అమెరికా సంయుక్త రాష్ట్రములు/తొమ్మిదవ అధ్యాయము

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము.

తొమ్మిదవ అధ్యాయము , (1)

పరిపాలనా
 భారము


స్వతంత్రము పొందిననాటికి సంయుక్త రాష్ట్రముల"ఆంతరంగిక వ్యవహారముల సంతృప్తి కర ముగా నుండెను. ప్రజలు స్వతంత్రమును సంపాదించుకొనిరే గాని చక్కని పద్ధతులమీద స్వపరిపాలనను నిర్మాణము చేసికొనుటకు తయారై యుండ లేదు. గొప్ప ఆదర్శములు కలిగి స్వతంత్ర పోరాటములో నాయకులుగా పని చేసినవారిలో కూడ చాలమంది నూతన సభుత్వ మును నడుపుటకు తగిన యనుభవము, లేనివారినియే చెప్పక తప్పదు. అంతవరకును ఆంగ్లేయ ప్రభుత్వము వారిచే నియమింప బడినవారిని ఎదిరించుటకే అలవాటు పడియుండిరి గాని తాము స్వయముగా జవాబు దారి సహించి ప్రభుత్వము నడుపు అవకాశం లేనివారై యుండి ఇపుడు ఆంగ్లేయ ప్రభుత్వము పోయి దేశమును సరిగా పాలించు భారము వారి మీద వడినది. రాష్ట్రములలో పరస్పర మనస్పర్థలును , ల

. అసూయలును, నిండి యుండెను. ఉత్తర రాష్ట్రముల వారికిని, దక్షిణ రాష్ట్రముల వారిని, తీవ్రమగు భేదాభి, పాయము లుండెను, వారి లాభ నష్టములు వేరుగను,, వీర లాభనష్ట ములు మరియొక విధము నను నుండెను


కావున పదమూడు రాష్ట్రమును కలిపి నుంచి నాటి కన్నిటికిని అనువగు సంయుక్త ప్రభుత్వమును స్థాపించుట కష్ట తరమగు కార్యముగ నుండెను. దేశీయ మహాజన స భ దేశ మ నంతను పాలించుటకు తగినంత అధికారము తోడసు కట్టు దిట్టముల తోడను కూడి యుండలేను. శత్రువుపై ప్రజలకుద్రేమును పురిగొలిపి స్వతంత్రమును స్థాపించుటడు మాత్రమే తగియుండెను - యూద్దకాలములో శత్రుపై నందు గల ద్వేషము వలనను స్వతంత్రేచ్చ వలసను రాష్ట్రములన్నియు ఐక్యత నొందెను. బుద్దము ముగిసిన తరువాత సట్టి ఐక్యత నిలుచుట కష్టముగ నుండెను.. దూరదృష్టిగల నాయకు లందరుసు యీ విషయములో నాత్రతను, గలిగి యుండిరి. ప్రధాన నాయకుడగు జార్జి వాషింగ్టము సర్వ సేనా పత్యముపదలి వైచుటకు ముందు ఈ విషయమును గూర్చి అన్ని రాష్ట్రముల పతినిధి సభలకుసు వ్రాసెను. అన్ని రాష్ట్రములును కలిసి యొకే ప్రభుత్వము క్రింద పని చేసిన గాని అభివృద్ధిని గొప్పతన మును పొంద నేర వనియు, చీలిపోయి యెపరికీ వారు స్వతంత్ర ముగా నున్నచో సంపాదించిన స్వతంత్రము యొక్క లాభమును విశేష కాలమనుభవించ నేరరనియు హెచ్చరించెను. బందోబస్తగు నౌక 'రాజ్యాంగ విధానమును తయారు చేసి కొని దానికి లోబడుట యవశ్యకమని సలహా నిచ్చెను. కాని నాలుగు సంవత్స:ముల వరకును రాష్ట్రములు తాము సంపాదించిన స్వేచ్చలో కొంత తగ్గించుకొని ఒక జూతీయ సంయుక్త ప్రభుత్వం. నకు 'లోబడి నడచుకొనుటకు తగిన కు దురు బాటు: పొంద లేదు ఈ నాలుగు సంవత్సరములును. దేశీయ మహాసభయే జాతీయ . ప్రభుత్వమును చలాయిం చెను కాని దాని అధికారము నాచుమాత్రావశిష్టముగ నుండెను. తగిన ధనము లేదు. సైవ్యములను తగినన్ని పెట్టుకొని సరి హద్దులను కాపాడగల స్థితిలో లేదు.. ఇతర దేశీయుల గౌరవముసు పొందు అర్హతను సంపాదించ లేదు. రాష్ట్రము లేవరి లాభము.కొరకు ప్రయత్నించుచు సమిష్టి లాభమురు నిర్ల్యక్షము చేసిరి.. కాని క్రమముగా అనుభవముమాద తగిన అధికారము లుగల జాతీయ ప్రభుత్వము నేర్పరచు ఆవశ్యకత గోచరించిసాగెను. న్యూ యార్కు రాష్ట్రము తనతోడి రాష్ట్ర ముల నుండి వచ్చు సరుకులపై పన్నులు విధించెను. దీనితో దేశము" వర్తక వ్యాపారమును సరిగా నడుపు అధికారము దేశీయ మమ జన సభ కిచ్చుట మంచిదని యొక అభిప్రాయము వ్యాపించెసు..

జాతీయ
ప్రభుత్వపు
ఆవశ్యకత.

దేశీయ మహాసభకుగల అధికారములు నిర్నయముకానందున స్పెయిన్ తో వర్తక సంధి చేసుసుటకు వీలు కలుగ లేను. ఆంగ్లేయులు ఓడవ రక చట్టముల సమెరికా రాష్ట్రములపై అమలు జరుపుచుండగ దేశీయ మహాసభ వాటిని ఆటంక పర్చుటకు చేతగాని అసహాయ స్థితియందుండెను. ఉత్తర రాష్ట్రములు ఆంగ్లేయుల ఓడవర్తక చట్టములకు లోబడుటయు దక్షిణరాష్ట్రము లెదిరించుటయు జరిగెను.


మరియు అలిఘనీను పర్వతములకు పశ్చిమ మువనున్న ప్రదేశమంతయు సంయుక్త రాష్ట్రములకు చేరవలెనని ప్రధమము నుంచియు అమెరికా వారు తలచిరి. కాని ఏరాషృమమున కెంత. ప్రదేశము చెందవలెనని ప్రదమమునుంచియు అమెరికా వారు తలచిరి. . తుదకు ఆదేశమంతయు నే రాష్ట్ర మునకును చెందక జాతీయ ఆస్థిగా దేశీయ మహాజన సభ కింద సండవలెనని అంగీకరించబడెను.


