శ్రీరస్తు

అప్పకవీయము[1]

పీఠిక



యు న్భూమియు నాఁగఁ బ్రాచిని బ్రతీచిన్ రుక్మిణీదేవి స
త్యాయోషామణియు న్మహోత్సుకత సేయు న్ముంగల న్మోడ్పుఁ[2]గే
ల్దోయిం దార్క్ష్యమరుత్సుతు ల్గొలున శ్రీదుం డేలు నాప్రోలిమో
మై యాకామెవలి న్వసించు హరి నిత్యంబు న్మముం బ్రోవుతన్.

1


తే.

కమల యెందును దనరూపు కాంచి యలిగి
యాత్మతరళాంతరమున నిజాధినాథు
తమ వతఁడు చూప గని చిత్తమునఁ జెలఁగు
నట్టి కౌస్తుభమణి హృదయమునఁ దలంతు.

2


క.

వననిధినందన కుయ్యెల, యనువునఁ దనరారి వారిజాక్షునివక్షం
బున నొప్పువైజయంతీ, వనమాలిక నా కొసంగు [3]వాగ్వైభవమున్.

3


తే.

కౌస్తుభంబును వనమాలికయును దనకు, దిగువగా [4]లచ్చి నొసలిపై దిద్దినట్టి
తిలకమునకు సమంబుగా వెలయునట్టి, చక్రశ్రీవత్సచిహ్నంబు సంస్మరింతు.

4


మ.

ధరఁ గాళిందితటంబునం గలుగు బృందాకాననాంతంబునం
బరితోషాతిశయాళు మోహమున గోపస్త్రీమణుల్ గుంపులై
హరి జేరం జనుదెంతు రెందుఁ [5]జనుదెం చానాద మాలించి స
త్వరయానంబులతోడ నట్టి మురళిన్ వర్ణింతు నిష్టాప్తికిన్.

5


సీ.

పాంచజన్యం బనఁబరఁగి దైత్యారాతి[6]యెడమను బై కేల నెసఁగు నెద్ది
మొగి సుదర్శననామునను [7]మాధవుదక్షిణాగ్రహస్తంబున నమరు నెద్ది

కౌమోదకీసంజ్ఞఁ గని కృష్ణుదాపలిరెండవకరమున నుండు నెద్ది
నందకం బనుపేర నారాయణునికుడిక్రిందటిచే నెలుఁగొందు నెద్ది


తే.

శార్ఙ్గ మనఁ దనరారి కేశవునివామ, బాహుయుగమూలమునఁ గనుపట్టు నెద్ది
యట్టి హరియైదుకైదువు లబ్దచక్ర, ఘనగదాఖడ్గచాపముల్ మనుచు మమ్ము.

6


తే.

కాలమేఘమునందుఁ బ్రకాశ మొందు, [8]కారుమెఱుఁగుతెఱంగునఁ గైటభారి
యంసములపై వెలుంగుపీతాంబరంబు, బంగరుచెఱంగు మాకు శుభంబు లొసఁగు.

7


క.

బాలతమాలాగ్రమునం, గ్రాలు శబీనాథుకార్ముకంబో యనఁగా
నీలఘనదేహుఁ డగు గో, పాలుతలన్ మెఱయు బర్హిబర్హము నెంతున్.

8


క.

భువనగకచ్ఛప[9]కిరిమా, నవసింహాదిత్యభృగుజననరాఘవయా
దవబుద్ధకల్కు లనుకే, శవుపదిరూపములు మది నజస్రముఁ దలఁతున్.

9


శా.

శ్రీమన్మందకటాక్షవీక్షణము పైఁ జిల్కం బయోజేక్షణుం
డామోదంబున నర్మగర్భసరసేష్టాలాపముల్ పల్కఁగా
వేమాఱుం దరహాస మాననమునం [10]బెంపొందఁగాఁ గొల్చు శ్రీ
భూముల్ నిచ్చలు మా కొసంగుదురు సంపూర్ణంబుగా [11]నిచ్చలన్.

10


క.

దాంతు హరిచరణ[12]భక్తి, స్వాంతు రసాతలనిశాంతు నత్యంతదయా
వంతు సమతీతవిధిక, ల్పాంతుఁ బరమశాంతు నయ్యనంతుఁ దలంతున్.

11


తే.

నామదిఁ దలంచెద సుపర్ణనామధేయు, మురహరవిధేయు నమరసమూహగేయుఁ
గనకనిభకాయు భక్షితకాద్రవేయు, వక్త్రకాంతిజితాత్రేయు వైనతేయు.

12


క.

తిన్ననివేత్రము కలుముల, కన్నియ [13]వన్నియను హస్తకమలతలమునం
జెన్నొందు జగము మనిపెడు, వెన్నునిదళవాయిఁ దలఁతు విష్వక్సేనున్.

13


ఉ.

పాయక కొల్తు రామజనపాలుఁడు జానకిఁ జూడ నంపుచోఁ
దోయధి గోష్పదంబుక్రియఁ దోఁప జివాలున దాఁటి లంక క
త్యాయతలీలఁ బోయి దివిజారుల దోమలఁబోలెఁ బట్టి బా
హాయతశక్తిఁ గొట్టి సతి నారసి తద్విభుఁ గన్న మారుతిన్.

14


క.

శుక భీష్మ విభీషణ శౌ, నక రుక్మాంగద వసిష్ఠ నారద [14]బక దా
ల్భ్య కిరీటి పుండరీకులఁ, బ్రకటితహరిపాదపద్మభక్తులఁ దలంతున్.

