హైందవ స్వరాజ్యము/పదియవ ప్రకరణము

పదియవ ప్రకరణము.

భారత భూమిస్థితి.

హిందువులు-మహమ్మదీయులు.


సంపా: మీరు కడపట నడిగిన ప్రశ్న చిక్కుది. కాని ప్రత్యు తర మెంతో కష్టము కాదు. రైళ్లు, వకీళ్లు, వైద్యులు ఉండుట చేత ఈ ప్రశ్న కవకాశము కలిగినది. రైళ్లను గురించి ఆలోచించి నాము, మరి ఇప్పుడు వకీళ్లు, వైద్యులను గురించి . అలోచిం తము. స్వభావముచేత మనము కాళ్లు చేతు లెంతదూరము తీసికొనుపోవునో అంతమాత్రమున కే అర్హులము. రైళ్లు మొద లైన మోహకరసాధనముల మూలకముగా తావునుండి తా వునకు పిచ్చి వేగమున పరుగిడకుందుమేని అనవసర గందర గోళము లుండి యుండవు. మనకష్టములు మననిర్మితములే. మానవ శరీరము నేర్పరచి నప్పుడే యీశ్వరుడే శరీర సంచలన మునకు. నొక మితి యేర్పరచెను. వెన్వెంటనే మానవుడు ఆ మితిని మీరుటకు సాధనములు వెదక మొదలిడెను. మాన వుడు తన సృష్టికర్త నెరుంగునుగాక యని అతనికి బుద్ధి బలము కలిగెను.మానవుడు దానిని దుర్వినియోగము చేసితనసృష్టికర్త

నే మరచెను. నేను నాచుట్టుముట్టు నుండు వారలకు తోడగునట్లు

53

భారత భూమిస్థితి.


మాత్రమే దైవమునన్ను నియమించినాడు. కాని గర్వముచేత నేను ప్రపంచములోని ప్రతిమానవునకు తోడగుదునని నటిం చున్నాను. ఈరీతిని అసాధ్యములను సాధ్యముచేయ నాలో చించుటలో మానవును అనేక భిన్న స్వభావములను భిన్నముఖ ములను ఎదుర్కొననలసిన వాడగుచున్నాడు. అందువలన ఎక్కడ లేని గందరగోళమున పడిపోవుచున్నాడు. ఈ హేతు వాదమును నంగీకరించు నెడల రైళ్లు మహానర్థదాయకము లనుట నాకర్థము కాగలదు. అవి కారణముగా మానవుడు సృష్టికర్తనుండి యెంతో వేరుపడిపోయినాడు.


చదువరి: కానిండు. నా ప్రశ్నకు నుత్తరమునకై మిక్కిలి యాతురతతో నెదురుచూచుచున్నాను.మహమ్మదీయుల రాకతో మన జాతీయత పోలేదా ?


సంపా; వివిధమతములవారు నివసించినమాత్రమున భారత భూమి యొక్క జాతి కాకపోలేదు. విదేశీయులు వచ్చినతోడనే దేశజాతి నశించిపోదు. వారు దీనియందు లీనమైపోదురు. ఇది జరిగినప్పుడు దేశ మొక్క జాతియేకాని వేరుకాదు. దేశమునకు ఇతరులను తనలో లీనము చేసికొను శక్తిమాత్రముండవలెను. భారత భూమికి ఎల్లప్పుడును ఆశ క్తికలదు. నిజమరయగా తలకొ క్కమతమను తప్పదు. కాబట్టి జాతితత్త్వము నెరిగినవా రెవ్వ

రును మత భేదములను గణింపరు. అట్లుగణింతు రేని వారుజాతి
54

హైందవ స్వరాజ్యము.


కాజాలరు. హిందువులు భారత భూమిని తామేనివసింప నెంతు రేని మిథ్యలో పడిన వారగుదురు. భారతభూమిని మాతృ భూమిగా కొనియుండు హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, పారసీలందరును ఏక దేశీయులు. తమతమ స్వలాభమున కే యైనను వీర లొండొరులతో సైకమత్యముగా నివసింప వలసి యుందురు.లోకములో ఎచ్చటను జాతీయత యనిన ఏకమతా వలంబనమను నర్థము లేదు. భారత భూమిలోను ఆసిద్ధాంతము నడచినది కాదు.


చదువరి: అయిన హిందూమహమ్మదీయులకు గల సహజ వైరమునుగురించి మీ రేమందురు.


