అనిరుద్ధచరిత్రము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
అనిరుద్ధచరిత్రము
తృతీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ | 2 |
వ. | అంత. | 3 |
సీ. | వినతాతనూజకేతనకళాసంప్రాప్తజనితానురాగవిస్తార మనఁగ | 4 |
చ. | ఇనుఁడు కరంబులం బొదివి యింపుగ సంగమ మాచరింపఁ బ | 5 |
చ. | ఇనునకుఁ బద్మినీకువలయేక్షణపై మది నెంతమోహమో | 6 |
క. | కమలినిపయిఁ గూరిమిచే, రమియించెంగా నన శుచిరాహిత్యముగా | 7 |
తే. | అంబురుహసంభవాండగేహాంతరమున, దీపకంబైనభాస్కరదీపకళిక | 8 |
చ. | అనయము జీవకోటికి భయంబుగ దారులు గట్టి కొల్లఁ గై | 9 |
సీ. | ఆదట దీరంగ నంభోజగంధులబటువుగుబ్బలమీఁదఁ బ్రాఁకి ప్రాఁకి | 10 |
క. | జీవనమె జీవనంబై, యీవిధముననున్న మమ్ము నెడచేసె నయో | 11 |
సీ. | వరునిరాకకు నిశావాససజ్జిక మింటఁ బఱిచిన వెన్నెలపాను పనఁగ | 12 |
సీ. | అధిపలాలితలైన స్వాధీనపతికలు నలుక దీఱిన కలహాంతరితలు | 13 |
శా. | మందాక్షాంచలము ల్గ్రమించి కులధర్మస్రోతసు ల్దాఁటి త | 14 |
ఉ. | చీఁకటివేళ సంచరణ సేయుచు నిక్కువ లైనచోట్ల న | 15 |
సీ. | గళరవంబులు రద్దిగాఁ జెలంగింపక పలుమాఱు మెల్లనె పలుకుమనుచుఁ | 16 |
ఉ. | ఆసమయంబునం గువలయప్రియమైన ప్రభుత్వరేఖ ను | 17 |
సీ. | భూనభోంతరములఁ బూర్ణీభవించు తమంబుల నుచ్చాటనంబు చేసెఁ | 18 |
సీ. | జతనంబుతోఁ దేఁటిసంచిణీహసము భిన్నీదుముదారుగా నిగుడి నడువఁ | 19 |
వ. | అంత | 20 |
మ. | చణబాహాబలశాలి మన్మథుఁడు చంచచ్చంచరీకచ్ఛటా | 21 |
మత్తకోకిల. | మత్తకోకిలశారికాశుకమంజుమోహననాదసం | 22 |
క. | వగ నొందుచుఁ జెలికత్తెలు, మృగమదఘనసారగంధమృదుకుసుమాదుల్, | 23 |
సీ. | విభునికౌఁగిటికినై వెతఁ జెందుమేనికిఁ జందనపంకం బలంద నేల | 24 |
తే. | ఎన్ని యుపచారములఁ చేసి రిందువదన, లన్నియును జూడ మునుపటికన్న మిగుల | 25 |
వ. | ఇక్కరణి నక్కువలయాక్షి విరహాతిశయంబున నోర్వంజాలక పరితపించుటకు సఖీ | 26 |
ఉ. | తల్లి సమస్తభాగ్యనిధి తండ్రి దయాపరమూర్తి నీచెలుల్ | 27 |
చ. | పురహరదేవునిం జెనకఁబోయి తదుగ్రలలాటనేత్రభీ | 28 |
వ. | అని పలికి సుధాకరు నుద్దేశించి. | 29 |
సీ. | కువలయంబులను గన్గొన్న చల్లనిచూపు కమలబృందములందుఁ గలుగదయ్యె | 30 |
క. | పగలొప్పని సౌమ్యత నై, జగుణం బగు నీకు నింత చల మేటికయో | 31 |
వ. | అని మలయపవను నుద్దేశించి. | 32 |
శా. | ఎంచం జల్లనివాఁడవై సరసులం దిష్టంబు వాటించుచుం | 33 |
వ. | అని పికశుకనికరంబుల నుద్దేశించి. | 34 |
క. | ఒకకుతికై యుండెడు మీ, రకటా చెలియెడల నింత యతికూహక మా | 35 |