ఆప్రదేశములో కొంత భాగములో నమిరినులు వలసల నేర్పరచుటయు నిందువలన రెండు రాష్ట్రము లేర్పడ టము జరిగెను. మరియ ఓహియో నదికి యుత్తరము నన్ను ప్రదేశము కూడ కాంగ్రెసునందు (దేశీయ మహాజనసభ ) సంఠ మించెను. దానిలో నిభాగములను అమ్మి యుద్ధఋణ ములను తీర్చుకొనుటకును, తీసివేసిన సైనికుల జీతములిచ్చుట. కును దేశీయ మహాసభ కధికారమివ్వబడెను. అచట కాపుర మునకు పోపువారికి సంపూర్ణమగు మత స్వేచ్చ యుండునటుల శాసించబడెను. మరియు నచట బానిసలను తేగూడదని కూడ నిబందనలు చేయబడెను. స్పెయిను వారు మిస్సిసిపీ ముఖ ద్వారముగుండ అమెరికనులు రాకుండ నాటంక పరచిరి. దక్షిణ రాష్ట్రము లేమియు చేయజాలకుండెను. “చెసపీ బే నుండి. ఓహియో సదివరకును గొప్పగాలవను త్రవ్వించిన చాలు రాష్ట్రములకు లాభకరమని యెంచిరి. దేశీయ మహాసభ బల పడినగాని యూపని సంపూర్ణము గాదయ్యెను. కావున సం

యాక్త ప్రభుత్వము బలపడనిచో ననేక నష్టనులు కలుగునని అనుభవము కూడనన్ని రాష్ట్రములకును క్రమముగా తోచెను. 1787 వ సంత్సరము మే నెలలో ఫిలడల్ఫియా నరమును సంయుక్త ప్రభుత్వ విధానమును సం యక్త ప్రభుత్వమునకును రాష్ట్రప్రభుత్వములకును 'గలసంబంధమును నిర్ణయించుటకు పన్నెండు రాష్ట్రములనుండి ఏబది అయిదుగురు " ప్రతినిధులు సమావేశ మగునట్లు ఏర్పాట్లుగావింపబడెను.

. ఆసమావేశమునకు జార్జి వాషింగ్ట నధ్యక్షత వహించెను. రెండుమూడు నెలలు పెక్కుమారులు సమావేశములు జరిగి వివిధ విషయములు బాగుగ చర్చించబడి ప్రస్తుతమున్న పద మూడు రాష్ట్రములకును ఇకముందు ఏర్పడబోవు రాష్ట్రములకు ను నర్తించునట్లుగ నొక ముయుక్త ప్రభుత్వ విధానమును , తయారుచేసిరి.

జార్జి
వాషింగ్టను
అధ్యక్షుడగుట.


దానిని 1787వ సంవత్సరము 20వ సెప్టెంబరు తేదీన దేశీయదుహాసభ వారంగీక రించి వివిధరాష్ట్ర ప్రభుత్వములకంచగ వారొటొకటి చొప్పున అన్ని రాష్ట్రములవారుసు అం గీకరించి దస్కతులు పెట్టిరి. 1789 సంవత్సరము జనేవరి 7వ తేదీన నూతన రాజ్యంగ విధాన ప్రకారమెన్నికలు జరిగి అమెరికా సంయుక్త రాష్ట్రములౌ ప్రథమ అధ్యక్షుడిగా జార్జి వాషింగ్ట నెన్న కొనబడెను. అమెరికామ సురక్షితముగ నడిపించుటకు జార్జి వాషింగ్టను కన్న అర్హులెవరు ! ఉత్కృష్టమగు ఆదర్శములను కలిగి?


యుంచుటయే కాక, అయకు విశేషమగు లోకానుభవము కూడనుండెను. తన సర్వస్వమును తన దేశముయొక్క ఘనత కొరకై అర్పించుటయే గాక , . తన దేశము యొక్క భావ్య దృష్టమునందును గొప్పదనము నందును సంపూర్ణమగు విశ్వాస మును కలిగి యుండెను. ఆయన కాంక్షించక పోయినను ఆయన నేక గ్రీవముగ : అద్యక్షునిగ నెన్ను కొనుట వలన ఆయన చేసిన మహత్తరమగు దేశ సేవకు కృతజ్ఞత చూపినట్లయ్యెను. ఆయన రాచకీయకక్షుల కతీతుడై దేశమును బహువిధముల అభివృద్ధి నొందించి "రెండవమారుకూడ నగ గ్రీవముగా మధ్యక్షుడుగ నెన్న కొన బడెను. మూడవసారికూడ అధ్యక్షత పదవి నివ్వగా సాయన స్వీకరించుటకు నిరాకరించెను.


(2)

సంప్జుర్ణ ప్రజా
స్వామికము.


అమెరికా సxx క్త రాష్ట్రములు ఆంగ్లేయ ప్రభుత్వమునుండి చీలిపోయిన తరువాత సంపూర్ణ ప్రజాస్వామికము నేర్పరచుకొనెను వారి రాజ్యాంగ విధానములో రాజు లేడు. ప్రభువులు లేరు. ప్రభువుల సభ లేదు. ప్రభు బికుదము మొదలగు బిరుదములను రాజ్యములోని పౌరుకెవరికివి యివ్వరు. బిరుదముల నెవరును దరించరు. మానవులా గౌరవము వారు పొందు బిరుదములనుబట్టి గాక సమర్దత యోగ్యతల వలననే గలుగువని వారి యభిప్రాయము, పరిపాలన 1787 వ సం వత్సరమున జార్జి వాషింగ్టను గారిచేత లిఖతముగా నిర్ణయించ బడిన రాజ్యంగ విధానమునుబట్టియే నేటికిని జరుగుచున్నది, అందులో ఏదైన మార్పులు కావలసియున్నచో మార్పులు


చేయుట కందులో చెప్పబడిన విధానము ననుసరించియే మార్పులు జగుగుచున్నవి. వంయుక్త రాష్ట్రములు యేబది రెండు రాష్ట్రములను కలిగియున్నవి. ఈ అన్ని రాష్త్రములును కలిసి సమృష్టి విషయములలో నొక జాతీయ ప్రభుత్వము.. క్రింద నున్నవి, "ఇదిగాక యేరాష్ట్ర ప్రభుత్వము ఆరాష్ట్రమున కున్నది.

రాష్ట్రముల
వ్యక్తిత్వము.

