హరివంశము
పూర్వభాగము - చతుర్థాశ్వాసము
|
శ్రీసంభావితవక్షో
భాసురమణిహారకిరణ[1]పరిచయచతురో
ల్లాసమృదుహాస యవిరత
భూసురగృహ[2]రచితహేమ ప్రోలయవేమా.
| 1
|
వ. |
అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు విచిత్రోపన్యాసవిశారదుం
డైన వైశంపాయనువాఙ్మయం బభినందించి జనమేజయుం డతని కి ట్లనియె.
| 2
|
సీ. |
యదువంశసంజాతు లగుభూపతుల నెల్లఁ బరిపాటితో వింటిఁ బరమపురుషుఁ
డగుశౌరి సేసినయట్టి యాశ్చర్యంపుఁ బనులు సవిస్తరఫణితిఁ జెప్ప
నన్నియు విన వేడ్క యయ్యెడు నద్దేవుప్రకృతి యెయ్యది యేమిభంగి వచ్చి
మర్త్యుఁడై పుట్టె నమర్త్యులు గొలువంగ సురలోక మేలుచు సురవిరోధు
|
|
తే. |
లాత్మశౌర్యనిరాకృతు లై [3]యొదుంగఁ
బరఁగు పరమేశ్వరుడు విశ్వభర్త యకట
కష్టతర మైనమనుజసర్గంబుఁ [4]జొరఁగ
నెవ్విధంబునఁ దనమది నిచ్చగించె.
| 3
|
క. |
దేవత లాదిగఁ గలభువ, నావాసుల నెల్లఁ గాచునధికుఁడు ధరణిన్
గోవులఁ గాచె నితం డను, నీ వెడమాయపుఁ [5]బ్రసక్తి యేల భజించెన్.
| 4
|
క. |
పదునాలుగుజగములు దన, యుదరంబున [6]జతనుపడఁగ నునుచుమహాకో
విదుఁ డొకమానవభామిని, యుదరంబున నెట్లడంగి యుండె [7]మహాత్మా.
| 5
|
శా. |
లోకం బంబుధి ముంచి యెంతయు నిరాలోకంబుగాఁ జేసి ని
శ్శోకుండై చతురాస్యజన్మగృహమై శోభిల్లుపద్మంబు నా
భీకాసారమునం దలిర్పఁగఁ గడుం బెంపారుసర్వాత్ముఁ డే
యాకాంక్ష న్వసుదేవసూనుఁ డనుపే రాసించె ధీసంగతిన్.
| 6
|
వ. |
మఱియు నప్రమమేయప్రభావుం డై యాకాశంబు మొదలయిన భూతంబులం గలి
గించి భూతతన్మాత్ర లుపాదానంబుగా సోమాగ్నిమయంబు లగు [8]శుక్రశోణితం
|
|
|
బులవలన సప్తధాతుసందీపితంబు లై పొడము శరీరంబులు ప్రాణముఖసమీ
రణంబులఁ జేష్టించువెరవు సూత్రించి కళాకాష్ఠాదులచేతం బరిగణితం బైనకాల
చక్రంబు యుగమన్వంతరపరార్థరూపంబునం [9]బరివర్తించుచు నుత్పత్తిస్థితిసంహా
రంబులకుఁ దా నొక్కరుండ హేతువై పవిత్రంబులకు నుత్తమపవిత్రంబును
దపంబులకుఁ బరమతపంబును వినయంబులకుఁ బ్రకృష్టవినయంబును దేజస్సులకు
నత్యంతతేజస్సును గతులకు నుదాత్తగతియును ధర్మంబులకు సేతువు నధర్మంబు
లకు నఖాతంబును వేదంబులకు వేద్యంబును బోధంబులకు బోధ్యంబును బ్రాప్తు
లకు బ్రాప్యంబు నగు వస్తు వతండ యన వెలుంగు సర్వజ్ఞుండు నిసర్గజరామరణ
విహ్వలం బగు దేహంబు నుద్వహించుట యత్యద్భుతం బవ్విధంబు నాకుఁ దెలియ
నుపదేశింపు మనినఁ బరీక్షిత్తనయునకుఁ బారాశర్యశిష్యుం డిట్లనియె.
| 7
|
క. |
నీ వడిగిన యీ యర్థము, భూవర కడుఁ గడిఁది దురవబోధం బైన
న్నావిన్నతెఱంగున నీ, భావ మలర విస్తరింతుఁ బరిపాటిఁ దగన్.
| 8
|
తే. |
విష్ణుమాహాత్మ్యకథనంబు వినుట కిట్లు
బుద్ధి జనియించె [10]నెంతయుఁ బుణ్యతముఁడ
వీవు హరిలీలఁ గీర్తింప నిప్పు డొదవెఁ
గాన నేను గృతార్థుండఁ గౌరవేంద్ర.
| 9
|
మ. |
విను సర్వంబును దాన యై జగము లావిర్భావదుర్భావముల్
తనయం [11]దొందఁగ నొండుఁ బొందక యచింత్యం బప్రమేయంబు నాఁ
జనురూపం బనిరూపణీయవిశదేచ్ఛం గ్రాల వెల్గొందు ని
త్యనిరాలంబుఁ డనాద్యుఁ డచ్యుతుఁడు చిత్సత్యాత్ముఁ డత్యున్నతిన్.
| 10
|
క. |
యజ్ఞకారుఁడు విష్ణుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞసత్క్రి[12]యార్చితుఁడును స
ర్వజ్ఞుఁడు యజ్ఞఫలప్రదుఁ, డాజ్ఞ ప్రభుఁ డఖిలమునకు నను నాగమముల్.
| 11
|
చ. |
అనఘ సహస్రపాదుఁడు సహస్రభుజుండు సహస్రవక్త్రలో
చనుఁడు సహస్రమస్తకుఁడు సర్వమహీవియదంతరాత్మ[13]శా
సనదురక్షతేజుఁ డజశంకరశక్రసమస్తదేవతా
మునిమనుధాతృముఖ్యబహుమూర్తిమయుండు ముకుందుఁ డొక్కఁడున్.
| 12
|
వ. |
అట్టిమహామహిమ గల దేవుం డొక్కొక్కకాలంబున [14]జగంబుల కుపద్ర
వంబు పుట్టినచోట్లను బృధివికి భరం బైనపట్లను సాధులకు బాధలు గదిరిన
యెడలను ధర్మంబులకుఁ జలనం బెలసిన నెలవులను విచిత్రంబు లగుజన్మంబులం
బచరించి లోకస్థితి నిర్వహించు నతని యవతారంబులు మున్నైనయవియు
|
|
|
నింక నయ్యెడు నట్టివియును సహస్రసంఖ్యంబులు వానిం బురాణవిదు లెఱుంగుదు
రేనునుం గొన్ని కీర్తించెద.
| 13
|
ఉ. |
లోకము [15]సర్వమున్ జలములోన మునింగి హతప్రకాశ మై
యాకుల మైనచో యుగసహస్రసమం బగుకాల మాత్మవి
ద్యాకమనీయసుప్తి నలరారి ప్రబుద్ధత నొంది ఫుల్లనా
భీకమలంబునం గనియెఁ బెంపుగ నచ్యుతుఁ డాచతుర్ముఖున్.
| 14
|
వరాహావతారంబు సంక్షేపరూపంబుగాఁ జెప్పుట
వ. |
ఇది పౌష్కరం బనునవతారం బాసమయంబున మధుకైటభులను దానవులు
సమరోన్ముఖు లై తోడరిన సమయించి యద్దేవుండు దీప్తం బగు తేజంబున వెలింగె
మఱియుం గల్పాదియం దమ్మహాప్రభావుండు భవ్యశ్రుతిచరణంబును యూప
దంష్ట్రంబును బ్రాయశ్చిత్తనఖంబును జిత్యాముఖంబును వహ్నిజిహ్వంబును
గ్రతుజానుకంబును దక్షిణాహృదయంబును నాజ్య[16]నాసికంబు నుపాకర్మోష్ఠంబును
నహోరాత్రలోచనంబును వేదాంగశ్రవణంబును సాముస్వనంబునుం దర్భరోమం
బును బ్రవర్గ్యావర్తభూషణం నను బ్రహ్మశీర్షంబును హవ్యకవ్యవేగంబును వివిధ
చ్ఛందోమార్గంబును బ్రాగ్వంశకాయంబు నగుయజ్ఞవరాహరూపంబు ధరి
యించి.
| 15
|
సీ. |
కొవ్వాఁడికోఱలమవ్వంపుమెఱుఁగుల విలయాంధకారంబు [17]వెలుఁగువాఱ
గురగురధ్వనులు [18]నిర్భరముగఁ బర్విన నెలసి బ్రహ్మాండంబు లెదురు మ్రోయ
మునుమించి నిడుమోర ముంచి దూఁటిన మహా[19]జలధిపూరము తల కెడవు గాఁగఁ
దోరంపు గొరిజుల త్రొక్కున నొడలెల్ల [20]నలిగులియై సర్పనాథుఁ డొదుఁగ
|
|
తే. |
నేడుపాతాళముల [21]క్రిందియిఱుకుగొంది, కరిగి [22]తోయాత్తయైనున్న ధరణిఁ
జూచి మొగము [23]దాపుగ నిచ్చి నిర్ముద్రశక్తి, గరిమ గడలొత్తఁగా నెత్తె [24]గిరివిభుండు.
| 16
|
వ. |
ఇట్లెత్తి సప్తసాగరసప్తద్వీపసప్తమహీధరవిభాగవిభాసిత యైన యమ్మహీదేవి
మరల నమ్మహాతోయమధ్యంబునఁ బదిలంబుగా నునిచె నిది వరాహావతారంబు
నారసింహం బగు నవతారంబు వినుము.
| 17
|
చ. |
దితితొలుపట్టి దైత్యకులదేవత దైవతలోకదుస్సహా
ద్భుతభుజుఁ డాహిరణ్యకశిపుస్ఫుటనాముఁ డనామయాకృతిం
గృతయుగవేళఁ జేసె గతకిల్బిషుఁడై తప మూర్జితక్షమా
స్మృతిధృతిశాంతిదాంతిముఖసిద్ధగుణంబుల మేటి వీఁ డనన్.
| 18
|
తే. |
పదునొకండువేలేఁడులు బ్రహచర్య, నియతి దప్ప కమ్మెయి ఘోరనిష్ఠ నడప
నబ్జభవుఁ డాతనికి మెచ్చి హంసయుక్త, వరవిమానంబుతో సురోత్కరము గొలువ.
| 19
|
క. |
చనుదెంచి వేఁడుము వరం, బని పలికిన మిన్ను దాఁకి సాష్టాంగముగా
వినతి యొనరించి యంజలి, జనితోత్తంస మగుశిరము నదురై యొప్పన్.
| 20
|
వ. |
అసురేశ్వరుం డఖిలసురాసురచక్షురక్షోగంధర్వభూతపిశాచోరగమనుష్యతిర్య
క్కులవలనను శైలపాదపశస్త్రంబులచేతను నార్ద్రశుష్కాదులచేతను దనకుం
జావు లేకుండను ఋషిశాపంబులు దన్నుం [25]బొరయకయుండను సూర్యసుధాకర
దహనసలిలగ్రహనక్షత్ర[26]దిగ్భూమ్యధికారంబులు దాన కైకొని నడపను శక్ర
వైవస్వతవరుణధనాధ్యక్షపదంబులు దనసొమ్ములై [27]యుండను గామక్రోధమద
ప్రముఖంబులు తనపంపు [28]సేసి వర్తింపను నభ్యర్థించిన నట్ల యొసఁగి బిసరుహాస
నుండు నిజలోకంబున కరిగిన.