సంపా:మనయిరువురకు శత్రువులైనవారపదములనుకల్పిం చినారు. హిందువులు మహమ్మదీయులు పోరాడికొనినప్పుడు అట్లువర్ణించిరి సరిగదా బహుకాలముగా పోరాటములు లేవే ఇక సహజ వైర మెక్కడకలదు. మరియొక విషయము జ్ఞాపక ముంచుకొనుడు. హిందూ మహ్మదీయులు పోరాటములు మానుకొనుట బ్రిటిషువారి రాజ్యస్థాపనకు తరువాతనే యని యనుకొనరాదు. హిందువులు మహమ్మదీయ పరిపాలనలోను మహమ్మదీయులు హిందూ పరిపాలనలోను చక్కగా వర్ధిలిరి. ఇరుప్రక్కలవారును పరస్పరము పోరాడు కొనుట ఆత్మహత్యకు

మార్గ మని యెరింగికొనిరి, కత్తికట్టిన మాత్రాన ఒండొరుల

55

భారత భూమిస్థితి,

మతము వీడుదురనుటను మరచిపోయిరి. , రెండు పక్షములును ఐక్యము మై జీవింప నిశ్చయించుకొనిరి. ఇంగ్లీషు వారి రాకతో మరల నాపోరాటములు ప్రారంభమయ్యెను.


ఇరువాగులవారును పోరాడుకొనునప్పుడు మీ చెప్పిన లో కోక్తు లేర్పడినవి. ఇప్పుడు వానిని తడవుట నష్టదాయకము. హిందూమహమ్మదీయు లనేకులు నేటి దినము ఏకమూలపురు షుని పేర్కొనుట లేదా ! వారిరక్త ము వీరియందు వీరిరక్తము వారియందు ప్రవహించుచున్న దిగదా ! మతము మార్చినం తనే మానవులు విరోధు లగుదురా! హిందువుల దైవము మహమ్మదీయుల దైవమున కంటే భిన్నమా ! మతములొ కే గమ్యస్థానమునకు జేర్చుమార్గములు కావా ! గమ్యస్థాన మొ క్కటే యైనప్పుడు మన మేమార్గము ననుసరించిన నేమి ? పో ట్లాడుకొనుటకు కారణ మేమికలదు ?


అంతియే కాదు. శైవులకును నైష్ణవులకును సంబంధించిన లోకోక్తు లెంతటి బలవద్విరోధమునో సూచించునట్టివి యున్నవి. అయిన వీ రేక జాతివారు కారని యెవ్వరును అనుట లేదు. వేదా ధారమతము 'జై నమతము కాదు. అయిన నీ రెండుమతముల వారును భిన్న జాతులు కారు. నిజమిది.మనము దాసులమైనాము. అందుచేత ఒండొరులతో పోరాడుకొని మనపోరాటమును

మూడవవాని మూలకముగా తీర్చుకొన నిచ్చగించు చున్నాము.
56

హైండప స్వరాజ్యము.

మహమ్మదీయులలో విగ్రహవిచ్ఛేదకు లెట్లుకలరో హిందువు లలోకూడ నట్టివారుకలరు. మనము విజ్ఞానాభివృద్ధి నందిన ట్లెల్ల మతేతరులతో పోరాడ నవసరము లేదనుట దృఢతరముగా నర్థము కాగలదు.


చదువరి: గోరక్షను గురించి మూయభిప్రాయము వీనవలతును.


సంపా: నాకు గోవు నెడ గౌరవముకలదు. ప్రేమపూర్వక మగు పవిత్ర భావమున్నది. భారత భూమి వ్యవసాయక దేశము. గోసంతతి మీద నాధారపడినది. కావున గోవు హైందవ భూమికి శరణ్యము. గోవు ఇంకను వేయివిధముల నుపయోగకారి. మహ మ్మదీయ సోదరు లిది కాదనరు.

కాని నేను గోవును గారవించునట్లే సోదరప్రజనుకూడ గౌరవింతును. మానవుడు హిందువు కాని మహమ్మదీయుడు కాని గోవువలెనే యుపయోగకారి. ఇట్లుండ గోవు నురక్షించు టకుగా నేను మహమ్మదీయునితో పోరాడుట కానిఆతనిని సంహ రించుట కాని తగునా ! అట్లు చేయుదు నేని నేను మహమ్మదీయ సోదరునకును గోవునకును రెంటికిని శత్రువునగుదును. కాబట్టి గోరక్షణకు ఒక్క టేమార్గము, మహమ్మదీయ సోదరుని దరిసి దేశ క్షేమమునకు నాతోకలిసి గోవును సంరక్షింపవలసినదని

అతనిని వేడికొందును. అతడంగీకరింపడేని కార్యము నాకు

57

భారత భూమిస్థితి.