ప్రథమమున సంయుక్త రాష్ట్రములు గా చేరి సంయుక్తప్రభుత్వము నేర్పరచుకున్న పదమూడు రాష్ట్రములుసు ఒకేకాలమున ఒకే చట్ట, ప్రకారము పుట్టినవి కావు. దేనికది. ప్రత్యేకపరిస్థితులలో ఏర్పడినది. ఆంగ్లేయ ప్రభుత్వము కిందనివియన్నియు సున్నప్పటికిని అన్నిటికిని సమానహక్కులు లేకుండెను, వివిధ రాష్ట్రములకును వివిధములగు హక్కులుగల దానశాసనము లుండెను కొన్ని రాష్ట్రములు ఆంగ్లేయ "రాజుయొక్క స్వంతమ క్రిందను,కొన్ని భూఖామందులక్రిందను, కొన్ని ప్రజా సమూహముల కిందను, కొన్ని ప్రత్యేక సంఘములకిందను, దాసపట్టాలు పొందెను. ప్రతి రాష్ట్రమునకును వేరు వేరగు పద్దతులమీద శాసనసభలు, అధికారవర్గము, న్యాయ స్థానములు మొదలగు పరిపాలనా పక్మురికరము లండెను. ఆంగ్లేయ ప్రభుత్వము వారి నిర్బంధములకు తాళజాలక అన్ని రాష్ట్రములును కలిసి తిరుగు బాటును సాగించి స్వతంత్రమును పొందెను. స్వతంత్రము పొందిన తరువాత విడివిడిగా నుండుటవలన తమక పొయము కలుగునని తలచి అన్ని రాష్ట్రములునుకలిసి యొక జూతీయ సంయక్త ప్రభుత్వము క్రిందికి వచ్చుటకు


అంగీకరించెను. గాని సంయుక్త ప్రభుత్వ విధానము నేర్పంచు -కొనుటలో రాష్ట్రములు తమ ప్రత్యేక వ్యక్తిత్వమును పోగొట్టుకొనుటకును తమ యాపత్తు స్వతంత్రమును పూర్తిగా జాతీయ ప్రభుత్వమునకు లోబరుచుటకును సమ్మతించలేదు, రాష్ట్రములు ప్రధమమున సర్వాధికారములు గలవి. అవి అవ సరమునుబట్టి కలసినవి కావున అన్ని రాష్ట్రములకును అనగా మొత్తపు సుయుక్త రాష్ట్రముల జూతికి సంబంధించిన సమ్మష్టి విషయములలో మాత్రమేసనగా రాజ్యంగ విధానములో స్పషీకరించిన విషయములలో మాత్రమే నిర్దిష్టమగు అధికారములు చలాయించుటకు జాతీయ సంయుక్త ప్రభుత్వము చేర్పరచుకొనెను. ఈయేర్పాటు ప్రకారము రాష్ట్రము లన్నియు ననేక ముఖ్యమగు విషయములలో జాతీయ ప్రభుత్వమునకు లోబడి నడచుకొనవలసి నప్పటికిని, జాతీయ ప్రభుత్వముకు యివ్వబడని అధికారము లన్నియు రాష్ట్రప్రభుత్వముల యందే యుండును. జాతీయ ప్రభుత్వపు అధికారము నిర్దిష్టమైని, మితమైనది. రాష్ట్ర ప్రభుత్వల అధికారము అనిర్దిషమైనది, అమితమైనది. జాతీయ ప్రభుత్వమును చలా యించుట కవసరమగు పన్నులు, జాతీయ ఋణము, సుంకములు, ఎగుమతి దిగుమతి సరుక లమీద పన్నులు, విదేశ సరుకులమీద పన్నులు, విదేశములతోను రాష్ట్రముల మధ్యను వర్తక వ్యాపారములను గూర్చిన నిబంధనలు, పోస్టు, పోస్టురోడ్లు, తంతి, ధూమశక్కటములు, పొగ యోడలు, సైన్యము, నావికాదళము, విదేశస్తుల విషయములు, యుద్ధము, సంధి, కొత్త రాజ్యములను సంపాదించుట, విదేశ వ్యవ

హారములు, ట్రేడు మార్కులు, కాపీరైటులు, నాణెముల, కరెన్సీనోట్లు, ( కాగితవు ధనము, ) జాతీయ ప్రభుత్వముపై నేరములు, సముద్రముల మీద నేరములు, దివాలా చట్టము, పౌరసత్వపు హక్కులు, సంయుక్త ప్రభుత్వపు రాజధాని లోను, వారి కోటలు, గిడ్డంగులు, నౌకా నిర్మాణశాలలు, మొదలగు ప్రదేశములలోను సమస్త శాసనములు చేయట, మొదలగు ఆకారములు జాతీయ ప్రభుత్వమునకు గలవు. 'రాష్ట్రములోని పౌరులకు సంబంధించిన సమస్తయితః విషయములలోను, శాసనములుచేయు అధి కొరకు రాష్ట్రప్రభుత్వముల కుండును. అనగా స్థానిక స్వపరిపాలన ; విద్య ; దాయ భాగము; దండనా సవములు; (క్రిమినలు లా; ) ధర్మస్మృతి; (సివిలు లా; ) పోలీసు; శాంతి సంరక్షణము; వివాహము; కంట్రాక్టుల ; భాగస్వాములు ; ఏజంట్లు; ఓటర్లు ; భార్యా భర్తల తండ్రి పిల్లలు యజమాని నౌకరుల సంబంధములు ; భీమా ; ఋణములు ; రాష్ట్రములోని పరిశ్రమలు; వర్తక వ్యాపారములు ; ఆస్థి పంపకము ; మొదలగు 'సమస్త విషచుములలోను శాసించుటకు రాష్ట్ర ప్రభుత్వములకే అధికారము గలదు. రాష్ట్రముల వ్యక్తిత్వము చెడకుండ రాష్ట్ర ప్రభుత్వములు జరుగుచు, రాష్ట్రములన్నియు కలిసి యేర్పాటు చేసుకున్న జాతీయ ప్రభుత్వమునకు సంయుక్త (Federal) ప్రభుత్వమని పేరు. ఇవియే అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వమునకును ఇతర జేశముల ప్రభుత్వములకును భేదము.


ఇంగ్లాండు, ఫ్రాన్సు, స్పైస్, ఇటలీ, జపాను మొదలగు చిన్న దేశ్లములో రాష్ట్రప్రభుత్వములే లేవు. శానససభలుగల రాష్ట్రములే లేవు. ఆదేశములన్నిటిలోను ఒకే ప్రభుత్వము గలదు. అది జాతీయ ప్రభుత్వము. కావున అదేశముల ప్రభుత్వలు, సంయుక్త ప్రభుత్వములుగావు. కనడా దేశములో రాష్ట్రముల కన్నిటికిని శాసనసభలు గలవు. పైన జాతీయప్రభుత్వము గలదు. దానికి రెండు శాసనసభలుగలవు, అయితే జాతీయప్రభుత్వమును రాష్ట్రప్రభుత్వమును ఒకే చట్ట ప్రకారముఏర్పడినవి గావున రాష్ట్ర ప్రభుత్వములకు నిర్దిష్టమైన యుధికారములును మిగిలిన సర్వాధికారమును జాతీయ ప్రభుత్వము నకును గలదు. రాష్ట్ర ప్రభుత్వములు జాతీయ భుశ్వమునకు సంపూర్ణముగ లోబడియున్నవి. కెనడా" కూడ సంయుక్త (Federal) ప్రభుత్వమని యే చెప్పవచ్చును. ఆస్ట్రేలియాకూడ కనడాను బోలిన సంయక ప్రభుత్వమే కలిగి యున్నది. ప్రస్తుతము ఆంగ్లేయ పాలనము కింద హిందూ దేశములో శాసనసభలుగల రాష్ట్ర ప్రభుత్వములును వీటి పైన రెండుశాసనసభలుగల జాతీయ ప్రభుత్వమును గలవు. ఇచట గూడ కనడా, ఆస్ట్రేలికూలవలే రాష్ట్రీయ ప్రభుత్వములకు. నిర్దిష్టమైన అధికారములును జూతీయ ప్రభుత్వమునకెక్కువ అధికారములు గలవు. కాని హిందూదేశములో జాతీయ ప్రభుత్వమునకు గూడ సంపూర్ణమగు అధికారములు లేవు. హిందూదేశ ముమీద సంపూర్ణ మగునట్టియు అనిర్దిష్ట మైనట్టియు అధికారములు లండను

లోని ఆంగ్లేయ పార్లమెంటు నకుమాత్రమే గలవు, , హిందూ దేశమునకు స్వరాజ్యము లేదు. ఆంగ్లేయ పార్లమెంటు యొక్క పరిపాలసకులోబడి, హైందవ జాతీయ ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వమును నిర్దిషమగు అధికారములను చలాయించు చున్నవి. హిందూదేశము స్వరాజ్యము పొందినతరువాత కనడా, ఆస్ట్రేలియాలలో వంటి సంయుక్తప్రభుత్వము నేర్పరచు కొనునో అమెరికా సంయుక్త రాష్ట్రములలోవంటి సంయుక్త ప్రభుత్వము నేర్పరచుకొనునో చెప్పుటకు వీలు లేదు.

కాంగ్రెసు.


అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము మూడుభాగములు గలది. మొదటిది. శాసనస్సభలు. దోనికి కాంగ్రెస్ అని పేరు శాసన సభలు రెండుగలవు. ఒకటి కజాప్రతినిధిసభ (House of Representatives,) రెండవది శిష్టసభ (Senate) ప్రజా ప్రతినిధి సభలో 43 మంది సభ్యులుగల . రెండు సంవత్సర ముల కొరసారి ఎన్నికలు జరుగును. దేశములోని రాష్ట్రము అన్నిటిలోను షుమారు రెండు లక్షల పదకొండు వేల జనులకొక ప్రతినిధి చొప్పున ఎన్నుకొనుటకు జిల్లాలుగా పంపిణీచేయబడినది. ప్రతినిధి ఇరువది ఐదు సంవత్సరములకు తక్కువ లేని వయసు గలవాడుగను, సంయుక్త రాష్ట్రములలో ఏడుసంవత్సరములు పౌరుడుగను, ఎన్నుకొనబడిన కాలమున ఎన్నకొస బడిన రాష్ట్రములో . కాపురస్తుడుగను, ఉండి తీరి వలెను. 'ఓట్ల ఎన్నిక హక్కులు రాష్ట్ర ప్రభుత్వములే నిర్ల యించును , అన్ని రాష్ట్రములలోను ఇరువది యొక్క సంవత్స రములు దాటిసపురుషులగు పౌరులకందరకును ఓట్లు (ఎన్ను కొను అధికారము) ఇవ్వబడినవి. కొన్ని రాష్ట్రములలో స్త్రీలకుకూడ ఎన్నిక ఆధికారము లివ్వబడినవి. చాల రాష్ట్ర ములలో పౌర స్వత్వములను కోరిన విదేశస్తులకును ఓటు చేయు అధికారమివ్వబడినది. ఓటర్లు కొన్ని రాష్ట్రములలో వ్రాయను చదవను నేర్పినవారుగనుండవలెను లేదా కొంత ఎక్కున ఆస్తి గలవారుగ నుండవలెను మరికొన్ని రాష్ట్రము లలో కొంతపన్ను చెల్లించువారుగనుండవలె. అన్ని రాష్ట్ర ములలోను ఓటుచేయు అధికారమును పొందకముందు కొంతకాల మారాష్ట్రములో కాపురముండి తీరవలెనని శాసించబడెను, గాని ఎంత కాలము కావుర ముండవలెనను విషయమున కొన్ని రాష్ట్రలలో మూడు నెలలు మొదలు మరికొన్ని రాష్ట్ర ములలో రెండున్నర సంవత్సరములవరకు వివిధ రాష్ట్రములలో వేరు వేరుధముల నిర్నయించబడినది.


శిష్టసభకు ఆరుసంవత్సరముల కొకసారి ఎన్నికలు జరుగును, గానీ ప్రజాప్రతినిధి సభవలె అందరిసభ్యుల ఎన్నికలు ఒక్కసారిజరగవు. శిష్టసభ లోని మూడవవంతు సభ్యులు ప్రతి రెండు సంవత్సరములకును ఎన్నుకొనబడుదురు. ఈసభలో రాష్ట్రమున ఇద్దరు సభ్యుల చొప్పున రాష్ట్ర శాసన సభలచే ఎన్నుకొనబడిన ప్రతినిధులుందురు, సభ్యుడు ముప్పదిసంవ త్సరములకు తక్కువగాని వయస్సుగలవాడుగను తొమ్మిదివంవ త్సరములు సంయుక్త రాష్ట్రముల పౌరుడుగను ఎన్నుకొనబడిన రాష్ట్రములో కాపుర మున్న వాడుగను ఉండి తీరవలెను. ఇందు వలన ప్రజాప్రతినిధి సభ దేశములోని యావన్మంది ప్రజల యొక్క ప్రానిధ్యమును వహించుచు నమ్మిష్ఠి జూతీయ భావమును

పోషించుచున్నది. శిష్టసభ రాష్ట్రముల ప్రాతినిధ్యము: నువహించుచు రాష్ట్రముల వ్యషభావవమును సంరక్షించుచున్నది. ఈ రెండుసభల సభ్యులకును జీతములిచ్చెదరు. ప్రతిశాసనమును రెండుసభలవలనను అంగీకరించబడవలెను. తరువాత అద్యక్షునివంతకముకై పోవును. ఆయన సంతరము చేయగానే చట్టమగును. ఆయన సంతకముచేయగ వుసర్విముకై శాపసము ప్రవేళ పెట్టబడిన శాసనసభకు పవచ్చును. వారు పున ర్విమర్శ చేసి మూడింట రెండువంతుల మంది. తిరిగి దానిని అంగీకరించినచో గానియంతట అందే చట్టమగును. మరియు అధ్యక్షుడు పదిదినములలో సంతక యైన చేయవలెను లేదావునర్వివిచుగ కై సబంపవలెను. లేనిచో దానంతెటఅదే చట్టమగును ఆర్టికవిషయమగు శాసనములు ముందుగా ప్రజాప్రతనిఖసభ లోనే ప్రవృశపెట్టి తీరవలెను. తక్కినవి ఏసభలో నైనను ప్రవేశ పెట్టబడవచ్చును. రెండు శాసనసభలకును ఏశాసనమువిషయములో నైన భేదాభిప్రాయము కలిగినపుడు చెరియొక యువ సంఘమును నియమించి యూ యుప సంఘములు కలిసి నిర్ణయించి నటుల రెండు శాసవసభలును అంగీకరించును. శిష్టసభకు సంయుక్త రాష్ట్రముల ఉపాధ్యక్షులు అధ్యక్ష వహించును. ప్రజా ప్రతినిధి సభకు వారి చేనెన్ను కొనబడినస్సీకరు (Speaker) ; అను ఆయన అధ్యక్షత వహించును. ఉప్యోగస్తులేవరును శాశను సభలోనూ సభ్యులుగా నుండకూడదు. సభ్యులు శానన సభ లలో నేమిమాట్లాడినను ఏనేరము కిందను శివిలు, క్రిమినలు న్యాయస్థానములలో విచారించబడకూడదు. ఏసభ్యడైనైనను శాసనసభ వారు మూడింట రెండు వంతులమంది అంగీకారముతో సభ్యత్వమునుండి తొలగించవచ్చును.

అధ్యక్షుడు.


సంయుక్త ప్రభుత్వములో రెండవ భాగము అధ్యక్షుడు.యాపత్తు ప్రభుత్వ నిర్వహణ భారమును ఈయసమిదనుండును. ఈయనయును ఉపాధ్యక్షుడును నాలుగు సంవత్సరముల కొక సారి ఎన్నుకొస బడుదురు. ఇందునిమిత్తము ప్రతి రాష్ట్రమ లోని ప్రజలు కొంతమంది ఓటర్లను (ఎన్నుకొను అధికారముగలవారిని) ఎన్నికొనెదరు. ఆఓటర్లు సంయుక్త రాష్ట్రముల ఆధ్యక్షుని ఉపాధ్యతుని ఎన్నుకొనెదరు. ఏరాష్ట్రము కైనను శిష్టసభ లోసు ప్రజా ప్రతినిధిపభ లోను కలిసి ఎంతమంది సభ్యులు గలరో అంతమంది ఓటర్లు ( electors ) ఆ రాష్ట్ర ప్రజలెన్ను కొనవలెను. శాసనసభ్యులుగాని ఉద్యోగస్తులుగాని ఓటర్లు (electors) గా ఎన్నుకొనబడగూడదు. పాత అధ్యక్షుని శాలపరిమితి యొక్క ఆఖరు నవంబకులోని మొదటి మంగళ వారము నాడు ఎలెక్టర్లు (ఓటర్లు) ఎన్నుకొనబడెదరు. అధ్యక్ష వరవికిగాని ఉపాధ్యక్ష పదవికి గాని అభ్యర్థి గానుండువాడు సంయుక్త రాష్ట్రములలో జనని మొందిన పౌరుడుగనుండవలెను.. విదేశస్తుడై సంయుక్త రాష్ట్రముల పౌరస్వత్వములను పొందిన వాడు ఏయుద్యోగమునకైన అర్హ డేగాని అధ్యక్షుడు గాని ఉపాధ్యక్షుడుగాని కానేరడు. అధ్యక్షుడును ఉపాధ్యక్షుడును ముప్పది అయిదు సంవత్సరములు తక్కువగాని వయసుగల వారుగను సంయుక్త రాష్ట్రము లలో పదునాలుగు సంవత్సర ములకు తక్కువగాని కాలము కావుర మున్న వారుగసు ఉండ వలెను. ఉపాధ్యక్షునకు నెఱకు నాలుగు వేల రూప్యములు జీతమిచ్చెదరు. అధ్యక్ష పదవి ఖాళీ అయి;చో ఉపాధ్యక్షుడు


'ఆపదవి వహించును. అధ్వడుకును ఉపాధ్యక్షుడును ఇద్దరును లేనప్పుడు మంత్రులలో నుంచి యొకరిని అధ్యక్షుని హోదాను చలాయించుటకు శిషసభవా రెన్ను కొనెదరు.


సంయుక్త రాష్ట్రముల సేనలకును నౌకొదళమునకును అధ్యక్షుడే సర్వసేనాధిపతియై యున్నాడు. ఈయన శిష్టసభ వారి సలహాతో మంత్రులను న్యాయాధిపతులను ఏదేశ రాయ బారులను పెద్దయుద్యోగస్తులను నియమించును. చిన్న యుద్యోగస్తులను శిష్టసభవారి సలహా లేకుండనే నియమించే వచ్చును. మంత్రులు అధ్యక్షునకు జవాబు దారులుగాని శాసన సభలకు జవాబుదారులుగారు. శాసనసభలలో మంత్రులు సభ్యులుగారు. మంత్రులు తొమ్మిదిమంది విదేశ వ్యవహారముల మంత్రి, ఆర్థికమంత్రి, యుద్దమంత్రి, నాకాదళమంత్రి, అంతర్వ్యవహార మంత్రి, న్యాయశాఖమంత్రి, పోస్టు(ట్రపా), మంత్రి, వ్యవసాయమంమంత్రి.వర్తకఫుమంత్రి, అనువారు. అన్ని చట్ట ములను క్రమముగా అమలుజరుపు విధి అధ్యక్షునియందున్నది. ఏదేశముతో నైనను అధ్యక్షుడు సంధి చేసుకొనిన యెడల దానిని శిష్టసభలోని మూడింట రెండువంతులమంది అంగీకరించ వలసియుండును.. శాసనసభలలో తాము పెట్టిన ముఖ్యమగు చట్టములోడిపోయినను సాధారణ విశ్వాన రాహిత్య తీర్మానమువలనను అధ్యడును ఉపాధ్యక్షుడు మంత్రి వర్గము రాజీనామా నివ్వనక్కర లేదు. ఎందువల్లననగా వీరి నెవరిని శాసనసభలు ఎన్నుకొన లేదు. వీరెవరును శాసనసభ లలో సభ్యులుగారు. అధ్యక్షుడు ఉపాధ్యక్షుడుగానీ ముంత్రులు మొదలగు పెద్ద యుద్యోగస్తులుగాని దేశద్రోహము, లంచము

పుచ్చుకొనుట, మొదలగుగొప్ప నేరములు చేసినపుడు మాత్రము ప్రజాప్రతినిధిసభవారు తీర్మానము చేసి శిష్టసభ యెదుట ప్రధానేరముమోపెదరు. శిష్టసభవారు సంయుక్త రాష్ట్రముల నన్యాయాధిపతి యొక్క అధ్యక్షతక్రింద విచారణసలిపి మూడింట రెండువంతులమంది యొక్క సమ్మతులందుకు వచ్చినచో నేరస్తులగునారిని యద్యోగములనుండి తీసి వేయుదురు. ఎన్నటికిని అట్లయుద్యోగములు - చేయకూడదని శాసించు పచ్చును. మరియు న్యాయస్థానములలో నేరారోళణ చేసి శిక్షింపజేయవచ్చును. అమోకా సంయుక్త రాష్ట్రముల ప్రభుత్వము కింద వాషింగ్ట సుపట్టణము మాత్రము గలదు. తక్కిన యావత్తు ప్రదేశమును ఏవో రాష్ట్రము క్రింద నుండును. వాషింగను పట్టణము మీదను సంయుక్త ప్రభుత్వమునకు చెందిన ఆయుధాగారములు నౌకానిర్మాణ శాలలు మొదలగు ప్రదేశ ములమీదను సర్వాధికారము సంయుక్త ప్రభుత్వమున కేగలదు. వాషింగ్టను పట్టణములోని (White House) స్వేతమందిరము అను గొప్ప నగరునందు అధ్యక్షుకు నివసించును. సంయుక్త రాష్ట్రముల గౌరవమునకు మర్యాదలకు చిహ్న మైనవాడు అధ్యక్షుడు. ఆయనకు నెలకు ఇరువది అయిదు వేల రూప్యములు జీతము నిచ్చెదరు. ఇంకను ఖర్చులన్నియు ప్రభుత్వ బొక్క సమునుండి భరించెదరు. ఏదేశ రాజులను మంత్రులను ఆధ్యక్షుడు తనమందిరమున గొప్పదర్జాగా ఆదరించును. న్యాయస్థానములలో శిక్షింపబడిన నేరస్తులకు క్షమాపణనిచ్చుటకు అధ్యక్షునికే అధికారముగలదు.

న్యాయ విచారణ
శాఖ.


సంయుక్త రాష్ట్రముల జాతీయ ప్రభుత్వములో మూడవ భాగము న్యాయస్థానములు , పౌరుల స్వతంతములను కాపాడుటకును శాసనములను ధర్మబుద్దితో పోలించుటకును ఏర్పడినవి న్యాయస్థానములు. న్యాయస్థానములలోని న్యాయాధి పతులు న్యాయమూర్తులుగను ధర్మస్వరూపులు గను ఉండ వలెను. లేనిచో ప్రభుత్వము అధర్మ ప్రభుత్వముగ నుండును. గావున స్వతంత్ర దేశములలో న్యాయస్థానములు కార్యనిర్వాహణ శాఖక ( Executive ) లోబడకుండ స్వతంత్రముగ మండునట్లు ఏర్పాటుచేసికొని యున్నారు. అట్టి ఏర్పాటే సంయుక్త రాష్ట్రములలోను గలదు. న్యాయస్థానములును అందలి న్యాయాధిపతులును శాసనసభలకు(కాంగ్రెసు) గాని అధ్యక్షుడు, మంత్రులు, వారి క్రింది యుద్యోగస్తులు మొదలగువారికి గాని లోబడియుండక స్వతంతముగ నున్నారు. సంయుక్త రాష్ట్రములలో ఉన్నత న్యాయస్థానమునకు ( Supreme Court ) సుప్రీం కోర్టు అని పేరు దానికి లోబడి సమస్త శివిలు క్రిమినలు కోర్టులు న్యాయస్థానములు) సుఉన్నవి. సుప్రీంకోర్టు (ఉన్నత న్యాయస్థానము) లో నొక ప్రధానన్యాయధిపతియు ఎనిమిది మంది సహాయన్యాయపతులును గలరు. ఒకసారి ఏర్పడిన తరువాతి న్యాయాధిపతులను కేవలము 'చెడు ప్రవర్తన రుజువైన తప్ప తీసి వేయుటకు వీలు లేదు. డెబ్బది సవత్సత్సరముల వయస్సు వచ్చువరకుసు పనిచేయవచ్చును. అటు పైన ఫింఛన్ (ఉపకార వేతనము )నిచ్చెదరు. రెవిన్యూ పోలీసు మొదలగు ఇతర పనులు చేయు ఉద్యోగస్తులెవరికిని

క్రిమిసలు శివిలు కేసులను విచారణ చేయు అధికారము లేదు. సంయుక్త ప్రభుత్వము వారు చేయు చట్టము పైనను రాజ్యంగ విధానమునకు వృతిరేకమగా చేయబడినవని ఏపౌరుడైనను సుప్రీం కోర్టులో (ఉన్నత న్యాయస్థానములో) దావా తెచ్చినచో ఆన్యాయ స్థానము వారు ప్రభుత్వము వారికి తెలియ జేసి ఉభయపక్షములను విచారించి తీర్పు చెప్పదగు చట్టము రాజ్యంగ విధానమునకు వ్యతిరేకముగ చేయబడినట్లు తీర్మానించినచో సది రద్దగును. ప్రభుత్వపు ఉద్యోగస్తులు చేయు చర్యలన్నియు కోర్టులో దావాలమూలకముగ ఆక్షేపించి అక్రమమయినవాటిని రద్దుపర్పించు కొనుటకు అమెరికాలోని పౌరులకు హక్కుగలదు.

