అమెరికా సంయుక్త రాష్ట్రములు/ఆరవ అధ్యాయము

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

ఆరవ అధ్యాయము , పంచ పరిస్థితులు.

{1)

{ఆమెరికా.}

యుద్ధారంభమున చుట్టునున్న ప్రపంచ స్థితిగతు లెటు లున్నవో తెలిసికొనుట మూవశ్యకము. గ్వయగా దేశముతప్ప మిగిలిన దక్షిణ అమెరికా ఖండమంతయు స్పైన్, పోర్చుగలు, జాతులచే నాక్రమించ బడియుడినది. గ్వయనాదేశములో కొంత భాగము ఒలాందా (డచ్చి వారి క్రిందను కొంత భాగము షరాసువారిక్రింద నుండెను. ఉత్తర అమెరికా ఖండములో సుత్తరముననున్న కనడా దేశము లో నెక్కువభాగము పరాసువారి క్రిందను కొద్దిగా ఆంగ్లేయుల క్రిందను ప్రధమములో నుండినప్పటికిని 1757 మొదలు: 1768 వరకు జరిగిన ఏడు సంవత్సరముల యుద్ధములో పరానువా రోడిపోయినందున, 1783 వ సంవత్సరమున జరిగిన పారిసు సంధివలన, కనడా దేశ మంతయు ఫొస్సు వదలి వేసి ఆంగ్లేయు సభుత్వమునకు పశవరచెను. ఇంతటి నుంచియు కనడా దేశ మాగ్లేయ సామ్రాజ్యములో ముఖ్యమైన వలసరాజ్య మై


- వృద్ది చెందినది. కనడా దేశమునకు దక్షిణముననున్న దీసంయుక్త రాష్ట్రములు. అప్పటి కీ దేశములోని తూప్పు సముద్రతీరమునను కొద్దిగ మధ్యభాగమునకు మాత్రము ప్రదేశము నాక్ర మించి పదమూడు రాష్ట్రములు ప్రధానముగ నాంగ్లేయులచే నిండి ఆంగ్ల ప్రభుత్వమునకు లోబడియుండెను. అవియే ఇంగ్లాండు దేశముతో యుద్ధము చేయుటకు సంసిద్ధ ముగుచుండెను. వీకి జన సంఖ్య స్వతంత యుద్ధమునాటికి షుమారు ముప్పదియైదు లక్షలుండును. కనడాలోను సంయుక్త రాష్ట్రములలోను తెల్ల వారు నివసించిన ప్రదేశమునగాక మిగిలిన ప్రదేశములో ఎర్రయిడియను జాతుల వారు స్వతంతమైన ప్రభుత్వములను గలిగి నివసించుచుండిరి. ఈ యెర్ర యిండియునులను నాశనముచేసి పూర్తిరిగ నీ రెండు దేశములను తెల్లవారు ఆక్రమించుకొను కాలము ముందు రానున్నది. ఈపని కాలక్రమేణ జరిగెను. ఇంకోక డెబ్బది వత్సము కాలములో సంయుక్త రాష్ట్రము లలోని అమెరికనులు ఎర్రంగండియనులను నాశనముచేసిక్రమ క్రమముగ సంయుక్త రాష్ట్రముల దేశమునంతయు తూర్పున అట్లాంటికు మహాసముదము మొదలు పడమట పసిఫికు మహా సముదమువరకును స్వాధీనమును పొంది యింకను ముప్పది తొమ్మిది రాష్ట్రములను స్థాపించిరి. ఇవన్నియుగలసి నేడు “సుప్రసిద్దములగు అమెరికా సంయు క్త రాష్ట్రములుగ విలసిల్లు చున్నవి

సంయుక్త రాష్ట్రములకు దక్షిణముననున్న 'మెక్సికో దేశము స్పైన్ వారి క్రింద నుండెను. వీటికి తూర్పుననున్న 'పశ్చిమయిండియా ద్వీపములు వివిధ యూరోపియు జాతు