15


వ.

అని యివ్విధంబున.

16


క.

పాతతహేతి పరిజన, వ్రాతంబుగ శేషశయను వనరుహనయనున్
ఖ్యాతిగ "న హరేస్తు పర, స్త్రాత" యనుట దెలిసి కృతిమొదలఁ దలఁచి వెసన్.

17

బ్రహ్మాదిస్తవము

చ.

తనజనికారణం బయిన తామరకున్ హితుఁ డౌటచే విక
ర్తనునకు వేయిఘృష్టు లిడి దానికి శత్రుఁడు గాన నేణచి
హ్నునకుఁ బదేనుఁ జేసి యవియున్ శిఖిభానుముఖామరాళిచే
చిన మొక టప్పు గైకొనను దిద్దనుఁ జేయు విధాతఁ గొల్చెదన్.

18


క.

శారద విద్యాజాలవి, శారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్
శారదనీరదసారద, పారద[15]హారదరహీరపాండుశరీరన్.

19


చ.

కడు కఠినంబు లద్రులు జగంబుల సందున సంభవించి పెం
పడరు నినుం గరంప వశమా యని న న్నిపు డంటివే కదా
వడిఁ గనకాద్రి చాపముగ వంచిన నీకు హిమాద్రిజాతయౌ
పడఁతిఁ గరంచు టెంత యను పార్వతి మెచ్చు శివుం దలంచెదన్.

20


చ.

పరిణయవేళయందుఁ దనపాదముఁ [16]బట్టుక నన్నెకంటిపైఁ
దిరముగ మోసి కంతునకుఁ దీరెఁ గదా పగ యంచు నీలకం
ధరుఁడు దరస్మితుఁ డగుటఁ దద్వలయాహిఫణాగ్రరత్నసుం
దరముకురంబునం గని యెద న్ముద మందు భవాని గొల్చెదన్.

21


చ.

ననుఁ గని యొక్కయెత్తుననె దక్షజయు న్నిటలాక్షుఁడు న్ముదం
బున నిరుచెక్కులుం గదిసి ముద్దుగొనంగ నొకింత నెమ్మొగం
బనువున వెన్కకుం దిగిచి యత్నవిహీనపరస్పరాస్యచుం
బనములు తల్లిదండ్రులకుఁ బన్నుగఁ గూర్చు [17]గజాస్యు నెన్నెదన్.

22


చ.

జనకునిఁ గొల్వ వచ్చు నలచామరకర్ణునితేజి నందివా
హనుమకుటాహిఁ గాంచి భయమంది పిఱిందికిఁ బోవఁజూచినం
దన శిఖిమావు దీకొలిపి దానిభయంబు హరించి పూర్వజా
తునకు ముదం బొనర్చు గుహు దుర్ధరశక్తివహు న్భజించెదన్.

23


క.

హరిశిఖియమదైత్యాంబుప, మరుద్ధనపశివు లిభాజమహిషనరాంభ
శ్చరహరిణపుష్పకవృష, ప్రరుచిరవాహనులు మమ్ము రక్షింతు రొగిన్.

24


క.

రవిశశికుజబుధసురగురు, కవిభానుజరాహుకేతుగణములు నాకుం
దవిలి ఘటంబున [18]నుండుచు, [19]సవ నిత్తురు గాక సకలసంపద లెపుడున్.

25

కవిస్తుతి

సీ.

వల్మీకభవుపాదవనరుహంబులు కొల్చి సాత్యవతేయుఁ బూజనము సల్పి
భట్టబాణునివచఃప్రాభవంబు గణించి కాళిదాసుని కిరుగేలు మోడ్చి
పండితాగ్రేసరు దండి వక్కాణించి భవభూతివాక్యజృంభణము మెచ్చి
జయదేవునకు నమస్కారంబు గావించి మల్హణు హృదయపద్మమున నుంచి


తే.

చోరుఁ గడుఁ బ్రస్తుతించి మయూరు నెంచి, మాఘు భూషించి భారవి మదిఁ దలంచి
హీరునకు మ్రొక్కి కవితావిహారమతుల, నితరవిద్వత్ప్రకాండుల నతులు చేసి.

26


సీ.

శబ్దశాసనుపాదజలజంబులు భజించి యుభయసత్కవిమిత్త్రు [20]నభినుతించి
శంభుదాసునకు నంజలి వేడ్క నొనరించి సహజపాండిత్యుని సంస్మరించి
సకలవిద్యాసనాథకవీంద్రుఁ గొనియాడి సౌజన్యజేయువాక్సదణిఁ బొగడి
నంధ్రకవితాపితామహు వర్ణించి సుజనవిధేయు హెచ్చుగ నుతించి


తే.

రామరాజవిభూషణరత్నఖచిత, చారుమస్తకలాపాదిహారివాక్య
గౌరవము పెక్కుభంగుల గణన చేసి, పిదప నితరాంధ్రకవులకుఁ బ్రియము పలికి.

27


తే.

కాళిదాసమయూరాదికవుల కైనఁ, గలవు తప్పు లనంగ నన్యులకు లేవె
దిద్దఁ దగుపట్ల దిద్దుడు దిద్ద రాని, యెడల నానేరములు క్షమియించు టొప్పు.

28


వ.

అని వర్తమానకవులం బ్రార్థించి.

29


క.

