అమెరికా సంయుక్త రాష్ట్రములు/ఎనిమిదవ అధ్యాయము

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

ఎనిమిదవ అధ్యాయము


. స్వతంతయుద్ధము — రెండ భాగము. (1)

ప్రాన్ సు మంచి
స్థితిలో లేదు.

పాన్పు దేశమువకును సంయుక్త రాష్ట్రములకును జరిగిన సంధి కొలదికాలమువరకు ప్రాన్సుతో ప్రచురము కాలేదు. ఫోన్సు దేశము యుద్ధముచేయుటకు తగిన మంచి ప్లితిలో లేదు. ప్రభుత్వము యొక్క ఆర్ధిక స్థితి మిగుల బలహీనముగ నున్నది. జాతీయ రుణము విశేషముగ నుండెను. ఆదాయముకంటె వ్యయమెక్కువగ నుండెను. పదునారవ లూయిరాజు యోగ్యుడుగాని సమర్దుడుగాడు. తుర్గోమంత్రి కొన్ని సంస్కరణములను చేయ ప్రయత్నించి రాజు యొక్క సహాయము పొంద జాకల రాజీనామా నిచ్చెను. నూతనముగ వచ్చిన ప్రధాన మంత్రి నెక్కరార్థిక విషయములలో మిగుల సమర్దుడే. కాని ఈయసయును ఏమియు చేయజాలక పోయెను. నెక్కరుమంతి. ఋణములు చేయ యత్నించెను. ప్రథమునులో కావలసిన ఋణము లభించెను. మధ్యమతరగతి ప్రజలు నెక్కరు నందు


విశ్వాసము కలిగి ప్రభుత్వములకు ఋణముల నిచ్చిరి. మంచి నాళాదళమును నిర్మించుటకు విశేషముగ ద్రవ్యము వెచ్చించ బడెను. ఈ సమయమున స్పైన్ యొక్క సహాయముతో తిరిగి సముద్రములపైన అధికారము పొందుటకు ప్రాస్సు ఉద్దేశించెను.

ఆంగ్లేయ ప్రభుత్వములు
కొంతవరకు లోబడుట.

ఇంగ్లాండులో నీ సంధిసంగతి తెలియగనే గొప్ప కలవరము జనించెను. రాజు ఆంగ్లేయ సైన్యము లను పూర్తిగ అమెరికానుండి తీసి ఫ్రాన్సు దేశముతో మాత్రము యుద్ధము చేయవలెనని తలచెను. అమెరికా పోయినను సరే, ఫ్రాన్సు దేశము పై పగ తీర్చుకొనవలెనను నూపా ఆయన మనమునందు పొడమెను. గాని ఈ యూహ సనుసరించి ప్రవర్తించలేదు. అమెరికనులకు కొన్ని హక్కుల నిచ్చి రాజీ పర్చుకొనవలె ననుతలంపు పార్లమెంటుసభ్యలకు కలిగెను. ఈ తలంపు ప్రధమము ననే నుఁడినచో యుద్ధమే జరిగియుండెడిది కాదు. ఫిబ్రవరి 17 వ తేదీన అమెరికనులను సంత్సప్తి పపరచు సుద్దేశముతో కొన్ని చట్టములను చేసిరి. అమెరికాకు చట్ట ప్రకారము స్వతంత్ర మివ్వకపోయినను ప్రవర్తనలో స్వతం త్రముగ చేయుచున్నామని ప్రధానమంత్రి నార్తు పభువు చెప్పెను. ఆదినమున ఇంగ్లాండు పార్లమెంటుకు అమెరికనులకు లోబడుస్థితిలో నుండిరి. కానీపరిపూర్ణమగు స్వతంత్రము సంగీకరించుట కష్టము లేకుండెను. కావున ఎటు ప్రవర్తించుటకును తోచక ఏవోయర్ధము లేని కొన్ని చట్టములను చేసిరి. అమెరికా వారిని పరాసువారికిని సంధి జరిగిన సంగతి తెలియలేదా..

యని యొక, సభ్యుడు. ప్రధానతుంత్రిని ప్రశ్నించెను. ప్రధాన మంత్రి, ఈప్రశ్నకు జవాబు చెప్పక వేరు సంగతులను గూర్చి ప్రముగించు చుండెను " దీనికి ముందు జవాబు చెప్పుము, జవాటుచెప్పుము " అని కొందరు సభ్యులు కేకలు వేసిరి. అందు మీద సుధీ జరగ లేదని చెప్పక తనకు ఉద్యోగరీత్యా సంధి సంగతి తెలియదని ప్రధానమంత్రి జవాబు చెప్పెను. అమెరి కనులను తృప్తి పరచుటకని మూడు చట్టములు చేయబడెను,మెసషు సిట్సు ప్రజలలో నాందోళనము కలుగుచున్నది. గా వున నారాష్ట్రమున కిదివరకుగల ఎన్నిక హక్కులను తిరిగి కలుగచేయడ మైనదను చట్ట మొకటి. తేయాకు చట్టమును రద్దుపరచుచు విదేశ వాణిజ్య విషయములో తప్ప రాష్ట్రములలోని ఆంగ్లేయపార్లమెంటు గారుపన్నులు వేwటకు ప్రజలపై హక్కు లేదను చట్టము రెండనది. అమెరికానుండి ఆంగ్లేయ సైన్యములను తీసివేయుటకును ఏరాష్ట్రముతో నైనను సంధిచేసు కొనుటకును క్షమాపణల నిచ్చుటకును ప్రజల యిబ్బందులను తొలగించుటకును యిద్దరు కమిషనరులను నియమించుచట్టము మూడవది. ఈ చట్టములు చేయుటవలన నాంగ్ల పార్ల మెంటువారు తమ బలహీనతను వెల్లడించిరేగాని వీటివలన అమెరికనులు తృప్తి చెందలేదు.

విలియంపిట్టు
యుద్దమునకు
పురిగొల్పెను.


మార్చి 17వ తేదీన అమెరికాలో చేసికొనిన సంధిషరతులను పరాసుప్రభుత్వమువారు పంపినారని ఆంగ్లేయ మంత్రులు పార్లమెంటు సభకు చదివి వినిపించిరి. ఈ సమయమున అనారోగ్యముషలన బాధపడుచుండిన - విసవిలియం పిట్టును ప్రధానమంత్రిగా చేసిన యుక్తముగ నుండు


వని సభ్యులలో చాలమంది తలంచిరి. రాజునకు నార్తు ప్రభువును ప్రధాన మంత్రిత్వమునుండి తప్పించుట ఇష్టము లేదు. “ఏప్రిలు 7వ తేదీన పార్లమెంటు సభకు విలియంపిట్టును రావించిరి. ఆయన పడక కుర్చీలో పరుండెను. లేచి నిలువగల స్థితిలో లేడు. ఆంగ్లేయుల సైన్యములను నౌకాదళములను తీసి వేయవలసిన దనియు మంచిమాటలచే రాజీపడవలెననియు రిచ్మండు ప్రభువొక తీర్మాసము సపపాదించెను అందు కూడ చర్చ జరిగిను. ఇదివరకు అమెరికా వారితో సంధి వేసుకొమ్మని చెప్పియున్న ఇలియంపిట్టు కివుడు తమ శత్రు దేశములగు పరాసు, స్పేయిన్ దేశము అమెరికనులతో చేరియున్న సమయమున రాజీపడుట అసంబద్దమని తోచెను. ఇట్టి స్థితిగతులలో నమెరికాకు స్వాతంత్య మిచ్చుట అవ్యక్తమని ఆయన తలచెను. " నేనీ సభలో మాట్లాడ శక్తియున్నంతవరకు అమెరికాకుస్వతంత్ర, మివ్వగూడదని చెప్పితీరెదవ"నీ, ఆయన చెప్పెను. ఆయన ధ్వని మిగుల బలహీనముగ నుండెను. చెప్పినదానినే . మరల మరల చెప్పెను. తలంపులు సరిగవచ్చుట లేదు. దీనికి రిచ్మండు ప్రభువు ప్రత్యుత్తరమిచ్చెను. అంద మీద విలియంపిట్టు లేచెను. ఏమో చెప్పెను. స్పృహతప్పి పడిపోయెను. పార్ల మెంటు సభ చాలించబడెను, మే 11 తేదీ వరకును ఆయన జీవించియుండెను. ఆయన చనిపోపగనే పార్లమెంటు సమావేశమై ఆయనకుగల ఋణములను తీగ్చుకొనుటయే గాక ఆయన దినవారి ములకగు ప్రయమును ఆయన వారసులకు సంవత్సరము నకు నాలుగు వేల సవరనుల యుపకార వేతరమును ఇచ్చుటకు తీర్మానించిరి. ఫ్రాన్సు పై యుద్ధము చేయుట కాంగ్ల దేశమునం

చుత్సాహము వ్యాపించెను. అనేకులు వచ్చి సైన్యములలో చేరుచుండిరి.

పరాసు సంధికి
వాషింగ్టను యొక్క
సంతోషము.

1778 సంవత్సరము మే నెల పరాను దేశముతో చేసికొనిన 8వ తేదిన నంధిషరతులమెరికా పరాను సంధికి దేశ మహాజనసభ వారికి చేరగానే వారు వాషింగ్టముకు బంపిరి. "అమెరిశా సంయుక్తరాష్ట్రముల స్వతంత్రమును కాపాడుటకును మాహక్కులను స్వతంత్రములను స్థిరముగ స్థాపించుటకును లోకములోని రాజులలో నొక బలవంతుడగు ప్రభువును మా వశమున చేర్చుటకు సర్వశక్తుడగు భగవంతుని కనుగ్రహము వచ్చిందని ఆయన సైనికులలో ప్రకటించెను, మరునాడు సంతోషదినముగ సలుపబడినది. సైనికులు దేవునికి వంద నముల నర్పించిరి. జయసూచకముగ తుపాకులు కాల్చబడెను. " ఫోన్సు దేశపు రాజు చిరాయువగు గాక! ” " అమెరిళా సంయుక్త రాష్ట్రములకును వీరికి మిత్రులగు యూరొపు దేశముల వారికిని జయము కలుగుగాక ! ” అని జయధ్వనులు చేయబడెను. దేశీయ మహాసభవారు కొత్త సైన్యములను పోగుచేసిరి. యుద్దము ముగిసిన తరువాత సైనికోద్యోగులకు సగము జీతమిచ్చెమదని పొగ్గ త్తము చేసిరి.


దేశీయ మహాసభ
వారి పట్టుదల.

ఫౌంస్సుతో సంధిచేసుకొనిన సంగతి అమెరికాలోతెలియుటకు కొన్ని వారములకు మునుపే ఆంగ్లేయ పార్లమెంటువారు అమెరికలను వారికట్టుడం తృప్తి పరచుటకై చేసిన చట్టములను ఆసం దర్భను న నార్తు ప్రభువిచ్చిన యుపన్యాసమును న్యూయార్కు


లో తెలసెను. వాషింగ్టను సేనాని గాని దేశీయ మహాజన సభాద్యక్షుడుగాని కొన్ని దినములవర కావర్తమానమును నమ్మలేదు. వాటియాదార్ధ్యమును వాషింగ్టను సమ్మగనే వాటినిగూర్చి అమెరికాలోని ప్రజలెటుల భావించెదరో యని ఆయనకు సంకోచముకలిగెను. అప్పటికి అమెరికనులలో చాల మందికి యుద్ధమునందు విసుగుపుట్టినటుల సూచనలు పొడగట్టు చుండెను కావున ప్రజలు పట్టుదలతో స్వతంత్ర యుద్ధమును జయప్రదముగా కొనసాగించుటకు మారుగ నాంయులిచ్చిన హక్కులతో తృప్తి చెంది రాజీ కొడంబడెదరేమోనను సందేహ మాయనకు కలిగెను. ఈ సంధి రాయబారములను త్వరపడి అంగీకరించుటగాని లేక తిరస్కరించుటగాని యుక్తముకాదని ఆయన తలంచెను. ఏప్రియలు 22వ తేదీన దేశీయ మహా జనసభవారు మాత్రము " "వెంటనే అమెరికాలోనుండి ఆంగ్లేయ సేనలన్నియు తీసి వేయబడిననే గాని, లేదా స్పష్టమగు మాటతో నమరి సంయుక్త రాష్ట్రముల స్వతంత్రము సంగీకరించినసేగాని, ఆంగ్లేయ రాయభారులతో సంధివిషయమున నెట్టిమాటలను జరుపగూడదని తీర్మానించిరి, ఇంతలో ఫాస్సుతో జరిగిన సంథిసంగతికూడ తెలిసినందున వీరి పట్టుదల యనేక మడుంగు లధికమయ్యెను.

దేశీయ మహాసభ వారి
ఆత్మ గౌరవము

జూను 4వ తేదీన ముగ్గురాంగ్లేయ సంథి రాయబారు లు అమెరికాకు చేరిరి. జూన్ 6వ తేదీన ఆంగ్లేయపార్లమెంటువారి చట్టములను అమెరికా దేశీయ మహాజన సభవారికి కంపిరి. " ఏపి)లు నెలలోనే తామివిషయమున తీర్మానము చేసియుంటి


మనియా,. ఆ గ్లేయ రాజు అమెరికా సంయుక్త రాష్ట్రములతో చేయుచున్న అధర్మసుగు యుద్ధము సంతరింపజేయవ లేనని నిజముగ గోరుచో, స్వతంత్ర దేశము యొక్క మర్యాదల తోడను సంధిషరతుల నమలుజరుపు పవిత్రోద్దేశ్యముతోడను తాము రాజీకి వచ్చుట కెట్టియభ్యంతరము లేవనియు” దేశీయ మహాజనసభవారు ప్రత్యుత్తరమును బంపిరి.


వారి ధీరత్వము


ఆదినముననే ఆంగ్ల రాయబారులు ఫిలడల్ఫియా పట్టణమునకువచ్చిరి. ఆసమయముస నాంగ్లేయులా పట్టణమును వదలి వెళ్ళుచుండిరి. అసమయ ముగ సొంగ్లేయ ప్రభుశ్వమునుండి వచ్చిన రహస్యపు ఉత్తరువుల ననుసరించి వారటుల వదలిపో వుచుండిరి. కాని ఈయుత్తరువులు - రాజభ క్తిగల అమెరికనులలో మితి లేని విచారమును కలిగించెను. ఆంగ్ల సేనలతోకూడ మూడు వేల మంది అమెరికను రాజభక్తులు బయలు దేరి వెళ్ళిపోయిరి. రాష్ట్రము లన్నియు తమయిచ్చవచ్చిన చట్టములను చేసుకొను హక్కును తమ కచ్చపచ్చి రీతిని రాష్ట్ర పరిపాలనను జగపుకొను హక్కును, అంగేయపార్లమెంటులో నమెరికనులకు ప్రాతినిధ్యమును వీరి యిష్టము లేనిది ఎట్టి సేనలను వీరి ప్రదేశములలోని, కాంగ్లేయులు తేకుండు హక్కును చేర్పించెదమనియు, నౌక మీద ఆంగ్లేయ సేనలనన్నిటిని ఇంగ్లాండునకు వెంటనే చెప్పించెద మనియు, సంధికి రావలసినదనియు, నాంగ్లేయ రాయబారులు తిరిగి దేశీయ మహాజన సభ వారికి వ్రాసిరి. జ్యూన్- 17 వ తేదీన " ఆంగ్లేయులు తమ స్వతంత్రమును స్పష్టముగ సంగీకరించ వలసినది లేదా ఆంగ్లేయ సేనలనన్నిటిని ఆంగ్ల దేశములో



చేర్చనిది " ఎట్టిషరతులను గూర్చియు 'రాయణరములు జరువమనియు నిదివరకే యిట్టి జవాబును చెప్పి యున్నా మనియు దేశీయ మహా సభ వారు ప్రత్యుత్తర మిచ్చిరి. జూన్ 17, 18 తేదీలను ఆంగ్లేయ సేనలన్నియు ఫిలడల్ఫియాను వదలి దలవేరు నదిని దాటి వెళ్లిపోయెను.

మానుమౌతు వద్ద
అమెరికనుల
జయము.


జూన్ 28వ తేదీని వాషింగ్టను మానుమౌతువద్ద నాగ్లేయ సేనలను తలపడెను. అప్పుడుష్టము అతియెక్కువగ నుండెను. యుద్ధము తీవ్రముగ జరిగెను. అమెరికనులకు సంపూర్ణముగ జయము గలిగెను. రాత్రి వేళ ఆంగ్లేయులు పారిపోయిరి, నూరుమంది ఆగ్లేయ సైనికులు ఖయిదీలయిరి. రెండువందల యేబది వుంది మరణించిరి,


జులై 2 వ తేదీన దేశీయమహా జనసభ వారు ఫిల డల్ఫియా పట్టణమున సమావేశ మైరి. తొమ్మిదవ తేదీన సంయుక్తప్రభుత్వపు నిబంధనల మీద ఎనిమిది. రాష్ట్ర ముల ప్రతినిధులు సంతకము చేసిరి. తక్కిన అయిదు 'రాష్ట్రములకు నీ పవిత్రమైన యొడంబడికె పి సంతకములు చేయవలసిన దని యుత్తరమును బంపి. నెలలోపలనే మరి రెండు రాష్ట్ర ములవారును సంతకములు చేసిరి. (2)

పరాసు
సేనలు వచ్చుట.