| 21
|
చ. |
తలఁకి నిలింపు లందఱు పితామహుఁ గానఁగఁ బోయి దేవ నీ
వలన వరంబు లిట్లు గని వాలినదైత్యుఁడు మమ్ము నింక నే
కొలఁదుల సైఁచునే కరము గొందలపెట్టక యెట్లు గావునం
దలఁపు మొకింత శాత్రవువధంబువిధంబును లోకనాయకా.
| 22
|
వ. |
అనినం బరమేష్టి వారి నుపలక్షించి.
| 23
|
చ. |
అసుర తపంబుపేర్మియిటు లారయ వచ్చిన నెమ్మెలైయి న్వరం
బొసఁగకపోవరాదు వినుఁ డున్నతిమై నిటమీఁద వాఁడు న
య్యసదృశనిష్ఠకున్ ఫల మనార్యముగా భుజియించుఁ బుణ్య మె
ల్ల సమసిపోవఁగాఁ జెడు బలం బఱి విష్ణుపరాక్రమంబునన్.
| 24
|
క. |
అందాఁక నోపుఁ డెట్లయి, నం [29]దత్క్రూరప్రవృత్తి నావుడుఁ జని రా
బృందారకు లసురయుఁ బెం, పొందినవర మట్లు వడిసి యుప్పొంగుమదిన్.
| 25
|
సీ. |
అమరేంద్రు భంగించి హవ్యవాహను గాసి చేసే యంతకుని నిర్జించి నిరృతి
దండించి వరుణుని గం డడఁగించి సమీరు మర్దించి కుబేరుఁ జెఱచి
యీశాను నొత్తి ఫణీశులఁ ద్రొక్కి సాధ్యుల నొంచి సిద్ధుల నుక్కుమణఁచి
వసువుల స్రుక్కించి వారిజాప్తుని యేపు మాపి యశ్వినుల యాటోప ముడిపి
|
|
తే. |
గరుడగంధర్వఖేచరవరులఁ బెక్కు, గతులఁ గారించి యప్సరోగణము నేలి
యధికు లగుతాపసుల నెల్ల నతకరించి, [30]యఖిలలోకాధిపుత్యంబు నందె నంత.
| 26
|
ఉ. |
భ్రష్టత నొంది దేవతలు బామరి దుగ్ధపయోధిమధ్యవి
స్పష్టభుజంగశయ్య ననుభావ[31]సమీహితసుప్తి నొప్పు శి
|
|
|
ష్టేష్టవిధాయి విష్ణు జగదీశ్వరు నార్తశరణ్యు సత్కృపా
దృష్టిసమగ్రుఁ జేరిరి ప్రదీప్తపరాక్రమచక్రశోభితున్.
| 27
|
తే. |
చేరి దైన్యంబుతోఁ దమ చెడ్డచేటు, లన్నియును విన్నవించి లోకాధినాథ
యజుఁడు మొద లగుసర్వభూతావళికిని, నిక్క మెవ్వరు శరణంబు నీవు దక్క.
| 28
|
క. |
దైతేయుపఱచుబాముల, కేతెఱఁగున నోర్వఁ జాల మిఁక నీయడుగుల్
ప్రీతిం గొలుచుచు నుండేవ, [32]మాతల నీ వెట్టు లుంచె దటుసూడు దయన్.
| 29
|
క. |
దితిసూనుఁ దునిమి మఱియును, దితిజకులము పీచమడఁచు [33]తేఁకువ మదిఁ బూ
నిక యేని మమ్ము నేలుట, సత మగు నమ్మెయికిఁ గరుణ సమకొలుపఁ గదే.
| 30
|
వ. |
అని యభ్యర్థించినఁ బాంచజన్యధరుండు సురవరులదెసం [34]బ్రసాదసుముఖుం డై.
| 31
|
శా. |
మీమీసంపదలుం బదంబులును నెమ్మిన్ గ్రమ్మనం గ్రమ్మఱం
గా మీసొ మ్మగు నెమ్మనమునఁ గలంకల్ మానుఁ డింకన్ సమ
స్తామర్త్యోత్తములున్ భవద్రిపుఁడు నేఁ డస్మద్భుజాభోగిపీ
తామూలాసుసమీరుఁడై పడఁగఁ బూర్ణానందతం జూడుఁడా.
| 32
|
క. |
ఇదె పోయెదఁ జిత్ర జయా, భ్యుదయము నొందెదఁ ద్రిలోకములకును [35]భద్రం
బొదవించెద నని యప్పుడ, కదలి[36]చని కఠోరకాయ ఘనకర్మఠుఁ డై.
| 33
|
విష్ణుదేవుఁడు నృసింహావతారంబున హిరణ్యకశిపుం జంపుట
సీ. |
స్కంధవిధూసనస్ఖలితసటాసమీరమున ఖేచరవిమానములు దూల
[37]దంష్ట్రాసముద్ధతదహనచ్ఛటానిపాతంబున దిగ్వదనంబు లెరియ
గ్రోధతరంగితఘోరనిశ్వాసవేగమునఁ బాబోధిపూరములు గలఁగ
దర్పసంభృతమహోదగ్రహుంకారఘోషమున బ్రహ్మాండోదరములు వగులఁ
|
|
తే. |
గలుషనేత్రకనీనికా[38]కపిలరోచు
లరుణ[39]శశభృన్మరీచుల నాక్రమింప
నమరు నరసింహమూర్తి యొప్పారఁ దాల్చి
విభుఁడు దైతేయు నెదుర నావిర్భవించె.
| 34
|
వ. |
అట్టి దారుణరూపంబు నాలోకించి యాలోకకంటకుండు కంటకితాంగుఁ డగుచు
భయవిస్మయరసంబుల మునిగియుఁ గలంగక [40]యనేకదనుజభటసహాయుం డై
యెదిర్చినం గార్చిచ్చు మృగంబులం బొదువుభంగిఁ [41]బ్రిదిలిపోనీక పట్టి యిట్ట
లం బగుబలంబున.
| 35
|
మ. |
గరుడత్రోటికఠోరఘోరనఖనిర్ఘాతంబులన్ వైరిపే
రుర ముగ్రోద్ధతిఁ జీరి నెత్తురులు [42]సర్వోర్వీనభోదిక్తటీ
బరిణాహంబుల నెల్ల వెల్లిగొనఁ బైపైఁ జల్ల [43]ప్రేవుల్ పొరల్
గర మాటోపముతో [44]హరించె హరి యాకర్షించి హర్షించుచున్.
| 36
|
వ. |
ఇట్లు శత్రువధం బాపాదించిన.
| 37
|
క. |
శితనారసింహఖరా, హతదైత్యమహీపసూపహారంబునఁ ద
ర్పితయయ్యె ననఁగఁ బరిశాం, తత [45]బొందెఁ ద్రిలోకపీడ తత్క్షణమాత్రన్.
| 38
|
క. |
సురలును మునులును ముదమున, నరసింహు నసహ్య[46]రంహు నానావిధవా
క్పరిణతిఁ బ్రణుతించుడు ని, ర్భరభక్తిప్రణతికరణపరు లై రర్థిన్.
| 39
|
వ. |
అయ్యాదిదేవుం డట్లు దేవపదంబులు ప్రతిష్ఠించి యుంచెం గాలాంతరంబున
హిరణ్యకశిపు సుతుమనుమం[47] డగువిరోచనతనయుండు బలి యనువాఁడు
బలీయుం డై బలసూదనసంపద యాక్రమించిన.
| 40
|
వామనావతారంబు సంక్షేపరూపంబుగాఁ జెప్పుట
తే. |
అదితి నిజపుత్త్రహితముగా నాదిదేవు, [48]వరదు విష్ణు గుఱించి దుష్కరతపంబు
సేయుటయు మెచ్చియాపుణ్యశీల కుదయ, మయ్యె వామనాకారుఁడై యవ్విభుండు.
| 41
|
వ. |
ఇట్లుదయించి యింద్రానుజుం డితం డుపేంద్రుం డనఁ బరఁగి బ్రహ్మచారివేషం
బున నధ్యయనంబు సేయుచుండ నక్కాలంబున బలిదైత్యుండు నిత్యం బగు
విష్ణుభజనతాత్పర్యంటును నార్యస్తవనీయం బగుదానశీలత్వంబును ననాకులం
బగుధర్మాచరణంబునుం దనకు నైజంబు లై వెలయ నశ్వమేధం బొనరింప నుపక్ర
మించిన.
| 42
|
క. |
ఆతనిపాలికి నర్థి, త్వాతిశయము దోఁప నంబుజాక్షుఁడు దైత్య
వ్రాతభయదవిక్రముఁడు స, నాతనవైభవుఁడు వంచనం జనుదెంచెన్.
| 43
|
వ. |
అవ్విధంబు ప్రాజ్ఞులు [49]సూచింపక మున్న యెఱింగియు.
| 44
|
చ. |
హరి యఖలైకదాత పరమాద్భుతలక్ష్మికి ధామ మస్మద
ధ్వరమున నర్థియై [50]యడుగ ధన్యుఁడఁ బుణ్యుఁ డగణ్యవస్తుసం
భరణుఁడ నేన యంచుఁ దనభావమునం బ్రియమందు దానవే
శ్వరు నడిగెం బదత్రితయసమ్మితధాత్రి యతండు వేడుకన్.
| 45
|
వ. |
విరోచనతనయుండును బహుమానప్రదానకలనంబునం దనమనోరథపూరణం
బాచరించిన నవ్వటుకుమారుండు.
| 46
|
తే. |
ఇనునిఁ దనమౌళిరత్నంబు నిద్ధహార, తరళరత్నంబు గటిసూత్రపరిధిమధ్య
రత్నమును నూపురాగ్రవిరాజమాన, రత్నమునుఁ జేయుచును బ్రవర్ధనము బొందె.
| 47
|
వ. |
ఇట్లు విక్రమమాణుం డైనయాత్రివిక్రమువిక్రమంబు సైరింపక [51]విప్రజిత్తి యశ్వ
[52]శిరుండు శ్వపతియు, శంకుండు శంకుకర్ణుండు పుష్కరుండు నికుంభుండు బాష్క
లుండు గగనప్రియుండు [53]సమ్మతుండు శరభుండు బృహత్కీర్తి మహాజిహ్వుండు
శంబరుండు విక్షరుండు [54]వేత్రుండు నింద్రతాపసుండు వాతాపి యసిరోముండు
పులోముండు వైశికుండు కాలదమనుండు కరాళుండు రాహువు మొదలుగాఁ
గల యసురముఖ్యులు కూర్మకుక్కుటలకమకరసృగాలబిడాలాద్యనేకవికృతవక్త్రం
బులు బహుబాహుచరణమస్తకంబులుం గలవికటకాయులు నగు రాక్షసుల
తోడంగూడఁ బరిఘుపట్టిసప్రాసకృపాణప్రముఖప్రహరణంబులు దాల్చి యతనిఁ
జిక్కువఱచుటకై యొక్కట కడంగి పొడిచినఁ బదజానుకూర్పరకరతలాహతుల
నందఱం దూలించి యవ్విశ్వరూపధరుండు విశ్వంబు నాక్రమించి.
| 48
|
క. |
అవలీల నసురనాయకు, నవమానితుఁ జేసి త్రిభువనాధీశ్వరవై
భవ మొసఁగె నింద్రునకు ముని, నివహంబులు ప్రస్తుతింప నిఖిలము నలరన్.
| 49
|
వ. |
వామనావతారం బాకర్ణించి తింక జామ[55]దగ్న్యునవతారంబుఁ జెప్పెద వినుము.
| 50
|
పరశురామావతారంబు సంక్షేపరూపంబుగాఁ జెప్పుట
శా. |
అత్రిప్రోద్భవుఁ డద్భుతాత్ముఁడు త్రిలోకారాధనీయుండు ద
త్తాత్రేయుం డనుసంయమీంద్రుఁడు సరోజాక్షావతారంబ యి
ద్ధాత్రిం దొల్లి సమస్తధర్మములు విధ్వస్తంబు లై పోయినం
జిత్రైశ్వర్యముపేర్మిఁ గ్రమ్మఱఁ బ్రతిష్ఠించెన్ మునిశ్లాఘ్యుఁ డై.