వ. | అని పలుకుచున్న సమయంబునం జిత్రరేఖం గనుంగొని యుషాంగన తనమనోహరుండైన | 36 |
ఉ. | ఔనటవమ్మ వాని సరసాధరసారరసామృతంబు నే | 37 |
వ. | అని పలికిన. | 38 |
చ. | విరహము నొందకమ్మ విభు వేగమె తోడ్కొనివత్తు నంచు నా | 39 |
శా. | కాంచెం గాంచనగాత్రి సౌధశిఖరాగ్రస్వర్ణపాంచాలికా | 40 |
వ. | కనుంగొని మనంబునఁ బెనంగొను ప్రమోదంబునఁ బ్రమాదంబగు విద్యావిశేషంబున | |
| సాధనసమగ్రజాగ్రద్వీరభటసమూహసమావృత్తంబును, రుక్మిణీసత్యభామాప్రము | 41 |
క. | అలరుక్మలోచనాకువ, కలశయుగాన్వితనిరూఢగాఢాశ్లేషో | 42 |
సీ. | బంగారుదివియకంబములపై నిరువంక దీపికాకాంతులు తేజరిల్లు | 43 |
ఉ. | మీసముతీరుఁ జూచి జిగిమేనిపటుత్వముఁ జూచి మోములో | 44 |
వ. | తదనంతరంబ. | 45 |
మ. | తనసమ్మోహనవిద్యచే జనుల నిద్రామగ్నులం జేసి య | 46 |
వ. | వచ్చుచున్న సమయంబున. | 47 |
ఉ. | ఎప్పుడు వచ్చునో కువలయేక్షణ యాతనిఁ దోడుకొంచు నే | 48 |
ఉ. | నావెత చూడలేక కరుణాపరురాలగు చిత్రరేఖ దా | |
| బోవుచునుండె నాకొఱకుఁ బోయినకార్యమునిర్వహింప రో | 49 |
వ. | అని తలంచుచు. | 50 |
తే. | తరుణి యిబ్భంగిఁ గుసుమకోదండచండ, కాండనిర్భిన్నహృదయయై కరుగుచున్న | 51 |
వ. | అప్పుడు. | 52 |
చ. | హృదయము ఝల్లుఝల్లుమన నెంతయు విస్మయమంది చూచి పెం | 53 |
వ. | అంత. | 54 |
క. | తెలివొంది చిత్రరేఖా, కలవాణిం గౌఁగిలించి కన్నుల హర్షా | 55 |
ఉ. | ఈసుకుమారమూర్తి నిపు డీడకుఁ దెచ్చితి ప్రాణదానముం | 56 |
క. | అని పలుకుచున్న బాలిక, వినయోక్తుల గారవించి వేడుకతోడం | 57 |
ఉ. | లేచుట యెప్పుడో నిదుర లేచినపిమ్మట నన్నుఁ గన్నులం | 58 |
మ. | అని చింతింపఁగ నిద్ర మేల్కని యతం డాకర్ణవిశ్రాంతమో | 59 |
ఉ. | నాథుసుదర్శనంబువలన న్మదనగ్రహమోక్ష మయ్యె బిం | 60 |
గీ. | ఇవ్విధంబున మేల్కాంచి యవ్విభుండు, ద్వారకాపురకనకసౌధప్రదేశ | 61 |
సీ. | కాఁకలు దేరు బంగరుసలాక యనంగఁ గసటు వాసిన చంద్రకళ యనంగ | 62 |
క. | మొదలను నే వసియించిన, యది ద్వారకలోనివజ్రహర్మ్యము గాదా | 63 |
వ. | అని విచారించుచు నవ్వరారోహ నాలోకించి. | 64 |
సీ. | పొలఁతిమోమునకు సంపూర్ణేందుబింబంబు వెలయ నివాళి గావింపవచ్చు | 65 |
గీ. | అని విచారించునెడఁ గించిదవసతాస్య, పద్మయై తనకై ప్రేమ బయలుపఱుచు | 66 |
ఉ. | ఎవ్వరిదానవే కువలయేక్షణ యెయ్యది నీదుపేరు నీ | 67 |
గీ. | తళుకువజ్రంపుఱవలయందంబు గులుకు, పలుకుదురుతేటముకురబింబములవంటి | 68 |
మ. | ఇది బాణాసురువీడు శోణపుర మాయింద్రారి మాతండ్రి పెం | 69 |