జులై 8వ తేదీన పరాసు దేశమునుండి నౌకాదళ మమెరికారు చేరి డెలవేరు నది ముఖద్వారము వద్ద దిగెను. ఏస్టింగు ప్రభువు యొక్క సేనాధిపత్యము క్రింద పరాను సేనకూడ దిగెను.

రోడు అయిలందులోని నీ రిపోర్టునందుగల ఆంగ్లేయ సేనలను ముట్టడించతలచిరి. సల్లెలిన్, లఫయతు, గ్రీక్ , సేనాసుల క్రింద సమెరికను సైన్యములు భూమిమీదనుండియు, పరాసు నౌకాదళము సముదముమీద నుండియు, ఆంగ్లేయులను ముట్టడించవలెనని పన్నిరి. కాని వారము రోజులవర కమెరికను సేనలు సిద్ధము కాలేదు. ఇంతలో హో సేనానిక్రింద నాంగ్ల నౌకదళము వచ్చెను. దానిని ముట్టడించుటకు ఏస్టింగుప్రభువు పరాను వారాబలమును తీసుకొని వెళ్ళెను. కాని గొప్ప తుపాను సంభవించి ఉభయ వర్గములవారును తలపడుటయే తప్పిపోయినది. పరాసు నౌకలకు కొంత తుపానువలన నష్టము కలిగినదని బాగుచేసుకొనుటకు బాస్టను రేవులోనికి ఏస్టింగు పరాసు నౌకాదళమును చేర్చెను. ఇట్లు చేయుట లఫయతునకును గ్రీన్ సేనానికిని ఇష్టము లేదు. ఇందువలన సల్లివసు సేనానిక్రింద వచ్చిన అమెరికను సైన్య ములు వెనుకకు మరలి రావలసివచ్చెను.

అమెరికనులపై
ఎర్ర యిండియనులు
ప్రయోగింపబడుట.

1778 సంవత్సరము జులై నెలలోను నవంబరు నెలలోను ఆంగ్లేయులును అమెరికను రాజభక్తులునుఎర్రయిండియనులను అమెరికను దేశ భక్తులపై రయోగించిరి. షుష్కినా, షెర్రి పల్లపు భూములలోను ముఖ్యముగ వోమింగు ప్రాంతములోను వున్న అమెరికనులమీద ఎర్రయిండియసు లకస్మాత్తుగ పడి పట్టణములను తగుల బెట్టిరి. ఆమెరికను పురుషులను స్త్రీలను శిశువులను క్రూరి వధల గావించిరి

ఆంగ్లేయులకును
పరాసులకు
యుద్ధములు.

ఆంగ్లేయులకును పరాసు వాటికిని ప్రపంచములో వివిద ప్రాంతములలో యుద్ధము ప్రారంభమయ్యెను జులై 27 న తేదిన ఉభయుల నౌకాదళములును బ్రెస్టు రేవుకు సమీపమున పోరు సలిపిరి. ఎవరికిని జయము కలుగ లేదు. సెప్టెంబరు నెలలో పశ్చిమయిండియా ద్వీపములలోని ఆంగ్లేయులదగు డొమినికా ద్వీపమును పరాసువారు స్వాధీనపరచుకొనిరి. పరాసువారి "సెంటులూసియా ద్వీపము నాంగ్లేయు లాక్రమించిరి. ఆమెరికా యుద్ధనౌకలు ఇంగ్లాండు, దేశముయొక్క, పశ్చిమతీరమును కొంతవరకు నష్టపరచెను. వైటుహెూవనురేవులో నున్న ఆంగ్లేయ పడవలను తగులబెట్టెను. హిందూదేశములో నప్పటికి పూసువారికి పుదుచ్చేరి, కారైకాలు, యానాం, మాహి, చంద్రనాగూరు పట్టణములుమాత్రమే గలవు. ఆంగ్లే యులకు గొప్ప గొప్ప రాష్ట్రములు స్వాధీనమందుండెను. ఆంగ్లేయ గవర్నరు జనరలు వారన్ హేస్టింగ్సు పరాసువారికి చెందిన పుదుచ్చేరి మొదలగు పట్టణము, సన్నిటిని స్వాధీనమును పొందదలచెను. పుదుచ్చేరి డెబ్బది రోజులవరకు లోబడక ఎదిరించెను. తక్కినవి వెంటనే ఆంగ్లేయుల వశమయ్యేను మాహి పట్టణమును పట్టుకొనినచో "తాను యుద్ధమునకు దిగుదునని మైసూరు ప్రభువు హైదరాలి చెప్పెను. ఆయన మాటలు లక్ష్యము చేయక ఆంగ్లేయులు మాహిని పట్టుకొనిరి. హైదరావాలి ఆంగ్లేయులపై యుద్ధమును ప్రకటించి కర్నాటకము

దాడి వెడలెను. 

ఆర్థిక
స్వతంత్రము
లేని ప్రజలు.

అమెరికాలో నింకను అమెరికనులస్థితి ఏమియా.బాగుగ లేదు. వీరికింక ఒక ప్రభుత్వము స్థాపనశాలేదు. ప్రభుత్వము లేని ప్రజలుగ నుండిరి, " ఫ్రాన్సు మన స్వాతంత్ర్యము సంగీకరించి మనకు సహాయము చేతునని యొప్పుకొనుటచేశ, మనవారు తాము చేయవలసిన పని యేమియు లేదని తలచి నిద్రావస్తను చెందుదురని తోచుచున్నది ” అని వాషింగ్టనుమేనెల 5వ తేదీననే వాసెను. దేశీయ మహాజనసభవారు కాగితపు నోట్లను పుట్టించుచున్నారే గాని వాటి చలామణి సంగతి యోచించుట లేదు. రాష్ట్రముల వారును కాగితములను వేయుచున్నారు. ఈ కాగితములను తోడి రాష్ట్రముల వారికిచ్చి ఋణములను • తీర్చుకొనుచుండిరి. అమెరికాలో మష్యమును ప్రోగుచేయు సాధనము కనుపించక ఫ్రాన్సులో పన్నెండులక్షల సవరనుల ఋణము చేయవలసినదని ఫోన్సు లోని తమ ప్రతినిధులకు తెలియచేసిరి. ఏదో విధమున యాచించి సొమ్మ పోగుచేయవలెనని వీరి యుద్దేశ్యము. ఆంగ్లేయ రాజుమీద స్వతంత్రమును ప్రకటించి రేగాని వీరు స్వతతత్రమగు ఆర్దిక స్తితిని పొందుట కశక్తులై "ఫోన్సరాజు మిక్కిలి యాదార్యముతో తమను సంరక్షించ పలెనని ” మిగుల విసయముగా కోరవలసినదని బెంజమిన్ ఫ్రాన్కులిసుకు వ్రాసిరి. యూరపు ఖండమునుండి ఋణములను ద్రవ్యసహా యమును పొందుటకన్న గత్యంతరము లేదని తలచిరి. బెంజమీను ఫాస్కులిను పరాసు దేశములో ఋణమునకై యత్నించు చుండగా హాలెండులో కూడ ఋణము - సంపాదించుటకు లారెన్సు అను నాయనను పంపిరి. మిక్కిలి అవమానకర మగు విషయ మేమన యుద్ధము కొన్ని సముద్రతీర ప్రాంత ములలోను సరిహద్దులనును మాత్రము జనగుచుండగ రాష్ట్ర ములలోని ప్రజలు మామూలుగ ద్రవ్యార్జనము చేసికొనుచుండిరి. వర్జీనియాలోని పొగాకు పంటకు లోపము కలుగ లేదు. మేసషు పెట్సు వారు వర్తకముచేసి ధనవంతులగుట మానలేదు. యుద్ద విరాళముల నిచ్చుటకును ఋణముల నిచ్చుటకును మాత్రమే లోపము కలుగుచున్నది.

ఆంగ్లేయిలు
జార్జియా రాష్ట్రమును
నాక్రమించుట.


వాషింగ్టను సేనావివద్ద తగిన సేనలుగాని ఆయుధములుగాని లేక యుద్ధము తీవ్రముగ సాగించుటకు కశక్తుడుగనుండెను. దక్షిణ ప్రాంత మంతయూ అమెరికను రాజభక్తులచే నిండి యుండెను. ఈ రాజభక్తులు జార్జియా రాష్ట్రము పై రెండు సార్లు దండెత్తి యుండిరి. వీరి పైకి అమెరికను సైన్యములు వెడలెను. ఇంతలో రెండు వేల మంది ఆంగ్ల సేనలు శవన్నావద్ద నీయమెరికనులను ముట్టడించెను. డిశంబరు 29 వ తేదీన జరిగిన యుద్దములో పూర్తిగా సమెరికను లోడిపోయిరి. శవన్నా శత్రువుల వశమయ్యెను. 1779 వ సంవత్సరము జనవరి నెలలో నిచట నుండి ఆంగ్లేయ సేనలు జార్జియా రాష్ట్రము నంతను స్వాధీనమును పొందెను.

రాజభక్తులు నా
శనము గావింపబడిరి ఆంగ్లేయులు
దక్షిణ కారోలినా నాక్రమించుట.

తరువాత శత్రువులు దక్షిణ కారొలీనా రాష్ట్రమునాకమించ తలచిరి. అమెరికను రాజభక్తుల సేసలు ఆంగ్లేయులతో కలయుటకై పోవు 14వ ఫిభ్రవరి నాడు వీరిని అమెరికను సేనలు ముట్టడించి చాలమందిని నాశనము గావించెను. రెండువందలమందిమాత్రము తప్పించుకొనిపోయి యాంగ్లేయులతో చేరిరి. ఈ సమయమున ఖయిదీలుగ చేయబడిన డెబ్బదిమంది రాజభక్తులను అమెరికను సైనికోద్యోగులు దేశద్రోహ నేరమున విచారించి అయిదుగురికి ఉరిశిక్షయు తక్కినవారికి కఠిన ఖైడును విధించిరి. కాని మార్చి 8వ తేదీన బ్రై రు. ఆర్చీవద్ద అమెరికనులను ఆంగ్లేయు లోడించిరి. మే నెలలో ఆంగ్లేయ నేనలు ఛార్లెసుటను వరకు నెట్టుకొని పోయి దక్షిణ కారోలినా నాక్రమించెను. ఆ రాష్ట్రమున ఆంగ్లేయ సైనికులు ప్రజలను దోచుకొనియు పెక్కు అవమాన కృత్యములను చేసియు ప్రజాపీడనము గావించిరి. వేసంగివచ్చుటచే సత్యధిక మగు సుష్ణమును సహించ జాలక యభయ పక్షములవారును కొంతకాలము యుద్దము పొగించ లేదు.

ఎర్రయిండియను
అమెరికనులచే
నాశనము చేయుట.

ఈ సమయముననే సయిదు వేలమంది అమెరికను సైన్యములు సల్లివనుసేనాని : కింద దేరి వెడలి, మస్కిహానా, గిన్నీ నదులమధ్య నున్న ఎరయిండియనుల దేశమునంతను నాశసముచేసి ఆక్రమించుకొనెను, అక్కడ .


నున్న ఎయిండియనుల గ్రామముల కన్నీటిని అమెరికను నేసలు తగులబెట్టి భస్మీపటలము గావించెను. వారి భూములలోని పంటల సన్నిటిని నాళనము చేసెను. ఒక్క గ్రామములోలకు అరవై వేల పడుల ధాన్యమును మంటలలో పడవేసెను. దొరికినంతవరకు పురుషులనక స్త్రీలనక శిశు వులనక ఎరయిండియనుల నందరను మిక్కిలి క్రూరముగ వధించెను. పారిపోయిన ఎర్రయిండియసులను నయగారా వరకు తరమిన వేసెను. ఈ ప్రదేశమంతయు నమెరికనులకు స్థిరముగ లోబడినది. తిరిగి ఎప్పుడును ఎర్రయిండియనీ ప్రాంతమున కనపడ లేదు. వెనుక వోమింగు పొంకమున ఆంగ్లేయులు ఎర్రయిండియనులచే గావింప చేసిన క్రూర కృత్య ములకు ప్రతిగ నిపుడీ ఘోర కృత్యములను వాషింగ్టను సేనాధ్యక్షుని యత్తరువుల సుసరించి సల్లివను సేనాని చేయుంచెను. ఆంగ్లేయులకును ఆమేరికనులకును, మధ్య ఎర్రయిండియనులు నాశనమయిరి.

ఆంగ్లేయులు మనషుసెట్సు
నాక్రమించుట.


1779వ సంవత్సరమున దేశీయ మహాజన సభవారు కనడా దేశముపై దండెత్త తలచిరిగానీ ఆంగ్లేయులు మనషు తగిన ద్రవ్యము లేకను నూతన సైనికులుత్సాహముతో ఏమియు చేయజాలక పోయిరి. జీతములు లేక సైనికోద్యోహాలు చాల యిబ్బందులు పడుచున్నారనియు వెంటనే తగిన ఏర్పాటులు చేయనిచో చాలమంది మానుకొని పోవుదురనియు వాషింగ్టను వ్రాయుచుండెను. ఈలోపున నాగ్గేయసైన్య ములు కనెక్టికటు రాష్ట్రములోని సముద్ర తీరములను ముట్ట

డించి ధ్వంసము చేయుచుండిరి. న్యూహావను మొదలగు పట్టణ ములను దోచుకొని తగుల బెట్టిరి. స్టోనీ పాయంటును న్యూయార్కు ఎదురుగనున్న మరియొక కోటను వశపరచు కొనిరి. (ఆగష్టు 19 ) జనరలు మెక్లీయను కింద మరియొక యాంగ్లేయ సైన్యము మెసష సెట్సులోని పెనబుస్కాటు బే సాక్రమించెను. వీరిని వెడల గొట్టుటకు మెసషు సెట్సు రాష్ట్రమువారు గొప్ప అమెరికన్లు సెస్యమును బంపిరి. గాని అమెరికనులు పూర్తిగ నోడిపోయిరి. వీరి పడవలను అంగ్లేయులు పట్టుకొనిరి. కొన్నిటిని ఆమెరికనులే తగులబెట్టుకొనిరి. అనేక మంది సైనికులు అరణ్యములలోనికి పారిపోయి యచట మరణించిరి. ఆ ప్రదేశమంతయు నాంగ్లేయుల వశమయ్యేను.

అమెరికను
రాజభక్తుల భావములు.


అమెరికను రాజభక్తుల సంగతియేమి? మాతృదేశ మగు ఇంగ్లాండు నుండి పూర్తిగా స్వతంత్ర మును పొందుట కమెరికనులలో ననేకుల కిష్టము లేకుండెను, ప్రతి రాష్ట్రము లోని ప్రజలలోను సభిప్రాయ భేదములు గలవు, అధిక సంఖ్యాకులు స్వాతంత్ర్యపక్షమున నుండటయు దేశీయమహాజన సభవారధికసంఖ్యాకుల ప్రతి నిధ్యము వహించుటయు నిర్వివాదమగువిషయమే. కానీ కొంత దృఢమైన సంఖ్యయే స్వాతంత్ర్యముసకు వ్యతిరేకులుగ నుండిరి. వీరిలో ధనవంతులును పలుకుబడిగల వారును గూడ గలరు. వీరాంగ్లేయ రాజునందు తమరాజభక్తిని ప్రకటించుట యేగాక రాజభక్తుల సంఘముల నేర్పరచి తమ యభిప్రాయములను వ్యాపింపజేయుచుండిరి. కొన్ని రాష్ట్రములలో నీరాజభక్తు లెక్కువ బలవంతులుగను మరికొన్ని చోట్ల బలహీనులుగను