| 51
|
మ. |
అతనిం బుణ్యయశోవిజృంభితుఁ [56]గృపైకాయత్తచిత్తాంబుజుం
గృతవీర్యాత్మజుఁ డైన యర్జునుఁడు భక్తిం గొల్చి తేజస్సము
[57]ద్ధతదోస్తంభసహస్రమున్ సకల[58]గోత్రామండలైకాధికా[59]
దృతియున్ యోగ్యవిభూతియున్ బడసి యుద్దీపించె [60]విప్రస్తుతిన్.
| 52
|
సీ. |
జమదగ్నిసుతుఁ డగ్నిసదృశతేజుఁడు రాముఁ డై జనియించి విశ్వాత్ముఁ డాద్యుఁ
[61]డాకార్తవీర్యు నహార్యధైర్యుని ననేకాత్మజబంధుసహాయు ఘనుని
నాజిలోఁ దొడరి యుత్తేజితపరశుధారాముఖంబున నతిరౌద్రభంగిఁ
దునుమాడి యాతనిఁ దొడరి పారావారపరివేష్టితాఖిలధరణిఁ గలుగు
|
|
తే. |
నరపతులనెల్ల వరుసతో నిరువదొక్క, మాటు [62]ద్రుంగించి నెత్తురు[63]మడువులయిదు
నిలిపి కోపంబు మాని యస్థలితనియతి, నశ్వమేధయాగంబు రమ్యముగఁ జేసె.
| 53
|
మ. |
అమితస్వర్ణమణిప్రతానము లసంఖ్యస్యందనాశ్వేభగో
సముదాయంబు లగణ్యధాన్యగృహవాసస్తల్పదాసీసమూ
హము [64]లత్యుత్తమయోగ్యభూసురుల కుద్యద్భక్తితో నిచ్చె దా
నముగా నాదివదాన్యుఁ డీతఁ డని తన్ వర్ణింపఁ ద్రైలోక్యమున్.
| 55
|
వ. |
మఱియుఁ గశ్యపమునీంద్రునకు నఖిలక్షోణియు [65]మఖదక్షిణగా నొసంగి కృష్ణా
జినోత్తరీయుండు జటాముకుటమండలియు నై మహేంద్రపర్వతంబునందు సర్వ
లోకహితార్థంబు నేఁడును దపంబు సేయుచున్నవాఁ డట్టిజామదగ్న్యుజనన
[66]వ్యాపారంబులు నివృత్తంబైన యనంతరంబ.
| 56
|
శ్రీరామావతారక్రమంబు సంక్షేపరూపంబునం జెప్పుట
క. |
ఇరువదినాలవత్రేతను, హరి దశరథభూమిపతికి నాత్మవిభూతి
స్ఫురణము చతురంశములుగ, [67]విరచించి జనించె భువనవిప్లవహృతికిన్.
| 57
|
వ. |
అన్నాలుగు మూర్తులయందు నగ్రజుండు.
| 58
|
మ. |
అమలాంభోజదళాక్షుఁ డక్షయఘనశ్యామాంగుఁ డాజానుదీ
ర్ఘమహాబాహుఁడు సంహతోరుకఠినోరస్కుండు సింహో[68]రువి
క్రమణుం డద్భుతశౌర్యధైర్యకలనాకల్యుండు కళ్యాణధీ
రమణీయుండు వెలింగె రాముఁడు గుణారాముండు భూమండలిన్.
| 59
|
ఉ. |
శైశవకేళియంద తనసత్త్వము లోకము ప్రస్తుతింపఁగాఁ
గౌశికుఁ డస్త్రకోటి యొసఁగంగఁ బ్రదీప్తతనొంది తన్మఖ
క్లేశకరున్ సుబాహుఁ డనుకిల్బిషరాత్రిచరున్ ససైన్యుఁ గీ
నాశునిఁ జేర్చి పేర్చె జననాథతనూజుఁ డజేయుఁ డై యనిన్.
| 60
|
క. |
వైదేహకన్య పురరిపు, కోదండధ్వంసశుల్క గోరి యతని చే
తోదయిత యయ్యె సాక్షా, చ్ఛ్రీదేవి యయోనిజాత సీత యనంగాన్.
| 61
|
చ. |
అనుపమనూత్నయౌవనమునంద పితృప్రియకారియై విభుం
డనుజుఁడు ధర్మపత్నియు నిజానుగమం బొనరింపఁ గాననం
బునఁ బదునాలుగేఁడులు తపోనియతిన్ వసియించి దేవతా
మునిజనరక్షణక్రియ లమోఘముగా నొనరించె నన్నియున్.
| 62
|
క. |
ఖరు మారీచునిఁ గూల్చుట, విరాధునిఁ గబంధు శాపవిచ్యుతిలాభ
స్ఫురితులఁ జేయుట యాదిగఁ, బరఁగినయవి తద్వనాంతపర్యట[69]నవిధుల్.
| 63
|
తే. |
భూరిబలసత్త్వమున నెందుఁ బొగడుగనిన, వాలి వధియించి సుగ్రీవు వానరేంద్ర
పదవియం దుంచె నద్దేవుఁ డుదధిలోన, నిలిపె [70]సేతువు నాశ్చర్య మొలయఁ బేర్మి.
| 64
|
వ. |
మఱియు నాత్మీయదారహరణదురితాపరాధి యైనవాని నహీనతపోవిభవలబ్ధ
ప్రభావు దేవాసురయక్షరక్షోభుజగగంధ్వరాదిసకలభూతదుర్జయు నపరిమితదనుజ
కోటిసహస్రపరివారు దారుణబాహువీర్యసమగ్రు దశగ్రీవు నుగ్రసమరంబున
సమయించె నివి యమ్మహాత్ముని విక్రమంబులు తదీయానుజు లగులక్ష్మణాదు
లింద్రజిల్లవణాదిసురవిరోధుల వధియించి రిట్టిమహిమచేత నత్యంతమహితుం డై
యతం డయోధ్యాపురంబున నభిషేకంబు నొంది దశాశ్వమేథావబృథస్నానశిర
స్కుం డై మహాతపస్వు లగుభూసురులకు గోసువర్ణగజరథతురగగ్రామకన్యా
దాసదాసీగృహాదిదానంబులవలన నతిసమృద్ధి గావించి సమ్యక్ప్రజాకల్పనంబునం
బరమధర్మంబు వడసె నాతని రాజ్యంబునందు.
| 65
|
సీ. |
విషశస్త్రజలవహ్నివిమతతస్కరబాధ లొంద వెన్నఁడు భర్త లువిదలందు
సతివలు పతులందు నవిలంఘితాచార లమరువర్ణంబులు నాశ్రమములు
నాత్మీయధర్మమునం దనాలస్యతఁ దనరారుఁ బ్రాణిజాతముల కెల్ల
నొలయ దకాలమృత్యుభయంబు దెవుళులు కలఁకలు [71]కఱవులు గలుగ వెపుడు
|
|
తే. |
నఖిలజనులు [72]సహస్రవర్షాయుషులు స, హస్ర[73]సంతానయుతులు సహస్రవిధులు
నగుచు [74]మోదింతు రచట లే వకృతదంభ, దర్పకార్పణ్యలోభాద్యధర్మగతులు.
| 66
|
క. |
మునులును సురలును వేడుక, మనుజులలోఁ గలసి మెలసి మనుచుండుదు రెం
దును గుడువుఁడు గట్టుఁడు గొనుఁ, డనుమాటలు వినఁగవచ్చు నఖలక్షోణిన్.
| 67
|
క. |
పదివేలును బదినూఱులు, నొదవిన లెక్క యగు నేఁడు లుర్వీస్ధలిపై
ద్రిదశహితార్థముగ నిలిచి, పదపడి రఘువిభుఁడు నిత్యపదవిం బొందెన్.
| 68
|
వ. |
రామావతారానంతరం బనంతవిభవుం డగులక్ష్మీవిభుండు యాదవరామత్వం
బులు గృష్ణత్వంబు నొందె నందుఁ బ్రలంబముష్టికమైందద్వివిదవధంబును నరిష్ట
కేశికువలయాపీడచాణూరకంసధ్వంసనంబును మురనరకశిశుపాలకాలయవనసాల్వ
పౌండ్రహననంబును బాణపరాభవంబును మఱియు ననేకదుష్టపార్థివప్రహ
రణకరణోద్యమంబును మొదలయినవి యద్దేవు దివ్యకర్మంబు లింకం గలియుగాం
తంబునఁ గల్క్యాత్మకుం డై విష్ణుయశుం డనుపేర నవతరింపంగలవాడు.
| 69
|
చ. |
హరియవతారసంకథన మాగమసమ్మిత మాద్యసంయమీ
శ్వరహృదయానుమోదనము సన్మతిఁ బ్రాంజలియై పఠించినం
దిరముగ విన్న నాపదుదధిం దరియించి నరుండు మంగళ
స్ఫురణము లెల్లఁ గాంచి తగఁ బొందుఁ దుదిన్ హరిలోకవాసమున్.
| 70
|
వ. |
అని యుపన్యసించి వైశంపాయనుండు జనమేజయునితోఁ ద్రివిక్రమావతార
శోభితుం డైనవిష్ణుపరాక్రమంబు లింకనుం గీర్తించెద విను మని యి ట్లనియె.
| 71
|
దేవదానవులకు జరిగిన తారకామయం బను యుద్ధప్రకారము
ఆ. |
అనఘ కృతయుగంబునందు వృత్రధ్వంస, మయినపిదపఁ దారకామయంబు
నాఁగఁ జెల్లె నొకరణమ్ము దేవతలకు, చానవులకు నధికదారుణముగ.
| 72
|
క. |
అందు సురారులచేతం, గ్రందుగ సురసిద్ధయక్షగంధర్వాదుల్
సందళితదేహు లై భీ, తి దూలి తలంచి రాదిదేవు ముకుందున్.
| 73
|
వ. |
అట్లు దలంచుటయు నార్తశరణ్యుండు గావున విక్రాంతజగత్త్రయుం డగుత్రివి
క్రముండు విక్రమోత్సుకుం డై సజలజలధరశ్యామం బగుదివ్యదేహంబు హే
మాంబరకౌస్తుభ[75]హారంబుల మాణిక్యముకుటంబున దేదీప్యమానం బై సకల
ధాతుమయం బగు సమున్నతాంజనశైలంబు గ్రేణిసేయఁ జక్రశార్ఙ్గగదాఖడ్గశం
ఖంబులు సాకారంబు లై పరివేష్టింపఁ జంద్రసూర్య[76]చక్రంబును మందరమహీథ
రాక్షంబును మేరుగిరికూబరంబును ననంతరజ్జుసంబంధంబును దారకాకుసుమపరి
కీర్ణంబును గరుడధ్వజవిభ్రాజితంబును నగు భువనరూపస్యందనంబు నధిరోహించి
యాకాశంబున నాకౌకసుల యాలోకనంబులకు నభిగమ్యుం డైనఁ గృతాంజలు
లై వారు జయ జగన్నాథ జయ జనార్దన జయ హృషీకేశ జయ సర్వభూ
తేశ్వర యనునివి [77]యాది యగు వివిధస్తోత్రకీర్తనంబులు మున్నుగాఁ గీర్తనం
[78]బొనర్చి దివిజవరులు తమకు నైన భయంబులు విన్నవించినఁ బ్రసన్నుండై మధుర
గంభీరభాషణంబుల నవ్విభుండు వారి కభయం బిచ్చి తద్విరోధుల వధియించు
టకు బ్రతిజ్ఞ చేసిన.
