏ ప్రభుత్వమైనను ప్రజల జన్మహక్కులకు వ్యతిరేక ముగ సంచరించినచో దానిని మార్చుటకును నాశనము చేయుటకును క్రొత్త విధమగు ప్రభుత్వమును స్థాపించుకొనుటకును ప్రజలకు సంపూర్ణమగు హక్కుగలదు." . అనుమొదలగు మానవహక్కులను సిద్ధాంతీకరించిరి. ఆంగ్లేయు రాజు వలనరాష్ట్రములమీద జపిన నిరంకుశ చర్యలను ఖండించిరి, " మమాయన సంరక్షణలో లేమని ప్రకటించుట వలనను మామీద యుద్ధము గావించుట వలనను ఆయన మా మీద రాజ్యమును కోల్పోయినాడు, ఆయన మాసముద్ర తీరములను దోచుకొనెను. రేవులను నాశనము చేసెను, మాపట్టణములను తగుల. బెట్టెను. మా ప్రజలను హత్యగా వించెను, మామీద నిరంకుశత్వమును స్థాపించు నుద్దేశముతో విదేశ సైన్యములను మామీదకు బంపి నాగరీకతగల రాజ్యమని తమకుగల పేరునకు వ్యతిరేకముగ మిక్కిలి యనాగరీక మైనట్టియు క్రూర మైనట్టియు ఘాతుక కృత్యములను మాపైసలుపుచున్నాడు తనరాయబారులను బంపి మాలో గృహ కల్లోలములను కుట్రలను చేయించ ప్రయత్నించినాడు. 'మేము పెట్టిన అర్జీలు తోసి వేయబడినవి. రాయ బారములు నిష్పల మైనవి. మాసోదనులగు ఆంగ్లేయ దేశ ప్రజలు ఔదార్యమును

న్యాయమును చూపుదురని ఆశించియుంటిమి. కాని మా ఆశ నిరాశయైనది. న్యాయమునకును ధర్మమునకును ఆంగ్ల ప్రజలు పెడచెవిని పెట్టినారు. "అని, వ్రాసిరి. కావున దేశైయమహాజనసభలో సమావేశమైన అమెరికా సంయుక్తరాష్టృముల ప్రతినిధులమైన మేము మాయొక్క యుద్దేశ్యముల పవిత్రతనుగూర్చియు మాపక్షము యొక్క న్యాయమును గూర్చియు జాతుల యదృష్టమును నిర్ణయించు పరమేశ్వరునికి మనవిచేసికొనుచు; సంయుక్త రాష్ట్రములలో నివశించు ప్రజలతరఫునను వారి అధికారము క్రిందను, సంయుక్త రాష్ట్రములు స్వతంత్రమైన రాష్ట్రములుగ నేర్పడినవనియు స్వతంత్రమును పొందుటకు హక్కు కలిగి యున్నదనియ; బ్రిటిషు రాజునకు చూపవలసి యుండిన రాజభక్తి నుండి పూర్తిగా విముక్తి చెందినవనియు ఆంగ్లేయరాజ్యమునకును మాకును గల రాజకీయ సంబంధము సంపూర్ణముగ తొలగిపోయిన దనియు స్వతంత్రమైన రాష్ట్రములయినందున సంయుక్తరాష్ట్రములవారు యుద్ధముచేయుటకును సంధి చేసుకొనుటకును యొడంబడికెలలో ప్రవేశించుటకును వర్తకపు టేర్పాట్లుచేయుటకును స్వతంతమైన ప్రభుత్వములు చేయగల సమస్త ఇతర కార్వములను నిర్వర్తించుటకును సంపూర్ణమగు హక్కును కలిగియున్నారనియు దృఢదీక్షతో ప్రకటించుచున్నాము. ఈప్రకటనసలు సఫల సుగుటకై ధర్మ స్వరూపుడగు భగవంతుని మీద పూర్తి భారము వైచి మాప్రాణములను మాఆస్తులను పవిత్రమైన మాగౌరవమును సమర్పించుచున్నామని తెలియజేసిరి. ఈస్వాతంత్ర్య


ప్రకటనము స్యూయార్కు రాష్టముగాక మిగిలిన యన్ని రాష్ట్రముల ప్రతినిధుల చేతను నేకగ్రీవముగా నంగీరించ బడెను. దీనిలో నిమిడియున్న ముఖ్య సూత్రములు అన్ని కాలములలోను ఇతరులచే వత్తిడి చేయబడి స్వాతం త్యయి.ను గోరుజాతుల కాశను పురిగొల్పుచున్నవి. మరియు ప్రపంచములోని రాజకీయ విప్లవముల కెల్ల పునాదిగ సున్నవి.

అమెరికనులలో మితి లేని
యుత్సాహము

ఈ స్వాతంత్య ప్రకటనము సంయుక్త రాష్ట్రముల ప్రజలలో మితిలేని యుత్సాహమును కలుగచేసెను. ఫిలడల్ఫియా పట్టణముననున్న స్వాతంత్ర్య పుర మందిరములో జయ సూచక ముగ గంటలు లేని మోగించబడెను. "దేశములోని యందరు ప్రజలకుసు స్వతం త్రము" అని యాపురమందిరము మీద చిత్రించబడెను. వర్జీనియా రాష్ట్రము ప్రజాస్వామ్యమయినదని చట్టమును చేసినది. న్యూయార్కులో మూడవ జార్జి సార్వభౌముని పత్రిమ పజలచే నాశనము చేయబడినది. స్వాతంత్ర్య ప్రకటనను, వాషింగ్టసుకు చేరిన 9న జులై దినమున సైనికుల నందరిని నిలున బెట్టి వినిపించెను. సైనికులందరును నెత్తిమీది టోపీలు తీసి బహు నంరతతో నాలకించిరి. . (6)

ఆంగ్లేయులు
జయమొందిరి

కాని దుర్దినములు రానున్నవి, న్యూయార్కు పట్టణము నందు వాషింగుటను సేసలుండెను. దానిని బలపరచుటకు వాషింగ్టను కోటలను కట్టు చుండెను. దానికి సమీపముననున్న లాంగు ద్వీపములో తొమ్మిది వేల అమెరికను సైనికులు సల్లిపను సర్లింగు సేనానుల