నుండిరి. యుద్ధముచాలకాలము సాగినకొలదియునాంగ్లేయులు పెక్కువిధముల కృషి సలిపి యనేక యుపాయములచే నమరికనులను చీలదీసి రాజభక్తులను వివిధ ప్రాంతములలోను "బలపరచుటయేగాక రాజభక్తుల పటాలములను బయలు దేర దీసి అమెరికను స్వాతంత్ర్య వాదుల పై యుద్దములను చేయించు చువచ్చిరి. అమెరికాలోని రాజభక్తులే తమకు ముఖ్యమగు బలమని ప్రధమమున కొంతకాలమాంగ్లేయులు నమ్మియుండిరి. 1780 వ సంవత్సరం డిశంబరు నెలలో 8954 మంది రాజభక్తు లాంగ్లేయ పటాలములలో చేయండిరి. 1781 వ సంవత్సరము 7 వ మార్చి తేదీన " దేశీయమహాసభహరి , కిందనుండిన అమెరికను సైనికుల మొత్తము కంటే సొంగ్లేయ సేనలలో సుండిన 'రాజభక్తుల సంఖ్య ఎక్కువగ నున్నదని” ఆంగ్లేయ సేనాధి పతి వాసెను. 1781 వ సంవత్సరము సెప్టెంబరులో ఏడు వేల మంది. రాజభక్తు లాంగ్లేయుల సైనికకొలువునందుండిరి. మెనషు సెట్సు, మేరీలాండు, సెన్ని సర్వేనియా, న్యూయార్కు రాష్ట్రములలో బలమయిన రాజభక్తుల సంఘము లుండెను. న్యూయార్కుకు సమీపమున రాజ భక్తులొక కోటను కూడ నిర్మించి యుండిరి. 1776 వ సంవత్సారము నవంబరు నెలలో కనెక్టికటు రాష్ట్రములోని రాజభక్తులను ఖయిదుచేయుటకు వాషింగ్టను యాచించెను. 1776 సంవత్సరము మార్చిలో బోస్టనునుండి ఆంగ్లేయ సేనలతోకూడ వెయ్యిమంది రాజు భక్తులు వెళ్లి పోయినందున న్యూఇంగ్లాండు రాష్ట్రములలో రాజభక్తుల పక్షము మిగుల బలహీనమయ్యేను. చాలా కాలము వరకు న్యూయార్కు, ఎన్ని సల్వేనియా, న్యూబర్సి రాష్ట్ర ములు రాబభక్తులతో నిండియుండెను. న్యూజర్సీలోనికి పోషింగ్టను ప్రవేశించినపుడు ప్రజలు భయము వలవను దేశద్రోహము వలనను వాషింగ్టనుకు సహాయముచేయ కుండుటను చూచియున్నాము, 1778 వ సంవత్సరమున వోమింగు మొదలగు ప్రాంతములలో రాజభక్తు లాంగ్లేయులతో చేరి ఎర్రయిండియసులను దేశభక్తు లమీద ఘాతకకృత్యములను చేయుటకు పురిగొలుపుటను చూచియున్నాము. దక్షిణమున నున్న జార్జియా కారొలీనా రాష్ట్రములలో రాజభక్తులు చాల పలుకు బడి గలిగియుండిరి. 1776, 79 సంవత్సరములలో కారోలీనారాష్ట్ర ములలో నేలికగ వాంశ్లేయులు, రాజభ క్తుల పటాలము లను పోగుచేయ గలిగిరి. ఈ రాష్ట్ర ములలో రాజభక్తులకును దేశభక్తులకును ఎడ =తెగని పోరాట ములుకలుగుచుండెను. ఇందువలన అన్ని రాష్ట్రము లలోను యుద్ద మాఖరగువరకును అమెరికను రాజభక్తులు ప్రబలియుండి మాంగ్లేయులకు కొంతవరకు సాయము చేయుచుండిరనట స్పష్టమగు చున్నది. కాని ఈ రాజభక్తులు స్వార్ధ పరులగనుండిరి. ధర్మపక్షమున తాము పనిచేయు చున్నామను నుత్సాహముగాని భగవద్దోదేశమును నెరవేర్చుచు న్నామను విశ్వాసముగాని వీరికి టేకుండెను. కావున నీరాజభక్తులు ఆంగ్లేయులు జయము లొంది నపుడు. వారిపక్షమున చేరు చుండుటయు, వారోడిపోవుచున్నపుడు జారి పోవుటయు చేయుచుండిరి. జయ మెటుపక్షముననున్నదో చూచి మరి వపర్తించుచుండిరి. కావున వీరి వలన నాంగేయు లకు తగిన చేయూతకలుగ లేదు. ఈ రాజభాక్తుల నుండి యొక పేరు పడసిన సేనాధిపతియయినను బయలు దేర లేదు. క్రమము గా నీసంగతి యాంగ్లేయ సేనాధిపతులును బాగుగ గ్రహించి వీరిని గూర్చి హీనముగవ్రాయుచుండిరి. ఆంగ్లసేనాథ్యక్షుడగు కారస్ వాలీసు, ప్రభువు వీరిని గూర్చి చెడు విధమున వ్రాసెను. యుద్దము చాలకాల మాంగ్లేయులు చేయగలిగిన దీరాజభక్తుల సహాయమువలస కాదు. దమస్యంత బలము. మీదనే నాధార పడి చేసిరి.


(3)

స్పయిన్ వారు
యుద్ధములో చేరుట.

స్పైన్ దేశము కొంతకాలమువరకు యుద్ధములో దిగలేదు. అటు ఇంగ్లాండతోను ఇటు ఫ్రాన్సుతోసు రాయబారములు జరుపుచునేయుండెను. కాని జిబాల్టరు పట్టణమును మైనార్కా ద్వీపమును ఇంగ్లాండునుండి సంపాదించవలెనని స్పైక్ ప్రభుత్వమునకు గలదు. వీటిని స్వాధీనపరచుకొనెదమని ప్రాస్సు చెప్పినందున 1779 వ సంవత్సరం 12 వ ఏప్రిలు తేదీన స్పైన్వా రు ఫ్రాన్సువారితో మెుడుబడికె చేసుకొని యాంగ్లేయులతో యుద్ధముచేయుటకు సమ్మతించిరి. పరాసువారు ఇంగ్లాం డుమీదికిగాని ఐర్లండు మీదికిగాని దాడి వెడలుదుమని చెప్పిరి. జ్కూ 16వ తేదీన నిగ్లాండువారును స్పైన్ కును మధ్య యుద్ధము ప్రకటించబడి ఆంగ్లేయ దేశములోని ప్రజలకు పొరుయమతిశయించెను. వెంటనే ఏబది వేలమంది ఐచ్చికసైనికులు చేరిరి. ఇదిగాక ఏబది వేల సైనికులుండిరి. పార్ల మెంటులో ఆమెరికాతో యుద్ద మెటులైన సంతరింప చేయ వలెననుపతమువారు వృద్ధి యగుచుండిరి. రాజుమాత్రము పట్టుదలను విడువ లేదు. అమెరికాస్వతంత చంగీకరించి అవ


మాసకరమైనసంధి చేసుకొనుటకు తాను సమ్మతించ జాలనని చెప్పెను. ఫొస్సు, స్పైన్, అమెరికాలతో యుద్ధముచేయుటకు రాజు సన్నద్ధుడయ్యెను.

అన్ని ఖండలలోను
యుద్ధము.


జులై 8వ తేదీన స్పైన్ సైన్యములు బాల్టరునుముట్టడించెను ఫోన్సు వారిని ఇంగ్లాండు పై దాడి వెడలమని స్పైన్ ప్రోత్సహించెను. పరాసు,స్పైన్ దేశముల సౌకాదములు కలిసి ఇంగ్లీషు ఛానలులోనికి వచ్చెను, అటునిటు క్రిందికి పైకిగ్రుమ్మరెను. ప్లిమాతు రేవువద్దకు వచ్చి ఆంగ్లేయ వర్తక పడవలను పట్టుకొనెను. ఒక ఆంగ్ల యుద్ధ నౌకనుకూడ స్వాధీనమపరచుకొనెను. ఇంతకంటే నేమియు చేయలేదు. పరాసు, స్పైన్ నౌకానేనాధిపతుల కభిప్రాయ భేదములు కలిగెను. బంక విరేచనములు సైనికులలో వ్యాపించెను. బెస్టు రేవును మరలి పోయెను. అక్కడనుంచి చీలిపోయెను. పరాసు నేనలలో జ్వరముకూడ ప్రబలెను. ఏమియు చేయకపోయినను వృధాగా విశేషసొమ్ము మాత్రము ఖర్చయ్యెను.


యూరొపు ఖండమున (నారు సీ) ఉత్తర సముదములో రెండు అమెరికను యుద్ధ నౌకలు ఆంగ్లేయ నౌకలను ముట్టడించెను. పోరు తీవ్ర ముగనే జరిగెను, ఆంగ్లేయ నౌకలను అమెరికనులు పట్టు కొని హాలుడు రేవులోనికి చేర్చింరి. ఒక ఆంగ్ల నౌక తగుల బడిపోయెను. ఒక అమెరికను నౌకవిశేషముగ నష్టమొందెను. 'అమెరికా ఖండమున పశ్చిమయిండియా ద్వీపములతో పరాసు వారి రెండు ద్వీపముల నాంగ్లేయులు పట్టుకొనిరి. స్పైన్


. వారు ఫ్లోరిడా వై దండెత్తిరి, మిస్సిసివీనది ప్రాంతముననున్న ఆంగ్లేయ వలస రాజ్యమునంతను నాక్రమించిరి. ఆఫ్రికా ఖండమున పరానువాతి సినిగలును ఆంగ్లేయులు గోరీని పట్టు కొని.. ఆసియా ఖండమున హిందూ దేశములో హైదరాలి నైజాం, మహరాష్ట్రులు మిత్రమండలిగ నేర్పడి ఆంగ్లేయులతో యుద్దము చేయుచుండిరి. పైమిత్రమండలి క్రింద సమర్థులగు పరాసు నేనాధిపతులు కొలువు చేయుచుండిరి. ఈవిధమున ప్రపంచములోని అన్ని ఖండములలోను యుద్ధము జరుగు చుండెను. .

శవన్నా
యుద్ధము


1779 వ సంవత్సరము 'సె ప్టెంబరు 1 వ తేదీన పశ్చిము. యిండియా ద్వీపములనుండి పరాను సేనాని ఏఏస్టింగుగు ముప్పది. యుద్ధనౌకలతోవచ్చి నాలుగు ఆంగ్లేయ నౌకలపై ఆకస్మికముగా పడెను. ఆంగ్లేయులు పారిపోయిరి. పరాసు సై స్వములు. 10 వ తేదిన శవన్నా రేవులో డిగెను. ఆఫ్ఘట్టణమును ముట్టడించుటకు తగిన స్థితిలో లేమని తలచెను. ఇంతలో ఆంగ్ల సై స్యములు బ్యూపర్డు సేనాని కిందపచ్చి పరాసువారిని ముట్టు డించెను. అమెరిక ను సేనాని లంకను కొన్ని సేనలను పరాసుల సహాయమునకు తెచ్చెను. 1779 వ సంవత్సరమున సెప్టెంబరు నెలలో శవన్నా వద్ద జరిగిన గొప్ప యుద్దములో ఆంగ్లేయులకే పూర్తిగ జయము కలిగెను. పరాసు సేనాని ఏస్టింగునకు రెండుసార్లు గాయములు తగిలెసు. వీరి క్రింద. పోరాడుచున్న పోలాండు స్వాతంత్యవాదియగు పులన్కేకి బల మయిన గాయము తగిలి మరణించెను. పరాసు అమెరికనులు

పక్షమున ఎనిమిది వందలమంది చనిపోయిరి. ఆంగ్లేయులకు బహుకొద్ది నష్టము కలిగెను. పరాసు సేనాని యుద్ధము చాలించి యోడ సైన్యముతోడను మెట్ట సైనికులతోడను వెడలి పోయెను. లింకను సేనాని మిగిలిన సైన్యములతో ఛార్లెను టనుకు పోయెను.

అమెరికను సేనాని
ఆంగ్లేయులకు
లోబడుట.

యుద్ధము బాగుగా జరుపుటకై రోడు అయిలండు లోనున్న ఆంగ్లేయ సేనలన్నియు న్యూయార్కు వద్ద క్లిన్న్ట సేనాని క్రిందనున్న సైన్యము లతో చేరెను. ఇంగ్లాండు నుండి కొన్ని కొత్తసేసలు వచ్చి వీటితో కలసెను. ఈ సైన్య ములన్నియు డిశంబకు 28వ తేదీన న్యూమూర్కు నుండి బములు దేరి , తోవలో చలిబాధపలనను నౌకల లోపమువల వలనను శ త్రు ప్రజల అడ్డంక మువలనను కొంత నష్టమును పొందుచు 1780 వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన ఛార్లెస్టన్ పట్టణమును చేరెను. దానిని ముట్టడించెను. లింకను సేనాని అమెరికను సై స్యములనన్నిటితోడను నా పట్టణములో నుండెను. గాని ఆంగ్లేయుల నెదిరింప జాలకపోయెను. ఆపట్టణములోని ప్రజలందరును రాజభక్తులై అమెరికనులకు సహాయ మేమియు చేయరైరి. పట్టణమును సంరక్షించుటకు తగిన బలము లేదు.గావున మే నెల 12వ తేదీన అమెరికను సేనాని లింకను అంగ్లేయులకు లోబడెను. జూర్జియాప్రాంతమున కారన్ వాలీసు ప్రభువు ఆంగ్లేయ సేనలను నడుపుచుండెను. జూన్ నెలలో జార్జియా రాష్ట్రమంతయు ఆంగ్లేయుల వశమయ్యెను.

దేశీయమహాసభ
వారి దివాళాస్థితి.

1779-80 చలికాలము జాషింగ్టను క్రిందనున్న అమెరికను సేనలకు మిగుల బాధకరముగ నుండెను. చలికాలము శీఘ్రముగ పొరంభించెను. చలి మిక్కుటముగ నుండెను. అమెరికసులు ఆంతయు తమ మిత్రులగు పరాసువారు చేసి పెట్టెదరని భారమం తయు నా మీద త్రోయుచుండిరి. స్వయం సహాయము తక్కువయ్యెను. “ఆమెకనులకోమనమును స్పెయి" వారుసు చేరిన తరువాత అమెరికనుల ప్రయత్నములు క్షీణించినవి. సోమరితనముతోడను ఆశ్రద్దతోడను కూడుకొనినారు. " అని 1779వ సంవత్సరం సెప్టెంబరు నెలలోనే అమెరికాలోని పరాను రాయబారి పరాసు ప్రభుత్వమునకు వ్రాసిను. అమెరికా విప్లవ ప్రభుత్వము ( దేశీయ మహాజనసభ), దివాళయగు స్థితిలో నుండెను. ఇరవై కోట్ల డాలరుల కాగితములను సృష్టించినారు. ఈ కాగితపు డాలరులను పుచ్చుకొనువారు అరుదుగ నుండిరి. ఆరువందల కాగితపు డాలర్లకు గాని యొక పాదరక్షలజత దొరక కుండెను. వాషింగ్టనువద్ద ద్రవ్యము లేక కాగితపు ముక్కలను పుచ్చుకొనువారు లేక సైనికు లందరును చలికాలమున దుస్తులును తిండియు లేక చాల బాధ పడి, చాలకాలము స్వల్పమగు భోజనములోనే తృపినొందు చుండిరి. కొంతకాల మదియును కూడ లేకుండెను. వివిధ రాష్ట్రములవారును సైనికులకు భోజనపదార్థములను సమకూర్చ వలెనని దేశీయ మహాజనసభవారుత్తరువు చేసిరిగాని దాని ప్రకారము జరుపువారు లేరైరి. సైనికులే చుట్టునున్న ప్రజల నుండి బలవంతముగ భోజన పదార్ధములను దోచుకొని తెచ్చు "నుచుండిరి. నిర్నయమైన యొక దినమువరకు మంచి యేర్పాట్లను చేయనిచో తామందరము వెళ్ళిపోయెదమని సైనికోద్యోగులందరుసు కట్టుకట్టి వాషింగ్టనుకు దెలియ చేసిరి. 1780 సంవత్సరం ఏప్రిలు 3 వ తేదీన " యింత తీవ్రముగ నసంతృప్తి పబలి న సమయము యుద్ధకాలములో ఎప్పుడును తటస్థించ లేద"ని వాషింగ్టను వ్రాసెను. సైన్యములకు అయిదు నెలల జీతము బాకీయున్నదనియు, యెప్పుడును ఆరు దినములకన్న యెక్కువ రోజులకు చాలిన ఆహార పదార్థములు సైన్యముల వద్ద లేపనీయు, ఆనేక సమయములలో భోజనము లేకుండ. కూడ నుండుచు వచ్చిరనియు సైన్యములవద్ద దవ్యము బొత్తిగా లేదనియు, వీరికి ఋణమునిచ్చువారు లేరనియు, సైని కులయొక్క సహనశక్తి అత్యద్భుతముగ చూపబము చున్న దనియు, దేశీయ మహాసభ సంఘమువారు తెలియబరచిరి.. కనెక్టికటు సేనలలో తిరుగబాటు సిద్ధమయ్మెను గాని వాషింగ్ట నెటులనో నణచి వేసెను. ఆరునెలలవరకు నూరు రొఖ్డాలర్లు ముందుగ చేతిలో పెట్టినగాని యొక్క అమెరిక నై సను సై స్యములలో, చేరకుండెను. జూన్ నెలలో వాషింగ్ట ను వద్ద పోరునలుపుటకు తగిన స్థితిలో నున్న సైనికుల మొత్తము మూడు వేల ఏడువందల అరవై మంది మాత్రముడిరి.

అమెరికనుల
నిస్సహాయత.