| 74
|
ఆ. |
సత్యసంధుఁ డైనచక్రాయుధునిపూన్కి, యమృత మర్థిఁ గనినయట్లు గాంచి
దివిజవరులు మున్ను దిగులుసొచ్చినమనం, బులు కలంకదేఱి పురికొనంగ.
| 75
|
వ. |
సమరోద్యుక్తు లై రాసమయంబున.
| 76
|
దేవతలు రాక్షసులమీఁద యుద్ధసన్నద్ధు లై వెడలుట
చ. |
వనజహితుండు దీప్తవిభవంబున నొప్పె నశేషదిక్కులుం
దనరెఁ బ్రసన్న లై పరమతాపసవర్యులు వేల్వ హవ్యవా
హనుఁడు ప్రదక్షిణార్చి నెలవారెఁ గరం బనుకూలవర్తి యై
యనిలుఁ డెలర్చె నిర్జరుల కయ్యెడుశత్రుజయంబు దెల్పుచున్.
| 77
|
వ. |
అట్టికల్యాణనిమిత్తంబులకుఁ జిత్తంబుల నుత్సాహంబు లొదవి పొదలుచు వసు
రుద్రాదిత్యామరుదశ్వివిశ్వేసాధ్యులు సపరివారు లయి పురుహూతపురోభాగంబున
కరుగుదెంచి రతండును బిశంగహయసహస్రయుక్తంబును [79]సముద్దీప్తాశనిధ్వజ
విరాజితంబును దేజోవిరాజితార్కమండలంబును బ్రచండమారుతమనోజవంబును
సువిహితత్రిదశమనోరథంబును నగు తనరథంబు మాతలిసారథికం బై పార్శ్వం
|
|
|
బునం బొలుపారఁ బ్రబలవలాహకమాలికాపరివృతం బై విద్యుదింద్రాయుధా
లంకృతం బైన యభ్రమాతంగంబు నెక్కి యుక్కు మీఱి వేయిగన్నులుం గన్న
కౌతుకంబునం బ్రతివికాసంబు నొందు నస్పందవిభవంబునఁ బ్రభూతభిదుర
పాణి యై భాసిల్లె నతని కెలంకులం బిఱుందనుం గఠోరదండహస్తుండును గాల
మృత్యుసహాయుండును నపరిమితవ్యాధిపరివారుండును నగుపరేతపతియు సకల
సాగరభోగిప్రకరపరివృతుండై సుజాతముక్తామరకతభూషణంబుల భూషితం బగు
దేహంబుతోఁ బాశప్రకరంబు కరంబున నదుర వరుణుండును యక్షరాక్షసులు
కోట్లు గొలువ శంఖపద్మాదినిధు లిరుదెసల నిలువఁ బుష్పకాధిరోహణంబున
మెఱసి మహాగద కేలం గ్రాల నుల్లసిల్లు సాక్షాత్త్రిలోచనుండపోలెఁ ద్రిలోచన
సఖుండును నఖండగర్వంబునం దనర్చిరి తక్కిన దిక్పాలురుం దమతమపరివారంబు
లతో నాత్మీయవాహనంబులు మహనీయంబులుగా నొప్పిరి సప్తతురంగరయ
తరంగితాకారం బై యనూరుసారథ్యవిస్ఫారం బైనతేంతోడ వారిరుహమిత్రుం
డును విచిత్రగతిత్వరితం బగు [80]సీతాశ్వంబుల శాశ్వతం బగు సమందస్యందనంబున
జందనసుందరం బగుశరీరం బేపారం దారాపరివారుం డై నీహార[81]ప్రసారణ
కరుండును సురసైన్యమధ్యం బలంకరించి పరిస్ఫుటస్ఫటాచక్రంబు లెసంగఁ
జక్రిప్రభువులు ప్రభూతదంష్ట్రాశస్త్రు లై దుర్విషహవిషానజ్వాలాజాలంబుల
నంబరంబు వొదువుచు దనుజభయదం బగునాటోపంబు వాటించిరి శైలేం
ద్రులు సాంద్రపాషాణతరువర్షంబు లమర్షంబునం బగఱపైఁ గురియువారై పేర్చి
రిట్లు సుసంఘటితసన్నాహం బగు వివిధవ్యూహంబు గైకొని కన్నాకై వెన్నుండు
వేవురు విభాకరులునుం బదివేవురు ప్రళయమహాపావకులును ప్రోవుగట్టినట్టిపగిదిం
దేజ ప్రతాపంబులు విపక్షదురభిక్షేపంబు లై యేపార దీపించె నంత నింతయు
నెఱింగి యక్కడ.
| 78
|
మయుఁడు మొదలగు రాక్షసులు దేవతలమీఁద యుద్ధసన్నద్ధు లై వెడలుట
తే. |
విఱిగిపోయి క్రమ్మఱ నొకవిష్ణుఁ జేతఁ, బట్టి పోటొగ్గి వచ్చెద రిట్టి దివిజు
లయిన [82]నేమయ్యె నిది చూడుమనుచు దితిజు, లఖిలసైన్యంబుఁ దగనేకముఖము సేసి.
| 79
|
వ. |
నిర్భరోత్సాహంబున నడపి రట్టి యెడ.
| 80
|
మ. |
విలసచ్చక్రచతుష్క మై ఘనతరద్వీపిత్వగావేష్టనో
జ్వల మై కిష్కుచతుశ్శతత్రితయవిస్తారాఢ్య మై రెండువే
లెలువు ల్పూనిన కాంచనోజ్జ్వలరథం బిం పెక్కఁగా నెక్కి యు
త్కలుఁ డై యేఁగె మయుండు సైన్యమున కేకస్వామి యీతం డనన్.
| 81
|
చ. |
ఇనుమునఁ జేసినం బొలుచు నెన్మిది[83]గండుల తేరువేయు పెం
పెనసినగర్దభంబులు వహింపఁగఁ గ్రోశము విప్పు గల్లి సా
|
|
|
ధనచయకోటి యొప్పఁగ నుదగ్ర[84]పతాకనభోగ్రభాగచుం
బిని యయి క్రాలఁగాఁ జనియె భీతివిదూరుఁడు దారుఁ డాజికిన్.
| 82
|
క. |
గద పూంచిపట్టి మహి గ్ర, క్కదలఁగఁ దొక్కుచును నడచెఁ [85]గాల్నడతోఁ బెం
[86]పొదవి విరోచనుఁడు సమ, భ్యుదిత[87]శిఖర మగు[88]చరిష్ణుభూధరముక్రియన్.
| 83
|
తే. |
వేయి గుఱ్ఱముల్ పూనినవెడఁదయరద, మర్థితో నెక్కి రిపుకోటి నదరఁ జేయఁ
జాలుకడఁక హయగ్రీవుఁ డాలమునకు, నరిగెఁ దనుఁ జూచి దనుజులు హర్ష మొంద.
| 84
|
క. |
వేసేతుల నిడుపగు బా, ణాసనము గుణస్వనోగ్ర మగునట్లుగ ను
ల్లాసంబునఁ ద్రిప్పుచు ఘో, రాసురుఁడు వరాహుఁ డొప్పె నఖలధ్వజినిన్.
| 85
|
క. |
[89]విక్షరుఁడు క్రోధదహన, ప్రకరణోగ్రాక్షుఁ డగుచుఁ బటురథవేగ
ప్రక్షుభితక్షితి యగుగతి, వీక్షింపఁగ విస్మయముగ వెస నని కమరెన్.
| 86
|
క. |
అష్టాదశగజరభసా, క్లిష్టం బగురథముమీఁదఁ గేలఁ గడిఁది వి
ల్లిష్టమునఁ బట్టి మెఱసెన్, ద్వష్ట యనిష్టభట[90]మథనతత్పరశక్తిన్.
| 87
|
తే. |
శ్వేతుఁ డనఁగ విశృంఖలశ్వేతహరుల, యరదమున విప్రచిత్తికి నాత్మజుండు
శ్వేతరత్నవిభూషణశ్వేతవసన, లసితుఁ డై శ్వేతగిరిమాడ్కి నెసఁగెఁ జూడ.
| 88
|
క. |
బలిసూనుఁ డరిష్టుం డను, బలియుఁడు బలవద్గజేంద్రపరికల్పన ను
జ్జ్వలుఁ డై యొప్పఁగ నార్చుచుఁ, బొలుపారె సతోయజలదపోతంబుక్రియన్.
| 89
|
తే. |
కడిఁదియసుర [91]బాణుండును గడఁగి మేఘ, వాహ మభినవగమననిర్వాహలీల
మెఱయునట్లుగఁ జూపుచు [92]మెఱసె సైన్య, మధ్యమునఁ దుల్యుఁడై [93]వియన్మధ్యరవికి.
| 90
|
క. |
లంబాభరణంబులతో, లంబుఁడు దానాతిభరవిలంబితగమన
స్తంబేరమంబు నెక్కి బ, లంబులకుం దిలకమయ్యె లలితవిభూతిన్.
| 91
|
తే. |
సైంహికేయుండు దీప్తోరుసింహవక్త్రుఁ, డహితబలముల మ్రింగుదు ననువిధమునఁ
జెలఁగి సెలవులు నాకుచు జిహ్వ తార, నేత్రముల రౌద్రరసరేఖ నిర్వహించె.
| 92
|
వ. |
మఱియు ననేకు లనేకవాహనంబులతోడ ననేకాయుధహస్తు లై నడచి రిట్లు
గూడిన దానవానీకంబు సురపతాకినికి నభిముఖంబుగా మోహరించెం బ్రవర్తిత
తూర్యఘోషభీషణసంకులంబు లగునబ్బలంబులు రెండును బ్రళయమారు
తోద్ధూతకతరంగధ్వనిభీకరంబు లగు రత్నాకరంబు లొండొంటిం దార్కొను
తెఱంగునఁ గదియ నడచె నాసమయంబునఁ బూర్వాధిష్ఠితం బగురథంబు డిగ్గి.
| 93
|
త్రివిక్రమదేవుండు గరుడవాహనారూఢుం డై దేవతలకు సహాయం బగుట
సీ. |
పసిఁడికెందగడు పైఁబఱపినయట్లు దిక్కులఁ బక్షకాంతి పైకొలుపువాని
ముందట నెఱసంజ మొలపించు చంచుదష్టోరగమణిదీప్తి నొప్పువానిఁ
|
|
|
బ్రళయాగ్నిశిఖలు పైఁ బ్రసరించు క్రోధసంరక్తవిలోచనప్రభలవాని
నిఖిలాండములు నొక్కనెగవున దాఁటంగఁ గలయద్భుతోగ్రవేగంబువాని
|
|
ఆ. |
వైనతేయు నింద్రవజ్రావమానన, చండశౌర్యు నెక్కి చక్రశార్ఙ్గ
గదలు దాల్చి కడిమిఁ గడఁగె సర్వాభయ, ప్రదుఁడు శ్రీవిభుండు బవరమునకు.
| 94
|
వ. |
అద్దేవునకుం దలకడచి పాకశాసనుండు లోనగులోకపాలురు సకలసురగణం
బులం గొని దనుజనివహంబులం దలపడిన నసురలు నసహ్యరంహస్సంపాతంబున
నిలింపులం గైకొనక [94]తఱిమిన.
| 95
|
తే. |
కరులు కరులును హరులును హరులు నరద
ములు నరదములుఁ గాల్బలములునుఁ గాలు
బలముఁ దాఁకంగఁ గయ్య మగ్గలికఁ [95]బేర్చె
రెండు[96]మొనలకు నతిరౌద్రరేఖ బెరయ.