వినఁదగు వెండియుఁ బొత్తము, గనఁ దగు బుధజనుల నడుగఁగాఁ దగుఁగా కెం
దును దెలియని పట్టునఁ ద, ప్పన వల దని [21]భావిజనుల కంజలి మోడ్తున్.

30

గురుస్తుతి

సీ.

ఆదిని రెండవవేదంబు చెప్పిన మార్తిసర్వన్నఁ గ్రమస్వరాదిఁ
దరువాత శబ్దశాస్త్రముఁ జదివించిన కాండూరి గిరిదేశికప్రకాండు
నామీఁద సకలసిద్ధాంతము ల్దెలిపిన ధీరవర్యుఁ బ్రధాని సూరభట్టు
వెస నన్ను లక్షణవేత్తఁ గావించిన ఘను మంచికంటియోబనకవీంద్రు


తే.

స్మార్తకర్మంబు లెఱిగించి సభలఁ బూజ్యుఁ, జేయు నల[22]కొలిచలిమల్లసింగనార్యు
నాగమము లుపదేశించినట్టి రాజ, యోగివర్యునిఁ దలఁతు విద్యాగురులను.

31


క.

అని యిష్టదేవతాస్తుతి, యును సకలకవీంద్రులనుతియును గురునుతియున్
వినయమున సలిపి తెలుఁగున, ఘనకావ్యం బొకటి సేయఁగాఁ దలఁచుతఱిన్.

32

స్వప్నప్రకారము

సీ.

ధాతరెండవపరార్ధమున నాదిదినంబుపగటి వరాహకల్పంబునందు
మహితవైవస్వతమనువేళ దేశంబు లర్థింప నైన మహాయుగమునఁ
గలిసమయంబునఁ దొలిచరణంబున మాసికం బగు చాంద్రమానమునను
శాలివాహననామశకమున గజశైలశరసుధాకిరణులసంఖ్య (1578) నడవ[23]


తే.

నంగజాబ్దంబునను దక్షిణాయనమున, జలధరర్తువు [24]మొదలిమాసంబునందు
బహుళమున దేవకికిఁ జక్రపాణి పుట్టి, నట్టి యష్టమి సనుదేర నధికభక్తి.

33


సీ.

చక్రవాళాంతరక్ష్మామధ్యసంస్థితదైవతగోత్రంబు దక్షిణమున
లవణాబ్ధివేష్టితలక్షయోజనసువిస్తారజంబూద్వీపతలమునందు
భరతవర్షంబున భరతఖండంబున మంగళోర్విని గర్మమహితభూమి
మలయవింధ్యాచల[25]మధ్యమంబునఁ గృష్ణయామ్యతీరమున బ్రహ్మాశ్రమమున


తే.

దండకాటవి [26]నంధ్రాభిదానపుణ్య, దేశమున శ్రీగిరీశాన్యదిశను కొండ
వీటిపడమటఁ [27]దంగెడవిషయమునను, గామెపల్లిని గోపాలధామమునను.

34


క.

కల్పోక్తమార్గమున సంకల్పము గావించి గోపికావిభుపూజల్
సన్పి మది నతనిపదములు, నిల్పి పురాణార్థగోష్ఠి నిశ గడుపునెడన్.

35


సీ.

మిగులఁ జేతులరెంట మేటిశంఖంబును జుట్టుఁగైదువయును బట్టువాఁడు
ముద్దులగుమ్మలౌ ముద్దియ లిద్దఱు కైదండ లిడ నీటు గలుగువాఁడు
బంగారుచెఱఁగుల పచ్చనిహొంబట్టుదుప్పటి [28]యొల్లెవా టొప్పువాఁడు
హారకేయూరమంజీరకోటిరాది[29]భూషణంబులు చాలఁ [30]బూనువాఁడు


తే.

నుదుటఁ గస్తూరితిలకంబు వొదలువాఁడు
తలఁచి చూచిన నా కులదైవ మగుచు
[31]బొలుచు నాకులదైవంబుఁ బోలువాఁడు
నిలిచె నొకరుఁడు నాదుముంగలను [32]గలను.

36


వ.

ఇట్లు నిలిచిన.

37


క.

కరములు రెంటను దాల్చిన, పరికరములు చూచి యతనిఁ బరమేశునిఁగాఁ
బరికించి లేచి వలగొని, మురియుచు సాష్టాంగదండము లొనర్చి వెసన్.

38

భగవద్వాక్యము

ఆ.

[33]మోడ్పుఁగేలు ఫాలమునఁ జేర్చుకొనియున్నఁ, గరుణ నతఁడు నన్నుఁ గాంచి పలికె
న న్నెఱింగి వందనం బొనర్చితి వాత్మ, మెప్పు పుట్టె నీదు మెలఁకువకును.

39


ఉ.

ఈ యువతుల్ రమాధరణు లేను బయోరుహపత్రనేత్రుఁడన్
నీయెడఁ గూర్మి గల్గి ధరణీదివిజోత్తమ వచ్చినాఁడ [34]శ్వ
శ్రేయస మబ్బు నీకు నిఁక సిద్ధము నన్నయఫక్కి [35]యంధ్రముం
జేయుము మాయనుగ్రహముచేఁ గవు లచ్చెరు వంది మెచ్చఁగన్.

40


క.

వినియును గనియును నెఱుఁగని, ఘనఫక్కిం దెనుఁగుఁ జేయఁగా నెట్లగు నా
కనవలదు దానిలక్షణ, మును నీ కది గలుగుచందమును విను మింకన్.