క్రింద సండెను. అప్పటికి, సొన్ డొమింగో ద్వీపమును, న్యూ ఫౌండులాండుకు సమీపమున ఒకటి రెండు చిన్న ద్వీపములును, ఫ్రాన్సునకు లోబడియుండెను. -

{ఫ్రాంసు

(2) ఫ్రాన్సు దేశమునపుడు పదునారవ లూయి రాజు పాలిం చుచుండెను. ఈయనకు పూర్వము రాజు (ఫ్రాను పది హేనవ లూయి ఈయనపితామహూడు. పదు నేనవ లూయి స్త్రీలోలుడను వివిధ దుర్గణ సమన్వితండునునై యుండెను. ఆయన యుంపుడుకత్తెలు రాచకార్య. ములలో పెత్త సము :వహించి తమ యిష్టము వచ్చినట్లు మంత్రులను సేనానాయకులను నియమించుచు తీసి వేయుచు కొత్త వారిని నియమించుచు చెంచలబుద్దితో సంచరించినందున 1757 మొదలు జరిగిన 7 గంవత్సరముల యుద్దములో ఫొన్సు అమెరికాఖండములోను యూరపులోను హిందూ దేశములోను నోడిపోయి రాజ్యములో చాలభాగమును పోగొ ట్టుకొనెను. అదివరకు యూరఫుజాతులలో నెల్ల నగ్రస్థావము వహించియున్న ఫ్రాన్సు ఉత్తమస్థితిని కోల్పోయెను. హిం దూదేశపు సామాజ్యమును ఉత్తర అమెరికాలోని కనడావలన రాజ్యమును ఆంగ్లేయులకు వదలివేయవలసివచ్చెను. ఈయేడు సంవత్సరముల యుద్దమువలన ప్రపంచమురియొక్క రాజ్యమును వర్తకమును ఆంగ్లేయులకు సంక్రమించెను. మరియు పది హేనవ లూయీ రాజు మరణించు వరకు పరాసు ప్రభుత్వము యొక్కయుప్రజల యొక్కయ ఆర్థిక స్థితిమిగుల దుర్బలముగనుండెను. పదునారవ లూయి మిగుల యోగ్యుడు. కాని రెండు:


తరములనుంచి వచ్చిన కీడులను సంస్కరించ తగిన సామర్ద్యము గలవాడుకాడు. ఇంక ను వరాసుదేశ మే వాజ్మయములోను భావ ప్రపంచములోను యూరఫుఖండముసకు శిరోమణియైయుం డెను. యూరపులోని వివిధ ప్రభుత్వములవారి యంతర్జాతీయ వ్యవహారము లన్నియు పరాసుభాషలోనే జరుగుచుండెను, యూరవులోని అన్ని దేశ ప్రజలకును పరాసుభాష సామాన్య ముగా తెలిసియుండెను. , ప్రష్యా రాజు ఫ్రెడరికు డి గ్రేటుటు పరానుభాషలోనే కవిత్వమును వ్రాయుచుండెను. ఆంగ్లేయ రాజగు రెండవ జార్షి కల వాటుపడిన భాష పరాసు భాషయే సుప్రసిద్ధ చరిత్రకారుడగు గిబ్బను పరాసుభాషలోనే చరిత్రలు వ్రాయ నారంభించారు. వాల్టేరు ప్రతి దేశపు రాజుతోడను పరాసు భాషలో నే యాత్తర ప్రత్యుత్తరములు జరిపెను. ఇటలీ దేశము లోని సుప్రసిద్ధ నాటకకర్తలు పరాసుభాష లోనే వ్రాసిరి.. పరాసు భాషలో సున్న వాజ్మయము. శాస్త్ర సముదాయము అప్పటికి మరి యేభాషలోను లేకుండెను. పరాసు వాజ్మ యము నందా కాలమున మిలి పేరువడసిన గంధకర్తలిరువురు వాల్టేరు, రూసో వీరు , వ్రాసిన గ్రంధములను వీరుబోధంచిన సిద్ధాంతములను మానవచరిత్రములో నూతన శకమును ప్రారంభింపచేసినవి. వీరనేక గ్రంథములను రచించిరి. జీవిత. పరమార్గమును గూర్చియు వివిధ మనుష్యుల మధ్యను వివిధ మానవ సంఘములమధ్యను నుండవలసిన సంబంధములను గూర్చియు మానవులకుగల యభిప్రాయములలో సంపూర్ణ మగు మార్పును కలుగచేసిరి. వాల్టేరు పండితుడు కవిత్వము, నాటకములు, నవలలు, ప్రహసనములు, వ్యాసములు, ' చరి త్రలు,తత్వశాస్త్రము, రాజకీయశాస్త్రము, ప్రకృతి శాస్త్రములు, మొదలగు నన్ని విషయములను గూర్చియు, నసంఖ్యాకము లగు గ్రంధములు వ్రాసెను. ఏబదినంవత్సరముల కాలము ఎడ తెగకుండ గ్రంధములు వ్రాయుటచే యూరపు ఖండమునం దంతటను ప్రభువుల చేతను ప్రజల చేతను గౌరవాశ్చర్యములతో 'నీయన గంధములు చదువబడుచుండెను. ఈయన వ్రాసిన గ్రంథములు ఎనుబదితొమ్మిది సంపుటములయ్యెను. పరిపాలన లోను, శాసనములలోను, రాజ్యాంగ విధానములోను, గల లోపములను మిగుల కఠినముగ విమర్శించెను. సాంఘిక దోషములను అనమానత్వమును తీవ్రముగ ఖండించెను. నీతి యుపన్యాసమును వర్దిల్లవ లెననియు, మానవులకు సమాసత్వ మున, స్వాతంత్ర్యమను కావలెననియు ప్రతి గ్రంథము నందును వాసెను. . ప్రభుత్వము చేసెడి అక్రమములను నిర్భయముగ చూపినందుకును, రాజకీయాభిప్రాయములను వెల్లడించినందు సకును శిక్షించుట మిగుల దుర్మార్గమగు అనాగరిక పద్దతియని వాల్టేరు వ్రాసెను. మత స్వేచ్ఛ లేకుండ చేయుట గొప్ప పాప కృత్యమనియు నాయన వ్రాసెను. మానవజన్మము మిగుల ఘనమయినదనియు, కాయకష్టము మిగుల గౌరవమయినదనియు చూపెను. వాక్స్వాతంత్ర్యము, పత్రికా స్వాతంత్ర్యము, మతి స్వేచ్చ- ఈమూడును సంపూర్ణముగ నుండవలెనని కోరెను. ప్రభుత్వములు ను, మతగురువులును ప్రజల స్వేచ్చను "నీతిని వృద్ధి చేయుటకై పుట్టిన వారుగాని, ప్రజల స్వాతం త్యము నణచుటకును, ప్రజలను నిర్బంధించి భయ పెట్టి మనస్సులలోని అభిప్రాయము లకు వ్యతిరేకముగ మాటలాడు కపట వేషధారు

. లను గావించుటకు పుట్టినవారు కారని ఆయన విమర్శించెను. . ఏబది సంవత్సరములు ఆయన ఫ్రాన్సు దేశముప గొప్పజ్ఞాన జ్యోతియై ప్రకాశించెను. మానవులు పోగొట్టుకొనిన స్వాతం త్ర్యము ను తిరుగ సంపాదించుటకు సతతము కృషిసలిపెను. తన దేశములో రెండు తరముల గారి అభిప్రాయములను భావము లను ఉద్దేశములను పూర్తిగామార్చివేసెను. అమెరికా స్వతఁత యుద్ధమునాటి కీయసకు ఎనుబదిమూడు సంవత్సరముల వయస్సుగలదు. 178వ సంవత్సరమున నీయన పారిసును దర్శించుటకు వచ్చినపుడు ప్రజలీయనకు చూపిన గౌరవమునకు "మేర లేదు. అమెరికా స్వతంత్ర పక్షపు నాయకులలో నొకరగు బెంజమీను ఫ్రాన్కు లీను తన మనుమని వాల్టేరు యొక్క యాశీర్వచనమునకు గోనిపోయెను. ఆపిల్ల వాని శిరమున తన హస్తముంచి " భగవంతుని యనుగ్రహమును, స్వాతం త్యమును పొందుదుపుగాక ! " యని యాజగద్విఖ్యాతపురుషు డాశీర్వదించెను.