ఉ. | కన్నియఁ గాని యన్యసతిఁ గాను శరీరము నీదుసొమ్ముగా | |
| న న్నలయించెదేని రమణా యిక నేమనుదాన నిన్ను నా | 70 |
వ. | అని పలికి యక్కాంత చింతాసముద్రాంతర్మగ్నాంతరంగయై తలవంచుకొని యూర | 71 |
సీ. | తొలుత నాతనిరూపుఁ గలఁగన్నయాదిగా మగువకు దినములే యుగము లయ్యె | 72 |
చ. | పలుకులలోని ప్రార్థనయు భావములోఁ గలతెంపు మోములో | 73 |
వ. | అప్పుడు. | 74 |
సీ. | అకలంకచంద్రబింబాననయూరుదేశంబులవెంట సంచరణ చేసి | 75 |
సీ. | తనువుల దిగుపాఱుకనుదోయిబెళకుముత్యాలరాసులు తలఁబ్రాలు చేసి | 76 |
క. | లలనామణి కప్పుడు గు, బ్బలపొంగున బిగిసి ఱవిక పక్కునఁ బగిలెన్ | 77 |
మ. | రమణిఁ గొబ్బునఁ గౌఁగిలించి పయికిన్ రాఁదీయుచో గల్లనం | |
| కముహూర్తం బిదియంచుఁ దెల్పుచు మహాకందర్పమౌహూర్తికా | 78 |
ఉ. | కాంచనగాత్రిముద్దువగఁ గాంచి కవుంగిట గుబ్బ లంటఁ గీ | 79 |
సీ. | సురుచిరాంబరబంధకరణంబు భేదించి వ్రీడాబలంబుల విఱుగఁదోలి | 80 |
ఉ. | చంచలలోచన న్సురతసౌఖ్యమున న్గరఁగించె నంచు వ | 81 |
సీ. | జలచరనేత్ర కన్నులవెరపింపుకే యెత్తినబిరుదాంక మేటఁ గలిపి | 82 |
చ. | వలచినపొందులై మనసు వచ్చిన చక్కఁదనంబులై భ్రమల్ | 83 |
గీ. | అంత నానవోఢ యానందమునఁ దను, సురతమున జయింపఁ బరిభవంబు | 84 |
ఉ. | చిందఱవందఱై యసురసేనలు డెందమున న్భయాకులం | 85 |
శా. | ప్రాతఃకాలమహాబలాఢ్యుఁడు నిశాప్రత్యర్థివీరుం బరా | 86 |
వ. | మఱియు నాసమయంబునం బ్రణయకలహవ్యాపారంబులం బరాఙ్ముఖులై మౌనము | 87 |
గీ. | గగనవీథిని వాహ్యాళిఁ గదలు పద్మ, బాంధవప్రభుముందరఁ బట్టు సూర్య | 88 |
మ. | తమముం బాయఁగఁ జేసి రాగగుణముం దప్పించి సన్మార్గవ | 89 |
వ. | అప్పుడు. | 90 |
శా. | గోరు ల్నాటినగుబ్బచన్నులను జిక్కు ల్వడ్డహారావళుల్ | 91 |
సీ. | అకలంకరాజబింబాననంబులయందు నిదురతమంబులు ముదురుకొనఁగఁ | 92 |
క. | కాలోచితకృత్యంబులు, లీలం గావించి సరసలేపనసుమనో | 93 |
వ. | ఇవ్విధంబున నవ్వధూవరులు ప్రాణంబులకంటె నతిశయంబగు విశ్వాసంబు గలుగు | 94 |
సీ. | అలఁతఁ బాపెడునవ్వు టమృతంపుఁదేటల చిలుకరింపులప్రేమ తొలకరింప | |
| గలికి తేలింపుఁజూపులఁ గరఁగి కరఁగి, సొలపునెయ్యంపుఁజిన్నెలఁ జొక్కి చొక్కి | 95 |
సీ. | కెమ్మోవిరుచు లాననిమ్మని విభు వేఁడుకొనినఁ గొమ్మనియాస కొలిపి యాన | 96 |
మ. | సిచయాభావనటన్నితంబతటయోషిద్రత్నకించిచ్చల | 97 |
సీ. | వి ల్లెక్కుడించక వేసినమదనుండు పలుమాఱు కుంటెనపనులు నడప | 98 |
క. | ఎక్కువలగు మక్కువలను, జక్కవలను బోలి యిట్లు సరసత నెల వా | 99 |