నసాధ్యము కావున గోవును పోనిచ్చుట తప్పదు. గోవు నెడల నా కత్యంత ప్రియం బైన యెడల దానిసంరక్షణకై నాప్రాణము సమర్పింపవలసిన దే తప్ప అందుకయి యొరుల ప్రాణము కొన రాదు. ఇది మనమతముయొక్క, సిద్ధాంతమని నావిశ్వాసము. మనుష్యులు 'పెడబుద్ధులై నప్పుడు పరిస్థితి విషమ మగును. నే నేదాడనిన మహమ్మదీయ సోదరుకుకోదాడనును. నేనుగం భీర దృష్టి నటించిన అత డట్టిరీతినే ప్రత్యుత్తరమిడును. అతనికి మర్యాద గా నమస్కరి చిన ఆతడు పదింత లెక్కువమర్యా దతో నమస్కరించును. అట్లు చేయడేని "నేనమస్కరించుట దోషమని యెవ్వరును ననబోరు. హిందువు లెప్పుడు పోరు పె ట్టిరో ఆనాడు గోహింస మిక్కుటమయ్యెను. నాయభిప్రాయ మున గోరక్షక సభలు నిజముగా గోహింసక సభలు. అట్టిసభ లవసరమై యుండుటయే మనకు లజ్జాకరము. గోరక్షణ మార్గము మనము మరచినందు చేతనే ఈసభలవసర మైనవి. రక్తసంబంధ సోదరుడు గోసంహారమునకు కడంగినాడు. నేనేమి చేయవలెను ! అతనిని పైబడి సంహరింపవలెనా లే కున్న నతని పాదములబడి ప్రార్థింపవలెనా ! రెండవమార్గ మే అవలంబనీయ మందురు కదా! ఇప్పుడు మహమ్మదీయ సోదరుని యెడ నవలంబింపవలసిన మార్గ మదియేకదా ?


హిందువులు గోవులను హింసించి నశింపజేయుట లేదా?

అప్పు డెవరు వానినిరక్షించుచున్నారు.గోసంతతిని కర్రలతో
58

హైందవ స్వరాజ్యము.


పొడిచి కన్నకష్టముల బెట్టు హిందువు లెందరు లేరు. అప్పు డెవరు సంరక్షణకర్తలు ! ఇదెల్ల యు మన యేక జాతీయత కడ్డ మువచ్చినదా?


తుదివిషయము. హిందువు లహింసావాదులును మహమ్మదీ యులు తదితరులును అగుట నిజమే యయినచో హిందువుల ధర్మమేమి? అహింసా మతానుసారి సోదరమానవునిచంపవచ్చు నని ఎవరు లిఖించిరి ! అతనికొక్కటే ఋజుపథము. ఒక జీవ మును కాపాడుట కింకొకని జంపరాదు. మనసు కరగునట్లు ప్రార్థింపవచ్చును. అంతియే తనధర్మము.


ఇక, ప్రతిహిందువు అహింసావాదియేనా ? బునాదులకు దిగి ఆలోచింతు మేని మనలో నొక్కడు కూడ అహింస మత ముగా బ్రతుకుట లేదు. మనము ఏదో యొక రీతిని జీవహింస చేయుచునే యున్నాము. హిందువులలో అనేకులు మాంసా హారు లున్నారు. వారెబ్బంగిని గూడ అహింసావలంబకులు గారు, హిందువులహింసాపరులు మహమ్మదీయులు కారు, కాబట్టి వీరికి పొత్తుపొసగదు, అనువాదము ఈ కారణము చేత మృషా వాదము.

స్వార్థపరులగు ఆచార్యబృవు లీ గండరగోళము నంతయు

కల్పించుచున్నారు. ఇంగ్లీషువారందుకు మెరుగు పెట్టుచున్నారు.

59

భారతభూమిస్థితి.

వారు చరిత్ర వ్రాయుటయం దొకమార్గము తొక్కుదురు ; లోకములోని యెల్బరగుణములను అభ్యాసములను వారుగ్రహిం చుట నటింతురు. దైవము మనకు పరిమితమగు బుద్ధిని ప్రసా దించినవాడు. వారతని ధర్మములను తామే తలధరించి నవనవ ప్రయోగములనన్నియు గావించుచుందురు. తమ కని పెట్టిన వానిని గురించి తామే అట్టహాసముగా వ్రాసి మనకు నమ్మకము కలుగునట్లుగా మోహమున పడవేయుచున్నారు.మనమ జ్ఞానముమై వారి పాదముల కెరగుచున్నాము.


దుర్మతమును మానదలచుకొనునారు కొరానును చదివి చూడవచ్చును. హిందువులకు అంగీకారార్ల ములైన సూత్రము లందు నూర్ల కొలదికలవు. అ దేరీతిని భగవద్గీతలోను మహమ్మ దీయుల కేమాత్రమును అభ్యంతరా ములుకాని సూత్రము లెన్ని యో యున్నవి. కొరానులో నాకర్ధము కానట్టివో నాకు రుచింపనియట్టివో వాక్యము లున్నవని నేను మహమ్మదీయులతో పోట్లాడుదునా ! ఇరుపక్షములున్నగాని పోట్లాట పొసగదు. కాబట్టి నేను మహమ్మదీయ సోదరునితో పోట్లాడ నిచ్చగింప నేని నాపై పోట్లాటను తెచ్చి పడ వేయజాలడు. అదేరీతిని పోట్లా టకు తాను సాయముచేయడని మహమ్మదీయ సోదరుడను నేని నాకును పోట్లాటకు శక్తి కలుగదు, అంతరాళమున చేయివిస

రిన చేయి నొప్పిపట్టవలసిన దే కాని మ రేమియు కాదు. ఆచార్య
60

హైందవ స్వరాజ్యము.