ప్రజలలో విప్లన భావములను నిజముగా కలుగ చేసినది రూసో. ఈయన గ్రంధములు మిగుల తీవ్రభావములుగలిగి, యద్రేక పూరితములై ప్రజాసమూహముల హృదయములను పూర్తిగ నాకర్షించెను. ఈయన జాడ్యగ్రస్తుడు, కడుబీదవాడు, అతి స్వతంత్రుడు. ఈయనను 'రాజులును ప్రభువులును అపాయకరమైన వానినిగ నెంచిరి. ప్రజలు విశేషముగ ప్రేమించిరి. మానవులను నాగరికత యనునది నై జధర్మములనుండి దూరముగ చేసి మాలిన్యమును కలుగచేసిన దనియు, నాగరికత యను విషవృక్షమును నరికి వైచి మానవులు స్వచ్చమగు సహజ


స్వభావమును తిరిగిపొంది, సృష్టికర్త యొక్క యుద్దేశ్యములను నెరవేర్చవలెననియు నాయన ముఖ్య సిద్ధాంతము. “సృ షిలో అందరు సమానులు. ఎక్కువ తక్కువలు లేవు. స్వభావముగ నీతిగలవారు. శారీరదార్థ్య ముగల నారు. స్వేచ్ఛ గలవాడు, నాగరికత యనునది అసమానత్వమును అవినీతిని దెచ్చినది. శరీరదార్థ్యమునుకూడ పొడుచేసినది. కొద్దిమంది. స్వార్ధపరులు నాగరికత పేరున విశేష మందిని దాసులుగచేసి కొనినారు, కావున నాగరికతను నిస్మూలనము చేసి మనుష్యు లలో స్వభావజన్య మగునీతి; స్వతంత్రము , సమానత్వము లను తిరిగి స్థాపించవలెను. విద్యగల వారికన్న విద్య లేనివారును నాగరికు లకన్న అనాగరీకుల ను, భాగ్యవంతులకన్న బీద వారును ఎక్కువ నీతిమంతులు" అని ఆయన నాసెను. ఆయన రచించిన గ్రంధములలో ముఖ్యమయినవి "న్యూ హె లాయిసా” “ఎమిలీ” “సోషలుకంట్రాక్ట్” అను మూడు గ్రం ధములును వీటిని అతిఆత్రతతో ప్రజలు చదివిరి. ఆయన వ్రాసినమాటలు ఒక గొప్ప ప్రవక్తయొక్క సందేశములని ప్రజలు నమ్మిరి." గ్రామములను విడువవద్దు, బస్తీలలో చేసే పద్దు, బస్తీలలో చెడిపోవుటకు అనేక మార్గములుగ లవు. పల్లెటూళ్ళే స్వచ్చమయినవి. నీతిమంతమయినవి” అని ఆయన , వ్రాసెను. "" దైవాంశసంభూతులమని చెప్పి రాజులు ప్రజలను మోసము చేసి నిరంకుశముగ పాలించుచు దాసులుగచేసు కొనియున్నారు. పుట్ట కవల్లనే శ్రేష్టులమని ప్రభువులు ప్రజలను లోబరచుకొని దాస్యములో ముంచియున్నారు. ఈశ్వరుని ప్రతినిధులమని పలికి మతగురువులు ప్రజలను తమ పాద్యా క్రాంతులుగా చేసి