గీ. | చక్రభావనచేఁ గాంచి శక్తి దనకుఁ, బ్రాపు గలుగుటనో లేమిఁ బాపుకొనియె | 100 |
మ. | అసమాస్త్రుండను గారడీఁ డతివ గర్భాయాసనిశ్శ్వాసమం | 101 |
ఉ. | మెల్లనికౌఁగిలింపులును మెత్తనిమాటలు లేఁతముద్దులుం | 102 |
సీ. | ఉరువులై కొనల నల్పొప్పుచన్నులు కరగ్రహణత కొకవింతకాంక్షఁ జేయఁ | |
| నలపుసొల్పులఁ బల్కు పలుకులు వీనుల వినుటకు నొకవింతవేడ్క యొదవఁ | 102 |
వ. | అంత. | 103 |
ఉ. | మందిరపాలికాజనులు మానినిఁ గన్గొని గర్భభార | 104 |
చ. | చెలఁగి భవత్తనూభవ వసించుగృహాంతము పోతుటీఁగెయున్ | 105 |
వ. | అని విన్నవించిన. | 106 |
ఉ. | ఖేదము క్రోధము న్మదినిఁ గీల్కొన బాహుబలాఢ్యులైన క్ర | 107 |
క. | అని పలికిన రోషానల, జనితస్ఫుటనిస్ఫులింగచయభాతిని లో | 108 |
మ. | అమలేందూపలవేదికాస్థలమునం దాసీనుఁడై యయ్యుషా | 109 |
మ. | భయదాహంకృతిఁ జక్రముద్గరగదాప్రాసాదిహేతిచ్ఛటో | 110 |
చ. | తలలు పగిల్చి కంఠము లుదగ్రతఁ ద్రుంచి భుజప్రదేశముల్ | 111 |
క. | హతశేషులు భయవిహ్వల, మతులై యేతెంచి కదనమార్గముఁ దెలుపన్ | 112 |
వ. | బాణుం డక్షుద్రరౌద్రముద్రాసమున్నిద్రనేత్రకోణుండును, నాహనాటోపధురీణుం | 113 |
క. | యదువంశతిలక వీనికి, విధి జయకాలంబు పెనఁగ నేటికి హరిచే | 114 |
గీ. | అనియె నమ్మాట వీనులయందుఁ దగిలి, రిపుమహీరుహవిదళనోద్వృత్తిఁ గెరలు | 115 |
వ. | అప్పుడు. | 116 |
ఉ. | బాహుబలోద్ధతిం బ్రళయభైరవుభంగిఁ బరాక్రమించి య | 117 |
క. | వనితాసంపర్కంబున, ననిరుద్ధు నిరుద్ధుఁ జేసె నరివర్గంబున్ | 118 |
వ. | ఇవ్విధంబున. | 119 |
గీ. | పట్టుకొని యాఁపు సేయించె బాణుఁ డతని, నపుడు తద్భంగజనితఖేదాంధకార | 120 |
సీ. | వేకువఁ గాంతిదప్పినచంద్రబింబంబువిధమున నెమ్మోము వెల్లఁబోయెఁ | 121 |
గీ. | వీడు ముఖకాంతి వసివాళ్లు వాడు మేను, నెండు కెమ్మోవి బాష్పము ల్నిండు కన్ను | 122 |
వ. | ఇ ట్లమ్మనోహరాంగి విరహానలసంతప్తమానహృదయయై యుండె నంత నిక్కడ. | 123 |
మ. | అనిరుద్ధుండు పురంబులోపలను లేఁ డాశ్చర్య మేమో కదా | 124 |
ఉ. | తల్లియుఁ దండ్రియు బహువిధంబుల ఖేదము నొందుచుండఁగాఁ | 125 |
క. | కానున్న కార్య మయ్యెడు, నే నిప్పుడు వీరితోడ నిజముగఁ దెలుపం | 126 |
వ. | అని శుకుండు పలికె ననిన నటమీఁదటికథావృత్తాంతం బెఱింగింపు మనుటయు. | 127 |
ఉ. | అండభవప్రకాండగమనాదరపండితపుండరీకమా | 128 |
క. | శ్రితరాజహంసయోగా, యతిదివ్యవిలోకనాక్షయాగమహితగా | 129 |
స్రగ్ధర. | ప్రతాపవద్రిపుద్రుమప్రభంజనప్రభంజనా | 130 |
గద్య. | ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా | |