సవరణలు

20 వ పుటలో 11 వ పంఙ్క్తిలో 'వాడు నారదుడొక్కడే' యనుటకు బదులు 'వారు నారదగోభిలులు' అని యుండవలెను. 14 వ పంఙ్క్తిలో 'నాతని యభిప్రాయము' అనుటకు బదులు 'వారి యభిప్రాయము' అని యుండవలెను.

43 వ పుటలో 12 వ పంఙ్క్తిలో 'మను' అనుమాట యుండకూడదు. 16 వ పంఙ్క్తి 'దేవలస్మృతి యీనిర్వచనము నిచ్చుచున్నదని' యుండవలెను.

60 వ పుటలో 7 వ పంఙ్క్తి ప్రారంభములో 'స్థాలీపాకమైన పిమ్మట' నని యుండవలెను.

61 వ పుటలో 4 వ పఙ్క్తిలో 'అంతటితో వివాహము పూర్తియగును' అను వాక్యము లేనట్లు బావింపవలెను. 61 వ పుటలో 5 వ పఙ్క్తిలో 'సమావేశనము' అనుటకు పిమ్మట 'ఇది వివాహములో నంతర్భూతమా కాదా యను నంశమును ముందు చూతము' అని యుండవలెను.

65 వ పుటలో 3 వ పఙ్క్తిలో 'చెప్పు' మొదలు 5 వ పంఙ్క్తిలో 'నున్నది' అనువఱకును లేనట్లు భావించి దీనికి బదులుగ 'ను పరాశరుడును చెప్పుచున్నారు' అనుదాని చదువవలెను. 65 వ పుటలో 18 వ పంఙ్క్తిలో 'యుండును' కు పిమ్మట 'అది యైనను షష్ఠ్యంతము పూర్వమందున్నపుడే యగును. (పాణిని. 1-4-9) ఇచట షష్ఠ్యంతము లేదుకాన నార్షమనుటకు వీలులేదు. అంతేకాక, అని యుండవలెను.

70 వ పుటలో 6 వ పఙ్క్తిలో 'ఆపస్తంబపారస్కరులు' మొదలు 9 వ పఙ్క్తిలో 'నొసగుచున్నది' వఱకు లేనట్లు భావించి యాపిమ్మట నీక్రింది వాక్యములను పూరించు కొనవలెను.

పైన చేయబడిన చర్చయంతయు నాపస్తంబగృహ్య సూత్రము ననుసరించియే చేయబడినది. కాన నిపుడితర గృహ్యసూత్రముల ననుసరించి కూడ నీయంశమును పరిశీలింతము.

కొన్ని గృహ్యసూత్రములను బట్టి వివాహములోని దీక్షయొక్క పరిసమాప్తిలో దంపతులకు సమావేశసము జరుగవలెనని స్పష్టముగ కలదు.

హిరణ్యకేశి గృహ్యసూత్ర మిట్లు చెప్పుచున్నది.

అథైనాముపయచ్ఛతే (హిరణ్యకేశి 1-7-11-4)

(త్రిరాత్రదీక్షానన్తరము వరుడు వధువును పరుండబెట్టి యోనిని స్పృశించి యామెను పొందును.)

బోధాయనుడు గూడ వ్రతాన్తమం దుపనంవేశనము చెప్పుచున్నాడు. అతడు వ్రతకాలపరిమితిలో వికల్పములను సూచించియున్నాడు. అథయదికామయేత శ్రోత్రియం జనయేయమితి ఆరున్ధత్యుపస్థానాత్కృత్వా త్రిరాత్రమక్షార లవణాశినౌ అథఃశ్శాయినౌ వ్రతచారిణావాసాతే చతుర్థ్యాంపక్వహోమ ఉపసంవేశసంచ...... అథయదికామ యేతదేవం జనయేయమితి సంవత్సరమే తద్వ్రతంచరేత్ వ్రతాన్తేపక్వహోమ ఉపసంవేశనం చ (బో. గృ. సూ. 1-7-11)

(శ్రోత్రియుడగు కుమారుని కనవలెనని కోరు దంపతులు అరున్ధత్యుపస్థానము మొదలు మూడునాళ్లు క్షారలవణములులేని యాహారము భుజించుచు క్రింద శయనించుచు వ్రతమాచరింపవలెను. నాల్గవనాడు పక్వహోమము, ఉపసంవేశనము జరుగవలెను....... దేవతుల్యుని కనవలెననని కోరుదంపతులీ వ్రతమును సంవత్సరకాలము చేయవలెను. వ్రతాన్తమందు పక్వహోమము నుపసంవేశనము జరుగవలెను.)

పెండ్లికూతు రెంతవయస్సు కలదైనను గూడ సమావేశనము జరుగవలసినదేనా యను ప్రశ్న యుదయించును. రజస్వలకాని భార్యను పొందరాదని గౌతముడు చెప్పిన ట్లిదివఱలో చూచియున్నాము. గృహ్యసూత్రకారుల మతములో వథువు రజస్వల యైనదిగనే యుండవలెనని చెప్పుటకు నేమియు నాధారము లేదు. అంతేకాక యించుమించుగ స్మృతులన్నియు రజోదర్శనానన్తర వివాహమును నిషేధించుచున్న ట్లిదివఱలో చూచియున్నాము. కాన నిచటివధువు రజోదర్శనము కాని రజస్వలయై యుండుటకు వీలున్నది. అనగా పండ్రెండేండ్ల వయస్సుగలదై యుండవలెను. పండ్రెండేండ్లు వచ్చిన బాలికకు రజోదర్శనము కాకున్నను నామె రజస్వల యైనట్లే భావింపవలెనని కొన్ని స్మృతులు సూచించుచున్నవి.

      ప్రాప్తేతుద్వాదశే పర్షేయ: కన్యాంనప్రయచ్ఛతి
      మాసిమాసి రజస్తస్యా: పితాపిబతిశోణితం
                                     (పరాశర. 8- 5)

(పండ్రెండవయేడు వచ్చినదగుచుండగా నెవడు కన్యను దానముచేయడో యాతండ్రి ప్రతి మాసమునను నామె రజస్సును త్రాగుచున్నాడు.)

దీనిని బట్టి పండ్రెండేడ్ల బాలిక రజస్వలయే యని తేలుచున్నది. పైకి రజోదర్శనము కాకున్నను లోన రజస్స్రావమైనట్లే భావింపవలెనని దీని యభిప్రాయము. ఆవయస్సున వివాహమగు వథువునకు సమావేశనము కావచ్చునని గృహ్య సూత్రకారుల మతమని యూహింపవచ్చును. అంతకుపూర్వము వివాహమగుదానికి సమావేశనము లేదని యీవిధముగ నూహింపవలసి యున్నది. ఈ సమావేశనము వివాహాంగమేయని చెప్పవలెను. ఈసమావేశమైన పిమ్మట రజోదర్శనానన్తరము ఋతుకాలములోనే సమావేశనము జరుగును. ఈలోపున జరుగదు. రజోదర్శనానన్తరము చతుర్థ రాత్రమున భర్త చేయవలసిన కృత్యమును వర్ణించుచు బోధాయనుడు, 'ఆతడామెను పొందును' (అథైనాముపైతి 1-7-44) అని చెప్పియున్నాడు. ఇదియే రెండవ సమావేశనము. ఇచటి నుండి యనిషిద్ధ దినములలో భార్యను పొందుచుండవలెను. వివాహాంగమైన సమావేశనమునకు పిమ్మటనే ఋతుమతి విషయము ప్రస్తావింపబడుటచే వివాహములో సమావేశనమును విధించిన బోధాయనాదుల మతములోగూడ కన్యదృష్ట రజస్కకాదని తేలుచున్నది. వివాహము దృష్టరజస్కకే ఋత్వితరకాలములో జరుగుచో గూడనిటి ప్రస్తావన కవకాశమున్నది కాదాయనుటకు వీలులేదు. ఏలన నిట పేర్కొనబడిన రజోదర్శనము ప్రథమమే యనుటకు నిటనీయబడిన రజస్వలా నియమములే సాక్ష్యములు. (1-7-22 నుండి 36 వఱకు) ఈవిషయములు వివాహముకాని స్త్రీ రజస్వలయైనను పాటింపవలసినవే కాన వాని నిచటనే చెప్పుటచే వివాహమైనపిమ్మటనే రజస్వలయగుటయే బోధాయనుని దృష్టిలో క్రమమని తేలుచున్నది.

ఆపస్తంబుడు సమావేశనమును వివాహాంగముగ విధింపలేదని యిదివఱలో చూచియుంటిమి. సమావేశనము వివాహాంగమా కాదాయను నంశమున ఋషులలో నభిప్రాయ భేదమున్నట్లు గోభిలగృహ్యసూత్రము చెప్పుచున్నది.

          ఊర్థ్వంత్రిరాత్రాత్ సంభవ ఇత్యేకే
                                (గో. గృ. సూ. 2-5-7)

(త్రిరాత్రానంతరము సమావేశనము కావలెనని కొందఱు చెప్పుచున్నారు.)

117 వ పుటలో 17 వ పఙ్క్తిలో 'పరాశరస్మృతిలో' అనుటకు బదులు 'పురాణములలో' అని యుండవలెను.

100 వ పుటకును 101 వ పుటకును నడుమ నీక్రింది వాక్యములుండవలెను:

వసిష్ఠుడు అక్షతయోనిని వివాహమాడవలెనని చెప్పుచున్నాడు.

       అస్పృష్టమైధునామ వరయవీయసీం (వసిష్ఠ. 8-1)

దీనినిబట్టి వసిష్ఠుని మతములో యక్షతయోనిగనున్న స్త్రీని వివాహమాడవచ్చునని మాత్రమే తెలియుచున్నది. అట్టి స్త్రీ వితంతువగుచో నామెను వివాహమాడవచ్చునని యాతని మతమైనట్లీ క్రింది శ్లోకమువలన తెలియుచున్నది.

      పాణిగ్రాహే మృతేబాలా కేవలం మంత్రసంస్కృతా
      సాచేదక్షతయోనిస్స్యాత్పున స్సంస్కారమర్హతి.
                                     (వసిష్ఠ. 17 - 14)

(మంత్రసంస్కృతయు నక్షతయోనియునగు బాలికకు భర్తమరణించుచో నామె మఱల వివాహ సంస్కారమున కర్హురాలు.) ఇట్టి పునర్వివాహములో కన్యాదానముండదు. దానమై మంత్రసంస్కారము కాకుండ భర్తను కోల్పోయిన స్త్రీకే మఱల దానము గలదని యీక్రింద శ్లోకమువలన తెలియు చున్నది.

       అద్భిర్వాచా చదత్తాయాం మ్రియాతాదౌవరోయది
       నచమంత్రోపనీతాస్యాత్కుమారీ పితురేవసా
                                         (వసిష్ఠ 17-12)

(కన్య యుదకముచేతను వాక్కుచేతను నీయబడినదై మంత్రసంస్కృత కాకుండగనే భర్తను కోల్పోవుచో నామె తండ్రికే చెందును.)

మంత్ర సంస్కారమైన పిమ్మట నామె తండ్రికి చెందదు. కావుననే మంత్ర సంస్కారము కాకుండిన కాలములో నామె తండ్రికి చెందునని చెప్పబడినది.

నారదుడు కూడ నట్టి స్త్రీకి పునర్వివాహము నంగీకరించినాడు. కాని యామె పునర్భువని యంగీకరించినాడు.

      కన్యైవాక్షతయో నిర్యాపాణిగ్రహణదూషితా
      పునర్భూః ప్రథమాప్రోక్తా పునస్సంస్కారమర్హతి
                                      (నారద. 12-16)

కావుననే నారదు డట్టి స్త్రీ యేడువిధములగు పరపూర్వలలో నొకతెనుగనంగీకరించినాడు.

      పరపూర్వా స్త్రీయస్త్వన్యా: సప్తప్రోక్తా యథాక్రమం
                                           (నారద. 12-45)

అని యేడువిధముల పరపూర్వలను పేర్కొనుటలో నారదుడు పైమాటలను చెప్పియున్నాడు.

నారద వసిష్ఠులు దక్క మఱియే స్మృతికారుడును నక్షతయోనికా పునర్వివాహము నంగీకరింపలేదు.

101 వ పుటలో 1 వ పఙ్క్తిలో 'ఇంకను ననేకవిధముల' అనుమాటలు లేనట్లు భావింపవలెను.

109 వ పుటలో 16 వ పఙ్క్తికిని 17 వ పఙ్క్తికిని నడుమ నీక్రింద వాక్యములను చేర్చుకొనవలెను:

షండడగు భర్తను వదలి మఱొకని వివాహమాడ వచ్చునని నారదస్మృతి చెప్పుట పైననీయబడిన నారద. 12-80, 81., 13-28 లకు విరుద్ధముగనున్నది.