41

గ్రంథప్రభావము

తే.

ఆంధ్రశబ్దచింతామణివ్యాకరణము, ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు
బాసచేఁ జెప్పె నన్నయభట్టు దొల్లి, పర్వములు మూడు శ్రీమహాభారతమున.

42


వ.

ఆసమయంబున.

43


తే.

భారతముఁ [36]దెనుఁగించుచుఁ దా రచించి, నట్టి రాఘవపాండవీయము నడంచె
ఛందము నడంచ నీఫక్కి సంగ్రహించె, ననుచు భీమన [37]మ్రుచ్చిలి యడఁచె దాని.

44


ఉ.

ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపఁగాఁ బడియె నెందును దానినె కాని సూత్రసం
పాదనిలేమిచేఁ దెనుఁగుపల్కు మరొక్కటిఁ గూర్చి చెప్పఁగా
రా దని [38]దక్షవాటి కవిరాక్షసుఁ డీ నియమంబుఁ జేసినన్.

46


క.

ఆ మూఁడుపర్వములలో, నా మాన్యుఁడు నుడువుతెఱఁగు లరసికొని కృతుల్
దాము రచించిరి తిక్కసు, ధీమణి మొదలైన తొంటి[39]తెనుఁగుకవీంద్రుల్.

47


తే.

రాజరాజరేంద్రతనూజుఁ డార్య, సఖుఁడు సారంగధరుఁడు శైశవమునందు
నన్నయి రచించునెడఁ బఠనం బొనర్చె, నన్యు లెవ్వ రెఱుంగ రీ యంధ్రఫక్కి.

48


క.

అతఁడు [40]కాళ్లుఁ జేతులు, మతి సెడి జనకుండు [41]దఱుగ మత్స్యేంద్రునిసం
గతి నవి గ్రమ్మఱ మొలచిన, క్షితి సిద్ధులఁ గలసి యొక్కసిద్ధుం డయ్యెన్.

49

క.

ఆ లోకనుతుఁడు మొన్నటి, [42]కీలకసమమున మతంగగిరికడ నొసఁగెన్
బాలసరస్వతులకు నతఁ, డోలిఁ దెనుఁగు టీక దాని కొప్పుగఁ జేసెన్.

50


క.

ఆదిని భీమకవీంద్రుఁడు, గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున నా
మీఁదట రాజనరేంద్ర, క్ష్మాదయితునిపట్టి దాని మహి నెలయించెన్.

51


క.

ఇల నెనుబదిరెం డార్యలు, గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగు నీ
విలసితఫక్కి మతంగా, చలవిప్రునివలన నీదుసదనముఁ జేరున్.

52


క.

మును నారాయణధీరుఁడు, తనకు సహాయుఁడుగ సంస్కృతము వాగనుశా
సనుఁడు రచియించె దానికి, దెనుఁగింపఁగ నీకు తోడు నే నిపు డగుదున్.

53


క.

సురభాషయందు నల్సా, క్షరముల బహుసూచితార్థసారము లిముడిం
తురు సూత్రంబుల నవి వి, స్తరముగఁ దెనుఁగింపకున్నఁ దరమే తెలియన్.

54


తే.

నారికేళపాకంబుగా నన్నయకవి, ప్రక్రియాకౌమిదిని [43]ముట్టఁ బలికెఁ గానఁ
గేవలాంధ్రులు గాన దాత్రోవ నీవు, గోస్తనీపాక మై యుండఁ గూర్పవలయు.

55


ఆ.

శబ్దశాసనుండు సంస్కృతగ్రంథంబు, గానఁ దెలుఁగుమాట గలయ రామి
లక్షణంబె కాని లక్ష్య మొక్కటియును, బలుకకునికిఁ దెలియబడవు కొన్ని.

56


తే.

ఒక్కసూత్రంబువలన సముద్భవించు, శబ్దములు లెక్క వెట్టంగ శక్య మగునె
నలువకైనను [44]బలుకులేఁజెలువ కైన, నైన [45]నెఱిగింపు మొకకొన్నియైన నీవు.

57


చ.

రమణను సత్కవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తికా
వ్యములును దొల్లి యైన నిపు డైనను ముంగల నైన దీని సూ
త్రములను దక్క వేఱొకవిధంబున నాంధ్రముఁ జేయఁజాలమిన్
క్షమఁ దెనుఁగింప దీన నవి సర్వముఁ జేయు ఫలంబు నీ కగున్.

58


క.

[46]తాతనయు [47]నూత్నదండియు, నీ తెనుఁగులలక్షణం బొకించుక [48]తెలియన్
జేతఃప్రౌఢిమఁ జెప్పిరి, క్ష్మాతలమున దీనితెఱఁగుగా నవి యెల్లన్.

59


తే.

ఆంధ్రభాషామహాకాననాంతరమున, సంతతంబును శబ్దాపశబ్దసరణు
లెఱుఁగనేరక మది సంశయించు తెలుఁగు, కవులు నుపదంబు లిందును గాంతు రిలను.

60


తే.

కవుల కుపకార మగుటచేఁ గలుగు సుకృత, లాభ [49]మందున నగు సర్వశోభివృద్ధి
దాన సమకూఱు నాకపదంబు దీనిఁ, దెనుఁగుఁ గావించుకంటె శోభనము గలదె.

61


ఆ.

ధరణి నీకు నిష్టదైవ మెప్పుడుఁ గామె, పల్లె నున్నచక్రపాణి యగుట
నంకితంబు దీని నతనికిఁ జేయుము, విప్రవర్య మాకు వేఱు గలదె.

