హరివంశము/పూర్వభాగము-తృతీయాశ్వాసము

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - తృతీయాశ్వాసము

శ్రీమత్పంటకులాంబుధి
సోమ [1]చిరయశోమహత్త్వశోభతలోభ
వ్యామోహరహితకోమటి
[2]వేమ సమిద్ధప్రతాపవిపులస్తోమా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకు జెప్పె నట్లు పితృసమారాధనవిశేషం
బులు వివరించి వైశంపాయనుండు జనమేజయునకు మరియు ని ట్లనియె. వృష్ణి
వంశప్రసంగంబున ని ట్లన్నియుం చెప్పితి నింకఁ దన్మూలం బైన సోమాన్వయ
క్రమంబు వినుము పరమేష్టికి మానసపుత్రుం డగు నత్రిమహాముని యఖిలలోక
హితార్థంబు మనోవాక్కాయకర్మంబులు ధర్మంబునం దగులం గాష్ఠకుడ్యశిలా
సదృశుం డై నిలిచి యూర్ధ్వబాహుతయు నిర్నిమేషావలోకనంబును సర్వలోకా
సాధారణంబుకు నై యమర మూడువేలదివ్యవర్షంబులు మహాతపంబు గావించి.

2


క.

తనశుక్ల మూర్ధ్వగతముగ, నొనరించిన నశ్రుబిందు [3]లొలికి యతనిలో
చనములఁ గాంతిమయము లై, యనయము నొకప్రోవు గట్టి యవి వెలుఁగంగన్.

3


మ.

అది సోమాహ్వయ మైన గర్భముగఁ బ్రేమాయత్త లై దిక్కులా
పదియుం గైకొని కాల్చి యంతన భరింపంజాల కుర్విస్థలిన్
బ్రిదులన్ వైచినఁ జూచి యక్షణమ సంప్రీతిన్ విరించుండు వ
చ్చి దయాలీల యెలర్పఁగాఁ ద్రిభువనక్షేమక్రియాకాంక్షి యై.

4


క.

సితవాజిసహస్రసమం, చితమగు తేరిపయి నిడినఁ జెలువొందె మహా
ద్యుతి యగు గర్భము సోముం, డితఁ డన బాలుఁ డయి వేల్పు లెల్ల నుతింపన్.

5


వ.

ఆసమయంబున భృగ్వంగిరసప్రముఖులగు చతుర్ముఖతనయు లతని ననేకంబు లగు
ఋగ్యజుస్సామసూక్తంబులఁ బ్రస్తుతించిరి తత్తేజంబున జగంబులెల్ల నాప్యా
యనంబు నొందె గర్భపాతంబు నప్పుడు సెదరి పుడమిం బడిన కాంతిశకలంబులు
మహోషధు లై యొప్పె నట్లు జనియించిన కుమారుండు.

6

ఉ.

[4]తొంబదివేలపద్మములు తోరపుసంఖ్యగ నొప్పునట్టి య
బ్దంబులు దారుణం బగు తపం బొనరించిన నిచ్చ మెచ్చి య
య్యంబుజసూతి యోషధుల నప్పుల విప్రుల నేలువానిఁగాఁ
బంబిన వేడ్కతో నతనిఁ బట్టము గట్టిన నత్యుదగ్రతన్.

7


శా.

రాజై యాతఁడు బ్రహ్మ యిచ్చిన యనర్ఘస్యందనం బెక్కి నీ
ర్వ్యాజస్ఫూర్తి త్రిసప్తవారములు పారావారపర్యంతధా
త్రీజైత్రత్వము నొంది యాత్మమహిమన్ శ్రీ లెల్లఁ దన్ జేరఁగా
రాజత్తేజము గాంచెఁ బ్రస్ఫురితసామ్రాజ్యైకపూజ్యస్థతిన్.

8


వ.

అట్టి యైశ్వర్యంబునకుఁ బ్రియం బంది ప్రాచేతసుం డగు దక్షుండు తన కూఁతుల
నిరువదియేడ్వురఁ బత్నులంగా నొసంగినం గైకొని యారాజు రాజసమాజపూ
జితం బగు రాజసూయం బొనరించునెడ నత్రి హోతయు [5]భృగుం డధ్వర్యుండు
[6]నారదుం డుద్గాతయు బ్రహ్మ బ్రహ్మయు [7]సనత్కుమారప్రముఖపరివృతుం డగు
నారాయణుండు సదస్యుండును నై రప్పరమపుణ్యుం డగణ్యహిరణ్యరత్నరజ
లరాశిభాసితం బగు త్రైలోక్యంబును యజ్ఞదక్షిణగా నిచ్చె నని చెప్ప విందుము.

9


తే.

ద్యుతియుఁ బుష్టియుఁ దుప్టియు ధృతియుఁ బ్రభయు
వసువు కీర్తియు ననుపేరివనిత లతనిఁ
బొంది రట్టియైశ్వర్యవిస్ఫూర్తి నెందుఁ
బరఁగి యతఁడు [8]మదిమది భ్రాంతి గదిరి.

10

చంద్రుఁడు బృహస్పతి భార్య యగు తారం గొనిన ప్రకారము

చ.

సురగురు భార్యఁ దార యను సుందరిఁ బుణ్యచరిత్రఁ దత్పతిన్
బరిభవ మొందఁజేసి కనుబల్మి హరించి మహామునీంద్ర ని
ర్జరవరు లెంత చెప్పినను సక్తిమెయిన్ విడువంగ నొల్ల కు
ధ్ధురతయ చూపుచున్ సతతదోహలతన్ విహరించుచున్నెడన్.

11


వ.

వాచస్పతిజనకుం డగు నంగిరసునకు శిష్యుండు గావున శుక్రుం డాబృహస్పతి
పక్షం బంగీకరించె. భార్గవస్నేహంబున భర్గుం డజగవం బనుచాపంబు గైకొని యాటో
పంబున గురునివాఁడై నిలిచె. నప్పుడు చంద్రాపరాధంబులోని వారిన కా నిరూపించి.

12


క.

పురహరుఁడు బ్రహశిర మను పరమాస్త్రం బమరవరులపైఁ దొడిగినఁ ద
చ్చిరకీర్తి యెల్ల నాశముఁ, బొరసెను బలహీను లైరి పొలుపఱి వారల్.

13


వ.

ఇట్లు నిస్తేజు లైన [9]యహితులతెఱం గెఱింగి దైతేయులు గడంగిన.

14


తే.

దారుణం బగు సమరంబు దారకామ, యంబు నాఁగ దేవతలకు నసురలకును

గరము నిడవిగా లోకసంక్షయ[10]విధాయి, యగుచు వర్తిల్లెఁ గౌరవాన్వయవరేణ్య.

15


వ.

అందు దైత్యులచేత నాదిత్యులు పెక్కండ్రు మడిసిరి. శేషించినవారు వారి
రుహాసను శరణుసొచ్చిన నద్దేవుండు మహాదేవుం బ్రార్ధించి యుడిపి భార్గవుని
రావించి తారం దెప్పించి బృహస్పతి కిప్పించె. నప్పు డంతఃప్రసవయై యున్న
యన్నాతిం గనుంగొని యాంగిరసుం డిది మదీయతేజంబు గా దనవుడు.

16


క.

తనరునిషీకాస్తంబం, బునమఱువునఁ బువ్వుఁబోణి పుత్రుని గర్భో
జ్జనితునిఁ బావకసమతే, జుని నల్లన యుజ్జగించె స్రుక్కుచు భీతిన్.

17


తే.

జాతమాత్రుఁ డై బాలుఁడు సర్వసురల, యొప్పులును గెల్చెఁ దనమేనియొప్పుపేర్మి
నతనిఁ జూచి వేల్పులు విస్మితాత్ము లగుచు, సంభ్రమావేశ మొందఁ దజ్జననిఁ బిలిచి.

18


ఉ.

సోమునిపట్టియో గురునిసూనుఁడొ యీతఁడు దీని యున్నరూ
పేమియుఁ గొంక కీవు ధవళేక్షణ చెప్పు మనంగ సిగ్గునన్
భామిని గీడుమే లొకఁడు పల్కద దానికి నల్గి తత్సుతుం
డామగువన్ శపించుటకునై కడఁగన్ బరమేష్ఠి గ్రక్కునన్.

19


ఉ.

ఆతని మాన్చి తారఁ గడుఁబ్రార్థన మొప్పఁగ బుజ్జగించి భా
మా తెలియంగఁ జెప్పు మసమానవిభానిధి యైన యీతనూ
జాతునిహేతు వై నతఁడు [11]సత్య మొకానొకఁడెవ్వఁ డన్న నా
శితమయూఖుఁ డంచు సరసీరుహలోచన యొయ్యఁ బల్కినన్.

20


క.

చనుదెంచి సోముఁ డప్పుడు, తనయుఁ దిగిచి కౌఁగిలించి తన్మస్తము మూ
ర్కొని బుధుఁ డనునామ మతని, కొనరిచె మునిదేవతాసముత్కర మలరన్.

21


వ.

బృహస్పతియుఁ దారం గైకొని చనియె. సురలు సురజ్యేష్ఠుని వీడ్కొని నిజ
నివాసంబుల కరిగి. రట్టిదారుణం బగు గురుదారహరణదురితంబున.

22


తే.

రాజయక్ష్మరోగార్తుఁ డై రాజు ప్రతిది, నంబుఁ బ్రక్షీణమండలత్వంబు నొంది
తండ్రి శరణంబు సొచ్చిన దయ దలిర్ప, నత్రి తత్పాపపరిహార మాచరించె.

23


క.

ఆవెరవునఁ గ్రమ్మఱఁగఁ ద, నూవృద్ధి వహించి విధుఁడు నూతనకాంతి
శ్రీవిలసిల్ల జగత్త్రయ, జీవనహేతు వనువినుతి నేకొని వెలిఁగెన్.

24


క.

ఈయాఖ్యానము భక్తిం, బాయక చదివినను వినినఁ [12]బాపరహితుఁడై
యాయుర్వర్ధనపుత్ర, శ్రీయుక్తియుఁ దనరి నరుఁడు చెన్నొందు నిలన్.

25


ఉ.

సోమతనూజనందనుఁడు సుందరమూర్తి పురూరవుండు ల
క్ష్మీమహిమన్ వెలింగెఁ బరిశీలిత[13]యజ్ఞుఁ డుదాత్తుఁ డార్తర
క్షామణి యుద్ధశౌండుఁడు విచక్షణుఁ డక్షతసత్త్వుఁ డత్యుదా
త్తామలచిత్తుఁ [14]డాత్మపరమార్థవివేకుఁ డనంగ నున్నతిన్.

26

చ.

సురలకు లేనియాతని విశుద్ధగుణంబుల కాత్మ నెంతయుం
గరఁగి వధూజనైకతిలకం బగు నూర్వశి కాన వచ్చి ని
ర్భరవిభవోత్సవస్ఫురితభక్తి వరించిన నాదరించి యా
నరవరుఁ డిష్టభోగకలనం జరితార్ధగఁ జేసె నుగ్మలిన్.

27


సీ.

మందాకినీసరి న్మహితతీరంబుల నందనంబున మేరునగతటంబు
లన్నింట హేమకూటాద్రిశృంగంబుల గంధమాదనశైలకందరములఁ
జైత్రరథాంతరఫలముల నలకాపురంబున మఱియు నిర్జరవిహార
లలితదేశము లెన్ని గలిగె నం దెల్ల నయ్యింతియుఁ దాను నశ్రాంతకేళి


తే.

[15]నైదు నేడును నెనిమిది నాఱుఁ బదియు, బదియు నైదును నెనిమిది వరుసతోడ
నేఁడు లొక్కొక్కచోటఁగా నెంతయేనిఁ, గాల ముద్వేలసౌఖ్యాబ్ది నోలలాడె.

28


వ.

అమ్మహారాజునకు రాజధాని యై భాగీరథి యుత్తరకూలంబునఁ బ్రతిష్ఠానం బను
పురంబు సుప్రతిష్ఠంబు లగు గరిష్టసంపదల నొప్పారె. నంత.

29

రజి యనురాజుచరిత్రంబు సంక్షేపంబుగా నెఱిఁగించుట

క.

ఆయువును నమావసువు దృ, ఢాయువును వనాయువును శతాయువు ననఁగా
నాయూర్వశియం దతనికి, ధీయుతు లుదయించి రధికతేజులు పుత్రుల్.

30


వ.

అం దగ్రజుం డైన యాయువునకు నహుషుండును వృద్ధశర్ముండును రంభుండును
రజియును ననేనుండు నన నేవురుకొడుకులు పుట్టిరి. వారిలో రజికిఁ బంచశత
తనూజులు జనియించి రాజేయు లనం బ్రఖ్యాతులయి. రాసమయంబున.

31


క.

అమరులు నసురలు నీసున, సమరమునకుఁ దొడఁగుచుండి సన్నతులయి య
క్కమలజు నడిగిరి తమలో, నమరఁగ నెవ్వరికి విజయ మగు నని యధిపా.

32


వ.

అడిగిన నద్దేవుండు వారి కి ట్లనియె.

33


క.

ఘోరాయుధకరుఁ డై యె, వ్వారికినై కడఁగి యాహవం బొనరించున్
వీరవరుఁడు రజిభూపతి, వారలఁ ద్రిలోక్యవిజయవైభవ మొందున్.

34


క.

ధృతి యుండును రజి యున్నెడ, ధృతిఁ బాయక శ్రీ వెలుంగు ధృతియు సిరియు సం
గత మయినచోట విజయో, న్నతి ధర్మము దాన [16]యమరు నావుడుఁ బ్రీతిన్.

35


వ.

ఆ రాజు రాహుదౌహిత్రుండు గావున మాతృవంశంబువా రగుటం జేసి
దైతేయు లాతని నాత్మీయసాహాయ్యకంబునకు నభ్యర్థించిన నతండు.

36


క.

దివిజుల జయించి మిమ్మును, దివిజుల నే నేలువాఁడఁ దెల్ల మిది ప్రియం
బవునే యనవుడు నొడఁబడ, కవనీవల్లభునితోడ ననిమిషవైరుల్.

37


వ.

మాకు నధీశ్వరుండు ప్రహ్లాదుండ. యస్మదీయం బగు నుత్సాహం బఖిలంబును దద
ర్థంబ యీసమయంబున కమరు లియ్యకొనినం గొనిరి కాని యే మొల్ల మనిన
ననిమిషు లవ్విధంబునకు నిచ్చగించి యతనికి నింద్రత్వం బిచ్చువారై. రంత.

38

మ.

[17]వినమత్కారుకమేఘముక్తనిశిఖోద్వేలాంబుధారావళిన్
దనుజాంభోజవనీ[18]సహస్రముల విధ్వంసంబు నొందించి య
య్యనపాయుండు తదాశ్రయస్థ మగు నుద్యద్రాజ్యలక్ష్మిన్ సుధా
శనగేహంబున శాశ్వతంబుగఁ బ్రతిష్టాపించెఁ బెం పేర్పడన్.

39


వ.

అప్పుడు పురుహూతుండు.

40


క.

నీ వింద్రుఁడ వై తొడఁబా, టీవిధ మగుటను నరేంద్ర యేఁ బుత్రుఁడ నై
నీవిభవమునకు యుక్తుఁడఁ, గావలవదె యనిన నల్ల కా కని రజియున్.

41


వ.

దివంబున నుండి దేవేంద్రలక్ష్మి యనుభవించెఁ. దత్పుత్రు లందఱు భూలోకంబు
విడిచి నాకలోకంబునక పోయి శతక్రతుండు తోడంబుట్టు వగుట నతనిఁ దమ
లోన నొకని[19]తోడి వాలివానంగాఁ జేసి యఖిలరాజ్యంబును దార యాక్రమించి
సర్వలోకంబును భుజియించి. రట్టి ప్రవర్తనంబుల బహుదీర్ఘం బగు కాలంబు గడచె.
నివ్విధంబున.

42


క.

సిరిఁ బాసి వాసవుఁడు దన, గురుఁ గానఁగ నరిగి యతనిగురుతరచరణాం
బురుహముల కెరఁగి [20]యపరి, స్ఫురితము లగుగద్గదోక్తముల ని ట్లనియెన్.

43


మ.

రజిచే గద్దియ గోలుపోయి విభుతాభ్రష్టుండ నై క్రమ్మఱన్
రజిపుత్రావళి యాక్రమంబున ననర్థంబుల్ పొరిం బైకొనన్
నిజమై యెందును నిల్వనేరక విపన్నిర్మూఢతం దూలెదన్
సుజనశ్రేష్ఠ యొకింత నాదెస కృపం జూడందగుం జూడవే.

44


క.

మదిలో [21]నన్నుఁ దలంచుచు, బదరీఫలమాత్రహవ్యభాగ మనలునం
దొదవించితేనియును న, భ్యుదయము నే నొంది మూరిఁబోవనె చెపుమా.

45


చ.

అనిన నతండు నీవు నను నక్కట యిం తన నేల మున్న యీ
పని యెఱిఁగించితేని నశుభంబులు నీదెసఁ జేరనిత్తునే
విను మిటసూడు సర్వమును వేగమె మేలుగ నుద్వహించెదన్
మనమున శంకఁ దక్కు మనుమానము మానుము లేదు భారమున్.

46


వ.

అని యతని నాశ్వాసించి విశ్వక్రియాధుర్యుం డగు నయ్యాచార్యుండు తదీయ
తేజోవృద్ధివిధాయియుఁ బరప్రభావపరిభావియు నగు ననుష్ఠానంబు నిర్వహించిన.

47


క.

రజిసుతులు కామరోష, ప్రజనితదర్పమున మోహపరులై ధర్మ
త్యజనంబు సేసి సాధు, ద్విజవిద్వేషాదిదురితవృత్తిఁ దగిలినన్.

48


మ.

బలముం దేజముఁ దప్పి పోవుటయుఁ గోపం బార జంభారి యు
జ్జ్వలదంభోళిఁ బరాక్రమించి పటుగర్వస్ఫూర్తి నయ్యందఱం

బొలియింపంగఁ దొలంగి పోయె రజి యుద్భూతప్రభావోగ్రుఁ డై
బలవిద్వేషి పునఃప్రతిష్ఠ గనియెం బ్రాజ్యస్వరాజ్యంబునన్.

49


క.

శతమఖరాజ్యావాప్తి, ప్రతిపాదక మైన యీయుపాఖ్యాన[22]ము వి
శ్రుతమై దీర్ఘాయురరో, గతలును దురితాపగమముఁ గావించు భువిన్.

50

యయాతిమహారాజుచరిత్రంబు సంక్షేపంబుగాఁ జెప్పుట

వ.

అని చెప్పి వైశంపాయనుం డి ట్లనియె. నహుషునకు యయాతియు సంయాతియుఁ
బ్రయాతియు ననువారు పుట్టి. రందు యయాతి శుక్రపుత్రి యైన దేవయాని
యిందు యదుతుర్వసు లనువారి నిద్దఱను వృషషర్వపుత్రి యైన శర్మిష్ఠయందు
[23]ద్రుహ్య్వనుపూరుల ననంగా మువ్వురం బుట్టించి యైశ్వర్యంబున ననిమిషేశ్వర
సదృశుండై వెలింగె.

51


చ.

అనుపమదివ్యవాహయుత మైన రథంబు సురేంద్రుఁ డాదరం
బున నొనఁగంగఁ [24]గాంచి యిరుమూఁడుదినంబుల సర్వభూతలం
బును నతఁ డేలెఁ దత్సుతుఁడు పూరుఁడు లోనగు వైన్యు లెల్ల న
జ్జనపతియట్ల యమ్మహితసాధన నేలిరి పేర్మి యొప్పఁగన్.

52


వ.

[25]పెక్కబ్దంబు ల ట్లరిగినం బారిక్షితుం డగు జనమేజయుండు గర్గతనయుం డగు
బాలుం బ్రమాదంబున వధియించి బ్రహహత్యఁ దగిలి లోహగంధి యగు దేహం
బుతోఁ బౌరజానపదులచేతం బరిత్యక్తుం డయి తిరుగుచు శౌనకుం డను మహా
ముని నాశ్రయించి యతండు తురగమేధంబు సేయింపం గిల్బిషంబువలనం బాసె.
మున్ను పాతకి యైనప్పుడ యాదివ్యస్యందనం బంతర్ధానం భై నిలువక నాకంబు
నకుం బోయిన.

53


క.

ఉపరిచరవసువునకు నె, య్యపువెరవున నింద్రుఁ డిచ్చె నత్తే రాచే
దిపతివలన మగధనరా, ధిపుఁడు బృహద్రథుఁడు వడసెఁ దేజం బెసఁగన్.

54


వ.

తత్సుతుం డగు జరాసంధు వధియించి భీముండు వాసుదేవున కిచ్చె. నట్లు యయాతి
సప్తద్వీపంబులుం దన బాహుబలంబున సాధించి.

55


సీ.

[26]పూర్వోత్తరం బగు పుడమికి [27]నొడయుఁగా నొనరించి యదునగ్రతనయు నిలిపె
దక్షిణపూర్వమై తనరుదేశమునకుఁ బ్రభువుఁగాఁ జేసి తుర్వసుని నిలిపెఁ
బశ్చిమోదగ్భూమిభాగముల్ రెంటికి నధిపతులుగ ద్రుహ్యు ననుని నిలిపె
మధ్యమం బై యొప్పుమండలంబునఁ బరిస్ఫుటభూతిగంభీరుఁ బూరు నిలిపె


తే.

సకలరాజ్యంబు [28]సుతులకు సత్కరించి, తాను సన్యస్తశస్త్రుఁ డై తనరు విషయ

భోగములమీఁదితృష్ణ యుప్పొంగ[29]సుతులఁ, బెంపు శోభిల్లఁ బిలిచి సంప్రీతితోడ.

56


క.

తనముదిమిఁ బుచ్చికొని యౌ, వన మిం డని వేఱువేఱ వారల నర్థిం
చిన నెవ్వరు నీరై రా, జనపతి నలువురకు నిచ్చె శాపము లోలిన్.

57


క.

[30]కడపటివాఁ డగు పూరుం, డడుగక[31]మును దండ్రి కాత్మయౌవన మిచ్చెన్
గడుసంతసమునఁ గైకొని, యడరెడు రాగంబుతోడ [32]నతివలుఁ దానున్.

58


తే.

దేవయానసమేతుఁ డై దేవచరిత, భూములందుఁ బ్రభూతసంభోగరుచులఁ
పెద్దగాలంబు విహరించి పెరుగుచున్న, కామమున కేమిటను గడ గానలేక.

59


వ.

క్రమ్మఱం బూరుపాలికి వచ్చి యతని యౌవనం బతనిక యిచ్చి యాత్మీయం బగు
జరాభారంబు వహించె. కామోద్దేశంబు లగు వానిం బేరుకొని సుభాషితంబు
లి ట్లని యుదాహరించె.

60

యయాతిమహారాజు పఠించిన సుభాషితంబులు

తే.

అంగములు కూర్మ మెట్లు ప్రత్యాహరించు నట్లు, కామము [33]దమయంద యడఁపఁజాలు
ధన్యచిత్తుఁ డానందతత్త్వంబు నొందు, నితరు లెల్లఁ గాలగ్రస్తు లింత నిజము.

61


క.

పసిఁడియు బశువులు భామలు, వసుమతిమీఁదఁగలయంతవట్టు నొకఁడ యిం
పెసఁగఁగఁ [34]బడసియుఁ దనియఁడు, విసువ[35]వలదె తృష్ణవలన విరతిప్రాప్తిన్.

62


క.

సమధికభోగంబులచే, సమయుం గామ మనునది మృషావాదం బా
జ్యమునం దోడ్తో ననలం, బమితం బై యొదవుఁగాక యాఱునె యెందున్.

63


క.

అని పలికి వనంబునకుం జని దేవీసహితుఁ డై యసామాన్యతపం
బొనరించి సిద్ధసేవిత, వినుతగతుల నవ్విభుండు వెలుఁగొందె నృపా.

64


వ.

అని యిట్లు పరమపావనం బగు యయాతిచరితం బెఱింగించిన.

65


క.

విని జనమేజయవిభుఁ డి, ట్లను నస్మద్వంశమునకు నాద్యుఁ డయిన పూ
రునివంశశాఖ లన్నియు, వినవలతుం జెప్పవే పవిత్రచరిత్రా.

66


క.

నావుడు నమ్ముని యి ట్లని, యావిభునకుఁ జెప్పుఁ బూరునాత్మజుఁడు గుణ
శ్రీవిలసితుఁడు ప్రవీరుఁడు, నా వెలసె మనస్యుఁ డతని నందనుఁడు నృపా.

67


వ.

అమ్మనస్యునకు నభయదుండును వానికి సుధన్వుండును సుధన్వునకు సుబాహుం
డును సుబాహునకు రౌద్రాశ్వుండునుం బుట్టిరి. రౌద్రారాశ్వునకు ఋచేయువు
దశార్గేయువు కృకణేయువు కచేయువు స్థండిలేయువు సన్నతేయువు జలేయువు
స్థలేయువు వనేయువు వననిత్యుండు నను పదుండ్రు కొడుకులును రుద్రయు
శూద్రయు భద్రయు మలహయు దలదయు సులభయు నలదయు సురసయుఁ

జపలయు రత్నకూటయు నను కూఁతులు పదుండ్రునుం బుట్టి. రక్కన్యకలకు నత్రి
వంశోద్భవుం డైన ప్రభాకరుం డను మహాముని భర్త యయ్యె. నతండు.

68


తే.

రాహునిహతుఁ డై యినుఁడు ధరాతలమునఁ, బడగవచ్చినఁ బడనీక పరమయశుఁడు
స్వస్తి యగుఁగాత మని పునస్స్వస్థుఁ జేసి, భువనవాసులచే నెల్లఁ బొగడు వడసె.

69


వ.

ఆతని కయ్యింతులందు స్వస్త్యాత్రేయు లను కొడుకు లనేకు లుద్భవించి విప్ర
వంశంబులకుం గర్త లైరి. మఱి కక్షేయువునకు సభానరపరమంథుచాక్షుషులు
పుట్టి. రాసభానరునకుం గాలానలుండు నతనికి సంజయుండు నాతనికిం బురంజయుం
డునుం బుట్టి. రమ్మహీపతికి జనమేజయుండు పుట్టె.

70


క.

జనమేజయునకుఁ బుట్టెను, ఘనుఁడు [36]మహాసారుఁ డన జగద్విదితుఁడు త
త్తనయుండు మహాఘనుఁ డా, యనకు నుశీనరతితిక్షు లాత్మజు లిరువుర్.

71


వ.

ఆ యుశీనరునకు నృగయయుఁ గ్రిమియు వాయయు దర్వయు దృషద్వతియు
ననుపత్ను లేవురయందును వేర్వేఱక్రమంబున నృగుండును గ్రిమియును నపుం
డును సువ్రతుండును శిబియునుం బుట్టిరి. శిబి సార్వభౌముం డై వెలసెఁ. దద్వం
శ్యులు శైబ్యు లనఁ బ్రసిద్ధు లైరి. సృగునకు యౌధేయు లను పుత్రులు పుట్టిరి.
నవునకు నవరాష్ట్రంబును గ్రిమికిఁ గ్రిమిలాపురంబును సువ్రతునకు నంబష్ఠవిష
యంబును నుపభోగ్యంబు లయ్యె. నింకఁ దితిక్షువంశంబు వినుము.

72


క.

ధీరుఁడు తితిక్షుసుతుఁడు మ, హారథుఁడు పృషధ్రుఁ డనఁగఁ బ్రాగ్దేశంబుల్
గోరి భుజియించె సుతుఁ డ, వ్వీరవరున కుద్భవించె [37]ఫేనుఁ డనంగన్.

73


క.

[38]ఫేనుఁడు సుతపుఁ గనియె న, మ్మానవపతికిని జనించె మానసజని యై
దానవబలి [39]బలి యనఁ జతు, రానను [40]పని కాత్మయోగహారివిభూతిన్.

74


వ.

అతఁడు బ్రహ్మవలన మహాయోగీశ్వరత్వంబుఁ గల్పపరిమాణం బైన యాయువు
ననేకవంశకర్తృత్వంబును వరంబులుగాఁ బడసి యంగవంగసుహ్మపుండ్రకళింగు
లను పుత్రులం గాంచె. నయ్యేవురుం దమపేళ్ల నేను జనపదంబులు గావించిరి. వారి
లోన నంగుండు.

75


క.

సుతు దధివాహనుఁ గనియెను, జితశత్రుని దివిరథాఖ్యు సృజియించె నతం
డతనికిఁ జిత్రరథుం డన, నతిరధుఁ డుదయించెఁ బుత్రుఁ డవనీనాథా.