బృవుల కాకరమీక ప్రతివాడును తన మతమునందలి సత్యము నేరిగినచో పోట్లాటలకు అవకాశమే యుండదు.


చదువరి: మన ఇరు తెగలను ఇంగ్లీషువా రెప్పటి కైనను చేర నిత్తురా ?


సంపా : మీ యధైర్యమే ఈ ప్రశ్నకు కారణము. మన తెలివితక్కువకిది తార్కాణము. ఇద్దరు సోదరులు సుఖముగా శాంతముగా బ్రదుక దలచుకొనిన యెడల , మూడవవానికి చెరుపసాధ్యనూ! దుష్టబోధలను వినినచో వారిని మన మవివే కులమనమా? ఇంగ్లీషు వారు హిందూ మహమ్మదీయుల విభేద పరుపగలిగిన యెడల అది మన లోపమే కాని వారిలోపమంతగా కాదు.మృద్ఘట మొక్క రాతి తాకుడునకుగాకున్న మరియొక్క రాతి తాకుడున కైనను పగులగలను. కాబట్టి ఆ ఘట మును సంరక్షించుటకు మార్గము రాయిరప్పనుండి దూరము తీసుకొనిపోవుట గాదు. చక్కగా కాల్చి బలపరచుటయే పరమ సాధనము. మసహృదయములు మట్టివి కాకూడదు.వజ్రసన్నిభ ములుగా తప్తములైనవి కావలెను. అప్పుడు సర్వాపాయ ములనుండి సంరక్షితుల మగుదుము. ఈపని హిందువు లెక్కు వగా చేయవచ్చును. వారు సంఖ్యలో నెక్కువ. విద్యా వంతులనికూడ చెప్పుకొంచరు. అందుచేత హిందూమహ మ్మదీయ సఖ్యము చెడకుండ కాపాడుటకు వారెక్కువ

“సమర్థులు.
61


భారతభూమిస్థితి.


పరస్పరము ఈ రెండు సంఘములకు అవిశ్వాసము కలదు.. మహమ్మదీయు లందుచేత మార్లీ ప్రభువునొద్ద కొన్ని ప్రత్యేక స్వాతంత్ర్యములు కోరుచున్నారు. దీనిని హిందువు లేల ప్రతి ఘటింపవలెను ? హిందువులు ప్రతిఘటింపక యుండినచో ఇంగ్లీషు వారికది మనసున కెక్కును. మహమ్మదీయులు క్రమముగా హిందువులను విశ్వసింతురు. సోదర భావము ఫలించును. ఇంగ్లీ షువారి వద్దకు మనవిభేదములను తీర్పునకు కొనిపోవుట సిగ్గు మాలిన తనము. ఊరకుండిన హిందువునకు నష్టము లేదనుట యెవ్వరికై నను అర్థము కావలసిన దే. ఒకడు రెండవవానికి విశ్వాసపాత్రుడగునేని మొదటివానికి నష్ట మెక్కడను సంభ వింపదు.


హిందూమహమ్మదీయు లెప్పుడును పోట్లాడుకొనరని నే ననువాడను కాను. ఏక కుటుంబములో నివసించుసోదరు లే ! యెన్ని విషయములలోనో కలహింతురు. నెత్తులు పగులగొట్టు కొందురు. అట్లు జరుగవలెననుట అవసరము కాదు. కానియెల్లరు లోకమున సమభావులు కారు. ఆగ్రహావేశు లైనప్పుడు మనుష్యు లెన్ని యో వివేకవిహీనప్రవర్త నలపాలగుదురు. ఇవియన్నియు మనము భరింపక తీరదు. అయిన,మనము పోట్లాడుకొని నప్పుడు ఇంగ్లీషు న్యాయస్థానములకు గాని మరియే న్యాయస్థానము

లకుగాని పోనక్కర లేదు. న్యాయవాదుల నియమించుకొన
62

హైందన స్వరాజ్యము.


నవసరము లేదు. ఇరువురు పోట్లాడినారు. అందులో ఇరువు రకో ' ఒక నికో శిరస్సు బ్రద్దలైనది. మూడవ వాడు వీరికి న్యాయము తీర్చు టెట్లు ! పోట్లాడువారికి గాయపడుదు మేయను జాన ముండవలదా?