ఫ్రాన్సునుండి తగిన సహాయము తీసుకొనిరమ్మని లఫయతు ప్రభువుకు పరాసు దేశమునకు బంపిరి, ఆయన చేయదగిన ప్రయత్న మంతయు చేసిఏప్రిలు నెలలో నమెరికాకు తిరిగివచ్చెను. కొలదికాలములో వరాసు సైన్యము లమెరికాకు వచ్చి చేరునని

చెప్పెను. జులై నెలలో నారు వేల మంది పరాను సైనికులు న్యూపోర్టు రేవులో వచ్చిదిగిరి. వారితో చేరుటకు వాషింగ్టనువద్ద మనుష్యులుగాని సామగ్రులుగాని లేకుండెను. రెం డవ పరాసుసేన ఫ్రాన్సులోనుండి బయలు దేరకమునుపే బ్రెస్టు రేవులో నాంగ్లేయులచే నాటంక పరచబడెను. మరియు నిచట న్యూపోర్టు రేవునుకూడ ఆంగ్లేయనౌకాదళము ముట్టడించెను. పశ్చిమ ఇడియా ద్వీపములలోని వరాసువారిని, స్పెయిన్ గారిని సహాయము తెచ్చుకొమ్మని వాషింగ్టనుకు దేశీయ మహాజనసభ వారు అధికార మిచ్చిరి. వాషింగ్టను మిగుల దుస్థితిలో నుండెను. ఏమిపై న్యము తెచ్చుకున్న ను ప్రయోజనము లేదయ్యెను. వచ్చినవారు తిండి లేక మాడ వలసినదే. లేని చో వారిని యిండ్లకు వంపి వేయవలసిన దే. ఇంత కన్న యేమిచేయటకును తోచుట లేదని వాషింగ్టను వ్రాయు చుండెను. జనేవరి 1 వ తేదీన తనవద్దనున్న సైస్యములలో సగము వెళ్ళిపోవుననియు తక్కినవారు. దేశాభిమానమువలన మాత్రమే నిలిచి యుండవలసిన దేగాని మరియే కారణము చేతను నిలిచియుండరనియు వాషింగ్టను మరల వ్రాసెసు. అమెరికా దేశీయు లింతకన్న యెక్కవ సహాయమును చేయ నిచో అమెరికను సైశ్యములు పేరువకుగూడ నుండపనియు అమెరికా దేశములో అమెరిళా ప్రజలపక్షమున విదేశీయులు మాత్రమే పోరాడుచుండునంతటి యవమానకరమగు స్థితి త్వ రలో సంభవించ నున్నదనియుకూడ నాయన దేశీయ మహా సభ వారికి తెలిపెను. కానియీకాలమున , నాంగ్లేయులును న్యూజెర్సీలో దండెత్తుట తప్ప మరి యేమియును చేయలేదు


అమెరికా సంయుక్త రాష్ట్రములు సముద్రము మీద యుద్దము తీవ్రముగ జరుగు చుండెను. ఆంగ్లేయ నాకాసేనాని అడ్మిరలు రోడ్ని జనవరి 8వ తేదీన 15 స్పైన్ వర్తక యోడలను 7 యుద్ధనౌకలను పట్టుకొనెను.. 16 వ తేదీన సెటువిన్సెంటువద్ద స్పైన్ వారి నౌకాదళము నోడించి వారి పదకొండు నౌకలలో నేడింటిని నాశనము చేసెను. జిబాల్టరు పైబడి దానిని స్వాధీనపరచుకొనెను. మైనారా ద్వీపమును జయించెను. పశ్చిమ యిండియా ద్వీపములకై వయనమై పోయెను. అక్కడ పరాసు నౌకాదళమును ముట్టడించెను. గానీ జయము పొందలేదు నాంగ్లేయ నేనానికి సాయము చేయటకుగాను తన నౌకాదళముతో అమెరికా దేశమునకు చేరెను.

హాలెండుతో
ఆంగ్లేయులకు
కలహము.

ఈలోపున మరియొక దేశము యుద్ధములోనికి లాగబడు చున్నది. తటస్తమ గనున్న దేశములలో కెల్ల హాలండు నకు విరివిగ విదేశ వాణిజ్యము గలదు. యుద్ధమువలన వీరు ఎక్కువలాభము పొందుచున్నారు. అమెరికా వారు కూడ వీరి సరుకులనే ఎక్కువగా కొనుచున్నారు. యుద్దములోనికి దిగియున్న ఇతర దేశముల వారును వీరి సరుకులనే కొనుచున్నారు. వీరి ఇటులయిన తమ పక్షమున యుద్ధము లోనికి- చేర్చుకొనవలెనని ఆంగ్లేయులు ప్రయత్నించిరి, పాత యొడంబడిక అను బయట పెట్టిరి. ఆంగ్లేయులకు యుద్దములోయము చేయుటక హాలండువా దివరకే మొడంబడి. యండిరనీ చెప్పిరి. కాని హాలండువారు పోరాడదలచలేదు.


అమెరికను నౌకలకు హాలండు రేవలలో శరణ్య మిచ్చుట అక్రమమని ఆంగ్లేయులు చెప్పిరి. ఎవరైనను తమ రేవుల లోనికివచ్చి సురక్షితముగ ముండవచ్చునని హాలండువారు జవాబు చెప్పడం తమ శత్రువుల కేమైన ఆయుధములనుగానిభోజన పదార్గములనుగాని తీసుకొని పోవుచున్నారేమో చూచుటకై ఆంగ్లేలు తటస్తులగు దేశములవారి పర్తకతపు టోడలను సోదా చూడనారంభించి. దీనికి హాలెండు వారొప్పు కోసలేదు. జనవరి నెలలో అయిదు హాలెండు యుద్ధనౌకల సంరక్షణ క్రింద పరాసు వారి బ్రెస్టు రేపునకు పోవుచున్న ఒక హాలెండు వర్తకపు నాకాదళమును ఇంగ్లీషు ఛానలులో నాంగ్లేయు నౌకాదళ మాపి సోదా చూచెదమనిరి. దీనికి హాలెడు వారు తిరస్కరించిరి. ఇరుపక్షములవారును కలహించిరి. కొన్ని హాలండువారి వర్తకపు టోడల నింగ్లీషు వారు పట్టుకొని ఆంగ్లేయ దేశపు రేవులోకి తెచ్చిరి. తక్కిన హాలెండు నౌకలు వెళ్లిపోయెను. కొన్ని నెలతరువాత హాలెండుతో జరుపుచున్న వర్తకమును మానుట ఆంగ్లేయులు తీర్మాకంచిరి. ఉభయలకును సంవత్సరాంతము వరకును యుద్ధము ఆరంభము కాలేదు.


తటస్త దేశముల
కట్టడి.


ఆంగ్లేయులు హాలెండు వారి వర్తగవు నౌకల నాపు టయు 'స్పైన్ వారు రష్యావారి వర్తకపు నౌకల నావుటయ జరిగినందున యూరపు ఖండము లోని తటస్త దేశముల వారొకట్లడిని చేసికొనిరి. దీనికి ముఖ్యులు ప్రష్యారాజును రుష్యా రాణియును మార్చి 8వ తేదీన "తట ప్రదేశముల వారిపడ

వలు సముదముల మధ్య సేగాక యుద్ధము చేయుచున్న దేశ ములవారి రేవు రేవునకును ప్రయాణము చేయుచున్నను ఎవ రును ఎట్టి అభ్యంతరమును చేయగూడదనియు తటస్న దేశ ములవారి పడవల మీద నాయుధములుగాఢ మిగతా నేమి తీసుకొని పోవుచున్నను ఆటంకపరచ గూడదనియు" రుష్యా రాణి ప్రకటించి ఈధర్మమును కొనసాగించుటకు తటస్త దేశ ముల వీరందరు నొక యొడంబడిక చేసుకొని దీని నమి లు జరుపుటకు తమ సైన్యములతో సిద్ధముగ నుండవలెనని గోను, రుష్యా, ప్రష్యా, హాలెండు, స్వీడను, డెన్మార్కు , పోర్చుగలు ప్రభుత్వములనా కట్టడిలో చేరిరి. పలు నెలలో పరాసు, స్పైక్, దేశములవారుకూడ నిందు కంగీక డించిరి. అక్టోబరు నెలలో అమెగా సంయుక్త రాష్ట్రములు సమతిని వెలిబుచ్చెను. సంవత్సరాంతమున ఆస్ట్రియూ చక్ర వర్తికూడ చే7ను. ఇదువలన ఆంగ్లేయ వర్తకముఖకు నష్టమని యింగ్లాండు చేర లేదు.

ఇంగ్లాండులో
కల్లోలము

ఈ సమయమున ఐర్లాండులో గొప్పకల్లోలము బయలుదేరెను. అప్పటికి ఐర్లాండు ఆంగ్లేయరాజు ఐర్లాండులో క్రిందనున్నను వేరుపార్లమెంటును కలిగియుండెను. ఆసార్లమెంటు కింగ్లాండు పొర్లమెంటు వలెనే ప్రజా ప్రతినిధి సభయు ప్రభువుల సభయుసని రెండు సభలుండెను. ఇంగ్లాండులోని పి వి కౌన్సిలు వారు తయారు చేసి పం పెడి చట్టము ల ను అవును, కాదు యని సమ్మతుల నిచ్చి యిష్టము వచ్చి ఏదో


నెక్కువమంది యంగీకరించుటయు లేదా తిరస్కరించుటకు మాత్రమే చేయవలెను గాని ఐర్లండు పార్లమెంటు వారికి స్వంతముగ చట్టముల నువపొదించు సధికారము లేకుం డెను. ఐర్లండు ప్రభువల సభమీద ఇంగ్లాండు ప్రభువుల సభకప్పీలు (విమర్శనాధికారము) గలదు. ఆంగ్లేయ పార్లమెంటువారు చేయుచట్టములను ఐర్లాండువ రిని బద్ధులను చేయును, కాని ఐర్లాండు యొక్క పార్లమెంటులో నున్న వారందరును ఇంగ్లాండు నుండియు స్కోట్లండు నుండియు వచ్చి కాపురమున్న ప్రొటస్టంటు మతస్తులు. ఆంగ్లేయులు ఐర్లండులో ముఖ్యముగ అల స్టరు ప్రాంతమున వలసవచ్చి నివసించి ఐర్లాండులోని చాల భూములను స్వాధీనమును పొంది గొప్ప భూఖామందులై యుండిరి. వీరాంధేయ దేశపు ప్రొటస్టంటు క్రైస్తవమత శాఖకు చెందినవారు. వీరు ఐర్లాండులోని ప్రభువుల సభలో సభ్యులగుటయేగాక ఐర్లాండు ప్రజా ప్రతినిధి సభయు వీరి చేతులలోనే యుండెను. వీరికిష్ట మువచ్చిన వీరి పలుకుబడి లోని ప్రొటస్టంటలను ప్రజాప్రతినిధిసభకు నియమించు చుండిరి. ఐర్లాండు ప్రజలలో నత్యధిక సంఖ్యాకులు రోమను కాథ లిక్కులు, ఆంగ్లేయరాజులు అయిర్లాండును జయించగనే రోమను కాథలిక్కు భూఖామందల భూములను లాగుకొని ఆంగ్లేయ దేశమునుండి వచ్చిన ప్రొటస్టంటు భూఖామందుల కిచ్చిరి . ఐర్లాండులో నూటికి ఎను బదినలుగురు రోమను కాథలిక్కు లుండిరి. నూటికి పదునారుగురు మాత్రమే ప్రొట సెంటులు గలరు. ఆంగ్లేయ ప్రభుత్వము పొరు ఐర్లాండులోని రోమను కాథలిక్కుల కన్ని రాచకీయ హక్కులను తీసి వైచిరి. రోమసు


కాథలిక్కులు పార్లమెంటు సభ్యులగుటకుగాని, పార్లమెంటు సభ్యులను యెస్నుకొనుటకుగాని, సైనికులుగ చేరుటకుగాని ఏ ప్రభుత్వోద్యోగమును చేయుటకు గాని న్యాయవాదుల గుటకుగాని పురపాలక సంఘముల సభ్యులగుటకు గాని వీలు లేకుండ చట్టములను చేసిరి. రోమను కాథలిక్కే గాక ఆంగ్లేయ దేశపు ప్రొటస్టంటు శాఖకు చెందని యితర ప్రాటస్టంటు మతస్తులుకూడ నెట్టి యుద్యోగమునకును అర్హులు కారని శాసించిరి. కావున ఐర్లాండు యొక్క పరిపాలనాధికార మంతయు ఆంగ్లేయ దేశమునుండి వచ్చి కాపురముండి నట్టియు ఆంగ్లేయ దేశపు ప్రాటస్టెంటు మత శాఖకు చెందినట్టియు నూటికి పదిమంది జన సంఖ్యగల ,ప్రభువుల యొక్కయు వారి ఆంగ్లేయ యనుచరుల యొక్కయు సధీనమన నుండెను. ఐర్లాండు ప్రజలు చాలవరకు ఆంగ్లేయుల భూములను దున్నచుండెడి బీద రైతులైరి. ఐర్లాఁడు ప్రజన వర్తకము పడు కూడా ఆ గకర మగు చట్టము లాంగేయ ప్రభుత్వముచే చేయబడ్డాను. ఐర్లండుప్రదాలు పేదరికములో మునిగి యండి. అచట జమదేవత తన నివాస మేర్పరచుకొనినది.


1779న సంవత్సరమున పరాసువారు ఐర్లాండు పై దండెత్తుదు రనువార్త తెలిసి అరవయి వే మంది ప్రాట స్టెంటు ఐచ్ఛిక సైనికులు పోగయిరి. కాని ఈ అవకాశము తీసుకొని ఐర్లాండులోని ఆంగ్లేయ ప్రభువులు ఐర్లాంను పార్ల మెంటున ఆంగ్లేయ పార్లమెంటు మీద పరాధీనత తప్పించవలసినదనియు వర్తకపు హక్కుల నివ్వవలసినదనియు నాందోళనము చేయ సాగిరి. ప్రొటస్టంటు ఐచ్చిక సైనికులు రోమనుకాథలిక్కు


ప్రజలకుగూడ కొన్ని హక్కుల నిప్పెంచెదమని మూత పెట్టి యాంగ్లేయ దేశము పై తిరుగబాటు చేయుటకు సిద్ధము చేయుచుండిt. ఐర్లాండు పార్లమెంటుకు స్వతం, త్రాధికారము కావలెననికూడ గోరిరి. 1779వ సంవత్సరము సవంబరు 25 వ తేదిన లండనులో ఆంగ్లేయ పార్లమెంటు సమావేశమై నపుడు ఐర్లాండు దేశములోని కల్లోలమునుగూర్చి యోచించిరి. ఐర్లాండు దేశపు ఏరకమునకును రోమనుకాథలిక్కు మతస్తులకును కొన్ని హక్కుల నిచ్చుటవసరమని ప్రధాన మంతి చెప్పి ను. రోమను కాథలిక్కులకు హక్కులనగనే పార్ల మెంటు సభ్యులలో కొందరికి చాలకష్టముగ తోచెను. వెంటనే ఇంగ్లాండులోను స్కాట్లండులోను రోమను కేథలిక్కులకెట్టి హక్కుల నివ్వగూడ దనియూందోళనము చేయుటకు అనేక సంఘములు స్థాపించబడెను. ఈ సంఘములన్నియు కేంద్రీకరింపబడి యొకప్రొట స్టెటు సంఘమునకను బంధములుగ, చేయబడెను. వీరనేక మహజర్లను పార్లమెంటునకు బంపిరి, పైగ జూన్ 2 మొదలు జూన్ 8వ తేదివరకును లండనులో గొప్ప ప్రజుయల్లరులు జరిగెను. ప్రజాసమూహములు బయలు దేరి రోమను కాథలిక్కుల దేవాలయమును యిండ్లను తగుల బెట్టిరి. బ్యాంకిని దోచుకొనిరి. ప్రభుత్వ సైనికు లీయల్లరుల నణచుటకు యత్నించగ యనేకమంది యుభయ పక్షములను హతులైరి లండనులోని యనేక భాగములలో మంటలు లేచెన. మంటలలో కూడ ననేకులు చనిపోయిరి. లక్ష యెనుబది. 'వేల సవర సులు కిమ్మతుగల యాస్తి పాడ య్యెస. ఇట్టీయల్లరులే బొస్టలు మొదలగు కొన్ని ఇతర చోట్లను ప్రారంభించగ వెంటనే వణచి వేయబడెను. 19వ జూన్ పార్లమెంటు సమావేశమయ్యెను. రోమను కాథలిక్కులకు కొన్ని స్వల్పమగుహక్కుల నిచ్చుచు చట్టమును చేసిరి. జులై 6వ తేదీన యల్లరులు చేసినవారిలో ముఖ్యు లను విచారించి శిక్షలను విధించిరి. స్పైన్ దేశము ఆంగ్లే యులతో రాజీకి రావలెనని కొంతవరకు రాయబాగములు జరిపెను. కాని రోమను కాథలిక్కుల పై జరిగిన అల్లరుల వలన రోమనుకాథలిక్కులగు స్పైన్ ప్రభుత్వమువారు మనస్తాపము నొంది. సంది పయత్నములను విరమించిరి. అమెరికా, పొన్సు మొదలగు దేశములతో ఇంగ్లాండు యుద్ధము చేయుచు. యూరపులోని పెక్కు ప్రభుత్వములవా రింగ్లాండు యొక్క వర్తకమునకు నస్టకరముగ కట్టడి చేసుకొని యన్న నీసమయ మున నీఅల్లరులు జరుగుటంబట్టి యాంగేను జన బాహుళ్య మాయద్దవిషయములలో నెట్టి శ్రద్దయు పుచ్చుకొనుట లేదని. గోచరించుచున్నది.