| 96
|
మ. |
పరిఘప్రాసశరాసిశక్తిముసల[97]ప్రవ్యగ్రశస్త్రౌఘని
ర్భరనిర్భిన్నశరీరు లై దితిసుతవ్రాతంబుచే దివ్యులున్
సురసంఘాతముచేత దానవులు నస్తోకంబులై నెత్తురుల్
దొరుగం బుష్పితకింశుకో[98]జ్జ్వలత విద్యోతించి రేకాకృతిన్.
| 97
|
ఉ. |
ఏపున దానవు ల్మిగిలి యెందును వేలుపుమూఁకఁ గ్రూరమా
యాపరికీర్ణపాశనిచయంబులఁ గట్టినఁ జేతు లాయుధ
[99]వ్యాపృతి దక్క నంఘ్రులు ప్రవర్తనశూన్యత నొంద వాహముల్
[100]ప్రోపఱ నెల్లవారలు బ్రభూతభయార్తిఁ గలంగి [101]రయ్యెడన్.
| 99
|
ఉ. |
అంతయుఁ జూచి గోత్రభిదుఁ డాత్మవిభూతిఁ దదీయమాయ పెం
పంతయు [102]మాన్చి యంధతమసాంబకపంక్తుల నంబరక్షితి
ప్రాంతము లెల్లఁ గప్పుటయు నన్యులఁ దమ్మును గానలేక వి
భ్రాంతతఁ బొంది తూలెడువిపక్షులఁ గూల్చిరి పేర్చి నిర్జరుల్.
| 100
|
చ. |
అసురలు సావఁగాఁ గని తదగ్రణి యైనమయుండు రోషసం
ప్రసరకఠోరనేత్రశిఖ పర్వఁగ నౌర్వునిచేత సృష్ట మై
యెసఁగెడుమాయ నప్పు డెలయించినఁ బుట్టె యుగాంతసంభృత
ప్రసభకృశానుతుల్య మగు పావకసంచయ మద్బుతోద్ధతిన్.
| 101
|
ఉ. |
ఆతీవ్రానలుపేర్మి వాసవతమిస్రాస్త్రప్రభావంబు ని
ర్ధూతంబై చెడ నంతఁ బోక యది యెందుం దానయై పర్వి స
|
|
|
ర్వాతంకంబుగఁ బ్రేల్పఁగాఁ దొడఁగె దేవానీకమున్ దానవ
వ్రాతంబుల్ సెలఁగెం గలంగి విబుధు ల్వార్ధీశ్వరుం జేరినన్.
| 102
|
వ. |
[103]దివస్పతి యయ్యాపదకుం బ్రతీకారం బవ్వరుణు [104]నడుగుటయు నతం డిట్లనియె.
| 103
|
సీ. |
విను మౌర్వుఁ డనుమహాముని తొల్లి బ్రహ్మచర్యవ్రతనిష్ఠుఁడై యధికతపము
కడుదీర్ఘకాలంబు నడపంగ జగముల కెంతయు భయ మైన ఋషులు సురలు
నాతనిపాలికి నరుగుదెంచిరి హిరణ్యకశిపుఁ డాదిగా నసురతతియుఁ
జనుదెంచె నట్లు గూడిన వారలందఱు నమ్మహాతునితోడ ననఘ యిట్లు
|
|
తే. |
నీవు పిన్నప్రాయంబున నెఱయ బ్రహ్మ, చారివై నిష్ఠ సలుపంగ సకలకులముఁ
జెడదె విచ్ఛిన్నమూలమై సిద్ధమునులు, వినవె పత్నీసమేతులై కనిరి సుతుల.
| 104
|
క. |
అలజడియె కాక నీకీ, నిలుకడ నొకమేలు గలదె నిజము వినుము మా
పలుకులు సంతతిఁ బడయం, దలకొను మనుటయు నతండు దరహాసముతోన్.
| 105
|
వ. |
వారల నందజం గలయం గనుంగొని యిట్లనియె.
| 106
|
తే. |
బ్రహ్మయోనిసంజాతుఁ డై బ్రహ్మవిద్య, నలవరించుచు బ్రహ్మంబు నాత్మఁ జూచు
బ్రాహ్మణుఁడు బ్రహ్మచారియై పరఁగవలదె, బ్రహ్మయైన జాలునె యట్టిభవ్యుఁ గలప.
| 107
|
వ. |
వేదాధ్యయనయజన[105]ప్రజాసముత్పాదనంబులను మూఁడు తెఱంగులును ఋణ
త్రయమోక్షణోపాయంబు లై గృహస్థునకుం బాల్పడినవి యేము వనస్థుల మై
యున్నారము నిరాహారులు పవనజలాదిభోజనులు [106]నశ్మకుట్టులును దంతో
లూఖలులుం బంచతప్తులు నగుట వానప్రస్థధర్మంబు పరమధర్మంబు మాకు బ్రహ్మ
చర్యంబు మున్నిడుకొని పరమగతిం బ్రాపింపవలసి యుండు.
| 108
|
క. |
వినుఁడు తపంబును ధర్మం, బును వ్రతములు యోగచర్యములు నిష్ఫలమై
చను బ్రహ్మచర్యనిష్ఠకు, ననుకూలుఁడుగానిఖలున కని రాదిమునుల్.
| 109
|
క. |
తరుణీసంగమ మెక్కడ, యిర వగుయోగదశ యెక్క డేయూరికి నే
తెరు వజితేంద్రియుఁ డగుదు, శ్చరితుని యోగంబు దంభసంజ్ఞమ కాదే.
| 110
|
వ. |
పరమేష్ఠి తన బ్రహ్మచర్యంబు పొలివోవక యుండ మానసు లగునాత్మజుల సృజి
యించె మీరు బ్రహ్మచర్యంబు గా దని నిందించితిరి. సాధువు లయ్యు [107]నసాధు
వులుం బోలె నిట్లు పలుకం దగునె నన్ను సంతతి వడయు మనియెదరేని భవద్వ
చనంబు సేసెద [108]నట సూడుం డని పలికి యతండు.
| 111
|
క. |
తనతపముపేర్మి ననపా, యనిరూఢం బైనకాయ మమరంగ హుతా
శనునందుఁ దొడయొకటి యిడి, గొనకొని మధియించె విశదకుశకాండమునన్.
| 112
|
ఔర్వుం డనుమునివలన నౌర్వానలంబు సంభవించిన ప్రకారము
వ. |
అబ్భంగి నరణికరణి మధియింపఁ[109]బడు నయ్యూరువువలన నౌర్వుం డనుపేర
[110]నిరింధనుం డగుననలుండు తనయుం డై జనియించి యాకసంబు దాఁకిన యెఱమంటలు దెసలు వొదువ నొండొండ పెరుఁగుచుం దనతండ్రి యగునౌర్వమహాముని
యెదుర నిలిచి.
| 113
|
క. |
కడుఁ [111]బెల్లగునాఁకలి నా, యొడ లెరియింపంగఁ దొడఁగె నొక్కట జగముల్
[112]పొడిపొడిగా దరికొనియెద, నెడపక యించుక యనుజ్ఞ యిము మహాత్మా.
| 114
|
వ. |
అనునవసరంబున లోకపితామహుండు సనుదెంచి యోర్వునిచేత నభివాదితుం
డై నీపుత్రున కాహారంబును నివాసస్థానంబును నొసంగెద జగద్దాహంబున
దొడంగక యుండ వారింపు మనిన నతండు దేవా యేను గృతార్థుండ నైతి నిబ్బా
లునిదెసఁ ద్రైలోక్యనాథుండ వగునీవు భావంబు సదయంబుగా నిలుపుటం
[113]గడవ మే లెయ్యది యట్ల చేయుదు ననుటయు నవ్విశ్వగురుండు.
| 115
|
ఉ. |
అంబుధిలోన బాడబముఖాకృతి [114]నీతఁడు దాల్చి పెల్చఁ దో
యంబులు గ్రోలుచుండుఁ బ్రళయావధియందు మదీయరౌద్రతే
జంబును దన్నుఁ బొందఁగ నసహ్యసముద్ధతితో సమస్తలో
కంబులు నీఱుసేయు నది గార్యము నావుడు నమ్మునీంద్రుఁడున్.
| 116
|
వ. |
అవ్విధం[115]బ యొనర్పం గొడుకు నాజ్ఞాపించె నతండును దనతేజంబు లోకబాధ
కంబు గాకుండ నుపసంహరించి సాగరంబునకుం జనియెఁ జతుర్ముఖాదులు తమ
తమ[116]నెలవుల కరిగిరి హిరణ్యకశిపుఁ డౌర్వునిం బూజించి సర్వాంగప్రణతుం డై.
| 117
|
తే. |
అజుఁడు సనుదెంచి ప్రార్థించునట్టితపము, లోకమున నెవ్వరికిఁ జెల్లు నీక కాక
యేను భవదీయశిష్యుఁడ నెడరువొందు, నప్పటికి రక్ష యగువిద్య యానతిమ్ము.
| 118
|
వ. |
అనిన నమ్మహాతపోధనుండు నీవు సర్వభువనజైత్రుండవు మిత్రుండ వై న న్నాశ్ర
యించితి గావున మత్పుత్రుచేత నిర్మిత యైన[117]యనింధనాగ్నిరూప యగు విద్య
మాయ నీ కిచ్చితి సోమ[118]స్పర్శనంబు దక్కం దక్కిన యెయ్యవియు దీనికిం బ్రతికా
రంబులుగావు నీయన్వయంబున జనియించిన వారికెల్లను రిపునిగ్రహంబు వొందిన
యప్పటికి నిది వశగత యై యుండు ననియే నట్లు దైత్యపతివడసిన యవ్విశేషం
బిప్పుడు మయప్రయోగంబున నస్మద్బాధకం బైనయది.
| 119
|
క. |
సితకరునిఁ బనుపు మేనును, నతఁడు నయిన నిపుడ దీని నడఁతు మనిన నా
శతమన్యుఁ డబ్ధిపతిభా, షితములకుం బ్రీతుఁడై శశిం జూచి తగన్.
| 120
|
సీ. |
అంభోధిసుతుఁడ వనంతరసోదయంబులకుఁ గర్తవు సర్వభూతములకుఁ
[119]బోషకుండవు సమస్తౌషధీవిభుఁడవు యజ్ఞంబులకుఁ బ్రాణమై తలిర్తు
సుధకు నాధారమై శోభిల్లు వాత్మవై యోగీశ్వరులకు మృత్యువు హరింతు
భూచ్ఛాయ మచ్చగాఁ బొలుపారు తనుకాంతిఁ బ్రసరించి తిమిరంబుఁ బరిభవింతు
|
|
తే. |
నీమహత్త్వంబు [120]మునివర్ణనీయ మట్లు, గాన దివిజుల కైనయక్కఱ దొలంగఁ
జేయు మిప్పాశపాణియు శీతకిరణ, నీకుఁ దోడ్పడు ననవుడు నెమ్మి నతఁడు.
| 122
|
వ. |
పాకశాసనుశాసనంబు గయికొని దనుజానీకంబుపైఁ గడంగి.
| 123
|
మ. |
స్ఫురదాల్మీయమయూఖము ల్గలయ [121]నంభోభృత్పథం బంతయుం
బరఁగం జేసిన మాసె నౌర్వదహనస్ఫారాకృతిం గ్రాలు దు
ర్భరమాయావిసరంబు దానవులదర్పస్ఫూర్తియున్ డిందె న
ట్లరుదై యొప్పెడు [122]సేఁతఁ జేసి విధుఁ డుద్యద్ధాముఁడై వెండియున్.
| 124
|
మ. |
క్షితి యాకాశము దిక్కుల [123]న్దెలివి సూడ్కిం జెంద నీ కెందు [124]ను
ద్యతసాంద్రోద్ధతిఁ బర్వుదుర్విషహనీహారంబుఁ బూరించి భూ
రితరా[125]రాతిబలంబులం బొదిని మూర్చిల్లన్ విభేదిల్లఁ గం
పితచేష్టన్ [126]దురపిల్ల విహ్వలదశన్ భీతిల్లఁ జేసెన్ వెసన్.