      ఈర్షాషండాదయో యేన్యేచత్వారస్స ముదాహృతాః
      త్యక్త వ్యాస్తేపతితవత్ క్షతయోన్యా అపిస్త్రియా
                                   (నారద. 12-15)

(ఈర్ష్యాషండాదులగు నల్గురును గూడ క్షతయోనిచేత గూడ పతితులవలె విడువబడదగిన వారే.)

      అక్షిప్తమోఘ బీజాభ్యాంకృతే పిపతికర్మణి
      పతిరన్యఃస్మృతోనార్యా వత్సరార్థం ప్రతీక్ష్యతు
                                (నారద. 12-16)

(విగతబీజుడును వ్యర్థబీజుడును నగు పురుషునిచేత వివాహమాడబడిన స్త్రీ యొక సంవత్సరము నిరీక్షించి మఱొక భర్తను వివాహమాడవలెను.) భర్త చనిపోయిన యపుత్రకు నియోగమును గత పుంస్త్వుడగు భర్తగల యపుత్రకు పునర్వివాహమును కర్తవ్యములని చెప్పుట కేవల మసంగతము. నారదస్మృతిలో నిట్టి యసంగతము లుండుటచేతనే కాబోలు పరాశర యాజ్ఞవల్క్యులు స్మృతులను పేర్కొనుటలో నాస్మృతిలో వదలి వైచిరి.

126 వ పుటలో 15 వ పఙ్క్తికిని 16 వ పఙ్క్తికిని నడుమ నిట్లుండవలెను.

సపిండత్వం సాప్తపురుషం విజ్ఞాయతే

126 వ పుటలో 17 వ పఙ్క్తిలో '4-18' అనుటకు బదులు '4-17-18' అని యుండవలెను.

అక్షరముల సవరణలు.

పుట పఙ్క్తి తప్పు ఒప్పు
22 7 వథూవర్ణతలు వథూవరార్హతలు
22 7 అథ్యాయములలో అథ్యాయములో
29 8 పశ్సేద్వలీ పశ్యేద్వలీ
29 8 కలుగవలెననిచో కలుగవలెననినచో
46 7 పూర్వేషాముస్పర్శనే పూర్వేషాముపస్పర్శనే
51 16 మానుపశ్చేతి మానుషశ్చేతి
69 3 కొందఱ కొందఱీ
71 1 నీకే నొకే
74 19 పిచేత్ పిబేత్
76 14 నొందను నొందును
76 18 సంతయా సంయతా
81 12 బో. ధ. సూ అ. ధ. సూ
81 19 దక్షస్మృతి దక్షస్మృతి (4-17)
83 13 దక్షస్మృతిలో దక్షస్మృతిలో (4-3, 4, 5)
84 18 దంపతులలో ననుకూలత దంపతులలోన వనుకూలత
86 4 మారును మారుట
86 10 గూడినట్టి గూడిననట్టి
87 20 బో. ధ. సూ అ. ధ. సూ
90 7 యజ్ఞేశ్చ యజ్ఞైశ్చ
96 20 పద్యస్స సద్యస్స
99 9 త్రిణే త్రిణీ
100 7 శాస్త్రములను శాస్త్రములలోను
పుట పఙ్క్తి తప్పు ఒప్పు
102 10 ఫలైశుభై: ఫలైశ్శుభై:
103 1 మరణాన్తరమోర్పు ఆమరణాన్తమోర్పు
105 20 వితంతువులైన వితంతువైన
106 2 వితంతువుయవివాహిత వితంతువవివాహిత
108 5 పతితుడునైన పతితుడునై
108 13 తదైవా తథైవా
112 2 లేనియట్టి లేని
113 13 నిక్షేధించి నిషేధించి
113 15 వితంతువులు వితంతువు
142 8 రిక్థ రిక్థం
146 7 ధనమిచ్చుచో ధనమిచ్చియున్నచో
147 20 వాడుకొనుటలో వాడుకొను నధికార ముండుటలో
149 4 అర్ధస్వ అర్థస్య
153 2 సస్త్రీ నస్త్రీ
153 21 జరడాంధ జడాంధ
155 2 త్రో త్ర్యో
159 9 ది ధి
161 4 గౌరవార్హులు గౌరవార్హలు
162 2 త్రా త్రీ
173 10 ఘ్నర్ ఘ్నన్
176 14 నాగ్నీ నాశ్నీ


________________