76


వ.

ఆ చిత్రరథునకు ధర్మరథుండు పుట్టి విష్ణుపదం బను శైలంబున నధ్వరంబు నేసి
సోముని మెప్పించె. నాతనికి దశరథుం డను తనయుండు పుట్టి రోమపాదుం డను
నామాంతరంబు[41]నఁ బరఁగె.

77


క.

అజనందనుఁ డగు దశరథుఁ, డజితుఁడు దనకూఁతు శాంత యనుకన్యఁ బ్రియా
త్మజఁ గా నొసఁగఁగఁ గైకొని, సుజనప్రియుఁ డాత్రిలోకసుందరమూర్తిన్.

78

వ.

ఋశ్యశృంగునకుం బత్నిగా నిచ్చిన నమ్మహాత్ముండు పుత్రకామేష్ఠి సేయింపం జతు
రంగుం డను కొడుకుం గనియె. నాచతురంగునకుఁ బృథులాక్షుండు పుట్టి చంపుం
డను పుత్రుం గాంచె. వానిపేర నంగరాజధాని యగు చంపానగరంబు గలిగె. నట్టి
చంపునకు హర్యంగుండు ప్రభవించె.

79


చ.

మునిపతి ఋశ్యశృంగుఁ[42]డు ప్రమోద మెలర్పఁగ శత్రు[43]దారణం
బను సురవారణంబు దనకై నిజమంత్రబలంబుపేర్మి మే
దినికి డిగింపఁగాఁ గొని యుదీర్ణవిభూతిఁ బురందరాదులం
గొనక వెలింగె శాత్రవ[44]విఘూర్ణనఘోరభుజాబలంబునన్.

80


వ.

అట్టి హర్యంగునకు భద్రరథుండు పుట్టె. నతనికి బృహత్కర్ముండు పుట్టె. నాతనికి
బృహద్భానుండును నవ్విభునకు బృహన్మనుండు నమ్మహీపతికి జయద్రధుండు
నమ్మహీపతికి బృహత్కర్ముండు నారాజునకు విజయుండు నన్నరేంద్రునకు దృఢ
వ్రతుండు నాజననాథునకు సత్యకర్ముండునుం బుట్టి. రిది యంగవంశం. బింక ఋచే
యువు నన్వయంబు సెప్పెద.

81


క.

వినుము ఋచేయువుతనయుం, డనఘా మతినారసంజ్ఞుఁ డతనికి మువురుం
దనయులు సుమతియుఁ బృథుఁడును, ఘనుఁ డప్రతిరథుఁడు ననఁ బ్రకాశితతేజుల్.

82


వ.

వారు వేర్వేఱ వంశకర్త లై. రమ్మువ్వుర [45]వెనుక నందనుం డను కొడుకు ధర్మనే
త్రుం డను నామాంతరంబు గలిగి జనియించి దుష్యంతుండు శుష్యంతుండు ప్రవీ
కుంకు [46]ఖగుండు ననువారి నలువురఁ బుత్రులం గాంచె. నందు దుష్యంతుఁడు.

83


క.

స్వీకృతనాగాయుతబలు, శాకుంతలుఁ బడసెఁ భరతు సర్వదమను లో
కైకప్రకాశకీర్తి న, నేకాధ్వరధుర్యు నార్యహిరచరితు సుతున్.

84


వ.

అతనికి మువ్వురుభార్యలయందుఁ దొమ్మండ్రు కొడుకులు గిలిగి మాతృశాప
కలితం బగు నాశంబు నొందినం బిదప భరద్వాజుండు యజనంబు సేయింప వితథుం
డను [47]తనయుండు జనియించి.

85


సీ.

సుతుల సుహోత్రుఁడు [48]సుతహోత గయుఁడు గర్గుండు కపిలుం డనఁగోరి కనియె
నేవుర నందులో నిద్దఱు కాశ్యుండు గృత్స్న[49]మదుండు నాఁ గీర్తనీయు
[50]లాసుతహోతకు నాత్మజు లుగయించి రాగృత్స్న[51]4మదునకు నగఘ గార్త్స్న్య
[52]మదు లనఁ బరగు బ్రాహ్మణులును క్షత్రియవైశ్యులు గలిగి యవ్వసుధఁ బరఁగి


తే.

రగ్రజుండై న కాశ్యున కధికబలుఁడు, దార్ష్ట్యుఁ డుదితుఁడై సుతు దీర్ఘతపునిఁ గాంచె
దీర్ఘతపునకుఁ బుత్రుండు దివ్యమూర్తి, యైన[53]ధన్వంతరిసమాఖ్యుఁ డవతరించె.

86

వ.

ఆధన్వంతరికిఁ గేతుమంతుఁడును నతనికి భీమరథుఁడును బుట్టిరి. భీమరథునకు దివో
దాసుం డుద్భవించి నికుంభుఁ డను మహాత్ముశాపంబున వేయేండ్లు మనుష్య
శూన్యయై రాక్షసనిలయం బైన నిజరాజధాని యగు వారాణసి వసియింప
ననువుగాక గోమతీతీరంబున నగరంబు గావించి యుండి.

87


సీ.

హైహయదాయాదుఁ డైన భద్రశ్రేణ్యు తనయులు నూర్వురు తనకులంబు
వారలఁ జంపి దుర్వారులై తమఁ బిన్ననాఁడు గైకొనక యున్మాదలీల
[54]మందల విడిచిన మహనీయతపమున సుతుఁ బ్రతర్దనుఁ డను శూరుఁ బడసి
శత్రులఁ జంపించి శత్రుజి త్తనునామ మాత్మజునకు నిచ్చె నతనిపుత్రు


తే.

లలఘుభుజులు వత్సుండు భర్గాహ్వయుండు, నందవవత్సుఁడు పితృభక్తి నతిశయిల్లి
తండ్రి దయ నొసఁగగ ఋతుధ్వజుఁ డనంగఁ, బేరు వడసె నెంతయును సంప్రీతి [55]యలర.

88


వ.

మఱియునుం గువలయం బను నశ్వంబు గలుగుటం గువలయాశ్వుం డనియుం
[56]బ్రసిద్ధుం డయ్యె నతనికి నలర్కుం డనురా జుద్భవించి యనేక[57]శత్రుసంక్ష
యం బాపొదించి కాశీపురంబు క్రమ్మఱ నెక్కించి యఱువదియాఱువేలేండ్లు
వసుధ పాలించె నతని కొడుకు క్షేమకుంచును నాతనితనయుండు సునీథుండు నతని
సుతుండు క్షేమ్యుండుఁ దత్పుత్రుండు కేతుమంతుండును దత్ప్రభవుండు వర్ష
కేతుండును దదీయసుతుండు విభుండు నన వెలసిరి విభునకు నావర్తుంచును
నావర్తునకు సుకుమారుండును సుకుమారునకు సత్యకేతుండును జన్మించి రిట్లు
కాశీశ్వరు లైశ్వర్యంబున నెల్లచోట్లం బేరు గనిరి గర్గుం డను వానివలనం
గలిగినవా రనేకులు నిజకర్మభేదంబుల వేర్వేఱ వివిధబ్రాహ్మణక్షత్రియవైశ్య
శూద్రవంశంబులకుఁ గర్త లై రింక సుహోత్రుసంతానంబు వినుము సుహో
త్రుండు హస్తిం గనియె నాతండు హస్తిపురంబు నిర్మించె నారాజునకు నజ
మీఢద్విమీఢపురిమీఢు అనువారు మువ్వురు పుట్టి రంత నజమీఢునకుం
గేశినియు [58]సలినియు ధూమినియు నను భార్యాత్రయంబు గలిగిన వారిలోనఁ
గేశినికి జహ్నుండు జనియించి.

89

జహ్నునకు గంగాదేవి కూఁతురైన వృత్తాంతము

సీ.

అఖిలరాజన్యుల నాత్మవశ్యులఁ జేసి యైశ్వర్యసామగ్రి యతిశయిల్ల
సర్వమేధం బనుసత్రంబు గావించుచుండంగ నబ్ధిసంయుక్తి కరుగు
గంగ యాతనిమఖాగారంబుపై వెల్లి వొడిచిన నల్లి యద్భుతతపస్వి
యగు నమ్మహాత్ముఁ డయ్యమరతరంగిణిఁ గనుఁగొని తగునె యీగర్వ మిట్లు


తే.

మూఁడులోకంబులందును ముమ్మొగములఁ, బాఱు నిను నెందు లేకుండఁ బట్టి కుదియఁ
దిగిచి నీ రెల్లఁ గ్రోలెద దేవతలకు, నైన మాన్పంగ వశమె నాదయిన పేర్మి.

90

వ.

అనుచుఁ దత్పయఃపానంబునకుం దొడంగిన నతని నఖిలమునివరేణ్యసముదయం
బులు ప్రార్థించి యమ్మహానదిం దదీయదుహితంగాఁ గల్పించి యనల్పం బగు
నయ్యుత్సాహంబు వారించి రట్టి జహ్నుండు శరీరార్ధంబునం దటినీరూపధారిణి
యైన యువనాశ్వపుత్రి కావేరియందుఁ బుత్రు [59]నజితుం డనువానిం గనియె
[60]నజితునకు బలాకాశ్వుండు పుట్టె నతనికొడు కైన కుశికుండు.

91


చ.

తనయు మహేంద్రతుల్యవిభుఁ దా మహనీయునిఁ గాంతు నంచుఁ బే
ర్చిననియమంబునం దపము సేయఁగ దద్దయు భీతిఁ బొంది యా
తనికిఁ [61]బ్రదీప్త తేజమునఁ దాన తనూభవుఁడై జనించె న
య్యనిమిషభర్త గాధి యన నంచితకౌశిక[62]తాసమున్నతిన్.

92


వ.

గాధికి విశ్వామిత్రుం డగ్రజుండుగా విశ్వరథుండు విశ్వకృత్తు విశ్వజిత్తు నను
కొడుకులును సత్యవతి యను కూతురుం బుట్టి రాసత్యపతి ఋచివలన జమ
దగ్నిం గాంచె విశ్వామిత్రునకు దేవరాతప్రముఖు లనేకులు జన్మించి బ్రహ్మ
క్షత్రగోత్రకర్తలై రిది జహ్నువంశంబు.

93


క.

విను [63]నలిని యనెడు రెండవ, వనితను నజమీఢుఁ డధికవైభవుఁ బుత్రుం
గనియె సుశాంతునివరనం, దనుఁ [64]బురుహేతి [65]యనువాని దగఁ బుట్టించెన్.

94


వ.

పురుహేతికి [66]బహ్వశ్వుండు పుట్టె [67]బహ్వశ్వునకుం దనయులు ముగ్గలుండు
సృంజయుండు బృహదిషుండు యవీనరుండు క్రిమిలాశ్వుండు ననువారు గలిగిరి.

95


క.

జనకుఁడు వీ రేవురు బహు, జనపదరక్షణమునందు [68]శక్తు లనుచుఁ బే
ర్కొనెఁ బాంచాలురఁ బరముల, ననఘా పాంచాలురై రుదగ్రవిభూతిన్.

96


వ.

తదీయదేశంబులు పాంచాలంబు లనంబరఁగె వారిలోన ముద్గలు నకు మౌద్గ
ల్యుండు పుట్టి నలపుత్రి యైన [69]యింద్రసేనయందు [70]వారస్యుం గనియె
సృంజయునకుఁ బంచజనుండును బంచజునునకు సోమదత్తుండును సోమదత్తునకు
సహదేవుండును సహదేవునకు సోమకుండునుం బుట్టిరి.

97


క.

సోమకునకు నూర్వురుసుతు, లాముష్యాయణులు జంతుఁ డాదిగఁ గీర్తి
శ్రీమహితు లైరి పృషతుం, డా మొత్తంబునకు నెల్ల నవరజుఁ డధిపా.

98


వ.

పృషతునకుం బుత్రపౌత్రు లై ద్రుపదదృష్టద్యుమ్ను లన వెలసిరి మఱియు
నయ్యజమీఢునకు మూఁడవభార్య యైన భూమిని భవదీయపూర్వవంశజులజనని
యధికతేజుం డగు తనూజుం బడయుదు నని.

99


క.

అనలపరిచర్యయును భో, జననిమతి యు[71]పాశ్రయంబు సంధిల్లగ హా
యనములు పదివేలు తపం, బొనర్చె నిటు సేయ వశమె యువిదల కనఁగన్.

100

వ.

ఆపుణ్యచరిత్ర పవిత్రకుశసంస్తరణంబునం దగ్నిహోత్రసమీపంబున శయనించి
యుండఁ దదీయభర్త తత్సాంగత్యంబు ననుభవించె దానం జేసి ధూమవర్ణుం
డయ్యు నత్యంతదర్శనీయుం డగు ఋక్షుం డనుతనయుండు జనియించి జనలోక
పూజ్యంబగు సామ్రాజ్యంబున రాజిల్లె నట్టిఋక్షునకు సంవరణుండు పుట్టి.

101


ఉ.

క్షాత్రసమగ్రుం డైనకురుఁ గాంచెఁ గులైకధురంధరున్ జగ
జ్జైత్రవిచిత్రకర్మగుణసమ్మితు నాతఁడు గాఁడె యీ కురు
క్షేత్రము సేసె జహ్నుసుత సీమగఁ బూని ప్రయాగదాఁక లో
కత్రయపావనంబుగ నఖండితకీర్తిధనంబు సేకుఱన్.

102


వ.

అమ్మహీపతికి మహాధర్మపరిరక్షకుం డగుపరీక్షిత్తు జన్మించె నా జనపతికి జనమేజ
యుండు [72]శ్రుతసేనోగ్రసేనపూర్వజుం డై జననంబు నొందె నా జనమేజయునకు
సురథుండును సురథునకు విదూరథుండును విదూరథునకు ఋక్షుండును ఋక్షు
నకు భీమసేనుండును సుతు లై రివ్వంశంబునందు ఋక్షపరీక్షిజ్జనమేజయు లిద్ద
ఱిద్దఱును భీమసేనులు మువ్వురు నని యెఱుంగుము.

103


తే.

అనఘు భీమనేనునకు భవ్యప్రతాపు, డగు ప్రదీపుఁ డుద్భవ మొందె నతనిసుతులు
ప్రభులు దేవాపిశంతనుబాహ్లికులు త్రి, లోకవిఖ్యాతు లపగతశోకమతులు.

104


వ.