క్రింద విడిసి యుండెను. ఆంగ్లేయ నౌకాదళ మొకవైపు నుండియు సేనలొక వైపునుండియు ఆగస్టు 27వ తేదీన నీలాంగు ద్వీపములోని అమెరికను సేనలను ముట్టడించెను. ఆంగ్ల సేనలు చాలసధికముగ వచ్చి పైబడెను. ఉభయులకు జరిగిన పోరాటములో ఆంగ్లేయులు, పూర్తిగ జయమొందిరి. ఇద్దరమెరికసు సేనాసులను వెయ్యిమంది అమెరికను సైనికులను ఖయిదుచేసిరి. ఆరువందలు అమెరికసులు హుతులైరి. న్యూయార్కులో స్వల్పసంఖ్యగల సేనలు మాత్రమే యుండినందున వాషింగ్టన్ సహాయము చేయజులక పోయెను. ఆగషు 29 వ తేది రాత్రి వేళ మిగిలిన సైనికులందరు ఎటులనో వాషింగ్టన్ న్యూయార్కు పట్టణములోనికి చేర్చెను. లాంగు ద్వీపములో నమెరికనులకు గలిగిన యపజయము చాలవరకు వలస ప్రజలకే గాక అమెరికను సైనికులకు గూడ నిరుత్సాహమును కలుగచేసెను. 2 వ సెప్టెంబరు తేదిన వాషింగ్టను దేశీయ మహాజనసభ వారి కిటుల, వ్రాసెను ' మనస్థితి మిగుల దుఖకరౌగనున్నది. లాంగు ద్వీపపు యుద్ధము వలన మన ఐచ్చిక సైనికులలో నధిక సంఖ్యాకులు అధైర్యమును నిరాశసు చెందినారు. సైనికు లిండ్లకు పోవుటకు ఆతురతను జూపుచున్నారు. అనేక మంది యిదివరకే చెప్పకుండ పారిపోయినారు. కొన్ని పటాలములు యావత్తును కొన్ని కొంతవరకును నీవిధమున ఖాలీ అయినవి. మిగిలియున్న సైనికులోర్పునుగాని నిగ్రహమును గాని విధేయతసుగాని చూపుట లేదు. నాకీఐచ్చిక సైస్వముల యందు విశ్వాసముపోయినదని వ్రాయుటకు చింతిల్లుచున్నాను. "యుద్ధ మాఖరగువరకు స్థిరముగానుండు సైన్యముల నేర్పాటు చేసిన A గాని మనమేమియు చేయజాలమనియు కొంత కాలమువరకు చూత్రమే కొలువులో సుందు పని చేరిన ఐచ్ఛిక భటులను నమ్మిన యెడల మోసము వాటిల్లుననియు కూడ నాయన గట్టిగ వ్రాసెను. కనెక్టికటు రాష్ట్రము నుండి వచ్చిన ఆరు వేలమంది సైనికులు మాత్రము నిలిచియుండిరి. మిగిలినవారు సేనలను విడిచి గృహములకు జనిరి. సైనికులలో నాలుగవ వంతుకు అనారోగ్యముగ కూడ నుండెను. అందరికిని రెండు నెలల, జీతము బాకీపడినది. ఇచ్చుటకు సొమ్ము లేదు.

అమెరికనులు న్యూయార్కును
వదిలి పాఅరిపోయిరి

ఆంగ్లేయ సైన్యములు విజృంభించి న్యూయార్కు అమెరికనులు న్యూయార్కు పట్టణమును ముట్టడించుటకు తలపడెను. 11 వ సెప్టెంబరు తేదీన అమెరిక నులకును ఆగ్లేయులకును సంధి కుదర్చవలెనని ఉభయ పక్షముల ప్రముఖులును స్టేటను ద్వీపములో చేరిరి.కాని ఏమియు కుదరలేదు. 18వ తేదీనాడు ఆంగ్లేయ సైన్యములు న్యూయూర్కు ముట్టడిని ప్రారంభించెను. రెండుదినములు కాగనే అమెరికను సేన్యములలో నిస్పృహజనించినది. అమెరికనులు సైన్యములను విడచి పలాయనమగుచుండిరి. వాషింగ్టన్ నెంత ప్రోత్సాహించిపను ఆగలేదు. ఎనిమిదిపటాలముల సైనికులు, పారిపోయి ఖాళీ అయినవి. ఆంగ్లేయులమీద తుపాకులను గూడ కాల్చకుండ పారిపోయిరి. వాషింగ్టను ఖడ్గమును తుపాకిని ధరించి శతృవులముందు నిలచి తన సైనికులను హెచ్చరించుచుండెను. ప్రయోజనమేమియు లేదయ్యెను. అమెరికను సేనానులందరును కలసి న్యూయార్కు పట్టణము వదలిపోవు టయే చేయదగినపనియని నిశ్చయించిరి. సెప్టెంబరు 15వ తేదీన యుద్ధసామాగ్రులను ఫిరంగులను వదలి పెట్టి అమెరికను నేనలన్నియు న్యూయార్కును వదలిపోయెను. ఆంగ్లేయు సేనలు న్యూయార్కు పట్టణమునుజయప్రదముగా ప్రవేశించెను. అమెరికను సేనలను వాషింగ్టను న్యూయార్కుకు సమీపమున నున్న ఒక చిన్న మిట్ట మీద ప్రవేశ పెట్టెను. అక్కడ నొక కోటను నిర్మించెను. దానికి వాషింగ్టను కోటయని నామారణము చేసిరి.

(7)

వాషింగ్టన్ కోట
ఆంగ్లేయుల వశమయ్యెను.