<poem>హిందూదేశమున న్యాయవిచారణ శాఖ.<poem>


హిందూదేశమున ఆంగ్లేయ పాలనము కింద ముఖ్యముగా క్రిమినలు న్యాయస్థానములు స్వతంత్రముగ లేవు. జిల్లాలలోని క్రిమినలు న్యాయాధిపతులందరసు జిల్లా కలెక్టరుకు లోబడి యున్నారు. జిల్లా కలెక్టరు కార్య నిర్వాహక శాఖకు చెందిన యుద్యోగ పరంపరలో సతి ముఖ్యమగు స్థానమును వహించియున్నాడు. జిల్లాకలెక్టరుకు జిల్లా మేజ స్ట్రీటుగానున్నారు. జిల్లాలోని రివిన్యూ, అదాయపు పన్ను, ఉప్పుపన్ను, అబకారి, అడవి, పోలీసు, నీటి పారుదల ఇందలగు ప్రభుత్వ ముయొక్క అదాయమునకును ప్రతిష్టకును సంబంధించిన సమస్త శాఖలకును యజమానిగ నున్నాడు. జిల్లాకు మేజిస్ట్రేటుక్రింద క్రిమినలు న్యాయవిచారణను చేయు సబుకలెక్టరులు, డిప్యూటి కలెక్టరులు , తహస్సీలు దారులు, శిరస్తా M

దారులు కేవలము జిల్లాకలెక్షరుతో పాటు రెవిన్యూ ఉద్యోగస్తులు ప్రతి విషయములోను ఆయా ప్రదేశములలో జిల్లా కలెక్టరుకు లోబడి ప్రభుత్వము యొక్క ప్రతిష్ఠను ఆదాయమును కాపాడ వలసిన వారై యున్నారు. వీరి యుద్యోగములు జీతముల అభివృద్ది కేవలము జిల్లాకలెక్టరు యొక్క అనుగ్రహము మీద ఆధారపడియుండును. "ఇదిగాక జిల్లాలలోగల స్టేషనరీ సబు మేజిస్ట్రీలులు (ప్రత్యేక క్రిమినలు న్యాయాధిపతులు, కూడ చిన్న రవిన్యూ ఉద్యోగముల నుండి జిల్లాక లెక్టరులచే : నియమించ బడి పై యుద్యోగములకును పెద్దజీతములకును జిల్లాకలెక్టరుల ఆగ్రహా నుగ్రహములమీద ఆధారపడియున్నారు. కావున జిల్లాలలోని మిసలు న్యాయస్థానములలో రాజకీయ నేరములలోను పోలీసు, సాస్ట, ఆబుకారి, ఫారెస్టు, మొదలగు ప్రభుత్వపు కేసులలోను నిష్పక్షపాతమగు న్యాయము కలుగునని పౌరులకు విశ్వాసముండదు. ముఖ్యముగా రాజకీయ నేరములలో కలెక్టరుల యభిప్రాయాను సారముగ క్రింది మేజస్ట్రీటులు శిక్షలు విధించుట అనేక చోటుల జగుగుచున్నది. కార్య నిర్వాహ్నశాఖయు క్రిమినలు న్యాయవిచారణా శాఖయు విడదీయుటయు క్రిమినలు న్యాయాధిపతులందరను హైకోర్టు క్రింద సుంచుటయ చాల అవసరమని హైందవ రాజకీయ వేత్తలు ఆందోళనము చేయుచున్నప్పటికిని ఆంగ్లేయ అధి కారవర్గమువారు ఈమార్పుచేయుటకు ఇంతవరకును సమ్మతించుటలేదు. నైజాం రాష్ట్రములో ఘసతవహించిన నైబాంగారు కార్యర్వా హకశాఖను న్యాయవిచార శాఖను పూర్తిగా విడదీసినారు. రివిన్యూ ఉక్యోగస్తులెవరికిని సివిలు, క్రిమినలు అధి కారములు

లేకుండ చేసినారు. సివిలు న్యాయాధిపతులకే క్రిమినలు న్యాయమునుకూడ చేయు అధి కారముల నిచ్చి అందరు న్యాయాధిపతులను హైరోర్టుకు లోబడునట్లు చేసినారు. ఇది మిగుల సమంజసముగానున్నది.

రాష్ట్రములోని
ప్రభుత్వములు.


సంయుక్త రాష్ట్రములలోని రాష్ట్రముల ప్రభుత్వము లన్నియు ఒకే పద్దతిగ లేవు. గాని ప్రతి రాష్ట్రంలోను రెండు శాసనసభలు గలవు.చాలవరకు ప్రజా ప్రతినిధి సభయనియు శిష్ట నభయనియు వాటి పేర్లు కొన్ని రాష్ట్రములలో వాటికి వేరు పేర్లు గలవు. ప్రజా ప్రతినిధి సభకు రెండేండ్ల కొకసారియు శిస్టసభకు నాలుగు సంవత్సరముల కొకసారియు యెన్నికలు జరుగును. రెండు సభలకును సభ్యులను యెన్నుకొను అర్హత గల ప్రజలే యెన్నకొదరు. ప్రతి రాష్ట్రమునకు కార్య నిర్వాహణము చేయుటకు గవర్నరు నలుగురు మంత్రులు గలరు. కొన్ని రాష్ట్రములలో నింక నెక్కువమంది మంత్రులు గలరు. వీరివందరిని ప్రజలే యెన్నుకొనెదరు. చాల రాష్ట్రములలో రెండు సంవత్సరముల కొకసారి వీరి యెన్నికలు జరుగును. కొన్ని రాష్ట్రములలో నాలుగు సంవత్సర ముల కొకసారియు కొన్నిటిలో మూడు సంవత్సరముల కొక సారియు యెన్నికలు జరుగును. చాలరాష్ట్రములలో న్యాయాధిపతులు కూడ ప్రజలచే యెన్నుకొన బడుదురు. తక్కిన రాష్ట్రములలో గవర్నరులు శిష్టసభ వారి సమ్మతితో న్యాయాధిపతంలను నియమింతురు. స్వల్ప సంఖ్యగల రాష్ట్రలలో మాత్రము శాసవనభలు న్యాయాధిపతులను నియమిం