అందు దేవాపి కొండికప్రాయంబునన తపంబునకుం బోయి భార్గవచ్యవనునకుఁ
గృతకపుత్రుం డై దేవతలకు నాచార్యుం డయ్యె శంతనుండు రాజై జాహ్నవి
యందు భీష్ముని వాసవి యైన సత్యవతియందుఁ జిత్రాంగదవిచిత్రవీర్యుల నుత్పా
దించె విచిత్రవీర్యుం డనువానికి ధృతరాష్ట్ర పాండురాజులు వుట్టి రందు వైచిత్ర
వీర్యుం డగుపాండునిపుత్రుండు భవత్ప్రపితామహుం డర్జునుండు వంశకరుం
డైన యభిమన్యుం గనియే బాహ్లికునకు సోమదత్తుండు పుట్టె సోమదత్తసంభవులు
భూరిశ్రవశ్శలశల్యులు మువ్వురు పుట్టిరి బహుశాఖి యైన పూరునిసంతతి
యంతయు నెఱింగించితి నింక దుర్వసువంశంబును ద్రుహ్యుని గోత్రంబును
ననువు నన్వయంబును గ్రమంబున వేర్వేఱఁ జెప్పెద నాకర్ణింపుము.

105

దుర్వసువంశక్రమంబు సంక్షేపంబుగాఁ జెప్పుట

సీ.

వహ్ని సమాఖ్యు దుర్వసుఁ డాత్మజు[73]నిఁ గాంచె గోభానుఁ డావహ్ని కొడు కతనికిఁ
ద్రేసానుఁ డనఁ బుట్టె ద్రేసానునకుఁ గరంధముఁ డుద్భవించె నద్ధరణిపతికి
ధుర్యచిత్తుడు మరుత్తుండు నాఁగ జనియించె సంవర్తయజ్వుఁడై చను మరుత్తుఁ
డధిప యీతఁడు గాక యన్యుఁడు సు మ్మిమ్మరుత్తుఁ డపుత్రుఁడై రూఢతేజు


తే.

భరతజనకుఁడు దుష్యంతు భ్రాతయైన, ఘనుని దిష్యంతుఁ దగఁ బెంచుకొనియెఁ జూవె
యివ్విధమున దుర్వసువంశ మేగుదెంచి, బూరువంశ మిశ్రకమయ్యెఁ బౌరవేంద్ర.

106

వ.

ఆదిష్యంతునకు [74]గురుథాముండు ప్రభవించె వానికి [75]నాశ్రితుండు పుట్టె [76]నా
శ్రితునకుఁ బాండ్యకేరళకోళచోళు లన నల్వురు గలిగి ప్రత్యేకవంశప్రవర్తకు
లై నిజనామంబుల జనపదంబులు గావించిరి.

107


తే.

[77]ద్రుహ్యునకుఁ దనూభవుఁడు నేతుండు నాఁగఁ
బుట్టె నంగారుఁ డనఁగఁ దత్పుత్రుఁ డేచి
ధూతరిపుని మాంధాత్రునిఁ దొడరి పదియు
నాలుగు నెలలు ఘోరరణం బొనర్చి.

108


వ.

పిదపఁ దదీయసఖ్యంబు వడసి మరుభూములకుం బతియయ్యె నతనికి గాంధారుం
డనువాఁడు పుట్టి తనపేర గాంధారదేశంబు సేసెఁ దత్కులప్రభులు తురగారో
హణకుశలు లై విక్రమాదిగుణంబులం బరగిరి మఱియు ననువునకు [78]ఘర్ముం డను
కొడుకు పుట్టె [79]ఘర్మునకు ఘృతుండును ఘృతునకు దుదుహుండును దుదుహు
నకుఁ బ్రచేతసుండును బ్రచేతసునకు సుచేతసుండును సుచేతసునకుఁ బుత్రశతంబు
గలిగెఁ దద్వంశ్యు లెల్లను ధర్మవిరహితంబు లగు మ్లేచ్ఛవిషయంబులకుం బతు లై
రికం యదువంశ[80]విస్తరంబు వివరించెద.

109


తే.

యదువునకు నందనులు సహస్రదపయోదు, లనఁగఁ గ్రోష్టు[81]నీలాంజను లనఁగ నేవు
రూర్జితులు దేవసన్నిభు లుద్భవించి, రందుఁ బెద్దవాఁడైన సహస్రదునకు.

110


వ.

హైహయుండును హయుండు వేణుహయుండు నన మువ్వురు కొడుకులు పుట్టిరి
హైహయుం దొడంగి ధర్మనేత్రుండు కార్తి సహస్రజిత్తుండు మహిష్మంతుండు
భద్రశ్రేణ్యుండు దుర్దముండు ధేనుకుండు ననువారు క్రమంబునఁ గలిగిరి ధేను
కునకుఁ గృతవీర్యకృతాగ్నికృతధన్వకృతాంజను లన నలువురు సంజాతు లైరి కృత
వీర్యునకుఁ కార్తవీర్యార్జునుం డుదయించి.

111


సీ.

పదివేలవర్షముల్ పరమదుష్కర మగుతప మాచరించి యుదాత్తతేజు
నత్రితనూజు దత్తాఖ్యు నారాధించి యాతతకరుణఁ. గయ్యంబులందుఁ
జేతులు వేయును జెంద నెప్పుడు దుష్టు దండించు మహిమయు ధర్మసరణి
దప్పక పృథివియంతయు నేలుశక్తియు సకలప్రజానురంజనము వెరవు


తే.

నిష్టవరములుగాఁ గొని యేకరథమునన సమస్తధాత్రీపతులను జయించి
యేడుదివుల జన్నంబు లేడునూర్లు, ప్రగుణవైభవశ్లాఘ్యంబులుగ నొనర్చె.

112


చ.

అతని[82]మఖంబులందుఁ బ్రియమంది మహాముని యైననారదుం
డతులమహత్త్వుఁ డర్జునున కన్యులు తుల్యులె యెవ్వరు న్మహా

శ్రుతమున నీగి ధర్మమున శూరత ధీరత సంయమంబునన్
వ్రతమున నంచుఁ బాడె సురవర్యమునీంద్ర సభాంతరంబులన్.

113


క.

విను పంచాశీతిసహ, స్రనిరూపితహాయనములు సకలోర్వియుఁ బా
లన సేసి పిదప భార్గవ, ఘనపరశువువలన నతఁడు గనియె విముక్తిన్.

114


వ.

అట్టి కార్తవీర్యునకు శూరుండును శూరసేనుండును [83]ధృష్టుండును గృష్ణుండును
జయధ్వజుండును ననఁ బుత్రపంచకంబు వెలసె నందు జయధ్వజుం డవంతీశ్వరుఁ
డై తాలజంఘుం గనియె నతనికి నూర్వురు పుట్టి తాలజంఘాఖ్యు లైరి వారి
లోన వంశకరుం డైన వృషునకు మధువు పుట్టె మధువునకు వృష్ణి యుద్భవించె
నివ్విధంబున యదువువలన యాదవులును మధువువలన మాధవులును వృష్ణి
వలన వృష్ణులు నను పేళ్ల హైహయులు ప్రసిద్ధి బొందిరి యయాతిసంభవు [84]లేవుర
వంశంబు లివి యని వైశంపాయనుండు.

115


క.

ఈయదువంశంబులు విను, ధీయుతునకుఁ [85]గలుగు సంతతియుఁ బ్రాభవమున్
శ్రీయును [86]నధికవిభూతియు, నాయువు ననఁ బరఁగుశుభము లైదును ననఘా.

116


తే.

పంచభూతాత్మ మైన ప్రపంచ మెల్లఁ, దారయై యొప్పుచున్న యుదారపుణ్యు
లలఘు లై [87]పంచవంశ్యుల నభినుతింపఁ, గలుగు బంచేంద్రియార్థమాంగల్యయుక్తి.

117

యదువంశక్రమంబు సంక్షేపరూపంబునం జెప్పుట

వ.

ఇంక నఖిలజగత్ప్రభుం డగుపురుషోత్తమునకుం బ్రభవస్థానం బైన [88]యదుని తృతీ
యపుత్రుం డగు క్రోష్టునన్వయంబు వినుము. క్రోష్టునిపుత్రుండు [89]వృజి నీతిమం
తుండు స్వాహి యనుతనయులం బుట్టించె స్వాహికి రుశుంకుండును రుశుంకునకుఁ
చిత్రరథుండును బుట్టిరి.

118


క.

అతనికి శశిబిందుఁడు వి, శ్రుతవిభవుఁడు శతసహస్రసుదతీదయితుం
డతులితసుతదశకోటి, స్థితికారి జనించె నప్రతిమపుణ్యుఁ డిలన్.

119


తే.

అన్నరేంద్రునినందను లందఱకును, నాద్యుఁ డైనపృథుశ్రవుఁ డంతరుఁ డను
తనయుఁ బడసెను యజ్ఞుఁ డాతనితనూజుఁ, డుషతుఁ డామహీవిభునియాత్మోద్భవుండు.

120


క.

ఘనుఁడు [90]శితేపుం డతనికిఁ, దనూజుఁడు మరుత్తుఁ డనఁగఁ దత్ప్రభవుం డ
జ్జనపతి కంబళబర్హిషుఁ, గనియె నశఁడు పుత్రశతముఁ గాంక్షించి తగన్.

121


వ.

మహనీయంబు లగు దానధర్మంబు లనేకంబు లనుష్టించుచుండం బుత్రశతతుల్యుం
డయి రుక్మకవచుం డనువాఁడు పుట్టి పరాక్రమంబునఁ బ్రసిద్ధి నొంది కవచ
ధనుర్బాణధాతు లగు వైరుల నూర్వురరాజుల వధియించి రాజ్యపదంబు సంస్థి
తంబుగా నొందె నతనికిఁ బరాజిత్తన నిక్కంపుఁబేరివాఁడు పుట్టె నాపరాజిత్తునకు

రుక్ముండు పృథురుక్ముండు [91]జ్యామదుండు పాలితుండు హరి యన నేవురు గొడు
కులు గలిగి రందుఁ బాలితహరితు లనువారి నిద్దఱను దండ్రి యధ్వరంబున మహా
ద్విజులకు దక్షిణగా నిచ్చె రుక్ముండు రాజై పృథురుక్ముం డాప్తుండుగా నుండె.

122


క.

[92]జ్యామదుఁడు రాజ్య మొల్లక, సామజనిభ[93]గమన యైనశైబ్య దనపురం
ధ్రీమణితోఁ జనుదేరఁగ, శ్రీమహితుఁడు గానఁ దపము సేయఁగ నరిగెన్.

123


సీ.

అట్లు ప్రశాంతుఁడై యారణ్యకద్విజవినుతమై యొప్పువర్తనముతోడ
నుండంగ నొకవిప్రుఁ డుత్తమ[94]నృపధర్మకోవిదుం డాతని వేవిధముల
బోధించి దండంబు పోలదు తపము భూపతులకు నను బుద్ధి పట్టుకొనఁగఁ
జెప్పిన నారాజు చింతించి యన్నలు పొందిన సిరిదిక్కు వోవ నొల్ల


తే.

కరిగి [95]ఋక్షవద్గిరితటమందు శుక్తి, మతి యనంగఁ బేర్చినపురి [96]నతులశక్తి
నాక్రమించి యచ్చటు గుటుంబాధివాస, ముగ నొనర్చి మహాభుజస్ఫూర్తి యెసఁగ.

124


వ.

ఒక్కరుండును రథం బెక్కి యడియాలంబుతోడిపడగ యుల్లసిల్ల నుద్దీప్తదాప
ధరుం డై నర్మదయు మృత్తికావతియు నను మహానదుల యుపాంతదేశంబులు
జయించుటకై వెడలిన.

125


ఉ.

ఆతని[97]దాడికిం దలఁకి యచ్చటివీడులరాజు లెల్ల న
త్యాతురులై కళత్రతనయాప్తసుహృద్రథవాజి వారణ
వ్రాతము లుజ్జగించి పఱవంగఁ దొడంగి రతండు హాసవి
ద్యోతముఖాంబుజుం డగుచుఁ దోలె విరోధిచయంబుఁ గన్కనిన్.

126


తే.

[98]అయ్య యమ్మ దమ్ముఁ [99]డన యని పిలుచుచుఁ దల్లి బిడ్డ పట్టెఱుఁగక తల్లడమున
బాలవృద్ధదుర్బలులు గీడ్వడఁగఁ గాంది, శీకులైరి దేశములయశేషజనులు.

127

జ్యామదుం డనురాజు వనంబున నున్న కన్నియం గొనివచ్చుట

వ.

ఆ సమయంబున.

128


సీ.

కాటుకకన్నీరు కస్తూరికాపత్రకాంతకపోల[100]ంపుఁ గాంతిఁ బెనుప
వీడిన పెన్నెఱివేణి విచిత్రనవీనాభ్రమై కమ్మవిరులు గురియఁ
దూఁగాడుపయ్యెద దోదూయమానమన్మథవైజయంతికామహిమఁ బడయఁ
గరుపారునెమ్మేను కమనీయచైత్రకోరకితలతా[101]సధర్మతఁ దలిర్ప


తే.

వెఱుపు సేయుచేఁతలు తన్ను వితతభద్ర, లక్షణంబు లై యిట్టు లలంకరింప
నొంటిపడి చిక్కి పోలేక యున్న కన్నెఁ, గనియె నొక్కతె [102]నచట నాజనవిభుండు.

129


క.

కని యోడకు మని చేరం, జని రాజతనూజఁ గా నిజం బరసి యెఱిం

నవాఁడై మదిలోఁ దన, యనపత్యత సూచి రాగ మతిశయ మొందన్.

130


క.

సంతతి లేకున్నను మ, త్కాంతపయి న్వేఱయొకతెఁ గామింపక యే
నెంతయు ధృతి నుండితి నిది, యింతయు విధిఘటన దీని నేను వరింతున్.

131


వ.

అని యబ్బాల నరదంబుపై నిడికొని మగిడి తనపురంబునకుం జనుదెంచి యంతి
పురంబు సొచ్చునప్పు డవ్విజయోత్సవంబున.

132


క.

కైసేసి తాను సుదతులు, సేసలు పెట్టుటకు శైబ్య చిత్తంబున ను
ల్లాస మెలర్ప నెదుర్కొని, యాసరసిజనయనఁ గనియె నరదముమీఁదన్.

133


చ.