62

చ.

అని యతఁ డానతిచ్చి [50]చన నంతట మేల్కని నాల్గుదిక్కులుం
గనుఁగొని యద్భుతంబుఁ గుతుకంబును డెందమునం బెనంగ వేఁ
గినఁ గల [51]కేదిబద్ధ మని కేరుచు నుండెడువేళ నా మతం
గనగనివాసి పుస్తకనికాయధరుం డొకరుండు వచ్చినన్.

63


క.

ఆ విపు నతిథిఁగా సం, భావించి భుజింపఁ బెట్టి భాషించునెడన్
దా 'విశ్వశ్రేయం' బను, నీవచనము సదువ నెచటి దిది యన నతఁడున్.

64


క.

'నన్నయభట్టీయములో, నెన్నఁగఁ బ్రథమార్య గాదె యీపొత్తములో,
నున్నయవి యెనుబదియు రెం', డన్న మహాద్భుతముఁ బొంది యపు డెల్లరకున్.

65


వ.

మదీయస్వప్నవిధం బంతయుఁ దేటపడ నెఱింగించిన నాకర్ణించి సకలజనంబులు
నానందంబుఁ బొంది రందుఁ గొందఱు మాతృసంబధు లగు మదీయబంధువులు
గూడఁ గులసింధుసౌగంధికబంధులును గృతప్రబంధులను నీతియుగంధరులును
గావున నా కి ట్లనిరి.

66


క.

'హరిఁ గాంచుటచే మోక్షము, సిరిచే నర్థంబు ధాత్రిచే భూమియు శం
ఖరథాంగమ్ముల విజయము, విరచించు మటన్న కృతిని విద్యయుఁ గలుగున్.

67


ఆ.

శ్రేయ మబ్బు ననుచుఁ జెప్పె విష్ణుఁ డనఁగ, మంచి కల యటంచు నెంచ నేల
అతఁడు సెప్పు మన్న దితనిచే నిప్పుడు, గలిగె నిదియె సాక్షి గాదె మనకు.

68


వ.

అదియునుం గాక.

69

కర్తృవంశావతారము

సీ.

శ్రీవిష్ణునాభిరాజీవసంభూతుఁ డే, వసుమతీసురునకు వంశకర్త
రామాయణామరభూమీరుహాబ్ధి యే, వితతాగమాంతసంవేద్యగురుఁడు
కశ్యపాత్రివసిష్ఠగౌతమభృగువు లే, సూనృతభాషణుజోడువారు
పృథులశస్త్రకళాధురీణుండు ద్రోణుఁ డే, గురతపోరాశికి గూర్మిపట్టి


తే.

యతఁడు తనరారు సర్వలోకైకయోగ్య, తారకాపథవర్తి విస్తారకీర్తి
దురితకథపరిత్యాగి పరిమయోగి, [52]వరగుణాస్థాని శ్రీభరద్వాజమౌని.

70


తే.

అమ్మహామౌనిగోత్రాబ్ధి నవతరించి, తమ్ములును దాను నన్యోన్యతను దనర్చి
[53]తమ్ములను బోరునని సోముఁ ద్రస్తరించు, నౌర సోమాహ్వయుఁడు కాకునూరిఘనుఁడు.

71


తే.

అతఁడు మధురను బుధసమూహములఁ దొడరి, వేదశాస్త్రపురాణాదివాదములను
గాకు నూరింటిఁ జేసినకారణమునఁ, గూకునూరింటివాఁ డన ఘనతఁ గాంచె.

72

సీ.

బాలుఁడై కాశికాపట్టణంబున కేఁగి బ్రహ్మేంద్రునొద్ద శాస్త్రములు చదివె
[54]బ్రహ్మరాక్షసిచేతఁ గ్రమము చెప్పంబడి కట్టిన గండభాగంబు నొంచె
చరికొండసీమలో సంతరించెను గాకునూ రను సర్వాగ్రహార మొకటి
నిడుదవెల్లిని బొద్దినేపల్లి [55]నవదళపురిని మాన్యక్షేత్రములు గడించె


తే.

నవని సర్వజ్ఞుఁ డగుట గంగాంబికాభి, [56]రాముఁ డగుటను నిక్కంబు సోముఁ డనఁగ
మనియె నిలఁ గాకునూరి[57]తిమ్మనసుతుండు, సోముఁ దభినవచూతసద్గ్రామమునను.

73


చ.

[58]అతఁడు భవత్పితామహున కయ్యెఁ బితామహుఁ డా ఘనుండు భా
రతిని దపంబునం గని వరం బడిగెం దనయింట విద్య ప్ర
స్తుత [59]యగుచుండ [60]నందులకుఁ [61]జుమ్ము జగంబునఁ గాకునూరిసం
తతి యగు[62]వారు శోభనదినంబుల మున్నుగ వాణిఁ గొల్చుటల్.

74


తే.

గంగయందుఁ గుమారుని గాంచె నొకని, సోముని డని చెప్పుటెల్లను జోద్యమగునె
కాంచెఁ బెక్కుకుమారుల గంగయందు, సోముఁ డల కాకునూరివంశోత్తముండు.

75


వ.

[63]వా రెవ్వ రనిన.

76


సీ.

