అభినయదర్పణము/ద్వితీయాశ్వాసము
అభినయదర్పణము
ద్వితీయాశ్వాసము
అసంయుతలక్షణము
క. | శ్రీ రమణీమణివల్లభ | 1 |
వ. | అవధరింపుము. | |
క. | పరఁగ నసంయుతహస్తము | 2 |
వ. | ఇఁకఁ, బతాకంబును, ద్రిపతాకంబును, నర్థపతాకంబును, గర్తరీముఖంబును, మయూరార్థచంద్రంబులును, నరాళంబును, శుకతుండంబును, ముష్టియు, శిఖరంబును, గపిత్థకటకాముఖంబులును, సూచీచంద్రకళాహస్తంబులును, గోశహస్తంబును, సర్పశీర్షమృగశీర్షంబులును, సింహముఖంబును, లాంగూల సోలపద్మంబులును, జతురహస్తంబును, భ్రమరహస్తంబును, హంసాస్య హంసపక్షంబులును, సందంశంబును, ముకుళంబును, దామ్రచూడ త్రిశూలంబులును నను నీయష్టవింశతియు నసంయుతాఖ్యహస్తంబు లనం బరఁగుచుండు, నంత, | 3 |
పతాకహస్తలక్షణము
గీ. | గరిమ నంగుష్టంబును వంచి కడమ వ్రేళ్ళు | 4 |
పతాకహస్తవినియోగము
వ. | మఱియు నాట్యారంభమందు, మేఘమందు, వలదనుటయందు, నిశియందు, వాయుస్పర్శంబులయందు, ఖడ్గములయందు, నమరబృందములఁ జూపుటయందుఁ, దరంగంబులయందు, ఖడ్గములయందుఁ, దాపములయందు, ధారణియందు, నాశీర్వాదములయందుఁ, దాననుటయందు, నక్కడక్కడననుటయందు, శపథంబునందు, శయనంబునందుఁ, [1]దాళపత్రములయందుఁ, [2]బ్రతాపమునందు, ఫలద్రవ్యాదిస్పర్శంబులయందు, నశ్వమందు, ఖండించుటయందు, నంబుధియందు, దొడ్డవార లనుటయందు, దొరలయందు, దినమాసవర్షసూచనలయందుఁ, గవాటంబులు మూసి తెఱచుటయందుఁ, బొమ్మనుటయందు, శ్లాఘించుటయందు, నంగాదిస్పర్శంబులయందు, సమమనుటయందు, సప్తవిభక్తులతెఱఁగుం జూపుటయందుఁ, బ్రసాదంబు గైకొనుటయందుఁ, గరతాడనంబులయందుఁ, బీఠంబులయందు, మానినీమణులకుచస్థలిం బట్టుటయందుఁ, బతాకహస్తంబు వర్తించుచుండు, నంత | 5 |
త్రిపతాకహస్తలక్షణము
క. | మఱియును సపతాకంబుగ | 6 |
త్రిపతాకహస్తవినియోగము
సీ. | వెలయుచుండుఁ గిరీటవృక్షంబులకు మఱి | |
| బరమేశ్వరునకును బద్మనాభునకును | |
గీ. | వేడ్క రతికేళి మఱి కూడి వీడుటకును | 7 |
అర్థపతాకహస్తలక్షణము
గీ. | ఎనయఁ ద్రిపతాకహస్తమందునఁ గనిష్ఠ | 8 |
అర్థపతాకహస్తవినియోగము
గీ. | చిగురుకును [3]ఛురికకు ధ్వజశృంగములకు | 9 |
కర్తరీముఖలక్షణము
గీ. | అరయ నర్థపతాకంబునందు మిగులఁ | 10 |
కర్తరీముఖహస్తవినియోగము
చ. | మరణము భేదమున్ మెఱపు మాటికినిం గడకంటి దృష్టియున్ | 11 |
మయూరహస్తలక్షణము
గీ. | మెఱయ నంగుష్ఠమున ననామికను గూర్చి | 12 |
మయూరహస్తవినియోగము
చ. | నెమలిని దీఁగె లల్లుటను నిక్కముగా శకునంబుఁజూడనున్ | 13 |
అర్థచంద్రహస్తలక్షణము
క. | ఇరువుగ సపతాకంబును | 14 |
అర్థచంద్రహస్తవినియోగము
సీ. | సారెకుఁ గృష్ణపక్షాష్టమిశశిఁ జూపఁ | |
గీ. | జేరి యభిషేకమును వేడ్కఁజేయుటకును | 15 |
అరాళహస్తలక్షణము
గీ. | అనువుగాఁ జూడను పతాకహస్తమునను | 16 |
అరాళహస్తవినియోగము
క. | ఇరవుగ నాచమనీయము | 17 |
శుకతుండహస్తలక్షణము
గీ. | అరసి చూచిన మురహరీ! మఱి యరాళ | 18 |
శుకతుండహస్తవినియోగము
గీ. | పరఁగు కుంతాయుధమునకు బాణమునకు | 19 |
ముష్టిహస్తలక్షణము
గీ. | పరఁగ వ్రేళ్ళన్ని మఱి గూర్చిపట్టియున్న | 20 |
ముష్టిహస్తవినియోగము
చ. | స్థిరముగ జుట్టు పట్టుకొని జెట్లదె యుద్ధముచేయ నందునున్ | 21 |
శిఖరహస్తలక్షణము
గీ. | ముష్టిహస్తాన నంగుష్ఠ మూర్ధ్వముగను | 22 |
శిఖరహస్తవినియోగము
సీ. | వెడ విల్తునికి మఱి విలువట్టుటకును నా | |
గీ. | బరఁగ శ్రేష్ఠంబు ననుటకు భయమునకును | 23 |
కపిత్థహస్తలక్షణము
చ. | తగవుగ ముష్టిహస్తమునఁ దర్జనివ్రేలిని నెత్తి వంచియు | 24 |
కపిత్థహస్తవినియోగము
చ. | ఇరవుగ లక్ష్మివాణులకు నింపుగఁ దాళము వట్టునందుకుం | 25 |
కటకాముఖహస్తలక్షణము
ఉ. | చేరిన ముష్టిహస్తమునఁ జెన్నుగ మధ్యపు వ్రేలిక్రిందుగాఁ | 26 |
కటకాముఖహస్తవినియోగము
చ. | నిరతము వజ్రముష్టికిని నేర్పున బాణము నేయ నంగడాల్ | 27 |
సూచిహస్తలక్షణము
గీ. | సరగఁ దర్జనివ్రేలిని జాఁచిపట్టి | 28 |
సూచిహస్తవినియోగము
సీ. | పరఁగనొక్కటి పరబ్రహ్మంబుననుటకుఁ | |
| కానికానీ యని మేను సూపుటకును | |
గీ. | గట్టివా డనుమెచ్చుకు గరిమ మీఱ | 29 |
చంద్రకళాహస్తలక్షణము: వినియోగము
గీ. | మొనసి తర్జనికాంగుష్ఠములను జాఁప | 30 |
కోశహస్తలక్షణము
గీ. | వెలయ విరళంబుగా నైదువ్రేళ్ళు సాఁచి | 31 |
కోశహస్తవినియోగము
చ. | అనిశము పుట్టకుం బరఁగు నంతటఁ జెట్లకు స్వల్పభోజనం | 32 |
సర్పశీర్షహస్తలక్షణము
గీ. | అరయఁదొలుద తటి సపతాకహస్తమునకుఁ | 33 |
సర్పశీర్షహస్తవినియోగము
సీ. | [4]చందనంబునకును సర్పంబునకు మఱి | |
గీ. | సర్పశీర్షంబు హస్తంబు సరవిగాను | 34 |
మృగశీర్షహస్తలక్షణము
గీ. | అరయఁగా సప్తశీర్షంపు హస్తమందుఁ | 35 |
మృగశీర్షహస్తవినియోగము
సీ. | పడతులు చెక్కిళ్ళఁ బసుపు పూయుటకును | |
గీ. | బరఁగఁ బదములు ప్రియమునఁ బట్టుటకును | |
సింహముఖహస్తలక్షణము
గీ. | మఱి యనామిక యంగుష్ఠమధ్యమములుఁ | |
సింహముఖహస్తవినియోగము
గీ. | ఆజ్యహోమంబునకుఁ బిల్లియస్థులకును | |
లాంగూలహస్తలక్షణము
క. | మఱి పద్మకోశమందున | |
లాంగూలహస్తవినియోగము
సీ. | చేమంతిపూలకుఁ జెలఁగిన యలనిమ్మ | |
| జొన్నకాయలకును బొడ్డుమల్లెలకును | |
గీ. | మెఱయు మఱి యిన్నితావుల గరిమ మీఱి | 40 |
[6]పద్మకోశహస్తలక్షణము
. | వెలయ మఱి యైదు వ్రేళ్ళును విరళములుగఁ | 41 |
పద్మకోశహస్తవినియోగము
సీ. | చక్రవాకములకుఁ జాతకంబులకును | |
గీ. | జెలఁగఁ [7]గలగలశబ్దంబుఁ దెలుపుటకును | 42 |
చతురహస్తలక్షణము
ఉ. | సారెఁ గనిష్ఠకాంగుళిని జాఁచియుఁ దక్కిన మూడువ్రేళ్ళనుం | 43 |
చతురహస్తవినియోగము
సీ. | అనువుగాఁ గస్తురి యనుటకుఁ జెలువొందు | |
గీ. | కాంతనడలకు మఱి హంసగమనములకుఁ | 44 |
భ్రమరహస్తలక్షణము
గీ. | పొనర నంగుష్ఠమధ్యమములను గూర్చి | 45 |
భ్రమరహస్తవినియోగము
గీ. | పరఁగ నిలలోనఁ జెన్నొందు భ్రమరమునకు | 46 |
[8]హంసహస్తలక్షణము
గీ. | కొమరు మీఱఁ దర్జనిక యంగుష్ఠ మమరఁ | 47 |