దేశీయమహాజవసభవారు నాషింగ్టను కోరికపైన ఎనుబదియెనిమిది పటాలముల సైనికులను పోగు చేయుటకు తీర్మానించిరి. వీరు యుద్ధము ముగియువరకును పనిచేయవలసియుందురు. ఈ లోపుగ వదలి పెట్టుటకు వీలులేదు. దవ్యమును భూములను సైనికులకు పారితోషికముగ నిచ్చెదమనికూడ ప్రకటించిరి. ప్రత్యేక రాష్ట్రములవారును ప్రత్యేక పట్టణమును కూడ నెక్కువ పారితోషికముల నిచ్చెదమని ప్రచురించిరి. ఈవిధముగ సైన్యములను పోగుచేయుచుండిరి. ఆంగ్ల సేన లింతలో పోయి నవంబరు 18 వ తేదీని వాషింగ్టను కోటపై బడెను. అమెరికనులు హడ్సను నదిని దాటకుండుటకై రెండు ఆంగ్లేయు నావలు హడ్సను నదిలో నుంచిరి. వాషింగ్టను కొన్ని సేనలను వాషింగ్టనుకోటలో నిలిపి మిగిలిన సైన్యములతో న్ హయిటుప్లైమ.

లకు చేరెను. అక్కడ ఆంగ్లేయులు ముట్టడించగా నిలువ లేక నార్తు కాసిలుకు పోయెను. అక్కడ నుంచి తిరిగి యెటులనో హడ్సను నదిని దాటి వాషింగ్టను కోట కెదురుగనున్న లీకోటలో ప్రవేశించెను. వాషింగ్టను కోటను నవంబరు 16వ తేదీన నలువైపుల నుండియు సధిక సంఖ్యాకులగు నాంగ్లేయ సైన్యములు ముట్టడించగ లోపలనున్న అమెరికను సైనికులు లోబడిరి. 2818 మంది అమెరికను సైనికు లాంగ్లేయులచే ఖయిదుచేయబడిరి. ఆమెరికనుల యుద్ధసామాను లాంగ్లేయులకు చిక్కెను. వాషింగ్టనుకోట ఆంగ్లేయుల వశమయ్యెను. వాషింగ్టను సేనాని ఏమియు చేయజాలక తన సైనికులు శత్రువులచే జిక్కుటచూచి పసిపిల్లవానివలె ఊరక రోదనముచేసెను.

వాషింగ్టను సేనలతో
పారిపోవుట.

మూడుదినముల తరువాత 'కారన్ వాలీసు ప్రభువు యొక్క సేనాధిపత్యము క్రింద ఆరు వేల ఆంగ్లేయనేనలు హడ్సమనదిని దాటి వాషింగ్టనులో స్థావర మేర్పరచుకొనిన లీకోటను ముట్డడించిరి. వాషింఘ్టను సేనాని త్వరితముగ నీకోటను శత్రువులకు వదలివైచి డేరాలు, సామానులు, కందకములు త్రవ్వుకొనుటకు పరిక కములు మొదలగున వేమియు లేకనే మూడు వేల సైన్యములతో న్యూజర్సీ రాష్ట్రములోనికి పారిపోయెను. ఆంగ్లేయ సైన్యములు వెంబడించి తరుముచుండెను. న్యూజర్శీప్రజలు ధైర్యమును కోల్పోయి వాషింగ్టను కెట్టినహాయము చేయుటకును సాహసించలేదు. వాషింగ్టను డెలవీరు నదిని దాటి పెనిసి ల్వేనియా రాష్ట్రములోనికి చేరెను. అదృష్ట వశమున ఆంగ్లేయ లింతదూరము రాలేదు. ఇంతలో కెనడా నుంచి ఆంగ్లేయ సేనలు వచ్చి క్రౌను పాయంటును వశపర్చుకొనెను. న్యూయార్కు లోనుండిన ఆంగ్ల సైస్యములు రోడు అయిలండును స్వాధీనము పొందెను.

వాషింగ్టనుకు కష్టములమద్య
ధర్మము జయించునను విశ్వాసము.


ఇట్లు 1776వ సంవత్సరాంతముకు ఆంగ్లేయుల కే ప్రతి వాషింగ్టషకు దిక్కు సను జయములు కలిగి 304 గురు అమెరికను సైనిరోద్యోగులును 4564 మంది అమెరికను సైనికులును ఆంగ్లేయులచే ఖయిదు చేయబడిరి; రోడు అయిలాండు, న్యూజర్సీ, రాష్ట్రములు ఆంగ్లేయులకు స్వాధీనమయ్యెను. పెనిసిల్వనియా పైకి అంగ్లేయులు దండు వెడలుటకు సిద్ధముగ నుండిరి. దేశీయ మహాజనసభ కార్యస్థానమిచట నుండి బాల్టిమోరు నకు మార్చిరి. అమెరికను 'సర్వసేనాధ్యక్షుడగు ' వాషింగ్టసుసందు ఆయన క్రింద నుండిన చాలమంది యుద్యోగస్తుకు విశ్వాసము నశించెను. ఎటుచూచినను" అధైర్యము, అవిశ్వాసము, నిరాశ ప్రబలియుండెను. గాని వాషింగ్టనుకు మాత్రము తమయుద్యమము ధర్మమైన దయిసందున తప్పక జయముకలుగు సని దృఢమయిన నమ్మకముండెను. దేశీయమహాజన సభ వారును ధైర్యమును వదలక వాషింగ్టనునందు అపనమ్మకము పొందక ధర్మమూర్తియగు పరుమేశ్వరుని మీద భారము మోపి సకల ప్రయత్నములు చేయుచుండిరి. వాషింగ్టసుకు air యుద్ద విషయమున సమస్తకార్యములు చేయుటకును సంపూర్ణాధికారమిచ్చిరి. బెంజమిను ఫ్రాంక్లిలినును ఫ్రాన్సునకు బంపిరి. ఆయన పరాసు చేశీయుల సానుభూతిని సుపాదించు చుండెను. ఫ్రాన్సు, స్పైన్, దేశములతో నమెరికనులు. వాణిజ్యము సలుపునటుల యొడంబడికలు చేసికొనిరి.