అమరేశ్వరుండు భోగాతిశయంబున నమరేశ్వరుం డన నతిశయిల్లు
గొండలయ్య [64]సదల్పగురుధైర్యమహిమచేఁ గొండలయ్య యనంగఁ గొమఱు మీఱు
రంగప్పఁ డాశ్రితరక్షణప్రౌఢిమ రంగప్పఁ డన ధాత్రి రంగు గాంచు
లక్ష్మణుం డగ్రజాలాపానువర్తి యై లక్ష్మణుం డన భూతలమున వెలయు


తే.

నందులోఁ గాకునూరిరంగాహ్వయుండు, కనియె నలువురు[65]తనయులఁ గన్నమాంబ
యందుఁ తిరుమలభట్టు గంగార్యవర్యు, నెలమిఁ బెదసోముఁ [66]చినసోము నిందులోన.

77


సీ.

ఒకనివాకిలిఁ గాచి యుండఁ దెన్నటి కైన నుగ్రుఁడు గాడు దా నొక్కనాఁడు
ఇంట మంటలు రాలఁ గనుఁగొనఁ డెవ్వరి నేరఁ డెన్నటికిని నీరు మోవఁ
గుత్తుకందు విషంబు గూరిచి వర్తింపఁ డనిశంబు పరులను నడిగికొనఁడు
సంతతంబును బౌరుషము తృప్తి గాంచఁడు క్రతువులు గాఁ జేయుఁ గాని జెఱుపఁ


తే.

డిన్ని సద్గుణములు గల్గెనేని పూని, జోడు సేయంగ పచ్చు నాసోముఁ గాకు
నూరికులవారిజాతచకోరమదని, రామునకు రంగమను పెదసోమునకును.

78

సీ.

కొట్టించె నెవ్వఁడు గురువాసి వప్రదక్షిణభాగమున రొంపిచెర్లలోనఁ
గట్టించె నెవ్వఁడు ఘనశిలాసాలంబు రంగుగా శంకరలింగమునకుఁ
బెట్టించె నెవ్వఁడు పృథుతరారామంబు గుడిపాటికడ వినుకొండత్రోవఁ
బుట్టించె నెవ్వఁ డప్పురియామ్యదిశ గుంటఁ ద్రవ్వించి పశువులు ద్రావ జలము


తే.

క్షితిఁ దలంపఁగ సర్వజ్ఞశేఖరుండు, సత్పథవిహారి ద్విజరాజచారులక్ష
ణాన్వితుం డెవ్వఁ డతఁడు సోమాభిధుండు, కాకునూరికులాఖ్యసాగరభవుండు.

79


ఉ.

పట్టెము [67]పోతనార్యసుతవర్యుఁ డనం దగు పెద్ది[68]భట్టుతోఁ
బుట్టిన కృష్ణఁ గైకొని సుపుత్రుల వెంగనఁ గన్నుభట్టు బ
ల్దిట్టను గంగయ న్సురలఁ దిమ్మమ రంగమ లింగఁ గోనమన్
రట్టడిఁ గాకునూరి పెదరంగయసోముఁడు గాంచె వేడుకన్.

80


క.

వినుతమతిఁ గాకునూరిజ, ననమణి యగు సోమునగ్రనందనుఁ డగు వెం
గన బుధుఁ డన బెగడె జగం, బున సోమునినందనుండు బుధుఁ డగు టరుదే.

81


తే.

పల్లెనాటను నూటతొంబదియు నాల్గు
గ్రామముల నీడు గానక కాకునూరి
వెంగనార్యుఁడు వేదవేదాంగములను
బ్రస్తుతికి నెక్కె మాఱటబ్రహ్మ యనఁగ.

82


ఆ.

కాకునూరి వెంగఘనుఁడు సేసమయందుఁ గాంచె మొదల నప్పకవిని నిన్ను
వెనుక సోమవార్యు వేంకటపతిఁ గృష్ణు, భట్టు లక్ష్మణాఖ్యబాలుఁ గాంచె.

83


క.

శ్రీగిరిని పిలిచి నీవును, భోగవిభీషణుని పట్టపుకవీంద్రుఁడవై
వాగీశవినుతకామెప, లీగరుడాపనకృపాకలితవాక్ప్రౌఢిన్.

84


సీ.

జగతి నాపస్తంభశాఖోక్తషట్కర్మపద్ధతిఖండనిబంధనంబు
కాలబాలార్జనాఖ్య[69]జ్యౌతిషగ్రంథసంహితాసుశ్లోకసంగ్రహంబు
శ్రీమదనంతప్రసిద్ధమహావ్రతకల్పకథాంద్రోక్తికావ్యరచన
శ్రీనగాధీశసుశ్లేషనిందాస్తుతిభావగర్భితసీసపద్యశతము


తే.

లలితకవికల్పకాఖ్యానలక్షణంబు, మహితసాధ్వీజనౌఘధర్మద్విపదము
నంబికావాదనామకయక్షగాన, కృతియుఁ జేసితి కాకునూరికులయప్ప.

85


క.

ఇట్టిమహాగోత్రంబున, బుట్టిననీ కిట్టిశుభముఁ బొందుట యరుదే
గట్టిగ నాదేవుఁడు సమ, కట్టినయది తెనుఁగు జేయఁగా [70]దగు' ననినన్.

86

పరమోత్సుకతను నన్నయ, విరచించిన ఫక్కి వ్రాసి విప్రుని గాశీ
పురి కనిచి వృద్ధబాంధవ, గురువిబుధులచే ననుజ్ఞ గొని చిత్తమునన్.

87

కవివిచారము

క.