| 125
|
|
క. హిమకరునికురియుమంచున, బ్రమసి ముకుఁగుదైత్యకోటిఁ బాశాహతిన్
సమయించె వరుణుఁ డవ్విధ, మమితాద్భుతకారి యయ్యె నాలోకింపన్.
| 126
|
వ. |
ఇత్తెఱంగునం బ్రాలేయపాశప్రహరణు లైనయయ్యిందుప్రచేతసులచేత నచేతనం
బై తూలు దైతేయసైన్యవ్రాతంబులం జూచి మయుండు క్రమ్మఱ నాత్మీయ
సూసుం డగు క్రౌంచుండు నిర్మించిన పార్వతి యనుమాయ గీర్వాణులదెసఁ బ్రయో
గించి ప్రచండగండశైలకరాళంబును బ్రబలపవనోద్ధూతపాదపోత్కటకూ
టంబును బ్రకుపితపంచాస్యవ్యాఘ్రఘోర[127]కుధరంబును నగుపర్వతసంచయంబు
సర్వదిశలం బుట్టించిన.
| 127
|
ఆ. |
కోటిరాలు వచ్చి కూలె మ్రాఁకులు వచ్చి, పొదివె సింగములును పులులు వచ్చి
కఱచె నట్టిభంగి గాసియై రమరులు, మాసెఁ జంద్రవరుణమదముపేర్మి.
| 128
|
క. |
తలలు వగిలియును జేతులు, నలిసియుఁ గాళులును దొడలు నడుములుఁ బార్శ్వం
బులు నొగిలియు వాహనములు, నలుఁగులుఁ దుమురయ్యె [128]నులిసె ననిమిషబలముల్.
| 129
|
క. |
సరసిజనాభుఁడు దక్కఁగ, సురనివహమునందు రూపు [129]సొం పెడలనివాఁ
డరిదిగ వెదకిన లేఁ డ, ప్పగుసున నెంతయును నెడరు వాటిలినతుదిన్.
| 130
|
|
వ. అగ్ని మారుతులం బిలిచి విష్ణుండు మీరిమ్మాయ [130]మాయునట్లుగా నాత్మయతీవ్రత
సూపి యేపారుం డని పనిచిన.
| 131
|
శా. |
దీప్తజ్వాలము లొక్కపెట్ట దెసలం దీవ్రానుబంధోగత
వ్యాప్తిం బర్వఁగ సర్వదానవబలవ్యాలగ్నుఁడై వచ్చునా
సప్తార్చిన్ బలవంతుఁ జేయుచు నభస్వంతుండు దుర్దాంతుఁడై
సప్తస్కంధములం గదల్చి పొదలెన్ సంపాతచండాకృతిన్.
| 132
|
ఉ. |
ఘోరయుగాంతవహ్నిఁ బటుగోత్రనగావళియెల్ల భస్మసా
త్కారము నొందునట్లు చెడి ధారుణిఁ జూర్ణపుఁబ్రోవు లయ్యె న
మ్మారుతమిత్రుచే రిపులమాయపుఁగొండలు దేవశత్రులున్
భూరిరథాశ్వనాగచయపూర్వముగాఁ బొడియైరి పోరిలోన్.
| 133
|
వ. |
ఇట్లు సకలసైన్యంబులు సమసిన మయుండు సవిస్మయుం డై తిరిగె దొరలును
సై రింపలేక తొలంగిరి చెలంగి రథాంగధరుఁ గీర్తించుచు నమర్త్యులు సమరజయ
విభాసితు లైరి లోకంబులు ప్రమోదమేదురంబు లై పొదలె నెందునుం దొంటి
యట్ల మహాధ్వరంబులు ప్రవర్తిల్లెఁ దపోధనులతపంబులు నిర్వఘ్నంబు లై తల
కొనియె ధర్మంబును బ్రబల బై నలుకాళ్లును మాపి నడచె సమ్యక్పరిపాల
నంబు గాంచి భూదేవి భూరిస్థైర్యంబు వడసె వర్ణంబులు నాశ్రమంబులు నిజా
చారంబు లంగీకరించె నంత.
| 134
|
ఇంద్రాదిదేవతలతోడఁ గాలనేమి యను రాక్షసుఁడు యుద్ధము చేయుట
సీ. |
రౌద్రరసస్వభావోద్రేక మంతయు సాకారమై తనరారె ననఁగ
వీరగుణోల్లాసవిభవంబు సర్వంబు నవయవప్రౌఢిఁ గ్రొవ్వలరె ననఁగ
గర్వసర్వస్వరేఖాతత్వ మఖిలంబు విగ్రహవ్యాప్తి గావించె ననఁగ
దర్పసంభారదుగ్ధమవిశేషం బెల్లఁ దను[131]వికాసంబు గైకొనియె ననఁగఁ
|
|
ఆ. |
బ్రళయకాలదహనుప్రతిబింబ మనఁగఁ గృ, తాంతరోష నికృతి కాత్మ యనగ
నెగడువాఁడు కాలనేమి నా నొకదైత్యుఁ, డపరిభావ్య బలనిరస్తరిపుఁడు.
| 135
|
క. |
శతభుజుఁడు శతశిరస్కుఁడు, శతశిఖరోదగ్రశైలసదృశుఁడు దీప్తా
యతపింగశ్మశ్రు[132]కచా, న్వితనీలశరీరుఁ డుగ్రవీక్షణుఁ డెందున్.
| 136
|
వ. |
వనరుహాసనువలన లబ్ధవరుండు గావున నసురుల పరాభవంబునకు నమరుల విజ
యోత్సవంబునకుఁ గరంబు గలుషించి దనుజనాయకుల నందఱ నాశ్వాసించి
పురికొల్పుకొని క్రమ్మఱ సర్వసైన్యంబుల సమకట్టించి యగ్రణి యై సురలమీఁద
నెత్తి నడతెంచిన నాదిత్యు లందఱు నత్యంతసంరంభంబున జంభారి పురస్సరుం
డుగాఁ గడంగి రప్పుడు.
| 137
|
క. |
బలియుఁ డగు ప్రభువు తమకుం, గలిమిం [133]దన కెదిరి రిపులఁ గన్నంతన దై
త్యులు మది నరవాయిగొనక, యలఘుప్రహరణమహోగ్రులై తాఁకుటయున్.
| 138
|
క. |
ఇరువాఁగునకుం గయ్యము, కర మద్భుతభంగి నమరెఁ గరిహయసుభట
స్ఫురితాంగశకలచయదం, తురమై సంగరధరిత్రి దుస్సంచరగాన్.
| 139
|
ఉ. |
తార విరోచన ప్రభృతిదానవముఖ్యులు దర్పరోషదు
ర్వారసముధ్ధతిన్ బటుపరాక్రమకేళి యొనర్పఁ దన్మహో
దారత కోహటింపక శతక్రతుముందట నగ్నిదండభృ
ద్వారిపు లాదియైనసురవర్యులు గోల్తలచేసి రుక్కునన్.
| 140
|
చ. |
పరిఘవిభిన్నులై ముసల[134]పాటితులై కరవాలకృత్తులై
శరపరికీర్ణు లై పరశుసంప్రవిదారితు లై గదావిభం
గురు లయి తోమరప్రకరకుంఠితులై సమరావనిన్ [135]సురా
సురలు పరస్పరాభిహతి శోణితపూరము నించి రయ్యెడన్.
| 141
|
ఉ. |
కోఱలు దీటుచు న్నయనకోణములన్ దహనస్ఫులింగముల్
గాఱఁగ నూర్పులం జదల గాలిని నొక్కటఁగూల బాహువుల్
నూఱును జాంచి మై వెనిచి నూఱుశిరంబులు నూర్ధ్వదిక్తటుల్
దూఱఁగఁ గాలనేమి రణదోహలి యై కడఁగెన్ సముద్ధతిన్.
| 143
|
వ. |
ఇట్లు గడంగి చరణజానూరుకటినిపాతంబులం గూర్పరముష్టితలాఘాతంబుల
నిశాతహేతిప్రకరప్రహారంబులం గ్రూరసాయకవిదారణంబులం దరతరంబ బృందా
రకసైన్యబృందంబులం బొరివుచ్చుచుఁ దఱిమి యతం డైరావణారూఢుం డై
యున్న శతమన్యు నంతంతం గని యట్టహాసంబుతో నాహ్వానంబు సేసి.
| 144
|
మ. |
ఇదె కంటే సురనాథ నాభుజమునం దేపారెడున్ ఘోర మై
గద నీయాదల వ్రయ్యఁ దాఁకి మెదడుం గ్రక్కించు నేఁడాదిగాఁ
ద్రిదశేంద్రుం డనుపే రడంచి విజయోద్దీపుండ నై యేన యే
లుదు సందేహ మొకింతయున్ వలవ దీలోకత్రయీరాజ్యమున్.
| 145
|
క. |
అనుచుం గదియుఁడు నింద్రుడు, ఘనభిదురము వైచె ఘోరకఠినదనుజుఁ ద
ద్ఘనవక్షస్స్థలపాతం, బునఁ గుంఠితధార మయ్యెఁ బొలుపఱి యదియున్.
| 146
|
తే. |
కులనగము లైన వ్రయ్యలై కూలునట్లు, గా నొనర్చునక్కైదు వాకరణిఁ గష్ట
భావ మొంది క్రమ్మఱ వచ్చి పాకశాస, నునికరము సేరె నెంతయుఁదనుకు సొచ్చి.
| 147
|
సీ. |
ఆలోన గద [136]వూన్చి యభ్రమాతంగంబు కుంభపీఠంబు వగుల్చి యసుర
మఱియొక్కవ్రేటున మఘవువక్షంబును నొగిలించుటయును నేనుంగుఁ దాను
బీనుంగు లైనట్లు పృథివీస్థలంబునఁ గూలి గోత్రధ్వంసి కొంతవడికిఁ
దనుఁదానె సవరించుకొని గజేంద్రుని డిగవిడిచి నెమ్మనమున వెగడుఁ గదురఁ
|
|
తే. |
బాఱెఁగరియును నొకభంగి [137]బ్రతికి విగత, [138]తోయమగు తోయమునకు దోయనంగ
మదవిహీనమై యచ్చోన కదలకుండె, నస్తనిర్ఝరభృతి యగునద్రివోలె.
| 148
|
వ. |
ఇట్లు మహేంద్రు మర్దించి యమ్ముఖంబున నమ్మహాదైత్యుండు.
| 149
|
క. |
ఫణిపాశము ద్రెంచి ధను, ర్గుణనిస్వన మడర వాఁడికోలలఁ దనువున్
[139]వ్రణితము నొనర్చి వరుణుని, రణకర్మోద్యమమునకుఁ బరాఙ్ముఖుఁ జేసెన్.
| 150
|
క. |
పరిఘమున నురము శిరమును, బరియు నడఁచి ధనదు మూర్ఛపాలువఱచి కి
న్నరకోటిఁ బఱపి యాతని, సిరితోడన నిధిచయంబుఁ జేకొనియె వడిన్.
| 152
|
[140]సీ. |
మెచ్చక యెదురైనమృత్యువు మెడ ద్రొక్కి క్రొవ్వాడికోఱలు [141]ద్రెవ్వదాఁచి
కింకతో [142]జంకించి కిన్నరగణముల పొంకంబు సెడఁ గొంకువోవ నడిచి
[143]మదురువు గొని మాఱుమలయు కారెనుఁబోతు [144]నొడిసి కొమ్ములు పట్టి మడఁగ ద్రొబ్బి
మండెడుపటుకాలదండంబు చేతులఁ బిసికి వేఁడిమి యార్చి బెండు చేసి
|
|
తే. |
[145]పిఱికిప్రాణులఁ బొరిగొను బిరుదుమగఁడ
వగుదు నీ వని యందంద మొగముమీఁదఁ
జప్పటలు వెట్టి యాతఁడు జమునిలావుఁ
జేవయును [146]బొల్లగాఁ గాకు చేసి విడిచె.