కని మది నీసుతో నలుక గ్రమ్మన [103]నుప్పతిలంగ దండు పో
యినపని నాథ నిటు లెంతయు బాగయి వచ్చె నొక్కతె
న్ననువునఁ దేరిపై నిడుకొనం బదిలంబుగ నుంచి యిమ్మెయిం
గొని చనుదెంచి తౌఁ దగుఁ దగు న్నవరక్తులు గారె భూపతుల్.

134


తే.

అనిన నాతఁడు భయమున నబల నీకు, దీనిఁ గోడలిఁగాఁ గోరి తెచ్చినాఁడఁ
బార్థివాత్మజ నుత్తమభద్రమూర్తి, నెలమిఁ గైకొను మనిన నయ్యిగురుఁబోఁడి.

135


చ.

తనయులు నాకు లేరు మఱి తన్వి తనూజసమేత నీకు లే
దనయము దీనిఁ గోడ లనునట్టివిధం [104]బొకఁ డెద్ది సెప్పుమా
యన విని నీవు కాంచఁగల వాత్మజు నొక్కని వాని కెంతయుం
బెనుపుగ నిప్పయోజముఖిఁ బెండిలిసేయుదుఁగాక వేడుకన్.

136


వ.

ఇట్టి భవిష్యత్భావంబు నిరూపించి యిక్కన్యం దోడ్కొని వచ్చితి నని యతం
డప్పు డప్పడంతికి నొండుత్తరంబు సెప్ప వెరవు గానక యిట్లు పలికిన నల్లన నవ్వుచు
నవ్వామనయన యవ్వరాంగి నంగీకరించె [105]నివ్విధంబునం బరిణయవయస్క
యై యుండ నాశైబ్య కతిపయదివసంబులకు గర్భంబు దాల్చి కొడుకుం గనియె
వానికిఁ దండ్రి విదర్భుం డను పేరు పెట్టి గారంబునం బెనిచి కౌమారంబునం
బూర్వజన్మతపోగౌరవంబుకలిమిం గుమారీభావంబు పొలివోవక యున్న
యన్నాతి నతనికి నుద్వాహం బొనర్చె నదియును స్నుషాభిధానంబున [106]నెందును
వెలసి.

137


క.

క్రథకైశికు లన నిద్దఱఁ, బ్రధితయశులఁ గాంచెఁ రోమపాదుఁ డనఁగఁ బ్రో
న్మథితరిపుని మూఁడవసుతుఁ, బృథివీసమగుణు రణోగ్రుఁ బిదపం గనియెన్.

138


వ.

ఆరోమపాదునకుం బభ్రుండును బభ్రునకు ధృతియునుం బుట్టిరి తత్పుత్రపౌత్ర
పరంపర బహు[107]ముఖంబుల నెగడెఁ గైశికునకుం జేది యుద్భవించె వానివలనఁ
జైద్యాన్వయంబు గలిగె స్నుషాప్రథమపుత్రుం డగు క్రథునకుఁ గుంతియుఁ
గుంతికి ధృష్టుండును ధృష్టునకు దాశార్హుండును [108]దాశార్హునకు వరార్హుండును

బుట్టిరి మఱియుఁ గ్రమంబున వ్యోమజీమూత[109]నికృతులును భీమరథనవరథదశ
రథులును శకునికరంభదేవరాతదేవుక్షత్రులు నన, బదితరంబు లరిగిన.

139


క.

మధురవచనుఁ డదయించెను, మధు వను వసుధావిభుండు మాధవు లనఁగా
నధరీకృతాన్యనృపతులు, సధర్ము లాత్మీయు లాత్మసంజ్ఞఁ దలిర్ప.

140


క.

పురుఁ డన మధునకుఁ బుట్టెం, బురుషాగ్రణి యైనసుతుఁడు పురునకుఁ బుట్టెం
బురుహోత్రుఁ డతని కంగుఁడు, పురుహూతపరాక్రముండు పుట్టె నరేంద్రా.

141


వ.

అంగునకు సత్వతుండు వుట్టెఁ దద్వంశ్యు లెల్లను సాత్వతు లనం బరగిరి సత్వ
తునకు భజమానుండు దేవాపృథు డంధకుండు మహాభోజుండు వృష్ణి యను
పుత్రులు జన్మించి రందు భజనూనునకుం [110]గ్రిమియును గ్రమణుండును [111]గృష్ణుం
డును దశజిత్తును శతజిత్తుండును సహస్రజిత్తుండు నయుతజిత్తుండు ననం బెక్కండ్రు
గలిగి పెక్కువంశంబులు గలిగించిరి దేవాపృథుండు బహుయజ్ఞకర్తయై సర్వగుణ
పవిత్రుం డగు పుత్రుం బడయుదు నని.

142


క.

పర్ణాశనదీతటమున, నిర్ణయముగఁ దప మొనర్ప నెయ్యముమై న
య్యర్ణవగంభీరుని గుణ, పూర్ణతఁ గనుఁగొని ప్రియంబు వుట్టిన మతితోన్.

143


వ.

అమ్మహాతరంగిణి పరమమంగళం బగు నంగనారూపంబున నాభూపాలు వరియించె
వారికి బభ్రుండు పుట్టె నట్టి తండ్రికిం గొడుకునకు జగంబులయందు.

144


ఆ.

దేవసన్నిభుండు దేవాపృథుండు దూ, రమున వినిన[112]యజ్ఞరమ్యపదము
లరయఁ జేరి చూచినప్పుడు బభ్రుని, గుణము [113]లనఁగఁ గీర్తిఘోష మెసఁగె.

145


తే.

ఆఱువదియు నాఱువేలు నా నమలుసంఖ్య
గలుగుపురుషులు మును ముక్తిగలుగువారు
వారు పొందినగతియ దేవాపృథుండు
బభ్రుఁడును బొంది రండ్రు సద్బ్రహ్మవిదులు.

146


వ.

మహాభోజుండు మహాధర్మశీలుం డై బహుయజ్ఞంబులు బహుదక్షిణంబులుగా
నొనర్చి యపరిమితసువర్ణగోదానంబు లనుష్ఠించి బ్రాహ్మణభక్తి నిర్వహించి గర్వి
తారాతిదళనంబునం బరమక్షాత్రంబు జైత్రంబు గావించి వెలసె నతని వంశంబు
రాజులు మృత్తికావతీతీరభూము లేలి మార్తికావతు లనం బెంపొందిరి వారిలో
నశ్వఫల్గుం డత్యంతసమాఖ్య వడసె నతనికి నక్రూరచిత్రకులు పుట్టి రక్రూ
రునకు సుదేవోపదేవులు చిత్రకునకుఁ బృథవిపృథు లాదిగాఁ బెక్కండ్రు కొడు
కులును శ్రవణశ్రవిష్ఠ లనుకూఁతులు గలిగిరి మఱి యంధకునియన్వయంబు
వినుము కుకురుండు భజమానుండు [114]శుచి యనువార లంధకప్రసూతులు
వారియందుఁ గుకురునకు ధృష్టుండు పుట్టె ధృష్టునకుఁ బుత్రపౌత్రులయి కపోత

రోముండును ధైత్తిరుండునుం గడచిరి తైత్తిరునకుం గొడుకును మనుమండును
నై పునర్వసుండును నభిజిత్తుండునుం బరఁగిరి.

147


క.

అభిజిత్తునకు మహాయశుఁ, డభిమానసమున్నతాత్ముఁ డాహుకుఁ డనఁగాఁ
బ్రభవించె ననుజయై జగ, దభినుత యాహుకి జనించె నవనీనాథా.

148

అంధకవంశక్రమంబు సంక్షేపంబుగాఁ జెప్పుట

వ.

ఆ యాహుకి యవంతీశ్వరునకుం బత్ని యయ్యె నాహుకుండు సర్వవంశప్రదీపకుం
డై బంధుజనంబు నాత్మసదృశవిభవోజ్జ్వలంబుగాఁ [115]బెనిచి యనంతగజతురంగపరి
వార మగురాజ్యలక్ష్మి యేకభోగ్యంబుగా నుల్లసిల్లె.

149


సీ.

అతనికిఁ గాశిరాజాత్మజయందు దేవప్రభునిభులు దేవకుఁడు నుగ్ర
సేనుఁడు ననఁగఁ బ్రసిద్ధులు పుట్టి రాదేవకునకు నోలి దేవవంతుఁ
[116]డన సుదేవుఁ డనంగను సుపదేవుం డన దేవరక్షితుఁ డన దీప్తభుజులు
కొడుకులు నలువురు కూఁతులు దేవకియును శాంతి యనుదేవయును సుదేవ
తే. యును ననఁగ దేవరక్షితయును మఱివృక, దేవియును సుపదేవియు శ్రీవిశాల
యైన శ్రీదేవులే యన ననుపమాన, సరసమూర్తులు జనన మొందిరి క్రమమున.

150


వ.

ఉగ్రసేనునకుఁ గంసుఁడు జ్యేష్ఠుండుగా గ్రమంబున న్యగ్రోధుండును సునాముం
డును గుహ్యుండును [117]శంకుండును సుభూమిపుఁడు రాష్ట్రపాలుండు సుతనుండు
ననాధృష్టండు సారసుండు పుష్టిమంతుం డనఁ [118]దొమ్మండ్రు కొడుకులును గంసయుఁ
[119]గంసవతియు సుతనువు రాష్ట్రపాలికయు [120]గుహ్యయు నన నేవురుకూఁ
తులుం బుట్టిరి.

151


క.

ఈకుకురువంశకీర్తన, మాకర్ణించిన మనమ్మునందు నిలిపినం
జేకుఱుఁ బ్రజాసమున్నతి, శ్రీకలితం బైనసుచిరజీవన మొదవున్.

152


వ.

అంధకద్వితీయపుత్రుం డైన భజమానునకు [121]విదూరథుండు విదూరథునకు
శూరుండును శూరునకు శమియు శమికిఁ బ్రతిక్షితుండును బ్రతిక్షితునకు హృది
కుండునుం బుట్టిరి హృదికునకుఁ గృతవర్మపూర్వజుండుగా శతధన్వ దేవార్హులు
జనియించి రివ్విధంబున సత్వతనూజు లైన భజమాన దేవాపృథమహాభో
జాంధకులయన్వయంబులు సెప్పంబడియెఁ గడపటివాఁ డైన వృష్ణివంశంబు
ప్రశంసించెద.

153


క.

విను గాంధారియు మాద్రియు, ననఁగా వృష్ణికిఁ బురంధ్రు లందు [122]మొదటియా
లనఘుఁ గనియె మిత్రవివ, ర్ధనుని సుమిత్రుని నమిత్రదళనధురీణున్.

154

వ.

మాద్రికి యుథాజిత్తుండు దేవమీఢుండును [123]ననమిత్రుండును ననువారు పుట్టి
రందు దేవమీఢునకు శూరుండు పుట్టె.

155


క.

శూరోత్తముఁ డగుశూరుఁడు, మారిష యనుపత్నియందు మహనీయగుణో
దారు వసుదేవు దేవా, కారుఁ గనియె నిర్వికారగౌరవరమ్యున్.

156


ఉ.

ధీనిధి యుత్తముండు వసుదేవుఁడు పుట్టినయప్పు డంబరం
బానకదుందుభిధ్వనితమై కురిసెం గుసుమప్రవర్షముం
దానన చేసి యాసుగుణధాముఁడు మానవ[124]నాథభూషణుం
డానకదుందుభిస్ఫుటసమాఖ్య వహించె జగత్ప్రసిధ్ధిగన్.

157


తే.

పిదప వసుదేవుఁ డనుపేరఁ జేర్చు కాంతి, నమృతకరుఁ బోలి యొప్పుట నతిశయిల్లె
నతనిజననంబునకుఁ బ్రీతి నందె నందు, జంగమస్థావరాత్మకసకలజగము.

158


వ.

ఆవసుదేవునకు ననుజులయి దేవభాణుండు దేవశ్రవుండు నరాదృష్టి యనువారు
మొదలుగాఁ దొమ్మండ్రు బహుసంతతులం బడసిరి తత్సంతానంబులలోన దేవ
భాగునకుం బుత్రుం డగునుద్ధవాచార్యుఁడు బుద్ధితత్త్వంబున నింద్రాచార్యు
తోడం బురుడించె మఱియుం గౌశికుండు సుమిత్రుండు మొదలుగా నెంద
ఱేనిఁ బ్రఖ్యాతు లయిరి శ్రుతకీర్తియు శ్రుతదేవయు శ్రుతశ్రవయుఁ బృథయు
రాజాధిదేవియు నన నేవురు చెలియండ్రు గలిగిరి వారిలోన.

159


సీ.

శూరుఁడు పోరానిచుట్ట మౌకుంతిభోజునకుఁ దాఁ గుంతినాఁ దనయ గాగఁ
బృథ నిచ్చె నాయమ ప్రధితతేజుం డగు పాండుని భర్తగాఁ బడసి ధర్మ
మారుతశక్రాశ్విమహితాంశజన్ములఁ గనియెఁ బాండవుల నఖండయశుల
శ్రుతకీర్తి [125]వృద్ధశర్ముఁడు గరూశాధీశువల్లభ యై దంతవక్త్రుఁ గాంచె
తే. విను శ్రుతిశ్రవఁజైద్యుఁడు విగతరోషుఁ, డైన దమఘోషుం డుద్వాహమై యుదగ్రు
నరిభటాభీలు శిశుపాలు నాహిరణ్య, కశిపుతేజాంశసంభవుఁ గలుగఁజేసె.

160


వ.

శ్రుతిదేవకుం గేకయేశ్వరువలన నేకలవ్యుండు పుట్టి నిషాదులలోనం బెరిఁగె
రాజధిదేవి యావంత్యు లగువిందానువిందులం బ్రభవించె వసుదేవునకు బాహ్లి
కపుత్రి యైనరోహిణి ప్రథమపత్ని యై బలభద్రుం డాద్యుండుగాఁ గ్రమంబున
సారణుండు శరుండు దుర్దముండు [126]శమనుండు శ్వభ్రుండు పిండారకుండు [127]కుశ
కుండు గదుండు ననుకొడుకులం జిత్ర యనుకూఁతుం గాంచె నాచిత్రయ సుభద్ర
యనుపేర నెగడి కురువంశవర్ధనుం డయిన యర్జునుం జెందె.

161


ఉ.

దేవకి యాదిగాఁగ వసుదేవుఁడు దేవకుకూఁతు లందఱన్
దా వరుసన్ వివాహముయి తామరసేక్షణు నాద్యు నచ్యుతున్
దేవకియందుఁ గాంచె జగతీవర తక్కినవారియందుఁ దే
జోవిదితాత్ములం గనియె సూనులఁ బల్వుర నాగదాదులన్.