వాషింగ్టను ఆంగ్లేయుల
నోడించుట


1778వ సంవత్సరము 25వ డిశంబరు రాత్రి వాషింగ్టను రెండు వేల నాలుగు వందల అమెరికను సెనికులతో మంచుతో కప్పబడియున్న డెలవేరు నదిని దాటి న్యూ జర్నీ రాష్ట్రములో ప్రవేశించి ఆకస్మికముగాట్రెర్ టను వద్దనుండిన ఆంగ్లేయ సేనలపై బడెను. ఆంగ్లేయు లోడిపోయిరి. ఆంగ్లేయ సైన్యాధిపతి గాయములచే మరణించెను. వెయ్యిమంది. ఆంగ్లేయులు వాషింగ్టను చేతిలో జిక్కిరి. వీరిని బందీలుగాపట్టుకొని వాషింగ్టను ఖందీల తోడను తన సైన్యములతోడను తిరిగి నదిని దాటి న్యూజర్సీలో చేరెను. మిగిలిన ఆంగ్లేయు పై నికులు ట్రైన్ టనును వదలిపోగానే వాషింగ్టనిచట చేరి స్థావర మేర్పరచుకొనెను, దేశీయ మహాజన సభ వారు క్రొత్త సైస్యముల నేర్పరచి వాషింగ్టను వద్దకు బంపిరి, ఆంగ్లేయ సేనాధిపతి కారన్ వాలీసు ప్రభువు సైన్యములతో వచ్చి 1777వ సంవత్సరము 13వ జనవరి నాడు. అమెరికనులను మట్టడించెను . ప్రిన్సటను వద్ద కారన్ వాలీసునకును వాషింగ్టనుకును యుద్దము జరిగెను వాషింగ్టముకు జనుముకలిగెను. వాషింగ్టను తన సైన్యములతో మారిన్ టౌను

లో ప్రవేశించి శీతకాలమచట గడపెను. అచటనుండి అక స్మాత్తుగా నింగ్లీషువారి పైబడి యోడించు చుండెను. వాషింగ్టనుయొక్క సైన్యములు బలపడుచుండెను. నూతన సైన్యములు వచ్చి చేరుచుండెను. కొలది కాలములో నాంగ్లేయులు న్యూజర్నీ రాష్ట్రమును పూర్తిగా ఖాళీ చేసి వెడలిపోయిరి.


అమరికను సైన్యముల నెక్కువ చేయుటకు ప్రయత్నములు జరుగుచుండెను. కొత్త సైనికులు చేరుచుండిరి. కాని చాలమంది పాత సైనికులు సైన్యములను వదలిపోవు చుండిరి. ఇంతలో స్పోటకజాడ్యము అమెరికను సైనికులలో వ్యాపించెను. ఇందునలన కొత్తవాటు చేయుటకు సంకోచించుచుండిరి. జీతము బాకీపడెను, 1వ జూన్ తేదిన తనకు కొత్తగ చేరుచున్న వారికంటే తనను వదలి పెట్టిపోవు చున్న పాతవారి సంఖ్య ఎక్కునగుచున్నదని వాషింగ్టను వ్రాసెను గాని న్యూజర్నీ రాష్ట్రములో నాంగ్లేయ సైనికులు చేయుచున్న దోపిళ్ళు జరుపుచున్న దుండగములు కొంతవరకు కసి తీర్చుకొనుట 'కమేరికను సైనికులను ప్రోత్సహించ సాగెను.

మానవ సాతంత్ర
వాదులు.


ఈ సమయమున ఆమెరికా స్వాతంత్ర్య యుద్ధము యూరవుండవుదృష్టి నాకర్షించినది, అమెరి కనుల పక్షమున యుద్దము చేయుటకు పరాసు దేశమునుండి కొందరు వచ్చి అమెరికను సేనలలో సుద్యోగములను పొందుచుండిరి. లఫయతు

ప్రభువను నొక పదునెనిమిది వత్సరముల యీడుగల పరాసు యువకుడు పరాసు దేశములోని మెట్టుపట్టణమున నొక పరాస నేసకు సేనానిగనుండెను. ఒక దినమున నాగ్గేయ రాజగు మూడవజార్జియొక్క సోదరుడగు గ్లాస్టరు ప్రభువు ఆపట్టణము సందర్శించుటకు వచ్చెను. ఆసందర్బమునా లఫ యతుకు పైయధికారియగు పరాసు సేనాధిపతి గ్లౌసరు ప్రభువుకు విందు చేసెను. అపుడు లఫయతు కూడ నండెను. అమెరికా వారు స్వాతంత్ర్య ప్రకటనము గావించిరను వార్త అప్పుడే గ్లాస్టరుప్రభువు కింగ్లాండు నుండి వచ్చిన లేఖలవలన 'తెలిసెను. ఈసంగతీ లఫయతు బహుశ్రద్ధగా గమనించి గ్లాస్టరుప్రభువును, ప్రశ్నించి తనకు కావలసిన విషయములు తెలుసుకొనెను. అప్పటినుండియు నమెరికావార సైన్యములో చేరి పనిచేయు వలెనని లఫయతు ప్రభువు మనసునందు నిశ్చయించుకొనెను. మరునాడే పారిసునకు పోయి 'అమెరికా వారి సహాయముగ యుద్ధపరికరములను భోజన పదార్దములను గొనిపోవుట కేర్పడిన నౌకయందు ప్రయాణము చేయుటకు రహదారి చీటిని కొనెను. పారిసులోని అమెరికను ప్రతినిధిని దర్శించి మేజరు జనరలుద్యోగ మిప్పించెదనను వాగ్దత్తమును పొందెను. కాని ఇంతలో నూజర్సీ రాష్ట్రమునుండి వాషింగ్టను పారిపోయెనను వార్త తెలియగ సమెరికాకు పోవుటకు నౌక దొరకక పోయెను. పరాసుదేశములోని ఆమెరికనులు కూడ నీయువ కుడగు సేనానిని అమెరికాకు వెళ్ళుటకు మంచి సమయము