లోకంబునఁ గల విబుధా, నీకములో నెదిరిఁ బోల నేరుతు నైనన్
నా కిచ్చె నంధ్రశబ్ద, వ్యాకరణము దెనుఁగుఁ జేయు మని హరి కరుణన్.

88


తే.

మహిని వాగనుశాసనమయుఁ డొనర్చు, నిమ్మహాగ్రంథ మను నాప యెక్కి యాంధ్ర
శబ్దజలరాశి తరియించుజనుల కేను, గర్ణధారుఁడ హరియనుగ్రహము [71]దీవి.

89


ఉ.

ఎన్నఁగ నన్నయాఖ్యకవి యీ కలికాదిని జెప్ప దాని భీ
మన్న హరించెఁ గ్రమ్మఱ మహాత్ముడు రాజనరేంద్రుపట్టి దా
మున్న నొసంగె విప్రునకు మూల మతం డొనరించెఁ [72]డీక నా
కన్నది మున్ను విన్నదియుఁ గాదు మహాద్భుత మబ్బె నా కిటన్.

90


క.

మూలము చెప్పిన నన్నయ, భూలోక హ్మ యతనిబుద్ధి దెలిసి వ్యా
ఖ్యాలక్ష్యంబు లొనర్చిన, బాలసరస్వతులఁ బోలు ప్రాజ్ఞులు కలరే.

91


క.

ఎక్కడి మతంగపర్వత, మెక్కడి కామెపలి సుకపు లీలో లేరే
గ్రక్కున నది దెనుఁగింపక, దక్కుట నను ధన్యుఁ జేయు తలఁపున నేమో.

92


క.

ఆతిక్కనముఖ్యకవి, వ్రాతముచే నీ తెలుంగువ్యాకరణము ధా
త్రీతలమునఁ గడు నంత, ర్భూతంబై తెనుఁగు గాకపోవుట లెల్లన్.

93


వ.

మత్పురాతనజననఘనవరతపోవిశేషంబువలనన కదా యని నింతించి నితాంతసంతు
ష్టితాంతరంగుండ నై.

94


తే.

తన యనుగ్రహమునఁ జెప్పు మనుచు నిన్నఁ, గలను వచ్చిన హరి తానె కలఁడు నాకుఁ
దెలియని పదంబు లెల్లను దెలుప నింక, శంక సేయంగ వలదని సమ్మతించి.

95


వ.

ముందు బృందారకభాష నశేషవిద్యాజలజాసనుండగు శబ్దానుశాసనుండు సంక్షే
పంబుగాఁ గూర్చిన యాంధ్రవ్యాకరణంబునందలి సంజ్ఞా, సంధి, తత్సమ, దేశ్య,
క్రియాపరిచ్ఛేదంబు లయిదునుం దెనుఁగుఁబలుకుల నేను విస్తరించి భాషాపరిచ్ఛే
దంబును, వర్ణపరిచ్ఛేదంబును, వళిప్రాసపరిచ్ఛేదంబును, [73]పద్యపరిచ్ఛేదంబును, సంధి
పరిచ్ఛేదంబును, [74]తత్సమపరిచ్ఛేదంబును, దేశ్యపరిచ్ఛేదంబును, [75]క్రియాపరిచ్ఛేదం

బును నను నామంబుల నభిరామంబు లగు నాశ్వాసంబు లెనిమిదిగా నెలకూచి
బాలసరస్వతి సకలభాషాకవి మహోపాధ్యాయ ప్రణీతాంధ్రవ్యాఖ్యానగ్రంథం
బాధారంబుగా రచియింప బూని.

96


క.

దశమీసురగురువాసర, శశితారావజ్రయోగషష్ఠకరణయు
క్తశరాసనలగ్నంబున, శిశిరక్షరాంశమున మొదలు సేసితిఁ గృతికిన్.

97


వ.

ఇట్లు కృతప్రారంభుండనై మదీయేష్టదేవతం గాంచి నమస్కరించి వినుతించి
యతనిం గురించి షష్ఠ్యంతములు విన్నవించెద.

98

షష్ఠ్యంతములు

క.

సాయసవేంకటపతిభూ, నాయకదత్తాగ్రహారనగరప్రాగ్దే
శాయతదేవాలయమునఁ, బాయక వసియించు గోపభామాపతికిన్.

99


క.

శ్రుతిశాస్త్రాగమజితగీ, షిపతి వట్టెము పెద్దనార్యసంపాదితపు
ణ్యతరాగ్రహారపూర్వ, క్షితిజశమీయామ్యమున వసించిన హరికిన్.

100


క.

తంగెడసీమను నిర్జర, గంగాసమ నాగనిమ్నగాపూర్వమునం
బింగళిపురదక్షిణమున, రంగుగ నెలకొన్న గోపరత్నంబునకున్.

101


క.

కేతవరనామపట్టణ, దైతేయాశాసమన్వితనికేతునకున్
వాతాత్మజతార్క్ష్యసమ, న్వీతునకు సమస్తలోకవిఖ్యాతునకున్.

102


క.

అలఘుతరశీలునకు మం, గళగుణజాలునకు దనుజకాలున కింద్రో
పలనీలునకును గామే, పలిగోపాలునకు ఘోషపతిబాలునకున్.

103


తే.

అంకితము గాఁగ నేఁ జేయునట్టియాంధ్ర, శబ్దచింతామణిగ్రంథసౌరపాద
పంబునకు నాలవాలంబుపగిది నొప్పు నట్టిభాషాపరిచ్ఛేద మెట్టి దనిన.