162

క.

బలదేవుఁడు రేవతియం, దలఘుబలుని సుతుని సుల్ముకాహ్వయుఁ గనియెన్
లలనలు మఱియు నతనికిం, బలువురు మదిరాదు లర్థిఁ బడసిరి సుతులన్.

163


వ.

కృష్ణునకు రుక్మిణీప్రముఖు లయిన దేవు లెనమండ్రును మఱియుం బదియాఱు
వేలునూర్వురుం గలిగిరి వారియందు లక్షయు నెనుబది[128]వేవురు కొడుకులు
పుట్టి రందఱకుఁ బ్రద్యుమ్నుండు పెద్దవాఁ డయ్యె మఱియుఁ జారుధేష్ణసాం
బాదు లనేకులు ప్రసిద్ధు లయి తనర్చిరి.

164


తే.

అనఘ వృష్ణికనిష్ఠనందనుఁడు పుణ్య, శీలుఁ డనిమిత్రుఁ డాత్మజు శినిసమాఖ్యుఁ
[129]గాంచె సత్యకుఁ డుదయించె ఘనుఁడు శినికి, సత్యకునకు సాత్యకి పుట్టె సత్యయశుఁడు.

165


వ.

అతనికి యుయుధానుం డనునామంబు ముఖ్యంబై యుండెఁ దద్వంశ్యులు
శైనేయు లనం బరఁగిరి మఱి యుథాజిత్తువంశంబు మెఱయ ననమిత్రుండు
జనియించె ననమిత్రునకు నిఘ్నుం డనువాఁడు పుట్టె నిఘ్ను నకుఁ బ్రసేన
సత్రాజిత్తులు పుట్టిరి.

166

సత్రాజిత్తు సూర్యు నారాధించి శమంతకమణి సంపాదించుట

క.

సత్రాజిత్తు విమలచా, రిత్రమునకు నాత్మలోనఁ బ్రియ మంది తగన్
మిత్రుం డయ్యె ద్రిభువన, [130]మిత్రుఁడు మిత్రుండు కృప నమిత్రధ్వంసీ.

167


వ.

అట్టిసత్రాజిత్తు సముద్రతీరంబున నిలిచి నియుతుండై పదునొకండుదినంబులు సూర్యు
నారాధించిన బ్రసన్నుఁ డై యద్దేవుం డతనికి మేలు సేయు తలంపువం బెంపారు
మూర్త్యంతరంబు ధరియించి తదగ్రభాగంబున నిలిచిన నతనికిఁ బ్రణతుం డై
వివిధ వాక్యంబులఁ బ్రస్తుతించి.

168


తే.

దేవ నీవు నభంబున నేవిధమున, వెలుఁగు దట్ల దురాలోకవిపులమూర్తి
నిచ్చటికిని విచ్చేసితి రెట్లు నిన్నుఁ, గన్నులారఁగఁ గని మేలు గాంచువాఁడ.

169


వ.

అనుటయు సూర్యుఁడు నగుచు నిది యొక్కరత్నంబు శ్యమంతకనామధేయంబు
కంఠావలంబి యైన నత్తేజంబువలన నతిసౌమ్యం బయ్యును మదీయరూపంబు నీకుం
దేఱిచూడరాకున్నది యట చూడు మనుచు నది పుచ్చి యతనికి నఱుతం బెట్టి
వరంబు వేఁడు మని పలికిన.

170


క.

అతఁ డమ్మణి యీగియ యభి, మతవరముగ నడుగుటయును మార్తాండుడు న
ట్ల తగంగ నిచ్చి యంత, ర్హితుఁ డయినఁ బ్రమోద మాత్మ నెసకం బెసఁగన్.

171


వ.

మగుడి సత్రాజిత్తు ద్వారకానగరంబున కరుగుదేరం గని యెల్లవారును విస్మయ
సమ్మోహసంభ్రమంబులం గమలనాభుపాలికిం బోయి.

172


క.

దేవర దర్శించుటకై, తా వచ్చుచు నున్నవాఁడు తపసుం డిదె తే

జోవిసర మెసఁగ నన విని, యావిభుఁ డల్ల నగి వార లందఱతోడన్.

173


వ.

అతని నర్కప్రసాదలబ్ధరత్నుం డైన సత్రాజిత్తుం గా నెఱింగించె నట్లు సనుదెంచి
సరోజినీ[131]బాంధవసఖుండు సుఖంబున నున్నంత.

174


ఉ.

నిచ్చలు నమ్మహామణి వినిర్మలకాంచనరత్నభారముల్
పొచ్చెము యెన్మిది ప్రభూతముగాఁ గురియున్ ధరిత్రిఁ దా
నెచ్చట నుండె నచ్చటికి నేయుపసర్గము నేభయంబు నే
యచ్చికయున్ జనింపక సమంచితసుస్థితి నిచ్చు నిచ్చమై.

175


మ.

అది దామోదరుఁ డుగ్రసేనునకు నొయ్యం జేర్పఁగాఁ గర్జమున్
మది నూహించుచు నుండుఁ గృష్ణుఁ డడుగన్ మానోచితుం డివ్విభుం
డిది యీకుండను రాదు వేఱొరుల కే నె ట్లిత్తు నంచుం బొరిన్
దదనుధ్యానము చేయుచుం దలఁకు సత్రాజిత్తుఁ డెల్లప్పుడున్.

176


వ.

కృష్ణుండును గులంబులోనం [132]గలహంబు పుట్టు నని తలంచి తాను శక్తుం డయ్యును
గొననొల్లక యయ్యైప్రసంగంబులం గోర్కి సన్నవాఱం బలుకుచుండఁ జుట్టంబు
లందఱు నెఱింగి యుండుదు రిట్లు సత్రాజిత్తు జనార్దనునివలన శంకించి యమ్మాణి
క్యంబు ప్రసేనున కిచ్చె [133]నదియును నశుచియైనవాఁడు దాల్చినం దనగుణంబులు
సూపక ప్రాణాపద నొనర్చు నత్తెఱం గయ్యిరువురు నెఱుంగ రంత.

177


సీ.

ఆప్రసేనుఁడు తురగారూఢుఁడై మహావిపినదుర్గంబుల [134]వేఁటలాడ
నొక సింహ ముగ్రమై యుఱికి గుఱ్ఱమ్ము నాతనిఁ జంపి బలుఁగండ యనుతలఁపునఁ
గ్రమ్మ రత్నము నోరఁ గబళించునంతలో నేతెంచి మృగపతి నెలుఁగుఱేఁడు
జాంబవంతుఁడు మహాసత్త్వుండు వధియించి యమ్మణి గైకొని సమ్మదమునఁ


తే.

జని బిలంబు ప్రవేశించి తనతనయుఁడు, శిశువు సుకుమారుఁ డనువానిచేతి కాడ
మానికంబును నిచ్చె నమ్మాడ్కి నవధిం, జనఁగ నారాజసుతుబంధుసముదయంబు.

178


క.

మృగయాతత్పరుఁడై చని, మగుడండు ప్రసేనుఁ డేమి మాయయు రమ్యం
బగుమణి[135]కై యేపాపులు, దెగిరో ప్రాణమున కేమి తెఱఁ గిఁక ననుచున్.

179


వ.

ఇవ్విధంబు కృష్ణకృత్యంబ కా నోపు నని యొండొరులతోడ నొయ్యనొయ్యన
[136]పలుకుచుండం గర్ణపరంపరం బరివాదంబు ప్రకటం బగుటయు లోకవేది యగు
నయ్యాదిపురుషం డాకీడు మాన్చుకొనుటకై యెవ్విధంబున నైనం బ్రసేను
చావుచే టరసెద నని చుట్టంబులు వినం బలికి యాప్తులు వెరవరులు నగుపరి
[137]చరులుం గొనిచని వింధ్యంబు ఋక్షవంతంబు ననుపర్వతంబులు గ్రుమ్మరి యొక్క
ప్రదేశంబున.

180

మ.

బలవత్సింహచపేట[138]పాటితతనుప్రభ్రష్టభూషాంబరా
కులకేశప్రకరుం గరస్థలితఖడ్గు న్ముక్తపల్యాణసం
వలితగ్రీవవికీర్ణకేసరమృతాశ్వప్రాంతసంస్థున్ రజః
కలుషశ్మశ్రుముఖుం బ్రసేనుఁ గనియెం గ్రవ్యాద[139]సంవేష్టితున్.

181


వ.

కని తదీయశరీరంబున నమ్మహారత్నంబు కానక యనతిదూరంబునఁ బడియున్న
సింహశవంబు నాలోకించి యచ్చోట ఋక్షపదంబు లుపలక్షించి సర్వాపేక్ష
ణీయం బగు మణికిం గల గౌరవంబు నూహించి యయ్యెలువునడుగుజాడ బిల
ద్వారపర్యంతంబు ననుసరించి వచ్చిన సహచరవర్గంబు నిలిపి బిలంబు సొచ్చి కొంత
దవ్వువోయి జాంబవత్పుత్రునకు ధాత్రి యొనరించు బుజ్జవంబులయందు.

182


క.

వీరుఁ బ్రసేను వధించె మృ, గారి యదియు జాంబవన్నిహత మయ్యె మహో
దార మగు రత్న మిదె సుకు, మారక నినుఁ జేరె నేడ్పు మానుమ యింకన్.

183


వ.

అనునెలుం గాకర్ణించి రయంబున.

184


క.

అంతర్బిలమున కేఁగి య, నంతద్యుతినూత్న మైన యారత్నము నం
తంతఁ గని కదియుటయు మది, నెంతయు భయ మంది దాది హృదయంబడరన్.

185


వ.

కావవే యని పలుక నయ్యార్తరవంబునకు జూంబవంతుండు పఱతెంచి.

186


మ.

అతనిం గాంచి యుదగ్రకోపమున బాహాబంధురవ్యూహనో
ద్ధతిమై నాఁకినఁ గృష్ణుఁడుం [140]బటుభుజవ్యాఘాతనిర్ఘాతసం
పతనాభీలబలంబునం దొడరె నిబ్బంగిన్ రణం బేకవిం
శతిసంఖ్యాకలితాహముల్ హరికి ఋక్షస్వామికిం జెల్లఁగన్.

187


వ.

యాదవేశ్వరుని యనుచరు లక్కడ నేఁడెనిమిదిదివసంబులు గాచికొనియుండి బల
దేవానుజుఁడు బిలాంతరంబు వెలువడఁ డయ్యెఁ బ్రాణంబులతో నున్న నిన్నాళ్లేల
తడయు ననుచుం జేటు సొచ్చి మగుడిపోయి కృష్ణుండు నిహతుం డయ్యె నని
చెప్పిన.

188


క.

శోకించి చుట్టములు పర, లోక విధులు నడుప నిర్విలోపత విహితా
నేకతిలపిండదానము, లాకృష్ణున కట యొనర్చె నాప్యాయనమున్.

189


వ.

దానం జేసి యతండు సత్త్వహానిం బొందక యెప్పటియట్ల యుండె జాంబవంతుండు
నిరాహారత్వంబుకతనను బ్రబలసంప్రహార[141]భేదంబులవలనను బలహీనుం డై
యోటువడి యద్దేవునకు సవినయప్రణామం బొనర్చి.

190


మ.

సురగంధర్వభుజంగ[142]మద్యుచరరక్షోముఖ్యులు న్నీదెసం
బరిభావం బొనరింప నోప రని మదమద్భావంబునం దోఁచె నె
వ్వరు తిర్యగ్భకు లైన మాదృశులు దేవా నిన్ను మత్స్వామి దా
శరథిం బ్రాప్తపునస్సముద్భవునిఁగా శంకించెదం జెప్పవే.

191

క.

అనిన నగుచు నవ్విభుఁ డా, యన కాత్మావతర[143]ణంబు నఖిలము నెఱిఁగిం
చిన నాతఁడు భక్తిసమ, ర్చనలు దగ నొనర్చె నధికసమ్మోదమునన్.

192


వ.

తదీయకరతలస్పర్శనంబున నాయతసమరశ్రమంబు నుజ్జగించి ఋక్షేశ్వరుండు.

193


క.

తనకూఁతు జాంబవతి నాఁ, జనుకన్నియఁ దెచ్చి యిచ్చె సస్నేహత న
వ్వనజేక్షణునకు నతఁడును, వనజాస్యఁ బరిగ్రహించె వాంఛ [144]యెలర్పన్.

194

శ్రీకృష్ణుఁడు జాంబవతిం బరిగ్రహించి నిజపురంబునకు వచ్చుట

వ.

అట్లు కన్యారత్నంబు నివేదించిన యనంతరంబ శ్యమంతకరత్నంబును సమర్పించినం
బ్రణతునిచేతిది గొనఁదగనిదైనను బరివాదపరిహారార్థం బయ్యర్థవిదుండు గై
కొని చరితార్థుం డై జాంబవతిం దోడ్కొని పురంబున కరుగుదెంచిన.

195


ఉ.

పౌరులు బంధుమిత్రులును భాగ్యఫలంబులు నేఁడు మాకు నిం
డారఁగఁ బండె నత్యుతుఁ డపాయ మొకింతయు లేక యిమ్మెయిం
జేరె జగంబు లన్నియును జేకుఱు నేలితి మంచు సమ్మద
స్ఫారతఁ ద్రుళ్లియాడి రెలప్రాయము వచ్చినయట్లు వృద్ధులున్.

196


క.

సకలయదువృష్ణిభోజాం, ధకసభయును వినఁగ శౌరి తనవృత్తాంతం
బొకటియుఁ దప్పక యుండఁగ, నకుటిలమతిఁ డెలియఁజెప్పె నాశ్చర్యముగన్.

197


వ.

శ్యమంతకమణియు సత్రాజిత్తున కిచ్చె నివ్విధంబున మిథ్యాభిశంసనశమనంబు
గావించికొని గోవిందుం డందఱు నభినందింప జాంబవతి నంతఃపురంబు భూషణం
బుగా నునిచెఁ బ్రాప్తరత్నుం డైన యా ప్రసేనానుజన్ముండు.

198


క.

లేని [145]ప్రయి వెట్టితిమి హరి, పై నక్కట దీని కిదియ ప్రాయశ్చిత్తం
బైనది యని తననందన, నానతుఁడై సత్యభామ నతనికి నిచ్చెన్.

199


వ.