. కాదని నిరుత్సాహపరచిరి. దీనితో లఫయతు నిరుత్సాహ మును చెందలేదు. తనయుద్యమమును మానలేదు. తానే యొక యోడను సంపాదించెను. దానిలో తానే అమెరికాకు వాషింగ్టను సేనానియొద్దకు యుద్ధసామాగ్రులను తీసుకొని పోయెదనని కూడ చెప్పెను. పరాసు ప్రభుత్వమువారును ఆంగ్లేయ , ప్రభుత్వ మువారును నీయనను పోకుండ నాటంక పరచిరి గాని ఎటులనో తప్పించుకొని పన్నెండుమంది పరాసు సేనానులుగనున్న స్నేహితులతో బయలు దేరి స్పైన్ దేశమునుచేరి యచ్చటనుండి సముద్రముమీద పయనము చేసి, సురక్షితముగ దక్షిణ కొరోలీనా రాష్ట్రములోని జార్జి టౌను రేవు లో డిగెను. అక్కడనుండి యా పదగుగ్గురు పరాసు సేవాసులును ఫిలడిల్ఫియా పట్టణమును చేరిరి. కొంతకాలము వీరిని అమెరికను సేసలలో చేర్చుకొన లేదు. కాని వీరు జీతము లేకుండకూడ పనిచేసెదమని చెప్పినందున చేర్చుకొనిరి. 1777ను సంవత్సరము జులై 31 వ తేదీన వాషింగ్టను కొన్ని అమెరికను సేసలపై లఫయతు ప్రభువును 'మేజర జనరలగ నియమించెను. అప్పటినుండియు లఫయతు సేనాసి వాషింగ్టను సందు మిగుల గౌరవమును భక్తిని కలిగిన పరమమిత్రుడయ్యెను. ఈనెలలోనే యూరొపు ఖండములోని పోలండు దేశమునుండి కోసియజుకో యసు యువకుడు యింజనీయరుగ ( శిల్పశాస్త్రజ్ఞుడుగ) అమెరికాకు వచ్చి వాషింగ్టసుతో చేరెను. ఈ సమయముననే నొక యమెరికను స సైన్యము రోడు అయిలండు రాష్ట్రములో నుండియున్న ఆంగ్లేయ సేనపై యాకస్మికముగ బడి యాంగ్లేయ సైనికుల నందరను నేనాధిపతితో కూడ ఖయిదుచేసెను. లఫయతు ప్రభువు ముందురాబోవు పరాసు ప్రజాస్వాతంత్ర్య విప్లవములోను కోసియజుకో పోలండు జాతీయ స్వాతంత్య్ర పోరాటములోను స్వాతంత్రపక్షమున పోరాడి సుప్రసిద్ధులుగా సున్నారు.


అమెరికను
రాజభక్తులు


ఇంగ్లాండులో మూడవ జార్జీ సార్వభౌముడును మంత్రులును అమెరికసుల మీద పట్టుదలతో రాజభక్తులు యుద్దమును సాగించుచుండిరి. 1777 వ సంవత్సరము మేనల 30వ తేదీన ప్రభువుల సభకు విలియంపిట్టు (చాతాం ప్రభువు) అనారోగ్య స్థితి యందేవచ్చెను. పరాసు, స్పెన్, దేశములవారమెరికనులతో చేరక మునుపే అమెరికనులతో సంధి చేసుకొన వలసినదని యొక తీర్థానము నుపపొదించెను. “మీర మెరికనులను జయించ బాలరు. వారి దేశమునుండి వారిని మీరు తమిరివేయ గలరా? వారు స్వాతంత్ర్యమును పొందుటకు దీక్షవహించినపుడు వారిని మీరేమి చేయ గలరు? వారిని మీరెటుల పాలించ గలరు!" అని ఆయన సుడివెను. కాని ఆయనపక్షమున నిరువది ఎనిమిది సమ్మతులును, వ్యతిరేకముగ తొంబదితొమిది సమతులును వచ్చినందున ఆయన తీర్మానమోడిపోయెను. అమెరికనులలో రాజభక్తి గలవారింకను గలరనియు వారిని ఎర్రయిండియనులను రాజద్రోహులగు సమెరికనులమీద ప్రయోగించుటకును, కనడా దేశము నుండి యొక గొప్ప సైన్యము నమెరికనులపై పంపుటకును, మంత్రులు నిశ్చయించిరి.

ఆంగ్లేయుల
జయములు

జులై 1వ తేదీన గొప్ప సైన్యముతో నాంగ్లేయ నేనాని జనరలు బర్గాయను క్రౌన్ పాయింటును నుండి బయలు దేరి దక్షిణముగా పెళ్లెను. దక్షిణమునుండి హెూ సేనాని క్రింద కొంత సైన్యము వచ్చి కలసెను. ఈ సై స్య ముంతను. టికొందొరీ గా మీదపడగ నక్కడి అమెరి కను సైన్యము లెదిరింప కనే పారిపోయెను. ఆంగ్లేయ సైన్యములమెరికెనులను 'వెంటనంటెను, సైనస్బరోవద్ద అమిరికనులమీదపడి యోడించెను. హడస్సనది మీదనున్న ఎడ్వరు కోటను స్వాధీనపర్చుకొనెను. స్కూలరు కోటను ముట్టడించి దాని సంరక్షణ కై వచ్చిన అమెరికను సేనలను పూర్తిగ నోడించెను . ఈవిధమున ఆంగ్లేయులు జయము లొందుచుండిరి.


రాజభక్తుల
నోడించుట

న్నూహంపుషైర్ రాష్ట్ర ములోని బెన్నింగ్టన్ వద్ద అమెరికను సేసలు స్టార్కు సేనాధిపతిక్రింద యుండెను. వీరిమిదికి ఆంగ్లేయ పై స్యములు వచ్చి ముట్టడించగ స్టార్కు సేనాధిపతి ఆంగ్లే యుల నోడించి తరిమెను. మరియొక ఆంగ్లేలేయ సేనకు కూడా రాగా వారికిని పరాజయమే కలిగెను. బెన్నింగ్టన్ యుద్ధ ములవలన కొంత వరక మెరికనుప్రతిష్ట నిలువబడెను . అమెరికను . సైస్యములు స్కూలరు కోటను ముట్టడించగ న్యూర్కులోని రాజభక్తి పరాయణులను ఎర్రయిండియనులను తరిబీతు చేయుచుంన లిజరసు ఆంగ్లేయ సేనాని మిగుల అధైర్యముతో నాకోటను, అందులోని డేరాలు,సామాసులు, యుద్దపరికరములను వదలి కనడా దేశమునకు పారిపోయెను. అమెరికనులు స్కూలరు కోటలో ప్రవేశించిరి. .