| 154
|
వ. |
ఇత్తెఱుంగున లోకపాలురుం దూలినఁ దక్కినవేల్పులు కన్నవారు కన్నతెరువునం
బఱచిరి గాలనేమియుఁ దత్తత్పదంబు లాక్రమింపఁ దగిన యధికారులం బనిచి.
| 155
|
శా. |
స్వర్గద్వారము గాయుదీవ్రకరు నుత్పాటించి తారాగణాం
తర్గామిం దుహినాంశుఁ ద్రోచి త్రిజగత్సంసేవ్యు హశ్యాశనున్
దౌర్గత్యాన్వితుఁ జేసి వారి నెలవుల్ దానై తదీయక్రియా
సర్గంబున్ దనసొమ్ముగాఁ గొనియె నాశ్చర్యోగ్రవీర్యంబునన్.
| 156
|
వ. |
మఱియునుం [147]బ్రభావబంధురుం డగుట [148]ననిలస్కంధంబులు నూర్ధ్వభువనబంధం
బులు నతని యధీనంబులయ్యె సకల[149]సాగరశిలోచ్చయసమేతయగుభూతధాత్రియు
నతనిచేతికి వచ్చి తచ్చండశాసనంబున నిలిచె నప్సరోగంధర్వాదులుం దదీయ
సేవావృత్తంబ యూఁదిరి దేవతలు చెడిపోయి పలుచోట్లం బడియుండి రివ్వి
ధంబునుం గనియును విష్ణుండు వానికిం గాలపరిపాకం బగుట యపేక్షించి యూర
|
|
|
కుండె నట్లు సర్వపదేశ్వరుం డై యసురేశ్వరుం డయ్యసురవంశంబు ప్రశంసనం
బొనర్ప దర్పవిభంబున శోభిల్లి.
| 157
|
కాలనేమి విష్ణుదేవునిమీఁద యుద్ధసన్నద్ధుఁడై పోవుట
చ. |
క్షమయును ధర్మమున్ శ్రుతము సత్యము లక్ష్మియు నాఁగ నెందుఁ బెం
పమరెడు విష్ణుసంశ్రితము లైదుతెఱంగులు దన్నుఁ జేరమిన్
సమధికరోషతన్ సకలసైన్యసమేతముగాఁ బరాక్రమో
ద్యమ మెసఁగం గడంగెఁ గమలాక్షునిమీఁద జయాభిలాషియై.
| 158
|
తే. |
దైత్యవంశనాశము మదిఁ దలఁచుచున్న, యాదిదేవుని విష్ణు ననంతుఁ గాంచి
కలఁగు డెందముతోడ నక్కాలనేమి, యిట్లనియె నతఁ డాదిగా నెల్ల వినఁగ.
| 160
|
సీ. |
ఏకార్ణవంబునం దెవ్వఁడు మామధుకైటభు లనువారి గీటడంచె
దితిజవంశమునకుఁ [150]దేవయైన హిరణ్యకశిపు నెవ్వఁడు నఖాగ్రములఁ జీరె
ననిమిషారణి యైనయదితిగర్భంబున [151]ననలాభుఁడై యెవ్వఁ డవతరించె
బలియుఁడై యెవ్వఁడు బలిఁ గట్టి తనమూఁడువిక్రమంబుల లోక మాక్రమించె
|
|
తే. |
నసురకామినీనేత్రతోయములు గురిసి, యంబుదద్యుతిఁ త్రిదశసస్యంబుఁ బ్రోచు
నెవ్వఁ డవ్విష్ణుఁ డతఁడు నాకిచటనబ్బెఁ, బగయడంగింప [152]గనుటెట్టి భాగ్యఫలమొ.
| 161
|
మ. |
ఘనకల్పాంతపతంగబింబసమచక్రం బాజిఁ బ్రే రేచుచుం
దునిమేం బల్వుర సస్మదన్వయుల నీదోర్దర్సధుర్యుండు నేఁ
డును దైత్యాబ్ధులఁ గ్రోల నౌర్వశిఖియాటోపంబునం బేర్చునీ
తనియయ్యస్త్రమ యింతకంటెను నిమిత్తం బెద్ది వైరాప్తికిన్.
| 162
|
క. |
జాత్యంతరములఁ బొందుచుఁ, గృత్యం బొకఁ డెఱుఁగఁ డితఁడు గీర్వాణగణ
ప్రీత్యర్థము దైర్యాన్వయ, మృత్యువ యై యెసఁగు నొప్పమికి మితి గలదే.
| 163
|
వ. |
వైకుంఠుం డనంతుండు విష్ణుం డను పేళ్లు గలిగించుకొనుటెల్ల నదియకాదె కావున
నియ్యపరాధంబు లన్నింటికి ఫలం బనుభవింపఁ గలవాఁ డై నాబారిం బడియె
ని న్నారాయణు వధియించి పూర్వులఋణంబు నీఁగెదం గా దేని మత్సాయకదళిత
దేహుం డై యుత్సాహంబు విడిచి యితండు నన్ను శరణంబుసొచ్చి ప్రణమిల్లెడు
నదియును మహనీయంబగు నని పలుకుచుం గలహార్థి యై కదియు నెడఁ దద్భాషి
తంబు లాకర్ణించి గోకర్ణశయనుండు నయనారవిందంబులు మందస్మితవికాసంబున
నుద్వృత్తంబులుగా నాసద్వృత్తవిహీనుం జూచి యి ట్లని యె.
| 164
|
తే. |
క్రొవ్వి యివ్విధమున [153]నీవు గొన్ని కాటు, లఱచినంతన నీచేత నగునె యొకటి
యాడినట్ల చేయనివాని నకట పురుషుఁ, డండ్రె రజ్జులాడునే శూరుఁ డైనవాఁడు.
| 165
|
ఉ. |
దానవకీట నీవటు పితామహుఁ డిచ్చినయీగి నమ్మి
ర్మానఘనుండవై సదవమాన మొనర్చితి దాని కంతకుం
బో నినుఁ దొంటిదానవులపోకన పుచ్చి నిలింపులన్ యథా
స్థానములందు నిల్పెద ముదంబునఁ దాపసకోటి మెచ్చఁగన్.
| 166
|
వ. |
అనినం గినిసి విబుధవిరోధి క్రోధద్విగుణారుణరోచు లగులోచనంబులం బుండ
రీకలోచనుం దప్పక చూచి [154]బాహాశతంబునం బృథగ్విధంబు లైనయాయుధంబు
లన్నియుం బూన్చి మయతారవిప్రచిత్తిప్రభృతిదైత్యు లాత్మీయప్రహరణపాణు
లై తోడం దఱుమం దరియం జొచ్చి పొదివినం గులక్షోణిధరంబు[155]పోలిక నక్షో
భ్యుం డై యాసమరవిచక్షణుండు నిలుచుటయం గని సైరింపక.
| 167
|
ఆ. |
కాలనేమి యార్చి కాలదండము వోని, ఘోరగద యమర్చి దారుణంపు
హాస మెసఁగ నుఱక యశరి గరుత్మంతు, గుఱిఁచి వీచి వైచెఁ గ్రూరభంగి.
| 168
|
క. |
హరి చూచి వెఱుఁగువడ [156]న, ప్పరుషప్రహరణము వచ్చి పక్షీంద్రుని ని
బ్బరముగఁ దాఁకిన వడఁకెం, బొరి నాతఁడు వజ్రనిహతభూధరము[157]క్రియన్.
| 169
|
చ. |
కరుణఁ దదీయదుర్భరత గ్రక్కున మాన్చి జవంబు సత్త్వవి
స్ఫురణముఁ దొంటికంటెనుఁ బ్రభూతముగా నొనరించి దేవుఁ డు
ద్ధురుఁ డగుశత్రు జంపుటకు దోహలియై రభసోగ్రభంగి నా
గరుడనితోడఁ గూడ నిజకాయము వర్ధన మొందఁ జేసినన్.
| 170
|
శా. |
బాహువ్యాప్తి యశేషదిగ్భరిత మై భాసిల్లె వక్షస్స్థల
వ్యూహ[158]క్రాంతి నిరుద్ధమయ్యె గగనం బూర్థ్వంబు మూర్ధాగ్రస
న్నాహవ్యాహతిఁ దూలె నంఘ్రి[159]యుగమున్ సర్వోర్వియుం జెందె సం
గూహంబున్ సురశత్రు లుద్గతభయక్షోభార్తులై [160]రెల్లెడన్.
| 171
|
ఉ. |
క్రమ్మఱ విశ్వవిక్రమణకర్మ మితండు [161]దొడంగె నొక్కొ చో
ద్యమ్మిది యంచు వేల్పులును దాపసులుం బరమేశ సత్కృపా
ర్ద్రమ్మగుచూడ్కిఁ జూడు మము దైత్యవిఘాతన మాచరింపు లో
క మ్మఖిలంబు గావు మని గాఢమతిం [162]బ్రణుతించి రవ్విభున్.
| 172
|
విష్ణుదేవుఁడు చక్రాయుధముచేతఁ గాలనేమిం జంపుట
వ. |
అమ్మహాప్రభావుండు భవ్యం బగునిజతేజంబునం బ్రత్యర్థితేజంబు తిరోహితంబు
సేయుచుఁ గల్పాంతసహస్రకరమండలప్రచండంబును దుస్సహసహస్రా[163]రోపేతం
బును విమతసహస్ర మేదోరుధిరదిగ్ధంబును సకలచరాచరభూతభయావహో
|
|
|
త్సేకంబును సమస్తవినతజనాభయప్రదానలలితంబును సర్వభువనపూజితంబును
సాక్షాత్పరమేష్ఠి[164]సృష్టంబును నపరిభావ్యప్రభాపటలదుర్దర్శనంబును నగుసుదర్శన
చక్రంబు కరంబున నమర్చి.
| 173
|
మ. |
సురవిద్వేషిపయిన్ సరోషపరుషస్ఫూర్తిం బ్రయోగింప న
ప్పరమాస్త్రంబు ప్రశస్తమై చని వెసన్ బాహావనం బంతయు
న్మురియం జేసి శిరంబు లెల్లఁ దునుమన్ మ్రోడై తదీయాంగ మ
చ్చెరువారం దనతొంటినిల్కడన నిల్చెం గొంతసే పద్దివిన్.
| 174
|
మ. |
వినతాసూనుఁడు దాని సైఁపక మహావిస్తీర్ణముల్ గాఁగ గ్ర
క్కున ఱెక్కల్ ప్రసరించి వాయుసమసంక్షోభంబునం బాఱి తాఁ
కినఁ దద్వక్షము [165]తాఁకునన్ విఱిగి సంక్షీణాసువై కూలె దై
త్యుని[166]దేహంబు ధరిత్రి గ్రక్కదల వాతోద్ధూత[167]మేఘాకృతిన్.
| 175
|
వ. |
ఇట్లు కాలనేమి కాలగోచరుం [168]డగుటయుఁ దక్కినప్రధానదైత్యు లవ్విశ్వరూపు
విశ్వవ్యాప్తివలన నెందునుం బోవనేరక క్రోల్పులికోల్తలం జిక్కినజింకల[169]తెఱంగున
బ్రమసియున్నవా రున్నచోటన యడంగి యొదుఁగ నమ్మహాబాహుండు బాహు
బలం బమర నమితవిక్రమంబు లగుచక్రగదాఖడ్గంబులం దదీయదేహంబులు
వ్రయ్యను జదియను దునియనుం జేసి ధరణిం దొరంగించెఁ బెఱయసురులు
నవ్విధంబునఁ బొడవడంగి రిబ్భంగిం దారకామయం బనుపేరి యద్దారుణసంగ్రా
మంబు నివృత్తం బగుటయు విజయవిభాసి యగునవ్వాసవానుజు నభినందింప
నరవిందాసనుండు సిద్ధసంయమిసమేతుండై చను చెంచి సబహుమానంబుగా
నిట్లనియె.