అక్కుమారిక నక్రూరకృతవర్మశతధన్వప్రముఖు లగుయాదవు లెందఱేని
నెప్పుడు నడుగుచునికిం జేసి వాసుదేవుని కిచ్చుట దమకు నత్యంతంబును నవ
జ్ఞతగా నెక్కించుకొని సత్రాజిత్తు శత్రుంగాఁ దలంచుచుండుదు రయ్యందఱు
నొక్కనాఁడు తద్విషయం బగు [146]మంతనంబున నుండి శతధన్వున కి ట్లనిరి.

200


మ.

మన మెల్లం దన [147]తొంటిమంచితన మాత్మం గోరి కోరంగఁ గై
కొన కాకృష్ణునిసొమ్ముఁ జేసె ఖలుఁడై కూఁతున్ సహింపంగ వ
చ్చునె [148]యీపాడివిచార [149]మేమిటికిఁ దుచ్ఛున్ వీనిఁ ద్రుంగించి యెం
దు నలభ్యం బగు మానికంబు గొని సంతోషింత మంతర్గతిన్.

201


చ.

ఎఱుఁగనివాఁడ పోలె హరి [150]యివ్విధి యూరక చూచె నేని లే
దుఱక మనంబులోనఁ బగ యూఱడుచందమ యైనఁ బేర్చి యం

దఱమును నొక్కఁడై కలసి దవ్వుగఁ బాపుద మెవ్వ రెక్కడే
[151]నొఱగిన వారి నెల్లఁ దగ నోర్తము నిశ్చయ మిట్లు దీనికిన్.

202


వ.

అనిన నతండు నవ్విధంబున కియ్యకొనియె జనార్దనుండు జతుగృహదాహంబునఁ
గుంతీనందనులు మ్రంది రనువార్త విని తాను బరమార్థవేది యయ్యును
దుర్యోధనుబుద్ధికి నిజంబు గావించుటకై వారణావతంబునకుఁ బోవుటయు
రంధ్రాన్వేషి యగుటం జేసి.

203

శతధన్వుఁడు సత్రాజిత్తుం జంపి శ్యమంతకమణి నపహరించుట

తే.

అలఘుచరితు సత్రాజిత్తు నర్ధరాత్రి, సుప్తుఁడై యుండ వధియించి లుప్తధర్ముఁ
డైనశతధన్వుఁ డతనియనర్ఘదివ్య, వినుతమాణిక్యరాజంబు గొనుచుఁ జనియె.

204


సీ.

తండ్రిఁ జంపినఁ గడుఁ దలఁకి యత్యంతవేగము గల గుఱ్ఱాలఁ గట్టినట్టి
తే రెక్కి చెచ్చెర వారణావతమున కరిగి యాతెఱఁగు నారాయణునకు
సర్వంబు నెఱిఁగించె సత్యభామాదేవి వాసుదేవుండు నవ్వామనయన
మనసులో నున్న యుమ్మలికయు మానెడు పంతంబుమాట లొక్కింత కొఱఁత


తే.

పడక యుండంగఁ [152]బలికి యప్పడఁతిఁ గొనుచుఁ
బురికిఁ జనుదెంచి యేకాంతమున హాలాంకు
[153]తోడఁ దలపోసి శతధన్వుఁ దునిమి యతని
చేతిరత్నంబు గొనుపని సేయఁదలఁచె.

205


వ.

ఇట్లయ్యిరువురుం గూడి కీ డొనర్ప నుద్యోగించు తెగువ యెఱింగి శతధన్వుండు
వారితోడి[154]పోరికిఁ బెనుప్రాపై నిలుచునట్లు గృతవర్మ [155]నడుగంబోయిన నతం
డియ్యకొనక బలదేవవాసుదేవులదెస విరోధంబునకుఁ [156]2దానొనర్పమి దెలియం
బలికె నక్రూరుం గలపికొనువాఁడైన నతండు.

206


మ.

[157]అసురీహారమృణాళహంసము [158]మహేంద్రాంతఃపురీకర్ణప
త్రసమున్మీలనమూలశిల్పి [159]గుమతథ్వాంతార్కబింబంబు దు
ష్ప్రసహం బెవ్వనిచక్ర మట్టిహరికిం బ్రత్యర్థియై నిల్వఁగా
వసమే యెంతటివానికిన్ వెఱుతు నివ్వైరస్యముం బూనఁగన్.

207


వ.

ఏ నతని శరణాభిలాషకుండ దోషాచరణంబునకు నెట్లు గణంగుదు [160]వెడంగనయి
మున్ను మీతలంపునం గలసితి నవి యన్నియు నప్రయోజనం[161]బు లనిన శత
ధన్వుం డట్లేని నాకు నిక్కడ [162]నన్యుంచు రక్షకుండు లేఁడు తొలఁగిపోయెద నీ
వీయలభ్యరత్నంబు డాఁపవలయుఁ బ్రాణంబుపయి నచ్చునంతటి పోరామి
యందును నెవ్వరికి నెఱింగింపకుండునది యని యొడంబఱచి యతనిచేతి కిచ్చి
యా ప్రొద్ద పురంబు వెలువడి పూర్వోత్తరదిశాభిముఖుం డై.

208

శతధన్వుఁడు కృష్ణునకు వెఱచి తురగారూఢుఁ డై పాఱిపోవుట

క.

తనకు నొకనాఁట శతయో, జనములు సను హృదయ యను లసత్తురగనితం
బినిగలిమి దాని నెక్కి ప, వనసమగతిఁ జనియె మనసు వడఁకఁగ భీతిన్.

209


ఉ.

అంత నెఱింగి శౌరియు సహాగ్రజుఁడై రథ మెక్కి యయ్యప
క్రాంతుని వెన్నడిం దగులఁగాఁ దనపోయెడిదవ్వు వోయి తా
నంతటఁ బోవలేక మృతినందె హయాంగన భోజవర్యుఁడున్
భ్రాంతతఁ బాదచారి యయి పాఱె విదేహపురంబు చేరువన్.

210


క.

కనుఁగొని కృష్ణుఁడు బలదే, వున కిట్లను హయములకు [163]తెవు లగు వెసం
జననిచ్చుట గావున నీ, వనఘా కొనిరమ్ము రథము నల్లన వెనుకన్.

211


తే.

విగతవాహనుఁ డైనయివ్విమతుఁ డోపు, కొలఁది మెల్లనఁ బాఱెడుఁ గూడ ముట్టి
పట్టికొనియెద ననిన నబ్బలియుఁ డట్ల, కాక యన డిగ్గ నుఱికి యాకంసరిపుఁడు.

212


క.

[164]కొంతదడ వరిగె వెసుకొని, యంతటఁ గడు నలిగి యాతఁ డాశతధను న
త్యంతక్రోధంబున మది, [165]శాంతింపక తునియవైచెఁ [166]జక్రముచేతన్.

213


వ.

ఇట్లు తల ద్రుంచి శతధన్వుం జేరఁబోయి.
క. [167]మొలయును జీరయు నోరును, దలయును శోధించి చూచి తత్తనువున న
వ్విలసితరత్నము గానఁడ, హలధరుఁడును గూడ వచ్చె నంతటిలోనన్.

214


వ.

ఆతం డవ్విధం బతనికిం జెప్పి శతధన్వువధంబు వితథం బయ్యె నను పలుకు పలికిన
నది బొం కనుతలంపునఁ గటకటంబడి బలుండు.

215


తే.

[168]అర్థతృష్ణ యెట్టిదియొ నీయట్టివాఁడు, నిస్సిరో యింతమాత్రకు నిట్టిఁడయ్యెఁ
బలుకు లేటికి నీతోడి భ్రాతృధర్మ, మింక నింతియ చాలు నీయిచ్చఁ జనుము.

216


వ.

అని యతని శపథవాక్యంబులు విశ్వసింపక సాంత్వనంబులు గైకొనక యిమ్మాయ
లేనెఱుంగనియవియె యుడుగు మని పాసి యొక్కరుండును మిథిలాపురంబునకుం
జని జనకరాజు చేత సత్కృతుండయి తత్సదనంబున నుండె వెన్నుండును సైన్య
సుగ్రీవమేఘపుష్పపలాహకంబు లను రథ్యంబులు గల యాదివ్యరథంబుతోడ
మగుడి ద్వారవతీపురంబునకు వచ్చె నక్కడ.

217


క.

వైదేహపురనివాసు మ, హాదుర్దమసత్త్వు సాత్వతాగ్రణి ఘను దా
మోదరపూర్వజుఁ గానం, గా దుర్యోధనుఁడు వచ్చి కడు వినయమునన్.

213

వ.

సవిశేషార్చనాతోషితుం గానించి యతం డాచార్యుండుగా గదాకౌశలం బంత
యుం దుది ముట్ట నభ్యసించె నంతఁ గొంతకాలంబునకు నుగ్రసేనాదియాదవ
వృద్ధులు రత్నంబు కృష్ణునకుం జేపడమి లెస్సగా నెఱింగి పోయి బలభద్రున
కవ్విధంబు దెలిపి యతనిం దోడ్కొని చనుదెంచి రనంతరంబ.

219


సీ.

అక్రూరుఁ డమ్మెయి నమ్మహారత్నంబు దనకు వచ్చిన ననుదినము గురియు
పసిఁడియు మణులు నల్పంబు నాత్మోపభోగమునకుఁ గొనక దానములు ధర్మ
ములు హుతంబులు బంధుపూజనంబులు నూర్జితములుగ జరపుచుఁ దనరి యెందు
నతులితంబై దానపతి యనుపేరు ప్రఖ్యాతి నొందగ నిత్యయజన మొకఁడ


తే.

కృత్యముగ నిష్ఠతోడ దీక్షించియుండె, నఱువదియు రెండు నేఁడు లిత్తెఱఁగుతోడ
నెడప కెపుడును మారియు నడఁగె వఱపు, లుడిగె భద్రంబు వర్ధిల్లుచుండె నుర్వి.

220

అక్రూరుఁడు విడిచిపోవుటవలన ద్వారకయం దుత్పాతంబులు పుట్టుట

వ.

ఆనడుమ నొక్కతఱిఁ దదీయబాంధవు లగు భోజులు శత్రుఘ్నుండను యాదవు
వధియించిన.

221


తే.

కలఁక పుట్టి యాదవులలో నిలువ ననువు, గాక తానుజుట్టలుఁ దొలఁగంగఁ జనియె
నమ్మహాత్ము డతనిపోక యాదిగాఁగఁ, బుట్టె బహుదోషములు యదుపురమునందు.

222


వ.

అట్టి యనావృష్టిమారిదవాగ్నివ్యాధ్యాద్యుపద్రవంబులు సూచి వృష్ణి [169]ప్రము
ఖులు దమలోనం జింతించునెడ వసుదేవనందనుండు.

223


క.

మున్నెన్నడు లే వొక్కట, యున్నయునికిఁ బెక్కుకీళ్లు నుగ్రమ్ముగ ను
త్పన్నములై మానక యి, ట్లున్నవిధమునకు నిమిత్త మూహింపఁదగున్.

224


వ.

ఎయ్యది యేని నొక్క.టి లేక యిట్లేల యగు ననిన నందకుం డనుకులవృద్ధుం
డతని కిట్లనియె.

225


క.

జననుత విను మక్రూరుని,జనకుండు శ్వ[170]ఫల్గుఁ డున్నజనపదమున సం
జనితంబులు గా వెన్నఁడు, ననుపమదుర్భిక్షమారికాదిభయంబుల్.

226


వ.

కాశీశ్వరుదేశంబునం దవగ్రహపీడ పొడమినం బెద్దలు సెప్ప నతండు [171]శ్వఫల్గుం
బ్రార్థించి తోడ్కొనిపోయి యద్దురితంబులఁ బాపికొనియెఁ దొల్లి యా కాశ్యుపత్ని
గర్భిణియై సముచితసమయంబునఁ బ్రసవింపక పండ్రెండేండ్లు చూలు మోచిన
నచ్చెరువు నొంది యవ్విభుండు నిజప్రభావంబునఁ దద్గర్భంబు గూఁతురుగా
నెఱింగి తల్లీ మీతల్లికిం గ్లేశంబు సేయక వెడలుము భవదీయవదనావలోకనంబున
నన్నుఁ గృతార్థుం జేయవలదే యనినం గడుపులో నున్నకన్య తండ్రిం బేర్కొని.

227


క.

అనుదినమును నేఁడాదిగ, ననఘా యొక్కొక్కమొదవు నవనిసురున కి
చ్చిన నింక వత్సరత్రయ, మున కేను జనింతుఁ జేయుము మదీప్సితమున్.

228

వ.

అనిన నట్ల కాక యని యయ్యనుష్ఠానంబు విధంబునడప సుక్తకాలంబునం గన్నియ
పుట్టి గోప్రదానప్రసూత యగుటం జేసి గాందిని యనుపేరు గాంచి క్రమంబునం
బెరిఁగి పెండ్లిప్రాయంబున నున్నదిగావున నన్నాతి నన్నరనాథుండు పరమోప
కారి యైనయాశ్వఫల్కునకు నొసంగె నట్టితండ్రికిం బుట్టిన కొడుకునకు బితృ
ప్రభావం బెట్లును లేకుండునే యక్రూరుం డసాధారణగౌరవోదారుం డట్లు
గావున.

229


క.

ఆతఁడు దొలఁగిన నెంతయు భీతికిఁ బట్టయ్యె నిట్లు పృథివి దగదు నీ
త్యాతిశయగుణునిదెస నొక, టేతావనాత్రమునకు నెగ్గు గణింపన్.

230


వ.

అనినం దద్వచనం బంగీకరించి రథాంగధరుండు తదపరాధంబు సైరించినవాఁడయి
యుగ్రసేనానుమతంబున నక్రూరు రావించిన నుపప్లవం బంతయుం బ్రశాంతం
బయ్యె నంతం గృష్ణుం డొక్కనాఁ డంతర్గతంబున.

231

శ్రీకృష్ణుఁ డక్రూరునిచేత నున్న శ్యమంతకరత్నంబు బయలుపఱుచుట

సీ.

ఘనుఁడు [172]శ్వఫల్గునితనయుఁ డక్రూరుండు తండ్రిప్రభావంబు తాను జూపె
నను డల్పహేతువు నరయ ననల్పంబు గలదు దుర్భిక్షాదికలుషశాంతి
యందుఁ గారణ మొక్కఁ డాశ్యమంతకరత్న మున్నది యాతనియొద్దఁ దప్ప
దిది యమ్మహామణి కీదృశాద్భుతభూతి గలుగుట విందు మీయలఘుశీలుఁ


తే.