వాషింగ్టన్ యొక్క
అపజయములు.

సెప్టెంబరు నెలలో న్యూయార్కునందు బలమైన సైన్యములను క్లింటన్ యొక్క యూధిపత్య ముక్రింద నుంచి అగ్లేయసేనాని హో పదునెనిమిది వేల సైనికులతో ఫిలడల్ఫియాకు ఏబది మైళ్ళ దూరముననున్న ఎల్కు నది యొడ్డున దిగెను. అమెరికను సేనాని వాషింగ్టను పదునాలుగు వేల సైన్యములతో నాంగ్లేయులపై దాడి వెడలెను. సెప్టెంబరు 11 వ తేదీన బొండిలైన్ వద్ద యుద్దము జరిగెను. అమెరికను లోడిపోయిరి. మూడువందలమంది హతులగుటయు ఆరువందలమంది గాయ ములనొందుటయు నాలఁగువందల మంది ఆంగ్లేయులచే పట్టు బడుటయు జరిగెను. లఫయతు ప్రభువుకు కూడ గాయము తగిలెను. ఈ యుద్దములో పోలెండు దేశమునుండి వచ్చిన మరియొక స్వాతంత్ర్యవాది ఫులా క్క-ప్రభువు వాషింగ్టసుకువ సేనాధిపతిగ పోరుసలి పెను. ఇంక కొన్ని సైన్యములు వచ్చి వాషింగ్టనును చేరెను. వీటితో తిరిగి ఆంగ్లేయులతో యుద్ద ముచేయయత్నించెను. కాని తుపానుపట్టి వాషింగ్టను యుద్ధ సామానులు చెడిపోయెను. వాంషీంగ్టను తన సేనలను మరల్పుకొని వచ్చెను. మరియొక అమెరికను సేనాని పది హేను వందల సైన్యములతో ఫిలడల్ఫియా సమీపమున సంగ్లేయులచే నోడించబడెను. ఆంగ్లేయులు సెప్టెంబరు 26 వ తేదీన ఫిలడెల్సియా పట్టణమున ప్రవేశించిరి. అమెరికా దేశీయ మహాజన సభవారు తమ కార్యస్థానమును అచటనుండి లంకాస్టరుకు మార్చిరి. అక్టోబరు 4 ప తేదీన అమెరికను సైన్య ములు వచ్చి ఆకస్మికముగ జర్మను టౌనులోని ఆంగ్ల సేనలపై బడెను గాని అమెరికనులే విశేషసషముతో నోడిపోయి పలాయనమైరి. నాలుగు దినముల తరువాత న్యూయార్కులోని ఆంగ్లేయ సైన్యములు హడ్సను నదిమీదనున్న మాంగమరీ క్లింటన్ కోటలను పట్టుకొనుటయేగాక 'రెండు అమెరికను యుద్ధ 'నౌకలనుకూడ నాశనముచేసిరి. వాషింగ్టను తన సైన్యములతో డెలవేరు కోటలోనుండెను. ఆంగ్లేయులు వచ్చి ముట్టడించిన, 'అయిదుదినములు వాషింగ్టను తీవ్రముగ పోరునలిపెను. కాని ఆంగ్లేయ సేనలసంఖ్య వారికి జమును కలుగచేసెనను" నవంబకు 20 వ తేదీన వాషింగ్టను దెలవేరు కోట నాంగ్లేయులు పశముచేసి వెడలిపోయెను. వాషింగ్టను తన సేనలతో లైటు మార్డును చేరెను. అక్కడనుండి ఆంగ్లేయ సేనాని హూ వాషింగ్టనును తరుమగ వాలీఫోర్టీ లో వాషింగ్టము ప్రవేశంచెను. వాషింగ్టసు సమర్దుడుకాడని యనేక మంది అమెరికనుల కపోహలు కలుగసాగెను.


సెరటోగా మిట్టల
వద్ద అమెరికనులు గొప్ప
జయమునొందుట

కాని మరియొక ప్రాంతమువ భగవదనుగ్రహమువలనఅమెరికనుల నావరించిన యుధకారము విడి పోయి ఆశాసూర్యుడు తన కిరణములను వద్ద ప్రకాశింప జేయుచున్నాడు, ఆంగ్ల సేనాపతి బర్గాయిను హడ్సను నదిని దాటి "సెరటోగామిట్ట పదేశమును చేరి అక్కడ నుంచి హడ్సను నది యొద్దుననే పోయి 'బెసుసుకొండలవద్దనున్న అమెరికను సైన్యం ములను తాకెను. ఆదినమంతయు ఆంగ్లేయులకును అమెరికను లకును జరిగిన పోరాటములో ఆంగ్లేయులే వెళ్కువ నష్టమును పొందిరి. అమెరికను నేనలు సుక్షితముగా తమవిడిది చేరి