| 176
|
తే. |
సురల భంగించి సన్మునీశ్వరుల కెగ్గు, చేసి త్రైలోక్యమును గాసి[170]సేయుచుండు
నాత్మ నన్నునుఁ జీరికినైనఁ గొనఁడు, దనుజుఁ డింతటివార తత్సహచరులును.
| 177
|
ఉ. |
ఈయసురేంద్రుఁ గూల్చుటకు నీవొకరుండును దక్క లేఁడు నా
రాయణ మూఁడులోకముల నన్యుఁడు వేల్పుల[171]యక్కుఁగొఱ్ఱు ఘో
రాయతశక్తిమైఁ బెఱికి తప్రతిఘాతవిభూతి నెన్నఁడుం
బాయకయుండ నిప్డు గడుభవ్యునిఁ జేసితి దేవతావిభున్.
| 178
|
ఉ. |
ఈవిధ మేను మెచ్చి నిను నిష్టవరంబులచేఁ బ్రకామసం
భావితుఁ జేయఁగోరి యిటు పన్నుగ వచ్చితి [172]నిచ్చమైఁ ద్రిలో
కీవరదుండ వీవు పరికింపఁగ నీకొకవాంఛితంబు ల
క్ష్మీవర యెందు లేమి గని సిగ్గునఁ బొందె మదాత్మ యిచ్చటన్.
| 179
|
క. |
నినుఁ జూడఁ గోరి యున్నా, రనఘా మల్లోకవాసు లగుమునివరు ల
వ్వినుతాచారులు ధన్యతఁ, దనరు [173]తెఱుఁగొనర్పవలయుఁ దద్దయుఁ గరుణన్.
| 180
|
వ. |
కావున నస్మదీయస్థానంబునకు నాతోడన యరుగుదె మ్మనినఁ బరమేష్ఠివాక్యంబు
నకు నియ్యకొని విష్ణుండు జిష్ణుప్రముఖు లగుదివ్యులం జూచి యి ట్లనియె.
| 181
|
మ. |
అమరారాతు లనేకు లీరణమునం దస్మన్మహాచక్రవి
క్రమగర్వంబునఁ గాలనేమిమునుగాఁ గాలాంతముం బొంది రే
క్రమమో తప్పిరి రాహువున్ బలియు లోకం బింక నిశ్శంకతో
సముదీర్ణం బగుఁగాక యెల్లవిధులన్ సంప్రాప్తనైజస్థితిన్.
| 182
|
తే. |
లోకపాలురు దమతమలోకములన, తొంటియైశ్వర్యములు నిత్యధుర్యనుద్ధామ
లుల్లసిల్లంగఁ గైకొని యుండువారు, గాత యాత్మీయు లానందఘనతఁ [174]బొంద.
| 183
|
క. |
క్రమమున హవ్యముఁ గవ్యము, నమర పితృప్రీతిసేయ ననఘములై య
జ్ఞములు ప్రవర్తిల్లఁగ ధ, ర్మము పొదలి చరించుగాఁత మహి నలు[175]కాలన్.
| 184
|
మ. |
కుటిలాచారులు దైత్యు లెప్పుడును మీకుం గీడు గావింప ను
త్కటరంధ్రంబులు వేచియుండుదురు నిక్కం బెమ్మెయిన్ వారి న
మ్ముట కర్తవ్యము గాదు సాత్వికమతు ల్ముగ్ధాత్మకుల్ మీర [176]లొ
క్కటియు న్నేరరు మాయ నేమఱకుఁ డేకర్జంబులందుం దగన్.
| 185
|
వ. |
ఏను వోయివచ్చెద నని యానతిచ్చి యప్పరమేశ్వరుండు పరమేష్ఠిపురస్సరుండై
తోడ్కొనిపోవం దదావాసంబునకుం జని యందు.
| 186
|
క. |
ప్రాతస్సవనాహుతు లను, వైతానికవహ్ను లిద్ధవైభవమునఁ బ్ర
స్ఫితంబులుగా నొప్పుమ, హాతాపసవరుల సంయతాత్ములఁ గనియెన్.
| 187
|
వ. |
కని యమహితాధ్వరంబులఁ దనకు హితంబులుగాఁ గల్పితంబు లగుభాగంబు
లభినందింపుచు నయ్యింద్రానుజుం డమ్మునీంద్రులకుఁ బ్రత్యేకంబ యభివాద
నంబు సేసి త్రేతాగ్నులకుం బ్రదక్షిణించి సద్యోహుతాజ్యసౌరభోద్దామంబు
లగుతదగ్రిమధూమంబు లుపాఘ్రాణింపుచు ఖచితమాణిక్యజాలంబులగు కనక
చషాలంబుల నుజ్జ్వలరూపంబు లగుసమున్నతయూపంబు లాలోకింపుచు విస్తారిత
మనోమోదంబు లగువేదనినాదంటు లాకర్ణింపుచు బ్రహలోకంబు గలయం
గ్రుమ్మరు సమయంబున.
| 188
|
క. |
యజమానులు ఋత్విజులును, [177]యజనసమేతు లయియున్న ననిమిషులుఁ బ్రమో
దజడాత్ము లగుచు నవ్వి, శ్వజగద్విభు నధిగమించి సముదితభక్తిన్.
| 189
|
తే. |
అర్ఘ్య మర్పించి ప్రాంజలులై మహాత్మ, క్రతువులకు నెల్ల నగ్రపూజితుఁడ వీవు
నీవు లేనిసంయమములు నిష్ఫలములు, వేదవిహితంబు లగుసర్వవిధులు నీవ.
| 190
|
చ. |
దనుజవిభంజనార్థముగ దారుణయుద్ధ మొనర్ప నీవు వో
యిన నఖిలక్రియా[178]తతియు నే మటుబాయఁగఁ బెట్టి నిన్నె చిం
తన మొనరించుచుండితిమి ధన్యుల మైతిమి నేఁడు నీజయం
బునఁ బరమేశ మాకొలువు మోదమెలర్పఁగఁ గైకొనం దగున్.
| 191
|
వ. |
అనిన వారియాలాపంబు లాలించి యభ్యర్చనంబు లాదరించి [179]యందఱం బ్రత్యేక
పరిగ్రహంబున ననుగ్రహించి యద్దేవుం డాదిదేవుం డటఁ బితామహునకుం
బ్రణమిల్లి వీడ్కొని తదీయలోకంబు వెలువడి తనకుం బురాణసంశ్రయం బగు
దుగ్ధసాగరంబున కరిగి.
| 192
|
మ. |
ఇనచంద్రద్యుతికోటికిం జోరగ రా కెల్లప్పు[180]డున్ గర్భవా
సనసామగ్రిన తేజరిల్లుచు నజస్వారాజులం దొట్టి యె
వ్వనికిన్ దుర్గమమైనపుణ్యపదమున్ వైకుంఠనామంబు న
ర్థి నధిష్ఠించి యనంతరంబ పరమోద్దీపస్వరూపంబునన్.
| 193
|
నారాయణుండు యోగనిద్రాపరాయణుం డై యుండుట
ఉ. |
వేయుశిరంబు లొప్పఁ బది[181]వేలుకరంబు లెలర్ప నొప్పి నా
రాయణుఁ డార్య మైన తనయంచితతల్పముఁ జెంది పెక్కు వేల్
హాయనముల్ పరిభ్రమణ మందుట నొందినడప్పిమాన్ప భ
ద్రాయితసుప్తిఁ గోరి కనుదమ్ముల[182]దోయి యొకింత మోడ్చినన్.
| 194
|
మ. |
మును గల్పాంతమునందు విచ్చలవిడిన్ మోదంబు [183]వర్ధిల్లఁగాఁ
దను బ్రాపించి [184]చిరోపభోగమహిమన్ ధన్యాత్మయై విశ్వమో
హన నాఁ బ్రాజ్ఞులచేతఁ గీర్తనలు నిండారంగఁ గన్నట్టి ని
ద్ర నెఱిం జెందెఁ దదీయభావము సముద్యద్దివ్యయోగాకృతిన్.
| 195
|
వ. |
ఇవ్విధంబున నిద్రితాత్ముండై యద్దేవుండు.
| 196
|
ఉ. |
ఈతఁడు నిత్యసుప్తుఁ డని యిచ్చఁ దలంపఁగఁ గొంద ఱీతఁ డు
ద్యోతితసత్త్వబోధుఁ డని యూహ మొనర్పఁగఁ గొంద ఱీతఁ డు
ద్ధూతవికారుఁ డిట్టిఁ డనఁ [185]దోఁచెడువాఁ డనఁ గొంద ఱచ్యుతుం
డాతతలీల [186]చూపి దనుజారులకున్ భరమయ్యె నాత్మలన్[187].
| 197
|
సీ. |
ఘర్మాంతమున సుప్తి గైకొని యతఁడు ప్రమోదింపఁ బర్జన్యుఁ డాదరమునఁ
[188]బుష్కలావర్తకంబులు [189]లోనుగాగ సర్వపలాహకంబులఁ బనిచి జగము
నాప్లావితము సేయు[190]నప్పుడు వర్తిల్ల కుడుగు యజ్ఞాదిమహోత్సవములు
మేఘాపగమమున మేల్కనఁగా సర్వకల్యాణములు సమగ్రతఁ దలిర్చుఁ
|
|
తే. |
బతిఁ బతివ్రత యనిశంబుఁ బరిచరించు, నట్లు విభు నిచ్చ యెఱిఁగి యిట్లనుసరించు
చుండు నయ్యోగనిద్ర యన్యుల కశక్య, నిష్ఠ కల్పంబు లిటు లోలి నిద్ర సలుప.
| 198
|
వ. |
ఒక్కొక్క కారణంబున నాభీలదర్పులగు దానవులవలన భువనంబులకు నుపద్రవం
బులు దనికినం దలరు దివిజులదుస్థితి యెఱింగి యయ్యాదిపురుషుండు గర
ణీయానురూపంబులగు [191]నవతారంబు లంగీకరించి జగన్మంగళంబు
నిర్వహించు నని యిట్లు వైశంపాయనుండు విష్ణుమూలప్రకృతియుఁ దదీయా
వతారకారణంబులు జనమేజయునకు సవిస్తరంబుగాఁ దెలిపినవిధంబు.
| 199
|
శా. |
లోకస్తుత్యచరిత్ర నిత్యకరణా[192]లోలన్మనస్సూత్ర య
స్తోకశ్రీతులితామరేంద్ర జనచక్షుఃపూర్ణిమాచంద్ర దా
నాకల్పోజ్జ్వలహస్తపద్మశశిచూడాధీన ధీపద్మస
ర్పాకారస్ఫుటబాహువిక్రమనికామాస్తోదయ[193]ప్రక్రమా.
| 200
|
క. |
ధీరసకలార్థిలోకా, ధార జితవికార సుకృత[194]ధారలసితస
ద్ధారాదుర్దిననిర్ముషి, తారిద్యుతిభార నిత్యహర్షస్మేరా.
| 201
|
మాలిని. |
వితతవినయవిద్యా విప్రధర్మాత్మవిద్యా
జితసకలసపత్నశ్రీక సమ్యగ్వివేకా
మతివిభవమహేంద్రామాత్యసౌజన్యనిత్యా
చతురచతురుపాయా [195]సక్తసత్త్వైకయుక్తా.
| 201
|
గద్యము. |
ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన శ్రీహరివంశంబునం బూర్వభాగంబునందుఁ జతుర్థాశ్వాసము.
|
|