104

—————

  1. (వా) వావిళ్లవారిప్రతి
    (ప) పరవస్తువారిప్రతి
    (పె) పెండ్యాలవారిప్రతి
    (గి) గిడుగు రామమూర్తిగారు పరిష్కరించిన వావిళ్లముద్రణప్రతి
    (పూ.ము.) వావిళ్లవారి 5-వ కూర్పు
    (రా) రావూరివారి సవరణ
    (సూ) సూర్యాలోక ముద్రితప్రతి. (సూర్య)పీఠిక అని లేదు. ఇక్కడనుండియే ప్రథమాశ్వాసము ప్రారంభమగును. 1-17 పద్యములకు 'ఆయుధపరిజనసహితవిష్ణుస్తుతి' యని శీర్షిక.
    (ఓ) ఓరుగంటి రామకవి వ్రాఁతప్రతి

  2. కే
  3. వాంఛితఫలమున్ (వా), వాగ్విభవంబున్ (గి)
  4. నొప్ప (పూ.ము.)
  5. జనునంచా(సూ)
  6. యడమను బయికేల నమరు నెద్ది (వా)
  7. కృష్ణుని (రా)
  8. కాఱు మెఱుంగు (పూ.ము., సూ) అప్పకవియే రేఫాక్షరసీసమాలికలో దీనిని 'కారు' అని లఘురేఫముగా నిచ్చియున్నాఁడు.
  9. కిటి (సూ)
  10. విప్పొంద
  11. నిష్టముల్ (గి,సూ)
  12. వర్తి
  13. వన్నెయును
  14. బలి (సూ)
  15. హరతార, హరదరద, దరహార
  16. బట్టియు
  17. గణేశు (వా)
  18. నుండెడు (వా)
  19. సవన్ = క్రీడచే, 'సవో యజ్ఞఃసవా క్రీడా' అభియుక్తవచనము. (గి), 'చవి నిత్తురు' అనుపాఠ మున్న సరసముగ నుండునని తోఁచెడి. చవిన్ = ప్రీతితో (రా).
  20. నుచ్చరించి (వా), నుపచరించి (ఓ)
  21. భావికవుల (వా)
  22. కొలిచలమల (ఓ), కొలచలమల (సూ)
  23. క్రీ. శ. 1656
  24. మొదటి (సూ)
  25. మధ్యంబునను (సూ)
  26. నాంధ్రా (గి) వ్రాఁతప్రతులలో నన్నిచోటుల 'ఆంధ్ర'శబ్దమే కనఁబడుచున్నది.
  27. కంగేడ (సూ)
  28. వల్లెవా టొప్పు (సూ)
  29. భూషణంబులఁ జాలఁ (ప)
  30. బొదలువాఁడు (వా)
  31. బోల్చుఁ (వా)
  32. వెసను
  33. మోడ్పుకేలు (గి)
  34. సూ. శ్వసోవసీయ శ్శ్రేయసః. 5-4-80 పాణిని అష్టాధ్యాయి. శ్వశ్శ్రేయసం శివం భద్రం కల్యాణం మంగళం శుభమ్. అని అమరము.
  35. యాంధ్రము (గి)
  36. దెనుఁగింపుచు (గి అధస్సూచి), తెనిఁగింపుచు - ఇప్పటిరూపము (రా)
  37. యెంతయు నడఁచె (సూ)
  38. ద్రాక్షవాటి (సూ)
  39. తెనుఁగు (సూ)
  40. దనకాళ్లు చేతులు మతి చెడి (సూ)
  41. దరుగ (పూ.ము.)
  42. కీలకసమనామతంగ (సూ)
  43. బుట్ట
  44. బలుకులచెలికి నైన
  45. నెఱుఁగింపు (గి)
  46. తాతన - తాతంభట్టు
  47. నూత్నదండి - కేతన అభినవదండి బ్రిదాంకితుఁడు (రా)
  48. యైనన్ (సూ)
  49. మందును (సూ)
  50. చను (ప)
  51. కేదబద్దమని (వా)
  52. వరగుణస్థాని (సూ)
  53. తమ్ములనె పేరుననె సోము (సూ)
  54. బ్రహ్మరాక్షసుతోడఁ గ్రమము చెప్పుచు బండిగట్టిన గండభాగంబు మ్రోదె (వా)
  55. నివరళ
  56. రాముఁ డనఁగను (సూ)
  57. తమ్మన (సూ)
  58. ఆతఁడ (సూ)
  59. మగు (సూ)
  60. నందునకు (వా)
  61. సుమ్ము (గి, పూ.ము.), జుమ్ము (రా)
  62. వారి (సూ)
  63. వా రెవ్వ రంటేని (పూ.ము.)
  64. దలంప (పూ. ము.)
  65. తనయుల గన్నమాంబ (సూ). ఇందు 'గన్న' యని సరళాదిగా నున్నది.
  66. చిన్న (సూ)
  67. పోచ (ఓ)
  68. రాజు (ఓ)
  69. జ్యోతిష (సూ)
  70. గదియు' మనన్
  71. పేర్మి (సూ)
  72. నింకఁ దాఁ గన్నది
  73. బద్య (రా)
  74. దత్సమ
  75. గ్రియా (ఇవి ద్రుతముమీఁది పరుషము లగుట సరళము లగును. కానీ పూ.ము.లోఁ బరుషాదిగా నున్నవి (రా).