డోలి నొకజన్న మొనరించి యొండుక్రతువు, దోనతొడఁగెడు నసదృశదానగరిమ
[173]యెడపడకయుండ సలిపెడు నింతవ్యయము, సేయ నే మెఱుఁగనిసిరి [174]చెందెనెందు.

232


వ.

అని యూహించి సమస్తయదువృష్ణిసమక్షంబున నొండుకార్యంబుపేర నతనిం
బిలిపించి.

233


క.

ఆపనికిఁ దగిన సరసా, లాపంబులఁ గొంతసేపు లాలితమృదుగో
ష్ఠీపరిణతుఁడై పదపడి, యాపురుషోత్తముఁడు నగుచు నబ్బోజవిభున్.

234


వ.

దానపతీ యని సంబోధించి యల్లన యిట్లనియె.

235


చ.

సకలజగంబు[175]లందుఁ గడుసార మనం దగునుజ్జ్వలచ్ఛ్యమం
తకమణి నీకు నిచ్చె శతధన్వుఁడు నీవును డాఁచినాఁడ వి
య్యకుటిలకర్మ ముర్వింగలయంతటికిన్ హిత మేను నాత్మ దీ
నికిఁ గడు సంతసిల్లితిని నిక్, మెఱుంగుదు మింత యెప్పుడున్.

235


క.

నీయొద్దన యుండుటయును, మాయర్థం బగుటఁ జేసి మది నెఱిఁగియు నొం
డేయదియును బలుకము భవ, దీయమహత్వంబు బహుమతిక్షమ మగుటన్.

236

వ.

ఈరౌహిణేయుండు రత్నవిషయం బైనయవిశ్వాసంబువలన మాదెసం బ్రస
న్నుండు గాకుండు నట్టిదుశ్శంక నంగీకరింపం జేయం జిత్తంబునకు సమాధానం
బెప్పుడు లేక యున్నారము మాకుం బ్రియంబుగా నమ్మణిశ్రేష్ఠం బివ్వరిష్ఠవిచా
రుండు చూడం జూపవలయు ననుటయు నక్రూరుం డా నారాయణునకు సవిన
యంబుగా నిట్లనియె.

238


క.

శతధన్వుఁడు నా చేతికి, నతులితమణి డాఁప నిచ్చి యరుగుట గల దే
నతిదుర్భర మవ్వస్తువు, సతతక్లేశమున మోచి జరపితి దినముల్.

239


తే.

[176]ఊర కిచ్చిన నేమగు నొక్కొయొడయుఁ, డడుగుటయు భక్తి నిచ్చెద నపుడ యేను
నేఁ డడుగు నెల్లి యడుగు నన్నీరజాక్షుఁ, డనుచు గోరుదు భవదీప్సితార్థ[177]కృతికి.

240


క.

ఇదె కైకొను మమ్మణి నీ, మది వలసినవారి కిమ్ము మ మ్మధిక[178]సుఖా
స్పదహృదయులఁ [179]జేయుము దగ, సదభిమతచరిత్ర యనుచు సంప్రీతి మెయిన్.

241


వ.

తనకట్టిన చీరకొంగున నున్నముడి [180]యూడ్చి కాంచనసంపుటంబు దెఱచి సభామ
ధ్యంబు మధ్యందినార్కతేజోవిరాజితం బగునట్లు గావించు విరాజితప్రభావిసరం
బున నసమానం బగునమ్మాననీయరత్నంబు నయ్యదురత్నంబుముందట నివేదిం
చిన నత్యంతలోచనీయం బగుతదీయవైభవంబున.

242


సీ.

బలదేవుఁ డిది నాకుఁ బద్మనాభునకును బొత్తులసొ మ్మని బుద్ధి సేసె
సత్యభామ మదీయజనకునిపడసినయర్థంబు తనుఁ జేరు నని [181]తలంచె
నగ్రజుఁ బ్రియురాలి నాత్మఁజూడక కృష్ణుఁ డొక్కింతవడిగోర్కి మదిల [182]గొనియె
సకలయాదవులును సంస్పృహాలోకనస్మేర[183]విస్మయరసస్తిమితు లైరి


తే.

వృష్ణివరుఁ డంత నాభోజు[184]వీరవరున, కనియె ననఘ యారత్నంబు నాత్మశుద్ధి
కెల్ల చుట్టాలకును నిని యింత సూప, వలసె నింతియ నాదైనవాంఛితంబు.

243


వ.

దీనికిం దాలధ్వజుండును నేనును సత్యభామయు నర్హుల మన్యులకుం బనిగాదు
సకలకాలగుశులును సంభృతబ్రహ్మచర్యులును నగు సుజనుల చేత ధార్యమాణం
బై యిమ్మానికంబు నిజంబు నిజప్రభావంబుఁ జూపుం గావున నే మెవ్వరము
నింత [185]నియమంబున కోర్వము సర్వగుణసంశుద్ధభావుండవు నీవ తదీయధారణ
యోగ్యుండవు నీక యిచ్చితి ననిన నట్ల కాక యని సంతసిల్లి.

244


క.

ఆరత్నము గైకొని య, క్రూరుం డది మొదలు గాఁగ గొంకక సాలం
కారముగ బయలుమెఱసి యు, దారతఁ దేజంబు మిగిలెఁ దపసుఁడ పోలెన్.

245


తే.

జలజనాభుమిథ్యాభిశంసనవిముక్తి
యైనయిక్కథ చదివిన ననుదినంబు

వినినఁ దలఁచిన సడిలేక జనులు సర్వ
దోషరహితులై పొందుచుందురు శుభంబు.

246


క.

అని వైశంపాయనుఁ డ, త్యనుపమయశుఁ డగు పరీక్షిదాత్మజునకుఁ జె
ప్పినపుణ్యకథన మఖిలము, [186]ననతారివిదారి దారుణాసివిభాసీ.

247


శా.

కాంతాఖేలనపుష్పబాణ కరుణాకల్యాణ విజ్ఞానవ
చ్చింతాస్వీకృతశౌరి సత్కృపమఖశ్రీప్రీతగీర్వాణ దు
ర్దాంతోదగ్రశరాసనప్రథితవిద్యాద్రోణ వాణీధురీ
ణాంతర్వాణిజనార్చితోజ్జ్వలగుణా యానమ్రవిద్వద్గణా.

248


క.

రామాయణహరివంశ, శ్రీమన్మధుర[187]ప్రసంగ సిద్ధ చిరయశ
స్సామర్థ్యకరణ[188]నిపుణా, శ్రీమల్లచమూవరేణ్యసేవితహృదయా.

249


మాలిని.

సుజనభజనదుష్టస్తోమనిర్మర్దకామా
త్యజనచతురవృత్తిస్థాపనోద్దీపితా[189]ర్థా
యజనముఖసుకర్మ[190]ప్రాపితాభంగకీర్తి
ధ్వజ కలియుగకృష్ణా దానకేళి సతృష్ణా.

250


గద్యము.

ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన శ్రీహరివంశంబునం బూర్వభాగంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. సమ
  2. వేమానుసమిద్ధచారు
  3. లొలికె నతని
  4. 'పద్మానాం దశతీ ర్దశ' అని మూలము. 1-25-18 = వేయి పద్మముల యేండ్లు అర్థ మని నీలకంఠుఁడు.
  5. భృగు వధ్వర్యుండు
  6. హిరణ్యగర్భుం
  7. సనత్కుమారాదిముని
  8. మఱిమఱి
  9. యమరుల
  10. కరంబు, న
  11. సత్యముగా
  12. బాతక
  13. యజ్వుఁడు
  14. డాత్త, ఆర్త.
  15. ఎలమిఁ బదియును బదియేను నిరువదియును, నేడు నెనిమిదియును బదియేడు నైదు
  16. ఎలసి
  17. విను తత్కార్ముకమధ్యయుక్త
  18. సహస్రకము
  19. తోటి
  20. యపవి
  21. న నిన్ను దలంచుచు
  22. మను
  23. ద్రుహ్యుండు ననుండునుఁ బూరుండు నను మువ్వురిం
  24. గ గెల్చి
  25. పెక్కుతరంబు. పెక్కుతెఱంగులం దిరిగిన
  26. పూరుని మధ్యమభూమికి నధిపుగా నభిషేక, మొనరించె నవనినాథు, లేక, పూరుని ...మికి రాజుగా న....రించె నధిపుఁ డట్లు
  27. నొడయుఁగా నొనరించి
  28. పుత్రుల
  29. నాత్మ, జాతు లందఱ
  30. కడపుట్టువాఁడు
  31. మున్న తగ నాత్మ
  32. నన్నరపతియున్
  33. ల్దమ
  34. నెవ్వఁడు
  35. దగదె
  36. మానశాలు
  37. వేను
  38. వేనుఁడు
  39. యన నాచతు
  40. పని నాత్మ
  41. నుఁ గలిగి
  42. ఁడను
  43. వారణం
  44. విఘూర్ణకఠోర
  45. వెనక
  46. అనఘుండు ననఘుండు
  47. తనూజుండు
  48. సుతహోత
  49. పతుండు
  50. లాసుతహోతకు
  51. పతికిని ననఘ గార్త్స్న్య
  52. పతులనఁ బుత్రులు బ్రాహ్మణక్షత్రియ
  53. ధన్వంతరీడ్య తదాఖ్యఁ బుట్టె.
  54. నుందను
  55. వెలయ
  56. ప్రభవించి
  57. రాక్షస
  58. నీవియు
  59. సలజుం
  60. సలజునకు
  61. బృథుత్వ
  62. తేజుఁ డున్నతిన్
  63. విను నిమియనంగ రెండవవనితకు విను గవిని యనఁగ
  64. పురుజాతి
  65. ని నతండు
  66. వాద్ర్యశ్వుండు
  67. నతనికి
  68. ఁజతురు
  69. నీలపుత్రి సం. ప్ర.
  70. వధ్యశ్వుం; వధ్వన్వ్యు
  71. వాగ్యమంబు
  72. శ్రుతసేనుండు నుగ్రసేనుండు భీమసేనుండు జననంబునొంది రందు
  73. గనియె
  74. వరుద్ధామకుండు
  75. సక్రీదుండు
  76. సక్రీదునకు
  77. దుహ్యునకు
  78. మర్ముం
  79. మర్ము
  80. విస్తరం బుపన్యసించెద
  81. నీలాంజికు
  82. మఘంబు
  83. వృషుండు
  84. లపూర్వ
  85. గలదు
  86. గీర్తి
  87. తరసంభవం బిది యభి
  88. యదూత్పత్తియదు
  89. స్వాజి
  90. శినేయుం
  91. జ్యామఘుండు
  92. జ్యామఘుఁడు
  93. గామి
  94. నృపకోటి
  95. ఋక్షవత్తటమున యందు
  96. యతుల
  97. ధాటికిం
  98. అయ్య యన్నదమ్ములను రమ్మనుచుఁ బిలుచు ... బాలవృత దుర్బలులు గ్రస్సిపడఁగఁ గాంది...
  99. డస
  100. రేఖలకు నొసఁగ
  101. సమర్థత
  102. నెదుర
  103. నివ్వటిలంగ
  104. బొక టెద్ది
  105. నిట్లుండం
  106. నయందు; నయ్యందున
  107. విధంబుల
  108. దాశార్హునికొడుకు వ్యోముఁడు గాన నిది తప్పు, వ్యోముని విడిచినఁ బరిగణనము తప్పు.
  109. భృహతులును
  110. గృమియు
  111. ధృష్ణుండును.
  112. యట్ల
  113. గనఁగ
  114. శమీకుండు బలబర్హిషుండు నను
  115. జేసి
  116. డన నట యుపదేవుఁడన వసుదేవుండు నన
  117. రంహుం
  118. బదుం
  119. నంసపతియు
  120. ఁగంకయు
  121. విడూరథుండు
  122. దొలుత
  123. నమిత్రుండును
  124. లోక
  125. పృథుకీర్తి
  126. మదనుండు
  127. కుశీవరుండు
  128. వేలు
  129. గనియె
  130. మిత్రుఁడ యన మిత్రుకున కమిత్రవిభేదీ; మిత్రుఁడు మిత్రుఁడుగా నమిత్రవిభేదీ.
  131. నఖ
  132. గలంక
  133. నది యశుచి
  134. వెంటఁదిరుగ
  135. కేపాపాత్ములు
  136. మునుకు
  137. జనంబులు
  138. పటిష్ఠ, వరిష్ఠ.
  139. సంశ్లిష్టితున్
  140. బ్రతి
  141. భేదంబునను
  142. ముఖ్యవర
  143. భంగియ
  144. యలర్పన్
  145. ప్రతివట్టితిమి
  146. స్యమంతకరత్నంబు మనంబుననుండి
  147. తోడి
  148. యీపాడి; యీచెంత; యీసేఁత విచార మేమిటికి వచ్చున్.
  149. మేఁటికి నటంచున్
  150. యిప్పని
  151. నొరసిన
  152. నాడి
  153. తోఁడ
  154. పోరునకు
  155. నొడఁబఱుప
  156. నొడఁబఱుప
  157. అసురవ్రాత
  158. సురేం
  159. గుముద, కుమతి
  160. వెణంగురునయి
  161. బనిన
  162. నుండుమను దక్షుండు
  163. నెవులు గడువెసమైఁ సెవులగు (పూ. ము.)
  164. వ. కొంత దవ్వు వెనుకొని యంట నరిగి యంతట నట్లు శతధన్వుమస్తకంబు దునియం జక్రంబు వైచి చేరంబోయి.
  165. చింతింపక
  166. చక్రము
  167. తలయును జీరయు నోరు మొదలుగా (పూ. ము.)
  168. అకట
  169. ముఖ్యులు
  170. ఫల్కు
  171. శ్వఫల్కుం
  172. శ్వఫల్కు
  173. యెడవకుండఁగ సలిపెడు
  174. యే యితనికి
  175. నందు
  176. ఊరకిచ్చుట గా దది యునికి యెఱిఁగి.
  177. కృతియ
  178. శుభా
  179. జేయందగు
  180. విడిచి
  181. దలఁచి
  182. కొనఁగ
  183. విస్మిత
  184. విభున కిట్టు లనియె.
  185. నియతి
  186. ననయము నానందవిస్మితాస్యుం డగుచున్.
  187. ప్రబంధసేవ
  188. కరుణనిత్య
  189. ర్థిప్రజననముఖకర్మ
  190. ప్రాభవ - ఈ పాఠమున యతిభంగము. (చూ. పాఠాంతరములు).