ఆంగ్లేయ సేనాని
కారన్ వాలీసు ప్రభువు
కాండన్ వద్ద గొప్

1760 సంవత్సరమంతయు అమెరికాలోని దక్షిణప్రాంతముననే యుద్దము జరుగుచుండెను. దక్షిణ కారోలినా రాష్ట్ర మాంగ్లేయుల మయ్యెను. కాని యూరాష్ట్రము నుండి కొందరమెరి:కను దేశభక్తులు లేచిపోయి పక్కనున్న ఉత్తర కారోలీనా రాష్ట్రములో చేరి యండి సమయము దొరకినపుడెల్ల నాంగ్లేయుల పైబడుచుంరి. ఆగస్టు నెలలో నిచటికి వాషింగ్టను కొంత సైన్యము.పంపెను. పర్జీనియా రాష్ట్రమునుండియు కొంత సైన్యము •


వచ్చెను. గేట్సు సేనాని ఈఅమెరికను సైన్యములన్నిటికిని. నేనాధిపత్యము వహించి పదునారవ యాగస్టున శాండన్ వద్ద కారన్ పొలీసు ప్రభువు కిందనుండిన యాంగ్లేయ సైన్యములను తార్కొనెను, కాని యీదిన మమెరికనులకు మిగుల దురదృష్టమైనది. వర్జీనియా నుండి వచ్చిన యైచ్బికభటు లాయుధములను పార వేసి ఆంగ్లేయులు వెంబడించినను చిక్కక సమీపముననున్న అడవులలోనికి పారిపోయిరి, చాలమంది ఇతర సైనికులును నదేపనిని చేసిరి. మొతముమీద అమెరికను సైన్యములలో రెండు భాగము లొక తుపాకియైన శత్రువులమీద కాల్చకుండగనే సత్వంత భయమువలన పలాయన మైరి. అమెరికను సేనాని డిక్నాలుసకు బలమైనగాయములు. తగిలి మరణించెను. యుద్ధమునకు నిలువబడిన అమెరికను సైనికులలో రెండు వేల మంది హతులైరి. అమెరికను సామాగ్రులును యుద్ధసామానులును ఆంగ్లేయులు స్వాధీనము పొందిరి. మిగిలిన కొద్ది సైన్యములతో సమరికను నేనాని గేట్సు ఉత్తర కరోలినా రాష్ట్రములోనికి పారిపోయెను, దక్షిణకారో లినా రాష్ట్రములోనుండి వచ్చిన దేశాభిమానులను నడపుచున్న సమ్ఫుటరు సేనాని పై ఆంగ్లనే లాకస్మికముగ పడి యోడించి చాల మందిని యుద్ధములో చంపి కొందరిని ఖైదీలుగా పట్టుకొనిరి. సమ్ఫుటరు సేనాని ఒంటరిగా నెత్తి విూద టోపీ కూడా లేకుండా జీను లేని గుర్రము పై నొక్కి పారిపోయెను.


కాని వేరొక చోట అమెరికను పక్షముకు

కింగ్సుకొండవద్ద
అమెరికనుల
జయమొందిరి.

కింగ్సుకొండద్ద కొంతవరకు జయముకలుగుచున్నది. ఆంగ్లేయ సేనానియగు కారన్ వాలీసు ప్రభువు ఆమెరికను ప్రజలను తన "సైన్యములలో చేరనునియు, తమ కాహారసామాగ్రుల నిమ్మని, నిర్బంధించుటయు, దేశభక్తుల ఆస్తులను వశపరచుకొనుటయు, ఆంగ్లేయు సైని కులు ప్రజలను దోచుకొనుటయ, హింసించుటయు, పట్టణములను తగుల బెట్టుటయు, చాలమంది అమెరిక నులలో నింగ్లీషు వారి పై ద్వేషమును పురిగొల్పుచుండెను. ప్రజలు సాయుధులై జేమ్సు విలియమ్సు, మారియనుల కింద ఐచ్చిక సైనికులుగ తయారుచేయబడిరి. ఆంగ్లేయులపై యాక స్మికముగ బడుచు పెద్ద సేనలు వచ్చి యదిరించినపుడు తప్పించుకొని పోవుచుండిరి. " ఉత్తరకారొలీనాలోని వీడీ, నాంటి నదుల మధ్యనున్న ప్రదేశము " నాంగ్లేయులపై యుద్ధము చేయుటకు సిద్ధపడని వాడొక 'డైన లేడని కారన్ వాలీసు వ్రాసెను. ఉత్తర కారొలీనా రాష్ట్ర మంతయు నీవిధముననే యుండెను. రాజభ క్తులనుండి కొంత తనకు సహాయము కలుగునని చూశించి కారాన్ వాలీసుప్రభువు ఉత్తర కారొలేనా పై డండయాత నలిపెను. 'మీజరుఫర్గూసను క్రింద కొంత సైన్య మును మిట్టపదేశములకు బంపి తాను మిగిలిన నేనలతో చెర్లెటి మీదికి వెడలెను గానీ త్రోవలో మేజరు ఫర్డూసను గొప్ప యపజయమును పొందెనను వార్తచేరెను. కింగ్సుకొండ వద్ద మేజరు ఫర్గూసను కింది నేనలను అమెరికనులు తార్కొని పూర్తిగా నోడించిన. మేజరు ఫర్గూసను హతుడయ్యెను. ఆంగ్లేయ సైనికులు మరణించిన వారుగా మిగిలినవారినందరను అమెరికనులు ఖుయిదు చేసిరి. ఈ వార్త తెలియగానే కారన్ వాలీసు ప్రభువు వెనుకకు మరలి దక్షిణ కారొలీనాలోనికి చే రెను. కాని త్రోవపొడ గుసను అమెరికను ఐచ్చిక భటులును ? రయితులునును పెక్కు విధములగు నిబ్బందులుసు కలుగజేసి , ఆంగ్లేయుల యాహార పదార్దముల సమెరిగనులు వ పరచుకొనుచుండిరి. దొరికిన యాంగ్లేయులను హతులను గావించుచుండిరి. బ్లాకుస్టాకువద్ద ఆంగ్లేయులు అమెరికనులతో యుద్దము చేసి యోడిపోయిరి.

హిందూదేశములో
హదరాలీ ఆంగ్లేయుల
నోడించెను.

1780 సంవత్సరమున హి:దూ దేశములో మైసూరు హిందూ దేశములో రాజగు 'హైదరాలీ ఆంగ్లేయుల నోడించెను,క్విబికువద్ద నుఁడిన ఆంగ్లేయ నౌకాదళమును ఆమెరికను నౌకాదళముపట్టుకొనెను. పశ్చిమ యిండియా ద్వీపముకు తూర్పుయిండియా ద్వీపములకును వెళ్ళుచుండెడి ఆంగ్లేయ నా దళమును స్పైన్ వారు పట్టుకొని రెండు వేల ఎనిమిగివందల ఆంగ్లేయ సైనికులను ఖయిదుచేసిరి. ఇందువలన ఆంగ్లేయవర్తకమునను నష్టము కలిగెను. 1780 సంవత్సరము డిశంబరు 20 తేదీన నాంగ్లేయ ప్రభుత్వమువారు హా లెండు దేశముపై యుద్దమును ప్రకటించిరి,


1781 సంవత్సరము కూర్చి నెలలో హిందూదేశములో కూటు సేనాని పూసువారి పుదుచ్చేరిని వశ పరచుకొని అక్క డనున్న పరాసు హరి. నిరాయుధులు గావించి హైదరాలీని మహారాష్ట్రులను ఓడించెను. హిందూ దేశ ములోని హాలండు వారికి (ఒలందా వారికి) గల పట్టణములను నవంబరు నెలలో ఆంగ్లేయులు వశపరచుకొనిరి. ఫిభ్రవరి నెలలో నింకను

హాలెండుతో యుద్ధము బాగుగ ప్రచురించకమునుపే హాలెండువారి యూస్టేషియను ద్వీపమును "ఆంగ్లేయ నౌ సేనాని యాకస్మికముగా ముట్టడించి యందు లోని హాలెండువారి ము ప్పదిలక్షల సవరసుల కిమ్మతుగల వర్తక సరుకును నూటయే బది వర్తకపు పడవలను అయిదు చిన్న యుద్ధనౌకలను స్వాధీనమును పొందెను. ఇతేగాక యూరోపునకు వచ్చుచున్న నలుబదియేడు హాలెండువర్తకవు నౌకలనుకూడ నాంగ్లేయులు సముద్రమధ్యమునందు పట్టుకొనిరి. మార్చి నెలలో పశ్చిమ యిండియా ద్వీపములలోని హాలెండువారికి చెందిన డెమరారా "మొదలగు ద్వీపముల ఇంగ్లేయు లాక్రమించుకొనిరి. ఉత్తర అమెరిశా తీరమున నాంగ్లేయుల పెన్సజోలా ద్వీపమును స్పైన్ వారు వశపరచుకొనిరి. '

అమెరికను
సైనికుల కష్ట
పరంపరలు.

పరాసు దేశపు ఆర్థిక స్థితి మిగుల చెడుగ నుండెను.పరాసు ప్రభుత్వము పదునారు కోట్ల సవరను వరకు ఋణపడియుండిరి. దీనిని తీర్చుమార్గ మెద్దియును లేకుండెను. అమెరికాకు సాయము చేయుటకుగాను హాలెండులో పరాసువారు ఒక కోటి లివరీల బుణమును చేసిరి. కొన్ని సంస్కరణములను చేయయత్నించి సాగక పరాసుమంత్రి నెక్కరు రాజీనామా నిచ్చెను. అమెరికాలో కూడ నింకను స్థితిగతులు వృద్ధి చెంద లేదు. 1780డిశంబరు నెలలోను 1781 సంవత్స:ము జనవరి నెలలోను మిక్కుటమగు చలికాల మగుటచే అమెరికను సేనలు పడిన కష్టములు వర్ణనాతీతములు. సైనికులకు పది నెలల జీతము బాకీ బడినది. అమెరికను కాగితపు నోట్లవంటివాటిని ఆంగ్లే యులుకూడ సృష్టించి మోసము చేయసాగిరి. ఇందువలన ప్రజలకీ కాగితవు నోట్లయందు పూర్తిగా విశ్వాసము పోయినది. విదేశము నుండి సొమ్మరానిది. ఏమిచేయుటకును వీలు లేదని వాషింగ్టను గట్టిగ వ్రాయుచుండెను. 1781 సంవత్సరము జనవరి 1 వ తేదీన పెన్నీసి ల్వేనియా రాష్ట్రము నుండి వచ్చిన సైనికులలో చాలభాగము తిరు బాటు చేసి వెళ్ళిపో యెదమసిరి. వారిని పోడుండ చేయుటకు ప్రయత్నించగ నొక యుద్యోగస్తుడు చంపబడెను. పదమూమువందల సేనికులా యుద్ధములతో వెడలిపోయిరి. కాని వారు దేశద్రోహులు గారు. ఆంగ్లేయులు వారిని తమపక్షమున చేరమని కోరగా వారు నిరాకరించిరి. దేశీయ మహాజన సభవారు. వారితో నెటులనో రాజీపడి కొందరిని యిండ్లకు పంపి వేసి కొందరిని నేనలలో చేర్చుకొనిరి. జనేవరి 20 వ తేదీన న్యూజర్సీ రాష్ట్రమునుండి వచ్చిన సైనికులు తిరుగ బాటు చేసిరి. ఐదుగురు ముఖ్యులను వాషింగ్టను ఉరితీయించెను. ఇట్టి సందర్బమువలన కొత్తవారు సేనలలో చేరుట లేదు. కొన్ని రాష్ట్రములలో మాత్రము కొద్ది కాలమువరకు సేనలలోనుండు షరతుతో సైనికులు చేరుచుండిరి. దేశీయ మహాజనసభ వారు కావలెనని తీర్మానించిన ముప్పదియేడు వేల సైనికులను ఏడువేల మంది మాత్రమే యుండిరి. భోజనసామాగులు దొరకక సైనికులు చుట్టుపట్టు ప్రజలను నిర్బంధించి "తెచ్చు కొనుట జరుగుచుండెను. ఇటుల చేయుటవలన ప్రజలకిబ్బంది కలిగించుటయు సైనికులకు దురభ్యాసములు నేర్పుటయు ప్రజల సొను భూతిని గోల్పోవు ము కలుగుచున్నదని వాషింగ్టను వ్రాయుచుండెను.


అమెరికావారి
బ్యాంకు.

17881 సంవత్సరము ఫి. బేవకు నెలలో రాబస్టు మారి సు యొక్క ముఖపత్యము క్రింద దేశీయ అమెరికా వారిర్యాంకి మహాజన సభ వారొక బ్యాంకిని స్థాపించి . దీనితో 'సైనికుల యార్షిక స్థితి వృద్ధి చెందెను. మార్చి 1 వ తేదీన మిగిలిన యన్ని రాష్ట్రమ్ములను సంయుక్త ప్రభుత్వపు నిబంధనలపై సంతకములు చేసినవి. ఈ కాలమున "అమె రికాలోని యన్ని భాగములలోను తిరుగ బాటుదార్ల బలము క్షీణించి పోయినదనియు తిరుగబాటు నణచుటకు రోజు గారి నేనలు చేయుచున్న ప్రయత్నముల నాటంక పరచుటకు తగిన శక్తి లేదనియు కొలది కాలములో సమెరికాయంత యి రాజు గారికి స్వాధీనమగువని ము” నాంగేయమం త్రి తమ ప్రభు త్వము వారికి వారు చుండెను.


1781 సం॥రం జనేవరి 17వ తేదీన ఆంగ్లేయ సేనలువచ్చి కాపస్సు యుద్ధము. అమెరికా సేనాని మార్గమును ముట్టడించెను. జరిగిన దారుణ యుద్ధములో సాంగ్లేయులు పూర్తిగ, నోడింప బడిరి. ఈకౌపస్సు యుద్దములోనొందినదయము అమెరిక నులకు మంచిఖ్యాతిని శలుగచేసినది. దీనికి ఆంగ్ల సేనాధ్యక్షుడు కార? బాలీపు, సభువు కినుక వహించి మంచి సైన్యములతో అమెరి కనుల పై కి దాడి వెడలెను. అమెరికను నేనలు ఆంగ్లేయులకు వెరచి రెండువందల మైళ్ళదూరము పారిపోయెను. కారణ వాలీసు మెటనంటి తరుముచుండెను. అమెరికనులు పారి



పోవుచుండిరి. అమెరికన సేవలకు సరిగా తిండికూడ లేకుండెను. నలుగురి కొకటి చొప్పున చలికాలములో కప్పుకొనుటకు దుప్పటులుండెను. కారన్ వాలీసు ప్రభువు నెమ్మదిగ హిల్సు బరోను చేరెను. రాజభక్తులందరుసు వచ్చి తన సైన్యములలో చేరపలేనని యుత్తరువు చేసెను. రాజభక్తు లెక్కువైరి. ఒక్క దినముననే ఏడు రాజభక్తుల సైన్యము లేర్పడెను. కాని పిక్కె స్సు, లీయను వారి క్రింద కొంతమంది అమెరను దేశభ క్తులు రాజభక్తుల పై బడి మూడు వందల మందిని ముక్కలుముక్కలుగా చీల్చి వేసీరి.. దీనివలన రాజభక్తులలో చాల భయము కలిగెను. తమ స్నేహితులగు నీ రాజభ క్తులు పిరికి పందలనియు శతువులగు తిరుగుబాటుదార్లు మొండి ధైర్యము గలవారనియు” కారన్ వాలీ సుప్రభువు వ్రాసెను. -


గిల్బర్టు కోర్టు
హౌసు యుద్ధము.