ఆంగ్ల సేనలనుండి 'ఎరయిండియనులును అమెరికను రాజభక్తి పరాయణులును జూరిపోసాగిరి. ఆంగ్లేయులకు భోజనపదార్గ మలును వారిగుర్రములకు తిండియు దొరకకుండెను. ఇంతలో గేట్సను అమెరికను సేనాని కొత్తసేసటతో వచ్చెను. అమెరికను సేనలు బలపడెను. తిరిగి ఆంగ్లేయులును అమేరికనులకును తీవ్రమగు పోరును నలిపిరి. ఆంగ్లేయ సేనాని ఫౌజరు చంపబడెను. రాత్రివరకు యుద్దము జరిగి రాత్రివేళ ఎవరిబసలకు వారు వెళ్ళిరి. ఆంగ్లేయులనష్టము ఏడువంద మందియ నమేరికనుల నష్టము నూటఏబదిమందియు కలిగెను. బరా యిసు సేనాని ఆంగ్లేయ సేనలను సెరటోగా మిట్టప్రదేశములకు తీసుకొని వెళ్ళె. ఎడ్వర్డుకోటలో ప్రవేశించదలచెసు. కానీ అది అమెరికనుల వశముదుండినందున ప్రవేశించలేదు. ఈయనవద్ద మూడు వేల అయిదువందలమంది పోరు సలుప తగిన సైనికులు మాత్రమే గలరు. సరియైన తిండి లేక బాధపడు చుండిరి. పదునాలుగువేల అమెరికను సైనికులు గేట్సు సేనాని క్రింద సచ్చి వీరిని చుట్టుకొనికి. ఆంగ్లేయ సేనానులు యద్దము సలుపజాలక అమెరికనులకు లోబడుటకే నిశ్చయించి . అక్టోబరు 16వ తేదీన అయిదు వేల ఏడువందల తొంబది యొక్క మంది బ్రిటిషు సైనికులు యుద్ధసామానులతోడను "నలుబది రెండు ఫిరంగులతోడను అమెరికనులకు లోబడిరి. నిరాయుధులుగ చేయబడి ఆమెరికనుల మీద యుద్దము చేయ కుండునట్లును వెంటనే ఇంగ్లాండునకు పయనమైపోవుటకును సమ్మతించి వడలివేయబడిరి. ఆంగ్లేయ సైనికులు తిండి లేక శల్యము లై చిక్కియుండు జూచియ మెరికను సైనికులు జాలి నొంది వదలిపేసిరి. క్లింటన్ సేనాని కొంద రాంగ్లేయ సైని కులను తీసుకొని యిచటికి వచ్చెనుగాని' ఆయన వచ్చువరకే, ఇక్కడ ఆంగ్లేయులకు కాదగిన పరాభవము పూర్తియయ్యెను. అక్టోబరు 26 వ తేదీన నాంగ్లేయులు మాంగుమరీ క్లింటన్ కోటను విడిచి వెళ్ళిరి,


దేశీయ మహాజనసభ
వారి వద్ద ద్రవ్యము
లేక ఇబ్బందులు.

అమెరికను సేనాని గేట్సు సెరటోగా మిట్టప దేశములలో పొందిన జయమును తన సేవాద్యక్షుడగు వాషింగ్టనుకు తెలువక సూటిగ దేశీయ మహా జనసభ వారికే తెలియపరచెను. దేశీయసభ,వారు గేట్సు సేనానికి వందనములను సువర్లన తకమును నిచ్చిరి. గేట్సు సేనాని సంతోషముతో సుప్పొంగి వాషింగ్టనును లక్ష్యముచేయ లేదు. వాషింగ్టను కొన్ని సైన్య ములను తనకు సహాయముగ పంపమని కోరికను గేట్సు పంచ లేదు. కాని తనవద్ద నుండిన స్వల్ప సేనలతోనే నాంగ్లేయులతో పోరి ఫిలడల్ఫిమూ రాష్ట్రమును సంరక్షించుటకు వాషిం గ్రను ప్రయత్నించెను. ఫిలడల్ఫియా రాష్ట్రములో కూడ రాజభక్తి పరాయణులగు సమేరిక నుల సంఖ్య వృద్ధియగుచుం డెను. ఈ అపాయమునుండి తొలగించవలెనని వాషింగ్టను ప్రయత్నించెను. కాని వాషింగ్టసుకు కొంతకాలము వరకు కష్టములే ఎదుర్కొనెను, వాషింగ్టను వాలిఫోర్జిలో చేరెనని పైన వాసియుంటిమి. ఇచటనే ఆయన చలికాలమును గడపెను. కాని చుట్టుపట్టు పదేశ మంతయు రాజు భక్తి పరాయణలగు సమెరికనులతో నిండియుండెను. ఆంగ్లేయులు రొఖ్క, మిచ్చి వస్తువులను కొనుచుండిరి. వాషింగ్ను వద్ద రొఖము లేదు. ఆమెరికను దేశీయ మహాజనసభవారు సృష్టించిన (కరెన్సినోట్లు) కాగితపు ద్రవ్యము మాత్రము గలదు. దీనిని పుచ్చుకొని కావలసిన వస్తువుల నిచ్చువారు లేకుండిరి. దేశీ యమహాజనసభ వారివద్దదవ్యము లేదు. ఎవరునుఋణములిచ్చుటలేదు. ఉత్సాహముతో సభ్యులు సభలకు వచ్చుట లేదు. ఉరకె కాగితములను సృష్టించుచుండిరి. ఈ కాగితపు ముక్కల విలువ తగ్గిపోయెను. వాషింగ్టనుకు గాని ఆయన సైనికులకు గాని దుస్తులు లేకుండెను. డిశంబరు నెలలో నాహారపదార్తము లయిపోయెను. "వెంటనే తగిన ఏర్పాటుల సు చేయనిచో సైనికులుపవాసము చేయుటగాని లేక ఇండ్లకు పోవుటగాని జరుగ గలదని” ఆయన దేశీయసభాధ్యక్షునికి వ్రాసెను. "ధరించుటకు దుస్తులుగాని తొడుగుకొనుటకు పాదరక్షలుగాని లేక దాదాపు మూడు వేల మంది సైనికులెట్టి పనిచేయుటకును అనర్హులుగ నుండిరి. చుట్టు ప్రాంతములనుండి దొరకినదాని నెల్ల బలవంతముగ తెమ్మని సైనికులను బంపవలసివచ్చెను. ఇట్లు చేయుటవలన ప్రజల సొనుభూతిని గోల్పోవుదునని కూడ నాయన దేశీయ మహాసభ వారికి వ్రాసియుండెను. కొంతకాల మునకు చుట్టు పట్టులనుకూడ ఏమియు దొరుకకుండెను. గుర్రములు చాలవరకు తిండి లేక చనిపోయెను. మార్చి 11వ తేదీనుండియు మనుష్యులకు కూడ తిండి లేకుండెను. ఆరుదినములు వాషింగ్టను సైనికులతో కూడ .నుపవాసము చేసెను. యావత్తు సేనలో రెండు పాదరక్షల జత మాత్రమే మిగిలి యుండెను. సైన్యములలో జ్వరములు వ్యాపించి యనేకులు మరణించిరి. అనేకమంది సైన్యములను పదలి వెళ్ళిపోవుచుం