హంసహస్తవినియోగము
చ. | చెలువుగఁ బూలు గోయఁగను జిత్రము వ్రాయఁగఁ బొట్టువెట్టఁగా | 48 |
హంసపక్షహస్తలక్షణము
గీ. | చెలువు మీఱఁగ మఱి సర్పశీర్షమందు | 49 |
హంసపక్షహస్తవినియోగము
చ. | చెలువుగ నేటికట్టకును జెన్నుగ వారధి గోడఁజూపనుం | 50 |
సందంశహస్తలక్షణము
గీ. | ఎలమిఁ దర్జనిమధ్యమములను జేర్చి | 51 |
సందంశహస్తవినియోగము
సీ. | చేరి ముత్యములకు వారిబిందువులకుఁ | |
గీ. | నొనరఁ జెలియలు మడుపుల నొసఁగుటకును | 52 |
ముకుళహస్తలక్షణము
గీ. | ఒనరఁగా నైదుఁవ్రేళ్ళను నొకటిగాను | 53 |
ముకుళహస్తవినియోగము
సీ. | పరఁగ దానములకుఁ బ్రాణంబు లనుటకు | |
| దామర మొగ్గకుఁదగవుగా [11]నై దన | |
గీ. | బ్రేమ మీఱఁగ ముద్దులు వెట్టుటకును | 54 |
తామ్రచూడహస్తలక్షణము
గీ. | అనువు మీఱఁగ ముకుళహస్తంబునందుఁ | 55 |
తామ్రచూడహస్తవినియోగము
గీ. | ఒనర వాయసమునకును నొంటె కమరుఁ | 56 |
త్రిశూలహస్తలక్షణము
క. | పరువడిఁ జిటికెన వ్రేలును | 57 |
త్రిశూలహస్తవినియోగము
క. | ఎలమిని ముల్లోకములకుఁ | 58 |
మాలిని. | సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా! | 59 |
గద్యము
ఇది శ్రీవాసుదేవకరుణాకటాక్షవీక్షణాకలితశృంగారరసప్రధానసంగీతసాహిత్యభరతశాస్త్రవిద్యాపారంగత శ్రీమద్యాజ్ఞ
వల్క్యాచార్యపదారవిందమరందబిందుసందోహపానతుందిలమిళిందీభూతనిజాంతరంగ
శ్రీమృత్యుంజయార్యపుత్ర కాశ్యపగోత్రపవిత్ర సుజనవిధేయ లింగముగుంట
మాతృభూతనామధేయ ప్రణీతం బయిన యభినయదర్పణం బను
మహాప్రబంధమునందు నసంయుతాఖ్యాష్టా వింశతి
హస్తంబులను బరుగుచున్నయది
ద్వితీయాశ్వాసము60
- ↑ తాళపత్రముల గుఱించి చెప్పుటయందు “తాళపత్రే చపేటేచ ద్రవ్యాదిస్పర్శనే తథా” అభి 212
- ↑ ప్రతాపమును గూర్చి పలుకునప్పుడు “ప్రతాపేచ ప్రసాదేచ చంద్రికాయాం ఘనాతపే” అభి 210
- ↑ “క్రకచే ఛురికాయాంచ ధ్వజే గోపుర శృంగయోః” అభి 236
- ↑ ‘చందనే భుజగే మందే ప్రోక్షణే పోషణాదిషు| దేవర్ష్యుదకదానేషుహ్యాస్ఫాలే గజకుంభయోః|| గజాస్ఫాలేతు మల్లానాం యుజ్యతే సర్పశీర్షకః’ అభి 828
- ↑ ఈఁటె “పరశుపట్టిసముల బాకుల వాడి, బరిచీల నురుగదాప్రముఖాయుధముల” (సారం 2 భా)
- ↑ దీనినే “సోలపద్మహస్తము”నుగాను వ్యవహరింతురు. “కనిష్ఠాద్యావర్తితాశ్చే ద్విరళా స్సోలపద్మకః” (అభి 355)
- ↑ “.......... తటాకే శకటే చక్రవాకే కలకలారవే| శ్లాఘనే సోలపద్మశ్చకీర్తితో భరతాగమే||” (అభి 357)
- ↑ ఈహంసహస్తమునకే ‘హంసాస్యహస్త’మనియుఁ బేరు. “మధ్యమాద్యాస్త్రయో౽ఙ్గుళ్యః ప్రసృతా విరళాయది|| తర్జన్యఙ్గుష్ఠసంయోగే హంసాస్యకర ఈరితః” (అభి 379,380)
- ↑ “రచనేయాపకాదీనాం పులకే మౌక్తికేమణౌ| వేణునాదే సంయుతశ్చే ద్వాసనాయాం నిజత్మని” (అభి 387)
- ↑ “షట్సంజ్ఞాయాం సేతుబంధే నఖరేఖాఙ్కనే తథా| విధానే హంసపక్షో౽యం కీర్తితో భరతాగమే” (అభి 390)
- ↑ “ఆత్మని ప్రాణనిర్తేశే పఞ్చసఙ్ఖ్యానిరూపణే” (అభి)