తుదకు మార్చి నెల 15వ తేదీన గ్రీస్,కింద నుండిన అమెరికను సీసలకును క్లారస్ వాలీసు ప్రభువు క్రిందనుండిన ఆంగ్లేయ సేనలకును గిల్ఫర్డుకోర్టు హౌసు అను ప్రదేశమున యుద్ధము జరి గెను. అమెరికను సైన్యములు మూడు భాగములుగ విభజించ బడి మూడు ప్రదేశములలో నుంచబడెను. 'మొదటి భాగమున ఉత్తరకారొలీనా ఐచ్ఛిక భటులుండిరి. ఆంగ్లేయులు ముట్టడించగనే వీరు పారిపోయిరి. ఇచట ఆంగ్లేయులకు తేలికగ జయము కలిగెను. రెండవ భాగమున వర్జీనియా సైనికులుండిరి. ఇచటకూడ ఆంగ్లేయులే జయమొందిరి. మూడవ భాగమున గ్రీన్ సేనాని నడుపుచుండెను. ఇక్కడ యుద్ధము మిగుల తీవ్రముగ జరిగెను. చివరకు గ్రీన్ సేనాని యోడిపోయి మిగిలి సైన్వముతో వెడలిపోయెను. కాని యుద్దమందు ఆంగ్లేయు లే ఎక్కువ సష్టమొందిరి. విశేషముగ నికులను కారస్వాలీసు పోగొట్టుకొనెను. అందువలన కాన్వాలీసు సైనికులతో మరలి పోవుచుండగ గ్రీన్ నూతన సైన్యములతో వెంబడిం చెము, కారన్ వాలీసు శీఘ్రముగా నుత్తర కాకొలీనా రాష్ట్రమునంతను నమెరికనులకు వదలి సమద్రతీరమూ నున్న విల్మింగుటనును జేరెను. ఇటనుండి వర్జీనియా రాష్ట్రము నకు పోవసుద్యుక్తుడయ్యెను నర్జీనియాలోని ఆంగ్లేయ సైన్యములు పైకి పరాసు ప్రభువగు లఫయతు సేనాని వెడలెను, లఫ యతు జీతము పుచ్చుకొనండ వాషింగ్టన్ కింద పని చేx: చుండెను. ఈయన కింద వున్న సైనికులకు జీతము గాని సరియైన తిండిగాని దుస్తులుగాని లేకుండెను. ఈయన స్వంత ముగ రెండు వేల సవరనుల ఋణముచేసి తనకింది సైనికులకు అవసరమగు 'నేర్పాటులనెల్ల జేసి, ఆ ప్రాంతములలోని ఐచ్చిక సైనికులను గూడ చేర్చి ఆంగ్లేయుల ను ముందుకు రాకుండ నాటంక పరుప గలీ గెము. ఏక్రియల్ నెల చివర భాగమున ఆంగ్ల సేనాని కారన్ వాలీసు ప్రభువు పదునాలుగు వందల సైనికులతో విల్మింగుట ను వదలి వర్జీనియాలోని పీటర్సు బర్గును చేరెను. "కారన్ వాలీసు వెడలిపోయిన తరువాత దక్షిణకొరొలీకా, జర్షియా రాష్ట్ర ములను స్వాధీనమును పొందుటకు అమెరికను సేనాని గ్రీన్ ప్రయత్నములను చేసెను. ఆ ప్రాంతములలోని వివిధ భాగములకును తగిన సేనలను పంపెను. తాను కాండం పైకి వెడలెసు. ఏప్రియల్ 18 వ తేదీన ఈయనను రాడన్ ప్రభువు A క్రింద నాంగ్లేయ సేనలు ముట్టడించెను, అమెరికను లోడిపోయిరి. రాడన్ ప్రభువు మొదట అమెరికన్ 'సేవాని గ్రీసను తరుము చుండెను. ఈ మధ్యను లీ, "మేరియన్ సేనానులకింద నమెరికను సేనలు వచ్చి రాడను నాటంక పరచెను. రాడన్ వెను కకుమరలి పాంటీ నది యొడ్డునే పోవుచుండెను. దక్షిణ కారో'లీనా రాష్ట్రములోని వాయవ్య భాగమంతయు సమెరికనుల వశమయ్యెను. రాడు నిలువ నీడదొరకక నమెరికన్ సైన్యములచే నలువైపులనుండియు తరుమబడి కొలదికాలములో నా రాష్ట్రమును వదలి ఛార్జెస్టన్ ను చేరెను. రాజు భక్తులతో తాను వారిని సంరక్షించలేననియు వారి తిప్పలు వారే చూచుకొమ్మనియు చెప్పి వెళ్ళెను. అక్కడ జబ్బుపడి యుద్ధములో విసికి రాడన్ ప్రభువు ఇంగ్లండునకు పయనమై పోయేను. దక్షిణ కారొలీనా రాష్ట్రములో చాల భాగము సమెరికను సేనాని గ్రీను వశ పరచుకొ నెను. పాంటి, ప్రాతముల మాత్రమే ఆంగ్లేయు లింకను యుండిరి. ఈ రాష్ట్రము నుండి కారస్ వాలీసు ప్రభువు వర్జీనియాకు పోవుటవలన నదివర కాం గ్లేయులు పొందిన జయములన్నియు మాసిపోయెను. "ఇచట తగినంతమంది రాజభక్తులు తమ పక్షమున పోరా డుదురు గాని, పోరాడిసను ప్రయోజనము కలుగునవిగానీ, ” అయనకు నమ్మకము లేక నీరాష్ట్రమను విడిచి వెళ్ళెను. దేశమును జయించుట కొంగ్లేయ సైన్యము చాలదే మెనని కూడా నాయనకు సందేహము కలిగెను, మే నెలలో నాంగ్లేయ పార్లమెంటు సమావేశ మైసవుడు, పిట్టు, ఫాక్సు, మొద లగు సభ్యులు కారస్ వాలీ సు ప్రభువు పంపిన నివేదికసు బట్టి -

యుద్ధము జయప్రదముగ సాగించుట దుర్లభమని తోచు చుసన్నందున నేదోవిధముగ సంధి చేసికొనవలసినదని చెప్పిరి. . కాని ఎక్కువమంది దీనికి సమ్మతింప లేదు. .

కారన్ వాలీసు
వర్జీఇయా రాష్ట్ర్
సభ్యులను
ఖైదు చేయుట,

'మే 20 వ తేదీన కారన్ వాలీసు ప్రభువు తనకిందసున్న ఆంగ్లేయ సేనలతో వీటర్సుబర్గును చేరెను. వర్జీనియారాష్ట్ర రాష్ట్రీయసభ వారు చార్లలో అను భై మచేయట. స్వనీ పట్టణమున సమావేశమై యండగవారి పైకి టార్లెటను క్రింద కొంత యూగ్లేయు 'సేవను పంపెను.టార్గెటను వెళ్ళి ఏడుగురి సభ్యులను ఖైదీలుగా పట్టుకొ నెను. కార్ వాలీసు ప్రభువు స్వయముగా లఫయ తును ముట్టడించుటకై బయలు దేరెను. లఫయతు యుద్ధము చేయక తప్పించుకొనుచు నాంగ్లేయులు ముందుకు సాగకుండ " పెక్కువిధముల చిక్కులు మాత్రము కలుగచేయుచుండెను.వేసవికాల మంతయు నాంగ్లేయ సేన ఆటు ఇటు తిరుగుచు ప్రజలసొత్తులను పాడు చేయుచుండెను, ముప్పదిలక్షల సవరనుల కిమ్మతుగల యాస్తి పాడుచేయబడెను. ఇటుల వృధాగా కాలయాపనము చేయటక న్నతాసు వర్జీనియానశదలి కారొలీ నాకుపోయిన 'బాగుండు సని కారన్ వాలీసు తలంచెను.


కానీ ఇంతలో తన క్రింది సైన్యములలో నుంచి మూడు వేలనుండిని న్యూయార్కుకు పంపనలసిన దనియు మిగతా సేసలతో నెక్కడనైన సుకక్షితమగు తావున నుండవలసిన దనియు పై నుండి గుత్తరవులు వచ్చెను. దీని నను సరించి కారణ వాలీసు ప్రభువు ఆగష్టు 8వ తేదిన మార్కుటౌను


నాక్రమించెను. అక్కడ మంచిరతణ ఏర్పాటులను చేయుచుండెను. మంచి నాకాదళముగల వారి కాప్రచేశము మిగుల యుక్తమైనది.

దక్షిణ కరోలినా
రాష్ట్రమమెరికనుల
వామయ్యెను.


దక్షిణ కారొలీ లో నమెరికను 'సేనాని గీను సెప్టెంబరు8వ తేదీన సొంగ్లేయుల నోడించగ నాంగ్లేయులో రాష్ట్రమును పూర్తిగా వదలి రాష్ట్రము రాత్రివేళ ఛార్లెసటను నైపుకు వెడలిపోయిరి.విల్మింగటను, ఛార్లెసుటను, శహన్నా పట్ణములలో మాత్ర మాంగ్లేయులుండిరి. మిగిలిన దక్షిణ , పాంతమంతయు స్థిరముగ నమేరికనులకు స్వాధీనమై ఈ రాష్ట్ర ములలో యుగ్గము ముగిసెను.

ఆర్నోడు న్యూ
యింగ్లాండును
తగులబెట్టుట.

అమెరికసు సేవాధ్యక్షునిలో కలహించి అమెరికను సేనలను వదలి యాంగ్లేయ పక్షమున చేరిన ఆర్నొల్డు సేనాని తన స్వంత రాష్ట్ర ముగుకనెక్టికటుకు కారన్ వాలీసు బంపబడిబ డియక్కడ రాజభక్తుల పటాలములను పోగుజేయ చాలకను అమెరికను సైన్యములను ముట్టడంచ జాలకను తన వద్దనుండిన ఆంగ్లేయ సేనలతో న్యూ లండను పట్టమును దోచుకొని తగుల బెట్టి నిలుచుటకు తావుదొరకక తిరిగి వచ్చెను.


ఈ మధ్య కాలమున యుద్ధము జయప్రదముగ " సాగించు కొనుట వాషింగ్టను సేనాధిపతి

యార్కు టౌను వద్ద
అమెరికనులకు
గొప్ప జయము. కారన్
వాలీసు ప్రభువు
లోబడెను.

యార్కుటౌను వద్ద మంచి యేర్పాటులను చేయుచుండెను." అమెరికనులకు గొప్ప కొన్ని సెన్యములు పశాను దేశమునుండి జయము, పచ్చిదిగెను. పరాసు, దేశమునుండి ఇరువది లక్షల లివరీల ధనముకూడ వచ్చిచేరెను. పరాసు సైన్యములును ఆమెరికను సైన్యములును కలసి న్యూయార్కును ముట్టడించెను. వాషింగ్టన్ యోచించెను. కాని లఫయతు నేనానియు పరాసు సైన్యముల సేనాధ్యక్షుడగు రోషంబోయును యార్డు టౌను మీదికి వెడలుటదీయుట యుక్తమని సలహానిచ్చిరి. యర్డు టౌనును సముద్రము వైపునుండి డిగ్రాసీ ప్రభువు కిందనున్న పరాసు నౌకాదళముకూడ ముట్టడింపవచ్చునని తలచిరి. దీనికి వాషింగ్టన్ కూడ సమ్మతించెను. ఆగస్టు 21 వ తేదీన పరాసు, ఆమెరికను సేనలు వాషింగ్టను, ఆఫయతు, రోషంబో సేనా నులకింద బయలు దేరెను. 28, 24, తేదీలను హడ్సను నదిని దాటెను. వీరు వచ్చి న్యూయార్కు మీద పడుదురే మోనని న్యూయార్కులోని యాంగ్లేయ సేనలు సిద్ధపడుచుం డునేగాని న్యూయార్కు నువదలి వీరిని ముట్టడించటకు సాహ సించ లేదు. పరాను అమెరిక ను సేన లప్రతిహతముగ సాగి. పోవుచుండెను. తోవలో వాషింగ్టను స్వగామ మగు మాంటు వెర్నను దాటి సెప్టెంబరు 14 వ తేదీన విలియమ్సు అగ్గును చేరెను. సెప్టెంబరు 28 వ తేదీన నీ సైన్యమంతయు యార్కుటౌనుకు రెండు మైళ్ళ దూరమున విడిసెను. పరాను వారిసేనాని డిగా సి ప్రభువు ఇరువది ఎనిమిది యుద్ధనౌకలతో బయలు దేరి. తోవలో యూరవునకు వెడలిపోవుచున్న

ఆంగ్లేయ సేనాని రాడను ప్రభువును ఖయిదీగ పట్టుకొని గేప్పు సేవాని ఆండవచ్చిన యాంగ్లేయ నౌకాదళము నోడించి తరుమగొట్టి రెండు ఆంగ్లేయ యుద్ధనౌకలను పట్టుకొని జయప్రదముగా యాక్కు బాసు పట్టణపు సముద్ర రేవులో నిలచెను. ఆమెరికను సైన్యములు కుడి వైపునుండియు, ఎడమవైపునుండి కొంత పరాను సైన్యమును యార్కునది కావలియుడ్డుననున్న గౌస్టరనుండి కొంత పరాను సైన్యమును, యార్డు ఔనుసు ముట్టడించెను, కారన్ హలీసు ప్రభువు తనకు కొంత సహాయము వచ్చి చేరునని తలచెను. కానీ రాలేదు. అక్టోబరు 5 వ తేదీన ముట్టడి ప్రారంభమయ్యేము. 9, 10 తారీఖులను ఫిరంగులు బాగుగా కాల్చబడెను. కోటగోడలు బ్రద్దలుచేయబడెను. 1వ తేదీనుండియు నాంగ్లేయులు బదులు కాల్చుట క్షీణించెను. 14వ తేదీన ఆంగ్లేయు లంత్య ప్రయత్నమును చేసి విఫలులైరి. మరునాడాంగ్లేయ సేనాని కారంవాలీసు ప్రభువు యుద్ధము మానవలసినదని వర్తమానమంపెను. 10 వ తేదీన ఆంగ్లేయ సైప్యమంతయు నూరు ఫిరంగులతోకూడ వాషింగ్లను సేనానికిని సముదేరేవులలోని ఆంగేయనౌకలు డిగాసి సేనానికిని స్వాధీనపర్చబడెను. యార్కు బాను గ్లాస్టరు పట్టణము ల మెరిశనుల వశమయ్యెను. కారన్ వాలీసు ప్రభువు వాషింగ్టనువద్ద శరణుజొ చ్చెను. -


అమెరికనుల
సంతసము.

ఈ వార్త ఆమెరికాలో కలిగించిన సంతసమునకుమేర లేదు. వాషింగ్టను తన కింది యుద్యోగ స్తు నొకనిని దీనిని తెలుపుటకై ఫిలడల్ఫి యాకు బంపెను, అతను రాత్రి కచటికి

చేరెను. దేశీయ మహాజన సభాధ్యక్షుని యింటికి పోయి బిగ్గరగా తలుపు తట్టెను. ద్వారపాలకు డీ సంగతి విని అత్య ధిక సంతోషముతో సధ్యక్షుని లేపెను. ఆరాతి ఫిలడల్ఫి యాపురములో జరిగిన గోలాహలము వర్ణనాతీతము, నేరములు చేసిన సైనికుల కందరకును వాషింగ్టను క్షమా వణ నొసంగెను. సైన్యములు భగవదారాధనను సలిపెను . సేనాధిపనులకు వందనము లర్పించబడెను. పరాసువారికి కృతజ్ఞత వెల్లడించబడెను. ఈ జయము యొక్క స్మారక చిహ్నము యార్కుటౌనులో నొక చలువరాతి స్తంభము ప్రతిష్టించబడెను. దేశీయ మహాజన సభవారు వాషింగ్లను సేనానికి రెండు పతాకములును రోషంబో సీనా:నికి రెండు తుపాకులును బహుమానమఁగ నిచ్చిరి.


ఆంగ్లేయ
పార్లమెంటులో
చర్చ.


ఈ వార్త నవంబరు 27వ తేదీన నాంగ్లేయ దేశములోచేరెను. ప్రధానమంత్రి నార్తుప్రభువు ఆంగ్లేయ పార్లమెం గుండెలో గుండు దెబ్బ తగిలినట్లుకూలబడెను. భగవంతుడా! అంతయు ముగిసినది" అని కేక వేసెను. కాని కొలది రోజులలో పార్లమెంటు సమా వేశమయినపుడు, అమెరికాను తన రాజ్యములో నుంచుకొనుటకు నిశ్చయించితి ననియు తన సేవలు చూపుచున్న పరాక్ర మమువలన తన రాజ్యములలో శాంతి నెలకొలుపబడుచున్న చనియు రాజు తన యుపన్యాసములో చెప్పెను. , ప్రభువుల సభలోను ప్రజాప్రపతినిధి సభలోను కొందరు సభ్యులు రాజు గారి యుపన్యాసమును ఖండించిరి. రాజుగారి యుపన్యాసము వలన " రాజ్యకాంక్ష తనివితీరనిది, " నాక్రోధముచల్లా

రనేరదు. నామీద తిరుగబాటు చేసిన అమెరికనులను పూర్తిగ లోబరచుకొనుటకన్న మరి యెద్దియు నాకు సంతృప్తి కలుగ చేయ నేరద "ని యగ్ధమగుచున్నదని ఫాక్సు చెప్పెను. ఇందుకు ప్రత్యుత్తరముగ అమెరికా మీద ఆంగ్లేయ దేశముయొక్క బ్రతుకు ఆధారపడియున్న దనియు అమిరికాయొక్క స్వాతం త్ర్యము నకు తామంగీరించజాలమనియు పర్జీనియాలో సాంలేయు లకు గలిగిన పరాభవము వలన నాంగ్లేయలు మరింత పట్టు దలతో యుద్దమును కొనసాగించ వలెననియు మంత్రులు చెప్పిరి. పార్లమెంటు సభ్యులలో నెక్కువమంది మంత్రుల వక్షము ససే సమ్మతుల నిచ్చిరి. కానీ పది హేనురోజుల తరువాత " అమెరికా వారిని నిర్బంధించి రాజభక్తిని పొందుట సాధ్యమయిన పని కానేరదని ” ప్రధానమంతి పార్లమెంటులోఒప్పుకొనెను. ఆంగ్లేయ దేశములోని లండను, 'వెస్టుమిని స్టరు, సర్రె, మిడిల్ సెక్సు ప్రాంతములలో ప్రజలు బహిరంగ సభలు జరిపి యమెరికనులతో యుద్దము చాలించుమని తీర్మా నములు చేసి పార్లమెంటుకు బంపిరి.