కొని వారిని మాథ్యములో ముంచి మత స్వేచ్ఛను పూర్తిగా తీసి వేసినారు. ఈ సిద్ధాంతములు కేవలము. స్వార్ధ పరులచే కల్పింపబడినవి ” అని విమర్శించెను. "దేశము ప్రజలది. ప్రజలు మొదట ప్రభుత్వములు లేక ఎవరీయిష్టము వచ్చిన విధ మున వారు ప్రవర్తింపుచు సంపూర్ణ స్వేచ్చము కలిగియుండిరి. కాని కలహములు కలుగు చుండెను. శాంతి కలిగి యుండుటకై ప్రజలందరును కలిసి ప్రభుత్వముల నేర్పరచుకొనిరి. రాజులు గాని మరి ఏప్రభుత్వము : గానీ ప్రజలేర్పరచుకొనగ వచ్చిన వారు. ప్రజల లాభమసకై ఏర్పడినవారు. ప్రజలకు నౌకరులు. తమ్మ తాము పాలించుకొను హక్కు ప్రజలది. పజ్రల చిత్తమే చట్టము, ఏ ప్రభుత్వమునకు ఎప్పుడు ప్రజల కష్టము లేకపో యిసను ఆ ప్రభుత్వమును కూలదోసి తమయిచ్చవచ్చిన ప్రభుత్వమును ప్రజలు స్థాపించుకొనవచ్చును.” అనునది ఆయన రాజకీయ తత్వము. "ఏ ప్రభుత్వమునకును ప్రజ లయిష్టమునకు వ్యతి రేకముగ ప్రవర్తించుటకు హక్కు లేదు. ప్రజల స్వాతంత్యమును పొడుచేయుటకు అర్హత లేదు. స్వాతంత్ర్యము ప్రజల సహజధర్మము. ప్రజలస్వతంత్రతను కాపాడుకొనుటకును ప్రజలచిత్తమనకు లోబడి నడచుకొను టకును ప్రధమమున ఒడంబడికెలు జరిగి పజలు ప్రభుత్వము లనేక్సగుచుకొన్నారు. కాలక్రమమున గాజులును ప్రభువులును ఇతర ప్రభుత్వములును మొదటి యొడంబడి కెలకు భిన్నముగ ప్రజల స్వతంత్రతను హరించి ప్రజలను దాసులను చేసికొని నిరంకు శత్వమును స్థాపించియున్నారు. ప్రజలుత మహక్కులను గూర్చి మరచిపోయి బాధలకులోనయినారు. తిరిగి స్వతంత్రతమ సంపాదించుకొనుట ప్రజలవిధియైయున్నది. ' దేశములోని ప్రజలందరును ఒకేజాతి, ఎక్కువ తక్కువలు లేవు. అందరి దీని దేశాభిమానమును తిరిగి బోధించవలెను.......” అని ఆయన వ్రాసెను. వాలేరు, రూసో, పండితులేగాక పెక్కు మంది గ్రంధకర్తలు పరాసుభాషలో గంధములు వ్రాసిరి . ఆకాలమున ఫ్రాన్సు దేశములోని అందరు గ్రంధకర్తలును ప్రజ లనుభవించు సమస్త కష్టములకును స్వతంత్రతను పొందుట గన్న, వేరుతరుణోపాయము లేదని వాసిరి.