డిరి. బహు స్వల్పకాలములో రెండు మూడు వందలమంది సైనికోద్యోగులు రాజీనామాల :చ్చి లేచిపోయిరి. ఈసమయమున నాంగ్లేయ సేనలు వీరిని ముట్టడించవచో వీరిని చులకనగ నాశనము చేసియుండును. కాని యదృష్టవశమున నాంగ్లేయ సైన్యములు ఫిలడల్ఫియా పట్టణమునుండి కదలి రాలేదు. చలి కాలమంతయు నా పట్టణములో సంగ్లేయులు సంతోషము తోను ఆటపాటలతోను గడవుచుండిరి. ఇట్టి దుఃఖకరమైన స్థితిలో వాషింగ్టనుండగ పెన్నిసిల్వేనియా రాష్ట్రీయసభవా రీయనను అసమర్ధుడని తీవ్రముగ ఖండించిరి. దేశీయమహాజన సభలో గొందరీయనకు వ్యతిరేకముగ నొగ కక్షి బయలు చేరెను. యుద్ధమును సదువుట కేర్పడిన యువనంఘము లో నీయనకు ప్రతికక్షులగువారుకూడ నియ మింపబడిరి. ఈయనను సర్వసేనాధ్యక్ష పదవినుండి తొలగించి గేట్సు సేనానిని గాని లీసేనానినిగాని నియమించవలెనని కూడ కొంతవరకు యత్నములు జరిగెసు. లుఫయతు నేనానిని యియసక్రిదనుండి వేరుచేయవలెనని యోచించిరిగాని నీఫలయతుసేనాని వాషింగ్టను కింద నేపనిచేసెదపని ఖండితముగ చెప్పెను. చినకకు వాషింగ్ట నుకు సహాయమును సామాగ్రులును వంపి దేశీయ మహాజన సభ ఆరాయననే సర్వసేనాధిపతిగ నుండవలెనని తీర్మానించిరి.

ఆంగ్లేయ పార్లమెంటు వారు
యుద్ధమును తీవ్రముగ
సాగించుటకు నిచ్చయించుట

ఫిలడల్ఫినూ తమకు లోబడెనను వార్త ఆంగ్లేయలో నధికముగ సంతోషమును కలుగచే సెను. కాని శీఘ్రముగనే సెరటోగా మిట్టప్రదే నాంగ్లేయులకు కలిగిన పరాభవసు, పంగతి కూడ తెలసెను. దీనితో నమిత


మగు దుఃఖము కలిగెను . ప్రధాన మంత్రి నార్తు ప్రభువు భోజనముగాని నిద్రగాని లేక విచారములో మునిగెను. అమెరికను యుద్ధమును వదలి వేయపలెనా లేక తాసుమత్రి వదవిని త్యజించవలెనాయని నూలోచించు చుండెను ఆంగ్లేయ రాజునకు కలిగిన పరితాపముకు మేరలేదు. పార్లమెంటులో గొప్ప కలవరము కలిగెను. కొందరు సభ్యులు వెంటనే ఆమెరికావారి స్వాతంత్యమునంగీకరించి వారితో మైత్రి పొందవలసినదని చెప్పిరి. పార్లమెంటు సభ 1778వ సంవత్సరం జనవరి 20 వ తేదీవరకు నిలుపుదల చేయబడెను. ఈలోపున నాంగ్లేయ రాజు సంధి షరతులను గూర్చి సంధాన పరచుటకుగాను ఫ్రాన్సు దేశములో నున్న అమెరికాప్రతినిధి బెంజమిను ఫోన్కు లినుకు న్నేహితుడగు హట్టను వద్దకు రాయబారులను పంపెనుగాని హట్టనుని సంప్రదించగ నీ సందర్భమున సంధికుదురుట యసంభవమని ఫోన్కులిను చెప్పినారు. జనవరి 20 వ తేదీన పార్లమెంటు సమావేశమయిననాడు వారు తిరిగి చర్చజరిగెను. మెటనే ఆమెరికనులకు స్వాతంత్ర్య మిచ్చి రాజీపడవలసినదని కొందరు సభ్యులు చెప్పిరి. అమెరికాకు స్వాతం త్యమిచ్చుటకు విల్లియం పిట్టు సమ్మతించలేదు. యద్దముమాని ఆంగ్లేయ రాజ్యముక్రింద సమెరికా నుంచుకొనుటయే ఆయన యుద్దేశ్యము. ప్రధాన మంత్రి రాజీనామా నిచ్చెదనని చెప్పెనుగాని రాజు రాజీనామా నివ్వకుండ నిర్బంధించెను. "ఇప్పుడ మెరికనులకు లోబడుట ఆంగ్లేయుల కగౌరవము గాన యుద్దమును జరుపవలసినద"నియే పార్ల మెంటు వారు తుదకు తీర్మానించిరి.

{అమెరికాకును
ఫ్రాన్ సుకును స్పైన్ కును
వడంబడికలు}

1778 సంవత్సరము ఫిభ్రవరి 6వ తేదీన ప్రాసు దేశప్రభుత్వమునకును అమెరికా సంయుక్త రాష్ట్రములకును నొడంబడికెలు జరిగెను. పరాసు ప్రభుత్వము అమెరికా సంయుక్త రాష్ట్రముల స్వతంత్రము సంగీకరించి, సంయుక్త రాష్ట్ర ములవారు సంపూర్ణమగు స్వతంత్రమును పొందువరకును నిలుపదల చేయకుండునట్లును ఈ యుద్ధములో పరాసువారు పూర్తిగ సహాయము చేయునట్లును నోడంబడిరి. స్పైన్ రాజు కూడ నీసంధి కంగీకరించెను. గాని ఇంకను సంధిపత్రముపై సంతకము చేయ లేదు. ప్రారాసు దేశముతో చేసుకొనిన సంధి వలన నమెరికా స్వాతంత్ర యుద్ధమునకు నూతన వికాసము కలిగెను.