ఇతర
 ఖండములలో
యుద్ధములు.


" 1782 వ సంవత్సరము జనవరి 31 వ తేదీన డెమరారాను పరాసువారు జయించిరి. పిభ్రవరి ఇతర ఖండములలో నెలలో సెంటు కీట్సు, నెవిసు, మాంట సిరా టులను స్పైన్ వారాశ్రమించిరి. కేపుఆఫ్ గుడ్ హోపును ఆంగ్లేయులు ముట్టడించి, పరాసువారికిని ఆంగ్లేయులకును సముద్రముమీద కొన్ని కలతలు జరిగె. ఎవరు గెలిచినది చెప్పుటకు వీలు లేదు. పరాసు నౌకలమీద మూడు వేల పరాసు సైన్యములు .

నకు చేరినవి. హైదరాలి! వప్పగింత చేయబడెను. హైద రాలి కుమారుడగు టిప్పుసుల్తాను డిశంబరు నెలలో జయముల నొందుచుండెను. హైదరాలి డిశంబరు 7 వ తేదీన స్వర్ణ స్తుడయ్యెను. మహారాష్ట్రలతో సాంగ్లేయులు మే నెల లోనే సంధి చేసికొనిరి. మైనార్కా ద్వీపములోని యాంగ్లే యుల నోడించి పగాసువారు స్వాధీనమును పొందిరి. ఆంగ్ల నా కాదళము పరాసు నౌకాదళము ముందర నిలువజూలక నాంగ్ల దేశమును చేరెను.


ఆంగ్లేయ పార్లమెంటులొ
సంధి పక్షము
వృద్ధి చెందినది.
ప్రధానమంత్రి
రాజీనామానిచ్చెను.

యుద్దములోగలుగుచున్న యపజయములవలన ఆంగ్లేయపార్లమెంటులో మంత్రుల పలుకుబడి తగ్గెను . ఆంగ్లేయ పౌర్ల మెంటు 1782 వ సంవత్సరము ఫిబ్రేటగి 22 వ తేదీన యుద్ధము చాలించనలసినదని జనరలు కన్వే. ప్రజా ప్రతినిధిసభలో నుపపాదించిన తీర్మానమున కనుకూలముగ నూట తొంబది యిద్దరును, వ్యతి రేకముగ నూట తొంబది ముగ్గు రును నమ్మతుల నిచ్చిరి. ఇందువలన మంత్రుల పక్షమున సున్న సంఖ్య చాలవరకు తగ్గినదని స్పష్టమగుచున్నది. అయి దుదినముల తరువాత యుద్దము చాలించవలసినదను తీర్మాసము పార్లమెంటులోని యధిక సంఖ్యాకులచేనామోదింపబడి నది. అయినను యుద్ధము మానుటకు రాజు సమ్మకంచ లేదు. ప్రధానమంత్రి రాజీనామాంచ్చెదనని చెప్పెను. రాజు రాజీనామా నంగీకరించననెను. అమెరికాతో యుద్ధము చేయువారు రాజునకును దేశమునకును శతువులని మరి యొక తీర్మానమును కన్వే యువ పొదించెను. ఈ తీర్మా నము పార్లమెంటు వారిచే 'నేశ గ్రీవముగ సంగీకరించబడెను. మరునాడు ఆమెరికా వారితో వెంటనే సంధి చేసుకొనుటకు 'రాజు, కధికార మివ్వబడెనను చట్టము నొక సభ్యుడు పెట్టు 'టకు పార్లమెంటువారనుమతి నిచ్చిరి. మంత్రుల పదవి దుర్భర మయ్యెను. ప్రధానమంత్రి నార్తు ప్రభువు యొక్క గాజీనామాను రాజంగీక రించెను. " నీవే నన్ను వదలిపోవు చున్నావు, నేను నిన్ను వదలుట లేదు ” అని రాజు చెప్పెను. మార్చి నెల 20వ తేదీన ప్రధానమంత్రి రాజీనామానిచ్చి “బయటనున్న గుర్రపుబండిపై నెక్కి వెళ్ళిపోయెను. పార్ల మెంటు సభ చాలించబడెను.


మూడవ జూర్ణిరాజు ఆంగ్లేయ దేశమును వదలి స్వదేశ మగు హనోవరుకు పోయెదనని బెదిరించెను. కాని తుదకట్టి యుద్దేశ్యమును విరమించుకొని మార్చి 22 వ తేదీన నూతన మంతిపర్గము నేర్పాటుచేసెను. అమెరికా వ్యవహారములు ష్బెర్లు మంత్రి చూచునట్లేర్పడెన. ఈయన వెంటనే క్లిణ్ టన్ టన్ సేనాని స్థానమున సర్ గై కాగ్లటసును అమెరికాలోని

యాంగ్ల సేనల కథ్యక్షువిగ : యమించి ఎటులైన సంధిప్రయ త్నములు చేయవలెనని చెప్పి యమెరికాకు బంపెను. తాను స్వయముగ నిదివరకు అమెరికా దేశీయ మహాజనసభ నథ్య క్షుడుగ నుండిన హెనీ లా రెన్సుతోను బెక్ జమీను ఫ్రాస్కు లీనుతోను ఒక స్కాచి పెద్దమనుష్యునిద్వారా సంధిరాయ బారములను నడుపసాగెను.అమెరికాలోని , పజలు తాము చాల బలహీనముగ నున్నా మనియు ఆంగ్లేయులు చాల బలవంతు

అమెరికా ప్రజలు
ఆత్మ విశ్వాసమును
గోల్పోయిరి.

లనియు, యుద్ధము త్వరలో మగియ నేరదనియే నమ్ను చుండిరి. కారొలీనా గోల్పోయి, ఆ రాష్ట్రములలో రాజభక్తులకు ను దేశభక్తులకును నప్పుడప్పుడు యుద్దములు జరిగి యొక రిపై నొకరు ఘోర హత్యలు గామించుకొను చుండిరి. క్రమముగా రాజభ క్తుల సంఖ్య క్షీణించెను. కాని దేశీయ మహాసభ హరివద్దనుండిన ద్రవ్యమంతయు జనరివరకు ఖర్చయిపోయినది. జూను 1 వ తేదీ వరకు నిరునది వేల డాలకులు మాత్రము రాష్ట్రముల నుండి వసూలయ్యెను. వాషింగుట సువద్ద పది వేల సైనికులు మాత్ర ముండిరి. జీతము జీతములొరకు తొందర జేయుచుండిరి. ఇంతలో నూతనాంగ్ల సేనాధ్యక్షు డమెరికాకు జే రెను. సంధి రాయబారములను పంపసాగెను. కాని వాషింగుటనుగాని, దేళీయ మహాసభ వారుగాని, ఆయబాగములు :నిజమైనవని నమ్ముట లేదు. బ్రిటిషు వారు తమమీదికి దండెత్తుచో సంరక్షణ చేసికొనుటకు తగిన సైన్యములు లేవనియే వాషింగ్టను వ్రాయుచుండెను. ఈ సమయమున వాషింగ్టను వద్ద నుండిన సేనలలోకూడ నసంతృప్తి మిగుల వ్యాపించియండెను. యెటులనో తిరుగబాటులు జరుగకుండ వాషింగ్టను చేసెను. ఆర్థిక వ్యవహారమును చూచుచున్న రాబర్టు మారిసు పెట్టుబడి పెట్టిన సొమ్మును తిరుగ నిష్వవలసినదని దేశీయ మహాసభ వారి నడుగగా సొమ్ము నివ్వకపోవుటయేగాక కఠిన ముగ మందలించిరి. సైనికులును సైనికోద్యోగులను కలసియొక సభచేసి తమకు దేశీయ మహాసభ వారివలన న్యాయము కలుగ నేరదుగావున వాషింగుటను అమెరికాకు రాజుగ నేర్పడు ట యుత్తమమని తీర్మానించి రాజరికమును ప్రజా పరిపాలన మును కలిసియుండట మంచిదనియు జాషింగ్టను సమెరికాయొక్క కిరీటాధిపత్యము నంగీకరించ వలయుననియు కోరిరి. వాషింగ్టను అమెరికా యొక్క. స్వతంత్రమగు ప్రజూపాలన మగుటయే తన యుద్దేశ్యముగాని తాను గాని మరియొకరుగాని యె ప్పటికిని రాజుగ నేర్పడగూడదని చెప్పి వారినందరిని గట్టిగా మందలించి పంపి వేసెను

సంధి రాయ
బారములు.

ఆంగ్లేయ మంత్రీ, అమెరికా వారితోడను పరాసు వారి తోడను సంఘ రాయబారములు జరుపుచుం డెను. ఆంగేయునౌకాసేనాని పశ్చిమ యిండియా ద్వీపములవద్ద పరాసు నౌకాళము నోడించి, నౌకాసేనానిని తొమ్మిది యుద్ద నౌకలతోగూడ పట్టుకొనెను. కాని ఆంగ్లేయల బహమా' ద్వీపములను స్పైనువారు వశపరుచు కొనిరి. ఆంగ్లేయ ప్రధాసము శ్రీ బక్కింగుహం చనిపోయి నందున అమెరికా వ్యవహారములను చూచుచున్న 'హెల్బర్ను ప్రధాన మంత్రిత్వమును కూడ వహించెను. కీర్తిశేషులగు విలియంపిట్టు కుమారుడగు పిట్టు యువకుడయ్యను ఆర్థిక మంత్రి యయ్యెను. ఈలోపుగా జార్జియా రాష్ట్రమునుండి ఆంగ్లేయులు తరిమి వేయబడిరి. ఆ రాష్ట్ర మంతయు జూలై 11వ తేదిన సమెరికనుల వశమయ్యెను. ఆరాష్ట్రమమందుండిన రాజు భక్తులు ఫ్లోరిడాకు పారిపోయిరి. ఆంగ్లేయ సేనలు ఛార్లెనుటన లో చేరిరి. స్పైన్ వారు చాల సైన్యములతో చాల కాలము జి బ్రాలల్డును ముట్టడించిరిగాని తుదకు 1782 సంవత్స రము సెప్టెంబరు 18 వ తేదిన ఆంగ్లేయులు ముట్టడిని వదలించు

కొనిరి. పరాసు, స్పెయి" నాగదళములను ఆంగ్ల నాకా సేనాని యోడించెను.


ఈలోపున పారిసువట్టణములో అమెరికా వారితో వృరుగను వరానువారితో వేరుగను సంధి ప్రయత్నములు జరుగు చుండెను. బెజమీను ఫ్రాన్కులిను కొంతకాలము ఒంటరి గను తరువాత 'జేయి, ఆడమ్సు అనువా రమెరికానుండి వచ్చి తోడ్పడియు సమెరికా తరఫున సంధి యద్యమమును సాగించు చుండెను. పెన్ని సిల్వానియా, మేరీలాండు, డెల వేరు, స్యూ యార్కురాష్ట్ర ములలోని రాజభక్తులు సంధి చేసుకొనవల దనియు తాము దేశీయ మహాజవ సభను నాశనము చేతుమునియు, సొంగ్లేయ ప్రభుత్వమువారికి మహజరులు బంపిరి. అక్టో బరు నెలలో " సేనలు చాల యిబ్బంది పడుచున్నవి, సంధి త్వరలో జరిగిన మంచిది. ” అని వాషింగ్టను వ్రాసెను. పరాసు ప్రభుత్వము వారికి తెలియకుండ సంధీని కుదుర్చుకోమని అమెరికా వారు వాగ్దత్తము చేసియున్నప్పటికీని తుదకు పరాసు వారికి తెలియకుండగనే అమెరికాప్రతినిధులు చిత్తు సంధి షర తులపై సంతకములుచేసిరి. అది పరాసుపోరిని అమెరికా వారు మరియొక ఋణ మిమ్మని కోరుచున్న సమయము. తమకు తెలియ కుండ సంధి చేసుకొనుట న్యాయము కాదని పరాసుమంత్రులు చెప్పిరి. బెంజమీను , ఫాస్కులిను క్షమాపణగోరెను. పరా సువారు మిగుల నౌదార్యమును చూపిరి. అరువదిలక్షల లివరీల ఋణమునిచ్చుట కంగీకరించి వెంటనే యారులక్షల లివరీలను చెల్లించి వేసిరి. స్పెయిన్ వారుకూడ ద్రవ్యము లేక ఫోర్సుగల్ వారి వద్దనుండి నూటికి యెనిమిది చొప్పున వడ్డితో ఋణము చేయవలసివచ్చెను.

అమెరికా స్వతంత్ర
మంగీఅరింప బడుట.

1782 సంవత్సరము డిశంబరు నెల 5వ తేదీన ఆంగలేయ పార్లమెంటు సమావేశము కాగనే అమెరికా స్వతంత్రణఅమెరికా వలనరాష్ట్రముల స్వతంత్రమును మంగీకరింప బడుట. తానంగీకరించు చున్నానని రాజు తెలియ చేసెను. "ఇటుల ఆంగ్లేయ రాజ్యమునుండి ఆమెరికా వారు విడిపోవుటను నేనునా ప్రజల యుదేశ్యము ననుసరించి యంగీక రించుచున్నాను. నా యభిప్రాయములు నా ప్రజలకొరకై మార్చుకొనినాను. ఇంత గొప్ప భాగ మాంగ్లేయరాజ్యము నుండి విడిపోవుటవలన ఆంగ్లేయ దేశమున కెట్టిసష్టమువాటిల్లకుండును గాక యని వరమేశ్వరుని ప్రార్థించుచున్నాను. మరియు రాజకీయస్వాతంత్రమునకు రాజరిక మెంతయావశ్యకమో అమెరికవారు గ్రహింతురని సమ్మచున్నాను. మతము, భాష, పరస్పరలాభము , ప్రేమాను బంధములు, ఉభయ దేశములు వారి మధ్యను శాశ్వతమగు నైకమత్యమునకు తోడ్పడు నని విశ్వసించుచున్నాన. ఐకమత్యము పురిగొలుపుటలో నాశక్తి వంచనలేక పాటుపడుదునని వాఁగ్డత్తము చేయుచున్నా నని రాజుపన్యసించెను. ఈ నెలలోవలనే పరాసు సేలను. తీసుకొని నౌకాదళ మమెరికానుండి పరాసు దేశమునకు వచ్చెను.


1788 సంవత్సరము జనవరి 20వ తేదీన ఇంగ్లాండు.ఫ్రాన్సు, స్పైన్ ప్రభుత్వముల వారి

సంది షరతులాఇ
సంతకము
చేయబడెను.

మధ్య సంధి యొడంబడికలు కుదిరి చిత్తు షరతుల పై సంతకములు చేసుకొసిరి. (1) అమెరికా వలసరాష్ట్రములు సంపూర్ణముగ స్వతంత్ర దేశమయినదని యగీకరించబడెను. (2) ఈ వలస రాష్ట్రములకును ఆంగ్లేయుల రాజ్యములో చేయ స్న కనడా దేశమునకును మధ్య సరిహద్దు నిర్నయించబడినది. (3) ఆంగ్లేయులును పరాను పోరును స్పైన్ వారును యుద్ధ కాలములలో నొకరివద్దనుండి యొకరు జయించిన ప్రదేశములను తిరిగి యిచ్చి వేయవలెను. ఆఫ్రికాఖండమున ఆంగ్లేయులును పరాసువారును కొంత ప్రదేశమును మార్చుకొనిరి. (4) హిందూదేశములోలోని నాగపట్టణమును ఆంగ్లేయులు తీసుకొని 'హాలెండు వారితో ని దేవిధమైనన నాంగ్లేయ ప్రభుత్వమువారు రాజీపడిరి. (5) అమెరికాలోని రాజభ క్తులయందు న్యాయమును కరుణయు కనపరచవలసిందని అమెరికా దేశీయ మహా సభవారికి సిఫారసు చేయబడినది. (6) టిప్పు సుల్తానుకును "అగ్లేయులకును యుద్ధము జరుగుచుండగ నీసంధివర్తనూనము తెలసి పరాసువారు టిప్పుసుల్తానును వదలి వెళ్ళిపోయిరి. టిప్పు సుల్తాను మంగళూరును పట్టుకొని తరువాత ఎవరు జయించి నది వారు విడిచి వేయ షరతుతో నాంగ్లేయులతో 1784 వ సంవత్సరం మార్చి నెలలో రాజీవ డెను.

రాజభక్తులకు
నష్టపరిహార
మిచ్చుట


పార్ల మెంటులో నీ రాజీనామాలనుగూర్చి చర్చ జరిగినపుడు వెనుక ప్రధానమంత్రి పదివిని త్వజించిన నార్తు ప్రభువును ఫాక్సు మొదలగు సభ్యులును సంధిషరతులను ఖండించిరి. 


రాజభక్తుల కెట్టి సురక్షణయు నివ్వక రెండవక క్ష వారి యనుగ్రహమ నకు వానిని వదలి పెట్టుట అక్రమమని చెప్పిరి. నూతనమంత్రుల చర్యలను తీవ్రముగ విమర్శించిరి. తుడ కొకయుపసంఘ మేర్పాటై అమెరికను రాజభక్తులకు కొంత నష్టపరిహార మిచ్చుటకును సైశ్యములలో చేరిన రాజభక్తులకు సగముజీతము లిచ్చుటకును తీర్తానింపబడెను. ఒక కోటి యిరువది లక్షల సవరసులు ఆంగ్లేయ ప్రభుత్వముచే అమెరికను రాజభక్తుల కివ్వబడెను.

అమెరికను సైనికులకు
దేశస్వాతంత్రమును
సంపాదించితిమనుత్రుప్తి.

అమెరికను వారి సైన్యములు జీతములకు తొందర చేయుచుండెను. 1780 సం. స సైనికోద్యో యుల కందరకును యావజ్జీవమును సగము జీతము ను పింఛనుగ, (ఉపకార వేతనముల) నిచ్చుటకు వాగ్గత్తము చేయబడెను.ఆప్రచార మిచ్చుటలేదు. తగినంతమంది రాష్ట్రము వారంగీకించను లేదు. దీనికి బదులుగ కొంత సొమ్ము మొత్తముగనైన యివ్వమని సైగికోద్యోగులు కోరిరి. దీనికిని దేశీయ మహాసభవారు ప్రత్యుత్తర మివ్వలేదు.


సె నికోద్యోగులు అంతఃకలహమును ప్రారంభించుటకు తీర్మానము చేయుటకు గాను సమావేశ మైరి. వాషింగ్టను అక్కడికి వచ్చి తొందర పడవద్దనియు వారియొక్క హక్కులకై తాను సర్వవిధముల శృషి చేసెదననియు చెప్పి సమా వేశమును సమాప్తి చేయించెను. మరునాడే సంధిషరతు లపై సంతకము లయినవనువార్త చేరెను. మరియొక

నెలలోపల యుద్ద మంతరించినదని: దేశీయ మహాసభ వారు ప్రచురించిరి. 'సేనలకు జీతము లిచ్చుటకు దవ్యము లేదు. చాలవరకు వాషింగ్టను సైనికుల నూరకనే యిండ్లకు పంపి వేసెను. దేశ స్వాతంత్యమును సంపాదించితి మనుతృప్తి కంటె దవ్యము ముఖ్య విషయము కాదని చాలమంది జీతమును కోరరనే సంతోషముగ గృహములకు వెడలిపోయిరి. పెన్ని సీల్వానియానుండి వచ్చిన యొక సేన ఫిలడల్ఫియాలో నున్న 'దేశీయ మహాజన సభామందిరమును ముట్టడించి తమకు వెంటనే రావలసిన సొమ్ము నివ్వనిచో మహా సభ వారిమీద పగతీర్చుకొంకుమని బెదరించిరి. వాషింగ్టను మరియొక సైన్యమును బంపి వీరిని చెదరగొట్టి వీరిలో ముఖ్యులను ఖయిదుచేసెను. ఈవిధమున ససంతృ ప్తివలన నక్కడక్కడ సైనికులు తిరుగబాటులు చేయుచుండగ వాషింగ్టను తిరుగ బాటులను కొన్ని చోటుల మంచిమాటలతోడను గొంతమందికి కొంత దవ్వ మిప్పించియు కొన్ని చోటుల శిక్షించి బెదిరిం చియు నేర్పుతో నణచి వేసి శాంతి పూర్తిగ నెలగొలిపెను ,

సంధియొడంబడికెలు
స్థిరపడినవి.

1788 ప సంవత్సరము సెప్టెంబరు 3వ తేదీన ఇంగ్లాండు, ఆమెరికా, ఫ్రాంసు, స్పైన్, హాలెండు దేశముల మధ్య జరిగిన సంధి యొడంబడికెలన్నియు స్థిరపర్చబడెను. అందరును సంధిపత్రములపై సంతకములు చేసిరి. అమెరికా దేశము స్వతంత్రమును సంపాదించెను. ప్రొస్సు దేశ మీస్వాతంత్ర సంపాదనమునకు ముఖ్యముగ తోడ్పడెనను కీర్తిని వడసెను. ఆంగ్లేయ సేవలు అమెరికాను విడిచి వెళ్ళెను. అమెరికా వారు స్థిరపడినది. చాలవరకు సేనలను తీసివేసిరి. రాజభక్తులలో చాలమంది పక్కనున్న ఆంగ్లేయ రాజ్యమగు కనడా దేశములోనికి వలన పోయిరి. తక్కినవారు దేశభక్తులుగా మారి తోడి దేశీయులతో గలసి మెలసి నెమ్మదిగ నివంసిచిరి. ఇరుపక్షముల వారును యుద్ధములో పట్టుకొనిన ఖయిదీల సందరలు విడుదలచేసి యిండ్లకు పఁపివేసిరి. రాజకీయ నేరముల చేసిన వారందరును క్షమాపణ నొసంగిరి అమెరికా రాష్ట్రము లన్నిటిలోను పండుగలు ఉత్సవములు వేడుకలు మిగుల సంరంభమతో సలిపిరి

వాషింగ్టను
సైనికులవద్ద శెలవు
పుచ్చుకొనుట.

డిశంబకు 4 వ తేదీన వాషింగ్టను న్యూయార్కు పట్టణమున తన సేనాను వద్దను నిల్చి యున్న సైనికులవద్దను శెలవు పుచ్చుకొనెను, ప్రేమ పూతమైన హృదయములో వాషింగ్టను తన కృతజ ను వెల్లడి.. గడచిన దినములు ఘనతను కీర్తిని సుపావంచినటులే వారికి రానున్న దినములు సౌఖ్యానహముగను మంగళకరముగను నుండునుగాక యని పరమేశ్వరుని ప్రార్థించెను. అందరును తమ బలహీనమగు ప్రయత్నముల నాశీర్వదించి జయము సమకూర్చిరి మనకు ధర్మస్వరూపుడగు భగవంతునికి హృదయ పూర్వక వందన ముల నర్పించిరి.. ఆనందముతోను ప్రేమతోను కూడుకొనిన బాష్పములు కనులనుండి రాల పోషింగ్టను సమావేశమునకు వచ్చిన ప్రతి వారినుండియు శేలవు గైకొనెను. అచటనుండి న్యూజర్సిమీదుగా ఫిలడల్ఫియాకు బోయి యచట దేశీయ మహాసభ వారి కోశాధికారికి తన ఓమా ఖర్చు లేఖను వప్ప'


గించి దేశీయ మహాజన సభవా రపుడు సమావేశ మైయున్న అన్నపోలీసుకు పోయెను. వాషింగ్టను జీటమేమియు పుచ్చు క్సొలేదు. సైనికుల దుస్తులు యుద్ధసామాగ్రులు భోజన పదార్దములు మొదలగునవి కొనుటకుగాను తన స్వంతము సుండి' యుద్దకాలములో పదునాలుగు వేల నాలుగువందల డెబ్బదితొమ్మిది సవరనుల పదునెనిమిది షిల్లింగుల తొమ్మిది సెన్సులను పెట్టుబడి కూడ పెట్టెను. అమెరికా వారు జయము పొందనిచో ఈ పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రానేరదనుట నిస్సంశయము.తన మాతృదేశ స్వాతంత్యమునకై తన మాన ప్రాణధనముల నర్పించిన ధీరుడు జారిపోషింగ్టను గాక మరియెవరు? డింబరు 19 వ తేదీన దేశీయసభా నమా వేశమును చేరి నాలుగు దినము తరువాత తన యుద్యోగ మును దేశీయ సభ నానికి త్యజించెను. దేశీయ మహాసభ వారు జార్జి వాషింగ్టనుకు కృతజ్ఞతా వందనముల సర్పించివి. ఆయన పెట్టుబట్టిన సొమ్మంతయు నిచ్చి వేసిరి.

స్వాతంత్ర
యుద్ధ వ్యయము.


ఈస్వాతంత్ర యుద్ధములో అమెరికా వారికి మూడుకోట్ల డెబ్బది లక్షల సవరనుల ద్రవ్యము ఖర్చగుట యే గాక తొంబది లక్షల సవరనులు అరాసు దేశమునౌ ఋణపడిరి. ఎంతఖర్చయినను తాము భగవదను,గ్రహమువలన స్వాతంత్యమును పొందితి మను ఆనందమును పొందిరి. ఆంగ్లేయులకు పదునాలుగు కోట్ల సవరనులసొమ్ము ఖర్చయ్యెను. స్వదేశములోనే పోరాడ కలసిన వారగుటచే ఆమెకనులకు తక్కువ ఖర్చును, పదునారు వందల మైళ్ళ దూరము నుండి నేనలను తెచ్చి తమకెట్టిసానుభూ P తియు చూవని ప్రజల మధ్య పోరాడవలసిన వారగుటచే నాంగ్లేయుల కధికమయమును కలుగుటకు కారణమయ్యెను.

ఎర్ర ఇండియనుల
గతియేమి.

ఈ యుద్దములో ఎర్రయిండియు లాంగ్లేయులతో చేరిరి. కాని లాభమును పొందుటకు మారుగా నపొరమగు నష్టమును పొందిరి. కొన్నివం దలమంది అమెకనుల పైబడి, శిరములను ఖండించి వీరెత్తుకొనిపోయి యుందురు. కాని సుష్కినా నది కిని గిన్సీ నదికి, మధ్యనున్న ప్రదేశములోని ఎర్రయిండియను లను నాశనము చేసి దానినంతయు ఆమెరికనులాక్రమించు కొనిరి. వర్జీనియూ రాష్ట్రముసకు పశ్చిమముననున్న ఇల్లినాయి సు జాతులు నిర్మూలనము" గావింపబడి యా ప్రాంతమంతయు నమెరికనులకు స్వాధీనమయ్యెను. మిసిసిపీ నదియొడ్డున బఫరుసగు కోట నమెరికనులు కట్టి దానికి పశ్చిమము నందున్న ఎర్రయిండిమును జూతుల నరికట్టిరి. దక్షిణను నమన్న చెరు కీల యొక్కయు వారి మిత్రులగు జాతుల యొక్కయు దేశమంతయు అమెరికనులచే ధ్వంసము చేయబడి యాక్రమించబడినది. అమెరికనులు యుద్దకాలములో తమ చుట్టుపట్టున నున్న నూతనప్రదేశమును ఆక్రమణ చేసి అచటస్థిరనివాసములు పొంది నూతనజిల్లాల నేర్పరచుచుండిరి. వీటిని కొలది కాలములో నూతన రాష్ట్రములుగ నామకరణ చేయునున్నారు. అమెరికనుల వలస, ప్ర దేశము అలి ఘనీసు కొండలను దాటి మిస్సి సిపినదిప్రసహించు ప్రాంతము వరకును వ్యాపించినది. ఎర్ర్ యిండియను అదృశ్యమైపోయినకొలదియు వాఫప్రదమగు సేద్యహూములు, గనులు, అడవులు అమిరికనుల వశముమ్యెను. తమకు


యుద్ద కాలమున సహాయను చేసి అమెరికసుల శత్రుత్వమును పొందిన ఎర్రయిండియనుల మందుగతినిగూర్చి, తెల్లవారగు అమెరి కను రాజభక్తులను గూర్చి చేసినటుల సంధి కాలమున ఆంగ్లేయులు కూడ యోచించలేదు, వారిగతిని గూర్చి యోచించువారే లేరు. సంధిషరతులలో వారి సంగతి ప్రస్తాపింపబడనే లేదు.

నీగ్రో
బానిసలు.


యుద్ధములో తమపక్షమున చేరిన సల్లనీగ్రో బానిసల నందరినీ బాసనత్వమునుండి విముక్తి చేసెద మనీ యాంగ్లసేనాని డనుమోరు ప్రభువు యుద్ధ కాలమున ప్రకటించెను. నీగ్రోల సేనలు వచ్చి నాంగ్ల నేనలలో చేరిరి. కాని బానిసత్వమును రద్దుపరచుట కాంగ్య మంత్రులుగాని యితర సేవాసులుగాని అంగీకరించ లేదు.. తమ సైన్యమ లలో చేరిన నీగ్రోగోలసుకూడ బానిసలుగ పట్టు "ని అనేకమారులు విక్రయించిరి. కొందరిని బహుమాన ముల కింద పంచి పెట్టిరి. రెండు వేల మందిని పశ్చిమ యిండియా ద్వీపము లలోని తెల్ల భూఖామందులకు మనిషిని రెండు వందల ఏబంబు వెండి డాలరుల చొప్పున విక్రయించిరి. అమెరికా వారుకూడ తమ సైన్యములలో చేరు . నీగ్రోబానిసలకు స్వేచ్చను కలుగచేసి వారియజమానులకు నష్టపరిహారమిచ్చుటకు నిశ్చయించి ముఖ్యముగ సత్తర రాష్ట్రములలో నీగ్రో లను పటాలములలోనికి చేర్చుకొనుచుండిరి. కానీ దక్షిణ రాష్ట్రముల వారు బానిసత్వమును తీసివేయుటకు సమ్మతించ లేదు. అచట నీగ్రోలను సేవలలో చేర్చలేదు. 1776 సం|| జులై 4వ తేదీన అమెరికావారు చేసిన స్వతంత్ర ప్రకటన


ములో సమెరిశా రాష్ట్రములలో బానిసత్వమును రద్దు పరచుట కొక నిబంధనను జెఫర్చను చేర్చెను. కాని దక్షిణమున నున్న దక్షీణ కారొలీనా జార్జి రాష్ట్రములవారు బాని సత్వమును మాన్పుటకు ప్రయత్నించినచో తాము సంయుక్త రాష్ట్రముల చేరమని బెదిరించినందువ నిబంధనను కొట్టి వేసిరి. ఇచ్చనచ్చిన రాష్ట్రములవారు బానిసలకు స్వేచ్చ నివ్వవచ్చుననియు నిష్టము లేనివా రివ్వనక్కర లేదనియు చివరకు రాజీపడిరి. ఉత్తర రాష్ట్రములలో బానిసత్వమునకు వ్యతిరేకభావము తీవ్రముగ ప్రబలియుండెను. 1780 వ సంవ త్సరమున మెపషు సెట్సు, పెన్ని సిల్వానియా కూడా రాష్ట్రముల వారును, 1784 సం|రం స్యూహంపు పైరు రాష్ట్ర మువారు , 1784 సంవత్సరమున కనెక్టికటు, రోడు అయిలాండు రాష్ట్ర ములవారును బానిసత్వమును రద్దుపరచిరి. 1783 సంవత్సర మొక బానిస తప్పించుకొని మెసషు సెట్ను రాష్ట్రములో వచ్చిచేరెను. వెంటనే బానిసత్వము తొలగెను. యజమాని యా బానిసను పట్టుకోను యత్నించెను. స్వేచ్ఛకొందిన వారిని పట్టుకొనుటకు హక్కు లేదని తీర్మాసించిరి. 1790 వ సంవత్సరమున జరిగిన జనాభాగణితీలో నీ రాష్ట్రములోని బాని నలసంఖ్య సున్న యని వ్రాసియిచ్చిరి. డెలవేరు న్యూజర్సీ రాష్ట్రములలోకూడ బానిసలకు స్వేచ్చ నొసంగుటకు యజ మానులను ప్రోత్సాహించు చట్టములను చేసిరి. వర్జీనియా రాష్ట్ర ప్రముఖులగు జెఫరుసను పాట్రికు హెంరీ, జూర్జిమే సనులు బానిసత్వమునకు బద్దశత్రువులుగ నుండిరి. కాని సేనలలో చేరెడు ప్రతి అమెరికనునకును ఒక నీగ్రో బానిసను పారితోషిక

ముగ నిచ్చెదమని వర్జీనియా రాష్ట్ర సభవారు తీర్మానము" చేసిరి. వాషింగ్టసుమాత్ర మిూవిషయమున తటస్థుడుగ నుండెను. ఆంగ్లేయులకును అమెరికనులకును జరిగిన సంధిలో బానిసత్వ మంగీకరించబడెను. " నీగ్రోలను మరింతర ఆస్తులను” ఆంగ్లేయ సైనికు లమెరికా నుండి తమతో కూడ తీసుకొనిపోగూడదని నిబంధననుచేసిరి. యుద్ధములో నేవైపున చేరినను (సల్లవాని) నీగ్రోయొక్క స్థితి బాగుపడ లేదు. "కానీనీగ్రో బానిసత్వమునుగూర్చి ఇంక డెబ్బదిసంవత్సరములలో నమెరికాలోని యుత్తర రాష్ట్రముల వారికిని దక్షిణరాష్ట్ర ములవారికిని గొప్పయద్దము జగ గనున్నది. .

1788 వ ఇంవత్సరముననే అమెరికా సంయుక్త రాష్ట్ర ముల స్వాతంత్ర్యమును స్వీడను, డెన్మార్కు, స్పైన్, రుష్యా ప్రభుత్వములవా రంగీకరించివి. అమెరికా వారితో ఒడంబడి కెలు చేసికొనిరి. రెండు సంవత్సరమల తరువాత ప్రష్యాకు వారును ఒడంబడికెలు గావించుకొనిరి. ఖాళీ పుట
స్వాతంత్రదేవతయొక్క ప్రతిమ.