ఈగంధ వ్యాపకమువలన పరాసుదేశములో - నూతనానాదర్శనములు, నూతసకోరికలు, నూతనభావములు, పూర్తిగా కలిగెను. త్వరలో గొప్ప ప్లవము కలిగే ప్రపం చము, మార నున్నదిని ఫోన్సులో చాల మంది తలచు చుండిరి. "మాతరు వాత ప్రపంచ మాఖరగుసు. ప్రళయము రానున్నదని పదిహేనవ లూయి రాజు చెప్పచుండెను. “విప్లవకాలమును సమీ పించుచున్నాము. యూరొపుఖండములోని గొప్పరాజ్యములు విశేష కాలము నిలచుటయసంభము” అని 1760 సంవత్సరములో రూసో పండితుడు వ్రాసెను. " మేము విప్లవమునకు విత్తులు వెదజల్లుచున్నాము. విప్లవము రాక తప్పదు.” ' అని 1762 గంవత్సరమున వాలేరు పండితుడు వ్రాసెను. “విప్లవము ఇదివర కే ప్రారంభమయినదనియు రాచకీయ విప్లవ మికను రాకుండినను భావవిప్లవమిదివరకే పూర్తి యైనద నియు” యుండిటెకవల్లీ యను గంధకర్త వాసెను. అమెరికాలో ప్రజా స్వాతంతోద్యమమును చూచి పదునారవ లూయి రాజు యొక్క మంత్రి మాలి షెర్బీ 1614 సంవత్సరమునుండియు, సమావేశపరచబడని స్టేట్సు జనరలు (దేశ ప్రతినిధిసభ) ను వెంటనే పొరీసులో సమావేశపరచమని 1775 సంవత్సరము లో పరాసు రాజునకు సలహానిచ్చెను. పరాసు చేశములో కూడ ప్రజలు తిరుగ బాటులు చేయకముందే ప్రజలహక్కులను. స్టాంపిచుట మంచిది యని ఈయన యుద్దేశించెను.

(3)

{అమెరికాలో స్వతంత్ర భావములు

అమెరికా ప్రజలు కూడ వాల్లేరు, రూసో, పండితులు,గ్రంధపఠనము గావించుచు భావోధ్రేకమును పొందుచుండిరి. "అమెరికావారియందు. స్వతం - భావములు "పరాసు వారికి ప్రథమసు నుండియు సానుభూతియు మిత్రభావము నుండెను అమెరికాలో నిస్తార మగు ప్రదేశములు గలవు. ఎవరికీని లోపము లేదు. సమాన త్వము బాగుగనున్నది. ఇంకను విషయలోలతలో చిక్క... లేదు. స్వాతంత్ర్యముతో, కూడ యోగ్యత, నమ్రత గలదు. పరిపక్వమయిన రాజకీయ ప్రతిష్టాపనలను స్థాపించుకొనుట కును ప్రజాసౌఖ్యము సకై పాటు బడుటకును అచట మంచియవ కాశము గలదు” అని 1750 సంవత్సరమున పరాసుప్రధాన మంత్రి తుర్నో చెప్పెను. "వారిచుట్టును అడవులు సృష్టి సౌంద ర్యము మరియెచటను లేవు. రూసోపండితుడు ,వ్రాసిసవిధమున సృష్టి యొక్క శాసనముల ననుసరించి స్వభావమగు స్వతం త్రములుగల సంఘమును నిర్మించుకొనుట కమెరికా వారికవ కాశముగలద"ని మ రియొక ఫెంచి గంధకర్త 'వ్రాసియున్నాడు రూసొపండితుని విప్లవ సిద్దాంతములను ప్రధమమున నవలంబించి లోకమునకు మార్గదర్శకు లగుట కమేరికావారే యం

..


దరికన్న అర్హులని పరాసు దేశములోని బుద్ధిమంతులు తలచు చుండిరి. మరియు తమకు శత్రువగు యింగ్లాండులో నమెరి కనులు పోరాడుచున్నందున పరాసు రాచకీయవేత్తల కమెరి కనులయందు సొసుభూతి మరింత హెచ్చినది. ఇంగ్లాండు సందు ద్వేషమును అమెరికనులయందు ప్రేమగౌరవములను ప్రతిపరాసు పౌరుని హృదయమునందును ప్రజ్వరిల్లెను, స్పైన్ దేశపురాజగు మూడవచార్లెసు ఆశాలమున ఫ్రాన్సు రాజుతో స్నేహమును ఇంగ్లాండునం దసూయను గలిగియుండెను. కావున అమెరికా స్వతంత యుద్ధమున పరాసు, స్పైన్, దేశముల ప్రభుత్వములవారమెరికను పశము నవలంభించుటకు సిద్ధముగ నుండిరి. తక్కిన యూరొపు ప్రభుత్వము లన్నియు తటస్త ముగ నుండెను.