చును. దాదాపుగా అన్ని రాష్ట్రములలోను శాసనసభలు న్యాయాధిపతులను ఉద్యోగము లోనుండి తీసి వేయవచ్చును. కొన్ని రాష్ట్రములలో న్యాయాధిపతులు రెండు సంవత్సర ముల కాలము వరకును కొన్ని రాష్ట్రములలో ఇంక నెక్కువ కాలము వరకును తక్కి నవానిలో న్యాయాధిపతులు సత్ప్రవర్తన గలిగి, పనిచేయు సంతకాలము వరకును యెస్నుకొన బడుచున్నారు. ప్రతి రాష్ట్రములోను సుప్రీంకోర్టు (ఉన్నత న్యాయస్థానము) సు దాని కింద శివిలు క్రిమినలు చట్టములు, ప్రకారము విచారణచేయు అన్ని కోర్టులును గలవు. కక్షి దారు ఏ ప్రత్యేక రాష్ట్రమునకు చెందనివాడై యున్నప్పుడును దావాలో సంయుక్త ప్రభుత్వ శాసన విషయములకు - సంబంధమున్న ప్పుడును మాత్రము రాష్ట్రీయ యున్నత న్యాయస్థానము నుండి సంయుక్త యున్నత న్యాయ స్థానమునకు అప్పీలు (విమర్శనాధికారము) గలను. తక్కిన అన్ని విషయములలోను రాష్ట్రీయ యున్నత న్యాయస్థానపు తీర్పు ఆఖరు తీర్పు అగును. అందు పైన విమర్శించు అధికార మెవరికిని లేదు.


స్థానిక
స్వపరిపాలనము.


అమెరికాలో స్టోనిక స్వపరిపాలనము ప్రధానమైనది. స్థానిక సంఘములకు చాల అధికారములు గలవు. ముఖ్యముగా పోలీసు, పారిశుధ్యము బీదల సంరక్షణ, పాఠశాలలు, రోడ్లు, వంతేలు, వర్తక వ్యాపారములకు లైసెన్సు (అనుమతి) నిచ్చుట, స్థానిక పన్నులు విధించుట, వసూలు చేయుట, సామాన్య క్రిమినలు నేరములను, సివిలు దావాలను విచారించుట, జైళ్ల పరిపాలన, గ్రంధాలయములు, మొదలగు ప్రజల సౌఖ్యము, శాంతి, సుపరి పాలసములకు సంబంధించిన విషయము అన్నిటి లోను అధికారములు గలిగియున్నవి. పెద్ద పట్టణములలో మ్యునిసిపాలిటీలును (బరోలు), జిల్లాలకు జిల్లా బోర్డులును, (కౌంటీలు) గ్రామములలో (బౌనుషిపులు) యూనియనులు లేక గ్రామ పంచాయితీలు గలవు. ప్రతి గ్రామములోను (టౌనుషిపు) గ్రామ పంచాయితీ గలదు. వోటర్లందరును ప్రతి సంవత్సరము ఒకచోట చేరి పంచాయితీ దార్లను యితర యుద్యోగస్తులను ఎన్నుకొనెదరు. గ్రామముల పరిమితినిబట్టి ముగ్గురు మొదలు తొమ్మిది వరకు పంచాయితీదార్లెన్నుకొన బడుదురు. పంచాయితీదార్లతో పాటు (టౌను క్లర్కు) ఆసు రికార్డులను దాచు వుద్యోగస్తుడు, కోశాధిపతి, పన్నులు వేయు ఆస్పెసర్లు, పన్నులు వసూలు చేయు అధికారి, పాఠశాల తనిఖీ దార్లు, పోలీసు ఉద్యోగస్తులు, గ్రంథాలయ పాలకులు, బీదల విచారణాధికారి, రాజమార్గముల యుద్యోగి, మొదలగు ఉద్యోగస్తు లందరిని ఎన్నుకొనెదరు. ఓటర్ల సభలు సంవత్సరములో రెండుమూడు సారులు జరుగును. ఆ సభలలో సుద్యో గస్తులు తాముచేయు పనినిగూర్చి ప్రశ్నించబడి జవాబులు చెప్పవలసి యుందురు. జిల్లా బోర్డు క్రింద గ్రామ పంచా యితీ లండును. జిల్లా పోలీసు, జయిళ్ళు, జిల్లా యొక్క క్రిమినలు సివిలు. న్యాయస్థానములు, తీర్పులను అనులు జరుపు షెరిఫులు, రోడ్లు పారిశుద్ధ్యము, విద్య, మొదలగు వివిధవిషయములు జిల్లా బోర్డుల కింద నుండును. న్యాయాధిపతులు, షేరి వులు, పోలీసు వుద్యోగస్తులు, మొదలగు పెద్ద యుద్యోగస్తు


. లందరును ప్రజలచే నెన్నకొన బడుదురు. అన్ని విషయములను తనిఖీ చేయుటకు ప్రజలచే కెన్న కొవబడు బోర్డు గలదు. మ్యునిసిపాలిటీల క్రిందకూడ పోలీసు, జైలు, న్యాయస్థానంములు గలవు. ప్రధానోద్యోగస్తు లందరును ప్రజలచే ఎన్న కొన బడుచున్నారు. మ్యూనిసిపాలిటీకి సంబధించిన విషయము లన్నింటిలోను మ్యునిసిపలు సభ్యుల సంఘము శాసనసభను బోలియున్నది. మ్యనిసిపలు చైరుమను (మేయరు ) కార్య నిర్వహణ భారమును వహించి యున్నాడు.


అమెరికాలో సంపూర్ణమగు మత స్వేచ్చ గలదు. అధ్యక్షుడు మొదలు 'యే యుద్యోగస్తుడును ఏ మతమునకు చెందినను చెందవచ్చును. అమెరికా ప్రభుత్వ బొక్కసము నుండి యే మత పోషణకొరకును సొమ్ము ఖర్చు పెట్టరు. సంయుక్త రాష్ట్రముల రాజ్యాంగ విధానము ప్రకారము నడుచు కొందమని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, న్యాయాధిపతులు, మంత్రులు, మొదలగు గొప్ప యుద్యోగస్తులును శాసనసభ్యులను ప్రమాణము చేసెదరు. విదేశస్తు డెవడైన సంయుక్త రాష్ట్రముల పౌరుడు కావలెనని కోరినచో సంయుక్త రాష్ట్ర ములలో అయిదేండ్లయినను కాపురమున్నట్లును యే రాష్ట్రములో తాను దరఖాస్తు చేయుచున్నాడో అచట నొక సంవ త్సరమైన కావురమున్నట్లును మంచి ప్రవర్తన గలవాడై నట్లును ఒక రాష్ట్రములోని న్యాయస్థానములో దరఖాస్తుచేసి పౌరుస్వత్వములను పొందపలెను. అదివరకు ప్రభుబిరుద మున్నచో దానిని విసర్జించవలెను. -